
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఎంపిక పూర్తయింది. ఇక డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమికే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఇండియాకూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీకే ఆ పదవి ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం.
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అవధేశ్ ప్రసాద్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. స్పీకర్‌గా బీజేపీకి చెందిన ఓం బిర్లా ఇప్పటికే ఎన్నికైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment