deputy speaker
-
మహారాష్ట్రలో ధంగర్లకు ఎస్టీ హోదాపై నిరసన.. సెక్రటేరియట్ భవనం నుంచి దూకిన నేతలు
ముంబై: మహారాష్ట్రలోని ధంగర్ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చినందుకు నిరసనగా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా గిరిజన నేతలు సెక్రటేరియట్ భవనం మంత్రాలయం మూడో అంతస్తు నుంచి దూకారు. అయితే, పోలీసులు ముందు జాగ్రత్తగా దిగువన రెండో అంతస్తులో నెట్లో పడటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఈ ఘటన మంత్రాలయం సముదాయంలో శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో ఉద్రిక్తతకు దారి తీసింది.దూకిన వారిలో జిర్వాల్తోపాటు ఎన్సీపీకే చెందిన ఎమ్మెల్యే కిరణ్ లహమతే, బీజేపీ గిరిజన ఎంపీ హేమంత్ సవర తదితరులున్నారు. వీరిని పోలీసులు నెట్ నుంచి బయటకు తీశారు. అనంతరం ఈ నేతలంతా గ్రౌండ్ ఫ్లోర్లో బైఠాయించారు. కోటా విషయమై సీఎం షిండే వెంటనే తమతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రాలయం భవనం పైనుంచి గతంలో ఆత్మహత్యకు యత్నించిన ఘటనలున్నాయి. దీంతో, అక్కడ పోలీసులు నెట్‌ను ఏర్పాటు చేసి ఉంచారు. కాగా, గిరిజనులకు సంబంధించిన నిర్ణయాలపై అధికార కూటమిలోని అంతర్గత విభేదాలను ఈ ఘటన మరోసారి బహిర్గతం చేసింది. -
సచివాలయంపై నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్
ముంబై: మహారాష్ట్ర సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్.. సచివాలయంలోని మూడో అంతస్తుపై నుంచి కిందకు దూకేశారు. అయితే ఆయన దూకిన సమయంలో భవనానికి సేఫ్టీ నెట్ ఏర్పాటు చేసి ఉండటంతో వారు అందులో పడిపోయారు. పోలీసులు వెంటనే వారిని రక్షించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు.పెసా చట్టం ప్రకారం ఉద్యోగ నియామకాలను వ్యతిరేకిస్తూ గత 15 రోజులుగా మహారాష్ట్రలో గిరిజన విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. ఎస్టీ కేటగిరీలో ఉన్న ధంగర్ కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో గిరిజన ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. అయినప్పటికీ ప్రభుత్వం వీరి గోడు పట్టించుకోకపోవడంతో గిరిజన ఎమ్మెల్యేలు, గిరిజన సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, మరికొందరు గిరిజన ఎమ్మెల్యేలు నేరుగా నేడు మంత్రాలయ భవనం వద్దకు చేరుకుని మూడో అంతస్తు నుంచి కొన్ని డాక్యుమెంట్లను గాల్లోకి విసిరేస్తూ దూకేశారు. అయితే భవనానికి నెట్ కట్టి ఉండటంతో ఎవరికీ ఏం కాలేదు.#WATCH | NCP leader Ajit Pawar faction MLA and deputy speaker Narhari Jhirwal jumped from the third floor of Maharashtra's Mantralaya and got stuck on the safety net. Police present at the spot. Details awaited pic.twitter.com/nYoN0E8F16— ANI (@ANI) October 4, 2024 ఈ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్తో ఇప్పటికే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చర్చలు జరిపారు. ఈ సమస్య పరిష్కారానికి సానుకూలంగానే ఉన్నామని సీఎం చెప్పినప్పటికీ అందుకు తగ్గట్టుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గిరిజన ప్రజాప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి? ఎన్డీయే ఆలోచన అదేనా!
న్యూఢిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు.. ఆ పదవిని తమ కూటమి సభ్యుడికే ఇవ్వాలని బీజేపీ యోచిస్తుండగా... మరోవైపు విపక్ష కూటమిలో భాగమైన తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఫైజాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన అవధేశ్ ప్రసాద్‌కు ఆ సీటు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు పలికింది.అయితే డిప్యూటీ స్పీకర్ నియామకంపై ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ.. ఈ విషయంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య చర్చలు జరిగే అవకాశాలు లేనట్లు సమాచారం, డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విమర్శిస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా 2019 నుంచి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. గతంలో ఎక్కువ శాతం ప్రతిపక్షమే ఈ పదవిని కేటాయించారు. అయితే ఇది ఎల్లప్పుడూ కొనసాగదని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష హోదా ఉండటంతో.. తమ ఎంపీలలో ఒకరికి డిప్యూటీ పదవి దక్కాలని డిమాండ్ చేస్తోంది. కాగా 16వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని అన్నాడీఎంకేకు ఇవ్వగా, 17వ లోక్ సభ పదవీ కాలం మొత్తం ఈ పోస్టు ఖాళీగానే ఉంది. భారత పార్లమెంట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈసారి కూడా . అయితే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇంకా అధికారిక షెడ్యూల్ విడుదల కాకపోవడంతో ఆ పదవిపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది.. ఇక స్పీకర్ పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా విజయం సాధించి రెండవసారి స్పీకర్ పదవిని చేపట్టారు. -
డిప్యూటీ స్పీకర్ ‘ఎస్పీ’కి ఇవ్వండి: తృణమూల్
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఎంపిక పూర్తయింది. ఇక డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమికే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఇండియాకూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీకే ఆ పదవి ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అవధేశ్ ప్రసాద్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. స్పీకర్‌గా బీజేపీకి చెందిన ఓం బిర్లా ఇప్పటికే ఎన్నికైన విషయం తెలిసిందే. -
లోక్‌సభ స్పీకర్‌పై ఉత్కంఠ.. ఖర్గే సహా కూటమి నేతలతో చర్చలు
ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయంపై తీసుకువచ్చేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రంగంలో దిగారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల ఇండియా కూటమిని ఒప్పించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ప్రతిపక్షాల ఇండియా కూటమి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ కోసం పట్టుపడుతున్న విషయం తెలిసిందే. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక నామినేషన్‌కు మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ముగియనుండటంతో ఇరు కూటముల మధ్య ఉత్కంఠ నెలకొంది.మరోవైపు మాజీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈసారి కూడా బీజేపీ ఓం బిర్లాను స్పీకర్‌గా ఎంపిక చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికైన లోక్‌సభ స్పీకర్లు అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఇక, స్పీకర్ ఎంపికకు ఎన్నిక జరిగితే.. ఇలా ఎన్నిక జరగటం ఇదే తొలిసారి అవుతుంది.డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించటం ఆనవాయితీగా వస్తోంది. 2014లో బీజేపీ తన మిత్ర పక్షం అన్నాడీఎంకే ఎంపీ ఎం తంబిదురైని డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసింది. ఇక.. 2019 నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది.16,17 లోక్‌సభల్లో కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్షహోదా కూడా దక్కలేదు. కానీ, ఈసారి లోక్‌సభ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ దక్కించుకోవాలని పట్టుపడుతోంది. -
ప్రొటెం స్పీకర్‌కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?!
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. పద్దెనిమిదవ లోక్‌సభ ఇవాళ తొలిసారి భేటీ కానుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయడం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం.. నేపథ్యాలతో నాలుగు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే.. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి సహాయ నిరాకరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్లమెంట్లో ఇవాళ, రేపు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రొటెం స్పీకర్ ప్యానెల్లో ఇండియా కూటమి ఎంపీలు కూడా సభ్యులుగా ఉన్నారు. ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సీనియర్ ఎంపీలు కే సురేష్(కాంగ్రెస్), టీఆర్ బాలు(డీఎంకే), బీజేపీ ఎంపీలు రాధా మోహన్ సింగ్.. ఫగ్గాన్ సింగ్ కులాస్తే, సుదీప్ బంధోపాధ్యాయ(టీఎంసీ)లను ప్రొటెం స్పీకర్ సహాయ ప్యానెల్లో సభ్యులుగా నియమించారు.అయితే ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ నియామకాన్ని ఇండియా కూటమి తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. సభలో సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే భర్తృహరిని ఎంపిక చేశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రొటెం స్పీకర్ ప్యానెల్‌లోని బీజేపీ ఎంపీలిద్దరు తప్ప మిగతా ముగ్గురు.. భర్తృహరికి సహకరించొద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక.. పార్లమెంట్‌సమావేశాలు ఈ ఉదయం 11గం. ప్రారంభం కానున్నాయి. అరగంట ముందుగానే పార్లమెంట్ కాంప్లెక్స్ గేట్ నంబర్ 2 వద్ద ఇండియా కూటమి ఎంపీలు చేరుకుంటారు. తమ ఐక్యతను ప్రదర్శిస్తూ ఒకేసారి పార్లమెంట్‌లోకి ప్రవేశించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ గేట్ వద్దే ఎంపీలు నిరసన తెలిపే గాంధీ విగ్రహం ఉండేది. ఆ తర్వాత గాంధీ విగ్రహంతో పాటు మిగతా వాటిని ‘ప్రేరణ స్థల్’ కి ఏర్పాటు చేశారు. లోక్‌సభ సమావేశాల్లో.. తొలుత భర్తృహరి మెహతాబ్‌తో ప్రోటెం స్పీకర్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత ఎంపీలంతా పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. 18వ లోక్‌సభ ప్రారంభానికి ముందు.. కాసేపు ఎంపీలంతా మౌనం పాటించి కుర్చీల్లో కూర్చుంటారు.ముందుగా ఆనవాయితీ ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు సహా మొత్తం 280 మంది ఎంపీలు ఇవాళ ప్రమాణం చేస్తారు. రేపు మిగతా ఎంపీలు ప్రమాణం చేస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఇవాళ ఏపీ, రేపు తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఇక.. స్పీకర్ ఎన్నిక 26వ తేదీన ఉండనుంది. ఇక 27వ తేదీన రాష్ట్రపతి ముర్ము లోక్‌సభ-రాజ్యసభ సభల సభ్యుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఇదిలా ఉంటే.. ఏకాభిప్రాయంతో స్పీకర్ ఎన్నికకు ప్రయత్నాలు సాగిస్తోంది ఎన్డీయే కూటమి. ఈ క్రమంలోనే ఓం బిర్లా కే మళ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని విపక్ష కూటమి కోరే అవకాశాలున్నాయి. సంప్రదాయంగా ప్రతిపక్షానికి, లేదంటే మిత్రపక్షాలకు డిప్యూటి స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశం లేకపోలేదు.డిప్యూటీ స్పీకర్ విషయంలో.. 2014లో అన్నా డీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చింది ఎన్డీయే కూటమి16 వ లోకసభ లో (2014లో) ఏఐఏడిఎంకే కి చెందిన తంబిదొరై డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారుఅయితే 17 వ లోకసభ లో (2019 లో ) మాత్రం ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది -
జనసేనకు కీలక పదవి
-
డిప్యూటీ స్పీకర్ విషయంలో ట్విస్ట్ తప్పదా?
అమరావతి, సాక్షి: కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులపాటు నిర్వహించేందుకు సన్నాహకాలు పూర్తయ్యాయి. ఈ నెల 21వ తేదీన మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేస్తారు. ఆ మరుసటి రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్‌గా ఇప్పటికే అయ్యన్నపాత్రుడి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేసేశారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ ఎవరనే ఉత్కంఠ వీడింది. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని కోరారు. దీనికి ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో.. రేపు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాతే మిగిలిన 174 మంది వరుసగా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తారు.ఇదీ చదవండి: ముసుగు తొలగింది.. బూతులు.. బెదిరింపులు మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు వెళ్తుందనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఆ విషయంలో ట్విస్ట్ తప్పదనే ప్రచారం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేనకు మంత్రి పదవులు తక్కువగా ఇచ్చారు చంద్రబాబు. దీంతో.. డిప్యూటీ స్పీకర్ ఇవ్వొచ్చని తొలి నుంచి ప్రచారం నడిచింది. ఈ క్రమంలో జనసేన తరఫున లోకం మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారని కథనాలు వెలువడ్డాయి కూడా. అయితే.. స్పీకర్ పదవి విషయంలో జనసేనకు మొండి చేయి దక్కవచ్చనేది లేటెస్ట్ టాక్. డిప్యూటీ స్పీకర్ పదవిని మరో మిత్రపక్షం బీజేపీకి వెళ్లవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి(బాబు అనుచరుడు కూడా) పేరు ఫైనల్ కావొచ్చని తెలుస్తోంది. ప్రధాన మిత్రపక్షం జనసేనకు తక్కువ మంత్రి పదవులు ఇచ్చినా.. పవన్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వడంతో పాటు ప్రాధాన్యం ఉన్న శాఖలు ఇవ్వడం, అదే సమయంలో బీజేపీకి కేవలం ఒకే మంత్రి పదవి ఇవ్వడంతో చంద్రబాబు ఈమేర ఆలోచన చేస్తున్నారన్నది తాజా ప్రచార సారాంశం. -
ఆస్పత్రిలో చేరిన పుదుచ్చేరి డిప్యూటీ స్పీకర్
సాక్షి, చైన్నె: పుదుచ్చేరి డిప్యూటీ స్పీకర్ రాజ వేలు(64) అస్వస్థతకు లోనై ఆస్పత్రి పాలయ్యారు. ఆయన్ని చికిత్స నిమిత్తం చైన్నెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని నెటపాక్కం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి రాజ వేలు ఎన్నికై న విషయం తెలిసిందే. ఆయన బీజేపీ– ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇంట్లో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన చైన్నెకు తరలించారు. ఇక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం.. 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..
కర్ణాటక: కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నుంచి 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెన్స్‌కు గురయ్యారు. డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమానీపై పేపర్లు చించి విసిరిన అనంతరం.. ఎమ్మెల్యేలను సస్పండ్ చేస్తున్నట్లు ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసెంబ్లీలో బుధవారం సెషన్ గందరగోళం నెలకొంది. అయితే.. నేడు స్పీకర్ యూటీ ఖాదర్ లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాని సభా కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు. రోజూలాగే బుధవారం సభ ప్రారంభమైంది. 2024 ఎన్నికలకు ముందు 30 మంది ఐఏఎస్ అధికారులను బదీలీ చేయడంపై బీజేపీ, జనతాదళ్ (సెక్యులర్) (జేడీ(ఎస్)) ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలిపారు. అంశంపై సభలో చర్చలు తీవ్ర స్థాయికి చేరాయి. విరామ సమయం కూడా లేకుండానే చర్చలు కొనసాగించాలని డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైనవారు లంచ్‌కు వెళ్లి మళ్లీ చర్చకు రావాలని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. లంచ్ బ్రేక్ తీసివేయడంపై ఎమ్మెల్యేలు ఫైరయ్యారు. పేపర్లను చించి డిప్యూటీ స్పీకర్‌పై విసిరారు. స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. బౌన్సర్లు అడ్డుకున్నారు. ఈ పరిణామాల అనంతరం 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పండ్ చేశారు. ఇదీ చదవండి: ‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్‌ను కలిసిన ఉద్ధవ్ -
ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జలాసనం
-
లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్ లేరు.. ఇది రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: లోక్‌సభకు గత నాలుగేళ్లుగా డిప్యూటీ స్పీకర్ లేరని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల శాసనసభలకు డిప్యూటీ స్పీకర్లు లేకపోవడంపై దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు గత నెలలో కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ప్రతిపక్ష నేతకు దక్కరాదనే ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. ‘1956లో ప్రధాని నెహ్రూ ప్రతిపక్ష నేత, తన విధానాలను తీవ్రంగా విమర్శించే అకాలీదళ్ ఎంపీని సర్దార్ హుకుం సింగ్ పేరును డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రతిపాదించారు’అని అప్పటి ఘటనను జైరాం రమేశ్ ఉదహరించారు. -
చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆగ్రహం
-
విషాదం.. బీజేపీ సీనియర్ నేత ఆనంద్ కన్నుమూత
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్నాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మమణి(56) తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మమణి(56) మధుమేహ వ్యాధిలో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో షుగర్ వ్యాధి కారణంగా లివర్ ఇన్ఫెక్షన్కు గురైంది. దీంతో, ఆనంద్‌ను బెంగళూర్‌లోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆనంద్ మమణి.. కోమాలోకి వెళ్లిపోయారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆయనను తమిళనాడులోకి చెన్నైలోకి ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవల అనంతరం.. మళ్లీ బెంగళూరుకు తీసుకువచ్చారు. ರಾಜ್ಯ ವಿಧಾನ ಸಭೆಯ ಮಾನ್ಯ ಉಪ ಸಭಾಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ ಆನಂದ ಮಾಮನಿ ಅವರು ನಿಧನರಾದ ಹಿನ್ನಲೆಯಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿನ ಮಣಿಪಾಲ್ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಅವರ ಪ್ರಾರ್ಥಿವ ಶರೀರದ ದರ್ಶನ ಪಡೆದು, ಕುಟುಂಬದ ಸದಸ್ಯರಿಗೆ ಸಾಂತ್ವನ ತಿಳಿಸಿದೆನು. ಓಂ ಶಾಂತಿಃ pic.twitter.com/DMcLOzC49d — Basavaraj S Bommai (@BSBommai) October 22, 2022 కాగా, తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆనంద్ తుదిశ్వాస విడిచారు. ఇక, ఆనంద్ మమణి.. బెలగావి జిల్లాకు చెందిన సవదట్టి నియోజకవర్గం నుంచి మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం.. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు.. ఆనంద్ మమణి మృతిపై కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. సీఎం బొమ్మై ట్విట్టర్ వేదికగా.. “మా పార్టీ ఎమ్మెల్యే, గౌరవనీయులైన రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఆనంద చంద్రశేఖర మామణి మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ఈ బాధను భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’’ అంటూ నివాళులు అర్పించారు. ನಮ್ಮ ಪಕ್ಷದ ಶಾಸಕರು, ರಾಜ್ಯ ವಿಧಾನಸಭೆಯ ಮಾನ್ಯ ಉಪ ಸಭಾಧ್ಯಕ್ಷರಾದ ಆತ್ಮೀಯ ಶ್ರೀ ಆನಂದ ಚಂದ್ರಶೇಖರ ಮಾಮನಿ ಅವರು ನಿಧನರಾದ ವಿಷಯ ತಿಳಿದು ಅತೀವ ದುಃಖವಾಗಿದೆ. ದೇವರು ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಚಿರಶಾಂತಿ ನೀಡಿ, ಈ ನೋವನ್ನು ಭರಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ಅವರ ಕುಟುಂಬ ವರ್ಗಕ್ಕೆ ಕರುಣಿಸಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. ಓಂ ಶಾಂತಿಃ pic.twitter.com/PQq96zMKPI — Basavaraj S Bommai (@BSBommai) October 22, 2022 -
Kolagatla Veerabhadra Swamy: కార్యకర్త నుంచి డిప్యూటీ స్పీకర్ వరకు...
విజయనగరం: సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కోలగట్ల వీరభధ్రస్వామి డిప్యూటీ స్పీకర్ హోదా వరకు వ్యక్తిగతంగా ఎదిగారు. పాలన లో తనదైన ముద్రవేస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎమ్మె ల్సీగా ఎన్నికైన ఆయనకు సీఎం జగన్మోహన్రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొద్ది నెలల కిందట డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల పేరును సీఎం ప్రకటించారు. ప్రస్తు తం జరుగుతున్న శాసనసభా సమావేశాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సీఎంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రివర్గం సమక్షంలో ఆయన డిప్యూటీ స్పీకర్ పీఠాన్ని సోమవారం అధిరోహించారు. కోలగట్ల 1983లో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం 1985లో కోపరేటివ్ బ్యాంకు డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. 1987లో మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికకాగా, 1989లో కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1989, 1994, 1999 సంవత్సరాల్లో విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 2004 సంవత్సరం ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజుపై విజయం సాధించారు. 2013 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014 సంవత్సరంలో ఎమ్మెల్సీ పదవితోపాటు ఆ పార్టీకి రాజీనామాచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. అదే ఏడాది విజయనగరం శాసనసభా నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందగా... వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ గా కొనసాగుతున్నారు. ప్రత్యేక గుర్తింపు.. విజయనగరానికి చెందిన పూసపాటి వంశీయులపై రాజకీయంగా పోరాడి విజయం సాధించడంతో ఎమ్మెల్యే కోలగట్లకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సుమారు 7 మార్లు ఎమ్మెల్యేగా, పలు శాఖల రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా పదవులు అధిరోహించిన పూసపాటి అశోక్‌గజపతిరాజుపై స్వతంత్య్ర అభ్యరి్థగా ఒకసారి, వైఎస్సార్సీపీ తరఫున మరో సారి పోటీచేసి తన సత్తాను నిరూపించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. కార్పొరేషన్ హోదా దక్కించుకున్న విజయనగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా సాగుతున్నారు. అభినందనల జల్లు.. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోలగట్లవీరభధ్రస్వామికి అభినందనలు వెల్లువెత్తాయి. విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు,, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, చనమల్లు వెంకటరమణ, రాష్ట్ర పర్యాటకశాఖ డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు కుప్పం ప్రసాద్ ద్వారకానాథ్, గుబ్బ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కలి్పంచిన సీఎంకు తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిసి కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి
-
AP: డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా కోలగట్ల నామినేషన్
సాక్షి, అమరావతి: శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులకు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో కోలగట్ల వెంట బీసీ సంక్షేమం, పౌర సంబంధాల శాఖ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, పుష్పశ్రీవాణి, శంబంగి చిన్నప్పలనాయుడు తదితరులున్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కోలగట్ల స్పీకర్ తమ్మినేని సీతారాంను మర్యాదపూర్వకంగా కలిశారు. గడువు ముగిసే సమయానికి కోలగట్ల మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సోమవారం లాంఛనంగా ప్రకటించనున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి గురువారం రాజీనామా చేయడంతో ఆ పదవికి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శాసనసభలో శుక్రవారం స్పీకర్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలవరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువుగా తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఎన్నిక నిర్వహిస్తామని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. -
ఏపీ: డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి(శుక్రవారం) నుంచి సాయంత్రం వరకూ నామినేషన్ల స్వీకరణ సాగనుంది. వైఎస్సార్సీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ వేసే అవకాశం ఉంది. కోలగట్ల వీరభద్రస్వా మధ్యాహ్నం 3.30 గంటలకు నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. సోమవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుందని స్పీకర్ ఇదివరకే ప్రకటించారు. బలాబలాల రిత్యా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. -
డిప్యూటీ స్పీకర్‌పై దాడి.. జుట్టు పట్టుకుని లాగుతూ..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మాణం సందర్భంగా ఆ దేశ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. శనివారం పాక్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లాహోర్ కోర్టు ఆదేశాల మేరకు కొత్త సీఎంను ఎన్నుకునేందుకు పంజాబ్ అసెంబ్లీ శనివారం సమావేశమైంది. ఈ సందర్భంగా సభ జరుగుతున్న క్రమంలో.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు బీభత్సం సృష్టించారు. గట్టిగా అరుస్తూ డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీపై వారు దాడి దిగారు. ఆయనపైకి పువ్వులు విసురుతూ, జుట్టు పట్టుకుని లాగుతూ, చెంపపై కొడుతూ దాడి చేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డులు కూడా వీరిని నిలువరించలేకపోయారు. ఈ సందర్భంలో పీటీఐ, పీఎంఎల్‌క్యూ సభ్యులు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాడి నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మజారీ సెక్యూరిటీ గార్డుల రక్షణలో సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం సభలో చోటుచేసుకున్న పరిణామాలపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Pti and pmlQ members resorting to violence eventually in Punjab assembly. Assault on Deputy speaker Dost Mazari makes it another sad day for democracy in this country and a blatant violation of LHC order. God knows what else is left for us to see, disturbing visuals. pic.twitter.com/RkblxWmd4g — Absa Komal (@AbsaKomal) April 16, 2022 -
మైక్ కట్ చేయడంతో ఎమ్మెల్యే రసమయి అసంతృప్తి
-
'సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు'
-
ఢిల్లీ పర్యటనలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
-
ఊరూరా తిరుగుతూ కరోనాపై అవగాహన
-
డిప్యూటీ స్పీకర్ తీరుపై నెటిజన్ల విమర్శలు
-
లాక్‌డౌన్‌తో ఎవరూ ఇబ్బంది పడకూడదు
-
అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కృషి
సాక్షి, అమరావతి: రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల అర్చకుల (ఆగమ) కోర్సులకు నిర్వహించిన అర్చక పరీక్ష ఫలితాలను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో కలిసి గురువారం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 2013 నుంచి అర్చకుల (ఆగమ) పరీక్షలను నిర్వహించలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్చకుల జీవితాల్లో వెలుగులు పేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే 2019 జూలై 13, 14 తేదీల్లో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అర్చకులకు ప్రవేశ, వర, ప్రవర ఆగమ పరీక్షలను నిర్వహించామన్నారు. పరీక్షల్లో తప్పిన వారికి సప్లిమెంటరీ నిర్వహిస్తామని, వెరిఫికేషన్‌కు కూడా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అర్చకుల (ఆగమ) పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అర్చక (ఆగమ) పరీక్ష పాసైన వారు విదేశాల్లో కూడా ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు కామేశ్ శర్మ పాల్గొన్నారు. 84.93 శాతం ఉత్తీర్ణత ఆగమ పరీక్షలకు 5,176 మంది హాజరవ్వగా.. 4,396 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ శ్రేణిలో 2 వేల మంది, ద్వితీయ శ్రేణిలో 1,156 మంది, తృతీయ శ్రేణిలో 247, మౌఖిక మరియు ప్రయోగ పరీక్షల్లో 993 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 84.93. రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు నవంబరు 25లోగా కమిషనర్, దేవదాయ శాఖ కార్యాలయానికి రూ. 200 డీడీని జతపరిచి వివరాలు పంపాలి. ఫలితాల వివరాలను https://tms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. -
డిప్యూటీ స్పీకర్‌గా.. కోన రఘుపతి ఏకగ్రీవం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం సభానాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు తదితరులు కోన రఘుపతిని స్పీకర్ స్థానం దగ్గరకు సాదరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. ఇతర శాసనసభ్యులంతా డిప్యూటి స్పీకర్‌కు అభినందనలు తెలియజేశారు. అంతకుముందు రఘుపతి నామినేషన్‌ను 11మంది ఎమ్మెల్యేలు వేర్వేరుగా ప్రతిపాదించారు. కాగా, ‘కోన’ను అభినందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ముస్తఫా, అంబటి రాంబాబు, కరణం బలరామకృష్ణమూర్తి, అనగాని సత్యప్రసాద్, తదితరులు ప్రసంగించారు. ప్రతిపక్షానికీ బాగా మాట్లాడే అవకాశమివ్వండి : జగన్ సభా నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ తరఫున బాపట్ల నుంచి రెండోసారి ఎన్నిక కావడం.. ఆయన కుటుంబ రాజకీయ చరిత్ర చూసి అందరికీ మంచి చేస్తారన్న ఉద్దేశంతో డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసినట్టు చెప్పారు. ’మీ తండ్రి కోన ప్రభాకరరావు స్పీకర్‌గా, మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా, మంత్రిగా, రాజకీయ ప్రముఖునిగా ఖ్యాతి గడించారు. మీరూ మంచి స్పీకర్‌గా రాణిస్తారని భావించి మిమ్మల్ని ఎన్నుకున్నాం. సభలో అందరికీ మంచి చేస్తారని, ప్రతిపక్షానికి కూడా బాగా మాట్లాడడానికి సమయం ఇస్తారని భావిస్తున్నాం. మీ నాన్నగారి మాదిరే అన్నింటా రాణించాలని ఆశిస్తున్నాం. మీరు ఎన్నికైనందుకు అభినందనలు’.. అని జగన్ అన్నారు. మంచి పేరు తెచ్చుకోవాలి : చంద్రబాబు అంతకుముందు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ.. కోన రఘుపతి తన తండ్రి బాటలో పయనించి సభకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. కోన ప్రభాకరరావు నిర్మొహమాటంగా, విలువలతో కూడిన రాజకీయం చేసేవారని, జాతీయ స్థాయిలో ఆయన గుర్తింపు కలిగిన వ్యక్తని కొనియాడారు. తపన, సామాజిక బాధ్యత కలిగిన కుటుంబం నుంచి వచ్చిన కోన రఘుపతి కూడా మంచి కీర్తి గడించాలన్నారు. సభ్యుల ప్రయోజనాలు కాపాడుతా : కోన కాగా, తనను డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కోన రఘుపతి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శాసన నిర్మాణ వ్యవస్థలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తనకు పరిచయం ఉందని, సభ్యుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అర్థవంతమైన చర్చలతో నిర్మాణాత్మక సూచనలతో ముందుకు సాగుదామన్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై తక్షణమే వేటువేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనదన్నారు. అంతటి స్ఫూర్తిదాయకమైన ప్రకటనతో సభా ఔన్నత్యాన్ని కాపాడతానని, తన తండ్రి పేరు, ప్రతిష్టలను కాపాడతానని, బాపట్ల ప్రాంత అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. అధికార పక్ష సభ్యుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గత సభలో డిప్యూటీ స్పీకర్ ఐదేళ్ల కాలంలో మహాఅయితే ఏ నాలుగైదు గంటలో ఆ స్థానంలో కూర్చుని విధులు నిర్వహించారని, ఈ సభలో ఆ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు. తండ్రి స్పీకర్.. కొడుకు డిప్యూటీ స్పీకర్ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కోన రఘుపతి.. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి రెండుసార్లూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఈయన రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, స్పీకర్‌గా, మహారాష్ట్ర సహా మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. కాగా, కోన ప్రభాకర్ అప్పట్లో స్పీకర్‌గా పనిచేయగా, ప్రస్తుతం ఆయన తనయుడు రఘుపతి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. -
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి
-
డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారం మంగళవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం సభానాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు తదితరులు కోన రఘుపతిని స్పీకర్ స్థానం దగ్గరకు సాదరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులంతా డిప్యూటి స్పీకర్‌కు అభినందనలు తెలియజేశారు. తండ్రి స్పీకర్.. కోడుకు డిప్యూటీ స్పీకర్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. కోన ప్రభాకరరావు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్‌గా, మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో తండ్రి కోన ప్రభాకర్ స్పీకర్‌గా పనిచేయగా, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించడం విశేషం. మృదుస్వభావి అయిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
డిప్యూటీ స్పీకర్‌గా కోన ఏకగ్రీవంగా ఎన్నిక!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నిక కాబోతున్నారు. సోమవారం గడువు ముగిసే సమయానికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో మంగళవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. సోమవారం గడువు ముగిసే సమయానికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో మంగళవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. సోమవారం ఉదయం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల వరకూ ఈ పదవికి నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ప్రకటించారు. శాసనసభ సమావేశం వాయిదా పడిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, అన్నాబత్తుని శివకుమార్, కొరుముట్ల శ్రీనివాసులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొట్టుగుళ్ల భాగ్యలక్ష్మి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వెంట రాగా కోన రఘుపతి అసెంబ్లీ కార్యాదర్శి(ఇంచార్జి) పి.బాలకృష్ణమాచార్యులుకు తన నామినేషన్ పత్రాలను ఆయన ఛాంబర్లో అందజేశారు. కోన రఘుపతి నామినేషన్ పత్రాలపై ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉప ముఖ్యమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, టి.అర్థర్, చెట్టి ఫాల్గుణ, టీజేఆర్ సుధాకర్‌బాబు, మద్దిశెట్టి వేణుగోపాల్ సంతకాలు చేశారు. కాగా మంగళవారం ఉదయం 11గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. చదవండి: డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల -
డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
-
డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. జూన్ 18వ తేదీన ఉదయం 11గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుందని ఆయన వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్లను ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు దాఖలు చేసుకోవచ్చునని తెలిపారు. అనంతరం గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ మొదలైంది. సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు ఈ తీర్మానాన్ని బలపరిచారు. -
ఆర్టీసీ భవన్లో డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయం
సాక్షి, సికింద్రాబాద్: మెట్టుగూడ ప్రధాన రహదారిలోని ఆర్టీసీ భవనం ఇకపై తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంగా మారనుంది. మెట్టుగూడ నుంచి తార్నాకకు వెళ్లే దారిలో ఈ భవనం ఉంది. ఆర్టీసీ ఎండీ కోసం నిర్మించిన ఈ భవనం ఆర్టీసీ చైర్మన్ల నివాస భవనంగా కొనసాగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రవాణ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ఆయన కుంటుంబం కొద్ది సంవత్సరాల పాటు ఈ భవనంలోనే నివసించారు. నాలుగేళ్ల క్రితం సీఎం హోదాలో సికింద్రాబాద్ పర్యటనకు వచ్చిన కేసీఆర్ ఇదే భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్పట్లోనే ఎక్సైజ్ మంత్రి హోదాలో పద్మారావు ఈ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా వాడుకుందామని ఆలోచించారు. ఆ తరువాత మినిస్టర్ క్వార్టర్స్‌కు కొంతకాలం మకాం మార్చారు. కొద్ది రోజుల క్రితం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన పద్మారావుగౌడ్ ఆర్టీసీ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. మినిస్టర్ క్వార్టర్స్‌కు వెళ్లడం కంటే తన నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలనుకున్న ఆయన నిర్ణయానికి సీఎం అంగీకారం తెలిపినట్టు తెలిసింది. శనివారం డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ తన అనుచరులతో కలిసి ఆర్టీసీ భవనాన్ని సందర్శించారు. నీల ప్రభాకర్, ఓడియన్ శ్రీనివాస్, సుంకు రాంచందర్, అశోక్‌గౌడ్, శైలేందర్, మంత్రి తనయుడు రామేశ్వర్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేత చందు గంగపుత్ర పాల్గొన్నారు. -
భట్టి విక్రమార్కని కలిసిన కేటీఆర్
-
సీఎల్పీ నేత భట్టిని కలిసిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సమావేశం అయ్యారు. (డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు) డిప్యూటీ స్పీకర్ పదవి ఏకగ్రీమయ్యేలా టీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపగా, ఏకగ్రీవ ఎన్నికకు ఎంఐఎ, బీజేపీ ఆమోదం తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా తుది నిర్ణయం మాత్రం తెలపలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో తమకు సహకరించాలంటూ కేటీర్ ఇవాళ ఉదయం సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్కను కలిశారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించిన అనంతరం తమ నిర్ణయం చెబుతామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ భేటీకి కేటీఆర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ అభ్యర్థి పద్మారావు గౌడ్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. -
డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఉపసభాపతిగా తిగుళ్ల పద్మారావుగౌడ్ ఎన్నిక కానున్నారు. డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావుగౌడ్ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఖరారు చేశారు. దీంతో పద్మారావుగౌడ్ శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహణ కోసం అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు గురువారమే నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలందరికీ లిఖితపూర్వక సమాచారం ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారంతో ముగియనుండగా, సోమవారం ఎన్నిక ప్రక్రియ జరగనుంది. అదేరోజు పద్మారావు బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తుండటంతో పద్మారావు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే... తిగుళ్ల పద్మారావుగౌడ్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో పద్మారావు ఒకరు. 2004, 2014, 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 సికింద్రాబాద్ ఉప ఎన్నికల్లో, 2009 ఎన్నికల్లో సనత్‌నగర్‌లో ఓడిపోయారు. 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఆబ్కారీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికవుతున్నారు. సీఎం కేసీఆర్ తరహాలోనే.. మంత్రిగా పని చేసిన తర్వాత డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన సందర్భాలు ఉమ్మడి రాష్ట్రంలో అరుదుగానే ఉన్నాయి. 1995 నుంచి 1999 వరకు చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో కేసీఆర్ రవాణా మంత్రిగా పని చేశారు. 1999 ఎన్నికల తర్వాత మళ్లీ ఏర్పడిన చంద్రబాబు మంత్రివర్గంలో కేసీఆర్‌కు మంత్రిగా అవకాశం దక్కలేదు. అప్పుడు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఇలాంటి తరహాలోనే పద్మారావు మంత్రి తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవిని చేపడుతున్నారు. -
అడ్వకేట్ నుంచి డిప్యూటీ స్పీకర్ దాకా...!!!
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి తొలి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పద్మాదేవేందర్ రెడ్డి 2001లో టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి ఆ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అడ్వకేట్ గా పనిచేసిన అనుభవం ఆమెకు రాజకీయాల్లో కలిసొచ్చిన అంశం. టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటకీ ఆమె మాత్రం తన ధైర్యం కోల్పోలేదు. ఆమె పోరాట పటిమ చూసి పార్టీయే దిగివచ్చింది. ఈ ఒక్క విషయం చాలు పద్మా దేవేందర్ రెడ్డి ఏంటో తెలుసుకోవడానికి! విద్యార్థి దశ నుంచే రాజకీయాలంటే ఆసక్తి కనబర్చిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించిన అనతి కాలంలోనే జెడ్పీటీసీ మెంబర్‌గా గెలిచి తన సత్తా చాటారు. పద్మా దేవేందర్ రెడ్డి చేరికతో బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న ఆమె భర్త కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. పెద్ద కుటుంబంలో జన్మించిన పద్మాదేవేందర్ రెడ్డి బాల్యమంతా ఊర్లోనే సాగింది. చిన్నప్పడు ఎప్పుడూ చదువులో ముందుండేవారు.చదువులో అందరికన్నా ముందుండాలనే పట్టుదలతో ఉండేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జన్మించిన పద్మా దేవేందర్ రెడ్డి చదువంతా కరీంనగర్ పట్టణంలోనే సాగింది. ఎల్ ఎల్ బీ పూర్తి కాగానే న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో దాదాపు మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 17 ఏళ్ల ప్రాయంలోనే వివాహం జరిగినప్పటికీ తాను మాత్రం లక్ష్యాన్ని పక్కన పెట్టలేదు. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని కుంటుంబం నుంచి వచ్చిన పద్మాదేవేందర్ రెడ్డి రాజకీయ నేతగా నిలదొక్కుకోగలిగారంటే అది ఆమె సంకల్ప బలమే అని సన్నిహితులు చెబుతుంటారు. మంత్రివర్గంలో చేరాలని బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ కేసీఆర్ సూచనల మేరకు డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరించారు. బాధ్యతలను నిర్వర్తించడంలో కష్టపడే తత్వం పద్మా దేవేందర్ రెడ్డిది. ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలసి సిద్దిపేట నుంచి వరంగల్ వరకు సైకిల్ యాత్రలో పాల్గొని ఏ విషయంలోను మహిళలు పురుషుల కన్నా తక్కువ కాదని చాటి చెప్పారు. కుటుంబ నేపథ్యం : పేరు : మాధవరెడ్డిగారి పద్మా దేవేందర్ రెడ్డి జన్మస్థలం : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పుట్టిన తేదీ : జనవరి6,1969 తల్లిదండ్రులు : విజయా రెడ్డి,భూమి రెడ్డి చదువు : బీ.ఏ ఎల్.ఎల్.బి (ఉస్మానియా యూనివర్సిటీ) వివాహం : 22 పిబ్రవరి,1988 భర్త : ఎం దేవేందర్ రెడ్డి కుటుంబం : కుమారుడు పునీత్ రెడ్డి రాజకీయ నేపథ్యం : ►2001 లో టీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం ►2001 లో మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రామాయంపేట నుంచి జెడ్పీటీసీగా గెలుపు (జెడ్పీలో పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా) ►2004 లో రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక ► 2008 ఉప ఎన్నికల్లో ఓటమి (ఉద్యమంలో భాగంగా పదవి రాజీనామా, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి) ► 2009 లో ఎన్నికల్లో ఓటమి ►2009 లో టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ (కూటమి పొత్తుల్లో భాగంగా టీఆర్ఎస్ అథిష్టానం టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు) ► 2010 లో తిరిగి పార్టీలో చేరిక ► 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు (మళ్లీ ప్రస్తుత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ) ►2014-2018 తెలంగాణ తొలి డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. ఎ.రమణా రెడ్డి (ఎస్.ఎస్.జే) -
ఏనుగుపై నుంచి పడ్డ డిప్యూటీ స్పీకర్
డిస్పూర్ : అసోం డిప్యూటీ స్పీకర్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. ఏనుగు మీద నుంచి కిందపడి చిన్నగాయంతో బయటపడ్డారు. అస్సోం బీజేపీ ఎమ్మెల్యే కృపానాథ్ మల్లాహ్ ఈ నెల 5న డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా ఆయన సొంత నియోజకవర్గమైన కరీంగంజ్ జిల్లాలోని రాటబరిలో ఆదివారం ఆయకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం అంబారీని సిద్దం చేశారు. అంబారిపై ఊరేగింపుగా వస్తున్న కృపానాథ్ దగ్గరకి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో ఏనుగు బెదిరి పరుగెత్తే ప్రయత్నం చేసింది. దీంతో డిప్యూటీ స్పీకర్ అదుపు తప్పి కింద పడ్డారు. వెంటను సిబ్బంది వచ్చి ఆయనను పైకి లేపారు. అదృష్టవశాత్తు ఆయన గడ్డి ఉన్న ప్రదేశంలో పడడంతో ప్రమాదమేమి జరగలేదు. ఆ వెంటనే ఆయన సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదంతా అక్కడ ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ అయింది. డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కృనానాథ్ కరీంగంజ్ జిల్లాలోని రాటబరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2003,2011లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలవగా, 2016లో బీజేపీలో చేరి రాటబరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. -
డిప్యూటీ స్పీకర్‌కి తప్పిన ప్రమాదం
-
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎంపీ?
-
అన్నదాతకు అండ
మెదక్ జోన్ : దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు అడుగడుగునా అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కోరారు. శనివారం పట్టణంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు సమితులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పంటసాగు కోసం ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇవ్వడం రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. రెవెన్యూ రికార్డులని ఎన్నోళ్లుగా తప్పుల తడకగా ఉన్నాయని సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టి తప్పులను పూర్తిగా సరిచేయడం జరుగుతోందన్నారు. రైతు శిక్షణతో సమగ్ర సమాచరాన్ని రైతు సమితులు తెలుసుకుని పల్లెలో పంటలసాగు విషయంలో రైతులకు సహాయపడాలని ఆమె కోరారు. అనంతరం జరిగిన రైతు సమితుల శిక్షణలో భాగంగా వ్యసాయ జిల్లా అధికారులు పరుశురాం రసాయన ఎరువులతో భూసారం దెబ్బతింటుందని, సేంద్రియ ఎరువులతోనే రైతుకు మంచి ఆదాయం లబిస్తోందని తెలిపారు. అనంతరం రైతు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు మాట్లాడుతూ, నాలుగురోజల పాటు కొనసాగే ఈ రైతు సమితుల శిక్షణలో రోజులు ఐదు మండలాల సమితుల మండల, గ్రామ, జిల్లా కోఆర్డినేటర్లు పాల్గొంటారని తెలిపారు. శిక్షణలో అధికారులు చెప్పే ప్రతి విషయాన్ని అవగతం చేసుకుని పల్లెలో రైతులకు వివరించాలన్నారు. వే బ్రిడ్జి ప్రారంభం.. మార్కెట్ కమిటీ ఆవరణలో రూ.13 లక్షలతో నిర్మించిన ధర్మ కాంటను ఈ సందర్భంగా ఆమె ప్రారంభించారు. అలాగే పశువుల షెడ్డు నిర్మాణం రూ.19 లక్షలతో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మెన్ రాగి అశోక్, రైతు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, జెడ్పిటీసీ లావణ్యరెడ్డి, ఉద్యానవనశాఖ అధికారి చక్రపాణి తదితరులు ఉన్నారు. -
'పారికర్‌ను అమెరికాకైనా తరలిస్తాం..'
సాక్షి, పనాజీ : అవసరం అయితే మెరుగైన వైద్యం కోసం గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను అమెరికా తరలిస్తామని బీజేపీ నేత, గోవా డిప్యూటీ స్పీకర్ మైఖెల్ లాబో చెప్పారు. క్లోమం (ప్యాంక్రియాస్) సంబంధించిన సమస్య ఏర్పడిన కారణంగా కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన పారికర్ ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ప్రధాని మోదీ కూడా ఆయనను పరామర్శించి రావడంతో అంతలా పారికర్‌కు ఏమైందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అయితే, వాటన్నింటిని ఆస్పత్రి వర్గాలు కొట్టి పారేశాయి. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మైకెల్ కూడా సోమవారం ఓ ప్రకటన చేశారు. 'ఆయన మాకు కావాలి. మేం చేయగలిగిందంతా చేస్తాం. అవసరం అయితే, ఆయనను అమెరికాకు కూడా తరలిస్తాం' అని మీడియా ప్రతినిధులతో అసెంబ్లీ ప్రాంగణంలో చెప్పారు. ప్యాంక్రియాస్‌కు సంబంధించిన సమస్య కారణంగా పారికర్ ఈ నెల (ఫిబ్రవరి) 15న లీలావతి ఆస్పత్రిలో చేరి వైద్యంసేవలు పొందుతున్నారు. ఆయనకు ఓ సర్జరీ కూడా చేయగా ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు ఇప్పటికే చెప్పాయి. -
సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక వైఎస్ఎన్
ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఘనంగా వైఎస్ఎన్ అశీతి ఉత్సవం రాజమహేంద్రవరం కల్చరల్ : తెలుగునాట సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక వైఎస్ నరసింహారావు అని, సాంస్కృతిక దీప్తి వసివాడకుండా అరచేతిని అడ్డుపెట్టి ఆయన కాపాడుతున్నారని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. వైఎస్ఎన్ అశీతి జన్మదినోత్సవ సారథ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి రాజమహేంద్రవరంలోని త్యాగరాజ నారాయణదాస సేవాసమితి ఆడిటోరియంలో వైఎస్ నరసింహారావు అశీతి ఉత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండలి మాట్లాడుతూ వైఎస్ఎన్ కారణంగానే రాజమహేంద్రవరంలోని పురమందిరం, కందుకూరి జన్మగృహం, రాళ్లబండి మ్యూజియం నేటిMీ Sపరిరక్షింపబడుతున్నాయన్నారు. అనంతరం వైఎస్ నరసింహారావు తనకన్నా పెద్దవారైన చిట్టూరి ప్రభాకరచౌదరి, ముళ్లపూడి సూర్యనారాయణ, పోతుకూచి సూర్యనారాయణమూర్తి, జోస్యుల సూర్యప్రకాశరావు, డాక్టర్ సీతరాం భార్గవి, పేరిటచర్ల సూర్యనారాయణరాజు, ద్రోణంరాజు సుందర రామారావులను సత్కరించారు. పుస్తకాల ఆవిష్కరణ అశీతి పేరిట వెలువడిన ప్రత్యేక సంచికను మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. వైఎస్ఎన్ రచించిన నృసింహోపనిషత్తు మూడోముద్రణ, స్వాతంత్య్ర ఉద్యమంలో వీర వనితలు, అరిపిరాల నారాయణరావు రచించిన ఎదురీత పుస్తకాలను కూడా అతిథులు ఆవిష్కరించారు. ముందుగా నరసింహారావును ఇంటి నుంచి ఫ్రీడంపార్కు వరకు, అక్కడి నుంచి సభాస్థలికి మేళతాళాలతో, వేదస్వస్తితో తీసుకువచ్చారు. ఎంపీ మురళీమోహన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు, ఆదాయపన్ను అధికారి మేడిశెట్టి తిరుమలరావు, డాక్టర్ రాపాక ఏకాంబరాచార్యులు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, విశ్వనాథ గోపాలకృష్ణ, శలాక రఘునాథ శర్మ, కోసూరి చండీప్రియ, కె.శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ప్రసంగించారు.అనంతరం వైఎస్ నరసింహారావును నిర్వాహకులు, నగర ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఫణి నాగేశ్వరరావు స్వాగత వచనాలు పలికారు. నిత్యవిద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి పవర్‌పాయింట్ ద్వారా వైఎస్ఎన్ జీవిత విశేషాలను వివరించారు. -
చేప చిక్కిందోచ్!
మెదక్ మున్సిపాలిటీ: కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని పలు చెరువులను ఆదివారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పిట్లం చెరువు వద్ద పలువురు యువకులు చేపలు పడుతుండటంతో.. ఆమె కూడా గాలం వేశారు. ఓ చేప చిక్కడంతో సంతోషం వ్యక్తం చేశారు. -
ప్లాస్టిక్‌ను నిషేధించాల్సిందే?
వందశాతం అమలుకు బల్దియా చర్యలు కవర్లు వాడితే భారీగా జరిమానాలు మెదక్: క్యాన్సర్ వ్యాధికి కారణమవుతూ పర్యావరణానికి పెనుముప్పుగా మారిన తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని పకడ్బంధీగా అమలు చేసేందుకు మెదక్ బల్దియా సన్నద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి పట్టణంలో వందశాతం తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలు చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 40 మైక్రాన్లలోపు ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం పర్యావరణానికే కాకుండా మానవాళి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. దీంతో తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లను వినియోగించడంపై ప్రభుత్వం గతంలోనే నిషేధం విధించింది. అయితే అంతటా నిర్లక్ష్యం అలుముకోవడంతో వాటి నిషేధం పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో తక్కువ మైక్లాన్ల కవర్ల వాడకాన్ని పకడ్బంధీగా నిలువరించేందుకు బల్దియా నడుం బిగించింది. ఈ నేపథ్యంలో నిషేధం అమలులో ఉన్నా అక్రమంగా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న షాపుల యజమానులపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం కోసం బల్దియాలు కృషి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 18న మెదక్ ఖిల్లా బల్దియా అధికారులతోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్, వైస్చైర్మన్లతో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా పర్యావరణానికి పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ కవర్లను వందశాతం నిషేధించి, ప్లాస్టిక్ రహిత పట్టణాన్ని నెలకొల్పాలని తీర్మానం చేశారు. మున్సిపల్ శానిటేషన్ అధికారులు ప్లాస్టిక్ కవర్లను వినియోగించే షాపుల యజమానులపై భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తూ వందశాతం నిషేధం అమలుకు కృషి చేస్తున్నారు. అలాగే రోడ్లపై షాపుల యజమానులు నిత్యం చెత్తా చెదారం పడేయడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ప్రతీ షాపు యజమాని చెత్తను బుట్టలోనే వేసి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు. ఇందుకోసం పట్టణంలోని డిపో రోడ్డు, జే.ఎన్ రోడ్డుతోపాటు మున్సిపాలిటీ ముందున్న రోడ్లను ఎంపిక చేశారు. మున్సిపాలిటీ ఆదేశాలు పాటించని షాపులపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ బ్యాగుల వాడకానికి బదులు న్యూస్ పేపర్‌తో తయారు చేసే బ్యాగులను ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ బ్యాగుల తయారీ కోసం ఇప్పటికే మెప్మా అధికారులు సంగారెడ్డికి వెళ్లి దాని తయారీని క్షుణ్ణంగా తెలుసుకొని వచ్చినట్లు తెలిసింది. కాగా పట్టణంలోని మహిళా గ్రూప్ సభ్యులకు పేపర్ బ్యాగుల తయారీపై శిక్షణ ఇచ్చి వాటిని తయారు చేయించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. బ్యాగుల తయారీతో మహిళా సంఘాల సభ్యులకు జీవనోపాధి లభించడంతోపాటు పట్టణంలో వందశాతం ప్లాస్టిక్ నిషేధం అమలవుతుందని అధికారులు భావిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఈ పేపర్ బ్యాగులను అన్ని షాపుల యజమానులు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు సహకరించాలి ప్లాస్టిక్ రహిత పట్టణం కోసం ప్రజలంతా సహకరించాలి. ప్లాస్టిక్‌తో క్యాన్సర్ వ్యాధితోపాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతిని కరువు, కాటకాలకు కారణమవుతోంది. ప్లాస్టిక్‌తో ఇంతటి ప్రమాదం పొంచి ఉన్నందున దీని వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. దీనికి ప్రజలంతా సహకరించాలి. - మల్లికార్జున్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్, మెదక్ ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలే మానవ మనుగడకు పెనుముప్పుగా తయారైన ప్లాస్టిక్‌ను మెదక్ పట్టణంలో పూర్తిగా నిషేధించాం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్లాస్టిక్ వాడినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పట్టణంలో షాపులు, హోటళ్లపై దాడులుచేసి జరిమానాలు విధించాం. అక్టోబర్ 2వరకు వందశాతం నిషేధం అమలు చేస్తాం. - షాదుల్లా, శానిటేషన్ అధికారి, మెదక్ పేపర్ బ్యాగుల తయారీలో మహిళలు ముందుండాలి పట్టణంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నందున పేపర్ బ్యాగుల తయారీ విధానం తెలుసుకునేందుకు మెప్మా అధికారులను ఇప్పటికే సంప్రదించాం. త్వరలోనే మహిళా సంఘాల సభ్యులకు వాటి తయారీపై శిక్షణ ఇప్పిస్తాం. పేపర్ బ్యాగుల తయారీతో ఆదాయం సమకూరుతుంది. దీనికోసం మహిళలకు రుణాలిస్తాం. - ప్రసాదరావు, మున్సిపల్ కమిషనర్, మెదక్ -
కేసీఆర్‌కు పాదాభివందనం
కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ స్పందన మెదక్ సంబరాల్లో పాల్గొన్న పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్: మెదక్ పట్టణ కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు. ప్రత్యేక జిల్లాను ప్రకటిస్తూ ప్రభుత్వం ముసాయిదాను జారీ చేసిన నేపథ్యంలో సోమవారం మెదక్ పట్టణంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎన్నో యేళ్ల నాటి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కేసీఆర్ ఆశీస్సులతో తీరిందన్నారు. ప్రత్యేక జిల్లాను ప్రకటించిన తండ్రిలాంటి సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. జిల్లా సాధన కోసం సహకరించిన మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్, అందోల్, దుబ్బాక ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, బాబూమోహన్, సోలిపేట రామలింగారెడ్డిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
రాముడుపాలెంలో ఉపసభాపతి పుష్కరస్నానం
నడకుదురు (చల్లపల్లి) : ఏపీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కుటుంబసమేతంగా మంగళవారం ఉదయం రాముడుపాలెం పుష్కరఘాట్‌లో స్నానమాచరించారు. వారికి ప్రజా ప్రతినిథులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. బుద్ధప్రసాద్, ఆయన సతీమణి విజయలక్ష్మి, కుమారుడు మండలి వెంకట్రామ్ (రాజా), ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్‌లు పుష్కరస్నానం చేశారు. అనంతరం సర్పంచ్ పుట్టి వీరాస్వామి నూతన వస్త్రాలు బహూకరించగా, అర్చకస్వాములు, జంగందేవరలు ఆశీర్వచనం పలికారు. -
‘కడియం’పై ఆగ్రహం
సిద్దిపేట జోన్: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మహిళ ఉపాధ్యాయులను కించపర్చేలా వ్యాఖ్యాలు చేశారంటూ బుధవారం రాత్రి సిద్దిపేటలో మహిళ టీచర్లు స్థానిక పాత బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత మహిళ ఉపాధ్యాయుల సంఘం అద్వర్యంలో వెంకటేశ్వరాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఉదయరాణి, సుకన్య, సాయిశ్రీ, సౌజన్య, సరళ, యాదమ్మ, శోభరాణి, శ్రీవాణి, అనిత, ఆరుణ, విజయ, స్వాతి, పద్మ, మాదవి, యశోద, తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణవేణి విగ్రహ ఏర్పాటుపై చర్చ
నాగాయలంక : స్థానిక శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్‌లో నది బ్యాక్‌డ్రాప్ అనుసంధానంగా కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ప్రధాన మార్గానికి అభిముఖంగా నదిని తాకిస్తూ విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కమిటీ సభ్యులతో ఆయన అభిప్రాయపడ్డారు. పుష్కరఘాట్ కేంద్రంగా జరిపే సాంస్కృతిక కార్యక్రమాలు, హారతి తదితర అంశాలపై చర్చించారు. శ్రీరామపాదక్షేత్రం ఆలయాల పునర్నిర్మాణ పనులను కూడా బుద్ధప్రసాద్ పరిశీలించారు. ఏఎంసీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, ఎంపీపీ సజ్జా గోపాలకృష్ణ (జీకే), ఏఎంసీ మాజీ చైర్మన్ తుంగల కోటేశ్వరరావు, డీసీ చైర్మన్ అంబటి లక్ష్మణప్రసాద్, ఎంపీటీసీ తలశిల స్వర్ణలత, డీఈ ఎం.మారుతీప్రసాద్, లాఖిత కనస్ట్రక్షన్స్ అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఉపసభాపతిగారూ.. పడిపోతున్నామయ్యా..
అవనిగడ్డ: నాలుగు గ్రామాలకు ప్రధాన రహదారి అది. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కార్యాలయానికి వెళ్లేందుకు ఈ దారే ప్రధాన ఆధారం. అంతటి ప్రాధాన్యమున్న ఈ తారురోడ్డును మట్టిరోడ్డుగా మార్చేశారు. కొత్తపేట రోడ్డులో ఉన్న రజకుల చెరువుకు పైపులైన్ వేసేందుకు వారం రోజుల క్రితం పనులు చేశారు. తూములు వేశాక మట్టిని తొలగించకుండా వదిలేశారు. కొన్నిచోట్ల మట్టిదిబ్బలను తొలగించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి కరిగిపోవడంతో తారురోడ్డు మట్టిరోడ్డుగా మారిపోయింది. చినుకు పడితే ఈ దారిపై వెళ్లేందుకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పుష్కర రహదారి ఇదే కొత్తపేట, రామకోటిపురం, తిప్పపాలెం, రామచంద్రపురం గ్రామాలతో పాటు డిఎస్సీ, గ్రూప్ పరీక్షలకు శిక్షణ పొందేవారితో నిత్యం ఆ రహదారి కిటకిటలాడుతుంది. మండలంలోనే అతిపెద్ద పుష్కరఘాట్ కొత్తపేటకు వెళ్లేందుకు ఈ రహదారే ఏకైక మార్గం. త్వరలో జరగనున్న పుష్కరాలకు ఈ మార్గంలో వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. రెండు పెద్ద విద్యాసంస్థలతో పాటు రెండు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. తూముల కోసం వేసిన మట్టిని తొలగించక పోవడంతో వాహనాలు మట్టిలో దిగిపోతుండటంతో అవస్థలు పడుతున్నారు. ఉపసభాతి బుద్ధప్రసాద్ కార్యాలయం, ఇల్లు ఈ రహదారిలోనే ఉంది. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రహదారికి రెండు వైపులా ఉన్న మట్టిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అంబరీష్ రాజీనామా చెల్లదు
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, సినీ నటుడు అంబరీష్ ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి తిరస్కరించారు. మండ్యా అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానంటూ అంబరీష్ ఒకే లైన్‌తో పంపిన రాజీనామా లేఖ చెల్లదని స్పష్టం చేశారు. సరైన ఫార్మాట్‌తో రాజీనామా లేఖ పంపాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ ఆయనకు సూచించారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి స్పీకర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనను కేబినెట్ నుంచి తొలగించినందుకు నిరసనగా అంబరీష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సిద్ధరామయ్య.. అంబరీష్ సహా 14 మంది మంత్రులను తొలగించి, కొత్తగా 13 మందిని కేబినెట్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి భగ్గుమంది. అంబరీష్ బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముందని భావిస్తున్నారు. మంత్రివర్గం నుంచి అంబరీష్‌ను తొలగించినందుకు ఆయన మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు సినీ ప్రముఖులు కూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ముక్కుసూటి మనస్తత్వంగలవారు, నిజాయితీవ్యక్తులు ఈ రోజుల్లో రాణించలేరంటూ అంబరీష్ భార్య, నటి సుమలత ట్వీట్ చేశారు. కాగా మంత్రి పదవి నుంచి అంబరీష్‌ను తొలగించడం సబబేనంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచారు. -
ఒకే ఆస్తి.. మూడు రిజిస్ట్రేషన్లు
► మాజీ డిప్యూటీ స్పీకర్ పసల ఆస్తుల వ్యవహారం ► రిజిస్ట్రేషన్ శాఖలో మాయజాలం సాక్షి ప్రతినిధి, ఏలూరు : విశాలాంధ్ర తొలి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత పసల సూర్యచంద్రరావు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. అలంపురం, ఆ తరువాత తాడేపల్లిగూడెం శాసనసభా నియోజకవర్గాల నుంచి 1950-1960 సంవత్సరాల మధ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన పసల ఆ తర్వాత శాసనమండలికి కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయులకు సన్నిహితుడిగా ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన పసల సూర్యచంద్రరావు ఆస్తులపై భూబకాసురుల కన్నుపడింది. తాడేపల్లిగూడెంలో ఆయనకు గల కోట్లాది రూపాయల విలువైన భూ విక్రయాలను స్వయంగా ఆయన బంధువులే వివాదాస్పదం చేస్తున్నారు. దీనికి రిజిస్ట్రేషన్ శాఖ కూడా వంతపాడటం గమనార్హం. 2004 జనవరి 17న పసల సూర్యచంద్రరావు మృతి చెందగా, ఆ తర్వాత ఆయన ఆస్తుల వ్యవహారాలు రచ్చకెక్కాయి. తాడేపల్లిగూడెం ఓవర్ బ్రిడ్జికి సమీపంలో ఉన్న ఐదు ఎకరాల 50 సెంట్ల(ఆర్ ఎస్ 216, 217-2బీ) భూమిలో సుమారు 9వేల గజాల స్థలానికి సంబంధించి ఆయన కుమారులైన సిద్ధార్థ, సాయి రూ.95 లక్షలకు చెక్కులు తీసుకుని గుడిమెట్ల బాపిరెడ్డి అనే వ్యక్తికి పవర్ ఆప్ అటార్నీ (జీపీఏ) రాశారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2005 ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే, ఆ రూ.95 లక్షలకు సంబంధించి బాపిరెడ్డి చెల్లని చెక్కులు ఇవ్వడంతో ఆ తర్వాత సిద్ధార్థ, సాయి కోర్టులో కేసు వేశారు. జీపీఏను రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో వారిద్దరూ అడ్డదారి తొక్కారు. ఏలూరు, పెనుగొండల్లో రిజిస్ట్రేషన్ అదే 9 వేల గజాల స్థలాన్ని విజయవాడకు చెందిన రావిసూర్యప్రకాశ్బాబు అనే వ్యక్తికి విక్రయించారు. సూర్య ప్రకాశ్‌బాబు నుంచి రూ.1.20 కోట్లు తీసుకుని ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అతని పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా ఒకే స్థలాన్ని రెండుచోట్ల రిజిస్ట్రేషన్ చేయించిన వాళ్లు మరోసారి ఇదే స్థలంలో కొంత భాగాన్ని పెనుగొండలో మరో వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. 2016 ఫిబ్రవరిలో పసల సిద్ధార్థ ఉంగుటూరు వాస్తవ్యుడు కె.సత్యనారాయణకు 3,500 గజాల స్థలాన్ని పెనుగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఒకే ఆస్తిని వేర్వేరు వ్యక్తుల పేరిట వేర్వేరు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయడం చూస్తుంటే ఆ శాఖ పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే పసల సూర్యచంద్రరావు ఆస్తుల విక్రయాలకు సంబంధించి మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
రాజకీయాలంటే భయమేస్తోంది-మండలి బుద్ధప్రసాద్
-నేటి పార్టీలకు సిద్ధాంతాలు లేవు -రాజకీయాలంటే భయమేస్తోంది -ఉపసభాపతి బుద్ధప్రసాద్ ఆవేదన అవనిగడ్డ(కృష్ణా జిల్లా) : కులాలు, మతాల వారీగా ప్రజలను విభజిస్తూ సమాజాన్ని కలుషితం చేస్తున్న నేటి రాజకీయాలంటే భయమేస్తోందని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయం రచ్చబండపై సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. ఒకప్పుడు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు ఉండేవని, కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసేవారని చెప్పారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. కులమతాలను ప్రోత్సహించకుండా రాజకీయాలు లేవని, అన్ని పార్టీలూ వీటిని ప్రోత్సహిస్తూ అశాంతికి కారణమవుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు అభివృద్ధి, పనిచేసే నాయకుడిని చూసి ప్రజలు ఓటేసేవారని, నేడు డబ్బులు పంచకపోతే ఓటేసే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటి పార్టీలకు సిద్ధాంతాలు లేవని, అధికారమే పరమావధిగా ఎదుటి పార్టీలను దూషించడానికే ప్రాధాన్యతనిస్తున్నాయని అన్నారు. రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోయాయని, ప్రజల బాగోగులను పట్టించుకునే తీరిక లేదని చెప్పారు. ఓటర్లను ఎలా బుట్టలో వేసుకోవాలా అనే ఆలోచనలతోనే పనిచేస్తున్నాయని, మారిన ఈ రాజకీయాలంటేనే భయమేస్తోందని తెలిపారు. యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, జాతిని జాగృతం చేసేలా మంచి వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నుకోవాలని యువతకు సూచించారు. తహశీల్దార్ వెన్నెల శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఖాదర్ బాషా, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
'మేము ప్రజలకు జవాబుదారులం'
మెదక్ : తాము ప్రజలకు జవాబుదారులుగా పనిచేస్తామే కానీ ప్రతిపక్షాలకు కాదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్‌కు వెళ్లిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. మెదక్ ఎమ్మెల్సీ ఏకగ్రీవం కావడంపై పలువురు అఖిలపక్ష నాయకులు ఇష్టానురీతిగా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. కానీ ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అధికార పార్టీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. దీనికి నిదర్శనమే ఇటీవల జరిగిన వరంగల్ ఎన్నికలన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు తాము పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున అభివృద్ధికి కొంత ఆటంకం కలుగుతోందని చెప్పారు. -
'ఆదుకోండి మేడమ్..అప్పుల పాలయ్యాను'
మెదక్ : దేశానికి వెన్నెముక అయిన అన్నదాతల పరిస్థితి నేడు దీనంగా మారింది. సోమవారం మెదక్ మండలం కూచన్‌పల్లికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిని సాయం చేయాలంటూ ఓ రైతు అర్థించడం చూసినవారిని కదిలించింది. 'ఆదుకోండి మేడమ్.. బోర్లువేసి అప్పులపాలయ్యాను..' అంటూ డిప్యూటీ స్పీకర్‌కు చిలుముల దశరథం అనే రైతు వినతి పత్రం అందజేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, మూడు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదని చెప్పాడు. వర్షాధార పంటలు సాగు చేద్దామన్నా... ఖరీఫ్‌లో వర్షాలు లేకపోవడంతో ఎలాంటి పంట వేయలేదన్నాడు. బోర్లు వేసేందుకు, కుటుంబ పోషణకు చేసిన అప్పులు లక్షల్లో పేరుకుపోయాయని, వాటిని తీర్చే మార్గం కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కుటుంబానికి తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నానంటూ డిప్యూటి స్పీకర్ ముందు తనగోడు వెళ్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన ఆమె అక్కడే ఉన్న ఆర్డీఓకు ఆదేశాలిస్తూ... రైతు దశరథంకు సబ్సిడీపై రెండు గేదెలు ఇప్పించడంతోపాటు అప్పులవారి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. -
మల్లన్న సేవలో డిప్యూటీ స్పీకర్
శ్రీశైలం : శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను మంగళవారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ప్రధానాలయ గోపురం వద్ద ఈఓ సాగర్‌బాబు వారికి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర విశేషపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందజేయగా, ఈఓ స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలతో పాటు జ్ఞాపికను అందజేశారు. -
తిరుమల మ్యూజియం అభివృద్ధి చేయాలి
తిరుమల: తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియంను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర శాసనసభ ఫిర్యాదుల కమిటీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమలలోని మ్యూజియంను అక్షరధామ్ మ్యూజియం తరహాలో తీర్చిదిద్ది, శ్రీవారి వైభవ ప్రాశస్త్యాన్ని, క్షేత్ర మహిమను భక్తకోటికి చేరుకునే కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీకి సూచన చేస్తామన్నారు. టీటీడీ ప్రచురణలు, సాహిత్య సంపదను ఇంటెర్నెట్ ద్వారా జన బాహుళ్యానికి చేరవేసేలా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ధార్మిక సంస్థ అయిన టీటీడీ ధర్మప్రచారానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. -
రావడం.. పోవడం.. జీతాలు తీసుకోవడమేనా?
రామచంద్రాపురం: ‘ఉద్యోగమంటే... కార్యాలయానికి రావడం.. కూర్చోవడం.. పోవడం.. జీతాలు తీసుకోవడమేనా?’ అని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి జీహెచ్ఎంసీ ఉపకమిషనర్ విజయలక్ష్మిని నిలదీశారు. బుధవారం ఆమె రామచంద్రాపురం పట్టణంలోని ఎల్ఐజీ, హెచ్ఐజీ, జ్యోతినగర్ కాలనీల్లో పర్యటించారు. నెల రోజుల క్రితం స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా వచ్చిన సమస్యలను అధికారులు ఎంతవరకు పరిష్కరించారో ఆరా తీశారు. ఒక సమస్య కూడా పరిష్కారానికి నోచుకోక పోవడంతో ఆమె విస్మయాన్ని వ్యక్తం చేశారు. నాటినుంచి నేటివరకు పారిశుద్ధ్య అధికారులు ఒక్కసారి కూడా తమ కాలనీకి రాలేదని స్థానికులు డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆమె జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీల్లో ఎందుకు పర్యటించలేదంటూ ఉపకమిషనర్ విజయలక్ష్మిని ఆమె నిలదీశారు. ఆమె పొంతనలేని సమాధానం చెప్పడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్వయంగా సూచించిన సమస్యలనే పరిష్కరించక పోతే తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ఆమె అధికారులను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ముందుకు పోతున్న తరుణంలో ఇక్కడ అధికారులు ప్రజా సమస్యలను పట్టించుకోక పోవడం, స్వయంగా వచ్చి సమస్యను చెప్పినా వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. స్వయంగా సీఎం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ చెత్తను ఎత్తి వేస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ హరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ పనితీరును మార్చుకోక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే మహీపాల్‌రెడ్డి మాట్లాడూతూ.. పనిచేయని అధికారులకు ప్రజలే సరైన గుణపాఠం నేర్పుతారని తెలిపారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, పెద్ద సమస్యలుంటే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటామన్నారు. -
'తెలంగాణ ఇస్తే అంధకారం అవుతుందన్నారు'
మెదక్: "ప్రత్యేక తెలంగాణ ఇస్తే రాష్ట్రం అంధకారం అవుతుంది" అని సమైక్యాంధ్ర నాయకులు అన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆమె సొంత జిల్లా మెదక్‌లో విలేకరులతో మాట్లాడారు. అరవై ఏళ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ 24 గంటల సింగిల్ ఫేజ్ కరెంట్ అందిస్తున్నారని ఆమె చెప్పారు. -
'మిషన్ కాకతీయ' పనుల్లో డిప్యూటీ స్పీకర్
మెదక్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంలో రాజకీయనాయకులు, అధికారులు పాలు పంచుకుంటున్నారు. తాజాగా మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని కవలంపేట చెరువును టీయూడబ్ల్యుజే (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) దత్తత తీసుకుంది. ఈ చెరువులో పూడికతీత పనులను గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చింతా ప్రభాకర్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్ పైనే.. పట్టాల ఆశలు
- అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ నిధుల కోసం ఎదురుచూపులు - నిధులు మంజూరు చేయాలి: డిప్యూటీ స్పీకర్ మెదక్: పుష్కర కాలంగా రైల్వేలైన్ కల ఈసారి బడ్జెట్లోనైనా సాకారమవుతుందా? అని మెతుకుసీమ ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుపడుతూ అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో రైల్వేబడ్జెట్ పైనే ఆశలు పెంచుకుంటున్నారు. అక్కన్నపేట-మెదక్‌కు 17.2 కిలో మీటర్ల దూరం రైల్వేలైన్ వేయాలని 12 ఏళ్లుగా ఈ ప్రాంత వాసులు రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నారు. ఈ మేరకు 2012-13బడ్జెట్లో రూ.129.32కోట్ల అంచనా వ్యయంతో రైల్వేలైన్ మంజూరైంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 50శాతం ఖర్చు భరిస్తూ రైల్వేలైన్ ఏర్పాటు కోసం ఉచితంగా భూమిని సమకూర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు 131.14హెక్టార్ల భూమి అవసరం ఉంటుందని, అందులో 9.66 హెక్టార్ల అరణ్యభూమి ఉందని సర్వేలో నిర్ధారణ అయింది. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు ఉన్న 17.20 కిలో మీటర్ల దూరంలో లకా్ష్మపూర్, శమ్నాపూర్, మెదక్ పట్టణాల వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మధ్యలో 35వంతెనలు నిర్మించాల్సి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇందుకనుగుణంగా 19-01-2014న అప్పటి మెదక్ ఎంపీ విజయశాంతి, అప్పటి మంత్రి సునీతారెడ్డి రైల్వేలైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 కోట్లు విడుదల కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 35.26 కోట్లు మంజూరయ్యాయి. 2015 జనవరిలో భూ సేకరణ కోసం రూ.25 కోట్లు, రైల్వేలైన్ కోసం రూ.10.26 కోట్లు మంజూరు చేశారు. కాగా రైల్వేలో సంస్కరణల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో కొత్త ప్రతిపాదనలకు అవకాశం ఉండదని భావిస్తూ పాత ప్రతిపాదనల నిధులను వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్లో పూర్తిస్థాయి ప్రాజెక్ట్ నిధులు మంజూరయితే అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులు ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది. పూర్తిస్థాయి నిధులు మంజూరు చేయాలి: పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ 2015-16కి సంబంధించిన రైల్వే బడ్జెట్లో అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ కోసం కేంద్ర ప్రభుత్వం తనవంతు పూర్తి నిధులను మంజూరు చేయాలి. మిగతా నిధులను ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ప్రతిపాదనలు పంపారు. కేంద్రం నిధులు మంజూరు చేస్తే త్వరలో పనులు ప్రారంభమై రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయి. రైల్వేలైన్ ఏర్పడితే సామాన్య ప్రజలకు ఉపాధి దొరకడంతోపాటు ఎంతో మేలు జరుగుతుంది. మెదక్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు పర్యాటక శాఖ అభివృద్ధి చెందుతుంది. -
విధానసభ సమావేశాలు మొదలు నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ : విధానసభ రెండు రోజుల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకున్నారు. రామ్నివాస్ గోయల్ స్పీకర్‌గా, వందనా కుమారి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. విధానసభ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన 67 మంది ఆప్ సభ్యులతో పాటు ముగ్గురు బీజేపీ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి గోపాల్‌రాయ్ అందరికంటే ముందు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన చౌదరి ఫతేసింగ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత స్పీకర్, డిప్యూటీ స్పీక ర్ల ఎన్నిక జరిగింది. షహదరా ఎమ్మెల్యే రామ్నివాస్ గోయల్‌ను స్పీకర్‌గా, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే వందనా కుమారిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన రామ్ నివాస్ గోయల్‌ను ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ పోడియం వద్దకు తీసుకెళ్లారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంగళవారం విధానసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగంలో ఆప్ సర్కారు విధానాలు ప్రతిబింబించనున్నాయి. మహిళల భద్రతపట్ల ప్రభుత్వానికి గల నిబద్ధత, అధికార యంత్రాంగంలో అవినీతిని నిర్మూలన, విద్యుత్తు, నీటి సరఫరా అంశాలతోపాటు నగరవాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎల్జీ తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. ఆ తరువాత విద్యుత్తు చార్జీల తగ్గింపు, ఉచిత నీటి సరఫరా వంటి ఎన్నికల హామీలపై ప్రభుత్వం చర్చ జరపాలనుకుంటోంది. అయితే సమయాభావం కారణంగా విస్తృత చర్చ జరిగే అవకాశం లేదు. చర్చ అనంతరం ధన్యవాద తీర్మానంతో ఈ సమావేశాలు ముగుస్తాయి. 70 మంది సభ్యులున్న ఢిల్లీ విధానసభ సమావేశాలు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం లేకుండా తొలిసారిగా జరుగుతున్నాయి. బీజేపీ సభ్యులు కూడా ముగ్గురే ఉండడంతో ప్రతిపక్ష పాత్రినిధ్యం నామమాత్రమైపోయింది. -
కాళేశ్వరున్ని దర్శించుకున్న డిప్యూటి స్పీకర్
కరీంనగర్ (మహదేవపూరం): త్రివేణి సంగమ క్షేత్రంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని డిప్యూటిస్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి సందర్శించారు. సోమవారం కరీంనగర్ జిల్లా మహదేవపురం మండలం కాళేశ్వరం చేరుకున్న డిప్యూటి స్పీకర్ కుటుంబసభ్యులతో సహా పూజలు నిర్వహించారు. -
వనిత మహా విద్యాలయ వార్షికోత్సవం
-
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి
మెదక్ మున్సిపాలిటీ: వైద్యులు నిస్వార్థంగా పని చేయకుంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్ని సౌకర్యాలు కల్పించినా ప్రయోజనం శూన్యమని డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని ఆమె తనిఖీ చేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ కలెక్టర్ రాహుల్ బొజ్జాతో కలిసి స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఆస్పత్రి వై ద్యులు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీల్లో ఉన్న సమస్యలతో పాటు వైద్యుల పని తీరుపై చర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై రోగులకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత వైద్యులదేనన్నారు. చాలా చోట్ల వైద్యులు మొక్కుబడిగా పని చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. రామాయం పేట పీహెచ్సీ పని తీరు రోజు రోజుకు అధ్వానంగా మారుతోందన్నారు. ఇక్కడ పని చేస్తున్న వైద్యులను వెంటనే బదిలీ చేయాలని అక్కడే ఉన్న డీఎంహెచ్ఓకు సూచించారు. వైద్యులు పని తీరు మెరు గు పరుచుకోవాలని లేనిపక్షంలో చర్య లు తప్పవన్నారు. పలు పీహెచ్‌సీల్లో ఓపీ రోగులను చూడకపోయినప్పటికీ ఎక్కువ సంఖ్యలో వస్తున్నట్లు నమోదు చేస్తున్నారని, ఇలాంటి చర్యలను మానుకోవాలన్నారు. మెదక్ ఏరియా ఆస్ప త్రి పని తీరు గతంలో కన్నా కొంత మెరుగైనప్పటికీ రోగుల నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని, ఈ పద్ధతిని మానుకోవాలన్నారు. ఏరియా ఆస్పత్రిలో అంబులెన్స్‌తో పాటు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నా వైద్యవృత్తి పవిత్రమైందన్నారు. మెడికల్ ఆఫీసర్లు, వైద్యులు కింది సిబ్బందిని తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. వైద్యులు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు సాధిస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోగులను వేరే ఆస్పత్రులకు రెఫర్ చేయాలన్నారు. త్వరలో మెదక్ ఏరియా ఆస్పత్రిలో ఒక చిన్న పిల్లల వైద్యుడు, జనరల్ ఫిజిషియన్, అనస్థీషియా నిపుణుడిని నియమించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి, డీసీఏహెచ్ నరేంద్ర బాబు, ఎన్ఆర్హెచ్ఎం డీపీఓ జగన్నాథం, ఈఈ రఘు, డిప్యూటీ ఈఈ రమేశ్, ఆర్డీఓ నగేశ్ గౌడ్, మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, జెడ్పీటీసీ లావణ్య రెడ్డి, ఎంపీపీ లక్ష్మి, వివిధ ఆస్పత్రుల వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. అర్హులందరికి అసరా వర్తింపు చిన్నశంకరంపేట: ‘ఆసరా’ పథకం కింద అర్హులందరికీ పింఛన్లను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం చిన్నశంకరంపేట మండలం శాలిపేట, టి.మాందాపూర్ గ్రామాల్లో పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పింఛన్ల జాబితాలో పేర్లు లేనంత మాత్రాన ఆందోళన చెందవద్దన్నారు. మరో సారి దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు అందించేందుకు చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు, వితంతువులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ. 15 వందలు అందించేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని అసరా పథకం కింద పింఛన్ అందించి ఆదుకుంటామన్నారు. నియోజకవర్గలో రూ.125 కోట్లతో రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ నగేష్, ఎంపీపీ అధ్యక్షురాలు కృపావతి, జెడ్పీటీసీ స్వరుప, శాలిపేట, టి.మాందాపూర్ గ్రామాల సర్పంచ్‌లు మూర్తి పెద్దులు, సిద్దాగౌడ్, ఎంపీటీసీలు యాదమ్మ సత్యగౌడ్, పెంటమ్మ, ఎంపీడీఓ రాణి, తహశీల్దార్ మోహన్, సర్పంచ్‌లు రంగారావు, సత్యనారాయణ,నాగరాజ్, టీఆర్ఎస్ నాయకులు లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డిప్యూటీ స్పీకర్‌కు ఉద్యమ సెగ
మెదక్ టౌన్: డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి మరోమారు జిల్లా కేంద్ర సాధన ఉద్యమ సెగ తగిలింది. శనివారం మెదక్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మెదక్‌కు వచ్చిన డిప్యూటీ స్పీకర్ కాన్వాయ్‌ని స్థానిక రాందాస్ చౌరస్తాలో ఉద్యమకారులు అడ్డుకున్నారు. దీంతో ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో పోలీసులు ఉద్యమకారులపై తమ ప్రతాపం చూపారు. అక్కడి నుంచి ఈడ్చివేశారు. అయినప్పటికీ ఉద్యమకారులు పట్టువదలకుండా ఒకరికొకరు పట్టుకొని గొలుసుగా ఏర్పడి కాన్వాయ్కి అడ్డుగా పడుకున్నారు. దీంతో చేసేది లేక డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కారులోంచి దిగి దీక్షా శిబిరానికి వచ్చారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎవరిని అడిగి టెంట్‌వేసి దీక్షలు చేపట్టారని ఆగ్రహించారు. దీంతో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎవరినడిగి చేశారంటూ ఉద్యమకారులు ఆమెను ప్రశ్నించారు. ఒక దశలో అసహనానికి గురైన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహిస్తూ మైక్‌లు పడేసి పోలీసుల సాయంతో కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆమె వైఖరిని నిరసిస్తూ రెండు గంటలపాటు పట్టణ వ్యాపార, వాణిజ్య సంస్థల వారు స్వచ్ఛందంగా బంద్ పాటించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు డిప్యూటీ స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి రాందాస్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. అనంతరం జిల్లా కేంద్ర సాధన సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, ఓ వైపు సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న సీఎం కేసీఆర్, మెతుకు సీమ ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, స్వయంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీనే నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. జిల్లా కేంద్రం సాధించే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అఖిల పక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, కుల సంఘాల నేతలు, యువజన సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఏడుపాయల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాపన్నపేట: ఏడుపాయలను పర్యాటక కేంద్రంగా...ఆధ్యాత్మిక నిలయంగా మారుస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆమె హైదరాబాద్ - ఏడుపాయల బస్సును ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు. ఏడుపాయల అభివృద్ధికోసం ఇప్పటికే ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించామని, అందుకనుగుణంగా పనులు ప్రారంభించినట్లు చెప్పారు. రోడ్డు వెడల్పు కోసం పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఏడుపాయల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, కాటేజీలు నిర్మిస్తామన్నారు. ఘనపురం ఆనకట్టను అభివృద్ధి చేసి పర్యటన క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు. స్నానఘాట్లు ఏర్పాటు చేస్తామని, హోమశాల నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. మెదక్ జిల్లాలో తాగునీటికోసం మూడు గ్రిడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు, ఆహారభద్రత కార్డులు అందజేయనున్నట్లు డిప్యూటీ స్పీకర్ తెలిపారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పింఛన్ల పంపిణీ ఏడుపాయల దుర్గమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. మిన్పూర్లో తాగునీటి పథకానికి శంకుస్థాపన, తమ్మాయిపల్లిలో పింఛన్ల పంపిణీ, చీకోడ్, కొంపల్లి, రాంతీర్థం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ పవిత్ర దుర్గయ్య, జెడ్పీటీసీ స్వప్న, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్, కోకన్వీనర్, ఆశయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకట్రాములు, విజయలక్ష్మి , ప్రతాప్‌రెడ్డి, సంజీవరెడ్డి, ఈఓ వెంకట కిషన్‌రావు, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, మంగ రమేష్, చింతల నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెపల్లెకు బస్సు సౌకర్యం
మెదక్‌టౌన్: రాష్ట్రంలోని పల్లెపల్లెకు బస్సు సౌకర్యం కల్పిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మెదక్ బస్ డిపోలోని నూతన బస్సులకు ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీను లాభాల్లోకి తీసుకవెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆర్టీసీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 500 హైర్, 500 కొత్త బస్సులు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ సిబ్బంది సేవా ధృక్పథంతో పని చేయాలన్నారు. మెదక్ బస్ డిపోకు 10 బస్సులు అవసరం ఉండగా ఇప్పటికి ఐదు బస్సులు వచ్చాయని, మరో ఐదు బస్సులు త్వరలో వస్తాయన్నారు. మెదక్ నుంచి హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా డిపో ఆవరణలో పార్కింగ్ స్థలానికి నిధులు కేటాయించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు పద్మాదేవేందర్ దృష్టికి తీసుకవెళ్లగా, పార్కింగ్ స్థలానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీఓ నగేష్, తహశీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జునగౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జడ్పీటీసీ లావణ్యరెడ్డి, టీఎంయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, షకయ్య, పృధ్వీరాజ్, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సుభాష్‌చంద్రబోస్, మల్లేశం, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణరెడ్డిలతో పాటు కౌన్సిలర్లు టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. -
రైతులను అన్నివిధాల ఆదుకుంటాం
రామాయంపేట: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి , మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం రామాయంపేట వచ్చిన సందర్భంగా స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండో గ్రేడ్, మూడో గ్రేడ్ మక్కలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో రైతులకు కొంతమేర మేలు జరుగుతుందన్నారు. కరువు మూలంగా మొక్కజొన్న సరిగా ఎదగక పోవడంతో చాలావరకు రైతులు నష్టపోయారని, గ్రేడ్లవారీగా మక్కలను కొనుగోలు చేయడంతో వారికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రతిపక్షాలు రైతులను మభ్యపెడుతున్నాయని, ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. అనవసర విమర్శలు చేయకుండా అభివృద్ధి విషయమై సహకరించాలన్నారు. విలేకరులకు హెల్త్‌కార్డులతోపాటు ఇళ్ల స్థలా లు మంజూరు చేస్తామన్నారు. ఈసందర్భంగా ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య డిప్యూటీ స్పీకర్, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డిని సన్మానించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు, నరేన్ ట్రస్ట్ అధినేత చాగన్ల నరేంద్రనాధ్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, సర్పంచులు పాతూరి ప్రభావతి, తిర్మల్‌గౌడ్, పార్టీ జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి కొండల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్, చంద్రపు కొండల్‌రెడ్డి, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
‘డెప్యూటీ’ ఖాయం
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో వరుస విజయాలతో అన్నాడీఎంకే దూసుకు వస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరితోపాటుగా రాష్ట్రంలోని 40 స్థానాల్లో 37 స్థానాలను కైవశం చేసుకుంది. ఈ గెలుపుతో దేశంలోనే అతి పెద్ద మూడో పార్టీగా అన్నాడీఎంకే అవతరించింది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంతో సామరస్య పూర్వకంగా మెలిగేలా ఆ పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత అడుగులు వేస్తూ వచ్చారు. రాష్ట్ర అభివృద్ధి నినాదం, తమిళ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కేంద్రంతో మైత్రీకి రెడీ అవుతున్నారు. డెప్యూటీ సీటు: జాతీయ స్థాయిలో మూడో పార్టీగా అవతరించడంతోపాటుగా రాజ్యసభలో 11 మంది సభ్యులను కలిగి ఉండడం అన్నాడీఎంకేకు కలసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్లో మోడీ సర్కారుకు సంపూర్ణ మెజారిటీ ఉన్నా, రాజ్యసభలో మాత్రం లేదు. దీంతో ఏదేని కీలక ముసాయిదాలు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి వస్తే, అన్నాడీఎంకే మద్దతు తప్పనిసరి. ఈ దృష్ట్యా, ఆ పార్టీని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. పార్లమెంట్లో ఇంత వరకు ప్రధానప్రతి పక్షం ఎవరికి అన్న విషయాన్ని స్పీకర్ సుమిత్ర మహజన్ ప్రకటించ లేదు. తమకు ఆ చాన్స్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోపాటుగా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినా, వారికి ఇచ్చేందుకు సుముఖంగా లేరు. ప్రధాన ప్రతి పక్షం లేకుండానే పార్లమెంట్ ముందుకు సాగుతున్నా, డెప్యూటీ స్పీకర్ ఎంపిక అనివార్యం అయింది. ఈ పదవి అన్నాడీఎంకేకు కట్టబెట్టేందుకు బీజేపీ సర్కారు సిద్ధం అయింది. సీఎం అంగీకారం : లోక్‌సభ డెప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్‌కు సంబంధించి ఢిల్లీలోని బీజేపీ పెద్దలు, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు నెలన్నర క్రితం సమాచారం పంపించారు. ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చిన జయలలిత మంగళవారం అంగీకారం తెలపడంతో పార్టీ పార్లమెంటరీ నేత తంబిదురై నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అగ్రనేత అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ తదితరులు నామినేషన్ పత్రానికి ఆమోదం తెలపడంతో ఇక, తంబిదురై డెప్యూటీ స్పీకర్ సీటులో కూర్చోవడం ఖరారైనట్టే. తంబిదురైకు డెప్యూటీ పదవి దక్కిన దృష్ట్యా, ఇక కేంద్రంలో అన్నాడీఎంకే, బీజేపీలు స్నేహ పూర్వకంగా మెలిగినట్టే. ఈ స్నేహం కేవలం కేంద్రానికే పరిమితం అయ్యేనా, లేదా రాష్ట్రంలోను సాగేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇక, పార్టీ పార్లమెంటరీ నేతకు డెప్యూటీ స్పీకర్ పదవి దక్కడంతో, ఆయన చేతిలో ఉన్న పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఎదురు చూపులు అన్నాడీఎంకే ఎంపీల్లో బయలుదేరాయి. అయితే, అత్యధిక శాతం అన్నాడీఎంకే ఎంపీలు పార్లమెంట్లో తొలిసారిగా అడుగు పెట్టిన వారే. ఒకరిద్దరు మాత్రమే సీనియర్లు ఉన్న దృష్ట్యా, వారిలో ఒకరికి పార్టీ ప్రతి పక్ష నేత పదవి వరించే అవకాశాలున్నాయి. -
సింగూరు జలాలతో సిరులు పండాలి
►రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ►సమైక్య రాష్ట్రంలో కానిది ఇప్పుడు సాధించాం ►డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ►ఘనపురం ఆనకట్టకు 0.25 టీఎంసీల నీరు విడుదల పుల్కల్: సింగూరు జలాలతో సిరులు పండాలని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బుధవారం మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆనకట్టకు 0.25 టీఎంసీల నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఘనపురం ఆయకట్టు కింద సుమారు 12 వేల ఎకరాలలో నారుమళ్లు ఉన్నాయని ఆ పంటలను కాపాడుకునేందుకు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో నీటిని వదలాలంటే గతంలో హెచ్చార్సీకి వెళ్లిన సందర్భాలున్నాయన్నారు. సమైక్య రాష్ట్రంలో సాధించుకోనివి ఇప్పుడు అనుకున్నదే తడవుగా సాధించుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్ అన్నారు. ఇది రైతు ప్రభుత్వమని, రైతులు కోరుకున్న వెంటనే నీటిని వదులుతున్నామన్నారు. ఘనపురం ఆనకట్టకు సాగునీరు కావాలని మంత్రి హరీష్‌రావు సీఎం కేసీఆర్‌ను కోరారని, సీఎం వెంటనే నీటిని వదిలేలా ఆదేశాలు జారీ చేశారన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉండి ఎన్ని పోరాటాలు చేసినా నీరు వదిలేందుకు అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. రైతులు అడిగిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం నీరు విడుదల చేసిందన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కనకారెడ్డి, సంగమేశ్వర్‌గౌడ్, రమేష్ బస్వరాజ్, స్వామి, రాజ్‌కుమార్, శంకరయ్య, ఇన్చార్జి కలెక్టర్ శరత్, మెదక్ ఆర్డీఓ వనజాదేవి, తహశీల్దార్ ఎల్లారెడ్డి, ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ జగన్నాథం, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
ప్రజల నిర్ణయాల మేరకే అసెంబ్లీలో తీర్మానాలు
కమాన్‌పూర్: నవ తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజల నిర్ణయూల మేరకే అసెంబ్లీలో తీర్మానాలు చేసినట్లు డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆమె ఆర్జీ-3 డివిజన్ ఓసీపీ-1 ఫేస్-2లోని భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సస్యశ్యామలం కోసం అందరూ కృషిచేయూలన్నారు. ఆమేరకు ప్రభుత్వం నిధుల కేటారుుంపూ చేపడుతుందన్నారు. ఇప్పటికే 42 అంశాలపై తీర్మానం చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డల సౌభగ్యం కోసం ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీన్నీ తెలంగాణ పునఃనిర్మాణానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్ట మధు, రామగుండం డెప్యుటీ మేయర్ సాగంటి శంకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కటారి రేవతిరావు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గంట వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు భూక్య ఆశాకుమారి, వకులా దేవి, నాగరాజ కుమారి, రమాదేవి, చంద్రకళా, కాపురబోయిన భాస్కర్, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా తొలిసారిగా వచ్చిన డెప్యూటీ స్పీకర్‌ను సెంటినరీకాలనీ పార్టీ కార్యాలయంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. -
‘డెప్యూటీ’ గ్యారెంటీ!
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు రాష్ట్రంలో అన్నాడీఎంకే తన హవాను చాటుకుంది. 37 మంది ఎంపీల గెలుపుతో దేశంలోనే అతి పెద్ద మూడో పార్టీగా అన్నాడీఎంకే అవతరించింది. అలాగే, కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వంతో సామరస్య పూర్వకంగా మెలిగే విధంగా ఆ పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి నినాదం, సమస్యలు, హక్కులను ఏకరువు పెడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రాల్ని సంధిస్తూ, అమలు చేయించుకునే పనిలో నిమగ్నమయ్యారు. డెప్యూటీ పదవి: జాతీయ స్థాయిలో అత్యధిక ఎంపీలను కైవసం చేసుకున్న మూడో పార్టీగా అవతరించడంతోపాటుగా రాజ్యసభలో 11 మంది ఎంపీలను కలిగి ఉండడం అన్నాడీఎంకేకు కలసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్లో మోడీ సర్కారుకు సంపూర్ణ మెజారిటీ ఉన్నా, రాజ్యసభలో మాత్రం లేదు. దీంతో ఏదేని కీలక ముసాయిదాలు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే, అన్నాడీఎంకే మద్దతు తప్పనిసరి. ఈ దృష్ట్యా, ఆ పార్టీని తమ వైపు తిప్పుకునేందుకు కొత్త ప్రభుత్వం రెడీ అవుతోంది. పార్లమెంట్లో ఇంత వరకు ప్రధాన ప్రతి పక్షం ఎవరికి అన్న విషయాన్ని స్పీకర్ సుమిత్ర మహజన్ ప్రకటించ లేదు. తమకు ఆ చాన్స్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటుగా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు స్పీకర్‌ను విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అయితే, స్పీకర్ ఇంత వరకు తన నిర్ణయాన్ని వెల్లడించ లేదు. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే పార్లమెంట్ ముందుకు సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేకు డెప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టేందుకు బీజేపీ సర్కారు సిద్ధమైంది. కాంగ్రెస్‌కు ఇప్పుడే ప్రధాన ప్రతిపక్షం హోదా కట్ట బెట్టిన పక్షంలో, వారికే డెప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఇప్పట్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతి పక్షం ఇవ్వకుండా, ముందుగా డెప్యూటీ స్పీకర్‌ను ఎంపిక చేసే పనిలో స్పీకర్ సుమిత్ర మహజన్ ఉన్నట్టు ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. తంబిదురైకు చాన్స్ దక్కేనా : ఇప్పటికే డెప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్‌కు సంబంధించి ఢిల్లీలోని బీజేపీ పెద్దలు, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు సమాచారం పంపినట్టు తెలిసింది. ఏదేని కీలక విషయాల్లో ఆచితూచి అడుగులు వేసే సీఎం జయలలిత, ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఎదురు చూపులు పెరిగాయి. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో డెప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం తంబి దురైకు ఉంది. అలాగే, యూపీఏ హయాంలో ప్రొటెం స్పీకర్‌గా ఆయన వ్యవహరించారు. ఒక వేళ డెప్యూటీ స్పీకర్ పదవికి జయలలిత అంగీకరించిన పక్షంలో ఆ ఛాన్స్ ఎంపీ తంబిదురైకు దక్కేనా అన్న చర్చ మొదలైంది. అదే సమయంలో పార్టీ పార్లమెంటరీ నేత పదవి చాన్స్ ఏ ఎంపీకి దక్కుతుందో అన్న ఉత్కంఠ తప్పదు. తంబిదురైను డెప్యూటీ స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టి, పార్లమెంటరీ నేత పదవిని మరొకరికి జయలలిత కట్ట బెట్టేనా అన్న ఉత్కంఠకు మరి కొద్ది రోజుల్లో తెర పడనున్నది. -
జిల్లాకు మరో కీలక పదవి
డెప్యూటీ స్పీకర్‌గా బుద్ధప్రసాద్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక సాక్షి, విజయవాడ : జిల్లాకు మరో కీలక పదవి లభించింది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. తాజాగా శాసనసభ డెప్యూటీ స్పీకర్‌గా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి బుద్ధప్రసాద్ మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. టీడీ పీలో సీనియర్ నేత, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్‌కు కూడా మరో కీలక పదవి దక్కవచ్చని ఆ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదీ బుద్ధప్రసాద్ రాజకీయ ప్రస్థానం.. మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు తనయుడిగా బుద్ధప్రసాద్ రాజకీయ అరగ్రేటం చేశారు. ఆయన 1977-85లో జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడిగా, పీసీసీ సంయుక్త కార్యదర్శిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బుద్ధప్రసాద్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన్ను 2013లో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి, అధికార భాషా సంఘం చైర్మన్ పదవికి రాజీనామా చేసి గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. బుద్ధప్రసాద్‌కు పదవి లభించడంతో టీడీపీ అధ్యక్షుడు జిల్లాకు పెద్దపీట వేసినట్లయింది. -
ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా మండలి
-
ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా మండలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ స్పీకర్ పదవికి మండలి పేరును ఎంపిక చేశారు. ఆయన ఎన్నిక కావడం లాంఛనమే. మండలి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకర్గం నుంచి మరోసారి ఎన్నికయ్యారు. గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేరు వినిపించినా చంద్రబాబు చివరకు మండలి వైపు మొగ్గు చూపారు. -
డిప్యూటీ స్పీకర్ గా గొల్లపల్లి సూర్యారావు!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం అయిద గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23న డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. కాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేరు ఖరారు అయ్యింది. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్‌గా కాలువ శ్రీనివాసులు పేరు ఖరారు కాగా, మరో ముగ్గురు విప్ లపై టీడీపీ కసరత్తు చేస్తోంది. విప్ లుగా బొండా ఉమా మహేశ్వరరావు, కూన రవికుమార్, జయనాగేశ్వరరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ఏకే జవహర్ పేర్లు పరిశీలిస్తోంది. -
సంక్షేమ పథకాలు పేదలకు అందాలి
సమీక్ష సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి రామాయంపేట: ప్రభుత్వ పథకాలు సక్రమంగా పేదలకు అందేలా అధికారులు కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో నష్టపోయిన రైతులకు వెంటనే ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పథకాల నిర్వహణ కోసం గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ.25కోట్లు వెనక్కి మళ్లిపోగా తాను ఆ నిధులను మళ్లీ వెనక్కి రప్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వివిధ శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మెదక్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతోపాటు ఎంపీడీఓలు, తహశీల్దార్లు, రామాయంపేట, మెదక్ జెడ్పీటీసీ సభ్యులు బిజ్జ విజయలక్ష్మి, లావణ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్‌కు ఘన స్వాగతం డిప్యూటీ స్పీకర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా గురువారం రామాయంపేటకు వచ్చిన పద్మాదేవేందర్‌రెడ్డికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు టపాసులు పేలుస్తూ బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం రామాయంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ బైక్షోరూంను ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, రామాయంపేట జెడ్పీటీసీ సభ్యులు బిజ్జ విజయలక్ష్మి, లావణ్యరెడ్డి, మాజీ ఎంపీపీ అధ్యక్షుడు పుట్టి విజయలక్ష్మి, సంపత్, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, పార్టీ యువత విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల్‌రెడ్డి, జితేందర్‌గౌడ్, ఇతర నాయకులు నార్లపూర్ నర్సింలు, స్థానిక సర్పంచ్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -
హుందాగా సభ నిర్వహిస్తా
మెదక్: తనను డిప్యూటీ స్పీకర్ పదవి వరిస్తుందని ఊహించలేదని పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని ఆర్అండ్బీ విశ్రాంతి గృహంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తనకు డిప్యూటీ స్పీకర్ పదవి రావడం గర్వంగా ఉందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు, మెదక్ ప్రజలకు వినమ్రంగా నమస్కరిస్తున్నానన్నారు. ఉన్నత పదవిలో ఉన్న తాను సభా సంప్రదాయాలను, మర్యాదను, హుందాతనాన్ని కాపాడేందుకు కృషి చేస్తానన్నారు. రాబోయే తరాలకు ఆదర్శంగా సభా కార్యకలాపాలు నిర్వహిస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారిణిగా పోరాట పటిమను ప్రదర్శించామన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తమపట్ల కఠినంగా వ్యవహరించిందన్నారు. నిర్దాక్షిణ్యంగా మార్షల్స్‌తో అసెంబ్లీ నుంచి బయటకు గెంటివేయించారన్నారు. తాము మాత్రం గత అనుభవానుల దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాల సలహాలు, సూచనలను స్వీకరిస్తామన్నారు. సద్విమర్శలను ఆహ్వానిస్తామన్నారు. రైతు రుణమాఫీలో భాగంగా రూ.18వేలకోట్లను మాఫీ చేశామని, దీంతో 25 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఆర్డీఓ వనజాదేవి డిప్యూటీ స్పీకర్‌ను సన్మానించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆమె వెంట జెడ్పీటీసీ లావణ్యారెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్‌గౌడ్, రాగి అశోక్, నాయకులు కృష్ణారెడ్డి, లింగారెడ్డి, పద్మారావుతోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మెదక్‌లో ఘన స్వాగతం మెదక్ మున్సిపాలిటీ: డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం సోమవారం మొదటిసారిగా నియోజక వర్గానికి వచ్చిన పద్మాదేవేందర్ రెడ్డికి మెదక్‌లో ఘన స్వాగతం లభించింది. పట్టణంలోని టీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు మంగళ హారతులతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్థానిక ఆర్డీఓ వజనాదేవి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశం, ఏఎంసీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, టీఆర్ఎస్ సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కరణం వెంకటేశంతో పాటు పలువురు నేతలు, అధికారులు వేర్వేరుగా ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజక వర్గ అభివృద్ధి విషయంలో అధికారులు, నాయకులు తనకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఇంజినీర్ చిరంజీవులు, టీపీఎస్ కొమురయ్య, మెదక్ డీఎస్పీ గోద్రు, పట్టణ సీఐ విజయ్ కుమార్, ఎస్సై అంజయ్య, వేణు, ఏఎస్సై రాజశేఖర్, టీఆర్ఎస్ కౌన్సిలర్లు మల్లికార్జున్ గౌడ్, రాగి ఆశోక్, మాయ మల్లేశం, సలాం, జెల్ల గాయత్రి, చంద్రకళ, ఆరేళ్ల గాయత్రి, మెంగని విజయ లక్ష్మి, గోవిందు, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రావు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు క్రిష్ణా రెడ్డి, లింగారెడ్డి, గంగాధర్, హామీద్‌లతో పాటు పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నవ తెలంగాణ నిర్మాణానికి కృషి చిన్నశంకరంపేట: తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వారి త్యాగం వెలకట్టలేనిదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ 60 ఏళ్లుగా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రాంత సమస్యలపై శాసనసభలో జరిగే చర్చలకు సంపూర్ణ సహకారం అందించి తెలంగాణ అబివృద్ధికి కృషిచేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోల్పోయిన వనరులను కాపాడుకుంటూ నవ తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట జెట్పీటీసీ స్వరూప,ఎంపీటీసీలు విజయలక్ష్మి,వెంకటి,టీఆర్ఎస్ నాయకులు లకా్ష్మరెడ్డి,రామ్‌రెడ్డి, తదితరులు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
మా మంచి నాన్న
ఫాదర్స్‌డే సందర్భంగా ప్రత్యేక కథనాలు పెద్ద కొడుకుగా నా ఆశయం నెరవేర్చింది డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తండ్రి భూంరెడ్డి ముస్తాబాద్ : నాన్నంటే వేలు పట్టి నడిపించేవాడే కాదు.. కదిలే దైవం. వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చే బాధత్య వారి కడుపులో పుట్టిన బిడ్డలది. తెలంగాణ తొలి ఉద్యమంలో కళ్లు తెరిచి, మలిదశ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పద్మాదేవేందర్‌రెడ్డి పోరుబాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభలో డెప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కొండం భూంరెడ్డి, విజయ దంపతుల పెద్ద కూతురు పద్మ. ఆమె గురించి తండ్రి భూంరెడ్డి మాటల్లోనే.. దూరభారం తగ్గించుకునేందుకు లేఖలతో దగ్గరయ్యేది పద్మ నా పెద్ద కూతురు. తెలంగాణ తొలి ఉద్యమం జరుగుతున్న సమయంలోనే 6.01.1969లో పద్మ జన్మించింది. ఆమె తర్వాత అనిత, కొడుకు వంశీధర్‌రెడ్డి. చదువులో ఎప్పుడు ముందుండే పద్మ పట్ల నాకు కొద్దిగా ప్రేమ ఎక్కువే. ఏడు వరకు నామాపూర్‌లోనే చదివింది. ఎంతో చలాకీగా ఉండేది. స్కూల్లో భరతమాత వేషాలు వేసేది. అల్లూరిసీతారామరాజు ఏకపాత్రభినయంతో ఆకట్టుకునేది. క్లాస్‌లో ఇతరుల కంటే ఒక్క మార్కు తక్కువ వచ్చినా పట్టుదలతో చదివి ఫస్ట్ వచ్చేది. నేను చెన్నూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు తరచూ నాకు పద్మ లేఖలు రాసేది. ఉత్తరాలతో కుటుంబ క్షేమ సమాచారాలు అందించేది. నా కొడుకు జబ్బుపడ్డప్పుడు పెద్ద కొడుకుగా వెన్నంటి నిలిచి మాకు ఓదార్పునిచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. అనుకున్న లక్ష్యం కోసం మొండిగా పనిచేసేది. తెలంగాణ తొలి శాసనసభకు డెప్యూటీ స్పీకర్ అయింది. తండ్రిగా ఇంతకంటే ఏం కావాలి. ఆడపిల్లను అనే భయం ఆమెలో ఏనాడు నేను చూడలేదు. - కొండం భూంరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి తండ్రి నాన్న లేఖలే పాఠాలయ్యాయి.. ఏడో తరగతి వరకు నామాపూర్‌లో చదివా. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వివిధ ప్రాంతాల్లో పనిచేసేవాడు. నాకేమో నాన్న దగ్గర ఉండాలని కోరిక. ఐదో తరగతిలో ఉన్నప్పుడే నాన్నకు లేఖలు రాసేదాన్ని. అమ్మ విజయ చెబుతుంటే నేను ఉత్తరాలు రాస్తూ, క్షేమ సమాచారాలు తెలుసుకునేదాన్ని. నాన్న రాసే లేఖల్లో ఎన్నో మంచి విషయాలు ఉండేవి. అమ్మ, చెల్లి, తమ్ముడిని బాగా చూసుకోవాలని, పట్టుదలతో చదవాలని చెప్పేవారు. అలా నాన్న ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తి చేశా. డిగ్రీ కాగానే దేవేందర్‌రెడ్డితో నిశ్చితార్థం చేశారు. చదువుకోవాలన్న నా కోరికను నాన్న దేవేందర్‌రెడ్డితో చెప్పారు. పెళ్లైన అనంతరం న్యాయ శాస్త్రం చదివించారు. అప్పుడే మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా. ఎమ్మెల్యేగా తెలంగాణ బాధలను అసెంబ్లీలో వినిపించే అవకాశం వచ్చేది కాదు. ఇప్పుడు అదే అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర తొలిశాసనసభకు ఉపసభాపతిగా ఎన్నిక కావడం వెనుక తెలంగాణ ఉద్యమ నేపథ్యం, నాన్న పెంపకం, దేవేందర్‌రెడ్డి ప్రోత్సాహం ఉన్నాయి. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాల్గొనడం నా ముందు ఉన్న సవాల్. -పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనసభ డెప్యూటీ స్పీకర్ నాన్న నుంచి నేర్చుకున్నా.. నాన్నది అరుదైన వ్యక్తిత్వం. అంతకుమించి మాటకు కట్టుబడే వ్యక్తి. నాన్న గురించి చెప్పాలంటే నిజంగానే మాటలు రావడం లేదు. తండ్రిగా తను చేయాల్సిందంతా చేశారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంత మొండిగా వ్యవహరించారో అందరికి తెలిసిందే. తెలంగాణ రావడంతో ఎంతో ఆన ందంగా ఉంది. కేసీఆర్ తనయుడిగా ఈ జీవితానికి నాకిది చాలు. తండ్రి పేరు చెడగొట్టకుండా ఉండాలన్నదే నా లక్ష్యం. ప్రజాజీవితంలో ఎప్పుడూ బిజీగా ఉండే నాన్న మాకు తక్కువ సమయం కేటాయించారు. నిజంగానే ఇప్పుడు నేను అదే అనుభవిస్తున్నా. బిజీగా ఉండడమే దానికి కారణం. ప్రజల కోసం పని చేయాలన్న తత్వం నాన్నది. నాన్న ప్రభావం నాపై చాలానే ఉంది. అమ్మతో మేం ఎక్కువ గడిపేవాళ్లం. తండ్రిగా అన్ని బాధ్యతలు నెరవేర్చారు. నేనెంతో నేర్చుకున్నా. ఇంతకంటే ఏం చెప్పాలో మాటలు రావడం లేదు. - సిరిసిల్ల -
డిప్యూటి స్పీకర్‌గా పద్మా దేవేందర్ రెడ్డి
-
పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విపక్షాలు కూడా పద్మా దేవేందర్ రెడ్డి అభ్యర్ధిత్వానికి మద్దతు తెలపడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు స్పీకర్ మధుసూదనాచారి గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు పద్మ దేవేందర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. మరోవైపు తెలంగాణ శాసనసభ ఉపసభాపతిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. -
డిప్యూటి స్పీకర్‌కు కేసీఆర్ అభినందనలు
-
చీఫ్‌విప్‌గా నల్లాల ఓదెలు
డిప్యూటీ స్పీకర్‌గా పద్మ ఏకగ్రీవమే సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వ చీఫ్‌విప్‌గా చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌ను విప్‌గా నియమించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. చీఫ్‌విప్‌గా ఏనుగు రవీందర్ రెడ్డి, జలగం వెంకట్రావు తదితరుల పేర్లను అనుకున్నప్పటికీ వారు విముఖత వ్యక్తం చేశారు. దీనితో నల్లాల ఓదెలుకు ఈ పదవిని కట్టబెట్టాలని నిర్ణయించారు. నామినేషన్ దాఖలు చేసిన పద్మ.. ఇదిలాఉండగా, డిప్యూటీ స్పీకర్ పదవికి పద్మా దేవేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి ఆమె తన నామినేషన్‌ను శాసనసభా కార్యదర్శి ఎన్.రాజాసదారాంకు అందించారు. బుధవారం సాయంత్రంతో నామినేషన్ గడువు ముగిసే సమయానికి పద్మా దేవేందర్ రెడ్డి నామినేషన్ మాత్రమే దాఖలైంది. దీనితో డిప్యూటీ స్పీకర్‌గా పద్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు శాసనసభలో గురువారం ప్రకటించనున్నారు. నామినేషన్ దాఖలు తరువాత స్పీకరు ఎస్.మధుసూదనాచారిని పద్మా దేవేందర్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వారు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. -
జిల్లాకు రెండోసారి దక్కిన డిప్యూటీ స్పీకర్ పదవి
సంగారెడ్డి డివిజన్: జిల్లాకు చెందిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. తెలంగాణ శాసనసభ తొలి డిప్యూటీ స్పీకర్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఆమె ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికను గురువారం అధికారికంగా ప్రకటిస్తారు. వెనువెంటనే ఆమె డిప్యూటీ స్పీకర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాకు డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఇది రెండోపర్యాయం. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రస్తుత సీఎం కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి డిప్యూటీ స్పీకర్ పదవి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అయిష్టంగానే డిప్యూటీ స్పీకర్ పదవిని అంగీకరించారని తెలిసింది. డిప్యూటీ స్పీకర్ పదవికి ఆమె పేరును టీఆర్ఎస్ అధినేత పరిశీలించిన నాటి నుంచే పద్మాదేవేందర్‌రెడ్డి తన అయిష్టతను వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే కేసీఆర్ మహిళ, విద్యాధికారులైన పద్మాదేవేందర్‌రెడ్డికే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. పద్మాదేవేందర్‌రెడ్డి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవిపై అంతగా ఆసక్తి చూపలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టడం వల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉండదని భావించిన ఆమె భావించారు. అయితే సీఎం కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి ఆమె పేరునే ఖరారు చేయటంతో పద్మాదేవేందర్‌రెడ్డికి మరో మార్గం లేకుండాపోయింది. బుధవారం పద్మాదేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఒకే ఒక్క నామినేషన్ రావటంతో డిప్యూటీ స్పీకర్‌గా ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. జిల్లాకు చెందిన మరో మంత్రి హరీష్‌రావు పద్మాదేవేందర్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నికలో కీలకపాత్ర పోషించారు. ఆనందంగా ఉంది: పద్మాదేవేందర్‌రెడ్డి తెలంగాణ తొలి డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావటం సంతోషంగా ఉందని పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం గర్వంగా భావిస్తున్నారు. సభలో హుందాగా వ్యవహరించి శాసనసభా వ్యవహారాలు సక్రమంగా జరిగేలా చూస్తానని, డిప్యూటీ స్పీకర్‌గా రాగద్వేషాలకు అతీతంగా పనిచేసి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తానని ఆమె పేర్కొన్నారు. -
ప్రస్తుత పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేం: కేసీఆర్
హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ పదవిపై టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తగ్గటం లేదు. స్పీకర్ ఎన్నిక ఏకపక్షంగా జరిగినందున డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలంటూ విపక్ష నేతలు బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ పదవిపై వెనక్కి తగ్గలేమని ఆయన విపక్షాలను సముదాయించారు. మరోవైపు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఇప్పటికే టీడీపీ, బీజేపీ, ఎంఐఎం, వామపక్ష పార్టీలు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపాయి. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కూడా పద్మాదేవేందర్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. పలువురు కాంగ్రెస్ నేతలు పద్మా దేవేందర్‌రెడ్డికి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే మరి కొందరు నేతలు ప్రతిపక్షాలకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
'ప్రతిపక్షాలతో సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తాం'
హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రతిపక్ష సభ్యులు తర్జన భర్జన పడుతున్నారు. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వటం సంప్రదాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గీతారెడ్డి అన్నారు. అయితే అధికార టీఆర్ఎస్ డిప్యూటీ స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించిందని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై ఇతర ప్రతిపక్షాలతో సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తామని గీతారెడ్డి తెలిపారు. డిప్యూటీ స్పీకర్‌ను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం, లేదంటే ప్రతిపక్షాలు నుంచి అభ్యర్థిని పోటీకి పెట్టడం, కాదంటే ఎన్నికకు దూరంగా ఉండటం ఈ మూడు ప్రత్యామ్నాయాలు తమ ముందు ఉన్నాయని ఆమె చెప్పారు. మరోవైపు తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడానికి ఎం.పద్మా దేవేందర్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంలేదు. డిప్యూటీ స్పీకర్‌గా ఉంటే రాజకీయంగా నష్టపోతానని, దానికన్నా ఎమ్మెల్యేగా ఉంటేనే మంచిదని పేర్కొంటున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టాలంటూ ఆమెకు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు ద్వారా కేసీఆర్ ఆదేశాలిచ్చారు. ఇందుకు పద్మ అంగీకరించలేదు. -
విస్తరణపైనే ఆశలు
ఉత్కంఠలో ‘కొప్పుల’మంత్రా.. చీఫ్ విప్పా.. ఈశ్వర్ వర్గీయుల్లో టెన్షన్ కరీంనగర్ సిటీ : ఒకటి తను వద్దన్నాడు... మరొకటి పార్టీ ఇవ్వనంది.. అన్నట్లు తయారైంది ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ పరిస్థితి. తనకు వస్తుందనుకున్న డెప్యూటీ సీఎం పదవిరాకపోగా, అధినేత ఆఫర్ చేసిన స్పీకర్ పదవి పట్ల ఆయన విముఖత చూ పారు. అయినప్పటికీ స్పీకర్, డెప్యూటీ స్పీకర్లలో ఏదో ఒక పదవి వస్తుంద నే అంతా భావించారు. చివరకు స్పీకర్‌గా మధుసూదనాచారి, డెప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. దీంతో కొప్పులకు దక్కే పదవిపై మళ్లీ చర్చ మొదలైంది. తనకు ఏ ఇతర పదవులు వద్దని, మంత్రి పద వే కావాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చెప్పిన ఈశ్వర్, అందుకు అనుగుణంగా హామీ పొందినట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. తనకు కచ్చితంగా మంత్రి పదవే వస్తుందనే భరోసాతో ఉన్న కొప్పుల, మంత్రివర్గ విస్తరణపైనే ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఆయనకు కచ్చితంగా స్థానం లభిస్తుందనే భరోసాతో ఆయన వర్గీయులు ఉన్నారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్‌కు పదవి లభిస్తుందని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. అయితే మంత్రి పదవి లభిస్తుందా, అంతే స్థాయిలో ఉన్న మరో పదవి వరిస్తుందా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఆయనకు కేబినెట్ ర్యాంకుతో సమానమైన చీఫ్ విప్ పదవి వస్తుందనే ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇవ్వగా, కొప్పులకు చీఫ్ విప్ కట్టబెట్టాలని సీఎం ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. డెప్యూటీ సీఎం, స్పీకర్, డెప్యూటీ స్పీకర్ పదవులకు కొప్పుల పేరు వినపడినా ఆ పదవులు దక్కకపోవడం, ప్రస్తుతం ఏ పదవి వస్తుందో అంచనా వేయలేకపోతుండడంతో ఈశ్వర్ వర్గీయుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈశ్వర్ మాత్రం మంత్రివర్గ విస్తర ణపైనే ఆశలు పెట్టుకున్నారు. -
నాకు డిప్యూటీ స్పీకర్ వద్దు..!: పద్మా దేవేందర్‌రెడ్డి
* పద్మా దేవేందర్‌రెడ్డి స్పష్టీకరణ * హరీష్‌రావు బుజ్జగింపులతో అయిష్టంగా అంగీకారం * నేడు నామినేషన్ దాఖలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడానికి ఎం.పద్మా దేవేందర్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంలేదు. డిప్యూటీ స్పీకర్‌గా ఉంటే రాజకీయంగా నష్టపోతానని, దానికన్నా ఎమ్మెల్యేగా ఉంటేనే మంచిదని పేర్కొంటున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టాలంటూ ఆమెకు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు ద్వారా కేసీఆర్ ఆదేశాలిచ్చారు. ఇందుకు పద్మ అంగీకరించలేదు. దీంతో మంగళవారం ఉదయం మంత్రుల చాంబర్లో ఆమెతో హరీష్‌రావు సమావేశమయ్యారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా పద్మను బుజ్జగించారు. ‘‘డిప్యూటీ స్పీకర్ హోదాలో మంత్రుల కార్యాలయాలకు వెళ్లలేం. నియోజకవర్గ అభివృద్ధి కోసం సచివాలయానికి, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుంటే పనులు కావు. డిప్యూటీ స్పీకర్‌గా ఉండి కార్యాలయం, బుగ్గకారు, అటెండర్‌తో సంతోషపడటానికేనా ఎమ్మెల్యే అయింది? నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకుంటే ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ ప్రజలకు దూరమవుతా. డిప్యూటీ స్పీకర్ పదవి వల్ల రాజకీయంగా నష్టమే. దానికంటే ఎమ్మెల్యేగా ఉండటమే మంచిది’’ అని పద్మా దేవేందర్‌రెడ్డి తెగేసి చెప్పారు. ‘‘నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి వంటివేమీ ఉన్నా సిద్దిపేటను చూసుకున్నట్టుగానే మెదక్ నియోజకవర్గాన్ని కూడా చూసుకుంటా. న్యాయశాస్త్రంలో పట్టా ఉన్నందున సభా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలరని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో విస్తరణకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అవకాశం వస్తుంది’’ అని హరీష్‌రావు బుజ్జగించారు. దీంతో అయిష్టంగానే ఆ పదవి చేపట్టడానికి ఆమె అంగీకరించారు. బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రెండో ఎమ్మెల్సీ ఎస్సీలకు...? గవర్నర్ కోటాలోని రెండో ఎమ్మెల్సీని ఎస్సీలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే మంత్రివర్గంలో అవకాశం పొందిన నాయిని నర్సింహారెడ్డికి ఒక ఎమ్మెల్సీ అనివార్యంగానే ఇవ్వాల్సి ఉంది. ఇక రెండో ఎమ్మెల్సీ కోసం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన ముఖ్య నాయకులు చాలా మంది పోటీపడుతున్నారు. సామాజికవర్గాల సమతూకం కోసం ఒకటి.. ‘రెడ్డి’ సామాజికవర్గానికి ఇస్తుండటంతో రెండోదాన్ని ఎస్సీలకు ఇవ్వాలని కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడే ఉంటాడన్న కేసీఆర్ ప్రకటనను ఉదహరిస్తూ మందకృష్ణ చేస్తున్న దాడితో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీలకు అవకాశం ఇవ్వలేకుంటే ఎస్టీలకు ఇచ్చే ప్రతిపాదన కూడా కేసీఆర్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. -
డిప్యూటీ స్పీకర్‌గా పద్మ..!
నేడు నామినేషన్... ఎన్నిక లాంఛనం? మరో పదవిపై జిల్లాలో చర్చ గులాబి దళపతి సర్కార్‌లో మెతుకు సీమకు మరో ప్రాతినిధ్యం లభించింది. తెలంగాణ రాష్ట్ర శాసన సభ డిప్యూ టీ స్పీకర్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేరు దాదా పు ఖాయమైంది. బుధవారం ఆమె ఉప సభాపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. స్పీకర్ తరహాలోనే డిప్యూటీ స్పీక ర్ పదవిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కాబట్టి పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నిక లాంఛనమే కానుంది. ఆ పదవి పట్ల ముందుగా ఆమె అయిష్టతను వ్యక్తం చేసినప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేర కు కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జిలా ్లకు ఇంకా రెండు పదవులు ఇస్తానని ఈ నెల 4న గజ్వేల్ నియోజకవర్గ కేం ద్రంలో జరిగిన రివ్యూ మీటింగ్‌లోనే సీఎం కేసీఆర్ ప్రకటిం చారు. అన్నట్లుగానే ఆయన జిల్లాకు అవకాశం కల్పించారు. మరోటి మంత్రి పదవా..? విప్పా? ఇక రెండో పదవిపైనే సందిగ్ధం నెలకొని ఉంది. దీనిపై పార్టీ సీనియర్ నాయకులు కూడా సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. జిల్లాకు మంత్రి పదవి ఇస్తారా? లేక విప్ తోనే సరిపెడతారనే అంశంపై చర్చ జరుగుతోంది. ఒక వేళ మంత్రి పదవి ఇస్తే సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన బాబూమోహన్ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా వీరిద్దరూ ఒకరినొకరు ‘బావ’ అని అని సంభోదించుకుంటారు. ఈ అనుబంధంతోనే బాబూమోహన్‌ను పార్టీలో చేర్చుకున్న కేసీఆర్, పట్టుబట్టి మరీ అందోల్‌లో గెలిపించుకున్నారు. ఈ అనుబంధంతోనే మంత్రి పదవికి ఇచ్చేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. బాబూమోహన్‌కు పదవి ఇవ్వటం వల్ల సామాజిక వర్గాల సమీకరణను కూడా సమతుల్యం చేసినట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ విప్ పదవి ఇస్తే సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేరును పరిశీలించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్
హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు డిప్యూటీ స్పీకర్ పదవికి పద్మా దేవేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. బుధవారం సాయంత్రం వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. ఇక తెలంగాణ శాసనసభ రేపటకి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. -
డిప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి?
హైదరాబాద్: శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పేరును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన మధుసూదనాచారి ఎన్నిక కావడంతో... డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ఓసీల నుంచి ఒకరిని ఎన్నుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, డిప్యూటీ స్పీకర్‌గా వెళితే నియోజకవర్గ అభివృద్ధి, పార్టీకి పనిచేసే విషయంలో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో పద్మా దేవేందర్‌రెడ్డి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ కంటే చీఫ్ విప్ అయినా సరేననే ఆలోచనతో ఆమె ఉన్నారని సమాచారం. నిర్ణయాల్లో మార్పులేమీ జరగకుంటే డిప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి మంగళవారం నామినేషన్ వేయనున్నారు. చీఫ్ విప్ పదవికి ఏనుగు రవీందర్‌రెడ్డి(ఎల్లారెడ్డి)ని కేసీఆర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనికి రవీందర్‌రెడ్డి విముఖంగా ఉన్నారు. రవీందర్‌రెడ్డి అంగీకరించకుంటే ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకట్రావు పేరును పరిశీలించే అవకాశాలున్నాయి. -
గంపెడాశలు
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో తొలి అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమై ఈ నెల 13 వరకు జరగనున్నాయి. మొదటి రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం, 10న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక, 11న డెప్యూటీ స్పీకర్ ఎన్నిక, 12న గవర్నర్ ప్రసంగం, 13న గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనుంది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి సమావేశాల్లో జిల్లా నుంచి దాసరి మనోహర్‌రెడ్డి (పెద్దపల్లి), బోడిగె శోభ (చొప్పదండి),రసమయి బాలకిషన్ (మానకొండూర్), పుట్ట మధు (మంథని), వొడితెల సతీష్‌కుమార్ (హుస్నాబాద్) ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టనున్నారు. జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. జగిత్యాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున టి.జీవన్‌రెడ్డి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్‌రెడ్డికి, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామారావులకు సభలో మాట్లాడే అవకాశం రానుంది. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలకు సమస్యలపై మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. ఒకవేళ అవకాశం వస్తే ఎవరెవరు ఏ సమస్యపై గళం విప్పుతారోనని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల అమలుపై ప్రజలంతా కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతులందరికీ రూ.లక్ష పంట రుణాలు మాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రాగానే దీనిపై జిల్లాలో రగడ మొదలైంది. గత ఆర్థిక సంవత్సరం రైతులు తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని సీఎం కే సీఆర్ నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. దీంతో ఆంక్షలు లేని రుణమాఫీ ప్రకటించాలంటూ జిల్లావ్యాప్తంగా పార్టీలకతీతంగా నాయకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంట రుణాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో పాత బకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు కొత్తగా ఖరీఫ్ రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఖరీఫ్ సాగుకు సన్నద్ధమైన రైతులు దుక్కులు, విత్తనాలు, ఎరువులు, ఇతర పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. శాసనసభ సమావేశాల్లో రుణమాఫీపై సర్కారు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ఎదురుచూస్తున్నారు. అలాగే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, పరికరాలకు కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో మరో ప్రధానమైన హామీ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం. 125 చదరపు గజాల్లో రూ.3లక్షల ఖర్చుతో ప్రభుత్వమే ఇంటిని నిర్మిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పేదలు ఇప్పటికే మంజూరై నిర్మాణం ప్రారంభించని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారు. కొత్త సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 80వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉండగా, ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేస్తే బకాయి బిల్లులు వస్తాయో రావోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో ఉంది. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది. తాము అధికారంలోకి వస్తే సంక్షేమానికి పెద్దపీట వేస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. ఇప్పుడిస్తున్న రూ.200 వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.వెయ్యికి, ప్రస్తుతం రూ.500 ఉన్న వికలాంగుల పింఛన్లను రూ.1500కు పెంచుతామని హామీ ఇచ్చింది. జిల్లాలో వృద్ధులు, వితుంతువులు, వికలాంగులు, గీత, చేనేత కార్మికులు, అభయహస్తం పింఛన్‌దారులు మొత్తం 3.7లక్షల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గత కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలుపరిచిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై కొత్త ప్రభుత్వం ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈ పథకం ద్వారా జిల్లాలో గత విద్యాసంవత్సరం 1,47,423 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. వైఎస్సార్ మరణానంతరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కిరణ్ సర్కారు కొర్రీలు పెట్టడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుత సర్కారు ఈ పథకాన్ని కొనసాగిస్తూ పెండింగ్ బకాయిలను విడుదల చేస్తే తప్ప పేద విద్యార్థులు ఉన్నత విద్య కొనసాగించలేని పరిస్థితి ఉంది. పేదలకు బుక్కెడు బువ్వ పెట్టే పీడీఎస్ పథకం అమలు జిల్లాలో అస్తవ్యస్తంగా తయారైంది. గత సంవత్సరం కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం ఆదిలోనే అభాసుపాలైంది. రూ.185కే ఉప్పు, పప్పుతో పాటు తొమ్మిది రకాల సరుకులు ఇస్తామన్నా.. నాలుగైదుకు మించి అందడం లేదు. దీంతో జిల్లాలోని 9,38,072 మంది కార్డుదారులు ఇబ్బందుల్లో పడ్డారు. పేదలకు ఎంతో ఆసరాగా ఉండే ఈ పథకాన్ని టీఆర్ఎస్ సర్కారు సమర్థంగా అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇక కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య అన్న హామీపై పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ దీని అమలుకు రెండుమూడేళ్ల సమయం పడుతుందని తెలుస్తోంది. అంతవరకు జాప్యం చేయకుండా ఈ విద్యాసంవత్సరం నుంచే విద్యా పథకాన్ని అమలు చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. వచ్చేది వర్షాకాలం.. అంటువ్యాధుల సీజన్. జిల్లాలో సర్కారు వైద్య సేవల దుస్థితి పాలకులకు తెలియంది కాదు. గతంలో డెంగీ, చికున్‌గున్యా, విషజ్వరాలు విజృంభించి జిల్లా కేంద్రంతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వందలాది మంది మృత్యువాతపడ్డారు. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు ఏరియా, కమ్యూనిటీ ఆసుపత్రుల్లో కనీసం వైద్య సౌకర్యాలు లేక పలువురి ప్రాణాలు గాలిలో కలిశాయి. వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసి పేదల ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కొత్త సర్కారుపై ఉంది. జిల్లాలో ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో పురోగతి లోపించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఈ సీజన్లో అయినా పంటలకు ఎల్లంపల్లి నీరందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మధ్యమానేరు రిజర్వాయర్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. గండిపల్లి, గౌరవెల్లి, తోటపెల్లి జలాశయాలకు తట్టెడు మట్టికూడా ఎత్తలేదు. వరదకాల్వ పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. వీటితోపాటు గత వర్షాకాలంలో తెగిపోయిన, గండ్లుపడ్డ చెరువులు, కుంటలకు మరమ్మతులు చేస్తే తప్ప నీళ్లు నిలిచే పరిస్థితి లేదు. వీటన్నింటిని టీఆర్ఎస్ సర్కారు ప్రథమ ప్రాధామ్యంగా గుర్తించి అవసరమైన నిధులు మంజూరు చేయాల్సిన అవసరముంది. సార్వత్రిక ఎన్నికలు, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సంధికాంలో నెలకొన్న పాలనాపరమైన స్తబ్ధత కారణంగా జిల్లాలో పలు ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకపోయాయి. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో వ్యవసాయం, విద్యుత్, వైద్య, ఆరోగ్యం, విద్య, రోడ్లు, తదితర మౌలిక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా సమస్యల పరిష్కారం కోసం కొత్త ఎమ్మెల్యేలు శాసనసభలో గళమెత్తాల్సిన అవసరాన్ని జిల్లా ప్రజలు గుర్తుచేస్తున్నారు. -
డిప్యూటీ స్పీకర్‌గా పద్మ?
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి జిల్లాకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వొచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. పద్మకు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టే అంశాన్ని టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోమవారం నుంచి తెలంగాణ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశం ప్రారంభం రోజున ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. జిల్లాకు చెందిన శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీ స్పీకర్‌గా మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. ఇద్దరి ఎన్నికపై హరీష్‌రావు ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పద్మా దేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కిన పక్షంలో జిల్లాకు రెండోమారు శాసనసభా డిప్యూటీ స్పీకర్ పదవి దక్కినట్లు అవుతుంది. డిప్యూటీ స్పీకర్‌గా గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రస్తుత సీఎం కె.చంద్రశేఖర్‌రావు పనిచేశారు. పద్మ విముఖత శాసనసభా డిప్యూటీ స్పీకర్ పదవిపై మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిపై ఆసక్తిగా లేరని ఆమె అనుచరులు చెబుతున్నారు. మహిళా కోటాలో ఆమె మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇస్తానని పేర్కొనటం గమనార్హం. ఈ నేపథ్యంలో మహిళా కోటాలో తనకు మంత్రి పదవి ఖాయమని భావిస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవిపై విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ స్పీకర్‌గా మధుసూదనాచారి.. డిప్యూటీగా పద్మా దేవేందర్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవందర్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. పార్టీ శ్రేణులతో చర్చించిన అనంతరం టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వీరిద్దరినీ ఎంపిక చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిపక్షాలతో చర్చించనుంది. ఈ నెల 11న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అదే రోజున స్పీకర్‌ను ఎన్నుకుంటారు.