
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఏలూరు టౌన్ : త్వరలో ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలకు సంబంధించి అద్దెకు షాపుల ఎంపిక ప్రక్రియను ఆబ్కారీ శాఖ అధికారులు శనివారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో చేపట్టారు. అయితే, అద్దె షాపుల ఎంపికకు అధికారులు ఓపెన్ టెండర్లను స్వీకరించగా ఇందుకు తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. ముఖ్యంగా ఏలూరు, పెదవేగి మండలాల పరిధిలో ఒకరికొకరు పోటీపడి అతి తక్కువ ధరకే షాపులు అద్దెకిచ్చేందుకు ఒప్పుకోవటం గమనార్హం. కేవలం రూ.1కే షాపును ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఏలూరు నగరంలోని 30వ డివిజన్‌లో షాపు, పెదవేగి మండలం కూచింపూడి, కొప్పులవారిగూడెం, కొప్పాక గ్రామంలోని మద్యం దుకాణాలను రూ.1కే ప్రభుత్వానికి అద్దెకు ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment