ప్రస్తుత పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేం: కేసీఆర్
హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ పదవిపై టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తగ్గటం లేదు. స్పీకర్ ఎన్నిక ఏకపక్షంగా జరిగినందున డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలంటూ విపక్ష నేతలు బుధవారం సీఎం కేసీఆర్ను కలిశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ పదవిపై వెనక్కి తగ్గలేమని ఆయన విపక్షాలను సముదాయించారు.
మరోవైపు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఇప్పటికే టీడీపీ, బీజేపీ, ఎంఐఎం, వామపక్ష పార్టీలు టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపాయి. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కూడా పద్మాదేవేందర్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. పలువురు కాంగ్రెస్ నేతలు పద్మా దేవేందర్‌రెడ్డికి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే మరి కొందరు నేతలు ప్రతిపక్షాలకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.