సాక్షి, ఢిల్లీ : ‘నారద స్కాం’లో ప్రమేయమున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుత ఎంపీలు సౌగతా రాయ్, దస్తిదార్, ప్రసూన్ బెనర్జీలను మరియు స్కాం జరిగినప్పుడు ఎంపీగా ఉండి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న సుభెందు అధికారిని విచారించడానికి లోక్‌సభ స్పీకర్‌ను సిబిఐ అనుమతి కోరింది. ఈ విషయంపై సిబిఐ అధికారి మాట్లాడుతూ.. స్పీకర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే పై నలుగురు వ్యక్తులను నిందితులుగా పేర్కొంటూ నారద స్కాంలో మొదటి చార్జిషీట్‌ను దాఖలు చేస్తామని తెలిపారు.
2014లో నారద వార్తా చానెల్ సీఈవో మాథ్యూ సామ్యూల్ ఒక స్టింగ్ ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో పై నలుగురు వ్యక్తులు లంచం తీసుకున్నట్లు రికార్డైంది. ఇదే తర్వాత ‘నారద స్కాం’గా పేరు గాంచింది. కాగా, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పార్టీ పశ్చిమ బెంగాల్‌లోఈ స్కాంలను ప్రధానంగా ప్రస్తావించింది. నారద, శారద (చిట్‌ఫండ్ కుంభకోణం)లను ప్రచారంగా మలచి అసలు ఖాతాయే లేని ఆ రాష్ట్రంలో 18 ఎంపీ సీట్లను గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment