West Bengal minister
-
పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్ అరెస్టు
కోల్‌కతా: రేషన్ సరుకుల కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో పశ్చిమ బెంగాల్ అటవీ మంత్రి, టీఎంసీ నేత జ్యోతిప్రియో మల్లిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 18 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మల్లిక్‌ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. మల్లిక్‌ను కోర్టులో ప్రవేశపెట్టి, తదుపరి విచారణ కోసం కస్టడీ కోరుతామని చెప్పారు. 18 గంటలపాటు ప్రశ్నించినా నోరువిప్పలేదని, విచారణకు సహకరించలేదని అన్నారు. కాగా, మంత్రి మల్లిక్‌ను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలినట్లు తెలిసింది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. న్యాయస్థానం ఆయనను 10 రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
మమతా బెనర్జీకి తీరని లోటు.. బెంగాల్ కేబినెట్ మంత్రి ఆకస్మిక మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, కేబినెట్ మంత్రి సుబ్రతా సాహా కన్నుమూశారు. ముర్షిదాబాద్ మెడికల్ కాళాశాలలో గురువారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన మంత్రిని ఆసుపత్రికి తరలించగా కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కేబినెట్ మంత్రి సుబ్రతా సాహా మృతి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీరని లోటుగా పార్టీ వర్గాలు తెలిపాయి. సుబ్రతా సాహా ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. ముర్షిదాబాద్‌లోని సగర్దిఘి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు గెలుపొందారు. 69 ఏళ్ల సాహాకు ఇటీవలే పిత్తాశయ ఆపరేషన్ జరిగింది. అనారోగ్యం నుంచి కోలుకును బుధవారం ఉదయమే సొంత జిల్లాకు తిరిగివచ్చారు మంత్రి. కానీ, రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన బెర్హంపోర్లోని ముర్షిదాబాద్ మెడికల్ కలేజీలో చేర్పించారు. గురువారం ఉదయం మరణించారు. మమత బెనర్జీ దిగ్భ్రాంతి.. మంత్రి సుబ్రతా సాహా ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ‘సుబ్రతాబాబుతో దీర్ఘకాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన రాజకీయ, సామాజిక సేవలు గుర్తుండిపోతాయి. సుబ్రతా సాహా మృతితో రాజకీయ ప్రపంచంలో లోటు ఏర్పడింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని సామాజిక మాద్యమాల్లో రాసుకొచ్చారు దీదీ. ముర్షిదాబాద్ జిల్లా నుంటి 2011లో టీఎంసీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు సుబ్రతా సాహా. సగర్డిఘి నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. తొలిసారి కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత టీఎంసీలో చేరారు. ఇదీ చదవండి: మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ.. టీఎంసీ సీనియర్ నేత రాజీనామా! -
‘డాన్‌లా ప్రవర్తిస్తున్నారు’.. ఆ మంత్రి వైఖరిపై హైకోర్టుకు ఈడీ!
కోల్‌కతా: స్కూల్ టీచర్ల నియామకాల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ ఆసుపత్రిలో ఒక డాన్‌లాగా ప్రవర్తిస్తున్నాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కలకత్తా హైకోర్టుకు తెలియజేసింది. చట్టం నుంచి తప్పించుకొనేందుకు అనారోగ్యం అంటూ నాటకాలు ఆడుతున్నాడని ఆక్షేపించింది. పార్థా ఛటర్జీని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బిబేక్ చౌదరి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. నిందితుడు అధికార బలం ఉన్న వ్యక్తి అని, కోల్‌కతా ఆసుపత్రిలో మహారాజులాగా చెలరేగిపోతున్నాడని విన్నవించారు. ఆయనను ఎస్ఎస్కేఎం హాస్పిటల్ నుంచి ఎయిమ్స్‌కు తరలిస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. పార్థా చటర్జీని ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు సోమవారం ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకెళ్లాలని ఈడీని ఆదేశించారు. ఇదే కుంభకోణంలో అరెస్టయిన పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఆమెను ఒక్కరోజుపాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బెంగాల్ మంత్రి పార్థా చటర్జీని ఈడీ అధికారులు ఈ నెల 23న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అలాగే కోల్‌కతాలో అర్పితా ముఖర్జీ నివాసంలో రూ.21 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో బెంగాల్ మంత్రి అరెస్ట్.. అసలు సినిమా ముందుంది: బీజేపీ -
