సాక్షి, సిటీబ్యూరో: నాలుగున్నరేళ్ల ప్రగతి, సంక్షేమాన్ని వివరించి వచ్చే ఎన్నికల కోసం సమర శంఖాన్ని పూరించేందుకు ఆదివారం నగర శివార్లలో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ కోసం నగరం హోరెత్తుతోంది. సభలో పాల్గొని సంఘీభావం తెలియచేయాలంటూ టీఆర్‌ఎస్ నాయకులు కాలనీలు, అపార్ట్‌మెంట్లు, బస్తీల్లో బొట్టు పెడుతూ ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతానికివివరించటంతో పాటు ఆయా కులాలు, వర్గాలకు చేసిన సంక్షేమాలు మరింత ఊపుతో ముందుకు వెళ్లాంటే కొంగర కలాన్‌సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నగరం నుండి మూడు లక్షల మందికి తగ్గకుండా కొంగర కలాన్‌కు తరలివెళ్లే ఏర్పాట్లు చేసిన పార్టీ నేతలు, ప్రతి డివిజన్ నుండి 1500 నుండి 3500 మందికి తగ్గకుండా వేళ్లేలా వాహనాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీతో పాటు విద్యా సంస్థల బస్సులు, బైక్‌లు, క్యాబ్‌లను సిద్ధం చేస్తున్నారు. ఆదివారం ఉదయం పది గంటలకు అన్ని చోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించి భారీ బైక్‌ర్యాలీలతో సభా స్థలికి బయలుదేరే ఏర్పాట్లు చేశారు.
అందరూ కలిసి రావాల్సిందే...
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రూపులుగా విడిపోయిన వారందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు. కార్పొరేటర్లతో విభేదించే నాయకులను సైతం మంత్రులు, నియోజకవర్గాల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జులు పిలిచి మరీ బుజ్జగించి ప్రగతి నివేదన సభ ఏర్పాట్లలో పాలు పంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు నగర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విభేదాలున్న నియోకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి, జనసమీకరణపై వారి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శుక్రవారం ఖైరతాబాద్ నియోకజవర్గ కార్పొరేటర్ల సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఐదువేల బైక్‌లు, 550 ఆర్టీసీతో పాటు 700 ప్రైవేటు బస్సులతో జనాన్ని తరలించేందుకు కసరత్తు పూర్తి చేశారు. మల్కాజిగిరి నుండి భారీ సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎంఎల్‌సీ మైనంపల్లి హన్మంతరావు శుక్రవారం సాయంత్రం వరకు వాహనాల ఏర్పాట్లలోనే తలమునకలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment