Stores
-
'రెండు లక్షల కిరాణా స్టోర్లు మూతపడతాయి': ఏఐసీపీడీఎఫ్
భారతదేశంలో క్విక్ కామర్స్ బిజినెస్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఆన్లైన్ వ్యాపారం దేశంలోని సుమారు 2 లక్షల కిరాణా షాపులు మూతపడటానికి కారణమవుతాయని 'రిటైల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్' (AICPDF) వెల్లడించింది.చాలామంది నిత్యావసర వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ పండుగ సీజన్లో కిరాణా స్టోర్ల విక్రయాలు చాలా వరకు మందగించాయని ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 13 మిలియన్ల కిరాణా స్టోర్స్ ఉన్నట్లు.. ఇందులో 10 మిలియన్ల కంటే ఎక్కువ టైర్ 2, చిన్న నగరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.ఏఐసీపీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ ప్రకారం.. క్విక్ కామర్స్ సైట్స్ వల్ల చిన్న వ్యాపారులు భారీగా నష్టపోతున్నారు. దీనికి కారణం ఆ సైట్లలో అందించే కొన్ని డిస్కౌంట్స్ కూడా అని వెల్లడించారు. ఆన్లైన్లో కొనుగోళ్లు పెరగటం వల్ల రాబోయే రోజుల్లో చిల్లర వ్యాపారులను భారీ నష్టాన్ని చూడాల్సి ఉంటుంది, లేదా వారి వ్యాపారాలకు మంగళం పాడాల్సి ఉంటుందని అన్నారు.ఇదీ చదవండి: బాంబుల్లా పేలుతున్న బంగారం ధరలు: తారాజువ్వలా మరింత పైకి..గత రెండు, మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కిరాణా స్టోర్లకు కస్టమర్ల సందర్శనలు దాదాపు సగానికి పడిపోయాయని తెలుస్తోంది. క్విక్ కామర్స్ ప్రభావం మెట్రోల్ నగరాల్లో ఎక్కువగా ఉంది. ఈ కారణంగా ఇప్పటికే.. టైర్ 1 నగరాల్లో 60,000 స్టోర్స్, టైర్2, టైర్ 3 నగరాల్లో 50,000 స్టోర్స్ మూతపడ్డాయి. కాబట్టి చిన్న చిల్లర వ్యాపారులకు రక్షణ కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏఐసీపీడీఎఫ్ వెల్లడించింది. View this post on Instagram A post shared by Upsc World official (@upscworldofficial) -
ఫెస్టివల్ సీజన్‌కూ క్యూ–కామర్స్ కిక్కు
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో పండుగల సీజన్ మొదలైంది. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా గణేశుని నిమజ్జనంతో వినాయకచవితి ఉత్సవాలు ముగియగా...ఇక దసరా, దీపావళి వరుస పండుగల సందడి ప్రారంభం కానుంది. వచ్చే జనవరి మధ్యలో జరగనున్న సంక్రాంతి దాకా రాబోయే ఫెస్టివల్ సీజన్‌కు ఈసారి క్విక్–కామర్స్ అనేది కీలకంగా మారనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి ముగిసే దాకా సుదీర్ఘకాలం పాటు పండుగ ఉత్సవాలు కొనసాగుతాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వస్తువులు, ఆయా ఉత్పత్తులు వేగంగా ఇళ్లు, కస్టమర్లకు చేరవేయడం అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.దేశంలోని సంప్రదాయ ఎల్రక్టానిక్ (ఈ)–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఇప్పటికే వివిధ వర్గాల వినియోగదారులపై తమ ముద్రను బలంగానే చూపాయి. దీంతో రిటైల్ రంగంలోని వ్యాపార సంస్థలు, వ్యాపారులను ఈ–కామర్స్ దిగ్గజాలు కొంతమేరకు దెబ్బకొట్టాయి. అయితే మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ–కామర్స్‌ను తలదన్నేలా క్విక్ (క్యూ)–కామర్స్ అనేది ఓ కొత్త కేటగిరీగా ముందుకొచి్చంది. అమెరికాతో సహా వివిధ దేశాల్లో నిత్యావసరాలు మొదలు వివిధ రకాల వస్తువులను ఆ¯Œన్లైన్లో ఆర్డర్ చేశాక మరుసటి రోజుకు చేరవేయడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి అవసరమైన వస్తువులను తెచ్చుకున్నంత సులువుగా వివిధ వినియోగ వస్తువులు, ఉత్పత్తులను పది నిమిషాల్లోనే కస్టమర్లకు చేరవేసే డెలివరీ మోడళ్లు మనదేశంలో హైదరాబాద్‌తో సహా పలు ప్రముఖనగరాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. దీంతో సంప్రదాయ ఈ–కామర్స్ సంస్థలకు పోటీగా క్యూ–కామర్స్ ఎదుగుతోంది. ఇదిలా ఉంటే...డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్స్ కూడా వేగంగా తమ వినియోగదారులను చేరుకోవడం ద్వారా తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ప్రస్తుత పండుగల సీజన్లో దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ పరిశ్రమ ద్వారా 35 శాతం అమ్మకాలు పెరుగుతాయని ‘టీమ్ లీజ్’తాజా నివేదిక వెల్లడించింది. డిమాండ్‌ను తట్టుకొని ‘ఆన్ టైమ్ డెలివరీ’చేసేందుకు వీలుగా ఆయా సంస్థలు ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. ⇒ క్విక్–కామర్స్ సెగ్మెంట్లో.. వచ్చే అక్టోబర్‌లో నిర్వహించనున్న వార్షిక ఉత్సవం ‘బిగ్ బిలియన్ డేస్–2024’కోసం ఫ్లిప్‌కార్ట్ ‘మినిట్స్’ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాననగరాల్లో వంద దాకా ‘డార్క్ స్టోర్స్’ను తెరవనుంది ⇒ ప్రస్తుతమున్న 639 డార్క్ స్టోర్ల నుంచి 2026 ఆఖరుకల్లా రెండువేల స్టోర్లకు (ఈ ఆర్థిక సంవత్సరంలోనే 113 స్టోర్ల ఏర్పాటు) బ్లింకిట్ ప్రణాళికలు సిద్ధం చేసింది ⇒ వచ్చే మార్చికల్లా దేశవ్యాప్తంగా 700 డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయాలని (ఇప్పుడున్న 350 స్టోర్ల నుంచి) జెప్టో నిర్ణయించింది. ⇒ డెలివరీ పార్ట్నర్స్, లాజిస్టిక్స్ సపోర్ట్‌ను అందించే ‘షిప్ రాకెట్, ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బీస్ వంటివి కస్టమర్లకు వేగంగా డెలివరీలు చేసేందుకు వీలుగా తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటున్నాయి ⇒ హైదరాబాద్‌తో సహా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, కొచ్చి, పణే వంటి నగరాల్లో షిప్ రాకెట్ ఇప్పటికే ‘షిప్ రాకెట్క్విక్’లను ప్రారంభించింది. పలు నగరాల్లో మరో నెలలో ఈ సరీ్వసులు మొదలుకానున్నాయి ⇒ కస్టమర్లకు వారి ఆర్డర్లను వేగంగా చేరవేసేందుకు వీలుగా షిప్‌రాకెట్ కంపెనీ స్థానిక లాజిస్టిక్ ప్లాట్‌ఫామ్స్ పోర్టర్, ఓలా, బోర్జె, ర్యాపిడో, షాడో ఫాక్స్‌తో భాగస్వామ్యాన్ని తయారు చేసుకుంది ⇒ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే దేశంలోని పది మెట్రో నగరాల్లో ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్ అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ సర్వీస్‌ను ప్రవేశపెట్టింది ⇒ గిఫ్టింగ్ ఫ్లాట్‌ఫామ్స్ ’ఫెర్న్స్ ఏన్పెటల్స్’క్విక్ కామర్స్ ద్వారా పంపిణీకి సిద్ధం చేసిన ప్రత్యేక ఉత్పత్తుల రేంజ్‌లు సిద్ధం చేసింది. ఇందుకు ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దేశంలో క్యూ–కామర్స్‌కు ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఈ పండుగల సీజన్లో తమ అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని విశ్వసిస్తోంది ⇒ లాజిస్టిక్స్ మేజర్ డెలివరీ సంస్థ ఇప్పటికే ఈ–కామర్స్ కంపెనీలకు డార్క్ స్టోర్స్ నెట్‌వర్క్‌ను అందించేందుకు ‘సేమ్‌డే డెలివరీ’అనే కొత్త సర్వీస్‌ను ప్రకటించింది‘డార్క్ స్టోర్స్’అంటే... ఇలాంటి స్టోర్ట్స్ కస్టమర్లు ప్రత్యక్షంగా వెళ్లి షాపింగ్ చేసేందుకు ఉద్దేశించినవి కాదు. వినియోగదారుల నుంచి వచ్చే ఆన్లైన్ ఆర్డర్లకు వీలైనంత ఎక్కువ వేగంగా వారి ఇళ్లకు డెలివరీ చేసేందుకు ఉద్దేశించి... విభిన్న రకాల వస్తువులు, ఉత్పత్తులను భద్రపరుచుకునేందుకు నగరంలోని బిజీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే స్టోర్లు ఇవి. పలురకాల వస్తువులను స్టోర్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి, అక్కడి నుంచి కస్టమర్ల ఇళ్లకు తరలించడానికి ఉద్దేశించినవి. ఇవి డి్రస్టిబ్యూషన్న్ఔట్లెట్లుగా పనిచేస్తాయి. ప్రధానంగా మెరుగైన పంపిణీ, వేగంగా డెలివరీ, విభిన్నరకాల ఉత్పత్తులను స్టోర్ చేసే అవకాశం, తదితరాలకు సంబంధించినవి. -
ఐఫోన్ 16 సిరీస్ ఫ్రీ-బుకింగ్స్: ఇలా బుక్ చేసుకోండి
యాపిల్ ఇటీవల తన ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఇప్పుడు సెప్టెంబర్ 13 నుంచి భారతదేశంలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ జాబితాలో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. వీటిని వివిధ మార్గాల్లో బుక్ చేసుకోవచ్చు.ఫ్రీ ఆర్డర్ ఎక్కడ చేయాలంటే..యాపిల్ స్టోర్ ఆన్లైన్యాపిల్ స్టోర్ బీకేసీ, ముంబైయాపిల్ స్టోర్ సాకేత్, ఢిల్లీఅమెజాన్ఫ్లిప్కార్ట్క్రోమావిజయ్ సేల్స్రిలయన్స్ డిజిటల్యూనికార్న్ స్టోర్స్ఇమాజిన్ స్టోర్స్ ఆప్రోనిక్ స్టోర్స్మాపుల్ స్టోర్స్ఐప్లానెట్ స్టోర్స్ఐకాన్సెప్ట్ స్టోర్స్పైన పేర్కొన్న స్టోర్లలలో లేదా అధికారిక వెబ్సైట్లలో ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండటం మంచింది. ఎందుకంటే అధికారిక వెబ్‌సైట్స్ మాదిరిగానే ఉంటూ.. పలువురు సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశం ఉంది.డిస్కౌంట్ వివరాలుఐఫోన్ 16 సిరీస్ బుక్ చేసుకునేవారు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకుంటే రూ. 5000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ 16 సిరీస్ అన్ని మోడళ్లకు వర్తిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకునే వారు మూడు లేదా ఆరు నెలల పేమెంట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. యాపిల్ ట్రేడ్ ఇన్ ప్రోగ్రాం కింద ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 4000 నుంచి రూ. 67500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధరలుఐఫోన్ 16128 జీబీ: రూ. 79900256 జీబీ: రూ. 89900512 జీబీ: రూ. 109900ఐఫోన్ 16 ప్లస్128 జీబీ: రూ. 89900256 జీబీ: రూ. 99900512 జీబీ: రూ. 119900ఐఫోన్ 16 ప్రో128 జీబీ: రూ. 119900256 జీబీ: రూ. 129900512 జీబీ: రూ. 1499001 టీబీ: 169900ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్256 జీబీ: రూ. 144900512 జీబీ: రూ. 1649001 టీబీ: రూ. 184900 -
అన్లిమిటెడ్ ‘రెడ్ అలర్ట్ సేల్’
న్యూఢిల్లీ: అన్లిమిటెడ్ స్టోర్స్ ‘రెడ్ అలర్ట్ సేల్ ఆఫర్’ను ప్రకటించింది. అన్ని బ్రాండెడ్ వ్రస్తాలపై 50% ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే రూ.3వేల షాపింగ్‌పై అంతే విలువైన ఉత్పత్తులు ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా 87 స్టోర్లలో జనవరి 1 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఫ్యాషన్ ఇష్టపడే ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని కోరింది. -
ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే..
ఏవైనా నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే ఇంటి పక్కనున్న కిరాణా దుకాణానికో లేదా మార్కెట్‌కు వెళుతుంటాం. పెద్ద పట్టణాలు, నగరాల్లో అయితే షాపింగ్ స్టోర్‌కు వెళుతుంటారు. షాపింగ్‌మాల్‌లోకి వెళ్లిన తరువాత మనకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాక, బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చి, క్యాష్ పే చేస్తుంటాం. అయితే దుబాయ్‌లోని ఆ స్టోర్‌లో క్యాషియర్ ఉండరు. అంటే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరూ ఉండరు. మరి సరుకులు తీసుకున్నాక ఆ స్టోర్‌లో క్యాష్ ఎలా పే చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. యూఏఈలోని దుబాయ్ పగలు, రాత్రి అనే తేడాలేకుండా నిత్యం వెలుగు జిలుగులతో మెరిసిపోతుంటుంది. ఈ మహానగరంలో 2018లో అమెజాన్ కెరెఫోర్ మినీ అనే షాపింగ్ స్టోర్ తెరిచింది. ఇది చూసేందుకు ఇతర స్టోర్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే ఇది అత్యాధునిక స్టోర్‌గా పేరొందింది. ఈ స్టోర్‌లో సరుకులు కొనుగోలు చేసే వినియోగదారుల దగ్గర ఈ స్టోర్‌కు సంబంధించిన యాప్ ఉండాలి. ఇది ఉంటేనే స్టోర్‌లోనికి ఎంట్రీ లభిస్తుంది. లోనికి వచ్చాక వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఈ స్టోర్‌లో హై రిజల్యూషన్ కలిగిన సీసీ కెమెరాలు ఉంటాయి. అవి సెన్సార్‌ను కలిగివుంటాయి. ఇవి వినియోగదారుల ప్రతీ కదలికను పర్యవేక్షిస్తుంటాయి. స్టోర్‌లోని వచ్చిన వినియోగదారులు తాము సరుకులు తీసుకుని బ్యాగులో వేసుకోగానే రసీదు వివరాలు వారి ఫోనులోప్రత్యక్షమవుతాయి. షాపింగ్ పూర్తయిన తరువాత పేమెంట్ ఆదే ఫోను ద్వారా చేయాల్సివుంటుంది. కెరెఫోర్ సీఈఓ హనీ వీస్ మాట్లాడుతూ భవిష్యత్‌లో అంతా ఇలానే ఉంటుందని, ఈ స్టోర్‌లోకి వచ్చే వినియోగదారులు ప్రత్యేక అనుభూతికి లోనవుతారని అన్నారు. ఇది కూడా చదవండి: 200 ఏళ్ల నేలమాళిగలోకి దూరిన అమ్మాయిలు.. లోపల ఏముందో చూసి.. -
50% డిస్కౌంట్: అన్లిమిటెడ్ స్టోర్స్‌లో ‘రెడ్ అలర్ట్ సేల్’
న్యూఢిల్లీ: వివిధ ఉత్పత్తులపై అత్యుత్తమ రాయితీలు, ఆఫర్లతో ‘రెడ్ అలర్ట్ సేల్’ ప్రారంభించినట్లు అన్లిమిటెడ్ స్టోర్స్ ప్రకటించింది. అన్ని బ్రాండెడ్ వస్త్రాలపై 50% ఫ్లాట్ ఆఫర్ అందిస్తుంది. అలాగే రూ. 3 వేల షాపింగ్‌పై అంతే విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని అన్లిమిటెడ్ స్టోర్లలో ఈ ఆఫర్ జూలై రెండో తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. -
రెండింతలకు చేతక్ స్కూటర్ల ఉత్పత్తి
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని జూన్ నాటికి రెండింతలకు చేర్చనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫేమ్–2 పథకం పొడిగింపు విషయంలో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల విస్తరణ చేపడుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం నెలకు 5,000 యూనిట్లను తయారు చేస్తున్నట్టు కంపెనీ ఈడీ రాకేశ్ శర్మ తెలిపారు. ‘విడిభాగాలు సరఫరా చేసే కొందరు వెండార్లపై పెద్ద ఎత్తున ఆధారపడ్డాం. వారు సకాలంలో సరఫరా చేయకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నాం. సరఫరా సమస్యల నుంచి గట్టెక్కాం. అది మాకు కొంత విశ్వాసాన్ని ఇస్తోంది. మే నెలలో ఉత్పత్తి 7,000 యూనిట్లకు, జూన్‌లో 10,000 యూనిట్లకు చేరనుంది. డిమాండ్‌నుబట్టి భవిష్యత్‌లో ఉత్పత్తి ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయిస్తాం. ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 105 నుంచి సెప్టెంబర్‌కల్లా సుమారు 150 తాకనుంది. సరఫరా సమస్యలు తొలగిపోయి డిమాండ్ కొనసాగి, నెట్వర్క్ విస్తరణతో 2023–24లో బజాజ్ ఆటో చేతక్తోపాటు ‘యూలుకు’ సరఫరా చేసిన వాహనాలతో కలిపి విక్రయాలు ఒక లక్ష యూనిట్లకు ఎగుస్తుంది’ అని వివరించారు. సబ్సిడీ పొడిగించాల్సిందే.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంపొందించే పథకం ఫేమ్–2 పొడిగింపుపై ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉందని బజాజ్ ఆటో అర్బనైట్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ పేర్కొన్నారు. ‘పొడిగింపు నిర్ణయానికి ముడిపడి చాలా అంశాలు ఉన్నాయి. సబ్సిడీని నిలిపివేస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా పెరుగుతాయి. ’ అని తెలిపారు. -
స్మార్ట్ బజార్ ఫుల్ పైసా వసూల్ సేల్
సాక్షి, హైదరాబాద్: సరికొత్త ఆఫర్లతో స్మార్ట్ బజార్ ఫుల్ పైసా వసూల్ సేల్ మళ్లీ వచ్చినట్టు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సేల్ ఈనెల 21 నుంచి 26 వరకు అన్ని స్మార్ట్ బజార్, స్మార్ట్ సూపర్ స్టోర్, స్మార్ట్ పాయింట్ స్టోర్స్‌లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్యాకేజ్డ్ ఫుడ్, గృహోపకరణాలు, వ్యక్తిగ తమైన, కిచెన్‌కు సంబంధించిన వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్లను ఇస్తున్నట్టు వివరించింది. బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, షాంపూలు, సబ్బులు, టూత్‌పేస్ట్ వంటివి 50 శాతం డిస్కౌంట్‌కే లభిస్తున్నాయని వెల్లడించింది. అలాగే మహిళలు, పురుషులు, చిన్నపిల్లల బట్టలపై 50 శాతం డిస్కౌంట్ వంటి మరెన్నో ఆఫర్లు ఉన్నట్టు పేర్కొంది. -
100 ఔట్లెట్లు దాటిన డికాక్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీ, కాఫీ వంటి పానీయాల విక్రయంలో ఉన్న డికాక్షన్ 100 స్టోర్ల మైలురాయిని అధిగమించింది. కార్యకలాపాలు మొదలైన ఏడాదిన్నరలోపే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఏపీ, తెలంగాణలో 25 నగరాలు, పట్టణాల్లో 110 స్టోర్లున్నాయని డికాక్షన్ ఫుడ్స్, బెవరేజెస్ కో–ఫౌండర్ అద్దేపల్లి సంతోషి తెలిపారు. ఒక్కటి మినహా మిగిలిన కేంద్రాలన్నీ ఫ్రాంచైజీలవేనని చెప్పారు ‘ఏప్రిల్ నాటికి 130 ఔట్లెట్లు దాటతాం. కర్నాటక నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోనే 70 కేంద్రాలు ఉన్నా యి. ఫ్రాంచైజీల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు. 80 లక్షల మందికిపైగా కస్టమర్లను సొంతం చేసుకున్నాం. మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ వంటి పానీయాలూ విక్రయిస్తున్నాం. ప్రతి కేంద్రానికి 2–4 మందికి ఉపాధి లభిస్తోంది’ అని తెలిపారు. తొలుత ఫ్రాంచైజీ కేంద్రాలు.. సొంత స్టోర్ కంటే ముందే రెండు ఫ్రాంచైజీ కేంద్రాలు ఏర్పాటయ్యాయని డికాక్షన్ కో–ఫౌండర్ అద్దేపల్లి జయ కిరణ్ తెలిపారు. మొదటి 10 ఔట్‌లెట్లూ ఆర్టిస్టులవేనని చెప్పారు. ‘వృత్తిరీత్యా గాయకుడిని. కరోనా కారణంగా కార్యక్రమాలు లేక ఆర్థిక భారం మీద పడింది. ఆ సమయంలో వేడి పానీయాలకు డిమాండ్ ఉండడంతో వ్యవస్థీకృతంగా టీ వ్యాపారం ఎంచుకున్నాం. డికాక్షన్ తొలి కేంద్రం అక్టోబర్ 2020లో హైదరాబాద్ ఏర్పాటైంది. నేను, నా భార్య సంతోషి మూడు నెలలపాటు మా స్టోర్‌లో పనిచేశాం. తొలి 25 ఔట్లెట్లు 2021 మార్చి నాటికి, 50 సెంటర్స్ అక్టోబర్ కల్లా అందుబాటులోకి వచ్చాయి. మూడు నెలల్లోనే వీటికి 50 స్టోర్లు తోడవడం బ్రాండ్ పట్ల నమ్మకానికి నిదర్శనం’ అని వివరించారు. డికాక్షన్ కో–ఫౌండర్స్ జయ కిరణ్, సంతోషి -
జీఎస్టీ షురూ: ఐస్‌క్రీమ్ పార్లర్లు, స్టోర్ల నిర్వాహకులకు షాక్
న్యూఢిల్లీ: పార్లర్లు లేదా స్టోర్లు విక్రయించే ఐస్‌క్రీమ్‌లపై 18 శాతం జీఎస్టీ అమలవుతుందని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) స్పష్టం చేసింది. గత నెల 17నాటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 21 వస్తు, సేవల జీఎస్టీ రేట్ల లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకోగా.. వీటికి సంబంధించి వర్తక సంఘాలు వివరణలు కోరడంతో సీబీఐసీ తాజా ఆదేశాలిచ్చింది. తయారైన ఐస్‌క్రీమ్‌లను విక్రయించే కేంద్రాలే పార్లర్ల కిందకు వస్తాయని.. రెస్టారెంట్ తరహావి కాదని స్పష్టం చేసింది. ఐస్‌క్రీమ్‌ను ఒక ఉత్పత్తి (తయారు చేసిన) గా అందించడానికే వాటి పాత్ర పరిమితం అవుతుందని.. రెస్టారెంట్ మాదిరి ఏ తరహా ఉడికించే కార్యకలాపాల్లో పాల్గొనేవి కావంటూ వివరించింది. -
IKEA : కొత్తగా సిటీ స్టోర్లు.. ప్రైస్‌వార్‌కి రెడీ
ప్రపంచంలోనే అతి పెద్ద హోం ఫర్నీచర్ తయారీ, అమ్మకాల సంస్థ ఐకియా మరో కొత్త కాన్సెప్టుతో మార్కెట్లోకి రానుంది. అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ఎత్తులతో వస్తోంది. ఫర్నీచర్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెర లేపనుంది. హైదరాబాద్‌తో మొదలు స్వీడన్‌కి చెందిన అతి పెద్ద ఫర్నీచర్ తయారీ సంస్థ ఐకియా తన తొలి స్టోర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నవీ ముంబైలో రెండో స్టోర్‌ను ఇటీవల ప్రారంభించింది. ఈ రెండు స్టోర్లు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఇందులో తొమ్మిది వేల రకాల ఫర్నీచర్ వస్తువులు సిద్ధంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ తరహా ఆల్ ఇన్ వన్ అనే సూత్రానే పాటిస్తూ వచ్చింది ఐకియా సంస్థ. కానీ ఇటీవల మార్కెటింగ్‌లో కొత్త సిటీ స్టోర్స్ పేరుతో కొత్త కాన్సెప్టును తీసుకొచ్చింది. సిటీ స్టోర్లు విశాలమైన ప్రాంగణంలో అన్ని వస్తువులు ఒకే చోట కష్టమర్లకు లభించాలనే మార్కెటింగ్ టెక్నిక్‌కి స్వల్ప మినహాయింపులు ఇచ్చింది. అన్ని రకాల వస్తువుల స్థానంలో ముఖ్యమైన వస్తువులు లభించే విధంగా ఐకియా ఫర్నీచర్ స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని సిటీ స్టోర్ల పేరుతో ఏర్పాటు చేస్తోంది. పరిమాణంలో ఐకియా స్టోర్ల కంటే సిటీ స్టోర్లు చిన్నవిగా ఉంటాయి. యాభై వేల చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సిటీ స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ 6,500 రకాల ఫర్నీచర్లు లభిస్తాయి. ఎక్కడంటే ఐకియా సిటీ స్టోర్లు ఇప్పటికే యూరప్‌లో ముఖ్యమైన నగరాల్లో ప్రారంభం అవగా ఇండియాలో హైదరాబాద్, నవీ ముంబై స్టోర్లకు అదనంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నగర శివారు ప్రాంతాల్లో ఈ సిటీ స్టోర్లు రానున్నాయి. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రచురించింది. ధరల తగ్గింపు సిటీ స్టోర్ల ఏర్పాటుతో పాటు ధరలు తగ్గించడం ద్వారా ఎక్కువ కస్టమర్ బేస్‌ను సేల్స్‌ను సాధించాలనే లక్ష్యంతో ఐకియా ఉంది. ఈ మేరకు ఐకియా స్టోర్లలో ఎక్కువగా అమ్ముడయ్యే 50 రకాల వస్తువుల ధరలను 20 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయించినట్టు ఐకియా, ఇండియా మార్కెటింగ్ మేనేజర్ పెర్ హార్నెల్ తెలిపారు. ఐకియా స్టోర్ల నిర్వహాణ సామర్థ్యం పెంచడంతో పాటు మార్జిన్లను తగ్గించుకునైనా ధరల తగ్గింపును అమలు చేస్తామన్నారయన. చదవండి: పికప్ వాహనాలకు మహీంద్రా ఫైనాన్స్ -
తెరుచుకున్న ‘తనిష్క్’
ముంబై: లాక్డౌన్ ఎత్తివేత నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా స్టోర్లను తెరిచినట్లు బంగారు ఆభరణాల తయారీ సంస్థ తనిష్క్ తెలిపింది. స్టోర్లలోకి పరిమిత సంఖ్యలోనే కస్టమర్లను అనుమతిస్తామని పేర్కొంది. వైరస్, బ్యాక్టీరియాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికత కలిగిన ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను స్టోర్లలో ఏర్పాటు చేసినట్లు వివరించింది. సిబ్బందికి టీకా సిబ్బంది మొత్తానికి ఉచితంగా టీకాను అందించామని, స్టోర్లలో డబుల్ మాస్క్ లేదా ఎన్95 మాస్కుల ధారణ తప్పనిసరి చేశామని తెలిపింది. టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్ అన్‌లాక్ ప్రక్రియ తర్వాత దేశవ్యాప్తంగా ఉండే తన 356 స్టోర్లలో 294 రిటైల్ స్టోర్లను పునఃప్రారంభించింది. చదవండి : SBI: హెల్త్‌కేర్ బిజినెస్ లోన్ ద్వారా ఎంత రుణం పొందవచ్చు ? -
ఏపీ: జియో స్టోర్లలో మొదలైన అమ్మకాలు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లోని 38 నగరాలు, పట్టణాల్లోని జియో పాయింట్ స్టోర్లలో బుధవారం ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలు మొదలయ్యాయి. కొత్తగా రూపుదిద్దుకున్న ఈ జియో పాయింట్ స్టోర్లలో సంస్థ, మొబైల్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు, ఇతర చిన్న గృహోపకరణాల వంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలను చేపట్టనున్నట్లు జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ వెల్లడించారు. ప్రారంభ ఆఫర్ కింద వినియోగదారులకు రూ. 1100 విలువైన బహుమతులు, రూ. 300 విలువైన గిఫ్ట్ వోచర్లు ఖచ్చితంగా లభిస్తాయని తెలిపారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ఇంటర్నెట్ సదుపాయం లేని, ఆన్లైన్లో ఎప్పుడూ షాపింగ్ చేయని వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని జియో పాయింట్ స్టోర్లు రూపొందించబడ్డాయని పేర్కొన్నారు. పెద్ద నగరాలు మొదలుకొని చిన్న స్థాయి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు దేశవ్యాప్తంగా ఇప్పటికే విస్తరించి ఉన్న ఈ జియో పాయింట్ స్టోర్లు వినియోగదారుల నుంచి విశేష ఆదరణను చూరగొంటున్నాయన్నారు. ఇప్పటివరకు ఈ స్టోర్లలో కేవలం 4జీ మొబైల్స్, జియో సిమ్ అమ్మకాలు జరిగేవని, ఇప్పుడు ప్రారంభిస్తున్న ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలతో ఈ స్టోర్లు మరింత చేరువ కానున్నాయని తెలిపారు. -
‘కరోనా’ ఎఫెక్ట్; ఐకియా కీలక నిర్ణయం
బీజింగ్ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ చైనాను ఆర్థికంగా కూడా దెబ్బతీస్తోంది. చైనాలోని నగరాలతోపాటు ప్రపంచదేశాలకు కూడా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆయా దేశాలు చైనాలో ఉన్న తమ ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశాయి. పలు విమానయాన సంస్థలు చైనా విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశాయి. తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద ఫర్నిచర్ రిటైలర్ స్వీడన్ కు చెందిన ఐకియా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలోని తన 30 దుకాణాలలో సగం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ విస్తరించిన వుహాన్ నగరంలోని దుకాణాన్ని ఇప్పటికే మూసి వేసింది. వ్యాధి వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించేందుకు సహకరించాలన్న చైనా ప్రభుత్వం పిలుపునకు ప్రతిస్పందనగా జనవరి 29 నుండి చైనాలోని సగం దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. బాధిత ఉద్యోగులు తదుపరి నోటీసు వచ్చేవరకు విధులకు హాజరు కానవసరం లేదని ఇంట్లోనే వుంటారని తెలిపింది. కాగా చైనాలో సుమారు 14,000 మందికి ఉపాధి కల్పిస్తోంది ఐకియా. గత నెలలో బైటపడిన చైనాలో కరోనా వైరస్ బారిన పడి చనిపోయినవారి సంఖ్య బుధవారం నాటికి 132కు పెరిగిన సంగతి తెలిసిందే. -
బ్యాడ్మింటన్ స్టార్స్
బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సందడి చేసింది. కొండాపూర్లోనిఓ మాల్లో ఆమె భర్త కశ్యప్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొంది.సెల్ఫీలు దిగుతూ అభిమానులను అలరించింది. గచ్చిబౌలి: కొండాపూర్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఏర్పాటు చేసిన కైరా స్టోర్‌ను బ్యాడ్మింటన్ స్టార్స్, దంపతులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడల్స్‌తో కలిసి న్యూ కలెక్షన్స్‌ను ప్రదర్శించారు. త్వరలో మలేసియాలో జరగనున్న నేషనల్ టోర్నమెంట్ సిద్ధమవుతున్నానని సైనా చెప్పారు. దేశవ్యాప్తంగా 111 స్టోర్లు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కైరా డైరెక్టర్లు దినేశ్ మంగ్లాని, కరిష్మా మంగ్లానిపాల్గొన్నారు. -
169 స్టోర్లు మూత:వేల ఉద్యోగాలు గల్లంతు?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర, దక్షిణ భారతదేశంలో మెక్ డొనాల్డ్స్ స్టోర్లు భారీ ఎత్తున మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు లిమిటెడ్ (సీఆర్పీఎల్)తో ముగిసిన ఒప్పందం నేపథ్యంలో మెక్ డొనాల్డ్స్ షాపులు ఈ రోజు(బుధవారం) నుంచి మూతపడ నున్నాయి. దీంతో వేలాదిమంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. మెక్‌డోనాల్డ్స్ ప్రకారం మొత్తం 169 దుకాణాల్లో మెక్ డొనాల్డ్స్ ట్రేడ్ మార్క్ ఆహార ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబరు 6 నుంచి తన బ్రాండ్ పేరు , ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించే అధికారం సీఆర్‌పీఎల్‌కు లేదని పేర్కొంది. రద్దు నోటీసు కాలం సెప్టెంబరు 5 న ముగిసినందున, మెక్‌డొనాల్డ్ మేధో సంపత్తిని ఉపయోగించేందుకు సీఆర్‌పీఎల్‌కు అధికారం లేదు. అంటే వారు మెక్‌డొనాల్డ్ పేర్లు, ట్రేడ్‌మార్క్ పేర్లు, డిజైన్లు, బ్రాండింగ్, మార్కెటింగ్ లాంటివి ఉపయోగించడం మానివేయాలి. దీనికి సంబంధించి చట్టపరమైన , ఒప్పంద హక్కుల ప్రకారం తాము వ్యవహరించనున్నామని మెక్‌డోనాల్డ్ ఇండియా ప్రతినిధి చెప్పారు. అయితే స్టోర్లమూసివేతపై సీఆర్పీఎల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు బుధవారం నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నామని కంపెనీ ఎండీ విక్రమ్ బక్షి చెప్పారు. ఈ స్టోర్ల మూసివేత కారణంగా వేలాదిమంది ఉద్యోగులను రోడ్డుమీదికి నెట్టివేయనుందన్నారు. అంతేకాదు ఇది తమ వ్యాపారంపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని విక్రమ్ బక్షి తెలిపారు. దాదాపు 10 వేల మంది (ప్రత్యక్షంగా ,పరోక్షంగా)తో పాటు కంపెనీ సరఫరాదారులు, ఇతర వ్యాపార భాగస్వాములకు తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పారు. కాగా మెక్‌డొనాల్డ్‌తో ఫ్రాంఛైజ్ ఒప్పందం రద్దును సవాలు చేస్తూ సీఆర్పీఎల్ పిటిషన్‌ను మంగళవారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కొట్టివేసింది. సీఆర్పీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ బక్షి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే -
భారత్ వైపు.. బ్రాండ్స్ చూపు
♦ వచ్చే ఆర్నెల్లలో 50కి పైగా అంతర్జాతీయ రిటైలర్ల రాక ♦ సుమారు 3,000 పైచిలుకు స్టోర్స్ ప్రారంభం ♦ లిస్టులో పాస్తా మానియా, లష్ అడిక్షన్, కోర్స్ మొదలైనవి ♦ ఫ్రాంచైజీ ఇండియా అంచనాలు న్యూఢిల్లీ: దేశీయంగా రిటైల్ రంగంలో సంస్కరణల నేపథ్యంలో పలు చిన్న, మధ్యస్థాయి విదేశీ బ్రాండ్లు భారత్‌వైపు చూస్తున్నాయి. రాబోయే ఆరు నెలల్లో సుమారు 53 అంతర్జాతీయ రిటైల్ సంస్థలు భారత మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. దాదాపు 3,000 పైచిలుకు స్టోర్స్ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఆయా సంస్థలతో జట్టు కట్టిన ఫ్రాంచైజీ ఇండియా గణాంకాల ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు ఇప్పించేందుకు, కార్యకలాపాలు ప్రారంభించడంలోను .. భాగస్వాములను వెతికిపెట్టడంలోనూ వాటికి ఫ్రాంచైజీ ఇండియా సహకారం అందిస్తోంది. ఇండియాలో కాలుమోపేందుకు ఆసక్తిగా ఉన్న సంస్థల్లో కోర్స్, మిగాటో, ఎవిసు, వాల్‌స్ట్రీట్ ఇంగ్లీష్, పాస్తా మానియా, లష్ ఎడిక్షన్, మెల్టంగ్ పాట్, యోగర్ట్ ల్యాబ్, మొనాలిసా తదితర బ్రాండ్స్ ఉన్నాయి. వీటిలో చాలా మటుకు అమెరికా, సింగపూర్‌కి చెందినవి. ఇవి 300–500 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. వీటిలో 18 ఫుడ్ అండ్ బెవరేజెస్ సంస్థలు కాగా.. అపారెల్, లైఫ్‌స్టయిల్, ఎడ్యుకేషన్ ఉత్పత్తుల సంస్థలు తలో 13 ఉన్నాయి. సుమారు దశాబ్దం కింద పెద్ద రిటైలర్లు, బ్రాండ్స్ భారత్‌లోకి వచ్చాయని, ఇప్పుడు చిన్న, మధ్య స్థాయి బ్రాండ్స్ ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఫ్రాంచైజీ ఇండియా హోల్డింగ్స్ చైర్మన్ గౌరవ్ మార్యా వెల్లడించారు. ఇవన్నీ విస్తరణకు ఎక్కువగా ఫ్రాంచైజీ విధానంపైనే ఆధారపడుతున్నాయి. అవకాశాల గని భారత్.. ఏటీ కియర్నీ నివేదిక ప్రకారం రిటైలింగ్‌కు ప్రపంచంలోనే అపార అవకాశాలున్న దేశంగా భారత్ ఇటీవలే చైనాను అధిగమించింది. భారత ప్రభుత్వం విదేశీ రిటైలర్లకు సంబంధించిన నిబంధనలు కూడా సడలించింది. సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలించడంతో స్వీడన్‌కి చెందిన హెనెస్ అండ్ మారిట్జ్ (హెచ్అండ్ఎం), ఐకియా, జపాన్ సంస్థ యూనిక్లో, అమెరికాకు చెందిన గ్యాప్ మొదలైన దిగ్గజ బ్రాండ్స్ భారత్‌వైపు దృష్టి సారించాయి. హెచ్అండ్ఎం ఇప్పటికే స్టోర్స్ ప్రారంభించగా.. ఐకియా హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కార్యకలాపాల ప్రారంభానికి జోరుగా కసరత్తు చేస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తుండటం, వస్తు సేవల పన్నుల విధానాన్ని ప్రవేశపెడుతుండటం మొదలైన చర్యలు కూడా తీసుకుంటోంది. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానుంది. అలాగే ప్రస్తుతం భారత వృద్ధి రేటు కూడా ఆకర్షణీయంగా ఉంది. ఇలాంటి సానుకూల అంశాలన్నీ విదేశీ బ్రాండ్స్‌ను ఆకర్షిస్తున్నాయి. స్వదేశంలో విస్తరణ మందగించి, ఇతర దేశాల మార్కెట్లు అంతంత మాత్రంగానే ఉండటంతో.. చిన్న స్థాయి రిటైల్ సంస్థలు భారత్ వైపు చూస్తున్నాయి. బ్రెజిల్, రష్యా, చైనా మార్కెట్లలో విస్తరణ పూర్తయిపోవడం.. యూరప్, మధ్యప్రాచ్య దేశాల మార్కెట్లలో వృద్ధికి అవకాశాలు తగ్గిపోవడంతో భారత్ వైపు మళ్లుతున్నట్లు పిల్లల దుస్తులు విక్రయించే యూరోపియన్ సంస్థ మొనాలిసా వర్గాలు పేర్కొన్నాయి. చిన్న బ్రాండ్స్.. చిన్న పట్టణాలపై దృష్టి.. దిగ్గజ సంస్థలు పెద్ద నగరాలు, పట్టణాలే లక్ష్యంగా కార్యకలాపాలు ప్రారంభిస్తుంటాయి. వాటికి భిన్నంగా ఈ చిన్న బ్రాండ్స్.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో అవకాశాలపై మొనాలిసా వంటి సంస్థలు దృష్టిపెట్టాయి. ఇక నాన్ వెజ్ విషయంలో భారత్‌లో ప్రధానంగా చికెన్ ఉత్పత్తులకుండే డిమాండ్‌ను అవకాశంగా మల్చుకోవాలని బ్రిటన్‌కి చెందిన క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్ఆర్) సదరన్ ఫ్రైడ్ చికెన్ యోచిస్తోంది. చికెన్ ప్రధానమైన తమ మెనూ ఇక్కడ బాగా ఆదరణ పొందగలదని భావిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. సదరన్ ఫ్రైడ్ చికెన్ అంతర్జాతీయంగా 700 పైచిలుకు ఫ్రాంచైజీలు నిర్వహిస్తోంది. ఫుడ్ చెయిన్స్ జోరు .. దేశీ రిటైల్ మార్కెట్ పరిమాణం 2016లో సుమారు 641 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏటా 10% వృద్ధి రేటుతో ఇది 2026 నాటికి 1.6 ట్రిలియన్ డాలర్లకి చేరొచ్చని అంచనా. ఇంత భారీ మార్కెట్లో ఆహారం, నిత్యావసరాల రిటైల్ వ్యాపారం కేవలం 3 శాతమే. దీంతో అవకాశాలు అందిపుచ్చుకోవాలని అంతర్జాతీయ ఫుడ్ చెయిన్స్ భావిస్తున్నాయి. డామినోస్ పిజ్జా, మెక్‌డొనాల్డ్స్ ఆధిపత్యం నడుస్తున్న మార్కెట్లోకి 18 క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చెయిన్స్ ప్రవేశించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇవన్నీ కూడా స్నాక్స్, ఐస్ క్రీమ్ బ్రాండ్సే. -
నగరంలోని మూడు దుకాణాల్లో చోరీ
హైదరాబాద్: తాళం వేసి ఉన్న మూడు దుకాణాలలో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. నగరంలోని వనస్థలిపురం కాలనీలో మంగళవారం రాత్రి మూడు దుకాణాల షట్టర్లు పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు దుకాణాల్లోని నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన షాపుల యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఎంత మొత్తంలో నగదు చోరీకి గురైంది అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. -
భారీగా మూతపడుతున్న నైక్ స్టోర్స్
ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ నైక్ దేశంలో భారీ ఎత్తున తన దుకాణాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించిందట. ఇటీవలి భారీ నష్టాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ వేర్ మేకర్ అమెరికాకు చెందిన నైక్ దాదాపు 35శాతం స్టోర్లను మూసివేస్తున్నట్టు సమాచారం. భాగస్వాముల సంఖ్యను తగ్గించుకొనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందని ఇండస్ట్రీ సీనియర్లు వ్యాఖ్యానించారు. గతంలో 20 మందిగా పార్టనర్ల సంఖ్యను రెండునుంచి మూడుకు తగ్గించే యోచనలో ఉందని తెలిపారు. పెట్టుబడులపై క్షీణించిన ఆదాయం, తప్పుడు మార్కెటింగ్ విధానాలే సంస్థకు నష్టాలు తెచ్చిపెట్టాయని, రీటైల్ వ్యాపార విస్తరణ ప్లాన్ కూడా విఫలమైన కారణంగా దుకాణాల మూసివేతకు దారితీసిందని మరో పరిశ్రమ పెద్ద అభిప్రాయపడ్డారు. అలాగే క్రికెట్ పై సంవత్సరానికి దాదాపు 60 కోట్లకు పైగా వెచ్చించే నైక్...భారత క్రీకెట్ దిగ్గజాలకు కిట్ల స్పాన్సరింగ్ విషయంలో కూడా పునరాలోచిస్తున్నట్టు సమాచారం. కాగా నైక్ ప్రస్తుతం సుమారు 200 దుకాణాలను నిర్వహిస్తున్న నైక్ అడిడాస్ , రీ బ్యాక్, ప్యూమా లాంటి ప్రత్యర్థి కంపెనీలకు దీటుగా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా ప్రీమియం షూస్, దుస్తులు తదితర అమ్మకాల్లో పేరు గడించిన సంగతి తెలిసిందే. -
యాపిల్‌కు షాకిచ్చిన కేంద్రం?
న్యూఢిల్లీ : భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను సొంతం చేసుకోవాలనుకుంటున్న ఆపిల్ కు భారీ షాక్ తగిలింది. యాపిల్ స్టోర్లు, రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకం అనే రెండు ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన యాపిల్ కు కేంద్రప్రభుత్వం అడ్డుకట్టవేసింది. యాపిల్ స్టోర్లను నెలకొల్పేందుకు ఆపిల్ పెట్టుకున్న దరఖాస్తును కేంద్రం తోసిపుచ్చిందని పేరు చెప్పడానికి ఇష్టపడని టెలికం అధికారి ఒకరు చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ తెలియజేసింది. ఆపిల్ అనుకున్న ప్లాన్ ఇండియాలో అమలు చేయడానికి నిబంధనలు అనుమతించవని ఖరాఖండిగా చెప్పేసిందని పేర్కొంది. యాపిల్ రీఫర్బిష్డ్ ఫోన్లను (వినియోగ ఫోన్లు) దిగుమతి చేసుకుని విక్రయాలకు అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్రాండెడ్ రిటైల్ స్టోర్లు తెరుచుకోవడానికి స్థానికంగా ఉన్న నిబంధనల్లో సడలింపు ఉండదని తేల్చి చెప్పింది. 30శాతం లోకల్ సోర్సింగ్ ఉండాలన్న నిబంధననుంచి వెనక్కితగ్గేది లేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ నిబంధననుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా యాపిల్ కోరిందని తెలిపారు. భారత్ లో ఉద్యోగల కల్పన కోసం ఉద్దేశించిన ఈ నిబంధన సడలింపు కుదరదని జైట్లీ తేల్చి పారేశారు. మరోవైపు యాపిల్ ప్రతిపాదనను ఆమోదిస్తే ప్రమాదకర పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ఇవన్నీ చూశాక కేంద్రం మాత్రం యాపిల్ ప్రతిపాదనకు నో చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్' వార్తా సంస్థ తెలియజేసింది. ఇలా కేంద్రం నుంచి అనుకోని షాక్ తగలడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్టయింది. పాత ఫోన్లన్నీ ఇండియాకు దిగుమతి అయితే ఆపిల్‌ను అనుమతిస్తే పాత ఫోన్లన్నీ ఇండియాకు దిగుమతి అయి వస్తాయని, దీనికితోడు ఇండియాలో తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' ప్రచారానికి కూడా దెబ్బ తగులుతుందని కొంతమంది నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేశారు. అయితే యాపిల్ కు ఇటీవలే భారత్ లో రిటైల్ స్టోర్లు ఏర్పాటుచేసుకోవడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నుంచి అనుమతులు లభించాయి.ఎఫ్ డీఐ నిబంధనల ప్రకారం సింగిల్ బ్రాండ్ రీటైల్ లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ అనుమతి కల్పించింది. కానీ మూడింట ఒక వంతు కాంపోనెంట్స్ భారత్ కు చెందినవే ఉండాలనే నిబంధన కచ్చితంగా అమలుచేయాలని ప్రభుత్వం చెప్పింది. స్థానిక ఉద్యోగవకాశాలను, పరిశ్రమను అభివృద్ధి చేయడమే ఈ నిబంధ ఉద్దేశమని స్పష్టం చేసింది. కాగా పడిపోతున్న యాపిల్ అమ్మకాలను పునరుద్ధరించుకునే చర్యలో భాగంగా సీఈవో టిమ్ కుక్ ఇటీవలే భారత్ లో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలు ప్రభుత్వ సీనియర్ అధికారులను, టెక్ నిపుణులను కలిశారు. ముంబైలో పలువురు బాలీవుడ్ ప్రముఖులను కలిసి, సిద్ధి వినాయక టెంపుల్ లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. -
విస్తరణ బాటలో మెడ్ ప్లస్
♦ ఫ్రాంచైజీ మోడల్ విధానంలో ఏపీ, తెలంగాణలో.. ♦ 1,100 స్టోర్ల విస్తరణ లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మెడ్‌ప్లస్ సంస్థ విస్తరణ బాట పట్టింది. తొలి దశలో భాగంగా ఏపీ, తెలంగాణల్లో 1,100 స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫ్రాంచైజీ విధానం ద్వారా రెండు రాష్ట్రాల్లోని జిల్లా, మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మెడ్‌ప్లస్ ఫౌండర్, సీఈఓ డాక్టర్ మధుకర్ గంగాడీ గురువారం ఒక ప్రక టనలో తెలిపారు. ఒక్కో స్టోర్ ఏర్పాటుకు 300-500 చ.అ. స్థలం, దాదాపు రూ.15-20 లక్షల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ పెట్టుబడిలో ఫ్రాంచైజీ, అద్దె డిపాజిట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాక్ ఏర్పాటు వంటివన్నీ కలిసే ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం పెట్టుబడిలో 70% వరకూ రుణాన్ని అందించేందుకు గాను ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. -
తాండూరులో చోరీల పరంపర..
తాండూరు: జిల్లాలో ప్రధాన వ్యాపార కేంద్రమైన తాండూరు పట్టణంలో చోరీలు పెరుగుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో రెండు నగల దుకాణాల్లో దొంగతనాలు జరగడంతో వ్యాపారులతో పాటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ చోరీలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. రాత్రి పూట పకడ్బందీగా గస్తీ నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నా మరోవైపు చోరీలు జరుగుతున్నాయి. ఇటీవల ముఖ్యంగా తాండూరులోని నగల దుకాణాలను లక్ష్యంగా చేసుకొని దుండగులు చోరీలకు పాల్పడ్డారు. లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతోపాటు నగదును అపహరించుకుపోయారు. దీంతో వ్యాపార వర్గాలు భయాందోళనకు గురవుతున్నాయి. నిత్యం రాత్రిపూట 6-7 బీట్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, దానిని ఓ ఎస్ఐ పర్యవేక్షణ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. సంఖ్యాపరంగా బీట్లు బాగున్నా పెట్రోలింగ్ మాత్రం నామమాత్రంగా మారిందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. గత నెల 16న రాత్రి పట్టణంలోని గాంధీనగర్‌లోని శ్రీరంజన్ జ్యువెలరీ దుకాణంలో, ఈనెల 1న రాత్రి బాలాజీ బ్రదర్స్ నగల దుకాణంలో చోరీలు జరిగాయి. గుర్తుతెలియని దుండగులు రెండు వారాల వ్యవధిలో రెండు నగల దుకాణాల్లో సుమారు రూ.6 లక్షల సొత్తు అపహరించుకుపోయారు. ఈ రెండు ఘటనల్లో దుండగులు దుకాణాల పైకప్పులు తొలగించి షాపుల్లోకి చొరబడ్డారు. చోరీల తీరు దాదాపు ఒకేవిధంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. కర్ణాటక ముఠాకు చెందిన దుండగలు ఈ చోరీలు చేశారా?, స్థానికుల హస్తం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయిపూర్లోని ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో ఇటీవల దుండగులు చోరీకి పాల్పడి రూ.లక్ష వరకు నగదు అపహరించుకుపోయారు. కాగా ఈ విషయం వెలుగులోకి రాలేదు. పెట్రోలింగ్ కేవలం రాత్రివేళల్లో నడిచే హోటళ్లను మూయించడానికే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాండూరు రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో గస్తీ వంతుగా మారిందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. అర్థరాత్రి దాటిన తరువాత రైల్వేస్టేషన్, బస్టాండ్ల వద్ద అనుమానితులపై పోలీసుల నిఘా పూర్తిగా కొరవడింది. తాండూరు పట్టణం కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడం, రైలు సౌకర్యం ఉండటంతో ఆ రాష్ర్ట ముఠాలు ఇక్కడ చోరీలకు పాల్పడుతూ సులువుగా ఇక్కడి నుంచి పారిపోతున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు పటిష్టంగా గస్తీలు నిర్వహించి చోరీల పరంపరకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముమ్మరంగా దర్యాప్తు.. చోరీ కేసులను ఛేదించేందుకు ముమ్మరంగా దర్యా ప్తు చేస్తున్నట్లు తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్ తెలిపారు. ప్రత్యేక బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాత్రివేళల్లో పటిష్టంగా గస్తీలు నిర్వహిస్తున్నట్లు డీస్పీ పేర్కొన్నారు. -
మామూళ్ల మత్తు
సాక్షి, కర్నూలు/ డోన్ టౌన్ : ఆ ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఈఎస్) నెల జీతం సుమారు రూ. 50 వేలు. అయితే ఆయన గీతం మాత్రం నెలకు రూ. 6 లక్షలపైమాటే. సీఐ జీతం రూ. 25 వేలు పైమాటే. కానీ ఆయనకు మామూళ్ల రూపంలో నెలకు అందుతున్నది మాత్రం అక్షరాల రూ. లక్ష. ‘మీరు ఎంత ధరకైనా అమ్ముకోండి. మద్యం కల్తీ చేసుకున్నా ఫర్వాలేదు. కానీ తమకిచ్చే మామూళ్లు ఇస్తే చాలు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆబ్కారీ అధికారులు.. మామూళ్లకు తెరతీసి సిండికేటు వ్యాపారులతో చేతులు కలిపారు. వాస్తవానికి సిండికేట్లను అరికట్టాలన్న ఉద్దేశంతో సర్కారు మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానిస్తోంది. ఇలా షాపులు దక్కించుకున్న దుకాణాదారులందరినీ కలిపి ఆబ్కారీ అధికారులే సిండికేటుగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే షాపులు పొందిన తర్వాత(పోస్ట్ సిండికేట్) సిండికేటన్నమాట. గరిష్ట చిల్లర ధరల(ఎంఆర్పీ)కి మించి మద్యం విక్రయాలను జరుపుకోమంటూ.. మామూళ్లకు తెరలేపారు. గతంలో వ్యాపారులే సిండికేట్ అయి గరిష్ట అమ్మకం ధరకు ఎంతో కొంత అదనంగా నిర్ణయించి అమ్ముకునే ఆనవాయితీ ఉండేది. ప్రస్తుతం ఈ బాధ్యతను ఎక్సైజ్ అధికారులు భుజాన వేసుకున్నారు. కొంత మంది ఎక్సైజ్ అధికారులు దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులను ఓ వేదిక మీదకు తీసుకువచ్చి సిండికేట్‌గా ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల మద్యం క్వార్టర్ బాటిల్‌కు రూ. 10, బీరు బాటిల్‌కు రూ. 15 వంతున అదనంగా వసూలు చేసుకోవచ్చంటూ మద్యం వ్యాపారులకు అధికారులు సెలవివ్వడంతో జిల్లాలో మద్యం సిండికేట్లు మళ్లీ చెలరేగిపోతున్నాయి. గరిష్ట చిల్లర ధరకు మించి విక్రయిస్తూ మందు బాబుల జేబులు గుల్ల చేస్తున్నారు. మద్యం మాఫియాకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో వ్యాపారం మూడు క్వార్టర్లు.. ఆరు ఫుల్లులు అన్న చందంగా మద్యం వ్యాపారం యథేచ్చగా సాగుతోంది. ఇదే అదనుగా చూసుకొని పల్లెల్లో కూడా బెల్టు షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. అక్రమాన్ని నిరోధించాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ. 30 వేలు! జిల్లాలో 14 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. నంద్యాల, కర్నూలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ల ఆధ్వర్యంలో ఈ స్టేషన్లు నడుస్తున్నాయి. వీటి పరిధిలో 194 మద్యం దుకాణాలున్నాయి. ప్రతి నెలా వీటి ద్వారా రూ. 80 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. గరిష్ట చిల్లర ధరకు అమ్మితే దుకాణాదారుకి రూ. 22 శాతం లాభం వస్తుందని అంచనా. అది సరిపోవడం లేదని వ్యాపారులంతా సిండికేటై ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. చిన్న సీసాపై రూ. 10, బీరు సీసాపై రూ. 15 పెంచి అమ్ముతున్నారు. ఈ సిండికేట్ల ఎక్సైజ్ అధికారులు అండదండలు అందిస్తుండటంతో ఒక్కో దుకాణాదారుడు ఎక్సైజ్ స్టేషన్ అధికారికి నెల వారీగా రూ. 30 వేలు మామూళ్ల రూపంలో అందజేస్తున్నట్లు సమాచారం. ఇలా ఆ సర్కిల్ పరిధిలో ఉండే స్టేషన్ల నుంచి ప్రతి నెలా మామూళ్లు ముట్టజెప్పుతున్నారు. ఇందులో ఆయా అధికారులకు వాటాలు వెళ్తున్నాయి. ఉదాహరణకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు 14 స్టేషన్ల నుంచి నెలకు సరాసరి రూ. 50 వేల చొప్పున రూ. 7 లక్షల వరకు అందుతోందని సమాచారం. అసిస్టెంట్ కమిషనర్‌కు రూ. 2.50 లక్షలు, ఒక్కో ఎక్సైజ్ సూపరింటెండ్‌కు వారి పరిధిలోని స్టేషన్ల వారీగా నెలకు మొత్తం రూ. 6 లక్షలకుపైగా వాటాలందుతున్నట్లు తెలుస్తోంది. ఇక సీఐలకు ఒక్కొక్కరికి రూ. లక్ష, ఎస్ఐలకు రూ. 40 వేలు, కానిస్టేబుళ్లకు రూ. 15 వేలకు పైగా నెల వారీ మామూళ్లు అందజేస్తున్నట్లు సమాచారం. ఈ సొమ్మును వసూలు చేయడానికి ఒక్కో స్టేషన్లో ఇద్దరేసి కానిస్టేబుళ్లను నియమించడం విశేషం. అందరూ కలిసిక(ట్టే)ట్టుగా.. జిల్లాలో మద్యం వ్యాపారులను ఒక వేదికపైకి తీసుకొచ్చిన ఎక్సైజ్ అధికారులు వారికి ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు కూడా చెబుతుండటం గమనార్హం. ఉదాహరణకు ఇటీవల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల బృందం ఒక స్టేషన్ పరిధిలోని నాలుగు షాపులపై దాడులు చేసి.. అక్రమాలపై రూ. 4 లక్షలు ఫెనాల్టీ రాస్తే... ఆ వెంటనే మిగిలిన షాపులకు చెందిన యజమానులు తలా రూ. 40 వేలు వేసుకుని అ సొమ్మును కట్టేశారు. అంటే అందరూ కలిసికట్టు (సిండికేట్)గా కేసులనూ ఎదుర్కొంటున్నారన్నమాట. అదేవిధంగా ఎక్సైజ్ సిబ్బంది నుంచి అందుతున్న సహకారానికి ఈ సిండికేట్లు మరింత రెచ్చిపోయి.. కర్ణాటకకు చెందిన ఛీప్ లిక్కర్(స్ఫూరియస్ లిక్కర్)ను యథేచ్చగా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బెల్టు షాపులూ కొనసాగుతున్నాయి. మ్తొతంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఈ తంతు యథేచ్చగా జరుగుతోంది. -
ఎన్పీడీసీఎల్ స్టోర్స్‌లో చోరీపై విచారణ
ఎట్టకేలకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు హన్మకొండ సిటీ : ఎన్పీడీసీఎల్ జిల్లా స్టోర్స్‌లో జరిగిన చోరీపై అధికారులు విచారణ ప్రారంభించారు. హన్మకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ సహాయ డివిజనల్ ఇంజనీర్ జిల్లా స్టోర్స్‌లో జిల్లాకు అవసరమయ్యే విద్యుత్ పరికరాలు నిలువ చేస్తారు. జిల్లాలో ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు అవసరమున్నా, లేక ఇతర మెటీరియల్ అవసరమున్నా ఈ స్టోర్స్ నుంచి పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ల నుంచి వచ్చే కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల కాపర్ వైర్‌ను ఇక్కడే నిలువ చేస్తారు. అరుుతే, ఆరు రోజుల క్రితం ఓ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ నుంచి కాపర్‌వైర్‌ను జిల్లా స్టోర్స్‌లో నిలువ చేయడానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కాపర్‌వైర్ నిలువ చేసే గదికి ఉన్న తలుపు నుంచి వెలుతురు రావడాన్ని స్టోర్స్ అధికారులు గుర్తించారు. దగ్గరికి వెళ్లి చూడగా తలుపునకు రద్రం చేసి ఉంది. ఈ దర్వాజ వినియోగంలో లేదు. పైగా దర్వాజకు లోపలి వైపు గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. ఈ గదికి భద్రత ఉన్నప్పటికీ దొడ్డిదారిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. నిలువ చేసిన కాపర్ వైర్లో 17 క్లింటాళ్ళ వైరు చోరీకి గురైనట్టు అధికారులు గుర్తించారు. వెంటనే సుబేదారి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. రూ.7 లక్షలు విలువ ఉండడంతో ఇది పెద్ద దొంగతనంగా భావించిన పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు వెనకడుగు వేశారు. నాలుగు రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తమను పట్టించుకోలేదని విద్యుత్ అధికారులు తెలిపారు. చోరీ జరిగిన విషయంపై గురువారం ‘సాక్షి’లో వార్త ప్రచురితం కావడంతో పాటు జిల్లా స్టోర్స్ బాధ్యలైన అధికారులు అడిషనల్ ఎస్పీని కలిసి పరిస్థితిని వివరించారు. ఆ తరువాత అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు ఫిర్యాదు స్వీకరించినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. డీఈలు విజేందర్‌రెడ్డి, ఉత్తం, విజిలెన్స్ సీఐ జితేందర్‌రెడ్డి జిల్లా స్టోర్స్‌కు వచ్చి దొంగతనం జరిగిన గదిని, చుట్టూ పరిసరాలు పరిశీలించారు. రాత్రి కాపలాదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా స్టోర్ట్స్‌ను ఆనుకొని నీటిపారుదల శాఖ ఎస్ఈ గృహ సముదాయం ఉంది. ఈ గృహ సముదాయం, జిల్లా స్టోర్స్ మధ్యన ప్రహరీ ఉంది. ఇక్కడి నుంచి కాపర్ వైర్ బయటకి వెళ్లి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. నీటిపారుదల శాఖ ఎస్ఈ గృహ సముదాయం ఎప్పుడూ నిర్మాణుష్యంగా ఉంటుందని, దీంతో దీనిని చోరీకి అనువుగా చేసుకొన్నట్లుగా భావిస్తున్నారు. దీంతో పాటు ఇందులో పనిచేసే ఓ ఉద్యోగిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఉద్యోగి కొన్ని రోజులుగా విధులకు హాజరు కాకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతుంది. పోలీసులు పూర్తిస్థారుు విచారణ జరిపితే.. చోరీలో ఎవరి హస్తం ఉందో వెల్లడి కానుంది. -
రాత్రి 10 గంటల వరకు షాపులు!
సాక్షి, ముంబై: నగరంలోని దుకాణదారులు ఇక మీదట కొత్త సమయ వేళలను పాటించనున్నారు. ప్రస్తుతం నగరంలోని దుకాణాలు, సంస్థలు రాత్రి 8.30 గంటలకే తమ దుకాణాలను బంద్ చేసేవారు. ఇక మీదట వీరు రాత్రి 10 గంటల వరకు కొనసాగించవచ్చు. నగర దుకాణాలు, సంస్థల యాక్టును సవరించి రాత్రి 8.30 నుంచి రాత్రి 10 గంటల వరకు సమయాన్ని పెంచారని దుకాణ దారులు పేర్కొన్నారు. తమ ప్రతిపాదనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమ్మతించి, మంజూరు చేశారని వారు తెలిపారు. దీంతో ఇక మీదట తాము దుకాణాలను రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంచుకోవచ్చని వారు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, దీనిపై తాము ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేశామని కార్మిక మంత్రి హసన్ ముష్రిఫ్ పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా 18.5 లక్షల దుకాణాలు, సంస్థలు ఉన్నాయన్నారు. దుకాణాలను మూసి ఉంచే సమయాన్ని రాత్రి 8.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పొడిగించేందుకు చట్ట సవరణ నిమిత్తం 2011 అక్టోబర్ 20న రాష్ర్ట ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. ఈ ప్రతిపాదనను ఇరు సభలు అనుమతినిచ్చాయన్నారు. తర్వాత దానిని రాష్ట్రపతి అనుమతి కోసం సమర్పించగా వారం కిందటే వారినుంచి ఆమోదముద్ర లభించిందని ముష్రిఫ్ పేర్కొన్నారు. కాగా, దుకాణాలు, సంస్థలు రాత్రి 8.30 వరకు మూసి ఉంచాలని 1948లోనే చట్టం చేశారు. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ గడువును రాత్రి 10 గంటల వరకు మార్చాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ముంబై లాంటి మహానగరాల్లో నగరవాసులు మామూలుగా రాత్రి 9 గంటల కంటే ముందు ఇంటికి చేరుకోరన్నారు. అయితే దుకాణాలు రాత్రి 8.30 మూసి ఉంచడంతో వీరికి రోజువారీ సరుకులు కొనుగోలు చేయాలన్నా కష్టంగా మారుతోందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ సమయాన్ని మరింత పొడిగించడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి కూడా సహాయకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. రాత్రి 8.30 గంటల నుంచి 10 గంటల వరకు గడువును పొడిగించే ప్రతిపాదనను ఒక దశాబ్దం తర్వాత పరిగణనలోకి తీసుకున్నారన్నారు. అయితే ఈ ప్రక్రియ వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయన్న అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అంతేకాకుండా విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఓ పక్క నగరాన్ని అంతర్జాతీయ క్షేత్రంగా, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆసక్తి చూపిస్తూ, మరో పక్క హాస్యాస్పద నిబంధనలు విధిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.