మంత్రిగారి సన్నిహితురాలి ఇంట్లో నోట్ల కట్టలు! అర్పిత ఎవరంటే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED శుక్రవారం నిర్వహించిన దాడులు చర్చనీయాంశమయ్యాయి. ఆ రాష్ట్ర మంత్రికి బాగా దగ్గరైన ఓ మహిళ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడడం సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రిగా మంత్రి పార్థా ఛటర్జీకి ఆప్తురాలైన అర్పిత ముఖర్జీ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో సుమారు 20 కోట్ల విలువైన నగదు బయటపడింది. బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ నియామకాలు, ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డులో అవకతవకల నేరాలకు సంబంధించిన డబ్బుగా అనుమానిస్తున్నారు అధికారులు. బ్యాంక్ అధికారుల సాయంతో ఈ డబ్బును లెక్కించారు ఈడీ అధికారులు. మొత్తం 500, 2వేల నోట్ల కట్టలే ఉన్నాయి. ఇరవైకి పైగా మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అర్పితతో పాటు విద్యాశాఖ మంత్రి పరేష్ అధికారే, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య.. తదితరుల ఇళ్లలో ఈడీ దాడులు కొనసాగాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు బయటకు వచ్చాయి. అర్పిత ఎవరంటే.. అర్పిత ముఖర్జీని మంత్రి పార్థా ఛటర్జీకి బాగా దగ్గరైన మనిషిగా చెబుతోంది ఈడీ. బెంగాలీ, ఒడియా, తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ ఆమె నటించారు. బెంగాలీలో ఒకటి రెండు పెద్ద చిత్రాల్లోనూ ఆమె కనిపించారు. ఆమె ఫేస్బుక్ బయోలో మల్టీ టాలెంటెడ్ అని ఉంది. పార్థా ఛటర్జీ నిర్వహించే దుర్గా పూజల కమిటీ ‘నాట్కల ఉదయన్ సంఘ’కు ఆమె ప్రచారకర్తగానూ వ్యవహరించారు. కోల్‌కతాలో భారీగా దుర్గా పూజలు నిర్వహించే కమిటీ ఇది. ఇక వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పార్థా ఛటర్జీపై పలు ఆరోపణలు ఉన్నాయి. స్కూల్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో టీచర్ల నియామకాలకు సంబంధించి ఆయన అవినీతికి పాల్పడినట్లు ఆరోపణపై దర్యాప్తు కొనసాగుతోంది కూడా. ఇదిలా ఉంటే.. ఇదంతా బీజేపీ నడిపిస్తున్న డ్రామా అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అమరవీరుల దినోత్సవం ర్యాలీ తర్వాతే ఈ దాడులు నిర్వహించడంతో కుట్రపూరిత చర్యగా అభివర్ణిస్తోంది. అయితే బీజేపీ మాత్రం తమ తప్పులు బయటపడడంతో టీఎంసీ ఇలాంటి ఆరోపణలకు దిగుతోందని అంటోంది. చదవండి: తవ్వేకొద్దీ అవినీతి.. కట్టలు కట్టలుగా డబ్బులు,కళ్లు తిరిగేలా బంగారం! -
బెంగాల్ మంత్రికి వీసా నిరాకరణ
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ గ్రంథాలయ శాఖ మంత్రి, జమాత్ ఉలేమా హింద్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిక్ అల్లాహ్ చౌదరికి బంగ్లాదేశ్ వీసా నిరాకరించింది. వీసా నిరాకరణకు గల కారణం వెల్లడికాలేదు. ఈ విషయంపై సిద్ధిక్ చౌదరి మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 26 నుంచి 31ల మధ్య ఐదు రోజుల బంగ్లాదేశ్ పర్యటనకు ఈ నెల 12వ తారీఖున వీసా కోసం దరఖాస్తు చేశాను. అక్కడ ఓ సదస్సులో పాల్గొనమని నాకు ఆహ్వానం వచ్చింది. నాకూ కొన్ని వ్యక్తిగత పనులున్నాయి. వీసా ఇస్తున్నట్టుగానీ, తిరస్కరిస్తున్నట్టు గానీ నాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. వీసా కోసం అన్ని పత్రాలను సమర్పించాను. అవసరమైన అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద తీసుకున్నాను. అయినా వీసా రాకపోవడంతో ఇప్పటికే బుక్‌చేసుకున్న టికెట్‌ను క్యాన్సిల్ చేసేశా’నని వెల్లడించారు. ఈ విషయంపై బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్‌ను వివరణ కోరగా, ఆయన అందుబాటులోకి రాలేదు. ఆ కార్యాలయ సిబ్బంది కూడా అందుబాటులోకి లేకుండా పోయారు. ఈ విషయంపై తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. వీసా రాకపోవడంపై మేము నిజంగా ఆశ్చర్యపోతున్నాం. ఒక మంత్రికి బంగ్లాదేశ్ వీసా నిరాకరించడంపై మేము షాక్‌కు గురయ్యామని వ్యాఖ్యానించారు. సిద్ధిక్ చౌదరి పశ్చిమ బెంగాల్లో ముస్లిం సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల నాయకులలో ఒకరు. కాగా, సిద్ధిక్ చౌదరి ఇటీవల వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, దేశవ్యాప్త ఎన్నార్సీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం. -
మాజీ మంత్రి బెయిల్‌పై విడుదల
కోల్ కతా: పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారదా చిట్‌ఫండ్ స్కాంలో నిందితుడిగా ఉన్న రాష్ట్ర మాజీ రవాణశాఖ మంత్రి మదన్ మిత్రా జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 21 నెలలుగా అలీపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మిత్రా బెయిల్ పై విడుదలై భవానీపూర్ పోలీస్ స్ఘేషన్ పరిధిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుగా రూ.30 లక్షల షరతుతో పాటు ఆయన పాస్ పోర్టును స్వాధీనం చేసుకుని మదన్ మిత్రాకు అలీపూర్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూర్ చేసింది. తృణముల్ కాంగ్రెస్ సీనియర్ నేత మదన్ మిద్రా తన నివాసానికి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 'గత రెండేళ్లుగా దుర్గామాత ఉత్సవాలను చూడలేకపోయాను. ఈ ఏడాది నాకు ఆ సమస్య లేదు. తనకు, తన కుటుంబసభ్యులకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది' అని మాజీ మంత్రి తెలిపారు. నవంబర్ 23వరకూ తనకు బెయిల్ మంజూరయిందని కాలమే తన నిర్దోషిత్వాన్ని నిరూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి పూర్తి సమయం కుటుంబంతో గడుపుతానని, చట్టాలను ఉల్లంఘించే యత్నం చేయనన్నారు. -
శారద స్కాంలో బెంగాల్ మంత్రి అరెస్ట్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారద చిట్‌ఫండ్ స్కాంలో సీబీఐ శుక్రవారం ఆ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మదన్ మిత్రాను అరెస్ట్ చేసింది. సీబీఐ ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. శారద స్కాంలో సీబీఐ ఇంతకుముందు పలువురు నాయకులను, ఉన్నతాధికారులను అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారిలో పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ రజత్ మజుందర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మాజీ నాయకుడు అసీఫ్ ఖాన్, మాజీ ఎంపీ కునాల్ ఘోష్ ఉన్నారు. ఈ కేసులో సీబీఐ పలువురు ఎంపీలను ప్రశ్నించింది. -
బెంగాల్ మంత్రికి చావుదెబ్బలు
రాంపుర్హత్: పశ్చిమ బెంగాల్ మంత్రి నూర్ ఆలం చౌధురీని ఆదివారం కొందరు దుండగులు ఓ భూవివాద ం విషయంలో దారుణంగా కొట్టి గాయపరిచారు. అనంతరం ఓ కాలేజీలో ఉదయం 11.30 నుంచి ఏకంగా 8 గంటల పాటు నిర్బంధించారు. బీర్భూమ్ జిల్లా రాంపుర్హత్ శివారులోని కాలేజీలో ఉదయం జరిగిన భేటీకి మంత్రి రాగానే భవనం వెలుపల అల్లరిమూక చేరింది. చౌధురీ ట్రస్టుకు చెందిన దోఖాల్బాటీ గ్రామంలో ఉన్న ఆ కాలేజీ స్థలంలో కొన్నేళ్ల కిందట నిర్మించిన వివాదాస్పద మసీదును కూలగొడుతున్నామని కాలేజీ యాజమాన్యం మైక్రోఫోనులో ప్రకటించింది. దీంతో అల్లరిమూక రెచ్చిపోయి మంత్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి కాలేజీలోని ఓ గదిలో నిర్బంధించింది. ఆందోళనకారులు కాలేజీని, రోడ్డును ముట్టడి ంచడంతో మంత్రిని ఆస్పత్రికి తరలించలేకపోయామని జిల్లా ఎస్పీ చెప్పారు.