శారద స్కాంలో బెంగాల్ మంత్రి అరెస్ట్ | West Bengal transport minister Madan Mitra arrested by CBI | Sakshi
Sakshi News home page

శారద స్కాంలో బెంగాల్ మంత్రి అరెస్ట్

Dec 12 2014 4:41 PM | Updated on Aug 20 2018 4:27 PM

శారద స్కాంలో బెంగాల్ మంత్రి అరెస్ట్ - Sakshi

శారద స్కాంలో బెంగాల్ మంత్రి అరెస్ట్

పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారద చిట్ఫండ్ స్కాంలో సీబీఐ శుక్రవారం ఆ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మదన్ మిత్రాను అరెస్ట్ చేసింది.

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారద చిట్ఫండ్ స్కాంలో సీబీఐ శుక్రవారం ఆ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మదన్ మిత్రాను అరెస్ట్ చేసింది. సీబీఐ ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు.

శారద స్కాంలో సీబీఐ ఇంతకుముందు పలువురు నాయకులను, ఉన్నతాధికారులను అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారిలో పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ రజత్ మజుందర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మాజీ నాయకుడు అసీఫ్ ఖాన్, మాజీ ఎంపీ కునాల్ ఘోష్ ఉన్నారు. ఈ కేసులో సీబీఐ పలువురు ఎంపీలను ప్రశ్నించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement