
స్పెషల్ టాస్‌్కఫోర్స్ దాడుల్లో వెలుగులోకి..
సాక్షి, హైదారాబాద్/అబిడ్స్ : హోలీ సంబరాలను సొమ్ము చేసుకొనేందు కు గంజాయి విక్రేతల ముఠా కొత్త పన్నాగం పన్నింది. హోలీ వేడుకల్లో భాగంగా శుక్రవారం లోయర్ ధూల్‌పేట్‌లో కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, బర్ఫీ స్వీట్లకు సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 100 కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, 72 బర్ఫీ స్వీట్లు, సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి కుల్ఫీ ఐస్‌క్రీమ్‌ల్లో గంజాయిని కలిపి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయితో తయారైన వీటిని స్వా«దీనం చేసుకుని, సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment