కర్ణాటక: కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నుంచి 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెన్స్‌కు గురయ్యారు. డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమానీపై పేపర్లు చించి విసిరిన అనంతరం.. ఎమ్మెల్యేలను సస్పండ్ చేస్తున్నట్లు ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసెంబ్లీలో బుధవారం సెషన్ గందరగోళం నెలకొంది. అయితే.. నేడు స్పీకర్ యూటీ ఖాదర్ లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాని సభా కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు.
రోజూలాగే బుధవారం సభ ప్రారంభమైంది. 2024 ఎన్నికలకు ముందు 30 మంది ఐఏఎస్ అధికారులను బదీలీ చేయడంపై బీజేపీ, జనతాదళ్ (సెక్యులర్) (జేడీ(ఎస్)) ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలిపారు. అంశంపై సభలో చర్చలు తీవ్ర స్థాయికి చేరాయి. విరామ సమయం కూడా లేకుండానే చర్చలు కొనసాగించాలని డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
అవసరమైనవారు లంచ్‌కు వెళ్లి మళ్లీ చర్చకు రావాలని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. లంచ్ బ్రేక్ తీసివేయడంపై ఎమ్మెల్యేలు ఫైరయ్యారు. పేపర్లను చించి డిప్యూటీ స్పీకర్‌పై విసిరారు. స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. బౌన్సర్లు అడ్డుకున్నారు. ఈ పరిణామాల అనంతరం 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస‍్పండ్ చేశారు.
ఇదీ చదవండి: ‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్‌ను కలిసిన ఉద్ధవ్
Comments
Please login to add a commentAdd a comment