
మిత్రాకు మళ్లీ జైలు
కోల్ కతా: శారద ఛిట్ ఫండ్ కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి మదన్ మిత్రాకు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయనకు విధించిన జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 30 వరకు పొడిగించింది. ఆయన విధించిన జ్యుడీషియల్ కస్టడీ శుక్రవారంతో ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ లభించకపోవడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు.
కాగా మిత్రాను మంత్రి పదవికి అనర్హుడిగా ప్రకటించాలంటూ కలకత్తా హైకోర్టులో పిల్ దాఖలయింది. శారద ఛిట్ ఫండ్ కుంభకోణంతో సంబంధముందన్న ఆరోపణలతో డిసెంబర్ 12న మిత్రాను సీబీఐ అరెస్ట్ చేసింది.