ఏపీ: జియో స్టోర్లలో మొదలైన అమ్మకాలు | Electronics And Home Appliances Sales Started In Jio Store In AP | Sakshi
Sakshi News home page

ఏపీ: జియో స్టోర్లలో మొదలైన అమ్మకాలు

Published Fri, Aug 28 2020 8:19 PM | Last Updated on Fri, Aug 28 2020 8:52 PM

Electronics And Home Appliances Sales Started In Jio Store In AP - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లోని 38 నగరాలు, పట్టణాల్లోని జియో పాయింట్ స్టోర్లలో బుధవారం ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాల అమ్మకాలు మొదలయ్యాయి. కొత్తగా రూపుదిద్దుకున్న ఈ జియో పాయింట్ స్టోర్లలో సంస్థ, మొబైల్స్‌, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు, ఇతర చిన్న గృహోపకరణాల వంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలను చేపట్టనున్నట్లు జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ వెల్లడించారు. ప్రారంభ ఆఫర్ కింద వినియోగదారులకు రూ. 1100 విలువైన బహుమతులు, రూ. 300 విలువైన గిఫ్ట్ వోచర్లు ఖచ్చితంగా లభిస్తాయని తెలిపారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు.

 ఇంటర్నెట్ సదుపాయం లేని, ఆన్‌లైన్‌లో ఎప్పుడూ షాపింగ్ చేయని వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని జియో పాయింట్ స్టోర్లు రూపొందించబడ్డాయని పేర్కొన్నారు. పెద్ద నగరాలు మొదలుకొని చిన్న స్థాయి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు దేశవ్యాప్తంగా ఇప్పటికే విస్తరించి ఉన్న ఈ జియో పాయింట్ స్టోర్లు వినియోగదారుల నుంచి విశేష ఆదరణను చూరగొంటున్నాయన్నారు. ఇప్పటివరకు ఈ స్టోర్లలో కేవలం 4జీ మొబైల్స్, జియో సిమ్ అమ్మకాలు జరిగేవని, ఇప్పుడు ప్రారంభిస్తున్న ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలతో ఈ స్టోర్లు మరింత చేరువ కానున్నాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement