డిప్యూటీ స్పీకర్‌గా పద్మ..! | Deputy Speaker of the Padma ..! | Sakshi
Sakshi News home page

డిప్యూటీ స్పీకర్‌గా పద్మ..!

Published Tue, Jun 10 2014 11:32 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

డిప్యూటీ స్పీకర్‌గా పద్మ..! - Sakshi

డిప్యూటీ స్పీకర్‌గా పద్మ..!

నేడు నామినేషన్... ఎన్నిక లాంఛనం? మరో పదవిపై జిల్లాలో చర్చ
 
గులాబి దళపతి సర్కార్‌లో  మెతుకు సీమకు మరో ప్రాతినిధ్యం లభించింది. తెలంగాణ రాష్ట్ర శాసన సభ డిప్యూ టీ స్పీకర్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేరు దాదా పు ఖాయమైంది. బుధవారం ఆమె ఉప సభాపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. స్పీకర్ తరహాలోనే డిప్యూటీ స్పీక ర్ పదవిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు టీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. కాబట్టి  పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నిక లాంఛనమే కానుంది. ఆ పదవి పట్ల ముందుగా ఆమె అయిష్టతను వ్యక్తం చేసినప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేర కు  కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జిలా ్లకు ఇంకా రెండు పదవులు ఇస్తానని ఈ నెల 4న గజ్వేల్ నియోజకవర్గ కేం ద్రంలో జరిగిన రివ్యూ మీటింగ్‌లోనే సీఎం కేసీఆర్ ప్రకటిం చారు. అన్నట్లుగానే ఆయన జిల్లాకు అవకాశం కల్పించారు.

మరోటి మంత్రి పదవా..? విప్పా?

ఇక రెండో పదవిపైనే సందిగ్ధం నెలకొని ఉంది. దీనిపై పార్టీ సీనియర్ నాయకులు కూడా సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. జిల్లాకు మంత్రి పదవి ఇస్తారా? లేక విప్ తోనే సరిపెడతారనే అంశంపై చర్చ జరుగుతోంది. ఒక వేళ మంత్రి పదవి   ఇస్తే  సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన బాబూమోహన్ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా వీరిద్దరూ ఒకరినొకరు ‘బావ’ అని  అని సంభోదించుకుంటారు. ఈ అనుబంధంతోనే బాబూమోహన్‌ను పార్టీలో చేర్చుకున్న కేసీఆర్, పట్టుబట్టి మరీ అందోల్‌లో గెలిపించుకున్నారు. ఈ అనుబంధంతోనే మంత్రి పదవికి ఇచ్చేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. బాబూమోహన్‌కు పదవి ఇవ్వటం వల్ల సామాజిక వర్గాల సమీకరణను కూడా సమతుల్యం చేసినట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ విప్ పదవి ఇస్తే సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేరును పరిశీలించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement