నారదా స్కామ్: తృణమూల్ నేతను విచారించిన సీబీఐ
నారదా టేపుల కుంభకోణంలో తృణమూల్ నేత, బెంగాల్ మాజీ మంత్రి మదన్ మిత్రాను బుధవారం సీబీఐ ప్రశ్నించింది.
సాక్షి,కోల్‌కతాః నారదా టేపుల కుంభకోణంలో తృణమూల్ నేత, బెంగాల్ మాజీ మంత్రి మదన్ మిత్రాను బుధవారం సీబీఐ ప్రశ్నించింది. మిత్రా గతంలో శారదా కుంభకోణంలో చాలా నెలలు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. నారదా స్కామ్‌లో ఆయన పాత్రపై విచారణ జరుపుతున్నట్టు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ కుంభకోణంలో మిత్రాతో పాటు పలువురు తృణమూల్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. నారదా న్యూస్ సీఈవో మ్యాథ్యూ శ్యామ్యూల్స్ వ్యాపారవేత్తగా పరిచయమై తృణమూల్ నేతలకు ముడుపులు ముట్టచెప్పగా వారు అంగీకరించినట్టు టేపుల్లో రికార్డ్ అయిన విషయం తెలిసిందే. కాగా, మదన్ మిత్రా గతంలో మమతా బెనర్జీ తొలి క్యాబినెట్‌లో క్రీడలు, రవాణా మంత్రిగా పనిచేశారు. నారదా టేపుల వ్యవహారాన్ని సీబీఐతో పాటు ఈడీ కూడా విచారిస్తోంది.