‘శారదా’ స్కాం కేసులో సుప్రీం కీలక నిర్ణయం | Saradha chit-fund scam: Supreme Court refuses to entertain a plea filed | Sakshi
Sakshi News home page

‘శారదా’ స్కాం కేసులో సుప్రీం కీలక నిర్ణయం

Published Mon, Feb 11 2019 11:38 AM | Last Updated on Mon, Feb 11 2019 11:38 AM

Saradha chit-fund scam: Supreme Court refuses to entertain a plea filed - Sakshi

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. కాగా శారదా గ్రూప్‌ పేరుతో 200 ప్రయివేటు కంపెనీలు నడిపిన పొంజీ స్కీం దివాళా తీయడంతో కోటి 70 లక్షలమంది డిపాజిటర్ల బతుకులు రోడ్లమీద పడిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ప్రముఖులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలతో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. మరోవైపు  శారదా కుంభకోణంతో సంబంధమున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కునాల్‌ ఘోష్‌ కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement