Trinamool Congress
-
ఇండియా కూటమి చీఫ్‌గా మమతా బెనర్జీ..?
జాతీయ స్థాయిలో విపక్ష ఇండియా కూటమికి నేతృత్వం వహించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. బెంగాలీ న్యూస్ ఛానల్ న్యూస్ 18 బంగ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. అవకాశం వస్తే తాను ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తానని తెలిపారు. అయితే బెంగాల్ సీఎం పదవిని మాత్రం వదులుకోనని ఆమె స్పష్టం చేశారు.రెండు పాత్రలకు న్యాయం చేస్తాబెంగాల్ సీఎంగా, విపక్ష కూటమి నాయకురాలిగా రెండు పాత్రలకు న్యాయం చేయగలనని మమతా బెనర్జీ దీమా వ్యక్తం చేశారు. ‘ఇండియా కూటమిని నేనే స్థాపించా. దాన్ని నడిపించాల్సిన బాధ్యత నాయకత్వ స్థానంలో ఉన్నవారిపై ఉంటుంది. వారలా చేయలేకపోతే నేనేం చేయగలను? ప్రతీ ఒక్కరిని కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది’ అని మమత అన్నారు. ‘దీదీ’ ప్రకటన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.అందుకే కూటమికి దూరమయ్యారా?ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలవకుండా మమత ఒంటరిగా పోటీ చేశారు. మొదటి నుంచి విపక్ష కూటమిలో కీలకపాత్ర పోషించిన ఆమె చివరి నిమిషంలో పక్కకు తప్పుకోవడంపై అప్పట్లో హాట్‌టాపిక్ అయింది. ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు తనకు అప్పగించడానికి కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఒప్పుకోకపోవడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఒంటరిగా బరిలోకి దిగారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే సీట్ల పంపకంలో తేడాలు రావడం వల్లే తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు తృణమూల్ కాంగ్రెస్ అప్పట్లో వివరణ ఇచ్చింది. మమతా బెనర్జీని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినప్పటికీ తాను అడిగినన్ని సీట్లు ఇవ్వలేదనే సాకుతో మమత సింగిల్‌గానే పోటీ చేశారు. ఇండియా కూటమి గెలిస్తే కచ్చితంగా మద్దతు ఇస్తానని ప్రకటించి తనదారి తాను చూసుకున్నారు. కాగా, బెంగాల్లో 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.మమతకు పగ్గాలు అప్పగిస్తారా?ఇండియా కూటమి నడిపించేందుకు సిద్ధమని మమతా బెనర్జీ తాజాగా తనకు తానుగా ప్రకటన చేయడం ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రస్తుతం ఇండియా కూటమి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 101 స్థానాలను దక్కించుకున్న హస్తం పార్టీ ఇండియా కూటమిలో అతి పెద్ద భాగస్వామిగా ఉంది. 37 ఎంపీలను కలిగిన సమాజ్‌వాదీ పార్టీ రెండో పెద్ద భాగస్వామిగా కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, శివసేన (యూబీటీ) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. హరియాణాలో అనూహ్యంగా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది.చదవండి: మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్.. యూబీటీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయంమమతకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతుఈ నేపథ్యంలో ఇండియా కూటమిని బలోపేతం చేసే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు మమతా బెనర్జీకి సమాజ్‌వాదీ పార్టీ సూచనప్రాయంగా మద్దతు ప్రకటించింది. ‘ఇండియా కూటమి నాయకురాలిగా మమతా బెనర్జీ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆమెకు మద్దతు ఇవ్వాలి. కూటమి బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుంది. బెంగాల్లో బీజేపీని నిలువరించడంలో మమత కీలకపాత్ర పోషించారు. ఆమె పట్ల మాకు సానుభూతి ఉంది. చాలా కాలం నుంచి ఆమెతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయ’ని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉదయ్ వీర్ సింగ్ మీడియాతో అన్నారు. కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మమత వారసుడు అతడేనా?ఇదిలావుంటే తన రాజకీయ వారసుడి ఎంపికపై మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీ నాయకత్వం అంతా కలిసి తన రాజకీయ వారసుడిని ఎంపిక చేస్తుందని ఆమె చెప్పారు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మమత తర్వాత పార్టీ పగ్గాలు ఆయనకే అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఆయననే ఎక్కువగా టార్గెట్ చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్టయింది. -
ఇండియా కూటమి ఎంపీల కీలక భేటీకి టీఎంసీ డుమ్మా
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను అదానీ అవినీతి అంశం, ఉత్తరప్రదేశ్‌లో సంభాల్ హింసాకాండ ఘటనలు కుదిపేస్తున్నాయి. ఈ అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుపడుతుండటంతో ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సైతం పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో విపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సమావేశమయ్యారు.ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు రాగా.. ముఖ్యంగా ఉభయసభల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎదుర్కొనే వ్యూహంపై తీవ్రంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.. అయితే ఈ కీలక సమావేశానికి ఇండియా కూటమిలో భాగంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ డుమ్మా కొట్టింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ హింస అంశం వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలనుకుంటున్నట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. కానీ కాంగ్రెస్ మాత్రం అదానీ వ్యవహారంపై మాత్రమే ఒత్తిడి చేయాలనుకుంటోందని.. దీంతో నేడు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశానికి హాజరుకావడం లేదని ఆ పార్టీ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. తమ ప్రధాన అంశాలు ఎజెండాలో లేనప్పుడు సమావేశానికి హాజరు కాబోమని తృణమూల్ నేతలు తెలిపినట్లు పేర్కొన్నాయి.మరోవైపు అదానీ గ్రీన్‌పై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపణలపై చర్చించే వరకు హౌస్‌లోని కార్యకలాపాలను నిలిపివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సోమవారం ఉదయం కూడా కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అదానీ సమస్యపై చర్చించేందుకు లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అయితే, కాంగ్రెస్‌తో సహా పలు పార్టీల ఎంపీలు ఫెంగల్ తుఫాను కారణంగా సంభవించిన నష్టం, మసీదు సర్వేపై ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో హింస, బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సన్యాసులను లక్ష్యంగా చేసుకోవడం, పంజాబ్‌లో వరి సేకరణలో జాప్యం వంటి అనేక ముఖ్యమైన సమస్యలపై చర్చలు జరపాలని పట్టుబడుతున్నారు. -
కాంగ్రెస్‌కు మరో షాక్.. బాంబు పేల్చిన మమత!
ఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఘోర పరాజయాల నేపథ్యంలో ఇండియా కూటమిలో లుకలుకలు చోటుచేసుకుంటున్నాయి. ఇండియా కూటమిలో చీలికలను సంకేతాలిస్తూ తృణమూల్ కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోయే ప్రసక్తే లేదంటూ కుండబద్దలు కొట్టింది. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. హర్యానాలో కాంగ్రెస్ విజయం పక్కా అనుకున్నప్పటికీ హర్యానాలో ఓటమి.. మహారాష్ట్రలో కూడా దారుణ ఫలితాలు రావడంతో ఇండియా కూటమిలో లుకలుకలు చోటుచేసుకున్నాయి. మొదటి నుంచి ఇండియా కూటమిలో వ్యతిరేక స్వరం వినిపిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బిగ్ బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ కు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తృణమూల్ కాంగ్రెస్.పార్లమెంట్ సమావేశాల వేళ కూటమిలో చీలికకు సంకేతాలిస్తూ కాంగ్రెస్ తీరుపై టీఎంసీ నేతలు సంచలన విమర్శలు చేశారు. అలాగే, మిత్రపక్షం కాంగ్రెస్ నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోదని టీఎంసీ పేర్కొంది. పార్లమెంట్ లో బెంగాల్ ప్రజల సమస్యలను లేవనెత్తే విధంగా సభను నిర్వహించాలని కోరింది. అవినీతిపై పార్లమెంట్లో చర్చ కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రజల కోసం తాము చర్చ కొనసాగించాలనుకుంటున్నట్టు టీఎంసీ వెల్లడించింది. బెంగాల్ కు నిధుల కొరత ఉంది. కేంద్రం నుంచి నిధుల రావాల్సి ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పార్లమెంట్ లో చర్చించాలనుకుంటున్నాం అని టీఎంసీ సభ్యులు తెలిపారు.ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల్లోనూ, పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఎంసీ వేర్వేరుగా పోటీ చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ ఉపఎన్నికలలో మొత్తం ఆరు స్థానాలను, లోక్‌సభ ఎన్నికలలో 40 నియోజకవర్గాలలో 29 స్థానాలను గెలుచుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఓటమి చెందడంపై కూడా టీఎంసీ ఘాటు విమర్శలు చేసింది. -
Mamata Banerjee: రాజీనామాకైనా సిద్ధం
కోల్‌కతా: బెంగాల్ ప్రజల కోసం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని తెలిపారు. ‘వైద్యుల సమ్మెపై ప్రతిష్టంభన ఈ రోజుతో తొలిగిపోతుందని ఆశించిన బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను. జూనియర్ డాక్టర్లు నబన్నా (సచివాలయం)కు వచ్చి కూడా చర్చలకు కూర్చోలేదు. తిరిగి విధులకు వెళ్లాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని మమత గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. ‘సదుద్దేశంతో గత మూడురోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మెడికోలు చర్చలకు నిరాకరించారు’ అని సీఎం అన్నారు. ‘ప్రజల కోసం నేను రాజీనామా చేసేందుకు సిద్ధం. కానీ ఇది పద్ధతి కాదు. గడిచిన 33 రోజులుగా ఎన్నో అభాండాలను, అవమానాలను భరించాం. రోగుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో చర్చలకు వస్తారని భావించా’ అని మమత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినా.. తమ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోదని హామీ ఇచ్చారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారంతో జూనియర్ డాక్టర్లు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. నెలరోజులకు పైగా వీరు విధులను బహిష్కరిస్తున్నారు. సెపె్టంబరు 10న సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను బేఖాతరు చేశారు. మమత సమక్షంలో చర్చలకు జూడాలు డిమాండ్ చేయగా.. బెంగాల్ ప్రభుత్వం దానికి అంగీకరించి వారిని గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చల కోసం నబన్నాకు రావాల్సిందిగా ఆహా్వనించింది. అయితే ప్రత్యక్షప్రసారం ఉండాలనే జూడాల డిమాండ్‌ను ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చర్చలు జరగలేదు. రెండుగంటలు వేచిచూశా సమ్మె చేస్తున్న డాక్టర్లను కలవడానికి రెండు గంటల పాటు సచివాలయంలో వేచిచూశానని, వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని మమత అన్నారు. గురువారం సాయంత్రం 5:25 గంటలకు సచివాలయానికి చేరుకున్న డాక్టర్లు ప్రత్యక్షప్రసారానికి పట్టుబట్టి బయటే ఉండిపోయారు. ప్రత్యక్షప్రసారం డిమాండ్‌కు తాము సానుకూలమే అయినప్పటికీ హత్యాచారం కేసు కోర్టులో ఉన్నందువల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే.. చర్చల రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశామని మమత వివరించారు. ‘పారదర్శకత ఉండాలని, చర్చల ప్రక్రియ పక్కాగా అధికారిక పత్రాల్లో నమోదు కావాలనే రికార్డింగ్ ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు అనుమతిస్తే జూడాలతో వీడియో రికార్డును పంచుకోవడానికి కూడా సిద్ధం పడ్డాం’ అని మమత చెప్పుకొచ్చారు. రహస్య పత్రాలపై ఇలా బాహటంగా చర్చించలేమన్నారు. గడిచిన నెలరోజుల్లో వైద్యసేవలు అందక రాష్ట్రంలో 27 మంది చనిపోయారని, 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ‘15 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని చర్చలకు పిలిచాం. కానీ 34 మంది వచ్చారు. అయినా చర్చలకు సిద్ధపడ్డాం. చర్చలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతోనే వైద్యశాఖ ఉన్నతాధికారులెవరినీ పిలువలేదు (వైద్యశాఖ కీలక అధికారుల రాజీనామాకు జూడాలు డిమాండ్ చేస్తున్నారు)’ అని మమతా బెనర్జీ అన్నారు. నబన్నాకు చేరుకున్న జూనియర్ డాక్టర్లను ఒప్పించడానికి ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, డీజీపీ రాజీవ్ కుమార్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. ముమ్మర సంప్రదింపులు జరిపారు. అయినా జూడాలు తమ డిమాండ్‌పై వెనక్కితగ్గలేదు. ప్రభుత్వం జూడాలను చర్చలకు పిలవడం రెండురోజుల్లో ఇది మూడోసారి. రాజకీయ ప్రేరేపితంచర్చలు జరపాలని తాము చిత్తశుద్ధితో ఉన్నామని, అయితే డాక్టర్ల ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని మమతా బెనర్జీ సూచనప్రాయంగా చెప్పారు. ‘డాక్టర్లలో చాలామంది చర్చలకు సానుకూలంగా ఉన్నారు. కొందరు మాత్రమే ప్రతిష్టంభన నెలకొనాలని ఆశిస్తున్నారు’ అని ఆరోపించారు. బయటిశక్తులు వారిని నియంత్రిస్తున్నాయన్నారు. ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమని, వాటికి వామపక్షాల మద్దతుందని ఆరోపించారు. మమత రాజీనామా కోరలేదు: జూడాలు ప్రత్యక్షప్రసారాన్ని అనుమతించకూడదనే సర్కారు మొండి పట్టుదలే చర్చలు కార్యరూపం దాల్చకపోవడానికి కారణమని జూనియర్ వైద్యులు ఆరోపించారు. తామెప్పుడూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా కోరలేదని స్పష్టం చేశారు. ప్రతిష్టంభనకు వైద్యులే కారణమని మమత పేర్కొనడం దురదృష్టకరమన్నారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల బహిష్కరణ కొనసాగిస్తామని తేలి్చచెప్పారు. -
మహిళా అధికారితో దురుసు ప్రవర్తన.. మంత్రి రాజీనామాకు ఆదేశం
కలకత్తా: సొంత పార్టీ నేత, పశ్చిమబెంగాల్ జైళ్ల మంత్రి అఖిల్గిరిపై తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరి ఓ మహిళా అధికారిని బెదిరిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పార్టీ సీరియస్ అయింది. ఆ మహిళా అధికారికి క్షమాపణలు చెప్పడంతో పాటు మంత్రిపదవికి వెంటనే రాజీనామా చేయాలని గిరిని పార్టీ ఆదేశించింది. ఈ విషయమై తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ సంతనుసేన్ మాట్లాడుతూ ‘ఒక మహిళా అధికారితో మా మంత్రి అనుచితంగా ప్రవర్తించారు. ఇలాంటి ప్రవర్తనను మేం సమర్థించం. ఆ మంత్రిని మహిళా అధికారికి క్షమాపణ చెప్పడంతోపాటు మంత్రిపదవికి రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించాం.తృణమూల్ కాంగ్రెస్ రాజధర్మాన్ని పాటిస్తుంది. మహిళా వ్యతిరేక పార్టీ బీజేపీ సొంత పార్టీ నేతలపై ఎప్పుడూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో సీపీఎం కూడా ఈ విషయాల్లో రాజధర్మాన్ని పాటించలేదు’అని సంతనుసేన్ తెలిపారు. -
ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు
న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఆధిక్యాన్ని కనబర్చాయి. విపక్ష ఇండియా కూటమి పారీ్టలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), డీఎంకే, ఆప్‌లు పది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్నాయి. బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. పశ్చిమబెంగాల్లోని నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి బుధవారం ఉప ఎన్నికలు జరగ్గా.. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకుగాను 29 చోట్ల నెగ్గి బెంగాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాలుగింటికి నాలుగు స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. వీటిలో మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలు కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం వచి్చన చోట్ల కూడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ జయకేతనం ఎగురవేసింది. 294 మంది సభ్యులున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ బలం 215కు చేరింది. అసెంబ్లీలో భార్యాభర్తలు హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేసి.. బీజేపీ టికెట్‌పై పోటీచేశారు. వీరిలో ఇద్దరు ఓటమి పాలుకాగా.. ఒక్కరు గెలుపొందారు. అందరి దృష్టిని ఆకర్షించిన డేహ్రా నియోజకవర్గంలో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సతీమణి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం పట్టుబట్టి మరీ కమలే‹Ùను రంగంలోకి దింపింది. హిమాచల్ అసెంబ్లీలో ఇకపై భార్యాభర్తలు సుఖ్విందర్, కమలే‹Ùలు కనిపించనున్నారు. తాజాగా ఇద్దరి గెలుపుతో 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 40కి చేరింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీకి ఓటేయడంతో కాంగ్రెస్ బలం 34కు పడిపోయింది. సుఖు ప్రభుత్వాన్ని అస్థిరత వెంటాడింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు నెగ్గింది. ఇప్పుడు మరో రెండు స్థానాలు గెలవడంతో కాంగ్రెస్ బలం మళ్లీ 40కి చేరింది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇందులో ఒకటి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. -
ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు
న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఆధిక్యాన్ని కనబర్చాయి. విపక్ష ఇండియా కూటమి పారీ్టలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), డీఎంకే, ఆప్‌లు పది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్నాయి. బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. పశ్చిమబెంగాల్లోని నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి బుధవారం ఉప ఎన్నికలు జరగ్గా.. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకుగాను 29 చోట్ల నెగ్గి బెంగాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాలుగింటికి నాలుగు స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. వీటిలో మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలు కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం వచి్చన చోట్ల కూడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ జయకేతనం ఎగురవేసింది. 294 మంది సభ్యులున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ బలం 215కు చేరింది. అసెంబ్లీలో భార్యాభర్తలు హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేసి.. బీజేపీ టికెట్‌పై పోటీచేశారు. వీరిలో ఇద్దరు ఓటమి పాలుకాగా.. ఒక్కరు గెలుపొందారు. అందరి దృష్టిని ఆకర్షించిన డేహ్రా నియోజకవర్గంలో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సతీమణి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం పట్టుబట్టి మరీ కమలే‹Ùను రంగంలోకి దింపింది. హిమాచల్ అసెంబ్లీలో ఇకపై భార్యాభర్తలు సుఖ్విందర్, కమలే‹Ùలు కనిపించనున్నారు. తాజాగా ఇద్దరి గెలుపుతో 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 40కి చేరింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీకి ఓటేయడంతో కాంగ్రెస్ బలం 34కు పడిపోయింది. సుఖు ప్రభుత్వాన్ని అస్థిరత వెంటాడింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు నెగ్గింది. ఇప్పుడు మరో రెండు స్థానాలు గెలవడంతో కాంగ్రెస్ బలం మళ్లీ 40కి చేరింది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇందులో ఒకటి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. -
తిరుగులేని తృణమూల్.. బైపోల్స్‌లో ముందంజ
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి తిరుగులేదని మరోసారి తేలింది. రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ సీట్లకు తాజాగా ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది. మనిక్టల, బాగ్డా, రానాఘాట్ దక్షిణ్, రాయిగంజ్ అసెంబ్లీ సీట్లకు జులై 10న ఉప ఎన్నిక జరిగింది. వీటి ఫలితాలు శనివారం(జులై 13) ఉదయం నుంచి వెలువడుతున్నాయి.ఉప ఎన్నికల పోలింగ్‌లో అధికార టీఎంసీ అక్రమాలకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలకు టీఎంసీ కొట్టిపారేసింది. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఎంసీ అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. -
ఇలా చేయడం చంద్రబాబుకు కొత్తేంకాదుగా!
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన సింహగర్జనకు లోక్‌సభ దద్దరిల్లింది. ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీపైన, బీజేపీపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఆ పార్టీలో చేరితే వాషింగ్ మిషన్‌లో వేసినట్లేనా?అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మహారాష్ట్ర ఎన్సీపీ చీలికవర్గం నేతలు అజిత్ పవార్, ప్రఫుల్ల పటేల్ లపై ఉన్న ఆరోపణలను ప్రస్తావించి వారంతా బీజేపీలో చేరగానే నీతిమంతులు అయిపోయారా అని నిలదీశారా? చంద్రబాబు ను సీబీఐ, ఈడీ ఎందుకు అరెస్టు చేయలేదని బెనర్జీ ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ షేర్ విలువ హటాత్తుగా పెరిగి ఒకరోజులోనే 521 కోట్ల సంపద వచ్చిందని, ఈ వ్యవహారాలపై దర్యాప్తు చేయరా అని అడిగారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కనుక వీరంతా పునీతులు అయిపోయినట్లేనా? అవినీతిపరులు నితిమంతులు అయినట్లేనా? అని ఆయన అన్నారు. నిజానికి ఇంత కీలకమైన ప్రశ్నకు మోదీ స్పష్టమైన సమాధానం ఇచ్చి ఉండాల్సింది. కాని ఈ విషయంలో ఆయన కూడా నైతికంగా దెబ్బతిన్నారని చెప్పక తప్పదు. బీజేపీతో కలవకముందు అజిత్ పవార్ కాని, ప్రఫుల్ల పటేల్ కాని పలుమార్లు ఈడీ విచారణను ఎదుర్కోవలసి వచ్చింది. బీజేపీతో సంబంధం పెట్టుకోగానే, ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది.. అలాగే ఈడి గోల కూడా పోయింది. చంద్రబాబు విషయం చూస్తే మరీ ఆసక్తికరం అని చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, మోదీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మోదీని టెర్రరిస్టు అని, అవినీతి పరుడని, భార్యనే ఏలుకోలేని వాడు దేశాన్ని ఏమి ఏలుతాడని పలుమార్లు ధ్వజమెత్తారు.మోదీ సైతం 2019 ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబును ఉద్దేశించి ఆరోపణలు చేస్తూ పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని అన్నారు. ఆ ఎన్నికలలో టీడీపీ ఓటమితో చంద్రబాబు లైన్ మార్చి మళ్లీ మోదీని ఆకట్టుకోవడానికి పలు ఎత్తుగడలు వేశారు. తొలుత మోదీ ఇష్టపడలేదు. ఆదాయపన్ను శాఖ చంద్రబాబు పీఎ ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల రూపాయల విలువైన అక్రమాలు జరిగాయని తేల్చినట్లు సిబిటిడి ప్రకటించింది. అంతేకాక ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు కొన్ని అక్రమాలకు సంబంధించి నోటీసులు కూడా ఇచ్చింది. ఆయన ఏదో సాకు చూపుతూ తప్పించుకునే యత్నం చేశారు. ఈలోగా మోదీతో మధ్యవర్తుల ద్వారా మంతనాలు సాగించి తన జోలికి రాకుండా చేసుకోగలిగారు. అది ఆయన మొదటి సక్సెస్ అని చెప్పవచ్చు. విశేషం ఏమిటంటే లోక్ సభలో వైఎస్సార్సీపీకి అప్పట్లో 19 మంది సభ్యులు ఉండేవారు. అయినా వారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్థాయిలో చంద్రబాబుపై వచ్చిన అభియోగాల గురించి బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసినట్లు అనిపించదు. చంద్రబాబుపై గత ఏపీ ప్రభుత్వంలో సిఐడి పలు అవినీతి కేసులు నమోదు చేసి ఈడి, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదు. ఒకవైపు దేశంలో అవినీతిని అంతం చేస్తానంటూ కబుర్లు చెప్పే మోదీ ఇలా చేస్తున్నారేమిటా అని అనుకోవడం తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అప్పటికే చంద్రబాబు తెలివిగా తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీను బీజేపీలో విలీనం చేయించారు. వారిలో ఇద్దరు భారీ ఎత్తున బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులలో ఉన్నారు. బీజేపీలో చేరగానే వారంతా మోదీ ఎదుట కూర్చుని కబుర్లు చెప్పగలిగారు. తదుపరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ముందుగా బీజేపీ అధిష్టానం వద్దకు పంపించి పొత్తు కుదిరేలా చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ద్వారాను, బీజేపీలో ఉన్న తన కోవర్టుల ద్వారాను బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, జెపి నడ్డాలను ఎలాగైతేనేం ఒప్పించి టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరేలా చేయగలిగారు. ఏపీకి బీజేపీ అధ్యక్షురాలిగా వచ్చిన దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ విషయంలో తన వంతు సాయం చేసి అధిష్టానం పై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఈ రకంగా చంద్రబాబు తెలివిగా మోదీని , ఇతర బీజేపీ అగ్రనేతలను తనదారిలోకి తెచ్చుకున్నారు. దాంతో ఆయనపై అన్నివేల కోట్ల ఆరోపణలు వచ్చినా, ఏపీకి చెందిన ఒరిజినల్ బీజేపీ నేతలు ఎంత తీవ్రమైన విమర్శలు చేసినా చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈడి అప్పటికే ఆ కేసులో కొందరిని అరెస్టు చేసినా, చంద్రబాబు జోలికి రాలేదు. ఇంకో సంగతి కూడా చెప్పాలి. డిల్లీ లిక్కర్ స్కామ్ అంతా కలిపి వంద కోట్లు ఉంటుందో, నిజంగా ఎవరికైనా ముడుపులు ముట్టాయో లేదో కాని, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ,మాజీ ఎమ్.పి కవిత వంటివారు నెలల తరబడి జైలులో ఉంటున్నారు. న్యాయ వ్యవస్థ సైతం వారికి ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదో అర్ధం కాదు.ఇదే డిల్లీ లిక్కర్ కేసులో కీలకమైన వ్యక్తిగాఈడి పరిగణించి విచారణ చేసిన లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వైసిపి టిక్కెట్ ఇవ్వకపోతే టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. ఆయన గెలిచి మోదీతో కలిసి ఫోటో దిగారు.ఇలాంటివాటిని చూస్తే ఏమనిపిస్తుంది. ఈ దేశంలో అధికార పార్టీలో ఉంటే ఏ కేసునుంచి అయినా తప్పించుకోవచ్చు. అదే ప్రత్యర్ధి పార్టీలో ఉంటే నిజంగా అవినీతి జరిగినా,జరగకపోయినా ఈడి,సీబీఐ వంటివి వెంటబడే అవకాశం కూడా ఉంటుందన్న భావన ప్రజలలో ఏర్పడుతోంది. ఇవే కాదు.పశ్చిమబెంగాల్ లో శారదా చిట్ ఫండ్ స్కామ్ లోను, నారదా స్టింగ్ ఆపరేషన్ లోను కొందరు టీఎంసీ నేతలను సీబీఐ ఆరెస్టు చేసింది. వారు ఆ తర్వాత బీజేపీలో చేరగానే దాదాపు వారంతా సేఫ్ అయ్యారు. ఇలా ఆయా రాష్ట్రాలలో మోదీ ఇదే గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఈసారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం అయిందని చెప్పవచ్చు. తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలకు మోదీ ఎన్నడూ సమాధానం చెప్పలేదు.అలాగే మోదీ తనపై చేసిన అవినీతి అభియోగాలకు చంద్రబాబు జవాబు ఇవ్వలేదు. ఇప్పటికి అదే పరిస్థితి కొనసాగుతోంది. అయినా వారు జట్టు కట్టగలిగారు. కాంగ్రెస్ పార్టీ తన సొంత పార్టీవారిపై సీబీఐ, ఈడి వంటివాటిని ప్రయోగించి నష్టపోతే, మోదీ మాత్రం ఎదుటిపార్టీవారిపై ఈ సంస్థలను ఉపయోగించి అధికారం నిలబెట్టుకునే యత్నం చేస్తున్నారన్న భావన ఏర్పడింది.పార్లమెంటులో కళ్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలపై మోదీ నేరుగా స్పందించలేకపోయారు. తన ప్రభుత్వం అవినీతిపై జీరో టాలరెన్స్ తో ఉందని మోదీ చెప్పినప్పటికీ,అందుకు ఆధారాలు చూపలేకపోయారు.ఇది ఒక ఎత్తు అయితే చంద్రబాబు గొప్పదనాన్ని ఒప్పుకోక తప్పదు. అదేమిటంటే చంద్రబాబు పై అంత పెద్ద ఆరోపణ లు లోక్ సభలో వస్తే సంబంధిత వార్తలను తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిలోనే కాకుండా, ఆంగ్ల పత్రికలలో సైతం రాకుండా చేయగలిగారు.ఆయన మేనేజ్ మెంట్ స్కిల్ ఆ స్థాయిలో ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు. జర్నలిజం విలువల గురించి ఉపన్యాసాలు ఇచ్చే ఎన్.రామ్ నాయకత్వంలోని హిందూపత్రిక సైతం ఇందుకు అతీతంగాలేదు. ఒకప్పుడు ఎమర్జెన్సీపై పోరాడిన గోయాంకకు చెందిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఈ వార్తలు ఇవ్వలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలదీ ఇదే దారి . హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందిన వెలుగు, బీఆర్ఎస్ కు చెందిన నమస్తేతెలంగాణ వంటి పత్రికలు సైతం ఈ వార్తను విస్మరించాయంటే ఏమని అనుకోవాలి. వామపక్షాల పత్రికలలో కూడా ఈ వార్త ప్రముఖంగా కనిపించలేదు.చంద్రబాబు పై టీఎంసీ చేసిన ఆరోపణలపై టీడీపీ ఎంపీ శబరి స్పందించారు. ఆమె గతంలో ఆదాయపన్ను శాఖ చేసిన సోదాలు, సిబిటిడి ప్రకటన, చంద్రబాబుకు ఇచ్చిన నోటీసు గురించి ప్రస్తావించకుండా గత ఎన్నికలలో టీడీపీ గెలిచిందని ,నంద్యాల వంటి చోట్ల కూడా గెలుపొందామని, టీడీపీ ప్రభుత్వం వచ్చిందని చెప్పుకొచ్చారు. అవినీతి ఆరోపణలకు ,ఈ గెలుపునకు సంబంధం ఏమిటో తెలియదు. 2015లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి వ్యూహం పన్ని ,అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి టీడీపీ ప్రయత్నించిందని ఆరోపణ వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కేసులో అరెస్టు అయ్యారు. అదే కేసులో చంద్రబాబుపై కూడా తీవ్ర అభియోగాలు రావడం, ఆయన వాయిస్ ఆడియో ఒకటి లీక్ కావడం సంచలనం అయింది. ఆ వెంటనే ఆయన డిల్లీ స్థాయిలో చక్రం తిప్పి తన జోలికి కెసిఆర్ ప్రభుత్వం రాకుండా చేసుకోగలిగారు. అది చంద్రబాబు విశిష్టత. ఎక్కడ ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో చంద్రబాబుకు తెలిసినంతగా దేశంలో మరే నేతకు తెలియదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. దానికి తోడు పరిస్థితులు కూడా ఆయనకు కలిసి వస్తుంటాయి. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడం, టీడీపీ, జెడియు పార్టీ వంటి పార్టీల మద్దతు అవసరం కావడంతో ,అప్పటికే ఈ పార్టీలతో పొత్తు పెట్టుకున్నందున వారికి ప్రాధాన్యత కూడా పెరిగింది.అందువల్లే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మోదీ సరసన చంద్రబాబు కూడా కూర్చోగలిగారు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదని కళ్యాణ్ బెనర్జీ ప్రశ్నిస్తే మాత్రం ఏమవుతుంది! ఏమి కాదని తేలిందని అనుకోవచ్చా! సోషల్ మీడియాతో పాటు, సాక్షి వంటి ఒకటి ,రెండు మీడియాలు తప్ప ఇంకేవి వార్తనే ఇవ్వలేదు. అది చంద్రబాబు నైపుణ్యం అని ఒప్పుకోక తప్పదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
టీఎంసీ ఎంపీకి షాక్.. రూ. 50 లక్షలు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సాకేత్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. లక్ష్మీ పురికి క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. క్షమాపణలను ప్రముఖ జాతీయ వార్తాపత్రికలో ప్రచురించాలని, ఆరు నెలల పాటు సోషల్ మీడియాలో కూడా ఉంచాలని సూచించింది. ఎనిమిది వారాల్లోగా ఈ ఉత్తర్వును పాటించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.కాగా, 2021 జూన్ 13, 26న సాకేత్ గోఖలే వివాదస్పద ట్వీట్లు పోస్ట్ చేశారు. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురి తన ఆదాయానికి మించి స్విట్జర్లాండ్‌లో ఆస్తిని కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆమె భర్త, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గురించి కూడా ఆ ట్వీట్లలో ప్రస్తావించారు.ఈ నేపథ్యంలో అదే ఏడాది లక్ష్మీ పురి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలేపై పరువునష్టం దావా వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. -
డిప్యూటీ స్పీకర్ ‘ఎస్పీ’కి ఇవ్వండి: తృణమూల్
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఎంపిక పూర్తయింది. ఇక డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమికే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఇండియాకూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీకే ఆ పదవి ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అవధేశ్ ప్రసాద్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. స్పీకర్‌గా బీజేపీకి చెందిన ఓం బిర్లా ఇప్పటికే ఎన్నికైన విషయం తెలిసిందే. -
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
పశ్చిమ బెంగాల్‌లోని బన్గావ్ నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది. టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. సీఏఏ అనుకూల ప్రచారంతో బీజేపీ.. వ్యతిరేక ప్రచారంతో టీఎంసీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. మరి.. ఎక్కువ సంఖ్యలో ఉన్న మథువాల మద్దతు ఎవరికి ఉంది..? బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా..? లేక టీఎంసీ మళ్లీ పుంజుకుంటుందా..?బన్గావ్.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులోని లోక్‌సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మథువాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పార్టీల గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. దీంతో బీజేపీ, తృణమూల్ ఈ రెండూ పార్టీలు మథువా సామాజికవర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. గత ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శంతను కుమార్ బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బిశ్వజిత్ దాస్ రంగంలో దిగారు.బన్గావ్ లోక్‌సభ స్థానం 2009లో ఏర్పడింది. స్వాతంత్య్రం అనంతరం, 1971లో హిందూ శరణార్థులు భారీగా బనగావ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో ఎక్కువ మంది వలస వచ్చారు. వీరిలో అత్యధికులు మథువాలే. ప్రస్తుతం బన్గావ్ ఓటర్లలో 67 శాతం దాకా వాళ్లే ఉన్నారు. ఇప్పుడు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తేవడంతో సహజంగానే వీరంతా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు.ఇక.. బన్గావ్ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ ప్రచారాన్ని బన్గావ్ నుంచి ప్రారంభించిన మోదీ.. మథువా సామాజికవర్గానికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన అత్యధిక ఓట్లు బీజేపీకే పడ్డాయి. అలా బన్‌గావ్‌లో తొలిసారి బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి శంతను ఏకంగా లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.అటు.. బన్గావ్ రాజకీయాలను బీనాపాణి దేవి కుటుంబం శాసిస్తోంది. 1947లో బీనాపాణి దేవి, ఆమె భర్త ప్రమథ్ రంజన్ ఠాకూర్ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి దక్షిణ కోల్‌కతాలోని బల్లిగంజ్‌లో స్థిరపడ్డారు. ప్రమథ్ ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. మథువాల హక్కుల కోసం పోరాడారు. వలస వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం కోసం.. స్థానిక ఠాకూర్ నగర్లో ఆయన భూమి కొనుగోలు చేశారు. ఆ స్థలంలో శరణార్థుల కోసం తొలి ప్రైవేట్ కాలనీ నిర్మించారు. ఆ తర్వాత ప్రమథ్ 1962లో కాంగ్రెస్ అభ్యర్థిగా హన్స్‌ఖాలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలవగా.. కుమారుడు కపిల్ కృష్ణ ఠాకూర్ 2014లో ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం భార్య మమత 2015 ఉప ఎన్నికలో గెలిచారు. చిన్న కుమారుడు మంజుల్ కృష్ణ ఠాకూర్ టీఎంసీ ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆయన కుమారుడే బీజేపీ అభ్యర్థి శంతను.మరోవైపు.. సీఏఏను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మథువా వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపిందని మండిపడుతోంది. మథువాలకు ఇప్పటికే పౌరసత్వం, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు ఉండగా.. మళ్లీ కొత్తగా పౌరసత్వం ఇస్తామని బీజేపీ ఎలా చెబుతోందంటూ టీఎంసీ ప్రశ్నిస్తోంది. అసలు మథువాలు భారతీయ పౌరులు కాకపోతే.. వారు ఓటు ఎలా వేశారు..? ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్‌కు.. బెంగాల్ అసెంబ్లీకి ఎలా ఎన్నికయ్యారు అని నిలదీస్తోంది. మొత్తానికి హోరాహోరీగా ప్రచారం చేస్తున్న రెండు పార్టీల్లో మథువాలు ఎవరికి మద్దతుగా నిలుస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. -
ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఒక సిట్టింగ్ ఎంపీ సహా ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను రద్దు చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. వారి నామినేషన్లు పత్రాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిషన్ని ఆశ్రయించింది.బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోల్‌కతా-దక్షిణ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలా రాయ్ ఎంపీగానే కాకుండా కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారని పేర్కొన్నారు. లాభదాయకమైనదిగా పరిగణించే ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె ఈసారి నామినేషన్ దాఖలు చేశారని చటోపాధ్యాయ చెప్పారు.మరో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హత్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న హాజీ నూరుల్ ఇస్లాం నామినేషన్‌ను కూడా రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నూరుల్ ఇస్లాం ఇదే నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు.నామినేషన్ దాఖలు చేసేవారెవరైనా ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వ, శాసనసభ లేదా పార్లమెంటరీ హోదాలో ఉన్నట్లయితే తమ నామినేషన్‌తో పాటు గత 10 సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుందని, కానీ నూరుల్ ఇస్లాం ఆ నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించలేదని బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ అభ్యంతరం వ్యక్తం చేశారు.బీర్భూమ్ లోక్‌సభ నియోజకవర్గానికి తమ మొదటి అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి దేబాసిష్ ధర్ నామినేషన్‌ను ఇదే కారణంతో రద్దు చేశారని ఛటోపాధ్యాయ గుర్తు చేశారు. దీంతో తాము అభ్యర్థిని మార్చవలసి వచ్చిందన్నారు. రాయ్, ఇస్లాం నామినేషన్లలో ఈ లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే ఈసీని ఆశ్రయించామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు సహా ఎంత వరకూ అయినా వెళ్తామని చటోపాధ్యాయ స్పష్టం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఎటువంటి స్పందన లేదు. -
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమిపై కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే తాము బయటినుంచి మద్దతిస్తానని ప్రకటించారు. సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో విభేదాలు తలెత్తడం వల్లే ఇండియా కూటమికి మమత దూరంగా ఉన్నారు. బుధవారం(మే15) కోల్‌కతాలో మమత మీడియాతో మాట్లాడారు. ‘మేము ఇండియా కూటమికి బయటినుంచి మద్దతిస్తాం. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’అని తెలిపారు. కాగా, బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎంలు బీజేపీ మద్దతిచ్చి తృణమూల్‌ను ఓడించాలని చూస్తున్నాయని మమత ఇటీవల విమర్శలు గుప్పించడం గమనార్హం. -
కునాల్‌ఘోష్‌కు తృణమూల్ షాక్
కోల్‌కతా: పార్టీ ప్రధాన కార్యదర్శి కునాల్‌ఘోష్‌కు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) షాక్ ఇచ్చింది. ఆ పదవి నుంచి ఘోష్‌ను తప్పిస్తూ పార్టీ హైకమాండ్ బుధవారం(మే1) ఆదేశాలు జారీ చేసింది.ఇంతకుముందే ఘోష్‌ను అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించిన పార్టీ హైకమాండ్ తాజాగా ఆయనను ప్రధాన కార్యదర్శి పదవిని కూడా తొలగించింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తపస్‌రాయ్‌పై ఘోష్ బుధవారం బహిరంగంగానే ప్రశంసలు కురిపించారు. తపస్‌రాయ్ పార్టీ మారడం సరైందేనని, తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్సే సరైన దిశలో వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తృణమూల్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఘోష్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. -
కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ సంచలన కామెంట్స్
కలకత్తా: ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆమె ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలపైనే విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీతో కలిసి కాంగ్రెస్, వామపక్షాలు తృణమూల్ కాంగ్రెస్‌పై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అసలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిందే తానని, కూటమికి ఇండియా అనే పేరు కూడా తానే పెట్టానన్నారు. ఇంత చేస్తే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ బీజేపీ కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్,వామపక్షాలకు ఎవరూ ఓటు వేయకండి’అని మమత పిలుపునిచ్చారు. కాగా,లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పశ్చిమబెంగాల్లో పొత్తు కుదరలేదు. సీట్ల పంపకం ఒప్పందం కుదరకపోవడం వల్లే ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని తృణమూల్ ప్రకటించింది. ఇదీ చదవండి.. కోయంబత్తూరులో రూ.1000 కోట్లు.. బీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు -
ప్రచారంలో యువతికి ముద్దు.. వివాదంలో బీజేపీ ఎంపీ
కోల్‌కతా: దేశమంతటా ఎన్నికల వేడి రాజుకుంది. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటంతో నువ్వానేనా అన్నట్లుగా అధికార ప్రతిపక్షాలు ప్రచార జోరు పెంచాయి. ఓటర్లను ఆకర్షించుకునేందుకు విభిన్న రీతిలో ప్రచారం చేస్తూ హోరెత్తిస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్లో ఓ బీజేపీ అభ్యర్ధి నిర్వహించిన ప్రచారం వివాదంలో చిక్కుకుంది.బెంగాల్ నార్త్ మల్దా నియోజవర్గం బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము.. మరోసారి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇటీవల ఆయన తన నియోజకవర్గ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఖగేన్.. ఓయువతి చెంపపై ముద్దు పెట్టాడు. చంచల్ శ్రిహిపూర్ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ప్రచారంలో భాగంగా ఖగేన్ ముర్ము యువతికి ముద్దు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఘటన రాజకీయ దుమారాన్ని రేపింది.దీనిపై అధికార తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ బీజేపీపై విరుచుకుపడింది. కాషాయ పార్టీలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవేలేదని విమర్శలు గుప్పించింది. ‘బీజేపీ ఎంపీ బెంగాల్‌లోని ఉత్తర మాల్దా అభ్యర్ధి ఖగేన్ ముర్మూ తన ప్రచారంలో ఓ మహిళకు ముద్దు పెట్టారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీల నుంచి.. బెంగాలీ మహిళలపై అశ్లీల పాటలు రాసేటటువంటి నేతలు.. బీజేపీ శిబిజరంలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవే లేదు. నారీమణులకు ‘మోదీ పరివార్’ ఇస్తున్న గౌరవం ఇది. ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి’ అంటూ ఎక్స్ వేదికగా మండిపడింది. అయితే ఖగేన్ ముర్మూ తన చర్యలను సమర్ధించుకున్నారు. ఆమెను తన కుమార్తెలా భావించి, ముద్దు పెట్టినట్లు తెలిపారు. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారని విమర్శించారు. చదవండి: పతంజలి కేసు.. ‘క్షమాపణలు అంగీకరించం.. చర్యలు తప్పవు’ -
సందేశ్‌ఖాలీ హింస.. దీదీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం
సందేశ్‌ఖాలీ వ్యవహారంపై సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సందేశ్‌ఖాలీలో జరిగిన ఘటన అత్యంత సిగ్గుచేటని పేర్కొంది. ఈ మేరకు సందేశ్‌ఖాలీ హింసపై దాఖలైన పిటిషన్లను గురువారం విచారణ చేపట్టింది. సందేశ్‌ఖాళీ భూఆక్రమణ, లైంగిక ఆరోపణలపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అఫిడవిట్లో పేర్కొన్న ఒక్క విషయం నిజమైనా, అందులో ఒక శాతం వాస్తవమున్నా అది సిగ్గుచేటని పేర్కొంది. రాష్ట్రంలో పౌరుల భద్రతకు ముప్పు కలిగితే 100 శాతం ప్రభుత్వ బాధ్యతేనని తెలిపింది. దీనికి అధికార పార్టీ, స్థానిక యంత్రాంగం అందుకు పూర్తి నైతిక బాధ్యత వహించాలని చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అంతేగాక ఈ కేసులో నిందితుడైన షేక్ షాజహాన్ తరపున హాజరైన న్యాయవాదిపై సైతం చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. ‘విచారణలో ఉన్న నిందితుడి తరుపున హాజరువుతున్నారు. ముందు మీరు మీ చుట్టూ అలుముకున్న చీకటిని తొలగించండి. తరువాత మీ వాయిన్‌ను వినిపించడండి.’ అని మందలించారు. కాగా జనవరి 5న ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు షాజహాన్ షేక్ కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 55 రోజుల పాటు షాజహాన్ పరారీలో ఉండడంపై కోర్టు అసహనం వ్యక్తంచేసింది. కాగా ఫిబ్రవరి నెలలో పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆలస్యంగా అరెస్ఠ్ చేయడంపై బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. స్థానిక టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతడి అనుచరులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కవాకుండా వారి భూములను బలవంతంగా లాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన అధికార టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ వివాదానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. చదవండి: ఎన్నికల వేళ.. వంద కోట్ల ఇల్లీగల్ లిక్కర్ పట్టివేత? -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె తల నుదుటిపై భారీ గాయమైంది. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఎక్స్’ట్విటర్’లో వెల్లడించింది. మమతా తలకు గాయమైన ఫోటోను షేర్ చేసింది. ఆసుపత్రి బెడ్‌పై మమతా పడుకొని ఉండగా.. ఆమె తల నుదుటి భాగాన గాయమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖం మీదుగా మెడ వద్దకు రక్తం కారుతూ కనిపిస్తున్నారు. ‘మా చైర్పర్సన్ మమతా బెనర్జీ గాయపడ్డారు. దయచేసి ఆమెకోసం ప్రార్థించండి’ అంటూ ట్వీట్ చేశారు. కాగా మమతా బెనర్జీ గురువారం కాళీఘాట్‌లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆమెకు ఈ గాయమైంది. దీంతో వెంటనే ఆమెను కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఏడాది జనవరిలోనూ కారు ప్రమాదంలో మమతా తలకు స్వల్ప గాయమైంది. బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా.. ఆమె కాన్వాయ్‌కు ఎదురుగా మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్ కారుకు బ్రేక్‌లు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం.. విండ్‌షీల్డ్‌కు ఢీకొనడంతో తలకు స్వల్ప గాయమైంది. Our chairperson @MamataOfficial sustained a major injury. Please keep her in your prayers 🙏🏻 pic.twitter.com/gqLqWm1HwE — All India Trinamool Congress (@AITCofficial) March 14, 2024 -
టీఎంసీ అభ్యర్థులను జాబితాలో కనిపించని 'నుస్రత్ జహాన్' పేరు
మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఈరోజు పశ్చిమ బెంగాల్ నుంచి రాబోయితే లోక్‌సభ ఎన్నికలకు మొత్తం 42 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో బహరంపూర్ స్థానం నుండి మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, అసన్సోల్ నుంచి శత్రుఘ్న సిన్హా, దుర్గాపూర్ నుంచి కీర్తి ఆజాద్ వంటి కొన్ని ప్రముఖ పేర్లు ఉన్నాయి. టీఎంసీ పార్టీ 16 మంది సిట్టింగ్ ఎంపీల పేర్లతో పాటు, 12 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే కృష్ణానగర్ స్థానం నుంచి బహిష్కరణకు గురైన లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాను పార్టీ వరుసగా రెండోసారి మళ్లీ నామినేట్ చేసింది. సందేశ్‌ఖాలీ వివాదం కారణంగా 'నుస్రత్ జహాన్'ను బసిర్హాట్ స్థానం నుంచి తొలగించి.. ఆ స్థానంలో హాజీ నూరుల్ ఇస్లామ్‌ను బరిలోకి దింపారు. కాగా ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. -
అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ.. బరిలో మాజీ క్రికెటర్
కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మెగా ర్యాలీలో 'మమతా బెనర్జీ' రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 42 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బహరంపూర్ నుంచి పార్టీ అభ్యర్థిగా టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ (Yusuf Pathan), కృష్ణానగర్ నుంచి మాజీ ఎంపీ మహువా మొయిత్రా బరిలో నిలిచారు. మమత బెనర్జీ మేనల్లుడు, వారసుడు 'అభిషేక్ బెనర్జీ' డైమండ్ హార్బర్ నుంచి పోటీ చేయనున్నారు. నటుడు శత్రుఘ్న సిన్హా అసన్సోల్ నుంచి పోటీ చేయనున్నారు. అయితే సందేశ్‌ఖాలీ వివాదం కారణంగా 'నుస్రత్ జహాన్'ను బసిర్హాట్ స్థానం నుంచి తొలగించి.. ఆ స్థానంలో హాజీ నూరుల్ ఇస్లామ్‌ను బరిలోకి దింపారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితా కూచ్‌బెహార్: జగదీష్ చంద్ర బసునియా అలీపుర్దువార్: ప్రకాష్ చిక్ బరైక్ జల్పాయ్గురి: నిర్మల్ చంద్ర రాయ్ డార్జిలింగ్: గోపాల్ లామా రాయ్‌గంజ్: కృష్ణ కళ్యాణి బాలూర్ఘాట్: బిప్లబ్ మిత్ర మాల్డా నార్త్: ప్రసూన్ బెనర్జీ మాల్డా సౌత్: షానవాజ్ అలీ రెహాన్ జంగీపూర్: ఖలుయిలుర్ రెహమాన్ బెర్హంపూర్: యూసుఫ్ పఠాన్ ముర్షిదాబాద్: అబూ తాహెర్ ఖాన్ కృష్ణానగర్: మహువా మోయిత్రా రణఘాట్: ముకుట్ మణి అధికారి బొంగావ్: బిస్వజిత్ దాస్ బర్రా క్పూర్: పార్థ భౌమిక్ దుండం: సౌగత రాయ్ బరాసత్: కకోలి ఘోష్ దస్తిదార్ బసిర్హత్: హాజీ నూరుల్ ఇస్లాం జాయ్నగర్: ప్రతిమ మండల్ మధురాపూర్: బాపి హల్దర్ డైమండ్ హార్బర్: అభిషేక్ బెనర్జీ జాదవ్‌పూర్: సయోని ఘోష్ కోల్‌కతా సౌత్: మాలా రాయ్ డబ్ల్యూ కోల్జాత నార్త్: సుదీప్ బంద్యోపాధ్య హౌరా: ప్రసూన్ బెనర్జీ ఉకుబెర్రా: సజ్దా అహ్మద్ సెరాంపూర్: కళ్యాణ్ బెనర్జీ హుగ్లీ: రచనా బెనర్జీ ఆరంబాగ్: మిటాలి బాగ్ తమ్లుక్: దేబాంగ్షు భట్టాచార్య కాంతి: ఉత్తమ్ బారిక్ ఘటల్: దేవ్ దీపక్ అధికారి ఝర్గ్రామ్: కలిపాడా సోరెన్ మిడ్నాపూర్: జూన్ మాలియా పురూలియా: శాంతిరామ్ మహతో బుర్ద్వాన్ వెస్ట్: అరూప్ చల్రనోర్తి బర్డ్వాన్ ఈస్ట్: డాక్టర్ షర్మిలా సర్కార్ దుర్గాపూర్ బుర్ద్వాన్: కీర్తి ఆజాద్ అసన్సోల్: శత్రుఘ్న సిన్హా బోల్పూర్: అసిత్ మాల్ బీర్భం: సతాబ్ది రాయ్ బిష్ణుపూర్: సుజాత మోండల్ ఖాన్ -
టీఎంసీకి షాక్.. ఎంపీ సభ్యత్వానికి మిమీ చక్రవర్తి రాజీనామా
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నటి, టీఎంసీ నేత మిమీ చక్రవర్తి తన లోక్‌సభ ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన నియోజకవర్గంలో స్థానిక పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు స్థానిక నేతలతో విభేదాల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్ స్థానం నుంచి మిమీ చక్రవర్తి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. తన రాజీనామా లేఖను టీఎంసీ అధినేతి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అందజేశారు. అయితే ఆమె సీఎం ఆమోదించలేదు. ప్రొటోకాల్ ప్రకారం లోక్‌సభ ఎంపీ రాజీనామాను స్పీకర్‌కు సమర్పించాలి. ఇంకా లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామాను అందజేయ్యకపోవడంతో ఇది అధికారిక రాజీనామాగా పరిగణించకపోవచ్చు. -
కాంగ్రెస్ తో కటీఫ్ చెప్పేసిన తృణమూల్, ఆప్
-
మమతా లేని ఇండియా కూటమిని ఊహించలేము: కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయంపై ప్రతిపక్ష ఇండియా కూటమి అయోమయ స్థితిలో పడేసింది. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందన్న మమతా ప్రకటనతో కూటమిలోని పార్టీలో టెన్షన్ మొదలైంది. దిది నిర్ణయంపై తాజాగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లేని ఇండియా కూటమిని ఊహించలేమని అన్నారు, ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమికి టీఎంసీ బలమైన పిల్లర్‌గా అభివర్ణించారు. భవిష్యత్తులో టీఎంసీతో సీట్ల పంపకాల చర్చలు ఫలప్రదంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. బీజేపీని ఓడించాలని మమతా బెనర్జీ అన్నారు. ఓడించేందుకు మేము ఏమైనా చేస్తాం. మమతా బెనర్జీ, టీఎంసీ పార్టీ భారత కూటమికి బలమైన మూల స్తంభాలని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. దిది లేని భారత కూటమిని మనం ఊహించలేం. ఈ కూటమి పశ్చిమ బెంగాల్లో కూటమిలా పోరాడుతుంది. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగమయ్యేందుకు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలను ఆహ్వానిస్తన్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చాలాసార్లు కోరారు’ అని తెలిపారు. సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయన్న జైరాం రమేష్.. పశ్చిమ బెంగాల్లో భారత కూటమి ఏకమై ఎన్నికల్లో పోటీ చేస్తుందని, దానిపై తమకు పూర్తి విశ్వాసముంది. బీజేపీని ఓడించేందుకు తాము ఏ అవకాశాన్ని వదలదని ఆయన అన్నారు. అదే ఆలోచనతో ప్రస్తుతం అస్సాంలో ఉన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుందని అన్నారు. -
ఇండియా కూటమికి దీదీ షాక్
కోల్‌కతా: ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై బుధవారం సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారామె. ఇండియా కూటమిలో భాగంగా.. కాంగ్రెస్‌తో జరిపిన సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయని ఆమె తెలిపారు. ‘మేము వారికి ఏ ప్రతిపాదన ఇచ్చినా, వారు అన్నింటినీ తిరస్కరించారు. ఇక మాకు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవు... బెంగాల్లో ఒంటరిగానే పోరాడతాం. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. అంతేగాక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను ఉద్ధేశిస్తూ ‘ వారు రాష్ట్రానికి వస్తున్నారు. కనీసం దీనిపై మాకు సమాచారం ఇచ్చే మర్యాద వారికి లేదు’అని మండిపడ్డారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఖర్గే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ కూడా భాగమే. ప్రస్తుతం ఎన్నికల కోసం కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మమతా తాజాగా ప్రకటన చేయడం అధికార బీజేపీని పడగొట్టేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. అయితే మమతా బెనర్జీ అవకాశవాది అంటూ, ఆమె సహాయం లేకుండానే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి బెంగాల్ సీఎంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే మమతా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: Ayodhya: అయోధ్యకు వెళ్లే బస్సులు రద్దు! -
‘గీతా పారాయణం’లో పార్టీల దూషణల పర్వం
కోల్‌కతా: దాదాపు 1,20,000 మందితో కోల్‌కతాలో జరిగిన మెగా భగవద్గీత పఠన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంది. కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజూందార్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మతాన్ని, రాజకీయాలను కలిపేయడం బీజేపీ అలవాటుగా మారిందంటూ తృణమూల్ మండిపడింది. ‘‘గీతా పఠనానికి మేం వ్యతిరేకం కాదు. కానీ దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోకండి. లేదంటే ఈ కార్యక్రమం కంటే ఫుట్‌బాల్ మ్యాచ్ వంటిది ఏర్పాటు చేయడం మేలు’’ అని టీఎంసీ నేత ఉదయన్ గుహ అన్నారు. ఈ కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ దానికి దగ్గర్లోనే రాజ్యాంగ పఠనం కార్యక్రమం నిర్వహించింది. మరోవైపు గీతా పఠనానికి ప్రధాని మోదీ మద్దతుగా నిలిచారు. దీనితో సమాజంలో సామరస్యం పెంపొందుతుందంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
దుష్ప్రవర్తనను నిగ్గు తేల్చడమెలా?
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రమైన దుష్ప్రవర్తనతోపాటు, సభను ధిక్కరించినందుకు గానూ ఆమెను పార్లమెంటు నుండి బహిష్క రించాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ, దాని పేరు సూచించినట్లుగానే, ఎంపీల అనైతిక ప్రవర్తనను పరిశీలించి తగిన శిక్షలను సిఫారసు చేస్తుంది. నేటి వరకూ, ‘అనైతిక ప్రవర్తన’ అనేదానికి తగిన నిర్వచనం లేదు. ఎంపీల ప్రవర్తన తీరును పరిశీలించి, అది అనైతికమా, కాదా అని కమిటీ నిర్ణయిస్తుంది. ఎథిక్స్ కమిటీ చరిత్రలో ఎప్పుడూ ఒక ఎంపీని బహిష్కరించాలని సిఫారసు చేయలేదు. సభ్యులను విచా రించి శిక్షించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, సత్యాన్ని తెలుసుకునేందుకు అనుసరించే ప్రక్రియ సమర్థతపై సరైన అంచనా ఇంకా రావలసే ఉంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు మహువా మొయిత్రా తీవ్రమైన దుష్ప్రవర్తనతోపాటు, సభను ధిక్కరించినందుకుగానూ ఆమెను పార్లమెంటు నుండి బహిష్కరించాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. పార్లమెంటులో ప్రశ్నలను లేవనెత్తడం కోసం ఆమెకు ఇచ్చిన లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌ను దుబాయ్‌కి చెందిన ఒక వ్యాపారవేత్తతో పంచుకున్నారనేది ఆమెపై ఉన్న ప్రధాన అభియోగం. ఆ వ్యాపారవేత్త ఆమె పేరుతో లోక్‌సభకు ప్రశ్నలు పంపడానికి ఆమె లాగిన్, పాస్‌వర్డ్‌ను ఉపయోగించుకున్నారు. ఆయన వ్యాపార ప్రయోజనాల సమర్థవంతమైన ప్రమోషన్ కోసం ఆమె లాగిన్ ఐడీని దుర్వినియోగం చేయడానికి అనుమతించారనేది మొయిత్రాపై ఉన్న అభియోగంలోని ప్రధానాంశం. ఎథిక్స్ కమిటీ రెండు రోజులపాటు సమావేశమై, మొయిత్రాను దోషిగా నిర్ధారించి, ఆమెను బహిష్కరించాలని కోరింది. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ, దాని పేరు సూచించినట్లుగానే, ఎంపీల అనైతిక ప్రవర్తనను పరిశీలించి తగిన శిక్షలను సిఫారసు చేయవలసి ఉంటుంది. అయితే, నేటి వరకూ, ‘అనైతిక ప్రవర్తన’ అనేదానికి తగిన నిర్వచనం లేదు. ఎంపీల ప్రవర్తన తీరును పరిశీలించి, అది అనైతికమా కాదా అని కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ చరిత్రలో లేని బహిష్కరణ ఎథిక్స్ కమిటీ ఇప్పటివరకు పరిశీలించిన కేసులు ఏమంత ఎక్కువగా లేవు. సాధారణ ప్రవర్తనా నియమాలకు భిన్నమైన చిన్న చిన్న అతిక్రమణలతో ఈ కమిటీ వ్యవహరించింది. అటువంటి అతిక్రమణల తీవ్రతను బట్టి శిక్షలు మారుతూ ఉంటాయి: ఉపదేశించడం, మందలించడం, సభా సమావేశాల నుండి నిర్దిష్ట కాలానికి సస్పెండ్ చేయడం సాధారణంగా సిఫారసు చేస్తారు. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ చరిత్రలో ఎప్పుడూ ఒక ఎంపీని సభ నుంచి బహిష్కరించాలని సిఫారసు చేయలేదు. పార్లమెంటు నుండి బహిష్కరించడం చాలా తీవ్రమైన శిక్ష. ఎందుకంటే బహిష్కరించబడిన ఎంపీకి చెందిన నియోజకవర్గ ప్రజలకు సభలో ప్రాతినిధ్యం వహించే హక్కు, అవకాశం లేకుండాపోతాయి. అందువల్ల, బహిష్కరణ చాలా అరుదుగా సిఫారసు చేస్తారు. 1951లో, తాత్కాలిక పార్లమెంటు సభ్యుడు హెచ్డి ముద్గల్, ఒక వ్యాపార సంస్థ ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నట్లూ, దానికిగానూ ఆర్థిక ప్రయోజనాలను పొందు తున్నట్లూ గుర్తించి సభ నుండి బహిష్కరించారు. హౌస్‌లోని ప్రత్యేక కమిటీ ఈ కేసును విచారించి, ఆయన బహిష్కరణకు సిఫారసు చేసింది. అదే విధంగా, 2005లో, 10 మంది ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నలు వేసేందుకు డబ్బును స్వీకరిస్తున్నట్లు ఒక స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన సందర్భంలో వారిని లోక్‌సభ నుండి బహిష్కరించారు. ఈసారి కూడా ప్రత్యేక కమిటీ కేసు దర్యాప్తు చేసింది. ఒకరి వ్యక్తిగత ప్రయోజనాలను ప్రోత్సహించడానికి పార్లమెంటరీ పని చేయడం కోసం డబ్బును స్వీకరించడం సభా నియమాలకు సంబంధించి తీవ్ర మైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. కాబట్టి, అటువంటి దుష్ప్రవర్తనకు గాను అంగీకరించిన శిక్ష– బహిష్కరణ. రాజా రామ్ పాల్ వర్సెస్ గౌరవనీయ స్పీకర్, లోక్‌సభ (2007) ఉదంతంలో సుప్రీంకోర్టు... ప్రత్యేక హక్కును ఉల్లంఘించినందుకు సభ్యుడిని బహిష్కరించే సభ అధికారాన్ని ఆమోదించింది. అధికారం ఉందా, లేదా? అయితే, (ఆ సందర్భంలో) అటువంటి ప్రత్యేక హక్కు ఉందా లేదా అనే అంశాన్ని కోర్టు నిర్ధారిస్తుంది. అలాంటి హక్కు ఉనికిలో లేదని గుర్తిస్తే, సదరు బహిష్కరణను కొట్టివేస్తుంది. రాజా రామ్ పాల్ కేసు ప్రాముఖ్యత ఏమిటంటే, ఒక ఎంపీని బహిష్కరించే సభ అధి కారం ఒక ప్రత్యేక హక్కు ఉనికితో నేరుగా ముడిపడి ఉండటం. దాన్ని ఉల్లంఘిస్తే బహిష్కరణ సాధ్యపడుతుంది. అయితే ఇది ఒక ముఖ్య మైన ప్రశ్నకు దారి తీస్తుంది. విశేషాధికారాల కమిటీకి కాకుండా, ఇతర కమిటీకి బహిష్కరణను సిఫార్సు చేసే అధికారం ఉందా? (1951, 2005 సంవత్సరాలలో ఎంపీల బహిష్కరణకు సిఫార్సు చేసిన కమి టీలు నైతిక లేదా విశేషాధికారాల కమిటీలు కావు. నిర్దిష్ట సమస్యలపై విచారణ కోసం సభ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు.) రాజా రామ్ పాల్ తీర్పులోని తర్కాన్ని అనుసరించినట్లయితే, విశేషాధికారాల కమిటీ లేదా సభ నియమించిన ప్రత్యేక కమిటీ మాత్రమే విశేషాధికారాల ఉల్లంఘనపై ఎంపీని బహిష్కరించే వ్యవహా రాన్ని నడపగలదు. పార్లమెంట్‌లోని ఏ ఇతర సాధారణ కమిటీ ఆ సిఫారసు చేయలేదు. విశేషాధికారాల కమిటీ ముందుకు తేలేని సమస్యలతోనే ఎథిక్స్ కమిటీ వ్యవహరిస్తుంది. ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేయడంలోని తర్కం ఏమిటంటే, విశేషాధికారాల కమిటీ ముందుకు తేనక్కరలేనంతటి దుష్ప్రవర్తనలు చాలా ఉన్నాయి. అయితే అదే సమయంలో అటువంటి ప్రవర్తనతో తగిన విధంగా వ్యవహరించడానికి సభా క్రమశిక్షణా యంత్రాంగం అందుబాటులో ఉండాలి. వివిధ కమిటీల పాత్రల్లోని ఈ వ్యత్యాసం పార్లమెంటు దృష్టిని డిమాండ్ చేస్తుంది. తద్వారా పార్లమెంట్ శిక్షాస్మృతి అధికారాల కార్యాచరణలో మరింత స్పష్టత తేవడం జరుగుతుంది. పార్లమెంటరీ కమిటీలు చేసే దర్యాప్తు పరిధి, ప్రయోజనం, దాని స్వభావం కూడా ఇక్కడ దృష్టిలో ఉంటుంది. తక్షణ అవసరం స్కామ్‌లు, ఇతర తీవ్రమైన కేసులకు దారితీసే ఆర్థిక దుర్విని యోగానికి సంబంధించిన విషయాలను పార్లమెంట్ పరిశోధిస్తుంది. ఇటువంటి పరిశోధనలు భారీ ఆర్థిక మోసాలకు దారి తీసే వ్యవస్థాగత లోపాలను వెలికితీసేంత సమగ్రంగా ఉంటాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వంటి దర్యాప్తు సంస్థ చేయలేని ఈ విధిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నిర్వహిస్తుంది. అయితే సభ్యుడిని బహిష్కరించే అధికారంపై ఎటువంటి వివాదం లేనప్పటికీ, విచారణ విధానం గురించి కొన్ని ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి. ఫిర్యాదుదారు, ప్రతివాది ఎంపీ, ఇతర ప్రమేయం గల వ్యక్తులతో సహా సాక్ష్యం తీసుకోవడం కమిటీ సాధారణంగా అనుసరించే విధానం. వారు రాతపూర్వక పత్రాలను సమర్పించవచ్చు. అలాగే మౌఖిక ప్రకటనలు తీసుకోవచ్చు. ఆధారాలు సేకరించిన తర్వాత, సచివాలయ అధికారులు అటువంటి సాక్ష్యాలను జల్లెడ పట్టి, కనుగొన్న విషయాలు, సిఫార్సులతో కూడిన ముసాయిదా నివేదికను సిద్ధం చేస్తారు. కాబట్టి, ఒక ఎంపీకి ఇచ్చే అత్యంత తీవ్రమైన శిక్ష అయిన బహిష్కరణను కమిటీలోని మెజారిటీ ఆధారంగా నిర్ణయిస్తారు. పార్లమెంటరీ విచారణ స్వభావాన్ని మనం పరిశీలించినప్పుడు. సాక్ష్యాధారాలను బేరీజు వేసే అధికారుల సామర్థ్యాలు, దర్యాప్తు రంగంలో వారి నైపుణ్యం, మరియు ఎక్కువగా నిపుణులు కాని, న్యాయపరంగా శిక్షణ పొందని కమిటీ సభ్యుల మనస్సును అన్వయించడం వంటి సంబంధిత అంశాలను ఎప్పుడూ పరిగణనలోకి తీసు కోవాలి. పరిశోధనాత్మక యంత్రాంగాల ద్వారా విధానపరమైన సమగ్ర తను కొనసాగించినప్పుడు మాత్రమే న్యాయం, సత్యం నిర్ధారించ బడతాయి. ఏ తప్పు చేసినా దాని సభ్యులను విచారించి శిక్షించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, సత్యాన్ని తెలుసుకునేందుకు, న్యాయం చేయడానికి అనుసరించే ప్రక్రియ సమర్థత, దాని పటిష్టతపై సరైన అంచనా అనేది ఇంకా రావలసే ఉంది. మహువా మొయిత్రా కేసు ఈ పనికి సంబంధించిన ఆవశ్యకతను మనకు గుర్తు చేస్తోంది. పి.డి.టి. ఆచారి వ్యాసకర్త లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఆ అధికారం ఎథిక్స్ కమిటీకి లేదు: ఎంపీ మహువా మొయిత్రా
న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ నైతిక విలువల కమిటీకి నేరపూరిత ఆరోపణలను పరిశీలించే అధికారాలు లేవని ఆరోపించారు. ఈ మేరకు ఆమె కమిటీకి బుధవారం ఓ లేఖ రాశారు. కాగా ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యేందుకు మహువా సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే కమిటీ ముందు హాజరయ్యే ఒకరోజు ముందు ఆమె లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘తనకు జారీ చేసిన సమన్లను మీడియాకు విడుదల చేయడం సరైందని ఎథిక్స్ కమిటీ భావించినందున.. గురువారం విచారణను ఎదుర్కొనే ముందు నా లేఖను సైతం విడుదల చేయడం ముఖ్యమని భావిస్తున్నాను’ అని ఆమె చెప్పారు. ప్యానల్‌కు క్రిమినల్ అధికార పరిధి లేదు కమిటీ చైర్పర్సన్ వినోద్ కుమార్ సోంకర్‌కు రాసిన లేఖలో.. తనపై వచ్చిన నేరాపూరిత ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సరైన వేదికేనా? అని మహువా ప్రశ్నించారు. పార్లమెంటరీ కమిటీలకు నేరారోపణలను విచారించే క్రిమినల్ అధికార పరిధి లేదని పేర్కొన్నారు. చట్టపరమైన దర్యాప్తు సంస్థలు మాత్రమే ఇటువంటి కేసులో విచారించవచ్చునని చెప్పారు. దేశ రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ కమిటీల దుర్వినియోగాన్ని నిరోధించే లక్ష్యంతో ఇలాంటి ఏర్పాట్లు చేశారని మోయిత్రా తెలిపారు. చదవండి: రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఎవరో తెలుసా? గ్లోబల్ సెలబ్రిటీలు ఆమె కస్టమర్లు హీరానందానీని కూడా విచారణకు పిలవాలి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు అనుమతించాలని మోయిత్రా డిమాండ్ చేశారు. కాగా పార్లమెంట్లో అడిగేందుకు తన నుంచి ప్రశ్నలు స్వీకరించినట్లు దర్శన్ ఆరోపిస్తున్నారు. అంతేగాక దుబాయ్ నుంచి ప్రశ్నలు పోస్టు చేసేందుకు ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌కు వాడినట్లు తెలిపారు. కాగా అదానీ గ్రూప్‌ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకునేలా పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు మోయితా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయగా.. నైతిక విలువలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టింది. ఈ కేసులో నవంబర్ రెండున మహువా లోక్‌సభ ఎథిక్స్ ముందు విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. ఈ కేసులో నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహాద్రాయ్‌లు ఇప్పటికే కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. -
అవును.. పార్లమెంట్ లాగిన్ ఐడీ ఇచ్చా: ఎంపీ మహువా మొయిత్రా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన లోక్‌సభ లాగిన్ ఐడీ వివరాలు వ్యాపారవేత్త, హీరానందాని గ్రూప్ సీఈవో దర్శన్ హీరానందానికి ఇచ్చినట్లు ఆమె ఆంగీకరించారు. అయితే అతని నుంచి కేవలం చిన్న చిన్న గిఫ్ట్‌లే అందుకున్నట్లు చెప్పారు. హిరానందని గ్రూప్ సీఈవో నుంచి స్కార్ఫ్, కొన్ని లిప్‌స్టిక్‌లు, ఐషాడో వంటి మేకప్ ఐటమ్స్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. పార్లమెంటులో తాను అడగాల్సిన ప్రశ్నలను పోస్ట్ చేసేందుకు తన లోక్‌సభ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించేందుకు స్నిహితుడైన దర్శన్ హీరానందానికి అనుమతి ఇచ్చినట్లు ఆమె అంగీకరించారు. అయితే హీరానందని నుంచి డబ్బుల రూపంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలను మహువా ఖండించారు. ఈ క్రమంలో వ్యాపారవేత్తను ప్రశ్నించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతరులకు కూడా వివరాలు ఇచ్చా! లోక్‌సభ లాగిన్ వివరాలు ఇచ్చినట్లు అంగీకరించిన మహువా.. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తాను మారుమూల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇతరులకు కూడా ఈ వివరాలు ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఎప్పటికప్పుడు ఓటీపీ వస్తుందని, తన ప్రశ్నలు పోస్టు అవుతుంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, పార్లమెంటరీ వెబ్సైట్లను నిర్వహించే ఎన్ఐసీకి దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని తెలిపారు.. ముంబైలో ఉన్నప్పుడు హీరానందానీ కారు వాడాను వ్యాపారవేత్త అయిన హీరానందాని తన స్నేహితుడని, అతని నుంచి పుట్టినరోజు కానుకగా స్కార్ఫ్, లిప్‌స్టిక్‌లు, బాబీ బ్రౌన్ నుంచి మేకప్ ఐటమ్స్ తీసుకున్నట్లు మొయిత్రా పేర్కొన్నారు. తన కోసం దుబాయ్‌లోని డ్యూటీ ఫ్రీ స్టోర్ నుంచి మేకప్ వస్తువులు తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. తన ఇంటి ఇంటీరియర్లను మార్చడం కోసం తాను అతనిని సంప్రదించానని, అతను ఆమెకు కొత్త ఆర్కిటెక్చరల్ ప్లాన్లు, డ్రాయింగ్లను అందించాడని, అయితే ఖర్చులను ప్రభుత్వం పరిధిలోకి వచ్చే సీపీడబ్ల్యూడీ చేపట్టిందని ఆమె చెప్పారు. అలాగే తాను ముంబయిలో ఉన్నప్పుడల్లా హీరానందానీ స్నేహితుడైనందున అతని కారును ఉపయోగించేదానినని కూడా చెప్పింది. రూ. 2 కోట్ల ప్రస్తావన లేదు దర్శన్ హీరానందని తనకు ఇంకా ఏమైనా ఇచ్చి ఉంటే వెంటనే వచ్చి చెప్పాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎవరైనా ఆరోపణ చేస్తారని, కానీ ఆ ఆరోపణలను నిరూపించే బాధ్యత వారిపై ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. అఫిడవిట్లో తనకు 2 కోట్ల నగదు ఇచ్చిన ప్రస్తావన లేదని, ఒకవేళ ఇచ్చినట్లయితే.. దయచేసి ఎప్పుడు ఇచ్చారో తేదీ చెప్పాలని, అన్ని డాక్యుమెంటరీ సాక్ష్యాలను అందించాలని కోరారు. సొమ్ములు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినట్లు ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 కేవలం ప్రధాని మోదీ, అదానీ గ్రూప్‌ను,లక్ష్యంగా చేసుకొని ప్రశ్నించినవేనని లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. వీటికి తోడు మొయిత్రా ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమె పార్లమెంట్ ఐడీని దుబాయ్‌లో కొందరు ఉపయోగించుకుని లాగిన్ అయిన విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించిందని నిషికాంత్ దూబే మరో ఆరోపణలు చేయడం దుమారం చెలరేపింది. ఈ ఫిర్యాదుపై లోక్‌సభ నైతిక వ్యవహారాల కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 31న తమ ముందు విచారణకు హాజరు కావాలని మహువాను కమిటీ తెలిపింది. అయితే తన నియోజకవర్గం కృష్ణానగర్‌లో ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల వల్ల మరికొంత సమయం కావాలని ఎంపీ కోరగా.. ఆమె హాజరుకావాల్సిన తేదీ నవంబర్ రెండుకు మారింది. కొత్త తేదీ ఇచ్చిన ఎథిక్స్ కమిటీ.. ఇంతకు మించి పొడిగింపు ఉండదని వెల్లడించింది. ఇక ఇప్పటికే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ నైతిక వ్యవహారాల కమిటీ ముందు హాజరై తమ వాంగ్మూలం ఇచ్చారు. అదే విధంగా మహువాకు వ్యతిరేకంగాపలు సాక్ష్యాలను సమర్పించారు. -
రాజ్యసభలో హైడ్రామా.. డెరెక్ ఒబ్రియాన్ సస్పెన్షన్.. ఆపై ఉపసంహరణ
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ సస్పెన్షన్ అంశంపై మంగళవారం రాజ్యసభలో హైడ్రామా నడిచింది. మంగళవారం సభ ఆరంభం కాగానే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ మణిపూర్ అంశంపై చర్చించాలంటూ పట్టుబడ్డారు. దీంతో చైర్మన్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలకు పదేపదే అడ్డుతగులుతున్న ఒబ్రియాన్ను సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. సభా మర్యాదకు భంగం కలిగిస్తున్నందుకు ఆయనను వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ రాజ్యసభలో నేత గోయల్ తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్ తివారీ సహా పలువురు సభ్యులు ఒబ్రియాన్ పట్ల సౌమ్యంగా వ్యవహరించాలని చైర్మన్‌ను కోరారు. స్పందించిన ధన్‌ఖడ్.. ఒబ్రియాన్ తిరిగి సమావేశాలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, ప్రతిపక్ష నేతలపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన పీయూష్ గోయెల్‌పై ‘ఇండియా’ కూటమి నేతలు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. న్యూస్‌క్లిక్ వెబ్‌పోర్టల్‌కు నిధులందాయంటూ గోయెల్ చేసిన ఆరోపణలపై విపక్ష పార్టీల నేతలు మంగళవారం రాజ్యసభ చైర్మన్‌కు ఈ మేరకు నోటీసు అందజేశారు. -
నా కారునే ఆపుతావా.. టోల్గేట్ సిబ్బందిపై ఎంపీ దాడి
కోల్‌కతా: తన కారు ఆపాడని కోపంతో ఓ టోల్ బూత్ సిబ్బందిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ దాడి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ప్రకారం టీఎంసీ ఎంపీ సునీల్ మండల్ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. బుర్ద్వాన్‌లోని పల్సిట్లో గురువారం రాత్రి ఆయన కారు టోల్ గేటు దాటుతుండగా టోల్ ఉద్యోగి నిబంధనల ప్రకారం వాహనాన్ని ఆపాడు. అయినప్పటికీ డ్రైవర్ కారును ఆపలేదు. ట్రాఫిక్ కోన్‌ను ఢీకొట్టి ముందుకు నడిపాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న టోల్ బూత్ ఉద్యోగి ఉజ్వల్ సింగ్ ట్రాఫిక్ కోన్‌ను పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో కారు దిగి వచ్చిన ఎంపీ సునీల్ మండల్ ఆ ఉద్యోగిపై మండిపడ్డారు. నా కారునే ఆపుతావా అంటూ అతడిపై చేయి చేసుకోవడంతో పాటు తోసేశారు. టోల్ ప్లాజా వద్ద ఉన్న ఇతర ఉద్యోగులు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంపీకి నచ్చజెప్పడంతో ఈ గొడవ సద్ధుమణిగింది. అయితే ఈ ఘటన మొత్తం టోల్‌ప్లాజాలోని సీసీ కెమెరాలో రికార్డయింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో టీఎంసీ ఎంపీ సునీల్ మండల్స్పందించారు. తాను తొందరలో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించడంతోనే తాను చేయి చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఆ ఉద్యోగిని భౌతికంగా తోయడం తప్పేనంటూ క్షమాపణలు కూడా చెప్పారు. ये #MP #MLAs को समझना चाहिए कि टोल प्लाजा पर खडे सामान्य लोग उन्हें नहीं पहचानते. वो अपना काम कर रहे है. अगर गाडी रोक दी तो गुनाह नहीं कर दिया जनाब पश्चिम बंगाल के बर्दवान पूर्व के #सांसद #sunilmandal है हरकत तो दिख ही रही है https://t.co/w1sRx9QO3t pic.twitter.com/09EbhRDNDu — Archana Pushpendra (@margam_a) August 4, 2023 -
విరాళాల సేకరణలో బీజేపీ టాప్.. ఆరేళ్లలో వేల కోట్ల విరాళాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విరాళాల సేకరణలో అన్ని రాజకీయ పార్టీల కంటే చాలా ముందంజలో ఉంది. భారత రాజకీయాల్లో సంస్కరణల కోసం పోరాడుతున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. 2016–17 నుంచి 2021–22 మధ్య కాలంలో ఎలక్టోరల్ బాండ్లు, ప్రత్యక్ష కార్పొరేట్ విరాళాలు సహా ఇతర విరాళాల ద్వారా మొత్తంగా ఆరేళ్లలో రూ.10,122 కోట్లు బీజేపీకి వచ్చాయి. బీజేపీ ప్రకటించిన మొత్తం విరాళాలు ఇతర జాతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. బీజేపీ తర్వాత స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విరాళాల రూపంలో రూ.1547.439 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రూ.823.301 కోట్లు, సీపీఐ(ఎం) రూ.367.167 కోట్లు, ఎన్సీపీ రూ.231.614 కోట్లు సేకరించాయి. ప్రాంతీయ పార్టీల్లో బీజేడీ తీయ పార్టీల జాబితాలో బిజు జనతాదళ్ (బీజేడీ) అత్యధికంగా రూ.692.60 కోట్లు విరాళాలు సేకరించింది. ఇక తెలంగాణరాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ రూ.476.89 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత డీఎంకే పార్టీ రూ.475.73 కోట్లు, వైఎస్ఆర్సీపీ రూ.456.20 కోట్లు, శివసేన రూ.267.90 కోట్లు, ఆప్ రూ.169.70 కోట్లు, టీడీపీ రూ.168.67 కోట్ల విరాళాలు సేకరించాయి. చదవండి: ఆ తేనేలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
రాజకీయ వేడి!
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కోవడానికి విపక్షాలంతా చేయి చేయి కలిపి తమ బలం చాటనున్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ సహా 20 జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ నెల 23న పలో సమావేశమై మోదీని ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలను రచించనున్నారు. దేశంలో అత్యంత బలవంతుడైన నాయకుడు మోదీని ఎదిరించి నిలబడుతున్న రాహుల్ గాందీ, అరవింద్ కేజ్రివాల్; మమతా బెనర్జీ వంటి వారు ఈ సమావేశానికి హాజరై వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా మంత్రాంగం నడపనున్నారు. పాట్నా సమావేశంలో ప్రతిపక్ష పార్టీలందరూ ఒకే తాటిపైకి రాగలరా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పార్టీల్లో ఎవరికి వారికే ప్రధానమంత్రి పదవి తమకే దక్కాలన్న ఆశ ఉండడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్నారు. ప్రధాని మోదీని ఎదుర్కోవాలంటే విపక్షాల ఓట్లు చీలకుండా ఉండడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విపక్ష పార్టీ లన్నీ ఏకతాటిపైకి తీసుకురావడానికి చొరవ చూపించారు. ప్రతీ నియోజకవర్గంలోనూ బీజేపీకి దీటుగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపుదామని ఆయన ప్రతిపాదించారు. కానీ ఇదెంతవరకు కార్యరూపం దాలుస్తోందన్న అనుమానాలున్నాయి. ♦ ప్రాంతీయ పార్టీ ల మధ్య నెలకొన్న రాజకీయ శత్రుత్వం విపక్షాల ఐక్యతకు అసలు సిసలైన సవాల్‌గా నిలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఉప్పు నిప్పుగా ఉన్న టీఎంసీ, లెఫ్ట్ పార్టీ లను ఒకే తాటిపైకి తీసుకురావడం కష్టమనే అభిప్రాయాలున్నాయి. జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి వాటితో కాంగ్రెస్ కలిసే అవకాశం లేదు ♦ సీట్ల సర్దుబాటు అన్నది లెక్కకు మించిన పార్టీ ల మధ్య సవ్యంగా జరగడం అతి పెద్ద సవాల్. పశ్చిమ బెంగాల్, అస్సాం, జార్ఖండ్, కేరళ, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంత సులభంగా కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లోనే 172 లోక్‌సభ స్థానాలున్నాయి. ♦ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్ , రాజస్తాన్‌లలో తాము పోటీకి దిగమని హామీ ఇస్తోంది కానీ తమకు గట్టి పట్టున్న న్యూఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ పోటీపడకూడదని షరతు విధిస్తోంది. అదే విధంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధిక సంఖ్యలో సీట్లు కాంగ్రెస్కుకేటాయించడానికి సిద్ధంగా లేరు. ♦ బీజేపీపై ఉమ్మడి అభ్యర్థిని నిలపకపోతే మోదీని ఎదుర్కోవడం కష్టసాధ్యమని నితీశ్ కుమార్ అభిప్రాయంగా ఉంది. ఆ దిశగా ఆయన ఎంతవరకు ఒప్పించగలరన్నది సందేహమే. ♦ ప్రధాని మోదీకున్న చరిష్మాను తట్టుకొని నిలబడాలంటే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజీపడి ఇతర పార్టీ లకు దగ్గరవాలని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ♦ ఈ సవాళ్లన్నింటిని అధిగమించడం ఇప్పుడే సాధ్యం కాదు కాబట్టి ప్రస్తుత సమావేశం దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలైన ధరాభారం, నిరుద్యోగంతో పాటు మతం పేరుతో సమాజాన్ని చీల్చే చర్యలకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాట వ్యూహాన్ని చర్చించడానికి పరిమితమయ్యే అవకాశాలున్నాయి ఒకవైపు విపక్ష పార్టీ లన్నీ ఏకం కావడానికి సర్వ శక్తులు ఒడ్డుతూ ఉంటే అధికార ఎన్డీయే నుంచి ఇప్పటికే ఎన్నో పార్టీ లు దూరమయ్యాయి. మళ్లీ వారందరితోనూ జత కట్టడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ద్వయం దృష్టి పెట్టారు. మహారాష్ట్రలో శివసేన దూరమయ్యాక ఆ పార్టీని చీల్చి ఏక్నాథ్ షిండేని సీఎంను చేసిన బీజేపీకి ఇప్పుడు ఆయన వైఖరి కూడా కొరుకుడు పడడం లేదు. మహారాష్ట్రలో బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కంటే ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేకి జనాదరణ అధికంగా ఉందని పేపర్లో ప్రకటన ఇవ్వడం బీజేపీకి మింగుడు పడడం లేదు.తమిళనాడులో మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై జయలలితపై చేసిన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసింది. ఇక బీహార్‌లో నితీశ్ కుమార్ జేడీ (యూ) దూరమయ్యాక ఎన్నికల్లో బీజేపీ నష్టపోతుందని పార్టీ అంతర్గత సర్వేల్లో వెల్లడైంది. ఇటీవల ప్రధాని మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలతో జరిగిన సమావేశంలో తమతో కలిసే మిత్రపక్షాలను కలుపుకొని పోవాలని మోదీ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ♦కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 2020లో ఎన్డీయేకి గుడ్‌బై కొట్టేసిన పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్‌ను కూడా తిరిగి ఎన్డీయే గూటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ♦ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జేడీ(ఎస్) ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలపాలని కలిసి పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది. బీహార్‌లో కులప్రాతిపదికన చిన్న పార్టీ లను కలుపుకొని వెళితే మేలన్న యోచనలో బీజేపీ ఉంది. లోక్‌జనశక్తి పార్టీ (చిరాగ్ చీలిక వర్గం) ఎన్డీయేకి దూరమవకుండా చర్యలు తీసుకుంటూనే హిందూస్తాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) దగ్గరకు తీసుకునే చర్యలు చేపడుతోంది. నితీశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండే ఇటీవల విభేదాల కారణంగా బయటకు వచ్చిన వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముకేశ్ సాహ్నితో కూడా మంతనాలు సాగిస్తోంది. ♦ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన ఓం ప్రకాశ్ రాజ్బహార్కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ తో మంతనాలు సాగిస్తోంది. బీజేపీ యూపీ అధ్యక్షుడు చౌధరి భూపేంద్ర సింగ్ వారణాసిలో జరిగిన రాజ్బహార్ వ్యక్తిగత కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా అన్ని వైపుల నుంచి ఎన్డీయేని బలోపేతం చేయడానికి బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. - సాక్షి, నేషనల్ డెస్క్ -
పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ ఖాళీ.. టీఎంసీలో చేరిన ఏకైక ఎమ్మెల్యే
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ సోమవారం అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. పశ్చిమ మెదినీపూర్ జిల్లాఆలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. కాగా ముర్షిదాబాద్ జిల్లాలోని మైనార్టీల ప్రాబల్యం ఉన్న సాగర్డిఘి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బేరాన్ బిస్వాస్.. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక శాసన సభ్యుడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సాగర్‌డిఘీ ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థిపై దేబాశిష్ బెనర్జీపై 22 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. తాజాగా ఆయన కూడా పార్టీ మారడంతో రాష్టంంలో హస్తం పార్టీ ఖాళీ అయ్యింది. Today, during the ongoing #JonoSanjogYatra in the presence of Shri @abhishekaitc, INC MLA from Sagardighi Bayron Biswas joined us. We wholeheartedly welcome him to the Trinamool Congress family! To strengthen your resolve to fight against the divisive and discriminatory… pic.twitter.com/CyCaUKTyRs — All India Trinamool Congress (@AITCofficial) May 29, 2023 బైరాన్ చేరిక అనంతరం టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. బిస్వాస్‌ను తృణమూల్ కాంగ్రెస్‌ల కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేకంగా కేవలం టీఎంసీ మాత్రమే పోరాడగలదని పేర్కొన్నారు. కాషాయ పార్టీ విభజన, వివక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సరైన వేదికను ఎంచుకున్నారని తెలిపారు. కలిసి కట్టుగా పోరాడి గెలుస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2021లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోకాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఈ ఏడాది ఉప ఎన్నికలో బిశ్వాస్ కాంగ్రెస్ టిక్కెట్‌పై సాగర్డిఘి స్థానాన్ని గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు ఆయన ఉన్నారు. చదవండి: ఆందోళన వద్దు.. ఆర్టీసీ బస్సుల్లో రూ. 2 వేల నోట్లకు ఓకే -
మైక్ పట్టుకొని పాట పాడిన మమతా బెనర్జీ.. వీడియో వైరల్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాట పాడారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో గురువారం తన నిరసనను సీఎం ఓ పాట రూపంలో వ్యక్తపరిచారు. రవింద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచిన ఓ బెంగాలీ పాటను మైక్ పట్టుకొని స్వయంగా ఆలపించారు. ధర్నా సమయంలో స్టేజ్ మీదున్న ఇతర నేతలు, కళాకారులతో కలిసి ‘ఎబార్ తోర్ మోరా గంగే’ అనే పాటను పాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ కోల్‌కతాలో రెండు రోజులుగా మమతా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. గ్రామీణ ఉపాధి హామీ పథకంతో సహా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం స్వయంగా ఈ ధర్నా చేపట్టారు. ఈ దీక్షలో మమతతో పాటు టీఎంసీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ నిరసన దీక్ష ఈ రోజు రాత్రి 7 గంటలకు ముగియనుంది. చదవండి: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని.. ఆ వీడియో చూస్తూ అడ్డంగా బుక్..! #WATCH | West Bengal CM Mamata Banerjee sings a Bengali song on the second day of her Dharna in Kolkata, against the Central government for not clearing funds for several schemes including 100 days work. pic.twitter.com/r6CRXCuqty — ANI (@ANI) March 30, 2023 -
అమ్మా.. పోలీసులు తీసుకెళుతున్నారు!
న్యూఢిల్లీ: తృణమాల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి సాకేత్ గోఖలేని గుజరాత్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు డెరెక్ ఓబ్రియన్ అన్నారు. ఇది రాజకీయ ప్రతీకార చర్య అని తృణమాల్ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. సాకేత్ గోఖలే సోమవారం రాత్రి న్యూఢిల్లీ నుంచి రాజస్తాన్‌లోని జైపూర్‌కి విమానంలో వెళ్లారని, అక్కడ ముందుగానే వేచి ఉన్న గుజరాత్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఓబ్రెయిన్ ట్విట్టర్లో తెలిపారు. ఆయన మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు తన అమ్మకు ఫోన్ చేసి తనను పోలీసులు అహ్మదాబాద్ తీసుకువెళ్తున్నారని, మధ్యాహ్నానికి అక్కడకి చేరుకుంటానని చెప్పారు. ఆయనకు పోలీసులు ఫోన్ చేయడానికి కేవలం రెండు నిమిషాలే ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత అతని నుంచి ఫోన్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గోఖలే మోర్బీ బ్రిడ్జ్ కూలిన ఘటన గురించి కొన్ని వార్తపత్రికల క్లిప్పింగ్‌ల తోపాటు మోర్బీ ప్రధాని పర్యటనకు రూ. 30 కోట్లు ఖర్చు అవుతుందని ఆర్టీఐ పేర్కొందని ట్వీట్ చేశారు. ఐతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆ వార్తలను నకిలీవిగా పేర్కొనడం గమనార్హం. ఐతే ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం గోఖలే చేసిన ట్వీట్లను గుర్తించింది. గోఖలే చేసిన ట్విట్లను దృష్టిలో ఉంచుకునే ఇలా తప్పుడూ కేసులు బనాయించి అరెస్టులు చేస్తోందంటూ తృణమాల్ కాంగ్రెస్ నేత ఓబ్రెయిన్ ఆరోపణలు చేశారు. ఐతే ఆయన ఇక్కడ ఏ ట్వీట్ అనేది స్పష్టం చేయలేదు. ఇలాంటి చర్యలతో తృణమాల్కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షాల నోటిని మూయించలేరన్నారు. బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యను మరో స్థాయికి తీసుకువెళ్తోందంటూ విరుచుకుపడ్డారు. కాగా, జైపూర్ విమానాశ్రయ పోలీసు ఇన్ఛార్జ్ దిగ్పాల్ సింగ్ ఈ విషయమై మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు, ఎవరు తెలియజేయ లేదని స్పష్టం చేశారు. (చదవండి: తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్’.. పన్నీరు సెల్వానికి ఊహించని షాక్!) -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్
Pavan Varma.. దేశవ్యాప్తంగా రాజీకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బీహార్‌లో బీజేపీకి హ్యాండ్ ఇస్తూ నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీ సపోర్టుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ఇంతకు ముందు బీజేపీతో కలిసి ఉండటాన్ని ఇష్టపడని కొందరు నేతల జేడీయూను వీడారు. తాజాగా బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకోవడంతో నేతలు మళ్లీ నితీష్ చెంతకు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీహార్‌కు చెందిన జేడీయూ మాజీ ఎంపీ పవన్ వర్మ శుక్రవారం.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. ‘మమతా జీ, ఏఐటీసీ కార్యాలయానికి పంపిన నా రాజీనామాను దయచేసి ఆమోదించండి. మీ ఆప్యాయత, మర్యాదలకు ధన్యవాదాలు చెబుతున్నాను. మీతో సంప్రదింపులు జరిపేందుకు నేను ఎదురుచూస్తున్నాను. మీకు అంతా మంచి జరుగాలని కోరుకుంటున్నాను. హృదయపూర్వక నమస్కారాలు’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే, గతంలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని పవన్ కుమార్ తప్పుపట్టారు. ఈ సందర్భంలోనే పౌరసత్వ సవరణ చట్టాన్ని నితీశ్ కుమార్ సమర్థించడాన్ని పవన్ వర్మ వ్యతిరేకించారు. . బీజేపీ-ఆర్ఎస్ఎస్పై నితీశ్ కుమార్ కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ లేఖ రాయడం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో, పవన్ వర్మను జేడీయూ సస్పెండ్ చేసింది. అనంతరం, ఆయన మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్‌లో చేరారు. కాగా, తాజాగా నితీష్ కుమార్.. బీజేపీకి గుడ్ బై చెప్పడంతో పవన్ వర్మ టీఎంసీ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మళ్లీ పవన్ వర్మ.. నితీష్ గూటికి చేరుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, పవన్ వర్మ టీఎంసీలో చేరి ఏడాది కూడా కాకపోవడం విశేషం. Pavan Varma joined TMC in November 2021. In January 2020, he was expelled from JD(U) over his open criticism of Nitish Kumar's support for the controversial Citizenship Amendment Act. https://t.co/oa1arCypqc — The Wire (@thewire_in) August 12, 2022 ఇది కూడా చదవండి: శశిథరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం -
కాళీ మాతపై వ్యాఖ్యలు ఇష్యూ.. సీఎం మమత కామెంట్స్ ఇవే..
కోల్కత్తా: కాళీమాతను అవమానిస్తూ విదేశంలో ఒక డాక్యుమెంటరీ పోస్టర్ వెలిసిన వివాదం ముదిరిపోయి భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పోస్టర్‌పై తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తప్పులు అందరూ చేస్తారు. కానీ, వాటిని సరిదిద్దుకోగలరు. మేము కూడా పని చేస్తున్నప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ, ఆ తర్వాత సరిదిద్దుకుంటాం. కొందరు మంచి పనిని సహించక అరుస్తుంటారు. ప్రతికూల ఆలోచనలు మన మెదడుకు మంచిది కాదు. అందుకే సానుకూల దృక్పథంతో ఆలోచించండి అని అన్నారు. ఇదిలా ఉండగా.. అంతకు ముందు ఎంపీ మొయిత్రా.. ‘నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్ స్వీకరించే వ్యక్తి’, ‘సిక్కింలో కాళీమాతకు విస్కీని కానుకగా సమర్పిస్తారు. అదే యూపీలో ఇది తీవ్రమైన దైవదూషణ’ చేస్తారని ఆమె అన్నారు. అదే బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో కాళీమాతను ఆరాధించే తారాపీఠ్ శక్తిపీఠం వద్ద సాధువులు ఎప్పుడూ ధూమపానం చేస్తూ కనిపిస్తారు. నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్ స్వీకరించే వ్యక్తి. నాతో సహా ప్రతి ఒక్కరికీ నచ్చిన దైవాన్ని నచ్చినట్లు ఆరాధించే హక్కుంది’ అని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెను దుమారం చోటుచేసుకుంది. బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. మొయిత్రా వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని టీఎంసీ తర్వాత ట్వీట్‌చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేతలు ఆమెపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. టీఎంసీ ఎంపీ మొయిత్రా.. మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. దీంతో మధ్యప్రదేశ్ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: హిందుత్వం ఎప్పటికీ భారతదేశంగా మారదు.. ‘కాళి’ లీనా ట్వీట్లు మరింత దుమారం -
తృణమూల్‌పై నడ్డా విమర్శలు.. తిప్పికొట్టిన సీఎం మమత
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి విధానాలు, విలువలు లేవంటూ బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యవస్థీకృత వసూళ్లకు పాల్పడే సిండికేట్లు నడపడమే దానికి తెలిసిన ఏకైక విద్య అని ఎద్దేవా చేశారు. బెంగాల్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ చేతిలో తృణమూల్ ఓటమి ఖాయమన్నారు. రెండు రోజుల బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన బంకించంద్ర చటర్జీ వందేమాతరాన్ని రచించిన వందేమాతరం భవన్‌ను బుధవారం సందర్శించారు. మరోవైపు నడ్డా విమర్శలపై బెంగాల్ సీఎం, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ మండిపడ్డారు. ఎన్నికలు రాగానే ప్రజలను మభ్యపెట్టేందుకు పథకాలు, ప్రత్యేక రాష్ట్రాల హామీలివ్వడం, తర్వాత తుంగలో తొక్కడం బీజేపీకి పరిపాటేనన్నారు. చదవండి: వివాదస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత: మరింత చిక్కుల్లో నూపుర్ శర్మ -
Sakshi Cartoon: తిరిగి తృణమూల్‌లో చేరుతున్న బీజేపీ నాయకులు
తిరిగి తృణమూల్‌లో చేరుతున్న బీజేపీ నాయకులు -
దేశం ప్రమాదంలో ఉంది.. పోరాడాల్సిందే
గువాహటి: బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో పడిందని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో టీఎంసీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా అసోం రాజధాని గువాహటిలో పార్టీ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘హిందువులు ప్రమాదంలో ఉన్నారని కొందరు అంటున్నారు. ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని మరికొందరు అంటున్నారు. మీ మతం కళ్లద్దాలు తీసి చూడండి భారతదేశం ప్రమాదంలో ఉంద’ని వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అసోంలోని 14 లోక్‌సభ స్థానాలకు గాను 10 స్థానాలు గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. గెలిచే వరకు విశ్రమించబోం అసోం నుంచి అవినీతి బీజేపీని తరిమి కొట్టడానికి టీఎంసీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ‘టీఎంసీ ఎక్కడ అడుగుపెట్టినా చివరి వరకు గట్టిగా పోరాడింది. రెండేళ్లలో బీజేపీని తరిమికొట్టేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో గెలిచే వరకు విశ్రమించబోం. పోరాటం ప్రారంభించిన తర్వాత వెనక్కి తిరిగి చూడబోం. అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉంది. లోక్‌సభ ఎన్నికలు రెండేళ్లలో జరగనున్నాయి. ఇక్కడ 14 సీట్లకు గాను 10 స్థానాల్లో పోరాడి గెలుస్తామ’ని అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపుర, మేఘాలయా రెండింటిలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. (క్లిక్: జేపీ మీటింగ్‌కు రాహుల్ ద్రవిడ్..?) భారీగా చేరికలు ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయడంపై టీఎంసీ అధినాయకత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రిపున్ బోరాను అసోం టీఎంసీ అధ్యక్షుడిగా నియమించింది. ఆయన ఇలీవలే కాంగ్రెస్ పార్టీని వీడి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరారు. కాగా, కొద్ది రోజుల్లోనే జిల్లా, బ్లాక్ కమిటీలను ఏర్పాటు చేస్తామని అభిషేక్ బెనర్జీ తెలిపారు. 2022 చివరి నాటికి అన్ని బూత్‌లలో కమిటీలు ఉండేలా చూస్తామన్నారు. మరోవైపు ప్రాంతీయ, జాతీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అభిషేక్ బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. (క్లిక్: అవార్డ్ తిరిగి ఇచ్చేసిన రచయిత్రి.. బీజేపీ, టీఎంసీ మాటల యుద్ధం) -
అవార్డ్ తిరిగి ఇచ్చేసిన రచయిత్రి.. బీజేపీ, టీఎంసీ మాటల యుద్ధం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ‘అవార్డ్ వాపసీ’ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. టీఎంసీ ఏలుబడిలో స్వోత్కర్ష ఎక్కువైందని బీజేపీ విమర్శించగా.. కమలనాథులు తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని అధికార పార్టీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. అసలేం జరిగింది? బెంగాల్‌కు చెందిన రచయిత్రి, జానపద సంస్కృతి పరిశోధకురాలు రత్న రషీద్ బెనర్జీ.. పశ్చిమబంగ బంగ్లా అకాడమీ 2019లో తనకు ప్రదానం చేసిన ప్రతిష్టాత్మక ‘అన్నదా శంకర్ స్మారక్ సమ్మాన్’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సాహిత్య విభాగంలో అవార్డు ప్రదానం చేయడంతో ఆమె ఈ విధంగా తన నిరసన తెలియజేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా.. సోమవారం ప్రభుత్వ సమాచార, సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మమతకు సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. ఆమె రాసిన 'కబితా బితాన్' పుస్తకానికి గాను సాహిత్య అకాడమీ ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన అవార్డును ముఖ్యమంత్రికి అందజేశారు. దీనిపై రషీద్ బెనర్జీ స్పందిస్తూ.. మమతా బెనర్జీ రాసిన పుస్తకంలో సాహిత్యమే లేదని, ఆమెకు అవార్డు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తన పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. అవమానంగా భావిస్తున్నా ‘సీఎంకు సాహిత్య పురస్కారం ఇవ్వడం నన్ను అవమానించినట్లు భావిస్తున్నాను. ఆ నిర్ణయానికి ఇది నా నిరసన. నేను దానిని అంగీకరించలేను. ముఖ్యమంత్రి గారి ‘కబితా బితాన్’ పుస్తకాన్ని నేను సాహిత్యంగా అస్సలు పరిగణించను. ఆమె మన ముఖ్యమంత్రి. మేము ఆమెకు ఓటు వేశాం. నేను వృద్ధురాలిని. నాకు కలం భాష మాత్రమే తెలుసు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఆమె మాకు అందనంత ఉన్నత పదవిలో ఉన్నారని తెలుసు. ఇలాంటి ఉదంతాలు ప్రతికూల సంకేతాలు పంపే అవకాశముంద’ని రషీద్ బెనర్జీ పేర్కొన్నారు. అధినాయకురాలి దృష్టిలో పడేందుకే.. మమతా బెనర్జీని ప్రసన్నం చేసుకోవడానికే తృణమూల్ నేతలు ఆమె అవార్డు ఇచ్చారని బీజేపీ సీనియర్ బిజెపి నాయకుడు శిశిర్ బజోరియా ‘ఇండియా టుడే’తో చెప్పారు. రాజకీయ నాయకురాలైన మమతా బెనర్జీకి సాహిత్య అవార్డుతో కవులు, రచయితలు అసంతృప్తికి గురయ్యారని అన్నారు. ఇందులో భాగంగానే రషీద్ బెనర్జీ తన సాహిత్య పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారని తెలిపారు. తమ అధినాయకురాలి దృష్టిలో పడేందుకు తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోటీ నడుస్తోందని ఎద్దేవా చేశారు. (క్లిక్: కేజ్రీవాల్ కిడ్నాప్ చేసేందుకు యత్నించారు) బీజేపీ నీతులు చెప్పడమా? అవార్డ్ వాపసీ అంశాన్ని తగ్గించి చూపించేందుకు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు బీజేపీపై ఎదురుదాడికి దిగారు. సాహిత్యం, సంస్కృతి గురించి బీజేపీ నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన బీజేపీ తమకు నీతులు చెప్పే అర్హత లేదని వ్యాఖ్యానించారు. (క్లిక్: దేశానికి తదుపరి ప్రధాని అమిత్ షా..?) -
Sakshi Cartoon: మన దుకాణం కూడా మూసుకోవాల్సివస్తుంది!
తిక్కరేగి నిజంగానే కలిపేస్తే.. మన దుకాణం కూడా మూసుకోవాల్సివస్తుంది! -
తృణమూల్‌లో కాంగ్రెస్ విలీనం కావాల్సిందే: మమతా బెనర్జీ
-
బీజేపీ నుంచి ఔట్.. మమత పార్టీలోకి మరో సీనియర్ నేత
ఈ ఏడాది జనవరిలో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నాయకుడు జై ప్రకాశ్ మజుందార్ మంగళవారం తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు కోల్‌కతాలో జరిగిన సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీ కండువా కప్పుకున్నారు. కాగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని అభియోగాలు మోపుతూ ముంజుందార్తో పాటు మరో పార్టీ నాయకుడు రితేష్ తివారీని బీజేపీ సస్పెండ్ చేసింది. వీరిద్దరూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. West Bengal | Suspended BJP leader Jay Prakash Majumdar joins Trinamool Congress, in the presence of CM Mamata Banerjee, in Kolkata pic.twitter.com/mWZBOk36No — ANI (@ANI) March 8, 2022 అయితే పార్టీలో సస్పెండ్ అయిన, పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలతో ఎంపీ లాకెట్ ఛటర్జీ సమావేశమైన మరుసటి రోజే మజుందార్ టీఎంసీలో చేరడం విశేషం. 2014లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన. జై ప్రకాష్ మజుందార్ ఇటీవలి వరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ విఫలమైందని, పార్టీ కార్యకర్తలను విస్మరించిందని ముజుందార్ విమర్శలు గుప్పించారు. చదవండి: ఆ ఊరిలో మగవాళ్లకు ఇల్లే లేదు! ప్రతి ఇల్లు మహిళలదే ఇదిలా ఉండగా 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించినప్పటి నుంచి కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియోతో సహా బీజేపీ నాయకులు టీఎంసీలో చేరారు. ముకుల్, సబ్యసాచి దత్తా, రాజీవ్ బెనర్జీ వంటి అనేక మంది టీఎంసీ నుంచి వెళ్లిన వారు కూడా తిరిగి పార్టీలోకి వచ్చారు. -
అది సభా హక్కుల ఉల్లంఘనే
కోల్‌కతా: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీఐబీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన ఇద్దరు అధికారులపై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బుధవారం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హక్కుల తీర్మానం ప్రవేశపెట్టింది. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసేటప్పుడు ముందస్తుగా సమాచారం అందివ్వలేదని అది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆ తీర్మానం పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ మంత్రి తపస్ రాయ్ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నారద స్టింగ్ ఆపరేషన్ కేసుకి సంబంధించి ఈ ఏడాది మొదట్లో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిరాద్ హకీమ్, మదన్ మిత్రా, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని, వారిని అరెస్ట్ చేయడానికి ముందు స్పీకర్ బిమన్ బెనర్జీ అనుమతి తీసుకోలేదని, ఆయనకు ఏ విధమైన సమాచారాన్ని కూడా అందివ్వలేదని తపస్ రాయ్ చెప్పారు. ఈడీ కూడా వారి ముగ్గురిపై అభియోగాలు నమోదు చేసిందని వెల్లడించారు. సీబీఐ, ఈడీ సభా హక్కుల్ని ఉల్లంఘించారని, స్పీకర్‌కు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదన్నారు. సీబీఐ డిప్యూటీ ఎస్పీ సత్యేంద్ర సింగ్, ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రతిన్ బిశ్వాస్‌పై సభా హక్కుల ఉల్లంఘనను ప్రవేశపెడుతున్నట్టుగా వెల్లడించారు. ఈ అంశాన్ని స్పీకర్ బిమన్ బెనర్జీ హక్కుల కమిటీ పరిశీలనకు పంపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా దీనిపై విచారణ జరిపి నివేదిక అందించాలని విజ్ఞప్తి చేశారు. -
బీజేపీ అనే వైరస్‌కు వ్యాక్సిన్ మమతే.. అభిషేక్ బెనర్జీ తీవ్ర విమర్శలు
అగర్తలా: తృణమూల్ కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి రజీబ్ బెనర్జీ, త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే అశిష్‌దాస్ శనివారం త్రిపురలోని అగర్తలాలో జరిగిన ఒక కార్యక్రమంలో టీఎంసీ గూటికి చేరారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. 2011, 2016లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన రజీబ్ గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి దోమ్జూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తృణమూల్ అధికారంలోకి రావడంతో బీజేపీ నుంచి మళ్లీ మాతృసంస్థకి చేరుకున్నారు. గోవా నుంచి త్రిపుర వరకు పార్టీని విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అగర్తాలలో తృణమూల్ కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈసారి త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్, రైట్ అందరినీ మట్టికరిపిస్తామని అభిషేక్ధీమా వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ అనే వైరస్‌కి వ్యాక్సిన్ ఒక్కటే ఉంది. దాని పేరు మమతా బెనర్జీ. త్రిపుర ఓటర్లు ఆ వైరస్‌కి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలి. మొదటిది వచ్చే నెలలో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండో డోసు ఇవ్వాలి’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అగర్తలా ర్యాలీ నిర్వహించాలని గత కొద్ది రోజులుగా టీఎంసీ ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అడ్డు చెబుతూ వస్తోంది. కరోనా నిబంధనల వల్ల ర్యాలీలకు అనుమతించేది లేదని పోలీసులు తెగేసి చెప్పారు. దీంతో టీఎంసీ కోర్టుకెళ్లింది. చివరికి త్రిపుర హైకోర్టు ర్యాలీకి అనుమతించింది. -
TMC Dulal Roy: వైరస్ పూర్తిగా అంతమయ్యేలా శానిటైజర్‌తో శుద్ధి!
సురీ: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భమ్ జిల్లాలో గురువారం దాదాపు 150 మంది బీజేపీ కార్యకర్తలు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)లో చేరారు. వీరంతా గతంలో టీఎంసీలో ఉన్నవారే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో మళ్లీ సొంతింట్లో అడుగుపెట్టారు. అయితే, టీఎంసీ నేతలు వారిపై శానిటైజర్ చల్లిన తర్వాతే తమ పార్టీలో చేర్చుకోవడం సంచలనాత్మకంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఇలామ్‌బజార్ ప్రాంతంలో ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. బీజేపీ నుంచి వస్తున్న కార్యకర్తలపై టీఎంసీ స్థానిక నాయకులు శానిటైజర్ చల్లారు. తర్వాత టీఎంసీ జెండాలను వారి చేతుల్లో పెట్టారు. ఇన్నాళ్లూ వారు బీజేపీ కోసం పని చేశారని, వైరస్‌తో ప్రభావితమయ్యారని, తమ పార్టీలో చేర్చుకునేముందు వారిపై వైరస్ పూర్తిగా అంతమయ్యేలా శానిటైజర్‌తో శుద్ధి చేశామని టీఎంసీ నేత దులాల్‌రాయ్ చెప్పారు. అయితే, తమ పార్టీ కార్యకర్తలను బలవంతంగా టీఎంసీలో చేర్చుకున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధ్రువా సాహా ఆరోపించారు. చదవండి: పారదర్శకంగా రాష్ట్రాలకు టీకా పంపిణీ -
కలకత్తా హైకోర్టు జడ్జిపై తృణమూల్ ఆరోపణలు
-
ఈ ఫలితాలు కారుచీకట్లో కాంతిరేఖలు
ఆధునిక కాలంలో ఒక రాజకీయ అశ్వమేధ యజ్ఞం భగ్నమైంది. ఒక ఇంద్రజాల ప్రదర్శన మధ్యలోనే విచ్ఛిన్నమైపోయింది. అధికారం కోసం ఇంత తీవ్రాతితీవ్రమైన ప్రయత్నం ఈ మధ్యకాలంలో ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదు. బీజేపీ తన ఆధిపత్యాన్ని స్థిరపర్చుకోవాలంటే బెంగాల్ ఆ పార్టీ దాటవలసిన చివరి సరిహద్దుగా ఉండింది. అందుకే డబ్బు, మీడియా, సంస్థాగత యంత్రాంగం, చివరకు నరేంద్ర మోదీ.. ఇలా దేన్నీ, ఎవరినీ బీజేపీ వదిలిపెట్టకుండా రంగంలోకి దింపింది. కానీ బీజేపీని బెంగాల్లో ప్రజలు ఓడించారు. ఘోరావమానాల పాలు చేశారు. ఈసారి తీర్పు భిన్నమైంది. ప్రతిపక్షాలకు ఇది ఒక మార్గాన్ని చూపింది. ఏం చేయకూడదు అని గుర్తించినట్లయితేనే మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలం. ఎట్టకేలకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఈ చీకటి దినాల్లో తప్పనిసరిగా అవసరమైన ప్రారంభం ఇది. ఏం చేయకూడదు అని మనం గుర్తించినట్లయితేనే మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలం. సాధారణ ఎన్నికల రాజకీయాల గణాంకాలను దాటి చూస్తే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు నిజంగానే అద్భుతమని చెప్పాలి. సాధారణ సమయాల్లో ఒక జనరంజక ముఖ్యమంత్రి మూడోసారి కూడా అధికారంలోకి రావడం గొప్ప విశేషమేమీ కాదు. కానీ బీజేపీ ఓటు షేర్ పెరగడం గొప్ప ముందంజ గానే గుర్తించాల్సి ఉంటుంది. ముగ్గురు ఎమ్మెల్యేలను మాత్రమే కలిగివున్న ఒక రాజ కీయ పార్టీ నిజమైన ప్రతిపక్ష పార్టీగా అవతరించడంపై వేడుకలు జరుపుకోవడాన్ని పూర్తిగా సమర్థించవచ్చు. కాని ఇది సాధారణ ఎన్నికలు కావు. అధికారాన్ని కొల్లగట్టడానికి ఇంత తీవ్రాతితీవ్రమైన ప్రయత్నం ఈ మధ్యకాలంలో ఏ రాష్ట్రం లోనూ జరిగి ఉండదు. బీజేపీ తన ఆధిపత్యాన్ని స్థిరపర్చుకోవాలంటే బెంగాల్ ఆ పార్టీ దాటవలసిన చివరి సరిహద్దుగా ఉండింది. అందుకే సర్వతోముఖ దాడి ప్రారంభించడానికి బీజేపీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఎంచుకుంది. డబ్బు, మీడియా, సంస్థాగత యంత్రాంగం, చివరకు నరేంద్ర మోదీ.. ఇలా దేన్నీ, ఎవరినీ బీజేపీ వదిలిపెట్టకుండా రంగంలోకి దింపింది. ఎన్నికల కమిషన్‌కు ఉన్న పవిత్రత నుంచి, కేంద్ర భద్రతా బలగాల తటస్థత, కోవిడ్ నిబంధనల వరకు ప్రతి అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మల్చుకుంది. బీజేపీ నేతలు తమ విజయాలను ఏకరువు పెట్టడం బెంగాల్ ఎన్నికల్లో జరిగినట్లుగా ఎక్కడా జరగలేదు. అయినప్పటికీ బీజేపీని బెంగాల్లో ప్రజలు ఓడించారు. ఘోరావమానాల పాలు చేశారు. ఆధునిక కాలంలో ఒక రాజకీయ అశ్వమేధ యజ్ఞం భగ్నమైంది. ఒక ఇంద్రజాల ప్రదర్శన మధ్యలోనే విచ్ఛిన్నమైపోయింది. బెంగాల్‌ని బీజేపీ కనుక కైవసం చేసుకుని ఉంటే ఏం జరిగి ఉండేదో కాస్త ఊహించండి మరి. వేడుకలు, విజయధ్వానాలు మరోవైపు ప్రతిపక్షంలో భయాందోళనలు.. కాని మన గణతంత్ర ప్రజాస్వామ్యం ఒక్క రోజులోనే తన స్థానాన్ని, ఔన్నత్యాన్ని గొప్పగా ప్రకటించుకుంది. కేంద్రపాలకులకు ఇంత భంగపాటు కలగడంతో అనూహ్య అవకాశాలకు వీలుకల్పించినట్లయింది. మనం ఇప్పుడు కరోనా మహమ్మారి సుడిగుండంలో ఎంతగా చిక్కుకుపోయామంటే, మోదీ వీర భక్తాగ్రేసరులు కూడా ప్రస్తుత కేంద్ర పాలనపై అనుమానాస్పద దృష్టితో చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ప్రతిష్టంభన నుంచి ఇంకా మనం బయటపడలేదు. పైగా సెకండ్ వేవ్ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ మరింత ఘోరమైన పరిస్థితుల్లో కూరుకుపోవచ్చు. పైగా చారిత్రాత్మక రైతాంగ నిరసనకు మనం సాక్షీభూతులుగా ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి తీర్పు రావడం అనేది ప్రస్తుత కేంద్రపాలకులు అఖండులు, అజేయులు కాదనే సత్యాన్ని తిరుగులేనివిధంగా దేశంముందు నిలి పింది. ఇక కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు ప్రతిపక్షాల స్థానాన్ని మరింతగా బలోపేతం చేసింది. గత ఏడేళ్లుగా బానిసత్వంలో మగ్గుతున్న దేశానికి ఈ తీర్పు తిరిగి ఊపిరి పోసినట్లయింది. ఇది మోదీ పాలన అంతానికి నాందీ వాచకం కానుంది. కేంద్రపాలకుల పతనం మొదలు కావచ్చు. కానీ ఈ గొప్ప అవకాశానికి మనం ఎలా స్పందిస్తాం అన్నదాని పైనే ఇది ఆధారపడి ఉంటుంది. ముందుగా ఈ తీర్పు దేనికి వ్యతిరేకమో గుర్తించడం చాలా అవసరం. ఈ తీర్పు మతతత్వ రాజకీయాలకు తిరస్కృతి కాదు. పైగా బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనతో ఉంటున్న ముస్లిం ఓటర్ల సమీకరణను లౌకిక రాజకీయాలకు సంకేతంగా చెప్పలేం. అలాగే కరోనా మహమ్మారి, లాక్డౌన్ కాలంలో మోదీ ప్రభుత్వం చేసిన అనేక తప్పులకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాదిది. కేరళను మినహాయిస్తే స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో అతిపెద్ద ప్రజారోగ్య సంక్షోభం ఏ రాష్ట్రంలోనూ ఎన్నికల అంశంగా కాలేదు. పెద్దనోట్ల రద్దు ఉదంతంలో లాగే ప్రజలు తమ ఆర్థిక బాధల పర్యవసానాలకు కారణాలపై ఇంకా అనుసంధానం కాలేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాల అసమర్థతపై కూడా ప్రజలు పెద్దగా దృష్టి పెట్టలేదు. కేరళలో ఎల్డీఎఫ్ విజయం అనేది వామపక్ష భావజాలం పట్ల విస్తృత ప్రజానీకం ఆమోదం అని చెప్పడానికి వీల్లేదు. అలాగే బీజేపీకి వ్యతిరేక ప్రచారంలో రైతు సంఘాలు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ విధానాల పట్ల రైతుల వ్యతిరేకతను కూడా ఈ తీర్పు పెద్దగా ప్రతిబింబించలేదు. అయినా సరే.. ఈ అసాధారణ అవకాశాన్ని మనం వినయపూర్వకంగానే అంగీకరించాల్సి ఉంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చెందిన విజయగాధగా చెప్పడానికి వీల్లేని అనేకానేక రోజువారీ సంభవించే కారణాల ప్రతిఫలనంగానే బీజేపీ ప్రస్తుత తిరోగమనం సంభవించింది. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రులకున్న ప్రజాదరణ ఒక కీలకాంశంగా పనిచేసింది. కానీ ఇది సుపరిపాలనపై ప్రజాతీర్పు కాదు. అదే నిజమైతే తమిళనాడులో ఏఐడీఎంకే చిత్తుగా ఓడిపోవలసి ఉండాలి. అలాగే అస్సోంలో సోనోవాల్ ప్రభుత్వం కూడా మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. అలాగే మమతా బెనర్జీ పాలనా రికార్డుకూడా తగుమాత్రమే ప్రభావం చూపింది. పశ్చిమ బెంగాల్లో, అస్సోంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ విజయానికి నిర్దిష్టమైన ఎన్నికల నిర్వహణే కీలకపాత్ర పోషించింది. ఈ అవకాశం ఎవరికి సంబంధించనిది అనే అర్థ సత్యాన్ని మనం బహిరంగంగా అంగీకరించాల్సిన సమయం ఇది. మమతా బెనర్జీ లేక ప్రశాంత్ కిషోర్, పినరయి విజయన్ లేక సీపీఎం, హేమంతా బిశ్వాస్ శర్మ లేదా సోనోవాల్.. ఇలా ఈ ఎన్నికల్లో ఎవరు విజేతలు అనే అంశంపై చాలా మంది తామే కారణమని ప్రకటించుకోవచ్చు. కానీ ఈరోజు పరాజితులెవ్వరు అనే విషయంపై రెండు అభిప్రాయాలు లేవు. అదేమిటంటే భారత జాతీయ కాంగ్రెస్. రాహుల్ గాంధీ కేరళ నుంచి తొలిసారి ఎంపీ అయ్యాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కాంగ్రెస్ పోగొట్టుకోకూడదు. అలాగే ఏడాది క్రితం పౌరసత్వ సవరణ చట్టంపై భారీ స్థాయి నిరసనలు చెలరేగిన అస్సాంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్ రానివ్వకుండా ఉండాల్సింది. పుదుచ్చేరిలో అధికారం కోల్పోయింది. బెంగాల్లో ఊసులేకుండా పోయింది. ప్రజా తీర్పు సందేశం అత్యంత స్పష్టంగా ఉంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ ఇక నాయకత్వం వహించలేదు. మోదీ అజేయత్వానికి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పదే పదే తూట్లు పొడుస్తూ వస్తున్నాయి. కానీ రాష్ట్రాల స్థాయిల్లో వ్యక్తమవుతున్న ఈ అసంతృప్తి జాతీయ వ్యాప్త సెంటిమెంట్‌గా మారడంలో వైఫల్యం చోటు చేసుకుంటోంది. ఈసారి తీర్పు మాత్రం భిన్నమైంది. ప్రతిపక్షాలకు ఇది ఒక మార్గాన్ని చూపింది. 2022 మొదట్లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజాతీర్పు ఇలాగే సాగితే మోదీ పాలన ముగింపునకు అది ప్రారంభం కాగలదు. మోదీ పరాజయం పొందవచ్చు. కానీ అది కాంగ్రెస్ చేత కాదు. మోదీ పట్ల పచ్చి వ్యతిరేకత వల్ల కూడా కాకపోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ఒక సవాలు కూడా ఉంది. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ ఇండియా సంస్థాపకులు -
బెంగాల్: సింగూరులో దీదీ వర్సెస్ భట్టాచార్య..
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నాలుగో దశ ఎన్నిక ప్రచారం జోరందుకుంది. 10వ తేదీన పోలింగ్ జరుగనున్న 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా అందరి దృష్టి హాట్ సీట్ అయిన సింగూర్‌పై ఉంది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి అధికారాన్ని కట్టబెట్టడంలో నందిగ్రామ్‌తో పాటు సింగూర్ ఉద్యమం కీలకపాత్ర పోషించింది. దీంతో ఇప్పుడు సింగూర్‌లోనూ దీదీ తప్పనిసరిగా గెలవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. మమతా బెనర్జీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆమెకు తలనొప్పిగా మారాయి. ఒకవైపు నందిగ్రామ్‌లో సువేంధు అధికారి కమలదళంలో చేరి బరిలో నిలబడటంతో దీదీకి కష్టాలు పెరిగాయి. మరోవైపు సింగూర్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన టీఎంసీ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ భట్టాచార్య ఇప్పుడు మమతా బెనర్జీకి సవాలుగా మారారు. పంతం నెగ్గడమే ముఖ్యం భట్టాచార్య వయసురీత్యా ఈసారి అతనికి టికెట్ ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరించింది. దీంతో 88 ఏళ్ల రవీంద్రనాథ్ కాషాయ కండువా కప్పుకొని సింగూరు బరిలో దీదీకి సవాలు విసిరారు. సింగూర్ ఉద్యమ సమయంలో మమతకు అండగా నిలబడ్డారు. దీదీకి అనుకూలంగా రైతులు మొగ్గు చూపేలా చేయడంలో రవీంద్రనాథ్ కీలక పాత్ర పోషించారు. సింగూరు ప్రాంతంలో అతనికి ఉన్న ఇమేజ్ కారణంగా నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ సింగూర్ నుంచి బేచారాం మన్నాను బరిలో నిలబెట్టింది. చదవండి: మేమొస్తే బెంగాల్లో పారిశ్రామికీకరణ బేచారాం ప్రస్తుతం సింగూర్ దగ్గర్లోని హరిపాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనకు, రవీంద్రనాథ్‌కు మధ్య మొదటి నుంచి ఉన్న విబేధాల కారణంగా ఈసారి హరిపాల్ సీటు నుంచి బేచారాం భార్యను అభ్యర్థిగా దీదీ నిలబెట్టింది. హరిపాల్ సీటుకి పోలింగ్ ప్రక్రియ మూడోదశలో నేడు జరుగనుంది. అయితే ఒకే కుటుంబంలో భార్యభర్తలకు రెండు సీట్లు కేటాయించడంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఇటీవల సింగూర్‌లో జరిగిన ప్రచార సభలో ప్రసంగించిన మమతాబెనర్జీ, సింగూర్ అభ్యర్థిగా రవీంద్రనాథ్ కాకపోతే, నందిగ్రామ్‌కు బదులుగా సింగూర్ నుంచి తాను పోటీ చేసేవారని అన్నారు. భట్టాచార్య రూపంలో బీజేపీకి అవకాశం సింగూర్‌లో 2.30 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 12% మంది మైనారిటీ వర్గాలకు చెందినవారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం వామపక్ష– కాంగ్రెస్ కూటమి కారణంగా మైనారిటీ ఓట్లు చీలతాయి. అదే సమయంలో ప్రధానంగా ఉన్న హిందూ ఓటు టీఎంసీ, బీజేపీల మధ్య విభజించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పరిశ్రమను స్థాపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీపీఎం ప్రకటించింది. సింగూరు ఉద్యమం కారణంగా ప్రజలకు లబ్ధి జరుగకపోగా, టీఎంసీలోని అగ్రశ్రేణి నాయకులు కోటీశ్వరులయ్యారని వామపక్షాలు వాదిస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఈసారి తమకు మద్దతు ఇస్తారని పార్టీ చెబుతోంది. సింగూర్ అసెంబ్లీ సీటు హుగ్లీ జిల్లా పరిధిలోకి వస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో çహుగ్లీ లోక్‌సభ సీటు నుంచి 70 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ గెలుపొందారు. దీంతో ఇప్పుడు రవీంద్రనాథ్ భట్టాచార్య టీఎంసీని వదిలి బీజేపీలో చేరడంతో తప్పకుండా సింగూరులో కమలం వికసిస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికీ ఖాళీగా టాటా ప్లాంట్‌ను తొలగించిన స్థలం సీపీఎం ప్రభుత్వ హయాంలో టాటా గ్రూప్ సింగూర్‌లో నానో కార్ ప్లాంట్‌ను ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా అప్పట్లో మమత రైతుల సహకారంతో ఒక పెద్ద ఉద్యమాన్ని చేశారు. ఫలితంగా టాటా గ్రూప్ సింగూర్‌ను విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా ప్రభుత్వం ప్లాంట్‌కు ఇచ్చిన ప్రాంతాన్ని మైదానంగా మార్చింది. ఇప్పటికీ అక్కడ భూమి ఖాళీగానే ఉన్నప్పటికీ, కొన్నిచోట్ల సాగు చేస్తున్నారు. -
మమత కోసం రంగంలోకి శరద్ పవార్
ముంబై: శత్రువుకు శత్రువు మిత్రుడన్న నానుడిని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ మరోసారి రుజువు చేస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ మీద ఎప్పుడూ విమర్శలు ఎక్కుపెట్టే శరద్ పవార్ ఇప్పుడు ఏకంగా మమతా బెనర్జీకి సపోర్ట్ చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. వచ్చేవారం పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్న ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమవడంతో పాటు భారీ ర్యాలీకి సైతం ప్లాన్ చేస్తున్నారు. పవార్ బెంగాల్ టూర్ కోసం మూడు రోజుల పర్యాటన ఖరారైనట్లు ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపసే వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు స్పష్టం చేశారు. కాగా త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అస్సాంలోనే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇదివరకే జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఎలాగైనా మమతను గద్దె దింపి రాష్ట్రంలో పార్టీ జెండా ఎగరేయాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇందుకోసం కేంద్ర మంత్రులను, ఇతర రాష్ట్రాల సీఎంలతో ప్రచారం చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మిథున్ చక్రవర్తి, గౌతమ్ గంభీర్‌తో రోడ్‌షో కూడా చేయించనుంది. చదవండి: అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేయరు: శరద్ పవార్ వాళ్లే ‘పరాయి శక్తులు’! -
దీదీకి మరో షాక్.. ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో తృణమూల్ నేతలు వరుస పెట్టి కాషాయ కండువా కప్పుకుంటున్న విషయం విధితమే. తాజాగా సోమవారం ఐదుగురు తృణమూల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఎమ్మెల్యేలు సోనాలి గుహ, సీతల్ సర్దార్, దీపేందు బిశ్వాస్, రవీంద్రనాథ్ భట్టాచార్య, జతు లహిరిలు కమల దళంలో చేరి దీదీకి గట్టి షాకిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు హబీబ్పూర్ అభ్యర్థి సరళా ముర్ము కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. పోటీపడి మరీ టికెట్ తెచ్చుకున్న అభ్యర్ధులు కూడా పార్టీని వీడుతుండంతో దీదీకి పాలుపోవడం లేదు. పార్టీ ఫిరాయించిన నేతలంతా రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్, అగ్ర నేతలు సువేందు అధికారి, ముకుల్ రాయ్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు. ఎన్నికలకు ముందు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కాషాయ పార్టీలో చేరడంతో తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. గతవారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ల సమక్షంలో మాజీ కేంద్ర రైల్వే మంత్రి, టీఎంసీ నేత దినేష్ త్రివేది బీజేపీలో చేరగా, ఇటీవల కోబ్రా మిథున్ చక్రవర్తి కూడా కమలదళంలో చేరారు. కాగా, 291 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది విడతల్లో పోలింగ్ జరగనుంది. -
ఓట్లు కొనేందుకు బీజేపీ సిద్ధమైంది: మమతా బెనర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎల్పీజీ సిలిండర్ల ధరల పెరుగుదలను నిరసనగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం సిలిగురిలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్యాస్ బండ ప్లకార్డులు పట్టుకొని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు బీజేపీ సిద్ధమైందని మండిపడ్డారు. బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని ఓట్లు టీఎమ్‌సీకి వేయండని ఆమె చెప్పారు. మహిళలు బెంగాల్లో క్షేమంగా లేరని మోదీ అంటున్నారని, మరి బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మహిళలు సురక్షితంగా ఉన్నారా అని ప్రశ్నించారు. బెంగాల్లోనే మహిళలు అత్యంత సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈ పాదయాత్రలో పార్టీ ఎంపీలు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్‌లు పాల్గొన్నారు. మర్చి 27 నుంచి ప్రారంభమయ్యే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. చదవండి: బెంగాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైంది -
టీఎంసీలో చేరిన టీమిండియా ఆటగాడు
కోల్కత్తా : టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తన స్వరాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో బుధవారం హుబ్లీలో నిర్వహించిన ర్యాలీ పాల్గొని టీఎంసీ గూటికి చేరాడు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో మనోజ్ రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గతకొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేంద్రంలోని మోదీ సర్కార్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రో ధరలను పెంచుతోందంటూ విమర్శలు కురిపించాడు. అంతేకాకుండా సామన్యుడి నడ్డివిరిచేలా పెరుగుతున్న ధరల్లో పెట్రోల్, డీజిల్ భారీ భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. కాగా బెంగాల్లో రాజకీయ కాక తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోరు ఉత్కంఠగా మారింది. అధికార టీఎంసీ నేతల్ని టార్గెట్‌గా చేసుకున్న బీజేపీ.. విజయమే లక్ష్యంగా దూసుకుడుగా వ్యవరిస్తోంది. మరోవైపు బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేలా మమత పావులు కదుపుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తుల్ని తనవైపుకు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులకు టికెట్లు కేటాయించి పార్లెమెంట్‌కు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మనోజ్ తివారీని సైతం తన గూటికి చేర్చుకున్నారు. కాగా 35 ఏళ్ల మనోజ్ తివారీ టీమిండియా తరుఫున వన్డే, టీ-20లకు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో సొంత జట్టు కోల్కత్త తరఫున సుదీర్ఘంగా ఆడాడు. కొన్నాళ్ల పాటు పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రాష్ట్ర స్థాయిలో బెంగాల్ క్రికెట్‌కు సారథిగా వ్యవహరించాడు. 2008లో ఫిబ్రవరి 3న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అరంగేట్రం చేసిన తివారీ.. 12 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తరువాత ఫామ్ కోల్పోవడంతో జట్టుకి దూరమయ్యాడు. ఐపీఎల్లో రాణించినప్పటికీ జట్టులో మరోసారి చోటుదక్కలేదు. ఈ క్రమంలోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నకావడంతో రాజకీయ రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే టీఎంసీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తారా లేక అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. -
కీలక సర్వే: దీదీ హ్యాట్రికా.. కమల వికాసమా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకిత్తిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. మరో రెండు నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు గల బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్-వామపక్షాలతో కూడిన కూటమి పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గడిచిన రెండేళ్ల వరకు రాష్ట్రంలో ఏమాత్రం ఉనికి కూడా లేని బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సవాలు విసిరింది. ఎవరూ ఊహించిన విధంగా 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే రెండుసార్లు సీఎంగా విజయం సాధించిన ముచ్చటగా మూడోసారి ఆశపడుతున్న మమతకు చెక్ పెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. ఉత్కంఠ పోరులో విజయం ఎవరిది.. ఇప్పటికే టీఎంసీకి చెందిన అనేకమంది కీలక నేతలను తనవైపుకు తిప్పుకుని ఎన్నికలకు ముందే పైచేయి సాధించింది. జంగల్‌మహాల్, నందిగ్రాం వంటి కీలకమైన ప్రాంతాల్లో పట్టున్న సువేందు అధికారి బీజేపీలో చేరడం మమతకు భారీ ఎదురుదెబ్బ లాంటిదే. ఆయనతో పాటు కెబినేట్ మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీదీకి హ్యాండ్ ఇచ్చి కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారు. అయితే నేతలు పోతేనేం తమకు ప్రజా మద్దతు ఉందంటూ మమత ధీమా వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల కాలంలో ప్రవేశపెట్టినే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమను మరోసారి గెలిపిస్తామని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ సైతం విజయంపై సంచలన ప్రకటనలే చేస్తోంది. ఈ ఎన్నికల్లో టీఎంసీని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని, బెంగాల్ కోటపై కాషాయజెండా ఎగరేసి తీరుతామని కమళనాథులు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెంగాల్ ఎన్నికలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారాన్ని ముగించారు. దేశ వ్యాప్తంగా బెంగాల్ ఎన్నికలపై పెద్ద చర్చేసాగుతోంది. ఉత్కంఠంగా సాగుతున్న పోరులో ఎవరు విజయం సాధిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. మమత హ్యాట్రిక్.. ఈ క్రమంలోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ఓ సంస్థ నిర్వహించిన సర్వే ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. హోరాహోరీగా సాగిన పోరులో అధికార తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయం సాధిస్తుందని సీఎన్ఎక్స్, ఏబీపీ ఆనంద (ప్రైవేటు సంస్థలు) నిర్వహించిన పబ్లిక్ ఒపినియన్ సర్వేలు తెలిపాయి. టీఎంసీ 146 నుంచి 156 స్థానాల్లో విజయం సాధించి మమత మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని పేర్కొన్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ 113-121 సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పాయి. మేజిక్ ఫిగర్ 148 సీట్లు కాగా... కాంగ్రెస్-వామపక్షాల నేతృత్వంలోని కూటమికి 20-28 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేల్చాయి. అయితే మెజార్టీ సంఖ్యకు మమత కొంత దూరంలో నిలిచిపోతే లెఫ్ట్ కూటమి మద్దతుతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. కాగా బెంగాల్ వ్యాప్తంగా జనవరి 23 నుంచి ఫిబ్రవరి 7 వరకు 8,960 మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వేను వెల్లడించినట్లు సీఎన్ఎక్స్ నిర్వహకులు తెలిపారు. జయలలిత బాటలో మమత.. సీన్ రిపీటవుతుందా -
రాజ్యసభ ఎంపీ, వ్యాపారవేత్తకు ఈడీ షాక్
సాక్షి,ముంబై: వ్యాపారవేత్త, తృణమూల్ కాంగ్రెస్ మాజీనేత, రాజ్యసభ ఎంపీ కేడీ సింగ్ ఈడీ షాకిచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కన్వర్ దీప్ సింగ్‌ను బుధవారం అరెస్ట్ చేసింది. పీఎంఎల్ఏ చట్టం కింద ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది.1900 కోట్ల రూపాయల పోంజీ చిట్ ఫండ్ స్కీం స్కాం కేసు దర్యాప్తులో ఈ అరెస్టు చోటు చేసుకుంది. ఆల్కెమిస్ట్ ఇన్ఫ్రా రియాల్టీ లిమిటెడ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేడీ సింగ్‌పై 2016లో ఈడీ కేసు నమోదు చేసింది. చిట్ ఫండ్ స్కీమ్ ద్వారా అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఆయన ఇల్లు,ఆఫీసులపై గతంలో ఈడీ సోదాలు నిర్వహించింది. 2019 జనవరిలో ఆల్కెమిస్ట్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన రూ. 239 కోట్ల ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. చిట్‌ఫండ్ పేరుతో సుమారు 1916 కోట్ల నిధులను మూడేళ్లలో సేకరించిందనేది ప్రధాన ఆరోపణ. అయితే సుమారు రూ.1077 కోట్లు తిరిగి చెల్లించినట్లు 2015లో సంస్థ సెబీకి తెలిపింది. మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి మరికొంత సమయం కోరింది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించిన సెబీ 2016 మార్చిలో ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. అటు నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో కూడా కేడీ సింగ్‌ను సీబీఐ ప్రశ్నించింది. -
కాపురంలో పొలిటికల్ చిచ్చు; స్పందించిన సుజాత
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్లో భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన పొలిటికల్ డ్రామా ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం విడాకుల వరకు దారితీసింది. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మండల్ ఖాన్ సోమవారం తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తన భార్య సుజాతా ఖాన్ పార్టీ మారడంపై స్పందించిన భర్త సౌమిత్రా ఖాన్ ఆమె పార్టీ మారినందుకు తమ పదేళ్ల వివాహిక బంధాన్ని తెంపేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. త్వరలోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటానని, ఇక ముందు తన భార్య తన ఇంటి పేరును వాడుకోరాదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా మరో నాలుగు నెలల్లో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్ననేపథ్యంలో భార్యాభర్తల పొలిటికల్ డ్రామా చర్చనీయాంశంగా మారింది. తాజాగా భర్త నిర్ణయంపై సుజాత స్పందించి మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిన ఓ పార్టీయే (బీజేపీ) నాకు విడాకులివ్వాలని నా భర్తను కోరుతోంది అని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను పార్టీ మారినందుకే నా భర్త విడాకులు ఇస్తానని అంటున్నాడు. ఇందుకు ఆయనను బీజేపీ నేతలే రెచ్ఛగొడుతున్నారు. వారిలో ఒక్కరైనా ఆయనను ఎందుకు అడ్డుకోవడంలేదు. ఇది మంచిది కాదని ఆయనకు ఎందుకు నచ్ఛజెప్పడంలేదు. కానీ నేను ఆయన్ను ఇంకా ప్రేమిస్తున్నాను’. అని పేర్కొన్నారు. అయితే పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన రాజకీయ పార్టీలు మాత్రం ఈ విషయంపై నోరుమెదపకుండా జరుతున్న తతంగాన్ని చూస్తూ కూర్చున్నాయి. చదవండి: మాటల యుద్ధం.. ఆ దమ్ముందా: ప్రశాంత్ కాగా బెంగాల్‌లోని బిష్ణూపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన సౌమిత్రా ఖాన్ భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భర్తను గెలిపించుకునేందుకు ఎంతో కష్టపడినప్పటికీ బీజేపీలో తనకు తగిన గుర్తింపు రాకపోవడంతో తాను పార్టీ మారాల్సి వచ్చిందని సుజాతా మండల్ ఖాన్ ఆరోపించారు. ఎప్పటి నుంచో పార్టీకి విధేయంగా పని చేస్తున్న తమ లాంటి వారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన అవినీతి పరులకు గుర్తింపు ఇస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో తాను పార్టీ మారానని ఆమె వివరించారు. ఇప్పటికీ బీజేపీలో కొనసాగుతోన్న ఆమె భర్త గురించి ప్రశ్నించగా, అది ఆయన ఇష్టమని, ఏదోరోజున వాస్తవాలను గుర్తించి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినా చేరిపోవచ్చని ఆమె చెప్పారు. -
పార్టీ మారిన భార్యకు విడాకులన్న ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మండల్ ఖాన్ సోమవారం నాడు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. బెంగాళ్‌లోని బిష్ణూపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన సౌమిత్రా ఖాన్ భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. కోల్‌కతాలో టీఎంసీ నాయకులు సౌగతా రాయ్, పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సమక్షంలో సుజాతా ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. (యడియూరప్పకు పదవీ గండం తప్పదా?) 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భర్తను గెలిపించుకునేందుకు ఎంతో కష్టపడినప్పటికీ బీజేపీలో తనకు తగిన గుర్తింపు రాకపోవడంతో తాను పార్టీ మారాల్సి వచ్చిందని సుజాతా మండల్ ఖాన్ ఆరోపించారు. ఎప్పటి నుంచో పార్టీకి విధేయంగా పని చేస్తున్న తమ లాంటి వారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన అవినీతి పరులకు గుర్తింపు ఇస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో తాను పార్టీ మారానని ఆమె వివరించారు. ఇప్పటికీ బీజేపీలో కొనసాగుతోన్న ఆమె భర్త గురించి ప్రశ్నించగా, అది ఆయన ఇష్టమని, ఏదోరోజున వాస్తవాలను గుర్తించి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినా చేరిపోవచ్చని ఆమె చెప్పారు. ఇదే విషయమై సౌమిత్రా ఖాన్‌ను ప్రశ్నించగా, సుజాతా ఖాన్ పార్టీ మారినందున తమ పదేళ్ల వివాహిక బంధాన్ని తెంపేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, త్వరలోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటానని చెప్పారు. ఇక ముందు తన భార్య తన సర్ నేమ్‌ను వాడుకోరాదని ఆయన చెప్పారు. (బెంగాల్లో బీజేపీకి అంత సీన్ లేదు: పీకే) -
మమత మాత్రమే మిగులుతారు!
మిడ్నాపూర్: రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో ఎవరూ మిగలరని, కేవలం మమతా బెనర్జీ మాత్రమే పార్టీ్టలో ఉంటారని బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. శనివారం బెంగాల్లో ఆయన టీఎంసీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంసీ సీనియర్ నేత సువేందు అధికారి సహా పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. టీఎంసీ నినాదమైన ‘‘మా, మాటి, మనుష్(తల్లి, జన్మభూమి, ప్రజ) కాస్తా ‘‘దోపిడీ, అవినీతి, బంధుప్రీతి’’గా మారిపోయిందని అమిత్ షా దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 200 పైగా సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు మార్పు కోసం బీజేపీ వెనుక నడిస్తే మమతకు ఏమి సమస్యని ఆయన ప్రశ్నించారు. బంధుప్రీతి, బుజ్జగింపులే కారణం ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరడానికి టీఎంసీ అనుసరిస్తున్న బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలే కారణమని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ నుంచి పలువురు నేతలు సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీలో మోదీ నాయకత్వంలో పనిచేయడానికి చేరారని చెప్పారు. టీఎంసీలో చీలికలను బీజేపీ ప్రోత్సహిస్తోందన్న విమర్శలపై స్పందిస్తూ 1998లో టీఎంసీ ఏర్పడిందే కాంగ్రెస్ నుంచి చీలిపోయాయని గుర్తు చేశారు. టీఎంసీ నుంచి నేతలు వీడడం ఆరంభమేనని, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఎంసీని వీడుతున్నారన్నారు. ఇదే విధంగా వలసల జోరు కొనసాగితే ఎన్నికల నాటికి టీఎంసీలో మమత మాత్రమే మిగులుతారన్నారు. 9 మంది ఎంఎల్ఏలు, ఒక ఎంపీ అధికార టీఎంసీకి చెందిన కీలక నేత సువేందు అధికారి సహా వివిధ పార్టీలకు చెందిన 9 మంది ఎంఎల్ఏలు, ఒక టీఎంసీ ఎంపీ అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇటీవలే టీఎంసీకి సువేందు రాజీనామా చేశారు. బర్ధమాన్ పుర్బాకు చెందిన ఎంపీ సునీల్ మండల్, టీఎంసీ ఎంఎల్ఏలు బన్సారీ మైటీ, శిలభద్ర దత్తా, బిస్వజిత్ కుందు, సుక్రా ముండా, సైకత్ పంజా, సీపీఎం నుంచి టీఎంసీలో చేరిన ఎంఎల్ఏ దిలీప్ బిస్వాస్, సీపీఎంకే చెందిన మరో ఎంఎల్ఏ తపసి మండల్, సీపీఐ ఎంఎల్ఏ అశోక్దిండా, కాంగ్రెస్ ఎంఎల్ఏ సుదీప్ ముఖర్జీ బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ దశరధ్ టిర్కీ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు టీఎంసీ, లెఫ్ట్, పలువురు కాంగ్రెస్ జిల్లాస్థాయి నేతలు బీజేపీలో చేరారు. రైతు ఇంట భోజనం... పశ్చిమబెంగాల్లో పర్యటిస్తున్న హోంమత్రి అమిత్‌షా శనివారం ఒక రైతు ఇంట మధ్యాహ్న భోజనం చేశారు. బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని బలిజ్హరిలో నివాసముండే సనాతన్ సింగ్ నివాసానికి వెళ్లిన అమిత్‌షా అక్కడే నేలపై కూర్చొని భోజనం చేశారు. ఆయనతోపాటు బీజేపీ నేతలు కైలాస్ విజయ్వర్ఘీయ్, ముకుల్‌రాయ్, దిలీప్ ఘోష్ భోజనాలు చేశారు. అంతకుముందు స్థానిక ఆలయంలో అమిత్ పూజలు నిర్వహించారు. తన ఇంట్లో హోంమంత్రి విందారగించడంపై సనాతన్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. కేవలం పప్పు, రోటీలను మాత్రమే భోజనంలో ఇవ్వగలిగానన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు కదం తొక్కుతున్న వేళ రైతు ఇంట విందుకు అమిత్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చేఎన్నికల్లో రైతులను ఆకట్టుకునే వ్యూహంలో ఇది ఒక భాగమని భావిస్తున్నారు. ఎవరీ సువేందు? మమతా బెనర్జీ ప్రస్తుత ప్రభుత్వంలో సువేందు అధికారి రవాణా, నీటిపారుదల–జల వనరుల మంత్రిగా పనిచేశారు. నవంబర్ 27 న ఆయన మంత్రి పదవికి, డిసెంబర్ 16న ఎమ్మెల్యే పదవికిడిసెంబర్ 17న టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ తరువాత సువేందు అధికారికి జనాదరణ ఎక్కువగా ఉందంటారు. 2007నందిగ్రామ్ ఉద్యమంలో అధికారి కీలక పాత్ర పోషించారు. అనంతరం ‘జంగల్ మహల్’గా పేరుతెచ్చుకున్న పశ్చిమ మిడ్నాపూర్, పురూలియా, బంకురా జిల్లాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. రెండు మార్లు లోక్‌సభ ఎంపీగా కూడా ఆయన ఎన్నికయ్యారు. వెస్ట్ మిడ్నాపూర్, బంకురా, పురులియా, ఝూర్గ్రామ్, బీర్భూమిలోని కొన్ని ప్రాంతాలతో కలిపి మొత్తం 60 నుంచి 65 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారి కుటుంబ ప్రభావం ఉంటుందని విశ్లేషకుల అంచనా. అతనే కారణమా? ఇటీవల తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగానే సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్నారని బయటకు వినిపిస్తున్నా, అసలు కారణం వేరే ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలోని ఇతర సీనియర్ నాయకులకన్నా ప్రాధాన్యం పెరగడం, అభిషేక్‌ను తన వారసునిగా మమత సిద్ధం చేయడమే సువేందు అధికారి సహా అనేకమంది సీనియర్ల అసంతృప్తికి అసలు కారణమంటున్నారు. -
రాజ్యసభ: విపక్ష ఎంపీల సస్పెన్షన్
-
రాజ్యసభలో గందరగోళం
-
పెద్దల సభలో పెను దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లు తీవ్ర దుమారానికి దారితీస్తోంది. బిల్లులపై ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో గందరగోళం నెలకొంది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లులు ఆదివారం రాజ్యసభకు రావడంతో ఉదయం నుంచీ వాడీవేడి చర్చ జరుగుతోంది. రైతు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి. బిల్లు ఓటింగ్‌ను అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. (రాజ్యసభ ముందుకు వ్యవసాయ బిల్లులు) దీనిలో భాగంగానే డిప్యూటీ చైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ బిల్లు మాసాయిదా ప్రతులు చింపి.. పోడియంపై విసిరారు. టీఎంసీ, ఆమ్ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకులు విరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోళానికి దారితీసింది. దీంతో సభలో ఓటింగ్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విపక్షాల ఆందోళన నడుమ సభ వాయిదా పడింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు వ్యయసాయ బిల్లులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. -
కరోనాతో తృణమూల్ ఎమ్మెల్యే మృతి
కోల్ కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్(60) కరోనా వైరస్ తో పోరాడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. గత నెలలో ఆయనకు నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత నుంచి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.(కరోనా ఉగ్రరూపం: ఒక్క రోజే 465 మరణాలు) తమోనాశ్ మృతి పట్ల టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘35 ఏళ్ల పాటు ప్రజలు, పార్టీ కోసం తమోనాశ్ పని చేశారు. ఆయన లేని లోటు పూడ్చుకోలేం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అంటూ మమతా ట్వీట్ చేశారు.(కోవిడ్ మరణాలు: భారత్‌లో 1, యూకేలో 63.13!) పార్టీ తరఫున ఫాల్తా నియోజకవర్గం నుంచి తమోనాశ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998 నుంచి టీఎంసీ ట్రెజరర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
బీజేపీ నేతపై దాడి.. కాళ్లతో తన్నుతూ..
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి జై ప్రకాశ్ మజుందార్‌పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన జియాఘాట్ ఇస్లాంపూర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌ను సందర్శించేందుకు వెళ్లిన జైప్రకాశ్ మజుందార్‌పై తృణమూల్‌కార్యకర్తలు విరుచుపడ్డారు. పోలింగ్ బయట కాళ్లతో తన్నుతూ.. చెట్ల పొదలు ఉన్న మురికి కాలువలో తోసేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కార్యకర్తలను చెదరగొట్టారు. కాగా, తనపై దాడికి యత్నించిన తృణమూల్ కార్యకర్తలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ప్రకాశ్ మజుందార్ డిమాండ్ చేశారు. తృణమూల్ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనడానికి ఈ దాడియే నిదర్శనమన్నారు. తృణమూల్ నేతలు వీధి రౌడిల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా తృణమూల్ నేతలు మాత్రం ఈ దాడిని తమ కార్యకర్తలు చేయలేదని చెప్పుకొచ్చారు. స్థానికులే బీజేపీపై ఆగ్రహంతో జైప్రకాశ్ ముజుందార్‌పై దాడి చేశారని పేర్కొన్నారు. పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని ఖరగ్‌పూర్ సదర్, నదియాలోని కరీంపూర్, ఉత్తర్ దినాజ్‌పూర్‌లోని కలియాగంజ్ నియోజక వర్గాలకు నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కలియాగంజ్ నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పపర్మతానాథ్ రాయ్ మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కరీంపూర్‌నుంచి ఎన్నికైన టిఎంసి ఎమ్మెల్యే మహువా మొయిత్రా, ఖరగ్‌పూర్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే దిలీప్ ఘోష్ లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. -
నిమిషానికి 170 ఫోన్ కాల్స్ వస్తున్నాయి..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ ప్రజాదరణ మూటగట్టుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించిన ‘దీదీ కే బోలో’కార్యక్రమానికి భారీ స్పందన వస్తోందని తృణమూల్ పార్టీ వర్గాలు తెలిపాయి. ‘సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి రెండు రోజుల్లోనే 2 లక్షలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. నిమిషానికి 170 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మరో లక్ష మంది వారి అభిప్రాయాలను హెల్ప్‌లైన్ నెంబర్, వెబ్‌సైట్‌ల్లో పంచుకున్నారు. ఇంకా ఫోన్ కాల్స్‌ని లెక్కిస్తూనే ఉన్నాం. భారీ స్పందన లభిస్తోంది’అని వెల్లడించాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చవిచూసిన మమతా బెనర్జీ తిరిగి ప్రజాదరణ సమకూర్చుకునే దిశగా ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుని, పరిష్కరించడానికి వెయ్యి మందికి పైగా పార్టీ నేతలు రానున్న 100 రోజుల్లో 10వేల గ్రామాల్లో పర్యటించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆలోచనగా ప్రారంభించిన ఈ భారీ ప్రజాదరణ కార్యక్రమం కోసం మమతా.. 9137091370 హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. -
తృణమూల్ కార్యకర్త దారుణ హత్య..!
కోల్‌కత : తృణమూల్ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హుగ్లీ జిల్లా నకుందాలో నివాసముండే లాల్‌చంద్ బాగ్ (40) మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా మాటువేసిన దుండగులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన లాల్‌చంద్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. లాల్‌చంద్ తండ్రి ఫిర్యాదు మేరకు 27 మందిపై కేసు నమోదు చేశామని, ఆరుగురిని అరెస్టు చేశామని ఎస్పీ తథాగత బసు తెలిపారు. మిగతా వారికోసం గాలింపు ముమ్మరం చేశామని వెల్లడించారు. కాగా, ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యనని బీజేపీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలిలో పాల్గొన్నందుకే తమ కార్యకర్తను అతి దారుణంగా కొట్టి చంపారని టీఎంసీ జిల్లా నాయకుడు దిలీప్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వాటిని రాజకీయాలతో పోల్చొద్దు: జహాన్
కోల్‌కతా: పార్లమెంట్లో తృణముల్ కాంగ్రెస్ ఎంపీగా నుస్రత్ జహాన్ సింధూరం, మంగళసూత్రంతోనే ప్రమాణం చేయడం ముస్లిం మత వర్గానికి ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమబెంగాల్లో ఇస్కాన్ సంస్థ నిర్వహించిన వార్షిక రథయాత్రకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి నుస్రత్ జహాన్ అదే వస్త్రధారణతో హాజరవడం చర్చనీయాంశమైంది. ఇదే విషయమై నుస్రత్ మీడియాతో మాట్లాడుతూ.. 'నేను పుట్టుకతోనే ముస్లింనని, నాకు నా మతమేంటో తెలుసని, ఇలాంటి చిన్న చిన్న విషయాలను నేను పట్టించుకోనని' ఘాటుగానే స్పందించారు. తాను ఒక ఎంపీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యానని, మతాన్ని రాజకీయంతో పోల్చడం తగదని ఆమె పేర్కొన్నారు. మరోవైపు నుస్రత్ జహాన్ చేసిన వాఖ్యలపై ఇస్కాన్ ప్రతినిధి రాధా రామ్‌దాస్ ట్విటర్లో స్పందించారు. 'రథయాత్ర వేడుకకు వచ్చినందుకు ముందుగా అభినందనలు. మీరు చేసిన వాఖ్యలు మాకు ఆనందాన్ని కలిగించాయి. మీ మతాన్ని గౌరవిస్తూనే ఇతర వేడుకలకు హాజరవడం మత సామరస్యాన్ని పెంపొందించింది. దీన్ని మీరు ఇలాగే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం' అని ట్వీట్ చేశారు. ఇంతకుముందు సీఎన్ఎన్-న్యూస్ 18 చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నుస్రత్ జహాన్ తన పెళ్లి విషయమై మాట్లాడుతూ... ‘నేను ఒక హిందువును పెళ్లాడిన సంగతి మీకు తెలిసిందే. నా నుదుటి మీద బొట్టును చూసి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయానికి అణుగుణంగానే నడుచుకుంటున్నా. ప్రతి వ్యక్తికి సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. నేను ముస్లిం మతాన్ని, మావారు హిందూ మతాలను గౌరవిస్తాం. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికుంటాయ’ని ఆమె పేర్కొన్నారు. -
బెంగాల్లో రాష్ట్రపతి పాలన తప్పదా!
సాక్షి, న్యూఢిల్లీ : చినికి చినికి గాలి వానలా మారినట్లు పశ్చిమ బెంగాల్లో పార్టీ జెండాలు, బ్యానర్ల విషయంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ప్రారంభమైన తగువు తుపాకులు పట్టుకొని పరస్పరం కాల్చుకునే పరిస్థితికి దారితీసింది. ఇరువర్గాల మధ్య గత పక్షం రోజులుగా కొనసాగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 13 మంది మరణించారు. వారిలో ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలుకాగా, ఐదుగురు తణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నుంచి 24 పరగణాల జిల్లా ఉత్తరాదిలోనే ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటికి ఇంతటితో తెరదించకపోతే మరింత తీవ్ర పరిణామాలు ఉంటాయని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జాతి విద్వేషాలు రగులుకునే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. బంగ్లాదేశ్‌కు సరిహద్దులో ఉన్న ఈ జిల్లాలో 2017, 2010లో హిందూ, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగాయి. బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి వచ్చిన వలసదారులు స్థానిక బెంగాలీలను స్థానభ్రంశం చేశారని తణమూల్ మంత్రి ఒకరు ఆరోపించడం అంటే జాతి విద్వేషాలకు అవకాశం ఇవ్వడమే. 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీని కమ్యూనిష్టులు సవాల్ చేసినప్పుడు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో, 2000 సంవత్సరంలో కమ్యూనిస్టులను, మమతా బెనర్జీ సవాల్ చేసినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో, ఇప్పుడు మమతా పార్టీని బీజేపీ సవాల్ చేస్తున్నప్పుడు కూడా రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఏర్పడిందని సామాజిక శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీగా అల్లర్లను అరికట్టాల్సిన బాధ్యత తణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది. మమత అధికార యంత్రాంగం కూడా పార్టీ లాగా వ్యవహరిస్తుండడంతో పరిస్థితి తీవ్రమైంది. ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలను అరికట్టడం చేతకాక బెంగాల్ పోలీసులు చేతులు కట్టుకు కూర్చున్నారని అనడంకన్నా వాటిని ఆపడం ఇష్టంలేక మిన్నకుంటున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లను గెలుచుకున్న ప్రతిపక్ష పార్టీగా బీజేపీ కూడా అల్లర్లను అరికట్టేందుకు బాధ్యత తీసుకోవాలి. లేకపోతే పరిస్థితి తీవ్రమవడం, కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించడం తప్పదు. -
బెంగాల్ హింసపై కేంద్రం ఆందోళన
సందేశ్‌ఖలీ/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణల అనంతరం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బెంగాల్లో శాంతిభద్రతలను పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హింసను అరికట్టడంలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించింది. ఆందోళనలు, అల్లర్లను నియంత్రించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో టీఎంసీ, బీజేపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బీజేపీ, టీఎంసీ నేతలు మాటలయుద్ధానికి దిగారు. టీఎంసీ శ్రేణుల దాడుల్లో బీజేపీ కార్యకర్తలు సుకాంత మొండల్, ప్రదీప్ మొండల్, శంకర్ మొండల్ చనిపోయారని బీజేపీ ప్రధాన కార్యదర్శి సయతన్ బసూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఘర్షణల్లో కయూమ్ మొల్లాహ్ అనే టీఎంసీ కార్యకర్త చనిపోయినట్లు టీఎంసీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బీజేపీ కార్యకర్తల మృతదేహాలతో కోల్‌కతాలోని పార్టీ కార్యాలయానికి కమలనాథులు ఊరేగింపుగా తీసుకురాగా, పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ తన ప్రసంగాల ద్వారా రాజకీయ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని బీజేపీ నేత ముకుల్‌రాయ్ ఆరోపించారు. తమ కార్యకర్తల చావుకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో 11 మంది మహిళలు సహా 62 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి జవాబు ఇచ్చింది. సంఘవిద్రోహక శక్తుల కారణంగా చెలరేగిన అల్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని స్పష్టం చేసింది. -
టీఎంసీ నేత దారుణ హత్య
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన సీసీ కెమెరాకు చిక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన తృణమూల్ నేత నిర్మల్ కుందూ మంగళవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో స్థానికంగా ఉన్న ఓ టీ కొట్టు దగ్గరకు వచ్చారు. టీ తాగుతూ స్థానికులతో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కాల్చి చంపారు. బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి అందరూ చూస్తుండగానే కుందూను కాల్చి చంపాడు. కాల్చిన వెంటనే బైక్‌పై వచ్చిన ఇద్దరు జనం మధ్య నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలైన కుందూను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. కాగా బీజేపీ నేతలే కుందూను హత్య చేశారని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం కుందూ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుంచి బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య హింసాత్మక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరు పార్టీలు తరచూ దాడులకు పాల్పడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో 42 స్ధానాలకు గాను బీజేపీ తొలిసారిగా 18 స్ధానాల్లో గెలుపొంది పాలక తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికల్లో 34 స్థానాల్లో గెలుపొందిన టీఎంసీ.. ఈ ఎన్నికల్లో 22 స్థానాలను మాత్రమే సాధించింది. -
పశ్చిమబెంగాల్లో మళ్లీ అల్లర్లు
-
బీజేపీలో చేరిన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు
-
బెంగాల్లో దీదీకి షాక్
న్యూఢిల్లీ/కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోకముందే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. బెంగాల్లో కమలం వికసించడంతో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జారుకుంటున్నారు. మంగళవారం తృణమూల్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక సీపీఎం ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. వీరితోపాటు 50 మందికిపైగా కౌన్సిలర్లు బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. వీరిలో ఎక్కువ మంది టీఎంసీ పార్టీ వాళ్లే. బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ కొడుకు టీఎంసీ ఎమ్మెల్యే సుభ్రాన్షు రాయ్‌తోపాటు ఎమ్మెల్యేలు తుషార్‌కాంతి భట్టాచార్య (టీఎంసీ), దేవేంద్రనాథ్ రాయ్ (సీపీఎం) బీజేపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై సుభ్రాన్షుని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు టీఎంసీ బహిష్కరించింది. ఎమ్మెల్యేలు ఇంకా వస్తారు.. ‘రాబోయే రోజుల్లో మరింత మంది ఎమ్మెల్యేలు టీఎంసీ నుంచి బీజేపీలో చేరతారు. అలాగని బెంగాల్లో దీదీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మేం అనుకోవడం లేదు. 2021 వరకు కొనసాగిస్తాం. అయితే ఆమె చేసిన తప్పుల కారణంగా ప్రభుత్వం పడిపోతే మేమేం చేయలేం’అని ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు కైలాశ్ విజయ్వార్గియా, ముకుల్ రాయ్ అన్నారు. 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ హుగ్లీ బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం అయ్యాయి. 2014 ఎన్నికల్లో 42 లోక్‌సభ స్థానాలకు గాను 34 స్థానాలను గెలుచుకున్న టీఎంసీ.. 2019లో కేవలం 22 సీట్లకే పరిమితమైంది. గతంలో 2 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ ఎన్నికల్లో 18 సీట్లు గెలిచింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి కేబినెట్లో మార్పులు చేసిన మమత సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ తన కేబినెట్లో పలుమార్పులు చేశారు. రవాణా శాఖమంత్రి సువేందు అధికారికి నీటిపారుదల, జలవనరుల మంత్రిత్వ శాఖను అప్పగించారు. సైన్స్–టెక్నాలజీ, బయోటెక్నాలజీ మంత్రి బ్రాత్య బసుకు అటవీశాఖను అదనపు బాధ్యతలు ఇచ్చారు. అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్బోస్ను అటవీశాఖ సహాయమంత్రిగా చేశారు. సోమెన్ మహాపాత్రకు పర్యావరణం, ప్రజారోగ్యం,ఇంజనీరింగ్ బాధ్యతలు ఇచ్చారు. మలే ఘాతక్కు కార్మిక, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా రజిబ్ బెనర్జీ, చంద్రిమా భట్టాచార్యకు పంచాయతీరాజ్ సహాయమంత్రిగా నియమించారు. -
‘కాషాయం’లో కలిసిపోయిన ‘ఎరుపు’
సాక్షి, న్యూఢిల్లీ : సమీర్ మహతో బిద్రీ గ్రామంలో ఆఖరి కమ్యూనిస్టు. ‘ఒకప్పుడు మేము ఇక్కడ చాలా బలంగా ఉండేవాళ్లం. మొదట్లో మా మీద మావోయిస్టులు దాడులు జరిపారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వారు. తృణమూల్, పోలీసుల నుంచి మాకు రక్షణ కావాలంటే బీజేపీలో చేరడమే ఉత్తమమని ఇక్కడ అందరు భావించారు. అందుకనే మా గ్రామంలోని కమ్యూనిస్టు కార్యకర్తలందరు బీజేపీలో చేరిపోయారు. చివరకు నేను కూడా చేరిపోక తప్పడం లేదు’ అని దీర్ఘ నిశ్వాసంతో సమీర్ మహతో తెలిపారు. బెంగాల్‌లోని సాల్ అడవుల్లో ఝార్గ్రామ్ పార్లమెంట్ నియోజకవర్గంలో జార్ఖండ్‌కు సరిహద్దులో బిద్రీ గ్రామం ఉంది. సమీర్ మహతో ఎంతోకాలంగా సైద్ధాంతికంగా సీపీఎంకు కట్టుబడి ఉన్నారు. అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఓ హిందూత్వ పార్టీలో చేరడం అంటే అనూహ్య పరిణామం. కొరుకుడు పడని విషయం. ‘బెంగాల్ రాష్ట్రానికి కమ్యూనిస్టులు ఒక్కరే మార్గదర్శకులు, నిర్దేషకులు అనుకున్నాం. చివరి వరకు నేను కమ్యూనిస్టు పార్టీలోనే ఉండిపోతానని అనుకున్నాను. ఓ జనరేటర్‌ను దొంగిలించానని పోలీసులు నాపై తప్పుడు కేసు పెట్టారు. బీజేపీ కార్యకర్తలే నాకు అండగా నిలిచారు’ అని సమీర్ వివరించారు. 34 ఏళ్ల సీపీఎం సుదీర్ఘ పాలనకు 2011లో తెరపడినప్పటికీ ఐదేళ్ల పాటు దాని ప్రభావం ఎక్కువే ఉండేది. ఇటీవలి కాలంలో మాత్రం ఆ పార్టీ ప్రభావం అతివేగంగా పడిపోతూ వచ్చింది. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు వచ్చిన పోలింగ్ శాతం 29.58 శాతం కాగా, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల ఓట్ల శాతం 41 శాతం. అంటే, ఆ ఎన్నికల్లో 184 సీట్లను సాధించి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ కన్నా రెండు శాతం ఓట్లు ఎక్కువ. 2016 ఎన్నికల నాటికి రాష్ట్రంలో వామపక్షాల ప్రభావం అనూహ్యంగా పడిపోయింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 44.9 శాతానికి పెరగ్గా, వామపక్షాల పోలింగ్ శాతం 24కు పడిపోయింది. అయినప్పటికీ ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు కమ్యూనిస్టు ఉండేవారు. ఆ తర్వాత కమ్యూనిస్టు కార్యకర్తలపై మార్క్స్ ప్రభావం తగ్గుతూ మోదీ ప్రభావం పెరగుతూ వచ్చింది. 2017లో కాంటాయ్ సౌత్‌లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థియే గెలిచినప్పటికీ వామపక్షాలు, బీజేపీ పోలింగ్ శాతాలు తిరగబడ్డాయి. బీజేపీ పోలింగ్ శాతం 9 నుంచి 31 శాతానికి పెరగ్గా, వామపక్షాల శాతం 34 నుంచి 10 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీకి కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వడం అన్నది 2018 పంచాయతీ ఎన్నికల నుంచి ప్రారంభమైంది. ఆ ఎన్నికల్లో అన్ని పార్టీల వారిని పాలకపక్ష తృణమూల్ కాంగ్రెస్ టెర్రరైజ్ చేయడంతో పలు పంచాయతీ సీట్లలో కమ్యూనిస్టులు, బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలిపారు. ఫలితంగా సీపీఎం తన సొంత ఉనికిని కోల్పోవాల్సి వచ్చింది. దాంతో బలం పుంజుకున్న బీజేపీ, తృణమూల్‌కు ప్రధాన ప్రతిపక్షంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇతర పార్టీల అభ్యర్థులను పాలకపక్ష తణమూల్ టెర్రరైజ్ చేయడం వల్ల ఆ ఎన్నికల్లో 34 శాతం తృణమూల్ సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనే విషయం తెల్సిందే. సీపీఎం కార్యకర్తలు భద్రత కోసం తమ పార్టీని వీడి బీజేపీలోకి పోతున్నారని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, ఆ పార్టీ వద్ద డబ్బులు ఎక్కువగా ఉండడం, పైగా బీజేపీ కార్యకర్తపై చిన్న దాడి జరిగినా మీడియాలో పెద్దగా ప్రచారం వస్తుండంతో ఇది జరుగుతోంది. ఝార్గ్రామ్ జిల్లా పార్టీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సర్కార్ తెలిపారు. సైద్ధాంతిక కట్టుబాటు గురించి ప్రస్తావించగా, క్షేత్రస్థాయిలో అది పనిచేయదని, ఎలాగైనా తృణమూల్‌ను ఓడించడమే లక్ష్యంగా తమ పార్టీవారు ఆలోచిస్తున్నారని తెలిపారు. మాల్దా ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం ఆదివాసీలకు కేటాయించడంతో ఆ సీటును 1962 నుంచి సీపీఎం గెలుచుకుంటూ వస్తోంది. అక్కడ గత మూడుసార్లు వరుసగా విజయం సాధిస్తూ వచ్చిన ప్రముఖ సీపీఎం నాయకుడు ఖాగెన్ ముర్మూ గత మార్చి నెలలో బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వామపక్షమనేది ఏదీ లేదని, బీజేపీ ఒక్కటే మిగిలిందనీ మాజీ సీపీఎం కార్యకర్త సురేంద్ర నాథ్ బర్మన్ తెలిపారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కమ్యూనిస్టుల పాలనలో అధ్వాన్నంగా గ్రామీణ ప్రాంతాల రోడ్లు తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మెరుగుపడ్డాయి. కొత్త రోడ్లు వేశారు. కేంద్ర ఆవాస్ యోజన పథకాన్ని సవ్యంగా అమలు చేస్తోన్న రాష్ట్రాల్లో బెంగాల్ రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కమ్యూనిస్టులు తణమూల్ను వ్యతిరేకిస్తూ బీజేపీలో చేరిపోవడం విడ్డూరంగా, అసంబద్ధంగా కనిపిస్తోంది. -
అమిత్ షా ర్యాలీపై రాళ్లదాడి
కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేళ మరోసారి హింస చెలరేగింది. రాజధాని కోల్‌కతాలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య తీవ్ర మంగళవారం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో పాల్గొనగా, ఘర్షణలు జరగడంతో ర్యాలీని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఈ గొడవల్లో ఆయనకు ఏమీ కాలేదు. అమిత్ షా ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఈ గొడవ ప్రారంభమైందని అధికారులు చెప్పారు. కోపోద్రిక్తులైన బీజేపీ మద్దతుదారులు టీఎంసీ కార్యకర్తలతో గొడవకు దిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఎప్‌ప్లనేడ్ అనే ప్రాంతంనుంచి స్వామి వివేకానంద పూర్వీకుల ఇంటి వరకు, దాదాపు 4 కిలోమీటర్ల వరకు అమిత్ షా ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా, ఆయన వాహనం విద్యాసాగర్ కళాశాల వద్దకు చేరుకోగానే అక్కడి హాస్టల్ లోపలి నుంచి బీజేపీ వాళ్లపైకి టీఎంసీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. అనంతరం ప్రతిదాడికి దిగిన బీజేపీ కార్యకర్తలు కళాశాల లోపలికి వెళ్లి కార్యాలయాలను ధ్వంసం చేశారు. అక్కడి మోటార్ సైకిళ్లకు నిప్పు పెట్టారు. ప్రముఖ తత్వవేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూడా బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటన తర్వాత కోల్‌కతాలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ హింస చెలరేగింది. ఘటనపై అమిత్ షా మాట్లాడుతూ ‘నాపై దాడి చేసేందుకు టీఎంసీ గూండాలు ప్రయత్నించారు. హింసను రగిలించేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నించారు. కానీ నేను సురక్షితంగా ఉన్నాను. టీఎంసీ కార్యకర్తలు దాడి చేస్తుంటే పోలీసులు మౌనంగా చూస్తూ ఉన్నారు. మా ర్యాలీ మార్గాన్ని కూడా వారు తప్పుదారి పట్టించారు’ అని ఆరోపించారు. అమిత్ షా దేవుడా.. పెద్ద గూండా అమిత్ షా ఆరోపణలకు మమత స్పందిస్తూ ‘ఆయనే పెద్ద గూండా. విద్యా సాగర్ మీద మీరు చెయ్యి వేశారు. ఇక మిమ్మల్ని గూండా అని కాకుండా ఇంకేమని పిలవాలి? మీ ద్ధాంతాలు, విధానాలంటే నాకు అసహ్యం’ అని అన్నారు. ఘర్షణల అనంతరం విద్యాసాగర్ కళాశాలను మమత పరిశీలించారు. అక్కడ ఆమె మాట్లాడుతూ ‘అమిత్ షా తన గురించి తాను ఏమనుకుంటున్నారు? ఆయనకు వ్యతిరేకంగా ఎవ్వరూ పోటీ చేయకుండా ఉండటానికి ఆయనేమైనా దేవుడా అని ఆమె ప్రశ్నించారు. కోల్‌కతాలో రోడ్ షో కోసం అమిత్ షా కొందరు వ్యక్తులను బయటి రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారనీ, ఈ హింసకు వారే కారణమని టీఎంసీ నేతలు ఆరోపించారు. బెంగాల్ విద్యా శాఖ మంత్రి, టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ విద్యాసాగర్ కూడా కళాశాలను దాడి అనంతరం పరిశీలించారు. విద్యాసాగర్ విగ్రహాన్ని బీజేపీ నేతలు ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండిస్తూ, బీజేపీకి బెంగాల్ సంస్కృతి అంటే గౌరవం లేదన్నారు. విచారణ ప్రారంభమైందనీ, విగ్రహాన్ని పాడుచేసిన వారిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. -
‘వారి గుండెల్లో బులెట్లు దింపాలి’
కోల్కత్తా: ఆరోవిడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగాల్లో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఈ ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మే 19న జరిగే చివరి దశ పోలింగ్ ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే బీజేపీ సారథి అమిత్ షా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారంలో మునిగితేలుతున్నారు. మెజార్టీ సీట్లే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రచారంలో భాగంగా అమిత్ షా సోమవారం బెంగాల్లో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బసిర్హట్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సాయంతన్ బసు ఓ సమావేశంలో మాట్లాడుతూ.. చివరి దశ ఎన్నికల్లో తృణమూల్ కార్యకర్తలు ఆందోళలకు ప్రయత్నిస్తే భద్రతా సిబ్బంది వారికి తూటాలతో బదులివ్వాలని వ్యాఖ్యానించారు. దాడులకు పాల్పడుతున్న టీఎంసీ కార్యకర్తల గుండెల్లో బులెట్లు దింపి వారిని అణచివేయాలని పేర్కొన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త కూడా వారి దాడులను తిప్పకొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర బలగాలతో తాను మాట్లాడుతానని, వారు సక్రమంగా విధులు నిర్వర్తించపోతే బీజేపీ కార్యకర్తలే వారి పనిపట్టాలని అన్నారు. ప్రముఖ బెంగాలీ నటి, నస్రత్ జహాన్‌ను ఇక్కడి నుంచి టీఎంసీ బరిలో నిలిపింది. బీజేపీ నేత భారతిపై దాడి.. పశ్చిమబెంగాల్లోని 8 లోక్ సభ సీట్లకు పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఘటాల్ నియోజకవర్గంలోని కేశ్పూర్ ప్రాంతంలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారిణి భారతీ ఘోష్‌పై టీఎంసీకి చెందిన మహిళా కార్యకర్తలు దాడిచేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన భారతి రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో దొగాచియా పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ టీఎంసీ మద్దతుదారులు ఆమె కాన్వాయ్‌పై రాళ్లతో పాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలో భారతి భద్రతా సిబ్బంది ఒకరు గాయపడగా, కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా మనస్తాపానికి లోనైన ఆమె కన్నీరు పెట్టుకున్నారు. -
జై శ్రీరామ్ వర్సెస్ దుర్గా మాతా!
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య దివ్య పోరాటం కొనసాగుతోంది. బీజేపీ నాయకులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తుంటే అందుకు బదులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దుర్గా మాతా ఆశీస్సులు తనకే ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. జై శ్రీరామ్ అన్నందుకు కావాలంటే తనను అరెస్ట్ చేసుకోమంటూ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో సవాల్ విసిరిన విషయం తెల్సిందే. శనివారం నాడు మమతా బెనర్జీ కారు వెళుతుంటే కొంత మంది బీజేపీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారని, కారు ఆపిన మమతా వారిని విసుక్కున్నారని, అలా నినాదాలు చేసిన ముగ్గురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ సవాల్ చేశారు. జై శ్రీరామ్ అంటూ భారత్‌లో నినదించకుండా పాకిస్థాన్‌కు వెళ్లి నినాదాలు చేయమంటావా? అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా మమతను ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో బలపడేందుకుగాను శ్రీరామ నవమి నాడు ‘జై శ్రీరామ్’ అంటూ పెద్ద ఎత్తున బీజేపీ ర్యాలీలు నిర్వహించడం ప్రారంభించిన విషయం తెల్సిందే. అలా మొదలైన నినాదాల సంస్కతి ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి పాకింది. ఒక్క రామాలయం కట్టడం చేతగానీ తమకు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసే అర్హత ఎక్కడిదని, ఎందుకు శ్రీ రాముడిని ఎన్నికల ఏజెంట్‌ను చేస్తున్నారంటూ మమతా బెనర్జీ ఎదురు తిరిగారు. ‘అసలు దుర్గా మాతా గురించి మీకేం తెలుసు, ఆమెకు ఎన్ని చేతులు ఉంటాయో, ఆ చేతుల్లో ఎన్ని ఆయుధాలు ఉంటాయో తెలుసా!?’ అంటూ బీజేపీ నేతలనుద్దేశించి ఆమె ప్రశ్నిస్తున్నారు. ఆమె ఎన్నికల సభల్లో బెంగాలీలకు అత్యంత ఆరాధ్య దైవమైన దుర్గా మాతాగా మమతను చూపే పోస్టర్లను కార్యకర్తలు ప్రదర్శిస్తున్నారు. బెంగాల్లో 42 లోక్‌సభ సీట్లకు జరుగుతున్న ఎన్నికలు ఇరు పార్టీలకు ఎంత కీలకంగా మారాయన్న విషయాన్ని రెండు పార్టీల ప్రచార శైలి సూచిస్తోంది. హిందీ రాష్ట్రాల్లో నష్టపోతున్న సీట్లను బెంగాల్లో పూడ్చుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. 42 సీట్లకుగాను 23 సీట్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
మాజీ ఏపీఎస్ భారతీ ఘోష్ సంచనల వ్యాఖ్యలు
-
‘కుక్కల్ని కొట్టినట్టు కొట్టిస్తా’
కోల్‌కతా : ఐదో విడత సార్వత్రిక ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్‌లోని ఘాతల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ ఏపీఎస్ భారతీ ఘోష్ సంచనల వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలను ఇళ్లలోంచి లాక్కొచ్చి కుక్కలను కొట్టినట్లు కొట్టిస్తా అని హెచ్చరించారు. ఆనందపూర్ ప్రాంతంలో తృణమూల్ కార్యకర్తల దాడిలో గాయపడినట్టు చెబుతున్న కొంతమంది బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన భారతి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఓటు వెయ్యెదంటూ మా కార్యకర్తలను బెదిరిస్తారా? బెదిరించనివ్వండి. నేను కూడా ఉత్తర ప్రదేశ్ నుంచి 1000 మందిని తీసుకొచ్చి మిమ్మల్నీ(తృణమూల్ కార్యకర్తలు) కుక్కల్ని కొట్టించినట్లు కొట్టిస్తా. మా కార్యకర్తలకు ఏది ఇస్తే అంతకు రెట్టింపు వడ్డీతో కలిపి చెల్లిస్తా. అప్పుడు తృణమూల్ పార్టీ కార్యకర్తలు అంతా ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లాల్సి వస్తుంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
ది గ్రేట్ ఖలీ ప్రచారంలో ఎలా పాల్గొంటాడు?
కోల్‌కతా : బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రెజ్లర్ ది గ్రేట్ ఖలీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. జాదవ్‌పూర్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి అనుపమ్ హజ్రాకు మద్దతుగా ఖలీ ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అమెరికా పౌరసత్వం కలిగిన ఖలీ ఎన్నికల్లో ఎలా పాల్గొంటారంటూ తృణమూల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదివారం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. విదేశీ పౌరసత్వం ఉన్నవాళ్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని పేర్కొంది. ఓ విదేశీయుడు భారత ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని... ఖలీ సెలెబ్రిటీ హోదాను బీజేపీ వాడుకుంటూ.... భారతీయ ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అయితే కన్నయ్య కుమార్‌కు మద్దతుగా బంగ్లాదేశీ నటుడు పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తృణమూల్ ఫిర్యాదుపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖలీ పంజాబ్ పోలీసు శాఖలో పని చేసిన విషయాన్ని గుర్తు చేసింది. కాగా 2019 ఎన్నికల్లో అధికారం కోసం తృణమూల్, బీజేపీలో హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. అందులో ఇప్పటికే మూడు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో నెలకొన్న హింసపై ఇరు పార్టీలు పరస్పరం వేలెత్తి చూపుకుంటున్నాయి. -
మమతా బెనర్జీ బెంగాలీతో పాటు చైనీస్, సంతాలీలో ప్రచారం
సంగీతానికి భాషా భేదాలుండవని అంటారు. తమ ప్రచారానికీ భాషా భేదాలు లేవని నిరూపిస్తున్నారు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ. బెంగాలీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు భాషలతో పాటు చైనీస్, సంతాలీ వంటి భాషల్లోనూ తృణమూల్ పార్టీ తమ అభ్యర్థులకు ఓటేయాలంటూ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ భాష వారు ఎక్కువుంటే ఆ భాషలోనే అక్కడ గోడలపై ఎన్నికల నినాదాలు, అభ్యర్థనలు రాయిస్తోంది. ప్రచారం కూడా ఆయా భాషల్లోనే సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో పట్టు సాధించేందుకు బీజేపీ కృషి చేస్తున్న నేపథ్యంలో వారికి అడ్డుకట్ట వేసేందుకు మమతా బెనర్జీ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఈ బహుభాషా ప్రచారం ప్రారంభించారు. ఖరగ్‌పూర్ ఓటర్లలో 50 శాతానికిపైగా తెలుగు వారున్నారు. ఇక్కడ బీజేపీకి పట్టుంది. తృణమూల్ తరఫున ఇక్కడ మానస్ బునియా పోటీ చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం తృణమూల్ ఇక్కడ తెలుగులోనే ప్రచారం చేస్తోంది. ఈ ప్రాంత వాసులైన ప్రశాంత్‌రావు, తారకేశ్వరరావు తెలుగు ప్రచారానికి సహకరిస్తున్నారు. తాంగ్రా, సెంట్రల్ కోల్‌కతాలోని తిరేతా బజార్ ప్రాంతాల్లో చైనీయులు వేల సంఖ్యలో ఉన్నారు. వారిలో సగం మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. దక్షిణ కోల్‌కతా నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో తృణమూల్ అభ్యర్థి మాలారాయ్ తరఫున చైనా భాషలో ప్రచారం జరుగుతోంది. చైనా లిపిలో చిన్న చుక్క, గీతల్లో తేడాలొచ్చినా అర్థాలు తారుమారవుతాయి. ఆ పొరపాటు జరగకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటున్నా’నని తాంగ్రాలో ఉంటున్న హో కింగ్ తైమ్ అనే చైనీయుడు చెబుతున్నారు. వెస్ట్ మిడ్నపూర్‌లో గిరిజన ఓటర్లు ఎక్కువ. వీరిలో 52 శాతం సంతాలీలే. దాంతో ఇక్కడ సంతాలీ భాషలో ప్రచారం సాగుతోంది. ఇలా ఏ ప్రాంతంలో ఏ భాషీయులు ఉంటే అక్కడ ఆ భాషలో ప్రచారం చేస్తూ తృణమూల్ ఎన్నికల ప్రచారానికి కొత్త హంగులు దిద్దుతోంది. -
మోదీ అబద్ధాలకోరు
అలిపుర్దార్ (బెంగాల్): మోదీ అబద్ధాలకోరు. ఐదేళ్లుగా దేశప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆయన నిలబెట్టుకోలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. శనివారం అలిపుర్దార్ జిల్లా బరోబిషాలో ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడారు. సొంత భార్యకు న్యాయం చేయలేని వ్యక్తి, దేశానికి ఎలా న్యాయం చేయగలరని మోదీని ఉద్దేశించి అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కీలకమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు బీజేపీ ప్రభుత్వ మరో కుట్ర అని, తృణమూల్ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో వారి ఆటలు సాగునివ్వబోదని ఆమె అన్నారు. అధికారుల బదిలీలపై ఈసీకి లేఖ: కోల్‌కతా, బిద్దన్నగర్ పోలీసు కమిషనర్లతో సహా నలుగురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై శనివారం ఈసీకి ఆమె లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వ ప్రేరణతోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నామని అన్నారు. వారిని బదిలీ చేసేందుకు కారణాలు తెలపాలని, బదిలీ నిర్ణయాన్ని ఈసీ పునఃసమీక్షిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. బెంగాల్లో శాంతి భద్రతల సమస్య ఉందని ఇటీవల మోదీ ఆరోపణల నేపథ్యంలోనే∙ఈసీ బదిలీల నిర్ణయం తీసుకుందని మమతా బెనర్జీ ఆరోపించారు. -
మేమొస్తే నోట్లరద్దుపై దర్యాప్తు
కోల్‌కతా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే బీజేపీ హయాంలో చేపట్టిన నోట్లరద్దుపై విచారణ చేయిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. మోదీ ప్రభుత్వం రద్దు చేసిన ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఇక్కడ ఆమె పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఉపాధి హామీ పథకం అమలును ఏడాదిలో 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచుతామనీ, అలాగే కూలీని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. వస్తుసేవల పన్ను(జీఎస్టీ) విధానం ప్రజలకు వాస్తవంగా ఉపయోగపడుతుందా లేదా అనే దానిపై నిపుణులతో సమీక్ష చేపడతామన్నారు. పెద్ద నోట్లరద్దుతోపాటు, జీఎస్టీ అమలు ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయని ఆరోపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ఉద్యోగావకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు కేటాయించిన ఉద్యోగాలను భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు. అడ్వాణీజీతో మాట్లాడా ‘ఈరోజు బీజేపీ కురువృద్ధ నేత ఎల్కే అడ్వాణీజీతో మాట్లాడా. ఆయన ఆరోగ్యం గురించి వాకబుచేశా. నేను ఫోన్ చేయడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వ్యవస్థాపక సభ్యులు, పార్టీకి మూలస్తంభాల్లాంటి వారైన అడ్వాణీ, మనోహర్ జోషిలను బీజేపీ అలా ఎందుకు వ్యవహరిస్తోంది. ఇప్పుడు వారిని ఎందుకు వదిలివేసింది? గురువులకు గురుదక్షిణ ఇలా కూడా చెల్లిస్తారా అని ఆశ్చర్యం వేస్తోంది. అయినా, ఆ పార్టీ అంతరంగిక విషయాలపై నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు’ అని మోదీనుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
బెంగాల్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం ?
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో 13 లోక్‌సభ సీట్లకు సీపీఎం పార్టీ మంగళవారం నాడు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీంతో ఆ పార్టీ ఇప్పటి వరకు రాష్ట్రంలోని 42 సీట్లకుగాను 38 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని అర్థం అవుతుంది. సీపీఎం మార్చి 15వ తేదీన 25 లోక్‌సభ సీట్లకు అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పుడే చూచాయిగా ఈ విశయం అర్థం అయింది. ఆ జాబితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చేర్చడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోపం వచ్చింది. తమ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయాలో నిర్ణయించడానికి సీపీఎం వారె ఎవరంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అనుమతి తీసుకోకుండా బీర్భూమ్ అభ్యర్థిగా తమ మెడికల్ సెల్ చైర్మన్ పేరును ఎలా ఖరారు చేస్తారని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ సోమెన్ మిత్రా ఆ రోజే మీడియా ముందు ప్రశ్నించారు. ఇక సీపీఎం నాయకులతో చర్చలు జరపాల్సిన అవసరం తమకు ఎందుకుంటుందని కూడా అన్నారు. ఆ తర్వాత రెండు రోజులకు పొత్తు చర్చలకు స్వస్తి చెప్పామని స్పష్టం చేశారు. ఇంకా తాము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా వదిలేశామని మంగళవారం జాబితా విడుదలప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంటే నాలుగు స్థానాలు ఆ పార్టీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం కాబోలు. ఈ మరుసటి రోజే తాము పొత్తు కోసం సీపీఎంతో ఎలాంటి చర్చలు జరపడం లేదని కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటించింది. సీపీఎంతో పొత్తు పెట్టోకోవాల్సిందిగా కేంద్ర నాయకత్వం ఒత్తిడి తెస్తున్నప్పటికీ రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఇష్టం లేదని తెలుస్తోంది. 2011 ఎన్నికల వరకు 34 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన సీపీఎం పార్టీకి 2016 ఎన్నికల్లో కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయింది. తణమూల్, బీజేపీ పార్టీలకన్నా వెనకబడింది. ఈ పరిస్థితి ఎవరికి లాభం ? పొత్తు కుదుర్చుకోక పోవడం వల్ల ఎక్కువ నష్టపోయేది కాంగ్రెస్, సీపీఎం పార్టీలే. తద్వారా బీజేపీ ఎక్కువ లాభపడే అవకాశం ఉంది. కేవలం హిందూత్వ నినాదంతోనే ఓట్లను సమీకరిస్తున్న బీజేపీ ఇప్పుడు పాలకపక్ష తణమూల్ కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను చీలకుండా దక్కించుకునే అవకాశం ఏర్పడింది. ఎప్పుడు కూడా బెంగాల్ ఎన్నికలను స్థానిక అంశాలే ప్రభావితం చేస్తాయి. స్థానిక ఎంపీ మీద కోపం ఉన్నా, పాలకపక్ష పార్టీపై కోపం వచ్చినా అక్కడి ప్రజలు వెంటనే ప్రత్యర్థుల వైపు తిరుగుతారు. మరోపక్క తణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా బాగుపడే అవకాశం ఉంది. చీలకుండా ముస్లిం ఓట్లన్నీ ఆ పార్టీకే పడే అవకాశం ఉంటుంది. ఉత్తర బెంగాల్ రాష్ట్రంలో ముస్లింలు ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో తణమూల్ కాంగ్రెస్ పెద్దగా రాణించలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క రాష్ట్రంలోనే కాకుండా పొత్తుల కోసం పలు రాష్ట్రాల్లో కుస్తీ పడుతున్న ఫలితం ఉండడం లేదు. -
‘రణ’మూల్
పశ్చిమబెంగాల్ యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మమతా బెనర్జీ.. కాంగ్రెస్‌తో 26 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని స్థాపించిన పార్టీయే ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ/టీఎంసీ). బెంగాల్లో ప్రస్తుత పాలకపక్షంగా ఉన్న ఈ పార్టీ 1998 జనవరి 1న ఆవిర్భవించింది. దీదీ, అంతకు ముందు బెంగాల్ ‘అగ్నికన్య’గా పేరు సంపాదించిన మమత పోరాట పటిమ, 34 ఏళ్ల సీపీఎం పాలనకు ముగింపు పలకాలనే పట్టుదలతో స్థాపించిన 13 ఏళ్లకే (2011) తృణమూల్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లుగా తిరుగులేని మెజారిటీతో రాష్ట్రాన్ని పాలిస్తోంది. సీపీఎం మొదటి ముఖ్యమంత్రి జ్యోతిబసు హయాంలో కాంగ్రెస్ నేతగా మార్క్సిస్ట్ సర్కారుపై ఎడతెగని పోరాటం చేశారు. 2000 నవంబర్‌లో జ్యోతిబసు వారసునిగా వచ్చిన సీనియర్ సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య హయాంలో తృణమూల్ కాంగ్రెస్ పదిన్నరేళ్ల కాలం హింసాత్మక ఉద్యమాలతో సంచలనం సృష్టించింది. చివరికి 2011 మే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకుంది. మమత ‘నిరసన నృత్యం’ 1970ల చివర్లో జనతా పార్టీకి స్ఫూర్తిప్రదాత జయప్రకాశ్ నారాయణ్ కారు బానెట్‌పై యూత్ కాంగ్రెస్ నేతగా ఎదుగుతున్న మమత డాన్స్ చేసి మొదటిసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. మధ్య తరగతి బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. సీపీఎం సమరశీల కార్యకర్తల ధాటికి కాంగ్రెస్ కార్యకర్తలు భయపడి పారిపోయే రోజుల్లో ఆమె వారికి ఎదురొడ్డి నిలిచి దెబ్బలు తిన్నారు. జ్యోతిబసు హయాంలో 1991లో వామపక్ష కార్యకర్తల దాడిలో మమత తల పగిలి కుట్లుపడ్డాయి. తృణమూల్ పార్టీ ఆవిర్భావం 1996–98 మధ్య కేంద్రంలో పాలన సాగించిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలకు లోక్‌సభలో బయటి నుంచి కాంగ్రెస్, సీపీఎం మద్దతు ఇచ్చాయి. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో చేసిన ఈ ప్రయోగం కారణంగా బెంగాల్లో సీపీఎంతో కాంగ్రెస్ రాజీపడుతోందని మమత గ్రహించారు. ఈ క్రమంలోనే 1998 జనవరి 1న పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పేరుతో ప్రాంతీయ పార్టీ స్థాపించారు. కొన్ని నెలలకే జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే టీఎంసీకి 7 సీట్లు రాగా, మిత్రపక్షం బీజేపీకి ఒక స్థానం దక్కింది. 1999 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తుపెట్టుకుని పశ్చిమ బెంగాల్లో 8 సీట్లు తృణమూల్ కైవసం చేసుకుంది. వాజ్‌పేయి నాయకత్వంలో ఏర్పడిన మూడో ఎన్డీఏ ప్రభుత్వంలో మమతా బెనర్జీ రైల్వేమంత్రి అయ్యారు. 2001 వేసవిలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడానికి వీలుగా వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి మమత సహా తృణమూల్ మంత్రులు రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 294 సీట్లకు 226 స్థానాలకు పోటీచేసి 60 స్థానాలు టీఎంసీ కైవసం చేసుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించింది. మళ్లీ 2003 సెప్టెంబర్‌లో తృణమూల్ (మమతా) వాజ్‌పేయి ప్రభుత్వంలో చేరింది. 2004 ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తృణమూల్ పొత్తుపెట్టుకుంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా బీజేపీతో పాటే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. టీఎంసీకి ఒకే ఒక సీటు దక్కింది. 2006 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరాజయం తప్పలేదు. తృణమూల్ బలం 60 నుంచి 30కి పడిపోయింది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ 235 సీట్లు సాధించింది. మమత, తృణమూల్ పని ఇక అయిపోయిందనుకున్న ఈ దశలో బుద్ధదేవ్ సర్కారుపై బ్రహ్మాండమైన పోరు సాగించడానికి తృణమూల్‌కు గొప్ప అవకాశం వచ్చింది. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలో సింగూరులో సారవంతమైన వేయి ఎకరాల భూమిని సీపీఎం సర్కారు టాటా మోటార్స్ నానో కారు ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించింది. భూసేకరణను రైతులు వ్యతిరేకించారు. రైతులకు మద్దతుగా మమత కోల్‌కతాలో 25 రోజులు నిరాహార దీక్ష చేశారు. తర్వాత మరో విదేశీ సంస్థకు నందిగ్రామ్‌లో కెమికల్ కాంప్లెక్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం వేలాది ఎకరాల భూమి కేటాయించడమేగాక 70 వేల మంది ప్రజలను ఖాళీ చేయించడానికి ప్రయత్నించింది. ఈ ఉద్యమంతోనూ తృణమూల్ లబ్ధిపొందింది. సింగూర్, నందిగ్రామ్‌తోపాటు భాంగోర్, సాల్బొనీ లాల్‌గఢ్, నయాచార్లో సీపీఎం కార్యకర్తలు, పోలీసుల హింస, అత్యాచారాల ఫలితంగా బుద్ధదేవ్ ప్రభుత్వం, కమ్యూనిస్టులు జనాదరణ కోల్పోయారు. పరిస్థితులు తృణమూల్‌కు అనుకూలంగా మారాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని టీఎంసీ 19 సీట్లు గెలుచుకుంది. అధికార పీఠంపై మమత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని పోటీచేసిన తృణమూల్ సొంతంగానే మెజారిటీ సీట్లు సాధించింది. తృణమూల్ కూటమికి 227 సీట్ల భారీ మెజారిటీ లభించింది. ఒక్క తృణమూల్‌కే 184 స్థానాలు దక్కడంతో మంత్రివర్గంలో ఇతర పార్టీలకు స్థానం కల్పించలేదు. ముఖ్యమంత్రి కావాలనుకున్న మమత లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. ఐదేళ్ల పాలనలో అనేక ప్రజాహిత కార్యక్రమాలతో తృణమూల్ పలుకుబడి విపరీతంగా పెరిగింది. సీపీఎం సహా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఎంసీలో చేరారు. టీఎంసీని రాజకీయంగా ఎదుర్కొనలేక సీపీఎం, ఇతర వామపక్షాలు చతికిలపడ్డాయి. ముస్లింలు కూడా పాలకపక్షానికి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో 34 కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్రమోదీతో ఓ పక్క, కమ్యూనిస్టులతో మరోపక్క పోరాడుతూనే టీఎంసీ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 293 సీట్లకు పోటీచేసి 211 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ లేదా ఎన్డీఏకు 200 లేదా అంతకన్నా తక్కువ సీట్లు వస్తే ప్రధాని అయ్యే అవకాశం వస్తుందనే అంచనాతో మమతా బెనర్జీ ముందుకు సాగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ సీట్లు 1998 - 7 1999 - 8 2004 - 1 2009 - 19 2014 - 34 -
దీదీ అడ్డాపై.. మోదీ గురి!
పశ్చిమ బెంగాల్: జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూస్తున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధాని మోదీకి మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని లోక్‌సభ ఎన్నికలు పతాక స్థాయికి చేర్చాయి. దీదీ గడ్డపై తమ ప్రతాపం చూపాలని మోదీ, షా ద్వయం నిర్ణయించుకుంది. ఆ వైపుగా బీజేపీ తన అడుగుల్ని ముమ్మరం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ (80), మహారాష్ట్ర (48) తర్వాత దేశంలో అత్యధిక ఎంపీ సీట్లు కలిగిన పశ్చిమ బెంగాల్ (42)లో సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని కమలనాథులు వ్యూహాలు పన్నుతున్నారు. లెఫ్ట్ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో ఏర్పడిన రాజకీయ అస్థిరతను భర్తీ చేయాలని బీజేపీ యోచిస్తోంది. విడతల వారీగా ఎన్నికలు జరిగే బెంగాల్లో 20 చోట్ల గెలుపే లక్ష్యంగా కాషాయ పార్టీ బరిలోకి దిగుతోంది. దీని కోసం పాక్‌పై జరిపిన వాయుసేన దాడులు, కులం, స్థానిక గుర్తింపు, జాతీయత, శరణార్థుల సమస్యలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా ప్రయోగించనుంది. ఈ దిశగా ఇప్పటికే బీజేపీ అధిష్టానం అక్కడి శ్రేణుల్ని సమాయత్తం చేసింది. 20 సీట్లే లక్ష్యం.. బెంగాల్లో 20 సీట్లను దక్కించుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడుగా ఉన్న 6 సీట్లు, గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉన్న మరో ఆరు స్థానాల్లో కులాన్ని ఆయుధంగా వాడుకోవాలని కాషాయ పార్టీ ఆలోచిస్తోంది. మిగిలిన 8 నుంచి 9 స్థానాల్లో స్థానికత, శరణార్థుల సమస్యలు, విభజన హక్కుల ప్రస్తావనతో ఆధిక్యం సాధించాలని చూస్తోంది. బలహీనపడ్డ లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన చిన్న చిన్న నియోజకవర్గాలపైనా ఫోకస్ పెట్టనుంది బీజేపీ. మాథువాల మనసు గెలిచేదెవరో.. బెంగాల్లో నిర్ణయాత్మకంగా భావించే మాథువా కులస్థులు అక్కడి కృష్ణానగర్, రానాఘాట్, బారక్పూర్, బరాసత్, బనగాం, కూచ్బెహర్తో పాటు రాష్ట్రంలోని చాలా చోట్ల అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ కుల ఓటర్ల సంఖ్య దాదాపుగా 1.5 కోట్లు. మాథువాల ఆధ్యాత్మిక గురువు బొరోమా బినాపనీ దేవిని దగ్గర తీసుకోవడం ద్వారా 2011 ఎన్నికల్లో మాయావతి లాభపడ్డారు. బినాపనీ దేవి మృతితో మాథువాల ఓట్లపై అన్ని పార్టీలూ కన్నేశాయి. ప్రధాని మోదీ కూడా తన ప్రచారాన్ని మాథువాలు ఎక్కువగా ఉండే బనగాం నుంచే ప్రారంభించనున్నారు. మాథువాల మద్దతు ఉన్న వారికి రాష్రంలో అధిక సీట్లు లభించే అవకాశాలుండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. రిపీటవుతున్న.. యూపీ ఫార్ములా! ఉత్తరప్రదేశ్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో వాడిన హిందూత్వ ఫార్ములానే బెంగాల్లోనూ సంధించాలని కాషాయ పార్టీ కసరత్తులు చేస్తోంది. ముస్లిం ఓట్లు ఎలాగూ తృణమూల్ ఖాతాలో చేరతాయి కాబట్టి హిందూ ఓటర్లను ఆరర్షించే పనిలో కమలనాథులు బిజీగా ఉన్నారు. గిరిజనలు అధికంగా ఉండే పురులియా, బంకురా, ఝర్గ్రాం లాంటి ప్రాంతాల్లో హిందూ మోడల్‌ను వాడుకోవాలని ఆర్ఎస్ఎస్ వర్గాలు పథకాలు వేస్తున్నాయి. ‘కీ’లకం కానున్న శరణార్థులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులను (మాథువాలు) ఎందుకు భారతీయులుగా గుర్తించరు’ అని బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మమతా బెనర్జీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇది. శరణార్థుల పౌరసత్వ హక్కుల గురించి 2016లో అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని మోదీలు ప్రస్తావించారు. ఈసారి శరణార్థుల హక్కులు, గుర్తింపు అంశాలకు ప్రచార సమయంలో ఎక్కువ స్థాయిలో ప్రస్తావించాలని కమలనాథులు ఆలోచిస్తున్నారు. లెఫ్ట్ స్థానాలపై కన్ను.. దాదాపు 33 సంవత్సరాలు బెంగాల్లో అధికారంలో ఉన్న సీపీఐ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. లెఫ్ట్ ప్రాభవం తగ్గడంతో బలపడాలని బీజేపీ భావిస్తోంది. కూచ్ బెహర్‌లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ 1962 నుంచి 2009 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. అలీపుర్దార్లో ఆర్ఎస్పీ 1977 నుంచి 2014 వరకు జరిగిన ఎలక్షన్లలో తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. పురులియాలో 1980 నుంచి 2014 వరకు సీపీఐ విజయం సాధిస్తూ వచ్చింది. లెఫ్ట్ పార్టీల క్యాడర్ బలహీనంగా మారడంతో ఈ స్థానాల్లో గెలుపుపై బీజేపీ ధీమాగా ఉంది. -
రంజాన్ రోజు ఎన్నికలు జరిగితే తప్పేంటి?
-
రంజాన్ రోజు ఎన్నికలు జరిగితే తప్పేంటి?
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలను రంజాన్ మాసంలో జరపడం ముస్లిం ఓటర్లపై ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని వస్తున్న వ్యాఖ్యానాలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రంజాన్ రోజు ఎన్నికలు జరిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటూనే తమ పనులు చేసుకుంటారని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. రంజాన్ మాసంలో ఎన్నికలు జరగడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు ఏ విధమైన కారణాలు ఉన్నప్పటికీ.. ముస్లింలను, రంజాన్‌ను వాటి కోసం వాడుకోరాదని విజ్ఞప్తి చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌పై స్పందించిన తృణమాల్ కాంగ్రెస్ నాయకుడు, కోల్కత్తా మేయర్ ఫరీద్ హకీమ్.. ఏడు దశల్లో ఎన్నికలు జరపడం వల్ల సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. రంజాన్ పర్వదినం రోజునే బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలోని కొన్ని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అక్కడి ముస్లింలకు ఇబ్బంది కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం రాజ్యంగ బద్ధమైన సంస్థ అని.. మేము వారికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని తెలిపారు. -
తృణమాల్ నాయకుడి కాల్చివేత
కోల్కత్తా: తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడుని దుండగులు కాల్చి చంపారు. ఇటీవల టీఎంసీ ఎమ్మెల్యేను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన ఘటన మరవకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన టీఎంసీ నాయకుడు కార్తీక్ నస్కర్‌ను దుండగులు అతి దగ్గర నుంచి కాల్చిచంపారు. కార్తీక్ భార్య స్వప్న నస్కర్ దారియా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఉన్నారు. కార్తీక్ టాంగ్రఖలి నుంచి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత అతన్ని అడ్డగించిన కొందరు వ్యక్తులు పదుననైన ఆయుధాలతో తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత అతన్ని కాల్చివేశారు. అక్కడున్నవారు ఆస్పత్రి తరలించేలోపే కార్తీక్ మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆదివారం సాయంత్రం కుల్తూలికి చెందిన అధికార పార్టీకి చెందిన ఓ కార్యకర్తను కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. -
వాగ్వాదాలు.. నిరసనలు
న్యూఢిల్లీ: సీబీఐ వివాదంపై మంగళవారం కూడా పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా విపక్షాల నిరసనలతో రాజ్యసభ కార్యక్రమాలు పూర్తిగా స్తంభించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరపాలని లోక్‌సభలో అధికార పక్షం పట్టుబట్టగా సీబీఐని కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సభ్యులు నిరసన కొనసాగించారు. దీంతో ఇరు పక్షాల నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధంతో సభ మూడుసార్లు వాయిదాపడింది. ప్రధాన ప్రతిపక్షమైన తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. ఒకవైపు, ఇలా గందరగోళం కొనసాగుతుండగా స్పీకర్ సుమిత్రా మహాజన్ పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో నినాదాలు కొనసాగించారు. ‘అవినీతి– సంఘ వ్యతిరేక శక్తులు’ ఏకమై ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయంటూ బీజేపీకి చెందిన హకుందేవ్ నారాయణ్ యాదవ్ వ్యాఖ్యానించగానే ప్రతిపక్ష సభ్యులంతా లేచి నిలబడి ఆ వ్యాఖ్యలను తొలగించాలంటూ పట్టుబట్టారు. ఇదే సమయంలో అపురూప పొద్దార్ (టీఎంసీ), వీణా దేవి(ఎల్జేపీ)లు పరస్పరం బెదిరించుకుంటూ సైగలు చేసుకోవడంతో మిగతా సభ్యులు జోక్యం చేసుకుని వారిని వారించారు. రాజ్యసభలో.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చకు చేపట్టాలని అధికార పక్షం పట్టుబట్టగా సీబీఐని ప్రభుత్వం వాడుకోవడంపై చర్చించాలంటూ టీఎంసీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు నినాదాలతో అంతరాయం కలిగించారు. దీంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను బుధవారానికి వాయిదా వేశారు. రైతుల స్థితిగతులపై దేశవ్యాప్త సర్వే న్యూఢిల్లీ: రైతుల స్థితిగతుల వివరాలు తెలుసుకునేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా సర్వే చేపట్టనుంది. ఈ ఏడాది పంట కాలంలో రైతుల ఆదాయం, వ్యయం, రుణాలు తదితర వివరాలు సేకరించనుంది. వ్యవసాయదారుల పరిస్థితిపై 77వ రౌండ్ నేషనల్ శాంపుల్ సర్వే (ఎన్ఎస్ఎస్) కాలంలో ఆధ్యయనం నిర్వహించనున్నట్లు మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్‌సభలో రాతపూర్వకంగా తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వేను చివరిసారిగా ఎన్ఎస్ఎస్వో 2012–2013 పంట కాలానికి చేపట్టింది. కాబట్టి 2014–2018 మధ్య కాలంలో రైతుల స్థితిగతుల వివరాలు అందుబాటులో లేవని లోక్‌సభకు గజేంద్ర సింగ్ తెలిపారు. అందుబాటులో ఉన్న డేటా, వనరుల, ఉద్యోగుల లభ్యత తదితర అంశాలను బట్టి ఈ సర్వే కాల వ్యవధి ఉంటుందని చెప్పారు. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసే ఉద్దేశంతో ఏర్పాటైన కేంద్ర మంత్రుల కమిటీ 70వ రౌండ్ ఎన్ఎస్ఎస్ అధ్యయనం డేటా వివరాలను లెక్కలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. -
పార్లమెంట్లో తృణమూల్ ఎంపీల ఆందోళన
-
విపక్షాల సమరశంఖం
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలకు విపక్షాలు కలసికట్టుగా సమరశంఖం పూరించాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఐక్యంగా పోరాడాలని ప్రతినబూనాయి. మోదీ ప్రభుత్వ విధానాలు, పనితీరుపై ముప్పేట దాడి చేశాయి. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, హస్తినలో ప్రభుత్వం మారాల్సిందేనని ముక్తకంఠంతో నినదించాయి. ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో శనివారం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతమైంది. ప్రధాన విపక్షం కాంగ్రెస్ సహా 20 ప్రాంతీయ, జాతీయ పార్టీలకు చెందిన నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో విభేదాల్ని పక్కనపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఎన్నికలు ముగిసిన తరువాతే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించారు. ర్యాలీకి టీఎంసీ కార్యకర్తలు లక్షల్లో వచ్చారు. కోల్‌కతా విపక్ష సభ సక్సెస్‌కావడంతో అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఢిల్లీ, ఏపీ రాజధాని అమరావతిలోనూ ఇలాంటి ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. మోదీ ప్రభుత్వ గడువు తీరింది: మమతా మోదీ ప్రభుత్వంపై ఈ ర్యాలీకి అధ్యక్షత వహించిన మమత నిప్పులు చెరిగారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మార్పు రావాలంటే ఢిల్లీలో ప్రభుత్వం మారాలని ఉద్ఘాటించారు. సమష్టి నాయకత్వం గురించి తరచూ మాట్లాడే మోదీ, అమిత్ షాలు బీజేపీ సీనియర్ నాయకులు సుష్మా స్వరాజ్, గడ్కరీ, రాజ్‌నాథ్ తదితరులకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వడంలేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధ సంస్థలు సీబీఐ, ఆర్బీఐ, ఇతర విచారణ సంస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. మొండి బకాయిలు గుట్టల్లా పేరుకుపోయాయని, రఫేల్ లాంటి కుంభకోణాలు వెలుగుచూశాయన్నారు. ఏకమవకుంటే అణచివేత తప్పదు: ఖర్గే కాంగ్రెస్ తరఫున హాజరైన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే.. సోనియా పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. సోనియా, రాహుల్ గాంధీలు ఈ సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. ‘మోదీ తాను తినకపోయినా తన కార్పొరేట్ స్నేహితులు అంబానీలు, అదానీలకు లబ్ధి చేకూరుస్తున్నారు. నోట్లరద్దు, జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. గమ్యస్థానం చాలా దూరం ఉంది. దారి క్లిష్టంగా ఉంది. కానీ మనం అక్కడికి చేరాలి. మన మనసులు కలిసినా కలవకపోయినా, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ముందుకుసాగాలి’ అని ఓ హిందీ వాక్యంతో ఖర్గే ప్రసంగాన్ని ముగించారు. ఎలాగైనా బీజేపీని ఓడించాలి: కేజ్రీవాల్ కేంద్రంలో ప్రమాదకర బీజేపీని ఎలాగైనా ఓడించాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడుకోవాలంటే మోదీ ప్రభుత్వాన్ని మార్చాల్సిందేనన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆ ఒక్క సీటు(వారణాసి)నైనా ఎలా గెలుచుకోవాలో బీజేపీకి అర్థం కావడం లేదని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఓ వైపు అవినీతి గురించి మాట్లాడుతూనే కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని వాగ్దానాల్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని మోసగించిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. అది అవకాశవాదుల ర్యాలీ: బీజేపీ సాక్షి, న్యూఢిల్లీ: విపక్ష ర్యాలీ.. పరస్పర విరుద్ధ సిద్ధాంతాలున్న అవకాశవాదుల సమావేశమని బీజేపీ అభివర్ణించింది. లోక్‌సభ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ద్వేషంతో ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి ఇష్టపడని నేతలు ఒక చోట చేరారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ ప్రశ్నించారు. ‘వారు మాట్లాడుతున్న కొత్త ఫ్రంట్ రెండోదా? మూడోదా? తెలియదు. ఈ పార్టీల్లో ఒకరినొకరు తిరస్కరించిన వారున్నారు. యూపీలో కాంగ్రెస్‌ను వద్దనుకున్న ఎస్పీ–బీఎస్పీ ఈ ర్యాలీలో పాల్గొనడం వారి అవకాశవాదాన్ని సూచిస్తోంది’ అని అన్నారు. హాజరైన పార్టీలు, నాయకులు.. తృణమూల్ కాంగ్రెస్, జేడీఎస్, కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, ఎన్సీ, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, టీడీపీ, ఆప్, లోక్తాంత్రిక్ జనతాదళ్, జీజేఎం, ఏఐడీయూఎఫ్, జోరం నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ మిజోరం, జేఎంఎం, పటీదార్ ఆందోళన్ సమితి, శత్రుఘ్న సిన్హా(బీజేపీ), జిగ్నేశ్ మేవానీ(దళిత ఎమ్మెల్యే), అరుణాచల్ మాజీ సీఎం గెగాంగ్ అపాంగ్(ఇటీవలే బీజేపీ నుంచి బయటికి వచ్చారు). ఈవీఎం ట్యాంపరింగ్‌పై నలుగురితో కమిటీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల పనితీరు, వాటి దుర్వినియోగాన్ని అడ్డుకోవడంపై సూచనలు చేసేందుకు నలుగురు విపక్ష నాయకులతో కమిటీ ఏర్పాటైంది. దీనిలో అభిషేక్ సింఘ్వీ(కాంగ్రెస్), అఖిలేశ్(ఎస్పీ), సతీశ్ మిశ్రా(బీఎస్పీ), కేజ్రీవాల్(ఆప్) ఉన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌కు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయబోయే ఈ కమిటీ ఎన్నికల సంస్కరణలపై ఈసీకి నివేదిక సమర్పిస్తుందని మమతా చెప్పారు. ఎన్నికలకు వ్యవధి తక్కువ ఉందని, సంస్కరణల్ని ఈసీ వెంటనే చేపట్టాలని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఉన్నపళంగా మళ్లీ బ్యాలెట్ విధానానికి వెళ్లాలని తాము కోరడం లేదని, కానీ ఓట్ల లెక్కింపునకు వీవీప్యాట్ పద్దతిని విస్తృతం చేయాలని సింఘ్వీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు దెబ్బేనా? సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: విపక్షాలను ఒకతాటిపైకి తేవడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ప్రయత్నం సఫలమైంది. ఇదే స్ఫూర్తితో మహాకూటమి ఏర్పాటు యత్నాలు మరింత ముమ్మరమయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే.. ప్రధాన విపక్షం కాంగ్రెస్ పాత్ర పెద్దగా లేకుండానే ప్రాంతీయ పార్టీలు కోల్‌కతాలో ఒకే వేదికపైకి వచ్చి ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. ఇలా ప్రాంతీయ పార్టీలు తమంతట తాము ఏకమవడం కాంగ్రెస్ బలం తగ్గిపోయిందనే సంకేతాన్నిస్తోంది. ఈ కోణంలో చూస్తే లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని మరింత తగ్గించే అవకాశాలున్నాయి. ప్రాంతీయ పార్టీలకు చుక్కాని లేదని, వాటికి ఓ దిశానిర్దేశం లేదని ఇన్నాళ్లూ బీజేపీ, కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వస్తున్నాయి. కానీ ఇటీవలి కాలంలో చిన్నా చితకా పార్టీలు కూడా ఎన్నికల తరువాత ఒప్పందం కుదుర్చోవడానికి గట్టిగానే బేరమాడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు లేకుండా తామెన్ని సీట్లు గెలుస్తామోనని లెక్కలేసుకుంటున్నాయి. కోల్‌కతా ర్యాలీతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా రెండు ఫ్రంట్లు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలో కాగా, మరొకటి కాంగ్రెస్ రహిత ఫెడరల్ ఫ్రంట్(వేర్వేరు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కలసి ఏర్పాటుచేయబోయేది) అని భావిస్తున్నారు. ఇక కోల్‌కతా ర్యాలీ విషయానికి వస్తే..ఇతర నాయకులు 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడగా, ఆతిథ్యమిచ్చిన మమతా బెనర్జీ మాత్రం బెంగాలీలో సుమారు అరగంట సేపు ప్రసంగించారు. దీనిని బట్టి రాబోయే మహాకూటమి ర్యాలీల్లో స్థానిక పార్టీనే ఎక్కువ ప్రాచుర్యం పొందేందుకు ప్రయత్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగితే ఆప్, చెన్నైలో డీఎంకే ప్రభావం ఎక్కువ ఉండొచ్చు. శనివారం కోల్‌కతాలో జరిగిన విపక్ష ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు ర్యాలీకి వచ్చిన ముఖ్యనేతలకు భోజనం వడ్డిస్తున్న మమతా బెనర్జీ -
అడ్డొస్తే తొక్కి పడేస్తాం..
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లాకెట్ ఛటర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ బీజేపీ చేపట్టే రథయాత్రను అడ్డుకుంటే రథ చక్రాల కింద నలిగిపోతారని హెచ్చరించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకే రథయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ చేపట్టనున్న రథయాత్రలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు మూడు రథయాత్రలను బీజేపీ ప్లాన్ చేసింది. డిసెంబర్ 5,7,9 తేదీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలోని 42 లోక్ సభ నియోజకవర్గాల్లో ఈ యాత్రలు నిర్వహించనున్నారు. రథయాత్రల ముగింపు సందర్భంగా కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ సైతం పాల్గొనే అవకాశం ఉంది. కాగా, లాకెట్ ఛటర్జీ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకే బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. బెంగాల్ ప్రజలపై మతతత్వ ఎజెండా రుద్దడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని టీఎంపీ సెక్రటరీ జనరల్ పార్థ ఛటర్జీ విమర్శించారు. అందుకే బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ విభజన రాజకీయాలను ప్రజలే తిప్పికొడతారని ఆయన అన్నారు. -
తేల్చుకోవాల్సింది మీరే..!
కోల్‌కత : వచ్చే ఎన్నికల్లో కారల్ మార్క్స్, మమతా బెనర్జీ, నరేంద్ర మోదీల్లో ఎవరి సిద్దాంతాలు కావాలో బెంగాల్ ప్రజలు తేల్చుకోవాలని పశ్చిమబెంగాల్ బీజేపీ వైస్-ప్రెసిడెంట్ జయప్రకాశ్ మజుందార్ అన్నారు. ఇండియా టుడే నిర్వహించిన కాన్క్లేవ్ ఈస్ట్ -2018 చర్చా కార్యక్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ విఫలమైందనిపై ఆయన విమర్శలు గుప్పించారు. మమత పాలనలో మత ఘర్షణలు తీవ్రమయ్యాయని ఆరోపించారు. మమతా..మోదీ సిద్ధాంతాలు..! ‘మార్క్స్ సిద్ధాతంతం ప్రకారం మతం అనేది ప్రజలకు మత్తులాంటిది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకారం మతం అనేది ఓటు బ్యాంకు మాత్రమే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకారం మతం అనేది సమజానికి వెన్నుముక, మతం అనేది ఒక పవిత్రమైన విధానం’అని ముజుందార్ వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం సీపీఎం కథ ముగిసిందని అన్నారు. బెంగాల్ భవిష్యత్తు బీజేపీ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. మీరు ప్రభుత్వం నడపడం లేదా..! బెంగాల్లో అశాంతికి, మత ఘర్షణలకు మతతత్వ బీజేపీ కారణమని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కార్గా ఛటర్జీ ఆరోపించారు. రాష్ట్రేతర శక్తుల మూలంగానే బెంగాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తృణమూల్‌ను దెబ్బతీయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని అన్నారు. ఛటర్జీ వ్యాఖ్యలను మజుందార్ ఖండించారు. బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్న టీఎంసీ బెంగాల్లో అధికారం లేదా అని ఎద్దేవా చేశారు. అసమర్థ పాలన సాగిస్తున్న మమత బెనర్జీ ప్రభుత్వ పాలనకు ప్రజలు చరమ గీతం పాడనున్నారని అన్నారు. కాగా, ఇటీవల బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
దారుణం: మహిళా బీజేపీ నేతపై..
కోల్‌కతా: ఓ మహిళా బీజేపీ నేత పట్ల తృణమూల్ కాంగ్రెస్ నేతలు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. కనీసం మహిళా అనే గౌరవం లేకుండా రెండు సార్లు దాడి చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక ఘటన పోలీసుల సమక్షంలోనే జరగగా.. మరో ఘటన మీడియా సాక్షిగా చోటుచేసుకుంది. అయినా నిందితులపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాకపోడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. గత బుధవారం(సెప్టెంబర్ 26)న బీజేపీ రాష్ట్ర బంద్ నేపథ్యంలో దిసర్కార్ అనే మహిళా నేత తమ కార్యకర్తలతో కోల్‌కతాకు 40 కిలోమీటర్లో దూరంలో ఉన్న బారసత్‌లో రైల్‌రోకో నిర్వహించే ప్రయత్నం చేశారు. దీనిని అడ్డుకునేందుకు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ నేత, ఆ పంచాయతీ ఛీఫ్ అర్షదుజ్జమాన్ సదరు మహిళపై దాడి చేశాడు. కర్రలతో ఆమెను కొడుతూ ఒక తన్ను తన్ని పరుగెత్తించాడు. ఈ ఘటననంతా ఒకరు సెల్ఫోన్లో రికార్డ్ చేశారు. ఇక ఈ దాడి గురించి ఆమెను ఓ మీడియా రిపోర్టర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా.. మరోసారి ఆమెపై మీడియా సాక్షిగానే దాడి చేశారు. అర్షదుజ్జమాన్ సహాయకుడు కుతుబుద్దిన్ ఆమెను తంతూ.. కాళ్లు చేతులు కట్టేసి రోడ్డుపై విసిరేసాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఆ పార్టీ స్పందించలేదు. -
అస్సాంతో అశాంతి పరిస్థితులు తప్పవా!
సాక్షి, న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు గురువారం నాడు అస్సాంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, వారిని సిల్చార్ విమానాశ్రయంలో అస్సాం పోలీసులు అడ్డగించడం తెల్సిందే. ఇటీవల కోల్‌కతాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీకి మమతా బెనర్జీ అనుమతివ్వకపోవడంతో ఆయన తనను అరెస్ట్ చేసుకోమని సవాల్ చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ రెండు సంఘటనలకు సంబంధం ఉందని, అటు బెంగాల్లో పాగా వేసేందుకు అటు బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఆ ప్రయత్నాలను అడ్డుగోవడంతోపాటు రానున్న ఎన్నికల నాటికి ఇటు అస్సాంలో బీజేపీని బలహీనం చేయడం మమతా బెనర్జీ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అది నిజమే కావొచ్చుకానీ ఇది ఇంతకన్నా చాలా లోతుగా పరిశీలించాల్సిన అంశం. ఎన్ఆర్సీ విడుదల చేసిన జాతీయ పౌరసత్వ జాబితాలో దాదాపు 40 లక్షల మంది ప్రజలకు చోటు లభించకపోవడాన్ని మమతా బెనర్జీ మతపరమైన అంశంగా కాకుండా జాతిపరమైన అంశంగానే చూస్తున్నారు. ఇదో మరో ‘బెంగాలీ ఖెదావో (బెంగాలీలను బహిష్కరించండి)’ ఆందోళనేనని ఆమె ఆరోపిస్తున్నారు. ఆమె మాటల్లో నిజం లేకపోలేదు. 1960, 1970 దశకాల్లో అస్సాం సాంస్కృతిక జాతీయవాదులు ‘బొంగాల్ ఖేదా’ పేరిట వేలాది మంది బెంగాళీలను అస్సాం నుంచి తరిమేశారు. ఆ తర్వాత 1979 ప్రాంతంలో బెంగాళీల పేరిట బంగ్లాదేశ్ వలసదారులకు అప్పటి ప్రభుత్వం ఓటు హక్కు కల్పించినందుకు అస్సాం మరోసారి భగ్గుమంది. అస్సాం జాతీయ వాదులు 1979 నుంచి 1985 వరకు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన నుంచి తీవ్రవాదులు పుట్టుక రావడంతో రాష్ట్రంలో విధ్వంసకాండ కూడా పెద్ద ఎత్తునే చెలరేగింది. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల కారణంగానే లక్షలాది మంది ప్రజలు అస్సాం రాష్ట్రానికి వలసపోయారు. వారిలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. ‘బెంగాలీలను బహిష్కరించండి’ అన్న అస్సామీల ఆందోళన కారణంగా వేలాది మంది వెనక్కి వచ్చారు. వారికే బెంగాలీ ప్రభుత్వం సరైన ఆశ్రయం కల్పించలేక పోయింది. ఇప్పుడు ఏకంగా 40 లక్షల మందిని అస్సాం ప్రభుత్వ తరిమేస్తే వారిలో ఎక్కువ మంది బెంగాల్‌నే ఆశ్రయిస్తారన్నది మమతా బెనర్జీ భయం. దాన్ని ఎలాగైనా అడ్డుకోవడంతోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇదే అంశంపై వీలైనంత వరకు ఇరుకునబెట్టి రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలన్నది కూడా ఆమె వ్యూహమే. మరోపక్క ముస్లింలను బహిష్కరించడం ద్వారా దేశవ్యాప్తంగా హిందూశక్తులను ఆకర్షించి రానున్న ఎన్నికల్లో లబ్ధిపొందాలన్నది బీజేపీ వ్యూహం. ఎవరి వ్యూహం ఏమైనప్పటికీ బెడిసికొడితే అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడి దేశంలో అశాంతి నెలకొంటుంది. -
రాజుకుంటున్న అసోం పౌర ముసాయిదా రగడ
-
తృణమూల్ బృందం నిర్బంధం
సిల్చార్/న్యూఢిల్లీ: నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్నార్సీ) తుది ముసాయిదాపై ఆందోళనల నేపథ్యంలో అస్సాంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని అంచనావేయడానికి గురువారం అక్కడికి వెళ్లిన తృణమూల్ బృందాన్ని పోలీసులు సిల్చార్ విమానాశ్రయంలో అడ్డుకుని నిర్బంధించారు. వారి పర్యటన శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం అధికారులు తెలిపారు. ఎన్నార్సీ జాబితాలో భారతీయుల పేర్లు గల్లంతవడంపై స్థానిక ఆడిటోరియంలో సమావేశం నిర్వహించేందుకు ఆరుగురు ఎంపీలు, పశ్చిమబెంగాల్ మంత్రి, ఎమ్మెల్యేతో కూడిన తృణమూల్ బృందం అస్సాం వెళ్లింది. విమానాశ్రయంలోనే బైఠాయింపు.. తృణమూల్ బృందం విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకుని వీఐపీల గదిలో నిర్బంధించారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఎంపీ సుఖేందర్ శేఖర్ రాయ్ ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ‘మహిళా సభ్యులతో సహా మా అందరిపై భౌతిక దాడి జరిగింది. ఎన్నార్సీ జాబితాలో చోటుదక్కని వారితో మాట్లాడటానికే ఇక్కడికి వచ్చాం.కానీ పోలీసులు మమ్మల్ని విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతించలేదు’ అని అన్నారు. బీజేపీపై మమత మండిపాటు అస్సాంలో తమ పార్టీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంపై మమతా బెనర్జీ స్పందించారు. దేశంలో బీజేపీ సూపర్ ఎమర్జెన్సీని అమలుచేస్తోందని మండిపడ్డారు. ఏ చట్టం ప్రకారం ప్రతినిధులను అడ్డుకున్నారని నిలదీశారు. ‘ ఎన్నార్సీ జాబితాకు సంబంధించి ఎవరినీ వేధింపులకు గురిచేయమని హోం మంత్రి రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. కానీ మా ఎంపీలను సిల్చార్ విమానాశ్రయం నుంచి అడుగు బయటపెట్టనీయలేదు. పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారు. బీజేపీ తన బలంతో నిజాలను తొక్కిపెడుతోంది’ అని మమత ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ లోక్‌సభలో లేవనెత్తారు. అస్సాం దేశంలో భాగమేనని, అయినా ఎంపీలు అక్కడ అడుగుపెట్టకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అస్సాం ప్రభుత్వంపై శుక్రవారం సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. దేశమంతా ఎన్నార్సీ: బీజేపీ సభ్యుడు దేశమంతా ఎన్నార్సీ నిర్వహించాలని అధికార బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబే లోక్‌సభలో డిమాండ్ చేశారు. పలు ఈశాన్య రాష్ట్రాలు సహా కశ్మీర్లో జనాభా లెక్కలు సమగ్రంగా నిర్వహించలేదన్నారు. దూబే వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు.. స్పీకర్ సర్దిచెప్పడంతో శాంతించాయి. మరోవైపు, దళితులపై వేధింపుల నిరోధక చట్టం, ఎన్నార్సీ అంశాలు గురువారం పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి. -
‘వారి చేతులు రక్తపు మరకలతో తడిశాయి’
కోల్కత్తా : బీజేపీ ప్రభుత్వం తాలిబన్ గ్రూపులను తయారుచేసి దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పార్టీ వార్షిక దినోత్సవం సందర్భంగా శనివారం కోల్‌కత్తాలో మెగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. మతకల్లోలాలు సృష్టించి వారి చేతులు రక్తపు మరకలతో తడిసిపోయాయని మమతా ధ్వజమెత్తారు. బీజేపీ నేతల అహంకార, బెదిరింపులు మాటలకు ప్రజలు భయపడవద్దని సూచించారు. ప్రజల క్షేమం కోసం సరిగ్గా టెంట్ కూడా నిర్మించలేని వారు దేశాన్ని ఏం నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇటీవల మిద్నాపూర్‌లో మోదీ సభలో టెంట్ కూలి 90 మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. దేశాన్ని మతతత్వ బీజేపీ నుంచి రక్షించేందుకు ‘బీజేపీ హఠావో దేశ్ బచావో’ అనే నినాదాన్ని ఆగస్ట్ 15 నుంచి ప్రచారం చేస్తామని మమత ప్రకటించారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో తృణమూల్ విజయం సాధించి తీరుతుందని మమత ఆశాభావం వ్యక్తం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 32 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు జనవరిలో అన్నిపార్టీల నేతలతో కోల్‌కత్తాలో భార్యీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు మమతా ప్రకటించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల్లో కొందరూ మంచివారు ఉన్నారని, వారిని గౌరవిస్తానని పేర్కొన్నారు. కొందరూ మాత్రం మతకల్లోలు సృష్టించి దేశంలో అల్లర్లు రేపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సీనియర్ నేత చందన్ మిత్రా బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్‌లో చేరుతున్నట్లు మమతా ప్రకటించారు. వీరితో పాటు నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీఎంసీలో చేరారు. -
బీజేపీ, కాంగ్రెస్‌లకు షాక్
కోల్కత్తా : రానున్న ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ను ఎదుర్కొవాలనుకుంటున్న బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత చందన్ మిత్రా శనివారం టీఎంసీలో చేరారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ప్రధాన సహచరుడైన మిత్రా రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. గత కొంత కాలంగా నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వంతో విభేదిస్తున్న మిత్రా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన మొదటిసారి 2003లో రాజ్యసభలో అడుగుపెట్టగా, 2010లో రెండోసారి మధ్యప్రదేశ్ నుంచి పెద్దల సభకు ఎన్నికైయ్యారు. 2014లో హుగ్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. మిత్రాతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమర్ ముఖర్జీ, అబూ తెహర్, షబీనా యాస్మిన్, అఖ్రుజ్‌మాన్‌లు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఎంసీలు చేరారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్ నేతలు పార్టీని వీడటం బీజేపీ, కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగానే భావించాలి. -
మోదీజీ.. నిప్పుతో ఆటలొద్దు..
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో పాలక మమతా సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మిడ్నపూర్ కిసాన్ ర్యాలీలో చేసిన విమర్శలపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. నిప్పుతో చెలగాటం వద్దని మోదీకి హితవు పలికింది. ఈ ర్యాలీకి పొరుగు రాష్ట్రాలు జార్ఖండ్, ఒడిషాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించారని విమర్శించింది. కిసాన్ ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో సిండికేట్ రాజకీయాలను నడిపిస్తూ అధికారంలో కొనసాగేందుకు స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రధాని ఆరోపణలను తృణమూల్ దీటుగా తిప్పికొట్టింది. మత ఛాందసవాదం, అవినీతి, హత్యారాజకీయాలతో బీజేపీ సిండికేట్‌గా మారిందని దుయ్యబట్టింది. పశ్చిమ బెంగాల్ ప్రపంచంలో సాంస్కృతిక రాజధానిగా వర్ధిల్లుతోందని, అభివృద్ధి అజెండాలేని ప్రధాని మోదీ కేవలం రాజకీయాలతో పబ్బం గడుపుకునేందుకు వచ్చారని పేర్కొంది. మోదీ ఎన్ని మాటలు చెప్పినా బెంగాల్లో బీజేపీకి ఫలితం సున్నా అంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు మోదీ ర్యాలీలో టెంట్ కూలి 20 మందికి గాయాలైన ఘటన పట్ల తృణమూల్ విచారం వ్యక్తం చేసింది. క్షతగాత్రులకు అన్నిరకాలుగా సాయం చేసేందుకు సిద్ధమని పేర్కొంది. -
కాంగ్రెస్‌తో దోస్తీకి సై?
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీజేపీని ఢీకొట్టాలంటే విభేదాలు పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా ముందుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్, తృణమూల్ పొత్తుపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రాజన్ చౌదరి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక కథనం ప్రచురించింది. తృణమూల్‌తో పొత్తుకు రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు సానూకూలంగా ఉన్నట్లు, టీఎంసీతో కలిసి పోటీ చేస్తే పార్టీ ఓటింగ్ శాతంకూడా పెరిగే అవకాశం ఉందని రాజన్ చౌదరి అధిష్టానానికి తెలిపినట్టు సమాచారం. ఇదే అంశపై టీఎంసీతో చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మొనీహుల్ హక్, అబూ హసిమ్ ఖాన్లు టీఎంసీ ప్రధాన కార్యదర్శి మంత్రి పార్థ ఛటర్జీతో గురువారం సమావేశం అయ్యారు. ఆ మరుసటి రోజే కాంగ్రెస్ నేతలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర నాయకత్వం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో తృణమూల్‌తో పొత్తుకు అధిష్ఠానం అంగీకరించే అవకాశం ఉన్నట్లు సదరు వార్తాసంస్థ కథనంలో పేర్కొంది. కాగా 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-తృణమూల్ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కాంగ్రెస్‌తో విభేదించిన మమత 2012లో యూపీఏ ప్రభుత్వం నుంచి బయటకువచ్చారు. 2016లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఘోర పరాజయంపాలైన విషయం తెలిసిందే. -
ప్రతిపక్షాల అభ్యర్థి తృణమూల్ నాయకుడు
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ప్రతిపక్షాలు, అధికార పక్షాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ పీజే కురియన్ 2012లో డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైయ్యారు. కురియన్ పదవీ కాలం జులై 2తో ముగియనున్న విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మిత్రపక్షాల నుంచి అభ్యర్థిని పోటీలో నిలిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖెండు శేఖర్ రాయ్‌ను నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 51 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి రాజ్యసభలో పూర్తిస్థాయి మెజార్టీకి లేకపోవడంతో ప్రతిపక్షాలను ఏకం చేసి వారికి విజయం దక్కకుండా చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్, బీజు జనతా దళ్(బీజేడీ) పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి కేశవరావు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా పోటీ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇరవై ఆరేళ్ల తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. చివరిసారిగా 1992లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి నజ్మా హెప్తుల్లా(ప్రస్తుతం బీజేపీ), టీడీపీ అభ్యర్ధి రేణుకా చౌదరిపై పోటీ చేసి విజయం సాధించారు. జూలై 18 నుంచి ప్రారంభంకానున్న వర్ష కాల సమావేశంలో ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. -
‘బీజేపీ కార్యకర్త అయినందుకే హత్య’
సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్లో బీజేపీ దళిత కార్యకర్త హత్యకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు ఢిల్లీలోని బంగా భవన్‌ను ముట్టడించారు. పూరూలియా జిల్లాలో బుధవారం ఓ దళిత యువకుడు అనుమానస్పదంగా మృతి బెందిన విషయం తెలిసిందే. ఈ హత్యను తృణమూల్ కాంగ్రెస్ నేతలే చేశారని శుక్రవారం బంగా భవన్ వద్ద బీజేపీ దళిత మోర్చా నేతలు ఆందోళన చేశారు. బీజేపీ కార్యకర్త అయినందేకు తృణమూల్ నేతలు దళిత యువకుడిని హత్య చేసి చెట్టుకు ఉరేశారని మోర్చా నేతలు ముకుల్ రాయ్, కైలాస్ విజయ్ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణకు ప్రతీకారంగా ఈ హత్య చేశారన్నారు. కమ్యూనిస్టు ప్రభుత్వం చేసిన హింస కంటే తృణమూల్ నేతల హింసలే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. బీజేపీ కార్యకర్త అయినందేవల్లనే నిన్ను హత్యచేస్తున్నామని మృతుడి ఇంటి సమీపంలో ఓ లేఖ లభ్యమైందని పోలీసు అధికారులు తెలిపారు. కానీ ఆ లేఖ ఎవరు రాశారో వివరాలు ఏమీ లేవన్నారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలను టీఎంసీ తీవ్రంగా ఖండించింది. ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని టీఎంసీ నేతలు మండిపడ్డారు. -
బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ హవా
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) భారీ విజయం సాధించింది. సంఖ్యాపరంగా తక్కువ అయినప్పటికీ తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో మొదటి స్థానంలో ఉన్న సీపీఎం ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం.. 19,394 గ్రామ పంచాయతీలను టీఎంసీ, 5,050 పంచాయతీలను బీజేపీ గెలుచుకోగా, 1,306 చోట్ల సీపీఎం, 918 చోట్ల కాంగ్రెస్ గెలుపొందాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీంతోపాటు పంచాయతీ సమితుల ఫలితాల్లోనూ అధికార పార్టీ మంచి ఫలితాలను నమోదు చేసుకుంది. టీఎంసీ 560 పంచాయతీ సమితులను గెలుచుకుని, 350 సమితుల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 24 స్థానాలను గెలుచుకుని మరో 16 చోట్ల మెజారిటీ దిశగా సాగుతోంది. జిల్లా పరిషత్‌లలో టీఎంసీ 55 స్థానాలను గెలుచుకుని 30 చోట్ల పూర్తి ఆధిక్యంలో ఉంది. -
ప్రజాస్వామ్యం పరువు తీసిన తృణమూల్
సాక్షి, న్యూఢిల్లీ : ఇదివరకటిలాగే ఈసారి కూడా పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య హింసాకాండ చెలరేగింది. సోమవారం జరిగిన ఎన్నికల సందర్భంగా ఉత్పన్నమైన హింసాకాండలో దాదాపు 18 మంది మరణించారు. రాష్ట్రంలో హింసాకాండ పెరగలేదని వాస్తవానికి తగ్గిందంటూ ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను పాలకపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడుతోంది. 2003లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 61 మంది మరణించారు. ఆ విషయంతో పోలీస్తే హింసాకాండ తగ్గింది. అంతమాత్రాన ఎన్నికలు సవ్యంగా జరిగాయని, ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగ్గా పనిచేసినట్లు భావించలేం. తొలి ఓటు కూడా వేయకముందే 34 శాతం పంచాయతీలను ఎలాంటి పోటీ చేయకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడమే అందుకు కారణం. ఇతర రాజకీయ పార్టీలకు సంస్థాగత బలం లేకపోవడం వల్ల ఈ 34 శాతం పంచాయతీల్లో పోటీ చేయలేకపోయిందని, అందుకనే పోటీ లేకుండా తమ పార్టీ విజయం సాధించినదని పాలకపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటోంది. కానీ ఎవరిని పోటీ చేయకుండా బెదిరించడం వల్లనే పోటీ లేకుండా పాలకపక్షం గెలిచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్రమంగా ఎదుగుతూ ఇప్పుడు ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించిన భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి తృణమూల్ కాంగ్రెస్‌లో అభద్రతా భావం ఏర్పడిందని, అందుకనే తృణమూల్ బీర్భమ్ జిల్లాలో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని వారంటున్నారు. ఈ జిల్లాలోనే ఎక్కువ పంచాయతీలను పోటీ లేకుండా తృణమూల్ కైవసం చేసుకుంది. 2019లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ పంచాయతీలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే బీజేపీని అడ్డుకునేందుకు తృణమూల్ తీవ్రంగా కృషి చేసింది. ప్రజాస్వామ్యం బూడిదపై రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడం మంచిదికాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
దీదీ దూరమౌతుందా?
న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పాంత్రీయ పార్టీలతో సానిహిత్యం పెంచుకుంటున్న విషయం తెలిసిందే. దీనికి భిన్నంగా బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్ వేర్వేరుగా పోటి చేస్తున్నాయి. తృణమూల్‌తో పొత్తుకు కాంగ్రెస్ మొదటి నుంచి ప్రయత్నించినా మమత బెనర్జీ మాత్రం కాంగ్రెస్‌ను దూరంగా ఉంచారు. జాతీయ స్థాయిలో మోదీని ఓడించేందుకు లౌకిక శక్తులన్ని ఏకం కావాలని మమత పిలిపునిచ్చిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీలతో సానిహిత్యంగా మెలుగుతున్న మమత కాంగ్రెస్‌కు మాత్రం మొదటి నుంచి కొంత దూరంగా ఉంటున్నారు. ఇటివల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తుకు మమత సిద్ధంగాలేరని, పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత పొత్తుల గురించి ఆలోచిస్తామని టీఎంసీ సీనియర్ నేత తెలిపారు. మమత మొదటి నుంచి బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. నోట్ల రద్దు, జీఎస్టీ, వంటి అంశాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు మమత తీవ్ర స్థాయిలో కృషిచేస్తున్నారు. ఢిల్లీలో ఇటివల సోనియా గాంధీ విపక్ష పార్టీ నేతలకు ఇచ్చిన విందుకు మమత హాజరు కాలేదు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఇచ్చిన విందుకు మాత్రం మమత హాజరై సంఘీభావం తెలిపిన విషయం విధితమే. కాగా 2016లో బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ను ఓడించేందుకు కాంగ్రెస్- లెఫ్ట్ జతకట్టాయి. -
సోనియాతో మమత భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు బలమైన కూటమి అవసరమని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ పేర్కొన్నారు. ఈ కూటమితో కాంగ్రెస్ కలిసి పనిచేయాలని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని కోరినట్లు ఆమె తెలిపారు. బుధవారం ఢిల్లీలో సోనియా గాంధీతో 20 నిమిషాలపాటు మమత సమావేశమయ్యారు. విపక్షాల ఐక్యకూటమిలో కాంగ్రెస్ చేరాలని సోనియాను కోరినట్లు ఆమె తెలిపారు. అందరూ ఏకమై పోరాడితే బీజేపీ కనుమరుగవటం ఖాయమని.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘దేశ రాజకీయాల్లో బీజేపీని లేకుండా చేయటమే మా తొలి అజెండా. ఇందుకోసం అన్ని శక్తులూ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తపడాలి. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ సహకరించుకోవాల’న్నారు. కాంగ్రెస్‌తో కలసి పనిచేసేందుకు తనకు ఇబ్బందుల్లే వని.. కానీ రాహుల్ గాంధీతోనే కొన్ని సమస్యలున్నట్లు సోనియాతో మమత పేర్కొన్నట్లు తెలిసింది. త్రిపుర ఎన్నికల్లో తృణమూల్‌తో కలసి పనిచేసేందుకు రాహుల్ నిరాకరించిన విషయాన్ని మమత గుర్తుచేశారు. బీజేపీ అసంతృప్త నేతలు యశ్వంత్ సిన్హా, శతృఘ్న సిన్హా, అరుణ్ శౌరీలనూ మమత కలిశారు. -
ఎన్నికల్లో అదరగొట్టిన టీఎంసీ
సాక్షి, కోల్‌కతా : రాజ్యసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అదరగొట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి సీఎం మమతా బెనర్జీ మరోసారి సత్తా చాటుకున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గానూ నాలుగు స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులను బరిలోకి దించింది. ఆ నలుగురు అభ్యర్థులు విజయం సాధించడంతో టీఎంసీ శ్రేణులు సంబరాలు చేసుకుంటోంది. రాజ్యసభకు నేడు (శుక్రవారం) జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ తమ పార్టీ నుంచి అభ్యర్థులుగా సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు నడిముల్ హక్, సుభాశిస్ చక్రవర్తి, అబిర్ బిస్వాస్, సంతును సేన్ లను బరిలో దించగా అందరూ విజయం సాధించారు. మరో స్థానంలోనూ టీఎంసీ బలపరిచిన నేత గెలుపొందారు. టీఎంసీ మద్దతిచ్చిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ సైతం గెలుపొందారు. సీపీఎం అభ్యర్థి రణ్ బీర్ దేవ్‌కు వామపక్ష కూటమి మద్దతిచ్చినా సింఘ్వీనే విజయం వరించింది. ఒక్కో అభ్యర్థి నెగ్గాలంటే 50 ఓట్లు కావాలి. అధికార టీఎంసీకి 213 ఓట్ల బలం ఉండగా, కాంగ్రెస్ కు 42 మంది సభ్యులు, సీపీఎంకు 26 మంది సభ్యుల ఉంది. దీంతో నలుగురు అభ్యర్థులను మాత్రమే గెలిపించుకునే అవకాశం ఉన్నందున మమతా బెనర్జీ తమ పార్టీ నుంచి నలుగురిని ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకున్నారు. -
టీడీపీ నిర్ణయాన్ని స్వాగతించిన మమత
కోల్కత్తా: దేశాన్నిబీజేపీ విపత్తు నుంచి కాపాడాలని తృణముల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు రావటాన్ని ఆమె స్వాగతించారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలన్న టీడీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మమతా బెనర్జీ శుక్రవారం ట్విట్ చేశారు. దేశంలో ఉన్న దుర్మార్గపు పాలనకు, ఆర్ధిక సంక్షోభానికి, రాజకీయ అస్థిరతకి వ్యతిరేకంగా పోరాడటానికి ఎన్డీయే వ్యతిరేక శక్తులన్ని ఏకం కావాలని మమత పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలన్ని ఏకం కావాలని కోరారు. I welcome the TDP's decision to leave the NDA. The current situation warrants such action to save the country from disaster — Mamata Banerjee (@MamataOfficial) 16 March 2018 I appeal to all political parties in the Opposition to work closely together against atrocities, economic calamity and political instability — Mamata Banerjee (@MamataOfficial) 16 March 2018 -
2019లో మోదీ ప్రధానిగా ఉండబోరు!
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్టు 15న ఎర్రకోటపై నరేంద్రమోదీ చేయనున్న ప్రసంగమే ప్రధానమంత్రిగా ఆయన చివరి ప్రసంగమని, వచ్చే ఏడాది ఆయన ప్రధానిగా కొనసాగబోరని, ఇది రాసి ఇస్తానని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డెరెక్ ఒబ్రియాన్ వ్యాఖ్యానించారు. 2019లో ప్రధానిగా మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేయకుండా చూడాల్సిన సవాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల ముందు ఉందని అన్నారు. ‘ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఈ ఏడాది ఆగస్టు 15న తన చివరి ప్రసంగం చేయబోతున్నారు. ఇది సుస్పష్టమైన సంకేతం. 2019లో ఆయన ఎర్రకోట నుంచి ప్రసంగించలేరు. ఈ సవాల్‌ను తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు, అన్ని ప్రతిపక్ష పార్టీలు స్వీకరించాలి’ అని డెరెక్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా థర్డ్ ప్రంట్ ఏర్పాటుచేస్తానంటూ ప్రకటించిన తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ ప్రకటన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసిన మమత.. భావసారూప్యమున్న పార్టీలతో కలిసి జాతీయ కూటమిగా ఏర్పడేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో డెరెక్ ఓబ్రియాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
నాడు తృణమూల్....నేడు బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 34 ఏళ్ల సీపీఎం ఎదురులేని పాలనకు చరమగీతం పాడుతూ తృణమూల్ కాంగ్రెస్ ఎలాగైతే అఖండ విజయం సాధించిందో ఈ రోజున అదే మార్క్సిస్టుల కంచుకోటను బద్దలుగొట్టి త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. తద్వారా రాష్ట్ర రాజధాని అగర్తలా లాంటి నగరాల్లో బెంగాలీలు ఎక్కువగా ఉండడంతో త్రిపురలోకి పార్టీని విస్తరించాలనుకున్న తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ ఆశలను కూడా గండికొట్టింది. ఇది బీజేపీకి ఎంతటి సైద్ధాంతిక విజయమో, సీపీఎం పార్టీకీ అంతే సైద్ధాంతిక పరాజయం కూడా. దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రిగా, నిజాయితీపరుడైన నేతగా 20 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని ఓడించడం మాటలు కాదు. ఇందులో భారతీయ జనతా పార్టీ సాగించిన విస్తత ఎన్నికల ప్రచారంతోపాటు సీపీఎం ప్రభుత్వం అపజయాలు అన్నే ఉన్నాయి. ఇదివరకే అస్సాం, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాలో కాషాయ జెండాను ఎగురవేసిన భారతీయ జనతా పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ఎలాగైన సీపీఎంను ఓడించాలనే రాజకీయ సైద్ధాంతిక కసితో 2017, మార్చి నుంచే త్రిపురలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు పార్టీ జాతీయ నాయకులు పలుసార్లు చిన్న రాష్ట్రమైన త్రిపురలో ఉధృతంగా ప్రచారం సాగించారు. బీజీపీలో సంఘ్ పరివార్‌లో భాగమైన ఆరెస్సెస్ ఎన్నికల విజయానికి క్షేత్రస్థాయిలో అవసరమైన రంగాన్ని ముందుగానే సిద్ధం చేసి ఉంచింది. బీజేపీ రంగప్రవేశం చేసి రాష్ట్రంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్యనున్న సామాజిక విభేదాలను సొమ్ము చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేసింది. రాష్ట్రం అభివద్ధి చెందాలంటే అది కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వం వల్లనే అవుతుందని ప్రజలకు ఆశ చూపించింది. 1980, 1990 దశకంలో అంతర్గత సంఘర్షణల నుంచి రాష్ట్రాన్ని వెలుపలికి తీసుకరావడంలో, అత్యంత వివాదాస్పదంగా తయారైన ‘సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం’ను త్రిపుర రాష్ట్రం నుంచి ఉపసంహరించడంలో విజయం సాధించినందున మాణిక్ సర్కార్ తిరుగులేని నాయకుడిగా ఇంతకాలం రాష్ట్రంలో కీలక పాత్ర పోషించారు. అయితే సర్కార్ ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. సర్కార్ ప్రభుత్వం నియామకాలు చెల్లవంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంతో కొన్ని వేల మంది టీచర్లు రోడ్డున పడ్డారు. అవినీతి జరిగిందన్న కారణంగానే ఆ నియామకాలను కోర్టు కొట్టివేసింది. రోజ్ఫండ్ చిట్‌ఫండ్ కుంభకోణం బెంగాల్ నుంచి త్రిపుర వరకు వ్యాపించింది. ఇందులో పెట్టుబడులు పెట్టిన వేలాది సామాన్యులు నష్టపోయారు. దేశంలోనే అత్యధికంగా నిరుద్యోగులు త్రిపురలో ఉన్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడంలో కూడా సీపీఎం ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధిని సాధించి చూపిస్తామని, యువతకు తప్పకుండా ఉద్యోగాలిస్తామంటూ బీజేపీ చేసిన ప్రచారానికి యువత మొగ్గు చూపింది. ‘స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లా మండలి’ పరిధిలోని ప్రాంతాల్లో గిరిజన తెగల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను కూడా మాణిక్ సర్కార్ పట్టించుకోలేదు. తరచూ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసవచ్చిన వారుగా ముద్రకు గురవుతున్న బెంగాలీ భాష మాట్లాడే ప్రజలు, తామే ఆదిమ జాతిగా చెప్పుకునే గిరిజనుల మధ్య జరుగుతున్న గొడవలనూ ఆయన పట్టించుకోలేదు. దాంతో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 0.46 శాతం ఓట్లు సాధించి ఒక్క సీటులో కూడా గెలవని ‘త్రిపుర పీపుల్స్ ఫ్రంట్’ ఈసారి ఏకంగా తొమ్మిది సీట్లకు పోటీ చేసి ఎనిమిది సీట్లను గెలుచుకుంది. మాణిక్ సర్కార్ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకమని, బెంగాలీ మాట్లాడే ప్రజల పక్షమని ప్రచారం ద్వారా నమ్మించడంలో కూడా బీజేపీ విజయం సాధించింది. తద్వారా గిరిజనులను ఆకట్టుకుంది. పేదల పక్ష పార్టీకి చెప్పుకునే సీపీఎం ప్రభుత్వం పేదలైన గిరిజనుల కోసం ఏమీ చేయలేకపోయిందన్న భావం వారిలో ఎక్కువగా ఈసారి కనిపించింది. అందుకని త్రిపుర ప్రజలు బీజేపీని గెలిపించారనడం ఎంత సమంజసమో, సీపీఎంను ఓడించారనడం కూడా అంతే సమంజసం. (సాక్షి వెబ్ ప్రత్యేక కథనం) -
తృణమూల్‌కు షాక్, బీజేపీలోకి సీనియర్ నేత!
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ముకుల్ రాయ్ పార్టీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. బుధవారం రాజ్యసభ స్థానంతో పాటు పార్టీ పదవులన్నింటికి రాజీనామా చేశారు. నారదా, శారదా కుంభకోణాల్లో మమతకు క్లీన్ చిట్ వచ్చేందుకు రాజీనామాకు సిద్దపడ్డారని సమాచారం. రాజీనామా అనంతరం ముకుల్ రాయ్ మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన పార్టీపై ఎటువంటి విమర్శలు చేయలేదు. బీజేపీలో చేరబోతున్నాడంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన ఖండించలేదు. కానీ ప్రస్తుతానికి ఆయన ఏపార్టీలో చేరబోతున్నారనే అంశంపై ఉత్కంఠత ఉంది. అనుచరులు మాత్రంలో త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని విశ్వసనీయ సమాచారం. దీనిపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోస్ మాట్లాడుతూ బంతి ఇంకా తృణమూల్ కోర్టులోనే ఉందన్నారు. ఒక వేళ ముకుల్ రాయ్ బీజేపీలో చేరతామనంటే ఆహ్వానిస్తామని, ఆయన పార్టీలో చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు ఘోష్ తెలిపారు. రాయ్ లాంటి నాయకుడు ప్రతి రాజకీయ పార్టీకి విలువైన వాడేనని ఆయన అన్నారు. అయితే బీజేపీలో చేరడంపై ముకుల్‌రాయ్ దీపావళి తరువాత ప్రకటించే అవకాశం ఉంది. రాయ్ రాజీనామాపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ స్పందించారు. శుభపరిణామం అన్నారు. గతనెల 27న నజ్రుల్ మంచాఆలో పార్టీ విస్తరణ సమావేశంలోను రాయ్ సైలెంట్‌గానే ఉన్నారు. రాయ్ లాంటి సీనియర్ నేతలను ఎలా ఉపయోగించుకోవాలో తృణమూల్ సంస్థాగత సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఒక వేళ రాయ్ తృణుముల్ కాంగ్రెస్‌ను విడిచి బీజేపీలో చేరితే, వచ్చే ఏడాది జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తృణముల్‌కు ఎదురుగాలి వీచే అవకాశం ఉంది. -
తృణమూల్‌కు ముకుల్ రాయ్ గుడ్‌బై
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు భారీ కుదుపుకు గురవుతున్నాయి. తృణమూల్ ఆవిర్బావం నుంచి ఆ పార్టీకీ సీనియర్ నేతగా, ఢిల్లీలో పెద్ద దిక్కుగా ఉన్న ముకుల్ రాయ్ పార్టీని వీడుతున్నట్లు సోమవారం ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్‌కు, పార్టీ పదవులకు, రాజ్యసభ సభ్యత్వానికి దుర్గా పూజల అనంతరం రాజీనామా చేస్తానని ముకుల్ రాయ్ ప్రకటించారు. దుర్గా పూజల అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన చెప్పారు. శారదా చిట్‌ఫండ్ స్కామ్ బయటకు వచ్చాక ముకల్ రాయ్‌ని మమతా బెనర్జీ పార్టీ జనరల్ సెక్రెటరీ పదవి నుంచి తప్పించారు. అప్పటినుంచి ముకుల్ రాయ్‌ని మమతా బెనర్జీ నెమ్మదిగా పక్కనపెడుతూ వస్తున్నారు. బీజేపీవైపు..! తృణమూల్‌కు రాజీనామా చేసిన అనంతరం.. ఆయన భారతీయ జనతాపార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. రాజీనామా తరువాత మీరు బీజేపీలో చేరే అవకాశం ఉందా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధాన మిస్తూ.. 5 రోజులు ఆగండి.. మీకే తెలుస్తుంది అని ముకుల్ రాయ్ చెప్పారు. ఒకవేళ ముకుల్ రాయ్ బీజేపీలో చేరితే.. ఆ పార్టీకి పెద్ద ఊపు వస్తుందని రాజకీయ వేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి బాగా కలిసి వస్తుందనే అంచనాలున్నాయి. -
కేంద్ర మాజీ మంత్రి సుల్తాన్ కన్నుమూత
సాక్షి, కోల్‌కతా: తృణముల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సుల్తాన్ అహ్మద్ కన్నుమూశారు. 64 ఏళ్ల సుల్తాన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండెపోటు రాగా ఆయన్ని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర టూరిజం శాఖ సహయ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. టీఎంసీలో మైనార్టీ ముఖచిత్రంగా అహ్మద్‌ను పేర్కొంటారు. విద్యార్థి దశలో కాంగ్రెస్‌తో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఎంటల్లీ నుంచి రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1997లో మమతాబెనర్జీతో తృణముల్ కాంగ్రెస్ ను స్థాపించటంలో ఆయన ముఖ్యభూమిక పోషించారు. 2014 ఎన్నికల్లో ఉలుబేరియా నుంచి ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. నారదా స్టింగ్ కేసులో అహ్మద్ నిందితుడిగా ఉన్నారు. కాగా, ఆయన మృతిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. Shocked and deeply saddened at the passing of Sultan Ahmed sitting @AITCOfficial LS MP & my long term colleague. Condolences to his family — Mamata Banerjee (@MamataOfficial) 4 September 2017 -
వామపక్షం వాడలో కాషాయం జాడలు..!
పశ్చిమబెంగాల్ తాజా మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం నాయకత్వంలోని వామపక్షాలు చావుదెబ్బతిన్నాయి. రాష్ట్రంలో 2009 లోక్‌సభ ఎన్నికల్లో మొదలైన కమ్యూనిస్టుల పతనం క్రమేపీ ‘ముందుకు’ సాగుతోందనడానడానికి ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఒక కార్పొరేషన్, ఆరు మునిసిపాలిటీల్లోని 148 వార్డుల్లో పాలకపక్షమైన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) 140 కైవసం చేసుకుని ఏడింటినీ చేజిక్కించుకోగా, బీజేపీ ఆరు సీట్లతో ‘రెండో’ స్థానం సంపాదించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. లెఫ్ట్‌ఫ్రంట్ భాగస్వామ్యపక్షం ఫార్వర్డ్ బ్లాక్ ఒకే ఒక సీటు సాధించింది. సీపీఎం, కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేదు. బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో రెండు, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలు ఒంటరిగా పోటీచేసి గెలుచుకుంది. తర్వాత జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ తర్వాత స్థానం కాషాయదళం సంపాదించి, సీపీఎం, దాని మిత్రపక్షాలను మూడోస్థానానికి నెట్టేయడం బెంగాల్ రాజకీయ చిత్రపటంలో వస్తున్న మార్పునకు సంకేతం. 1991 నుంచీ బలపడుతున్న బీజేపీ! మండల్-మందిర్ వేడిలో జరిగిన 1991 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల నుంచీ బెంగాల్లో బీజేపీకి పడే ఓట్లు పెరగడం మొదలైంది. ముఖ్యమంత్రి, తృణమూల్ నాయకురాలు మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి బయటిపడి టీఎంసీ స్థాపించాక 1998 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పటి నుంచీ కాషాయదళం బాగా పుంజుకుంది. 1999 ఎన్నికల్లో కూడా టీఎంసీతో పొత్తు బీజేపీకి లాభించింది. ఏబీ వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాల్లో తృణమూల్ ఇంకా సూటిగా చెప్పాలంటే మమతా బెనర్జీ కొనసాగడం బెంగాల్ బీజేపీకి జనామోదం తెచ్చిపెట్టింది. 2006 అసెంబ్లీ ఎన్నికల నుంచీ బీజేపీతో తృణమూల్ తెగతెంపులు చేసుకుంది. తర్వాత ఎన్నికల్లో బీజేపీ ఒకట్రెండు సీట్లే సాధించినాగాని వామపక్షాల స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నంలో చాలా వరకు విజయంసాధించిందనే చెప్పవచ్చు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లు 6 శాతం నుంచి 2014 ఎన్నికలకు 17 శాతానికి పెరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థాయిలో ఓట్లు దక్కలేదు. 2006లో 6 శాతం, 2011లో 4 శాతం, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పదిశాతం ఓట్లు కమలానికి దక్కాయి. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఉప ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్ మూడో స్థానానికి దిగజారింది. బీజేపీ ద్వితీయ స్థానాన్ని సొంతం చేసుకోవడం మూడేళ్ల క్రితమే మొదలైంది. 2016 కూచ్‌బిహార్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ 28.5శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. సీపీఎం మద్దతుతో పోటీచేసిన వామపక్షాల అభ్యర్థి(ఫార్వర్డ్‌బ్లాక్)కి కేవలం 6.5 శాతం ఓట్లే పడ్డాయి. మొన్నటి ఏడు పట్టణాల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి 18 శాతం ఓట్లు లభించాయి. కరిగిపోతున్న సీపీఎం ఓటు 2009 లోక్‌సభ ఎన్నికల్లో మొదలైన సీపీఎం పతనం మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో పరాకాష్టకు చేరింది. 2009, 2011, 20014, 2016 వరుసగా లోక్‌సభ, అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సీపీఎంకు వరుసగా 33.1, 30, 22.9, 12.2 శాతం ఓట్లు దక్కాయి. కిందటేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె\స్తో లెఫ్ట్‌ఫ్రంట్ సీట్ల సర్దుబాటు చేసుకుంది. 148 సీట్లకు పోటీచేసిన సీపీఎంకు 26 సీట్లు రాగా, 92 సీట్లలో పోటీపడిన కాంగ్రెస్‌కు 44 స్థానాలు లభించడం విశేషం. మోదీపై మమత వైఖరిలో మార్పు! ప్రధాని నరేంద్రమోదీతో తనకేమీ పేచీ లేదని, గొడవంతా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతోనేనని ఆదివారం కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో మమత వ్యాఖ్యానించడం ఆమె వైఖరిలో మార్పునకు సూచికగా కనిపిస్తోంది. ‘పార్టీ అధ్యక్షుడు(షా) ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యంచేసుకోవడం దేశంలో నియంతృత్వ వాతావరణానికి చిహ్నం’అంటూ ఆమె ప్రధానిని వదలి ఆయన పార్టీని దుయ్యబట్టారు. బెంగాల్ జనాభాలో 27 శాతం ముస్లింలు (యూపీలో కన్నా ఎక్కువ) ఉండడం, మూడు జిల్లాల్లో మెజారిటీ వారిదే కావడం, నాలుగు జిల్లాల జనాభాలో ముస్లింలు నాలుగోవంతు దాటడం, బంగ్దాదేశ్ సరిహద్దు పొడవునా ఉన్న జిల్లాల్లో మైనారిటీల్లో కనిపిస్తున్న దూకుడు కూడా బీజేపీ బలోపేతానికి కారణాలుగా చెప్పవచ్చు. ఆరేళ్లు దాటిన తృణమూల్ పాలనలో ఆరెసెస్ శాఖలు 475 నుంచి 1680కి పెరిగాయి. ముస్లింలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న కొన్ని జిల్లాల్లో ఇటీవల మతఘర్షణలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో 2018లో జరిగే పంచాయతీ ఎన్నికలు బీజేపీ ఇంకే మేరకు బలపడినదీ సూచిస్తాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
పురపాలికల్లో తృణమూల్ హవా
రెండో స్థానంలో బీజేపీ కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో జరిగిన పురపాలక సంఘ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘన విజయం సాధించింది. ఎన్నికలు నిర్వహించిన మొత్తం ఏడు పురపాలక సంఘాలనూ టీఎంసీ కైవసం చేసుకుంది. ఏడు మున్సిపాలిటీల్లోనూ కలిపి మొత్తం 148 వార్డులకు ఆగస్టు 13న పోలింగ్ జరిగింది. గురువారం ఫలితాలు వెలువడగా టీఎంసీ 140 వార్డుల్లో గెలుపొందింది. వామపక్షాలను కాదని ఈసారి బీజేపీ ఆరు స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలవడం గమనా ర్హం. సీపీఎం, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. వామపక్ష కూటమిలోని ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఒక వార్డులో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని హల్దియా, పశ్చిమ బుర్ద్వాన్ జిల్లాలోని దుర్గాపూర్, కూపర్స్ క్యాంప్‌లలో అన్ని వార్డుల్లోనూ టీఎంసీ అభ్యర్థులే గెలుపొందారు. నాలుగు పురపాలక సంఘాల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేకపోయింది. కాగా ఎన్నికల్లో టీఎంసీ తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. టీఎంసీ ప్రజలను బెదిరించి, భయపెట్టినా తాము రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నామని బీజేపీ నాయకుడొకరు అన్నారు. ఎన్నికలు నియంతృత్వంగా సాగాయనీ, పోలింగ్ జరిగిన రోజునే ఎన్నికలను రద్దు చేయాల్సిందిగా తాము కోరామనీ, ఇది నిజమైన ప్రజాతీర్పు కాదని కాంగ్రెస్ పేర్కొంది. -
తృణమూల్ కార్యాలయానికి నిప్పు
డార్జిలింగ్: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పంటించారు. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రంకోసం 35 రోజులుగా వీరు సమ్మె చేస్తుండడం తెలిసిందే. కర్సెంగీ ప్రాంతంలోని రాజరాజేశ్వరీ హాల్లో మంటలు రేగిన మరుసటిరోజే ఆందోళనకారులు తృణమూల్ పార్టీ కార్యాలయానికి నిప్పంటించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టంగానీ, గాయాలుగానీ కాలేదని పోలీసులు తెలిపారు. సంప్రదాయ నేపాలీ దుస్తులను ధరించి ప్రత్యేక గుర్ఖాలాండ్ రాష్ట్ర నినాదాలతో బుధవారం ఉదయం ర్యాలీ జరిపారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం రీబందోబస్తును ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కేవలం ఔషధ దుకాణాలు మినహా మిగతా అన్నింటినీ మూసివేశారు. -
డుమ్మా కొట్టిన తృణమూల్ కాంగ్రెస్!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టింది. వర్షాకాల సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు, ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరిపేందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరేందుకు మోదీ సర్కారు ఈ భేటీ నిర్వహించింది. ఈ భేటీలో ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్రమంత్రులు, పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. జీఎస్టీ సహా ప్రతిపక్షాలు లేవనెత్తుత్తే ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. 24 ఉత్తర పరగణాల జిల్లాలో మతఘర్షణలకు బీజేపీ కారణమని ఆరోపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి దూరంగా ఉంది. అయితే, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్వహించే అఖిలపక్ష భేటీకి తాము హాజరవుతామని తృణమూల్ స్పష్టం చేసింది. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు హాజరు కేంద్రం నిర్వహించిన అఖిలపక్షం భేటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలు, ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కృష్ణా జలాల పంపకాలు, చేనేత, చిన్నతరహా పరిశ్రమలకు జీఎస్టీ మినహాయింపు, ఫిరాయింపు నిరోధక చట్ట సవరణ తదితర అంశాలను వారు ప్రస్తావించారు. -
ప్లేటు ఫిరాయించిన బీజేపీ
డార్జిలింగ్: ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం డిమాండ్‌కు గత దశాబ్దం కాలంగా మద్దతిస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీ హఠాత్తుగా నేడు తన పంథాను ఎందుకు మార్చుకుంది? సీపీఎం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గూర్ఖాలాండ్ రాష్ట్రం కావలంటూ గొడవ చేసిన బీజేపీ ఎందుకు మౌనం వహించిందీ? గూర్ఖాలాండ్‌కు మద్దతిస్తూ డార్జిలింగ్ నుంచి గత రెండు పర్యాయాలు బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన విషయాన్ని కూడా ఎందుకు విస్మరిస్తోంది? నేడు కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉంది. గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటే చేతిలోని పనే. అయినా ప్రత్యేక రాష్ట్రం కోసం గూర్ఖాలాండ్ ప్రజలు విధ్వంసం సష్టిస్తున్నా కదలిక లేదు. పైగా ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని కోరేది లేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గియా మంగళవారం స్పష్టం చేశారు. అందుకు గూర్ఖాలాండ్ మీదుగా చొరబాటుదారులు వస్తారని చైనా బూచీని చూపెడుతున్నారు. ఓ రాష్ట్రంకన్నా జాతీయ సమగ్రతే ముఖ్యమంటూ కొంత పాట వినిపిస్తున్నారు. ఈ చైనా బూచీ ఇంతకు ముందు లేదా? ఎందుకు ఇప్పుడు కొత్తగా వచ్చింది? ఇదంతా రాజకీయం కాదా? పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ ఐక్య బెంగాల్ పేరిట మరింత బలపడేందుకు కషి చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రమంతటా ఒకే భాష ఉండాలనే ఉత్తర్వులతో నేపాలీ మాట్లాడే గూర్ఖాలాండ్ ప్రజలను రెచ్చగొట్టారు. తనమూల్ కాంగ్రెస్ పునాదులను పెకిలించి తన పార్టీని బలోపేతం చేసుకోవాలని గత కొంతకాలంటా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ దశలో గూర్ఖాలాండ్ డిమాండ్‌ను అంగీకరించినట్లయితే మిగతా పశ్చిమ బెంగాల్ ప్రజలను మొత్తం శత్రువులను చేసుకోవాల్సి వస్తుందన్న భయం. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటవడం వల్ల బీజేపీకి రాజకీయంగా కూడా ఒరిగేదేమీ లేదు. మహా అంటే గూర్ఖాలాండ్‌కు ఒక్క ఎంపీ సీటు లభిస్తుంది. అది కూడా పార్టీకి దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ‘గూర్ఖా జనముక్తి మోర్చా’ లాంటి పార్టీలే తన్నుకు పోతాయ్. బెంగాల్‌లోని 42 ఎంపీ సీట్లపై దష్టి పెట్టడమే మంచిదన్న దూరదష్టితో ఆలోచించి ప్లేటు ఫిరాయించింది. -
‘కాస్కోండి.. ఢిల్లీ మాదే.. చాలెంజ్’
కోల్‌కతా: బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతి సవాల్ విసిరారు. బీజేపీ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, ఢిల్లీని త్వరలోనే తమ పార్టీ ఖాతాలో వేసుకుంటామంటూ ప్రతినభూనారు. తమ పార్టీని భయపెట్టాలని అనుకుంటుందని, అలాంటిది ఎప్పటికి జరగదని అన్నారు. బీజేపీని చూస్తే తనకేం భయం కావడం లేదని, మా పార్టీని జైలులో పెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బెదిరించినంత మాత్రానా బెదిరిపోమని చెప్పారు. ఢిల్లీ పీఠాన్ని స్వాధీనం చేసుకోవడం ఖాయం అని అన్నారు. 2019నాటి ఎన్నికల సమయానికి టీఎంసీని కూకటి వేళ్లతో పెకలించాలని బెంగాల్ బీజేపీకి ఆదేశించారు. ఆ క్రమంలోనే టీఎంసీ మొత్తాన్ని జైలులో పెట్టే రోజుంటుందని వ్యాఖ్యానించారు. ఇందుకు ధీటుగా మమత శుక్రవారం అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే మీకు తెలుసు.. రానున్న రోజుల్లో టీఎంసీ ఢిల్లీని సొంతం చేసుకుంటుందని.. నన్ను ఎవరు చాలెంజ్ చేశారో వారి సవాల్‌ను స్వీకరిస్తున్నాను’ అని మమత చెప్పారు. ఢిల్లీ నుంచి వస్తున్నారు. అబద్ధాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బెంగాల్‌ను స్వాధీనం చేసుకోవాలన్న తొందరలో ఉన్నారు. గుజరాత్‌ను ఏలలేని వాళ్లు ఇప్పుడు బెంగాల్ కోసం వస్తున్నారు’ అంటూ ఆమె తీవ్రంగా మండిపడ్డారు. -
మోదీ రథాన్ని ఆపలేరు
తృణమూల్‌పై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సిలిగురి (పశ్చిమ బెంగాల్): మోదీ రథాన్ని ఆపే శక్తి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు లేదని.. బెంగాల్లో ‘కమలం వికసిస్తుంది’అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బెంగాల్‌కు వచ్చిన షా నక్సల్బరీలో స్థానిక కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ‘తృణమూల్ కాంగ్రెస్ మోదీజీ రథాన్ని ఆపగలనని అనుకుంటోంది, కానీ అది దాని తరం కాదు. ఇక్కడ ఎంత ఎక్కువగా మమ్మల్ని ఆపాలని ప్రయత్నిస్తే కమలం అంతలా వికసిస్తుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయి. ఇందుకు దేశ ప్రజలే సాక్ష్యం’అని షా అన్నారు. ఒకప్పుడు అభివృద్ధిలో ముందుండే బెంగాల్ ఇప్పుడు వెనకబడిందని, నిరుద్యోగం ప్రబలిందని షా పేర్కొన్నారు. తృణమూల్ ప్రభుత్వం మైనారిటీలను బుజ్జగిస్తోందని ఆయన ఆరోపించారు. మోదీ ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’నినాదాన్ని పేర్కొంటూ అభివృద్ధి దేశం నలుమూలలకూ చేరుతుందన్నారు. నక్సల్బరీ నుంచే అభివృద్ధి ప్రారంభం ‘నక్సలైట్లు హింసాత్మక కార్యక్రమాలు నక్సల్బరీ నుంచే ప్రారంభించారు. కానీ ప్రస్తుతం అభివృద్ధి, వికాసం ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. మోదీ నేతృత్వంలో బెంగాల్ త్వరలో అభివృద్ధి బాటలో నడు స్తుంది’ అని అమిత్ షా అన్నారు. 2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్న అమిత్ షా 15 రోజుల్లో 5 రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయను న్నారు. దీనిలోభాగంగా అమిత్‌షా ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వరసగా కార్యకర్తలతో భేటీ అయి, పార్టీని పటిష్టతకు వ్యూహ రచన చేయనున్నారు. -
దయచేసి ఆ పార్టీలో చేరకండి: సీఎం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎంత ప్రలోభపెట్టినా బీజేపీలో మాత్రం చేరవద్దంటూ ఆమె ప్రజలకు విన్నవించారు. బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెడుతుందని, గొడవలు సృష్టిస్తుందని, ప్రజలు ఒకర్నొకరు కొట్టుకునేలా చేస్తుందని, హింస రాజేస్తుందని మమత హెచ్చరించారు. 'ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు బీజేపీలో చేరకండి. బీజేపీ హిందూ మతాన్ని అగౌరవ పరుస్తోంది. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస బోధనలను బెంగాల్ ప్రజలు విశ్వసిస్తారు. వారు మతసహనాన్ని బోధించారు. బీజేపీ ప్రచారం చేసే హిందూ భావజాలాన్ని మనం అంగీకరించరాదు. వాళ్లు హిందువులు కాదు. హిందూయిజం పేరుతో మతాన్ని అగౌరవపరుస్తున్నారు. మతం పేరుతో ప్రజల మధ్య ఘర్షణ పెడుతున్నారు' అని మమత అన్నారు. -
తృణమూల్ ఎంపీలు, మంత్రులపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: నారద స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎంపీలు, పశ్చిమ బెంగాల్ మంత్రులతో పాటు ఓ ఐపీఎస్ అధికారిపై సీబీఐ కేసు నమో దు చేసింది. కుట్రపూరిత నేరం, అవినీతి తదితర సెక్షన్ల కింద రాజ్యసభ ఎంపీ ముకుల్ రాయ్, లోక్‌సభ సభ్యులు సుల్తాన్ అహ్మద్, సౌగతా రాయ్, కకోలీ ఘోష్ దస్తీదార్, అపురూప పొద్దర్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కేంద్రం చేస్తున్న రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ దుయ్యబట్టారు. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచాక లబ్ధి చేకూరుస్తామన్న తృణమూల్ నేతలు డబ్బులు పుచ్చుకుంటూ స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన సంగతి తెలిసిందే. -
మమత తల నరికితే 11 లక్షలు
బీజేవైఎం నేత యోగేశ్ వార్ష్నీ వివాదాస్పద ప్రకటన ► ఖండించిన రాజకీయ పార్టీలు.. పార్లమెంట్లో రభస ► యోగేశ్‌ను అరెస్ట్ చేయాలని పార్టీల డిమాండ్ ► అతనిపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ బెంగాల్ ప్రభుత్వానికి ఉంది: కేంద్రం అలీగఢ్: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తల నరికి తీసుకొస్తే రూ.11 లక్షలు నజరానా ఇస్తానని బీజేపీ యువజన విభాగం... భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) నాయకుడు యోగేశ్ వార్ష్నీ వివాదాస్పద ప్రకటన చేశారు. మంగళవారం పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని సూరీలో హనుమాన్ జయంతి సందర్భంగా బీజేవైఎం కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ర్యాలీలు, సభలపై పోలీసులు నిషేధం విధించారు. దీనిని బీజేవైఎం కార్యకర్తలు ఉల్లంఘించడంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. అయితే ర్యాలీపై పోలీసుల చర్యను నిరసిస్తూ.. యోగేశ్.. మమతా బెనర్జీ తలకు రూ.11 లక్షల వెల కట్టాడు. ‘‘మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజ లను చిత్రహింసలకు గురిచేస్తోంది. ఎవరైనా ఎర్ర చొక్కా.. ఎర్ర ప్యాంట్ ధరిస్తే వారిని పోలీసులు గొడ్డును బాదినట్టు బాదుతు న్నారు. నాకు అర్థం కావడం లేదు.. మమత ఇఫ్తార్ విందులు ఇస్తారు. ముస్లింల కోసం మాట్లాడతారు. నేను ఆమెను అడిగేది ఒక్కటే హిందువులు మనుషులు కాదా? వారిలో ఏమాత్రం మానవత్వం అనేది ఉన్నా ప్రజలను ఇలా చిత్రహింసలకు గురి చేయరు. ఎవరైనా మమత తల నరికి తెస్తే.. అతనికి రూ.11 లక్షలు బహుమతిగా ఇస్తా’’అని ప్రకటించారు. ఖండించిన రాజకీయ పార్టీలు.. యోగేశ్ ప్రకటనను పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు ఖండించారు. ఒక ముఖ్యమంత్రిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనాగరికమని మండిపడ్డారు. పార్లమెంట్‌లోనూ దీనిపై దుమారం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ నిరసనకు దిగారు. తక్షణం యోగేశ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశానికి బీజేపీ దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. యోగేశ్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం.. యోగేశ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని ప్రకటించింది. పార్లమెంట్లో రభస.. రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన టీఎంసీ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్.. మతం ప్రాతిపదికగా బెంగాల్లో విధ్వంసం సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రిని భూతంలా చూపే ప్రయత్నాన్ని ప్రభుత్వం, పార్లమెంట్ ఖండించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఈ అంశంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్... బెంగాల్ ప్రభుత్వం అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాగేనా మహిళలకు రక్షణ కల్పించేది.. ఈ విషయంపై సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు జయాబచ్చన్ స్పందిస్తూ.. మహిళలు దాడులను, వేధింపులను ఎదుర్కొంటుంటే.. ప్రభుత్వం ఆవులను రక్షించడంలో బిజీగా ఉందని ఎద్దేవా చేశారు. మహిళలు తమకు రక్షణ లేదని భావిస్తున్న తరుణంలో ఒక మహిళా ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని, మహిళలకు రక్షణ కల్పించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ.. ఇది చాలా తీవ్రమైన అంశమని, బీజేపీ ఈ ఘటనను ఖండించడం మాత్రమే కాక.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, లెఫ్ట్, ఎస్పీ తదితర పార్టీలు కూడా తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపాయి. -
బెంగాల్ వీధుల్లో కొత్త రామాయణం
కోల్‌కతా: శ్రీరామ నవమి వేళ పశ్చిమ బెంగాల్ వీధుల్లో కొత్త రామాయణం దర్శనం ఇచ్చింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోటాపోటీగా రామ నవమి వేడుకలు జరిపించారు. అయితే, శ్రీరాముడికి ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంతుడికి మధ్య పోటీ పెట్టినట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించారు. బీజేపీ పార్టీ నేతలు శ్రీరామ నవమి ఉత్సవం నిర్వహించగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఒక్క హనుమంతుడికి మాత్రమే పండుగ నిర్వహించారు. రెండు పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చారు. శ్రీ రామ్ అంటూ వారు, జై హనుమాన్ అంటూ వీరు చూస్తున్నవాళ్లంతా ఔరా అనుకునేలా ఈ వేడుకలు జరిపారు. బీజేపీ నిర్వహించే వేడుకల్లో ఆరెస్సెస్ కూడా తోడై, వారి కార్యకర్తలు కూడా చేరి వీధుల్లో కాషాయ జెండాలతో బారులు తీరి నినాదాలు చేస్తుండగా.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ప్రత్యేకంగా ఆయా నివాసాల నుంచి పలువురుని తీసుకొచ్చి పలు చోట్ల హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. దీంతో ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా పెద్ద మొత్తంలో భద్రతను మోహరించారు. హిందూ సాంప్రదాయ ఆయుధాలతో ఎస్పీ నివాసం ముందు నుంచే పెద్ద మొత్తంలో ర్యాలీ ప్రారంభించారు. భారీ ఎత్తున నినాదాలు చేస్తూ టాపాసులు కాలుస్తూ రంగులు చల్లుకుంటూ చిందులేస్తూ సందడి చేశారు. దీనిపై పోలీసులు అడ్డు చెప్పగా మొహర్రం రోజున ముస్లింలు ఆయుధాలతో జరుపుకోవడం లేదా మేం చేస్తే తప్పేమిటంటూ 24వ పరగాణాల బీజేపీ అధ్యక్షుడు శంకర్ ఛటర్జీ అన్నారు. -
నారద సీఈవో సంచలన ఆరోపణలు
కోల్ కతా: నారద స్టింగ్ ఆపరేషన్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని న్యాయస్థానాలు ఆదేశించిన నేపథ్యంలో ఆ సంస్థ న్యూస్ సీఈవో మాథ్యూ శామ్యూల్ పోలీసులను ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడా ఆమెకు చుక్కెదురైన విషయం తెలసిందే. మార్చి 17న కోల్ కతా హైకోర్టు స్టింగ్ ఆపరేషన్‌పై ప్రాథమికంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పటి నుంచీ తృణముల్ కాంగ్రెస్ నేతల నుంచి తనకు, తన కుటుంబానికి బెదిరింపులు మొదలయ్యాయని.. తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో శామ్యూల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఫ్యామిలీ కూడా తమకు రక్షణ కల్పించాలని కోరుతూ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటుగా ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన జర్నలిస్టులకు వేధింపులు, బెదిరింపులు అధికమయ్యాయని, ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. నారదా స్టింగ్ ఆపరేషన్‌లో మొదటి వ్యక్తిని తానేనని, తనపై అనవసరంగా కేసులు నమోదుచేసే యత్నం జరుగుతోందని ఆరోపించారు. తద్వారా తనను ఉద్యోగం నుంచి తప్పించాలన్నది ప్రభుత్వం చర్యేనని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సంస్థ ఎవరిపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిందో.. కేవలం వారి నుంచి తనకు, తన ఉద్యోగులకు ప్రాణహాని ఉందన్నారు. స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన వారిలో అప్పటి, ప్రస్తుత మంత్రులు, సీనియర్ నేతలు ఉండటంతో ప్రభుత్వం ఆ న్యూస్ మీడియా జర్నలిస్టులపై వేధింపు చర్యలు చేపట్టిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు తృణముల్ కాంగ్రెస్ నేతలు ముడుపులు తీసుకుంటూ నారద న్యూస్ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. గతేడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలను ‘నారదన్యూస్.కామ్’లో ప్రసారమయ్యాయి. అయినా ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించింది. 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తిచేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోల్ కతా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా మమతకు చుక్కెదురైంది. -
మోదీపై వ్యక్తిగత దాడులొద్దు!
పార్టీ ఎంపీలకు టీఎంసీ అధినేత్రి సూచన పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు కలిగిన ఇబ్బందులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కాస్తా స్వరాన్ని తగ్గించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయవద్దని పార్టీ ఎంపీలకు ఆమె సూచించారు. పెద్దనోట్ల రద్దును ఆమె ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా.. మోదీ ప్రభుత్వం వెనుకకు తగ్గని విషయం తెలిసిందే. నోట్లరద్దుకు నిరసనగా బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించాలని ఆమె పార్టీ ఎంపీలకు సూచించారు. అయితే, ఈ నిరసన ప్రదర్శన విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రధాని మోదీపై వ్యక్తిగత దాడులుగానీ, నిందాపూర్వక వ్యాఖ్యలుగానీ చేయకూడదని ఆమె సూచించారు. ప్రధానిని తాను సంబోధించినట్టు.. మోదీ బాబు అని సంబోధించవద్దని ఆమె టీఎంసీ ఎంపీలకు స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దు తర్వాత మమతా బెనర్జీ, నరేంద్రమోదీ మధ్య స్నేహసంబంధాలు దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత మమతతోపాటు ఆమె పార్టీ ఎంపీలు కూడా మోదీపై వ్యక్తిగత దూషణలకు దిగారు. నిందాపూర్వక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పలు కుంభకోణాల్లో టీఎంసీ ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడం కూడా మోదీ సర్కారుపై మమత కోపాన్ని పెంచింది. ఈ పరిణామాలతో ప్రస్తుతం బెంగాల్లో బీజేపీ-టీఎంసీ బద్ధవిరోధులుగా పరస్పర రాజకీయ దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. -
‘పార్లమెంటు’ను సాగనివ్వండి
అఖిలపక్ష భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: అభిప్రాయ భేదాలెన్ని ఉన్నప్పటికీ పార్లమెంటు సమావేశాలను జరగనివ్వాలని.. ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా విపక్షాలు చేపట్టిన ఆందోళనల వల్ల శీతాకాల పార్లమెంటు సమావేశాలు వృథా అయిన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాలను ఫలప్రదం చేసేందుకు ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ మినహా అన్ని ప్రధాన పార్టీలు హాజరైన ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పార్టీల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను ఎన్నికల వరకే పరిమితం చేయాలని కోరారు. చిట్‌ఫండ్ కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో తమ ఎంపీలను అరెస్టు చేసినందుకు, నోట్ల రద్దుకు నిరసనగా తృణమూల్ ఈ సమావేశానికి గైర్హాజరైంది. నోట్ల రద్దుకు నిరసనగా బడ్జెట్ సమావేశాల్లో మొదటి రెండు రోజులు తాము గైర్హాజరు కానున్నట్లు లోక్‌సభలో తృణమూల్ చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీ చెప్పారు. సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ప్రధాని కోరారని ఆయన తెలిపారు. దీనికి అన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిపై ప్రభావం చూపేందుకే ముందస్తుగా బడ్జెట్ సమావేశాలు పెట్టారన్న విపక్షాల ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు. దీనిపై సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం ఇప్పటికే తీర్పునిచ్చాయని అన్నారు. అందరికీ ప్రయోజనకరంగా ఉండేలా, దేశం అభివృద్ధి చెందేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముందస్తు సమావేశాలు సరికాదు: ఆజాద్ సమావేశానికి ముందు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలు ముందుకు జరపడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇదే పరిస్థితి 2012లో తలెత్తినపుడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున యూపీఏ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసిందని గుర్తుచేశారు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రా లకు సంబంధించి బడ్జెట్లో వరాలు ప్రకటిం చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రెండో దశ బడ్జెట్ సమావేశాలకు ముందు కూడా మరో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నోట్ల రద్దుపై చర్చ సాగాలి: ఏచూరి పెద్దనోట్ల రద్దుపై తొలి దశ బడ్జెట్ సమావేశాల్లోనే రెండు రోజులపాటు చర్చ సాగించాలని ప్రభుత్వాన్ని తాము కోరినట్లు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ పెట్టడం అశాస్త్రీయమని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ సమావేశాల్లోనే పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. -
టీఎంసీ కార్యాలయంలో కాల్పులు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా మరో ముగ్గురు గాయపడినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్ పూర్‌లోగల టీఎంసీ కార్యాలయంలో గుర్తు తెలియని సాయుధులు ఈ కాల్పులకు తెగబడినట్లు సమాచారం. నిందితులను గుర్తించాల్సి ఉంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి మధ్య తీవ్ర స్థాయిలో బెంగాల్లో కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఇరు వర్గాలపై పరస్పరం దాడులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో బీజేపీ నేత ఇంటిపై టీఎంసీకి చెందిన వ్యక్తులు బాంబు దాడులకు దిగడంతోపాటు పరస్పర ఘర్షణలకు దిగి గాయపరుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టీఎంసీ కార్యాలయంలో కాల్పులు జరగడం కలకలాన్ని రేపుతోంది. -
ఆ గూండాలు మా ఇంటిపై దాడి చేశారు: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో బుధవారం ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేసి.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శ్రేణుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కోల్‌కతాలోని తన నివాసంపై టీఎంసీ గూండాలు దాడి చేశారని, తన తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిపై ఇలా దాడికి దిగడం సిగ్గుచేటు అని ఆయన ధ్వజమెత్తారు. కోల్‌కతా కైలాశ్ బోస్ ప్రాంతంలోని తన ఇంటిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న టీఎంసీ మద్దతుదారుల వీడియోను ఆయన ట్వీట్ చేశారు. రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ స్కాంలో ఇద్దరు టీఎంసీ ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడంతో ఇది రాజకీయ కక్షసాధింపేనంటూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళన దిగిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ-టీఎంసీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 'విషాదం ఏమిటంటే నేను కేంద్రమంత్రిని. నాకు ఎక్కడైనా పూర్తి భద్రత లభిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న నిరుపేద బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల పరిస్థితి దారుణంగా ఉంది. వారిని చితకబాదుతున్నారు. బీజేపీ జెండాలను కాల్చేస్తున్నారు. ఓ వృద్ధురాలి ఇంటిపై బాంబు వేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బెంగాల్ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది' అని సుప్రియో అన్నారు. TMC Goons trying 2 break into my Apartment in Kailash Bose Street where my MumDad are staying• How shameful is this -
'ముందు వాళ్లింట్లో బ్లాక్ మనీ వెతుక్కోవాలి'
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై సీపీఎం నిప్పులు చెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయినప్పటి నుంచి తొలిసారి బహిరంగంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై మాజీ ముఖ్యమంత్రి, సీపీఏం సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లధనంపై మాట్లాడే నైతిక హక్కు అసలు టీఎంసీకి లేదని అన్నారు. ఆ పార్టీ మొత్తం సామాజిక వ్యతిరేక శక్తులతో నిండి ఉందని, వారిలో ఒకరే నేడు అరెస్టయ్యారని ఆయన టీఎంసీ నేత సుదీప్ అరెస్టుపై వ్యాఖ్యానించారు. 'టీఎంసీ టాప్ టూ బాటమ్ అవినీతే. మమతా ప్రభుత్వం నిండా సామాజిక వ్యతిరేక శక్తులే ఉన్నారు. వారిలో ఒకరు నేడు అరెస్టయ్యారు. అందుకే ఆ పార్టీకి నల్లధనం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. నల్లడబ్బు ఎక్కడో ఉందని చెప్పడం మానేసి ఆ పార్టీ నేతలు వాళ్లింట్లో ఉన్న నల్లడబ్బును వెతుక్కుంటే మంచిది. ఇద్దరు ఎంపీలను అరెస్టు చేసినంత మాత్రానా బెనర్జీ అంతగా అరవాల్సిన పనిలేదు. వారంతా కుంభకోణాల్లో ఉన్నవారని అందరికీ తెలుసు. సీబీఐ కూడా చిన్నవారిని వదిలేసి పెద్దవారిని అరెస్టు చేయాల్సింది' అంటూ పరోక్షంగా మమతనుద్దేశించి భట్టాచార్య వ్యాఖ్యానించారు. -
మోదీ.. మీకిదే నా చాలెంజ్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలను వారం వ్యవధిలో సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ప్రధాని నరేంద్ర మోదీ సీబీఐని అడ్డుపెట్టుకుని తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ్, తపస్ పాల్లను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆమె అభివర్ణించారు. 'మోదీకి ఛాలెంజ్ చేస్తున్నా, మా పార్టీ నేతలను అరెస్ట్ చేయిస్తే పారిపోతారని మీరు భావిస్తున్నారేమో, మేం భయపడేది లేదు' అని మమత అన్నారు. పార్టీ ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కోల్‌కతాలో బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని మమత చెప్పారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రిజర్వ్ బ్యాంకు కార్యాలయం ఎదుట ఈ నెల 9, 10, 11 తేదీల్లో నిరసన తెలియజేస్తామన్నారు. అలాగే 10 రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపడతామని తెలిపారు. మంగళవారం రోజ్ వాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 30న ఇదే కేసులో టీఎంసీకే చెందిన ఎంపీ తపస్ పాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
తృణమూల్ ఎంపీ అరెస్ట్
కోల్‌కతా: రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కాంలో తృణ మూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ తపస్ పాల్‌ను శుక్రవారం సీబీఐ అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్ లో చిట్‌ఫండ్ స్కాంలను విచారణ చేస్తున్న సీబీఐ రోజ్ వ్యాలీ స్కామ్‌పై ఈ నెల 27న పాల్‌కు సమన్లు జారీ చేసింది. సాల్ట్ లేక్‌లోని తమ కార్యాలయానికి శుక్రవారం హాజరుకావాలని ఆదేశించిన సీబీఐ విచారణ కోసం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. తామడిగిన ఏ ప్రశ్నకూ ఎంపీ తపస్ సరైన సమాధానాలు ఇవ్వలేదని సీబీఐ అధికారి తెలిపారు. రోజ్ వ్యాలీ కంపెనీల్లోని ఒక దానికి డైరెక్టర్‌గా నియామకం కావడం, బెంగాలీ సినీ పరిశ్రమలో పెట్టుబడులు వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని అన్నారు. విచారణకు ఎంపీని భువనేశ్వర్‌కు తీసుకెళ్తున్నామన్నారు. నన్ను, మా ఎంపీలందర్నీ అరెస్టు చేయండి: మమత కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తనను, తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందర్నీ అరెస్టు చేయాలని సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. తమ పార్టీ ఎంపీలందరినీ అరెస్టు చేసినా బెదరబోనన్నారు. నోట్ల రద్దును వ్యతిరేకించినందుకు తమ పార్టీ, నేతలపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ‘రాజకీయ దురాగతాల’కు పాల్పడుతోందని ఆ పార్టీ ప్రతినిధి డెరెక్ ఓబ్రియాన్ ఆరోపించారు. -
గవర్నర్, సీఎం మమత మధ్య వార్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని టోల్‌ప్లాజాల వద్ద సైనిక బలగాల మోహరింపు విషయంలో సీఎం మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలను ఆ రాష్ట్ర గవర్నర్ కేశ్రీనాథ్ త్రిపాఠి పరోక్షంగా తోసిపుచ్చారు. బాధ్యతాయుతమైన ఆర్మీ వంటి వ్యవస్థలపై ఆరోపణలు చేసేముందు జాగ్రత్త వహించాల్సిన అవసరముందని ఆయన సూచించారు. అయితే, గవర్నర్ వ్యాఖ్యలను సీఎం మమత తప్పుబట్టారు. కేంద్రం గొంతునే గవర్నర్ వినిపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ‘కేంద్రం గొంతునే గవర్నర్ వినిపిస్తున్నారు. దాదాపు ఎనిమిది రోజులుగా ఆయన నగరంలో లేరు. ప్రటకనలు చేసేముందు నిజానిజాలు తెలుసుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం’ అని మమత మీడియాతో అన్నారు. టోల్‌ప్లాజాల వద్ద అనూహ్యంగా సైన్యాన్ని మోహరించడంతో దీనిపై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సైన్యం మోహరింపును వ్యతిరేకిస్తూ.. వెంటనే బలగాలను వెనుకకు పంపాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజ్‌భవన్ ముందు తృణమూల్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. శనివారం గవర్నర్‌ను కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇంతలో గవర్నర్ త్రిపాఠి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
దీదీని హతమార్చేందుకు కుట్ర!
-
దీదీని హతమార్చేందుకు కుట్ర!
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు విమానం కోల్‌కతా విమానాశ్రయం వద్ద దాదాపు అరగంట పాటు ల్యాండింగ్ కాకుండా గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంది. దాంతో.. తమ దీదీని చంపేందుకు కుట్ర జరుగుతోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పెద్దనోట్ల రద్దుకు నిరసనగా బిహార్‌లో నిర్వహించిన ర్యాలీ అనంతరం రాత్రి 7.35 గంటల సమయంలో మమత అక్కడ విమానం ఎక్కారు. వాస్తవానికి అది 6.35కే రావాల్సి ఉంది. తర్వాత సాంకేతిక కారణాల వల్ల విమానం అరగంట పాటు గాల్లోనే తిరుగుతూ 9 గంటల సమయంలో ల్యాండయిందని విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఏ విమానాశ్రయంలో అయినా ఇలాంటి ఘటనలు మామూలేనని అన్నారు. ఏటీసీ నుంచి అనుమతి రాకపోవడం వల్లనే విమానం కిందకు దిగలేదని, ఇదంతా మమతను హతమార్చేందుకు జరగుతున్న కుట్రేనని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హమీక్ ఆరోపించారు. ఆయన కూడా మమతతో పాటే విమానంలో వచ్చారు. తాము ఐదు నిమిషాల్లో కోల్‌కతా వస్తామని పైలట్ 180 కిలోమీటర్ల ముందునుంచే చెబుతున్నా.. అరగంట ఆలస్యంగా విమానం కిందకు దిగాల్సి వచ్చిందని ఆయన అన్నారు. దీంతో మమతా బెనర్జీతోపాటు ఇతర ప్రయాణికులకు కూడా తీవ్ర అసౌకర్యం కలిగిందన్నారు. విమానంలో ఇంధనం అయిపోతోందని పైలట్ చెప్పినా.. ఏటీసీ మాత్రం విమానాన్ని గాల్లోనే ఉంచేసిందని ఆయన ఆరోపించారు. ఇది ముఖ్యమంత్రిని చంపడానికి చేసిన కుట్ర తప్ప మరొకటి కానే కాదని.. పెద్దనోట్ల రద్దును గట్టిగా ప్రశ్నించడమే కాక, ప్రజా ఉద్యమంలో భాగంగా ఆమె దేశవ్యాప్తంగా తిరుగుతున్నందునే ఆమెను చంపాలనుకుంటున్నారని హకీమ్ అన్నారు. -
నోట్ల రద్దుపై నేడు దేశ వ్యాప్తంగా నిరసనలు
-
నోట్ల రద్దుపై నేడు నిరసనలు
భారత్ బంద్ కాదు: కాంగ్రెస్ - ఆర్థికమంత్రిగా ఉండుంటే రాజీనామా చేసేవాణ్ని: చిదంబరం న్యూఢిల్లీ/చెన్నై: కేంద్రం తీసుకున్న రూ. 500, రూ. వెరుు్య నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం దేశవ్యాప్తంగా విపక్షాలు ‘జన్ ఆక్రోశ్ దినం’ పేరుతో నిరసనలను చేపడతున్నాయి. విపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయని గతంలో వార్తలు వచ్చినప్పటికీ..బంద్ కాదనీ, కేవలం నిరసనలేనని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ స్పష్టం చేసింది. తాము నిరసనలు చేపడుతుంటే, బీజేపీ వాటిని ‘భారత్ బంద్’ అంటూ ప్రజలను తప్పదోవ పట్టిస్తోందని ఆరోపించింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సోమవారం నాటి నిరసనల్లో పాల్గొననున్నారుు. కాంగ్రెస్ మిత్రపక్షమైన జేడీయూ మాత్రం నోట్ల రద్దును సమర్థిస్తూ నిరసనలు చేపట్టడం లేదు. పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. రాజకీయ లబ్ధి కోసమే: కాంగ్రెస్ ‘నోట్ల రద్దు సరైన సన్నద్ధత లేకుండా రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయం’ అని, ‘నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్య’గా ఇది బాగా అమ్ముడవుతోందని కాంగ్రెస్ విమర్శించింది. ‘ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోడానికి 3 కారణాలు ఉన్నారుు. అవి 1.ప్రచారం 2.ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం 3. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడంలో విఫలమవ్వడం’ అని కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేశ్ వివరించారు. అవసరమైనన్ని నోట్లను ముద్రించి చలామణిలోకి తీసుకురావడానికి 250 రోజుల దాకా పడుతుందన్నారు. వద్దని చెప్పే వాణ్ని: చిదంబరం మరో కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ తానే గనుక ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుు్య ఉండి.. నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనంటూ ప్రధాన మంత్రి బలవంత పెడితే రాజీనామా చేసి ఉండేవాడినని అన్నారు. ‘నేను ఆర్థిక మంత్రిగా ఉండి..నోట్లను రద్దు చేసే నిర్ణయాన్ని ప్రధాని నాకు చెప్పి ఉంటే ఆయనకు సరైన లెక్కలు వివరించి ఈ నిర్ణయం అమలు చేయకూడదని సలహా ఇచ్చి ఉండే వాడిని. అరుునా అది తన నిర్ణయమనీ, అమలు చేయాల్సిందేనని ప్రధాని బలవంత పెడితే రాజీనామా చేసి ఉండే వాడిని’ అని చిదంబరం అన్నారు. ఎడారిలో పంట పండించడమే: ఏఐఏడీఎంకే దేశంలోని నల్ల ధనాన్ని ఏరివేయడానికి ప్రభుత్వం తీసుకున్న నోట్ల ఉపసంహరణ నిర్ణయం..అడుగున రంధ్రాలు పడిన బక్కెట్‌తో నీళ్లను తోడి ఎడారిలో పంట పండించాలనే చెత్త నిర్ణయం వంటిదని ఏఐఏడీఎంకే తీవ్రంగా విమర్శించింది. మరోవైపు నగదు రహిత లావాదేవీలకు ప్రజలు మళ్లాలన్న మోదీ సలహాను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్రంగా విమర్శించింది. -
నోట్ల రద్దు అతిపెద్ద తప్పుడు ప్రయోగం
-
అతిపెద్ద తప్పుడు ప్రయోగం
- నోట్లరద్దు విషయంలో ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు - పార్లమెంటు ఆవరణలో నిరసనకు 200 మంది విపక్ష ఎంపీలు హాజరు న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. బుధవారం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో.. దాదాపు 200 మంది ఎంపీలు (కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం) హాజరై.. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘కేంద్రం నిర్ణయం ఆర్థికంగా అతిపెద్ద తప్పుడు ప్రయోగం. దీనిపై మోదీ ఆర్థిక మంత్రి సహా ఎవరినీ సంప్రదించలేదు. ఈ స్కాంపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలి’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇంతపెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, ఉద్దేశపూర్వకంగానే కొందరు పారిశ్రామికవేత్తలకు లీక్ చేశారో పార్లమెంటులో చెప్పాలన్నారు. కోట్ల మంది ఇబ్బందులు ఎందుకు పడాలన్నారు. ‘పార్లమెంటుకు ప్రధాని హాజరై.. చర్చ మొత్తం విని జవాబుచెప్పాలి. దీని వెనక స్కాం ఉంది. అందుకే జేపీసీ వేయాలి’ అని విపక్షాలు డిమాండ్ చేశారుు. ప్రజాసమస్యలను పార్లమెంటులో ప్రతిబింబిస్తామని, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనన్నారుు. దేశానికి భద్రత కరువైంది: మమత అటు జంతర్‌మంతర్ వద్ద తృణమూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మోదీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ చేతుల్లో దేశానికి భద్రత లేదన్నారు. ‘హిట్లర్ కంటే ప్రధాని అహంభావి. స్విస్ అకౌంట్లున్నవారిని ముట్టుకోకుండా సామాన్యులను ఇబ్బంది పెడతారా?’ అని మండిపడ్డారు.ర్యాలీకి ఆప్, జేడీయూ, ఎస్పీ, ఎన్సీపీ మద్దతు ప్రకటించారుు. -
ఉపఎన్నికల్లో ‘అధికార’ హవా
-
ఉపఎన్నికల్లో ‘అధికార’ హవా
రెండేసి లోక్‌సభ స్థానాల్లో గెలిచిన బీజేపీ, టీఎంసీ న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నవంబర్ 19న జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు ఆధిపత్యం నిలుపుకున్నాయి. ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. నాలుగు లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ రెండు, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) రెండు సీట్లు గెలిచాయి. పశ్చిమబెంగాల్లోని కూచ్‌బెహర్, తమ్లుక్ లోక్‌సభ, మోంటేశ్వర్ అసెంబ్లీ స్థానాలను టీఎంసీ కై వసం చేసుకుంది. అస్సాంలోని లఖిన్‌పూర్ లోక్‌సభ, భైతలంగ్సో అసెంబ్లీ.. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ లోక్‌సభ, నేపనగర్ అసెంబ్లీ స్థానాలను అధికార బీజేపీ చేజిక్కించుకుంది. తమిళనాడులోని అరవకురిచ్చి, తంజావూరు, తిరుప్పరగుండ్రం అసెంబ్లీ స్థానాల్లో ఏఐఏడీఎంకే గెలిచింది. పుదుచ్చేరిలోని నెల్లితోపులో కాంగ్రెస్ పార్టీ సీఎం వి.నారాయణ స్వామిని విజయం వరించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని హయూలియాంగ్ అసెంబ్లీ స్థానంలో.. ఆత్మహత్య చేసుకున్న మాజీ సీఎం కలికో పుల్ భార్య డసాంగ్లు బీజేపీ తరపున గెలిచారు. త్రిపురలోనూ అధికార సీపీఎం బర్జల, ఖొవాయ్ అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. బీజేపీకి ఓటేసిన వారికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
నోట్ల రద్దుపై తృణముల్ ఆందోళన
-
పార్టీ చీఫ్ సహా ఎమ్మెల్యేందరూ జంప్
ఇంఫాల్: తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం మణిపూర్ టీఎంసీ చీఫ్ శ్యాంకుమార్ సహా ఆ రాష్ట్రంలో పార్టీకి చెందిన మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఎంసీ జాతీయ నేతలు తమను నిర్లక్ష్యంగా చూస్తున్నరని, పార్టీని వీడాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు శ్యాంకుమార్ చెప్పారు. మణిపూర్ సమస్యలను తృణమాల్ కాంగ్రెస్ ఎంపీలు పట్టించుకోవడం లేదని, ఈ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని కోరితే నిరాకరించారని ఆరోపించారు. 2012 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. కాగా గతేడాది మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత ఒక ఎమ్మెల్యేను సభకు అనుమతించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యుంఖమ్ ఎరబొట్ ఇటీవల బీజేపీలో చేరారు. తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు చేరడంతో కాంగ్రెస్ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. -
మాజీ మంత్రి బెయిల్‌పై విడుదల
కోల్ కతా: పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ స్కాంలో నిందితుడిగా ఉన్న రాష్ట్ర మాజీ రవాణశాఖ మంత్రి మదన్ మిత్రా జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 21 నెలలుగా అలీపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మిత్రా బెయిల్ పై విడుదలై భవానీపూర్ పోలీస్ స్ఘేషన్ పరిధిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుగా రూ.30 లక్షల షరతుతో పాటు ఆయన పాస్ పోర్టును స్వాధీనం చేసుకుని మదన్ మిత్రాకు అలీపూర్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూర్ చేసింది. తృణముల్ కాంగ్రెస్ సీనియర్ నేత మదన్ మిద్రా తన నివాసానికి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 'గత రెండేళ్లుగా దుర్గామాత ఉత్సవాలను చూడలేకపోయాను. ఈ ఏడాది నాకు ఆ సమస్య లేదు. తనకు, తన కుటుంబసభ్యులకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది' అని మాజీ మంత్రి తెలిపారు. నవంబర్ 23వరకూ తనకు బెయిల్ మంజూరయిందని కాలమే తన నిర్దోషిత్వాన్ని నిరూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి పూర్తి సమయం కుటుంబంతో గడుపుతానని, చట్టాలను ఉల్లంఘించే యత్నం చేయనన్నారు. -
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రమోషన్
కోల్‌కతా: మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 7వ జాతీయ హోదా కలిగిన పార్టీగా ఆవిర్భవించింది. జాతీయ ఎన్నికల కమిషన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం జాతీయ పార్టీ హోదా కల్పించింది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు జాతీయ పార్టీ హోదాలో కొనసాగుతున్నాయి. జాతీయ పార్టీ హోదా రావడంతో దేశంలో ఎక్కడి నుంచి అయినా తృణమూల్ కాంగ్రెస్ తమ పార్టీ గుర్తుతో పోటీ చేసే అవకాశం ఉంటుంది. జాతీయ పార్టీ హోదా ఎందుకు ఇచ్చారంటే.. కనీసం 11 మంది ఎంపీలు లోక్‌సభలో ఉండి, అది కూడా కనీసం 3 రాష్ట్రాల నుంచి ఉంటేనే పార్టీకి జాతీయ హోదా వస్తుంది. లేదా.. కనీసం నాలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో 6 శాతం ఓట్లు పొంది ఉండాలి, కనీసం 4 లోక్‌సభ స్థానాలు సాధించి ఉండాలి. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీ హోదా ఉన్నా కూడా జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్లలో రాష్ట్రస్థాయి పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ గుర్తింపుపొందింది. జాతీయ హోదా రావడానికి కావల్సిన చివరి నిబంధనకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అర్హత సాధించడంతో జాతీయ ఎన్నికల కమిషన్ ఈ అవకాశం కల్పించింది. -
ర్యాలీ చూస్తుంటే.. ఇంతలోనే బుల్లెట్ దిగింది..!
టీఎంసీ నేత హమిదుల్ రహమాన్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించనందుకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఏం జరిగిందో తెలియదు, ఇంటి ముందు నిల్చుని ర్యాలీ చూస్తున్న 13 ఏళ్ల బాలుడికి బుల్లెట్ దిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చోప్రా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా హమిదుల్ రహమాన్ ఎన్నికయ్యారు. ఇస్లాంపుర ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా కొందరు వ్యక్తులు తుపాకీ మోత మోగించారు. దాదాపు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటి ముందు నిల్చుని ర్యాలీ చూస్తున్న గర్ అలీకి బుల్లెట్ తగిలింది. ఇక అంతే ఆ బాలుడి తల్లిదండ్రులు ఉరుకులు పరుగులు పెట్టారు. అలీని ఇస్లాంపూర్ సబ్ డివిజన్ హాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. ఆ బాలుడికి బుల్లెట్ దిగిన విషయం నిజమే, అయితే ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
27న మమత ప్రమాణం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా మమతా బెనర్జీ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మమత పేరును పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పార్థ ఛటర్జీ ప్రతిపాదించగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సమర్ధించారు. అనంతరం ఆమె గవర్నర్ త్రిపాఠిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. మే 20 చాలా ప్రాముఖ్యమైందని, 2011న ఇదే రోజు తృణమూల్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిందని ఆమె విలేకర్లతో చెప్పారు. ఈ నెల 27న సీఎంగా మమత ప్రమాణస్వీకారం చేయనున్నారు. తృణమూల్ విజయానికి పంచమంత్రం కోల్‌కతా: బెంగాల్లో తృణమూల్‌కు అఖండ విజయం సులువుగా దక్కలేదు. 2011లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి మమతా బెనర్జీ బెంగాల్ ముఖచిత్రాన్ని మార్చేందుకు శ్రమించారు. కేంద్రంతో పోట్లాడినా, ఆవేశంగా మాట్లాడినా సంక్షేమాన్ని మరవలేదు. కులసమీకరణాల్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. ఆదాయాన్ని రెట్టింపు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించారు. 1. అభివృద్ధి.. గత ఐదేళ్లలో బెంగాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరిగింది.ఉపాధి హామీ పథకంలో పూర్తి స్థాయిలో అమలైంది. బెంగాల్లో గ్రామీణ ప్రజలు ఈ పథకంలో ఎక్కువ లబ్ది పొందారు. ఈ పథకంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాల్లో బెంగాల్ గత నాలుగేళ్లుగా దేశంలో మొదటి స్థానాల్లో నిలిచింది.గత నాలుగేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన రాష్ట్రాల్లో బెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. చిన్న గ్రామాలు సైతం తారురోడ్లతో మెరిసిపోయాయి. విద్యపై కూడా మమత అధికంగా దృష్టిపెట్టారు. సబుజ్ సతి పథకంలో 9 నుంచి 12 తరగ తి విద్యార్థినులకు సైకిళ్లు అందచేశారు. ఆర్థికంగా వెనబడ్డ అమ్మాయిలకు కన్యశ్రీ పథకంలో ఏడాదికి రూ. 750 నుంచి రూ.25 వేల వరకూ ఉపకార వేతనాలు అందచేశారు. 2. సామాజిక సమీకరణాలు.. ఈ సారి బెంగాల్లో కుల సమీకరణాలకు మమత తెరలేపారు. అతిపెద్ద దళిత కులం మతువాతో పాటు నమశుద్రలు, బెంగాల్ ముస్లింల మద్దతును మమత అభ్యర్థించారు. సీపీఎం ఓటు బ్యాంకైన గ్రామీణ బెంగాలీ ముస్లింల్ని మమత తనవైపుకు తిప్పుకున్నారు. 3. లెఫ్ట్ భావజాలం (పేదల పక్షపాతి) లెఫ్ట్ పార్టీలు అనుసరించిన పేదల సంక్షేమ మంత్రాన్నే మమత అనుసరించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించి లెఫ్ట్‌ను మట్టికరిపించి మమత అధికారంలోకి వచ్చాక ఆ విధానాన్నే అనుసరించారు. 2012లో ప్రత్యేక ఆర్థిక మండలి పాలసీని రద్దు చేశారు. 4. సంక్షేమం ఖర్చు మూడింతలు పెంపు మమత అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఆదాయాన్ని రెట్టింపు చేశాయి. అప్పులు తగ్గి రాష్ట్రం ఆర్థికంగా మెరుగుపడింది. దీంతో పేదల కోసం మమత మరింత ఖర్చుపెట్టారు. సంక్షేమ ఖర్చును మూడింతలు పెంచారు. సీపీఎంకు పట్టున్న పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించారు. 5. నామమాత్రంగా కూటమి ప్రభావం సీపీఎం, కాంగ్రెస్‌ల్లో హైకమాండ్ సంస్కృతి ఆ కూటమిని దారుణంగా దెబ్బతీసింది. క్షేత్రస్థాయి పరిస్థితులపై సరైన అవగాహన లేని నేతలు కూడా నిర్ణయాలు తీసుకోవడం కూటమి ప్రభావాన్ని నామమాత్రం చేసింది. దీంతో ఓటర్లను ఈ కూటమి ప్రభావితం చేయలేకపోయింది.