ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే లెసైన్సులు రద్దు
Published Mon, Oct 7 2013 3:56 AM | Last Updated on Tue, Sep 18 2018 6:38 PM
గంగావతి, న్యూస్‌లైన్ :ప్లాస్టిక్ కవర్లు వినియోగించే హోటళ్లు, దుకాణాల లెసైన్పులు రద్దు చేస్తామని నగరసభ అధ్యక్షుడు షామిద్ మనియార్ హెచ్చరించారు. స్థానిక జంతకల్లులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మద్దానేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌ఎస్ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగించే దుకాణ యజమానుల గురించి నగర ప్రజలు సమాచారం అందించాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేందుకు మొక్కలను పెంచాలన్నారు.
వార్డుల్లోకి వచ్చే చెత్త తరలింపు ట్రాక్టర్లలో చెత్త వేయకుండా చెత్తను ఇళ్లలోనే నిల్వ ఉంచినవారిపై జరిమాన విధించే చట్టం బెంగళూరులో అమలులోకి వచ్చిందన్నారు. నగర, పట్టణ పంచాయతీల పరిధిలో కూడా ఈ చట్టం త్వరలో అమలు అవుతుందని తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచకోకపోతే డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి మండలి మాజీ అధ్యక్షురాలు లలితరాణి శ్రీరంగదేవరాయలు, మద్దానేశ్వర యువజన సంఘం అధ్యక్షులు సోమశేఖరగౌడ, కళాశాల అభివృద్ధి సమితి అధ్యక్షులు సురేష్ గౌడప్ప, కౌన్సిలర్లు హుసేన్, ఉద్భవ లక్ష్మీ మహిళా మండలి ప్రముఖులు మల్లమ్మ, హంపమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement