
– రూ.55,52,500 విలువైన నోట్లు స్వా«దీనం
హైదరాబాద్: రద్దయిన పాత నోట్లు నగరంలో కలకలం రేపాయి. వీటిని మార్పిడి చేసేందుకు యత్నిస్తున్న నిందితులను సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న ఘటన ఆదివారం అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్‌హౌజ్‌కు చెందిన సయ్యద్ ముజమ్మిల్ హుస్సేన్ టెంట్‌హౌస్ నడుపుతూ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు.
ఆ తర్వాత 2006లో సౌదీ అరేబియా వెళ్లి 2019లో తిరిగి వచ్చాడు. ఆ మధ్యకాలంలో అతడు ఆదాయ పన్నును ఎగవేసేందుకు పాత కరెన్సీని పెద్ద ఎత్తున దాచిపెట్టాడు. దాన్ని మార్పిడి చేసేందుకు అప్పట్లో అనేక ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఇటీవలి కాలంలో మళ్లీ నోట్ల మార్పిడికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ తర్వాత అతడి సహచరుడు అమ్జద్‌ఖాన్ మధ్యవర్తుల ద్వారా పాతనోట్ల మారి్పడికి ప్రయత్నించారు.
ఇందుకోసం లంగర్‌హౌజ్‌కు చెందిన అహ్మద్‌ఖాన్, పాల్తీ భాస్కర్‌రావు, షేక్ నసీమాలతో పరిచయం చేసుకున్నారు. వీరికి 5 శాతం కమీషన్ ఇస్తామని అంగీకరించి మార్కెట్లో కస్టమర్ల కోసం వెతుకుతున్నారు. ఈ నెల 15న అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్ వద్ద రద్దయిన కరెన్సీని మార్చేందుకు ప్రయతి్నస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి మొత్తం రూ.55,52,500 విలువైన పాత కరెన్సీ నోట్లు, 4 సెల్‌ఫోన్లను అబిడ్స్ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. దాడిలో పాల్గొన్న సెంట్రల్‌జోన్ టాస్‌్కఫోర్స్ సిబ్బందిని డీసీపీ వైవీఎస్ సు«దీంద్ర అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment