Ice Cream
-
ఐస్‌క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ 'మహువా మొయిత్రా' (Mahua Moitra).. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy)లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసుకున్నారు. అయితే తనకు డెలివరీ చేసిన ఐస్‌క్రీమ్ పాడైపోయిందని.. తన ఎక్స్ (Twitter) ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింలో వైరల్ అవుతోంది.ఎంపీ మహువా మొయిత్రా.. గత రాత్రి స్విగ్గీని సోషల్ మీడియా పోస్ట్‌లో ట్యాగ్ చేసి ఆమె ఆర్డర్ చేసిన ఖరీదైన ఐస్‌క్రీమ్‌ల డెలివరీ సమస్యలను ఫ్లాగ్ చేశారు. 50 ఏళ్ల మొయిత్రా తనకు అందిన ఐస్‌క్రీమ్‌లు పోయిందని, అది తినడానికి కూడా ఏ మాత్రం బాగాలేదని పేర్కొన్నారు.నేను ఖరీదైన మైనస్ థర్టీ మినీ స్టిక్స్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసాను. కానీ అది పాడైపోయింది. త్వరలో రీఫండ్ లేదా రీప్లేస్మెంట్ చేయాలనీ ఆశిస్తున్నాను, అని స్విగ్గీని ట్యాగ్ చేస్తూ.. మహువా మొయిత్రా జనవరి 16న రాత్రి 10.15 గంటలకు ట్వీట్ చేశారు. ఈ ఫిర్యాదుపై స్విగ్గీ నిమిషాల వ్యవధిలో స్పందించి.. ఆమె ఆర్డర్ నెంబర్‌ను అడిగింది. మొయిత్రా అవసరమైన వివరాలను షేర్ చేశారు. ఎంపీ ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్ విలువ రూ. 1200.Sorry @Swiggy -you’ve got to up your game. Unacceptable that I ordered expensive Minus Thirty mini sticks ice cream & it arrives spoilt and inedible. Expecting a refund or replacement asap .— Mahua Moitra (@MahuaMoitra) January 16, 2025ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు మొయిత్రాను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. నేను ఎంపీని అయినంత మాత్రమే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయకూడదా అని సమాధానమిస్తూ.. దయచేసి ప్రజా ప్రతినిధులు సాధారణ వ్యక్తులు కాదు, అనే ఆలోచన నుంచి బయటపడండి, అని పేర్కొన్నారు.నెటిజన్ల స్పందనకొన్ని నిమిషాల్లోనే కరిగిపోయే ఫుడ్ ఎప్పుడూ ఆర్డర్ చేయకూడదు, మీకు సమీపంలో ఎక్కడైనా స్టోర్ ఉంటే.. అక్కడే కొనుగోలు చేసుకోవడం మంచిదని ఒకరు పేర్కొన్నారు. ఇలాంటి ఘటన తనకు కూడా ఎదురైందని.. అయితే భారీ ట్రాఫిక్ సమస్యల కారణంగా ఐస్‌క్రీమ్ కొంత పాడైందని అర్థం చేసుకున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: క్షమించండి.. మళ్ళీ ఇలా జరగదు: జొమాటో సీఈఓ -
ఐస్‌క్రీమ్ బిర్యానీ...!
మీరు సరిగ్గానే చదివారు. ఐస్ క్రీమ్ బిర్యానీనే. బిర్యానీ అంటేనే మసాలా. ఇక ఐస్‌క్రీమ్.. తీపి. ఈ రెండింటికీ అభిమానులు ఎంతో మంది. అలాంటిది ఆ రెండు డిషెస్‌ను కలిపితే.. రుచెలా ఉంటుంది? రుచి సంగతి తెలియదు కానీ.. ఈ బిర్యానీని ముంబైకి చెందిన మహిళా కంటెంట్ క్రియేటర్ హీనా కౌసర్ తయారు చేశారు. వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశారు. ఫొటోలో ఉన్న విధంగానే... హుండీలో బిర్యానీ... మధ్యలో స్ట్రాబెర్రీ ఐస్క్రీ స్కూప్. రెండు హుండీలను పట్టుకుని ఆమె వీడియోలో కనిపిస్తున్నారు. సాధారణంగా మసాలాలతో బంగారు వర్ణంలో ఘుమఘుమలాడే బిర్యానీ.. ఐస్‌క్రీమ్ రంగును పులుముకుని గులాబీ రంగులో మెరిసిపోతోంది. ఆ వీడియో ఇప్పుడు వైరలవుతోంది. ఆహార ప్రియులను విస్మయానికి గురిచేస్తోంది. హీనా సృజనాత్మకత ప్రత్యేకమైనదే అయినప్పటికీ, ఈ ప్రయోగం చాలా మంది ఆహార ప్రియులను అయోమయానికి గురిచేసింది. కంటెంట్ క్రియేటర్ హీనా బేకింగ్ అకాడమీని కూడా నడుపుతున్నారు. తన అకాడమీలో ఏడు రోజుల బేకింగ్ కోర్సు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో భాగంగా ఈ ఫ్యూజన్ డిష్‌ను తయారు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిర్యానీ-ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్ ఎప్పుడైనా ట్రై చేశారా..?
ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారెవరుంటారు. అయితే ఇప్పుడు వాటిలో రకరకాల ప్లేవర్లు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. వాటిలో కొన్ని టేస్ట్ బానే ఉన్నా చాలావరకు అంత బాగోవు. పండ్లు నుంచి స్వీట్స్‌తో తయారు చేసే ఎన్నో ఐస్‌క్రీంలు చూశాం కానీ ఇలాంటి ప్లేవర్డ్ ఐస్‌క్రీం మాత్రం చూసుండరు. అదికూడా అందరూ ఇష్టపడే బిర్యానీతో ఐస్‌క్రీం అంటే బాబోయ్ అనిపిస్తుంది కదూ..!. ఎలా ఉంటుందనే కదా డౌటు..?ఆకాశ్ మెహతా అనే సోషల్ మీడియా ఔత్సాహికుడు నెట్టింట ఒక రీల్ పోస్ట్ చేశాడు. అందుకోసం అని ఓ దుబాయ మాల్లోని ఐస్‌క్రీం స్టాల్లో వివిధ ఫ్లేవర్డ్ల ఐస్క్రీంలను ట్రై చేశాడు. ఆ దుకాణంలోని మెనూలో తనకు నచ్చిన కొన్ని ఐస్‌క్రీంలు సెలక్ట్ చేసుకున్నాడు. వాటి పేర్లు వరుసగా కెచప్, చిప్స్, బిర్యానీ, ఆలివ్ ఆయిల్, చాయ్ వంటి ఫ్లేవర్డ్ ఐస్‌క్రీంలు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ట్రై చేసి చూస్తున్నాడు. ముందుగా కెచప్ రుచి చూడగా..ఎలా ఉందనేది చెప్పలేను అని అన్నాడు. ఇక బిర్యానీ ప్లేవర్ చూడగానే ఈ ఐస్‌క్రీం కచ్చితంగా హిట్ అవుతుందని కితాబు ఇచ్చేశాడు. ఇక ఆలివ్ అద్భుతం అని, చిప్స్ ఆశ్చర్యపరిచేలా ఉందని, చాయ్ ఐస్‌క్రీం మాత్రం తనకిష్టమైన ఫ్లేవర్ అంటూ ఆ ఐస్క్రీంల రుచుల గురించి చెప్పుకొచ్చాడు. కానీ నెటిజన్లుమాత్రం ఇవేం ఐస్‌క్రీం ఫ్లేవర్డ్లు అని ఆకాశ్ పోస్ట్‌కి కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Akash Mehta (@mehta_a)(చదవండి: ‘బైక్ పింక్ సర్వీస్': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!) -
వెయిట్ లాస్ స్టోరీ: ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు..!
నిజ జీవితంలో బరువు తగ్గి చూపించిన వ్యక్తుల స్టోరీలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అబ్బా ఎంతలా అంకుంఠిత దీక్షతో బరువు తగ్గారు అనే ఫీల్ వస్తుంది. గ్రేట్ అనిపిస్తుంది కూడా. బరువు తగ్గాలనేకునే వాళ్లు ముఖ్యంగా డైట్లో షుగర్‌కి సంబంధించిన వాటికి దూరంగా ఉంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఐస్‌క్రీం తింటూ 16 కిలోలు తగ్గాడు. అదెలా అనే కదా..!. అలా ఎలా సాధ్యమయ్యింది? నిజంగానే ఐస్‌క్రీం తింటూనే బరువు తగ్గాడా అంటే..?.ఒక్కొక్కరు ఒక్కో విధమైన డైటింగ్ స్లైల్ ఉంటుంది. ఇక్కడ మిట్ సునాయ్ అనే 28 ఏళ్ల వ్యక్తి ఫిబ్రవరిలో తాను అధిక బరువు ఉన్నట్ల గుర్తించినట్లు తెలిపాడు. అలాగే వైద్యపరీక్షల్లో కొలస్ట్రాల్ స్థాయిలు కూడా అధికంగా ఉన్నాయని తెలియడంతో ఫిట్‌నెస్‌పై దృష్టిసారించినట్లు చెప్పుకొచ్చాడు. అందుకోసం సరైన జీవనశైలిని పాటిచడం తోపాటు సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు చెప్పాడు. రెగ్యులర్‌గా వ్యాయామం, అన్ని రకాల పదార్థాలను మితంగా తీసుకునేలా మనసును సిద్ధం చేసుకుని డైట్ ప్రారంభించినట్లు తెలిపాడు. అయితే తన బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడింది నడక అని చెబుతున్నాడు. తాను రోజూ పదివేల అడుగులు వేసేలా చూసుకునే వాడట. అలా అన్ని స్టెప్లు నడిస్తేనే.. ఐస్‌క్రీం తినాలనే లక్ష్యం ఏర్పరుచుకున్నట్లు వివరించారు. అలా అందుకోసమైన ఏ రోజు స్కిప్ చేయకుండా చేయగలిగానని చెబుతున్నాడు సునాయ్. ఆ విధంగా దాదాపు 150 రోజుల్లో అంటే.. ఐదు నెలల్లో సుమారు 16 కిలోలు పైనే బరువు తగ్గగలిగానంటూ తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. అలాగే డైట్లో ముఖ్యంగా తాను ఇష్టపడే దాల్, రోటీ, అన్నం, పండ్లు, పిజ్జా, పాస్తా, పనీర్ కర్రీ, పనీర్ టిక్కా, శాండ్విచ్లు, స్మూతీస్ వంటివి అన్ని మితంగా తీసుకునేవాడనని అన్నాడు. ఇక్కడ మనకిష్టమైన ఫుడ్‌ని దూరం చేయకుండానే అవి తింటునే వర్కౌట్లతో కెలరీలు తగ్గించుకుంటూ బరువు తగ్గొచ్చని చెబుతున్నాడు మిట్ సినాయ్. బరువు తగ్గడం అంటే నోరు కట్టేసుకోవాల్సిందే అని భయపడే వాళ్లకు సునాయ్ వెయిట్ లాస్ స్టోరీ ఓ ఉదహరణ.(చదవండి: కాస్మటిక్స్తో అర్లీ ప్యూబర్టీ ..! బాల్యపు ఛాయ వీడక ముందే ఇలా..!) -
విస్కీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు
-
Hyderabad: డెలీషియస్ గోల్డ్ ఐస్‌క్రీం అంటే అట్లుంటది.. మన హైదరాబాద్‌తోని!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అంటేనే వైవిధ్యానికి ఆలవాలం. ఆహర్యంతోపాటు ఆహారంలోనూ విభిన్నతకు అది వేదిక. రకరకాల రుచులకు అడ్డా. ఫుడ్ లవర్స్‌కు స్వర్గధామం. ఇక్కడ హైదరాబాదీ బిర్యానీయే కాదు.. దక్షిణ, ఉత్తర భారత సంప్రదాయ వంటకాలు, వెస్టర్న్ ఫుడ్, చైనీస్, జపనీస్.. ఇలా ఎన్నో దేశాల ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. అలా వారాంతంలో కాస్త డిఫరెంట్ ఫుడ్ తినాలనుకోవాలే కానీ.. దానికి కొదువే ఉండదు. అట్లుంటది మన హైదరాబాద్‌తోని. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే... బంగారం ఏమైనా తింటామా.. ఏంటి? అని ఎవరైనా మాట వరుసకు అనేవారు ఒకప్పుడు.కానీ, ఇప్పుడు బంగారాన్ని కూడా తినేస్తున్నారండోయ్. గోల్డ్ దోశ, గోల్డ్ ఇడ్లీ, గోల్డెన్ స్వీట్స్.. ఇలా బంగారపు పూత ఉన్న ఫుడ్ ఐటెమ్స్‌ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ వరుసలోకి ఐస్‌క్రీం కూడా వచ్చి చేరింది. హైదరాబాద్‌లో కూడా గోల్డ్ ఐస్‌క్రీం కూడా దొరుకుతోందా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మన నగరంలో అచ్చు 24 క్యారెట్ల గోల్డ్ ఐస్‌క్రీం లభిస్తోంది. అదెక్కడ అంటారా? మాదాపూర్‌లోని హూబర్, హోలీలో ఈ ఐస్క్రీంను అందుబాటులోకి తీసుకొచ్చారు. మైటీ మిడాస్ పేరుతో ఈ ఐస్క్రీంను అమ్ముతున్నారు. ఖరీదు జస్ట్.. రూ.1,179. సాధారణ కోన్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో సర్వ్ చేస్తుంటారు. ఐస్‌క్రీం పైన 24 క్యారెట్ల గోల్డ్ పేపర్‌తో అందంగా ముస్తాబు చేసి మనకు అందజేస్తారు. ఇంకేముంది.. ఇక మోస్ట్ డెలీషియస్ ఐస్క్రీంను ఆరగించేయడమే. -
Rajni Bector: ఓ విజేత ప్రస్థానం
రజనీ బెక్టార్... సమైక్య భారతంలోని కరాచీ నగరంలో 1940లో పుట్టారామె. తండ్రి అకౌంటెంట్ జనరల్. తండ్రి ఉద్యోగరీత్యా కొంతకాలం లాహోర్‌లో పెరిగారు. ఆమెకు ఏడేళ్లు నిండేలోపే దేశవిభజన జరిగింది. రజని కుటుంబం భారతదేశానికి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఢిల్లీలోని మిరిండా హౌస్‌లో చదువుకుందామె. కాలేజ్ చదువు పూర్తయ్యేలోపే లూథియానాలోని ఒక వ్యాపార కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టింది. ఆమె జీవితంలో కీలకమైన ఘట్టాలు జరిగాయి. గానీ అప్పటికి ఆమె వయసు పదిహేడే. చదువు పూర్తికాకముందే పెళ్లికి తలవంచాల్సి రావడంతో కలిగిన ఆ అసంతృప్తే ఆమెను ఇప్పుడు విజేతగా నిలిపింది. లూథియానాలో అడుగుపెట్టినప్పటి నుంచి పద్మశ్రీ అవార్డు అందుకునే వరకు సాగిన ఆమె విజయయాత్రను సంతోషంగా గుర్తు చేసుకుంటున్నారామె.ఓ కొత్త ప్రపంచం ‘‘నేను లూథియానాకి వచ్చేనాటికి అది చాలా చిన్న పట్టణం. ఢిల్లీ నుంచి వచ్చిన నాకు లూథియానాను పట్టణం అనడానికి కూడా మనసొప్పేది కాదు. పట్టణం మొత్తానికి నాలుగు కార్లుండేవి అంతే. మా అత్తగారింటివాళ్లు ఛాందసులు. మా పుట్టింట్లో అమ్మ వైపు, నాన్న వైపు వాళ్లందరూ ఉన్నత విద్యావంతులు, విశాల దృక్పథం కలిగిన వాళ్లు. అత్తగారిల్లు– పుట్టిల్లు ఒకదానికొకటి పూర్తిగా భిన్నం. దాంతో నేను కొత్త మనుషుల మధ్యకు మాత్రమే కాదు, ఏకంగా కొత్త ప్రపంచంలోకి వచ్చి పడ్డాననే చెప్పాలి. వంటతో స్నేహంనాకు రకరకాలు వండడం, కొత్త వంటలను ప్రయత్నించడం హాబీ. ఆ హాబీయే నాకు పెద్ద ఆలంబన అయింది. స్నేహితులను, బంధువులను ఇంటికి ఆహ్వానించడం వారికి చేసి పెట్టడం, వారు ప్రశంసిస్తుంటే పొంగిపోవడమే జీవితంగా మారిపోయాను. హీరో మోటార్ కార్పొరేషన్‌కు చెందిన బ్రిజ్మోహన్ ముంజాల్, ఎవన్ సైకిల్స్ కంపెనీకి చెందిన పహ్వాస్లు ‘లూథియానా ప్రజలకు మంచి వంటలను రుచి చూపిస్తున్నావ్’ అన్నారు. అప్పటి ఎమ్ఎల్ఏ ఒకరు తన మనుమరాలి పెళ్లికి కేటరింగ్ చేసి పెట్టమని అడిగారు. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. స్థాణువులా ఉండిపోయాను. ఎలాగో ధైర్యం చేసి అంగీకారంగా తలూపాను. ఇద్దరు అసిస్టెంట్ల సాయంతో రెండు వేల మందికి వంటలు చేయించాను. ఆ తర్వాత స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఏ వేడుక జరిగినా నాకు కబురు వచ్చేది. అయితే అవేవీ కమర్షియల్ సర్వీస్‌లు కాదు, స్నేహపూర్వక సర్వీస్లే. కొంతకాలానికి ఇంట్లోనే కుకరీ క్లాసులు మొదలు పెట్టాను. అప్పుడు మా అత్తగారు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఇంట్లో మగవాళ్లు వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నారు, నువ్వు క్లాసులు చెప్పి సంపాదించాల్సిన అవసరం ఏమొచ్చింది’ అని కోప్పడ్డారు. మా వారు నాకు మద్దతుగా నిలవడంతో ఆ పెనుతుఫాను సమసిపోయింది. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జైన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన సలహాతో అందులో ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్, బేకరీ కోర్సులో చేరాను. పిల్లలు కొంచెం పెద్దయి బోర్డింగ్ స్కూల్‌కెళ్లిన తర్వాత నేను కాలేజ్‌లో చేరడంతో ఇంట్లో నాకు ఎటువంటి ఇబ్బందీ రాలేదు. యూనివర్సిటీలో అడుగు పెట్టగానే నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. పెళ్లి కారణంగా చదువాపేసినప్పటి నుంచి మనసులో దాగి ఉన్న దిగులు ఒక్కసారిగా ఎగిరిపోయింది. కోర్సు పూర్తి కాగానే మా వారిచ్చిన ఇరవై వేలతో 1978లో క్రిమికా ఐస్‌క్రీమ్ యూనిట్ ప్రారంభించాను. ‘క్రీమ్ కా’ అనే అర్థంలో పెట్టానా పేరు. లూథియానాలో క్వాలిటీ ఐస్‌క్రీమ్ స్టాల్ పక్కన నేను స్టాల్ తెరిచాను కాని క్వాలిటీ ఐస్‌క్రీమ్‌ను కాదని మా యూనిట్‌కి ఎవరైనా వస్తారా అనే భయం చాలా రోజులు వెంటాడింది. అయితే నేను స్టాల్లో కూర్చోవడం లూథియానాలో మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఇంట్లో మగ్గిపోకుండా బయటకు వచ్చి ఏదైనా సాధించాలనే తపన ఉన్న వాళ్లందరూ తమ ఇంట్లో వాళ్లను ఒప్పించడానికి నన్ను మోడల్‌గా చూపించేవారు. నా ఐస్‌క్రీమ్‌కి కూడా ఆదరణ పెరగసాగింది.ఐస్‌క్రీమ్‌తో మొదలు బిస్కట్ వరకు క్వాలిటీని కాదని మా స్టాల్‌కి రావాలంటే వాళ్లకంటే ఎక్కువగా చేయాలి. ఐస్‌క్రీమ్‌తోపాటు బ్రెడ్, బిస్కట్ వంటి బేకరీ ఫుడ్ చేయడం మొదలు పెట్టాను. మా స్టాల్‌ను విస్తరించి జీటీ రోడ్లోకి మార్చాం. అంతా గాడిలో పడిందనుకునే సమయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ మొదలైంది. పంజాబ్ అట్టుడికిపోయింది. అనంతరం దేశం మొత్తాన్ని కుదిపేసిన దుర్ఘటన ఇందిరాగాంధీ హత్య జరిగింది. అప్పటికి వందేళ్ల నుంచి మా కుటుంబం చేస్తున్న ధాన్యం, ఎరువుల వ్యాపారం స్తంభించిపోయింది. రైతులతో సంబంధాలు తెగిపోయాయి. బెదిరింపులు ఎక్కువయ్యాయి. మా పెద్దబ్బాయి మీద అపహరణ ప్రయత్నం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆ వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అంటే.. 1990 నుంచి నా ఫుడ్ బిజినెస్సే ఇంట్లో అందరికీ ఫుడ్ పెట్టింది. ఇంట్లో అందరమూ క్రిమికా కోసమే పని చేయడం మొదలుపెట్టాం. పదహారు గంటల పని ఇప్పుడు క్రిమికాకు సంబంధించిన రోజువారీ బాధ్యతలేవీ లేవు. కానీ కీలకమైన సమయాల్లో రోజుకు పదహారు గంటలు పనిచేశాను. ఆహారం మీద నాకున్న ప్రత్యేకమైన అభిరుచే నన్ను ఈ రంగంలోకి తీసుకొచ్చింది. విజేతగా నిలబెట్టింది. నేను నా టేస్ట్బడ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. క్వాలిటీ చెక్‌లో భాగంగా ప్రతిదీ రుచి చూడాలి. కేవలం రుచి మాత్రమే చూడాలి. కడుపు నిండా తినకూడదు. కడుపు నిండితే రుచిని గ్రహించే శక్తిని కోల్పోతాం. ఆ నియమం పాటిస్తేనే విజయం మనదవుతుంది. ఈ దేశంలో జీవించాలని వచ్చాం. ఇక్కడే సవాళ్లనెదుర్కొన్నాం. జీవితాన్ని వెతుక్కున్నాం. మూడేళ్ల కిందట పద్మశ్రీ పురస్కారం అందుకున్నాను. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది’’ అన్నారు రజనీ బెక్టార్. మెక్‌డీ బర్గర్లో మా బన్నుమెక్ డొనాల్డ్ ఫుడ్ చైన్ మనదేశంలో అడుగుపెట్టింది. వాళ్లకు అవసరమైన బన్ కోసం బేకరీలన్నింటినీ సందర్శించారు. మా బేకరీని ఎంపిక చేసుకున్నారు. అయితే వారికి కావల్సిన నియమాలు, పరిమితులకు లోబడి తయారు చేసి ఇవ్వడానికి ఒక ఏడాదిపాటు ఎక్సర్సైజ్ చేశాం. మధ్యప్రదేశ్‌లో పండే నాణ్యమైన గోధుమల పిండితో చేసిన బన్ వారి ఆమోదం పొందింది. మొదట్లో కొంత నష్టం వచ్చినప్పటికీ క్వాలిటీ కంట్రోల్ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఇక మాకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత మెక్‌డీకి అవసరమైన సాస్ ΄్లాంట్ కూడా పెట్టాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతోపాటు విదేశాల్లో కూడా వేగంగా విస్తరించగలిగాం. టర్నోవర్ ఏడు వేల కోట్లకు చేరింది. మా ముగ్గురబ్బాయిలు బాధ్యతలు పంచుకుని వ్యాపారాన్ని కొనసాగించారు. ఇప్పుడు మూడవ తరం అడుగుపెట్టింది. మా మనుమడు ఢిల్లీ మార్కెట్ మీద దృష్టి పెట్టాడు. -
ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు : కంపెనీ లైసెన్స్ రద్దు
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటనలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పందించింది. వివాదానికి కారణమైన ఐస్‌క్రీమ్ తయారీదారు లైసెన్సును రద్దు చేసింది. దీనిపై దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) అధికారులు శుక్రవారం పుణేకు చెందిన ఐస్‌క్రీమ్ యూనిట్లను సందర్శించారు. నమూనాలను సేకరించారని అధికారులు తెలిపారు. అనంతరం ఫార్చ్యూన్ డెయిరీకి చెందిన యమ్మో కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేసినట్టు పూణే రీజియన్ ఎఫ్‌డిఎ జాయింట్ కమిషనర్ సురేష్ అన్నపురే తెలిపారు. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రాలేదని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఐస్‌క్రీంలో ఆ ‘ముక్క’ చూసి డాక్టర్‌కు కక్కొచ్చినంత పనైంది!తన సోదరి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కనిపించిందంటూ ముంబైలోని మలద్ ప్రాంతానికి చెందిన వైద్యుడు బ్రెండన్ ఫిర్రావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం కోన్ ఐస్‌క్రీమ్ తింటుండగా గట్టిగా ఏదో తగిలింది. వెంటనే అనుమానం రావడంతో దాన్ని పరిశీలించి చూడగా చిన్న మాంసపు ముక్క కనిపించింది. ఇది చూసి షాకైన ఫిర్రావ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కంపెనీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దీంతో మలద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆ ముక్కను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. దీనికి సంబంధించిన వివరాలను ఫిర్రావ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ స్టోరీ నెట్టింట్ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.. -
ప్రాసెస్డ్ ఫుడ్స్.. ఆరోగ్యం మటాష్
సాక్షి, అమరావతి: ప్రాసెస్డ్, అల్డా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురి పెద్దల్లో ఒకరు, ప్రతి 8మంది చిన్నారుల్లో ఒకరిని ప్రాసెస్డ్ ఫుడ్ వ్యసనపరులుగా మారుస్తోంది. ఐస్‌క్రీమ్, కూల్ డ్రింక్స్, రెడీ మీల్స్ (రెడీ టు ఈట్), ప్రాసెస్ చేసిన మాంసపు ఉత్పత్తులతో క్యాన్సర్, బరువు పెరుగుదల, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా సంభవిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 36 దేశాలకు చెందిన 281 అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అడిక్షన్’ ప్రమాదాలను కనుగొన్నారు. మొత్తం జనాభాలో 14 శాతం మంది పెద్దలు, 12 శాతం మంది చిన్నారులు నిత్యం ప్రాసెస్డ్ ఆహారాన్ని మాత్రమే భుజిస్తున్నట్టు బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో తేలింది. మద్యంతో సమానం ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు అతిగా తీసుకునే వారిలోనూ, ఆల్కాహాల్ తీసుకున్న వ్యక్తులలోనూ మెదడు స్ట్రియాటమ్‌లో ఎక్స్ట్రా సెల్యులర్ డోపమైన్‌ను ఒకే స్థాయిలో ప్రేరేపిస్తున్నట్టు తేల్చారు. తద్వారా తీవ్రమైన కోరికలు, స్థూలకాయం, తిండిపై నియంత్రణ లేకపోవడం, అతిగా తినే రుగ్మత, శారీరక–మానసిక అనారోగ్యం తదితర ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. యూకే, యూఎస్‌లలో సగటు వ్యక్తి ఆహారంలో సగానికిపైగా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగిస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అసమతుల్య ఆహారాన్ని తీసుకోవడంతో వైద్యం, పర్యావరణ కోసం ఏడాదికి 7 ట్రిలియన్ డాలర్లకుపైగా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా స్థూలకాయం, నాన్–కమ్యూనికేబుల్ వ్యాధులు ఉన్నత, మధ్య ఆదాయ దేశాలలో గణనీయంగా పెరిగాయి. పట్టణీకరణ, జీవనశైలిలో మార్పులతోపాటు స్త్రీ, పురుషుల ఉద్యోగాలు, ప్రయాణ సమయాలు పెరగడంతో కొన్ని దేశాల్లో అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం ఎక్కువగా ఉంది. ప్రాసెస్ చేసిన జంతు ఆధారిత ఉత్పత్తులు, నూడుల్స్, కృత్రిమ స్వీటెనర్లతో కార్డియో వాసు్కలర్, కార్డియో మెటబోలిక్ కోమోర్చిడిటీలు 9శాతం పెరుగుతోంది. అయితే రొట్టెలు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత ఉత్పత్తులు వంటి ఇతర అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలను కలిగి ఉండవని నివేదించింది. పౌష్టికాహార భద్రత లోపం ఇప్పటికే ఆసియా, లాటిన్ అమెరికాల్లో అత్యంత ప్రాసెస్‌తోపాటు సహా ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరుగుతోంది. ఇది ఆఫ్రికాకు కూడా వేగంగా వ్యాపిస్తోంది. అయితే కోవిడ్–19కి ముందు స్థాయిల కంటే చాలా ఎక్కువగా ఉంది. తద్వారా పౌష్టికాహార లోపం భయపెడుతోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 29.6 శాతం మంది (240 కోట్ల మంది ప్రజలు) 2022లో తీవ్రంగా ఆహార భద్రతను ఎదుర్కొన్నారు. వీరిలో దాదాపు 90 కోట్ల మంది (11.3 శాతం మంది) ఆహార అభద్రతలో తీవ్రంగా కూరుకుపోయారు. ఇక 2030లో దాదాపు 60 కోట్ల మంది దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో బాధపడతారని ఐక్యరాజ్య సమితి సైతం ఆందోళన చెందుతోంది. తొమ్మిది దక్షిణాసియా దేశాలలో పోషకాహార లోపం (24 కోట్ల మంది)లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తర్వాత భారతదేశం మూడవ స్థానంలో ఉంది. భారత్‌లో పోషకాహార లోపం 2004–06లో 21.4 శాతం నుంచి 2020–22 నాటికి 16.6కి తగ్గింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కడికక్కడ లభిస్తున్నాయి. నగరం/పట్టణం నుంచి 1–2 గంటలు, అంతకంటే ఎక్కువ ప్రయాణ సమయం ఉన్న గ్రామాల్లోనూ ఈ ఆహార విధానం వృద్ధి చెందడం ఆందోళన కలిగిస్తోంది. -
14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
సంక్షోభంలో అవకాశాల్ని ఎలా సృష్టించుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే పీహెచ్‌డీలు చేయాల్సిన అవసరం లేదు. రోజూ వారి నిత్యం మన నిజ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశంలోనూ ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉంటుంది. దాన్ని మనం గుర్తించాలి. సరైన సమయంలో దాన్ని ఒడిసిపట్టుకుంటే అవకాశాలు అనంతం. చేతిలో డిగ్రీ లేదు. జేబులో చిల్లిగవ్వలేదు. కానీ జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో నాడు 14ఏళ్ల వయస్సులో రైలెక్కి మంగళూరు నుంచి ముంబైకి వెళ్లిన రఘునందన్ కామత్ నేడు ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అవతరించారు. ఎవరీ రఘునందన్ కామత్. మామిడి పండ్ల వ్యాపారి కుటుంబంలోగత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ కామత్ అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళూరులోని ఓ కుగ్రామంలో మామిడి పండ్ల వ్యాపారి కుటుంబంలో జన్మించిన కామత్.. నేడు రూ.400 కోట్ల విలువైన నేచురల్స్ అనే ఐస్ క్రీం కంపెనీ అధిపతిగా పేరు గడించారు. ఆయన ప్రయాణం ఎలా సాగింది?శ్రమ నీ అయుధం అయితే ఐస్ క్రీం మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు సంపాదించిన రఘునందన్ శ్రీనివాస్ కామత్ చిన్న నాటి 14 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మామిడి పండ్ల వ్యాపారం చేసే తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నారు. చెట్టు మీద మామిడి పండ్లను కోయడం దగ్గర నుంచి అమ్మడం వరకు తెలుసుకున్నారు. అయితే, మామిడి పండ్ల వ్యాపారంలో మెళుకువలు తెలుసుకున్న కామత్‌కు బుర్ర నిండా ఆలోచనలే. శ్రమ నీ అయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని నమ్మే ఆయనకు ఐస్‌క్రీం బిజినెస్ చేయాలని కోరిక ఆ వయస్సులో బలంగా నాటుకుంది.రైలు ఎక్కి ముంబైకిఐస్క్రీం బిజినెస్ అంటే కృత్తిమ ఫ్లేవర్లు, లేదంటే పాలు, షుగర్,ఐస్‌తో చేయడం కాకుండా రకరకాల పండ్లతో ఐస్‌క్రీం తయారు చేసే వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా 1984లో మంగళూరు నుండి రైలు ఎక్కి ముంబైకి పయనమయ్యారు. అక్కడే ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న తన సోదరుడి వద్దకు వెళ్లారు. అదే రెస్టారెంట్లో కామత్ పనికి కుదిరారు. రోజులు గడుస్తున్నాయి. వ్యాపారలో మెళుకువలు నేర్చుకున్నారు.ఆలోచనలు మెదడును తొలిచేస్తుంటేమామిడి, అరటి పండు, పుచ్చకాయ ఇలా రకరకాల పండ్లతో ఐస్‌క్రీమ్‌లను ఎందుకు తయారు చేయకూడదు? అలా తయారు చేస్తే కస్టమర్లకు నచ్చుతుందో? లేదో? ఇలా రకరకలా ఆలోచనలు మెదడును తొలిచేస్తుంటే.. ఉండబట్టలేక పావు బాజీ ప్రధాన వంటకంగా, మరోవైపు పండ్లతో ఐస్‌క్రీమ్‌లను అమ్మడం ప్రారంభించారు. 12 రుచులతోఅలా రఘునందన్ శ్రీనివాస్ కామత్ ముంబై జుహు అనే ప్రాంతంలో తన తొలి ఐస్ క్రీమ్ పార్లర్‌ను కేవలం ఆరుగురు సిబ్బందితో, 12 రుచులతో ప్రారంభించాడు. అప్పట్లో, దీనిని తరచుగా కస్టమర్లు ఐస్ క్రీమ్ ఆఫ్ జుహు స్కీమ్ అని పిలిచేవారు.మూడు పువ్వులు ఆరు కాయలుగారోజులు గడుస్తున్నాయి. వ్యాపారం జోరందుకు. కామత్ ఐస్‌క్రీమ్‌కి మౌత్ పబ్లిసిటీ ఎక్కువైంది. 37ఏళ్లలో ఇంతింతై వటుడింతై అన్న చందగా ప్రస్తుతం, నేచురల్స్ ఐస్ క్రీమ్ 15 నగరాల్లో 165కి పైగా అవుట్లెట్లతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. -
‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ కన్నుమూత
దేశంలోని అగ్రశ్రేణి ఐస్ క్రీమ్ బ్రాండ్లలో ఒకటైన నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్ కన్నుమూశారు. 70 ఏళ్ల వయసులో శుక్రవారం సాయంత్రం ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ తుది శ్వాస విడిచారు.రఘునందన్ శ్రీనివాస్ కామత్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన.. ఎన్నో కష్టాలు పడి దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకదానిని నిర్మించారు. కర్ణాటకలోని మంగళూరు తాలూకాలో ముల్కి అనే పట్టణంలో తన కెరీర్‌ను ప్రారంభించిన కామత్, నేచురల్స్ ఐస్‌క్రీమ్‌ను స్థాపించి ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందారు. నేడు దీని విలువ సుమారు రూ. 400 కోట్లు.రఘునందన్ శ్రీనివాస్ కామత్ తండ్రి పండ్ల వ్యాపారి. చిన్నతనంలో పండ్ల వ్యాపారంలో తన తండ్రికి సహాయం చేసేవాడు. అలా పండ్ల గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని పెంచుకున్న కామత్ 14 సంవత్సరాల వయస్సులో తన గ్రామాన్ని విడిచి ముంబైకి పయనమయ్యాడు. 1984లో కేవలం నలుగురు సిబ్బంది, కొన్ని ప్రాథమిక పదార్థాలతో ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా నేచురల్స్ ఐస్‌క్రీమ్ పుట్టింది. -
ఓటర్లకు అల్పాహారం, ఐస్‌క్రీమ్
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్థానిక దుకాణదారులు వినూత్న ప్రయత్నం చేశారు. '56 దుకాణ్' దుకాణదారుల సంఘం ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లకు ఉచిత అల్పాహారం, ఐస్‌క్రీమ్‌లు అందించారు.నగరంలోని 56 దుకాణ్ మార్కెట్లోని దుకాణాల వద్ద అల్పాహారం తీసుకునేందుకు ఓటర్లు బారులు తీరి కనిపించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, దేవాస్, ఉజ్జయిని, మందసౌర్, రత్లాం, ధార్, ఖర్గోన్, ఖాండ్వాతో సహా ఎనిమిది పార్లమెంటు స్థానాలలో నాలుగో దశలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది."ఇండోర్ ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఓటింగ్‌లో కూడా మేము ప్రత్యేకంగా నిలుస్తాం. ఓటర్లకు ఉచితంగా అల్పాహారం అందించాం. తద్వారా వారు త్వరగా బయటకు వచ్చి ఓటు వేయవచ్చు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఇక్కడి ఓటర్లందరికీ పోహా, జిలేబీ వంటి ఇష్టమైన అల్పాహారాన్ని అందిస్తున్నాం" అని 56 దుకాణ్లోని షాప్ యజమాని శ్యామ్‌లాల్ శర్మ చెప్పారు. ఓటర్లలో అవగాహన పెంచి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని ఆయన అన్నారు. -
ఐస్‌క్రీమ్‌తో బరువు తగ్గొచ్చా?: దీపికా పదుకొనే ఫిట్నెస్ ట్రైనర్
ఐస్‌క్రీమ్‌లలో షుగర్ ఎంత ఉంటుందో తెలిసిందే. బరువు తగ్గాలనుకునేవారు వాటిని అస్సలు దగ్గరకు రానియ్యరు. అయితే దీపిక పదుకొనే ఫిట్నెస్ ట్రైయినర్ మాత్రం ఐస్‌క్రీమ్‌లను ఆస్వాదిస్తూ బరువు తగ్గొచ్చని చెబుతోంది. అందుకోసం ఏం చేయాలో సవివరంగా చెప్పడమే గాకుండా ఆ ఐస్‌క్రీమ్‌లను ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలిపింది. సెలబ్రిటీ ఫిట్నెస్ శిక్షకురాలు యాస్మిన్ కరాచీవాలా ఐస్క్రీంని ఇలా చేసుకుని తింటే కచ్చితంగా బరువు తగ్గుతారని చెబుతోంది. అదేంటి ఐస్‌క్రీంతో బరువు తగ్గడమా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే హెల్తీగా చేసుకుని తింటే కచ్చితంగా బరవు తగ్గుతారని అంటోంది యాస్మిన్. ఆమె కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపీక పదుకొనే వంటి బాలీవుడ్ ప్రముఖుల ఫిట్నెస్ ట్రైనర్ ఆమె. ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడిని వారంటూ ఉండరు. ఫిట్నెస్ మెయింటెయిన్ చేయడం కోసం ఐస్‌క్రీమ్‌ని త్యాగం చేయాల్సిన పనిలేదంటోంది యాస్మిన్. బరువు తగ్గేలా ఐస్క్రీంని చేసుకుని తింటే చాలని చెబుతోంది. ఇలా చేస్తే ఆరోగ్యానకి ఆరోగ్యం, మంచి ఫిట్నెస్ కూడా మీ సొంతమని నమ్మకంగా చెబుతోంది. ఇంతకీ ఎలా చేయాలంటే..?కావాల్సిన పదార్థాలు..యాపిల్స్:4డార్క్ చాక్లెట్ సిరప్: తగినంతమాపుల్ సిరప్బిట్స్ వాల్నెట్లుఐస్క్రీం మౌల్డ్లుతయారీ విధానం: నాలుగు యాపిల్స్‌ని తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కరిగించిన డార్క్ చాక్లెట్‌ని తీసుకోవాలి. దీన్ని ఉడికించిన యాపిల్ ముక్కల్లో వేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ వచ్చేలా మాపుల్ సిరఫ్ వేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఐస్‌క్రీం మౌల్డ్‌లలో పోసి అలంకరణగా వాల్నెట్లు వేసి డీప్ ఫ్రీజ్‌లో పెట్టండి అంతే ఆరోగ్యకరమైన ఐస్‌క్రీం డెజర్ట్ రెడీ. పైగా ఇందులో ఎలాంటి షుగర్ వినయోగించ లేదు కాబట్టి బరువు పెరుగుతామన్న భయం ఉండదు. అందులో ఉండే యాపిల్స్ బరువుని అందుపులో ఉంచుతుంది. పైగా రుచి రచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి ఐస్‌క్రీమ్ డెజర్ట్‌ని మీరు కూడా ట్రై చేయండి. View this post on Instagram A post shared by Yasmin Karachiwala | Celebrity Fitness Instructor (@yasminkarachiwala)(చదవండి: వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?) -
ఓటు వేస్తే టిఫిన్, తొలిసారైతే ఐస్‌క్రీమ్ కూడా..
దేశంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ఓటు కోసం ఓటరు దేవుళ్లను వేడుకుంటున్నారు. అదేసమయంలో ఎన్నికల సంఘంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఓటు విలువపై అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్థానిక స్వచ్ఛంద సంస్థలు, దుకాణాలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. మే 13న ఇండోర్‌లో ఓటింగ్ జరగనుంది. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహం అందించేందుకు స్థానిక ఫుడ్ మార్కెట్లలో ప్రత్యేక రాయితీలు అందిస్తున్నారు. మరోవైపు వేసవిని దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు ఉపశమనం కలిగించేలా ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. ఓటింగ్ జరిగే రోజున ఓటర్లకు ఉచితంగా ఐస్ క్రీం, పోహా, జలేబీ, శీతల పానీయాలు, ఇతర తినుబండారాలు అందించనున్నారు. ఈ ఆఫర్లలో వివిధ కేటగిరీలు, ఎంపికలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం వివిధ దుకాణాలకు ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే ఓటర్లు ఈ విధమైన ప్రయోజనం పొందేందుకు తమ ఓటరు కార్డుతో పాటు వారి వేలిపై ఇంక్ గుర్తును చూపించాల్సి ఉంటుంది.అంతే కాదు తొలిసారి ఓటు వేయబోతున్న యువతకు ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించారు. పోలింగ్ జరిగే రోజున ఉదయం 9 గంటలలోపు ఓటు వేసే యువత, సీనియర్ సిటిజన్లకు పోహా, జిలేబీ, ఐస్ క్రీంలను ఉచితంగా అందించనున్నారు. అలాగే మంచూరియా, నూడుల్స్ కూడా ఉచితంగా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఇండోర్‌లోని కొన్ని షాపింగ్ మాల్స్‌లో పోలింగ్ జరిగే రోజున పలు వస్తువులపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. -
అర్థరాత్రి నడి రోడ్డుపై నయనతార.. వీడియో వైరల్
కొందరు సెలబ్రిటీల చిన్న చిన్న కోరికలు ఆసక్తిగా ఉంటాయి. అలాంటి వారిలో నటి నయనతార ఒకరు. ఈ లేడీ సూపర్‌స్టార్ జీవితమే సంచలనం అని చెప్పవచ్చు. అన్నింటికీ మించి మనోధైర్యం నిండుగా ఉన్న నటి. కాకపోతే తన జీవితంలో ఎదురైన అవరోధాలను తట్టుకుని, ఈ స్థాయికి చేరుకునేవారే కాదు. వృత్తిని, వ్యక్తిగతాన్ని చాలెంజ్‌గా తీసుకుని, అత్యున్నత స్థాయికి చేరుకున్న నటి నయనతార. నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, ఇల్లాలిగా, పిల్లలకు తల్లిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఈ సంచలన తార ఇప్పటికీ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయినా కానీ చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడంలో ఇప్పటికీ వెనుకాడడం లేదు. రెండు దశాబ్ధాలుగా అగ్ర కథానాయకిగా కొనసాగుతున్న ఈ కేరళ భామ తల్లిదండ్రులు ఇప్పటికీ కేరళలోని కొచ్చిలోనే నివసిస్తున్నారన్నది తెలిసిందే. కాగా ఇటీవల తన తండ్రి కురియన్ పుట్టిన రోజు సందర్భంగా నయనతార కుటుంబ సమేతంగా కొచ్చికి వెళ్లారు. కాగా ఇటీవల ఒక రోజు అర్ధరాత్రి భర్తను, పిల్లల్ని వదిలి ఆ సమీపంలోని ఎంజీ రోడ్డుకు వచ్చారు. అంత అవసరం ఏమోచ్చిందంటారా? అక్కడ రోడ్డు పక్కన ఉన్న ఐస్‌క్రీమ్ కొట్టుకు వెళ్లి ఐస్‌క్రీమ్ కొనుక్కొని హాయిగా తినడం మొదలెట్టారు. విశేషం ఏమిటంటే ఆ ప్రాంతంలో నయనతార భారీ కటౌట్ ఒకటి ఉంది. దాన్ని చూస్తూ నయనతార ఐస్‌క్రీమ్ తిన్నారు. అంతటి సెలబ్రిటీ అర్ధరాత్రి నడిరోడ్డుపై నిలబడి ఐస్‌క్రీమ్ తింటుంటే ఎవరి కంటా పడకుండా ఉంటుందా? అలా కొందరు అభిమానులు అక్కడికి వచ్చి ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో నయనతారను విష్ చేశారు. ఈమె కూడా వారితో ముచ్చటించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలు అంత రాత్రిపూట ఆమెకు ఐస్‌క్రీమ్ తినాలని అనిపించడం ఏమిటీ, ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయటకు రావడం ఏమిటీ? అనే ఆశ్చర్యాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. 🎥 pic.twitter.com/CdjCKle1bv — Nayanthara✨ (@NayantharaU) April 4, 2024 -
లాక్మే ఫ్యాషన్ వీక్ : స్పెషల్ ఎట్రాక్షన్‌గా టాలీవుడ్ హీరో, ఫోటోలు వైరల్
ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న లాక్మే ఫ్యాషన్ వీక్ 2024 ఈ నెల (మార్చి) 17 ఆదివారం దాకా జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో మార్చి 13న ప్రారంభమైన ఈ ఫ్యాషన్ వీక్‌లో రకరకాల థీమ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. View this post on Instagram A post shared by Lakmē Fashion Week (@lakmefashionwk) మాగ్నమ్ ఐస్ క్రీం డిప్పింగ్ బార్ థీమ్ సెలబ్రిటీలు సందడి చేశారు. మాగ్నమ్ డిప్పింగ్ బార్లో తమ ఫ్యావరేట్ను ఫ్లావర్ను ఆస్వాదించారు. ఈ సెలబ్రిటీస్‌లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. తనకిష్టమైన ఐస్‌క్రీమ్‌ను ఎంజాయ్ చేస్తూ స్టయిలిష్ లుక్‌లో ఆకర్షణీయంగా నిలిచారు. లాక్మే ఫ్యాషన్ వీక్ 2024లో సస్టైనబిలిటీ డేలో ప్రముఖ నటి, మోడల్, మాజీ మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ దియా మీర్జా మెరిసింది. -
కూతురితో నారాయణ మూర్తి - ఫన్ మిస్ అయిన రిషి సునాక్!
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు 'నారాయణ మూర్తి' ఇటీవల తన కుమార్తె 'అక్షతా మూర్తి'తో కలిసి బెంగళూరులోని ఒక ఐస్‌క్రీమ్ పార్లర్లో సాధారణ వ్యక్తుల మాదిరిగానే ఐస్‌క్రీమ్ తింటూ కనిపించారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వైపు బ్రిటన్ ప్రథమ మహిళ, మరో వైపు టెక్ దిగ్గజం ఇద్దరూ చాలా సింపుల్‌గా కనిపించిన ఫోటో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోను ఒక ఎక్స్ (ట్విటర్) యూజర్ షేర్ చేస్తూ.. బెంగళూరులోని జయనగర్ 5వ బ్లాక్‌లోని 'కార్నర్ హౌస్'లో బ్రిటన్ ప్రథమ మహిళ అక్షతా మూర్తి తన తండ్రి నారాయణమూర్తితో కలిసి ప్రశాంతంగా ఐస్‌క్రీమ్ తింటున్నారు. ధనవంతులైనప్పటికీ సాధారణ వ్యక్తులు మాదిరిగా జీవితం గడుపుతున్నారు. ఇదే నారాయణమూర్తి గొప్పతనం అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో నారాయణ మూర్తి, అక్షతా మూర్తి ఇద్దరూ క్యాజువల్ దుస్తులు ధరించి ఉండటం చూడవచ్చు. ఇందులో రిషి సునాక్ పేరు కూడా ట్యాగ్ చేసి మీరు ఈ ఫన్ మిస్ అయ్యారు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసి పలువురు నెటిజన్లు వీరి సింప్లిసిటీకి ఫిదా అయిపోతున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి Britain's First Lady Akshata Murty with her Father Shri Narayan Murthy at Corner House in Jayanagar 5th block Bangaluru... Place was packed.... they came quietly and bought their ice cream . Rich but live a common life . This the greatness that Mr @Infosys_nmurthy carries along.… pic.twitter.com/QhYLikRbns — Devi Singh (@devipsingh) February 12, 2024 -
ఈ క్రిస్మస్ వేళ..సరదాగ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ట్రైం చేయండిలా!
ఐస్‌క్రీమ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఐస్‌క్రీమ్ – ఒకటిన్నర కప్పు పైనే (నచ్చిన ఫ్లేవర్) మినీ చాక్లెట్ చిప్స్ లేదా కలర్ స్ప్రింకిల్స్ – 2 టేబుల్ స్పూన్ల పైనే బిస్కట్స్ – కొన్ని (మార్కెట్లో దొరికే బిస్కట్స్ లేదా ఇంట్లో చేసుకునే కుకీస్ తీసుకోవచ్చు) తయారీ విధానం: ముందుగా నచ్చిన షేప్‌లో రెండేసి బిస్కట్స్ లేదా కుకీస్ తీసుకుని.. వాటి మధ్యలో.. సేమ్ షేప్‌లో ఐస్‌క్రీమ్ బిట్ పెట్టుకుని శాండ్‌విచ్‌లా చేసుకోవచ్చు. అనంతరం వాటిని చాక్లెట్ చిప్స్‌లో లేదా కలర్ స్ప్రింకిల్స్లో దొర్లించి వెంటనే సర్వ్ చేసుకోవాలి. ఇలాంటి వెరైటీలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. (చదవండి: -
పీనట్ ఐస్‌క్రీమ్ ఎప్పడైనా ట్రై చేశారా? సింపుల్ రెసిపి
పీనట్ ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి: స్వీటెండ్ కండెన్సడ్ మిల్క్ – 400 గ్రాములు హెవీ క్రీమ్ – 480 ఎమ్ఎల్,పీనట్ బటర్ – 250గ్రాములు వేరుశనగలు – 70 గ్రాములు (దోరగా వేయించి, తొక్క తీసి, కచ్చాబిచ్చా చేసుకోవాలి) తయారీ విధానమిలా: ముందుగా ఒక పెద్ద గిన్నెలో హెవీ క్రీమ్ వేసుకుని హ్యాండ్‌హెల్డ్ మిక్సర్‌తో బాగా నురుగు వచ్చేలా, క్రీమీగా చేసుకోవాలి. దానిలో కండెన్సడ్ మిల్క్, పీనట్ బటర్ వేసుకుని.. బాగా కలుపుకోవాలి. మెత్తగా క్రీమీగా మారిన తర్వాత.. దానిలో కచ్చాబిచ్చా చేసుకున్న వేరుశనగ ముక్కల్ని కలుపుకోవాలి. అనంతరం ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. సమాంతరంగా చేసుకోవాలి. 6 గంటలు పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుని.. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. -
ఈ మెషిన్ తో ఒకే సారి ఆరు కప్పుల ఐస్‌క్రీమ్ తయారీ..
క్లైమేట్‌తో సంబంధం లేకుండా ఇష్టపడే రుచుల్లో ఐస్‌క్రీమ్ ఎవర్గ్రీన్! అలాంటి ఐస్‌క్రీమ్ లవర్స్‌కి ఈ మెషిన్ తెగ నచ్చుతుంది. ఎందుకంటే ఇది చాలా తక్కువ సమయంలో.. ఎక్కువ మోతాదులో ఫేవరెట్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌ని అందిస్తుంది. ఇది ఒక్కసారికి సుమారు ఆరు కప్పుల ఐస్‌క్రీమ్‌ని తయారు చేయగలదు. దీనిలోని సుపీరియర్ ఫంక్షన్స్ యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తాయి. ఇందులో రొటేటెడ్ లేడల్ (గరిటె) ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. ఒకే కనెక్షన్‌తో రెండు గరిటెలుగా విడిపోయి.. లోపలున్న పదార్థాలను కలపడానికి సహకరిస్తుంది. ఇక దీని లోపల ఐస్‌క్రీమ్ స్పష్టంగా కనిపించడానికి ట్రాన్స్పరెంట్ మూత ఉంటుంది. ఈ మేకర్ని క్లీన్ చేసుకోవడం.. వినియోగించుకోవడం చాలా ఈజీ. (చదవండి: పురాతన ఆలయం కోతులకు ఆవాసం! ) -
అలోవెరాతో ఐస్‌క్రీమ్.. ఎప్పుడైనా తిన్నారా?
అలోవెరా ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి: కలబంద ముక్కలు – పావు కప్పు, పండిన కర్బూజా ముక్కలు – అర కప్పు కీర దోస –1(తొక్క తీసి, ముక్కలుగా చేసుకోవాలి) పుదీనా ఆకులు – 8 మిల్క్‌మెయిడ్ – అర కప్పు, మ్యాపుల్ సిరప్ – 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – 1 కప్పు (ఇవి మార్కెట్లో దొరుకుతాయి), ఫుడ్ కలర్ – గ్రీన్ కలర్ (అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో బాగా గిలకొట్టాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్లో పుదీనా ఆకులు, కలబంద ముక్కలు, కర్బూజా ముక్కలు, కీరదోస ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని.. ఫ్రెష్ క్రీమ్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం మిల్క్‌మెయిడ్, మ్యాపుల్ సిరప్, కొద్దిగా ఫుడ్ కలర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలిపి.. సుమారు 8 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన అలోవెరా ఐస్‌క్రీమ్ రెడీ అయిపోతుంది. -
ఒకప్పుడు రూ. 65 జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు వేల కోట్ల కంపెనీకి బాస్! ఎలా అంటే?
ఒక మనిషి జీవితంలో సక్సెస్ సాధించాలంటే కసి, పట్టుదల, నిరంతర శ్రమ అవసరం. అయితే ఉన్నతమైన చదువులు, డాక్టరేట్లు మాత్రమే సక్సెస్ తీసుకువస్తాయనేది అపోహ మాత్రమే అంటున్నారు కొంతమంది నిపుణులు. మనం ఈ కథనంలో కాలేజ్ డ్రాపౌట్ అయిన ఒక వ్యక్తి దేశంలో అగ్రగామి వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడు? ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. 'RG చంద్రమోగన్' ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ భారతదేశంలోని బిలినీయర్ల జాబితాలో ఈయన ఒకరు. చంద్రమోగన్ బాల్యం మొత్తం తమిళనాడులోని చెన్నైలో గడిచిపోయింది. చిన్నప్పటి నుంచే లెక్కల మీద మంచి పట్టు ఉండటంతో అందరూ ఇతన్ని 'హ్యూమన్ కంప్యూటర్' అని పిలిచేవారు. గణితంలో ఎంత పట్టు ఉన్నా.. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్ల 21 సంవత్సరాల వయసులోనే చదువుకు దూరమయ్యాడు. తన తండ్రి చిన్న ప్రొవిజనల్ స్టోర్ నడిపేవాడు, కానీ చంద్రమోగన్ అదికాదని ఒక టింబర్ డిపోలో కేవలం రూ. 65 జీతానికి ఉద్యోగం ప్రారంభించాడు. ఒక సంవత్సరం తరువాత ఆ ఉద్యోగం మానేసి 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ముగ్గురు కార్మికులతో ఐస్ క్రీమ్ వ్యాపారం ప్రారంభించాడు. కేవలం రూ. 13,000తో ప్రారంభమైన ఐస్ క్రీమ్ బిజినెస్ ప్రారంభంలో కొంత నష్టాలను చవిచూసింది. అప్పట్లో 15 తోపుడు బండ్ల మీద వ్యాపారం ప్రారంభించి మొదటి ఏడాదిలో రూ. 1.5 లక్షలు రావడంతో చంద్రమోగన్కు వ్యాపారం మీద కొంత నమ్మకం కలిగింది. 1981లో చిన్న పట్టణాలలో వ్యాపారం విస్తరించడం ప్రారంభించాడు. ఇదే ఆయన పురోగతికి పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఇదీ చదవండి: నెహ్రూ ఐడియా & జెఆర్‌డీ టాటా విజన్‌తో పుట్టిన కంపెనీ ఇదే! ఐస్ క్రీమ్ బిజినెస్ రోజురోజుకి వృద్ధి చెందుతూ 'అరుణ్' ఐస్ క్రీమ్ పేరుతో తమిళనాడులో మంచి ప్రజాదరణ పొందాడు. 1986లో హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ పేరుతో వ్యాపారం చేయడం ప్రారంభించాడు. ఇది భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ కంపెనీలలో ఒకటిగా ప్రతిరోజూ 10,000 గ్రామాలలో 4 లక్షల మంది రైతుల నుంచి పాలను సేకరిస్తుంది. ఇదీ చదవండి: అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్' - రీజన్ తెలిస్తే షాక్ అవుతారు! ప్రస్తుతం హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ మార్కెట్ క్యాప్ రూ.18,889 కోట్లుగా ఉంది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ప్రకారం RG చంద్రమోగన్ నేడు రూ. 13,000 కోట్ల కంటే ఎక్కువ నికర విలువను కలిగి ఉన్నారు. అతని కంపెనీ పాల ఉత్పత్తులను 42 దేశాల్లో ఉపయోగిస్తున్నారు. చంద్రమోగన్ ఛైర్మన్‌గా ఉండగా, ఆయన కుమారుడు సి సత్యన్ ఇప్పుడు హ్యాట్సన్ను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. -
రసగుల్లాతో ఐస్‌క్రీం..ఎప్పుడైనా ట్రై చేశారా? అదిరిపోద్దంతే!
రసగుల్లా ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి: వెనీలా ఐస్‌క్రీమ్ – నాలుగు కప్పులు; రసగుల్లాలు – ఎనిమిది; స్ట్రాబెరీ – ఆరు; బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: గడ్డకట్టిన ఐస్‌క్రీమ్‌ను రిఫ్రిజిరేటర్ నుంచి తీసి పదినిమిషాలు బయటపెట్టాలి ∙రసగుల్లాలను గట్టిగా పిండి సిరప్‌ను తీసేయాలి. పూర్తిగా పిండకూడదు. కొద్దిగా సిరప్ తేమ ఉండేలా పిండాలి ∙పిండిన రసగుల్లాలను చిన్నచిన్న ముక్కలు చేయాలి. స్ట్రాబెరీలను కూడా కడిగి సన్నగా తరగాలి ∙ఇప్పుడు ఐస్‌క్రీమ్‌లో రసగుల్లా ముక్కలు వేసి కలపాలి . దీనిలో స్ట్రాబెరీ ముక్కలు, బాదం పలుకులు వేసి మరోసారి చక్కగా కలపాలి. ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని గిన్నెలో వేసి మూతపెట్టి రాత్రంతా లేదా కనీసం నాలుగు గంటల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి . రిఫ్రిజిరేటర్లో నుంచి తీసిన పదిహేను నిమిషాల తరువాత రసగుల్లా ఐస్‌క్రీమ్‌ను సర్వ్‌చేసుకోవాలి. -
దటీజ్ "మహాలక్ష్మీ ఐస్ క్రీం"! అద్గది.. టెక్నాలజీని వాడటం అంటే..!
మన చుట్టూ సాధరణంగా ఉండే సామాన్యులు సైతం టెక్నాలజీని వాడుకునే సామర్థ్య కలిగి ఉంటారు. అవసరం వచ్చినప్పుడూ గానీ వారి నైపుణ్యం ఏంటో మనకు తెలియదు. వారు తమ నిత్యావసరాలకు టెక్నాలజీని వాడి చూపిస్తే..అందరూ అశ్చర్యపోతారు. నాలెడ్జ్ అనేది ఎవరీ సొత్తు కాదు. బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎవ్వడైనా తమకు అందుబాటులో ఉన్నవాటితోనే అద్భుతాలు చేసి చూపగలరు. అచ్చం అలాంటి అద్భుత ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఢిల్లీలోని మహాలక్మీ ఐస్ క్రీం బండి చూస్తే..కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ఐస్ క్రీం ట్రక్ టెక్నాలజీని వాడేంత స్థాయిని చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంత టెక్నాలజీ వాడగలిగే స్థోమత ఆ ఐస్‌క్రీం విక్రయించే అతనికి ఉండటమే..ఇక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి వీధుల్లో అమ్మే ఐస్‌క్రీం బండి వాళ్లు శీతలీకరణం కోసం ఇంటెన్సివ్ గ్లైకాల్ ఫీజర్లపైనే ఆధారపడతారు. అవి భారీగా ఉండటమే కాకుండా గణనీయమైన విద్యుత్‌ని డిమాండ్ చేస్తుంది. వేసవిలో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఐసీక్రీంని కూల్‌గా ఉంచటం కోసం అని సోలార్ విద్యుత్‌ని వాడాలన్న ఆలోచనే గ్రేట్గానూ, కొత్తగానూ ఉంది. ఇక అంత సాంకేతికతకు పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం ఆ ఐస్‌క్రీం విక్రయించే వ్యక్తికి ఉండటం..అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అతను ఆ వ్యాపారంలో లాభాలు గడించి ఆ స్థాయికి వచ్చాడని కొందరూ, విక్రయించే వ్యక్తికి వ్యక్తిగత సోలార్ టెక్నాలజీకి సంబంధించి కనెక్షన్ ఉంటే తప్ప ఇలా ఐస్‌క్రీం ట్రక్‌కి పెట్టలేరని కొందరూ కామెంట్లు చేస్తూ..పోస్ట్‌లు పెట్టారు. (చదవండి: -
ఐస్ క్రీంలో పురుగులు
-
ఐస్ క్రీం ఫ్రీగా ఇస్తామంటే డాన్స్ చేయకుండా ఆగుతామా?
ఉచితంగా ఇస్తామంటే ఏ పని చేయడానికి వెనకాడరు కదా!. అందులోకి ఫుడ్‌కి సంబంధిచింది అంటే ఇంక జనాలు ఎలా ఎగబడతారో చెప్పనవసరం లేదు. అందుకు పెద్ద చిన్నా అనే తేడా లేదు. అలాంటి ఘటనే బెంగళూరు చోటు చేసుకుంది. ఓ ఐస్‌క్రీం ఫాపు వాళ్లు డ్యాన్స్ చేస్తే ఐస్‌క్రీం ఫ్రీ అని ఆఫర్ ఇచ్చింది. అంతే ఇక..ఆ ఉచిత ఐస్క్రీంల కోసం వృద్ధులు యువత అనే తేడా లేకుండా పోటాపోటీగా డ్యాన్సుల చేసి మరీ ఐస్క్రీంని ఆరగించి వెళ్తున్నారు. మాములుగా ఏదైన ఈవెంట్ పరంగా చేయాల్సి వస్తే డ్యాన్స్ చేసేందుకు ఎవరూ ముందుకు రారు. ఇలాంటప్పుడూ మాత్రం డ్యాన్స్‌లు వచ్చినా రాకపోయినా రెండు స్టెప్లు ఏదోరకంగా వేసి మరీ తమ తడాఖా ఏంటో చూపిస్తారు. ఇలాంటి విచిత్రమైన ఆఫర్లు ఉంటే జనాల్లో దాగున్న అన్ని టాలెంట్లు బయటకు వచ్చేస్తాయి కూడా. అయితే ఎందుకిలా బెంగళూరుషాపు వాళ్లు ఈ ఆఫర్ పెట్టారంటే..ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఔనా! అయితే ప్రతి జూలై మూడోవ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా నేషనల్ ఐస్‌క్రీం డేని జరుపుకుంటారు. ఈ ఏడాది అదికాస్త జూలై 16న వచ్చింది. ఆ సందర్భంగా బెంగళూరులోని ప్రఖ్యాతిగాంచిన ఓ ఐస్‌క్రీం షాపు ఏదైన వినూత్న రీతిలో కస్టమర్లకు ఐస్క్రీంని సర్వ్ చేయాలనుకుంది. అందులో భాగంగా ఇలాంటి వైరైటీ ఆఫర్ ఇచ్చింది కస్టమర్లకు. ఆ షాపు వాళ్లు కస్టమర్లు అదిరిపోయే డ్యాన్స్‌లు చేస్తే ఐసీక్రీం ఫ్రీ అని బోర్డు పెట్టింది. అంతే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జనాలు ఇలా ఉత్సాహంగా ముందుకు వచ్చి తమ టాలెంట్‌ని చూపించారు. ఈ మేరకు సదరు ఐస్‌క్రీం షాపు అందుకు సంబందించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో నెటిజన్లతో పంచుకుంది. ఈ వేడుక మీ ప్రేమతో దిగ్విజయం జరిగింది అందుకు మా కస్టమర్లకు ధన్యావాదాలు అని ఇన్‌స్టాలో పేర్కొంది సదరు ఐస్‌క్రీం షాపు యాజమాన్యం. View this post on Instagram A post shared by Corner House Ice Creams (@cornerhouseicecreams) (చదవండి: సింపుల్ ఫుడ్ ఛాలెంజ్! కానీ అంత ఈజీ కాదు!) -
ఇస్మార్ట్ ఆఫర్ డ్యాన్స్ జెయ్యాలే... ఫ్రీగా ఐస్‌క్రీమ్ తినాలే!
‘డ్యాన్స్ చేయండి. ఐస్‌క్రీమ్ ఫ్రీగా తినండి’ అని ఎవరైనా ఆఫర్ ఇస్తే ఎంత బాగుంటుంది! ఎవరో ఎందుకు సాక్షాత్తూ ఒక ఐస్‌క్రీమ్ కంపెనీ ఇలాంటి ఆఫర్‌ను కస్టమర్లకు ఇచ్చింది. ‘ఐస్‌క్రీమ్ డే’ను పురస్కరించుకొని బెంగళూరుకు చెందిన ‘కార్నర్ హౌజ్ ఐస్‌క్రీమ్స్’ అనే ఐస్‌క్రీమ్ కంపెనీ షాప్ ముందు నుంచి కౌంటర్ వరకు డ్యాన్స్ చేస్తూ వచ్చే వాళ్లకు ఫ్రీ ఐస్‌క్రీమ్ ఆఫర్ ఇచ్చింది. ఇక డ్యాన్సులే డ్యాన్సులు! కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ డ్యాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. ‘ఫ్రీ ఐస్‌క్రీమ్ మాటేమిటోగానీ ఎంతోమంది డ్యాన్సింగ్ స్కిల్స్‌ను చూసే అవకాశం వచ్చింది’ ‘డ్యాన్స్ చేస్తే ఫ్రీగా టమాటాల ఆఫర్ ఎవరైనా ఇస్తే బాగుండేది’... ఇలాంటి కామెంట్స్ నెటిజనుల నుంచి వచ్చాయి. -
ఐస్‌క్రీమ్ పానీపూరీ! ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి
ఐస్‌క్రీమ్ పానీపూరీ కావలసినవి: ఐస్ క్రీమ్ – పావు కప్పు చొప్పున 2 రకాలు (ముందుగానే నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్.. కాస్త మెల్ట్ అయ్యాక కవర్లో వేసుకుని.. కోన్ లా చేసుకుని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి) పానీపూరీ – 10 లేదా 15 డార్క్ సెమీ స్వీట్ చాక్లెట్ – 300 గ్రా. (ఒక వంద గ్రాములు తురుములా కోరి పక్కనే పెట్టుకోవాలి) కమలాపండు తొనలు – 10 (గార్నిష్ కోసం) చాక్లెట్స్ చిప్స్, టూటీ ఫ్రూటీ, డార్క్ స్ప్రింకిల్స్ కలర్ స్ప్రింకిల్స్ – 3 టేబుల్ స్పూన్ల చొప్పున (అభిరుచిని బట్టి) తయారీ విధానం: ముందుగా ఓవెన్ లో 200 గ్రాముల డార్క్ సెమీ స్వీట్ చాక్లెట్ కరిగించి, ప్రతి పానీపూరీని కాస్త చిదిమి, దానికి మొత్తం చాక్లెట్ క్రీమ్ పట్టించి, ఆ పూరీలన్నిటినీ పావుగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం ప్రతి పానీపూరీలో రెండు ఐస్ క్రీమ్స్ నింపుకుని, చాక్లెట్ తురుము, కమలాపండు తొనలతో గార్నిష్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి చాక్లెట్స్ చిప్స్, టూటీ ఫ్రూటీ, కలర్ స్ప్రింకిల్స్, డార్క్ స్ప్రింకిల్స్ వాటిపై వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. (చదవండి: సూపర్ స్నాక్స్.. తమలపాకు గారెలు తయారీ ఇలా) -
ఐస్ క్రీమ్ తింటున్న కొద్దీ ఇంకా తినాలని ఎందుకు అనిపిస్తుంది?
ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వారుండరు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా ఆస్వాదించే మధురమైన స్నాక్. ఆఖరికి పెళ్లి భోజనాల్లో తాంబులాలకు బదులు ఐస్‌క్రీంలు సర్వ్ చేస్తున్నారు. అంతలా మిగతా తినుబండరాల్లో రారాజుగా అగ్రస్థానంలో నిలిచింది. ఐస్క్రీ వినియోగం విషయమై పోటీపెడితే ప్రతి దేశం పాల్గొంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐతే ఐస్‌క్రీం మనల్ని ఎందుకంతలా టెంప్ట్ చేసి..తినేకొద్ది తినాలనిపిస్తుందంటే.. తొలి నాళ్లల్లో కేవలం పాలు చక్కెరతో తయారు చేసిన ఐసీక్రీ మాత్రమే ఉండేది. ఆ తర్వాత వెన్నెలా అంటూ రకరకాల ఐస్‌క్రీం ఫ్లేవర్లు లెక్కకు మించి మార్కెట్లోకి వచ్చి మనల్ని ఊరించడం ప్రారంభించాయి. అయితే వీటి తయారికి పాలు, చక్కెర ప్రధానమైనవి. ఆ తర్వాత సాల్ట్, స్ట్రాస్ పియర్, బ్లూ చీజ్‌లు ఈ ఐస్‌క్రీంకి మరింత రుచిని తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. ఓన్లీ క్రిమ్ని సిప్ చేయకుండా మధ్య, మధ్యలో క్రంచీ క్రంచీగా తినేలా మాల్టెడ్ మిల్స్బాల్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే క్యాండీడీ సాల్మన్‌తో కూడిన ఐస్‌క్రీంలు, క్రీమీ సలాడ్ డ్రెస్సింగ్‌లో ఇల్లులాంటి ఆకృతులతో కూడిని ఐస్‌క్రీంలు వచ్చాయి. మొదటగా ఆ ఐస్క్రీంని చూడగానే రంగు, రుచి, ఆకృతులతో కట్టిపేడేయాలన్న లక్ష్యంతో తయారీదారులు వాటికే ప్రాధాన్యత.. ఇస్తూ మంచి నాణ్యతతోక కూడినవి ప్రజలకు అందిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా ఐసీక్రీంలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులోనూ సమ్మర్ సీజన్లో అయితే ఇక ఆ ఐస్క్రీంలను అస్సలు వదిలిపెట్టరు. ఇదే క్రమంలో ఫుడ్ ఇన్నోవేషన్ సెంటర్లు కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపైనే దృష్టి సారిస్తున్నాయి. మసోని ఉబెర్ గౌర్మెట్ అనే మహిళా ఫుడ్ ఇన్నోవేటర్ ఇప్పటి వరకు తన కెరియర్లో సుమారు 100 రకాల విభిన్న ఫ్లేవర్లతో కూడిన ఐస్క్రీంలను తయారు చేసింది. సరికొత్త బ్రాండ్లతో మరింత రుచిగా అందించేలా నెపుణ్యాలను మెరుగుపరచుకోవడమే గాక మనం తీసుకునే ఆహారంలో ఇన్ బ్యాలెన్స్ అయ్యేలా వాటిని రూపొందిస్తుంది ఉబెర్. అంతేగాదు ఆరోగ్యానికి ప్రమాదకారికి ఉండకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడూ నాణ్యతతో కూడిన సరికొత్త ఐస్క్రీంలను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు తయారీదారులో. దానిలో ఉండే చక్కెర గడ్డ కట్టకుండా ఉంటూ మన హయిగా ఆస్వాదించేలా ఉంటున్నాయి. ప్రజల ఆరోగ్య రీత్యా చక్కెరను కూడా తక్కువ శాతం వినియోగించేందుకు కంపెనీలు ఆసక్తి కనబర్చడంతో.. ప్రజలు కూడా వాటిని తినేందుకేక ఇష్టపడుతున్నారు. చల్లగా ఉండే ఆ ఐస్క్రీంని ఆస్వాదించగానే మన మెమెరీ ఒక్కసారిగా ఉత్తేజంగా మారడమే గాక మనం ఆనందంగా ఉన్న జ్ఞాపకాలు కళ్లముందు మెదిలేలా చేస్తుంది. దీంతో మనకే తెయని ఒక విధమైన అనుభూతికి గురై..మరోసారి తినాలనే ఫీలింగ్ వస్తుంటుంది. ఇక వీటిలో అధిక కొవ్వు, చక్కెరల కారణంగా రోజు ఎక్కువగా తింటే ఒబెసిటీ వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. అందువల్ల సాధ్యమైనంత మేర కాస్త దూరంగా ఉండటమే మంచిది అంటున్నారు ఆహార నిపుణులు. ఆయా ఐస్క్రీంలలో ఎలక్రిక్ మిషన్‌తో కూడిన స్కూపీల్లో చక్కెర స్థాయిలు, కొవ్వు శాతం సుమారు 10 నుంచి 11 శాతం మాత్రమే ఉంటాయి. ఇక మంచి బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన ఐస్క్రీంలలో అయితే వాటి స్థాయి అధికంగానే ఉంటుంది. (చదవండి: కమ్మని కాఫీలాంటి కళ) -
ప్రపంచంలోని టాప్ 10 బెస్ట్ ఐస్ క్రీమ్స్
-
కొండాపూర్‌లోని ఐస్‌క్రీమ్ సెంటర్లో విజయ్ దేవరకొండ సందడి (ఫొటోలు)
-
జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ఐస్‌క్రీమ్ తినగలమా..! ఎందుకంటే?
ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారుని చూసుంటారు, బైకుని చూసుంటారు.. అంతెందుకు ఖరీదైన దుస్తులను కూడా చూసుంటారు. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ గురించి తెలుసుకోబోతున్నారు. ఐస్‌క్రీమ్ ఏంటి.. ఖరీదైనదేంటి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా, దీని ధర వెయ్యో, పదివేలో అనుకుంటే పొరపాటే. అక్షరాలా రూ. 5 లక్షల కంటే ఎక్కువ. జపాన్‌కు చెందిన ఐస్‌క్రీమ్ తయారీదారులలో ఒకటైన 'సిలాటో' దీనిని తయారు చేసింది. ఇది బైకుయా అనే ప్రోటీన్ కలిగిన ఐస్‌క్రీమ్ కావడం విశేషం. ఇదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'ఐస్‌క్రీమ్'గా రికార్డుకెక్కింది. ఇంత ఖరీదైన ఐస్‌క్రీమ్ కూడా పాలతోనే తయారవుతుంది. కానీ ఇది వెల్వెట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో చీజ్, గుడ్డులోని పచ్చ సోన వంటివి కలుపుతారని సమాచారం. వీటితో పాటు ఇందులో పర్మిజియానో చీజ్, వైట్ ట్రఫుల్, ట్రఫుల్ ఆయిల్, గోల్డ్ లీఫ్ ఉంటాయి. ఈ మొత్తం ఐస్‌క్రీమ్ ఒక స్టైలిష్ బ్లాక్ బాక్స్‌లో ప్యాక్ చేస్తారు. ఇది చూడటానికి సాధారణ ఐస్ క్రీమ్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే దీనిని తినటానికి ఉపయోగించే స్పూన్ చేతితో తయారు చేసిన మెటల్ కావడం విశేషం. దీనిని క్యోటోకి చెందిన హస్తకళాకారులు ప్రత్యేకంగా తయారు చేశారు. (ఇదీ చదవండి: వాట్సాప్‌లో ఇలాంటి ఫీచర్ ఒకటుందని తెలుసా? తెలిస్తే ఎగిరి గంతేస్తారు!) కేవలం 130ml ఐస్‌క్రీమ్ ధర కంపెనీ వెబ్సైట్లో అక్షరాలా 8,80,000 యెన్స్ అంటే అమెరికా కరెన్సీ ప్రకారం దాదాపు 6వేల డాలర్ల కంటే ఎక్కువ, భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 5 లక్షలకంటే ఎక్కువ. ఈ ఐస్‌క్రీమ్ తినటానికి నిర్దిష్ట గడువు అంటూ ఏమి ఉండదు, కావున దీనిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ధర ఎక్కువ కావడంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. -
బీ అలర్ట్! హైదరాబాద్‌లో హానికర రసాయనాలతో ఐస్‌క్రీమ్‌లు..
సాక్షి, హైదరాబాద్: ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో వీటికున్న క్రేజ్ వేరు. రోడ్లపై ఐస్‌క్రీం కనపడితే కొనిచ్చేంత వరకు పిల్లలు మారాం చేస్తుంటారు. ఇక వేసవి వచ్చిందంటే చాలు.. హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్‌గా ఐస్‌క్రీం తినాలనిపిస్తుంది. అందుకు ఈ సీజన్లో ఐస్క్రీంలకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు దీన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. హానికరమైన రసాయనాలతో ఐస్క్రీంలను తయారీ, నకిలీ ఐస్‌క్రీంలపై బ్రాండెడ్ స్టిక్కర్లతో అమ్మకాలు జరుపుతున్నారు. ప్రజలు ప్రాణాల పణంగా, లాభాలే ప్రధాన అజెండాగా వ్యాపారం చేస్తున్నారు. భారీగా లాభాలు ఆర్జించేందుకు కల్తీ దారిని ఎంచుకుంటున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా చిన్న పిల్లలు తినే ఐస్ క్రీం ను కూడా కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడో వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ లోని చందానగర్‌లో వెలుగులోకి వచ్చింది. హానికరమైన రసాయనాలతో నకిలీ ఐస్‌క్రీమ్‌లను తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న ముఠా గుట్టు రట్టైంది. పోలీసులు జరిపిన దాడిలో బ్రాండెడ్ పేర్లతో నకిలీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో షాపులోని సరుకు సీజ్ చేసి నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తస్మాత్ జాగ్రత్త భాగ్యనగర ప్రజలారా! -
ఐస్‌క్రీమ్ అమ్మబోతున్న అంబానీ: రూ. 20వేల కోట్లతో..
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ కంపెనీ అధినేత 'ముఖేష్ అంబానీ' త్వరలో భారతదేశంలో మరో కొత్త బిజినెస్ ప్రారంభించనున్నట్లు సమాచారం. పెట్రోల్, ఎలక్రానిక్స్, క్లాథింగ్, టెలికాం, ఎనర్జీ వంటి మరెన్నో రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మరో రంగంపై కన్నేసింది. నివేదికల ప్రకారం, రిలయన్స్ సంస్థ త్వరలో ఐస్‌క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో రూ. 20,000 కోట్ల టర్నోవర్‌తో ఐస్‌క్రీమ్ పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఏర్పాట్లు చేస్తోంది. గత సంవత్సరం గుజరాత్‌లోనే రిలయన్స్ కంపెనీ ఈ బ్రాండ్ విడుదల చేసింది, కాగా ఇప్పుడు మార్కెటింగ్ కోసం అక్కడి ఐస్‌క్రీమ్ తయారీ అవుట్ సోర్సింగ్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రిలయన్స్ కంపెనీ ఐస్‌క్రీమ్ రంగంలోకి ప్రవేశిస్తే ఇక్కడి మార్కెట్లో పోటీ భారీగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలోని ఐస్ క్రీమ్ పరిశ్రమలో ఐసిస్ క్రీమ్, స్టార్మి ఇండస్ట్రీస్, అమూల్ సంస్థలు అత్యధిక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ కంపెనీలు రిలయన్స్‌తో పోటీ పట్టడానికి సిద్దమవ్వాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: Flipkart Offers: మండే ఎండల్లో కూల్ ఆఫర్స్.. ఏసీ కొనటానికి ఇదే మంచి సమయం) రిలయన్స్ సంస్థ కొన్ని రోజుల క్రితం డెయిరీ రంగంలోని ఆర్ఎస్ సోధి కంపెనీని కొనుగోలు చేసింది. అమూల్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఈ కంపెనీ ఐస్‌క్రీమ్ రంగంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒకప్పుడు టెలికాం రంగంలో జియో పేరుతో ప్రవేశించినప్పుడు ఈ రంగంలోని చాలా కంపెనీలు భారీగా నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అలంటి పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
దిల్ ఉండాలబ్బా..! ఆనంద్ మహీంద్ర అమేజింగ్ వీడియో
సాక్షి,ముంబై: మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర మరో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. తన మనసుకు నచ్చిన, ఆకట్టుకున్న వీడియో ఏదైనా సరే ఫ్యాన్స్‌తో పంచుకోవాల్సిందే. అలాంటి ఎన్నో విజ్ఞానదాయకమైన, ఆసక్తి కరమైన వీడియోలను ట్విటర్లో తరచుగా పంచుకుంటున్న ఏకైక బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. (ఇదీ చదవండి: హిప్ హిప్ హుర్రే! దూసుకుపోతున్న థార్ ) తాజాగామనసుంటే మార్గముంటుంది అంటూ ఒక వీడియోను ట్వీట్ చేశారు. హ్యాండ్‌మేడ్, ఫ్యాన్ మేడ్ ఐస్ క్రీం ఓన్లీ ఇన్ ఇండియా అంటూ ఒక వీడియోను షేర్ చేయడం విశేషంగా నిలిచింది. (Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?) Where there’s a will, there’s a way. Hand-made & Fan-made ice cream. Only in India… pic.twitter.com/NhZd3Fu2NX — anand mahindra (@anandmahindra) March 29, 2023 -
కొంపల్లిలో సందడి చేసిన డీజే టిల్లు భామ నేహా శెట్టి
డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి హైదరాబాద్‌లో సందడి చేసింది. కొంపల్లిలో ఓ ఐస్‌క్రీమ్ స్టోర్‌ను ప్రారంభించింది. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా.. నేహా శెట్టి కన్నడ సినిమా ముంగారు మలే 2తో సినీరంగంలోకి ఆడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో మెహబూబా, గల్లీ రౌడీ, డీజే టిల్లు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రారంభోత్సవంలో నేహా శెట్టి మాట్లాడుతూ..'నాకు వైట్ చాక్లెట్ బ్లాండీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. నేను ఐస్ క్రీమ్స్ రుచి చూడటానికి చాలా ఇష్టపడతా. అతి త్వరలో బెదురులంక మూవీతో మిమ్మల్ని అలరించేందుకు వస్తున్నా' అని తెలిపింది. ఐస్‌క్రీమ్స్ ప్రత్యేక రుచులు కోరుకొనే వారికీ ఇది సరికొత్త వేదికగా నిలుస్తుందని ఫ్రాంచైజ్ యజమాని అభిషేక్ దేవ అన్నారు. -
Neha Shetty Latest Photos: కొంపల్లిలో సందడి చేసిన నేహా శెట్టి (ఫొటోలు)
-
అందరికీ ఎండాకాలం, మాకిదే మంచి కాలమంటున్న ఆ కంపెనీలు.. ఎందుకంటే?
వేసవి కాలం మొదలైపోయింది.. భానుడి వేడి రోజు రోజుకి పెరుగుతోంది. ఈ తరుణంలో ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాల డిమాండ్ ఎక్కువవుతోంది. కావున అమ్మకాలు మునుపటికంటే దాదాపు రెండు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఎఫ్‌ఎమ్‌సిజి అండ్ డెయిరీ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కంపెనీల అమ్మకాలు మరింత వృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సీజన్లో తమ ఉత్పత్తులకు డిమాండ్‌ని పెంచుకోవడానికి తగిన ఆఫర్స్ కూడా తీసుకురానున్నట్లు సమాచారం. పాలు, పాల పానీయాల ఉత్పత్తులు, ఐస్‌క్రీమ్‌ల విక్రయదారులలో ఒకటైన మదర్ డైరీ ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అంచనా వేస్తూ ఉత్పత్తులను వేగవంతం చేయడానికి, రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రెండ్ కొనసాగటానికి తగిన విధంగా సిద్ధమవుతోంది. కోల్డ్-చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిఫర్ వెహికల్స్, షెల్ఫ్ స్ట్రెంగ్త్ నిర్ధారించడానికి కన్స్యూమర్ టచ్ పాయింట్లలో అసెట్ డిప్లాయ్మెంట్లో పెట్టుబడి పెట్టామని మదర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ బండ్లీష్ తెలిపారు. మదర్ డెయిరీ ఈ సమ్మర్ సీజన్లో మరో 15 కొత్త ఉత్పత్తులు లేదా రుచులను ప్రారంభించడం ద్వారా వినియోగదారులను ఆకర్శించడానికి సిద్ధంగా ఉంది. రాబోయే సీజన్లో ఐస్‌క్రీం వర్గం దాదాపు 25 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు కూడా బండ్లీష్ చెప్పుకొచ్చారు. శీతల పానీయాల తయారీ సంస్థ పెప్సికో వేసవి ప్రారంభంమే చాలా ఉత్సాహంగా ఉందని, 2023 పానీయాల రంగానికి తప్పకుండా కలిసొస్తుందని ఆశాభావాలను వ్యక్తం చేసింది. అంతే కాకుండా స్వదేశీ ఎఫ్‌ఎమ్‌సిజి మేజర్ డాబర్ ఇండియా తన వేసవి ఉత్పత్తులు తప్పకుండా ఆశాజనకంగా అమ్ముడవుతాయని ప్రకటించింది. -
ఐస్ క్రీం లవర్స్‌కి చల్లటివార్త: థండాయ్ ఐస్ క్రీం
హైదరాబాద్: ఐస్ క్రీమ్స్ తయారీలో ఉన్న ఎన్ఐసీ హానెస్ట్లీ క్రాఫ్టెడ్ ఐసీ క్రీమ్స్ హోలీ పండుగను దృష్టిలో పెట్టుకుని థండాయ్ ఫ్లేవర్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే కంపెనీ పాన్, గులాబ్ జామూన్, గాజర్ హల్వా, మోదక్, షీర్ ఖుర్మా, తిల్ గుడ్ వంటి 50కిపైగా ఫ్లేవర్లను విక్రయిస్తోంది. 2015లో ప్రారంభమైన ఎన్ఐసీ హానెస్ట్లీ క్రాఫ్టెడ్ ఐసీ క్రీమ్స్‌ను వాకో ఫుడ్ కంపెనీ ప్రమోట్ చేస్తోంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐస్‌క్రీం బ్రాండ్ ఎన్ఐసీ హానెస్ట్లీ క్రాఫ్టెడ్ ఐసీ క్రీమ్స్ ఇటీవల వాఫిల్ కోన్స్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వాఫిల్ కోన్లు 5 ప్యాక్‌లలో లభిస్తాయి. -
FIFA WC: బ్రెజిల్‌ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మి
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో గురువారం రాత్రి సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. అయితే బ్రెజిల్ స్టార్ నెయ్మర్ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో బ్రెజిల్‌ను ఎవరు ముందుండి నడిపిస్తారనే సంశయం మొదలైంది. కానీ నెయ్మర్ స్థానంలో వచ్చిన రిచర్లీసన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్రెజిల్ చేసిన రెండు గోల్స్ రిచర్లీసన్ కొట్టినవే కావడం విశేషం. అతను కొట్టిన రెండు గోల్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు 25 ఏళ్ల రిచర్లీసన్ పేరు ఫిఫా వరల్డ్‌కప్‌లో మారుమోగిపోతుంది. ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్‌కు ఆరో టైటిల్ అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రిచర్లీసన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అయితే రిచర్లీసన్ అనుకున్నంత ఈజీగా ఫుట్‌బాలర్ అవ్వలేదు. ఫుట్‌బాలర్ అవ్వడానికి ముందు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇప్పుడు స్టార్‌గా పేరు సంపాదించినప్పటికి ఒకప్పుడు పొట్టకూటి కోసం ఐస్‌క్రీంలు అమ్మాడు.. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. రిచర్లీసన్ తండ్రి ఓ మేస్త్రీ. తల్లి ఐస్ క్యాండీలు అమ్ముతుండేది. ఆమెతోపాటు అతడు కూడా వెళ్లి అవి అమ్మేవాడు. డ్రగ్స్‌కు మారు పేరుగా నిలిచే బ్రెజిల్‌లోని నోవా వెనేసియా అనే ఏరియాలో పుట్టి పెరిగాడు. ఐదుగురు సంతానంలో అందరి కంటే పెద్దవాడు. తినడానికి తిండి లేక ఖాళీ కడుపుతో పడుకున్న రోజులు ఉన్నాయి. తన స్నేహితులు డ్రగ్స్ అమ్ముతూ సులువుగా డబ్బు సంపాదిస్తున్నా.. అది తప్పని తెలిసి దానికి దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి డ్రగ్స్ వ్యాపారం చేసే వ్యక్తి ఒకరు అతని తలకు తుపాకీ గురి పెట్టాడట. తన నుంచి డ్రగ్స్ దొంగిలించిన వాళ్లలో తననూ ఒకడిగా భావించి అతడలా చేసినట్లు రిచర్లీసన్ చెప్పాడు. "ఆ సమయంలో చాలా భయపడ్డాను. ట్రిగ్గర్ నొక్కితే నా పనైపోయేది. కానీ మరోసారి ఇక్కడ కనిపిస్తే చంపేస్తానని బెదిరించి వదిలేశాడు. అలా చావు అంచుల వరకు వెళ్లి తప్పించుకున్నాం" అని చెప్పుకొచ్చాడు. అప్పటికి రిచర్లీసన్ వయసు 14 ఏళ్లు మాత్రమే. అయితే తమ కుటుంబ పరిస్థితి లేకపోయినా తాను ఏడేళ్ల వయసున్నప్పుడు తన తండ్రి తనకు పది ఫుట్‌బాల్స్ గిఫ్ట్‌గా ఇచ్చాడని, అదే తన జీవితాన్ని మార్చేసిందని రిచర్లీసన్ గుర్తు చేసుకున్నాడు. అలా ఫుట్‌బాల్‌పై మక్కువ పెంచకున్న రిచర్లీసన్ ఒక వ్యాపారవేత్త దృష్టిలో పడ్డాడు. అతని ప్రాత్సాహంతోనే తాను ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా ఎదిగినట్లు చెప్పుకొచ్చాడు. ఇక రిచర్లీసన్ అమెరికా మినీరో క్లబ్‌కు వెళ్లాకా అతని దశ మారిపోయింది. అక్కడి నుంచి రిచర్లీసన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇటీవలే ఎవర్టన్ క్లబ్ అతన్ని 6 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. ఎవర్టన్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఒప్పందం ఇది కావడం విశేషం. ఏది ఏమైనా సెర్బియాతో మ్యాచ్‌లో నెయ్మర్ లేని లోటును రిచర్లీసన్ తీర్చాడని బ్రెజిల్ అభిమానులు కామెంట్ చేశారు. On the biggest night of his career, Richarlison turned opportunity into greatness. Can Brazil’s number 9 fire his way to the Golden Boot in Qatar? 🇧🇷 #BRASER 🇷🇸 #POTM #YoursToTake @Budweiser @Budfootball pic.twitter.com/TYCYXUSQz0 — FIFA World Cup (@FIFAWorldCup) November 25, 2022 Richarlison! What have you done?! 🤯#FIFAWorldCup | @richarlison97 pic.twitter.com/kCKFdlINXq — FIFA World Cup (@FIFAWorldCup) November 24, 2022 చదవండి: FIFA WC: బైనాక్యులర్స్‌లో బీర్.. అడ్డంగా దొరికిన అభిమాని -
Viral Video: ఐస్‌క్రీం ఇవ్వకుండా చిన్నారిని ఏడిపించిన వ్యక్తి
-
ఐస్‌క్రీం ఇవ్వకుండా చిన్నారిని ఏడిపించిన వ్యక్తి.. పిల్లలతో ఆటలేంటి?
ఐస్ క్రీం అంటే అందరికి ఇష్టమే.. కాలంతో సంబంధం లేకుండా లొట్టలేసుకుంటూ తింటుంటారు. ఈమధ్య కాలంలో టర్కిష్ ఐస్ క్రీం పేరు అందరినోట ఎక్కువగా వినిపిస్తుంది. కారణం దాని రుచి కాకపోయిన అక్కడి వ్యాపారస్థులు చేసే జిమ్మిక్కులు. దీని వల్లే ఈ ఐస్‌క్రీం ఎక్కువ పాపులర్ అయ్యింది. ఐస్క్రీంను ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వెనక్కి లాగుకుంటూ కస్టమర్లను సరాదాగా ఆటపట్టిస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూసే ఉంటాం. తాజాగా టర్కిష్ ఐస్ క్రీం వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో కౌంటర్ ఎదురుగా ఐస్‌క్రీం కోసం నిలబడి ఉన్న చిన్నారితో విక్రేత ఫ్రాంక్ చేస్తుంటారు. తన ట్రిక్స్‌తో పాపను ఆటపట్టిస్తూ ఉంటాడు. ఐస్ క్రీం కోసం చేయి చాపిన ప్రతీసారి అతను మ్యాజిక్ చేసి ఖాళీ కోన్‌ను ఇస్తుంటాడు. అతని పిచ్చి చేష్టలు అర్థం కాక ఏడవడం మొదలు పెడుతుంది. అయినప్పటికీ ఆ పాపకు ఐస్‌క్రీం ఇవ్వకుండా అలాగే చేస్తుంటాడు. ఐస్‌క్రీం ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వెనక్కు తీసుకుంటాడు. దీంతో పట్టరాని కోపంతో ఖాళీ కోన్‌ను అతనిపై విసిరేస్తుంది. ఎట్టకేలకు ఆ పాప తండ్రి ఆమెను ఎత్తుకున్నాక ఐస్‌క్రీమ్ దక్కుతుంది.ఈ వీడియోను ఓ యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. क्यों परेशान कर रहे हो बेचारी को 😂👏😎 pic.twitter.com/V5slqNAqwr — ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 22, 2022 ఈ వీడియో వైరల్‌గా మారింది. లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంత చిన్న పాపను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. పిల్లలకు ఐస్‌క్రీం అంటే ఎంతో ఇష్టం. వారిని ఏడిపించకండి. పాప ఏడుస్తుంటే మిగతా వాళ్లంతా నవ్వడం ఏంటి. పిల్లల విషయంలో ఇలాంటి జోక్‌లు చేయవద్దు. ఐస్‌క్రీం అమ్మేవాడిని శిక్షించాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రికార్డులు ‘షేక్’!
గంటన్నరలో 266 మిల్క్‌షేక్స్ తయారుచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది యూఎస్‌కు చెందిన ఐస్‌క్రీమ్ కంపెనీ. ఆరిజోనాలోని సెలిగ్మన్లో ఓ కుటుంబం ‘స్నో క్యాప్’ ఐస్‌క్రీమ్ కంపెనీని నిర్వహిస్తోంది. మిల్క్‌షేక్స్‌లో ఫేమస్ అయిన ‘స్నో క్యాప్’... ‘మోస్ట్ మిల్క్‌షేక్స్ ఫ్లేవర్స్ ఆన్ డిస్ప్లే’గా ఈ ఘనతను సొంతం చేసుకుంది. గట్టిగా ప్రయత్నిస్తే... ఓ 50 ఫ్లేవర్స్ చేయొచ్చేమో. కానీ ఈ రికార్డు కోసం నాచోలు, బర్గర్లు, ఇతర ఏ స్నాక్ ఫ్లేవర్‌నూ స్నో క్యాప్ వదిలిపెట్టలేదు. గంటా 35 నిమిషాల్లో 266 ఫ్లేవర్స్‌ను ట్రై చేసి ప్రదర్శించి.. శభాష్ అనిపించుకుంది. -
నాతోనే ప్రాంకా.. ఐస్‌క్రీం వ్యాపారికి షాక్ ఇచ్చిన బుడ్డోడు.. వీడియో వైరల్
టర్కీలో ఐస్‌క్రీం వ్యాపారస్థులు కస్టమర్లను భలే ఆటపట్టిస్తుంటారు. కోను చేతిలో పెట్టినట్టే పెట్టి టక్కున వెనక్కి లాగేసుకుంటారు. నోరూరించే ఐస్‌క్రీం తిందామని వెళ్లిన వారికి ఫ్రస్టేషన్ వచ్చే వరకు ప్రాంక్ చేస్తూనే ఉంటారు. చివరకు కస్టమర్లకు నీరసం వచ్చే టైంలో ఐస్‌క్రీం చేతిలో పెడతారు. ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూశాం. కానీ ఓ బుడ్డోడు ఇలానే ప్రాంక్ చేద్దామనుకున్న ఓ టర్కీ ఐస్‌క్రీం వ్యాపారస్థుడికి షాక్ ఇచ్చాడు. ప్రాంక్ చేద్దామనుకుంటే చుక్కలు చూపించాడు. ఐస్‌క్రీం కోను చేతిలో పెట్టి వెనక్కి లాగేసుకుందాం అనే లోపే.. ఈ బుడ్డోడు ఐస్‌క్రీం ఇచ్చే కర్రను చేతితో బిగ్గరగా పట్టుకున్నాడు. అంతేకాదు ఐస్‌క్రీం వెండర్ చేతిపై కొట్టాడు. బాల భీముడిలా ఉన్న పిల్లాడి బలం ముందు ఆ వెండర్ నిలబడలేకపోయాడు. ఐస్‌క్రీం స్టిక్ వెనక్కి తీసుకునేందుకు వంగి వంగి ప్రయత్నించినా సఫలం కాలేకపోయాడు. చివరకు బుడ్డోడు హీరోలా తన ఐస్‌క్రీం తీసుకొని హాయిగా తినుకుంటూ వెళ్లాడు. అక్కడున్న వారంతా బుడ్డోడి చర్యను చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. View this post on Instagram A post shared by Dinesh Kumar (@black_dancer_dinesh) ఓ వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. బుడ్డోడిని అనేక మంది మెచ్చుకుంటున్నారు. ప్రాంక్ చేద్దామనుకుంటే షాక్ ఇచ్చాడు.. చిన్నోడు మామూలోడు కాదు అని కొనియాడారు. చదవండి: ఏడుస్తున్న చిన్నారిని కౌగిలించుకున్న మేఘన్.. వీడియో వైరల్ -
స్విగ్గీలో ఐస్‌క్రీం, చిప్స్ ఆర్డర్ చేస్తే.. డెలీవరీ చూసి షాక్ అయిన వ్యక్తి
చెన్నై: ఒకప్పుడు ఏదైనా కావాలి అంటే స్వయంగా వెళ్లి కొని తెచ్చుకునే వాళ్లం. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందింది. ఫుడ్ నుంచి గ్రాసరీస్, మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, హోం నీడ్స్ ఇలా ప్రతిదీ.. ఫోన్లో ఆర్డర్ చేస్తే క్షణాల్లో మన ముందు వాలుతోంది. అయితే అప్పుడు ఆర్డర్లు ఆలస్యం అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం లేదా మనం చెప్పినా వస్తువుకు బదులు వేరే వస్తువు డెలివరీ అవ్వడం వంటి పొరపాట్లు సాధారణంగా జరుగుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ న్యూస్ మీడియాలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం(ఆగస్టు 27) రాత్రి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ నుంచి తన పిల్లల కోసం ఐస్ క్రీమ్, చిప్స్ ఆర్డర్ చేశాడు. అయితే తీరా ఆర్డర్ డెలివరీ అయ్యాకి.. పార్శిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువును చూసి ఖంగుతున్నాడు. ఐస్‌క్రీం, చిప్స్‌కు బదులు కండోమ్‌లు ఉన్నాయి. ఇది చూసి షాక్ తిన్న అతను దానిని ఫోటో తీసి తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. చదవండి: 14 సింహాలు వెంటపడినా జడవలేదు.. ఒంటరైనా బెదరలేదు! ఇక జరిగిన పొరపాటుపై స్విగ్గీ సంస్థ స్పందించింది. తప్పుడు వస్తువు డెలివరీ చేసినందుకు సదరు వ్యక్తికి క్షమాపణలు చెప్పి, డబ్బును తిరిగి ఇచ్చింది. అయితే ఓ ఫుడ్ డెలివరీ కంపెనీలో ఇలాంటి వస్తువులు డెలివరీ చేయడం ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ కంపెనీ నుంచి కండోమ్ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. -
మండే ఎండల్లో చల్లని ఆఫర్.. రూ.2కే కోన్ ఐస్‌క్రీం.. ఎక్కడంటే?
నలువైపులా ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు రోహిణి కార్తెలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇలాంటి సమయంలో చల్లచల్లని కోన్ ఐస్క్రీంని కేవలం రూ.2లకే అందిస్తోంది ఓ ఐస్‌క్రీం పార్లర్. దీంతో ఒక్కసారిగా ఈ పార్లర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఎక్కడుంది ఈ పార్లర్, ఎందుకు అంత తక్కువ ధరకు అమ్ముతున్నారు. క్వాలిటీ బాగుంటుందా అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తమిళనాడులో చైన్నైలోని మాంబలం ఏరియాలో 1995లో వినూ ఇగ్లూ పేరుతో ఐస్‌క్రీం పార్లర్ ప్రారంభమైంది. ఆ రోజుల్లో ఇక్కడ కోన్ ఐస్క్రీని కేవలం రెండు రూపాయలకే అమ్మారు. దీంతో ఆ పార్లర్ ఆ ఏరియాలో క్లిక్ అయ్యింది. తమ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అదే కావడంతో ఐస్ క్రీం ధర మాత్రం మార్చలేదు. అయితే అనుకోని కారణాల వల్ల 2008లో ఈ పార్లర్ మూత పడింది. అక్కడి ప్రజలకు తక్కువ ధరకే నోరూరించే ఐస్‌క్రీం దూరమైంది. రూ.2 చాలు మాకు వినూ ఇగ్లూ ఐస్‌క్రీం పార్లర్‌ని 2022 ఫిబ్రవరిలో తిరిగి తెరిచాడు దాని యజమాని వినోద్. పాత కష్టమర్లకు ఆకట్టుకునేందుకు ప్రారంభ ఆఫర్‌గా కోన్ ఐస్‌క్రీం ధర రూ.2గానే నిర్ణయించారు. కొద్ది రోజుల తర్వాత ధరను మార్కెట్‌కు అనుగుణంగా మార్చాలని అనుకున్నారు. కానీ రూ.2 కోన్ ఐస్‌క్రీం కొనేందుకు వస్తున్న పాత కొత్త కస్టమర్లు చూపిస్తున్న ప్రేమ. ఆనాడు తన తండ్రి ప్రారంభించిన రూ.2 ఐస్‌క్రీం తమను ఎంతగా ఆకట్టుకుందో వారు చెప్పే విధానం చూశాక ధర మార్చ కూడదనే నిర్ణయానికి వచ్చాడు వినోద్. ఎలా సాధ్యం వినూ ఇగ్లూ స్పెషాలిటీగా కోన్ ఐస్‌క్రీం ధరను రూ.2గానే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వేసవి మొదలైన తర్వాత ఒక్కసారిగా వినూ స్టోరీ చెన్నై అంతటా పాకిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మీడియా, సోషల్ మీడియా ద్వారా వినూ పాపులారిటీ పెరిగిపోయింది. ఓ వైపు ధరలు మండిపోతుంటే రూ.2కే ఐస్ క్రీం ఎలా ఇవ్వగలుగుతున్నారంటూ అంతా వినోద్‌ను ప్రశ్నిస్తున్నారు. సెంటిమెంట్ కస్టమర్ల ప్రశ్నలకు వినోద్ సమాధానం ఇస్తూ.. పూర్తిగా పాలతోనే ఐస్‌క్రీం తయారు చేస్తాం. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాము. మార్కెట్లో ఈ ఐస్‌క్రీం సగటు ధర రూ.20గా ఉంది. కానీ మేము మాత్రం రూ.2కే విక్రయిస్తున్నాం. అయితే ఈ ఐస్‌క్రీం తినేందుకు వచ్చే జనాలు అధిక లాభాలు ఉండే కేకులు, పాలకోవాలు కొనడం ద్వారా నష్టం భర్తీ అవుతుంది. మా నాన్న ప్రారంభించిన రూ.2 ఐస్‌క్రీం అనే ఎమోషన్ కొనసాగుతుంది అంటూ బదులిచ్చారు. చదవండి: నెలకు రూ.3.30 కోట్ల జీతం ఇస్తామన్నా వద్దన్నాడు.. చివరికి.. -
అందాల అనుపమ (ఫోటోలు)
-
ఐస్‌క్రీం తిని ఫ్లేవర్ చెప్తే చాలు.. రూ. లక్ష మీవే..
సాక్షి, హైదరాబాద్: హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో ‘ది గ్రేట్ ఇండియా ఐస్‌క్రీం టేస్టింగ్ చాలెంజ్’ నిర్వహిస్తున్నట్లు హైబిజ్ టీవీ ఎండీ రాజగోపాల్ తెలిపారు. గురువారం గోల్కొండ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండియన్ ఐస్‌క్రీం మాన్యుఫ్రాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధీర్‌షా, దొడ్ల డెయిరీ ఐసీక్రీమ్స్ ప్రతినిధి అజయ్ సింహాలతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న హైటెక్స్‌లో ఈ ఛాలెంజ్ నిర్వహిస్తున్నామని, కళ్లకు గంతలు కట్టుకుని ఐస్‌క్రీం రుచి చూసి నగదు బహుమతిని గెలుచుకోవచ్చునన్నారు. ఈ సందర్భంగా నటి, మిస్ఇండియా–2018 స్పందన కళ్లకు గంతలు కట్టుకుని ఏ విధంగా ఐస్‌క్రీం రుచి చూడాలో చేసి చూపించారు. మొదటి బహుమతిగా రూ. లక్ష, రెండో బహుమతి రూ.50 వేలు, ఉత్తమ ప్రతిభ కనబరచిన 25 మందికి రూ. 10 వేల చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ఛాలెంజ్‌లో పలు ఫ్లేవర్ల ఐస్క్రీంలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ చాలెంజ్‌లో ఎవరైనా పాల్గొనవచ్చునని రూ. 150 ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు 8340974747 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. చదవండి: రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్.. ‘వన్ ప్లస్’తో చిక్కాడు! -
విజయడెయిరీ లక్ష్యం.. వెయ్యి కోట్ల టర్నోవర్
సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: విజయడెయిరీ టర్నోవర్‌ను రూ.వెయ్యికోట్లకు చేర్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. మూసివేత దశకు చేరుకున్న విజయడెయిరీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రూ.750 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని చెప్పారు. డిమాండ్ దృష్ట్యా విజయ డెయిరీ ఉత్పత్తులను పెంచేందుకు రూ.250 కోట్ల వ్యయంతో మెగాడెయిరీని కూడా నిర్మిస్తున్నామని అన్నారు. శనివారం ఇక్కడి నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద జరిగిన కార్యక్రమంలో విజయ ఐస్క్రీంలకు సంబంధించిన 66 పుష్కార్ట్స్ (ట్రైసైకిల్స్)ను శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ విజయడెయిరీ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడమే కాకుండా యువతకు ఉపాధి కల్పించేదిశగా ముందుకెళుతోందన్నారు. విజయ ఔట్లెట్ల నిర్వాహకులకు 50 శాతం సబ్సిడీపై ఫ్రిజ్‌లు, పుష్కార్ట్స్ ఇస్తున్నామని, దూద్‌పెడ, బటర్‌మిల్క్, లస్సీ, ఐస్‌క్రీంలు ఇలా ఎన్నో ఉత్పత్తులను యువత విక్రయించి ఉపాధి పొందేవిధంగా ఈ కార్ట్స్ అందిస్తున్నామని చెప్పారు. పర్యాటక ప్రాంతాలు, పార్కులు, హైవేలు, దేవాలయాల వద్ద విజయ ఉత్పత్తులను విక్రయించేవిధంగా ఈ ట్రైసైకిల్స్ ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాలు మనరాష్ట్రంలో ఉత్పత్తి కావడంలేదని, దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాలను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చర్యల నిమిత్తం అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించామన్నారు. విజయడెయిరీకి పాలుపోసే రైతులకు లీటర్‌కు రూ.4 చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ఇస్తున్నామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అధర్ సిన్హా, డైరెక్టర్ రాంచందర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, విజయ డెయిరీ అధికారులు పాల్గొన్నారు. -
Summer Tips: మితిమీరి ఐస్‌క్రీములు తింటే.. ఇక అంతే!
వేసవిలో ఐస్‌క్రీములు, కూల్‌డ్రింకుల కోసం చాలామంది ఆరాటపడుతుంటారు. ఇవన్నీ ఎండ ధాటి నుంచి తక్షణ ఉపశమనం కలిగించవచ్చునేమో గాని, దీర్ఘకాలంలో వీటివల్ల రకరకాల అనర్థాలు, ఆరోగ్య సమస్యలు తప్పవు. మితిమీరి ఐస్‌క్రీములు తింటే దీర్ఘకాలంలో స్థూలకాయం, మధుమేహం వంటివి తప్పవు. వీటికి తోడు రసాయనాలు కలిసిన కూల్డ్రింకులు తాగితే, ఈ సమస్యలకు తోడు పేగుల్లో సమతుల్యత దెబ్బతిని, జీర్ణకోశ సమస్యలూ తలెత్తే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల వేసవిని చల్లగా గట్టెక్కేయాలంటే చక్కగా మన పెద్దలు చెప్పిన మార్గాన్నే అనుసరించడం ఎంతైనా క్షేమం. ‘పెద్దలమాట చద్దిమూట’ అని ఊరకే అనలేదుగా మరి! అసలు వేసవిలో చద్దన్నానిదే అగ్రస్థానం. వేసవిలో ఉదయంపూట వేడివేడిగా తినే నానా రకాల అల్పాహారాల కంటే చల్లగా చద్దన్నం తినడమే శ్రేష్ఠం. భారత ఉపఖండంలోను, దక్షిణాసియా దేశాల్లోను చద్దన్నం తినడం తరతరాల అలవాటు. వేర్వేరు ప్రాంతాల్లో చద్దన్నాన్ని వేర్వేరు పేర్లతో పిలుచుకుంటారు. ఇందులోనే చిన్న చిన్న మార్పులతో రకరకాల రుచులను తయారు చేసుకుంటారు. తమ తమ స్థానిక వంటకాలను ఇందులో నంజుకుంటారు. ఇక వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కొబ్బరినీరు, నిమ్మరసం, మజ్జిగ వంటి పానీయాలను సేవించడం దేశవ్యాప్తంగా చిరకాలంగా ఉన్న అలవాటే. కాబట్టి ఐస్‌క్రీములు, కూల్‌డ్రింక్స్ జోలికి పోకుండా ఎంచక్కా వీటితో ఆరోగ్యకర రీతిలోనే భానుడి ప్రతాపం నుంచి విముక్తి పొందండి. చదవండి: Lemon Juice: నిమ్మరసంలో పంచదార కలుపుకొని తాగుతున్నారా? అయితే -
50 శాతం సబ్సిడీతో ‘ఐస్‌క్రీం సైకిళ్లు’
సాక్షి, హైదరాబాద్: విజయ పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు ఐస్ క్రీం పుష్ కార్ట్ (ట్రై సైకిల్)లను రాష్ట్రవ్యా ప్తంగా 50 శాతం సబ్సిడీతో అందించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో విజయ తెలంగాణ బోర్డు 14వ సమావేశం చైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటర్ పాలకు రూ.4 ఇన్సెంటివ్‌తో పాటు అదనంగా పాడి రైతుల పిల్లలను విద్యలో ప్రోత్సహించే విధంగా విద్యాకానుక, ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సహాయం కింద రూ. 5 వేలు, సబ్సిడీపై దాణా, ఉచిత పశువైద్య శిబిరాలు, పాడి పశువుల కొనుగోలుకు ఆర్థిక సాయం, మిల్క్‌షెడ్‌లకు అవార్డులు, ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయాలను విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. మేలుజాతి పశుసంపద అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న స హకారం గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వారు విజయ డెయిరీకే పాలు పోసేవిధంగా చూడాలని మంత్రి సూ చించారు. పాడి రైతులకు ప్రతి 7 రోజుల కు ఒకసారి బిల్లులను చెల్లించాలని సమావేశం తీర్మానించింది. పాల సేకరణ, ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం అవసరమైన సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ని యమించుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రధాన పర్యాటక ప్రాంతా లు, ప్రముఖ దేవాలయాల వద్ద విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, సమ్మక్క సారక్క, కొమురెల్లి జాతర వంటి ప్రధాన జాతరలలో తాత్కాలిక ఔట్లెట్లను ఏర్పాటుచేసి విజయ డెయిరీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని మంత్రి తెలిపారు. -
ఐస్ క్రీం విక్రయించనందుకు మొత్తం స్టాక్‌నే పాడు చేశాడు!!
పిల్లలు ఐస్‌క్రీం కావాలని మారం చేస్తే ఏదో రకంగా ఎక్కడికైన వెళ్లి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ అది వేళకాని వేళ అయితే కాస్త బుజ్జగించడానికి ప్రయత్నించటమో లేక వేరే ఏదైన కొని ఇవ్వడం చేస్తాం. కానీ ఇక్కడొక వ్యక్తి పిల్లలు ఐస్‌క్రీం అడిగితే షాపు యజమాని ఇవ్వనన్నాడని ఏం చేశాడో చూడండి. (చదవండి: పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి అక్కడ రూ.23 లక్షల రుణాలు ఇస్తారట!) అసలు విషయంలోకెళ్లితే...ముంబైలో వసాయ్ కౌల్ హెరిటేజ్ సిటీలోని ఓ వ్యక్తి తన పిల్లలతో కలిసి రాత్రి రెండు గంటల సమయంలో మెడికల్ స్టోర్ పక్కన ఉన్న ఐస్క్రీ షాపు వద్దకు వెళ్లాడు. అయితే ఆ సమయంలో షాపు మూసే నిమిత్తం అన్ని సర్దుకుంటున్నాడు. పైగా ఏంటీ ఈ సమయంలో వచ్చారు అన్నట్లుగా ఆశ్చర్యపోతూ ఆ వ్యక్తి వంకా చూశాడు. ఇంతలో సదరు వ్యక్తి వచ్చి ఐస్‌క్రీం అడగటంతో అతను ఇప్పుడు విక్రయించను అని చెప్పాడు. దీంతో అతను యజమానిని కోపంగా బెదిరించడం వంటివి చేశాడు. ఆ తర్వాత కాసేపటి ఒక ఇనుపరాడ్‌ని తీసుకుని ఐస్‌క్రీం స్టాక్ ఉన్న గాజు ఫ్రీజర్లను పగలు కొట్టేసి వెళ్లిపోతాడు. పాపం దుకాణ యజమానికి సదరు వ్యక్తి భారి నష్టాన్ని మిగిల్చి వెళ్లిపోతాడు. అయితే ఇదంతా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. దీంతో ముంబై సబర్బ్ వసాయ్‌లోని మానిక్‌పూర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి అతని ఆచూకి కోసం గాలిస్తున్నారు. (చదవండి: చైనా సైబర్‌స్పేస్ చివరి యుద్ధం!...ఇంటర్నెట్ క్లీన్ అప్!!) -
ఐస్‌క్రీమ్ చల్లగా ఉందేంటి, నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి.. కస్టమర్ ఫిర్యాదు
గతంలో పుడ్ తినాలంటే హోటల్‌కి వెళ్లి తినేవాళ్లం. కానీ స్విగ్గి, జొమాటో లాంటి ఆన్లైన్ యాప్‌లు వాడకంలోకి వచ్చాక కూర్చున్న చోటు నుంచే నచ్చిన పుడ్‌ని తెప్పించుకు తింటున్నాం. కస్టమర్ల సౌకర్యం కోసం ఆన్లైన్ పుడ్ డెలివరీ యాప్‌లు కొన్ని రూల్స్‌ని పాటిస్తుంటాయి. అయితే కొందరు కస్టమర్లు మాత్రం వీటిని అలుసుగా తీసుకుని డబ్బులు ఇవ్వకుండా కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఇటువంటి ఘటనలే యూకేలోని ఓ హోటల్లో చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. యూకేలోని ఓల్డ్‌హామ్‌లో హాసన్ హాబిబ్ అనే వ్యక్తికి జస్ట్ ఈట్ అనే రెస్టారెంట్ ఉంది. అన్ని హోటల్లో లానే అందులో టేక్ అవే సౌకర్యం ఉంది. ఆ ప్రాంతంలో పుడ్ సరిగా లేకుంటే మనీ రీఫండ్ లాంటి స్వీమ్‌లు కొన్ని కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే కొందరు దాన్నే అదునుగా తీసుకుని ఫుడ్ ఆర్డర్ చేస్తూ డెలివరీ అయ్యాక ఏదో ఒక సాకులు చెప్పి.. డబ్బులు రిఫండ్ చేయాలంటూ రెస్టారెంట్‌పై ఫిర్యాదులు చేస్తున్నారట. ఇటీవల ఓ కస్టమర్.. ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసి డెలివరీ కాగానే ఐస్‌క్రీమ్ చల్లగా ఉంది నాకేమి నచ్చలేదు మనీ రిఫండ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టాడట. ఇదొక్కటే కాదు ఇలాంటి సిల్లీ కారణాలతో మనీ రిఫండ్ చేయాలని ఫిర్యాదులు రోజు వస్తూనే ఉండడంతో ఆ రెస్టారెంట్ ఓనర్ ఆన్లైన్ ఆర్డర్స్, టేక్ అవేని ఆపేశాడట. చివరకి ఆ రెస్టారెంట్ యజమాని తన కస్టమర్లు ఎవరైనా ఫుడ్‌పై ఫిర్యాదు చేయాలనుకుంటే.. దానికి కొంత చార్జ్ వసూలు చేయడం మొదలు పెట్టాడు. కనీసం 30 రోజుల గడువు తీసుకొని ఆలోపు కస్టమర్ల ఫిర్యాదులో పేర్కొన్న విధంగా సమస్య ఉంటే.. రిఫండ్ ఇవ్వడం ప్రారంభించారు. చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే! -
జీఎస్టీ షురూ: ఐస్‌క్రీమ్ పార్లర్లు, స్టోర్ల నిర్వాహకులకు షాక్
న్యూఢిల్లీ: పార్లర్లు లేదా స్టోర్లు విక్రయించే ఐస్‌క్రీమ్‌లపై 18 శాతం జీఎస్టీ అమలవుతుందని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) స్పష్టం చేసింది. గత నెల 17నాటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 21 వస్తు, సేవల జీఎస్టీ రేట్ల లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకోగా.. వీటికి సంబంధించి వర్తక సంఘాలు వివరణలు కోరడంతో సీబీఐసీ తాజా ఆదేశాలిచ్చింది. తయారైన ఐస్‌క్రీమ్‌లను విక్రయించే కేంద్రాలే పార్లర్ల కిందకు వస్తాయని.. రెస్టారెంట్ తరహావి కాదని స్పష్టం చేసింది. ఐస్‌క్రీమ్‌ను ఒక ఉత్పత్తి (తయారు చేసిన) గా అందించడానికే వాటి పాత్ర పరిమితం అవుతుందని.. రెస్టారెంట్ మాదిరి ఏ తరహా ఉడికించే కార్యకలాపాల్లో పాల్గొనేవి కావంటూ వివరించింది. -
Viral: అచ్చం పుల్ల ఐస్ రూపంలో ఇడ్లీలు!
దక్షిణ భారతదేశంలో ఇడ్లీ బ్రేక్‌ఫాస్ట్ చాలా ఫేమస్. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇడ్లీలను సాంబార్‌తో తింటే రుచికరంగా ఉంటుందని నమ్ముతారు. అయితే సాధారంగా ఇడ్లీలు గుండ్రంగా ఉంటాయి. తాజాగా ఐస్ క్రీమ్ స్టిక్ రూపంలో ఉన్న ఇడ్లీలకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఓ ఇడ్లీ ఐస్ క్రీమ్ స్టిక్ రూపంలో ఉండి.. సాంబారులో ముంచబడి ఉంది. పక్కనే మరో చిన్న గిన్నేలో చట్నీ కూడా ఉంది. చదవండి: Viral Food Challenge: రండి.. 20 నిమిషాల్లో తినండి 20 వేలు గెలవండి ఈ ఫోటోను మైక్రో అంబీషియస్ అనే ఓ ట్విటర్ ఖాతా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే విధంగా ‘ఒక్క ప్రశ్న, ఎందుకు??’ అని కాప్షన్ జతచేశారు. అయితే ఈ ఫోటోను చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ‘వావ్ అచ్చం ఐస్ క్రీమ్‌లా ఉన్నాయి ఇడ్లీలు’, ‘చిన్న పిల్లలు తినడానికి బాగుంటుంది’ అని కామెంట్లు చేస్తున్నారు. Just one question, why?? pic.twitter.com/lH6lAA7r39 — Micro-ambitious (@pal36) September 30, 2021 -
Biggest Ice Gola: ఈ ఐస్‌గోళా అతిపె..ద్ద..ది.. ధర ఎంతంటే!!
వాన పడితే చాలు వేడి వేడీ బజ్జీలు, పకోడీలు గుర్తుకొస్తాయి. ఇక ఎండాకాలంలో అయితే చల్లని పానియాలు, ఐస్‌క్రీమ్‌లు.. ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోతాం. అలాగే ఇతర సీజన్లలో కూడా.. రొటీన్‌కి భిన్నంగా కొత్త రుచుల కోసం ఎప్పుడూ వెదుకుతూనే ఉంటాం! ఋతువుకో రుచన్నమాట. సాధారణంగా వేసవికాలంలో ఏ వీధిలోనైనా ఐస్‌గోళా బండి కనిపిస్తుంది. నలగ్గొట్టిన ఐస్‌ను గోళాకారంలో అమర్చి, నచ్చిన ఫ్లేవర్‌లో, రకరకాల రంగుల్లో భిన్న రుచుల్లో అందిస్తారు. వీటిని పిల్లలు, పెద్దలు ఆహ్లాదంగా ఆస్వాదిస్తారు. ఐస్‌గోళా పాపులర్ రుచుల్లో కలఖట్టా ఫ్లేవర్ ఒకటి. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎందరో. ఐతే తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి 5 కేజీల అతిపెద్ద ఐస్గోళాను తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ భారీ ఐస్గోళాకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వేలకొద్ది నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ప్రముఖ ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఈ వీడియోలో దీని తయారీ విధానాన్ని మనం చూడొచ్చు. మూడున్నర కేజీల నలగ్గొట్టిన ఐస్‌ను కోలాకారంలో తయారు చేసిన తర్వాత దీనిపై మ్యాంగో , చాక్లెట్లతో పాటు భిన్న రుచుల చిక్కని ద్రావణాలను పోశారు. దీని పై భాగంలో కేసర్ రబ్రీ, తాజా క్రీమ్‌లను జోడించారు. వీటన్నింటినీ చేర్చడంతో మరికొంచెం పెద్దగా తయారైంది. తర్వాత కోవాను తురిమి, నాలుగు స్పూన్ల ఐస్‌క్రీమ్‌ను పై భాగంలో ఉంచారు. వీటిపై క్రీమ్‌తో మరొక పొరను వేశారు. చివరిగా చెర్రీస్, చాక్లెట్ చిప్స్, బాదం పప్పు, సిరప్‌లతో అలంకరించారు. నోరూరించేలా ఉన్న ఈ ఐస్‌గోళా దేశంలోనే అతిపెద్దదని, 12 మంది తినగల ఈ గోళా ఖరీదు రూ.999లని అమర్ సిరోహి చెప్పుకోచ్చాడు. చదవండి: ఘుమఘుమలాడే బెంగాలీ రొయ్యల ఇగురు, క్యాబేజీ చికెన్.. ఎలా వండాలంటే.. -
కుకర్ని మడచి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోండి!
హైక్వాలిటీ టెక్నాలజీతో 3 ఇన్ 1 రిమూవబుల్ నాన్–స్టిక్ లార్జ్ ప్లేట్స్ ఉన్న ఈ గ్రిల్.. సరికొత్త లగ్జరీ లుక్‌తో వినియోగదారులని ఇట్టే ఆకర్షిస్తోంది. ‘హై, మీడియం, లో’ అనే త్రీ లెవల్స్ టెంపరేచర్ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ కలిగిన ఈ గాడ్జెట్‌పై.. శాండ్విచ్, వాఫిల్స్, బార్బెక్యూ స్టిక్స్.. వంటివెన్నో సిద్ధం చేసుకోవచ్చు. మన్నికైన నాన్–స్టిక్ పూత పూసిన ఈ ప్లేట్స్ తక్కువ నూనెతో కరకరలాడే రుచులని అందిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మేకర్‌కు ఆహారం అతుక్కోదు. దాంతో మృదువైన తడి గుడ్డతో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఈ మేకర్ చిన్నపాటి సూట్‌కేస్‌లా ఉంటుంది. వాఫిల్స్, శాండ్విచ్లకు 2 జతల ప్లేట్స్, గ్రిల్ చేసుకోవడానికి ఒక పొడవాటి ప్లేట్.. మొత్తంగా 5 ప్లేట్స్ విడివిడిగా లభిస్తాయి. చిత్రంలో చూపించిన విధంగా 180 డిగ్రీల దగ్గర టెంపరేచర్ సెట్ చేసుకొని దానిపైన గ్రిల్ ప్లేట్ పెట్టుకుని.. ఆహారాన్ని గ్రిల్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అన్నీ ముందువైపు వివరంగా ఉండటంతో దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. ఫ్రిక్సెన్ ఐస్‌క్రీమ్ రోలర్ ప్లేట్ మెనూలోని డెజర్ట్స్ సెక్షన్లో సాధారంగా అందరూ ఆత్రంగా వెదికేది.. తప్పకుండా కనిపించేది ఐస్‌క్రీమ్. బయటకొంటే.. కరిగేలోపు తినెయ్యాలి. కష్టపడి ఇంట్లో చేసుకుంటే.. గడ్డకట్టే దాకా ఎదురుచూడాలి. అందుకే ఐస్‌క్రీమ్ ప్రియుల కోరిక మేరకు.. నచ్చినప్పుడు, నచ్చిన విధంగా నిమిషాల్లో ఐస్‌క్రీమ్ రోల్స్ తయారుచేసుకుని, ఆనందంగా ఆస్వాదించే అవకాశాన్ని కలిపిస్తోంది ఫ్రిక్సెన్ ఐస్‌క్రీమ్ రోలర్ ప్లేట్. దీనికి పవర్‌తో పనిలేదు. ఇది 24 గంటలు ఫ్రిజ్‌లో ఉంటే.. కావాల్సినప్పుడు ఐస్‌క్రీమ్ చేతిలో ఉన్నట్టే. అదెలా అనేగా మీ డౌట్? ఏం లేదు.. రెసిపీ ముందే రెడీ చేసి పక్కనపెట్టుకుని.. ఫ్రిజ్‌లోంచి ఈ మేకర్ బయటికి తీసి.. దాని ప్లేట్లో ఆ మిశ్రమాన్ని పోసి.. పలచగా అంతా పరచాలి. 6 నుంచి 8 నిమిషాల పాటు.. అలానే ఉంచి రోల్స్‌లా తీసి సర్వ్ చేసుకోవాలి. లేదంటే అప్పటికప్పుడు మేకర్‌పైనే రెసిపీని సిద్ధం చేసుకోవచ్చు. గాడ్జెట్‌తో పాటు.. రెండు గరిటెలు లభిస్తాయి. వాటితోనే మేకర్ మీద అరటిపండ్లు, చాక్లెట్స్లు ఇలా వేటినైనా మెత్తగా గుజ్జులా చేసుకుని, కస్టర్డ్‌మిల్క్, ఎసెన్స్ వంటివి జోడించి టేస్టీగా ఐస్‌క్రీమ్ రోల్స్‌లా చేసుకోవచ్చు. పిల్లలు సైతం సులభంగా తయారు చేసుకోవచ్చు. పైగా పూరై్తన తర్వాత ప్లేట్ కడిగినట్లు కడిగి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అల్యూమినియం ప్లేట్‌తో రూపొందిన ఈ మేకర్ ఎర్గోనామిక్ డిజైన్, హై–క్వాలిటీ మెటీరియల్‌తో మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతోంది. మరో విషయం దీన్ని 24 గంటలూ ఫ్రిజ్‌లో ఉంచడం కుదరకుంటే.. కనీసం 12 గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మేకర్స్ దీర్ఘచతురస్రాకారం లో లేదా గుండ్రంగా చాలా రంగుల్లో లభిస్తున్నాయి. క్వాలిటీని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఫోర్టబుల్–ఫోల్డబుల్ ‘ప్రయాణాల్లో హోటల్ ఫుడ్ కంటే.. స్వయం పాకాలే బెస్ట్..’ అని ఎవరైన సలహా ఇస్తే.. ‘భలే చెప్పొచ్చారు.. కుకర్ని మడచి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోమంటారా..?’ అని వెటకారమాడకండి. ఎందుకంటే దాన్ని నిజం చేసేసింది టెక్నాలజీ. చిత్రంలోని కుకర్ని చక్కగా చిన్న పాటి బాక్స్లా మడచి వెంటతీసుకుని వెళ్లొచ్చు. 600ఎమ్ఎల్ సామర్థ్యం కలిగిన హై–క్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిన మినీ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ హాట్ పాట్.. చాలా రుచులని నిమిషాల్లో రెడీ చేయగలదు. ఫుడ్–గ్రేడ్ ఆర్గానిక్ సిలికాన్‌తో తయారైన ఫ్లెక్సిబిలిటీ మేకర్లో.. వాసన లేకుండా అధిక ఉష్ణోగ్రతపై వంట చేసుకోవచ్చు. దీని 304 స్టెయిన్లెస్ స్టీల్ బేస్ తుప్పు పట్టదు. గాడ్జెట్ ముందు భాగంలో సున్నితమైన టచ్ కంట్రోల్ ప్యానెల్‌పై అన్ని ఆప్షన్స్ ఉంటాయి. దాంతో రైస్, నూడూల్స్, సూప్స్, ఎగ్స్, సీఫుడ్.. ఇలా చాలానే సిద్ధం చేసుకోవచ్చు. చదవండి: Attractive Mini Charpoy Trays: నులక మంచం ట్రే, తోపుడి బండి ట్రే.. ఇంకా.. -
క్రీడల్లో మౌలిక విజయాలకు మోదీ దన్ను
మన ప్రధానమంత్రి నీరజ్ చోప్రాకు లడ్డూ రుచిచూపించడం, పి.వి.సింధు కోసం ఐస్ క్రీమ్ తెప్పించడం, బజ్రంగ్ పూనియాను చిరునవ్వుతో పలకరించడం, సదా నవ్వుతూ ఉండాలని రవి దహియాకు ఆప్యాయంగా సూచించడం, మీరాబాయి చాను అనుభవాలను పంచుకోవడం వంటి దృశ్యాలన్నీ చూసిన ప్రతి ఒక్కరిలో చిరునవ్వులు విరబూశాయి. అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరి తోనూ ఆయన కాసేపు ముచ్చటించడం మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. ఆ మరునాడు పారాలింపిక్ క్రీడాకారులతోనూ మాటామంతీ నిర్వహించి వారి స్ఫూర్తిదాయక క్రీడా పయనం గురించి తెలుసుకున్నారు. భారత క్రీడాకారుల కోసం ఏ నిర్ణయమైనా తీసుకోగల వ్యక్తి కూడా ప్రధానిలో కనిపిస్తారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే అక్కడ మన క్రీడాకారుల సంసిద్ధతపై నరేంద్ర మోదీ విస్తృత స్థాయి సమీక్ష నిర్వ హించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన క్రీడా మహా కుంభమేళాను ప్రారంభించారు. దీంతో అప్పటి దాకా క్రీడాంగణంలో చారిత్రక నైపుణ్యం అంతగా కానరాని ఆ రాష్ట్రంలో అట్టడుగు స్థాయి నుంచీ క్రీడాస్ఫూర్తి పెల్లుబికింది. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్స హించడంలో నరేంద్ర మోదీకి తనదంటూ ఒక పద్ధతి ఉంది. కొన్ని రోజుల కిందట 2013 నాటి ఒక వీడియో విస్తృత ప్రాచు ర్యంలోకి వచ్చింది. అది పుణెలో కొందరు కళాశాల విద్యార్థులను ద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న వీడియో. ప్రతిభగల భారీ జనాభాతోపాటు భారతదేశానికి ఉజ్వల క్రీడాచరిత్ర ఉన్నప్పటికీ ప్రతి ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్యను పెంచుకోవడానికి పెనుగులాడాల్సి రావడం శోచనీయమని తన ప్రసంగంలో ఆయన ఎంతో వేదన వ్యక్తం చేశారు. భారత్ వంటి దేశం ఒలింపిక్స్ విజయాలు పొందలేకపోవ డానికి సమస్య క్రీడాకారుల పరమైనది కాదని... వారికి సముచిత ప్రోత్సాహ కల్పనలో వ్యవస్థ వైఫల్యమే కారణమని తనకు అర్థమైంద న్నారు. క్రీడలకు తగిన మద్దతు, గౌరవం లభించాల్సి ఉందని అభిప్రా యపడ్డారు. ఈ నేపథ్యంలో తమ ఓటమి సందర్భంగా ప్రధాని స్వయంగా సంభాషించడమే తమ నైతిక స్థైర్యం ఇనుమడించడంలో కీలకపాత్ర పోషించిందని పురుషుల, మహిళల హాకీ జట్లు చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. ఇక క్రీడల విషయానికొస్తే– క్రీడల్లో పాల్గొనడానికి... ఆ దిశగా యువతకు లభించే ప్రోత్సాహానికీ మధ్య విస్తృత అగాథం ఉందని గుర్తించారు. ఒలింపిక్స్ విజేతలతో విందు సమావేశం అనంతరం మాట్లాడుతూ– ‘‘క్రీడలలో మనవాళ్ల ఇటీవలి విజయాలను చూశాక ఆటలపై తల్లిదండ్రుల ధోరణిలో సానుకూల మార్పు తప్పక వస్తుం దన్న విశ్వాసం కలిగింది’’ అన్నారు. ఈ క్రీడలలో భారత పతకాల సంఖ్య పెరగడం చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటలవైపు ప్రోత్సహిస్తారన్న ఆశలు ప్రధాని వ్యాఖ్యతో మరింత పెరిగాయి. భారత క్రీడా విజయాలను మరింత పెంచడానికిగల పలు మార్గాల్లో ‘‘ఒక రాష్ట్రం – ఒక క్రీడ’’ దృక్పథంతో రాష్ట్రాలను ప్రోత్సహించడం కూడా ఒకటి. ఆ మేరకు ఏదైనా ఒకటి లేదా (ఇతర క్రీడలు నిర్లక్ష్యానికి గురికాకుండా) కొన్ని క్రీడలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వవచ్చు. తమ పరిధిలోగల ప్రతిభా నిధి, సహజ ఆసక్తి, వాతా వరణ పరిస్థితులు సహా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల లభ్యత ఆధారంగానూ ఒక నిర్ణయం తీసుకోవచ్చు. భారత క్రీడారంగ ప్రగతికి దోహదపడిన అంశాల్లో నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణా లకు పెద్దపీట వేయడం మరొకటి. ఈ దిశగా సంప్రదాయక మార్గం అధికార యంత్రాంగం ప్రమేయంతో కూడుకు న్నదే కాకుండా ప్రయాస కూడా అధికం. కానీ, మోదీ ప్రభుత్వంలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపో యింది. ఆ మేరకు క్రీడాకారుల నుంచి సాక్షాత్తూ ప్రధానమంత్రే నేరుగా సమాచారం స్వీకరించడానికి ప్రాధాన్యమిచ్చారు. తదను గుణంగా క్రీడా మౌలిక వసతుల బలోపేతానికి గల వివిధ మార్గాలపై వారి అభిప్రాయాలను తనతో పంచుకోవాలని టోక్యో–2020కి వెళ్లే క్రీడాకారుల బృందాన్ని ఆయన కోరారు. ఇక మీరాబాయి కావచ్చు... మేరీకోమ్ కావచ్చు... క్రీడాకారులు ఎవరైనప్పటికీ గాయాలపాలై నపుడు వారికి మోదీ అత్యుత్తమ చికిత్స లభించేలా చూశారు. అనురాగ్ ఠాకూర్ భారత క్రీడారంగంపై ప్రతికూల ప్రభావం చూపిన ఇతర అంశాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వికాసం కూడా ఒకటి. ఈ విషయాన్ని మోదీ తన ‘ఎగ్జామ్ వారియర్స్’ (పరీక్షల యోధులు) పుస్తకంలోనే కాకుండా ‘పరీక్షలపై చర్చ’ కార్యక్రమాల సందర్భం గానూ ప్రస్తావించారు. ఆ మేరకు ‘ప్లే స్టేషన్’ (ఆధునిక క్రీడాపరి కరం)తో సమానంగా ‘ప్లేయింగ్ ఫీల్డ్’ (క్రీడా మైదానం)కూ ప్రాధాన్యం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రగతితో పాటు క్రీడలలో మానవ ప్రమేయం– జట్టు తత్వం, కలివిడితనంతో కూడిన ఆరోగ్యకర సమతూకం అవసరమని ఉద్బో« దించారు. రాబోయే కాలంలో భారతదేశపు తొలి క్రీడా విశ్వవిద్యా లయం మణిపూర్‌లో సాకారం కానుంది. ఇది క్రీడాకారులకు ఒక వరం మాత్రమే గాక ముఖ్యంగా ఈశాన్య భారతంలోని సుసంపన్న క్రీడా వారసత్వాన్ని ప్రోదిచేసేందుకు ఉపయోగపడుతుంది. టోక్యో–2020 భారత్ అనేక తొలి ఘనతలు సాధించిన ఒలిం పిక్స్. అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణపతకం మన వశమైంది. హాకీ జట్టు అద్భుతాలు చేసింది... డిస్కస్ త్రో, గోల్ఫ్, కత్తి యుద్ధం వగైరా క్రీడల్లోనూ మనవాళ్లు విజయవంతమయ్యారు. మొత్తంమీద నవభార తంలో నేడు ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది... మన క్రీడలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. క్రీడల్లో రాణించా లని ఆరాటపడే క్రీడాకారులకు మన ప్రధాని సదా అండగా నిలుస్తారు. వ్యాసకర్త కేంద్ర సమాచార–ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడాశాఖల మంత్రి -
అత్యంత ఖరీదైన, బంగారంతో చేసిన ఫుడ్ గురించి తెలుసా!?
ఏ రూపంలో ఉన్న బంగారం బంగారమే! పసిడి అంటే అందరికీ ఇష్టమే. నగలా మారి అతివల అందాన్ని ద్విగుణీకృతం చేయడంలోనూ... ఆపదల్లో ఆదుకునే కమోడిటిగానూ స్వర్ణానికి మంచి డిమాండ్ ఉంటుంది. మరి.. అదే బంగారం మనం తినే ఫుడ్‌లో కూడా ఉంటే! అచ్చంగా స్వచ్ఛమైన పసిడితో తయారు చేసిన ఆహార పదార్థాలను తింటే ఆ మజానే వేరు కదా!! ఇంతకీ.. ప్రపంచంలోని బంగారంతో చేసిన, అత్యంత ఖరీదైన టాప్-5 డిషెస్ గురించి మీకు తెలుసా?! 1. సూరత్ గోల్డ్ మిఠాయి గుజరాత్‌లోని సూరత్ పట్టణం స్వీట్లకు పెట్టింది పేరు. ముఖ్యంగా అక్కడ బంగారంతో తీపి పదార్థాలు తయారు చేసే ‘‘24 క్యారెట్ మిఠాయి మ్యాజిక్’’ షాప్ బాగా ఫేమస్. అందులోనూ.. ఖర్జూరాలు, నెయ్యి, పిండితో చేసే గోల్డ్ మిఠాయి ‘ఘరీ’ అంటే అందరికీ మక్కువే. మరి బంగారంతో చేసిన స్వీట్ కదా. ధర కూడా అదే రేంజ్లో ఉంటుంది. కిలో గోల్డ్ ఘరీ కొనుగోలు చేయాలంటే 9 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సాధారణ ఘరీ మాత్రం కేజీ 660- 820 రూపాయలకే దొరుకుతుంది. 2. గోల్డ్ దమ్ బిర్యానీ బిర్యానీ పేరు చెబితే చాలు నోట్లో నీరూరాల్సిందే. అలాంటిది బంగారంతో చేసిన బిర్యానీ అంటే లొట్టలేసుకుని తింటారు. అలాంటి వాళ్లు దుబాయ్‌లో ఎక్కువ మందే ఉన్నారట. మామూలుగానే అక్కడి వాళ్లకు బంగారం అంటే ప్రీతి. ఇక స్వచ్చమైన పసిడి మేళవింపుతో చేసిన రాయల్ గోల్డ్ బిర్యానీ అంటే మరీ ఇష్టమట. బంగారు పళ్లెంలో వడ్డించే ఈ బిర్యానీ సింగిల్ ప్లేట్ ధర రూ. 20 వేలు. బాంబేబోరోహ్.. యూఏఈ ఇన్‌స్టా పేజీ 3. 24 క్యారెట్ల ఐస్‌క్రీం హాంకాంగ్‌లో తయారు చేసే 24 క్యారెట్ల ఐస్‌క్రీంకు లగ్జరీ డిజర్ట్‌గా పేరుంది. సింగిల్ కోన్ ఐస్‌క్రీం లాగించాలంటే దాదాపు 950 రూపాయలు వెచ్చించాలి మరి! 4. 24 క్యారెట్ గోల్డ్ బర్గర్ కొలంబియాలోని టోరో మెకాయ్ రెస్టారెంట్లో అమ్మే 24 క్యారెట్ గోల్డ్ బర్గర్ ధర సుమారు. 4200 రూపాయలు. 5. గోల్డ్ పాన్ భారతీయులకు అత్యంత ఇష్టమైన మౌత్ ఫ్రెషనర్ పాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భోజనం తర్వాత పాన్ వేసుకుంటే.. అదో తృప్తి. ఇక ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో గల యామూస్ పాన్ షాపులో దొరికే గోల్డ్ పాన్‌కు ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారట. ఈ పాన్ కనీస ధర 600 రూపాయలట. యామూస్ పంచాయత్ ఇన్‌స్టా పేజీ అఫిషియల్ చదవండి: Afghanistan: 20 ఏళ్ల తర్వాత స్వదేశానికి.. ఎవరీ అబ్దుల్ ఘనీ?! Afghanistan: అశ్రఫ్ ఘనీ ఎక్కడున్నారో తెలిసిపోయింది -
నేచురల్స్ విజయం.. ఆ రుచి వెనుక రహస్యం ఇదే
మంచి వ్యాపారి కావాలంటే ఉండాల్సిన అర్హతలు కుటుంబ నేపథ్యం, పెట్టుబడి, మేనేజ్మెంట్ డిగ్రీలు ఇవేమీ అక్కర్లేదనీ నిరూపించాడీ వ్యాపారి. పదో తరగతి పాస్ కావడానికే నానా తంటాలు పడ్డా కామన్ సెన్స్ తో బిజినెస్‌లో సక్సెస్ అయ్యాడు. సహజత్వాన్ని మరో మెట్టుపైకి చేర్చాడు Naturals Ice Cream Success Story: రఘునందన్ శ్రీనివాస్ కామత్ అంటే ఎవరికీ తెలియదు. కానీ ఆయన స్థాపించిన నాచురల్స్ ఐస్‌క్రీం అంటే తెలియని వారు తక్కువ. అక్కడి రుచిని తలచుకుని నోరూరని వారు అరుదు. అమితాబ్ బచ్చన్ నుంచి వివియన్ రిచర్డ్స్ వరకు ఆ ఐస్‌క్రీంకి ఫిదా అయిపోయారు. ఐస్‌క్రీం తింటున్నామా లేక పళ్లు తింటున్నామా అనేంత సహజంగా ఇక్కడ హిమక్రీములు తయారవుతాయి. ఒక్కసారి ఇక్కడ ఐస్‌క్రీం రుచి చూసిన వారు రెండో సారి గుర్తు పెట్టుకుని మరీ తింటారు. ఇంతకీ అంతలా ఆకట్టుకునే ఆ ఐస్‌క్రీం తయారీకి బీజం ఎలా పడింది. మంగళూరు టూ ముంబై కర్నాటకలోని మంగళూరుకి చెందిన శ్రీనివాస్ కామత్ పళ్ల వ్యాపారి. మార్కెట్లో వందల పళ్ల మధ్య పక్వానికి వచ్చి రుచి ఎక్కువగా పండుని ఎంపిక చేయడంలో ఆయన దిట్ట. దీంతో పళ్ల మంగళూరులో పళ్ల వ్యాపారం చేస్తూ భార్య, ఏడుగురు సంతానాన్ని పోషించేవాడు. అయితే పళ్లపై వచ్చే వ్యాపారం సరిపోకపోవడంతో కుటుంబాన్ని ముంబైకి మార్చాడు. అలా తన పదిహేనవ ఏట తల్లిదండ్రులతో కలిసి ముంబైలో అడుగు పెట్టాడు రఘునందన్ శ్రీనివాస్ కామత్. తినుబండారాల షాప్ పళ్ల వ్యాపారం వద్దనుకుని ముంబైలో తినుబండరాల షాప్‌ని ఓపెన్ చేసింది ఆ కుటుంబం. మిగిలిన అక్కడున్న మిగిలిన షాప్‌లని కాదని తమ దగ్గరికే కష్టమర్లు వచ్చేలా చేసేందుకు రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేసేది రఘునందన్ తల్లి ప్రయత్నించేది. అయితే అంత తేలిగ్గా ఆ టేస్టీ ఫుడ్ రెసీపీ దొరికేది కాదు. అయినా ఆమె ప్రయత్నిస్తూనే ఉండేది. ఆమెకు తోడుగా రఘునందన్ వంటింట్లో ఎక్కువ సేపు గడిపేవాడు. వారి ప్రయత్నం ఫలించి రుచికరమైన రెసిపీలతో ఆ షాప్ బాగా నడిచింది. ఆర్థిక ఇబ్బందులు లేని స్థితికి ఆ కుటుంబం చేరుకుంది. దీంతో అక్కడే ఐస్‌క్రీంలు అమ్మడం కూడా ప్రారంభించారు. సొంత ప్రయత్నం ముంబైలోని ఈటెరీ షాప్‌లో ఇంట్లోనే తయారు చేసిన వెనీలా, చాక్లెట్ ఫ్లేవర్లు అమ్మేవారు. అయితే అన్నతో వచ్చిన విబేధాల కారణంగా ఆ షాప్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. దీంతో ఎవరూ చేయనిది ఏదైనా చేయాలని ఆలోచించాడు. ఫ్రూట్ ఫ్లేవర్లు అప్పటి వరకు వెనీలా, స్ట్రాబెరీ, చాక్లెట్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌లే అమ్మేవారు. మ్యాంగో, జామ, ద్రాక్ష ఫ్లేవర్లలో ఐస్‌క్రీమ్‌లు ఎందుకు అమ్మకూడదనే ఆలోచన రఘునందన్‌లో కలిగింది. రుచి ఎక్కువగా ఉండే పళ్లను గుర్తించడంలో తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న నైపుణ్యం, కొత్త రెసిపీలు తయారు చేయడంలో తల్లి నుంచి నేర్చుకున్న మెళకువలు రంగరించి ఫ్రూట్ఫ్లేవర్లలో ఐస్‌క్రీమ్‌లు తయారు చేశాడు. ఫస్ట్ స్టోర్ ముంబైలో జనసంచారం ఎక్కువగా ఉండే జూహు రోడ్లో 1984లో కేవలం నాలుగు టేబుళ్లతో నాచురల్స్ ఐస్‌క్రీం స్టోర్‌ని ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు రెగ్యులర్ ఫ్లేవర్ల తిని మోహం మొత్తిపోయిన జనాలకు ఈ ఫ్రూట్ ఫ్లేవర్లు బాగా నచ్చాయి. అంతే మరుసటి ఏడాదికే విల్లేపార్లేలో మరో స్టోర్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే ముంబైలో ఐస్‌క్రీమ్ అంటే నాచురల్స్ అనే పరిస్థితి మారింది. వివ్ మాటలతో లెజండరీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ హోస్ట్‌గా 1986లో సన్నీడేస్ కార్యక్రమం వచ్చేది. దానికి అతిధిగా వచ్చిన వివ్ రిచర్డ్స్ మాట్లాడుతూ.. తానెప్పుడు ముంబై వచ్చినా నాచురల్స్లో ఐస్‌క్రీమ్స్ తప్పక తింటానని, అక్కడ దొరికే రుచి మరెక్కడా దొరకదంటూ కితాబిచ్చాడు. ఆ కార్యక్రమంలో ఒక్కసారిగా నాచురల్స్ పేరు మార్మోగిపోయింది. మౌత్‌టాక్ నాచురల్స్ ప్రయాణం ప్రారంభైనప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రాండ్ ప్రచారంపై ఒక్క రూపాయి కూడా ఖర్చు రఘునందన్ కామత్ ఖర్చు పెట్టలేదు. అక్కడ ఐస్‌క్రీం రుచి చూసిన వాళ్లే ప్రచారం చేసి పెట్టారు. అందులో వివియన్ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు ఎందరో ఉన్నారు. అలా నోటిమాట సాయంతోనే ముంబై నుంచి దేశమంతటా నాచురుల్స్ రుచులు విస్తరించాయి. రూ.300 కోట్ల టర్నోవర్ రోడ్డు పక్కన చిన్న తినుబండరాల షాప్ నుంచి ప్రారంభమైన రఘునందన్ శ్రీనివాస్ కామత్ ప్రయాణం రోజు రూ. 300 కోట్ల టర్నోవర్‌కి చేరుకుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 135 పైగా ఔట్లెట్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు దోస, కోకోనట్, ద్రాక్ష, లిచి, జామ ఒకటేమిటి ఇలా అన్ని రకాల ఫ్లేవరల్లో ఐస్‌క్రీమ్‌లు దొరుకుతాయి. అదే రహస్యం నాచురల్స్ సక్సెస్ వెనుక ఉన్న రహాస్యం కామన్సెన్స్ అంటారు రఘునందన్ కామత్. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆ జ్ఙానంతోనే నాచురల్స్ స్థాపించానని చెబుతారు. వాళ్ల నుంచి నేర్చరుకున్న విషయాలనే మరింత సాన పెట్టానంటారు. అందులో కృత్రిమత్వం ఏమీ లేదనే. అందుకే తమ ఐస్‌క్రీమ్‌లు అంత సహాజంగా ఉంటాయంటారు. - సాక్షి, వెబ్‌డెస్క్ -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కప్ ఐస్‌క్రీమ్ ధర ఎంతో తెలుసా?
ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరూ. ఒకప్పుడు సీజనల్ గా కనిపించే ఈ ఐస్‌క్రీమ్ లు ఇప్పుడు ఎవర్ గ్రీన్ గా మారాయి. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా డైరీ సంస్థలు నోరూరించే విభిన్న రకాల ఐస్‌క్రీమ్‌లను అందిస్తున్నాయి. క్రీమ్ స్టోన్ వంటి స్టోర్లలో వీటి ధర చాలా ఎక్కువగానే ఉంటుంది. ఫేమస్ ఐస్‌క్రీమ్ స్టోర్లలో వీటి ధర రూ.500, రూ.1000 పైగా ఉంటుంది. అయితే, ఒక స్కూప్ ఐస్‌క్రీమ్ ధర తులం బంగారం కంటే ఎక్కువ ఖర్చవుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? మీరు విన్నది నిజమే. ట్రావెల్ వ్లాగర్ షెనాజ్ ట్రెజరీ ఇటీవల ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ కోసం దుబాయ్ కు వెళ్ళింది. అక్కడ ఒక స్కూప్ ఐస్‌క్రీమ్ ధర 840 డాలర్లు(సుమారు రూ.60,000) ఖర్చవుతుంది. ఇది మనకు తెలిసిన వెనీలా ఐస్‌క్రీమ్ లాంటిది కాదు, ఎందుకంటే దీనిని తాజా వెనీలా బీన్స్ ఉపయోగించి తయారు చేస్తారు. కుంకుమ పువ్వు, బ్లాక్ ట్రఫుల్స్ మాత్రమే కాకుండా 23 క్యారెట్ల తినదగిన బంగారం ఇందులో ఉంటుంది. బ్లాక్ డైమండ్ అని పిలిచే ఈ ఐస్‌క్రీమ్ ను వెర్సేస్ గిన్నెలో అందిస్తారు. వ్లాగర్ షెనాజ్ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో దాదాపు నిమిషం నిడివి గల దీనికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఐస్‌క్రీమ్ ను ఉచితంగా ఇచ్చినట్లు తన వీడియోలో పేర్కొంది. దుబాయ్ లోని జుమేరా రోడ్ లోని ఈ కేఫ్ బంగారంతో నిండిన లాట్టీని అందిస్తుంది. ఒక కప్పు లాటే 23 క్యారెట్ల బంగారు ఆకు ఉదారమైన పొరతో పొరలుగా ఉంటుంది. చాలా మంది దీనిపై రకరకాలుగా స్పందిస్తుంది. ఒక యూజర్ ఇక్కడ నాలుగు సార్లు రూ.60,000 ఖర్చు చేసి తిన్నట్లు పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury) -
ఐసీయూలో ఐస్‌క్రీం తిని అత్త.. హోటల్ రూంలో మేనల్లుడు మృతి
గురుగ్రామ్: తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరిన ఓ ఎయిర్‌హోస్టెస్ ఐసీయూలో ఐస్ క్రీం తిని మృతి చెందగా.. మరుసటి రోజే ఆమె మేనల్లుడు హోటల్ రూంలో విగతజీవిగా కనిపించాడు. వీరిద్దరి మృతి పట్ల సోషల్ మీడియాలో పలు అనుమానాలు తలెత్తుతుండటంతో మేఘాలయా తురా పార్లమెంట్ సభ్యుడు అగాథ సంగ్మా ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వం శాఖకు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ, గురుగ్రామ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు.. నాగాలాండ్‌కు చెందిన రోసి సంగ్మా (29) ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తన మేనల్లుడి సామువేల్ సంగ్మాతో కలిసి హరియాణ గురుగ్రామ్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 23న రోసి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. కాళ్లు,చేతుల్లో విపరీతమైన నొప్పి, తీవ్ర రక్తస్రావంతో బాధపడింది. దాంతో సామువేల్, రోసిని ఢిల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించాడు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరుసటి రోజు ఉదయం అనగా జూన్ 24 ఉదయం, రోసిని గురుగ్రామ్ సెక్టార్ 10లోని ఆల్ఫా హాస్పిటల్‌కు తరలించారు. ఆల్ఫా ఆస్పత్రి ఐసీయూలో చేర్చిన తర్వాత రోసి కోలుకుందని తెలిపాడు సామువేల్. తీవ్ర అనారోగ్యానికి గురై.. ఇబ్బంది పడిన రోసి ఆ తర్వాత ఆల్ఫా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు ఐస్‌క్రీం తిన్నదని తెలిపాడు. ఆ సమయంలో రోసి ఎదురుగా డాక్టర్లు ఉన్నారని.. కానీ ఆమెను వారించలేదని ఆరోపించాడు. దాంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడయి.. మరణించిందని తెలిపాడు సామువేల్. దీని గురించి ప్రశ్నించిన తనను ఆల్ఫా ఆస్పత్రి సిబ్బంది కిందపడేసి చితకబాదారన్నాడు. రోసి చనిపోయిన విధానం తెలియజేస్తూ సామువేల్ వీడియో రూపొందించి, న్యాయం చేయాల్సిందిగా కోరుతూ.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ మరుసటి రోజే ఓ హోటల్ రూంలో సామువేల్ మృతదేహం వెలుగు చూడటం కలకలం రేపింది. సామువేల్, రోసిల మృతిపై సోషల్ మీడియాలో పలు అనుమానాలు వ్యక్తం చేశారు నెటిజనులు. సామువేల్ మృతి గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకుని సామువేల్ చనిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆల్ఫా హాస్పిటల్ యాజమాన్యం ఈ సంఘటనపై స్పందించింది. తమ ఆస్పత్రికి వచ్చాక రోసి ఆరోగ్యం మెరుగైందని.. ఈ క్రమంలో ఐసీయూలో ఉన్న ఓ పేషెంట్ ఐస్‌క్రీం తినడం చూసిన రోసి.. తనకు కూడా కావాలని అడిగిందని తెలిపారు. రోసి తన ఇష్టప్రకారమే ఐస్ క్రీం తిన్నదని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు. ఇక సామువేల్‌పై తాము దాడి చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై సామువేల్ తండ్రి స్పందిస్తూ.. ‘‘నా కుమారుడు చనిపోయేంత పిరికివాడు కాదు. రోసికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాడు. చనిపోయే రోజు తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో నాకు కాల్ చేసి మాట్లాడాడు. మరికాసేటికే చనిపోయాడని తెలిసింది. తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది’’ అన్నాడు. -
కడుపులో ఉంగరాలు, చెవి దుద్దులు.. ఎలా వెళ్లాయంటే
బెంగళూరు: కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతున్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సర్జరీ చేసి చూడగా.. కడుపులో బంగారు చెవి దుద్దులు, చేతి ఉంగరాలున్నాయి. ఆశ్చర్యపోయిన వైద్యులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఓ బంగారం దుకాణంలో వీటిని దొంగతనం చేశానని.. పోలీసులకు బయపడి ఐస్‌క్రీంతో పాటు వీటిని కూడా మింగేశానని వెల్లడించాడు. ఆ వివరాలు.. దక్షిణ కర్ణాటక కసాబా గ్రామానికి చెందిన శిబుకు చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలో రెండు వారాల క్రితం శిబు ఓ బంగారం దుకాణంలో సుమారు 35 గ్రాముల బంగారు ఉంగరాలు, చెవి దుద్దులు దొంగతనం చేశాడు. వాటిని బయటకు కనిపించకుండా ఉంచడం కోసం ఐస్‌క్రీంతో పాటు మింగేశాడు. అయితే శిబు గంతలో కూడా ఇలానే చేసేవాడట. చిన్న చిన్న బంగారు ఆభరణాలు దొంగతనం చేశాక అనుమానం వచ్చి.. పోలీసులకు చిక్కితే.. దొంగిలించిన నగలు వారికి కనిపించకుండా ఉండటం కోసం మింగేసేవాడట. ఈ సారి కూడా అలానే చేశాడు. కాకపోతే తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చదవండి: నగల షాపు యజమానిపై దాడి.. రూ.7.50 లక్షలు చోరి -
విషాదం: ఐస్‌క్రీమ్ తిన్న కొద్దిసేపటికే..
సాక్షి, హైదరాబాద్: నాచారంలో విషాదం చోటు చేసుకుంది. ఐస్‌క్రీమ్ తిన్న కొద్దిసేపటికే సంపత్ అనే యువకుడు మృతి చెందాడు. స్విగ్గీ ద్వారా కేజీ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన సంపత్.. తిన్న కాసేపటికే వాంతులు, విరోచనాలతో మరణించాడు. నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: వేప: అబ్బో చేదు.. కానీ ఈ బుడతడికి కాదు! Siddartha Murder: ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం -
Soft Drinks: శీతల పానీయాలకు బ్రేక్
సాక్షి, అమరావతి: వేసవిలో ఇష్టంగా తీసుకునే శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు వినియోగదారులు దూరంగా ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న తరుణంలో శీతల పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని వైద్యులు, నిపుణులు చెబుతుండటంతో వాటి అమ్మకాలు 80 శాతానికి పైగా పడిపోయాయి. వీటిని తీసుకోవడం వల్ల జలుబు, గొంతు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో కరోనా వేళ వీటికి దూరంగా ఉంటున్నారు. దీంతో రాష్ట్రంలో పెప్సీ, కోకాకోలా వంటి కార్బొనేటెడ్ శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌ల వినియోగం 80 శాతం తగ్గిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా మార్చి నుంచి జూన్ వరకు కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌ల వినియోగం అధికంగా ఉంటుంది. 700 కోట్ల లీటర్ల నుంచి 150 కోట్ల లీటర్లకు.. దేశంలో ఏటా 700 కోట్ల లీటర్ల శీతల పానీయాలు అమ్ముడవుతుండగా.. ఈ ఏడాది 150 కోట్ల లీటర్లు కూడా దాటకపోవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. లాక్‌డౌన్‌తో షాపులు మూసివేస్తుండటంతో ఐస్‌క్రీమ్ అమ్మకాలు కూడా పడిపోయినట్టు డ్యూమాంట్ ఐస్‌క్రీం ఎండీ వివేక్ ఇనంపూడి ‘సాక్షి’కి తెలిపారు. దేశవ్యాప్తంగా ఐస్‌క్రీమ్ అమ్మకాలు 90 శాతం తగ్గిపోయాయని, కేవలం మిల్క్ బూత్‌ల ద్వారా 10 శాతం మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. కరోనా దెబ్బతో చెన్నై, బెంగళూరు, పాండిచ్చేరి, హైదరాబాద్‌లలో ఔట్లెట్ల విస్తరణను తాత్కాలికంగా నిలిపివేసినట్టు పేర్కొన్నారు. వేసవిలో ఐస్‌క్రీమ్ అమ్మకాల్లో 30 శాతం వృద్ధి నమోదవుతుందని, ఈసారి ఏప్రిల్‌లో వీటి అమ్మకాలు 40 శాతం తగ్గినట్టు అమూల్ జనరల్ మేనేజర్ ఆర్ఎస్ సోధి వెల్లడించారు. కషాయాలకు, జ్యూస్‌లకు డిమాండ్ ఇదే సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచే కషాయాలు, ఔషధ గుణాలుండే పానీయాలకు డిమాండ్ పెరుగుతోంది. కరోనా వేళ జీరా, అలొవెరా, ఉసిరి, త్రిఫల జ్యూస్ అమ్మకాలు పెరుగుతున్నట్టు టెట్రా ప్యాక్ మార్కెటింగ్ డైరెక్టర్ సౌమ్య త్యాగి తెలిపారు. పసుపు, అల్లం, తులసితో కూడిన పాల విక్రయాలు పెరుగుతున్నట్టు చెప్పారు. అధిక ప్రోటీన్లు ఉండే సోయా మిల్క్, బాదం మిల్క్ విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. వ్యూహాలు మార్చుకుంటున్న కంపెనీలు ఆరోగ్య పరిరక్షణకు వినియోగదారులు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో వివిధ కంపెనీలు కొత్త ఉత్పత్తుల విడుదలపై దృష్టి సారిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదం ఊపందుకోవడంతో కోకాకోలా, పెప్సీ వంటి బహుళజాతి సంస్థలు కూడా తమ మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. కార్బొనేటెడ్ డ్రింక్‌ల వినియోగం తగ్గుతుండటంతో స్థానిక పండ్ల రసాలు, పానీయాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ ప్రజలు అమితంగా ఇష్టపడే కాఫీ మార్కెట్లోకి కోకాకోలా అడుగు పెట్టింది. మూడు ఫ్లేవర్స్‌లో కూల్ కాఫీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. -
ఆర్జీవీ వల్ల కోటి రూపాయలు నష్టపోయా: నిర్మాత
రామ్‌గోపాల్ వర్మ స్పీచ్ వల్ల డబ్బులు పోగొట్టుకున్నానంటున్నాడు ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ. సుమారు 200కు పైగా చిత్రాలు నిర్మించిన ఆయన అప్పట్లో ఆర్జీవీతో ఐస్‌క్రీమ్ తీసి నష్టపోయానని చెప్తున్నాడు. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "2004లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, 2014లో రామ్‌గోపాల్ వర్మతో ఐస్‌క్రీమ్ సినిమా తీశాను. అప్పట్లో శాటిలైట్ హక్కులు జెమిని టీవీ వాళ్లు కొనేవారు. అలా ఈ సినిమాను కోటి 20 లక్షల రూపాయలకు కొన్నారు. కానీ రామ్‌గోపాల్ వర్మ నోరు జారుతూ ఈ సినిమాకు రూ.2. 5 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టారని చెప్పాడు" "దీంతో అనవసరంగా ఈ సినిమాను ఎక్కువ మొత్తానికి కొన్నామా? అన్న ఆలోచనలో పడ్డ జెమిని యాజమాన్యం వారి డీల్‌ను రద్దు చేసుకున్నారు. నిజానికి ఆర్జీవీ.. రెండున్నర లక్షల రూపాయల పెట్టుబడితో సినిమా ప్రారంభించాం. హీరోయిన్లు, టెక్నీషియన్లు అందరం సినిమా సక్సెస్ అయ్యాక డబ్బులు తీసుకున్నాం అని చెప్పాడు. కానీ వాళ్లదంతా వినలేదు. కేవలం ఆ పెట్టుబడి గురించి మాత్రమే విని సినిమా వదిలేశారు" అని రామ సత్యనారాయణ చెప్పుకొచ్చాడు. చదవండి: కరోనాతో తమిళ నిర్మాత మృతి -
తమ్ముడికి ఐస్‌క్రీం ఇప్పించి ఇంటికి వెళ్లమని చెప్పింది.. ఆమె మాత్రం!
సాక్షి, రంగారెడ్డి : తన తమ్ముడికి ఐస్‌క్రీం ఇప్పించుకుని వస్తానని ఇంట్లోనుంచి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన సంఘటన నార్సింగిలో చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లలితాబాయి, రాందాస్ దంపతులు కుమార్తె స్వాతి బాయి, కుమారుడితో కలసి నార్సింగిలో నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం స్వాతి బాయి(19) తన తమ్ముడికి ఐస్ క్రీం ఇప్పించుకుని వస్తానని ఇంట్లోనుంచి వెళ్లింది. అతనికి ఐస్‌క్రీం ఇప్పించి ఇంటికి వెళ్లమని చెప్పి కనిపించకుండా పోయింది. రాత్రి ఇంటికి రాకపోవడం, తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం లేకపోవటంతో ఆమె తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె ఆటోలో ఎంజీబీఎస్‌కు వెళ్లినట్టు గుర్తించారు. తల్లి ఫిర్యాదులో ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆదిశగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: టెకీ ఘనకార్యం; పెళ్లి పేరుతో ఇంటికి రప్పించుకొని.. ఏం కష్టమొచ్చిందో.. బిడ్డను చంపి ఉరేసుకున్న తల్లి -
రామ్‌గోపాల్ వర్మ తీసిన చెత్త సినిమాలివే..
"లక్కుతో శివ సినిమా తీసి.. షోలేని చెడగొట్టి.. పిచ్చవాగుడు వాగేవాడు డైరెక్టరా వర్మ హిచ్‌కాక్ సినిమాలు చూసి.. దెయ్యాల సినిమాలు తీసే రాంగోపాల్‌వర్మ.. డైరెక్టరా ఖర్మ.." ఇది రామ్‌గోపాల్‌వర్మ డైరెక్ట్ చేసిన సినిమాలో ఆయన మీదే ఆయనే వేసుకున్న సెటైర్. ఆయన ఎప్పుడు ఎవరి మీద సినిమా తీస్తాడో, ఎప్పుడు ఎవరి మీద కౌంటర్లు వేస్తాడో ఎవరికీ తెలియదు. కానీ ఆయన పేరు చెప్తే యూత్‌లో ఓ వైబ్రేషన్. శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన ఆయన ఎన్నో సంచలన సినిమాలు తీసి టాప్ డైరెక్టర్‌గా మారాడు. కానీ రానురానూ వర్మ స్టైల్ మారింది. ప్రజలు ఆదరించినా, ఆదరించకపోయినా తనకు నచ్చినట్లు సినిమాలు తీసుకుంటూ పోయాడు. ఇప్పటికీ అదే చేస్తున్నాడు కూడా. రేపు(బుధవారం) ఆర్జీవీ బర్త్‌డే. ఈ సందర్భంగా "అయ్యో వర్మ.. మాకేందుకీ ఖర్మ" అని బాధపడేలా జనాలకు తలపోటు తెప్పించిన ఆర్జీవీ సినిమాలు ఏంటో చదివేద్దాం.. డార్లింగ్: హారర్, రొమాన్స్, థ్రిల్ అన్ని అంశాలు కలగలిపి వచ్చిన చిత్రమిది. ఇషా డియోల్, ఫర్దీన్ ఖాన్, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జనాలను పెద్దగా మెప్పించలేకపోయింది. మేరీ బేటి సన్నీ లియోన్ బనా చాతీ హై: టైటిల్‌తోనే సినిమా ఏంటనేది మీకీపాటికే అర్థమై ఉంటుంది. సన్నీలియోన్‌లా పోర్న్ స్టార్ కావాలనుకుంటున్నానని ఓ అమ్మాయి పేరెంట్స్‌కు చెప్తుంది. నైనా గంగూలీ, మక్రంద్ దేశ్‌పాండే, దివ్య జగ్డాలే ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఐస్‌క్రీమ్: నవదీప్, తేజస్వి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రమిది. ఐస్‌క్రీమ్ తింటే పీడకలలు వస్తాయనేది కథ. ఈ కాన్సెప్టు, టేకింగ్, ట్విస్టులు లేసి సీన్లు, సాదాసీదా హారర్.. అన్నీ ప్రేక్షకులకు పరమ బోరింగ్ తెప్పించాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. డర్నా మానా హై: ఇది కూడా హారర్ జానర్లో వచ్చిందే. ఆరు చిన్న కథల సమ్మేళనమే ఈ సినిమా. సైఫ్ అలీఖాన్, వివేక్ ఒబేరాయ్, అఫ్తబ్ శివదాసని, శిల్పా శెట్టి, సమీరా రెడ్డి, నానా పటేకర్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాలే కాకుండా ఈ మధ్యకాలంలో బోలెడన్ని సినిమాలు వరుసపెట్టి చేసుకుంటూ పోయారాయన. అందులో కొన్ని ఎప్పుడొచ్చాయో, ఎప్పుడెళ్తున్నాయో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. కేవలం హీరోయిన్ల అందాలను, పాత యాక్షన్ సీన్లపైనే ఆధారపడుతూ ప్రజలకు బోర్ కొట్టిస్తూ.. వర్మ ఎందుకో వెనుకబడుతున్నాడు. చదవండి: వైరల్ : హైదరాబాద్ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్లు కొడుకు ఫొటోతో థియేటర్‌కు, కన్నీరు ఆగడం లేదు -
ఈ బనానా రంగు, రుచి సెపరేట్!
సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతోంది. వింతలు విడ్డూరాలకు కొదవేలేదు. మనకు తెలియని ఎన్నో అద్భుత విషయాలు క్షణాల్లో తెలుస్తున్నాయి. తాజాగా తియ్యతియ్యని అరటి పళ్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అరటిపళ్లు ఏంటీ? గొప్పదనం ఏం ఉంది? మామూలే కదా అనుకుంటున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే. ఎందుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అరటి పళ్లు సాదాసీదావి కావు. రంగూ రుచిలోనూ చిత్రంగా అనిపించేవే ‘బ్లూ జావా బనానా లేదా నీలం రంగు అరటిపళ్లు’. ఆగ్నేయాసియాల్లో విరివిగా పండే బ్లూ జావా అరటిపళ్లు ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలోని హవాయి, ఫిజీ వంటి ప్రాంతాల్లో ఇవి పండుతాయి. వెనీలా రుచిని కలిగి ఉండే ఈ నీలం అరటి పళ్లను బనానా ఐస్‌క్రీమ్, హవాయి బనానా అని కూడా పిలుస్తారు. మొదట్లో దక్షిణాసియా దేశాల్లోనే వీటిని ఎక్కువగా పండించేవారు. నీలం రంగు అరటిపళ్లు హైబ్రిడ్ అని చెప్పవచ్చు. ఆగ్నేయాసియాలో పండే ‘ముసా బాల్బిసియానా, ముసా అక్యుమనిటా’ అనే రెండు అరటి మొక్కల నుంచి ఉద్భవించిందే హైబ్రిడ్ నీలం రంగు బనానా. మొదట్లో ఈ అరటిపళ్లు నీలం రంగులో ఉన్నప్పటికీ అవి పక్వానికి వచ్చాక క్రమంగా నీలం రంగు మసక బారుతుంది. సాధారణ అరటి పళ్ల కంటే ఇవి కాస్త పెద్దగా ఉండడమే గాక, ఎక్కువరోజులు తాజాగా ఉంటాయి. పైకి నీలంగా కనిపించే ఈ బనానా లోపల మాత్రం అన్నింటిలాగానే తెల్లగా ఉంటుంది. నలుపు రంగులో ఉన్న చిన్న విత్తనాలు ఉంటాయి. దీనిలో పొటాషియంతో పాటు ఇతర రకాల ఖనిజ పోషకాలు అధికంగా ఉండడం వల్ల మంచి స్నాక్‌గా దీన్నీ తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఇది బాగా ఉపయోగపడుతుంది. అరటిపండును వంద గ్రాములను తీసుకుంటే దానిలో ఫ్యాట్ 0.3 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ 22.8 గ్రాములు, 89 కేలరీలు ఉంటాయి. పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల రోజువారి ఆహారంలో ఈ బనానా తీసుకోవడం వల్ల బరువును అదుపులో కూడా ఉంచుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక బ్లూ బనానా చెట్టు ఆకులు కూడా బాగా ఉపయోగపడతాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలను వేడిగా, ఫ్రెష్‌గా ఉంచేందుకు వాడే అల్యూమినియం ఫాయిల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఈ బనానా ఆకులను వాడవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న విచిత్ర బ్లూ బనానాను వీలైతే ఒక్కసారైనా టేస్ట్ చేసి చూడండి. l -
స్వీట్ ఎక్స్పెరిమెంట్
ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. ఒక్కో సమస్య కొత్తదారిలో నడిపిస్తుంది కూడా. అలా ఆర్తి తనకు తానుగా వేసుకున్న కొత్త దారి చక్కెర అంత తియ్యగా ఉంది. చక్కెర తినలేని వాళ్ల కోసం చక్కెర లేని తీపి రుచులను అందిస్తోంది ఆర్తి. చక్కెర తినలేని తన జీవితాన్ని తియ్యగా మలుచుకుంది. చెవులకు ఏమైంది! ఆర్తి రస్తోగి బెంగళూరమ్మాయి. డయాబెటిస్ ఆ ఫ్యామిలీ హిస్టరీలోనే ఉంది. రకరకాల ఆహార నియమాలు పాటించక తప్పదు. ఇంటిల్లి పాదీ దేనినీ సంతోషంగా తినడానికి వీల్లేదు. ‘ఇది తింటే షుగర్ లెవెల్స్ పోతాయి, అది తింటే బరువు పెరిగి ఇతర సమస్యలకు కారణమవుతుంది...’ అంటూ నోరు కట్టుకుని రోజులు వెళ్లదీయడమే. ఇక చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు అయితే దగ్గరగా చూడడానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు. పిల్లల దృష్టి వాటి మీద పడిందంటే వాటిని మనం తినకూడదని నచ్చచెప్పాలి, పిల్లల మనసు గాయపడుతుంది. అందుకే ఇంట్లో అవేవీ కనిపించడానికి వీల్లేనంత నియమానుసారంగా పెంచుకొచ్చారు అమ్మానాన్నలు. అలా ఆర్తి గాజు బొమ్మలా పెరిగిందని చెప్పాలి. అందరిలాగానే స్కూలుకెళ్లి చదువుకుంది. తినగలిగిందేదో తింటూ కాలేజ్ చదువు పూర్తి చేసింది. కారణం ఏమిటో తెలియదు, ఇరవ మూడేళ్ల వయసులో ఆమెకు వినికిడి తగ్గడం మొదలైంది. ఏ డాక్టరూ కారణం ఇదని తేల్చలేకపోయారు. డయాబెటిస్ కారణంగా ఎదురైన అనుబంధ సమస్యలుగానే గుర్తించారు. వినికిడి ఎనభై శాతం తగ్గిందని మాత్రం నిర్ధారించగలిగారు. ఉన్న ఇరవై శాతం వినికిడితోనే ఉద్యోగం తెచ్చుకుంది. మాటలు కనిపించేవి ఆర్తి సంపాదించింది మామూలు ఉద్యోగం కాదు. పెద్ద కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగం. ఆమె ఆరోగ్యంతో ఎదురీది జీవితంలో నిలబడడంలో ఆమె వంతు లోపమేమీ లేదు. కానీ ఆర్తి ఆ ఉద్యోగం లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. తోటి ఉద్యోగులు చూసే చూపులను తట్టుకోవడం కష్టమైంది. ‘ఎన్నిసార్లు చెప్పాలి’ అనే చిరాకు వినిపించేది కాదు, కానీ వాళ్ల ముఖాల్లో కనిపించేది. ఆ ఒత్తిడిని తట్టుకోవడం కష్టమైంది. బాధను అదిమిపెట్టడానికి ఆమె ఎంచుకున్న మార్గం ఐస్‌క్రీమ్. నిజమే ఇంట్లోనే ఐస్‌క్రీమ్ తయారు చేసుకోగలిగిన చిన్న మెషీన్‌ని కొనుక్కుంది. ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత ఐస్‌క్రీమ్‌తో ప్రయోగాలు చేయడం. తాను చేసుకున్న షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్ తింటూ సహోద్యోగుల నుంచి ఎదురైన వివక్షను మర్చిపోవడానికి ప్రయత్నించేది. ఆ ప్రాక్టీస్ ఆమెను మరింతగా ప్రయోగాల్లోనే మునిగిపోయేటట్లు చేసింది. ఐస్‌క్రీమ్ పుస్తకాలను చదివింది. అక్కడితో ఆగిపోకుండా ‘ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు’ అనుకుంటూ షుగర్ ఫ్రీతోపాటు గ్లూటెన్ ఫ్రీ, కీటో ఫ్రెండ్లీ కుకీలు, చాక్లెట్లు, బ్రౌనీ, కేక్‌ల మీద ప్రయోగం చేసింది. తన ప్రయోగాలను ఫుడ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ డిపార్ట్మెంట్కు పరీక్షకు పంపించింది. సలహా బాగానే ఉంది ‘చాలా బాగా చేస్తున్నావ్, సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ఇక సొంతంగా స్టార్టప్ పెట్టెయ్’ అని తిన్నవాళ్లు ఓ సలహా ఇచ్చేసే వాళ్లు. ‘స్టార్టప్ పెట్టాలంటే బ్యాంకు తనకు లోన్ ఇస్తుందా?’ సమాధానం లేని ప్రశ్న. అన్నీ బాగున్న వాళ్లకే బ్యాంకులు అంత త్వరగా లోన్ ఇవ్వవు. స్టార్టప్ పెట్టాలనే ఆలోచన మానుకుని ఏదో ఓ ఉద్యోగం లో చేరేటట్లు చేస్తుంటాయి. అలాంటిది ఉద్యోగం లో కొనసాగ లేని వైకల్యం ఉన్న తనకు లోన్ ఎలా వస్తుంది? అనుకుని స్నేహితుల సూచనను పక్కన పెట్టేసింది. అయితే... ఓ బలహీన క్షణంలో ఈ ఉద్యోగం ఇక వద్దు అని నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేసింది. అప్పుడు కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. ఇంట్లో అందరూ చేయగలిగినంత సహాయం చేశారు. అలా 2019లో ఆమె తన స్టార్టప్‌ను ప్రారంభించింది. అప్పుడు ఆర్తికి నలభై ఏళ్లు. రెండేళ్లు గడిచాయి. ఫుడ్ బిజినెస్ లో భారీ నష్టాలైనా వస్తాయి లేదా త్వరగా బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. ఇప్పుడామె బెంగళూరులో పది బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది. ఆన్లైన్లో పాతిక రాష్ట్రాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ‘‘ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ గా మారిపోతోంది. డయాబెటిక్ వాళ్లు రుచిని చంపుకుని బతకాల్సిన అగత్యం లేకుండా అన్ని రుచులనూ తినగలిగేటట్లు చేయడం సంతోషంగా ఉంది. వ్యాపారం కోసం వచ్చిన ఆలోచన కాదు. నా కష్టం నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన’’ అంటున్నారు ఆర్తి. తీవ్రంగా గాయపడి ఉండడం వల్లనో ఏమో ఆర్తి తన అవుట్లెట్లలో వికలాంగులు, ఎల్జీబీటీలను ఉద్యోగంలో చేర్చుకుంది. -
రుచిలో వెలగండి.. ఆరోగ్యానికి ఎంతో మేలు
వెలగ... పేరు వినగానే నాలుక కాస్తా పులుపు, తీపి, వగరు రుచులతో గిరిగరా తిరిగి నోట్లో నీళ్లూరతాయి. వెలగ రుచి తెలియని వారికి మాత్రం వెలగ అంటే వినాయక చవితినాడు పాలవెల్లికి కట్టే గట్టి కాయలాగే అనిపిస్తుంది, కనిపిస్తుంది. కరిమింగిన వెలగ పండని సామెత ఉంది కానీ, నిజానికి సరిగ్గా చేస్తేదాని మీద ఉండే గట్టి చెక్కతో సహా లాగించేయాలనిపిస్తుంది. ప్రస్తుతానికి ఓ ఐదు వెరయిటీలు అందిస్తున్నాము. కానీ ప్రయత్నిస్తే మీరు కూడా మరో ఐదు రకాలు దానికి జత చేయొచ్చు. ఇంకేం ఇవ్వాళ్లే మార్కెట్టుకి వెళ్లండి, వెలగట్టి ఇంటికి తెండి, రుచికి వెలిగిపోండి. వెలగ పండు భేల్ కావలసినవి వెలగ పండ్లు - 4; పచ్చిమిర్చి - 10 (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); ఉప్పు - తగినంత ; పంచదార - 4 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు; చాట్ మసాలా - ఒక టీ స్పూను; స్వీట్ చట్నీ- అర టీ స్పూను; గ్రీన్ చట్నీ- ఒక టీ స్పూను తయారీ: వెలగపండ్లను పగలగొట్టి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకుని, గరిటెతో బాగా మెదపాలి. పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, పంచదార, కొత్తిమీర తరుగు, చాట్ మసాలా, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ జత చేసి పప్పు గుత్తితో బాగా మెదపాలి. పగుల గొట్టిన వెలగ పండు చెక్కలలోనే అమర్చి అందిస్తే చూడటానికి అందంగా ఉంటుంది. వెలగ పండు స్మూతీ కావలసినవి: వెలగపండు -1; తేనె- 2 టేబుల్ స్పూన్లు; ఓట్స్ - ఒక టేబుల్ స్పూను; పెరుగు- అర కప్పు; తాజా కొబ్బరి తురుము - ఒక టేబుల్ స్పూను; ఏలకుల పొడి - పావు టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; బెల్లం పొడి - టేబుల్ స్పూను గార్నిషింగ్ కోసం: దానిమ్మ గింజలు- ఒక టీ స్పూను; మామిడికాయ ముక్కలు - ఒక టీ స్పూను; జీడిపప్పు ముక్కలు - ఒక టీ స్పూను. తయారీ: ఓట్సును తియ్యటి నీళ్లలో లేదా ఏదైనా పళ్లరసంలో పది నిమిషాలు నానబెట్టాలి. వెలగపండును పగులగొట్టి గుజ్జు బయటకు తీసి, రెండు కప్పుల నీళ్లలో సుమారు అరగంట సేపు నానబెట్టాలి. మెత్తగా పిసికి, పీచును, గింజలను వేరు చేయాలి. మిక్సీలో వెలగ పండు గుజ్జు, తేనె, ఐస్ క్యూబ్స్, బెల్లం పొడి, కొబ్బరి తురుము, నానబెట్టిన ఓట్స్, ఏలకుల పొడి, పెరుగు, మిరియాల పొడి వేసి మెత్తగా చేయాలి. గ్లాసులలో పోసి, కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా అయ్యాక బయటకు తీసి, జీడిపప్పు ముక్కలు, దానిమ్మ గింజలు, మామిడికాయ ముక్కలతో అలంకరించి అందించాలి. వెలగ పండు షర్బత్ కావలసినవి వెలగ పండు -1; నీళ్లు - తగినన్ని; పంచదార - తగినంత తయారీ: ముందుగా వెలగపండు గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙చేతితో మెత్తగా మెదిపి, తగిన న్ని నీళ్లు జత చేసి, చేతితో బాగా కలపాలి. ఒక పాత్రలోకి వడ పోయాలి. తగినంత పంచదార జత చేసి బాగా కలియబెట్టాలి. ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచి, బయటకు తీసి చల్లగా తాగాలి . ఎండ బాధ నుంచి కాపాడుతుంది. వెలగ పండు జామ్ కావలసినవి: వెలగ పండ్లు - 4; వేడి నీళ్లు - పావు లీటరు; పంచదార - 200 గ్రా. తయారీ : వెలగ పండ్ల గుజ్జును ఒక పాత్రలో వేసి మెత్తగా మెదపాలి. వేడి నీళ్లు జత చేస్తూ బాగా కలియబెట్టాక, వడబోసి, గింజలను వేరు చేయాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక గుజ్జును అందులో వేసి బాగా కలపాలి. పంచదార జత చేసి బాగా కలియగొట్టి, పొంగులు వచ్చేవరకు ఉడికించాలి. పావు గంట తరవాత మిశ్రమం కొద్దిగా చిక్కబడుతుంది. ఒక ప్లేటులోకి తీసుకుని, కొద్దిగా చల్లారాక గాలి చొరని సీసాలో నిల్వ చేసుకోవాలి. వెలగ పండు పచ్చడి కావలసినవి: వెలగపండు- 1; బెల్లం పొడి - ఒక కప్పు; కారం- ఒక టేబుల్ స్పూను; ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూను; వేయించిన జీలకర్ర పొడి - ఒక టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙ముందుగా వెలగపండును పగులగొట్టి గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి. మిక్సీలో అన్ని పదార్థాలు వేసి మెత్తగా చేయాలి. ఈ పచ్చడిని ఫ్రిజ్‌లో ఉంచితే పదిరోజుల వరకు బాగుంటుంది. వెలగ పండు ఐస్‌క్రీం కావలసినవి: పంచదార- 1 టేబుల్ స్పూన్; కొబ్బరి పాలు- అరకప్పు; వెలగ కాయ - 1 తయారీ: ఒక పాత్రలో వెలగ పండు గుజ్జు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదపాలి. కొబ్బరి పాలు జత చేస్తూ మరోసారి మెత్తగా చేయాలి. పంచదార జత చేసి బాగా కలిపి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అంగుళం మందం ఉన్న ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజ్‌లో ఐదు గంటల పాటు ఉంచి బయటకు తీయాలి. స్టౌ మీద పాన్ వేడయ్యాక, ఫ్రిజ్‌లో ఉంచిన ప్లేటును బయటకు తీసి, అందులోని వెలగపండు మిశ్రమాన్ని పాన్‌లో వేసి, కొద్దిసేపు ఉంచి, మళ్లీ ప్లేటులో పోసి, డీప్ ఫ్రీజర్‌లో మూడు గంటల పాటు ఉంచి, బయటకు తీసి, ఐస్ క్రీమ్ కప్పుల్లో అందించాలి. ఇలా తింటే ఎలా ఉంటుంది.. ఉదయాన్నే బియ్యంతో చేసిన ఇడ్లీ, దోసెలకు దూరంగా ఉండి, వాటి బదులు జొన్నలు, మినుములతో చేసిన ఇడ్లీ, దోసెలను తినటం మంచిది. మామూలుగా చేసుకునే ఇడ్లీ, దోసెలను వారానికి ఒకసారి మాత్రమే తినాలి. దోసెలను నేతిలో కాల్చుకుని తినటం మంచిది. ఉడకబెట్టిన సెనగలు, వేరు సెనగలు, అలసందలు ఆరోగ్యానికి మంచిది. మొలకెత్తిన గింజలు తినటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పూరీ, మైసూర్ బోండా వంటివి నెలకు ఒకసారి తింటే పరవాలేదు. వీలైతే వాటికి దూరంగా ఉండటం మంచిది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు చపాతీలు తింటే పరవాలేదు. అవి కూడా నేతితో కాల్చుకుని తినటం మంచిది. వెలగపండ్లు – ఉపయోగాలు 100 గ్రా. వెలగపండు గుజ్జు నుంచి 140 క్యాలరీలు వస్తాయి. అనేక వ్యాధుల నివారణలో ఔషధంగా పనిచేస్తోంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండు మంచి మందు. అల్సర్‌తో బాధపడే వారికి ఈ పండు వల్ల ఉపశమనం కలుగుతుంది. వెలగపండు గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధి అవుతుంది. రక్తహీనతను నివారించే గుణం వెలగపండులో ఉంది. ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే, వెలగ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి. అలసటగా, నీరసంగా ఉన్నప్పుడు వెలగపండు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది. మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినడం మంచిది. మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి. వెలగపండు గుజ్జుకి తగినంత గోరువెచ్చని నీళ్లు, కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే రక్తంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. కాలేయం, కిడ్నీలపై అధిక పనిభారం పడకుండా ఉంటుంది ∙స్త్రీలు వెలగ పండు గుజ్జు క్రమం తప్పకుండా తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వెలగపండు గుజ్జు తినడం వల్ల ప్రొటీన్లు సమపాళ్లలో అంది కండరాలు వేగంగా వృద్ధి చెందుతాయి ∙వెలగపండు గుజ్జుకి మధుమేహాన్ని అదుపులో ఉంచే శక్తి ఉంది. ∙వెలగ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది ∙నోటి పుండ్లనీ తగ్గిస్తుంది ∙పొట్టలో పేరుకున్న గ్యాస్‌నీ తొలగిస్తుంది. నరాలకూ ఉత్తేజాన్నీ, శక్తినీ ఇస్తుంది. -
ఐస్‌క్రీమ్ బాక్సుల్లో కరోనా
బీజింగ్: కరోనా వైరస్ జాడలున్న 4,800 ఐస్‌క్రీం బాక్సులను చైనా అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందరికి వ్యాపించింది? అనే విషయాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. ఈ ఘటన చైనా ఈశాన్య ప్రాంతంలోని టియాన్జియాన్ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానిక టియాన్జిన్ డకియావోడావో ఫుడ్ కంపెనీలో తయారైన ఐస్‌క్రీం శాంపిళ్లను పరీక్షించగా కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో బట్వాడా కాని 2,089 ఐస్‌క్రీం బాక్సులను కంపెనీ స్టోర్ రూంలోనే సీల్ వేసి ఉంచారు. మిగతా, 1,812 ఐస్‌క్రీం బాక్సులు వివిధ ప్రావిన్సులకు, 935 బాక్సులు స్థానిక మార్కెట్‌కు పంపిణీ కాగా అందులో 65 మాత్రం అమ్ముడు పోయినట్లు తేలింది. సరఫరా అయిన ప్రాంతాల్లో విచారణ చేపట్టి, వాటి ద్వారా ఎవరికైనా వైరస్ సోకిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. దీంతోపాటు ఆ ఐస్‌క్రీం ఫ్యాక్టరీలోని 1,662 మంది ఉద్యోగులను సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలని ఆదేశించారు. ఆ కంపెనీ ఐస్‌క్రీం తయారీలో వాడిన పాలపదార్థాలు ఉక్రెయిన్, న్యూజిల్యాండ్ నుంచి వచ్చినట్లు గుర్తించిన ఆరోగ్య శాఖ అధికారులు..అవి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాక్సుల్లో వైరస్ ఘటనపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని యూకేలోని లీడ్స్ యూనివర్సిటీ వైరాలజిస్టు గ్రిఫ్ఫిన్ అన్నారు. -
క్రీమ్‌స్టోన్‌లో సందడి చేసిన మోడల్స్
-
వైరల్: దొంగలకు చెమటలు పట్టించిన పోలీసు
దొంగలు కనిపిస్తే చాలు జనాలు హడలెత్తిపోతారు. కానీ పోలీసులు మాత్రం ఆన్‌డ్యూటీలో ఉన్నా, ఆఫ్‌డ్యూటీలో ఉన్నా వారినే తిరిగి భయపెడుతుంటారు. అందుకు ఉదాహరణగా నిలిచిందీ ఘటన. దక్షిణ అమెరికాలోని ఉరుగ్వే రాజధాని మాంటెవిడియోలో నలభై ఆరేళ్ల పోలీసాఫీసర్ తన కొడుకుతో కలిసి ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లాడు. ఐస్‌క్రీమ్ కొనుక్కుని తండ్రీకొడుకులిద్దరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఇద్దరు ఆగంతకులు జాకెట్లు వేసుకుని వీళ్లు కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చారు. వీళ్లను బెదిరించి డబ్బులు గుంజడం కోసం ఏదో ఆయుధాన్ని తీసేందుకు జేబులో చేయి పెట్టారు. (చదవండి: వైరల్: కూతురు స్కూల్ వీడియోలో తండ్రి డ్యాన్స్) వాళ్ల వాలకం, దొంగ చూపులు పసిగట్టిన పోలీసు వెంటనే అలర్ట్ అయ్యాడు. ఎడమ చేతిలో ఉన్న కోన్ ఐస్‌క్రీమ్ జారవిడవకుండా పట్టుకుని, కుడిచేతితో తుపాకీ అందుకుని నిందితులపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఊహించని దెబ్బకు తోక ముడిచిన దొంగలు బతుకు జీవుడా అని అక్కడి నుంచి వెనక్కు చూడకుండా పారిపోయారు. ఈ ఘటనలో పోలీసు ఎడమ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ ఏమాత్రం కింద పడకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా అక్కడి సీసీటీవీలో రికార్డవగా ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ ఘటనలో పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఛాతీలోకి బుల్లెట్ దిగడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నాడు. (చదవండి: పాక్ తింగరి పని.. ఫోటోలు వైరల్) -
‘రాకీ భాయ్’నే బోల్తా కొట్టించిన ఐరా..!
బయట పని ఒత్తిడి, ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే.. ఇంటికి వచ్చి భార్యాబిడ్డల ముఖం చూస్తే చాలు అలసట ఎగిరిపోతుంది. ఇక పిల్లలతో గడిపితే ఆ రోజు కోల్పోయిన సంతోషం అంతా తిరిగి వస్తుంది. ఈ విషయంలో సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేదు. కడుపు తీపి, పేగు బంధం అందరికి ఒకేలా ఉంటుంది కదా. ఇక ఇంట్లో ఐదేళ్లలోపు చిన్నారులు ఉంటే ఆ సందడే వేరు. వారి ముద్దు ముద్దు చేష్టలు, అల్లరితో ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది. తాజాగా రాకీ భాయ్ యశ్ ఈ కోవకు చెందిన వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో యశ్ తన కుమార్తెని ఐస్‌క్రీమ్ కోసం రిక్వెస్ట్ చేయడం చూడవచ్చు. ‘షేరింగ్ అనేది కేరింగ్‌లో భాగం.. కానీ ఐస్‌క్రీమ్ విషయంలో మాత్రం కాదు’ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవతోంది. (చదవండి: ‘నాన్నా.. ఇది సమ్మర్ అని నాకు తెలుసు’) View this post on Instagram Sharing is caring... not when it comes to ICE CREAM 😜 (Getting a dose of my own medicine here 😄) A post shared by Yash (@thenameisyash) on Oct 25, 2020 at 3:56am PDT దీనిలో యష్, ఐరా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉంటారు. ఇక చిన్నారి ముందు ఐస్‌క్రీమ్ గిన్నె ఉంది. తనకు కొంచెం ఐస్‌క్రీమ్ పెట్టమని యశ్ కుమార్తెని అడిగి నోరు తెరుస్తాడు. దాంతో ఐరా ఐస్‌క్రీమ్ స్పూన్ని తండ్రి నోటి దాకా తీసుకెళ్లి వెంటనే తన నోట్లో పెట్టుకుంటుంది. గిన్నెలో ఐస్‌క్రీమ్ అయిపోయేంత వరకు ఐరా ఇలానే చేస్తుంది. ఇక కూతురి అల్లరి చూసి యశ్ తెగ నవ్వుతాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక లాక్డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా స్టార్లందరు ఇంటికే పరిమితమయ్యారు. అనుకోకుండా దొరికిన బ్రేక్ టైంని కుటుంబంతో సరదాగా గడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే కేజీఎఫ్ 2 షూటింగ్ జరుగుతుంది. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా చిత్రం విడుదల కానుంది. -
ఛాయ్ ఐస్‌క్రీమ్ పరాఠా, సూపర్..
పుర్రెకోబుద్ధి జిహ్వకోరుచి అంటారు పెద్దోళ్లు. అంటే ప్రతి మనిషి ఆలోచనలు వేరుగా ఉంటాయి, అభిరుచులు భిన్నంగా ఉంటాయి అని దాని అర్థం. అలాగే ఒక్కొక్కరు ఒక్కోరకమైన టేస్ట్‌ను ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఓవైస్ సిద్ధ్‌క్వి అనే వ్యక్తి తన అభిరుచికి తగ్గట్టు ఒక స్పెషల్ డిష్‌ను తయారుచేసి దానిని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దానిని చూసివారు వారి అభిప్రాయాలను బట్టి భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంతకీ అతను చేసిన డిష్ ఏంటంటే... మనలో చాలా మందికి ఛాయ్ తాగనిదే తెల్లారదు. టీని ఇష్టపడని వారు సామాన్యంగానే ఎవరు ఉండరు అని చెప్పొచ్చు. Chai paratha reimagined, spiced doodh patti ice cream with sugar laced parhatta. pic.twitter.com/CzPORPMb0U — Owais Siddiqui (@OwaisO) October 8, 2020 అందుకే టీ అంటే చాలా ఇష్టపడే సిద్ధ్‌క్వి ఛాయ్ పరాఠ తయారు చేసి దానిలో తనకు ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను వేసి ఒక ఢిపరెంట్ డిష్‌ను తయారు చేశారు. చాలా మంది ఛాయ్‌తో పాటు సమోసకానీ, బిస్కెట్లు కానీ తినడానికి ఇష్టపడతారు. ఇక మన సిద్ధ్‌క్వి మాత్రం తనకు ఇష్టమైన టీని పరాఠ తయారీలో ఉపయోగించి దానిలో అతనికి ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్ పెట్టి ఒక డిఫరెంట్ టేస్ట్‌ను నెటిజన్ల ముందు ఉంచాడు. ఇక చాలా మంది నెటిజన్లు నిజంగా ఇది సూపర్బ్ కాంబినేషన్ అంటూ కితాబిస్తున్నారు. చదవండి: రోడ్డుపై సింహాలు, గుజరాతీలో మాట్లాడిన వ్యక్తి -
రూ. 10 కోసం కక్కుర్తి పడి..
ముంబై : ఎమ్ఆర్పీ రేటు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసిన ఓ రెస్టారెంట్‌కు షాక్ తగిలింది. 10 రూపాయల కోసం కక్కుర్తి పడితే ఏకంగా 2,45,000 రూపాయలు హాంఫట్ అయింది. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ జాధవ్ 2014, జూన్ 8న కూతురితో కలిసి అక్కడి షగుణ్ వెజ్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఫ్యామిలీ ప్యాక్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశాడు. బేరర్ ఐస్‌క్రీమ్ తెచ్చిచ్చిన తర్వాత అతడికి 175 రూపాయలు చెల్లించాడు. ( పుట్టిన శిశువు ఆడ, మగ కాకపోయినా సరే..) ఈ నేపథ్యంలో ఎక్సైరీ డేట్ కోసం ఐస్‌క్రీమ్‌ను తరచి చూడగా ఎమ్ఆర్పీ రేటు 165 రూపాయలు కనిపించింది. ఇదే విషయం హోటల్ యజమాన్యాన్ని అడిగి, మిగిలిన చిల్లర వెనక్కు ఇవ్వమని కోరాడు. వారు డబ్బులు ఇవ్వకపోగా అది కూలింగ్ ఛార్జ్ అని చెప్పారు. దీంతో ఆగ్రహించిన జాధవ్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఐదేళ్ల తర్వాత తాజాగా తీర్పు చెప్పిన కోర్టు సదరు హోటల్‌కు భారీ మొత్తంలో ఫైన్ వేసింది. -
ఐస్‌క్రీమ్ పార్లర్లో అందాల భామలు
-
వార్నీ, పిల్లి డ్రామా మామూలుగా లేదు
-
పిల్లికి ఐస్‌క్రీమ్ తినిపిస్తే ఇలాగే ఉంటుంది!
పిల్లి కల్లు మూసుకుని పాలు తాగుతుందంటారు. మరి కళ్లు తెరిచి ఐస్‌క్రీమ్ తినగలదా? తింటే దాని రియాక్షన్ ఎలాగుంటుంది? ఇదిగో, ఇలాంటి అనుమానాలు వచ్చాయో వ్యక్తికి. ఇంకేముందీ.. డైనింగ్ టేబుల్‌కు దగ్గరగా కుర్చీని లాగి పిల్లిని కూర్చుండబెట్టాడు. అనంతరం దాని పాలగిన్నె ముందు పెట్టి పాలకు బదులు ఐస్ క్రీం తినిపించబోయాడు. కానీ ఆ పిల్లి అతడికన్నా తెలివైనదానిలా ఉంది. తన వల్ల కాదన్నట్టుగా తలను అటూ ఇటూ ఊపుతూ ఐస్ క్రీం రుచి చూడలేను బాబోయ్ అని వెనక్కు జరుగుతోంది. ఇంతలో ఐస్ క్రీం ఉన్న చెంచాను అంటీఅంటించనట్టుగా దాని మూతకు ఆనించగానే అది కళ్లు తిరిగి పడిపోయినట్లుగా కుర్చీపై వాలిపోయింది. ఈ పిల్లి రియాక్షన్ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. (ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?) గత నెలలోనే బయటకొచ్చిన ఈ వీడియోను బాస్కెట్‌బాల్ ఆటగాడు రెక్స్ చాప్మాన్ మరోసారి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను రెండు మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోకు నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. "ఓరి.. దీని వేషాలో..", "దీని డ్రామా మామూలుగా లేదుగా" అంటూ కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "మీకు నవ్వులాటగా ఉందా? ఇది జంతు హింస కిందకే వస్తుంది", "పాపం దానికి ఐస్‌క్రీమ్ అస్సలు నచ్చలేదు, దాన్ని చూస్తుంటే బాధగా ఉంది" అని మార్జాలంపై జాలి చూపుతున్నారు. (మరీ అంత ఉత్సాహం పనికి రాదు! )