ఇంటి నుంచి మార్కెట్‌కు, షాపింగ్, ఆఫీసు ఇలా ఏ పనిమీద వెళ్లినా చేతి సంచిలేనిదే పని జరగదు. పాలు, పెరుగు, కూరగాయలు, కిరాణా సరుకులు ఏది తేవాలన్నా ఉండాల్సిందే.కానీ గత కొన్ని దశాబ్దాలుగా చేతి సంచి తీసుకెళ్లే పని లేకుండా చవకగా దొరికే ప్లాస్టిక్ బ్యాగులకు అలవాడి పడి పోయాం. ఈ అలవాటే ప్రకృతికి, పర్యావరణానికి తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. గుట్టలు, గుట్టలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ బ్యాగ్స్ వర్థాలు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. అందుకే జూలై 3వ తేదీన అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంగా జరుపుకుంటారు. ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన కల్పించి, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేలా ప్రజలను చైతన్యవంతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.
ఈ క్రమంలో ప్లాస్టిక్ సంచుల ప్లేస్‌లో పర్యావరణ అనుకూల, బయో-డిగ్రేడబుల్ , కాల్చినా కూడా ఎలాంటి విషపూరిత పొగలు లేదా వాయువులను విడుదల చేయని ప్రత్యామ్నాయ బ్యాగులపై ఓ లుక్కేద్దాం.
ప్లాస్టిక్ బ్యాగ్‌లు అత్యంత తక్కువ ఖర్చులో, అనుకూలంగా లభించేవే అయినప్పటి అవి మన పర్యావరణానికి చాలా చేటు చేస్తున్నాయి. అందులోనూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాకులు పర్యావరణానికి తీరని నష్టాల్ని మిగులుస్తున్నాయి. ఈ తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధిద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం.
ప్లాస్టిక్ సంచులకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు
వివిధ రంగులు డిజైన్లలో లభించే కాగితపు సంచులను వాడదాం
రీసైకిల్ చేయడానికి సులభమైనవి కాగితం సంచులు
సహజమైన ఫైబర్‌తో తయారయ్యే జనపనార సంచులు
ప్లాస్టిక్ బ్యాగ్‌లకు మరో చక్కటి ప్రత్యామ్నాయం క్లాత్ బ్యాగ్‌లు
మస్లిన్ నుండి డెనిమ్ వరకు పాత బట్టలతో చక్కటి బ్యాగులను తయారు చేసుకోవచ్చు
ఎకో-ఫ్రెండ్లీ, డబ్బు ఆదా కూడా
స్టైలిష్ ఆఫీస్ బ్యాగ్‌ల నుండి సాధారణ కిరాణా సంచుల వరకు
కాన్వాస్‌తో తయారైన టోట్ బ్యాగ్స్ బెస్ట్ ఆప్షన్
అందమైన డిజైన్లతో ఆకట్టుకునే వెదురు సంచులు, మన్నుతాయి కూడా
Comments
Please login to add a commentAdd a comment