
హైదర్షాకోట్‌లో మూసిన వైన్‌షాపు
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ పరిధిలోని వైన్‌షాపులన్ని ఆదివారం మధ్యాహ్ననికి ఖాళీ అయ్యాయి. రెగ్యులర్ బీర్లు, విస్కీ, రమ్, బాటిళ్లన్ని అమ్ముడు పోయాయి. ఒక పక్క పోలీసులు షాపులను మూసి వేయాలని, మరోపక్క నాయకులు మందు బాటిళ్లు కావాలని యజమానులపై ఒత్తిడి తెచ్చారు. చివరకు మధ్యాహ్నానికి బార్లు, వైన్‌షాపులన్ని మూతపడ్డాయి. కొన్ని షాపులు ఉదయమే మూయించివేశారు. ప్రగతి నివేదన సభ నేపథ్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ముందే మందు బాటిళ్లను కొనుగోలు చేశారు. పెద్ద ఎత్తున మందు బాటిళ్లను కొనుగోలు చేయడంతో షాపులో మధ్యం బాటీలన్నీ ఖాళీ అయ్యాయి. ఆదివారం ఉదయం బార్, వైన్‌షాపులను పోలీసులు తెరవ వద్దంటూ సూచించారు. కానీ నాయకుల ఒత్తిడితో షాపులను తెరిచి వారికి కావాల్సిన బాటిళ్లను అందించారు. ఎక్సైజ్ పోలీసులు తాము ఎవరికి షాపులు మూసివేయాలని తెలుపలేదన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు మాత్రం సభకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న షాపులను మూసివేయాలని తెలిపామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment