- నిర్వాహకురాలితో పాటు ఐదుగురు సెక్స్ వర్కర్ల అరెస్టు
గోల్కొండ: గుట్టుగా వ్యభిచారం చేస్తున్న ఓ ముఠాను పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా వరుసగా రెండవ రోజు కూడా టోలిచౌకి పరిసరాల్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు కావడం చర్చనీయాంశంగా మారింది. టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజా వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గోల్కొండ పీఎస్ పరిధిలోని మినీ గుల్షన్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో గురువారం రాత్రి ఇన్‌స్పెక్టర్ రాజా వెంకట్‌రెడ్డి తన సిబ్బందితో ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా నాయకురాలితో పాటు ఐదుగురు సెక్స్ వర్క్‌ర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా వ్యభిచార ముఠావారు బొంబాయ్ నుంచి డ్యాన్స్‌ర్లను తీసుకువచ్చి వారిచే బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. కాగా తదుపరి విచారణ నిమిత్తం కేసును గోల్కొండ పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ వారి నుంచి ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ యువతులను రెస్కూ హొమ్‌కు తరలించామని గోల్కొండ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ ఫయాజ్ తెలిపారు.
వ్యభిచార ముఠా గుట్టురట్టు
Published Thu, May 19 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM
Advertisement
Advertisement