రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని పరిధిలో ఓ వైన్ షాపును టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం సీజ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని పరిధిలో ఓ వైన్ షాపును టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. మాల్ గ్రామంలోని శ్రీసాయి వైన్స్‌లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో దాడులు నిర్వహించారు. షాపు పక్కనే ఉన్న ఇంట్లో అక్రమంగా మద్యాన్ని నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్టు గుర్తించారు. 180 లిక్కర్ కేసులు, 250 బీర్ల కేసులను స్వాధీనం చేసుకోవడంతోపాటు షాప్‌ను సీజ్ చేశారు. నిర్వాహకుడు శేఖర్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.