paper
-
నీట్ లీక్.. చెరువులోంచి 16 ఫోన్లు స్వాధీనం!
నీట్ పేపర్ లీకేజీలో సీబీఐ అధికారులు పురోగతి సాధించారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన అవినాష్ అలియాస్ బంటీని అరెస్టు చేశారు. అనంతరం పాట్నా సీబీఐ కోర్టులో హాజరుపరచగా, తదుపరి విచారణ కోసం సీబీఐ అతడిని జూలై 30 వరకు కస్టడీకి తీసుకుంది. నీట్ పేపర్ లీక్ కేసులో గతంలో అరెస్టయిన శశి పాసవాన్ బంధువు ఈ బంటీ కావడం గమనార్హం.నీట్ పేపర్ ప్రశ్నాపత్రాల కీని షేర్ చేయడంలో బంటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నీట్-యూజీ పరీక్ష తర్వాత పేపర్ లీకేజీ కోసం ఉపయోగించిన 16 ఫోన్లను సమీప చెరువులో పడేయగా.. కేసు విచారణ నిమిత్తం.. ఫోన్లను పడేసిన ప్రాంతాన్ని సీబీఐ అధికారులు సిగ్నల్స్‌ను ట్రాక్ చేసి గుర్తించారు. కాగా, నీట్ పేపర్ లీకేజీపై విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. పరీక్షకు ముందే నీట్ పేపర్ ప్రశ్నాపత్రాలను పొందేందుకు రూ. 35 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు అధిక మొత్తంలో చెల్లించినట్లు సీబీఐ అధికారుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. బీహార్ అభ్యర్థులు రూ. 35 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు, ఇతర రాష్ట్రాల అభ్యర్థుల నుంచి రూ.55 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు చెల్లించినట్లు విచారణలో తేలింది. హజారీబాగ్ (జార్ఖండ్), లాతూర్ (మహారాష్ట్ర), గోద్రా (గుజరాత్), పాట్నా (బీహార్)లలో పరీక్షా కేంద్రాలను గుర్తించడంతోపాటు వివిధ రాష్ట్రాల్లోని దాదాపు 150 మంది అభ్యర్థులు లీకైన పేపర్ల నుండి ప్రయోజనం పొందినట్లు జాతీయమీడియా కథనాలు చెబుతున్నాయి. -
International Plastic Bag Free Day అందమైన డిజైన్లు, ఆకృతుల్లో ముద్దొచ్చే బ్యాగ్స్ ఇవే!
ఇంటి నుంచి మార్కెట్‌కు, షాపింగ్, ఆఫీసు ఇలా ఏ పనిమీద వెళ్లినా చేతి సంచిలేనిదే పని జరగదు. పాలు, పెరుగు, కూరగాయలు, కిరాణా సరుకులు ఏది తేవాలన్నా ఉండాల్సిందే.కానీ గత కొన్ని దశాబ్దాలుగా చేతి సంచి తీసుకెళ్లే పని లేకుండా చవకగా దొరికే ప్లాస్టిక్ బ్యాగులకు అలవాడి పడి పోయాం. ఈ అలవాటే ప్రకృతికి, పర్యావరణానికి తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. గుట్టలు, గుట్టలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ బ్యాగ్స్ వర్థాలు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. అందుకే జూలై 3వ తేదీన అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంగా జరుపుకుంటారు. ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన కల్పించి, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేలా ప్రజలను చైతన్యవంతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో ప్లాస్టిక్ సంచుల ప్లేస్‌లో పర్యావరణ అనుకూల, బయో-డిగ్రేడబుల్ , కాల్చినా కూడా ఎలాంటి విషపూరిత పొగలు లేదా వాయువులను విడుదల చేయని ప్రత్యామ్నాయ బ్యాగులపై ఓ లుక్కేద్దాం.ప్లాస్టిక్ బ్యాగ్‌లు అత్యంత తక్కువ ఖర్చులో, అనుకూలంగా లభించేవే అయినప్పటి అవి మన పర్యావరణానికి చాలా చేటు చేస్తున్నాయి. అందులోనూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాకులు పర్యావరణానికి తీరని నష్టాల్ని మిగులుస్తున్నాయి. ఈ తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధిద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం.ప్లాస్టిక్ సంచులకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలువివిధ రంగులు డిజైన్లలో లభించే కాగితపు సంచులను వాడదాంరీసైకిల్ చేయడానికి సులభమైనవి కాగితం సంచులుసహజమైన ఫైబర్‌తో తయారయ్యే జనపనార సంచులుప్లాస్టిక్ బ్యాగ్‌లకు మరో చక్కటి ప్రత్యామ్నాయం క్లాత్ బ్యాగ్‌లు మస్లిన్ నుండి డెనిమ్ వరకు పాత బట్టలతో చక్కటి బ్యాగులను తయారు చేసుకోవచ్చు ఎకో-ఫ్రెండ్లీ, డబ్బు ఆదా కూడా స్టైలిష్ ఆఫీస్ బ్యాగ్‌ల నుండి సాధారణ కిరాణా సంచుల వరకుకాన్వాస్తో తయారైన టోట్ బ్యాగ్స్ బెస్ట్ ఆప్షన్అందమైన డిజైన్లతో ఆకట్టుకునే వెదురు సంచులు, మన్నుతాయి కూడా -
నీట్ పీజీ పరీక్ష ఖరారు.. లీకేజీ దెబ్బకు రెండుగంటల ముందే క్వశ్చన్ పేపర్ తయారు
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో కేంద్రం నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది.అయితే వాయిదా వేసిన ఆ పరీక్షను జులై నెలలో నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ ప్రశ్నాపత్రాన్ని రెండు గంటల ముందు తయారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.నీట్ యూజీ పేపర్ లీకేజీతో జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. తాజాగా,నీట్ పీజీ పరీక్షను కేంద్రం నిర్వహించనుందని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.అంతేకాదు ఈ పరీక్షలను ఆరోగ్య,కుంటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించనుందని తెలుస్తోంది. -
లాంగ్వేజ్ పరీక్షకు 104 మంది హాజరు.. 99 మంది ఫెయిల్!
ఉత్తరాఖండ్‌లోని ఒక కాలేజీ విద్యార్థులు అందరినీ ఆశ్చర్యపరిచే సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ విషయం తెలిసినవారంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల పండిట్ శివరామ్ ప్రభుత్వ కళాశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ కళాశాలలో బీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలో 92 శాతానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 104 మంది విద్యార్థులకు గాను కేవలం ఐదుగురు మాత్రమే హిందీ పేపర్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపధ్యంలో జవాబు పత్రాలను మరోమారు మూల్యాంకనం చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ ఫలితాలతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇటీవల ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో 129 మంది విద్యార్థుల్లో 119 మంది విద్యార్థులు పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 104 మంది విద్యార్థుల్లో ఐదుగురు విద్యార్థులు మాత్రమే హిందీలో ఉత్తీర్ణులయ్యారు. 100 మంది విద్యార్థుల్లో 61 మంది విద్యార్థులు పొలిటికల్ సైన్స్‌లో ఫెయిల్ అయ్యారు. హిస్టరీలో 56 మందికి ఏడుగురు ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లీషులో 28 మందికి గాను ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. సోషియాలజీలో 39 మందికి గాను ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడు ప్రమేష్ రావత్ మాట్లాడుతూ ఈ విషయమై ప్రిన్సిపాల్‌తో మాట్లాడామని, జవాబు పత్రాలను మరోమారు పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అంజనా శ్రీవాస్తవ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నాపత్రాల పునః మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
యూపీ బోర్డు పేపర్ లీక్ ప్రధాన నిందితుడు అరెస్ట్!
ఉత్తరప్రదేశ్ బోర్డు 12వ తరగతి పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 12వ తరగతి బయాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్ల ఫోటోలను నిందితుడు వినయ్ వాట్సాప్ గ్రూప్‌లో వైరల్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 29న యూపీ బోర్డు సెకండ్ షిఫ్ట్ పరీక్షలో 12వ తరగతికి చెందిన రెండు పేపర్లు లీక్ అయ్యాయి. ఆగ్రాలోని శ్రీ అతర్ సింగ్ ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ వినయ్ చౌదరి 12వ తరగతి బయాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్ ఫొటోలను ‘ఆల్ ప్రిన్సిపల్స్ ఆగ్రా’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. 12వ తరగతి పేపర్ లీక్ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పేపర్ లీక్ అయిన ఆగ్రాలోని సదరు కళాశాల గుర్తింపును రద్దు చేశారు. యూపీ బోర్డు సమావేశంలో శ్రీ అతర్ సింగ్ ఇంటర్ కాలేజ్ రోజౌలీ గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ చౌదరి, స్కూల్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రాజేంద్ర సింగ్, అదనపు సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గంభీర్ సింగ్, స్టాటిక్ మేజిస్ట్రేట్ గజేంద్ర సింగ్‌లపై ఫిబ్రవరి 29 న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే సెంటర్ నిర్వాహకుడు రాజేంద్ర సింగ్‌తో పాటు మరొక వ్యక్తిని కూడా అరెస్టు చేసి, జైలుకు తరలించారు. -
కవిత్వాన్ని ముద్రించే కెమెరా
ప్రపంచవ్యాప్తంగా కెమెరాలు ఫొటోలు, వీడియోలు తీయడానికే ఉపయోగపడతాయి. పోలరాయిడ్ కెమెరాలైతే, తక్షణమే ఫొటోలను ముద్రించి అందిస్తాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న కెమెరాను పోలరాయిడ్ కెమెరా స్ఫూర్తితోనే తయారు చేశారు. అయితే, ఇది ఫొటోలకు బదులుగా కవిత్వాన్ని ముద్రిస్తుంది. ఈ కెమెరాతో ఏవైనా దృశ్యాలను బంధిస్తే, దృశ్యాలకు అనుగుణమైన కవిత్వాన్ని ముద్రించి అందిస్తుంది. దృశ్యాల ద్వారా కవిత్వాన్ని సృష్టించడానికి ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. ఈ కెమెరా విడిభాగాలుగా దొరుకుతుంది. విడిభాగాలను జోడించుకుని, దీనిని ఎవరికి వారే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో సింగిల్బోర్డ్ కంప్యూటర్, రేకు డబ్బా, వెబ్‌కామ్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దీని ద్వారా కోరుకున్న స్థానిక భాషల్లో కూడా కవిత్వాన్ని ముద్రించుకోవచ్చు. థర్మల్ పేపర్‌పై ఈ కెమెరా ముద్రించే కవితల కాగితాలు చూడటానికి సూపర్ మార్కెట్ రశీదుల్లా కనిపిస్తాయి. అమెరికన్ డిజైనర్ శామ్ గార్ఫీల్డ్ ఈ కెమెరాకు రూపకల్పన చేశాడు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
"పేపర్ బ్యాగ్ ఫ్రైడ్ చికెన్" ఎలా చేస్తారో వింటే షాకవ్వుతారు!
ఇటీవల అందరికీ వంటకాల మీద ఆసక్తి ఎక్కువయ్యిందనే చెప్పాలి. అందులోనూ ఈ సోషల్ మీడియా పుణ్యమా! అని వాటికి క్రేజ్ మరింత పెరిగింది. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు అక్కడ వండే వివిధ రకాల రెసీపీల గురించి అందరూ క్షణాల్లో తెలుసుకుంటున్నారు. వండేస్తున్నారు కూడా. అలాంటి వంటకానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇంతవరకు ఎన్నో రెసీపీలు చేసే విధానాన్ని చూసే వింటారు. ఇక్కడ ఆ వ్యక్తి చేస్తున్న విధానన్ని మాత్రం అస్సలు చూసుండరు. కానీ అతను ఎలా చేశాడో చూస్తే మాత్రం విస్తుపోతారు. ఎలా చేశాడంటే..? సాధారణంగా చికెన్ ముక్కలు చక్కగా మసాల పొడుల్లో మేరినేషన్ చేసి మరీ డీప్ ఫ్రై చేసుకుని లాగించేస్తాం. అది కామన్, అలా కాకుండా అల్లం వెల్లుల్లి , కొన్ని రకాల మసాల పొడులతో చికెన్‌ని మేరినేషన్ చేసి పేపర్ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. అలా ఒక్కో చికెన్ ముక్కను పేపర్ బ్యాగ్‌లో పిన్ చేసి నేరుగా డీప్ ఫ్రై చేసేస్తున్నారు. ఇలా చేస్తే ఏం కాదా? అని అవాక్కవ్వకండి. ఎందుకంటే అది పేపర్ బ్యాగ్ కాబట్టి చక్కగా చికెన్ ఆ పేపర్ తోపాటు వేగిపోతుంది. పైగా దాన్ని ఓపెన్ చేయగానే చికెన్‌లో ఉన్న మసాలాలు జ్యూసీగా వస్తాయి. ఇలా చేయడం వల్ల మసాలా చికెన్ నుంచి వేరవ్వకుండా దానికే ఉంటుంది. టేస్ట్‌కి టేస్టు ఉంటుంది. ఇలా మలేషియాలోని వీధుల్లో తినుబండారాలు అమ్మే వ్యక్తి చేస్తూ కనిపించాడు. ఒక్కసారిగా ఫోకస్ అంతా అతడు తయారు చేసిన విధానంపైనే పడింది. అయితే ఆ పేపర్ బ్యాగ్‌ని పిన్చేస్తున్నారు కదా! ఏం ప్రమాదం కాదా? అనేది డౌటు. తినే కంగారులో ఆ ఫ్రైడ్ పేపర్ బ్యాగ్ చికెన్‌ని అలానే తింటేనే ప్రమాదం. అందుకు సంబంధించిన వీడియోని ఫుడ్ వ్లాగర్ వెరైటీగ్ ఫ్రై చేస్తున్న ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసా అనే క్యాప్షన్ పెట్టి మరీ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఇది ఆరోగ్యానికి చలా ప్రమాదకరం అంటూ మండిపడుతున్నారు. కాగితంలో ఉండే రసాయానాలు అలా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ చికెన్‌లోకి వెళ్లిపోతాయి. తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదురవ్వుతాయంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Trevor James (@thefoodranger) (చదవండి: దీపికా పదుకొనే మెచ్చిన 'ఈమా దత్షి' రెసిపీ!) -
టుడే న్యూస్ పేపర్ టాప్ హెడ్ లైన్స్
-
పేపర్ కవర్ ధర పదివేలా? ఏముందిరా అందులో..?
సాధారణంగా మనం వాడే పేపర్ కవర్ (ఎన్వలప్) ఎంత ఉంటుంది. పది, ఐదు, మహా అయితే రెండు వందలు ఉంటుంది. కానీ ఫ్రెంచ్ లగ్జరీ డిజైన్ హౌస్ హెర్మేస్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం ఒకే పేపర్ ఎన్వలప్‌ను వేల రూపాయలకు విక్రయిస్తోంది. దీనికి సంబంధించిన స్టోరీ ఒకటి ఇంటర్నరెట్లో హల్ చల్ చేస్తోంది. అయితే దీనికి ఓ ప్రత్యేకత ఉంది. హెర్మేస్ వెబ్సైట్ ప్రకారం, “సిగ్నేచర్ ఆరెంజ్ హెర్మేస్ పేపర్ ఎన్వలప్” ఆరెంజ్పేపర్ బాక్స్‌లో పట్టుదారాలతో చుట్టి ఉంటుంది. A4 , A5 అనే రెండు సైజుల్లో ఇది అందుబాటులో ఉంది. దీంట్లో ట్రావెల్ డాక్యుమెంట్స్, టిక్కెట్లు , ఇతర పత్రాలను దాచుకోవచ్చు. అంతేకాదు “ప్రత్యేక ఆహ్వానం లేదా ప్రేమ ప్రకటన” కోసం కూడా అపురూపంగా పదిలపర్చు కోవచ్చు. ఫ్రాన్స్లోప్రత్యేకంగా రూపొందించిన ఈపేపరు కవరు ధరసుమారు రూ. 10,411 (125 డాలర్లు)కి విక్రయిస్తోంది. అంతేకాదు దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. హెర్మేస్ హై-ఎండ్ స్టేషనరీ కలెక్షన్లో దీన్ని ప్రత్యేకంగా భావిస్తారు. కొందరు ఇది కాస్ట్లీ గురూ అంటోంటే, మరికొందరు మాత్రం స్టేటస్ బాస్ అంటారట. కాగా హీర్మేస్ ఇంటర్నేషనల్ లగ్జరీ బ్రాండ్ ప్రొడక్ట్స్ ధరలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది Balenciaga ట్రాష్ బ్యాగ్ ఒక్కొక్కటి రూ. 1.4 లక్షలకు విక్రయించడం వైరల్‌గా మారింది. అలాగే 7.5 అంగుళాల సమర్కాండే మోడల్‌తో సహా వివిధ విలువైన పేపర్‌వెయిట్ ధర 2,950 డాలర్లు, అలాగే మౌస్ ప్యాడ్ 405 డాలర్లంటే ఆశ్చర్యమే మరి. 1837 నుండి విలాసవంతమైన ఉత్పత్తులకు, ముఖ్యంగా సాండిల్స్, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఇతర లెదర్ వస్తువులకు ప్రసిద్ధి చెందింది ఈ బ్రాండ్. -
‘బావ-బావమరిది చెమట కక్కి సంపాదించారా?’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శ్వేత పత్రానికి కౌంటర్ పేరిట.. బీఆర్ఎస్ స్వేద పత్రం రిలీజ్ చేయడంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. బావ, బావ మరది చెమట కక్కి సంపాదించారా? అని కేటీఆర్, హరీష్‌రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఢిల్లీ పర్యటన ముందుకు ఆయన ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘ఏదో సాధించినట్లు బీఆర్ఎస్ స్వేద పత్రం అంటూ రిలీజ్ చేశారు. ఆ బావ, బావ మరిది వాళ్లేదో కష్టపడి చెమట చిందించి సంపాదించినట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆదాయం అది. వాళ్లు చేసిన అప్పుల్ని తీర్చాలంటే తెలంగాణ ప్రజలు స్వేదం చిందించాలి అని భట్టి వ్యాఖ్యాంచారు. ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలు తిన్నవన్నీ కక్కిస్తామని అన్నారు. అది జరిగి తీరుతుంది. జ్యుడీషియల్ ఎంక్వైరీ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది’’ అని అన్నారాయన. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు భట్టి ఢిల్లీ పర్యటనలో పాల్గొంటారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై పలువురు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం.. కాంగ్రెస్ అగ్రనేతల్ని ఈ ఇద్దరూ కలవనున్నట్లు సమాచారం. -
ఆదిలాబాద్: బ్యాంకు సిబ్బందికి షాకిచ్చిన దొంగ
నెన్నెల: ఓ ఆగంతకుడు ఆశగా అర్ధరాత్రి బ్యాంకులో చొరబడ్డాడు. ఆబగా నగదు కోసం వెతికాడు. క్యాష్కౌంటరేమో ఖాళీగా కనిపించింది. స్ట్రాంగ్‌రూం తాళం యమా స్ట్రాంగ్‌గా ఉండటంతో తెరుచుకోలేదు. ఎక్కడ వెతికినా ఏమీ దొరకలేదు. ఆనక చేసేదేమీలేక ‘గుడ్ బ్యాంక్.. ఒక్క రూపాయి కూడా దొరకలేదు’అని కితాబు ఇస్తూ ఓ పేపర్‌పై రాసి వెళ్లిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోటు చేసుకుంది. ముసుగు వేసుకుని గురువారం అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు బ్యాంకు తలుపు తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. క్యాష్ కౌంటర్లో చిల్లిగవ్వ కూడా లభించలేదు. ఎంత ప్రయత్నించినా స్ట్రాంగ్‌రూమ్ తాళం తెరుచుకోలేదు. ఇలా 15 నిమిషాలు బ్యాంకులో ఉండి చోరీకి యత్నించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోతుపోతూ టేబుల్‌పై ఉన్న ఓ పేపర్ మీద ‘గుడ్ బ్యాంకు, రూపాయి కూడా దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు. నా ఫింగర్‌ప్రింట్ కూడా దొరకదు’అని మార్కర్‌తో రాశాడు. శుక్రవారం ఉదయం బ్యాంకు ఆవరణలో ఊడ్చేందుకు వచ్చిన స్వీపర్ రాములు బ్యాంక్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి మేనేజర్ వెంకటేశ్వర్‌రెడ్డికి సమాచారం ఇచ్చాడు. మేనేజర్ వెంటనే బ్యాంకుకు చేరుకుని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు నగదు చోరీ కాకపోవడంతో సిబ్బంది, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెల్లంపల్లి ఏసీపీ సదయ్య బ్యాంక్‌ను సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
తెలంగాణ మొత్తం తిరగాల్సిందే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఏళ్ల తరబడి ఎదురు చూపుల తరువాత విడుదలైన నోటిఫికేషన్ల ప్రకా రం ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలు రాసేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 1 నుంచి 23వ తేదీ వరకు ‘తెలంగాణ రెసి డెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు’ఆధ్వర్యంలో గురుకులాల్లో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, పీఎల్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్, ఫిజికల్ డైరెక్టర్.. తదితర 9 రకాల ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి హాల్‌టికెట్లను ఆన్లైన్లో పెట్టారు. అయితే ఇప్పటికీ పలువురు అభ్యర్థులకు కొన్ని పరీక్షల హాల్‌టికెట్లను వెబ్సైట్లో చూపించడం లేదు. కొన్ని డౌన్లోడ్ కావటం లేదు. కొందరికి మాత్రం కొన్ని పరీక్షల హాల్‌టికెట్లు డౌన్లోడ్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. హాల్‌టికెట్లు చూసి పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. జేఎల్, డీఎల్, టీజీటీ, పీజీటీ, పీఎల్ పరీక్షలకు పేపర్–1 (జనరల్ స్టడీస్), పేపర్–2 (మెథడాలజీ), పేపర్–3 (సబ్జెక్టు) ఉన్నాయి. పరీక్షలు రాసే విషయంలో అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలు చూస్తే కళ్లు తిరిగే పరిస్థితి ఉందని అంటున్నారు. మూడు పేపర్లకు మూడు జిల్లాలు.. మంచిర్యాలకు చెందిన నికిత అనే అభ్యర్థి టీజీటీకి దరఖాస్తు చేయగా, ఆమెకు పేపర్–1 హైదరాబాద్‌లో, పేపర్–2 మంచిర్యాలలో, పేపర్–3కి వరంగల్‌లో సెంటర్లు ఇచ్చారు. అలాగే నిజామాబాద్‌కు చెందిన రమాదేవి నిజామాబాద్‌లో పరీక్ష కేంద్రం ఆప్షన్ ఇవ్వగా, ఆమెకు పేపర్–1 రంగారెడ్డి జిల్లా, పేపర్–2 మేడ్చల్, పేపర్–3కి కరీంనగర్ జిల్లాలో సెంటర్లు ఇచ్చారు. ఖమ్మంకు చెందిన బిందుకు పేపర్–1 ఖమ్మంలో, పేపర్–2 కొత్తగూడెంలో, పేపర్–3కి సత్తుపల్లిలో సెంటర్లు ఇచ్చారు. ఈ పరీక్షలను ఆగస్టు 4, 14, 22 తేదీల్లో రాయాల్సి ఉంది. ఇక్కడే మరో పెద్ద సమస్య వచ్చిపడింది. వీళ్లు టీజీటీతోపాటు పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జేఎల్ పరీక్షలకు కూడా దరఖాస్తు చేశారు. ఈ పరీక్షల కేంద్రాలు ఏయే జిల్లాల్లో కేటాయిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో సగం జిల్లాల్లో తిరగాల్సిన పరిస్థితి.. మొత్తం 9 విభాగాల పరీక్షల్లో కీలకమైన పీజీటీ, టీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలకు మూడు చొప్పున పేపర్లకు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలు ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి. టీజీటీ పరీక్షలు ఆగస్టు 4, 14, 22 తేదీల్లో ఉన్నాయి. కాగా, ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు.. ఆగస్టు 9, 10, 16, 19, 21 తేదీల్లో పీజీటీ, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పరీక్షలు రాయాల్సి ఉంది. వీరికి టీజీటీ తరహాలోనే వివిధ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తే ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వందల కిలోమీటర్ల మేర ఆగస్టు నెలంతా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు ఉన్న మహిళా అభ్యర్థులు నరకయాతన పడాల్సిన పరిస్థితులు కల్పించారని మండిపడుతున్నారు. ఒక అభ్యర్థి ఇలా పోటీ పరీక్షలు రాసేందుకు వివిధ జిల్లాలు తిరగాలంటే రూ. వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. -
ఇక డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులు
సాక్షి, అమరావతి: ఇక నుంచి పేపర్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, పేపర్ ఆర్సీ కార్డులుండవు. పేపర్ రహిత డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల దిశగా రాష్ట్ర రవాణా శాఖ ముందడుగు వేసింది. డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ప్రింట్ చేసి జారీ చేసే పాత విధానానికి స్వస్తి పలికింది. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ కార్డుల జారీ విధానానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రవాణా శాఖ కీలక విధాన నిర్ణయం తీసుకుంది. డిజి లాకర్ /ఎం–పరివాహన్లోఇవి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా రవాణా శాఖ ప్రింటింగ్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను అందిస్తోంది. ఇందుకోసం దరఖాస్తుతో పాటు ఒక్కో కార్డుకు రూ.200 ఫీజు, రూ.35 పోస్టల్ చార్జీలు వసూలు చేస్తోంది. అయితే ఈ విధానానికి శుక్రవారం నుంచి రవాణా శాఖ ముగింపు పలికింది. దాదాపు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న 25 లక్షలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ప్రింటింగ్‌లో జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే రూ.33.39 కోట్లు కేటాయించింది. ఇక శనివారం నుంచి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల విధానం అమల్లోకి రానుంది. ఇక నుంచి దరఖాస్తుతో కార్డు కోసం రూ.200, పోస్టల్ చార్జీలకు రూ.35 వసూలు చేయరు. దరఖాస్తులను పరిశీలించి తగిన ప్రక్రియ అనంతరం డిజిటల్ విధానంలోనే వీటిని జారీ చేస్తారు. ప్రత్యేకంగా ఎం–పరివాహన్, డిజి లాకర్లో అందుబాటులో ఉంచుతారు. వాహనదారులు, దరఖాస్తుదారులు వాటిని డౌన్లోడ్ చేసుకుని తమ మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ అధికారులు అడిగితే ఆ డిజిటల్ ఫార్మాట్లో ఉన్న కార్డులను చూపితే సరిపోతుంది. మొబైల్ ఫోన్లు వాడనివారు ఆ కార్డులను ప్రింట్ తీసుకుని కూడా తమతో ఉంచుకోవచ్చు. వాటిని చూపినా అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. ఇక నుంచి రవాణా శాఖ జారీ చేసే అన్ని డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచుతారు. వాహనదారులకు సౌలభ్యం డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల జారీ విధానం వాహనదారులకు సౌలభ్యంగా ఉంటుంది. వారి నుంచి కార్డుల కోసం ఫీజులు కూడా వసూలు చేయం. అవసరమైన అన్ని కార్డులు డిజిలాకర్ విధానంలో మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకుంటే చాలు. – ఎంకే సిన్హా, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ -
కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం.. 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..
కర్ణాటక: కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నుంచి 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెన్స్‌కు గురయ్యారు. డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమానీపై పేపర్లు చించి విసిరిన అనంతరం.. ఎమ్మెల్యేలను సస్పండ్ చేస్తున్నట్లు ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసెంబ్లీలో బుధవారం సెషన్ గందరగోళం నెలకొంది. అయితే.. నేడు స్పీకర్ యూటీ ఖాదర్ లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాని సభా కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు. రోజూలాగే బుధవారం సభ ప్రారంభమైంది. 2024 ఎన్నికలకు ముందు 30 మంది ఐఏఎస్ అధికారులను బదీలీ చేయడంపై బీజేపీ, జనతాదళ్ (సెక్యులర్) (జేడీ(ఎస్)) ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలిపారు. అంశంపై సభలో చర్చలు తీవ్ర స్థాయికి చేరాయి. విరామ సమయం కూడా లేకుండానే చర్చలు కొనసాగించాలని డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైనవారు లంచ్‌కు వెళ్లి మళ్లీ చర్చకు రావాలని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. లంచ్ బ్రేక్ తీసివేయడంపై ఎమ్మెల్యేలు ఫైరయ్యారు. పేపర్లను చించి డిప్యూటీ స్పీకర్‌పై విసిరారు. స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. బౌన్సర్లు అడ్డుకున్నారు. ఈ పరిణామాల అనంతరం 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పండ్ చేశారు. ఇదీ చదవండి: ‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్‌ను కలిసిన ఉద్ధవ్ -
వేలంలో రూ.కోట్లు పలికిన చార్లెస్ డార్విన్ ఆటోగ్రాఫ్ పేపర్
న్యూయార్క్: ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ తన స్వహస్తాలతో రాసిన ఓ ప్రతి వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఈ పేపర్‌పై డార్విన్ పూర్తి పేరుతో సంతకం ఉంది. ఇలాంటి లేఖ అత్యంత అరుదుగా లభిస్తుంది. నేచురల్ సెలక్షన్ థియరీకి సంబంధించిన సమ్మేషన్‌ను ఈ ప్రతిలో రాశారు డార్విన్. దీంతో ఈ పేపర్‌ను ఓ ఓత్సాహికుడు రూ.7.2కోట్లకు(8.82లక్షల డాలర్లు) కొనుగోలు చేశాడు. డార్విన్ ఫుల్ ఆటోగ్రాఫ్‌తో కూడిన అత్యంత ముఖ్యమైన ప్రతి ఇదేనని నిర్వాహకులు తెలిపారు. వేలంలో ఇదే రికార్డు ధర అని పేర్కొన్నారు. చదవండి: ఆరుగురు భార్యలు.. 54 మంది పిల్లలు.. గుండెపోటుతో మృతి.. -
కాగితం వృథాను అరికట్టే రోలర్జెట్ ప్రింటర్!
కంప్యూటర్లు వినియోగంలోకి వచ్చాక, ప్రింటర్ల వినియోగం కూడా పెరిగింది. ఆఫీసుల్లో వాడే ప్రింటర్ల వల్ల ఎంతో కొంత కాగితం వృథా అవుతుండటం మామూలే. ప్రింటర్ల వల్ల కాగితం వృథాను అరికట్టే ఉద్దేశంతో దక్షిణ కొరియాకు చెందిన డిజైనర్ జిసాన్ చుంగ్ ప్రయోగాత్మకంగా ‘రోలర్జెట్ ప్రింటర్’కు రూపకల్పన చేశాడు. పేపర్షీట్స్ బదులు పేపర్‌రోల్స్ వాడటానికి అనువుగా దీన్ని తీర్చిదిద్దాడు. ప్రింటింగ్ పూర్తయ్యాక, ప్రింట్ అయినంత మేరకు దీని నుంచి కాగితాన్ని కత్తిరించి తీసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం నమూనాగా రూపొందించిన ఈ ప్రింటర్ పనితీరు బాగున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పెద్దస్థాయిలో దీని తయారీ చేపడితే, ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. -
‘నెపా’ మళ్లీ షురూ: ఉద్యోగాలపై కోటి ఆశలు
నెపానగర్ (మధ్యప్రదేశ్): ప్రభుత్వరంగ న్యూస్ ప్రింట్ తయారీ సంస్థ అయిన ‘నెపా లిమిటెడ్’ ఆరేళ్ల విరామం తర్వాత తయారీ కార్యకలాపాలను మంగళవారం ప్రారంభించింది. తయారీ సామర్థ్యాన్ని లక్ష టన్నులకు (వార్షిక) పెంచింది. భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే దీన్ని ప్రారంభించారు. సంవత్సరానికి 1 లక్ష టన్నుల మెరుగైన ఉత్పత్తి సామర్థ్యంతో పునఃప్రారంభం కానున్న ఈ కేంద్రం పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని, దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. న్యూస్‌ప్రింట్‌లో దేశ స్వయం సమృద్ధికి ఈ ప్లాంట్ దోహదపడుతుందని చెప్పారు. 2018 అక్టోబర్‌లో రూ.469 కోట్లతో ఈ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.395 కోట్ల టర్నోవర్ సాధిస్తామని నెపా చైర్మన్, ఎండీ సౌరభ్దేవ్ తెలిపారు. 2023–24లో రూ.554 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంటామన్నారు. మూతబడడానికి ముందు 2015-16లో నెపా టర్నోవర్ రూ.72 కోట్లుగా ఉంది. న్యూస్‌ప్రింట్‌తో పాటు రైటింగ్, ప్రింటింగ్ పేపర్ ముద్రించడంలో కూడా విస్తరించాలని యోచిస్తోంది. కాగా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభంతో 1956 ఏప్రిల్ 26న, భారతదేశ మొదటి ప్రధానమంత్రి దివంగత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ మిల్లును జాతికి అంకితం చేశారు. అయితే 2016లో మూతపడింది. -
ప్రింటేసి.. తుడిచేసి.. ఒకే పేపర్‌పై మళ్లీ మళ్లీ ప్రింటింగ్!
సాధారణంగా ప్రింటర్లో ఏమైనా ప్రింట్ చేశామంటే.. ఆ కాగితాలను అవసరం ఉన్నంతసే పు ఉంచేయడం.. ఆ తర్వాత పడేయడమే.. కానీ కా గితాలపై ఇంకును తుడిచేస్తూ.. మళ్లీ మళ్లీ వాడుకోగలిగితే!? ఈ ఐడియా చాలా బాగుంది కదా.. అటు పర్యావరణాన్ని పరిరక్షించినట్టూ ఉంటుంది, ఇటు ఖర్చూ తగ్గుతుంది. పైగా తరచూ కాగితాలు తెచ్చుకోవడం దగ్గరి నుంచి వాటిని పడేయడం దా కా ఎంతో శ్రమ కూడా తప్పుతుంది. ఈ క్రమంలోనే రీప్ సంస్థ.. కాగితాలపై ఇంకును తుడిచేసే ‘డీప్రింటర్’ను రూపొందించింది. అంటే ప్రింటర్ ఇంకును ముద్రిస్తే.. ఈ డీ ప్రింటర్ ఆ ఇంకును తుడిచేసి మళ్లీ తెల్ల కాగితాలను ఇచ్చేస్తుంది. ఈ టెక్నాలజీకి ‘రీప్ సర్క్యులర్ ప్రింట్ (ఆర్సీపీ)’ అని పేరు పెట్టారు. ప్రత్యేకమైన పేపర్.. లేజర్ క్లీనర్‌తో.. డీప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించాలంటే.. అందుకోసం కాస్త మార్పులు చేసిన ప్రత్యేకమైన పేపర్‌ను వినియోగించాల్సి ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. ఈ పేపర్‌ను ప్రింటర్లో వినియోగించినప్పుడు ఇంకు పూర్తిగా లోపలివరకు ఇంకిపోకుండా.. పైపొరల్లోనే ముద్రితం అవుతుంది. తర్వాత ఈ పేపర్లను ‘డీ ప్రింటర్’లో పెట్టినప్పుడు.. దానిలోని ప్రత్యేకమైన లేజర్ ఇంకును ఆవిరి చేసేస్తుంది. దీనితో తెల్ల కాగితం బయటికి వస్తుంది. ఈ సాంకేతికతతో ఒక్కో పేపర్‌ను 10 సార్లు వాడుకోవచ్చట. అంటే కాగితం తయారీ కోసం చెట్లను నరకడం 90% తగ్గిపోతుందని కంపెనీ చెబుతోంది. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్: బడా కంపెనీల కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో బడా ఎఫ్ఎంసీజీ కంపెనీలు చిన్నపాటి టెట్రా ప్యాక్‌లలో విక్రయించే పండ్ల రసాలు, పాల ఉత్పత్తులకు పేపర్ స్ట్రాలు (పుల్లలు) జోడించడం మొదలు పెట్టాయి. పార్లే ఆగ్రో, డాబర్, అమూల్, మథర్ డెయిరీ ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రవేశపెట్టాయి. రీసైక్లింగ్ బెవరేజ్ కార్టన్స్ అలియన్స్ (ఏఏఆర్‌సీ) మాత్రం.. ప్లాస్టిక్ స్ట్రాలను మార్చే విషయంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ఇది సరఫరాలపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్ఎంసీజీ కంపెనీల స్టాకిస్టుల వద్ద నిల్వలు అడుగంటాయని.. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవి పేపర్ స్ట్రాలు లేదా ఇతర ప్రత్యామ్నాయలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని ఏఏఆర్‌సీ తెలిపింది. పేపర్ స్ట్రాల తయారీ ఫ్రూటీ, అపీ ఫిజ్ పేరుతో పెద్ద మొత్తంలో పండ్ల రసాలను విక్రయించే ప్రముఖ సంస్థ పార్లే ఆగ్రో బయో డీగ్రేడబుల్ (ప్రకృతిలో కలసిపోయే/పర్యావరణ అనుకూల) స్ట్రాలను తన ఉత్పత్తులకు జోడిస్తోంది. ప్రభుత్వం విధించిన గడువు నాటికి నిబంధనలను పాటించే లక్ష్యంతో పేపర్ స్ట్రాలను దిగుమతి చేసుకున్నట్టు పార్లే ఆగ్రో సీఈవో షానా చౌహాన్ తెలిపారు. పేపర్స్ట్రాల నుంచి పీఎల్ఏ స్ట్రాలకు మారిపోతామని చెప్పారు. పీఎల్ఏ స్ట్రాలు అన్నవి మొక్కజొన్న గంజి, చెరకుతో తయారు చేస్తారు. తమ వ్యాపార భాగస్వాములు పీఎల్ఏ స్ట్రాలను తయారు చేసే వరకు, కొన్ని నెలలపాటు పేపర్ స్ట్రాలను వినియోగిస్తామన్నారు. మథర్ డైరీ సైతం దిగుమతి చేసుకున్న పేపర్ స్ట్రాలను జూలై 1 నుంచి తయారు చేసే తన ఉత్పత్తులకు జోడిస్తున్నట్టు ప్రకటించింది. రియల్ బ్రాండ్‌పై పండ్ల రసాయాలను విక్రయించే డాబర్ ఇండియా సైతం టెట్రా ప్యాక్‌లతోపాటు పేపర్ స్ట్రాలను అందించడాన్ని మొదలు పెట్టినట్టు తెలిపింది. నిబంధనల అమలుకు కట్టుబడి ఉంటామని డాబర్ ఇండియా ఈడీ షారూక్‌ఖాన్ స్పష్టం చేశారు. పాత నిల్వలపై ప్రభావం ఏఏఆర్‌సీ సీఈవో ప్రవీణ్ అగర్వాల్ మాట్లాడుతూ.. జూన్ 30 నాటికి నిల్వలున్న రిటైలర్లకు తాజా పరిణామాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయని చెప్పారు. పంపిణీదారులు, రిటైలర్ల వద్ద ఉన్న ఉత్పత్తులు అమ్ముడుపోయే వరకు కొంత కాలం పాటు ఉపశమనం కల్పించాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. -
పేపర్ సంక్షోభం! ఇక 'పుస్తకాలు' ఉండవేమో!
No textbooks for students: పాకిస్తాన్లో లోపభూయిష్టమైన విధానాలు, ద్రవ్యోల్బణం తదితర కారణాల రీత్యా తీవ్రమైన పేపర్ సంక్షోభం తలెత్తింది. దీని ఫలితంగా వచ్చే ఏడాది విద్యాసంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని పాకిస్థాన్ పేపర్ అసోసియేషన్ అధికారులు చెబుతున్నారు. అదువల్ల స్కూళ్లు ఆలస్యంగా ఆగస్టులో ప్రారంభమవుతాయని పాకిస్థాన్ పేపర్ మర్చంట్ అసోసియేషన్, పాకిస్థాన్ అసోసియేషన్ ఆఫ్ ప్రింటింగ్ గ్రాఫిక్ ఆర్ట్ ఇండస్ట్రీ, పేపర్ పరిశ్రమకు సంబంధించిన ఇతర సంస్థలు తెలిపాయి. పేపర్ ధర పెరగడం వల్ల ప్రచురణకర్తలు ధరను నిర్ణయించలేకుపోతున్నారని పాకిస్తాన్‌కి చెందిన స్థానికి మీడియా పేర్కొంది. అందువల్లే సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తుంక్వా వంటి పాఠ్యపుస్తకాల బోర్డులు ఇక ముద్రించలేమని స్పష్టం చేశాయి. దీంతో పాకిస్తాన్ కాలమిస్ట్ అయాజ్ అమీర్ దేశంలోని అసమర్థలైన పాలకుల పై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు పాకిస్తాన్ గత రుణాలను చెల్లించేందుకు అప్పుల తీసుకునే విషవలయంలో చిక్కుకుపోయిందంటూ ఆవేదన చెందారు. ప్రస్తుతం ఏ దేశాలు పాకిస్తాన్‌కి రుణ సాయం చేయడానికి ఇష్టపడని దుస్థితలో ఉందని చెప్పారు. దీన్ని చైనా క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తుందన్నారు. ఆ దిశగానే రుణాలు, పెట్టుబడుల చెల్లింపుల విషయమై ఈ తరుణంలోనే పాకిస్తాన్‌తో గట్టి బేరం కుదుర్చుకుని పరిస్థితిని చక్కబెట్టుకునేందుకు యత్నిస్తోందన్నారు. ఈ మేరకు పాకిస్తాన్ 2021-22 ఆర్థిక సంవత్సారానికి గానూన సుమారు రూ. 30 వేల కోట్ల చైనా ట్రేడ్స్ ఫైనాన్స్ ఉపయోగించినందుకు సుమారు రూ. వెయ్యి కోట్లు పైనే వడ్డిని చెల్లించిందని నివేదిక పేర్కొంది. (చదవండి: యుద్ధం క్లైమాక్స్‌కి చేరుకుంటున్న వేళ...రష్యాకి ఊహించని ఝలక్!) -
కిక్కు కోసం.. బాస్‌కు రిజైన్ లెటర్ దేని మీద రాసిచ్చాడంటే !
సాధారణంగా ఉద్యోగులు తాము పని చేస్తున్న కంపెనీ నచ్చకపోతే రాజీనామా చేయడం సహజం. అందుకు వారు ఏ వైట్ పేపర్పైనో, లేదా మెసేజ్, ఈ మెయిల్ ద్వారా పంపడం సహజమే. ఎవరు రాజీనామా చేయాలన్నా ఇదే ఫాలో అవుతారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం కాస్త భిన్నంగా ఉంటుందని భావించాడో, లేదా బాస్‌పై కోపమో గానీ తన రాజీనామాను విచిత్రంగా రాశాడు. అంతేనా.. అతను ఏ పేపర్ మీద రాశాడో తెలిస్తే షాక్‌తో పాటు యాక్ కూడా అంటారు మరీ. అసలు ఆ ఉద్యోగి చేసిన నిర్వాకం ఏంటంటే.. ఓ ఉద్యోగి తన కంపెనీకి రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందరూ ఇచ్చినట్లు తన రాజీనామాను ఇస్తే కిక్కు లేదనుకున్నాడు. అందుకే.. ఏకంగా టాయిలెట్ పేపర్ మీద తన రాజీనామా లేఖను రాశాడు. ఈ నెల 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను అని రాసి.. తన బ్యాక్ చూపిస్తున్నట్టుగా డ్రాయింగ్ కూడా వేశాడు. దాన్ని రెడిట్‌లో పోస్ట్ చేసి.. మా బాస్‌కు ఇదే రాజీనామా పత్రాన్ని ఇవాళ ఇవ్వబోతున్నా అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. టిష్యూ పేపర్‌పై రాసిన లెటర్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాప్రే.. ఇలాంటి రిజైన్ లెటర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఇంటర్వ్యూలో అన్నీ కరెక్ట్‌గా చెప్పినా.. ఆ సిల్లి కారణంతో రిజెక్ట్ చేశారు -
గోల్నాకలో భారీ అగ్నిప్రమాదం
-
Hyderabad: గోల్నాకలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: గోల్నాకలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వెంటనే ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ సహయంతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మరో 30 ఏళ్లలో సముద్రంలో చేపల కంటే ఇవే ఎక్కువట!
వెబ్‌డెస్క్: అణుయుద్ధాలు, కరోనా వైరస్ల కంటే ప్రమాదకరంగా చాప కింద నీరులా ప్రపంచాన్ని చుట్టేస్తోన్న మరో ప్రమాదకారి ప్లాస్టిక్. ప్రస్తుతం ప్రతీ రోజు భూమిపై పోగవుతున్న ప్లాస్టిక్‌ను కంట్రోల్ చేయకపోతే 2050 నాటికి సముద్రంలో ఉన్న చేపల బరువు కంటే ఎక్కువ ప్లాస్టిక్ చెత్త అక్కడ పోగు పడిపోతుందని అంతర్జాతీయ నివేదికలు తేల్చి చెబుతున్నాయి. జులై 12న పేపర్ బ్యాగులపై అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా జులై 12న పేపర్ బ్యాగ్ డే నిర్వహిస్తున్నాయి. పర్యవరణానికి హానీకరంగా మారిన ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో పేపర్ బ్యాగులు వాడాటాన్ని ప్రోత్సహించడం పేపర్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. 1952లో అమెరికాలో 1852లో తొలిసారి పేపర్ బ్యాగులను తయారు చేసే యంత్రాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత కాలంలో పేపర్ బ్యాగులు ప్రపంచం మొత్తం విపరీతంగా అమ్ముడయ్యాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత వచ్చిన ప్లాస్టిక్ బ్యాగులు పేపర్ బ్యాగుల స్థానానికి ఎసరు పెట్టాయి ఇక 80వ దశకంలో వచ్చిన యూజ్ అండ్ త్రో బ్యాగులైతే పర్యవరనానికే ప్రమాదకరంగా మారాయి. ప్లాస్టిక్ భూతం 1950 నుంచి ఇప్పటి వరకు 830 బిలిమన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. ఇందులో 60 శాతం ప్లాస్టిక్ అంటే 500 బిలియన్ టన్నులు రీసైకిల్ చేయడానికి అనువుగా లేదు. అంటే 70 ఏళ్లలో 500 బిలియన్ టన్నుల ప్టాస్టిక్ భూతాన్ని భూమిపై పడేశాం. మనకు ప్రమాదమే సముద్రంలో పోగవుతున్న చెత్తను చేపలు తినేస్తున్నాయి, ఆ చేపలు మనం ఆహారంగా తీసుకోవడం వల్ల హర్మోన్స్ సమతుల్యత దెబ్బ తింటోంది. వీటికి తోడు ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ కారణంగా డ్రైనేజీలు మూసుకుపోయి వరద సమస్యలు కూడా తలెత్తున్నాయి. ప్లాస్టిక్‌ను కాల్చేయడం వల్ల కర్బణ ఉద్గారాలు పెరిగి భూతాపం సమస్య ఎదురువుతోంది. ఇలా ప్లాస్టిక్‌తో ఎలా ఉన్నా ఇబ్బందులే ఉన్నాయి. అందుకే పేపర్ బ్యాగులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కట్టడి చేయాల్సిందే ప్లాస్టిక్ నియంత్రణ విషయంలో అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. అయితే ప్లాస్టిక్ కట్టడి విషయంలో చాలా దేశాలు ఉదాసీన వైఖరినే అవలంభిస్తున్నాయి. ప్లాస్టిక్ విషయలో కఠినంగా ఉన్న దేశాల వివరాలు కెనడా భూమ్మీద ఉన్న తాగునీటిలో నాలుగో వంతు స్వచ్ఛమైన నీరు కెనడాలో ఉంది. ప్లాస్టిక్ కారణంగా జలవనరులకు తలెత్తుతున్న ఇబ్బందులు గుర్తించిన కెనడా జాగ్రత్త పడుతోంది. 2030 నాటికి పూర్తిగా ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ తయారీని నిషేధించింది. స్ట్రాలు, బ్యాగులు, కవర్లు, బాటిళ్లు, ఫుడ్ ప్లేట్స్, చెంచాలు ఇలా వన్ టైం యూజ్ ప్లాస్టిక్ నిషేధం విధించింది. రువాండ రువాండలో జరిగిన అంతర్యుద్ధం 1994లో ముగిసిన వెంటనే వ్యవసాయంపై ఆ దేశం దృష్టి సారించింది. అయితే అసలే వర్షాలు తక్కువగా ఉండే ఆ దేశంలో ప్లాస్టిక్ కారణంగా సాగు దిగుబడికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించింది. 2004లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. అంతటితో ఆగకుండా క్రమం తప్పకుండా ప్లాస్టిక్ నిషేధంపై భారీ ఎత్తున ప్రచారం నిర్వహించింది. ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా ఉండటం వారి జీవన విధానంలో ఓ భాగం అయ్యేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు ప్లాస్టిక్‌ను అతి తక్కువగా వినియోగించే దేశాల్లో ఒకటిగా నిలిచింది. కెన్యా ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకున్న దేశంగా కెన్యా చరిత్రలో నిలిచిపోయింది. ప్లాస్టిక్ తయారు చేసినా, అమ్మినా, ఉపయోగించినా సరే నాలుగేళ్ల జైలు శిక్ష లేదా 40,000 డాలర్లు జరిమానాగా విధిస్తూ చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం దెబ్బకు ఆ దేశంలో ప్లాస్టిక్ వినియోగం 80 శాతం మేరకు తగ్గిపోయింది. పేపర్ బ్యాగుల వినియోగం పెరిగింది. ఫ్రాన్స్ 2040 నాటికి దేశాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా మార్చేందుకు అనుగుణంగా ఫ్రాన్స్ పటిష్టమైన కార్యచరణతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా 2016లో టేక్ అవే, ఫుడ్ వేర్, కర్ట్లరీ ఐటమ్స్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. 2020లో టేబుల్ వేర్కి ఉపయోగించే ఐటమ్స్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని 50 శాతంలోపు పరిమితం చేసి, వాటి స్థానంలో భూమిలో కలిసిపోయే మెటీరియల్‌తో తయారైన వస్తువులు ఉపయోగించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని 2022 నాటికి పూర్తిగా తగ్గించాలని నిర్ణయించారు. ఇలా ఒక క్రమపద్దతిలో ప్లాస్టిక్‌కి చెక్ ఫ్రాన్స్ పెడుతోంది. ఇండియా 2022 నాటికి యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలంటూ 2017లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఆచరణలో అది అమలు కావడం లేదు. మన దగ్గర మార్కెట్లోకి వస్తున్న ప్లాస్టిక్‌లో 80 శాతం తిరిగి సముద్రంలోకి చేరుతుంది. ప్లాస్టిక్ నియంత్రణ, డిస్పోజల్‌కు సరైన పద్దతులు అమలు చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. -
కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు 21 రోజుల లాక్ డౌన్ దేశవ్యాప్తంగా అమలవుతోంది. నిత్యం చేతులను శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్లు వాడడం, కనీస భౌతిక దూరాన్ని పాటించడం లాంటి చర్యలు గత పదిరోజులుగా దాదాపు దేశ ప్రజలందరికి అలవాటుగా మారిపోయింది. అయితే కరెన్సీ నోట్ల మీద, పేపర్ మీద కూడా వైరస్ తిష్టవేసుకుని కూచుంటుందని, జాగ్రత్తలు అవసరమన్న హెచ్చరికలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగి అనుసరించిన పద్థతి, చెక్ తీసుకున్న వైనం చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో నిరంతరం చురుగ్గా వుంటూ, ఎన్నో ఆసక్తికర, విజ్ఞాన దాయక వీడియోలను పంచుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈ వీడియోను ట్వీట్ చేయడం విశేషం. వాట్సాప్ వండర్ బాక్స్ లో వచ్చిన వీడియోను షేర్ చేస్తూ ఈ టెక్నిక్ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు గానీ, క్యాషియర్ సృజనాత్మకతను మాత్రం మెచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. చేతికి గ్లౌజులు, నోటికి మాస్క్ లాంటి నియమాలను పాటించిన సదరు బ్యాంకు ఉద్యోగి వినియోగదారుడు నుంచి, చెక్కును ప్లకర్ తో అందుకోవడం, ఆ తరువాత దాన్ని పక్కనే సిద్ధంగా ఉంచుకున్న ఐరన్ బాక్స్ తో ఇస్త్రీ చేసి మరీ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ప్రక్రియ కరోనాను అడ్డుకునేందుకు ఎంతవరకు పనికి వస్తుందనే విషయంలో స్పష్టత లేదు. కాగా లాక్డౌన్ సమయంలో దేశ ప్రజలందరూ ఇంటి పరిమితమైనప్పటికీ ప్రజల సౌకర్యార్ధం కొన్ని అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయి. పోలీసు, వైద్యం, కిరాణా, బ్యాంకింగ్, మీడియా వంటి ముఖ్యమైన సేవలకు అనుమతి వుంది. అయినా దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా ఢిల్లీ నిజాముద్దీన్ ఉదంతం అనంతరం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. చదవండి : కరోనా : వారికి ఉబెర్ ఉచిత సేవలు లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది కరోనా సంక్షోభం: స్నాప్‌డీల్ డెలివరీ హామీ In my #whatsappwonderbox I have no idea if the cashier’s technique is effective but you have to give him credit for his creativity! 😊 pic.twitter.com/yAkmAxzQJT — anand mahindra (@anandmahindra) April 4, 2020 -
జేఈఈలో ‘పేపర్’ గొడవ
దుండిగల్: ఇన్విజిలేటర్ తప్పిదం కారణంగా తమ కుమారుడి భవిష్యత్ అంధకారమైందని ఆరోపిస్తూ విద్యార్థి తల్లిదండ్రులు జేఈఈ పరీక్ష కేంద్రం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వీరికి పరీక్ష రాసేందుకు వచ్చిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు తెలపడంతో ఉద్రికత్త నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 7, 8, 9 తేదీల్లో దేశ వ్యాప్తంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దుండిగల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం షాద్‌నగర్‌కు చెందిన విద్యార్థి బిక్కుమల్ల విష్ణుసాయి ఉదయం షిప్ట్‌లో పరీక్షకు హాజరయ్యాడు. ఆన్లైన్లో 3 గంటల పాటు జరిగిన ఈ పరీక్షలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. అయితే ప్రతి ప్రశ్నకు జవాబు రాబట్టేందుకు వీలుగా విద్యార్థులు రఫ్ పేపర్లను వినియోగిస్తారు. అయితే విష్ణుసాయి పరీక్ష కేంద్రంలో ముందుగా రెండు అడిషనల్ షీట్ లు తీసుకున్నాడు. అనంతరం అదనంగా అడిషనల్ షీట్ కావాలని కోరగా ఇన్విజిలేటర్ అందుకు నిరాకరించాడు. కేవలం నాలుగు పేపర్లను మాత్రమే ఇవ్వడంతో సదరు విద్యార్థి పరీక్ష సరిగా రాయలేక పోయాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు కళాశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వీరికి మద్దతు తెలపడంతో పరీక్షా కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడికి వచ్చిన కళాశాల ప్రతినిధులు విద్యార్థి తల్లిదండ్రులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అబ్జర్వర్ రాము మాట్లాడుతూ సిబ్బంది పొరపాటు కారణంగా తప్పిదం జరిగిందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెయిల్ పంపించి మరోసారి విద్యార్థికి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అయినా తల్లిదండ్రులు శాంతించకపోవడంతో తమ ఇన్విజిలేటర్ తప్పిదం ఉందని అంగీకరిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెయిల్ పంపించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఐదేళ్లుగా కష్టపడుతున్నా.. జేఈఈ పరీక్ష కోసం ఐదేళ్లుగా కష్టపడుతున్నా. ఎంట్రన్స్ పరీక్షలో 75 ప్రశ్నలకు జవాబులు రాయాలంటే కనీసం 20 రఫ్ పేపర్లు అవసరముంటుంది. అయితే ఇన్విజిలేటర్ సార్‌ను ఎంత బతిమాలినా కేవలం నాలుగు పేపర్లే ఇవ్వడంతో పరీక్ష సరిగ్గా రాయలేకపోయాను. దయచేసి నేను మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలి.–విష్ణుసాయి, విద్యార్థి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది మా కుమారుడు విష్ణుసాయి టెన్త్‌లో 88 శాతం మార్కులు సాధించాడు. రెండు సార్లు ఒలంపియాడ్లో విన్నర్‌గా నిలిచాడు. అతడికి 8వ తరగతి నుంచి ఐఐటీ శిక్షణ ఇప్పిస్తున్నాం. ఎంతో కష్టపడి చదివి ఎంట్రన్స్‌లో పాస్ అవుతాడన్న నమ్మకం ఉంది. అయితే ఇన్విజిలేటర్ తప్పిదం వల్ల మా కుమారుడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. –శ్రీకాంత్, విద్యార్థి తండ్రి -
వారి దాడులు కాగితాలపైనే
జైపూర్/సికార్/హిందౌన్ సిటీ: కాంగ్రెస్ హయాంలో సర్జికల్ దాడులు కేవలం కాగితాలపైనే జరిగాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖను దాటి వెళ్లి దాడులు జరిపాయన్న ఆ పార్టీ నేతల ప్రకటనలపై ఆయన పై వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ చేశామంటూ కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. శుక్రవారం ప్రధాని రాజస్తాన్‌లోని జైపూర్, సికార్, హిందౌన్‌లలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘మా ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లు ప్రకటించగానే కాంగ్రెస్ ఖండించింది. ఆ తర్వాత వ్యతిరేకించింది. ఇప్పుడు నేను కూడా అంటోంది (మీ టూ)’ అని తెలిపారు. ‘యూపీఏ జమానాలో మూడుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్లు ఆ పార్టీ నేత(రాహుల్) ప్రకటించారు. ఇప్పుడేమో మరొక నేత దానిని ఆరుసార్లకు పెంచారు. ఈ ఎన్నికలు పూర్తయ్యేలోగా ఈ సంఖ్య 600కు చేరుకుంటుంది. కాగితాలపైనే చేసిన ఈ దాడులతో ఫలితమేంటి? కాంగ్రెస్ అబద్ధాలు మాత్రమే చెబుతుంది’ అని అన్నారు. మై ఆప్కా ‘అభినందన్’ కర్తా హూ మీ అందరికీ శుభాకాంక్షలు (మై ఆప్కా ‘అభినందన్’ కర్తా హూ) అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. ‘ఇలా అని నేను అనగానే కాంగ్రెస్ వాళ్లు...ఐఏఎఫ్ పైలెట్ అభినందన్ పేరును ప్రస్తావించి ప్రధాని మోదీ నిబంధనావళిని అతిక్రమించారంటూ ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేస్తారు. ఆపై వాళ్ల నేత సుప్రీంకోర్టుకు వెళతారు. దీంతో కోర్టు ఒక వారంలోగా ఈ విషయాన్ని పరిష్కరించండంటూ ఈసీని కోరుతుంది. మోదీ నిబంధనలను ఉల్లంఘించలేదని, ప్రజలకు అభివాదం చేశారని ఈసీ స్పష్టం చేస్తుంది. వెంటనే కాంగ్రెస్ మీడియాను పిలిచి నన్ను విమర్శిస్తుంది’ అని వ్యంగ్యంగా అన్నారు. ‘అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినందుకు సంతోషపడాల్సింది పోయి.. ఎన్నికల సమయంలో ఇలా జరిగినందుకు కాంగ్రెస్ విచారంతో ఉంది. ఐరాస అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్నీ ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. అలా ప్రకటించడానికి ముందుగా మేడమ్(సోనియా గాంధీ), నామ్‌దార్(రాహుల్)లను ఐరాస సంప్రదించాలని కాంగ్రెస్ అనుకుంటోందా’ అని ప్రధాని ప్రశ్నించారు. 125 రోజుల్లో దేశమంతా.. న్యూఢిల్లీ: డిసెంబర్ 25 నుంచి మే 1 మధ్య 125 రోజుల్లో మోదీ దేశం మొత్తాన్నీ చుట్టేశారు. ఆయన వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, ఎన్నికల ప్రచారం కోసం మోదీ ఈ 125 రోజుల్లో 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, జామ్‌నగర్ నుంచి సిల్చార్ వరకు దేశం నలుదిక్కులా పర్యటిస్తూ శాస్త్రవేత్తలు, రైతులు తదితరులతో మాట్లాడారని వెబ్సైట్ పేర్కొంది. ప్రజలకు హామీలు ఇవ్వడమే కాకుండా వాటిని సత్వరమే నెరవేర్చేందుకు కృషి చేశారంది. ప్రధానమంత్రి రైతు గౌరవనిధి తదితర పథకాలను ఉదాహరణలుగా చూపింది. -
బాండ్‌పేపర్‌పై హామీలు
కొడిమ్యాల(చొప్పదండి): ఈనెల 22న నిర్వహిం చనున్న గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నా రు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెద క్ ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి మామిడి సుధాకర్‌రెడ్డి బాండ్‌పేపర్‌పై హామీలను ముద్రించి, పోస్ట్‌ద్వారా అభ్యర్థులకు పంపిణీ చేస్తున్నారు. తనను ఎన్నుకుంటే సీపీఎస్‌ను రద్దుచేపిస్తానని, కాంట్రాక్టు అధ్యాపకులకు హెల్త్‌కార్డులు మంజూరు చేపిస్తానని, అధ్యాపకులకు ఇంటిస్థలాలు సమకూరుస్తానని బాండ్‌పై హామీ లు ముద్రించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను 20 సంవత్సరాల భావి ఉద్యోగ జీవితాన్ని వదులుకుని పోటీలోఉన్నానని, దివ్యాంగుడినైనందున అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోతున్నందున బాండ్ద్వారా హామీలను తెలుపుతున్నానని, ఆశీర్వదించాలని కోరుతున్నారు. -
కాగితం కొరత తీరినట్లే!
ముంబై: పుస్తకాలు, నోటుబుక్స్, డెయిలీ పేపర్.. వీటన్నింటికీ కాగితమే ఆధారం. ఈ కాగితం తయారీకోసం లక్షలాది చెట్లు నరకాల్సి వస్తోంది. ఫలితంగా పర్యావరణం దెబ్బతింటోంది. అయితే ఇకపై చెట్లను నేలకూల్చకుండానే సరిపడా కాగితాన్ని తయారుచేసుకోవచ్చు. ఇందుకు చైనా తీసుకున్న తాజా నిర్ణయమే కారణం. కాగితాలు, ప్లాస్టిక్ వంటి పునర్వినియోగ చెత్త దిగుమతులపై చైనా నిషేధం విధించింది. దీంతో కోట్ల టన్నుల కాగితపు చెత్త పేరుకుపోయి.. పశ్చిమ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు ఆ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. నిజానికి భారత్‌లో తయారయ్యే కొత్త కాగితంలో 60 శాతంచిత్తు కాగితాల రీసైక్లింగ్ వల్లే ఉత్పత్తి అయ్యిందే. దీంతో విదేశాల నుంచి చౌకగా వస్తున్న చెత్త కాగితాలను వీలైనంత ఎక్కువ దిగుమతి చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఫలితంగా తక్కువ ధరకే దేశ ప్రజలకు కాగితం అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. -
ఆ ఏటీఎంలో రూ 2000 నోటుకు బదులు ఏమొచ్చిందంటే..
సాక్షి, కోల్‌కతా : ఏటీఎం కార్డుల మోసం పశ్చిమ బెంగాల్లో ప్రకంపనలు రేపగా తాజాగా బెంగాల్‌లోని ఓ ఏటీఎంలో రూ 2000 నోటుకు బదులు గోధుమ రంగు పేపర్ రావడంతో కస్టమర్లు విస్తుపోతున్నారు. నగరానికి పొరుగునే ఉన్న హౌరా జిల్లాలోని బాలీ ప్రాంతంలోని ఓ ఏటీఎంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఏటీఎం కార్డును స్వైప్ చేయగా రూ 2000 నోటుకు బదులు బ్రౌన్ పేపర్ వచ్చిందని బాధితుడు విజయ్ పండే వాపోయారు. డబ్బు డ్రా చేసుకునేందుకు తాను బుధవారం ఉదయం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు వెళ్లి రూ 6000 విత్‌డ్రా చేశానని, అందులో రెండు రూ 2000 నోట్లు రాగా మరో నోటుకు బదులు మెషీన్ నుంచి గోధుమ రంగు పేపర్ వచ్చిందని విజయ్ చెప్పారు. దీనిపై తక్షణమే తాను బ్యాంక్ అధికారులకు సమాచారం అందించానని, ఈ ఘటనపై విచారణ చేపడతామని వారు హామీ ఇచ్చారన్నారు. మరోవైపు ఏటీఎం కార్డుల్లో డేటా చోరీ చేస్తూ నగదు స్వాహా చేస్తున్న ఉదంతాలు కోల్‌కతాలో పెచ్చుమీరిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. రుమేనియన్ల హస్తంతో ఏటీఎం కార్డుల ఫ్రాడ్ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ రాకెట్‌కు సంబంధించి ముగ్గురు రుమేనియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘మిస్డ్ కాల్’తో ఇంట్లో స్వచ్ఛత
‘ఒక టన్ను పేపర్ రీస్లైకింగ్ చేయడం వల్ల 17 చెట్లను రక్షించినట్టవుతుంది.ఒక ప్లాస్టిక్ బాటిల్ రీసైక్లింగ్ నెలకు60 వాట్ల విద్యుత్‌ను ఆదా చేస్తుంది.ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ను విసిరిస్తే అది కనుమరుగు కావడానికి 500 ఏళ్లు పడుతుంది.ఇలా ఇంట్లో ఉండే చెత్తకు సంబంధించిన ప్రయోజనాలను ప్రజలకు సామాజిక మాధ్యమాల్లో వివరిస్తూనే ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మీ ఇంట్లోని చెత్తను తీసుకెళ్లి రీసైక్లింగ్ చేస్తామంటున్నారు నగరానికి చెందిన బిందు, లత, రీతూలు. స్వచ్ఛభారత్ తరహాలోనే ఈ ముగ్గురు కార్పొరేట్ ఉద్యోగులు ‘స్క్రాప్‌క్యూ’స్టార్టప్‌కు అంకురార్పణ చేశారు. సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో ఓ మూలన పడేసే పేపర్, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కొనుగోలు చేసి ఇంటి స్వచ్ఛతతో పాటు ఆర్థికంగానూ బాసటగా ఉంటున్నారు వీరు. ఈ చెత్త రీసైక్లింగ్ కోసం ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమలకు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం సామాజిక సేవకు ఉపయోగిస్తున్నారు. హ్యాపీ స్మైల్ ఫౌండేషన్‌కు విరాళాలిస్తూ వారి సేవలో పరోక్షంగా భాగస్వామ్యులవుతున్నారు. చెత్తతో మేలంటూ ప్రచారం.. ఇంట్లో చెత్త ఉండడం వల్ల కలిగే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. వర్షాకాలంలో అయితే ఈ తిప్పలు చెప్పనక్కర్లేదు. ఇంట్లో శుభ్రతకు ఈ చెత్త ఎప్పుడూ అడ్డే. నగరంలో ఎక్కువ మంది అద్దెదారులే. దీంతో ఆ చెత్తను ఉన్న ఇంట్లోనే ఓ మూలాన పెడుతుంటారు. చెత్త కొనేవాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తుంటారు. ఇంకొందరు వీలు చూసుకుని స్క్రాప్ దుకాణం ఎక్కడో వెదుక్కొని మరీ ఈ చెత్తను తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. అయితే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న నగరంలో చెత్తను ఎక్కడిపడితే అక్కడ పడేయడం వల్ల కలిగే అనర్థాలను, రీసైక్లింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను బిందు, లత, రీతూ ప్రజలకు వివరిస్తున్నారు. ‘తొలుత సామాజిక మాధ్యమాలను ప్రచారం కోసం ఎంచుకున్నాం. ఆ తర్వాత కాలనీలు, వీధుల్లో ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చివరకు ఇంటి ఇంటికీ వెళ్లి చెత్త విశిష్టతను తెలియజేస్తూ వాటిని పడేయవద్దని చెబుతున్నా’మంటున్నారు వీరు. మిస్డ్ కాల్‌తో మీ ఇంటికి.. ‘మీ ఇంట్లో పేపర్, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉంటే 040–30707070 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మా సిబ్బంది మీరు ఏ సమయం ఇస్తే ఆ సమయంలో వచ్చి డబ్బులు చెల్లించి చెత్త కొంటారు’ అని చెబుతున్నారు ఈ యువతులు. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘స్క్రాప్‌క్యూ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో వివరాలు నమోదు చేయాలని వివరిస్తున్నారు. -
ముంబై దాడులపై నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
-
కాగితం ఖాదీ
పత్తిని వడికి దారం చేసి మగ్గం మీద నేస్తే అది ఖాదీ. అదే రాట్నం, అదే మగ్గం మీద కాగితాన్ని వడికి వస్త్రాన్ని నేస్తే అది కాగితం ఖాదీ. ఆ ప్రయోగం చేసిన ఖాదీ ఇంటి అమ్మాయి పాలిశెట్టి నీరజ.. చేనేతలకు జీవాన్ని, పునరుజ్జీవాన్నీ ఇస్తోంది. ‘అహ నా పెళ్లంట’ సినిమాలో రాజేంద్రప్రసాద్ పెళ్లి కోసం పరమ పిసినారిగా నటిస్తుంటాడు. ఈ వెధవ దేహాన్ని కప్పుకోవడానికి దుస్తులెందుకు దండగ? కాగితంతో కప్పుకుంటే చాలదూ... అంటూ పేపర్ లుంగీ కట్టుకుంటాడు. అది చూసిన కోట శ్రీనివాసరావు (మామ పాత్ర) పేపర్ చీర ఎలా ఉంటుందో అని ఆలోచనలో పడతాడు. ఇది జంధ్యాల హాస్య చతురతకు పరాకాష్ట. ఆ సీన్‌కి హాలంతా పొట్టపట్టుకుని మరీ నవ్వేసింది. ఇప్పటికీ ఎప్పుడు టీవీలో ఆ సినిమా వచ్చినా ఆ సీన్ గుర్తొచ్చి... అప్పటి వరకు మునిగితేలుతున్న స్ట్రెస్‌ను చుట్టచుట్టి డస్ట్‌బిన్‌లో పడేసి, ఓ చిరునవ్వు నవ్వుతుంటాం. కాగితం నుంచి వస్త్రం అది సినిమా కోసం రాసుకున్న కామెడీ సీన్. అయితే ఆ ఫార్ములాతో క్లాత్ తయారవుతుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు పాలిశెట్టి నీరజ అనే తెలుగమ్మాయి ఓ ప్రయోగం చేసింది. పేపర్ని సన్నని పోగులుగా చేసి రాట్నంలో వేసి వడుకుతోంది. మగ్గం మీద నేసి కంప్లీట్ క్లాత్‌ను తయారు చేస్తోంది. ఇలా ఎకో ఫ్రెండ్లీ టెక్స్‌టైల్‌తో ఓ చిన్న వ్యాపార సామ్రాజ్యానికి తొలి అడుగు వేసింది. ఇప్పుడామె వీవింగ్ స్టూడియోలో ఫొటో ఫ్రేమ్‌లు, కుషన్ కవర్లు, ఫోల్డర్లు, పెన్ స్టాండ్, ల్యాంప్ షేడ్, పౌచ్‌లు, హ్యాండ్ బ్యాగ్, రూమ్ పార్టిషన్స్, కర్టెన్స్, సోఫా కవర్ వంటివి తయారవుతున్నాయి. ఇవన్నీ హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులే. వీటి తయారీలో కరెంట్ వాడకం తక్కువ. వేస్ట్ పేపర్, రీసైకిల్డ్ పేపరే వీటికి ముడిసరుకు. పొందూరు నుంచి జైపూర్ నీరజ పాలిశెట్టిది శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో చేనేతకారుల కుటుంబం. మగ్గం చప్పుళ్ల మధ్యనే పెరిగిందామె. నేతకారుల వారసులు కొత్త ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్న నేపథ్యంలో ఆమె తన మూలాలను వదలకుండా అందులోనే కొత్త రూపాలను సృష్టిస్తోంది. మరి కొందరికి ఉపాధినిస్తోంది. టెక్స్టైల్ కోర్సులనే చదివింది. కానీ ప్రయోగాలు చేయడానికి చదువొక్కటే సరిపోదు కదా. ఆచరణలో ఎదురయ్యే కష్టాలు తెలియాలి. ఆ అనుభవం కోసం తమిళనాడు, తిర్పూర్ వస్త్ర వ్యాపార సంస్థలలో పనిచేశారు. కోయంబత్తూర్, జైపూర్లలో డిజైన్ ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పారు. మరోవైపు వస్త్ర ప్రపంచంలో కొత్తగా మరేదైనా చేయాలనే తపన ఆమెను వెంటాడుతూనే ఉంది. పొందూరు నేత నైపుణ్యాన్ని, జైపూర్ సూత్రకార చేనేతల కళాత్మకతను జోడించి ఓ ప్రయోగం చేశారు. తన ప్రయోగానికి జపాన్ టెక్నాలజీని అనుసంధానం చేశారు. పేపర్ వస్త్రం తయారైంది. పేపర్ క్లాత్ తయారీకి పేపర్ని రెండు నుంచి నాలుగు మిల్లీమీటర్ల పోగులుగా కత్తిరిస్తారు. వాటిని చరఖా మీద వడికి దారాన్ని తయారు చేస్తారు. ఆ దారాలతో వస్త్రాన్ని నేస్తారు. నేతకారులకు బతుకు ఇప్పుడు నీరజ దగ్గర నాలుగు మగ్గాల మీద పని జరుగుతోంది. ఉత్పత్తులు ఫేస్బుక్ ద్వారా మార్కెట్ అవుతున్నాయి. ‘నేత నిలవాలి. నేతకారులు బతకాలి. పర్యావరణానికి హాని కలగని రీతిలో ప్రయోగాలు జరగాలి. నేతకారులకు మేలు చేయడంతోపాటు భూమాతకు హాని చేయని మెథడ్ కోసం ప్రయత్నించాను. విజయవంతమయ్యాను కూడా. ఇప్పుడు దీనిలో వీలయినంత ఎక్కువ మందిని మమేకం చేయాలి. సమాజంలో వచ్చే మార్పులకు తగ్గట్టు మన ప్రొఫెషన్లో మార్పులు చేసుకుంటూ ప్రొఫెషన్ని బతికించుకోవాలి. అప్పుడే అది మనకు బతుకునిస్తుంది’’ అంటారు నీరజ. – మంజీర చేనేత చేతుల్లో పెరిగింది మా తాత మగ్గం మీద నేయడాన్ని చూశాను. స్కూల్‌డేస్‌లో ప్రాజెక్ట్ కోసం జ్యూట్‌తో స్వయంగా నేశాను కూడా. మా నాన్న టెక్స్టైల్ డిజైనింగ్‌లో కోర్సు చేశారు. అహ్మదాబాద్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ తొలి బ్యాచ్ స్టూడెంట్ ఆయన. చిన్నప్పుడు ఇంట్లో చూసిన వాతావరణం, నాన్న ప్రభావంతో నేను కూడా టెక్స్టైల్ రంగంలోకే రావాలనిపించింది. బరోడాలోని మహారాజా షాయాజీరావు యూనివర్సిటీలో క్లోతింగ్ అండ్ టెక్స్టైల్స్ కోర్సు చేశాను. పీజీ తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ సెక్టార్లలో మొత్తం పదిహేడేళ్లు పనిచేశాను. ఈ రంగంలో మా తాత, నాన్నలకంటే ఎక్కువ పరిజ్ఞానాన్ని సంపాదించానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. – నీరజ పాలిశెట్టి, ఫౌండర్, సూత్రకార్ క్రియేషన్స్ -
పరి పరిశోధన
తిండి తగ్గిస్తే వయసుతోపాటు వచ్చే వ్యాధులు తగ్గుతాయి! లంఖణం పరమౌషధం అని పెద్దలు ఊరకే అనలేదు. అప్పట్లో అందరూ ఈ విషయాన్ని కొట్టిపారేసినా.. తాజా పరిశోధనలు ఇంకోసారి ఉపవాసం లేదా తక్కువ ఆహారం తీసుకోవడంతో వచ్చే ప్రయోజనాలను రూఢి చేస్తున్నాయి. విషయం ఏమింటే.. అమెరికాలోని పెన్నింగ్టన్ బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం కేలరీలు తగ్గిపోతే వయసుతోపాటు వచ్చే వ్యాధుల నుంచి కొంత రక్షణ లభిస్తుంది! దాదాపు రెండేళ్లపాటు జరిగిన ఈ అధ్యయనంలో ఊబకాయులు కాని వారి ఆహారపు అలవాట్లను పరిశీలించారు. వీరిలో కొందరికి ఆహారం ద్వారా అందే కేలరీలను 15 శాతం తక్కువ చేశారు. రెండేళ్ల తరువాత పరిశీలిస్తే.. వీరందరి బరువు సగటున తొమ్మిది కిలోల వరకూ తగ్గింది. తిండి తగ్గినా ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదు. బదులుగా వీరందరూ ఉల్లాసంగా ఉన్నారు. కేలరీలు తగ్గినప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గించడంతోపాటు జీవక్రియల వేగం కూడా మందగించినట్లు తెలిసింది. జీవక్రియల వేగం తగ్గడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని.. శరీరం అందుబాటులో ఉన్న శక్తిని అత్యంత సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా వయసు తొందరగా మీదపడదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రైడ్మన్ తెలిపారు. కేలరీలు పెరిగినప్పుడు ... కొవ్వులు, ప్రొటీన్లు, డీఎన్ఏలకు ఆక్సిజన్ చేరడం ద్వారా ఫ్రీరాడికల్స్ ఉత్పత్తి ఎక్కువవుతుందని, వీటివల్ల కేన్సర్, మధుమేహం, గుండెజబ్బులు, కీళ్లవాతం వంటివి వస్తాయని ఇప్పటికే కొన్ని పరిశోధనలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పశువ్యర్థాలతో కాగితం.. కాగితం తయారీ కోసం చెట్లు నరికేస్తున్నారంటే అందరూ అయ్యో అనుకుంటారు. మరో గత్యంతరం లేదు కాబట్టి సరిపుచ్చుకుంటాం కూడా. వియన్నా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడు ఈ సాకూ లేకుండా పోతోంది. ఎందుకంటే.. వీరు పశువ్యర్థాల నుంచే తెల్లటి కాగితాన్ని తయారు చేసేందుకు ఓ వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ‘‘పశువులు సెల్యులోజ్‌తో కూడిన గడ్డిగాదం తింటూ ఉంటాయి. ఈ ఆహారం వాటి కడుపుల్లో ఎంజైమ్‌లు, ఆమ్లాలతో చేరి.. వ్యర్థాలుగా విసర్జితమవుతూంటాయి. ఈ వ్యర్థాల్లో కాగితం తయారీకి ఉపయోగపడే సెల్యులోజ్ దాదాపు 40 శాతం వరకూ ఉంటుంది. దీన్ని తేలికగా వేరు చేయవచ్చు కూడా’’ అని వివరించారు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఆలెగ్జాండర్ బిస్మార్క్. ఆవు పేడతోపాటు ఏనుగులు, గుర్రాల వ్యర్థాలతోనూ తాము ప్రయోగాలు చేసి.. కాగితం తయారీకి చౌకైన పద్ధతిని అభివృద్ధి చేశామని వివరించారు. సోడియం హైడ్రాక్సైడ్‌తో కలిపినప్పుడు వ్యర్థాల్లోంచి అవసరం లేని వాటిని తీసేయవచ్చునని మిగిలిన పదార్థాన్ని సోడియం హైపోక్లోరైట్‌తో బ్లీచ్ చేస్తే తెల్లదనం వస్తుందని.. దాన్ని కాగితం తయారీకి వాడుకోవచ్చునని అంటున్నారు ఈయన. ఈ పద్ధతిలో మిగిలినపోయిన పదార్థాన్ని ఎరువు, ఇంధనంగా వాడుకునే అవకాశమూ ఉందని.. అంతేకాకుండా.. బయోగ్యాస్ ఉత్పత్తి చేసుకున్న తరువాతే కాగితం తయారీ చేపట్టేందుకూ వీలుందని వివరించారు. -
గ్రామీణ మహిళలకు ఉపాధి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం దుర్శేడ్‌లోని గాంధీ చేతికాగిత పు పరిశ్రమను గురువారం శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించారు. పాతబట్టలు,వ్యర్థ పదార్ధాలను ఉపయోగించి త యారు చేస్తున్న కాగితాలు, వాటితో వివిధ ఆకృతుల్లో రూపొందిస్తున్న వస్తువులను పరిశీలించారు. చేతికాగితపు చెట్లను పరిరక్షించడం జరుగుతుందని, గ్రామీణ మహిళలు ఉపాధి కలుగుతుందని తెలిపారు. పరిశ్రమ నిర్వాహకులు జె. రఘునందన్‌రావు తదితరులు ఉన్నారు. -
అనుభవం.. నేర్పని పాఠం!
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి జవాబుపత్రాలు మూల్యాంకనం చేయడం ఎంత ముఖ్యమో.. వచ్చిన మార్కులు టోటలింగ్ చేయడం, మార్కుల పోస్టింగ్‌లు పరిశీలించడం కూడా అంతే ముఖ్యం. ఇందులో స్పెషల్ అసిస్టెంట్ల(ఎస్ఏ)లే కీలకం. మూల్యాంకనంలో ప్రతి ముగ్గురు ఏఈ(అసిస్టెంట్ ఎగ్జామినర్లు)లకు ఒక స్పెషల్ అసిస్టెంట్(ఎస్ఏ)ను ఇవ్వాల్సి ఉంది. సుమారు 400 మందికి పైగా స్పెషల్ అసిస్టెంట్లు అవసరం కాగా వీరిలో సగంమంది కూడా రావడం లేదు. ఏటా ఇదే తంతు. గత అనుభవాలతో విద్యాశాఖ అధికారులు గుణపాఠం నేర్చుకోని పరిస్థితి. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. జిల్లాకు దాదాపు 5.40 లక్షల జవాబు పత్రాలు రానున్నాయి. రెండు రోజులుగా జవాబుపత్రాలు వస్తున్నాయి. స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తున్నారు. స్పెషల్ అసిస్టెంట్లు కీలకం ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు దిద్ది మార్కులు వేసిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్లు జవాబుపత్రం తీసుకుని మార్కుల పోస్టింగ్‌లు, మార్కుల టోటలింగ్ పరిశీలించాలి. ♦ ఏఈలు జవాబు పత్రాలు దిద్దుతున్న కంగారులో మార్కుల టోటలింగ్‌లో ఏవైనా తప్పులు జరిగే అవకాశం ఉంది. దీనికితోడు మండుతున్న వేసవితో ఉక్కపోత, సౌకర్యాల లేమితో తీవ్ర అసహనానికి లోనవుతుంటారు. ఈ క్రమంలో చిన్నచిన్న తప్పులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏఈలు దిద్దిన జవాబు పత్రాలను స్పెషల్ అసిస్టెంట్లు మరోసారి పరిశీలించి మార్కుల వివరాలను ధ్రువీకరిస్తారు. ♦ పొరపాటున ఏఈల చేతుల్లో టోటలింగ్‌లో తక్కువ వచ్చిన అంశాల్ని స్పెషల్ అసిస్టెంట్లు గుర్తించిన సందర్భాలు అనేకం. చాలీచాలని రెమ్యూనరేషన్ మూల్యాంకనం విధుల్లో పాల్గొంటున్న ఇతర అన్ని కేడర్ల కంటే కూడా స్పెషల్ అసిస్టెంట్లకే రెమ్యూనరేషన్ తక్కువ. ఏఈలకు డీఏ, పేపర్లు దిద్దినందుకు రోజుకు సగటున రూ.550 దాకా వస్తుంది. చీఫ్ ఎగ్జామినర్లకు కూడా ఇదే స్థాయిలో వస్తుంది. అయితే స్పెషల్ అసిస్టెంట్లకు మాత్రం కేవలం రూ.137.50లతో సరిపెడుతున్నారు. దీనికి తోడు డీఏ ఇవ్వడం లేదు. మండుతున్న ఎండలకు తోడు ఆశించిన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతోనే చాలామంది టీచర్లు స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. గుణపాఠం నేర్వని విద్యాశాఖ ఏటా ఇదే తంతు. గత అనుభవాలతో గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు టీచర్లు ఆసక్తి చూపడం లేదు. మూల్యాంకనంలో ఏమాత్రం తేడా వచ్చినా నష్టోపోయేది విద్యార్థులే. వారికి ఇష్టమున్నా.. లేకున్నా అధికారులే బలవంతంగా విధుల్లోకి తీసుకోవాలి. అలా చేస్తేనే పూరిస్థాయిలో స్పెషల్ అసిస్టెంట్లు వస్తారు. అయితే అధికారులు అలా చేయకపోవడం గమనార్హం. సమస్యను అధిగమిస్తాం ఏప్రిల్ 2 నుంచి 15వ తేదీ వరకు మూల్యాంకనం జరుగుతుంది. రెమ్యూనరేషన్ తక్కువ, డీఏ ఉండదనే కారణంతో స్పెషల్ అసిస్టెంట్లుగా వచ్చేందుకు ఆసక్తి చూపని పరిస్థితి వాస్తవమే. ఈసారి సమస్యను అధిగమిస్తాం. వీలైనంత ఎక్కువ మందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. – గోవిందు నాయక్,డిప్యూటీ క్యాంపు ఆఫీసర్ -
ఇదీ సాక్షి పాఠకుల సంఖ్య
పాఠకుల సంఖ్య.....93,41,000 సాక్షి, హైదరాబాద్ : సాక్షి దినపత్రికను ప్రతిరోజూ 93.41 లక్షల మంది పాఠకులు చదువుతున్నారని ఇండియన్ రీడర్షిప్ సర్వే (ఐఆర్ఎస్)–2017 తేల్చింది. ఈ సర్వేలో ప్రాంతీయ, హిందీ పత్రికలే అగ్రస్థానంలో నిలిచాయి. ఇంగ్లిష్ పత్రికలను వెనక్కి నెట్టి టాప్–10 స్థానాలను ఇవే కైవసం చేసుకున్నాయి. హిందీ పత్రికల పాఠకుల సంఖ్యలో ఏకంగా 45 శాతం వృద్ధి నమోదైంది. 7 కోట్ల పైచిలుకు పాఠకులతో దైనిక్ జాగరణ్ మొదటి స్థానంలో, 5.23 కోట్లతో హిందుస్థాన్, 4.6 కోట్లతో అమర్ ఉజాలా పత్రికలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రీడర్షిప్ స్టడీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్ఎస్సీఐ), మీడియా రీసెర్చ్ యూజర్స్ కౌన్సిల్(ఎంఆర్‌యూసీ)లు తాజాగా ఈ సర్వే ఫలితాలను వెల్లడించాయి. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా పత్రికలు కొత్తగా 11 కోట్ల మంది పాఠకులను సంపాదించుకున్నాయి. 2014 ఐఆర్ఎస్ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం పాఠకుల సంఖ్య 29.5 కోట్లు కాగా ప్రస్తుతం అది 40.7 కోట్లకు చేరింది. కొత్తగా చేరిన ఈ పాఠకులు పట్టణ ప్రాంతాల్లో 4 కోట్లు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 7 కోట్లు ఉండటం గమనార్హం. అలాగే 12 ఏళ్లు పైబడిన వారిలో పాఠకుల సంఖ్య 9 శాతం పెరిగినట్టు తేలింది. ‘‘ఈ అంకెలు ప్రింట్ రంగానికి మున్ముందు ఉజ్వల భవిష్యత్ ఉందనడానికి అద్దం పడుతున్నాయి’’ అని ఎంఆర్‌యూసీ చైర్మన్ ఆశిష్ భాసిన్ పేర్కొన్నారు. -
కాగితపు నీడ !
ఎండలు మండుతున్నాయి.. ఎండ వేడిమికి జీవరాశులన్నీ విలవిల్లాడుతున్నాయి. మొక్కలు సైతం మలమల మాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. అరటి సాగు చేసిన రైతులు మొక్కలను కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఒక్కో అరటి మొక్క రూ.12 వెచ్చించి ఎకరాకు 1200 మొక్కలు నాటితే ఎండ తీవ్రతకు కనీసం 50 శాతం మొక్కలు బతకడమూ గగనమైంది. పుట్లూరు మండలంలోని కడవకల్లు, చెర్లోపల్లి, ఓబుళాపురం తదితర గ్రామాల్లో అరటì మొక్కలు సాగు చేసిన వాటిపై ‘వి’ ఆకారంలో పేపర్‌ను మడిచి మొక్కపై ఎండ నేరుగా పడకుండా రక్షణ కల్పిస్తున్నారు. ఇలా పేపర్ల ద్వారా 15 రోజుల పాటు రక్షణ కల్పించి, మొక్కలను బతికించుకుంటే ఎలాంటి నష్టమూ జరగదని రైతులు చెప్తున్నారు. అరటి మొక్కలను కాపాడుకోవడానికి వినియోగిస్తున్న న్యూస్ పేపర్లు కిలో రూ.20 వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు. - పుట్లూరు (శింగనమల) -
పేపర్ గణపతికి ‘రికార్డు’ గుర్తింపు
యాకుత్‌పురా: పర్యావరణ పరిరక్షణలో భాగంగా పేపర్‌తో చేసిన వినాయకుడిని నెలకొల్పిన పాతబస్తీ గౌలిపురా అంబికానగర్ ప్రాంతానికి చెందిన ఎంబీఏ విద్యార్థి ఆర్.చంద్రకాంత్ చారికి లండన్‌కు చెందిన ‘ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఇతడు మూడేళ్లుగా పేపర్ వినాయకుడిని ఏర్పాటు చేస్తూ స్థానికంగా గుర్తింపు పొందాడు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 20 కిలోల న్యూస్ పేపర్లు, గోధుమ పిండి, వెదురు బొంగులతో 8.4 అడుగుల విగ్రహాన్ని రూపొందించాడు. సోమవారం రాత్రి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియా ప్రతినిధులు బింగి నరేందర్ గౌడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధి డాక్టర్ గుర్రం స్వర్ణశ్రీ.. చంద్రకాంత్‌కు గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు. -
పవన్ కల్యాణ్ టీవీ ఛానల్ పెడుతున్నారా?
హైదరాబాద్: ఇంట్లో పని వాళ్లకు జీతాలు ఇచ్చేందుకు, పార్టీ నడిపేందుకు డబ్బుల్లేవని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత మీడియాను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారా? టీవీ చానల్,లేదా పేపర్ పెట్టబోతున్నారా? 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్టు ఇటీవల తేల్చిచెప్పిన పవర్ స్టార్ తన ప్రచారం కోసం తన సొంత టీవీ, పత్రికా మాద్యమాన్ని ఉపయోగించుకోబోతున్నారా? అంటే అవుననే ఊహాగానాలు టాలీవుడ్ లో జోరుగా సాగుతున్నాయి. సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టి 2019 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జనసేన పోటీ చేయనున్నామని ఇటీవల జనసేన అధినేత మీడియాకు స్పష్టం చేశారు. తద్వారా పూర్తి సమయం రాజకీయాలకు అంకితం కానున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన టీవీ ఛానల్, లేదా పేపర్ పెట్టనున్నారనే వార్తలకు బరింత బలం చేకూరింది. మరోవైపు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే క్రమంలో, తనపై , పార్టీపై చెలరేగే విమర్శల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టాలనే ఆలోచనతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సొంత మీడియా ఉంటే మేలనే ఆలోచనతో కొత్త టీవీ ఛానల్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా ముందు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించనున్నారని అంటున్నారు. ఆ తర్వాత ఓ ఛానల్ కూడా కొంటారని తెలుస్తోంది. దీనిద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే ప్రణాళికతో ముందుకు వెడుతున్నట్టుసమాచారం. ఇప్పటికే పార్టీ నడిపేందుకు డబ్బులు లేవని చెప్పిన పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారనే ప్రశ్నలు గతంలోనే చాలా వినిపించాయి. మరి నెలగడవడం కష్టంగా ఉంది. ..చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని మీడియా ముందు ప్రకటించిన పవన్ ఓ టీవీ ఛానల్ పెట్టడం, ఓ న్యూస్ పేపర్ పెట్టడం లేదా టీవీ ఛానల్ కొనడం సాధ్యమయ్యే పనేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే.. మరింతకాలం వేచి చూడాల్సిందే.. -
మన కరెన్సీ నోటుకు మన కాగితమే!
సాక్షి,బెంగళూరు: మన కరెన్సీ నోటుకు అవసరమైన కాగితాన్ని ఇకపై మనమే తయారు చేసుకోనున్నాం. దీని వల్ల ప్రతి ఏడాది వేలాది కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగలనుంది. ఈమేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణా ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్బీఎన్ఎంఎల్) మైసూరులోని మేటగళ్లి ప్రాంతంలో 35 ఎకరాల విస్తీర్ణంలో కరెన్సీ ప్రింటింగ్‌కు ఉపయోగించే కాగిత తయారీ పరిశ్రమను మంగళవారం ప్రారంభించింది. ఏడాదికి 12వేల మెట్రిక్ టన్నుల కాగితం ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పరిశ్రమ వల్ల ప్రతి ఏడాది రూ.1,280 కోట్ల విదేశీ మారకద్రవ్యం మిగులుతుందని బీఆర్బీఎన్ఎంఎల్ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ జగన్మోహన్ తెలిపారు. -
పేపర్ కాదు... పూపర్!
భలే బుర్ర కాగితాన్ని సాధారణంగా దేనితో తయారు చేస్తారు..? కలప గుజ్జుతో చేస్తారు. అక్కడక్కడా గడ్డి, పీచు వంటి వాటితోనూ తయారు చేస్తారు. అయితే, కాగితాన్ని సాధారణంగా కాకుండా కాస్తంత అసాధారణంగా తయారు చేయాలనుకున్నారు మహిమా మెహ్రా, విజేంద్ర షెకావత్. వీళ్లిద్దరిదీ రాజస్థాన్. మహిమా మెహ్రా రిటైల్ వ్యాపారి. విజేంద్ర షెకావత్ హ్యాండ్‌మేడ్ పేపర్ ఉత్పత్తిదారు. ఎప్పుడూ ఉపయోగించే పదార్థాలతో కాగితం తయారు చేయడంలో విశేషం ఏమీ లేదనుకున్నారు ఈ ఇద్దరూ. ఓ కొత్తరకం కాగితాన్ని చేసి చూపించారు. ఒకసారి ఈ ఇద్దరూ అంబర్కోటకు విహార యాత్రకు వెళ్లారు. అప్పుడు వచ్చిందో ఐడియా..! అక్కడ వాళ్లిద్దరూ నక్కతోక తొక్కలేదు గానీ, కోట పరిసరాల్లో నడుస్తుండగా, పొరపాటున ఏనుగు లద్దెను తొక్కారు. ఏనుగులు, వాటి విసర్జకాలు పుష్కలంగా కనిపించేసరికి... ఈ పదార్థంతో కాగితం తయారీకి ఎందుకు ప్రయత్నించకూడదు..? అని ఆలోచించారు. ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. నాటి నుంచీ గజ విసర్జకాన్ని భారీ ఎత్తున సేకరించడం ప్రారంభించారు మహిమ, విజేంద్ర. సేకరించిన దానిని కడిగి, ఉడికించి, ఎండబెట్టి... ఇన్ని ప్రక్రియల తర్వాత దాని నుంచి కాగితం తయారీకి అనుగుణమైన పిప్పిని సేకరించారు. ఆ పిప్పితో తయారు చేసిన కాగితాలు భేషుగ్గా వచ్చాయి. దాంతో ఢిల్లీలో పరిశ్రమపెట్టి మందపాటి కార్డ్‌బోర్డులు, అట్టలు, డైరీలు, నోట్ పుస్తకాలు, ఫొటో ఆల్బమ్స్ వంటివి తయారు చేయడం ప్రారంభించారు. ఎలిఫెంట్ పూ పేపర్ డాట్ కామ్ పేరిట వెబ్సైట్ పెట్టి ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు సాగిస్తున్నారు. కావాలంటే మీరూ కొనుక్కోవచ్చు. లేదంటే ఆ స్ఫూర్తితో ఇలానే ఏదైనా కొత్త ఆవిష్కరణకు శ్రీకారమూ చుట్టవచ్చు. -
ఇంటిప్స్
లెదర్ చెప్పులు, షూస్, హ్యాండ్ బ్యాగ్‌లు కొత్తవాటిలా మెరవాలంటే... వాటి మీద పట్టిన దుమ్ము తుడిచి ఆ తర్వాత ఉల్లిపాయ తొక్కలతో రుద్దాలి. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కిరోసిన్ వేస్తే ఈగలు, దోమలు రావు. ఉడెన్ ఫర్నిచర్‌ను పేపర్‌తో తుడిస్తే పాలిష్ చేసినట్లు మెరుస్తాయి. పేపర్‌తో తుడవడం వల్ల సందుల్లోని దుమ్ము పూర్తిగా వదలదు. కాబట్టి ముందుగా మెత్తటి క్లాత్‌తో తుడిచి తర్వాత పేపర్‌తో తుడవాలి. -
మెట్రో కథలు
సండే మార్నింగ్... అలిగి పడుకుని ఉంది.ఏడుస్తూ ఉన్నాడు. మధ్యలో నాకొచ్చింది చావు అనుకున్నాడు. పదయ్యింది. మార్కెట్‌కు వెళ్లి చేపలు తెచ్చాడు. చేపలు అంటే చేపలు కాదు. ఒక్కటే వచ్చింది. కిలోంపావు. నూట నలభై ఇచ్చి మళ్లీ శుభ్రం చేసిచ్చినందుకు పది రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. కాస్త కరివేపాకు వేసి వీలుంటే మామిడికాయ తగిలించి కూర చేస్తే అందాక పేపర్ చదువుకుంటూ సండే మేగజీన్స్ తిరగేస్తూ టివీలో ఏదైనా ఉంటే చూస్తూ తిని పడుకుని సాయంత్రం సినిమాకు తీసుకెళదామనుకుంటే ఈ రచ్చ మొదలు. ఎందుకనో ఈ మధ్య ఆదివారం వస్తే చాలు భయమేస్తూ ఉంది. ఇద్దరికీ కుదిరేది ఆ ఒక్కరోజే. తక్కిన అన్ని రోజులూ ఆఫీసుకు వెళ్లిపోగా వాడు స్కూల్‌కు వెళ్లిపోగా ముగ్గురూ కలిసి ఉండేది ఆ ఒక్కరోజే. ఆ రోజైనా సరదాగా ఉందామంటే ఏదో ఒకటి నస. పోయిన ఆదివారం బీరువా తెరిచి చీరలన్నీ చూపించింది. చూడండి... ఇందులో ఒక్కటైనా ఫంక్షన్స్‌కు కట్టుకెళ్లేదిగా ఉందేమో చూడండి అంది. చీరలకు తీసుకెళితే జాకెట్లు ఇవ్వడానికి దర్జీ దగ్గరకు తీసుకెళ్లలేదని అదో అలక. అదంతా అయితే దాపున ఉండే అంగళ్లలో కూరగాయలు మండిపోతున్నాయనీ రైతుబజార్‌కు వెళ్లి వారానికి సరిపడా ఒకేసారి తెస్తే బాగుంటుందనీ... ఇవాళ బాల్ది వచ్చింది. దానికి గాలి తగ్గిపోయి మూలన పడేసి ఉన్నాడు. సాధారణంగా ఆడడు. ఇవాళ ఉదయం నుంచి గాలి కొట్టించమని అడుగుతున్నాడు. కింద ఆడుకుంటాడట. నువ్వూ రా నాన్నా అనంటే సరే అని బాల్కి గాలి కొట్టించి ఆడుకుందామని బయలుదేరబోయాడు. ధడేలున వచ్చి అడ్డం నిలబడి మెయిన్ డోర్ గ్రిల్ వేసి వీల్లేదు అని హూంకరించింది. అదేంటి? అదంతే. ఇవాళ మీరుంటారు. రేపటి నుంచి ఎవరుంటారు? వాడు కిందకెళితే ఎవరు కాపలా? అక్కర్లేదు కూచోండి. కోపం నషాళానికి అంటింది. అరె... పిల్లవాడు సండేపూట ఏదో ఆడుకుందామంటే వద్దంటుందేంటి. వెళితే ఏమవుతుంది? రెట్టించాడు. నాకు తెలుసు. నేను ఏమన్నా దానికి వ్యతిరేకం చేస్తారు. వాడి ముందు నన్ను పలుచన చేస్తారు... ఏడుస్తూ కూచుంది. ఆదివారం అంతా సర్వనాశనం. అమ్మ వద్దన్నందుకు... ఎందుకు వద్దంటుందో అర్థం కాక ఏడుపు ముఖం పెట్టాడు. దేవుడా. ఎందుకు రాద్ధాంతం చేస్తావు? రాద్ధాంతమా? మీకు తెలియదా... వీడేం ఆడతాడో మీకు తెలియదా? ఎంత ఆడే వీలుందో మీకు తెలియదా? సోఫాలో కూలబడ్డాడు. ఇక కిందకు వెళ్లడం జరగని పని. ఏడుస్తూ బెడ్రూమ్లోకి వెళ్లబోతుంటే లేచి సెల్ ఇచ్చింది.దీన్తో ఆడుకోరా... ఇదే నీకు గతి... దీన్తోనే చావు... ఏం చేస్తాం ఖర్మ... వెళ్లి పడుకుంది. ఇక్కడ చేరినప్పటి నుంచి చెప్తూనే ఉంది. ఇల్లు మారదామని. మారే కదా ఇక్కడకు వచ్చింది. ఇంతకు ముందు ఉన్న ఇల్లు చీకటిగా ఉండేది. పైగా చేరినప్పటి నుంచి ఉద్యోగంలో ఏవో ఒక గొడవలు. ఆరోగ్య సమస్యలు. ఇక్కడకు మారాకే అన్నీ సర్దుకున్నాయి. ఎవరో తెలిసినాయన వచ్చి వాస్తుపరంగా పర్ఫెక్ట్.... ఓనర్ గెంటితే తప్ప ఖాళీ చేయొద్దు అని చెప్పేసి వెళ్లాడు. మంచిదే. కాని ఈ సమస్య ఒకటి వచ్చిందే. ఆ రోజు ఆఫీసు నుంచి వచ్చే సరికి కణత దగ్గర పసుపూ పౌడర్ రాసుకుని ఉన్నాడు. సోఫా మీద గెంతాడట. మొన తగిలిందట. కొంచెం నెత్తురు కూడా వచ్చిందట. వంట చేయకుండా ఒళ్లో కూచోపెట్టుకుని ఉంది. ఆడే వీలు లేకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు అంది కళ్లు తుడుచుకుంటూ. ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తుంది. ఆ తర్వాత వంట పని ఎలాగూ ఉంటుంది. ఒక్కడే కిందకు పోతానంటే పంపదు. అలాగని ఇంట్లో అల్లరి చేస్తే సహించలేదు. ఒక్కోసారి దెబ్బలు తగిలించుకుంటాడు. ఇంకోసారి తనే నాలుగు బాదుతుంది.పోనీ పక్క ఫ్లాట్ వాళ్ల దగ్గరికైనా పంపవచ్చు కదా... ఆడుకొని వస్తాడు కదా? వాళ్లెందుకు పెట్టుకుంటారు? వాళ్ల పిల్లలను ఎక్కడకు తరుముదామా అని చూస్తుంటారు... అది నిజమే. ఆలోచిస్తే తామెలా పెరిగామా అని ఇద్దరికీ ఆశ్చర్యమే. ఇద్దరూ నలుగురు పిల్లల జనరేషన్ నుంచి వచ్చినవాళ్లే. నలుగురు పిల్లలకు అమ్మ అన్నం అయితే పెట్టుంటుంది కాని సాకింది మాత్రం తలా ఒకరు. పక్కింటి వాళ్లు... మేనత్తలు... బాబాయ్‌లు... అమ్మమ్మ... పొద్దున లేచి బయటికెళితే మళ్లీ అన్నం టైమ్‌కి తప్ప ఎవరూ గుర్తొచ్చేవారు కాదు. ఇప్పుడు అలా ఎక్కడా? నయం మగపిల్లాడయ్యాడు. ఆడపిల్ల అయితే అయిదు నిమిషాలు కూడా వదిలే వీలుండదు. ఉద్యోగానికి వెళ్లే ధైర్యం కూడా చేసుండేదాన్ని కాదు అంటుంది. మళ్లీ- మగపిల్లాణ్ణి కూడా పంపే వీల్లేదంట లేండి... ఇవాళ రేపు మగపిల్లల్ని కూడా నాశనం పట్టిస్తున్నారట. ఎవర్ని నమ్మగలం అంటుంది. ఏమిటి విరుగుడు? పాత ఫ్లాట్ కృష్ణకాంత్ పార్క్ దగ్గరగా ఉండేది. ఆదివారం ఆదివారం తప్పనిసరిగా తీసుకెళ్లేవారు. శక్తి కొద్దీ పరిగెత్తేవాడు. శక్తి కొద్దీ కింద దొర్లేవాడు. శక్తి కొద్దీ అన్నీ ఆడి మరో వారం దాకా అక్కర్లేనట్టుగా అలసిపోయేవాడు. ఇప్పుడు కుకట్పల్లి వైపు వచ్చారు. ఒక్క పార్కు లేదు. అసలు పార్కు ఒక అవసరమని భావిస్తున్నట్టుగా కూడా లేదు. పార్కు ఒక హక్కు అనే మాట చాలా పెద్దది. ఈ అపార్ట్మెంట్ రోడ్డు మీదే ఉంది. బయటకు రావడానికి లేదు. ట్రాఫిక్. గ్రౌండ్ ఫ్లోర్లో ఆడదామంటే బిల్డర్ కక్కుర్తి పడి వాచ్మెన్ రూమ్ కాకుండా ఇంకో రెండు గదులు కట్టి అమ్మేశాడు. కార్లు స్కూటర్ల పార్కింగ్‌కే స్థలం లేదు. వాటి మధ్య ఆడాలంటే ఏ కారు ఎక్కేస్తుందో అని భయం. కిందకెళతానమ్మా అని ఎంత ఏడ్చినా పంపదు. సరే కారిడార్‌లో ఆడతాను అంటాడు. కారిడారా అది? స్లమ్‌లో కూడా అంత ఇరుకు దారులు ఉండవు. ఇంటి ముందు రెండు కుండీలు పెట్టుకుంటే చెప్పుల స్టాండ్ పెట్టుకుంటే ఒక మనిషి నడిచే వీలే ఉంటుంది. ఇంకో మనిషి ఎదురు వస్తే ఆగి పక్కకు వాలి... పిల్లలందరికీ సైకిళ్లు ఉన్నాయి. అన్నీ ఫ్లాట్ల బయట పడి ఉంటాయి. ఎవరూ తొక్కరు. తొక్కే వీలు కూడా లేదు. ఒకవేళ తొక్కినా తగాదాలు. బాల్ డోర్‌కు తగిలిందని చాలా స్నేహంగా ఉండే మనిషే- ఫోర్ నాట్ టూ ఆమె- భయంకరంగా తగాదాకి వచ్చింది. ఇంకొక ఆమె బాల్ దాచేసింది. దాని బదులు సెల్ దోసిట్లో పడేస్తే మేలు కదా అని అదొకటి నేర్చుకుంది. సర్లే. వదిలెయ్. వంట చేయరాదా?... జవాబు చెప్పలేదు. నిన్నే. నాకు విసుగ్గా ఉందండీ... సెకండ్ చైల్డ్ కావాలనుకుంటే తనే వద్దన్నాడు. అదొక అసంతృప్తి ఉంది. ఒక్కణ్ణి సక్రమంగా పెంచగలిగితే చాలు... మన సంపాదనకు అదే గొప్ప అన్నాడు. ఈ మధ్య అది గుర్తు చేస్తోంది. ఇంకొకరిని కనుంటే తోడుగా ఆడుకునేవాడు కదా. ఒంటరిగా మిగిలేవాడు కాదు కదా. చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదట. పెళ్లైన కొత్తల్లో చెప్తుండేది. జామకాయలు కోసేదట. నేరేడు పండ్లు రాల్చేదట. పక్కనే చిట్టడవి ఉంటే స్నేహితురాళ్లతో రేగుపండ్ల కోసం వెళ్లేదట. తేగలు తవ్వేదట. చేలల్లో ఆటలు... తోటల్లో పరుగులు... నా కడుపున పుట్టినవాడు ఇలా మిగిలాడు అని ఏడుస్తుంది. ఏం చెప్పగలడు. ఖాళీ స్థలాలు లేవు. ఉన్నా గోడలు కట్టి కాపలా పెడతారు. స్కూళ్లల్లో ఆడిస్తారా అంటే అవి జైళ్ల కంటే ఘోరం. ఫ్లాట్ల పరిస్థితి ఇదీ. పిల్లలతో సంతోషం అంటారు. పిల్లలు సంతోషంగా ఉంటే కదా సంతోషంగా ఉండటానికి. చేపలు ఫ్రిజ్‌లో పెట్టాడు. గదిలోకి చూస్తే ముఖం డిజప్పాయింటెడ్గా పెట్టి సెల్‌తో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకో గదిలో మాట పలుకూ లేని అలక. మధ్యాహ్నానికి దరిద్రమైన పార్శిల్ భోజనం తప్పేలా లేదు. మళ్లీ సోఫాలో కూలబడ్డాడు.ఎదురుగా టీపాయ్ మీద న్యూస్‌పేపర్ కనిపిస్తూ ఉంది. ఆకాశ హర్మ్యాలు కడతారట. ఏవేవో స్థలాలు ఎవరెవరికో ధారపోస్తారట. పిల్లలకు గుప్పెడు స్థలం ఇస్తామని ఎవరూ అనడం లేదే. దేవుడు వెంటనే రియాక్ట్ అవుతాడన్న నమ్మకం లేదు. కాని పిల్లలు ఆడుకునే వీలున్న నగరం కోసం ప్రశాంతమైన ఆదివారపు ఉదయాల కోసం ముడుపు కట్టాలని మాత్రం అనిపించింది. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
ఫన్ అండ్ ట్రెండ్
సన్డే... వారానికోసారి వచ్చిపోయేదేగా అని లేజీగా ఇంటికే లాకయ్యి... బోర్‌గా ఫీలయ్యేవారికి కాస్తంత ఫన్... ఇంకాస్త ట్యాలెంట్‌ను మిక్స్ చేసి పర్ఫెక్ట్ ప్యాకేజీని అందించింది బంజారాహిల్స్ లామకాన్. మొబైల్ ఫోన్లు చేతిలోకొచ్చాక... డిజిటల్ కెమెరాలు అందుబాటులో ఉన్నాక... ‘క్లిక్’లు అందరూ కొడుతున్నారు. కానీ... అవి ప్రత్యేకంగా... కళాత్మకంగా ఉండాలంటే..! ఆ క్లిక్ ట్రిక్స్‌ను వంటబట్టించుకున్నారు అమెచ్యూర్స్. పేపరంటే చదువుకొనే వస్తువే కాదని... దాంతో క్రియేటివ్ ఆబెక్ట్స్ ఎన్నో చేయవచ్చని తెలుసుకున్నారు బుడతలు. ‘క్లిక్’ ఆన్ ‘చేతిలో కెమెరా ఉంటే ఎవరైనా ఫొటోలు తీసేస్తారు. కానీ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అనిపించుకోవాలంటే అంతకు మించి ఆలోచించాలి. ఆపై దాన్ని ఆచరణలో పెట్టాలి’ అంటున్నారు ప్రొఫెషనల్ ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ మను బైద్వాన్. ఫొటోగ్రఫీ అంటే ఇష్టపడే యువత కోసం ఆయన ‘బేసిక్స్ ఆఫ్ ఇమేజ్ ఎడిటింగ్ అండ్ పోస్ట్ ప్రాసెసింగ్’ వర్క్‌షాప్ నిర్వహించారు. ‘ఫొటోగ్రఫీలో మూడు స్టేజీలుంటాయి. ప్రీ ప్రాసెసింగ్, ఫొటోగ్రఫీ, పోస్ట్ ప్రాసెసింగ్. ముందుగా తీయాలనుకున్న ఫొటో ఎప్పుడు, ఎక్కడ అనేది నిర్ణయించుకోవాలి. ఇది ప్రీ ప్రాసెసింగ్. మనమేం తీయాలనుకున్నామో ఇమాజిన్ చేసుకున్నాక దాన్ని ఏ మాత్రం తేడా లేకుండా కెమెరాలో బంధించడానికి ప్రయత్నించాలి. అలా చేస్తే సగం సక్సెస్ అయినట్టే. ఆ తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్‌లో ఇమేజ్ను మరింత అందంగా చూపించేందుకు కలర్, బ్రైట్నెస్, ఎఫెక్ట్స్ వంటివి వాడతాం. ఫొటోగ్రఫీలో కూడా వీక్లీ, సీజనల్, ైనె ట్ క్లిక్ లాంటి చాయిస్‌లు ఉంటాయి. అప్‌కమింగ్ ఫొటోగ్రాఫర్స్ వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఒక్కసారి ఫోకస్ అలవాటు అయ్యాక ల్యాండ్‌స్కేప్, ైవె ల్డ్, ఫ్యాషన్, ప్రొడక్ట్ బే స్డ్, ఆటోమొబైల్ ఫొటోగ్రఫీల్లో ఏదో ఒకదానిపై దృష్టి పెడితే కీర్తితో పాటు కెరియర్‌కు ఎటువంటి ఢోకా ఉండదు’ అని చెప్పారు మను. నయా ఆర్కిటెక్ట్ ‘ఖాళీగా పేపర్ దొరికితే ఏం చేస్తారు? మహా ఐతే ఏదో ఒకటి రాస్తాం లేదంటే పడేస్తాం అంటారా... కానీ నాకిచ్చి చూడండి దాంతో జెట్, ట్యాంకర్, కారు, గన్, స్నేక్, స్కూల్ బ్యాగ్‌తో సహా ఇంకా ఎన్నో చేసి చూపిస్తా’ అంటున్నాడు పదకొండేళ్ల సాయిఆదర్శ్. తనతోటి పిల్లలకు కూడా ఆ విద్యను నేర్పిస్తూ పేరును సార్థకం చేసుకుంటున్నాడు. కాగితాలతో రకరకాల వస్తువులను తయారు చేయడం ఒక కళ. దీన్నే ‘ఆరిగామీ’ అంటారు. ‘కార్టూన్స్ బాగా ఇష్టం. టీవీలో కార్టూన్ షోస్ చూసినప్పుడు నాకు అలాంటి బొమ్మలే చేయాలనిపించేది. సో... ఆరిగామీ నేర్చుకున్నా. బైక్ నుంచి జెట్, షిప్స్ వరకు ఏదైనా ఇట్టే తయారు చేయగ లను. స్కూల్‌కు వెళ్లను. ఇంట్లోనే చదువుకుంటున్నా’... అంటున్న ఆదర్శ్ లామకాన్‌లో తనలాంటి చిన్నారులకెందరికో ఈ ఆర్ట్‌లో మెళకువలు నేర్పాడు. కార్పొరేట్ కల్చర్ జాడ్యంలో తన కుమారుడు చాలాసార్లు ఒత్తిడికి లోనవ్వడం తనను బాధించిందని, అందుకే వాడిని స్కూలు మాన్పించి... ఇంట్లోనే చదివిస్తున్నానని చెప్పారు ఆదర్శ్ తండ్రి యుగంధర్. వాడి ట్యాలెంట్‌ను అందరికీ పరిచయం చెయ్యాలన్నదే తన కోరికన్నారు. -
పత్రికల ధోరణి మారాలి
నేల విడిచి సాము చేసే తీరు మార్చుకోవాలి ‘మన తెలంగాణ’ ఆవిష్కరణ సభలో సీఎం కేసీఆర్ ప్రజలను చైతన్య పరిచే వార్తలు రాయాలి తెలంగాణవారికి పత్రికలు నడపడం రాదన్నందుకే దురుసుగా మాట్లాడా సాక్షి, హైదరాబాద్: ‘కొన్ని పత్రికలు నేల విడిచి సాము చేస్తున్నాయి. మేము రాసిందే వార్త అనే ధోరణిలో కొన్ని.. మాతో మంచిగా ఉండకుంటే వ్యతిరేక వార్తలు రాస్తామనే తీరుతో కొన్ని ఉన్నాయి. ఇదో విషవలయంగా మారింది. పత్రికా లోకానికి నా విజ్ఞప్తి ఒక్కటే. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో అనవసర అపోహలు, సందేహాలు లేవనెత్తకుండా ప్రజలను చైతన్యపరిచేలా వార్తలు రాయాలి. సమాజానికి కరదీపికలు, వైతాళికులు పాత్రికేయులే’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ‘మన తెలంగాణ’ పత్రికతోపాటు పత్రిక వెబ్‌పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో రాత రాసినా, గీత గీసినా, బొమ్మ చూపినా మేమే అనే తరహాలో ఉద్యమ వ్యతిరేక శక్తులు వ్యవహరించాయని, కానీ ఉద్యమ తీవ్రత వారి అభిప్రాయాన్ని పటాపంచలు చేసిందన్నారు. తెలంగాణ వారికి పత్రికలు నడపటం వచ్చా? అనే మాటలు వినాల్సి వచ్చిందని, వాటికి ధీటుగా సమాధానం చెప్పేందుకే తాను కొన్ని సందర్భాల్లో దురుసుగా మాట్లాడాల్సి వచ్చిందని, అవి దురుద్దేశంతో మాట్లాడిన మాటలు కాదని చెప్పారు. రాష్ట్రంలో కొన్ని కుల పత్రికలు, కొన్ని గుల పత్రికలున్నాయంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన మరోసారి గుర్తుచేశారు. మన తెలంగాణ పత్రిక తెలంగాణ కళ్లతో తెలంగాణను చూసి తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా ఉండాలని సూచించారు. ఆలపాటి ధర్మారావు డిప్యూటీ స్పీకర్‌గా ఉండగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తాను వ్యవసాయంపై అసెంబ్లీలో 78 నిమిషాలపాటు మాట్లాడితే తెల్లారి పత్రికల్లో నాలుగు లైన్ల వార్తే రాశారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. సభలో బుక్కో, బాటిలో విసిరితే పత్రికలు బ్యానర్ వార్తగా రాస్తున్నాయని, ఈ పద్ధతి మారాలన్నారు. పిడివాదంతో ఉంటారని అనుకునే కమ్యూనిస్టులు తెలంగాణ ఏర్పాటుతో ఆలోచన తీరు మార్చుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. మార్పునకు అనుగుణంగానే: ఎడిటర్ రాజకీయ పరిణామాల్లో వచ్చిన మార్పుతో పత్రికలు అవలంభిస్తున్న ధోరణి చూశాక ‘మన తెలంగాణ’ పత్రికను ప్రారంభించాలనే ఆలోచన వచ్చిందని పత్రిక సంపాదకులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ యాజమాన్యం ఉండే పత్రికలు రావాలన్న కేసీఆర్ మాటలు కూడా ప్రేరణ కలిగించాయన్నారు. ‘విశాలాంధ్ర’పై ఉన్న సీపీఐ పత్రిక ముద్రను చెరిపేందుకు, ప్రజలు కోరుకునేలా పత్రిక ఉండాలనే ఉద్దేశంతో ‘మన తెలంగాణ’ను ప్రారంభించామన్నారు. పత్రిక 18 నెలల మనుగడ సాగించాకే ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే నిబంధన నుంచి మినహాయింపునిస్తూ తమ పత్రికకు ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకే, కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ తెలంగాణశాఖ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కీర్తిస్తూ పాట రాసిన సుద్దాల అశోక్‌తేజ, దాన్ని ఆలపించిన వందేమాతరం శ్రీనివాస్, మన తెలంగాణ పత్రికపై గోరటి వెంకన్న రాసిన పాటను ఆలపించిన తెలంగాణ ప్రజానాట్యమండలి ప్రతినిధిని సీఎం శాలువాలతో సత్కరించారు. -
కాగితం కరెన్సీని మొదట ఉపయోగించినవారు ఎవరు?
ద్రవ్యం - భావనలు: సమాజంలో ప్రతి పరిణామంలో కీలక పాత్ర పోషించే ద్రవ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుత నాగరిక సమాజంలో ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టే వివిధ పనులకు ద్రవ్యం అవసరం తప్పనిసరి. ప్రాచీనకాలం నుంచి ఉన్న ద్రవ్య రూపాలను, ద్రవ్య విధులను, ద్రవ్య రకాలను, ద్రవ్య విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. - సమాజాభివృద్ధికి ఊతమిచ్చే ఈ ద్రవ్యం పూర్వకాలంలో వాడుకలో లేదు. ద్రవ్యం వినియోగంలోకి రాకముందు వస్తు వినిమయ పద్ధతి ఉండేది. దీన్నే వస్తుమార్పిడి పద్ధతి, బార్టర్ పద్ధతి అని పిలిచేవారు. - ఒక వ్యక్తి తన దగ్గరున్న ఒక వస్తువును ఇంకొకరికి ఇచ్చి దానికి బదులుగా అతని దగ్గరున్న తనకు కావాల్సిన మరొక వస్తువును పొందడాన్ని వస్తుమార్పిడి పద్ధతి అంటారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు తమకు కావాల్సిన వస్తువులను పరస్పరం మార్చుకుంటారు. ఆధునిక కాలంలో ప్రతిరంగంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో వస్తుమార్పిడి పద్ధతి ఆచరణలో అసౌకర్యంగా ఉండడం వల్ల పరస్పర మార్పిడి కోసం ద్రవ్యమనే ఉమ్మడి కొలమానాన్ని ప్రవేశపెట్టారు. ద్రవ్యం- నిర్వచనం ద్రవ్యాన్ని ఆంగ్లంలో మనీగా పిలుస్తారు. మనీ అనే పదం ‘మానెటా’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. రోమన్లు తమ ఆరాధ్యదేవతైన జునో మొనేటా ఆలయంలో నాణేలను ముద్రించడం వల్ల ఆ లాటిన్ పదం ఉత్పన్నమైందని తెలుస్తోంది. ద్రవ్యమంటే మార్పిడి మాధ్యమంగా, విలువల కొలమానంగా అందరూ అంగీకరించి ఉపయోగించేది. అంటే ద్రవ్యాన్ని ఉపయోగించే వారందరితో అది ఆమోదం పొంది ఉండాలి. - సెలిగ్మేన్ అనే ఆర్థికవేత్త ప్రకారం సర్వాం గీకారం పొందిందే ద్రవ్యం. - వాకర్ అభిప్రాయం ప్రకారం ద్రవ్యవిధులను నిర్వహించేదే ద్రవ్యం. (Money is what money does) ద్రవ్యం- పరిణామక్రమం పురాతన కాలం నుంచి ద్రవ్యం వివిధ రూపాలుగా రూపాంతరం చెందుతూ చలామణీలో ఉంది. వస్తురూప ద్రవ్యం: తొలిగా వస్తువు ద్రవ్య రూపంగా ఉండేది. ధాన్యం, పండ్లు, గవ్వ లు, బట్టలు, జంతువుల చర్మాలు, దంతాలను ద్రవ్యంగా వాడేవారు. ప్రపంచంలో చాలాచోట్ల ఇవి వాడుకలో ఉండేవి. మన దేశంలో ఆర్య నాగరికత (వేద నాగరికత) కాలంలో గోవులను ‘గోధనం’గా భావించి ద్రవ్యంగా ఉపయోగించేవారు. వీటిని వినిమయ సాధనాలుగా భావించేవారు. లోహ ద్రవ్యం: లోహ పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత లోహాలతో చేసిన నాణేలు అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటగా క్రీ.పూ.700లో లిబియా ప్రాంతంలో నాణేలను ద్రవ్య రూపాలుగా జారీ చేశారు. రోమన్లు ‘బిసాంత్’ అనే బంగారు నాణేలను, మౌర్యులు ‘పానా’ అనే వెండి నాణేన్ని ద్రవ్యంగా వాడేవారు. కాలక్రమంలో ఇత్తడి, రాగి, కంచు, నికెల్, స్టీల్ నాణేలను ప్రవేశపెట్టారు. కాగితం ద్రవ్యం: ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెన్సీ ‘కాగితం’. ప్రపంచమంతా కాగితం ద్రవ్యమే అమలులో ఉంది. వీటితో పాటు నాణేలు (coins) కూడా ఉపయోగిస్తున్నారు. ఇంతకుముందు దేశంలో బంగారు నిల్వల ఆధారంగా ఆ దేశ కేంద్ర బ్యాంక్ నోట్లను ముద్రించి విడుదల చేసేది. ప్రస్తుతం బంగారంతో సంబంధం లేకుండానే ద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. మధ్యయుగం నాటి చైనాలో ‘సుంగ్’ వంశ రాజుల కాలంలో మొదటిసారిగా కాగితం ద్రవ్యం చలామణీలోకి వచ్చింది. పరపతి ద్రవ్యం (Credit money): దీనినే అప్పు ద్రవ్యం అంటారు. ఈ ద్రవ్యాన్ని బ్యాంకులు సృష్టిస్తాయి. అందువల్ల బ్యాంక్ ద్రవ్యం అని కూడా అంటారు. ఇంతకు ముందు బంగారం నిల్వ ఉంచుకొని కరెన్సీ విడుదల చేసే విధంగానే బ్యాంకులు కరెన్సీని నిల్వ (బ్యాంక్ డిపాజిట్లు) గా ఉంచుకొని పరపతి ద్రవ్యాన్ని జారీ చేస్తాయి. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులను ఈ ద్రవ్యానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. సమీప ద్రవ్యం: ద్రవ్యానికి బదులుగా ద్రవ్యత్వం కల్పించేవాటిని సమీప ద్రవ్యం అంటారు. హుండీలు, ట్రెజరీ బిల్లులు, బాండ్లు మొదలైనవాటికి ద్రవ్యం ఆపాదించడం వల్ల అవి ద్రవ్యానికి ప్రత్యామ్నాయాలుగా మారతాయి. వీటికి ద్రవ్యానికి ఉండే లక్షణాలే ఉంటాయి. ద్రవ్యం రకాలు: ద్రవ్యాన్ని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు. 1. న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం కేంద్ర బ్యాంక్ (ఖఆఐ) జారీ చేసిన ద్రవ్యాన్ని న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యంగా భావించవచ్చు. ఇది చట్టసమ్మతమైంది. అంటే దీన్ని చెల్లింపుల మాధ్యమంగా ఎవరూ తిరస్కరించడానికి వీలు లేదు. ఈ న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం రెండు రకాలు. పరిమిత చట్టబద్ధ ద్రవ్యం: ద్రవ్యాన్ని కొంత పరిమితి వరకే అంగీకరించేది పరిమిత చట్టబద్ధ ద్రవ్యం. ఆ పరిమితిని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పరిమితికి మించి ద్రవ్యాన్ని ఆమోదించమని ఒత్తిడి చేయడం నేరం. ఉదా॥భారతదేశంలో తక్కువ విలువ ఉన్న నాణేలైన 5, 10, 20, 25 పైసల నాణేలను * 25 పరిమితికి మించి తీసుకొమ్మని ఎవరినీ బలవంతం చేయకూడదు. వినియోగదారుడు అమ్మకందారుడికీ *25 రూపాయలకు మించి చిల్లర నాణేలు ఇస్తే అమ్మకందారుడు అంగీకరించాల్సిన అవసరం లేదు. అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం: ఈ ద్రవ్యాన్ని ఎంతమొత్తమైనా, ఎలాంటి పరిమితి లేకుండా వినిమయానికి అందరూ అంగీకరించాలి. అంగీకరించకపోతే నేరం. ఉదా॥భారతదేశంలో * 50 పైసలకు మించిన విలువ గల నాణేలను, 1 రూపాయి నుంచి * 1000 నోటు వరకు ఉన్న కరెన్సీని ఎంత మొత్తమైనా స్వీకరించాలి. 2. ఇచ్ఛాపూర్వక ద్రవ్యం (చట్టబద్ధం కాని ద్రవ్యం): ఈ ఐచ్చిక ద్రవ్యానికి చట్ట సమ్మతి లేదు. ఇది నమ్మకం, విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ద్రవ్యాన్ని అంగీకరించకపోయినా నేరం కాదు. చెక్కులు, డ్రాఫ్టులు, డిబెంచర్లు, షేర్లు, క్రెడిట్ కార్డులు, హుండీలు (బిల్ ఆఫ్ ఎక్స్ఛేంజ్) మొదలైన వాటిని ఐచ్చిక ద్రవ్యంగా పరిగణించవచ్చు. ఈ ద్రవ్యాన్ని బ్యాంక్ ద్రవ్యం, దగ్గర ద్రవ్యం అని కూడా అంటారు. చెక్కులు: ఖాతాదారుడు (వినియోగదారు డు) తన బ్యాంకులో జమచేసిన సొమ్ము నుంచి తనకు, తను సూచించిన వ్యక్తికి తను కోరిన సొమ్మును జారీ చేయమని కోరడమే చెక్కు. ఖాతాదారుడు తన అకౌంట్లో తగినంత ద్రవ్యం ఉన్నప్పుడే చెక్కులు చెల్లుతాయి. లేకపోతే బ్యాంకులు చెక్కులను తిరస్కరిస్తాయి. వినిమయ మాధ్యమంగా చెక్కులు ఉపయోగపడుతున్నాయి. డ్రాఫ్టులు: వీటిని బ్యాంకులు జారీ చేస్తాయి. వ్యక్తులు, సంస్థల నుంచి సొమ్మును, దానికి నిర్ధారించిన కొంత కమిషన్ సొమ్మును తీసుకున్న బ్యాంకులు, వారు కోరిన విధంగా, కోరిన వారి పేరుపై, వారు చెల్లించిన సొమ్ము మేరకు డ్రాఫ్టులు జారీ చేస్తాయి. వినియోగదారుడు (డ్రాఫ్టులపై పేరు గలవారు) తన బ్యాంక్‌లో ఆ డ్రాఫ్ట్‌ను సమర్పించి అంతే సొమ్మును డిమాండ్ చేసి తీసుకోవచ్చు. అందుకే దాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ (డి.డి) అంటారు. చెక్కుల కంటే డ్రాఫ్టులు ఆమోదయోగ్యమైనవి. ఎందుకంటే సొమ్మును ముందే చెల్లిస్తారు కాబట్టి బ్యాంకుల నుంచి చెల్లింపులు నిర్ధారణగా జరుగుతాయి. బాండులు: ద్రవ్యం మూల్యనిధి కాబట్టి ప్రజలు తమ వద్ద కొంత డబ్బును నిల్వ ఉంచుకుందామని ఆశపడతారు. డబ్బును ఆర్థిక సెక్యూరిటీల రూపంలోనైనా భద్రపరుచుకోవాలని అనుకొంటారు. అందుకు బాండు సరైన ఆర్థిక సెక్యూరిటీ ఇస్తుంది. బాండు అంటే బేరరు (వినియోగదారుడు)కు కొంత నిర్ణీతకాలం తర్వాత నిర్ణీత వడ్డీతో కలిపి చెల్లిస్తామని వాగ్దానం చేసే కాగితం పత్రం. అవసరమైతే వీటిని బ్యాంకుల్లో కుదవపెట్టి దానిపై రుణాలను తీసుకోవచ్చు. వీటిని మన దేశంలో ఆర్బీఐ లేదా దాని అనుమతి పొందిన సంస్థలు, తపాలా కార్యాలయాలు (N పత్రాలు, ఇందిరా వికాస పత్రాలు) జారీ చేస్తాయి. డిబెంచర్లు: ఇవి కూడా బాండ్లలాంటివే. వీటిని కంపెనీలు, సంస్థలు ఒక నిర్ణీత వడ్డీతో జారీ చేస్తాయి. డబ్బు అవసరమైనప్పుడు బేరర్ వాటిని ఇతరులకు అమ్మవచ్చు. వాటిని గుర్తించిన సంస్థల్లో తనఖాపెట్టి అప్పు కూడా తీసుకోవచ్చు. బ్యాంక్ క్రెడిట్ కార్డులు: బ్యాంకులు ఎంపిక చేసిన కొంతమంది ఖాతాదారులకు, వారి కోరికమేరకు క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి. ఈ కార్డుదారులు ఎంపిక చేసిన వ్యాపార సంస్థల్లో బిల్లులు చెల్లించడానికి వీటిని ఉపయోగిస్తారు. వారు బిల్లు మొత్తాన్ని ద్రవ్యరూపంలో చెల్లించరు. కార్డును దుకాణదారు వద్ద నున్న చిన్న మిషన్‌లో స్వైప్ చేసి, ఆ బిల్లుపై సంతకం చేస్తారు. అప్పుడు బిల్లును బ్యాంకు చెల్లించి తర్వాత వినియోగదారుడి నుంచి ఆ సొమ్మును వసూలు చేస్తుంది. నిర్ణీత కాలంలో సొమ్మును వినియోగదారుడు చెల్లించకపోతే వడ్డీతో సహా జరిమానా వేసి కార్డును జారీ చేసిన సంబంధిత బ్యాంక్ నగదు వసూలు చేస్తుంది. అయితే ఖాతాదారుడు తన అకౌంటులో ఏ మాత్రం సొమ్ము లేకపోయినా బ్యాంక్ నిర్ధారించిన మేరకు సొమ్మును ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఖర్చు చేసుకోవచ్చు. ఆధునిక ఆర్థిక లావాదేవీల్లో ఎక్కువగా ఐచ్చిక ద్రవ్యాన్నే ప్రధానమైన ద్రవ్య వినిమయంగా ఉపయోగిస్తున్నారు. అది సులువుగా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల సౌకర్యవంతమైన సాధనంగా మారింది. పైన పేర్కొన్న ఐచ్చిక ద్రవ్యంతోపాటు బిల్ ఆఫ్ ఎక్స్ఛేంజ్, హుండీలు కూడా ద్రవ్య వినిమయంగా ఉన్నాయి. ద్రవ్యం ద్రవ్యవినిమయంగానేకాకుండా విలువల కొలమానంగా, భవిష్యత్తులో చెల్లింపుల కొలమానంగా, మూల్యనిధి లేదా విలువల నిధిగా వివిధ విధులను నిర్వర్తిస్తుంది. ఈ ద్రవ్యాన్ని ముద్రించడానికి, ద్రవ్య విధానాన్ని రూపొందించడానికీ మనదేశంలో 1934 చట్టం ద్వారా రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ను ఏర్పాటు చేశారు. దేశంలో ద్రవ్యాధికారం ఉన్న ఏకైక కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ కానిస్టేబుల్ పరీక్ష దృష్ట్యా ‘ద్రవ్యం - భా వనలు’ పాఠ్యభాగాన్ని ఎలా చదవాలి? - కె.రామకృష్ణ, నల్గొండ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష దృష్ట్యా సాంఘిక శాస్త్ర ప్రశ్నల్లో 6 నుంచి 8 ప్రశ్నలు అర్థశాస్త్రం నుంచే వస్తాయి. ముఖ్యంగా 8, 9, 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లోని అర్థశాస్త్ర విషయాలను అభ్యర్థులు బాగా చదివి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈసారి ఇంటర్ స్థాయిలో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి కిందిస్థాయి పాఠ్యాంశాలలోని అర్థశాస్త్ర భావన లను ఇంటర్లో విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. వాటిని చదవడం వల్ల విషయంపై అవగాహన పెరుగుతుంది. అర్థశాస్త్ర అంశాలపై అభ్యర్థికి ఉన్న ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలే ఉంటాయి. ప్రధానంగా అర్థశాస్త్ర మౌలిక భావనలతోపాటు, జాతీయ తలసరి ఆదాయం, ఉత్పత్తి-పంపిణీ, బడ్జెట్, ప్రభుత్వ వ్యయం, ఆదాయం, ద్రవ్యం, బ్యాంకింగ్, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, సమస్యలు, పంచవర్ష ప్రణాళికల గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అడ్మిషన్స: ఐఐఎం- లక్నో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)- లక్నో కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కెల్లే స్కూల్ ఆఫ్ బిజినెస్(కేఎస్బీ), ఇండియానా యూనివర్సిటీ, యూఎస్ఏల సంయుక్తాధ్వర్యంలో ఐఐఎం- లక్నో ఈ కోర్సును నిర్వహిస్తోంది. సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్. అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 10 వెబ్సైట్: http://www.iiml.ac.in/ ఎంబీఏ ప్రోగ్రామ్ గ్వాలియర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(ఏబీవీ - ఐఐఐటీఎం) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంబీఏ ప్రోగ్రామ్ విభాగాలు: ఆపరేషన్స్, మార్కెటింగ్, ఐటీ అండ్ సిస్టమ్స్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, సోషల్ సెక్టార్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్, పబ్లిక్ సర్వీసెస్ మేనేజ్మెంట్. కాలపరిమితి: రెండేళ్లు అర్హతలు: ఏదైనా ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా సైన్స్‌లో పీజీతో పాటు డిగ్రీలో ఆపరేషన్ రీసెర్చ్/కంప్యూటర్ సైన్స్/ఎకనామిక్స్/కామర్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. ఎంపిక: క్యాట్ స్కోరు ఆధారంగా ఎంపిక చేసి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జనవరి 30 వెబ్సైట్: http://www.iiitm.ac.in/ కువెంపు యూనివర్సిటీ షిమోగాలోని కువెంపు యూనివర్సిటీకి చెందిన డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్ కోర్సులు విభాగాలు: బీఏ, బీకామ్, బీబీఎం, బీఎస్సీ. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు విభాగాలు: ఎంఏ(రెండేళ్లు): కన్నడం, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఎడ్యుకేషన్, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ. ఎమ్మెస్సీ (రెండేళ్లు): మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ. పీజీ డిప్లొమా కోర్సులు(ఏడాది): విభాగాలు: కన్నడ కంప్యూటర్స్, కన్నడ జర్నలిజం, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మార్కెట్స్. అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31 (రూ.400 లేట్ ఫీతో) వెబ్సైట్: www.kuvempuuniversitydde.org/ బొమ్మనబోయిన శ్రీనివాస్ సీనియర్ ఫ్యాకల్టీ, హన్మకొండ -
వేలిముద్రలను గుర్తించేందుకు మ్యాజిక్ పెన్ను!
నేరం జరిగిన స్థలంలో వేలిముద్రలను సేకరిస్తే నేరస్తులను పట్టుకునేందుకు, నేర నిరూపణకు కీలక ఆధారం దొరికినట్లే. అందుకే.. పెట్రో లు పంపులు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, ఏటీఎంలు, తదితర చోట్ల బిల్లులు ముద్రించేందుకు ఉపయోగించే థర్మల్ కాగితాలపై సైతం నేరస్తుల వేలిముద్రలను గుర్తించేందుకు ఉపయోగపడే ఓ సరికొత్త మ్యాజిక్ పెన్నును ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌కు చెందిన డాక్టర్ జాన్ బాండ్ రూపొందించారు. సాధారణంగా థర్మల్ కాగితాలు వేడి తగలగానే రంగు మారతాయి. అలాగే ఈ కాగితంపై ప్రత్యేక రసాయనం ఉండే ఈ పెన్నుతో మార్కర్‌లా గీస్తే.. ఆ కాగితంపై రసాయన చర్యల్లో మార్పులు వస్తాయట. ఆ మార్పులను ప్రత్యేక కాంతిని ప్రసరించడం ద్వారా పరిశీలించి వేలిముద్రలను గుర్తించవచ్చట. వాడేందుకు సులభంగా ఉండే ఈ మ్యాజిక్ పెన్ను నేర దర్యాప్తులో ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులకు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. -
ప్రజా ప్రయోజనాలకు పట్టంకట్టే.. డెవలప్మెంట్ జర్నలిజం
పత్రికలో ప్రచురితమైన వార్త ప్రభుత్వాన్ని కదిలిస్తుంది. టీవీలో ప్రసారమైన కథనం అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. రేడియోలో వచ్చిన కార్యక్రమం ప్రజలను చైతన్యపరుస్తుంది. పాత్రికేయానికి ఉన్న శక్తి ఇది. సామాజిక బాధ్యత ఉన్న వృత్తి జర్నలిజం. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి, సమాజానికి మేలు చేయాలనుకునే సేవాతత్పరులకు సరైన కెరీర్.. డెవలప్మెంట్ జర్నలిజం. వృత్తిపరమైన సంతృప్తి సాధారణంగా జర్నలిజం పరిధిలోకి రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, వ్యాపార, సినిమా.. ఇలా అన్ని రంగాలూ వస్తాయి. కానీ, డెవలప్మెంట్ జర్నలిజంలో మాత్రం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికం, పర్యావరణం, వ్యవసాయం, ఆరోగ్యం, పరిశుభ్రత, లింగ వివక్ష, మౌలిక సదుపాయాలు, రహదారుల భద్రత, విద్య, మానవ హక్కులు.. ఇలా మానవాభివృద్ధికి సంబంధించిన రంగాలు ఉంటాయి. ఆయా రంగాల్లో సమస్యలను తెరపైకి తీసుకురావడం డెవలప్మెంట్ జర్నలిస్టుల బాధ్యత. అన్ని భాషల్లో మీడియా సంస్థలు విస్తరిస్తుండడంతో పాత్రికేయులకు అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. జర్నలిస్టులకు ప్రస్తుతం పత్రికలు, వార్తా చానళ్లు, మ్యాగజైన్లు, వెబ్సైట్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. డెవలప్మెంట్ జర్నలిస్టులకు మంచి డిమాండ్ ఉంది. మీడియా సంస్థల మధ్య పోటీ విపరీతంగా పెరగడంతో పాత్రికేయులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. వృత్తిలో ప్రతిభాపాటవాలు చూపితే సమాజంలో పేరుప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు. ఫ్రీలాన్స్‌గా కూడా పనిచేసుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులకు వృత్తిపరమైన సంతృప్తి లభిస్తుంది. కావాల్సిన నైపుణ్యాలు జర్నలిస్టులకు సామాజిక బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా భావించాలి. ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగని మనస్తత్వం అవసరం. మంచి కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఉండాలి. వార్తలు, వార్తల్లోని జీవరేఖను గుర్తించే నేర్పు ముఖ్యం. పాత్రికేయులు నిత్య విద్యార్థిగా మారాలి. ఎప్పటికప్పుడు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఈ వృత్తిలో డెడ్లైన్లు ఉంటాయి కాబట్టి పొరపాట్లకు తావులేకుండా వేగంగా పనిచేయగలగాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులు ఆరోగ్యాన్ని నూటికి నూరు శాతం కాపాడుకోవాలి. అర్హతలు ఇంటర్మీయెట్, గ్రాడ్యుయేషన్ స్థాయిల్లో ఏ కోర్సులు చదివినా పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టొచ్చు. అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా జర్నలిస్ట్‌గా పనిచేయొచ్చు. అయితే, సోషల్ సైన్స్ కోర్సులు చదివితే ఇందులో రాణించడానికి అవకాశం ఉంటుంది. మనదేశంలో జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్లో డిప్లొమా, పీజీ డిప్లొమా తదితర కోర్సులున్నాయి. ఆసక్తిని బట్టి ఇంటర్/గ్రాడ్యుయేషన్ తర్వాత వీటిలో చేరొచ్చు. మొదట మీడియా సంస్థలో ట్రైనీగా చేరి, అనుభవం, నైపుణ్యాలను పెంచుకొని పూర్తిస్థాయి జర్నలిస్టుగా కెరీర్లో నిలదొక్కుకోవచ్చు. వేతనాలు పని చేస్తున్న మీడియా సంస్థ(న్యూస్ చానల్, వార్తాపత్రిక, మేగజైన్)ను బట్టి వేతనం అందుతుంది. ప్రారంభంలో ఏడాదికి రూ.1.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వేతన ప్యాకేజీ పొందొచ్చు. అనుభవం, పనితీరు ఆధారంగా జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తిలో ప్రతిభ చూపితే తక్కువ సమయంలో ఉన్నత హోదాలు, అధిక వేతనాలు అందుకోవచ్చు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తే రాసిన కథనాలను బట్టి ఆదాయం లభిస్తుంది. కోర్సులను అందిస్తున్న సంస్థలు 1. ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in/ 2. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.efluniversity.ac.in 3. ఎ.పి. కాలేజీ ఆఫ్ జర్నలిజం వెబ్సైట్: http://apcj.in/ 4. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్: www.braou.ac.in 5. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.iimc.nic.in 6. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం అండ్ న్యూ మీడియా వెబ్సైట్: www.iijnm.org 7. ఆసియన్ కాలేజీ ఆఫ్ జర్నలిజం వెబ్సైట్: www.asianmedia.org -
కోల్‌కతాలో 3డీ ప్రింటెడ్ దుర్గామాత!
కోల్‌కతా: విజ్ఞానాన్ని, కళను మేళవిస్తూ 3డీ ప్రింటెడ్ టెక్నాలజీ ద్వారా కాగితంతో రూపొందించిన వినూత్న దుర్గామాత విగ్రహం తొలిసారిగా కోల్‌కతాలో పూజలు అందుకోనుంది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని దుర్గామాత విగ్రహం తయారీకి కూడా వాడుకోవడం ఇదే తొలిసారని దక్షిణ కోల్‌కతాలోని జోధ్‌పూర్ పార్కు దుర్గా పూజా కమిటీ వెల్లడించింది. దుర్గ విగ్రహాలను మట్టితో చేతులతోనే రూపొందించడం సంప్రదాయం. అయితే తాము 8.5 అంగుళాల పొడవు, 14 అంగుళాల వెడల్పు ఉన్న ఈ విగ్రహాన్ని కంప్యూటర్లో డిజిటల్ డిజైన్లు, శిల్పకళ అప్లికేషన్ల సాయంతో 3డీ ప్రింటర్ ద్వారా సృష్టించామని ‘ప్రింట్జ్ వరల్డ్‌వైడ్’ డెరైక్టర్ ఉజ్జల్ మిత్ర తెలిపారు. ఇలాంటి 3డీ ప్రింటింగ్ విగ్రహం తయారీకి ప్రస్తుతం రూ.60 వేలు ఖర్చవుతుందన్నారు. -
లక్షలు విదిలిస్తేనే అక్షరాలు
ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ టెక్నో పేరిట వేలకు వేలు వసూళ్లు విలవిల్లాడుతున్న మధ్య తరగతి తల్లిదండ్రులు కానరాని ప్రభుత్వ నియంత్రణ నక్కపల్లి: పేద మధ్య తరగతి తల్లిదండ్రుల ఆశలను ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమకు అనుకూలంగా మార్చుకుం టున్నాయి. పుస్తకాలు, ఫీజుల పేరుతో వేలకు వేలు గుంజుతున్నాయి. ఎల్కేజీ విద్యార్థుల పుస్తకాల కోసం రూ.2 వేలు, ఫీజుల నిమిత్తం రూ.20 వేలు, బస్సు చార్జీల రూపేణా మరో రూ.6 వేలు, ప్రాజె క్టు పనుల కోసం మరో రూ.2 వేలు... ఇలా వేలకు వేలు గుంజుతున్నా పట్టించుకున్న నాధుడే లేడని మధ్య తరగతి వర్గాలు వాపోతున్నాయి. మా దగ్గరే కొనాలి పాయకరావుపేట, తుని పట్టణాల్లోని ప్రధాన కార్పొరేట్ విద్యాసంస్థలు వసూలు చేస్తున్న ఫీజులు, విక్రయించే పుస్తకాల ధరలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. యాజమాన్యాలే టెక్నో పేరుతో సిలబస్ తయారు చేసి వాటి పుస్తకాలను తమవద్దే కొనుగోలు చేయాలని షరతు విధిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, నోట్ పుస్తకాలు, ఎక్జామ్ ప్యాడ్స్, డైరీ, ఫైళ్లు పేరుతో ప్యాకేజీ నిర్ణయించి వేలాది రూపాయలు గుంజుతున్నారు. పాఠ్యపుస్తకాలు, స్టడీమెటీరియల్ పాఠశాలలో, నోట్ పుస్తకాలను బయట కొనుక్కుంటామంటే యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు. పాయకరావుపేట పట్టణంలోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థ పాఠ్య పుస్తకాల కోసం ఎల్కేజీకి రూ.1907, యూకేజీకి రూ.2268, ఒకటో తరగతికి రూ.3047 వసూలు చేస్తోంది. అయిదో తరగతి విద్యార్థికి రూ.4200 పైనే అవుతోంది. ఎనిమిదో తరగతి విద్యార్థికి రూ.3830, తొమ్మిదో తరగతి విద్యార్థికి రూ.3900 వసూలు చేసి పుస్తకాలను సరఫరా చేస్తున్నారు. ఫీజుల రూపేణా ఎల్కేజీ విద్యార్థికి రూ.15000, బస్సు చార్జీలుగా కిలోమీటర్ల బట్టి రూ.4 వేల నుంచి రూ.6 వేలు వసూలు చేస్తున్నారు. అయిదో తరగతి, ఆపై చదివే విద్యార్థులకు రూ.19 వేల నుంచి రూ.23 వేల వరకు, బస్సు చార్జీల కింద రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ఇవిగాక ప్రాజెక్టుల కోసం ఏడాదికి మరో రూ.3 వేల నుంచి రూ.4 వేలు దండుకుంటారు. ఈ పాఠశాలలో అయిదో తరగతి విద్యార్థి చదవాలంటే ఏటా రూ.35 వేలు ఖర్చవుతుంది. ప్రయివేటు యాజమాన్యాల వసూళ్లను అరికట్టడంపై విద్యాశాఖ దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరు తున్నారు. -
సేవే లక్ష్యంగా సివిల్స్‌కు...
సక్సెస్ స్టోరీ ఐఐటీలో బీటెక్.. ఐఐఎంలో పీజీపీఎం.. ఆ తర్వాత ప్రఖ్యాత సిటీ గ్రూప్‌లో లక్షల వేతనంతో కార్పొరేట్ కొలువు.. అయినా సామాన్య ప్రజలకు సేవ చేయాలనే తలంపు.. నాలుగేళ్లపాటు చేసిన విదేశీ ఉద్యోగాన్ని వదిలి.. స్వదేశానికి పయనం.. ఐఏఎస్ దిశగా సివిల్స్‌కు ప్రిపరేషన్.. తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్.. గురి మాత్రం ఐఏఎస్‌పైనే..! తుది లక్ష్యం దిశగా పట్టువదలని ప్రయాణం.. ఫలితం.. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు!! సివిల్ సర్వీసెస్ 2013-14 ఆల్ ఇండియా టాపర్ గౌరవ్ అగర్వాల్‌తో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ.. అమ్మ శ్రద్ధ ఎంతో: మా స్వస్థలం జైపూర్. కుటుంబంలో అందరూ విద్యావంతులే. నాన్న సురేశ్ చంద్ర గుప్తా.. జైపూర్ డెయిరీలో సీనియర్ మేనేజర్. అమ్మ సుమా గుప్తా.. గృహిణి. అమ్మ నన్ను చదివించే విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునేది. ఫలితంగా అకడెమిక్స్‌లో ఎప్పుడూ ముందుండే వాణ్ని. సేవ చేయడమే లక్ష్యంగా.. సివిల్స్‌కు: ఐఐఎం, లక్నోలో ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పీజీపీఎం 2008లో పూర్తయింది. తర్వాత సిటీ గ్రూప్‌లో క్రెడిట్ డెరివేటివ్స్ విభాగంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ (ట్రేడర్)గా ఎంపికయ్యాను. 2008 జూన్ నుంచి 2011 సెప్టెంబర్ వరకు హాంగ్‌కాంగ్‌లో క్రెడిట్ ట్రేడర్‌గా విధులు నిర్వర్తించాను. ఈ క్రమంలో ఎన్నో ఫీల్డ్ విజిట్స్.. విభిన్న సంస్కృతుల ప్రజలతో మమేకం కావడంతోపాటు వారి సాదకబాధకాలు దగ్గర నుంచి చూశాను. మన దేశంలో ప్రజలకు సేవలందించాలని అనిపించింది. ఇందుకు ఐఏఎస్ సరైన మార్గంగా కనిపించింది. దాంతో 2011 సెప్టెంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి.. స్వదేశానికి తిరిగి వచ్చాను. 2011 సెప్టెంబర్ నుంచి ప్రిపరేషన్: ఐఏఎస్ లక్ష్యంతో సివిల్స్‌లో విజయం కోసం స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత సమయాన్ని ఏ మాత్రం వృథా చేయలేదు. తొలి ప్రయత్నంలోనే ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగాను. 2012లో మొదటిసారిగా సివిల్స్ రాశాను. 2012 ప్రిలిమ్స్‌కు.. 2011 సెప్టెంబర్ నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాను. ప్రతిరోజు సగటున 10 నుంచి 12 గంటల పాటు పుస్తకాలతోనే. 2012 ప్రిలిమ్స్‌లో రెండో పేపర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు గతంలో క్యాట్ రాసిన అనుభవం బాగా కలిసొచ్చింది. అలాగే పేపర్-1 జనరల్ స్టడీస్ కోసం ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాను. గత ప్రశ్నపత్రాల పరిశీలన.. ప్రశ్నలు అడుగుతున్న తీరు.. ఆయా అంశాలకు వెయిటేజిలపై స్వీయ విశ్లేషణ ద్వారా అవగాహన పెంచుకున్నాను. ఫలితంగా ప్రిలిమ్స్‌లో విజయం సొంతమైంది. మెయిన్స్‌కు ఇలా: సివిల్స్-2012 మెయిన్స్‌లో రెండు ఆప్షనల్స్ ఉండేవి. అకడెమిక్ నేపథ్యం, పరిజ్ఞానం ఆధారంగా ఎకనామిక్స్‌ను ఒక ఆప్షనల్‌గా.. చరిత్ర సంబంధిత అంశాలు, చారిత్రక అంశాలపై సహజ ఆసక్తి వంటి కారణాలతో హిస్టరీని రెండో ఆప్షనల్‌గా ఎంచుకున్నాను. ఎకనామిక్స్‌కు కోచింగ్ తీసుకోలేదు. కానీ హిస్టరీకి ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను. ప్రతి అంశానికి సంబంధించి సొంతంగా నోట్స్ రాసుకోవడంతోపాటు ఇంటర్నెట్ రిసోర్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకున్నాను. తద్వారా జనరల్ స్టడీస్‌పై పట్టు సాధించాను. దాంతో మెయిన్స్‌లోనూ విజయం వరించింది. తర్వాత ఇంటర్వ్యూలోనూ ప్రతిభ చూపి ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. శిక్షణలో చేరినప్పటికీ.. ఐఏఎస్ లక్ష్యంగా సిద్ధమయ్యాను. ఓవైపు శిక్షణ.. మరోవైపు ఐఏఎస్ ప్రిపరేషన్: రెండో ప్రయత్నంలో ఎలాగైనా ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో నిర్దిష్ట టైం మేనేజ్మెంట్తో 2013 సివిల్స్‌కు ప్రిపరేషన్ సాగించాను. ఈ సమయంలో ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు తగ్గకుండా చదివే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాను. ఐపీఎస్ ఫౌండేషన్ కోర్సు తర్వాత ఎన్పీఏలో శిక్షణ ప్రారంభం కావడానికి, 2013 మెయిన్స్ పరీక్షలకు మధ్య కొంత వ్యవధి లభించింది. ఈ సమయంలో మెయిన్స్‌పై దృష్టిపెట్టి గతంలో చేసిన పొరపాట్లను అధిగమించేలా కృషి చేశాను. అప్పటికే సివిల్స్ పరీక్షలపై స్పష్టత రావడంతో.. ఐపీఎస్ శిక్షణ, ప్రిపరేషన్‌కు సమయం కేటాయింపు విషయంలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదు. కొత్త ప్యాట్రన్.. కంగారు అనవసరం: 2013 మెయిన్స్‌లో కొత్త ప్యాట్రన్ అమల్లోకి వచ్చింది. ఆప్షనల్‌ను ఒక సబ్జెక్ట్‌కే పరిమితం చేసి, జనరల్ స్టడీస్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. కొత్తగా ఎథిక్స్ పేపర్‌ను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా జనరల్ స్టడీస్‌కు ప్రాధాన్యం పెరగడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇక్కడ గుర్తించాల్సింది.. పాత విధానంలో ఉన్న జనరల్ స్టడీస్ అంశాలనే విభజించి వేర్వేరు పేపర్లుగా యూపీఎస్సీ పేర్కొంది. ఈ లాజిక్‌ను గుర్తిస్తే కొత్త ప్యాట్రన్ విషయంలో ఎలాంటి ఆందోళన ఉండదు. ఎథిక్స్ పేపర్లో కొంతమేర పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంశాలు ఉంటాయి. ఇలా సిలబస్‌ను ఆమూలాగ్రం పరిశీలించి విశ్లేషిస్తే మానసిక సంసిద్ధత లభిస్తుంది. ఇదే వ్యూహంతో రెండోసారి ప్రిపరేషన్ సాగించి ఇంటర్వ్యూ దశకు చేరుకున్నాను. ఇంటర్వ్యూ.. అధిక శాతం అకడెమిక్ ప్రొఫైల్‌పైనే: నా ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నలు అధిక శాతం అకడెమిక్ ప్రొఫైల్ నుంచే. మే 30న పద్మశ్రీ అవార్డ్ గ్రహీత డాక్టర్ కిలమ్ సుంగ్లా బోర్డ్ నేతృత్వంలో ఇంటర్వ్యూ జరిగింది. ప్రశ్న-సమాధానం కంటే.. ఒక చర్చ కోణంలో ఇంటర్వ్యూ సాగింది. ప్రస్తుత దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు.. వాటిని అధిగమించేందుకు మార్గాలు.. ద్రవ్యోల్బణం.. ఎస్ఈజెడ్లు అంటే ఏంటి? కొత్త ప్రభుత్వం ఎలాంటి ఆర్థికవిధానాలు అనుసరిస్తే బాగుంటుంది? భూ సేకరణ చట్టాలు.. పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన విధానాలు.. ఇలా అన్నీ ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రశ్నలే అడిగారు. వీటితోపాటు ప్రస్తుత సామాజిక పరిస్థితుల నేపథ్యంలో.. మీడియా వ్యవహరిస్తున్న తీరు, మీడియా పాత్ర, సోషల్ మీడియాతో సానుకూలతలు-ప్రతికూలతలు వంటి ప్రశ్నలు అడిగారు. కాలేజీ రోజుల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌పైనా చర్చించారు. అన్నిటికీ సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చాను. నేషనల్ బయోస్ఫియర్ రిజర్వ్స్, నేషనల్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ మధ్య తేడా ఏంటి? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేకపోయాను. మొత్తం మీద ఇంటర్వ్యూ ముగిసాక.. ఐఏఎస్‌కు అవసరమైన ర్యాంకు వస్తుందనే నమ్మకం కలిగింది. ఫస్ట్ ర్యాంకు ఊహించలేదు: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఐఏఎస్ గ్యారంటీ అనుకున్నాను. కానీ ఆల్ ఇండియా టాపర్‌గా నిలుస్తానని ఊహించలేదు. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. నా విజయం వెనుక కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల తోడ్పాటు మరువలేనిది. ముఖ్యంగా సిటీ గ్రూప్‌లో ఉద్యోగాన్ని వదిలి వచ్చినా.. ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా.. ‘గో ఎహెడ్’ అంటూ ప్రోత్సహించారు. ఫండమెంటల్స్‌లో పట్టు.. తొలి మెట్టు: సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులకు నా సలహా.. తొలి ప్రయత్నానికి ఏడాది ముందు నుంచే కసరత్తు ప్రారంభించాలి. ముందుగా సివిల్స్ అంటే అందని ద్రాక్ష అనే భావన వీడాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అన్ని సబ్జెక్ట్‌లు, అంశాలకు సంబంధించి ఫండమెంటల్స్‌పై పట్టు సాధించడం చాలా అవసరం. ఇవి సాధ్యం చేసుకుంటే గమ్యం దిశగా సగం దూరం చేరుకున్నట్లే! ప్రిపరేషన్ ప్రణాళికలను కూడా వ్యూహాత్మకంగా రూపొందించుకోవాలి. ఈ విషయంలో గత ప్రశ్నపత్రాల పరిశీలనతోపాటు, సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి. ఆప్షనల్ ఎంపికలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఒక్క ఆప్షనల్ మాత్రమే ఉంది కాబట్టి ఆసక్తికి ప్రాధాన్యమిస్తూనే స్కోరింగ్ అవకాశం ఉన్న సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం మంచిది. ఇందుకోసం సీనియర్ల సలహాలు తీసుకోవడం ఉపయుక్తం. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ నుంచే మెయిన్స్ కోణంలో విశ్లేషణాత్మకంగా చదవాలి. ఆల్ ద బెస్ట్!! చదివిన పుస్తకాలు... హిస్టరీ: బిపిన్ చంద్ర జనరల్ స్టడీస్: ఇన్సైట్ ఐఏఎస్ అకాడమీ నోట్స్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్: డి.డి.బసు జాగ్రఫీ, హిస్టరీ బేసిక్స్ కోసం: 11, 12 తరగతుల పాత ఎన్.సి.ఇ.ఆర్.టి పుస్తకాలు బయాలజీ, ఎన్విరాన్మెంట్: 9, 10 తరగతుల ఎన్.సి.ఇ.ఆర్.టి పుస్తకాలు కరెంట్ అఫైర్స్: దినపత్రికలు, మ్యాగజైన్లు గౌరవ్ అగర్వాల్ అకడెమిక్ ప్రొఫైల్ 1999లో పదో తరగతి ఉత్తీర్ణత (88.2 శాతం) 2001లో +2 (సైన్స్, మ్యాథ్స్ గ్రూప్) ఉత్తీర్ణత (85.6 శాతం) 2001లో ఐఐటీ-జేఈఈలో ఆల్ ఇండియా 45వ ర్యాంకు 2005లో ఐఐటీ-కాన్పూర్ నుంచి బీటెక్ క్యాట్-2004లో 99.3 పర్సంటైల్ క్యాట్-2005లో 99.80 పర్సంటైల్ 2005 డిసెంబర్ నుంచి 2006 జూన్ వరకు ఐబీఎం రీసెర్చ్ ల్యాబ్స్‌లో ప్రాజెక్ట్ ట్రైనీగా ఇంటర్న్‌షిప్ 2006-2008 ఐఐఎం-లక్నోలో ఎంబీఏ ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేషన్. 9.25 జీపీఏతోపాటు గోల్డ్ మెడల్ విజేత 2007లో సిటీ గ్రూప్ హాంకాంగ్‌లో రెండు నెలల ఇంటర్న్‌షిప్, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ 2012-13 సివిల్స్‌లో 244వ ర్యాంకు సివిల్స్ 2013 - 14 ఆల్ ఇండియా 30వ ర్యాంకర్ కృత్తిక జ్యోత్స్నతో ఇంటర్వ్యూ ఈ వారం భవితలో (19.06.2014) -
నేటి వార్తలు - విశేషాలు
-
నేటి వార్తలు - విశేషాలు
-
టీడీపీ అధినేతకు ఫ్యాక్స్‌లు
చోడవరం : రుణ మాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీ నమేషాలు లెక్కిస్తుండడంతో ఆందోళన చెం దుతున్న రైతులు, సహకార సంఘాలు పార్టీ అధినేతకు ఫ్యాక్స్ సందేశాలు పంపుతున్నారు. జిల్లాలో రూ. వెయ్యి కోట్ల రుణాలున్నట్లు అంచనా. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోనే రూ.300 కోట్ల అప్పు రైతుల నెత్తిపై ఉంది. రుణ మాఫీ ప్రకటనతో సక్రమంగా బకాయిలు చెల్లించే రైతులు కూడా మాఫీ జరుగుతుందన్న ఆశతో చెల్లింపులు నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో రుణ మాఫీపై ప్రభుత్వం ఎటువంటి మెలిక పెట్టినా బ్యాంకులు మునిగిపోక తప్పదు. జాతీయ బ్యాంకుల మాటెలాఉన్నా సహకార బ్యాంకు, సంఘాల పుట్టి మునగడం ఖాయం. ప్రమాణ స్వీకారం సందర్భంగా తొలి సంతకం మాఫీపైనే అని టీడీపీ అధినేత చెబుతున్నా అందులో ఏం మెలిక పెడతారో అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. మరోవైపు ఖరీఫ్ ముంచుకు వస్తుండడంతో కొత్త రుణా ల పరిస్థితి ఏమిటన్న సందిగ్దం కనిపిస్తోంది. 2014 మార్చి నెలాఖరు వరకు ఇచ్చిన వ్యవసాయ సాధారణ, బంగారు రుణాలన్నీ మాఫీ చేస్తే పర్వాలేదుగాని, ఆంక్షలు విధిస్తే 70 శాతంపైగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ భయంతోనే సంపూర్ణ రుణ మాఫీ కోరుతూ రైతులు చంద్రబాబునాయుడుకు వినతులు పంపుతున్నారు. సంఘా ల అత్యవసర సమావేశాలు నిర్వహించి వ్యవసాయ రుణాలన్నింటినీ ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ తీర్మానం చేసి వాటిని అధినేతకు ఫ్యాక్స్ చేస్తున్నాయి. ఆదర్శ సొసైటీగా పేరొందిన జుత్తా డ సభ్యులంతా ఇప్పటికే ఇటువంటి తీర్మానాన్ని బాబుకు ఫ్యాక్స్ చేశారు. ఇదే బాటలో కెజెపురం, మాడుగుల, విజయరామరాజు పేట, గోవాడ, రావికమతం, కొత్తకోట, బుచ్చెయ్యపేట, చీడికాడ, కె.కోటపాడుతోపాటు అన్ని ప్రాథమిక సహకార సంఘాల రైతులు నడిచేందుకు సిద్ధమవుతున్నారు. జుత్తాడ పీఏసీఎస్ అధ్యక్షుడు డి.సన్యాసినాయుడు మాట్లాడుతూ వాయిదా మీరిన రుణాలన్నింటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని కోరుతూ కొత్త ప్రభుత్వానికి ఫ్యాక్స్ పంపినట్లు చెప్పారు. -
వార్తలు - విశేషాలు
-
కాఫీ విత్ సాక్షి 21st January 2014
-
వుమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ మన హైదరాబాద్‌లోనే!
నలుగురిలో నారాయణ అంటారుగానీ నలుగురు కూడిన చోట ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. భిన్నమైన భావాలు ఆవిష్కృతమవుతాయి. అలాంటి భావాలకు వేదికగా ఈసారి హైదరాబాద్‌లో ఆగస్టు నెలలో ఉమెన్ వరల్డ్ కాంగ్రెస్ జరగబోతోంది. దీని నేపథ్యం ... తొలిసారి 1981లో ఇజ్రాయిల్‌లోని హైఫా యూనివర్శిటీలో జరిగింది. ఇతివృత్తం: ది న్యూ స్కాలర్షిప్ 1984లో నెదర్లాండ్స్‌లోని గ్రోనిజెన్ యూనివర్శిటీలో జరిగింది. ఇతివృత్తం: స్ట్రాటజీస్ అండ్ ఎంపవర్మెంట్ 1987లో ఐర్లాండ్‌లోని ట్రినిటీ కాలేజిలో జరిగింది. ఇతివృత్తం: విజన్స్ అండ్ రివిజన్స్ 1990లో యుఎస్ఎ హంటర్ కాలేజి ఇతివృత్తం: రియాలిటీస్ అండ్ ఛాయిస్ 1993లో కోస్టారికాలోని యూనివర్శిటీ ఆఫ్ సాన్ జోస్ ఇతివృత్తం: సెర్చ్, పార్టిసిపేషన్, ఛేంజ్ 1996లో ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ ఎడెలాడ్ లో.. ఇతివృత్తం: థింక్ గ్లోబల్- యాక్ట్ గ్లోబల్ 1999లో నార్వేలోని యూనివర్శిటీ ఆఫ్ ట్రోమ్సో ఇతివృత్తం: జెండరైజేషన్స్ 2002లో ఉగాండాలోని మకెరెర్ యూనివర్శిటీలో ఇతివృత్తం: జెండర్డ్ వరల్డ్స్: గెయిన్స్ అండ్ చాలెంజెస్ 2005లో కొరియా ఎవా యూనివర్శిటీలో ఇతివృత్తం: ఎంబరాసింగ్ ది ఎర్త్: ఈస్ట్-వెస్ట్ నార్త్-సౌత్ 2008లో స్పెయిన్‌లోని కంప్యుటెన్స్ యూనివర్శిటీ ఇతివృత్తం: ఈక్వాలిటీ ఈజ్ నాట్ ఎ ఉటోపియా 2011లో కెనడాలోని కెర్లన్టన్ యూనివర్శిటీలో ఇతివృత్తం: లివింగ్ ఇన్ ది గ్లోబలైజ్డ్ వరల్డ్ పన్నెండవ వుమెన్ వరల్డ్ కాంగ్రెస్ ఈ సంవత్సరం మన రాష్ట్రంలో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రొ. రేఖా పాండే ఆధ్వర్యంలో జరగనుంది. థీమ్: ‘జెండర్ ఇన్ ఎ ఛేంజింగ్ వరల్డ్’ -
కాఫీ విత్ సాక్షి 20th January 2014
-
కాఫీ విత్ సాక్షి 18th January 2014
-
కాఫీ విత్ సాక్షి 11th January 2014
-
కాఫీ విత్ సాక్షి 10th January 2014
-
కాఫీ విత్ సాక్షి 9th January 2014
-
కాఫీ విత్ సాక్షి 8th January 2014
-
కాఫీ విత్ సాక్షి 7th January 2014
-
కాఫీ విత్ సాక్షి 4th January 2014
-
కాఫీ విత్ సాక్షి 3rd January 2014
-
కాఫీ విత్ సాక్షి 2nd January 2014
-
కాఫీ విత్ సాక్షి 1st January 2014
-
కాఫీ విత్ సాక్షి 31st December 2013
-
కాఫీ విత్ సాక్షి 30th December 2013
-
కాఫీ విత్ సాక్షి 27th December 2013
-
కాఫీ విత్ సాక్షి 24th December 2013
-
కాఫీ విత్ సాక్షి 21st December 2013
-
కాఫీ విత్ సాక్షి 20th December 2013
-
కాఫీ విత్ సాక్షి 19th December 2013
-
కాఫీ విత్ సాక్షి 18th December 2013
-
కాఫీ విత్ సాక్షి 17th December 2013
-
కాఫీ విత్ సాక్షి 16th December 2013
-
కాఫీ విత్ సాక్షి 14th December 2013
-
కాఫీ విత్ సాక్షి 13th December 2013
-
కాఫీ విత్ సాక్షి 12th December 2013
-
కాఫీ విత్ సాక్షి 11th December 2013
-
కాఫీ విత్ సాక్షి 5th December 2013
-
కాఫీ విత్ సాక్షి 4th December 2013
-
కాఫీ విత్ సాక్షి 3rd December 2013
-
కాఫీ విత్ సాక్షి 2nd December 2013
-
కాఫీ విత్ సాక్షి 29th November 2013
-
కాఫీ విత్ సాక్షి 28th November 2013
-
కాఫీ విత్ సాక్షి 27th November 2013
-
కాఫీ విత్ సాక్షి 26th November 2013
-
కాఫీ విత్ సాక్షి 25th November 2013
-
కాఫీ విత్ సాక్షి 23rd November 2013
-
కాఫీ విత్ సాక్షి 22nd November 2013
-
కాఫీ విత్ సాక్షి 21st Nov 203
-
కాఫీ విత్ సాక్షి
-
కాఫీ విత్ సాక్షి
-
కాఫీ విత్ సాక్షి
-
కాఫీ విత్ సాక్షి
-
కాఫీ విత్ సాక్షి 15th November 2013
-
కాఫీ విత్ సాక్షి 14th November 2013
-
కాఫీ విత్ సాక్షి 13th November 2013
-
కాఫీ విత్ సాక్షి 12th November 2013
-
కాఫీ విత్ సాక్షి 11th November 2013
-
కాఫీ విత్ సాక్షి 9th November 2013
-
కాఫీ విత్ సాక్షి 8th November 2013
-
కాఫీ విత్ సాక్షి 7th November 2013
-
కాఫీ విత్ సాక్షి 6th November 2013
-
కాఫీ విత్ సాక్షి 1st November 2013
-
కాఫీ విత్ సాక్షి 31st October 2013
-
కాఫీ విత్ సాక్షి 30th October 2013
-
కాఫీ విత్ సాక్షి 29th October 2013
-
కాఫీ విత్ సాక్షి 28th October 2013
-
కాఫీ విత్ సాక్షి 26th October 2013
-
కాఫీ విత్ సాక్షి 25th October 2013
-
కాఫీ విత్ సాక్షి 24th October 2013
-
కాఫీ విత్ సాక్షి 23rd October 2013
-
కాఫీ విత్ సాక్షి 22nd October 2013
-
కాఫీ విత్ సాక్షి 21st October 2013
-
కాఫీ విత్ సాక్షి 18th October 2013
-
కాఫీ విత్ సాక్షి 17th October 2013
-
కాఫీ విత్ సాక్షి 16th October 2013
-
కాఫీ విత్ సాక్షి 12th October 2013
-
కాఫీ విత్ సాక్షి 11th October 2013
-
కాఫీ విత్ సాక్షి 10th October 2013
-
కాఫీ విత్ సాక్షి 9th October 2013
-
కాఫీ విత్ సాక్షి 8th October 2013
-
కాఫీ విత్ సాక్షి 7th October 2013
-
కాఫీ విత్ సాక్షి 6th October 2013
-
కాఫీ విత్ సాక్షి 5th October 2013
-
కాఫీ విత్ సాక్షి 4th October 2013
-
కాఫీ విత్ సాక్షి 3rd October 2013
-
కాఫీ విత్ సాక్షి 2nd October 2013
-
కాఫీ విత్ సాక్షి 1st October 2013
-
కాఫీ విత్ సాక్షి 30th September 2013
-
కాఫీ విత్ సాక్షి 29th Sept 2013
-
కాఫీ విత్ సాక్షి 28th September 2013
-
కాఫీ విత్ సాక్షి 27th September 2013
-
కాఫీ విత్ సాక్షి 26th September 2013
-
కాఫీ విత్ సాక్షి 25th September 2013
-
కాఫీ విత్ సాక్షి 24th September 2013
-
కాఫీ విత్ సాక్షి 23rd September 2013
-
కాఫీ విత్ సాక్షి 21st September 2013
-
కాఫీ విత్ సాక్షి 20th September 2013
-
కాఫీ విత్ సాక్షి 19th September 2013
-
కాఫీ విత్ సాక్షి 18th September 2013
-
కాఫీ విత్ సాక్షి 17th September 2013
-
కాఫీ విత్ సాక్షి 16th September 2013
-
కాఫీ విత్ సాక్షి 15th Sept 2013
-
కాఫీ విత్ సాక్షి 14th September 2013