న్యూఢిల్లీ: పార్లర్లు లేదా స్టోర్లు విక్రయించే ఐస్‌క్రీమ్‌లపై 18 శాతం జీఎస్‌టీ అమలవుతుందని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) స్పష్టం చేసింది.
గత నెల 17నాటి జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం 21 వస్తు, సేవల జీఎస్‌టీ రేట్ల లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకోగా.. వీటికి సంబంధించి వర్తక సంఘాలు వివరణలు కోరడంతో సీబీఐసీ తాజా ఆదేశాలిచ్చింది.
తయారైన ఐస్‌క్రీమ్‌లను విక్రయించే కేంద్రాలే పార్లర్ల కిందకు వస్తాయని.. రెస్టారెంట్ తరహావి కాదని స్పష్టం చేసింది. ఐస్‌క్రీమ్‌ను ఒక ఉత్పత్తి (తయారు చేసిన) గా అందించడానికే వాటి పాత్ర పరిమితం అవుతుందని.. రెస్టారెంట్ మాదిరి ఏ తరహా ఉడికించే కార్యకలాపాల్లో పాల్గొనేవి కావంటూ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment