మాజీ మంత్రి బెయిల్పై విడుదల
కోల్ కతా: పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారదా చిట్ఫండ్ స్కాంలో నిందితుడిగా ఉన్న రాష్ట్ర మాజీ రవాణశాఖ మంత్రి మదన్ మిత్రా జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 21 నెలలుగా అలీపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మిత్రా బెయిల్ పై విడుదలై భవానీపూర్ పోలీస్ స్ఘేషన్ పరిధిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుగా రూ.30 లక్షల షరతుతో పాటు ఆయన పాస్ పోర్టును స్వాధీనం చేసుకుని మదన్ మిత్రాకు అలీపూర్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూర్ చేసింది.
తృణముల్ కాంగ్రెస్ సీనియర్ నేత మదన్ మిద్రా తన నివాసానికి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 'గత రెండేళ్లుగా దుర్గామాత ఉత్సవాలను చూడలేకపోయాను. ఈ ఏడాది నాకు ఆ సమస్య లేదు. తనకు, తన కుటుంబసభ్యులకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది' అని మాజీ మంత్రి తెలిపారు. నవంబర్ 23వరకూ తనకు బెయిల్ మంజూరయిందని కాలమే తన నిర్దోషిత్వాన్ని నిరూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి పూర్తి సమయం కుటుంబంతో గడుపుతానని, చట్టాలను ఉల్లంఘించే యత్నం చేయనన్నారు.