రసగుల్లా ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి:
వెనీలా ఐస్‌క్రీమ్ – నాలుగు కప్పులు; రసగుల్లాలు – ఎనిమిది;
స్ట్రాబెరీ – ఆరు; బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానమిలా:
- గడ్డకట్టిన ఐస్‌క్రీమ్‌ను రిఫ్రిజిరేటర్ నుంచి తీసి పదినిమిషాలు బయటపెట్టాలి ∙రసగుల్లాలను గట్టిగా పిండి సిరప్‌ను తీసేయాలి.
- పూర్తిగా పిండకూడదు. కొద్దిగా సిరప్ తేమ ఉండేలా పిండాలి ∙పిండిన రసగుల్లాలను చిన్నచిన్న ముక్కలు చేయాలి.
- స్ట్రాబెరీలను కూడా కడిగి సన్నగా తరగాలి ∙ఇప్పుడు ఐస్‌క్రీమ్‌లో రసగుల్లా ముక్కలు వేసి కలపాలి .
- దీనిలో స్ట్రాబెరీ ముక్కలు, బాదం పలుకులు వేసి మరోసారి చక్కగా కలపాలి.
- ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని గిన్నెలో వేసి మూతపెట్టి రాత్రంతా లేదా కనీసం నాలుగు గంటల పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి .
- రిఫ్రిజిరేటర్‌లో నుంచి తీసిన పదిహేను నిమిషాల తరువాత రసగుల్లా ఐస్‌క్రీమ్‌ను సర్వ్‌చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment