Narada scam
-
Narada Sting Case: టీఎంసీ నేతలకు ఝలక్
కోల్‌కతా: నారద స్టింగ్ టేప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం ప్రత్యేక కోర్టుకు ఛార్జ్‌షీట్ సమర్పించింది. పశ్చిమ బెంగాల్ మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. ప్రత్యేక కోర్టు ఛార్జ్షీట్లోని నలుగురు టీఎంసీ నేతలకు సమన్లు జారీచేసింది. సెప్టెంబర్ 16హాజరు కావాలని పేర్కొంది. టీఎంసీ నేతలతో పాటు సస్పెండ్ చేయబడిన ఐపీఎస్ అధికారి ఎస్ఎంహెచ్ మీర్జాకు కూడా కోర్టు నోటీసు పంపింది. చదవండి: అమరవీరులను అవమానించడమే ముఖర్జీ, హకీమ్, మిత్రాకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ద్వారా సమన్లు అందజేయాలని కోర్టు ఆదేశించింది. మిగిలిన ఇద్దరికి నేరుగా వారి చిరునామాలకు సమన్లు పంపిస్తున్నామని పేర్కొంది. ఇక ఈ ఏడాది సీబీఐ ముఖర్జీ, హకీమ్, మిత్రా, సోవన్ ఛటర్జీలను అరెస్ట్ చేయగా.. వారికి మే నెలలో కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చదవండి: పనిచేస్తారా? తప్పుకుంటారా.. పార్టీ శ్రేణులకు కమల్ వార్నింగ్! తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అవినీతిని బయటపెట్టడం కోసం ‘నారద న్యూస్’ అనే న్యూస్ ఔట్లెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనినే నారద స్టింగ్ ఆపరేషన్ అంటారు. నారద న్యూస్ వ్యవస్థాపకుడు మాథ్యూ శామ్యూల్ 2014-2016 మధ్య కాలంలో దాదాపు 12 మంది టీఎంసీ నేతలపైనా, ఓ ఐపీఎస్ అధికారిపైనా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. 2014లో ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగినప్పటికీ, 2016లో ‘తెహల్కా’ ప్రచురించింది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలకు ముందు దీనిని వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
సీఎం మమతా బెనర్జీకి రూ.5,000 జరిమానా
కోల్‌కతా: నారద కుంభకోణం కేసులో ఇద్దరు మంత్రులు సహా తృణమూల్ కాంగ్రెస్ నాయకుల అరెస్ట్‌ను నిరసిస్తూ సీబీఐ కార్యాలయం ఎదుట నిరసనలకు సంబంధించి వాదనలు వినిపించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. సరైన సమయంలో అఫిడవిట్ దాఖలు చేయడంలో విఫలమైనందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రూ.5,000 జరిమానా విధించింది. నారద కేసులో తృణమూల్ కాంగ్రెస్ అఫిడవిట్లను రికార్డు చేయడానికి నిరాకరిస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టులో అఫిడవిట్ల దాఖలుకు అనుమతి కోరుతూ తాజాగా మరో పిటిషన్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, సరైన సమయంలో అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో కోర్టు జరిమానా విధించింది. -
నారద కేసు: టీఎంసీ నేతలకు ఊరట
కోల్‌కతా: నారద స్టింగ్ టేప్స్ కేసులో నలుగురు టీఎంసీ నేతలకు కలకత్తా హైకోర్టు శుక్రవారం తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. రూ.2 లక్షలు చొప్పున వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ఎలాంటి న్యూస్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని షరతు విధించింది. టీఎంసీ నేతలు ఫిర్హాద్ హకీమ్, మదన్ మిత్రా, సుబ్రత ముఖర్జీ, సోవన్ ఛటర్జీలను మే 17న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి వీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా వీరికి తాత్కాలిక బెయిల్ ఇచ్చిన కోర్టు.. నిబంధనలు ఉల్లఘింస్తే బెయిల్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇక కేసుకు సంబంధించి కోర్టుకు ఏమైనా అవసరం వస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దర్యాప్తులో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అవినీతిని బయటపెట్టడం కోసం ‘నారద న్యూస్’ అనే న్యూస్ ఔట్లెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనినే నారద స్టింగ్ ఆపరేషన్ అంటారు. నారద న్యూస్ వ్యవస్థాపకుడు మాథ్యూ శామ్యూల్ 2014-2016 మధ్య కాలంలో దాదాపు 12 మంది టీఎంసీ నేతలపైనా, ఓ ఐపీఎస్ అధికారిపైనా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంపెక్స్ కన్సల్టెన్సీ సొల్యూషన్స్ అనే సంస్థకు వ్యాపార ప్రయోజనాలు కల్పించేందుకు వీరు నగదును తీసుకుంటున్నట్లు వీడియోలో కనిపించారు. స్టింగ్ ఆపరేషన్ చేయడం కోసమే ఈ కల్పిత సంస్థను శామ్యూల్ సృష్టించారు. 2014లో ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగినప్పటికీ, 2016లో ‘తెహల్కా’ ప్రచురించింది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలకు ముందు దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడినవారిలో ముకుల్ రాయ్, సౌగత రాయ్, కకోలీ ఘోష్ దస్తిదార్, ప్రసూన్ బెనర్జీ, సువేందు అధికారి, అపరుప పొద్దార్, సుల్తాన్ అహ్మద్, మదన్ మిత్రా, సోవన్ ఛటర్జీ, సుబ్రత ముఖర్జీ, ఫిర్హాద్ హకీమ్, ఇక్బాల్ అహ్మద్, షంకు దేబ్ పాండా సహా ఐపీఎస్ అధికారి హెచ్ఎంఎస్ మీర్జా ఉన్నారు. చదవండి: నారద కేసును రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయాలి: సీబీఐ నారదా స్టింగ్ ఆపరేషన్: మంత్రులకు బెయిల్ -
మీరు అనుమతిస్తే మేం చర్యలు తీసుకుంటాం
సాక్షి, ఢిల్లీ : ‘నారద స్కాం’లో ప్రమేయమున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుత ఎంపీలు సౌగతా రాయ్, దస్తిదార్, ప్రసూన్ బెనర్జీలను మరియు స్కాం జరిగినప్పుడు ఎంపీగా ఉండి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న సుభెందు అధికారిని విచారించడానికి లోక్‌సభ స్పీకర్‌ను సిబిఐ అనుమతి కోరింది. ఈ విషయంపై సిబిఐ అధికారి మాట్లాడుతూ.. స్పీకర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే పై నలుగురు వ్యక్తులను నిందితులుగా పేర్కొంటూ నారద స్కాంలో మొదటి చార్జిషీట్‌ను దాఖలు చేస్తామని తెలిపారు. 2014లో నారద వార్తా చానెల్ సీఈవో మాథ్యూ సామ్యూల్ ఒక స్టింగ్ ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో పై నలుగురు వ్యక్తులు లంచం తీసుకున్నట్లు రికార్డైంది. ఇదే తర్వాత ‘నారద స్కాం’గా పేరు గాంచింది. కాగా, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పార్టీ పశ్చిమ బెంగాల్‌లోఈ స్కాంలను ప్రధానంగా ప్రస్తావించింది. నారద, శారద (చిట్‌ఫండ్ కుంభకోణం)లను ప్రచారంగా మలచి అసలు ఖాతాయే లేని ఆ రాష్ట్రంలో 18 ఎంపీ సీట్లను గెలుచుకుంది. -
నారదా స్కామ్: తృణమూల్ నేతను విచారించిన సీబీఐ
సాక్షి,కోల్‌కతాః నారదా టేపుల కుంభకోణంలో తృణమూల్ నేత, బెంగాల్ మాజీ మంత్రి మదన్ మిత్రాను బుధవారం సీబీఐ ప్రశ్నించింది. మిత్రా గతంలో శారదా కుంభకోణంలో చాలా నెలలు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. నారదా స్కామ్‌లో ఆయన పాత్రపై విచారణ జరుపుతున్నట్టు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కుంభకోణంలో మిత్రాతో పాటు పలువురు తృణమూల్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. నారదా న్యూస్ సీఈవో మ్యాథ్యూ శ్యామ్యూల్స్ వ్యాపారవేత్తగా పరిచయమై తృణమూల్ నేతలకు ముడుపులు ముట్టచెప్పగా వారు అంగీకరించినట్టు టేపుల్లో రికార్డ్ అయిన విషయం తెలిసిందే. కాగా, మదన్ మిత్రా గతంలో మమతా బెనర్జీ తొలి క్యాబినెట్లో క్రీడలు, రవాణా మంత్రిగా పనిచేశారు. నారదా టేపుల వ్యవహారాన్ని సీబీఐతో పాటు ఈడీ కూడా విచారిస్తోంది.