Madan Mitra
-
ఐదుగురు భర్తలకు ఒకే భార్య.. టీఎంసీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం..
కోల్కతా: నోటి దురుసుతో తరచూ వార్తల్లో నిలిచే టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారు. భారత సంస్కృతిలో ఒక భార్యను ఐదుగురు పురుషులు పంచుకోవచ్చని వ్యాఖ్యానించారు. మహాభారతంలో ద్రౌపదిని పరోక్షంగా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలుపై కేంద్ర విద్యా శాఖ బృందం సమీక్ష నిర్వహించింది. ఇందులో అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఐదుగురు వంట సిబ్బందికి కేటాయించిన నిధులను ప్రభుత్వం ఏడుగురికి సమానంగా ఇస్తోందని కనిపెట్టారు. దీనిపై వ్యంగ్యంగా స్పందించిన మదన్ మిత్రా.. భారత సంస్కృతిలో ఐదుగురు కలిసి ఒకే భార్యను పంచుకుంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తుందో తెలిపేందుకు మదన్ వ్యాఖ్యలే నిదర్శనం అని కమలం పార్టీ ఎమ్మెల్యే, నటి అగ్నిమిత్ర పాల్ ధ్వజమెత్తారు. టీఎంసీ నాయకులు అందుకే అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఫైర్ అయ్యారు. సొంత టీఎంసీ పార్టీ కూడా మదన్ మిత్రా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సూచించారు. మిత్రా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత ఇతిహాసాల గురించి తప్పుగా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదన్నారు. చదవండి: వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే! -
నారదా స్కామ్: తృణమూల్ నేతను విచారించిన సీబీఐ
సాక్షి,కోల్కతాః నారదా టేపుల కుంభకోణంలో తృణమూల్ నేత, బెంగాల్ మాజీ మంత్రి మదన్ మిత్రాను బుధవారం సీబీఐ ప్రశ్నించింది. మిత్రా గతంలో శారదా కుంభకోణంలో చాలా నెలలు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. నారదా స్కామ్లో ఆయన పాత్రపై విచారణ జరుపుతున్నట్టు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కుంభకోణంలో మిత్రాతో పాటు పలువురు తృణమూల్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. నారదా న్యూస్ సీఈవో మ్యాథ్యూ శ్యామ్యూల్స్ వ్యాపారవేత్తగా పరిచయమై తృణమూల్ నేతలకు ముడుపులు ముట్టచెప్పగా వారు అంగీకరించినట్టు టేపుల్లో రికార్డ్ అయిన విషయం తెలిసిందే. కాగా, మదన్ మిత్రా గతంలో మమతా బెనర్జీ తొలి క్యాబినెట్లో క్రీడలు, రవాణా మంత్రిగా పనిచేశారు. నారదా టేపుల వ్యవహారాన్ని సీబీఐతో పాటు ఈడీ కూడా విచారిస్తోంది. -
మాజీ మంత్రి బెయిల్పై విడుదల
కోల్ కతా: పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారదా చిట్ఫండ్ స్కాంలో నిందితుడిగా ఉన్న రాష్ట్ర మాజీ రవాణశాఖ మంత్రి మదన్ మిత్రా జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 21 నెలలుగా అలీపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మిత్రా బెయిల్ పై విడుదలై భవానీపూర్ పోలీస్ స్ఘేషన్ పరిధిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుగా రూ.30 లక్షల షరతుతో పాటు ఆయన పాస్ పోర్టును స్వాధీనం చేసుకుని మదన్ మిత్రాకు అలీపూర్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూర్ చేసింది. తృణముల్ కాంగ్రెస్ సీనియర్ నేత మదన్ మిద్రా తన నివాసానికి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 'గత రెండేళ్లుగా దుర్గామాత ఉత్సవాలను చూడలేకపోయాను. ఈ ఏడాది నాకు ఆ సమస్య లేదు. తనకు, తన కుటుంబసభ్యులకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది' అని మాజీ మంత్రి తెలిపారు. నవంబర్ 23వరకూ తనకు బెయిల్ మంజూరయిందని కాలమే తన నిర్దోషిత్వాన్ని నిరూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి పూర్తి సమయం కుటుంబంతో గడుపుతానని, చట్టాలను ఉల్లంఘించే యత్నం చేయనన్నారు. -
మిత్రాకు మళ్లీ జైలు
కోల్ కతా: శారద ఛిట్ ఫండ్ కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి మదన్ మిత్రాకు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయనకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 30 వరకు పొడిగించింది. ఆయన విధించిన జ్యుడీషియల్ కస్టడీ శుక్రవారంతో ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ లభించకపోవడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు. కాగా మిత్రాను మంత్రి పదవికి అనర్హుడిగా ప్రకటించాలంటూ కలకత్తా హైకోర్టులో పిల్ దాఖలయింది. శారద ఛిట్ ఫండ్ కుంభకోణంతో సంబంధముందన్న ఆరోపణలతో డిసెంబర్ 12న మిత్రాను సీబీఐ అరెస్ట్ చేసింది. -
శారద స్కాంలో బెంగాల్ మంత్రి అరెస్ట్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల శారద చిట్ఫండ్ స్కాంలో సీబీఐ శుక్రవారం ఆ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మదన్ మిత్రాను అరెస్ట్ చేసింది. సీబీఐ ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. శారద స్కాంలో సీబీఐ ఇంతకుముందు పలువురు నాయకులను, ఉన్నతాధికారులను అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారిలో పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ రజత్ మజుందర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మాజీ నాయకుడు అసీఫ్ ఖాన్, మాజీ ఎంపీ కునాల్ ఘోష్ ఉన్నారు. ఈ కేసులో సీబీఐ పలువురు ఎంపీలను ప్రశ్నించింది.