
ఎన్నికల వేళ మద్యం షాపులకు తాళం పడింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గ్రేటర్ పరిధిలోని అన్ని వైన్ షాపులు బంద్ చేశారు.

మళ్లీ గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత ఆరు గంటలకు షాపుల్ని తెరుస్తారు.

ఈ నేపథ్యంలో నగరంలో మంగళవారం వైన్ షాపుల వద్ద రద్దీ నెలకొంది. చాలాచోట్ల షాపులు ఖాళీ అయ్యాయి.













