ఏపీ హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. జస్టిస్ సీటీ రవి కుమార్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
‘ఏ హోదాలో ఉన్నాసరే, ఆ ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు/ కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని సంస్థలు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం వారిపై తీవ్ర అభియోగాలున్నాయి’అని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే ఇద్దరు కేంద్ర అధికారులపై అవినీతి ఆరోపణలకు సంబంధించి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1946 కింద సీబీఐకి గతంలో అనుమతిచ్చిందని, రాష్ట్రం వేరు పడినందున మళ్లీ అనుమతులు అవసరమన్న నిందితుల వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ వారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేసింది. దీనిని తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు వర్తించిన అన్ని చట్టాలు కొత్తగా ఏర్పాటైన రెండు రాష్ట్రాలకు యథాప్రకారం కొనసాగుతాయని తేలి్చచెప్పింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు తాజాగా ఎలాంటి అనుమతి అవసరం లేదని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment