Task force police
-
బంజారాహిల్స్ లోని పలు పబ్బులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
-
సూడో పోలీసుకు అరదండాలు
సాక్షి, హైదరాబాద్: స్టార్ హోటళ్లకు వచ్చే విటులనే టార్గెట్‌గా చేసుకుని దాదాపు ఏడేళ్లుగా బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్న సూడో పోలీసు సన్నీ జాదవ్‌ను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిని 2017లో ఇదే తరహా నేరంపై మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ సాధన రష్మి పెరుమాల్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ నిందితుడి నుంచి రూ.4 లక్షల నగదు, ద్విచక్ర వాహనం తదితరాలు స్వా«దీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పార్శిగుట్టకు చెందిన సన్ని సోమాజీగూడలోని ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆన్లైన్ గాంబ్లింగ్‌తో పాటు గుర్రపు పందాలకు అలవాటుపడిన ఇతడికి నెలనెలా వచ్చే జీతం సరిపోలేదు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం పోలీసు అవతారం ఎత్తాడు. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఓ ఎస్సై గుర్తింపు కార్డులో మార్పుచేర్పులు చేసి తన ఫొటో, పేరు పొందుపరిచాడు. దీన్ని తన ఫోన్లో సేవ్ చేసుకున్న ఇతగాడు అసలు కథ మొదలెట్టాడు. ఆన్‌లైన్‌తో పాటు వివిధ డేటింగ్ యాప్స్ ద్వారా యువతులను బుక్ చేసుకునే అలవాటు ఉన్న ఇతగాడు వారిని కలవడానికి, సన్నిహితంగా గడపడానికి కొన్ని స్టార్ హోటల్స్‌లోని రూమ్స్‌కు వెళ్లేవాడు. ఇలా ఇతడికి ఏఏ హోటల్లో ఏఏ రూమ్స్‌లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతాయనే విషయం తెలిసింది. దీంతో ఆయా గదులకు వెళ్లి వచి్చన తర్వాత లేదా సమీపంలో కాపు కాయడం ద్వారా వాటిలోకి ఎవరు వెళ్లి వస్తున్నారో గుర్తించే వాడు. వాళ్లను అడ్డగించి పోలీసునంటూ బెదిరించే వాడు. ఆపై హోటల్ టెర్రస్ లేదా సమీపంలోని ప్రాంతానికి తీసుకువెళ్లి అరెస్టు చేస్తానంటూ భయపెట్టేవాడు. ఆ గదిలో తాను ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలో తతంగం మొత్తం రికార్డు అయిందని, దాన్ని కుటుంబీకులకు పంపుతానని తీవ్రంగా భయపెట్టేవాడు. ఇలా వారి నుంచి అందినకాడికి అందుకుని పంపేవాడు. 2017లో మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత బెయిల్‌పై వచ్చి తన పంథా కొనసాగించాడు. ఇతడి బారినపడిన వాళ్లు కూడా తాము కూడా తప్పు చేశామని, బయటపడితే పరువుపోతుందని మిన్నకుండిపోయే వారు. దీంతో ఇతడిపై ఎక్కడా కేసులు నమోదు కాలేదు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో సికింద్రాబాద్‌లో ఉన్న ఓ స్టార్ హోటల్లో ఓ వ్యక్తిని సన్ని పట్టుకున్నాడు. అతడిని తన స్టైల్లో బెదిరించి రూ.5 లక్షలతో పాటు 2 తులాల బంగారం గొలుసు తీసుకుని విడిచిపెట్టాడు. ఆపై మరోసారి అతడికి ఫోన్ చేసి భయపెట్టిన సన్ని మరో రూ.5 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. అయినప్పటికి వదలకుండా బెదిరింపులకు పాల్పడటంతో ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఎస్సైలు శ్రీనివాసులు దాసు, పి.గగన్‌దీప్, బి.అశోక్ రెడ్డి వలపన్ని సన్నిని అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. -
నాసిరకం సరుకు... బ్రాండెడ్ ముసుగు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వివిధ మార్కెట్లలో లభించే ముడిసరుకుతో నాసిరకం నిత్యావసర వస్తువుల తయారీ... ఉత్తరాది నుంచి తీసుకువచ్చిన ప్రముఖ సంస్థల పేర్లతో ఉన్న కవర్లు, డబ్బాల్లో ప్యాక్ చేయడం... శివార్లలోని కిరాణా దుకాణాల ద్వారా బ్రాండెడ్ సరుకుల పేర్లతో విక్రయం... ఈ పంథాలో రెండేళ్లుగా దందా చేస్తున్న ఘరానా ముఠా గుట్టును మధ్య మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు సభ్యులున్న ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశామని, వీరి నుంచి రూ.2 కోట్ల విలువైన సరుకు స్వాదీనం చేసుకున్నట్లు టాస్‌్కఫోర్స్ డీసీపీ ఎస్.రష్మి పెరుమాల్ పేర్కొన్నారు. ఈస్ట్‌జోన్ డీసీపీ ఆర్.గిరిధర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఏళ్లుగా ఇదే దందా... పలు కేసులు... రాజస్థాన్‌కు చెందిన శ్యామ్ బాటి, కమల్ బాటి కొ న్నేళ్ల క్రితం బతుకుతెరువు కోసం నగరానికి వల సచ్చి కాచిగూడ ప్రాంతంలో స్థిరపడ్డారు. తొలినాళ్లల్లో కిరాణా వ్యాపారం చేసిన ఈ ద్వయం ఆపై తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం బేగంబజా ర్కు చెందిన జయరాంతో జట్టు కట్టింది. ఈ ము గ్గురూ బ్రాండెడ్ వస్తువుల పేరుతో నాసిరకం సరు కులు ప్యాక్ చేసి విక్రయించాలని పథకం వేశారు. గుజరాత్, బెంగళూరు, ఢిల్లీల నుంచి నాసిరకం ముడిసరుకు ఖరీదు చేసే వాళ్లు. కాచిగూడలో ఏర్పాటు చేసిన కార్ఖానాలో వీటిని ప్రాసెస్ చేసి... బెంగళూరు, ఢిల్లీ, నాసిక్ నుంచి తీసుకువచ్చిన వివిధ బ్రాండ్ల పేరుతో ఉన్న కవర్లు, కార్టన్లు, డబ్బాల్లో నింపి స్టిక్కర్లు వేసి మార్కెట్లో విక్రయించే వాళ్లు. 2019, 2022 కాచిగూడ, మైలార్‌దేవ్‌పల్లితో పాటు నల్లగొండలోనూ కేసులు నమోదయ్యాయి. తెరవెనుక ఉండిపోయిన ముగ్గురూ తమ స్నేహితుడైన మహేందర్ సింగ్‌ను రంగంలోకి దింపారు. రాజస్థాన్‌కే చెందిన ఇతగాడు నాగారంలో కిరాణా వ్యాపారం చేస్తున్నాడు. అక్కడ తయారు చేసి.. ఇక్కడ నిల్వ ఉంచి... ముడిసరుకుని బ్రాండెడ్ కవర్లలో ప్యాక్ చేయడానికి కాటేదాన్‌లో ఓ కార్ఖానా ఏర్పాటు చేశారు. అక్కడ స్థానికులను పనిలో పెట్టుకుని మిథులేష్ కుమార్, త్రియన్ కుమార్ నేతృత్వలో వీటిని ప్యాక్ చేయిస్తున్నారు. ఇలా తయారైన నిత్యావసర వస్తువుల్ని దాచడానికి మహేందర్ ఇంటి సమీపంలో ఓ గోదాం అద్దెకు తీసుకున్నారు. తొలుత సరుకు మొత్తం ఇక్కడకు తీసుకువెళ్లి... ఆపై శివార్లలో ఉన్న కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. వీటిలో నాసిరకం సరుకుతో పాటు కల్తీ సరుకు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. వీరి వ్యవహరంపై మధ్య మండల టాస్‌్కఫోర్స్‌కు ఉప్పందింది. ఇన్స్పెక్టర్ బి.రాజునాయక్ నేతృత్వంలో ఎస్సైలు ఎస్.సాయికిరణ్, కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎస్ఆర్ఎల్ రాజు తమ బృందాలతో వలపన్నారు. అక్కడకు సరుకుతో వచ్చిన మహేందర్‌ను పట్టుకోగా... గోదాం, కార్ఖానా విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ రెంటి పైనా దాడి చేసిన పోలీసులు మిథులేశ్, త్రియన్లను పట్టుకుని మొత్తం రూ.2 కోట్ల విలువైన సరుకు స్వా«దీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్న అధికారులు ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరు ఉన్నారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. వీటితో ఆరోగ్యానికీ ముప్పు వీళ్లు సరఫరా చేస్తున్న నాసిరకం, నకిలీ సరుకుల వల్ల వినియోగదారులకు ఆరోగ్యానికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ప్యారాచూట్, సర్ఫ్, వీల్, బ్రూక్ బాండ్, హార్పిక్, లైజోల్, ఎవరెస్ట్ తదితర కంపెనీలకు చెందిన 30 రకాల ఉత్పత్తుల్ని వీళ్లు తయారు చేస్తున్నారు. వీటిని ఎవరూ గుర్తించకుండా ఉండటానికే శివార్లలోని కిరాణా దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. ఇవి నాసిరకం, నకిలీ అని తెలిసే వాళ్లు అమ్ముతున్నారా? లేదా వారినీ మోసం చేస్తున్నారా? అనే అంశాలు ఆరా తీస్తున్నాం. ఈ తరహా ముఠాలపై నిఘా, దాడులు కొనసాగుతాయి. – రష్మి పెరుమాల్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ -
బరితెగించిన ఎర్రచందనం స్మగ్లర్లు
కేవీపల్లె/పీలేరు: ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టాస్‌్కఫోర్స్ పోలీసులను కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. వివరాలు.. తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి సోమవారం రాత్రి కేవీపల్లె, సుండుపల్లె మండలాల సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టారు. ఆర్ఎస్ఐ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆరుగురు సిబ్బంది కేవీ పల్లె మండల సరిహద్దు వద్ద గస్తీ కాస్తుండగా.. మంగళవారం తెల్లవారుజామున కేఏ 02 ఎంజీ 2847 నంబర్ కలిగిన స్విఫ్ట్ కారు అటుగా దూసుకువచ్చింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ కారు వేగంగా వచ్చి కానిస్టేబుల్ బి.గణేశ్(40)ను ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే గణేశ్ మృతి చెందాడు. టాస్‌్కఫోర్స్ పోలీసులు కారును చుట్టుముట్టేసరికి ముగ్గురు స్మగ్లర్లు పారిపోగా.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఏడు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరూ తమిళనాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కృష్ణారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. వివరాలను తెలుసుకున్నారు. కానిస్టేబుల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గణేశ్ కుటుంబానికి అండగా ప్రభుత్వం విధి నిర్వహణలో గణేశ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న సీఎం జగన్ మానవత్వంతో స్పందించారు. గణేశ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి తక్షణ సాయంగా రూ.30 లక్షలు ప్రకటించారు. ఈ విషయాన్ని అనంతపురం డీఐజీ వెంకటేశ్వర్లు, అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు చెప్పారు. పీలేరు ప్రభుత్వాస్పత్రి వద్ద గణేశ్ మృతదేహానికి డీఐజీ, ఎస్పీ, టాస్‌్కఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ నివాళులర్పించారు. గణేశ్ కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. గణేశ్‌కు నివాళులర్పించిన వారిలో డీఎస్పీ మహబూబ్‌బాషా, డీఎఫ్‌వో వివేక్, ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వో సుబ్బారెడ్డి, ఎఫ్ఆర్వో రామ్లానాయక్, సీఐలు మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులున్నారు. శోకసంద్రంలో కుటుంబసభ్యులు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గుట్టకిందపల్లెకు చెందిన గణేశ్.. 2013 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. తిరుపతి టాస్‌్కఫోర్స్‌లో కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తూ.. తిరుపతిలోనే నివాసం ఉంటున్నారు. గణేశ్‌కు భార్య అనూషతో పాటు కుమారులు రాజకిశోర్(6), వేదాన్‡్ష(3) ఉన్నారు. పీలేరు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన గణేశ్ కుటుంబసభ్యులు.. అతని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. -
స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార ముఠా గుట్టురట్టు
-
స్వామీజీల ముసుగులో గంజాయి రవాణా
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.1.21 కోట్ల విలువైన 484 కేజీల గంజాయి స్వాదీనం చేసుకున్నారు. కాషాయ వ్రస్తాలు ధరించి, వాహనంలో దేవతామూర్తుల విగ్రహాలతో తిరుగుతూ భిక్షాటన ద్వారా జీవనం సాగిస్తున్నట్లు నమ్మిస్తున్న కొందరు వ్యక్తులు అదే వాహనంలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. భద్రాచలం టౌన్ సీఐ నాగరాజురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్వామీజీల వేషధారణలో కొందరు వాహనంలో ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి వాహనంలో గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారంతో భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరియాణా రాష్ట్రానికి చెందిన మున్షీరాం, భగత్, గోవింద్ పట్టుబడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో బల్వన్ అనే వ్యక్తి ప్రోద్బలంతో వీరు ఆటో కొనుగోలు చేసి దేవుడి ప్రచార రథంలా మార్చారు. ఏపీ–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కలిమెలిలో గంజాయిని కొనుగోలు చేసి హరియాణాలో విక్రయించేందుకు వీరు బయలుదేరారని సీఐ తెలిపారు. -
ఒంటరిగా ఉన్న జంటలే టార్గెట్
సాక్షి, సిటీబ్యూరో: నెక్లెస్ రోడ్లో ఒంటరిగా ఉన్న జంటలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న సూడో పోలీసును మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 20 కేసులు నమోదైనట్లు డీసీపీ నితిక పంత్ బుధవారం వెల్లడించారు. జనగాంకు చెందిన మరాఠీ సృజన్ కుమార్ కొన్నేళ్ల క్రితం విశాఖలో ఎస్సైగా పని చేసిన శ్రావణిని వివాహం చేసుకున్నాడు. పైళ్లెన కొన్ని నెలలకే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడానికి సూడో పోలీసు అవతారం ఎత్తాడు. తన భార్య పోలీసు యూనిఫాంలో ఉన్న ఫొటోను తన ఫోన్లో పెట్టుకుని తిరిగే సృజన్ తానూ డమ్మీ తుపాకీతో దిగిన వాటినీ ఇలా సేవ్ చేసుకున్నాడు. టార్గెట్ చేసిన వ్యక్తులకు వీటిని చూపిస్తూ తాను పోలీసునని బెదిరిస్తాడు. కేసు పేరు చెప్పి వారి నుంచి అందినకాడికి దండుకుంటాడు. ఇలాంటి నేరాలు చేసిన నేపథ్యంలో సృజన్‌పై గతంలో నగరంలో పాటు విశాఖపట్నం, వరంగల్ సహా వివిధ ప్రాంతాల్లో 18 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఇతడు నెక్లెస్ రోడ్నే తన టార్గెట్‌గా మార్చుకున్నాడు. నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అక్కడ ఒంటరిగా, ఏకాంతంగా ఉన్న జంటలను ఎంచుకుంటాడు. ఫోన్లోని ఫొటోలు చూపించి తాను పోలీసు అని, తనతో ఠాణాకు రావాలని గద్దిస్తాడు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాల్సి ఉందని భయపెడతాడు. అలా కాకుండా ఉండాలంటే తాను కోరిన మొత్తం ఇవ్వాలని బెదిరిస్తాడు. ఇలా రెండు జంటలను బెదిరించి డబ్బు దండుకున్నాడు. ఓ జంట నుంచి రూ.20 వేలు ఫోన్ పే చేయించుకున్నాడు. మరో జంట నుంచి ఈ పంథాలో రూ.99 వేలు తీసుకున్న సృజన్.. మరుసటి రోజు రూ.4 లక్షలు వసూలు చేశాడు. వీరి ఫిర్యాదుతో సెక్రటేరియేట్ ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ బి.రాజు నాయక్ నేతృత్వంలో ఎస్సైలు సీహెచ్.నవీన్‌కుమార్, ఎస్.సాయి కిరణ్ వలపన్ని బుధవారం నిందితుడిని పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలో ఇతడిపై ఆసిఫ్‌నగర్‌లో రెండు ఎన్బీడబ్ల్యూలు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. సృజన్ నుంచి రూ.1.38 లక్షల నగదు, వాహనం, ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం సెక్రటేరియేట్ పోలీసులకు అప్పగించారు. ఇతడు సూర్య, చరణ్, చెర్రీ పేర్లతోనూ చెలామణి అయినట్లు గుర్తించారు. -
లెక్కలు లేని.. 3.5 కోట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగదు అక్రమ రవాణాపై దృష్టిపెట్టారు. గతవారం మూడు ఘటనల్లో రూ.3.7కోట్లు పట్టుకోగా..సోమవారం రాత్రి నగరంలోని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు లెక్కలు లేని రూ.3.5 కోట్లను పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిర్మాణ రంగ వ్యాపారైన హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన కె.వెంకటేశ్వర్రావు సైదాబాద్‌కు చెందిన మరోవ్యాపారి బాలు మహేందర్‌కు రూ.3.5 కోట్లు నగదు రూపంలో ఇవ్వాలని భావించారు. అయితే ఈ నగదు తీసుకునేందుకు బాలు మహేందర్ కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన తన స్నేహితులు గండి సాయికుమార్ రెడ్డి, మహేశ్, సందీప్‌కుమార్, మహేందర్, అనూష్‌రెడ్డి, భరత్‌లను పంపాడు. ఈ ఆరుగురూ సోమవారం రాత్రి రెండుకార్లలో మారియట్ హోటల్ వెనుక ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడకు మరో కారులో వచ్చిన వెంకటేశ్వర్రావు నాలుగు అట్టపెట్టెల్లో సీల్‌వేసి తీసుకువచ్చిన నగదును వీరికి అప్పగించాడు. వాటిని తమ కార్లలో పెట్టుకుని ఆరుగురూ సైదాబాద్ వైపు బయల్దేరారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి వారిపై దాడిచేసి నలుగురిని పట్టుకున్నారు. వెంకటేశ్వర్రావు, బాలు మహేందర్‌లు పారిపోయారు. కాగా, వీరి వాహనాలను తనిఖీ చేయగా రూ.3.5 కోట్లు బయటపడ్డాయి. ఈ నగదుకు సంబంధించిన లెక్కలు వారి వద్ద లేకపోవడంతో కార్లతో సహా స్వాధీనం చేసుకుని గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న వెంకటేశ్వర్రావు, బాలు మహేందర్ కోసం గాలిస్తున్నారు. ఈ నగదుతో మునుగోడు ఉప ఎన్నికలకు ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
రూబీ కేసులో పోలీసులు దూకుడు.. ఫామ్ హౌస్‌లో నిందితులు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నలుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రంజిత్ సింగ్, సుమిత్ సింగ్‌తోపాటు మేనేజర్, సూపర్వైజర్ ఉన్నారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు మేడ్చల్ ఫాంహౌస్‌లో తలదాచుకున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. అంతటా నిర్లక్ష్యమే.. భవన నిర్మాణ లోపాలు, అగ్నిమాపక పరికరాల నిర్వహణలో పొరపాట్లు ఘోర ప్రమాదానికి కారణలయ్యాయి. మంటలు చెలరేగినప్పుడు.. ఫోమ్ సిలిండర్లు ఉపయోగించి సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేసినా అవి పని చేయలేదు. ఇలాంటి బ్యాటరీ ప్రమాదాలు సంభవించినప్పుడు నీటి బదులు.. వాడాల్సిన ఏబీసీ పౌడర్ అందుబాటులో లేదు. ద్వారాలు లేవు.. సెల్లార్‌ను పార్కింగ్‌కోసం కాఉండా కమర్సియల్ కార్యకలాపాలకు వాడారు. అసలు లాడ్జి ఎన్వోసీ కూడా సరిగా లేకపోవడం, అధికారులు స్పందన పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ఇక, అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రధాని కార్యాలయం మంగళవారం ట్వీట్ చేసింది. -
బెంగళూరు యువతులతో హైటెక్ వ్యభిచారం
మహబూబ్‌నగర్ (గద్వాల క్రైం): జిల్లా కేంద్రంలోని ఓ వ్యభిచార గృహంపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టణ ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ శేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యొన్నబత్తిని రమాదేవి(ఒంగోలు), సాంబశివరావు(విజయవాడ) కొంతకాలంగా గద్వాల పట్టణ శివారులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బెంగళూరు, ఒంగోలు నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సమాచారం అందడంతో పట్టణంలోని బీరోలు రోడ్డు(తాయమ్మ దేవాలయం) సమీపంలోని ఇంటిపై దాడులు చేశారు. నిర్వాహకులతోపాటు చెనుగోనిపల్లికి చెందిన యువకులు ఎం.డి ఫాయాజ్, ఎండి సోహెల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ గదిలోని సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. వారిని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరొకరు పరారయ్యారని స్థానికులు తెలిపారు. -
విశాఖలో డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగురు అరెస్ట్
అల్లిపురం (విశాఖ దక్షిణం): స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గోవా నుంచి (లైసెర్జిక్ యాసిడ్ డైథైల్ అమైడ్) ఎల్ఎస్డీ బ్లాట్స్ నగరానికి తీసుకువచ్చి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో నాలుగో పట్టణ పోలీసులు, యాంటీ నార్కోటిక్ సెల్, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడారు. నగరానికి చెందిన పాంగి రవికుమార్ అనే వ్యక్తి గంజాయి తీసుకుని వెళ్లి గోవాలో దిలీప్ అనే వ్యక్తికి ఇచ్చి, అతని వద్ద నుంచి నార్కోటిక్ డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ గ్రూపుల ద్వారా డార్క్ వెబ్సైట్ ఉపయోగించుకుని క్రిప్టోకరెన్సీ, యూపీఐ పేమెంట్స్ చేస్తూ పోస్టల్, ప్రైవేట్ కొరియర్స్ ద్వారా డ్రగ్స్ రవాణా జరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారం అంతా ఆన్లైన్లో జరుగుతోందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. -
బసేరా హోటల్లో అశ్లీల నృత్యాలు
-
బెయిల్ ఇప్పిస్తాడు... స్నాచింగ్స్ చేయిస్తాడు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసిన ఘరానా స్నాచర్ మహ్మద్ ఫైజల్ షా అలీ జాబ్రీ విషయంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇతడి వెనుక ఉండి కథ నడిపేది మహ్మద్ ఖలీల్‌గా తేలింది. వీరిద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన శాలిబండ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఆసిఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఫైజల్ సోదరుడు పేరున్న వైద్యుడు. ఇంటర్మీడియట్ మధ్యలో మానేసిన ఇతగాడు కొన్నాళ్లు పంజగుట్టలోని ఓ బ్యాంక్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేశాడు. వ్యసనాలకు బానిసగా మారి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం 2006 నుంచి చైన్ స్నాచింగ్స్ చేయడం మొదలెట్టి ఇప్పటి వరకు 138 గొలుసులు తెంపాడు. రెండుసార్లు పీడీ యాక్ట్ కూడా నమోదైంది. ఇతడు జైల్లో ఉండగా మరో ఘరానా స్నాచర్ ఖలీఫాతో పరిచయమైంది. ఇలా ఖలీఫాను కలవడానికి వచ్చే అతడి సోదరుడు ఖలీల్తోనూ స్నేహం చేశాడు. సింగిల్‌గా చైన్ స్నాచింగ్స్ చేసే ఫైజల్ విషయం తెలిసిన ఖలీల్ అతడిని అడ్డు పెట్టుకుని తేలిగ్గా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. దీనిని అమలులో పెట్టడం కోసం అతడికి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చాడు. ఇప్పటి వరకు ఫైజల్‌కు రెండుసార్లు బెయిల్ ఇప్పించిన ఖలీల్ అతడికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు చైన్ స్నాచింగ్స్ చేసేలా ప్రోత్సహించాడు. ఇలా తెచ్చిన గొలుసులను అమ్మగా వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకోవడం మొదలెట్టాడు. గతంలో సుల్తాన్‌బజార్ పోలీసులు ఫైజల్‌ను అరెస్టు చేసినప్పుడు కొన్ని నేరాలు చెప్పకుండా చేసి ఆ సొత్తు కాజేశాడు. ఖలీల్ పైనా రెండు స్నాచింగ్ కేసులు ఉన్నాయి. ఒంటరిగా బైక్‌పై సంచరిస్తూ స్నాచింగ్స్ చేసే ఫైజల్ మహిళల మెడలోని గొలుసులు లాగడంలో సిద్ధహస్తుడు. బాధితురాలికి ఏమాత్రం గాయం కాకుండా గొలుసు తెంపేస్తాడు. నేరం చేయడానికి వెళ్లేప్పుడే తనతో మరో షర్ట్ తీసుకువెళ్తాడు. స్నాచింగ్ చేసిన తర్వాత అనువైన ప్రాంతంలో ఆగి చొక్కా మార్చుకుంటాడు. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసినా చిక్కకుండా ఉండేందుకు వీలున్నంత వరకు ప్రధాన రహదారిని వాడడు. రెక్కీ లేకుండా నేరం చేయడం, చొక్కా మార్చుకోవడంతో పాటు గల్లీల్లో తిరుగుతూ తప్పించుకునే ఇతడి ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు ముప్పతిప్పలు పడాల్సి వస్తుంది. ఇటీవల శాలిబండ, నారాయణగూడ, సరూర్నగర్ల్లో మూడు స్నాచింగ్స్ చేసిన ఫైజల్‌తో పాటు సహకరించిన ఖలీల్‌ను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ చాకచక్యంగా పట్టుకుని 120 గ్రాముల బంగారం రికవరీ, నేరాలకు వాడే పల్సర్ బైక్ రికవరీ చేసింది. (చదవండి: 12 సీసీకెమెరాలు పెట్టినా...రూ.40 లక్షలు స్వాహా) -
హైదరాబాద్ రాంగోపాల్ పేట్ తకీల పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
-
బంజారా హిల్స్ ర్యాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ దాడులు
-
పోలీసు పుత్రిడి నుంచి ఉగ్రవాదిగా అజీజ్... 16 ఏళ్ల జైలు శిక్ష
సాక్షి హైదరాబాద్: పాక్ నిఘా సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో భారీ విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ దోషిగా తేలాడు. ఇతడికి 16 ఏళ్ల జైలు శిక్ష, రూ.26 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చినట్లు శనివారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏసీపీ పి.వెంకటేశ్వర్లు వివరించారు. ఈ కేసులో మరో నిందితుడు మహ్మద్ నిస్సార్‌కు న్యా యస్థానం 2011లోనే 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పెట్రోల్ పంపులో మేనేజర్‌గా.. భవానీనగర్‌కు చెందిన గిడ్డా అజీజ్ తండ్రి మెహతబ్ అలీ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేశారు. అజీజ్ 1985 నుంచి 87 వరకు పాతబస్తీలోని మదీనా ప్రాంతంలోని ఓ పెట్రోల్ పంపులో మేనేజర్‌గా పని చేశాడు. నల్లగొండ జిల్లా బోనాల్‌పల్లికి చెందిన సిమి ఉగ్రవాది మహ్మద్ ఫసీయుద్దీన్ ద్వారా ఉగ్రవాద బాటపట్టాడు. ఎల్ఈటీకి అనుబంధంగా ఆజం ఘోరీ ఏర్పాటు చేసిన ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్ సంస్థతో సన్నిహితంగా మెలిగాడు. హత్యలు, దోపిడీలతో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఫసీ అతని అనుచరుడు మీర్ 1993 జూన్ 21న కార్ఖానా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. 2000లో జగిత్యాలలో జరిగిన ఎన్కౌంటర్లో ఘోరీ చనిపోయాడు. దీంతో సౌదీ అరేబియాకు వెళ్లిపోయిన గిడ్డా అజీజ్ అక్కడే ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రిలీఫ్ ఆర్గనైజేషన్ (ఐఐఆర్వో) అనే సంస్థలో చేరాడు. పూర్తి స్థాయి జిహాదీ వలంటీర్లతో కూడి న ఈ సంస్థలో అజీజ్ కీలకపాత్ర పోషించాడు. భారీ విధ్వంసానికి కుట్ర.. ‘బాబ్రీ’ ఉదంతం తర్వాత రెచ్చిపోయిన అజీజ్ అయోధ్యతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ స్థాయిలో విధ్వంసానికి కుట్రపన్నాడు. అప్పట్లో బోస్నియా– చెచెన్యాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఆకర్షితుడైన అజీజ్ 1995లోనే ఆ దేశానికి వెళ్లి వచ్చాడు. ఆ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది యువతకు ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చాడు. 1995 జూలై 17 బోస్నియా నుంచి అసలు పేరుతోనే పాస్‌పోర్ట్ పొందాడు. ఆపై భారత్‌కు వచ్చిన గిడ్డా అజీజ్ 1993 జనవరి 7న సికింద్రాబాద్ ఆర్పీఓ కార్యాలయం నుంచి తన పేరుతోనే మరో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. 2000 అక్టోబర్ 3న అబ్దుల్ కరీం పేరుతో ఇంకో నకిలీ పాస్‌పోర్ట్ పొందాడు. అజీజ్, నిస్సార్ సహా మరొకరిని నగర పోలీసులు 2001 ఆగస్టు 28న హుమాయున్‌నగర్ పరిధిలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వద్ద అరెస్టు చేశారు. అజీజ్ నుంచి ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, బెల్జియంలో తయారైన పిస్టల్, క్యాట్రిడ్జిలు, బోస్నియా పాస్‌పోర్ట్, రెండు నకిలీ పాస్‌పోర్టులు, ఎలక్ట్రిక్ సర్క్యూట్ బోర్డులు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అజీజ్ సౌదీకి పారిపోయాడు. మూడేళ్లే అక్కడే ఉన్న అజీజ్ 2004లో నగరానికి వచ్చాడు. సికింద్రాబాద్‌లో ఉన్న గణేష్ దేవాలయం పేల్చివేతకు కుట్రపన్నాడు. సౌదీలో తలదాచుకుని.. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పేలుళ్లకు పన్నిన ఈ కుట్రను ఛేదించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మిగిలిన నిందితుల్ని అరెస్టు చేయగా... గిడ్డా అజీజ్ త్రుటిలో తప్పించుకున్నాడు. బోస్నియా పాస్‌పోర్ట్ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్‌ది నకిలీ పాస్‌పోర్ట్ అని గుర్తించిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అజీజ్‌పై 2008లో ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్‌పోర్ట్ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు 2016లో భారత్‌కు బలవంతంగా తిప్పిపంపించారు. దీంతో అప్పటి నుంచి 2001 నాటి విధ్వంసాల కేసు విచారణ సాగి అజీజ్‌కు 16 ఏళ్ల శిక్ష పడింది. (చదవండి: ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం) -
రూ.7444 ఇంజెక్షన్ @రూ.35 వేలు!
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే ఔషధాలను అనధికారికంగా సేకరించి, నల్లబజారుకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మెడికల్ షాపు నిర్వాహకులు ఉన్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్‌్కఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన కె.క్రాంతి కుమార్ వీవీ నగర్లో మెడిక్స్ ఫార్మసీ పేరుతో, వివేకానంద నగర్‌కు చెందిన ఎన్.వెంకట దినేష్ స్థానికంగా శంకరి పార్మసీ పేరుతో మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఆల్విన్ కాలనీకి చెందిన బాలాజీ మెడిసిన్ వరల్డ్ యజమాని శ్రీనివాస్‌తో కలిసి వారు బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే ఎంపోటెరిసరిన్–బి సంబంధిత ఇంజెక్షన్లను సేకరించారు. కొందరు రోగుల వద్ద మిగిలిన వాటిని దళారుల ద్వారా ఖరీదు చేయడంతో పాటు నకిలీ పత్రాలతో రోగుల బంధువుల మాదిరిగా సమీకరించిన వారి నుంచి వీరు కొనుగోలు చేసేవారు. అనంతరం రూ.7444 ఖరీదైన ఫంగ్లిప్ ఇంజెక్షన్‌ను రూ.35 వేలకు, రూ.8500 ఎంఆర్పీ కలిగిన పోసాకొంజోలీ ఇంజెక్షన్‌ను రూ.50 వేల చొప్పున విక్రయించేందుకు పథకం వేశారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కుటుంబీకులు, బంధువుల్ని టార్గెట్‌గా చేసుకుని ఈ దందాకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల జావేద్ నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షపీ వలపన్నారు. సోమవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి 35 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం రామ్‌గోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించారు. టాస్‌్కఫోర్స్ పోలీసులు కోవిడ్, బ్లాక్ ఫంగస్ మందుల అక్రమ దందాపై నిఘా పెంచారని సీపీ తెలిపారు. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి 56 కేసులు నమోదు చేసి 136 మందిని అరెస్టు చేశామని, వీరి నుంచి 450 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
పీఎంపాలెం (భీమిలి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను శనివారం రాత్రి విశాఖ పోలీసులు పట్టుకున్నారు. బెట్టింగ్‌ల ప్రక్రియ సూత్రధారి పరారు కాగా నలుగురిని అరెస్టు చేశారు. వారివద్ద నుంచి సుమారు రూ.3 లక్షలు విలువైన ఎల్రక్టానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను పీఎంపాలెం సీఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. ఈ నెల 9 నుంచి జరుగుతున్న పాకిస్తాన్ సూపర్‌లీగ్ టీ–20 క్రికెట్ మ్యాచ్‌లపై వీరు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. రుషికొండ పనోరమాహిల్స్ సెలబ్రిటీ టవర్స్ 15వ అంతస్తులోని ఫ్లట్‌ను చేబోలు శ్రీనివాస్ ఎలియాస్ కేబుల్ శ్రీను అద్దెకు తీసుకున్నాడు. అక్కడ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించేందుకు ఎల్రక్టానిక్ పరికరాలు సిద్ధం చేశాడు. విశాఖలోని అక్కయ్యపాలేనికి చెందిన కుంచంగి రవికుమార్ (29), సుజాతానగర్‌కు చెందిన తమ్మారెడ్డి ధనుంజయ్ (34), శ్రీకాకుళం జిల్లా నరసయ్యపేట మండలం బుచ్చిపేట మండలానికి చెందిన మార్పు శివాజీ (29), విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన వీరపునేని రాంబాబు (43)లను ఉద్యోగులుగా నియమించాడు. క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఒకేసారి 30 మందితో 30 సెల్ఫోన్ల ద్వారా మాట్లాడగల సామర్థ్యం ఉన్న సెటప్ బాక్సు ఏర్పాటు చేసి బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. తప్పుడు రేటింగ్‌లు చెబుతూ.. పాకిస్తాన్ సూపర్‌లీగ్ టీ–20 మ్యాచ్‌లలో శనివారం రాత్రి 9.30 గంటలకు కెట్ట గ్లాడియర్స్–పెషావర్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. క్రికెట్ లైవ్ గ్రూపులో చూస్తూ మ్యాచ్ గెలుపోటములపై కోడ్ ద్వారా అసలు రేటింగ్‌కు బదులు తప్పుడు రేటింగ్‌లు చెబుతూ బెట్టింగులు కాసేవారిని తప్పు దోవ పట్టిస్తూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం అందడంతో పీఎంపాలెం సీఐ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు శనివారం రాత్రి దాడిచేసి నలుగురు నిందితులను అరెస్టుచేసి వారివద్ద నుంచి పలు పరికరాలు, రూ.1,500 నగదు స్వాదీనం చేసుకున్నారు. అప్పటికే ప్రధాన నిందితుడు శ్రీనివాస్ పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు. -
భార్యలు మోసం చేయడంతో సైకోగా మారి 18 హత్యలు
సాక్షి, హైదరాబాద్: మొదటి భార్య వివాహమైన పక్షం రోజులకే మరొకరితో వెళ్లిపోయింది.. మూడేళ్లు కాపురం చేసిన రెండో భార్య విభేదాలు రావడంతో ఇద్దరు పిల్లల్ని తీసుకుని విడిపోయింది.. సహజీవనం చేసిన మూడో ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటూ కంటపడింది... దీంతో 2003లో తూప్రాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ‘మూడో’ఆమెను హత్య చేశాడు. అప్పటి నుంచి భర్తలు ఉండి పెడదారిలో వెళ్తున్న మహిళల్ని ఎంపిక చేసుకుంటున్నమైన రాములు 18 మందిని చంపాడు. తాజాగా ఘట్కేసర్, ములుగు పోలీస్స్టేషన్ల పరిధిలో ఇద్దరిని చంపిన ఈ సైకో సీరియల్ కిల్లర్‌ని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారని కొత్వాల్ అంజనీకుమార్ వెల్లడించారు. ఓఎస్డీ పి.రాధా కిషన్‌రావుతో కలసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. సైకో కిల్లర్‌గా మారి హత్యలు.. సంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామానికి చెందిన రాములుకు తలారీ, సాయిలు అనే పేర్లూ ఉన్నాయి. వృత్తిరీత్యా స్టోర్ కటర్ అయిన ఇతను ప్రస్తుతం బోరబండలో నివసిస్తున్నాడు. ఇద్దరు భార్యలతో పాటు సహజీవనం చేసిన మహిళ ద్వారా ఎదురైన అనుభవాలతో సైకో కిల్లర్‌గా మారాడు. ఇటీవల మరో మహిళను వివాహం చేసుకుని ఆమెతో కలసి బోరబండలో నివసిస్తున్న రాములు.. భర్తలు ఉండి వారిని మోసం చేస్తూ వ్యభిచారం చేసే వారిని, డబ్బు కోసం పరాయి మగవాడికి లొంగిపోయిన వారిని ఎంచుకుని చంపుతుంటాడు. చదవండి: (మదనపల్లి జంటహత్యల కేసులో కొత్త ట్విస్ట్) ప్రధానంగా కల్లు కాంపౌండ్లలో ఉన్న ఈ తరహా మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. వారితో కలసి కల్లు తాగే రాములు ఆపై డబ్బు ఆశ చూపి తన వెంట నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వారి పూర్వాపరాలు అడుగుతాడు. వారిలో ఎవరికైనా భర్తలున్నట్లు తేలితే... సైకోగా మారిపోయే రాములు వారిపై అత్యాచారం చేస్తాడు. ఆపై చీరతో ఉరి బిగించి లేదా బండ రాయితో మోది చంపేస్తాడు. కొన్నిసార్లు మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ముఖం తదితర భాగాలపై పెట్రోల్ పోసి కాల్చేస్తాడు. దీనికి ముందు మృతదేహంపై నుంచి చెవి కమ్మలు, కాళ్ల పట్టీలను తదితరాలు తస్కరిస్తాడు. ఏ ఆధారం వదలకుండా అక్కడ నుంచి జారుకుంటాడు. పిచ్చిపట్టినట్లు నాటకం... ఎనిమిది హత్యలు చేసిన ఇతడిని 2009, అక్టోబర్ 12న సైబరాబాద్ పోలీసులు తొలిసారిగా పట్టుకున్నారు. అప్పట్లో నార్సింగిలో జరిగిన హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. 2011లో మరో కేసులోనూ ఇలాంటి శిక్షే పడింది. దీంతో చర్లపల్లి కేంద్ర కారాగారంలో కొన్నాళ్లు శిక్ష అనుభవించాడు. అక్కడ నుంచి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో తనకు పిచ్చిపట్టినట్లు నాటకమాడాడు. దీంతో జైలు అధికారులు ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో చేర్చారు. 2011, డిసెంబర్ 29 రాత్రి రాములు అక్కడున్న ఇతర ఖైదీలు నర్సయ్య, అఫ్రోజ్ ఖాన్, గిరిజ సింగ్ వాఘేలా, యాదగిరి, లచ్చయ్యలతో కలసి పథకం వేసి తప్పించుకున్నాడు. దీనిపై ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ముగ్గురిని పోలీసులు అప్పట్లోనే పట్టుకోగా... రాములుతో పాటు లచ్చయ్య, అఫ్రోజ్ ఖాన్ కొన్నాళ్ల వరకు చిక్కలేదు. చదవండి: ('ఒకరోజు ఆగండి, మా పిల్లలు లేచి వస్తారు') చోరీ కేసులు కూడా.. పారిపోయిన రాములు నగర శివారుల్లో ఉంటూ స్టోన్ క్రషర్స్‌లో కార్మికుడిగా పని చేశాడు. మళ్లీ సైకోగా మారి చందానగర్ ఠాణా పరిధిలో ఇద్దరు మహిళలను హత్యచేశాడు. రాములు పని చేస్తున్న క్రషర్లోనే మేతారీ బాలనర్సింహ్మ పరిచయమైంది. వీరిద్దరు దుండిగల్, బోయిన్పల్లి పరిధుల్లో మరో ముగ్గురు మహిళల్ని చంపేశారు. ఈ ఐదు హత్య కేసుల్లో రాములు, బాలనర్సింహ్మను పోలీసులు 2013, మే 13న అరెస్టు చేశారు. జీవితఖైదు పడిన కేసుల్ని హైకోర్టులో సవాల్ చేసి, మిగిలిన కేసుల్లో బెయిల్ పొందిన రాములు 2018 అక్టోబర్ 3న బయటకొచ్చి శామీర్‌పేట, పటాన్చెరు పరిధుల్లో ఇద్దరు మహిళలను హత్య చేశాడు. పటాన్చెరు పోలీసులు అరెస్టు చేయగా.. గతేడాది జూలై 31న జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడిపై శామీర్‌పేట, మేడ్చల్, రాయదుర్గం, ఐడీఏ బొల్లారం ఠాణాల్లో చోరీ కేసులు కూడా ఉన్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా.. గత ఏడాది డిసెంబర్ 10న బాలానగర్ కల్లు కాంపౌండ్ నుంచి ఓ మహిళను ములుగు ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెతో కలసి మద్యం తాగి హత్య చేశాడు. డిసెంబర్ 30న యూసుఫ్‌గూడ కల్లు కాంపౌండ్ నుంచి వెంకటమ్మను తీసుకువెళ్లి ఘట్కేసర్ వద్ద హత్య చేశాడు. వెంకటమ్మ హత్య కేసును ఛేదించడానికి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఎస్సైలు కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్ తదితరులు సీసీ కెమెరాల ఫీడ్‌లో చిక్కిన ఫీడ్ ఆధారంగా రాములును పట్టుకున్నారు. ములుగులో హత్యకు గురైన మహిళను గుర్తించాల్సి ఉంది. -
16 హత్యలు: సీరియల్ కిల్లర్ అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని హతమారుస్తున్న సీరియల్ కిల్లర్ రాములును రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సైకో కిల్లర్ 16 హత్యలు చేసినట్లు పోలీసులు నిర్థారించారు. 2011లో ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి పరారైన రాములు స్వగ్రామం సంగారెడ్డి జిల్లా కంది మండలం అరుట్ల కాగా, గతంలో రాములపై పలు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. జైలు నుంచి పారిపోయి మళ్లీ హత్యలు చేస్తున్న సైకో కిల్లర్‌ను రాచకొండ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో పట్టుకున్నారు. నిందితుడిపై 16 హత్యలు, నాలుగు దోపిడీ, ఒక పోలీస్ కస్టడీ నుండి తప్పించుకున్న కేసులు ఉన్నాయి. చదవండి: ఈ దొంగ బాగా రిచ్, ఓ విల్లా.. 4 హైఎండ్ కార్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. ‘‘చిన్న వయసులో పెళ్లి చేసుకున్న రాములు.. తన భార్య విడిపోవడంతో అప్పటి నుండి మహిళలపై కక్ష పెంచుకున్నాడు. మానసికంగా దెబ్బ తిన్న రాములు.. అప్పటి నుండి హత్యలకు పాల్పడుతున్నాడు. మొదట ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను హత్య చేశాడు. అతని చేతిలో హత్యకు గురైన వారందరు కూడా మహిళలే. మెదక్ జిల్లా తూప్రాన్, సంగారెడ్డి, నరసాపూర్, బోయినపల్లిలో ఇద్దరిని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 మంది మహిళలను హత్య చేశాడు. చదవండి: కిడ్నాప్ కలకలం.. ఆడ వేషంలో వచ్చి మరీ.. నార్సింగ్ మహిళ హత్య కేసులో అతనికి జీవిత కాలం శిక్ష పడింది. అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి పోలీసులు తరలించగా, 2011లో అక్కడ నుంచి రాములు తప్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా తీరు మార్చుకోని రాములు.. ఐదు దోపిడీలకు పాల్పడ్డాడు. 2013 లో అతనిని బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా, 2018 లో జైలు నుండి విడుదలయ్యాడు. జైలు నుండి విడుదలై వచ్చిన తరువాత వరుసగా రెండు హత్యలకు రాములు పాల్పడ్డాడని’’ సీపీ వెల్లడించారు. -
శభాష్.. తెలంగాణ పోలీస్!
సాక్షి, హైదరాబాద్: సాంకేతికంగా ఎంతో ముందున్న హైదరాబాద్ పోలీసులు కేవలం ఇక్కడి కేసుల్నే కాదు..దేశంలోని ఇతర రాష్ట్రాలో నమోదైన వాటినీ కొలిక్కి తేవడంతో కీలకంగా వ్యవహరిస్తున్నారని కొత్వాల్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించారు. ఒడిశాలోని కటక్‌లో ఉన్న ఐఐఎఫ్ఎల్ సంస్థలో జరిగిన 12 కేజీల బంగారం దోపిడీ కేసు పరిష్కారంలో తమకు సహకరించాలని ఆ రాష్ట్ర డీజీపీ తనను కోరారని, వెంటనే స్పందించి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను పంపానని ఆయన తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో కొత్వాల్ ఈ విషయాలు తెలిపారు. ఒడిశాలోని కటక్‌లో ఉన్న నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇండియన్ ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐఐఎఫ్ఎల్) సంస్థలో గత నెల 19న భారీ బందిపోటు దొంగతనం జరిగింది. పట్టపగలు ఈ సంస్థపై దాడి చేసిన దుండగులు మారణాయుధాలతో బెదిరించి 12 కేజీల బంగారం ఎత్తుకుపోయారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన ముష్కరులు కొన్ని నిమిషాల్లోనే ఈ పని చేశారు. ఉదంతం జరిగిన 24 గంటలకూ కటక్ పోలీసులు కనీసం ఒక్క ఆధారమూ సేకరించలేకపోయారు. చదవండి: 9 కంపెనీలు.. 9 బ్యాంకులు.. రూ.9వేల కోట్లు దీంతో ఒడిశా డీజీపీ అభయ్ హైదరాబాద్ కొత్వాల్ అంజనీకుమార్‌ను సంప్రదించారు. సవాల్‌గా మారిన ఐఐఎఫ్ఎల్ కేసు దర్యాప్తులో కటక్ పోలీసులకు సహకరించాల్సిందిగా కోరారు. వెంటనే స్పందించిన కొత్వాల్ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును ఆదేశించారు. ఆయన అనేక సంచలనాత్మక కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో అనుభవం ఉన్న నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ బృందానికి చెందిన సబ్ఇన్స్పెక్టర్ కె.శ్రీకాంత్, కానిస్టేబుల్ ఈశ్వర్‌లను హుటాహుటిన కటక్ పంపారు. అక్కడకు వెళ్లిన ఈ ద్వయం వివిధ సీసీ కెమెరాలను అధ్యయనం చేసి, సాంకేతిక ఆధారాలను పరిశీలించి అనుమానితుల్ని గుర్తించారు. వీరిచ్చిన ఆధారాలతో ముందుకు వెళ్లిన కటక్ పోలీసులు గత నెల 24న ఏడుగురిని అరెస్టు చేశారు. కీలక కేసును కొలిక్కి తేవడంతో సహకరించిన హైదరాబాద్ పోలీసుల్ని ఒడిశా డీజీపీ అభయ్ ప్రత్యేకంగా అభినందించారు. -
మోసం, చోరీ.. పక్కా ప్లానింగ్
సాక్షి, సిటీబ్యూరో: వివిధ రకాలైన బహుమతుల పేర్లతో ఫోన్లు చేయడం... పన్నులు చెల్లించాలంటూ బ్యాంకు ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేయించుకోవడం.. ఇలా అందినకాడికి దండుకుని మోసం చేయడం. ఈ తరహా కేసుల్ని ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. అయితే పూల్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఆఫ్తాబ్ అహ్మద్ షేక్ కొత్త పంథాలో మోసాలు చేశాడు. కేవలం ఏడు నెలల కాలంలో 14 నేరాలు చేసిన ఇతగాడిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి ప్రయత్నిస్తామని కొత్వాల్ అంజనీకుమార్ తెలిపారు. అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. కొల్హాపూర్ జైల్లో నేరగాళ్లతో పెరిగిన పరిచయం పూల్‌బాగ్ ఆఫ్తాబ్ అహ్మద్ షేక్ వృత్తిరీత్యా కారు డ్రైవర్. ప్రస్తుతం పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. 2010లో మహారాష్ట్రలోని సియోన్లో ఉన్న అత్తవారింటికి వెళ్ళిన ఇతగాడు అక్కడే తన భార్యసోదరిపై అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పన్వేల్ పోలీసులు ఆఫ్తాబ్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. న్యాయస్థానం ఇతడికి ఐదున్నరేళ్ళ జైలు శిక్ష విధించడంతో కొల్హాపూర్ సెంట్రల్ జైలులో గడిపాడు. ఆ సమయంలోనే జైల్లో ఉన్న నేరగాళ్ళతో పరిచయం పెంచుకున్న ఆఫ్తాబ్ వివిధ రకాలైన మోసాలు చేయడం నేర్చుకున్నాడు. శిక్షాకాలం ముగియడంతో 2006 సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడు. నేరుగా నగరానికి చేరుకున్న ఆఫ్తాబ్ కొత్త పంథాలో గిఫ్ట్‌లంటూ బురిడీ కొట్టించడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు ఇతడిపై 23 కేసులు నమోదయ్యాయి. ఆఖరుసారిగా ఈ ఏడాది జనవరిలో అరెస్టయిన ఇతగాడు ఏప్రిల్‌లో జైలు నుంచి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి వరుసగా 14 నేరాలు చేశాడు. నేరుగా వెళ్ళి అదును చూసుకుని... ఇతగాడు గ్రామాల్లో తిరుగుతూ ఇన్స్టాల్మెంట్పై గృహోపకరణాలు విక్రయిస్తూ ఉంటాడు. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, మెదక్, నిర్మల్, సిద్దిపేట జిల్లాలు, మహారాష్ట్రలోనూ ఇలా చేశాడు. అలా కొందరు మహిళా కస్టమర్లను ఎంపిక చేసుకుంటాడు. మళ్ళీ వారి వద్దకు వెళ్ళే ఆఫ్తాబ్ తమ కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో మీకు బంపర్ బహుమతి వచ్చిందని నమ్మించేవాడు. ఇలా బాధితుల్ని తన వాహనంపైనే సమీపంలో ఉన్న తమ కార్యాలయానికి అంటూ తీసుకువెళ్ళేవాడు. కొద్దిదూరం వెళ్ళిన తర్వాత ఇది కేవలం పేదలకు ఉద్దేశించిన ‘స్కీమ్’ అని, మెడలో బంగారం ఉంటే ఇవ్వరని చెప్తాడు. వాళ్ళు తన మెడలో ఉన్న బంగారు ఆభరణాలను తీసి అతడికి ఇచ్చేవారు. ఆపై దృష్టి మళ్ళించి వాటితో ఉడాయించేవాడు. కొన్ని సందర్భాల్లో ఇంటి వద్దే వారికి ఇలా చెప్పేవాడు. దీంతో వాళ్ళు తమ ఆభరణాలు ఇంట్లోనే వదిలి వచ్చేవాళ్ళు. కొద్దిదూరం వెళ్ళిన తర్వాత వారి దృష్టి మళ్ళించి వెనక్కు వచ్చే ఆఫ్తాబ్ కుటుంబీకుల్ని బురిడీ కొట్టించి ఆ బంగారంతో ఉడాయించేవాడు. ఏడు నెలలు... 11 నేరాలు... ఈ నేరాలు చేయడం కోసం ఆఫ్తాబ్కు ఓ వాహనం అవసరమైంది. దీనికోసం అతడు మహారాష్ట్రలోని ఖాండ్వా ప్రాంతంలో దాన్ని తస్కరించాడు. దీనిపైనే వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ మహిళల్ని ఎంపిక చేసుకుని నేరాలు చేశాడు. ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు 14 నేరాలు చేశాడు. నగరంలోని చారి్మనార్‌తో పాటు ఇతర జిల్లాలు, మహారాష్ట్రల్లో పంజా విసిరాడు. వరుసగా నేరాలు జరగడంతో ఆయా ప్రాంతాలకు చెందిన అధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. చార్మినార్‌లో నమోదైన కేసును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేసింది. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, వి.నరేందర్, మ«హ్మద్ థకియుద్దీన్లతో కూడిన బృందం సీసీ కెమెరాలపై దృష్టి పెట్టింది. నేరం జరిగిన ప్రాంతాలతో పాటు ఇతర చోట్ల అధ్యయనం చేసి అనుమానితుడి ఫొటో సేకరించింది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు శుక్రవారం ఆఫ్తాబ్ను అరెస్టు చేసింది. ఇతడి నుంచి వాహనం, బంగారంతో కలిసి రూ.18.5 లక్షలు సొత్తు స్వాదీనం చేసుకున్నారు. -
నకిలీ ఐడీ.. సీఎం గన్‌మెన్.. డమ్మీ పిస్తోలు
సాక్షి, సిటీబ్యూరో: ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్లో గన్‌మెన్‌గా పని చేస్తున్న సబ్–ఇన్స్పెక్టర్గా చెప్పుకుంటూ పలువురిని మోసం చేసి శనివారం వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన ఎన్.సంతోష్ వ్యవహారంలో ఆసక్తికరమైన కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇతడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన లంగర్‌హౌస్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. చదవండి: కరోనా ఎఫెక్ట్: పెళ్లి ఆలోచన పెరిగింది.. ► రేతిబౌలి, ఖదీర్బాగ్కు చెందిన ఎన్.సంతోష్ టెన్త్ వరకు మాత్రమే చదివాడు. కొన్నాళ్లు ఓ సివిల్ కాంట్రాక్టర్ దగ్గర ఎలక్ట్రీషియన్‌గా పని చేసిన అతను ఆపై కారు డ్రైవర్‌గా మారాడు. ► నగరానికి చెందిన ఓ కారు రెంటల్ సంస్థకు తన ఆధార్, రెండు ఖాళీ చెక్కులు ఇచ్చి కారు అద్దెకు తీసుకునేవాడు. అనంతరం దీనిని తీసుకుని దూరప్రాంతాలకు కిరాయికి వెళ్తుండేవాడు. ► గతంలో సమాచార హక్కు చట్టం ప్రధాన కార్యాలయంలో పని చేసే ఓ అధికారి వద్ద కాంట్రాక్ట్ పద్దతిలో డ్రైవర్‌గా పని చేశాడు. ఈ నేపథ్యంలో ఇతడికి సఫారీ డ్రస్ వేసుకోవడం అలవాటు కావడంతో ఇప్పటికీ కొనసాగిస్తూ వచ్చాడు. ► కొన్నాళ్ల క్రితం ఓ రిజర్వ్ సబ్–ఇన్స్పెక్టర్ (ఆరెస్సై) అతడి కారును బుక్ చేసుకుని బయటి జిల్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన టోల్‌గేట్స్ వద్ద తన గుర్తింపు కార్డు చూపిస్తూ మినహాయింపు పొందారు. ► దీనిని చూసిన సంతోష్‌కు ఓ ఆలోచన వచ్చింది. నిత్యం కిరాయికి బయటి ప్రాంతాలకు వెళ్లే తన వద్ద కూడా ఇలాంటి కార్డు ఉంటే తానూ టోల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చని, ఇలా ప్రతి ట్రిప్‌లోనూ అదనంగా రూ.వెయ్యి వరకు లాభపడచ్చని భావించాడు. ► దీనిని అమలులో పెడుతూ... సదరు ఆరెస్సైకి చెందిన గుర్తింపుకార్డును ఫొటో తీసుకున్నాడు. ఫొటోషాప్ సాఫ్ట్వేర్ సహాయంతో అందులో మార్పులు చేసి తన పేరు, ఫొటో ఏర్పాటు చేసుకున్నాడు. ► అప్పటికే సఫారీ డ్రస్ వేసుకుంటున్న సంతోష్ కొత్తగా వచ్చిన నకిలీ గుర్తింపుకార్డులతో తాను సూడో పోలీసుగా మారాలనుకున్నాడు. అమెజాన్ నుంచి పిస్టల్ ఆకారంలో ఉన్న సిగరెట్ లైటర్‌ను రూ.850 వెచి్చంచి కొనుగోలు చేశాడు. ► ఓ సందర్భంలో ఓఆర్ఆర్ మీదుగా వెళ్తూ... అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది చేతిలో వాకీటాకీ చూశాడు. వెంటనే వారి వద్దకు వెళ్లిన ఇతగాడు దాన్ని చూస్తానంటూ తీసుకుని చేతిలో పట్టుకుని ఫొటోలు దిగాడు. ► సీఎం కేసీఆర్ తన అంగరక్షకులతో దిగిన ఫొటోను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేశాడు. ఇందులో ఆయనకు ఎడమ వైపున ఉన్న భద్రతా సిబ్బంది ఫొటోను ఫొటోషాప్ ద్వారా మారి్ఫంగ్ చేసి తన ఫొటో అతికించాడు. ►తన ఫోన్లో స్నేహితులు, బంధువుల నంబర్లను ‘కలెక్టర్ ఆఫీస్, సీఎం 2, సీఎం క్యాంప్ ఆఫీస్, సీబీఐ రవీంద్ర’ పేర్లతో సేవ్ చేసుకున్నాడు. దీంతో వారు కాల్ చేసినప్పుడు ఈ పేర్లే వచ్చేవి. స్నేహితులతో కూర్చున్నప్పుడు ఈ కాల్స్ వస్తే భారీ బిల్డప్ ఇచ్చేవాడు. ► వీటన్నింటినీ వినియోగిస్తూ తాను ప్రగతి భవన్లలో పని చేస్తున్న గన్‌మెన్‌గా అనేక మందికి పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తానంటూ అనేక మంది నుంచి డబ్బు వసూలు చేశాడు. ఒత్తిడి చేసిన వారికి తిరిగి చెల్లించేశాడు. -
హైదరాబాద్: పలు పబ్బులపై పోలీసుల దాడి
-
బీదర్ నుంచి వస్తున్న ‘రాణి’
సాక్షి, సిటీబ్యూరో: ‘రాణి’ బ్రాండ్ గుట్కాను వక్కల ముసుగులో కర్ణాటకలోని బీదర్ నుంచి నగరానికి అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇప్పటి వరకు సిటీలో దొరికిన నిషేధిత పొగాకు ఉత్పత్తులన్నీ పాన్ మసాలా, తంబాకు విడివిడిగా ప్యాక్ చేసి ఉన్నవే కాగా.. తొలిసారిగా పూర్తి గుట్కాను పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి గురువారం తన కార్యాలయంలో కొత్వాల్ అంజనీకుమార్ విలేకరులకు తెలిపిన వివరాలు ప్రకారం... (చదవండి: కూకట్‌పల్లిలో దారుణం) ► నగరానికి చెందిన అన్నదమ్ములు మహ్మద్ హసనుద్దీన్, మహ్మద్ మజారుద్దీన్, మహ్మద్ ఆరీఫ్ వ్యవస్థీకృత గుట్కా దందా ప్రారంభించారు. తమకు సహకరించడానికి అక్తర్, యాసీన్, మక్బూల్, దస్తగిరి, మీర్జా ఫజీ హుస్సేన్ బేగ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ► అఫ్జల్‌గంజ్, బహదూర్‌పుర ప్రాంతాల్లో ఉన్న గోదాముల్లో ఈ ముఠాలో కొందరు గోదాముల ఇన్‌చార్జ్‌లుగా, మరికొందరు ట్రాన్స్పోర్ట్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. బీదర్‌కు చెందిన రిజ్వాన్ ఈ ముఠాకు హోల్‌సేల్‌గా రాణి బ్రాండ్ గుట్కాను సరఫరా చేస్తున్నారు. ► వక్కల పేరుతో డీసీఎం వ్యాన్లలో బీదర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గుట్కా వివిధ గోదాములకు చేరుతోంది. అక్కడ నుంచి దీన్ని చిన్న చిన్న వాహనాల్లో పాన్‌షాపులు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొంత మొత్తం ట్రాన్స్పోర్ట్, కొరియర్ల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలు, పట్టణాలకు వెళ్తోంది. ► పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండటానికి బీదర్ నుంచి సిటీలో గుట్కా దిగిన తర్వాత ఒకే గోదాములో ఉంచట్లేదు. నిత్యం ఒకచోటు నుంచి మరోచోటుకు మారుస్తున్నారు. ఈ గ్యాంగ్ ఇటీవలే బహదూర్‌పుర పరిధిలోని కిషన్‌బాగ్‌లో ఓ గోదాము అద్దెకు తీసుకుంది. ► ఈ వ్యవహారంపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ తమ బృందాలతో ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో దాడులు చేశారు. ► మీర్జా, దస్తగిరిలను అరెస్టు చేసి వీరి నుంచి వాహనంతో పాటు రూ.63,96,000 విలువైన 31 బ్యాగుల్లో ఉన్న 639600 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ► నగరంలో ఉన్న కొరియర్, ట్రాన్స్పోర్ట్ సంస్థలు ఇలాంటి నిషేధిత ఉత్పత్తుల్ని రవాణా చేయవద్దని, అలా చేస్తే వారి పైనా కేసులు పెడతామని కొత్వాల్ అంజనీకుమార్ హెచ్చరించారు. ► ఈ కార్యక్రమంలో నగర కొత్వాల్ సిటీలోని గస్తీ వాహనాల సిబ్బందికి రిఫ్లెక్టివ్ జాకెట్లు పంపిణీ చేశారు. ఇళ్ల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తూ, కేసులు నమోదు చేస్తున్న వీరే పోలీసు విభాగానికి బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. (చదవండి: 300 పోలీసు అధికారుల ఇళ్లల్లోకి వరద నీరు) -
టాస్క్‌ఫోర్స్ తనిఖీ.. 800 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, విజయవాడ : నగర శివారులో 800 కిలోల గంజాయిని బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రామవరప్పాడు వద్ద తనిఖీలు చేపట్టగా... లారీలో తరలిస్తున్న సుమారు 80 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం నుంచి కొయంబత్తూరుకు లారీలో మొక్క జొన్న పిండి బస్తాల చాటున తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, లారీని సీజ్ చేసినట్లు ఆయన (గంజాయి రవాణా చేసే నార్త్ ముఠాకు చెక్) కూకట్‌పల్లిలో నలుగురు అరెస్ట్ సాక్షి, హైదరాబాద్ : గంజా విక్రయిస్తున్న నలుగురు యువకులను బుధవారం కూకట్‌పల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారంతో గంజా అమ్మడానికి సిద్ధంగా ఉన్న యువకులను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నవీన్ కుమార్, ఆనంద్, అనంత్ కుమార్, శ్రవణ్ అరెస్టు అయ్యారు. వీరు ఖమ్మం సత్తుపల్లి నుంచి 3.5 కిలోల గంజా సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని ఎస్ఓటీ పోలీసులు.. కూకట్పల్లి పోలీసులకు అప్పగించారు. (భర్తకు గండం ఉందని వివాహిత మెడలో తాళి కట్టి..) -
హవాలా ముఠాను పట్టేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
సాక్షి, విజయవాడ: వావాలా లావాదేవీల ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. స్విఫ్ట్ కారులో ఓ ముఠా హవాలా సొమ్ము తరలిస్తుందన్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాస్ బృందం ఆ ముఠాను కాపుకాసి పట్టేసింది. నరసాపురం నుంచి హైదరాబాద్‌కు హవాలా సొమ్ము తరలిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. ఆ కారులో ఉన్న కోటీ నలభై లక్షల రూపాయల ఇండియన్ కరెన్సీని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రూ.24 లక్షలు విలువ చేసే 30వేల డాలర్లు పట్టుకున్నారు. బంగారం వ్యాపారి ప్రవీణ్ జైన్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హవాలా మూలాల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల వద్ద కూపీ లాగుతున్నారు. -
టెన్త్ చదివిన ‘డాక్టర్’ గుట్టు రట్టు!
-
ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ రూ.లక్ష!!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే.. మరోవైపు కొందరు ఆక్సిజన్ సిలిండర్ల దందాకు తెరలేపారు. అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఈక్రమంలో సిలిండర్ల దందాపై పక్కా సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఆ ముఠాను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతున్న రెండు ముఠాలపై దాడి చేసిన పోలీసులు 34 ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. పలు క్లీనిక్‌లు, ఆస్పత్రులు, వ్యక్తిగతంగా కొందరికి ఈ ముఠాలు ఆక్సిజన్ సిలిండర్లు అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్క సిలిండర్‌కు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు అప్పగించామని తెలిపారు. నగరంలో సిలిండర్ల అమ్మకాల పై దృష్టి సారించామని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. (చదవండి: దుబ్బాకలో మరో డేరాబాబా) -
కరోనా: టాస్క్‌ఫోర్స్‌కు రిస్క్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేయడం, లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడం..నిర్దేశించిన కంటైన్మెంట్ జోన్ల పర్యవేక్షణ.. పాజిటివ్, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌పై నిఘా..వంటి ముఖ్య అంశాల్లో పోలీసు విభాగం పాత్ర అత్యంత కీలకం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపు ఐదుగురు సిబ్బంది దీని బారినపడ్డారు. సిటీ పోలీస్‌కు గుండెకాయ వంటి టాస్క్‌ఫోర్స్ పోలీసులను కరోనా వెంటాడుతోంది. ప్రధానంగా తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఈ భయం మరీ ఎక్కువైంది. గత నెల్లో వీళ్లు అరెస్టు చేసిన ఓ నిందితుడికి ఉస్మానియా వైద్యులు క్వారంటైన్ స్టాంప్ వేయడంతో ఉలిక్కిపడ్డారు. తాజాగా వీళ్లు రెస్క్యూ చేసిన బాలుడికి పాజిటివ్ రావడంతో కొందరు హోమ్ క్వారంటైన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. (17 రోజులు.. 93 రైళ్లు.. 1.18 లక్షల మంది ) నిందితుడికి ‘స్టాంప్’ వేయడంతో... ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత నెల 11న ఓ ఘరానా దొంగను అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా చంటపల్లి తండాకు చెందిన జటావత్ మహేష్ హైదరాబాద్ నగరంతో పాటు నల్లగొండలోని అనేక ప్రాంతాల్లో 50కి పైగా దొంగతనాలు చేశాడు. మైనర్‌గా చిక్కిన మహేష్‌ను అధికారులు జువైనల్ హోమ్‌లో ఉంచారు. ఈ ఏడాది మార్చిలో అక్కడ నుంచి పరారయ్యాడు. ఆపై కంచన్‌బాగ్, సరూర్‌నగర్, నల్లగొండ, మలక్‌పేట్‌ల్లో నేరాలు చేశాడు. ఇతడిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత నెల 11న పట్టుకున్నారు. విచారణ, రికవరీ, అరెస్టు తర్వాత కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికి మహేష్ జ్వరంతో ఉండటం, కరోనా విజృంభిస్తుండటంతో వైద్యులు అతడికి హోం క్వారంటైన్ స్టాంప్ వేశారు. కోర్టు సైతం ష్యూరిటీపై విడిచిపెట్టాలని ఆదేశించడంతో ఇతడికి రిమాండ్ తప్పింది. ఇతడి క్వారంటైన్ సమయం 14 రోజులు ముగిసే వరకు పోలీసులకు కంటి మీద కునుకులేదు. చివరకు అంతా సజావుగానే జరగడంతో ఊపిరిపీల్చుకున్నారు. రెస్క్యూ చేసిన బాలుడికి పాజిటివ్.. చాదర్‌ఘాట్ పరిధిలో చోటు చేసుకున్న ఓ బాలుడి కిడ్నాప్ కేసును ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెండు రోజుల క్రితం ఛేదించారు. శుక్రవారం ఆ బాలుడికి కరోనా పాజిటివ్ రావడంతో కొందరు అధికారులు, సిబ్బంది హోమ్ క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్ ముందు నిద్రిస్తున్న యాచకురాలి నుంచి ఈ నెల 13 ఉదయం ఆమె కుమారుడిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఠాణా ఈస్ట్‌జోన్ పరిధిలోకి రావడంతో తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ టీవీల్లో రికార్డు అయిన ఫుటేజ్‌లతో పాటు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు ఈ కేసును 48 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. అతడి చెరలో ఉన్న యాచకురాలి కుమారుడిని రెస్క్యూ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా..ఆ బాలుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు శుక్రవారం తేలింది. దీంతో ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, చాదర్‌ఘాట్ పోలీసులు కలిపి మొత్తం 22 మంది హోం క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ కేసులో నిందితుడు ‘ఠాణా క్వారంటైన్’లో ఉన్నాడు. ఈ ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులతో పాటు బాలుడి తల్లి నుంచీ వైద్యులు నమూనాలు సేకరించారు. ఆ నివేదిక రావాల్సి ఉండటంతో టాస్క్‌ఫోర్స్ సహా పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అరెస్టుల్లో అధికం ఆ ప్రాంతాల్లోనే.. ప్రస్తుతం నగరంలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే రాజధానిలోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నగరంలోనూ ప్రధానంగా స్లమ్స్‌లోనే ఈ కేసుల విస్తరణ ఎక్కువని కనిపిస్తోంది. ఇదిలా ఉండగా... పాత నేరగాళ్లు, వాంటెడ్ వ్యక్తులు ఉండేది కూడా ఇదే ప్రాంతాల్లో. వీరి కదలికలపై ఏమాత్రం ఉప్పందినా తొలుత రంగంలోకి దిగేది టాస్క్‌ఫోర్స్ పోలీసులే. వీటికితోడు ఈ పోలీసులు అనేక ప్రాంతాలకు వెళ్లి తనిఖీలు, సోదాలు చేపడుతున్నారు. అలా చేయడం వల్లే శుక్రవారం నకిలీ నెయ్యి, మద్యం లభించాయి. ఈ రకంగా సర్వకాల సర్వావస్థల్లోనూ విధులు నిర్వర్తించే తమకు ఉన్నతాధికారులు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లు అందించాలని టాస్క్‌ఫోర్స్ పోలీసులు కోరుతున్నారు. మరోపక్క తాజా పరిణామాల నేపథ్యంలో అత్యవసర, లాక్డౌన్ సంబంధిత కేసుల మినహా ఇతర రొటీన్ కేసుల జోలికి పోవద్దని అధికారులు సిబ్బందికి స్పష్టం చేస్తున్నారు. ఆ కేసుల్లో నిందితులు, అనుమానితులు, బాధితులు వారి బంధువులు..ఇలా ఎవరినీ నేరుగా తాకవద్దని, తాకాల్సి వస్తే కచ్చితంగా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
డబ్బులిస్తే.. ‘రాసి’పెడతారు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని టోలిచౌకి సూర్యనగర్ కాలనీలో ఉన్న న్యూ మదీన జూనియర్ కాలేజీ (సెంటర్ కోడ్– 60237) కేంద్రంగా గుట్టుగా సాగుతోన్న మాస్ కాపీయింగ్ వ్యవహారాన్ని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. బుధవారం కాలేజీపై దాడిచేసిన ప్రత్యేక బృందం.. కాలేజీ ప్రిన్సిపాల్, ముగ్గురు పరిపాలన విభాగం సిబ్బంది, ఆరుగురు విద్యార్థుల్ని పట్టుకుంది. ఇదీ జరుగుతున్న తంతు.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు బోర్డు నుంచి అనుమతి పొందిన కాలేజీల్లో న్యూ మదీన జూనియర్ కాలేజీ ఒకటి. ఇక్కడ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో కొందరికి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ షోయబ్ తన్వీర్ కచ్చితంగా పాస్ చేయిస్తానంటూ ఎర వేశాడు. ఒక్కో సబ్జెక్టుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఆయా పరీక్షల ప్రశ్నపత్రాలు స్థానిక పోలీసుస్టేషన్లలో ఉంటాయి. ఓఎంఆర్ షీట్‌తో కూడిన ఆన్సర్ షీట్స్ మాత్రం పరీక్ష కేంద్రానికే చేరతాయి. అక్కడ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇంటర్మీడియట్ బోర్డ్ వీటిని అందిస్తుంది. వీటిని బోర్డుకు చెందిన ఎగ్జామినర్ పర్యవేక్షణలో ఆయా సెంటర్లకు చెందిన వారు సిద్ధం చేస్తారు. దీన్నే తన్వీర్ అనుకూలంగా మార్చుకున్నాడు. ప్రతి ప్రశ్నపత్రంతోనూ జతచేసి ఉండే ఆన్సర్‌షీట్స్ బుక్‌లెట్‌ను ముందు రోజు రాత్రే వీళ్లు మార్చేస్తున్నారు. ఓఎంఆర్ షీట్‌కు డమ్మీ జవాబుపత్రాన్ని జత చేస్తున్నారు. పరీక్ష రాసేటపుడు విద్యార్థి బుక్లెట్పై ఉండే ఓఎంఆర్ షీట్లో క్వశ్చన్ పేపర్‌తో పాటు ఈ బుక్లెట్ నంబర్ కూడా వేయాలి. మదీన జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ తమతో ఒప్పందం కుదుర్చుకున్న వారికి ఓఎంఆర్ షీట్స్‌తో డమ్మీ బుక్లెట్స్ ఇస్తున్నాడు. అదే సమయంలో ప్రిన్సిపాల్.. అసలు బుక్‌లెట్స్‌ను కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది సయ్యద్ కలీముద్దీన్, షబానా బేగం, జాహెదా షరీన్‌కు ఇచ్చి పుస్తకాల్లో చూసి రాయిస్తున్నాడు. ఆయా సబ్జెక్టుల ప్రశ్నపత్రాలూ వీరికి ఇస్తున్నాడు. పరీక్ష ముగిశాక ఈ అసలు బుక్‌లెట్స్‌ను ఒప్పం దం చేసుకున్న విద్యార్థులకు అందించి, వాటిని ఓఎంఆర్ షీట్ కు జతచేయిస్తూ దానిపై ఆ బుక్లెట్ నంబర్ వేయిస్తున్నాడు. అదుపులో పది మంది.. నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు దీనిపై పక్కా సమాచారం అందుకున్నారు. డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదేశాలతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలోని బృందం న్యూ మదీన కాలేజీపై దాడి చేసింది. ఆ సమయంలో బుక్‌లెట్స్‌లో పరీక్షలు రాస్తున్న ముగ్గురు సిబ్బందితో పాటు ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద లభించిన ఆధారాలను బట్టి ఒప్పందం చేసుకున్న విద్యార్థులైన అహ్మద్ నజీర్ (సెయింట్ జోసఫ్ జూనియర్ కాలేజీ–టోలిచౌకి), మహ్మద్ అహ్మద్ హుస్సేన్, మహ్మద్ ఇక్బాల్ అబ్బాస్, ఫిరాజ్ మీర్జా (నియోసిస్ జూనియర్ కాలేజీ), మహ్మద్ రియాన్ నజీర్ (న్యూ రిలయన్స్ జూనియర్ కాలేజీ), నిసార్ అహ్మద్ (నారాయణ జూనియర్ కాలేజీ)ను పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు కామర్స్, నలుగురు కెమిస్ట్రీ పరీక్షలు రాయిస్తున్నారని గుర్తించారు. మరో ఇద్దరు విద్యార్థులైన మహ్మద్ అలీఖాన్, అబుబకర్ అబ్దుల్లా బిన్ మహఫూజ్ కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వారిని టాస్క్‌ఫోర్స్ బృందం గోల్కొండ పోలీసులకు అప్పగించింది. ఈ తరహాలో మరికొందరికీ ప్రిన్సిపాల్ పరీక్షలు రాయించినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగానూ దర్యాప్తు చేపట్టారు. యాజమాన్యానికి షోకాజ్ నోటీస్ మూకుమ్మడి మాల్ ప్రాక్టీస్ ఘటన నేపథ్యంలో న్యూ మదీన జూనియర్ కాలేజీ యాజమాన్యానికి ఇంటర్ బోర్డు షోకాజ్ నోటీసు జారీ చేసింది. టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీలో మాల్‌ప్రాక్టీస్ వాస్తవమేనని తేలిందని, దీంతో 8 మందిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు బుక్ చేశా మంది. యాజమాన్యం తమ తప్పిదాన్ని అంగీకరించిన నేపథ్యంలో కాలేజీ అనుబంధ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని యాజమాన్యానికి నోటీసు జారీ చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. -
విశాఖలో సుపారీ గ్యాంగ్ అరెస్టు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది మొదలవలస చిరంజీవిని హతమార్చేందుకు కుట్ర పన్నిన సుపారీ గ్యాంగ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం విశాఖలో అరెస్ట్ చేశారు. ఓ రౌడీషీటర్, జర్నలిస్టు సహా ఆరుగురిని అరెస్ట్ చేసి మూడు కత్తులు, రూ.70 వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా శుక్రవారం మీడియాకి ఈ వివరాలను వెల్లడించారు. ఏం జరిగిందంటే...? శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటకు చెందిన న్యాయవాదులు చిరంజీవి, అమ్మినాయుడు మధ్య రాజకీయ వైరుధ్యాలున్నాయి. కాగా అమ్మినాయుడు 2014లో టీడీపీ నుంచి ఎంపీటీసీగా ఎన్నికయ్యాడు. మరోవైపు విశాఖలో క్రైం రిపోర్టర్‌గా పనిచేస్తున్న కిల్లి ప్రకాష్, చిరంజీవికి మధ్య భూ వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మినాయుడు, కిల్లిప్రకాష్ కలసి చిరంజీవిని హతమార్చేందుకు రౌడీషీటర్ కన్నబాబుతో రూ. 10 లక్షలకు డీల్ కుదుర్చుకుని రూ.4 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. అయితే చిరంజీవిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ పలుమార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా విశాఖ చినముషిడివాడలోని ఒక ఇంట్లో సమావేశమైన ఈ గ్యాంగ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో కిల్లి ప్రకాష్, రాజన కన్నబాబు, గంటా రామరాజు, ఆసనాల ఏసుదాస్, బోనెల పరమేష్, పసిగడ అనిల్‌కుమార్ ఉన్నారు. ప్రధాన నిందితుడు కొత్తకోట అమ్మినాయుడుతో పాటు మదన్, సువ్వారి తేజేశ్వరరావు పరారీలో ఉన్నారు. దాడుల్లో డీసీపీ–2 ఉదయభాస్కర్ బిల్లా, ఏడీసీపీ (క్రైం) సురేష్‌బాబు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ త్రినా«థ్, ఏసీపీ(క్రైం) శ్రావణ్‌కుమార్, సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. -
బెజవాడలో బెట్టింగ్ ముఠా అరెస్టు
సాక్షి, అమరావతి బ్యూరో: పదుల సంఖ్యలో సబ్ బుకీలు, పంటర్లను పెట్టుకుని యథేచ్ఛగా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠా గుట్టును విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి బెట్టింగ్ నిర్వహణకు ఉపయోగించే సామగ్రితోపాటు రూ. 16.02 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీసు కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో నగర సీపీ ద్వారకా తిరుమలరావు విలేకరుల సమావేశంలో బెట్టింగ్ ముఠా వివరాలు వెల్లడించారు. విజయవాడ మాచవరం పరిధిలోని మారుతీనగర్ మసీదు వీధిలో నివాసం ఉండే పైలా ప్రసాద్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో 9 మంది పంటర్లతో క్రికెట్ బెట్టింగ్‌కు శ్రీకారం చుట్టాడు. పశ్చిమగోదావరి జిల్లా కైకారం గ్రామానికి చెందిన ప్రధాన బుకీ కళ్యాణ్ చక్రవర్తితో కలిసి బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఈ ముఠా సభ్యులు ఆంధ్రప్రదేశ్‌తోపాటు హైదరాబాద్‌లోని ఇతర బెట్టింగ్ ముఠాలతో సంబంధాలు పెట్టుకుని యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కళ్యాణ చక్రవర్తి గురించి చెప్పడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. వీరితోపాటు విజయవాడలోని మొగల్రాజపురానికి చెందిన మోహన్‌కృష్ణ, కృష్ణలంకకు చెందిన ఉండి శరత్‌చంద్రను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 16.02 లక్షల నగదుతోపాటు 19 సెల్ఫోన్లు, ఒక లైన్‌బాక్స్, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసును మాచవరం పోలీసులకు అప్పగించారు. -
8.86 కిలోల బంగారం స్వాధీనం
ఆటోనగర్(విజయవాడ తూర్పు): బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలను అక్రమంగా విజయవాడకు తరలిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3.18 కోట్ల విలువ చేసే 8.861 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి కోట్ల రూపాయల విలువ చేసే బంగారం విజయవాడకు వస్తోందన్న పక్కా సమాచారం నేపథ్యంలో విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఆదేశం మేరకు ఆదివారం టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో విజయవాడలో పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలోని బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా రెండు బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ముంబైకు చెందిన జయేష్ జైన్, విజయవాడ ఇస్లాంపేట వాసి పాగోలు శ్రీనివాసరావుగా గుర్తించారు. వీరిని ఇబ్రహీంపట్నం పోలీసులు విచారించగా.. ముంబైలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి, వాటికి ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమమార్గంలో విజయవాడకు చేరవేస్తున్నట్టుగా అంగీకరించారు. ఇలా అక్రమంగా రవాణా చేస్తున్న బంగారు వస్తువులను ఎటువంటి పన్నులు చెల్లించకుండా మార్కెట్ ధరలకు జ్యువెలరీ షాపులకు విక్రయిస్తున్నారని, కొంతకాలంగా ఈ దందా కొనసాగుతున్నదని పోలీసులు చెబుతున్నారు. -
హుండీ దందా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరం నుంచి ముంబైకి రవాణా చేయాలని చూసిన హుండీ నగదును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని రూ.5 కోట్ల నగదును సీజ్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2 దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడీని హవాలా అని, దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే దాన్ని హుండీ అని అంటారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన హర్షద్ భాయ్ పటేల్, ఉమేష్ బోథ్ పి.ఉమేష్ చంద్ర అండ్ కంపెనీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. కాచిగూడలోని ఆ సంస్థ ఆఫీస్‌లో గుజరాత్‌కు చెందిన విపుల్ కుమార్ పటేల్ మేనేజర్‌గా, శైలేష్ భాయ్, విపుల్, ఉపేంద్ర కుమార్ పటేల్, పటేల్ చేతన్‌కుమార్‌లు క్యాష్ ట్రాన్స్‌పోర్టర్స్‌గా, అర్జున్ లభూజీ కారు డ్రైవర్‌గా, రాజేష్ రమేశ్ భాయ్ పటేల్ పార్సిల్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. ఈ దందాలో కమీషన్‌గా రూ.లక్షకు రూ.600 తీసుకుంటారు. పట్టుబడ్డారిలా.. ఇటీవల నగరంలో వసూలు చేసిన రూ.5 కోట్లను ముంబై కార్యాలయానికి తరలించాల్సిందిగా వీరికి ఆదేశాలు అందాయి. దీంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రాంతం నుంచి డబ్బు తీసుకున్న ఈ ఏడుగురూ రెండు కార్లలో ముం బైకి బయలుదేరారు. దీనిపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు బి.దుర్గారావు, పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, మహ్మద్ ముజఫర్ తమ బృందాలతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వల పన్నారు. ఆ మార్గంలో వచ్చిన కార్లను తనిఖీ చేసి రూ.5 కోట్లు స్వాధీనం చేసుకుని ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
చారి.. జైలుకు పదకొండోసారి!
సాక్షి, హైదరాబాద్: అతడో ‘అవతార’పురుషుడు. చిన్నమొత్తాలు కొల్లగొట్టే పెద్దదొంగ. పేరు రాయబండి సూర్యప్రకాశ్‌చారి... ఇంటర్మీడియెట్ కూడా పాస్ కాలేదు... అయితేనేం.. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోని అధికారినని చెప్పుకుంటాడు... నకిలీ జర్నలిస్ట్ అవతారం ఎత్తుతాడు.. సన్మానాలు, అన్నదాన కార్యక్రమాల పేరిట ప్రభుత్వాధికారులకు ఎరవేస్తాడు. బదిలీల పేరుతో భయపెట్టి అందినకాడికి దండుకుంటాడు. ఈ ఘరానా మోసగాడిని మధ్యమండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వివరాలను డీసీపీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. సూర్యప్రకాశ్‌చారి ఇప్పటివరకు 11 సార్లు కటకటాల్లోకి వెళ్లాడు. అతడు ఏ నేరంలోనూ రూ.లక్షకు మించి వసూలు చేయలేదు. చిన్న మొత్తాలు అయితేనే అధికారులు పెద్దగా పట్టించుకోరని ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు. నకిలీ విలేకరి అవతారంతో మొదలు... రంగారెడ్డి జిల్లా కుంట్లూరుకు చెందిన రాయబండి సూర్యప్రకాశ్‌చారి ఉప్పల్‌లోని కళ్యాణ్పురి కాలనీలో నివసిస్తున్నాడు. ఇతగాడికి ఆర్ఎస్పీ చారి, సూరిబాబు, ప్రకాశ్ అనే మారు పేర్లూ ఉన్నాయి. నగరానికి వలసవచ్చి కొన్ని దిన, వార పత్రికల్లో పనిచేశాడు. ఇతడి ప్రవర్తన కారణంగా ఉద్యోగాలు ఊడిపోయాయి. అయినా, హైదరాబాద్, సైబరా బాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అనేక స్కూళ్లు, ఆస్పత్రులకు కాల్ చేసి ప్రముఖ దినపత్రికలో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకునేవాడు. తమ పత్రిక తరఫున భారీ ఈవెంట్ జరుగుతోందని, విరాళాలు ఇవ్వాలని అందినకాడికి దండుకునేవాడు. మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడినంటూ చెప్పి పలువురి దగ్గర డబ్బు వసూలు చేశాడు. మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్ సైతం... ఈ తరహా నేరాలకు పాల్పడుతూ 2009 నుంచి కుషాయిగూడ, చైతన్యపురి, కీసర, మీర్పేట్, హయత్‌నగర్, చైతన్యపురి, సనత్‌నగర్, హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇతడి మోసాల బారినపడినవారిలో మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి సైతం ఉన్నారు. 2016లో కోరుట్ల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎ.రాణిరెడ్డికి అతడు ఫోన్‌కాల్ చేసి సీఎంవో నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నాడు. జిల్లాస్థాయిలో ఉత్తమ అధికారిణిగా ఎంపికయ్యారని, రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం చేయనున్నామని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ కార్యక్రమం నిర్వహణకు రూ.35 వేలు చెల్లించాలంటూ బ్యాంకు ఖాతా నంబర్‌ను ఎస్సెమ్మెస్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన రాణిరెడ్డి సీఎంవోలో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె అప్పట్లో హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు బ్యాంకు అకౌంట్, ఫోన్ నంబర్ ఆధారంగా సూర్యప్రకాశ్‌చారిని గుర్తించి అరెస్టు చేశారు. ఆ తరువాత ఓ ఐఏఎస్ అధికారి ఫిర్యాదుతో ఇతగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా రిజిస్ట్రేషన్స్ శాఖ టార్గెట్ ఈ మోసగాడు తాజాగా రిజిస్ట్రేషన్ శాఖలోని సబ్–రిజిస్ట్రార్లను లక్ష్యంగా ఎంచుకున్నాడు. సిద్ధిపేట, జగిత్యాల, షాద్‌నగర్, చౌటుప్పల్, వరంగల్, శామీర్‌పేటలకు చెందిన ఎస్ఆర్వోలకు కాల్ చేసి తెలంగాణ పోరాటయోధుల కార్యక్రమంలో భాగంగా అన్నదానం చేయడానికి రూ.లక్ష డొనేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తక్షణం తాను చెప్పిన బ్యాంకుఖాతాలో వేయాలని, లేదంటే, మారుమూల ప్రాంతానికి బదిలీ చేయిస్తానని బెదిరించడంతో సిద్ధిపేట రూరల్ ఎస్ఆర్వో, టౌన్ ఇన్చార్జ్ ఎస్ఆర్వోలు రూ.55 వేలు, సంగారెడ్డికి చెందిన ఓ ఎస్ఆర్వో రూ.30 వేలు డిపాజిట్ చేశారు. సదరు ఎస్ఆర్వోలు సీఎంవోలో ఆరా తీయగా సూర్యప్రకాశ్‌చారి అనే వ్యక్తి ఎవరూ లేరని తేలింది. -
రవిప్రకాశ్ కోసం గాలింపు ముమ్మరం!
సాక్షి, హైదరాబాద్: టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్‌కోసం తెలంగాణ పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్ ఇంతవరకూ పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, ఇప్పటికే సైబరాబాద్ సైబర్ క్రైం విభాగం, బంజారాహిల్స్ పోలీసులు, మరోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ల 160, సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. తనపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రవిప్రకాశ్ రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు భంగపాటే మిగిలింది. ఏపీ వదిలి వెళ్లాడా? తెలంగాణ నుంచి పరారైన రవిప్రకాశ్ ఏపీలోని అప్పటి అధికార పార్టీ నేతల వద్ద తలదాచుకున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రవిప్రకాశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మరోచోటుకు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే, బెంగళూరు, విజయవాడలతోపాటు ముంబై, గుజరాత్‌లోనూ రవిప్రకాశ్ తలదాచుకునే అవకాశాలు ఉండటంతో రెండు టీంలు అక్కడా వెతికేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. రవిప్రకాశ్ తన ఆచూకీ చిక్కకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటిదాకా దాదాపు 30 వరకు సిమ్‌కార్డులు మార్చాడని సమాచారం. సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా మాత్రం సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మిగిలిన నిందితులు పోలీసుల విచారణకు బాగానే సహకరిస్తున్నారు. -
వడ్డీ వ్యాపారులపై టాస్క్‌ఫోర్స్ దాడులు
కరీంనగర్‌క్రైం: సామాన్యుల అవసరాలు అసరాగా చేసుకుని కరీంనగర్లో వడ్డీ వ్యాపారం చేస్తున్నవారిపై టాస్క్‌ఫోర్స్ బృందాలు రెండు రోజులు దాడులు చేస్తున్నాయి. ‘వడ్డీ దందాకు అడ్డేది’ శీర్షికన ఈనెల 25న ‘సాక్షి’లో వడ్డీ వ్యాపారుల అగడాలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సీపీ కమలాసన్‌రెడ్డి వెంటనే టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దించారు. రెండు రోజులుగా పలువురు వడ్డీ వ్యాపారులు, అనుమతి లేని ఫైనాన్స్‌లు, గిరిగిరి ఫైనాన్స్ వ్యాపారులపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. పలువురి వద్ద భారీగా నగదు డబ్బులు కూడా లభ్యమైనట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లోనే వడ్డీ వ్యాపారుల దందాకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నిందితులను కూడా అరెస్ట్ చూసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రామగుండం, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులపై దాడులు చేసిన పోలీసులు తాజాగా కరీంనగర్‌లోని వడ్డీ వ్యాపారులపై టాస్క్ఫొర్స్ బృందాలు దాడులు చేయడం సంచలనం కలిగించింది. అయితే ఈ దందాలో పలువురు బాడా బాబుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. కోటి రూపాయలు పెట్టుబడి పెడితే చాలు నెలకు రూ.20 లక్షలకు పైగా అదాయం వస్తోందని సమాచారం. టాస్క్‌పొర్స్ దాడులతో ఇవన్నీ బట్టబయలు కానున్నాయి. -
కిరాయి అడిగాడని కొట్టి చంపేశారు
సాక్షి, హైదరాబాద్: మాట్లాడుకున్నంత కిరాయి ఇవ్వాలన్న ఆటోడ్రైవర్‌ను చితకబాది క్రూరంగా చంపేశారు. అనంతరం ఆటోను తగలబెట్టేశారు. ఈనెల 1న ఈ ఘటన జరగ్గా.. ఐదుగురు నిందితులను హైదరాబాద్ సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ మీడియాకు వెల్లడించారు. ఈనెల 1న పహాడీషరీఫ్ సరస్సు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్ 30 నుంచి టి.సాయి నాథ్ అనే వ్యక్తి కనిపించడంలేదంటూ మే 2న చందానగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇక మే 3న రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని చింతల్మెట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఆటోను దగ్ధం చేశారని కేసు నమోదైంది. ఈ ఘటనలన్నీ వెంటవెంటనే చోటుచేసుకోవడం.. అవి సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లతో ముడిపడినవి కావడంతో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు..దర్యాప్తు చేసి చిక్కుముడిని ఛేదించారు. ఆటో నంబర్ ద్వారా దొరికిన లింక్.. మే 1న జల్పల్లి చెరువు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురికావడంతో స్థానిక పోలీసులు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో కాలిపోయిన ఆటో నంబర్ సాయంతో దాని యజమాని ఆర్సీ పురానికి చెందిన మహమ్మద్ ఇస్మాయిల్‌గా గుర్తించారు. అతడితో మాట్లాడటంతో ఈ 3 ఘటనలకు లింకు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. తన ఆటో (టీఎస్15యూసీ–4194)ను టి.సాయినాథ్ కు అద్దెకు ఇచ్చినట్లు చెప్ప డంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. లింగంపల్లి నుంచి పహాడీషరీఫ్ వరకు ఉన్న 40 కిలోమీటర్ల మేర సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. 4 రోజులపాటు 5 టెరాబైట్స్ వీడియోలను విశ్లేషించడంతో నిందితులు ఎవరనే విషయం తెలిసింది. రూ.200 కోసం గొడవ పడి.. మల్లేపల్లికి చెందిన ఎస్కే ఇస్మాయిల్ అలియాస్ అదిల్, షాహీన్‌నగర్‌కు చెందిన ఎస్.కె.అమీర్, మరో మైనర్ బాలుడు స్నేహితులు. ఈ ముగ్గురికి నేరచరిత్ర ఉంది. గత నెల 30న రాత్రి 7.20కి వీరు ముగ్గురూ టోలిచౌకీలో కలుసుకున్నారు. వీళ్ల స్నేహితుడు షేరా కూడా అక్కడికి వచ్చాడు. షేరాకు లింగంపల్లిలో ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు రావాల్సి ఉంది. దీంతో నలుగు రూ టోలిచౌకీ నుంచి ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలో మద్యం సేవించి రాత్రి 11 గంటలకు లింగంపల్లి చేరుకున్నారు. అక్కడ రావాల్సిన డబ్బులు తీసుకున్న తర్వాత సాయినాథ్తో కిరాయి మాట్లాడుకున్నారు. లింగంపల్లి నుంచి రాజేంద్రనగర్ చింతల్మెట్ వరకు రూ.700 కిరాయి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని అతడి ఆటో ఎక్కారు. టోలిచౌకీలో షేరా, మైనర్ బాలుడు దిగి వెళ్లిపోయారు. ఇస్మాయిల్, అమీర్లు రాజేంద్రనగర్‌లో ఆటో దిగాక కిరాయి కింద రూ. 500 ఇవ్వబోయారు. అయితే, తనకు మొత్తం కిరాయి రూ.700 ఇవ్వాలని సాయినాథ్ అడగడంతో మద్యం మత్తులో ఉన్న ఇస్మాయిల్, అమీర్లు సాయినాథ్‌ను చితకబాదారు. అహ్మద్ అలీఖాన్‌కు ఫోన్ చేసి కత్తి తీసుకొని రమ్మంటూ సూచించారు. అతడు కత్తి తీసుకుని రాగానే సాయినాథ్‌ను జల్పల్లిలోని చెరువు పక్క∙ ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్యచేశారు. చింతల్మెట్లో ఆటోదహనం.. సాయినాథ్‌ను హత్య చేసిన తర్వాత అతడి ఆటో తీసుకుని ఇస్మాయిల్, అమీర్, అహ్మద్‌లు వట్టేపల్లిలోని మైనర్‌బాలుడి ఇంటికి వెళ్లారు. తిరిగి చింతల్‌మెట్‌కు బయలుదేరారు. ఆ బాలుడు బైక్‌పై వారిని అనుసరించాడు. మార్గమధ్యంలో పెట్రోల్ తీసుకొని చింతల్మెట్లో ఆటోను కాల్చేశారు. తమ సెల్ఫోన్లతో పాటు మృతుడి సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని టోలిచౌకీ వెళ్లి మహ్మద్ అబ్దుల్ సమీర్ ఇంట్లో దాచిపెట్టారు. -
పంజాగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పుల కలకలం
-
కొలంబియా నుంచి కొకైన్
సాక్షి, హైదరాబాద్: భారత్‌కు సరఫరా అవుతున్న కొకైన్ మాదకద్రవ్యం ఆఫ్రికా దేశమైన కొలంబియా నుంచి వస్తోంది. భారీ ఓడల్లో ప్రాదేశిక జలాల వరకు తీసుకువస్తున్న స్మగ్లర్లు అక్కడ నుంచి నాటు పడవల్ని ఆశ్రయిస్తున్నారు. ముంబై, గోవాల కేంద్రంగా దందా చేస్తున్న వారిలో అత్యధికులు నైజీరియన్లే ఉంటున్నారు. పోలీసు నిఘాకు చిక్కకుండా, డిపోర్టేషన్‌కు ఆస్కారం లేకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ జాన్ పాల్ ఒనెబూచి అలియాస్ యుగోచుకువను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నారు. భారీగా పెరిగిన సాగు కొకైన్‌ను కోకా మొక్కల నుంచి తయారు చేస్తారు. ఈ మొక్కల సాగులో కొలంబియా ప్రపంచంలోనే టాప్. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న కొకైన్‌లో 85 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. అక్కడ కోకా మొక్కల సాగు విస్తీర్ణం ఏడాదిలో లక్ష ఎకరాలకు పైగా పెరిగింది. 2016లో ఈ విస్తీర్ణం 4,64,558 ఎకరాలుగా ఉండగా.. 2017 నాటికి ఇది 5,16,450 ఎకరాలకు పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. కొలంబియా నుంచి కొకైన్‌ను ఓడల్లో ఇతర దేశాలకు తరలిస్తుంటారు. భారత్ విషయానికి వస్తే భారీ ఓడల్లో ముంబై తీరానికి 12 నాటికల్ మైళ్ల వరకు (22.2 కిమీ) తీసుకొస్తారు. అక్కడి వరకు అంతర్జాతీయ జలాలే అయినా.. ఆపై దేశ ప్రాదేశిక జలాలు మొదలవుతాయి. ఇక్కడ కోస్ట్‌గార్డ్ నిఘా ఉంటుంది. దీనికోసం అంతర్జాతీయ జలాల్లోనే ఓడల్ని ఆపేసి అనువైన ప్రాంతంలో డ్రగ్ పార్శిల్స్‌ను నాటు పడవల్లోకి ఎక్కిస్తారు. అంతర్జాతీయ, ప్రాదేశిక జలాల్లోకి మారుతూ ఎవరి కంటా పడకుండా ముంబై, గోవా తీరాలకు నాటు పడవల్ని తీసుకొస్తున్నారు. ఇలా తీరానికి చేరుకున్న మాదకద్రవ్యం హోల్‌సేల్‌గా ప్రధాన స్మగ్లర్ల చేతికి చేరుతుంది. వారి నుంచి రిటైల్‌గా విక్రయించే పెడ్లర్లు కొనుక్కొని దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిక్కితే చిరునామా మారుతుంది మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టయిన నైజీరియన్లు తమ ఉనికి బయటపడకుండా, పోలీసు నిఘా ఉండకుండా ఉండేందుకు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఒనెబూచి ఉదంతమే దీనికి తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నైజీరియాలోని లాగోస్ నుంచి 2008లో వచ్చిన ఇతడు కేరళలో స్థిరపడ్డాడు. 2015లో హైదరాబాద్‌కు మకాం మార్చి పెడ్లర్‌గా మారాడు. గోవాలో అరెస్టయ్యాక జైలు నుంచి బయటకొచ్చిన ఒనెబూచి హైదరాబాద్‌లో టోలిచౌకి నుంచి జవహర్‌నగర్‌కు మకాం మార్చాడు. 2016లో ఎల్బీనగర్ పోలీసులు మరోసారి అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈసారి జైలు నుంచి బయటకు రాగానే బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని సయ్యద్‌నగర్‌కు మకాం మార్చాడు. తాజాగా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు అక్కడే చిక్కాడు. దాదాపు ప్రతి పెడ్లర్ కూడా ఇలా తరచూ మకాం మారుస్తుండటంతో నిఘా కష్టమవుతోందని పోలీసులు చెబుతున్నారు. అంతా ఒకచోట పెట్టకుండా.. హోల్సేలర్ల నుంచి 50 నుంచి 100 గ్రాముల చొప్పున ఖరీదు చేస్తున్న పెడ్లర్లు దాన్ని భద్రపరిచే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మొత్తం ఒకే చోటనో, తమ దగ్గరో ఉంచితే పోలీసులకు చిక్కితే మొత్తం నష్టపోవాల్సి వస్తుందని నాలుగైదు భాగాలుగా చేస్తున్నారు. వాటిని వేర్వేరు ప్రాం తాల్లో, స్నేహితుల వద్ద ఉంచుతున్నారు. కొద్దికొద్దిగా తీసుకొచ్చి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దీ నికి తోడు ఇంత మొత్తం డ్రగ్‌తో అరెస్టు అయితే జైలు నుంచి వచ్చాక తమ దేశాలకు బలవంతంగా తిప్పి పంపుతారనే (డిపోర్టేషన్) భయం పెడ్లర్స్‌లో ఉం టోంది. దీంతో ఒకే వ్యక్తికి 3 గ్రాములు మించి అమ్మకుండా, ఒకేసారి ముగ్గురు కంటే ఎక్కువ మంది కస్టమర్లకు అందించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. అందువల్లే ఇటీవల పోలీసులకు చిక్కిన పెడ్లర్స్ లో ఎవరి వద్దా భారీ మొత్తంలో డ్రగ్ రికవరీ కాలేదు. -
ఐపీఎల్ బ్లాక్ టికెటింగ్ ముఠా ఆటకట్టు
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా వారం క్రితం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు బ్లాక్టికెట్లు అమ్ముతున్న గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్న సంగతి మరువకముందే మరో ముఠాను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ జరిగిన ప్రతీ నగరంలోనూ యథేచ్ఛగా కొనసాగిన వీరి బ్లాక్టికెట్ల దందాకు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. కేవలం ఫేస్బుక్ ద్వారా ముగ్గురు ఒకరినొకరు పరిచయం చేసుకుని బ్లాక్టికెట్ల దందాను కొనసాగించారు. బ్లాక్టికెట్ల అమ్మకాలకు ఏకంగా విమానంలోనే వీరు రాకపోకలు సాగిస్తుండటం కొసమెరుపు. ఫేస్బుక్ ద్వారా పరిచయం.. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఆయుష్ విధేలే, కోల్‌కతాకు చెందిన సచిన్ శుక్లా, రాజస్తాన్ వాసి రిషబ్ సుథార్లు వేర్వేరు కాలేజీల్లో విద్యార్థులు. ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన పరిచయంతో ఈ ముగ్గురు ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలని పథకం వేశారు. అందుకు బ్లాక్టికెట్లను అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఆన్లైన్లో ఈ మెయిల్ ఐడీ ద్వారా పరిమిత సంఖ్యలోనే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో పథకం ప్రకారం ఈ ముగ్గురూ అనేక ఈమెయిల్ ఐడీలు సృష్టించారు. వీటి ఆధారంగా దేశంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్లను భారీగా ఆన్లైన్లో బుక్ చేసి టికెట్ కౌంటర్ల ద్వారా వాటిని తీసుకుంటున్నారు. మ్యాచ్ తేదీకి కొద్దిరోజుల ముందు ఈ ముగ్గురూ విమానాల్లో సంబంధిత నగరానికి చేరుకుని మ్యాచ్‌లకున్న డిమాండ్‌ను బట్టి ఒక్కో టికెట్‌కు రెట్టింపు ధర లేదా అంతకంటే ఎక్కువకు అమ్ముకుంటున్నారు. ఈనెల 14, 21 తేదీల్లో ఉప్పల్ స్టేడియంలోని ఎస్ఆర్హెచ్–డీసీ, ఎస్ఆర్హెచ్–కేకేఆర్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌ల టికెట్లతో వీరు కొద్దిరోజుల క్రితం నగరానికి చేరుకున్నారు. అయితే 14న జరిగిన మ్యాచ్‌కు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో వీరు బుక్ చేసుకున్న టికెట్లలో 89 టికెట్లను విక్రయించలేకపోయారు. రెండో మ్యాచ్‌కు సంబంధించి 162 టికెట్లను సికింద్రాబాద్ కేంద్రంగా అమ్మడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అక్కడి జింఖానా గ్రౌండ్స్ సమీపంలోని టికెట్ కౌంటర్ వద్దకు మంగళవారం చేరుకుని తమ వద్ద ఉన్న టికెట్లను అమ్మడం మొదలెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులు తమ బృందంతో దాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి 251 టికెట్లు, నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులైన ఈ ముగ్గురూ జల్సాలకు అలవాటు పడ్డారని, అందుకు అవసరమైన డబ్బు కోసమే ఈ మార్గం ఎంచుకున్నారని డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని బేగంపేట పోలీసులకు అప్పగించారు. -
నగరంలో భారీగా నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. నగరంలో భారీ స్థాయిలో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 4.92కోట్ల నగదును పట్టుకున్నట్లు సమాచారం. తాజాగా నల్గొండ, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తుల నుంచి 47 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ ఎంపీ అభ్యర్థికి చెందిన జయవీర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కోటి రూపాయలు స్వాధీన పర్చుకున్నారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమీషన్ సూచనల మేరకు నగదు సరఫరాపై దృష్టి సారించామన్నారు. నగరంలో నేడు 4.92కోట్ల నగదును పట్టుకున్నట్లు తెలిపారు. 8 పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మొత్తాన్ని లోకల్పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహాయంతో పట్టుకున్నట్లు తెలిపారు. సోమాజిగూడలో ఏప్రిల్ 6న సాత్విక్ రెడ్డి, సౌరభ్‌ల నుంచి 26లక్షలు, మూసారంబాగ్లో తండ్రా కాశీనాథ్ రెడ్డి, భుక్యా రవిల నుంచి 34లక్షలు, బంజారహిల్స్ రోడ్‌నెంబర్ 14లో మల్లారెడ్డి శ్రీనివాస్ నుంచి కోటి నగదును, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద బొడుపల్లి శ్రీనయ్య నుంచి కోటి నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
50 వేల యూరోల తస్కరణ
సాక్షి, హైదరాబాద్: చెన్నైకి చెందిన మహ్మద్ మురాద్ అనే వ్యాపారి నుంచి తస్కరణకు గురైన యూరోలను పట్టుకోవడానికి శాంతిభద్రతల విభాగం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మనీ ఎక్స్ఛేంజ్ కోసం మురాద్ హోలీనాడు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆయన వద్దనున్న యూరోలను గుర్తుతెలియని వ్యక్తి తస్కరించాడు. మురాద్ కొన్నాళ్లు చెన్నైలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేసి 11 నెలల క్రితం తన సోదరుడు మీరాన్ ముఖ్తర్తో కలసి చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో మాబ్ మనీఛేంజర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేశారు. మనీ ఎక్స్ఛేంజ్ మార్కెట్ చెన్నై కంటే హైదరాబాద్‌లో అనువుగా ఉన్నట్లు మురాద్ గుర్తించారు. తమకు అవసరమైనప్పుడు సిటీకి వచ్చిన శివంరోడ్‌లో ఉన్న జైన్ ఫారెక్స్ సంస్థలో ఎక్స్ఛేంజ్ చేసుకుని వెళ్తుంటారు. ఈ క్రమంలో చెన్నై సమీపంలోని మాధవరం నుంచి లిమోలైనర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో గత బుధవారం రాత్రి బయలుదేరి గురువారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. 50 వేల యూరోలతో నగరానికి... మురాద్ తనతోపాటు భారత్ కరెన్సీలో రూ.39 లక్షల విలువైన 50 వేల యూరోలను నగరానికి తీసుకువచ్చారు. గత గురువారం ఉదయం 8.30 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌లో బస్సు దిగిన మురాద్ అక్కడ నుంచి నేరుగా జైన్ ఫారెక్స్ సంస్థకు వెళ్లారు. ఆ దుకాణం మూసి ఉండటంతో ఫోన్ ద్వారా ఆ సంస్థకు చెందిన సజ్జన్‌ను సంప్రదించారు. అయితే, ఆ రోజు హోలీ పండుగ కావడంతో తాము దుకాణం తెరవమని, మరుసటి రోజు రావాల్సిందిగా సజ్జన్ సూచించారు. దీంతో తన వద్ద ఉన్న డబ్బుతో నగరంలో బస చేయడం ఇబ్బందిగా ఉంటుందని భావించిన మురాద్ రైలులో తిరిగి చెన్నైకు వెళ్లిపోవాలని భావించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. సమీపంలోని ఓ ప్రార్థనాస్థలంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తూ యూరోలతో కూడిన బ్యాగ్‌ను తాను కూర్చున్న కుర్చీలో పెట్టారు. తిరిగి వచ్చి చూసుకునేసరికి ఆ బ్యాగ్ మాయమైంది. ఎవరో దొంగిలించారని నిర్ధారించు కుని గోపాలపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించిన బ్యాగ్‌లో 50 వేల యూరోలతోపాటు రూ.2 వేల నగదు, ఇతర పత్రాలు ఉన్నట్లు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవలే వ్యాపారం ప్రారంభించిన తమకు ఆ మొత్తం చాలా ఎక్కువని, ఎత్తుకెళ్లిన సొమ్ము రికవరీ కాకుంటే జీవితం రోడ్డున పడాల్సి వస్తుందని మురాద్ వాపోయారు. దీంతో గోపాలపురం పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి కేసును కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. -
వాట్సాప్‌లో వివరాలు... కొరియర్లో సర్టిఫికెట్లు!
సాక్షి, హైదరాబాద్ : ‘‘విద్యార్థుల వివరాలు వాట్సాప్, ఈ–మెయిల్ ద్వారా ఛత్తీస్‌గఢ్‌కు ఇక్కడినుంచి వెళ్తాయి... అక్కడినుంచి నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు కొరియర్లో సిటీకి చేరతాయి... వీటిని రూ.12 వేల నుంచి రూ.50 వేల వరకు విక్రయించి ఆ సొమ్మును నిందితులు పంచుకుంటారు’’...ఇలా వ్యవస్థీకృతంగా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్ల దందాను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ దందాలో నగరానికి చెందిన నిందితుడిని పట్టుకున్నామని, పరారీలో ఉన్న ఛత్తీస్‌గఢ్ వాసి కోసం గాలిస్తున్నామని టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం తెలిపారు. నిందితుడు జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేసినట్లు వివరించారు. నాంపల్లిలోని బజార్‌ఘాట్‌కు చెందిన మహ్మద్ హబీబ్ 2012లో జేఎన్టీయూ నుంచి బీటెక్ (ఈఐఈ) పూర్తి చేశాడు. కొన్నాళ్ల పాటు టోలీచౌకిలోని ఓ కాలేజీలో పరిపాలన విభాగంలో పని చేశాడు. ఆపై మలక్‌పేటలో సొంతంగా అలీఫ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి నకిలీ సర్టిఫికెట్ల ప్రారంభించాడు. ఛత్తీస్‌గఢ్ లోని బోర్డ్ ఆఫ్ స్కూల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు చెందిన సునీల్ కపూర్ అలియాస్ బాలాజీ తరచుగా హైదరాబాద్‌కు వస్తూ తమ సంస్థ తరఫున ప్రచారం చేసే వాడు. టెన్త్, ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన వారితో తమ బోర్డ్‌లో అప్లై చేయిస్తూ వారిని పాస్ చేయించేవాడు. ఇలా ఇతడికి హబీబ్‌తో పరిచయం ఏర్పడింది. 2015లో అక్కడి హైకోర్టు బోర్డ్ ఆఫ్ స్కూల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌పై నిషేధం విధించింది. దీంతో నకిలీ సర్టిఫికెట్ల దందాకు దిగిన సునీల్ ఈ విషయం హబీబ్‌కు చెప్పాడు. బోగస్ విద్యార్హత పత్రాలు కావాలంటూ హబీబ్ వద్దకు వచ్చిన విద్యార్థుల వివరాలను సునీల్‌కు పంపేవాడు. వీటి ఆధారంగా టెన్త్, ఇంటర్‌లతో పాటు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను రూపొ ందించేవాడు. మధ్యప్రదేశ్‌లోని స్వామి వివేకానంద, రాజస్తాన్ విద్యాపీఠ్, మీరట్‌లోని సీహెచ్ చరణ్‌సింగ్, కాన్పూర్‌లోని ఛత్రపతి శివాజీ మహరాజ్, ఝాన్సీలోని బుందేల్‌ఖండ్, విశాఖలోని ఆంధ్రా, చెన్నైలోని అన్నామలై, వర్సిటీ ఆఫ్ పుణే, వీబీఎస్ పూర్వాంచల్ వర్సిటీలతో పాటు ఢిల్లీలోని బోర్డ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేర్లతో వీటిని తయారు చేసి కొరియర్లో హబీబ్‌కు పంపేవాడు. ఈ దందాపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీలతో కూడిన బృందం బుధవారం దాడి చేసి హబీబ్‌ను పట్టుకోవడంతో పాటు 16 నకిలీ సర్టిఫికెట్లు తదితరాలు స్వాధీనం చేసుకుంది. కేసును నాంపల్లి పోలీసులకు అప్పగించిన టాస్క్‌ఫోర్స్ పరారీలో ఉన్న సునీల్ కోసం గాలిస్తోంది. -
ఎన్నికల వేళ భారీగా ‘హవాలా’ డబ్బు పట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో రూ.90,50,400 హవాలా డబ్బు పట్టుబడింది. కంచన్‌బాగ్, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో నాలుగు బైక్‌లపై అక్రమంగా డబ్బు రవాణా చేస్తున్న నలుగురిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల వివరాలను మంగళవారం ఇక్కడ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని, దీంతో రోజులో 24 గంటలూ నగర పోలీసులు అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో కాచిగూడ, సుల్తాన్‌బజార్ పోలీస్స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో బర్కత్‌పురా లో నివాసముండే గుజరాత్‌కు చెందిన దేవేష్ కొథారి వద్ద రూ.50 లక్షలు, కాచిగూడలో నివాసముండే గుజరాత్‌వాసి భక్తి ప్రజాపతి వద్ద రూ.23 లక్షలు, ఎర్రగడ్డలో నివాసముండే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖాన్ బిలాల్ నసీమ్ వద్ద రూ.7,70,400, గోషామహల్ వాసి విశాల్ జైన్ వద్ద రూ.11.80 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. కోథారి వద్ద పట్టు కున్న రూ.50 లక్షల డబ్బు కోటులో దొరికింది. ఈ కోటులో కనీసం రూ.కోటి దాచే వీలుందని, ప్రత్యేకంగా అక్రమ పద్ధతిలో డబ్బులను రవాణా చేసేవిధంగా ఈ కోటు కుట్టించారని వివరించారు. ఈ నలుగురి నుంచి 3 క్యాష్‌కౌంటింగ్ యంత్రాలు, 4 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారనే విషయం లో స్పష్టత ఇవ్వకపోవడంతో నలుగురిని, పట్టుబడ్డ నగదును, ఇతర వస్తువులను ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తున్నట్లు అంజనీకుమార్ వెల్లడించారు. రూ.50 వేలకు మించితే రసీదులు చూపాలి ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రజలు ఎవరైనా రూ. 50 వేల కంటే ఎక్కువగా తమతో తీసుకెళ్లాలనుకుంటే తప్పనిసరిగా ఆ డబ్బుకు సంబంధించిన రసీదులను దగ్గర ఉంచుకోవాలి. తనిఖీల్లో పోలీసులకు సరైన పత్రాలు చూపించకపోతే వాటిని స్వాధీనం చేసుకొని ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తారని కమిషనర్ తెలిపారు.హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలతోపాటు మల్కాజిగిరికి సంబంధించిన ఒక అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయని, మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 45 తనిఖీ బృందాలను రంగంలోకి దింపామన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 195 కేసుల్లో లెక్కల్లో చూపని రూ.29 కోట్ల నగదు, రూ.3 కోట్ల విలువైన బంగారం, వెండి పట్టుబడిందని గుర్తు చేశారు. ఈ 195 కేసుల్లో 120 చార్జిషీట్లను కోర్టుల్లో దాఖలు చేశామని. 17 కేసుల్లో తీర్పులు కూడా వచ్చాయని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సభలు, సమావేశాలు, ర్యాలీలకు తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలని సూచించారు. డబ్బు అక్రమ రవాణాలో ఎక్కువగా హవాలా దందా జరుగుతున్నట్లు తెలుస్తుందని, ఈ విషయాలన్ని ఆదాయపన్ను శాఖ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వస్తాయన్నారు. పట్టుబడ్డ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది... ఎక్కడికి తీసుకెళుతున్నారనే విషయాలు ఆదాయపన్ను శాఖ విచారణలో తెలుస్తాయని చెప్పారు. సమావేశంలో ఎస్బీ జాయింట్ సీపీ తరుణ్‌జోషి, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్, ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎన్జీవో ముసుగులో పులివేట గ్యాంగ్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పులి హత్య కేసు మిస్టరీ వీడింది. ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనాలతో డొంక కదిలింది. రామగుండం సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాలెంజ్‌గా తీసుకొని ఛేదించారు. యానిమల్ ట్రాకర్స్ సహకారంతో పథకం ప్రకారమే పులిని చంపినట్లు తేలింది. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులను అరెస్టు చేశారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా శివ్వారం అడవుల్లో విద్యుత్ తీగలకు బలైన పులి కేసు మిస్టరీ వీడింది. మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి డిసెంబర్లో ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన రాయల్ బెంగాల్ టైగర్ జాతికి చెందిన నాలుగేళ్ల మగ పులి జనవరి 8న శివ్వారంలో విద్యుత్ తీగలకు తాకి చనిపోవడం వెనుక పెద్ద కుట్ర నడిచినట్లు తేలింది. అటవీశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేసే శివ్వారం ప్రాంతపు యానిమల్ ట్రాకర్స్ పులి జాడను వేటగాళ్లకు తెలియజేయగా, పథకం ప్రకారమే విద్యుత్ తీగను అమర్చి అరుదైన పెద్దపులిని హతమార్చినట్లు రామగుండం సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ విచారణలో వెల్లడైంది. పులి చనిపోయిన తరువాత దాని చర్మాన్ని, గోళ్లను ఒలిచి, తలను గుర్తుపట్టకుండా గొడ్డళ్లతో నరికిన వేటగాళ్లు చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నించారు. పులులను అంతమొందించేలా యానిమల్ ట్రాకర్స్ ద్వారా వేటగాళ్లను ఉసిగొల్పుతూ ‘టైగర్ హంటింగ్ అండ్ అసోసియేషన్’అనే స్వచ్ఛంద సంస్థ ముసుగులో చంద్రాపూర్‌కు చెందిన నందకిషోర్ పింప్లేతో పాటు ఏడుగురి దందాను పోలీసులు ఛేదించారు. మందమర్రిలో డిసెంబర్ 24న ‘పులిచర్మం’దొరికిన వ్యవహారంతో మొదలైన ఈ కేసుకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పి.కె. ఝా కోరిక మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు అటవీశాఖ సాధారణ పులిచర్మం దొరికిన కేసుగా వదిలేసిన కేసును రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణకు అప్పగించడంతో మిస్టరీ వీడింది. రామగుండం సీసీఎస్ (అడ్మిన్) అదనపు డిప్యూటీ కమిషనర్ అశోక్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ సీఐల నేతృత్వంలో విచారణకు ఆదేశించగా, వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ మేరకు టైగర్ హంటింగ్ అండ్ అసోసియేషన్ సంస్థ నిర్వాహకుడు నందకిషోర్ పింప్లేతో సహా ఏడుగురు సభ్యుల చంద్రాపూర్ గ్యాంగ్‌ను, ఇద్దరు యానిమల్ ట్రాకర్స్, ముగ్గురు వేటగాళ్లు, నలుగురు బ్రోకర్స్ సహా 16 మందిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు తొలినాళ్లలో మరో నలుగురిని అరెస్టు చేశారు. మొత్తంగా ఈ కేసులో 20 మందిని అరెస్టు చేసినట్లు కమిషనర్ వి.సత్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాలను అభినందిస్తూ పత్రికలో వచ్చిన కథనాల వల్లనే కేసును అటవీశాఖ నుంచి పోలీసులకు బదిలీ చేసినట్లు చెప్పారు వేటగాళ్లు ఉపయోగించిన మారణాయుధాలు, నగదు పులి హత్యలను ప్రోత్సహిస్తూ.. చంద్రాపూర్‌కు చెందిన ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే నందకిషోర్ పింప్లే 2002 నుంచి 2007 వరకు చంద్రాపూర్–గడ్చిరోలి హైవేలోని వాలని గ్రామంలో దాబా నడిపేవాడు. 2008 నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసి, సరైన సంపాదన లేకపోవడంతో వన్యప్రాణి వేటగాళ్లను పట్టిస్తానని అటవీశాఖ ఇన్ఫార్మర్గా మారాడు. వేటగాళ్లు చంపిన పులి, చిరుత చర్మాలు, వాటి గోర్లు మొదలైన పక్కా సమాచారాన్ని అందించి అటవీ అధికారుల నుంచి డబ్బులు తీసుకొని నమ్మకం సంపాదించాడు. తరువాత వేటగాళ్లను ఇన్ఫార్మర్ పేరుతో భయపెట్టి డబ్బులు సంపాదించేవాడు. దీన్నే వ్యాపారంగా మార్చుకోవాలని భావించి 2016లో టైగర్ హంటింగ్ అండ్ అసోసియేషన్ ప్రారంభించాడు. గుర్నేలే సురేష్, భుక్యా భీమ, పియూస్ బార్డే, అశ్విన్, రాకేష్ చక్రవర్తి, తోడాసే థామస్‌లతో కలసి సంస్థను అడ్డుపెట్టుకొని వన్యప్రాణుల వేటగాళ్లను బెదిరిస్తూ డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు. వన్యప్రాణుల కన్నా పులులను చంపితే చర్మానికి రూ. 30లక్షలు వస్తాయని వేటగాళ్లకు ఆశచూపి, వారు తీసుకొచ్చిన పులి చర్మాలపైనే డబ్బులు పెట్టి పూజలు చేస్తే డబుల్ అవుతాయని మభ్యపెట్టి , చర్మాలను అటవీ అధికారులకు పట్టించే మోసానికి తెరలేపాడు. ఇలా ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 60కి పైగా చర్మాలను పట్టించాడు. ఎన్జీవో సంస్థ కారణంగానే దేశంలో పులులు హతమైనట్లు రామగుండం కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో వన్యప్రాణుల వేటగాళ్లను 100 మందిని గుర్తించినట్లు చెప్పారు. మీడియా సమావేశంలో డీసీపీ వేణుగోపాల రావు, అడిషనల్ డీసీపీలు అశోక్‌కుమార్, రవి కుమార్, సీఐలు సాగర్, ఎడ్ల మహేశ్, శ్రీనివాస్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పులుల వేట వెనుక చంద్రాపూర్ ముఠా జనవరి 24న మందమర్రిలో పక్కా సమాచారంతో అటవీశాఖ అధికారులు పులి చర్మాన్ని స్వా«ధీనం చేసుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతను అటవీశాఖ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు అనుమానం రావడంతో రాష్ట్ర స్థాయిలో అటవీశాఖ పీసీసీఎఫ్ ఝా డీజీపీ మహేందర్ రెడ్డికి, ఇంటెలిజెన్స్ సహకారాన్ని కోరారు. ఈ మేరకు రామగుండం టాస్క్‌ఫోర్స్ సీఐ సాగర్ ఆధ్వర్యంలో రెండు బృందాలు అటవీశాఖతో కలసి దర్యాప్తు ప్రారంభించాయి. పట్టుబడిన పులి చర్మం ఎక్కడిదనే కోణంలో జరిగిన దర్యాప్తులో శివ్వారంలో యానిమల్ ట్రాకర్స్ ఇద్దరు ఇచ్చిన సమాచారంతో వన్యప్రాణుల వేటగాళ్లు పులిని విద్యుత్ తీగలతో హతమార్చినట్లు వెల్లడైంది. కేసు దర్యాప్తులో భాగంగా తీగను లాగితే డొంక కదిలినట్లు చంద్రాపూర్ గ్యాంగ్ పాత్ర వెల్లడైంది. (పోలంపల్లి ఆంజనేయులు) -
ఫేక్ కరెన్సీ ఫ్రమ్ పశ్చిమ బెంగాల్!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని తీసుకువచ్చి హైదరాబాద్‌లో చెలామణి చేయడానికి యత్నించిన అంతర్రాష్ట్ర ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఒక బెంగాలీ సహా ఇద్దరిని అరెస్టు చేశామని, వీరి నుంచి రూ.3.98 లక్షలు విలువ గల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని నగర కొత్వాల్ అంజనీకుమార్ వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో కలసి తన కార్యాలయంలో విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. ఈ కరెన్సీ బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నామని అన్నారు. గౌస్ దందానే నకిలీ కరెన్సీ.. చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్ గౌస్‌గా మారాడు. ఇతడిపై పోలీసులు ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనేకమంది ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతడు అక్కడ నుంచి నకిలీ కరెన్సీని వివిధ మార్గాల్లో నగరానికి రప్పించి చలామణి చేసేవాడు. అలా వచ్చిన మొత్తం నుంచి ఏజెంట్ల వాటాను వారికి పంపేవాడు. ఈ తరహాలో దందా చేస్తూ ఇప్పటికే మోండా మార్కెట్, గోపాలపురం, కంచన్‌బాగ్, గోపాలపురం, శాలిబండ, కాలాపత్తర్, భవానీనగర్, చాంద్రాయణగుట్ట, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, చార్మినార్, విజయవాడ, విశాఖపట్నం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇప్పటివరకు సిటీలో 13 సార్లు, బయట 2 సార్లు నకిలీ కరెన్సీ కేసుల్లో చిక్కాడు. జైలు నుంచి వచ్చిన నెల్లోనే.. జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన ప్రతిసారీ పోలీసు నిఘా నుంచి తప్పించుకోవడానికి తన చిరునామా మార్చేసే గౌస్ ప్రస్తుతం తలాబ్‌కట్ట మహ్మద్‌నగర్‌లో నివసిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో తన కుటుంబీకులతోనూ కలసి నకిలీ కరెన్సీ మార్పిడి చేసే ఇతగాడికి పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా మాల్దాలో ఉన్న కృష్ణాపూర్‌కు చెందిన అమీనుల్ రెహ్మాన్ అలియాస్ బబ్లూతో పరిచయం ఏర్పడింది. ఇతడికి రూ.40 వేలు చొప్పున చెల్లిస్తూ రూ.లక్ష నకిలీ కరెన్సీ తెప్పించి చెలామణి చేసేవాడు. 2016 సెప్టెంబర్‌లో సిటీ పోలీసులకు చిక్కిన గౌస్ గత నెల 12న విడుదలయ్యాడు. ఖాళీగా ఉండకుండా వెంటనే తన దందా మొదలెట్టాలని ప్రయత్నించాడు. రెండేళ్లకు పైగా జైల్లో ఉండటంతో ఇతడి వద్ద బబ్లూ కాంటాక్ట్ మిస్ అయింది. దీంతో విశాఖ జైల్లో ఉన్న తన పరిచయస్తుడు సిరాజ్ షేక్‌ను గత నెల 19న ములాఖత్‌లో కలిశాడు. అతడి నుంచి గౌస్ నంబర్ తీసుకుని సంప్రదించి నకిలీ కరెన్సీ సరఫరా చేయమని కోరాడు. రూ.4 లక్షల విలువైన కొత్త రూ.2,000 నోట్లు పంపడానికి అతడు అంగీకరించడంతో అది మార్పిడి చేసి రూ.1.6 లక్షలు తిరిగి ఇస్తానని ప్రతిపాదించాడు. స్నేహితుడికి ఇచ్చి సిటీకి సరఫరా.. దీనికి అంగీకరించిన బబ్లూ రూ.2,000 డినామినేషన్లో ఉన్న రూ.4 లక్షల నకిలీ కరెన్సీని గౌస్‌కు పంపాలని నిర్ణయించుకున్నాడు. తనకు పరిచయస్తుడైన మాల్దా వాసి రబీబుల్ షేక్‌కు ఈ మొత్తాన్ని ఇచ్చిన బబ్లూ వారిని రైలులో హైదరాబాద్‌కు పంపాడు. షేక్ గతంలోనూ సిటీలో నకిలీ కరెన్సీ రవాణా చేసి 2015లో ఫలక్‌నుమా పోలీసులకు చిక్కాడు. అప్పట్లో ఇతడు మైనర్ కావడం గమనార్హం. ఇతడికి సిటీపై పట్టు ఉండటంతోనే బబ్లూ ఆ మొత్తాన్ని ఇతడికి ఇచ్చి పంపాడు. ఇతడికి గౌస్ ఫోన్ నంబర్ ఇచ్చిన బబ్లూ నగరానికి చేరుకున్నాక సంప్రదించి నగదు అందించమని చెప్పాడు. దీంతో అతగాడు శుక్రవారం సిటీకి చేరుకుని గౌస్‌ను సంప్రదించాడు. అతడు చెప్పిన ప్రకారం చాంద్రాయణగుట్ట ప్రాంతంలో నకిలీ కరెన్సీ అందించాడు. ఆ మొత్తం నుంచి రూ.2 వేలను ఓ పండ్ల వ్యాపారి వద్ద మార్పిడి చేసిన గౌస్ నగదు క్వాలిటీపై సంతృప్తి చెందాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్ఐలు ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్ వర్మ, మహ్మద్ తఖ్రుద్దీన్, వి.నరేందర్ తమ బృందాలతో వలపన్ని ఇద్దరినీ అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.98 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకుని కేసును చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇంతటి హైక్వాలిటీతో, సామాన్యులు గుర్తుపట్టలేని విధంగా ఉన్న కరెన్సీ చిక్కడం డీమానిటైజేషన్ తర్వాత ఇదేతొలిసారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. -
ఆ డబ్బు ఎవరు పంపారు?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబడ్డ నగదు కేసులో పోలీస్‌శాఖ విచారణను వేగవంతం చేసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు పెంబర్తి చెక్‌పోస్టు వద్ద రూ.6 కోట్ల నగదును పట్టుకున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ బేగంబజార్‌కు చెందిన హవాలా వ్యాపారి అగర్వాల్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారించారు. ముగ్గురు నేతలకు ఆ డబ్బును తీసుకెళ్తున్నట్టు అగర్వాల్ విచారణలో బయటపెట్టాడని వరంగల్ పోలీసులు తెలిపారు. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, వరంగల్ ఈస్ట్‌లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వద్దిరాజు రవిచంద్రకు ఈ నగదును తరలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే పట్టుబడ్డ డబ్బు అగర్వాల్‌కు ఎక్కడి నుంచి వచ్చింది.. హవాలా ద్వారా అభ్యర్థులకు డబ్బు పంపించింది ఎవరన్న దానిపై వరంగల్ పోలీసులు దృష్టి సారించారు. మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ముగుస్తున్న తరుణంలో కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు వరంగల్ యంత్రాంగాన్ని ఆదేశించినట్టు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో నోటీసులు: హవాలా డబ్బులు తెప్పించిన వ్యవహారంలో ముగ్గురు నేతలు నామా నాగేశ్వర్రావు, కొండా మురళి, రవిచంద్రకు ఫిబ్రవరి మొదటి వారంలో నోటీసులు జారీ చేయనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. డబ్బు కోసం ఎవరిని సంప్రదించారు.. ఎక్కడ్నుంచి ఆ డబ్బు వచ్చింది.. తదితర అంశాలపై విచారించేందుకు వరంగల్ పోలీసులు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఇంత మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడం వెనుక వ్యూహకర్త ఎవరన్న దాని పైనా వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించనున్నట్టు తెలుస్తోంది. విశాఖ నుంచే వచ్చిందా? హవాలా ద్వారా హైదరాబాద్ వచ్చిన సొమ్మును కారు వెనుక సీట్లో కింద ప్రత్యేక అమరికలో తరలించిన విధానం చూస్తుంటే లింకు పెద్దదిగా ఉన్నట్టు వరంగల్ పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన నగదు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడెక్కడికి అగర్వాల్ ద్వారా డబ్బులు పంపించారు.. ఎవరెవరికి ఎంత అందింది.. అన్న లెక్కలు కూడా బయటపడే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. అయితే ఆ డబ్బు వచ్చింది ఏపీలోని విశాఖపట్నం నుంచే అని విచారణలో పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో విశాఖపట్నంలోనూ విచారణ జరిపేందుకు రెండు బృందాలను పంపనున్నట్టు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఆ ముగ్గురు నేతలతో పాటు ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన వారి అనుచరుల ఫోన్ కాల్‌డేటాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఇటు అగర్వాల్‌తో పాటు అతడి సోదరులు, వారి అసిస్టెంట్ల కాల్‌డేటాలను సైతం అనాలసిస్ చేస్తున్నట్టు తెలిసింది. దీని ద్వారా విశాఖలో ఎవరి నుంచి డబ్బు వచ్చిందన్న వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఆ డబ్బు పచ్చపార్టీదేనా? తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తుల నుంచే ఈ రూ.6 కోట్లు హవాలా ద్వారా వచ్చి ఉంటుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేసిన స్థానాలతో పాటు పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు సైతం పచ్చ పార్టీ నుంచే కోట్ల రూపాయలు రవాణా అయినట్టు ఆరోపణలున్నాయి. పట్టుబడ్డ డబ్బుకు సంబంధించిన వ్యవహారంలో టీడీపీ నేత నామా నాగేశ్వర్రావు పేరుండటం సంచలనంగా మారింది. అయితే వరంగల్ పోలీసులు కేసు విచారణలో వేగం పెంచడంతో పక్క రాష్ట్రంలోని పచ్చపార్టీ నేతలు వణికిపోతున్నారని తెలిసింది. -
ఈ బాబు... మహా ముదురు బాబూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి చెందిన ఓ మైనర్.. బైకులతో స్టంట్స్ చేయడంలో ఎక్స్పర్ట్.. అందులో మరికొందరికి శిక్షణ కూడా ఇస్తుంటాడు.. మరో ముగ్గురు బాలురతో జట్టు కట్టాడు.. ఈ స్టంట్స్ చేయడానికి, రేసింగ్స్‌లో పాల్గొనడానికి అవసరమైన బైక్‌ల కోసం చోరీల బాట పట్టారు. వాటిలో పెట్రోల్ నింపుకోవడానికి మొబైల్ ఫోన్స్ దొంగతనం చేయడం మొదలుపెట్టారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ ముఠాలోని నలుగురిని పట్టుకుని వారి గుట్టు రట్టుచేశారు. ‘సాహసాలు’అంటే మక్కువ.. హైదరాబాద్‌లోని సిద్ధార్థనగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు ఈసీఐఎల్‌లోని ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి ఇళ్లల్లో పని చేసుకుంటూ కొడుకును పోషిస్తోంది. బైక్‌లు నడపటంలో పట్టున్న అతడికి.. స్టంట్స్ చేయడమంటే సరదా. స్నేహితుల వద్ద నుంచి తీసుకున్న బైక్‌లతో రోడ్లపై స్టంట్స్ చేస్తుంటాడు. కేబీఆర్ పార్క్ వద్ద రేసింగ్స్ చేసేవాడు. ఉప్పల్‌లోని భగాయత్ ల్యాండ్స్‌లో ప్రతి శని, ఆదివారాల్లో స్టంట్స్ చేయడంలో యువతకు ‘శిక్షణ’కూడా ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఇతడికి తమ ఏరియాలోనే ఉండే ముగ్గురు మైనర్లతో పరిచయం ఏర్పడింది. ఈ ముఠాకు అతగాడు గ్యాంగ్‌లీడర్‌గా మారాడు. స్టంట్స్ చేయడానికి స్పోర్ట్స్‌బైక్స్.. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు స్టంట్స్ చేయాలంటే సొంతంగా స్పోర్ట్స్ బైక్ ఉండాలని సూత్రధారి భావించాడు. వాటిని ఖరీదు చేసే స్తోమత వారికి లేకపోవడంతో బైక్‌లను చోరీ చేయాలని పథకం వేశారు. ఇందుకు మరో ముగ్గురు మైనర్లనూ తమతో చేర్చుకున్నారు. వీరంతా కలసి గోల్కొండ, జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచి మూడు బైక్స్ చోరీ చేశారు. వీటిలో రెండు కేటీఎంలు కాగా, మరొకటి పల్సర్. వీటిపై తిరిగేందుకు కావాల్సిన పెట్రోల్ కోసం గోపాలపురం, మహంకాళి, ఎల్బీనగర్లలో సెల్ఫోన్లు దొంగతనం చేశారు. వీరు దొంగిలించిన బైకులకు తప్పుడు నంబర్ప్లేట్లు తగిలించి రోడ్డుపై వెళ్తున్న వారి నుంచి సెల్ఫోన్లు లాక్కుపోయేవారు. మల్కాజ్గిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో రెండు ఫోన్లు దొంగతనం చేశారు. చిక్కినా చెప్పడు... ఈ గ్యాంగ్ సూత్రధారి అయిన మైనర్ చాలా ముదురు. పోలీసులకు చిక్కినా కూడా పూర్తి వివరాలు చెప్పేవాడు కాదు. రెండు సెల్ఫోన్లు దొంగిలించిన కేసులో మల్కాజ్గిరి పోలీసులు గత నెలలో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో చేసిన నేరాలకు సంబంధించి నోరు విప్పలేదు. గత నెల 18న సూత్రధారి సహా ముగ్గురు మైనర్లు ఓ వాహనంపై వచ్చి క్లాక్‌టవర్ వద్ద సెల్‌ఫోన్ దొంగిలించారు. దీనిపై గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సూత్రధారిని గుర్తించారు. అతడి కదలికలపై ఆరా తీయగా.. వీకెండ్స్‌లో ఉప్పల్‌లోని భగాయత్‌లో, మామూలు రోజుల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. నిఘా పెట్టిన పోలీసులు సూత్రధారితో పాటు నలుగురు మైనర్లను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. -
జైల్లో జట్టుకట్టి పథకం వేసి..
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో గతేడాది డిసెంబర్ ఆఖరివారంలో వరుస గొలుసు చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్రముఠా గుట్టును హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతోపాటుగా హైదరాబాద్ వాసి చింతమల్ల ప్రణీత్ చౌదరిలు ముఠాగా ఏర్పడి ఈ వరుస గొలుసు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లి డిపోర్టేషన్‌పై తిరిగి వచ్చి నేర జీవితాన్ని ఎంచుకున్న ప్రణీత్ చౌదరే ఈ ముఠాకు సూత్రధారిగా తేల్చారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ ముఠా ఆట కట్టించడమే కాకుండా వారినుంచి మొత్తం సొత్తును రికవరీ చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. తన కార్యాలయంలో ఈ ముఠాకు సంబంధించి పూర్తి వివరాలను బుధవారం ఆయన మీడియాకు వెల్లడించారు. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ప్రణీత్ ఇంజనీరింగ్ చదువు మధ్యలోనే ఆపి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివేందుకు లండన్‌కు వెళ్లాడు. ముందస్తు సమాచారం లేకుండా భారత్‌కు వచ్చి వెళ్లడంతో ప్రణీత్‌ను అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు డిపోర్టేషన్ పద్ధతిలో తిప్పిపంపేశారు. అప్పట్నుంచి నేరజీవితం ప్రారంభించిన ప్రణీత్ తన వద్ద ఉన్న అమెరికా డాలర్లు మార్పిడి చేసుకోవచ్చంటూ ఆశ చూపించి చాలామందిని మోసం చేశాడు. 2014–15 ఏడాదిలో సరూర్‌నగర్, ఉప్పల్‌తోపాటు నోయిడాలోను పలు నేరాలు చేసి అక్కడి పోలీసులకు చిక్కాడు. 2015లో ప్రణీత్‌పై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ ప్రయోగించడంతో రెండున్నరేళ్ల పాటు నోయిడా సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఇదే జైలులో స్నాచింగ్స్, దోపిడీ నేరాలతో జైలు శిక్ష అనుభవిస్తున్న యూపీకి చెందిన ఛోకా, మోను వాల్మీకితో ప్రణీత్ చౌదరికి పరిచయమేర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడి గొలుసు చోరీలు చేయాలని పథకం వేశారు. ముందు రెక్కీ...ఆపై చోరీలు ఎల్బీనగర్ జోన్‌పై ప్రణీత్‌కు మంచి పట్టుండటంతో ప్రధాన రహదారికి ఆనుకుని ఏయే చోట్ల స్నాచింగ్ చేయాలి? ఏ రూట్లో పారిపోవాలి అన్న విషయాలు ముందే ఆలోచించి పెట్టుకున్నాడు. గత నెల 24న ఛోకా, మోనులను హైదరాబాద్ రప్పించి కాచిగూడలోని లాడ్జిలో బస ఏర్పాటు చేశాడు. చోరీలు చేసేందుకు ఓఎల్ఎక్స్లో మలక్‌పేటకు చెందిన సోఫి యాన్ నుంచి కేటీఎం బైక్‌ను అద్దెకు తీసుకున్నారు. వీరిద్దరూ దీనిపై, ప్రణీత్ పల్సర్ బైక్‌పై తిరుగుతూ గతనెల 24, 25 తేదీల్లో రెక్కీలు నిర్వహించారు. 26 సాయంత్రం ప్రణీత్ లాడ్జిలోనే ఉండిపోగా.. ఛోకా, మోనులిద్దరూ సాయంత్రం 4.40 నుంచి రాత్రి 8.55 మధ్య మీర్‌పేట, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్‌నగర్‌ల్లో 5 గొలుసు చోరీలకు పాల్పడ్డారు. ఆ రాత్రి లాడ్జిలో ఉండి మరుసటి రోజు ఉదయం 7 నుంచి 7.40 వరకు చైతన్యపురి, వనస్థలిపురం, హయత్‌నగర్‌ల్లో 5 స్నాచింగ్స్ చేసి తిరిగి లాడ్జికి వెళ్లిపోయారు. అదేరోజు వాహనాన్ని భవానీనగర్ ఠాణా పరిధిలో వదిలేసి ముగ్గురూ కలిసి ఉత్తరాదికి పారిపోయారు. దారి చూపిన గూగుల్ పే ఈ కేసులన్నీ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగినప్పటికీ హైదరాబాద్ పోలీసులూ అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సీసీ కెమెరాల్లో రికా ర్డయిన ఫీడ్‌తో పాటు ఇతర ఆధారాలను పరిశీలించారు. స్నాచర్లు ఉత్తరాదికి చెందిన వారుగా తేలడంతో తమ పరిధిల్లోని లాడ్జీల్లో ఆరా తీయగా... కాచిగూడలోని ఓ లాడ్జీలో వీరి వివరాలు దొరికాయి. లాడ్జి యజమానికి డబ్బు చెల్లించేందుకు ప్రణీత్ తన గూగుల్ పే యాప్‌ను వాడటంతో అడ్డంగా దొరికిపోయాడు. దుండగుల కోసం ఉత్తరాదిలో గాలించిన పోలీసులకు నిరాశే ఎదురైంది. అయితే మళ్లీ నేరాలు చేసేందుకు వీరు నగరానికి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భవానీనగర్ పరిధిలో ఇద్దరు స్నాచర్లు పల్సర్‌పై తిరుగుతూ పోలీసులకు చిక్కడంతో వారిద్వారా లాడ్జిలో ఉన్న ప్రణీత్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి బంగారాన్ని రికవరీ చేశారు. వాహనాలతో పాటుగా చోరీ ప్రయ త్నంలో ఎవరైనా అడ్డుకుంటే అంతం చేయడానికి ఉంచుకున్న ఓ కత్తినీ ఛోకా నుంచి స్వాధీనం చేసు కున్నారు. వీరికి బైక్ అద్దెకు ఇచ్చిన సోఫియాన్ పైనా విచారణకు నిర్ణయించారు. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని అధికారులు యోచిస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం స్నాచర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాచకొండ అధికారులకు అప్పగించారు. -
నగరానికి డ్రగ్స్ వయా గోవా
సాక్షి, హైదరాబాద్: గోవా నుంచి నగరానికి మాదకద్రవ్యాలను తెచ్చి విక్రయిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 21 లక్షల విలువ చేసే 89 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను సోమవారం ఇక్కడి నగర పోలీసు కమిషనరేట్‌లో సీపీ అంజనీకుమార్ మీడియాకు వివరించారు. గోవాకు చెందిన లివియో జోసెఫ్ అల్మీద అలియాస్ పియూష్ అక్కడే ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నాడు. అక్కడకు వచ్చే టూరిస్ట్‌లకు వాహనాలను అద్దెకిస్తుంటాడు. ఈ వ్యాపారంలో వచ్చే ఆదాయం సరిపోక ఇబ్బందులు పడుతున్న సమయంలో పియూష్‌కు డ్రగ్స్ క్రయవిక్రయాలు చేస్తున్న నైజీరియన్లతో పరిచయం ఏర్పడింది. వీరు రూ.3 వేలకు గ్రాము చొప్పున కొకైన్ కొనుగోలు చేసి అవసరమైనవారికి రూ.6 వేల నుంచి రూ.7 వేలకు విక్రయించడాన్ని గమనించాడు. విలాసవంతమైన జీవితంతోపాటు భారీగా ఆదాయం సంపాదించవచ్చనే ఉద్దేశంతో వారితో చేతులు కలిపి దందా మొదలెట్టాడు. మధ్యవర్తి ద్వారా పరిచయం 8 నెలల క్రితం గోవాకు వచ్చిన బంజారాహిల్స్‌వాసి, వాల్ పెయింటర్ యు.శంకర్‌తో ఓ మధ్యవర్తి ద్వారా పియూష్‌కు పరిచయం ఏర్పడింది. శంకర్‌ది ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. శంకర్ ద్వారా గోవా నుంచి మాదకద్రవ్యాలను నగరానికి పంపించి పియూష్ డ్రగ్స్ వ్యాపారం చేయసాగాడు. కాగా, కొత్త సంవత్సర వేడుకలకు హైదరాబాద్‌లో కొకైన్ విక్రయించాలని పథకం వేశారు. ఒక్కో గ్రాము చొప్పున గోవాలో ప్యాక్ చేసిన కొకైన్ శంకర్‌కు ఇచ్చేందుకు పియూష్ నగరానికి వచ్చాడు. ఈ సమాచారం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందడంతో బంజారాహిల్స్‌లో నిఘా పెట్టి శంకర్, పియూష్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి నుంచి 89 గ్రా. కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ను ఎవరెవరికి సరఫరా చేస్తున్నాడనే విషయాలు విచారణలో వెలుగులోకి వస్తాయని సీపీ వెల్లడించారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, ఎస్సై గట్టుమల్లు బృందం పాల్గొంది. డ్రగ్స్ ముఠా సమాచారం సేకరించిన కానిస్టేబుల్ జి.లోకేశ్వర్‌ను సీపీ అభినందించారు. -
వరంగల్‌లో రూ.3.5 కోట్ల నగదు స్వాధీనం
కాజీపేట: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని సిద్దార్ధనగర్‌లో ఓ ఇంట్లో దాచి ఉంచిన సుమారు రూ.3.5 కోట్ల నగదును బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వర్ధన్నపేట ప్రజా ఫ్రంట్ అభ్యర్థి డాక్టర్ పి.దేవయ్యకు సమీప బంధువైన కాంగ్రెస్ నాయకుడు గంగారపు అమృతరావు ఇంటి సమీపంలో ఉంటున్న కేరళకు చెందిన ఓ వ్యక్తి నివాసంలో ఈ నగదు దొరికింది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దార్ధనగర్‌లో నివాసం ఉండే అమృతరావు తన ఇంటి పక్కన ఉన్న కేరళ వ్యక్తి ఇంటిని బుధవారం అద్దెకు తీసుకున్నారు. అద్దెకు ఇచ్చిన కొద్దిసేపటికే ముగ్గురు యువకులు లగేజీ బ్యాగ్‌లతో రెండు కార్లలో వచ్చారు. ఆ కొద్దిసేపటికే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి.. ఆ ఇంటిలో ఉన్న దాదాపు రూ.3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. యువకుల మధ్య గొడవే పట్టించిందా... రెండు వాహనాల్లో నగదును తెచ్చిన యువకులు బహిరంగంగా రోడ్డుపై గొడవ పడడమే డబ్బుల గుట్టు తెలియడానికి కారణమైందనే చర్చ కాజీపేట పట్టణంలో జరుగుతోంది. ఎన్నికల అవసరాల కోసం తెచ్చిన డబ్బులు ఎవరి వద్ద ఉండాలనే విషయంలో యువకులు రోడ్డుపై వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో అటుగా వచ్చిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది విషయాన్ని ఆరా తీసి అధికారులకు సమాచారం అందించడంతో చాకచక్యంగా వ్యవహరించి నగదును పట్టుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అమృతరావు ఇంటిపై దాడి.. అమృతరావు ఇంటిలో ఇంకా ఏమైనా నగదు నిల్వలు ఉండొచ్చనే ఉద్దేశంతో పోలీసులు తనిఖీలు చేశారు. యువకులు డబ్బులతో వచ్చిన వాహనాలను తనిఖీ చేయగా కాంగ్రెస్ కండువాలు, జెండాలు బయటపడ్డట్టు తెలుస్తోంది. -
శరణార్థిగా అమెరికాలోనే స్థిరపడవచ్చంటూ...
సాక్షి, సిటీబ్యూరో: ‘ఇజ్రాయిల్...జోర్డాన్...ఇకోడర్ దేశాల్లో ఉద్యోగాలు, అమెరికా డాలర్లలో వేతనం. అవసరమైతే పనామా, మెక్సికో శరణార్థులుగా అమెరికాకు వెళ్లి స్థిరపడి లక్షల్లో జీతాలు తీసుకోవచ్చునని’ దాదాపు 50 మంది నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి టోకరా ఘరానా మోసగాడిని నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కుమారుడు వోస సన్నీధర్ అలియాస్ సన్నీతో కలిసి దేశం విడిచివెళ్లేందుకు యత్నించిన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన వోస గంగాధర్‌ను బషీర్‌బాగ్‌లోని ఓ హోటల్లో అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 8.6 లక్షల నగదు, 3,100 యూఎస్ డాలర్లు, 11 పాస్‌పోర్టులు, ఇతర గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన గంగాధర్ ఇంటర్ మొదటి సంవత్సరంతో చదువు ఆపేసి 1989లో షార్జాకు వెళ్లి అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్యాబ్రికేటర్, గ్లాస్‌కట్టర్, మొబైల్ టెక్నీషియన్‌గా ఐదేళ్లు పనిచేసి ఇండియాకు తిరిగి వచ్చాడు. వివాహం అనంతరం ఉద్యోగం నిమి త్తం దుబాయి, సౌదీఅరేబియా, సింగపూర్, ట్రినిడాడ్, ఖతార్, బ్యాంకాక్, బెహ్రైన్, జోర్ధాన్, ఇం డోనేషియా దేశాలకు వెళ్లి వచ్చాడు. సుమారు 30 దేశాల సరిహద్దులు, అక్కడికి ఎలా వెళ్లాలి, ఆయా దేశాల నుంచి మరో దేశానికి అక్రమ పద్ధతిలో వెళ్లి ఎలా స్థిరపడాలనే విషయాలపై పూర్తి పట్టు సా ధించాడు. ఉద్యోగంతో పెద్దగా డబ్బులు సంపాదించాలేమనే నిర్ణయానికి వచ్చిన అతను హైదరాబాద్‌లోని కూకట్పల్లి మహదేవ్పూర్కు మకాం మార్చాడు. విదేశాలకు వలసపోయే వారికి అవసరమయ్యే వీసా ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ చేయించి ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే గోలివడ్డ గంగాధర్, కస్తూరి ప్రకాస్ రాజ రామ్ పేర్లతోనూ చలమాణి అవుతూ ట్రావెల్ ఏజెంట్‌గా పరిచయం చేసుకుని నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తానని మోసానికి తెరలేపాడు. అమెరికాలోనే స్థిరపడవచ్చంటూ... ఇజ్రాయిల్, జోర్దాన్, ఇకోడర్ దేశాలకు పంపిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించి వారి పాస్‌పోర్టులు తీసుకున్నాడు. ఆమెరికాలో డాలర్లు వచ్చే పని కల్పిస్తానంటూ చెప్పిన అతను ఇందుకోసం వీసాలు ఇప్పిస్తానని దాదాపు 50 మంది నుంచి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల చొప్పున వసూలు చేశాడు. ఇకోడర్ నుంచి ఆమెరికాకు, పనామా దేశం, మెక్సికో దేశాల నుంచి శరణార్థిగా వెళ్లవచ్చని నమ్మించాడు. ఆయా దేశాల మీదుగా ఆమెజాన్ అడవుల్లో కొంత దూరం నడిస్తే అమెరికా చెక్‌పోస్టులు తారసపడితే శరణార్ధిగా పేరు నమోదు చేసుకొని ఆమెరికాలోకి ప్రవేశించవచ్చునని ఆ తర్వాత ఆమెరికాలో ఎలా ఉద్యోగం సంపాదించాలో వివరించాడు. వీసా, డాక్యుమెంటేషన్ చేయించేందుకు ఢిల్లీలోని ఇజ్రాయిల్ ట్రావెల్స్ యజమాని పునీత్ సహాయం తీసుకున్నాడు. ఇలా 2015 నుంచి 50 మందిని మోసం చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. 2015లో ఇతడిపై నిజామాబాద్‌లో మొదటి కేసు నమోదైంది. ఆ తర్వాత నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, అర్మూర్లలోనూ కేసులు నమోదయ్యాయి. టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిందిలా... అతని భారిన పడి మోసపోయినవారు గాలిస్తుండటంతో గంగాధర్ దేశం విడిచి వెళ్లాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా అబిడ్స్‌లోని వన్ లింక్ ట్రావెల్స్ నుంచి ఇకోడర్ దేశానికి వెళ్లేందుకు గంగాధర్, అతని కుమారుడు వోస సన్నీధర్ లియాస్ సన్నీలకు రెండు విమాన టిక్కెట్లు బుక్ చేశాడు. అక్కడి నుంచి శరణార్ధిగా ఆమెరికాకు వెళ్లి స్థిరపడి కుటుంబ సభ్యులను తీసుకెళ్లాలని భావించాడు. సోమవారం రాత్రి దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమైన తండ్రీ కుమారులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు బృందం అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది. మోసపూరిత ప్రకటనలను నమ్మి సామాన్యులు మోసపోవద్దని, ఇలాంటి వారి సమాచారాన్ని వెంటనే నగర పోలీసులకు తెలపాలని అంజనీకుమార్ తెలిపారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
దొంగతనానికి మంగళవారమే మంచిరోజట..
సాక్షి, హైదరాబాద్: వారాలు, తిథులు, నక్షత్రాలు వంటివి గణించుకొని చాలామంది మంచిపనులకు ఉపక్రమించడం ఓ ఆనవాయితీ. అయితే దొంగతనాలే జీవితంగా బతుకుతున్న మహమ్మద్ సమీర్ ఖాన్‌కూ ఓ సెంటిమెంటు ఉందట. కంటిచూపూ సరిగ్గా లేని ఈ నేరగాడు సహాయకుడు ఉంటే చాలు..పగటి పూట అదీ కేవలం మంగళవారం మాత్రమే చోరీలు చేస్తాడు. ఆ రోజు సెలవు దినమైతే మాత్రమే మరుసటి, ఆ తర్వాతి రోజులకు ‘పని’వాయిదా వేస్తాడు. ఇలా ఘరానా నేరచరిత్ర ఉన్న మహమ్మద్ సమీర్ ఖాన్ సహా ఇద్దరిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.21 లక్షల విలువైన 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో కలసి సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు ఆయన ఈ వివరాలు వెల్లడించారు. 18 ఏళ్ల కిందట సిటీకి వలస... సమీర్ ఖాన్‌కు సమీర్ పఠాన్, షోయబ్ అనే మారుపేర్లూ ఉన్నాయి. ఇతడి పూర్వీకులు అఫ్గానిస్తాన్‌లోని కాబూల్ నుంచి బెంగళూరుకు వలసవచ్చారు. చదువులేకున్నా సమీర్ కన్నడ, ఉర్దూ మాట్లాడగలడు. తన తండ్రి మరణానంతరం 2000లో తన తల్లితో కలసి హైదరాబాద్‌కు వచ్చి బార్కస్‌లో స్థిరపడ్డాడు. సీడీలు, వస్త్రాల వ్యాపారం చేశాడు. 2008లో సెల్‌ఫోన్ చోరీ కేసులో ఎస్సార్‌నగర్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లడంతో ఇతడి నేర చరిత్ర ప్రారంభమైంది. అప్పటి నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పలు నేరాలు చేస్తూ జైలుకు వెళ్లి వస్తున్నాడు. 2011లో ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, 2014లో గోల్కొండ, ఆర్సీపురం, మల్కాజ్గిరి, కు షాయిగూడ, కీసర ఠాణాల పరి«ధుల్లో నేరాలు చేసిన సమీర్ఖాన్పై 30 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని కలబురిగీ, బీదర్, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోనూ నేరాలు చేశాడు. తాజాగా జైల్లో పరిచయమైన ఓల్డ్ మలక్‌పేట వాసి మహమ్మద్ షోయబ్‌ను తన అనుచరుడిగా మార్చుకున్నాడు. అతడు బైక్ నడుపుతుంటే వెనుక కూర్చునే సమీర్ వీధుల్లో తిరుగుతూ అనువైన ఇంటి కోసం గాలిస్తుంటాడు. సమీర్ సోదరులూ చోరశిఖామణులే.. సమీర్ ఇద్దరు అన్నయ్యలూ దొంగలే. వీరిపై ఏపీలోని అనేక ఠాణాల్లో కేసులున్నాయి. ఓ అన్న అక్కడి జైల్లో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. మరో అన్న జైలుకు వెళ్లి వస్తుంటాడు. సమీర్ గత ఏడాది నవంబర్‌లో బెంగళూరులోని కడిగెహల్లీ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత బెయిల్‌పై వచ్చి మరికొన్ని నేరాలు చేశాడు. సిటీలో 3, బీదర్‌లో 5, కలబురిగీలో 4, ఏపీలో ఒకటి నేరాలు చేశాడు. ఇతడి కదలికలపై దృష్టి పెట్టిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఎస్సైల బృందం వలపన్ని సమీర్‌తో పాటు అతని సహాయకుడు షోయబ్‌ను పట్టుకున్నారు. కాగా నగర వాసులు ఎవరైనా రెండుమూడు రోజులకు పైబడి ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళుతుంటే స్థానిక ఠాణాలో సమాచారం ఇవ్వాలని కొత్వాల్ అంజనీకుమార్ కోరారు. ఆ రోజు కాకుంటే... అనువైన ఇంటిని ఎంచుకొని తాళం పగులగొట్టాక సమీర్ బంగారం, నగదుతో పాటు ఇతర విలువైనవీ ఎత్తుకొచ్చేస్తాడు. తాను మంగళవారం కాకుండా వేరే రోజుల్లో చోరీకి వెళ్తే ఆ ఇంట్లో ‘గిట్టుబాటు’కాకపోవడమో, పోలీసులకు చిక్కడమో జరుగుతుందని అతడి నమ్మకం. పోలీసులకు చిక్కకుండా తరచూ సిమ్‌కార్డులు మార్చడం, వాహనం నంబర్ మార్చడం వంటివి పాటిస్తాడు.వాహనంపై ఉన్నప్పుడు కచ్చితంగా హెల్మెట్, దొంగతనం చేసేప్పుడు టోపీ ధరించి సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తపడతాడు. గరిష్టంగా 10 నిమిషాల్లో చోరీని పూర్తి చేసి పరారవుతాడు. -
టీడీపీ నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ద్రవ్య మార్పిడి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతల చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. సాధారణంగా హుండీ, హవాలా దందాలకు సంబంధించిన వ్యక్తులు, నగదు చిక్కినప్పుడు పోలీసులు వారిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తారు. అయితే బుధవారం చిక్కిన రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్, జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్‌కుమార్ డ్రైవర్ తదితరులను ఆదాయపుపన్నుశాఖకు అప్పగించడంతోపాటు వారిపై సుల్తాన్‌బజార్ ఠాణాలో కేసు నమోదైంది. ఇందులో ఐదుగురినీ నిందితులుగా పేర్కొన్న పోలీసులు అనిల్ పేరును ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. ఈ కేసు దర్యాప్తు నేపథ్యంలో అనిల్‌తోపాటు మరికొందరు ‘టీడీపీ పెద్దలనూ’ విచారించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ సమీపంలోని పూజ ఫ్యాషన్స్ స్టోర్స్‌లో నగదుమార్పిడిపై సమాచా రమందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం దాడి చేసిన విషయం విదితమే. అనిల్ డ్రైవర్ పుప్పల్ల మహేశ్, అతడి బావమరిది డి.శ్రీనివాసరావులతోపాటు ఆ దుకాణం యజమాని నరేశ్ తండ్రి గుమన్‌సింగ్ రాజ్ పురోహిత్, సిరిసిల్ల అవినాశ్, నేపాల్సింగ్లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.59,00,500 స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని తన యజమానే ఇచ్చారని మహేశ్ వెల్ల డించాడు. రూ.50 లక్షలు పూజ ఫ్యాషన్స్ యజమా నికి, రూ.10 లక్షలు అవినాష్‌కు ఇవ్వాలని అనిల్ స్నేహితుడు వర్మ సూచించారని వెల్లడించాడు. ఈ మొత్తాన్ని జగిత్యాల్లో ఉన్న కళ్యాణ్ డ్రెస్సెస్‌కు పంపేందుకు హుండీ ఏజెంట్లు ప్రయత్నించారని టాస్క్‌ఫోర్స్ గుర్తించింది. ప్రాథమికంగా ఈ కేసులో తదుపరి చర్యల నిమిత్తం ఐదుగురితోపాటు నగదునూ ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించారు. ఈ నగదు తరలింపు వ్యవహారంపై ఎన్నికల సంఘానికీ సమాచారమిచ్చింది. ప్రాథమికంగా సేకరించిన ఆధారాలను బట్టి ఈ నగదును జగిత్యాలతో ఓటర్లకు పంపిణీ చేయడానికే తీసుకువెళ్తున్నట్లు గుర్తించా రు. దీనిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుల్తాన్‌బజార్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో శనివారం కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా అనిల్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. సైఫాబాద్‌కు చెందిన వర్మ ఎవరనే కోణంలో ప్రధానంగా ఆరా తీయనున్నారు. ఈ నగదు దొరకడానికి ఒకరోజు ముందు చిత్రపురి కాలనీలో జరిగిన సమావేశం ఏమిటి? దానికి టీడీపీ తరఫున ఎవరె వరు హాజరయ్యారు? వారికి, ఈ నగదు సరఫరాకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణాలపై దృష్టి పెట్టారు. దీనికోసం మరికొందరు టీడీపీ నేతలకూ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. వీరి సమాధానా ల ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి. మరో రూ.2.5 కోట్లు స్వాధీనం... ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొన్ని రోజులుగా అక్రమ ద్రవ్యమార్పిడిపై నిఘా ముమ్మరం చేశా రు. 2 దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్యమార్పిడిని హవాలా అని, దేశంలో అంతర్గతంగా జరిగే దాన్ని హుండీ అని అంటారు. బుధవారం టీడీపీ నేతలకు చెందిన రూ.59 లక్షలు దొరకగా.. తాజాగా ఆదివారం పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో ముఠా గుట్టురట్టు చేసి రూ.2.5 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన పాటిల్ జయేశ్ అనే జ్యువెలరీ వ్యాపారి 2010లో నగరానికి వచ్చి అబిడ్స్‌లో స్థిరపడ్డాడు. అతడి ప్రవృత్తి హుండీ దందా. రూ.లక్షకు రూ.600 చొప్పున కమీషన్ తీసుకునే జయేశ్ ఈ దందా కొనసాగిస్తున్నాడు. ఇతడి వద్ద వన్రాజ్, పాటిల్ అశ్విన్, నవీన్ పనిచేస్తున్నారు. ఆదివారం ఇద్దరు వ్యక్తులు భారీ మొత్తంతో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారంటూ పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లుకు సమాచారమందింది. ఆయన నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని రాంకోఠిలో వన్రాజ్, అశ్విన్‌ను పట్టుకు న్నారు. వీరి వద్ద రూ.1.8 కోట్లు, ఒక బైక్‌ను స్వాధీ నం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు జయేశ్ ఇంటిపై దాడి చేసి జయేశ్తోపాటు నవీన్ ను పట్టుకుని రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని ఓ ఏజెంట్ సూచన మేరకు రూ.1.8 కోట్లను రాంకోఠిలో ఓ వ్యక్తికి డెలివరీ చేస్తున్నట్లు తేలింది. ఈ కేసును ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. -
‘ఎన్నికల డబ్బుకు’ హుండీ మార్గం!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సీజన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు తరలింపుపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది. జోరుగా తనిఖీలు సాగుతుండటంతో నేరుగా తీసుకువెళితే ఇబ్బందనే ఉద్దేశంతో అక్రమ రవాణా కోసం హుండీ మార్గాన్ని అనుసరిస్తోంది. రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్యమార్పిడిని హవాలా అని, దేశంలో అంతర్గతంగా జరిగే దాన్ని హుండీ అని అంటారు. ఈ బాధ్యతల్ని ఎక్కడికక్కడ స్థానిక నేతలకు అప్పగించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి జగిత్యాలకు హుండీ మార్గంలో పంపుతున్న రూ.60 లక్షల్ని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. ఈ నగదును తెలంగాణ రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్, జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్‌కుమార్, ఆయన స్నేహితుడు సైఫాబాద్‌కు చెందిన వర్మ సమకూర్చారని టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. ఆయన వాహనంలోనే, సొంత డ్రైవర్ తరలించారని వివరించారు. పన్ను ఎగ్గొట్టడంతో పాటు అక్రమ కార్యకలాపాల కోసం సాగే ఈ దందాలు ఎన్నికల నేపథ్యంలో జోరందుకుంటూ ఉంటాయి. ఈసీ సైతం అభ్యర్థుల బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచడంతో ప్రత్యామ్నాయ మార్గాలు సాగుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయాల్సిందిగా పోలీసు విభాగాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత కొన్ని రోజులుగా నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగా వరుసపెట్టి హుండీ ముఠాలు చిక్కుతున్నాయి. పక్కా సమాచారంతో దాడి... నగరంలోని కోఠి ప్రాంతంలో భారీ మొత్తం నగదు మార్పిడి జరుగుతున్నట్లు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావుకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో వలపన్నిన బృందం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిసరాల్లో మఫ్టీల్లో కాపుకాసింది. బుధవారం రాత్రి తెలుపు రంగు వెర్నా కారు (ఏపీ 09 సీఎఫ్ 1144)లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు బ్యాగుతో అక్కడి పూజ ఫ్యాషన్స్ పేరుతో ఉన్న రెడీమేడ్ వస్త్రదుకాణంలోకి వెళ్లడాన్ని గమనించారు. మఫ్టీ పోలీసులు వీరిని నీడలా వెంటాడుతూ ఆ దుకాణంలోకి వెళ్లగా... బ్యాగులో ఉన్న నగదును ఆ దుకాణం యజమాని నరేశ్ తండ్రి గుమన్‌సింగ్ రాజ్‌పురోహిత్‌కు కొంత, సిరిసిల్ల అవినాశ్‌కు మరికొంత అందించారు. గుమన్సింగ్కు ఇచ్చిన మొత్తాన్ని ఆ దుకాణంలో పని చేసే నేపాల్ సింగ్ లెక్కిస్తుండగా... దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ ఫోర్స్ టీమ్ మొత్తం ఐదుగురినీ అదుపులోకి తీసుకుంది. విచారణ నేపథ్యంలో వెర్నా కారులో నగదు తీసుకువచ్చింది వల్లభనేని అనిల్ కుమార్ డ్రైవర్ పుప్పల్ల మహేశ్ అని గుర్తించిన పోలీసులు ప్రశ్నించగా... ఆ మొత్తం తన యజమానే ఇచ్చారని వెల్లడించాడు. తన వెంట ఉన్న మరో వ్యక్తి తన బావమరిది డి.శ్రీనివాసరావు అని, సాయం కోసం తీసుకువచ్చానని చెప్పాడు. మొత్తం రూ.60 లక్షలతో పాటు వాహనాన్నీ తనకు అప్పగించిన యజమాని అనిల్‌కుమార్, స్నేహితుడు వర్మ రూ.50 లక్షలు పూజ ఫ్యాషన్స్ యజమానికి, రూ.10 లక్షలు అవినాశ్‌కు ఇవ్వాలని సూచించారని చెప్పాడు. జూబ్లీహిల్స్ రేసులో అనిల్‌కుమార్?.. అనిల్ కుమార్ స్వస్థలం కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పాత బెల్లంకొండవారి పాలెం. సాధారణ కుటుంబానికి చెందిన ఇతని తండ్రి ఓ రైతు. దాదాపు 20 ఏళ్ల క్రితం పొట్ట చేతపట్టుకుని నగరానికి వచ్చారు. అప్పట్లో ద్విచక్ర వాహనం సైతం లేకుండా కాలినడకన తిరిగినట్లు సమాచారం. తొలినాళ్లలో సినిమా నిర్మాణ సమయంలో జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేస్తుండేవాడు. ప్రస్తుతం తెలంగాణ తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా ఉన్న అనిల్‌కు రూ.కోట్లలో ఆస్తి ఉందని సమాచారం. నందిగామలోనూ బినామీ పేర్లతో భారీగా కూడబెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తరఫున నందిగామ ఎమ్మెల్యేగా నిలబడే వారి కోసం అనిల్ ప్రత్యేకంగా ప్రచార రథాలు హైదరాబాద్‌లో రూపొందించి పంపేవారు. ఇటీవల అమరావతి వెళ్లిన అనిల్.. టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. తనకు తెలుగుదేశం తరఫున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వమని కోరినట్లు సమాచారం. వస్త్ర వ్యాపారం ముసుగులో దందా... వస్త్రవ్యాపారం ముసుగులో నరేశ్, కంప్యూటర్ ఆపరేటర్ ముసుగులో అవినాశ్ ఏళ్లుగా హుండీ, హవాలా దందాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.లక్షకు రూ.600 నుంచి రూ.800 కమీషన్ తీసుకుంటూ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకూ నగదు తరలిస్తూ ఉంటారని వెలుగులోకి వచ్చింది. ఈ రూ.60 లక్షల్ని జగిత్యాలలో ఉన్న కళ్యాణ్ డ్రస్సెస్కు పంపాలని వీరు ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో హవాలా దందా నిర్వహించే ఆ దుకాణ నిర్వాహకులు అక్కడి తెలుగుదేశం నాయకులకు నగదు అప్పగించే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహేశ్, గుమన్‌సింగ్, నేపాల్ సింగ్, శ్రీనివాస్, అవినాశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వల్లభనేని అనిల్‌కుమార్‌కు చెందిన వాహనం, సెల్ఫోన్లు, మరో ద్విచక్ర వాహనంతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును లెక్కించగా రూ.59,00,500 ఉన్నట్లు తేలింది. ఈ నగదు పంపడంలో కీలకంగా వ్యవహరించిన వర్మ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కీలక నేతకు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనిల్ ఇంట్లో కీలక నేతల భేటీ... మణికొండ చిత్రపురికాలనీలోని ఓ మండపంలో మంగళవారం రాత్రి జరిగిన పూజ కార్యక్రమాలకు ఈ నేతతో పాటు మరికొందరు కీలక టీటీడీపీ నాయకులు హాజరయ్యారని తెలిసింది. పూజ ముగిసిన తర్వాత అక్కడే ఉన్న అనిల్‌కుమార్ ఇంట్లో వీరంతా దాదాపు రెండు గంటల పాటు సమావేశమై కీలకాంశాలు చర్చించారని సమాచారం. ఇది జరిగిన మరుసటి రోజే అనిల్, వర్మ జగిత్యాలకు రూ.60 లక్షలు హుండీ రూపంలో పంపే ప్రయత్నం చేయడంతో ఇది ఎన్నికల ఖర్చులకు సంబంధించిన డబ్బే అని, దీని వెనుక సదరు టీటీడీపీ నాయకుల పాత్ర సైతం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో తదుపరి చర్యల నిమిత్తం ఐదుగురితో పాటు నగదునూ ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వివిధ కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. ఈ నగదు తరలింపు వ్యవహారంపై ఎన్నికల సంఘానికీ సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల సీజన్ నేపథ్యంలో ఇలాంటి దందాలు జోరందుకునే అవకాశం ఉండటంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిఘా ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్న హవాలా, హుండీ ఏజెంట్లపై డేగకన్ను వేశారు. -
జగిత్యాలలో ఆయుధాల కలకలం
-
కృష్ణా జిల్లాలో దొంగనోట్ల కలకలం..!
సాక్షి, విజయవాడ: జిల్లాలోని నందిగామలో దొంగనోట్లు ముద్రిస్తున్నారనే వార్త కలకలం రేపింది. పాత బైపాస్ రోడ్డులో గల ఓ ఇంట్లో దొంగ నోట్లు ముద్రిస్తున్నారనే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఉదయం దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నోట్లు ముద్రించే సాధనంగా భావిస్తున్న ప్రింటర్ స్కానర్, మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటికి తాళం వేసి సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎన్‌కేపాడులో.. విజయవాడ రూరల్ మండలంలోని ఎన్‌కేపాడులో దొంగనోట్లు ముద్రిస్తున్న షేక్ బాబు, షేక్ సుభాని, షేక్ జానీలను గురువారం ఉదయం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 75 వేల రూపాయలు విలువగల రూ. 100 నోట్లను, కంప్యూటర్, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
జూనియర్ ఆర్టిస్ట్ కోసం సిటీకి...
సాక్షి, సిటీబ్యూరో: కేరళలో పుట్టి పెరిగాడు... హైదరాబాద్‌లో డెన్ ఏర్పాటు చేసుకున్నాడు... కేసులు కావడంతో చెన్నైకి మకాం మార్చాడు... ఇలా మూడు రాష్ట్రాల్లోని దాదాపు 100 మందికి రుణాల పేరుతో రూ.3 కోట్ల టోకరా వేశాడు... ఈ ఘరానా నిందితుడితో పాటు ఇద్దరు అనుచరులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. వీరి నుంచి రూ.45 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. జూనియర్ ఆర్టిస్ట్ కోసం సిటీకి... కేరళలోని ధర్మాదం ప్రాంతానికి చెందిన సతీషన్ పాలయాడ్కు ఆంగ్లంపై మంచి పట్టు ఉండటంతో పాటు 1978లోనే ఎంఏ పూర్తి చేశాడు. అనంతరం చెన్నైకి మకాం మార్చిన ఇతను ఫిల్మ్ఫైనాన్షియర్గా మారాడు. 1984లో వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ఇతడికి 1995లో ఖమ్మం నుంచి చెన్నైకు వెళ్లిన జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. 1996లో ఆమెను రెండో పెళ్లి చేసుకున్న సతీషన్ హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఎల్బీనగర్లోని సహారా ఎస్టేట్స్‌లోని అపార్ట్మెంట్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నాళ్లుగా దాని యజమాని ఖాళీ చేయమని చెబుతున్నా.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆ ఉత్తర్వులతో అదే ఫ్లాట్‌లో ఉంటూ హిమాయత్‌నగర్‌లోని తిరుమల ఎస్టేట్స్‌లో కార్యాలయం ఏర్పాటు చేశాడు. చిక్కితే బోర్డు తిప్పేస్తాడు... రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు, కొన్ని కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. బౌద్ధనగర్, పార్శిగుట్టల్లో ఉంటున్న అన్నదమ్ములు ఎస్.రామ్ నివాస్ (ఇంటర్మీడియట్), పార్శిగుట్టకు చెందిన ఎస్.హరి నివాస్‌లను (ఎంబీఏ) తన ప్రధాన అనుచరులుగా మార్చుకున్నాడు. రుణం, సీట్ల కోసం వచ్చే వారితో ఆంగ్లంలో మాట్లాడి బురిడీ కొట్టించేవాడు. ఆపై సీటు, రుణం ఖరారైనట్లు తన లెటర్ హెడ్‌పై రాసిచ్చి అందినకాడికి దండుకునే వాడు. ఇలా ఓబెరాన్ ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ అండ్ లేసియోన్ వర్క్స్ కార్యాలయం ముసుగులో మోసాలు చేసి 2012లో తొలిసారి అరెస్టయ్యాడు. జైలు నుంచి రాగానే దాని పేరును ప్రైమ్ టెక్ సొల్యూషన్స్‌గా మార్చి మోసాలు చేస్తూ 2015లో చిక్కాడు. ఆపై సంస్థ పేరును మెల్సా ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్‌గా మార్చి 2017 వరకు మోసాలు చేసి మరోసారి అరెస్టు అయ్యాడు. నిఘా పెరగడంతో చెన్నైకి... గతేడాది బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఈ ముగ్గురూ ఇక తమ దందాలకు హైదరాబాద్ ‘అచ్చిరాదని’ భావించారు. చెన్నై మకాం మార్చారు. అక్కడి వలసరివక్కం ప్రాంతంలో యూనివర్శల్ యాక్సిస్ ఇండియా పేరుతో సంస్థ ఏర్పాటు చేశారు. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామంటూ సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నాడు. ఆసక్తి చూపిన వారి స్థిరాస్తుల్ని వాల్యూవర్గా వచ్చే హరినివాస్ పరిశీలిస్తాడు. లోన్ రావడానికి ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు, అర శాతం స్టాంప్ డ్యూటీ, రెండు శాతం కమీషన్లతో పాటు ఒక నెల ఇన్స్టాల్మెంట్ ముందే చెల్లించాలని చెప్పేవారు. కస్టమర్‌కు నమ్మకం కలిగేలా ఓ లెటర్ హెడ్‌పై రుణం మంజూరైనట్లు రాసివ్వడంతో పాటు నగదును సైతం తన బ్యాంకు ఖాతాల్లోనే వేయించుకుంటాడు. ఆపై రుణం ఇప్పించకుండా వాయిదాలు వేస్తూ గడిపేస్తాడు. నెలకు రూ.5 లక్షల ఖర్చు... ఇలా ఖాతాలో పడిన మొత్తాన్ని గరిష్టంగా 48 గంటల్లో డ్రా చేసేస్తాడు. చెన్నైలోని సతీషన్ కార్యాలయంలో రామ్, హరిలతో సహా మొత్తం పది మంది పని చేస్తున్నారు. వీరి జీతభత్యాలతో పాటు ఇతర ఖర్చుల నిమిత్తం నెలకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నాడు. గతంలో డబ్బు చెల్లించిన వారు ఎవరైనా తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తే తాజాగా చెల్లించిన వారు ఇచ్చిన డబ్బుతో పాత వారికి సర్దుబాటు చేస్తూ పోలీసుల వరకు విషయం వెళ్ళకుండా చూసుకునేవాడు. ఇలా హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో 100 మందిని రూ.3 కోట్ల మేర మోసం చేయడంతో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఇటీవల సతీషన్ మేడిపల్లి ప్రాంతంలో ఇల్లు ఖరీదు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వం లో ఎస్సైలు వి.కిషోర్, పి.మల్లికార్జున్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, ఎల్.భాస్కర్‌రెడ్డి, కానిస్టేబుల్ బి.ఏడుకొండలు వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. వీరిపై ఇప్పటి వరకు 14 కేసులు ఉన్నాయని, పీడీ యాక్ట్ ప్రయోగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. -
టాస్క్‌ఫోర్స్ పోలీసులమంటూ మహిళలపై దాడి
నెల్లూరు , ఆత్మకూరు: జైలులో మగ్గుతున్న వ్యక్తిని కుటుంబసభ్యులు బెయిల్‌పై తీసుకొచ్చిన కొద్ది నిమిషాల్లోనే టాస్క్‌ఫోర్స్ పోలీసులమని మఫ్టీలో ఉన్న ఐదుగురు వ్యక్తులు మహిళలపై దాడికి పాల్పడి బెయిల్ పొందిన వ్యక్తిని లాక్కెళ్లిన ఘటన పట్టణంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధిత మహిళలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చెన్నైలో మొబైల్‌షాపు నిర్వహిస్తున్న సా«థిక్ మన్సూర్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతని ఇంటికి సమీపంలోనే చెల్లెళ్లు నివసిస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది జూన్ 29వ తేదీన ఆంధ్రా పోలీసులు మొబైల్ దుకాణం వద్దకు వచ్చి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాతో సాధిక్ మన్సూర్ (పోలీసులు మన్సూర్ అలీ అని ఇతని పేరు మార్చారు)కు సంబంధాలున్నాయని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పటినుంచి నెల్లూరు జిల్లాలోని పలు జైళ్లలో తిప్పుతూ బెయిల్ తెచ్చుకుంటున్నా విడుదల చేయలేదు. మొత్తం 14 కేసులు అతడిపై నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయగిరి కోర్టు ద్వారా బెయిల్ వచ్చింది. గత వారమే సూళ్లూరుపేట జైల్ నుంచి ఆత్మకూరు జైలుకు తరలింపబడిన సాధిక్ మన్సూర్ బెయిల్‌కు సంబంధించిన పత్రాలను భార్య, అక్కాచెల్లెళ్లు, తల్లి సమర్పించి అతడిని తీసుకువచ్చారు. కొద్ది నిమిషాలకే ఓ కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి మన్సూర్‌ను తమ వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కుటుంబసభ్యులు, బంధువులు ఇదేంటని ప్రశ్నించగా వారిపై దాడికి పాల్పడి సెల్ఫోన్లను లాక్కొని దూరంగా నెట్టివేసి మన్సూర్‌ను తీసుకుని వెళ్లిపోయారు. దీంతో సాధిక్ భార్య ఆయేషా, చెల్లెళ్లు జన్నత్, సాలిహా, యాస్మిన్, తల్లి, మరదలు బెనజీర్, మనిషాలు తెలుగు భాష రాక తమ గోడు చెప్పుకునేందుకు ఎవరూ లేక స్థానికుల సహకారంతో జరిగిన విషయాన్ని ఆత్మకూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే ఈ కేసుతో తమకేమి సంబంధం లేదని పోలీసులు ఫిర్యాదును తీసుకోలేదని బాధితులు తెలిపారు. అసలు తన భర్త పేరు సాథిక్ మన్సూర్ కాగా పోలీసులు మన్సూర్ ఆలీ అని చెబుతూ 14 కేసుల్లోనూ ఇలానే పేరు మార్చి కేసులు నమోదుచేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయేషా వాపోయింది. పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎస్పీని గురువారం కలవనున్నట్లు తెలిపారు. -
గ్రూప్ 2 ఉద్యోగాలు: భారీ మోసం
సాక్షి, సిటీబ్యూరో: టీఎస్పీఎస్సీ గ్రూప్–2 నోటిఫికేషన్లో భాగంగా ఎమ్మార్వో కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన ప్రకాష్ వర్మ అనే వ్యక్తిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతను నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకోవడంతో పాటు అనేక మందికి బోగస్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినట్లు డీసీపీ రాధాకిషన్‌రావు మంగళవారం వెల్లడించారు. మెదక్ జిల్లాకు చెందిన ప్రకాష్ వర్మ తండ్రి ప్రేమ్ శ్యామ్ కుమార్ ఆర్టీసీ ఉద్యోగిగా పని చేసి రిటైర్ అయ్యారు. అతడి తల్లి ఆరోగ్య శాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పని చేసే వారు. ఆమె బదిలీ నేపథ్యంలో 15 ఏళ్ల క్రితం సిటీకి వలసవచ్చి సుచిత్ర వద్ద స్థిరపడింది. 2013లో తల్లి చనిపోవడంతో ఆ ఉద్యోగం కోసం ప్రయత్నించిన ప్రకాష్ ఉద్యోగం రాకపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలు, అధికారులతో వ్యవహరించాల్సిన తీరు తెన్నులు తెలుసుకున్నాడు. ఈ ‘అనుభవంతో’ అమాయకులను మోసం చేయడానికి రంగంలోకి దిగాడు. తాను కోఠి ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్లు గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. దీనిని నిరుద్యోగులకు చూపించి తానో ప్రభుత్వోద్యోగినని, అధికారులతో సంబంధాలు ఉన్నాయని నమ్మించాడు. 2016 గ్రూప్–2 నోటిఫికేషన్ ఆధారంగా దొడ్డిదారిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎర వేశాడు. దాదాపు ఎనిమిది మంది నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసి వారిని ఖైరతాబాద్ ఎమ్మార్వో ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్స్‌గా నియమిస్తున్నట్లు బోగస్ నియామక పత్రాలు అందజేశాడు. వీటితో అక్కడికి వెళ్లిన బా«ధితులు మోసపోయినట్లు గుర్తించారు. వీరి ఫిర్యాదుతో పంజగుట్ట, పేట్ బషీరాబాద్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ప్రకాష్ కదలికలపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎల్.భాస్కర్‌రెడ్డి, ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, వి.కిషోర్ వలపన్ని పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.3.5 లక్షల నగదు, నకిలీ గుర్తింపుకార్డు, నియామక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. -
ఒక ఘరానా దొంగ..ఇంటి చుట్టూ 32 కెమెరాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటి చుట్టూ 32 సీసీటీవీ కెమెరాలు.. వీటిలోని ఫీడ్‌ను రికార్డ్ చేయడానికి, లైవ్‌లో చూడటానికి నాలుగు డిజిటల్ వీడియో రికార్డర్స్(డీవీఆర్లు).. ఈ మాటలు చెప్పగానే.. ఎవరో పెద్ద రాజకీయ నాయకుడి నివాసమో లేక పోలీసు ఉన్నతాధికారి గృహమో అనుకుంటున్నారా..? కానే కాదు.. అది ఓ ఘరానా దొంగ ఇల్లు. భద్రత కోసం ఈ హైటెక్ దొంగ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలక్ట్రీషియన్ ముసుగులో ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో టిప్‌టాప్‌గా తిరుగుతూ పట్టపగలే ఇళ్లలో చోరీలకు పాల్పడే ఇతగాడి పేరు మీర్ ఖాజం అలీ ఖాన్. ఇతను పదో తరగతి వరకూ ఓ ప్రతిష్టాత్మక పబ్లిక్ స్కూల్లో చదవడం గమనార్హం. చివరికి నగర పోలీసు విభాగం వినియోగిస్తున్న అత్యాధునిక పాపిల్లన్ సాఫ్ట్వేర్ సాయంతో అతను దొరికిపోయాడు. ఈ ఘరానా నేరగాడి నుంచి రూ.18 లక్షల విలువైన 55 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మంచం పట్టి.. వ్యసనాలకు బానిసై.. ఆర్ఎంపీ డాక్టర్ అయిన మీర్ అక్బర్ అలీ ఖాన్ తన కుమారుడు ఖాజం అలీని చదువు నిమిత్తం ప్రతిష్టాత్మకమైన ఓ పబ్లిక్ స్కూల్లో చేర్పించాడు. ఆ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సమయంలో జరిగిన ఓ ప్రమాదం అతని జీవితాన్ని మార్చేసింది. ఓ భవనంపైన పతంగులు ఎగురవేస్తుండగా ఖాజం కాలు జారి కింద పడటంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమయ్యాడు. ఈ సమయంలో పరిచయమైన వారు వ్యసనాలు అలవాటు చేయడంతో వాటికి బానిసగా మారాడు. జల్సాలు.. అవసరాల కోసం ఆ స్నేహితులతోనే కలసి చోరీలు చేయడం మొదలుపెట్టాడు. ఇలా వరుస చోరీలు చేసి జైలుకు వెళ్లాడు. జూబ్లీహిల్స్ ఠాణాలో నమోదైన కేసులో అరెస్టు అయినప్పుడు నగర పోలీసులు ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఏడాది పాటు జైల్లో ఉన్న అలీ 2016 జూన్ 28న బయటకు వచ్చాడు. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి...: ప్రస్తుతం టోలిచౌకిలోని సూర్యనగర్‌లో నివసిస్తున్న ఖాజం అలీ ఇల్లు ఒకప్పుడు అక్కడి ఫ్లైఓవర్ పక్కన ఉండేది. ఈ ఇంటి స్థలానికి సంబంధించి ఇతడి కుటుంబానికి, గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు విభేదాలు ఉండేవి. దీంతో నయీమ్ నుంచి ముప్పు ఉంటుందనే ఉద్దేశంతో ఖాజం ఇంటి చుట్టూ 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. వీటిలోని ఫీడ్‌ను రికార్డ్ చేయడానికి నాలుగు డీవీఆర్లు ఏర్పాటు చేసుకున్నాడు. నయీమ్ ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు సీసీ కెమెరాలు కొనసాగించాడు. ఖాజం 2009–2015 మధ్య నగరంతోపాటు సైబరాబాద్, మెదక్ ల్లోని 17 పోలీసుస్టేషన్ల పరిధిలో 29 నేరాలు చేశాడు. 2016 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 16 మధ్య దాదాపు 40 రోజుల్లో 2 ఠాణాల పరిధిలో 9 నేరాలు చేశాడు. అప్పట్లో చిక్కినా చెప్పకపోవడంతో... ఖాజంను మీర్‌పేట పోలీసులు 2016లో అరెస్టు చేశారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం మలక్‌పేట, మంగళ్‌హాట్‌లో చేసిన 180 తులాల బంగారం చోరీ కేసుల్ని అతడు చెప్పలేదు. ఈ కేసుల్ని బాధితులు, పోలీసులూ దాదాపు మర్చిపోయారు. అయితే నగర పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చిన ‘పాపిల్లన్’సాఫ్ట్వేర్ ఖాజం ‘గతాన్ని’విప్పింది. ఆ నేరాలు జరిగినప్పుడు పోలీసులు సేకరించిన వేలిముద్రలు.. పాత నేరస్తుల డేటాబేస్‌తో సరిపోలలేదు. దీంతో ఆ కేసులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ‘పాపిల్లన్’అనే ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్వేర్ ఇతడికి చెక్ చెçప్పింది. ఇందులో ఇప్పటి వరకు అరెస్టు అయిన, వాంటెడ్‌గా ఉన్న పాత నేరగాళ్లతో పాటు వివిధ నేర స్థలాల్లో దొరికిన వేలిముద్రల్ని డిజిటలైజ్ చేసిన పోలీసులు వాటిని ఓ సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. ఈ సాఫ్ట్వేర్ వివిధ సందర్భాలు, సమయాల్లో నేర స్థలాల్లో దొరికిన వేలిముద్రల్ని పాత నేరగాళ్లకు చెందిన వాటితో సరిచూసి తక్షణం రిజల్ట్ ఇస్తుంది. దీంతో ఖాజం దాచిన రెండు దొంగతనాలు బయటపడ్డాయి. దీంతో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ముమ్మరంగా గాలించి మంగళవారం ఖాజంను పట్టుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించింది. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు భారీగా నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. రామగుండం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ, బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి నకిలీ విత్తనాల గుట్టును రట్టు చేశారు. ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న 13 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపించారు. బుధవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విజయసారథితో కలసి బెల్లంపల్లి ఏసీపీ వి.బాలుజాదవ్ వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద కొందరు వ్యక్తులు కార్లలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయించడానికి సిద్ధమవుతున్నట్లు పోలీసులకు మంగళవారం సాయంత్రం సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు రాత్రి సుమారు 8.30 గంటల ప్రాంతంలో నాలుగు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. నాలుగు కార్లు, ఆటోలో ఉన్న 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. బెల్లంపల్లికి చెందిన కొత్తపల్లి శ్రీనివాస్ అనే ఫెర్టిలైజర్ షాపు యాజమానికి నకిలీ పత్తి విత్తనాలు విక్రయించడానికి వచ్చినట్లు వారు తెలిపారని పోలీసు అధికారులు వివరించారు. వీరి వద్ద నుంచి 3.20 క్వింటాళ్ల నకిలీ లూజ్ విత్తనాలు, శ్రీపావని పేరుతో ఉన్న 600 నకిలీ విత్తనాల ప్యాకెట్లు (3 క్వింటాళ్లు), రూ.2.53 లక్షల నగదు, రూ.లక్ష విలువైన చెక్కు, 17 సెల్ఫోన్లు, నాలుగు కార్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాల విలువ మార్కెట్లో రూ.12.48 లక్షలు ఉంటుందని తెలిపారు. -
భారీగా గుట్కా పట్టివేత
కరీంనగర్, హుజూరాబాద్: హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న గుట్కాదందాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నిషేధిత గుట్కా విక్రయాలు జరుపుతున్న నలుగురు వ్యాపారులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ. 1.50 లక్షల విలువైన గుట్కాలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ పట్టణంలోని మామిండ్లవాడు చెందిన దేవునూరి భాస్కర్, ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి చెందిన భూపతి రాజు హుజూరాబాద్‌లో కిరాణా దుకాణం నడిపిస్తూ ఉపాధి పొందుతున్నారు. అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో నిషేధిత గుట్కాదందా సాగిస్తున్నారు. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన ఎక్కటి సంతోష్, కమలాపూర్ మండలం ఉప్పల్‌కు చెందిన నరేష్ వద్దనుంచి గుట్కాను తీసుకొస్తూ పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో.. పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేయగా దేవునూరి భాస్కర్, రాజు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. వారిని విచారించగా.. హుజూరాబాద్ పట్టణ శివారులో టీఎస్ 07యూఏ 0310 కారులో గుట్కాలు సరఫరా చేస్తూ ఎక్కటి సంతోష్, భాషబోయిన అశోక్ పట్టుపడ్డారు. పరారీలో మరో ఇద్దరు పట్టుబడిన వారిని విచారించగా తమకు జమ్మికుంటకు చెం దిన యాద సురేశ్ సరఫరా చేస్తాడని తెలిపారు. ఇతడూ, మరో వ్యాపారి ఉప్పల్‌కు చెందిన నరేశ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అయితే వీరిపై గతంలో కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్, ఎల్కతుర్తి పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలిపారు. దందా అంతా వీరి చేతుల్లోనే.. హుజూరాబాద్ ఏరియాలో గుట్కా దందా అంతా వీరి చేతుల్లోనే నడుస్తుందని సమాచారం. పెద్దమొత్తంలో డీసీఎం, కార్లలో తీసుకొచ్చి స్థానికంగా చిన్నచిన్న దుకాణాల్లో సరఫరా చేస్తున్నారు. ఈ తతంగం అంతా రాత్రివేళలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు జమ్మికుంట, కమలాపూర్, ఉప్పల్, ఎల్కతుర్తి, హుజూరాబాద్ మండలాల్లోని పలువురు దందా సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుట్కాదందాపై ఉక్కుపాదం కమిషనరేట్ పరిధిలో గుట్కాదందాపై ఉక్కుపాదం మోపు తామని టాస్క్‌ఫోర్స్ సీఐలు శ్రీనివాస్‌రావు, మాధవి, కిరణ్ తెలిపారు. హుజూరాబాద్‌కు గుట్కా సరఫరా చేసే వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో టౌన్ సీఐ వీవీ. రమణమూర్తి, టాస్క్‌ఫోర్స్ ఎస్సై రమేష్ ఉన్నారు. -
ఆ ఆయుధాల విక్రయం నిలిపేశాం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఆరోపణలపై హైదరాబాద్‌లో కేసులు నమోదు కావడంతో స్నాప్‌డీల్ సంస్థ దిగివచ్చింది. తమ వెబ్సైట్లో ఉన్న ఆయా ఆయుధాల మెనూను తొలగించామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని నగర పోలీసులకు వివరణ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావును కలసి స్నాప్‌డీల్ లీగల్ టీమ్ సంజాయిషీ ఇచ్చుకుంది. స్నాప్‌డీల్ చేస్తున్న ఆయుధ వ్యాపారాన్ని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత వారం గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయుధ చట్టం ప్రకారం 9 అంగుళాల కంటే ఎక్కువ పొడవు, రెండు అంగుళాల కంటే ఎక్కువ వెడల్పుతో కూడిన ఆయుధాలు సరైన అనుమతులు లేకుండా కలిగి ఉండటం, విక్రయించడం, ఖరీదు చేయడం నేరం. ఖరీదు చేసినందుకు సిటీకి చెందిన పలువురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు విక్రయించిన ఆరోపణలపై స్నాప్‌డీల్‌కు నోటీసులు జారీ చేశారు. పునరావృతం కాకుండా చూస్తాం.. దీంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను కలసి ఆ సంస్థ లీగల్ టీమ్ సంజాయిషీ ఇచ్చుకుంది. తాము నేరుగా ఎలాంటి ఉత్పత్తుల విక్రయాలు చేయమని, అటు విక్రేతలు.. ఇటు కొనుగోలుదారులకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే పని చేస్తామని వివరణ ఇచ్చింది. ఈ ఆయుధాలను గుజరాత్‌కు చెందిన సంస్థ తమ సైట్ ద్వారా విక్రయిస్తోందని పేర్కొంది. అయితే క్రయవిక్రయాలకు ప్లాట్‌ఫామ్‌గా వ్యవహరించిన నేపథ్యంలో స్నాప్‌డీల్‌కు విక్రేత కొంత మేరకు కమీషన్ చెల్లిస్తాడు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం బాధ్యులవుతారని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో తమ వెబ్సైట్ నుంచి పరిమితికి మించిన పొడవు, వెడల్పులతో ఉన్న ఆయుధాల మెనూను తొలగించామని, విక్రయాలు ఆపేశామని స్పష్టం చేశారు. దీంతో గుజరాత్ సంస్థకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన పోలీసులు.. స్నాప్‌డీల్‌పై చర్యలకు సంబంధించి న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించారు. ఇతర వెబ్సైట్లలోనూ... స్నాప్డీల్లోనే కాదు.. ఏ ఈ–కామర్స్ సైట్లలో చూసినా కత్తులు విక్రయానికి సిద్ధంగా ఉంటున్నాయని పోలీసులు గుర్తించారు. రూ.వెయ్యి నుంచి రూ.8 వేల వరకు వివిధ ఆకృతులు, సైజుల్లో వీటిని విక్రయించేస్తున్నారని ఆధారాలు సేకరించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఆయా వెబ్సైట్లకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్లైన్లో కత్తులు అందుబాటులోకి రావడంతో అనేక మంది అవసరం ఉన్నా లేకున్నా, చట్ట విరుద్ధమని తెలిసో తెలియకో వీటిని ఖరీదు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు. -
రెండేళ్లు.. రూ.6 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని బీదర్‌కు చెందిన భల్కీ గ్యాంగ్ అది.. దేవాలయాల్లోని పురాతన పంచలోహ విగ్రహాలే దాని టార్గెట్.. రెండేళ్లలో 3 రాష్ట్రాల్లోని తొమ్మిది ఆలయాల్లో రూ.6 కోట్ల విలువైన 11 విగ్రహాలు తస్కరించింది.. కామారెడ్డిలో రూ.3 కోట్ల విలువైన 3 విగ్రహాలను ఎత్తుకెళ్లిన వారంలోనే హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఈ ముఠా చిక్కింది. మొత్తం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. గుడి దొంగల అడ్డా భల్కీ.. కర్ణాటక బీదర్ జిల్లా సమీపంలోని భల్కీ ప్రాంతం గుడి దొంగలకు కేరాఫ్ అడ్రస్. ఢిల్లీ, మహారాష్ట్రలకు చెందిన పురాతన వస్తువుల స్మగ్లర్లు భల్కీ వాసులకు డబ్బు ఆశ చూపి దొంగలు గా మారుస్తున్నారు. చోరీ చేయడం తేలిక కావడం.. కొనేవారూ సిద్ధంగా ఉండటంతో భల్కీ గ్యాంగ్స్ ఏళ్లుగా పల్లె లు, పట్టణ శివార్లలో ని ఆలయాల్లో పురాతన పంచలోహ విగ్రహాలను దొంగతనం చేసి వాటిని ఢిల్లీ, మహారాష్ట్ర ముఠాలకు అమ్మేస్తున్నారు. భల్కీకి చెందిన ముఠాల్లో షేక్ హైదర్ గ్యాంగ్ ఒకటి. గతంలో హైదర్ చాంద్రాయణగుట్టలో దినసరి కూలీగా పనిచేశాడు. ఆ సమయంలో ఇదే ప్రాంతానికి చెందిన ఖాసింతో పరిచయమైంది. కర్ణాటకలో చోరీలు మొదలెట్టి.. ఖాసింతో జట్టు కట్టిన హైదర్ కర్ణాటకలోని బాగల్కోట్, బీజాపూర్ల్లోని 3 దేవాలయాల్లో దొంగ తనాలకు పాల్పడ్డారు. చివరికి పోలీసులకు చిక్కారు. బెయిల్‌పై బయటకొచ్చిన హైదర్ తమ ప్రాంతానికే చెందిన షేక్ ఎజాజ్‌తో జోడీ కట్టాడు. కర్ణాటకలో కేసులు ఉండటంతో ఈ ద్వయం మహారాష్ట్రను టార్గెట్ చేసుకుంది. గతే డాది ఔరంగాబాద్, లాథూర్ జిల్లాలోని ఖిల్లారీ, ఝాన్సీలో దొంగతనాలకు పాల్పడింది. ఈ విగ్రహాలను హైదరాబాద్ తీసుకువచ్చి విగ్రహాల స్మగ్లర్లకు నామమాత్రపు ధరకే అమ్మేసింది. మహారాష్ట్రలో నిఘా పెరగడంతో వీరి కన్ను తెలంగాణపై పడింది. దోమకొండలో సాధ్యం కాకపోవడంతో కామారెడ్డి జిల్లాలోని దోమకొండలో ఓ పురాతన దేవాలయం ఉన్న విషయం తెలుసుకున్న హైదర్, ఎజాజ్ గత శుక్రవారం అక్కడకు చేరుకున్నారు. ఆలయం లోపలకు వెళ్లేందుకు అను మతి లేక తిరిగి వచ్చేశారు. కామారెడ్డిలోనే బస చేసిన ఈ ద్వయం మరుసటి రోజు రాత్రి కామారెడ్డిలోని గోపాలస్వామి ఆలయంలోని వేణుగోపాలస్వామి, రుక్మిణి, సత్యభామల పంచలోహ విగ్రహాలు తస్కరించి హైదరాబాద్ చేరుకున్నారు. ఆ దేవాలయానికి సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని గుర్తించారు. పాత ‘మిత్రుడి’ సమాచారంతో.. పాత నేరగాళ్లపై దృష్టి పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాంద్రాయణగుట్టలో ఉన్న ఖాసింను పిలిపించారు. సీసీ కెమెరాల ఫీడ్‌లోని అనుమానితుల్ని చూపించగా.. హైదర్‌ను గుర్తించాడు. ఈ నేపథ్యంలో ఓ లాడ్జిలో బస చేసిన హైదర్, ఎజాజ్ ఆదివారం పోలీసులకు చిక్కారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న మూడు విగ్రహాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్లు ఉంటుందని తేల్చారు. నిందితులతో పాటు సొత్తును కామారెడ్డి పోలీసులకు అప్పగించారు. -
టెటనస్ వ్యాక్సిన్ల రీ–ప్యాకింగ్ ముఠా గుట్టు రట్టు
-
టెటనస్ వ్యాక్సిన్ల రీ–ప్యాకింగ్
సాక్షి, హైదరాబాద్: చిన్నారులుసహా ప్రతి ఒక్కరూ వినియోగించే టెటనస్(టీటీ) వ్యాక్సిన్ల రీ–ప్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యాంపిల్స్(ఇంజక్షన్ల బుడ్డి) ను ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ప్యాక్ చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళ వారం రాత్రి దాడి చేశారు. దాదాపు రూ.20 లక్షల విలువైన యాంపిల్స్ స్వాధీనం చేసుకు న్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నా రు. డి.సూర్యనారాయణరాజు ఎండీగా, ఆయన కుమారుడు వి.వేణుగోపాలరాజు డైరెక్టర్‌గా ఘట్కేసర్లో డానో పేరుతో కంపెనీ నడుస్తోంది. ఈ సంస్థే టీటీ యాంపుల్స్ను తయారు చేసి ప్యాక్ చేస్తుంది. నిబంధనల ప్రకారం వీటిని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో, పరిశుభ్రమైన వాతావరణంలో, పటిష్టమైన ఏర్పాట్ల మధ్య ప్యాక్ చేయాలి. డానో సంస్థకు అను బంధంగా, వేణుగోపాలరాజు పేరుతో అంబర్‌పేట్‌లోని ఛే నంబర్ వద్ద ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. సంస్థకు అవసరమైన ముద్రణ తోపాటు యాంపిల్స్ ప్యాక్ చేయడానికి అవసరమైన చిన్న అట్ట పెట్టెల్ని ఇక్కడ తయారు చేస్తుంటారు. ఘట్కేసర్లోని సంస్థలో తయారు చేసినవాటిలో సక్రమంగా ప్యాక్ కాని, పూర్తిస్థాయిలో నిండని యాంపిల్స్‌ను నిర్వాహకులు ఇక్కడకు తరలిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఈ ప్రెస్‌లో ఆ యాంపిల్స్‌ను రీ–ప్యాక్ చేసి మళ్లీ కంపెనీకి తరలిస్తున్నారు. ఇలా రీ–ప్యాక్ చేసే సమయంలో ఆ బాటిళ్లపై బ్యాచ్ నంబర్, ఎక్స్పైరీ డేట్ తదితరాలు తెలిపే కవర్లు, స్టిక్కర్లు సైతం ఉండట్లేదు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ తమ బృందాలతో దాడి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు రూ.20 లక్షల విలువైన యాంపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం ఔషధ నియంత్రణ విభాగానికి అప్పగించారు. స్వాధీనం చేసుకున్న నమూనాలపై ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకే అవి ఎంత ప్రమాదకరమో తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు. ప్రాథమికంగా ఈ సంస్థ నిర్వాహకులు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. -
ఆర్డర్ చేస్తే ఇంటికే డాగర్లు, తల్వార్ల డెలివరీ
-
ఆయుధం కావాలా..? ఆన్లైన్ ఉందిగా!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో లభిస్తున్న అక్రమ ఆయుధాల మెనూ ఇదీ. క్యాష్ ఆన్ డెలివరీ, నెలవారీ వాయిదాల పద్ధతుల్లోనూ ఇంటర్నెట్ కేంద్రంగా ఆయుధ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీనిపై కన్నేసిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం 12 మందిని పట్టుకుని, 13 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఈ నిందితులు స్నాప్‌డీల్ నుంచి ఖరీదు చేసినట్లు తేలిందని, ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌పైనా కేసులు నమోదు చేస్తున్నామని డీసీపీ పి.రాధా కిషన్‌రావు తెలిపారు. ఉత్తరాదిని కాపీ కొడుతూ.. పెళ్లిళ్లు, బారాత్‌లతో పాటు పుట్టినరోజు వేడుకల్లో కత్తుల్ని ప్రదర్శించే, డాగర్లను వెంట ఉంచుకుని సంచరించే సంస్కృతి ఒకప్పుడు ఉత్తరాదికి మాత్రమే పరిమితమై ఉండేది. ఇటీవల నగరంలోనూ ఈ విష సంస్కృతి విస్తరిస్తోంది. గతంలోనూ సిటీలో కత్తుల్ని స్వాధీనం చేసుకున్న ఉదంతాలు ఉన్నా వాటిని నిందితులు బీదర్, గుల్బర్గా నుంచి తీసుకొచ్చేవారు. అయితే ఇప్పుడు ఈ–కామర్స్ సైట్ల కారణంగా ఆన్‌లైన్‌లోనూ ఆయుధాలు దొరికేస్తున్నాయి. దీంతో అనేక మంది యువకులు అవసరం ఉన్నా లేకున్నా, చట్టవిరుద్ధమని తెలిసో తెలియకో వీటిని ఖరీదు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు. పెళ్లిళ్లు, బారాత్‌లు, బర్త్‌డే పార్టీల్లో(కేక్ కటింగ్ కోసం) వాటితో పోజులిస్తూ ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల మొదటి వారంలో ఓ ఎంగేజ్మెంట్ బారాత్ ఊరేగింపులో కత్తి విన్యాసం 15 ఏళ్ల సయ్యద్ హమీద్ ప్రాణం తీసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వీటి క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా పెట్టారు. అరెస్టు అయింది వీరే.. మంగళ్‌హట్ పరిధికి చెందిన సూద్ అమన్ సింగ్, తుసాంకునాల్సింగ్, సుధీర్‌సింగ్, మహ్మద్ సల్మాన్, హుస్సేనిఆలం పరిధికి చెందిన మహ్మద్ ముజీబ్, ముస్తాఫా హుస్సేన్, ఛత్రినాక పరిధికి చెందిన శశికాంత్ సింగ్, గోల్కొండకు చెందిన మహ్మద్ యాసీన్అహ్మద్, మహ్మద్ రవూఫ్, హుమాయున్‌నగర్ వాసి సల్మాన్ ఖాన్, బహదూర్‌పురకు చెందిన మహ్మద్ సిరాజుద్దీన్, అంబర్‌పేట వాసి మహ్మద్ సోహైల్‌ను టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. వీరిలో తొమ్మిది మంది పెళ్లిలో అలంకారానికి, సరదా కోసం వీటిని ఖరీదు చేశారు. మహ్మద్ ముజీబ్ సోదరుడిని ఇటీవల కొందరు హత్య చేశారు. దీంతో ఆయుధం కొని తన వద్ద ఉంచుకున్నాడు. మహ్మద్ రవూఫ్‌పై గతంలో హత్యాయత్నం కేసు, సల్మాన్‌పై హుక్కా సెంటర్ నిర్వహణ కేసులు ఉన్నాయి. ‘ఆన్లైన్’ జాబితాలు అధ్యయనం చేసి.. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ ఆన్లైన్ దందాపై దృష్టి పెట్టారు. మూడు నెలల కాలంలో ఆయుధాలను ఆన్లైన్లో ఎవరు ఆర్డర్లు ఇచ్చారు? ఎవరెవరు డెలివరీ తీసుకున్నారు? అనే అంశాలను ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ సోమవారం ఏడు ఠాణాల పరిధిలో దాడులు చేశారు. 12 మంది యువకుల్ని అరెస్టు చేసి 13 మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వీటిని విక్రయించిన స్నాప్‌డీల్ మేనేజింగ్ డైరెక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. హరియాణాలోని గుర్గావ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్నాప్‌డీల్ ఎండీకి నోటీసులు జారీ చేయనున్నామని డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. చిక్కిన వారంతా 20–25 ఏళ్ల మధ్య వయస్కులని, ఇలాంటి వారి దగ్గర ఆయుధాలు ఉంటే బెదిరింపులకు దిగడమే కాకుండా కీలక సందర్భాల్లో వాటిని వినియోగించి ఉద్రిక్తతలకు కారణమవుతారని వివరించారు. ఏ సైట్లో చూసినా.. స్నాప్‌డీల్ మాత్రమే కాదు.. ఏ ఈ–కామర్స్ సైట్లో చూసినా కత్తులు విక్రయానికి సిద్ధంగా ఉంటున్నాయి. రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు వివిధ ఆకృతులు, సైజుల్లో వీటిని విక్రయిస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు పార్శిల్స్ ఇంటికి చేర్చేస్తున్నారు. కొన్ని సైట్లు క్యాష్ ఆన్ డెలివరీ అవకాశాన్నీ ఇస్తున్నాయి. ఆయుధ చట్టం ప్రకారం ఇలా ఆయుధాలను అమ్మడం నేరం. ప్రస్తుతం స్నాప్‌డీల్‌పై ఆధారాలు చిక్కినందుకు దానిపై చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో ఇతర సైట్లకు సంబంధించి ఆధారాలు లభిస్తే చర్యలు తప్పవని డీసీపీ అన్నారు. ఆయుధ చట్టం ప్రకారం 9 అంగుళాల కంటే ఎక్కువ పొడవు, రెండు అంగుళాలకు మించి వెడల్పుతో కూడిన కత్తులు తదితరాలు కలిగి ఉండటం, విక్రయించడం, ఖరీదు చేయడం నేరమే అని ఆయన స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా వస్తున్న వాటినీ ఇంట్లో ఉంచుకోవాలంటే అనుమతి తప్పనిసరి అని అన్నారు. -
వ్యభిచార గృహంపై టాస్క్ఫోర్సు దాడి
విశాఖ క్రైం: నగరంలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని దొండపర్తి సీరపువారి వీధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న కొందరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీరపువారి వీధిలో ఉంటున్న పి.పద్మ, పి.యల్లారెడ్డి కొద్దిరోజులుగా తమ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో మంగళవారం సాయంత్రం ఆ ఇంటిపై ఏసీపీ చిట్టిబాబు ఆధ్వర్యలో దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు విటులతో పాటు కలకత్తాకు చెందిన ఓ యువతిని, నిర్వాహకులను అందుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. వీరి వద్ద నుంచి 4 సెల్ఫోన్లు, రూ.11400 నగదు స్వాధీనం చేసుకుని నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌కు అప్పగించినట్లు చెప్పారు. -
హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ కలకలం రేపింది. భాగ్యనగరాన్ని తమ అడ్డాగా చేసుకుని క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గత కొంతకాలం నుంచి కొంతమంది వ్యక్తులు క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ లు వేస్తున్నారు. దీనిపై నిఘా ఉంచిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. నారాయణగూడ, అబిడ్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో బెట్టింగ్ ముఠా సభ్యులు 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బెట్టింగ్ రాయుళ్ల వద్ద నుంచి రూ. 45 లక్షల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. క్యాష్ కౌంటింగ్ మిషన్, టీవీలు, ల్యాప్ టాప్, సెల్ ఫోన్లు, వాయిస్ రికార్డర్స్, బెట్టింగ్ వస్తువులు స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అరెస్టయిన వారిలో మనోజ్ కుమార్ అగర్వాల్, మహెందర్ కుమార్ కర్వా, రియాజుద్దీన్, యాళ్ల సరేష్ సహా మరికొంత మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి
సాక్షి, తిరుపతి: శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేశారు. మంగళవారం వేకువజామున శ్రీవారి పాదాల సమీపంలో సిబ్బందిపై కత్తులు, రాళ్ళతో దాడికి తెగబడ్డారు. దీంతో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దాడి నుంచి తప్పించుకునేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పారిపోయారు. సంఘటనా స్థలంలో 29 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా పారిపోయిన స్మగ్లర్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. -
కరీం‘నగరం’లో మాయగాడు..
♦ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఘరానా మోసం ♦ కొందరికి అపాయింట్మెంట్ లెటర్లు ♦ ఓ యువతికి ఏకంగా తహసీల్దార్ ఉద్యోగం ♦ సర్వీస్‌బుక్ అందజేత ♦ పలువురికి రూ.17 లక్షల టోపీ ♦ నిందితుడిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు కరీంనగర్ క్రైం: కరీం‘నగరం’లోని ఉద్యోగాల మాయగాడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించి అపాయింట్మెంట్ లెటర్లు ..సర్వీస్ బుక్‌లు అందించి పలువురి నుంచి రూ.17 లక్షల వరకు దండుకున్న బాగోతం బయటపడింది. కరీంనగర్ కమిషనరేట్‌లోని హెడ్‌క్వార్టర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామానికి చెందిన రామగిరి సాయికుమార్(22) సిరిసిల్లలో అగ్రహరం పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా కోర్స్ చేశాడు. చెడు అలవాట్లు, జల్సాలకు అలవాటు పడి అమాయకులను మోసం చేయాలని నిర్ణయించుకుని రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు బాగా పరిచయమని నమ్మించేవాడు. తన తండ్రి కూలీగా పని చేస్తుండగా పెద్ద కోటిశ్వరుడని దుబాయ్‌లో పలు కంపెనీలు ఉన్నాయని తన భార్యతో గొడవలు జరిగి ఇక్కడి వచ్చానని నమ్మించేవాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అందినకాడికి దండుకుని పారిపోవడం పనిగా పెట్టుకున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కో రకంగా మోసం కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన దయ్యాల రజిత అనే డిగ్రీ చదువుతున్న యువతికి కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి రూ.4 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగంలో జాయిన్ చేయిస్తానని చెప్పి అమెను సిరిసిల్ల కలెక్టరేట్‌కు తీసుకెళ్లి అక్కడ సార్ లేరని నీకు జాబ్ ఒకే అయిందని నమ్మించాడు. నెల రోజుల శిక్షణ ఉందని హైదరాబాద్ జీఎంహెచ్‌సీలో ట్రెయినింగ్ ఉందని కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లి అక్కడ తిప్పి వచ్చేవాడు. నెలతర్వాత పదోన్నతి కల్పించారని నమ్మించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ తంగళ్లపల్లి తహసీల్దార్‌గా వచ్చిందని అపాయింట్మెంట్ లెటర్‌తోపాటు సర్వీస్‌బుక్ అందించాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని మళ్లీ పోటీకి వస్తారని వారిని బురిడీ కొట్టించాడు. ఉద్యోగం వచ్చిందని షిర్డీకి వెళ్లి మొక్కుకుని వద్దామని చెప్పి హైదరాబాద్ నుంచి విమానంలో ఔరంగాబాద్ వరకూ అక్కడి నుంచి షిర్డీకి వెళ్లి అక్కడ స్టార్ హోటల్లో బస చేయించాడు. తిరిగి మళ్లీ విమానంలో వచ్చారు. ఇలా లక్ష ఖర్చు చేయించాడు. తహసీల్దార్‌కు కారు ఉండాలని కారు కొనిపించాడు. ఉన్న ఉద్యోగం వదులుకుని.. హైదరాబాద్‌లోని నేరేట్‌మెట్‌కు చెందిన తొంటి పర్శరాములు–అంజలి దంపతులను పరిచయం చేసుకున్నారు. పర్శరాములు ప్రైవేట్ కంపెనీలో నెలకు రూ.30 వేల వేతనంలో పని చేస్తుండగా పర్శరాములుకు జీఎంహెచ్‌సీలో సీనియర్ అసిస్టెంట్‌గా అంజలికి ఇబ్రహీంపట్నం సమీపంలోని బోంగుళూర్ మోడల్ స్కూల్లో జానియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి రూ.3 లక్షలు తీసుకుని వారికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చాడు. స్కూల్‌కు తీసుకెళ్లి అధికారులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆర్డర్ రాలేదని చెప్పడంతో పాఠశాల సమీపంలో నివాసం ఉండాలని చెప్పడంతో ఉన్న ఉద్యోగం వదలి అక్కడే ఉన్నారు. ఎంతకీ ఉద్యోగం రాకపోయే సరికి పోలీసులకు ఆశ్రయించారు. డ్రైవర్ ఉద్యోగం అంటూ.. ముత్త శ్రీౖశైలంను పరిచయం చేసుకొని కొత్తగా సృష్టించిన తహసీల్దార్ వద్ద ప్రభుత్వ డ్రైవర్‌గా అతడి భార్య శరణ్యకు మోడల్ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దానికి రూ. 2.5 లక్షలు ఖర్చ అవుతాయని తెలుపగా రూ.1.30 లక్షలు ముట్టచెప్పారు. కొద్దిరోజులకు శ్రీశైలంనకు తంగళ్లపల్లి తహసీల్దార్‌కు డ్రైవర్‌గా అతడి భార్యకు కరీంనగర్ కలెక్టరేట్లో అటెండర్ ఉద్యోగం వచ్చిందని అపాయింట్మెంట్ లెటర్లు సర్వీస్ బుక్‌లు ఇచ్చాడు. సముద్రాల మోడల్ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చిందని చిమ్మల సంతోష్‌కు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడమే కాకుండా స్కూల్‌కు తీసుకెళ్లి అధికారులకు లెటర్ చూపించాడు. ఎలాంటి ఆర్డర్ రాలేదని అక్కడి వారు చెప్పడంతో మరో రెండుమూడు రోజుల్లో వస్తుందని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. అతడు ఇచ్చిన రూ.1.50 వేలతో జల్సాలు చేసుకొని కొత్తగా కారును కూడా కొనుగోలు చేశాడు. దుబాయి పారిపోయి.. టాస్క్‌ఫోర్స్‌కు చిక్కి.. ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతో సాయికుమార్‌ను నిలదీసి టాస్క్‌ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడికోసం వెతకడంతో విషయం తెలుసుకున్న సాయికుమార్ ఈనెల4వ తేదీన దుబాయి పారిపోయాడు. జల్సాలకు అలవాటు పడడంతో అక్కడ కూడా ఎలాంటి పని చేయలేకపోయాడు. తిరిగి కరీంనగర్ రాగా పక్కా సమాచారంతో శుక్రవారం టాస్క్‌ఫోర్స్ ఎస్సైలు కిరణ్, సంతోష్, నాగరాజు పట్టుకున్నారు. సాయికుమార్‌పై అప్పటికే కరీంనగర్ టుటౌన్ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు, బెజ్జంకి పీఎస్‌లో ఒకటి, నేరేడుమెట్ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదు అయింది. అరెస్టు చేసి రిమాండ్ పంపుతున్నట్లు సీపీ తెలిపారు. నకిలీలను నమ్మవద్దు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఒక క్రమపద్ధతి ప్రకారం భర్తీ చేస్తారని డబ్బు ఇస్తే ఎలాంటి ఉద్యోగాలు రావని తెలిపారు. ఇలాంటి నకిలీలను నమ్మి మోసపోద్దన్నారు. చివరకు అటెండర్ జాబు రావాలన్నా కూడా ఒక పద్ధతిగా భర్తీ ఉంటుందని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. టాస్క్‌ఫోర్స్‌కు రివార్డులు మహామాయగాడిని చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సీఐ గౌస్‌బాబా, ఎస్సైలు కిరణ్, సంతోష్, నాగరాజులను సీపీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందించారు. – సీపీ కమలాసన్‌రెడ్డి -
రాజధానికి విదేశీ ‘దమ్ము’
- భారీగా విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా - ఓ ముఠాను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు - రూ.19 లక్షల విలువైన సిగరెట్లు సీజ్ సాక్షి, హైదరాబాద్: బంగారం... ఎలక్ట్రానిక్ వస్తువులు... మాదకద్రవ్యాలు... అక్రమ రవాణా పేరు చెప్పగానే ఇవే గుర్తుకొస్తాయి. నగరానికి చెందిన కొన్ని ముఠాలు మాత్రం కొన్నాళ్లుగా సిగరెట్లను స్మగ్లింగ్ చేస్తున్నాయి. ఏటా రూ.వందల కోట్ల విలువైన సరుకు ‘దిగుమతి’చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి ఓ ముఠాను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్టు డీసీపీ బి.లింబారెడ్డి సోమవారం వెల్లడించారు. వీరి నుంచి రూ.19 లక్షల విలువైన బంగ్లాదేశ్ తయారీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బంగ్లాదేశ్ టు సిటీ వయా మెట్రోస్... నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో ప్యారిస్ బ్రాండ్‌కు చెందినవి ఎక్కువగా ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఇవి తయారవుతున్నది బంగ్లాదేశ్‌లో. అక్కడ నుంచి నేరుగా కాకుండా... కోల్‌కతా, ఢిల్లీల మీదుగా రైలు మార్గంలో హైదరాబాద్‌కు వచ్చిపడుతున్నాయి. బేగంబజార్‌కు చెందిన మహ్మద్ హస్నుద్దీన్ ఈ అక్రమ సిగరెట్ల దందాలో ఆరితేరాడు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి వీటిని ఖరీదు చేస్తున్నాడు. వివిధ రకాల పేర్లతో రైళ్లలో పార్సిల్ అవుతున్న వీటిని తన ఏజెంట్లు ఎజాజ్ అలీ, అలీ రజాల ద్వారా నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి బేగంబజార్‌కు తెప్పించుకుంటున్నాడు. ఒక్కో ప్యాకెట్ రూ.20కి ఖరీదు చేస్తున్న హస్నుద్దీన్... మార్కెట్లో రూ.30కి విక్రయిస్తుండగా... వినియోగదారులకు రూ.40కు చేరుతోంది. ఎక్కడా బిల్లులు లేకుండా ఈ దందా సాగడంతో ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ఒకటికి ఒకటిన్నర డ్యూటీ... ఆరోగ్యానికి హానికరమైన, స్థానికంగా ఉండే వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం భారీగా విధిస్తోంది. ఈ సిగరెట్లపై ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే బంగ్లాదేశ్ నుంచి అక్రమ మార్గంలో వస్తున్న సిగరెట్లను కోల్‌కతా, ఢిల్లీలకు చెందిన వ్యాపారులు దేశ వ్యాప్తంగా వివిధ నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఇలా వెలుగులోకి.. సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇటీవల గుట్కా వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి రైలులో గుట్కా వస్తోందనే సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద కాపుకాసింది. ఎజాజ్, రజాలను పట్టుకుని వారు ఆటోలో తరలిస్తున్న పార్సిల్స్‌ను తనిఖీ చేయగా... రూ.19 లక్షల విలువైన 48 వేల ప్యారిస్ సిగరెట్లు బయటపడ్డాయి. ఆరా తీయగా... అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో వ్యాపారి హస్నుద్దీన్ కోసం అధికారులు గాలిస్తున్నారు. -
ఆసుపత్రిపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటలో ఉన్న అరుణశివరాం ఆసుపత్రిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు పరిశీలనకు వచ్చారు. విచారణలో భాగంగా లింగ నిర్దారణ పరీక్షలు చేసినట్లు ల్యాబ్ అసిస్టెంట్ ఒప్పుకున్నారు. లింగ నిర్దారణ పరీక్షలు చేయడం నేరమని, ఇటువంటి పనులకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని నగర సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. -
ముందు ‘పైలట్’.. వెనుక ‘ట్రాన్స్పోర్ట్’!
- పకడ్బందీగా గంజాయి అక్రమ రవాణా - విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు సరఫరా - ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు - పరారీలో మరో ముగ్గురు సాక్షి, హైదరాబాద్: నగరంలో వరుసగా పట్టుబడుతున్న డ్రగ్స్ ముఠాలు, పెరిగిన పోలీసు నిఘా నేపథ్యంలో స్మగ్లర్లు కొత్త పంథా అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా ‘పైలట్... ట్రాన్స్పోర్ట్’ విధానంలో అక్రమ రవాణా అవుతున్న 240 కిలోల గంజాయిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. రెండు వాహనాలు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలి స్తున్నారు. నల్లకుంటకు చెందిన రవి, ఖానాజీ గూడ వాసి కృష్ణ, ఎల్బీనగర్కు చెందిన మధు, అంబర్‌పేటవాసి నరేశ్, భువనగిరి వాసి వెం కన్న ఓ ముఠాగా ఏర్పడ్డారు. 9 నెలలుగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తక్కువ ధరకు రెండు కార్లలో తీసుకువచ్చి మహారాష్ట్రలో హోల్‌సేల్‌గా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. గడిచిన పది రోజులుగా పంథా మార్చి రెండు వాహనాల్లో ఒక దాన్ని పైలట్‌గా, మరోదాన్ని గంజాయి రవాణాకు వినియోగిస్తున్నారు. రెండు వాహనాల మధ్య గరిష్టంగా రెండు కిలో మీట ర్ల దూరం ఉండేలా పథకం వేశారు. పోలీసుల కదలికలు, తనిఖీలను గుర్తించే పైలట్ వాహ నం లోనివారు వెనుక వస్తున్న వాహనంలోని వారికి సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తారు. విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చే ఈ గ్యాంగ్ రెండు వాహనాలను కొన్ని గంటలపాటు ఫీవర్ ఆస్పత్రి వద్ద పార్కింగ్‌లో ఉంచుతారు. ఆపై అదును చూసుకుని ముందుకు వెళ్తారు. దీనిపై ఇటీవల వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసు లకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వం లోని బృందం ఈ ముఠాపై నిఘా ఉంచింది. శుక్ర వారం ఈ గ్యాంగ్ విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. రొటీన్‌కు భిన్నంగా హైటెక్ సిటీ సమీపంలో వాహనాలు నిలుపుకున్నారు. ఓ కారులో 240 కిలోల గంజాయి నింపుకున్నారు. సాంకేతిక ఆధా రాలను బట్టి ఈ రెండు వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఆపితే వెనుక వచ్చే రవాణా వాహనం తప్పించుకునే అవకాశం ఉందని భావించారు. దీంతో నార్సింగి టోల్గేట్ దగ్గర కాపుకాసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు పైలట్ వాహనాన్ని విడిచిపెట్టి వెనుక వస్తున్న వాహనాన్ని ఆపారు. తనిఖీ చేయగా అందులో 240 కిలోల గంజాయి పార్శిల్స్ లభించాయి. వాహనం నడుపుతున్న నరేశ్‌తోపాటు అందులో ఉన్న మధును అరెస్టు చేశారు. వెనుక వస్తున్న వాహనం కనిపించక పోవడంతో కొద్దిదూరం వెళ్లిన పైలట్ వాహనంలోని రవి, కృష్ణ వాహనాన్ని ఓఆర్ఆర్పై వదిలి పరారయ్యారు. దీంతో ఈ కారునూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వీరిద్దరితోపాటు వెంకన్న కోసమూ గాలిస్తున్నారు. -
బిస్కెట్లు.. విత్తనాలు.. స్టాంప్స్ కాదేదీ డ్రగ్స్‌కు అనర్హం!
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల సరఫరాదారులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు అన్వేసి స్తున్నారు. యాసిడ్ డైథైలామెడ్(ఎల్ఎస్డీ) డ్రగ్‌ను బిస్కెట్లుగా.. లైసర్జిక్ యాసిడ్ ఎమైడ్ (ఎల్ఎస్ఏ) డ్రగ్‌ను విత్తనాల రూపంలో సరఫరా చేస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. బిస్కెట్లు, విత్తుల రూపంలో డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఇద్దరు నల్లజాతీయులతో పాటు మొత్తం ఆరుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించారు. గోకర్ణలో ఏర్పడిన పరిచయాలతో.. కూకట్‌పల్లికి చెందిన ఎన్.రఘువంశీధర్రెడ్డి బీటెక్ పూర్తి చేసిశాడు. 2015లో బెంగళూరు వెళ్లిన ఇతగాడు అక్కడో కాల్ సెంటర్లో విధు లు నిర్వర్తించాడు. అక్కడ గంజాయి, ఎల్ఎస్డీ, కొౖకైన్, ఎండీఎంఏ(ఎక్స్టసీ) అలవాటయ్యా యి. ఏప్రిల్‌లో కర్ణాటకలోని గోకర్ణ ప్రాంతానికి వెళ్లిన వంశీధర్‌రెడ్డికి.. అక్కడ బెంగళూరుకు చెందిన క్రిస్టోఫర్‌తో పరిచయమైంది. అతడి ద్వారా పరిచయమైన వారి నుంచి ఒక్కో ఎల్ఎస్డీ స్టాంప్‌ను రూ.వెయ్యికి ఖరీదు చేసి రూ.1,500 నుంచి రూ.2 వేలకు విక్రయించే వాడు. ఎల్ఎస్ఏ విత్తనాలు, చెరస్ తదితర డ్రగ్స్‌నూ కొనిఅమ్మేవాడు. డార్క్ నెట్ నుంచి మరికొన్ని.. వంశీధర్‌కు సికింద్రాబాద్, కూకట్‌పల్లికి చెందిన అభినవ్ మహేంద్ర, వి.మల్లికార్జున్‌రావుతో పరి చయం ఏర్పడింది. వీరిద్దరూ డార్క్ నెట్లో ఉండే టోర్ బ్రౌజర్ వినియోగించి యూరోపి యన్ దేశాల నుంచి డ్రగ్స్ ఖరీదు చేస్తున్నారు. ఎస్‌ఎల్‌డీ డ్రాప్స్‌తో కూడిన బిస్కెట్లతో పాటు ఎల్ఎస్ఏ సీడ్స్, ఎండీఎంఏ, కొకైన్ పోస్టల్లో ఇక్కడకు రప్పిస్తున్నారు. వీటిని గ్రాము రూ.4 వేలకు కొంటూ కొంత వినియోగిస్తూ.. మరికొంత వంశీధర్‌తో పాటు ఇతరులకు విక్రయిస్తున్నారు. ఇక గోవాలో పరిచయమైన నల్లజాతీయుడు చికా అలియాస్ జాక్ ద్వారానూ డ్రగ్స్ ఖరీదు చేసి అమ్ముతున్నాడు. హుక్కాతో మొదలై డ్రగ్స్ వరకు.. మరో డ్రగ్స్ గ్యాంగ్‌ను కూడా బుధవారం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. న్యూబోయగూడకు చెందిన పి.రేవంత్ బీటెక్ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో హుక్కా సెంటర్లకు వెళ్లే ఇతగాడికి ఆ తర్వాత గంజాయి అలవాటైంది. తరచు గోవా వెళ్లే రేవంత్‌కు అక్కడ కొకైన్, ఎండీఎంఏ, చెరస్, ఎల్ఎస్డీ అలవాటయ్యాయి. అక్కడ తక్కువ ధరకు వీటిని ఖరీదు చేసి.. నగరానికి తీసుకువచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తూ పెడ్లర్‌గా మారాడు. డ్రగ్స్ విక్రయిస్తూ గతేడాది జనవరిలో టాస్క్‌ఫోర్స్‌కు చిక్కి జైలుకెళ్లాడు. నెల క్రితం గోవా వెళ్లిన రేవంత్ 20 ఎల్ఎస్డీ స్టాంపులు ఖరీదు చేసి.. సైఫాబాద్‌కు చెందిన నజీబ్ ఖాన్, లక్డీకపూల్ వాసి జైన్ ఖాన్‌కు అమ్మాడు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం వీరిని పట్టుకుని 11 ఎల్ఎస్డీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం మొదటి గ్యాంగ్‌కు చెందిన ఆరుగురిని బంజారాహిల్స్ పోలీసులకు, రెండో గ్యాంగ్‌ను సైఫాబాద్ పోలీసులకు అప్పగిస్తున్నామని డీసీపీ బి.లింబారెడ్డి తెలిపారు. ముఠాను పట్టుకుంటే మరొకరు.. డ్రగ్స్‌ను ఎక్కువగా విక్రయించాలని భావించిన వంశీధర్.. చికా, అభినవ్, మల్లికార్జున్‌కు ఒకేసారి ఆర్డర్ ఇచ్చాడు. బుధ వారం వీరంతా బంజారాహిల్స్ రోడ్ నం.12 లోని ఓ రెస్టారెంట్ సమీపంలో కలుసుకున్నా రు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేసి ఐదుగురినీ అదుపు లోకి తీసుకున్నారు. మణికొండలో నివసిస్తున్న మరో నైజీరియన్ లక్కీ ఇదే వ్యాపారం చేస్తున్నట్లు చికా విచారణలో వెల్లడించడంతో అతడినీ పట్టుకున్నారు. వీరి నుంచి 300 గ్రాముల కొకైన్, 42 గ్రాముల ఎండీఎంఏ, 5 ఎల్ఎస్డీ స్టాంప్స్, 11 ఎల్ఎస్ఏ విత్తనాలు, కారు స్వాధీనం చేసుకున్నారు. -
స్కానింగ్‌కు ఫాయిల్‌తో చెక్!
- విదేశాల నుంచి పోస్టులో వస్తున్న డ్రగ్స్ - స్కానింగ్‌కు చిక్కకుండా సిల్వర్ ఫాయిల్స్‌లో ప్యాక్ - టాస్క్‌ఫోర్స్ దర్యాప్తులో వెలుగులోకి కీలకాంశాలు సాక్షి, హైదరాబాద్: టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన డ్రగ్స్ గ్యాంగ్ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. వంశీధర్‌కి ఎల్ఎస్డీ డ్రగ్ సరఫరా చేసిన మల్లికార్జున్‌రావు ఇప్పటి వరకు మూడుసార్లు డార్క్‌నెట్ వినియోగించి జర్మనీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసినట్టు వెల్లడైంది. వర్చువల్ కరెన్సీ అయిన బిట్ కాయిన్స్‌ను ఆన్లైన్లో ఖరీదు చేసి వాటి ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేస్తున్నాడని తేలింది. బిట్ కాయిన్ విలువ ప్రస్తుతం భారత కరెన్సీలో రూ.1.65 లక్షలు ఉందని పోలీసులు చెప్తున్నారు. సిల్వర్ ఫాయిల్స్‌లో పార్శిల్.. ఆర్డర్లు తీసుకునే జర్మనీ, యూరోపియన్ దేశాల్లో ఉన్న డ్రగ్స్ సరఫరాదారులు వాటిని కొరియర్, పోస్టల్ ద్వారానే ఇక్కడకు పంపిస్తున్నారు. ఒక్కో దఫా గరిష్టంగా 200 గ్రాములు మాత్రమే ఖరీదు చేస్తుండటంతో ఆ మేరకు పార్శిల్ చేస్తున్నారు. ఎల్ఎస్డీ బిస్కెట్స్, ఎల్ ఎస్ఏ విత్తులతో ఇబ్బంది లేక పోయినా.. కొకైన్, ఎల్ఎస్డీ స్టాంపుల్ని విమానాశ్రయాల్లో స్కాన్ చేసినప్పుడు గుర్తించే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే స్కానింగ్‌కు చిక్కకుండా ఉండేందుకు వీటిని సిల్వర్ ఫాయిల్స్‌లో పార్శిల్ చేస్తున్నట్లు వెల్లడైంది. మల్లికార్జున్ వీటిని డెలివరీ చేయడానికి ఓ కిరాణా దుకాణం యజమాని చిరునామా ఇచ్చాడు. అభివన్‌కు సహకరించిన బాబీ.. డార్క్‌నెట్ ద్వారా అభినవ్ మహేందర్ కూడా డ్రగ్స్ ఖరీదు చేశాడు. ఈ వ్యవహారాల్లో ఇతడికి శశికాంత్ చర్ల అలియాస్ బాబీ సహాయకారిగా ఉన్నాడు. బాబీ చెరస్ అనే మాదక ద్రవ్యాన్నీ తీసుకువచ్చి అభినవ్‌కు అప్పగించేవాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కస్సోల్ లో లభించే ఈ చెరస్ కోసం తరచు అక్కడకు వెళ్లేవాడు. ప్రస్తుతం అక్కడే ఉన్న ఇతడిని సిటీకి వచ్చిన తర్వాత అరెస్టు చేయాలని టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్ణయించారు. మల్లికార్జున్, అభినవ్ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి విక్రయించే వంశీధర్ నిత్యం తన వెంట ఓ ఎయిర్‌గన్ ఉంచుకునేవాడు. డ్రగ్స్ క్రయవిక్రయాల దగ్గర ఎదుటి వారిని బెదిరించడానికి దీనిని వినియోగించే వాడని తేలింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన చికా 2012లో బిజినెస్ వీసాపై గోవా వచ్చాడు. ప్రస్తుతం అక్కడే వస్త్రవ్యాపారం చేస్తున్నాడు. నైజీరియాకు లక్కీ 2014లో స్టూడెంట్ వీసాపై ముంబై వచ్చాడు. 2016 వరకు ఢిల్లీలోని ఛత్రపతి కాలేజ్‌లో బీఎస్సీ (పెట్రో కెమికల్స్) చేశాడు. ప్రస్తుతం మణికొండలో స్నేహితుడితో కలిసి నివసిస్తున్నాడు. చికా, లక్కీ ఇద్దరూ వీసా గడువు ముగిసినా భారత్‌లోనే ఉంటున్నట్లు గుర్తించారు. చికా గోవాతో పాటు ముంబై, హైదరాబాద్‌ల్లో తరచు సంచరిస్తూ పబ్స్, హోటల్స్, రెస్టారెంట్స్‌లో డ్రగ్స్ అమ్మే వాడని వెల్లడైంది.