బెంగాల్ మంత్రికి చావుదెబ్బలు | West Bengal minister beaten up, held hostage by mob | Sakshi
Sakshi News home page

బెంగాల్ మంత్రికి చావుదెబ్బలు

Published Mon, Sep 2 2013 3:58 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM

West Bengal minister beaten up, held hostage by mob

రాంపుర్హత్: పశ్చిమ బెంగాల్ మంత్రి నూర్ ఆలం చౌధురీని ఆదివారం కొందరు దుండగులు ఓ భూవివాద ం విషయంలో దారుణంగా కొట్టి గాయపరిచారు. అనంతరం ఓ కాలేజీలో ఉదయం 11.30 నుంచి ఏకంగా 8 గంటల పాటు నిర్బంధించారు. బీర్భూమ్ జిల్లా రాంపుర్హత్ శివారులోని కాలేజీలో ఉదయం జరిగిన భేటీకి మంత్రి రాగానే భవనం వెలుపల అల్లరిమూక చేరింది. చౌధురీ ట్రస్టుకు చెందిన దోఖాల్‌బాటీ గ్రామంలో ఉన్న ఆ కాలేజీ స్థలంలో కొన్నేళ్ల కిందట నిర్మించిన వివాదాస్పద మసీదును కూలగొడుతున్నామని కాలేజీ యాజమాన్యం మైక్రోఫోనులో ప్రకటించింది. దీంతో అల్లరిమూక రెచ్చిపోయి మంత్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి కాలేజీలోని ఓ గదిలో నిర్బంధించింది. ఆందోళనకారులు  కాలేజీని, రోడ్డును ముట్టడి ంచడంతో మంత్రిని ఆస్పత్రికి తరలించలేకపోయామని జిల్లా ఎస్పీ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement