state govt
-
ఆంగ్ల భాషా నైపుణ్యం తప్పనిసరి!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన యువతకు ఆంగ్లంలో సరైన నైపుణ్యం లేకపోవడం వారి పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. యువతలో భాషా నైపుణ్యాలు పెంపొందించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులు ఆంగ్లం, ఇతర విదేశీ భాషలపై పట్టుసాధించేలా అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఇటీవల ‘రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్య విస్తరణ’పేరిట విడుదల చేసిన నివేదికలో ఆంగ్ల భాష అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘అనేక రాష్ట్రాల్లో, స్థానిక పరిశ్రమలలో పనిచేసే నైపుణ్యం గల వ్యక్తులు, ఇతర మానవ వనరులు ప్రధానంగా రాష్ట్రం బయటి నుంచే వస్తున్నారు. ఈ ధోరణికి ముఖ్య కారణం స్థానిక యువతకు ఆంగ్ల భాషలో నైపుణ్యం తగినంతగా లేకపోవడమే. సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది. విద్యార్థుల ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, తద్వారా వారు రాష్ట్రంలోనే ఉంటూ జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడం అత్యవసరం’అని తన నివేదికలో పేర్కొంది. ముందున్న రెండు రాష్ట్రాలు ఆంగ్ల భాష అవసరాన్ని గుర్తించడంలో పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు ముందున్నాయని నివేదికలో పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం 2023లో బ్రిటిష్ కౌన్సిల్ సహకారంతో ఈ దిశగా ప్రయత్నాలను ప్రారంభించిందని తెలిపింది. ఆరు నెలల పాటు ఇంటెన్సివ్ 18–సెషన్ల కోర్సును నిర్వహించడం ద్వారా ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టిందని వివరించింది. దాదాపు 5వేల మంది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఈ పైలట్ ప్రాజెక్ట్‌తో లాభం కలిగిందని వెల్లడించింది. విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో అభివృధ్ధి చెందేందుకు విద్యార్థులకు అవసరమైన భాషా సామర్థ్యాలను పెంపొందించడంలో పంజాబ్ చొరను నీతిఆయోగ్ ప్రశంసించింది. అదేవిధంగా, కర్ణాటక ప్రభుత్వం 2024లో ప్రారంభించిన కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, భాషా నైపుణ్యాలను పెంచడం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేసింది. మైక్రోసాఫ్ట్ ఇండియాతో భాగస్వామ్యంతో ‘ఇంగ్లిష్ స్కిల్స్ ఫర్ యూత్’కార్యక్రమం ద్వారా 16 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో 5,795 మంది విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాభివృధ్ధికి తోడ్పాటునందిస్తోంది. ‘స్కాలర్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ టాలెంట్’కార్యక్రమం ద్వారా ఆరు విశ్వవిద్యాలయాల నుంచి అర్హులైన విద్యార్థులకు లండన్‌లోని విశ్వవిద్యాలయాలకు రెండు వారాల పాటు పంపి, వారితో అభ్యసించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆంగ్ల విద్యను ప్రోత్సహించిందని నీతిఆయోగ్ ప్రశంసించింది. -
కేంద్ర అధికారులపై కేసు నమోదుకు.. సీబీఐకి రాష్ట్రాల అనుమతి అవసరం లేదు
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. జస్టిస్ సీటీ రవి కుమార్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఏ హోదాలో ఉన్నాసరే, ఆ ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు/ కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని సంస్థలు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం వారిపై తీవ్ర అభియోగాలున్నాయి’అని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే ఇద్దరు కేంద్ర అధికారులపై అవినీతి ఆరోపణలకు సంబంధించి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1946 కింద సీబీఐకి గతంలో అనుమతిచ్చిందని, రాష్ట్రం వేరు పడినందున మళ్లీ అనుమతులు అవసరమన్న నిందితుల వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. దీనిని తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం.. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు వర్తించిన అన్ని చట్టాలు కొత్తగా ఏర్పాటైన రెండు రాష్ట్రాలకు యథాప్రకారం కొనసాగుతాయని తేలి్చచెప్పింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదుకు తాజాగా ఎలాంటి అనుమతి అవసరం లేదని తెలిపింది. -
పైసా ప్రీమియం లేకుండా రూ.కోటి ఇన్సూరెన్స్..
అనుకోని సంఘనలు జరిగి కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుంది. అదే బీమా ఉంటే కుటుంబానికి కొండంత అండగా ఉంటుంది. దీన్ని గుర్తించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త బీమా పాలసీని ప్రకటించారు. ఇందులో ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రమాదవశాత్తూ మరణించినా లేదా అంగవైకల్యం పొందినా ఆర్థిక సహాయం అందజేస్తారు.ఈ పథకం కింద అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండా అంటే జీరో ప్రీమియంతో జీవిత బీమా, వైకల్య కవరేజీ అందిస్తారు. ఈ పాలసీ కింద రాష్ట్ర ఉద్యోగులకు కోటి రూపాయల వరకు బీమా కవరేజీ లభిస్తుంది.విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే లేదా వైకల్యానికి గురయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు అస్సాం సీఎం తెలిపారు.ఈ పథకం రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, ఇతర విపత్తుల వల్ల సంభవించే ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా బాధిత కుటుంబానికి రూ. 1 కోటి, పాక్షిక అంగవైకల్యానికి రూ.80 లక్షలు, అనారోగ్యంతో మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని అస్సాం సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
హైకోర్టుకు మరో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు వీరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు శుక్రవారం శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురు వారం జీవో జారీ చేస్తే శుక్రవారం వారి ప్రమాణం ఉంటుంది. వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయిస్తారు. వీరిద్దరినీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత సబ్ రిజిస్ట్రార్ సోమయ్య, కోటేశ్వరమ్మలకు 1964 ఆగస్టు 30న జన్మించారు. 10వ తరగతి మచిలీపట్నంలోని జైహింద్ హైస్కూల్లో, ఇంటర్మీడియట్ చల్లపల్లిలోని ఎస్ఆర్వైఎస్పీ జూనియర్ కాలేజీలో.. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, న్యాయ విద్యను మచిలీపట్నంలో అభ్యసించారు. 1989 ఏప్రిల్ 5వ తేదీన న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో చేరి ప్రాక్టీస్ చేశారు. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. అనంతరం 2016 నుంచి 2019 వరకు శ్రీకాకుళంలో ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక జడ్జిగా పని చేశారు. అనంతరం తిరుపతిలోని ఫ్యామిలీ కోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న సమయంలో గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసు మేరకు ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ పి.వెంకట జ్యోతిర్మయి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గుంటూరు జిల్లా తెనాలిలో పీవీకే శాస్త్రి, బాల త్రిపుర సుందరి దంపతులకు జన్మించారు. డిగ్రీ వరకు తెనాలిలోనే చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. అనంతరం 2008లో నేరుగా జిల్లా జడ్జి కేడర్‌లో ఎంపికై.. ఫ్యామిలీ కోర్టు, సీబీఐ కోర్టు, వ్యాట్ ట్రైబ్యునల్ ఛైర్మన్, ఎస్సీ ఎస్టీ కోర్టు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం ఈ ఏడాది మే 16న ఏపీ హైకోర్టు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అనుసరించి సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. -
ప్రీస్కూల్స్‌గా అంగన్వాడీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను క్రమంగా పూర్వ ప్రాథమిక పాఠశాలలు (ప్రీ స్కూల్స్)గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ విద్యా విధానం–2020కు అనుగుణంగా వీటిని అభివృద్ధి చేసేలా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. తొలి విడత కింద ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఉన్న వాటిని ప్రీస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసే దిశగా చర్యలు వేగవంతం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల సమాచారాన్ని క్రోడీకరించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కేంద్రాల ఆధునీకరణకు అవసరమైన మౌలిక వస తులు,నిధులు...తదితర అంశాలతో ప్రతిపాదనలను ప్రాథమికంగా ఖరారు చేశారు. వీటిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపినట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో.. జూన్ 6 తర్వాత ప్రభుత్వం ఆమోదం పొందే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.వసతులకు రూ.30 కోట్లుప్రస్తుతం తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు న్నాయి. వీటిలో 15,640 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల పరిధిలో కొనసాగుతున్నాయి. వీటిల్లోనే సూత్రప్రాయంగా ప్రీ స్కూల్ విద్యను అమలు చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందించింది. వీటి పరిధిలోని 3 లక్షల మంది 3 – 6 సంవత్సరాల మధ్యనున్న చిన్నారులకు ప్రీస్కూల్ విద్యను అందించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా కార్పెట్ల కొనుగోలు కోసం రూ.3.57 కోట్లు బడ్జెట్ అవసరమని ప్రతిపాదించింది. పుస్తకాలు, పఠన సామాగ్రి, బుక్ ర్యాక్స్ కోసం రూ.7.53 కోట్లు ప్రతిపాదించింది. ఆయా కేంద్రాలకు కొత్తగా రంగులు వేసేందుకు సమగ్ర శిక్షా విభాగంతో అవగాహన చేసుకుంది. పిల్లలకు ప్రత్యేక యూనిఫాం కోసం రూ.6.90 కోట్లు, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో రెండు టేబుల్స్ ఇతర సామాగ్రి ఏర్పాటు కోసం రూ.12.96 కోట్లు ప్రతిపాదించింది. మొత్తంగా రూ.30 కోట్ల విలువైన ప్రతిపాదనలు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వానికి సమర్పించింది.కొత్త టీచర్లా? ప్రస్తుత సిబ్బందేనా?ప్రీస్కూల్స్‌లో విద్యాబోధనకు శిక్షణ పొందిన టీచర్ల ఆవశ్య కత ఉంది. ప్రస్తుతం అంగన్వాడీల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లు పదో తరగతి అర్హతతో విధుల్లో చేరినవారే. ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు కొత్తగా టీచర్లను నియ మిస్తారా? లేక ఇప్పుడున్న వారితో నిర్వహిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం దక్కిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు
సాక్షి, అమరావతి: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల విధానాన్ని హైకోర్టు సమర్థించింది. పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్న వ్యవహారాల్లో నిర్దిష్టంగా ఫలానా విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవని పేర్కొంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ఈ మేరకు ఒక కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ప్రభుత్వం 2019 డిసెంబర్లో జీవో 174 జారీ చేసింది. కుటుంబంలో బహుళ పెన్షన్ల చెల్లింపుల విషయంలో కొన్ని నిబంధనలు తెచి్చంది. దీన్ని సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్ 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, సెర్ప్ సీఈవో, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే బహుళ పెన్షన్ల విషయంలో నిబంధనలు రూపొందించిందని ప్రభుత్వ న్యాయవాది వడ్లమూడి కిరణ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. తీర్పులో ముఖ్యాంశాలు ఇవీ.. ఈ గణాంకాలు చూశాక.. ‘కేంద్రం రూ.288 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.19,161 కోట్లు చెల్లిస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆసక్తికరమైన గణాంకాలను మా ముందుంచాయి. వృద్ధాప్య పెన్షన్ల కోసం కేంద్రం తన వాటా కింద ఏటా రూ.188.74 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.10,164 కోట్లు చెల్లిస్తోంది. వితంతు పెన్షన్ల కోసం కేంద్రం రూ.91.07 కోట్లు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.4,129.44 కోట్లు ఇస్తోంది. దివ్యాంగులకు కేంద్రం రూ.9.05 కోట్లు ఇస్తుంటే రాష్ట్రం రూ.2,594.31 కోట్లు చెల్లిస్తోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా పెన్షన్ల కింద వివిధ వర్గాలకు మొత్తం రూ.19,161.66 కోట్లు చెల్లిస్తోంది. ఈ గణాంకాలను చూసిన తరువాత జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడంలేదన్న పిటిషనర్ వాదనను మేం ఏమాత్రం అంగీకరించడం లేదు. ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం అశ్వనీకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వృద్ధులకు ఆర్థిక సాయం, పెన్షన్లు, నివాసం, మెడికల్ ఖర్చుల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. వృద్ధుల దయనీయ పరిస్థితిని సానుభూతి కోణంలో పరిశీలించి పెన్షన్ ఇవ్వటాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే పెన్షన్ మంజూరు పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్న నిధులు, ఆరి్థక పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. అందువల్ల పెన్షన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయాల్లో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం. దివ్యాంగులకు పెన్షన్లు మంజూరులో కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక కోణంలో ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం ఇది. దీన్ని పునఃసమీక్షించేందుకు మేం అధికరణ 226 కింద మాకున్న అధికారాన్ని వినియోగించలేం. ఆ నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నాం.’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
డ్రాప్ అవుట్.. నో చాన్స్!
సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లలందరినీ బడుల్లోకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో (2023–24) ఇప్పటి వరకు గుర్తించిన 38,677 డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించడం ఒక సూచికగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బడి ఈడు పిల్లలందరినీ నూరు శాతం బడుల్లో చేర్పించేలా ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా వలంటీర్ల ద్వారా ప్రత్యేకంగా 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు బడుల్లో ఉన్నారా.. లేక బడి బయట ఉన్నారా అనే అంశంపై సర్వే నిర్వహించడం ద్వారా డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించారు. ఇప్పటి వరకు 38,677 మంది డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించినట్లు ఇటీవల జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. 1వ తరగతిలో చేరిన పిల్లలు ఆ మరుసటి సంవత్సరం రెండో తరగతి.. ఆ మరుసటి సంవత్సరం ఆపై తరగతిలో.. ఇలా 8వ తరగతి వరకు చేరుతున్నారా లేక మధ్యలో డ్రాప్ అవుట్ అవుతున్నారా.. అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహణలో అసలు బడిలో చేరని, డ్రాప్ అవుట్, బాల కార్మికులను గుర్తించి వారి కోసం ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. పిల్లలను బడుల్లో చేర్పించడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించడం ద్వారా అవగాహన కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. తద్వారా బడి ఈడు పిల్లలందరూ బడుల్లో ఉండేలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. తద్వారా ఇప్పటి వరకు మొత్తం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్కూల్స్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్య 56,34,974కు చేరింది. ఈ విద్యా సంవత్సరంలో అత్యధికంగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బడుల్లో చేరిన పిల్లలు కర్నూలు జిల్లాలో 3,78,564 మంది ఉండగా, ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 3,06,667 మంది, నంద్యాల జిల్లాలో 2,29,280 మంది బడుల్లో చేరారు. -
‘ధూపదీప నైవేద్యం’ రూ.10 వేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోని అతి తక్కువ ఆదాయ వనరులున్న చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద నిధులను ప్రభుత్వం పెంచింది. ఆ ఆలయాలకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.6 వేలను రూ.10 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధూపదీప నైవేద్యం పథకం కింద గుర్తించిన 6,541 ఆలయాలకు ఇది వర్తించనుంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో ఒక్కో ఆలయానికి రూ.2,500 ఇచ్చేవారు. తర్వాత రూ.6 వేలకు పెంచారు. అందులో రూ.2 వేలు ఆలయంలో పూజాదికాల ఖర్చుకు, మిగతా మొత్తాన్ని అర్చకుడి కుటుంబ పోషణ కోసం అందించేవారు. ఇప్పుడీ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచటంతో.. పూజాదికాలకు రూ.4 వేలు, అర్చకుల కుటుంబాలకు రూ.6 వేలు వినియోగించుకునే వీలుంటుందని అంటున్నారు. ఈ పథకం పరిధిలోకి మరిన్ని ఆలయాలను తీసుకురావాలన్న ప్రతిపాదన ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా.. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడిగా పాత్రికేయుడు విష్ణుదాస్ శ్రీకాంత్‌ను నియమిస్తూ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంస్కృతిక సారథి కళాకారులకూ ఊరట ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్చించే విధుల్లో ఉన్న సాంస్కృతిక సారథి కళాకారుల వేత నాలను ప్రభుత్వం పెంచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించిన 583 మంది కళాకారులతో.. రాష్ట్ర అవతరణ తర్వాత సాంస్కృతిక సారథి బృందాన్ని ఏర్పా టు చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రస్తుతం రూ.24,514గా ఉన్న వేతనాలను రూ.31,868 చేసింది. 2021 జూన్ 1వ తేదీ నుంచే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సాంస్కృతిక సారథి కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ చిత్రాలకు స్వర–క్షీరాభిషెకాలు నిర్వహించాలని నిర్ణయించామని కళాకారుల ప్రతినిధులు తెలిపారు. -
కాపెక్స్ వ్యయంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ - వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కాపెక్స్ (మూలధనం) వ్యయంలో ఇతర రాష్ట్రాలకంటే కూడా ముందంజలో అగ్రగామిగా అవతరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) డేటా ప్రకారం.. ఏప్రిల్ - జూన్ కాలంలో ఆంధ్రప్రదేశ్ మూలధన వ్యయంలో రూ. 12,669 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. కాగా FY24కి రాష్ట్ర కాపెక్స్ బడ్జెట్ రూ. 31,061 కోట్లుతో 41 శాతంగా ఉంది. ఇక్కడ తెలుసుకోవలసిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణ మూలధన వ్యయం కూడా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 8 శాతంతో పోలిస్తే FY24 బడ్జెట్లో 27 శాతానికి పెరిగింది. క్యూ1లో వార్షిక లక్ష్యంలో 20 శాతానికి పైగా సాధించిన ఇతర రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి. 20 రాష్ట్రాల కాపెక్స్ ఖర్చులను విశ్లేషించిన రేటింగ్ ఏజెన్సీ.. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లు కలిసి మొదటి త్రైమాసికంలో మొత్తం క్యాపెక్స్‌లో 56.4 శాతంగా ఉన్నాయని పేర్కొంది. పటిష్టమైన పన్ను వసూళ్లు, వ్యయం తగ్గడం, ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో సబ్సిడీలు, జీతాల చెల్లింపుల ద్వారా కాపెక్స్ వృద్ధి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ తన బడ్జెట్ రెవెన్యూ రాబడిలో క్యూ1లో 22 శాతాన్ని సాధించింది. ఇది క్రితం సంవత్సరం త్రైమాసికంలో 18 శాతంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చితే ఈ త్రైమాసికంలో వడ్డీ, పెన్షన్, సబ్సిడీ చెల్లింపులు వంటి వ్యయాలను నియంత్రించడంలో కూడా రాష్ట్రం బాగా పనిచేసింది. -
ఇక అన్ని ప్రయాణాలకూ ఒకే కార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడానికి వీలుగా ఒకే కార్డును తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు రెండో వారంలోగా ‘కామన్ మొబిలిటీ కార్డు’లను సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ అంశంపై సచివాలయంలో గురువారం ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రులు... తొలుత హైదరాబాద్‌లోని ప్రజారవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి వినియోగించేలా ఈ కార్డును అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మొదట మెట్రోరైల్, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డులను జారీ చేస్తామని, సమీప భవిష్యత్తులో ఇదే కార్డుతో ఎంఎంటీఎస్, క్యాబ్ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకొనేలా విస్తరి స్తామని మంత్రులు తెలిపారు. పౌరులు వారి ఇతర కార్డుల మాదిరే దీన్ని కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్ కార్డ్ ఫర్ అల్ నీడ్స్ మాదిరి కామన్ మొబిలిటీ కార్డు ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు. ఈ కార్డుగల ప్రయా ణికులు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. మరోవైపు కామన్ మొబిలిటీ కార్డుకు ఒక పేరును సూచించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పౌరుల నుంచి పేర్లను కోరుతూ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో అరవింద్ కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. -
విలువలే ‘ఇల్లు’వెత్తు ఆస్తి
మంగళగిరి: విలువలే నిలువెత్తు ఆస్తి అని ఆ మహిళ నిరూపించారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థల పట్టాను వెనక్కి ఇస్తూ అధికారులకు లేఖ రాశారు. తనకు ఇప్పటికే ఇల్లు ఉందని, ఈ స్థలం పేదలకు దక్కేలా చూడాలని కోరారు. ఆమె నిజాయితీని అధికారులు, పేదలు ప్రశంసిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. నగర పరిధిలోని యర్రబాలెంకు చెందిన దండిభొట్ల నాగసీత కనకదుర్గ 2019లో సొంతింటి కోసం దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం అర్హురాలిగా గుర్తించింది. ఆ తర్వాత ఆమె భర్త సుబ్రమణ్య శర్మ పేరుతో 100 చదరపు గజాల స్థలం కొని బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. అప్పటికే ఇంటి స్థలానికి అర్హురాలిగా ఎంపికైన కనకదుర్గ పేరుతో అధికారులు ఇంటిస్థల పట్టాను మంజూరు చేశారు. ఇటీవల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందించారు. అయితే తనకు సొంతిల్లు ఉందని, పేదలకు చెందాల్సిన సెంటు స్థలం తాను పొందడం భావ్యం కాదని భావించిన కనకదుర్గ ఆ పట్టాను వెనక్కి ఇస్తూ అధికారులకు లేఖ రాశారు. అనర్హులైనా.. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం స్థల పట్టాలు మంజూరు చేస్తోంది. అయితే వీటిని అనర్హులూ తీసుకుంటున్నారు. అప్పటికే తమ పేరు మీద ఆస్తులు, స్థలాలను ఇంట్లో వేరేవారి పేరు మీదకు మార్చి ఇంటిస్థలం, టిడ్కో గృహ పట్టాలు పొందుతున్నారు. ►నగరంలోని ఇందిరానగర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఇప్పటికి మూడు పారీ్టలు మారి ప్రస్తుతం టీడీపీ కండువా కప్పుకున్నాడు. ఆయనకు అనేక ఆస్తులున్నా తల్లి పేరున ఏ ఆస్తి లేకుండా చేసి టిడ్కో ఇల్లు పొందాడు. ఈ ఉదంతం నగరంలో చర్చనీయాంశమవుతోంది. ► కమర్షియల్ కాంప్లెక్స్‌తోపాటు నగరంలో మరో రెండు ఇళ్లు ఉన్న ఓ వ్యక్తి తన భార్య పేరున టిడ్కో ఇల్లు పొందడం గమనార్హం. ► యర్రబాలెంలో రెండు అంతస్తుల డాబాలో ఉండే ఓ మహిళ తనకు నెలకు రూ.25వేల వరకు అద్దెల రూపంలో ఆదాయం వస్తున్నా.. ఇంటిస్థల పట్టాను పొందారు. ఇలా అనేక మంది తమ పేర్ల మీద ఆస్తులు లేకుండా చేసుకుని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే స్థలాలను అర్హులకు దక్కకుండా కాజేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా నిబంధనల వల్ల అధికారులూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కనకదుర్గను ఆదర్శంగా తీసుకుని అనర్హులు పొందిన ఇంటిస్థల పట్టాలను వెనక్కి ఇవ్వాలని అధికారులు, ప్రజలు కోరుతున్నారు. అనర్హులు ఉంటే పట్టాలు రద్దుచేస్తాం పేదల ఇళ్ళ స్థలాలను అనర్హులు పొంది ఉంటే కచ్చితంగా పట్టా రద్దు చేసి చర్యలు తీసుకుంటాం. అనర్హులను ఎంపిక చేసిన సిబ్బందిపైనా చర్యలు తప్పవు. అనర్హులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పట్టాలు వెనక్కి ఇచ్చి పేదలకు దక్కేలా సహకరించాలి. ఇంట్లో ఎవరికైనా స్థలం, ఆస్తి ఉండి స్థలాలు పొందిన అనర్హులు వెంటనే పట్టాలు వెనక్కి ఇవ్వాలి. – జీవీ రామ్‌ప్రసాద్, తహసీల్దార్, మంగళగిరి -
ఇల్లు కొనుక్కున్నా.. పట్టా వెనక్కి తీసుకోండి
మంగళగిరి: రాష్ట్రంలో ఇల్లులేని పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం పట్టాలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా యర్రబాలెంకు చెందిన దండిభొట్ల నాగసీత కనకదుర్గను అధికారులు అర్హురాలిగా గుర్తించి ఇటీవల ఆమెకు పట్టాను అందజేశారు. నిజానికి.. 2019లో తనకు సొంతిల్లు లేకపోవడంతో కనకదుర్గ అందుకోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తాజాగా అర్హురాలిగా గుర్తించింది. కానీ, 2019 అనంతరం తన భర్త దండిభొట్ల సుబ్రహ్మణ్య శర్మ పేరుతో వున్న వంద చదరపు గజాల స్థలాన్ని విక్రయించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఈ ఏడాది మార్చి 23న రిజిస్ట్రేషన్ చేయించుకుని అందులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. అప్పటికే ఇంటి స్థలానికి అర్హురాలిగా కనకదుర్గను ఎంపిక చేసిన అధికారులు ఆమె పేరున పట్టాను మంజూరుచేసి ఇటీవల అందరితో పాటు అందజేశారు. కానీ, తనకు సొంతిల్లు ఉండగా పేదలకు చెందాల్సిన సెంటు స్థలాన్ని తాను పొందకూడదని కనకదుర్గ గ్రహించి ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటి స్థలాన్ని రద్దుచేసి వేరొక అర్హురాలికి ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులకు ఆదివారం ఆమె లేఖ రాశారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని, గతంలో ఇంటర్ విద్యార్థులతో, తాజాగా పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కొన్ని పార్టీలు కుట్రలకు తెరలేపాయని పరోక్షంగా బీఆర్ఎస్ను విమర్శించారు. తనపై మోపిన పేపర్ లీకేజీ కేసు ఆ కుట్రలో భాగమే అని విమర్శించారు.ఇది అత్యంత క్లిష్ట సమయమని, పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుట్రలకు భయపడితే 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల జీవితాలు ప్రమాదంలో పడ్డట్లేనన్నారు. టెన్త్ పేపర్ల లీకేజీకి కుట్ర కేసులో ప్రస్తుతం కరీంనగర్ జైల్లో రిమాండ్‌లో ఉన్న సంజయ్.. గురువారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కారాగారం నుంచే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. తొలుత పార్టీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బండి.. పార్టీ నిర్మాణం కోసం శ్రమించిన వాజ్‌పేయి, డీఎన్ రెడ్డి మొదలు చలపతిరావు, రామారావు, టైగర్ నరేంద్ర, జితేందర్‌రెడ్డిల సేవలను స్మరించుకున్నారు. నిరుద్యోగుల పక్షాన గళమెత్తినందుకే.. కేసులు, జైళ్లు కొత్తకాదని.. ప్రజల కోసం ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లేందుకు, ప్రాణమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని సంజయ్ పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీలో వైఫల్యాలను, ప్రభుత్వ తప్పిదాలను, ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ కొడుకు పాత్రను ఎత్తిచూపుతూ 30 లక్షల మంది నిరుద్యోగ కుటుంబాల పక్షాన గళమెత్తినందుకే తనను కేసులో ఇరికించారని ఆరోపించారు. నాడు తన స్వార్థం కోసం 27 మంది ఇంటర్మీ డియట్ విద్యార్థులను ప్రభుత్వం బలి తీసుకుందని మండిపడ్డారు. ప్రధాని మోదీ నాకు స్ఫూర్తి ప్రధాని మోదీ తనకు స్ఫూర్తి అని, ఆయన ఈనెల 8న హైదరాబాద్‌కు వస్తున్నా తాను ఆ సభకు హాజరయ్యే అవకాశం కన్పించకపోవడంతో బాధగా ఉందని సంజయ్ పేర్కొన్నారు. మోదీ సభను కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. శ్యామ్‌ప్రసాద్.. దీన్ దయాళ్ సిద్ధాంతాలు, వాజ్‌పేయి త్యాగం, మోదీ ఆశలను నెరవేర్చేందుకు కృషి చేయాలని, కేసీఆర్ సర్కార్‌ను బొందపెట్టడమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బిడ్డ, కొడుకుల స్కాంలు బయటపడుతున్నాయి.. బిడ్డ, కొడుకు చేసిన స్కాంలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో నిస్పృహలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తనను అరెస్టు చేసి జైలుకు పంపడం ద్వారా ఉద్యమాలను అడ్డుకోవాలని చూస్తోందని సంజయ్ ఆరోపించారు. జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి టీఎస్పీఎస్సీ లీకేజీకి బాధ్యుడైన కేసీఆర్ కొడుకును కేబినెట్ నుండి బర్తరఫ్ చేసేవరకు, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవరకు, లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ చీఫ్ పిలుపునిచ్చారు. నియంత పాలనకు చరమ గీతం పాడేదాకా పోరాడదామని అన్నారు. ‘గడీల్లో బందీ అయి విలపిస్తున్న తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడమే మనందరి లక్ష్యం. అందుకోసం తెగించి కొట్లాడదాం.. రాబందుల రాజకీయ క్రీడ నుండి తెలంగాణ తల్లిని రక్షించుకుందాం. అందుకోసం మీరంతా కదిలిరండి..’అని విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
-
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
హుజూర్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉన్నా కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల దాహార్తి తీర్చడానికి రూ.36 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం చేపడితే గ్రామాలకు తాగునీరు అందడంలేదు కానీ కేసీఆర్ కుటుంబం దాహార్తి తీరడానికి ఉపయోగపడిందని విమర్శించారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించడంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీని ప్రశ్నించడానికి బీఎస్పీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. తెలంగాణలో లక్షల కోట్ల సంపద కేసీఆర్ కుటుంబం గుప్పెట్లో బందీ అయిందని, బీఎస్పీ అధికారంలోకి వస్తే వారు దోచుకున్నదంతా పేదలకు పంచుతామని, అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. -
‘దీక్ష’ను కొనసాగించి తీరుతాం
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, నిర్బంధాలు విధించినా దీక్షను కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టి తీరుతామన్నారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష తలపెట్టిన విషయం తెలిసిందే. దీక్షకు ప్రభు త్వం అనుమతి నిరాకరించిన తర్వాత బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యం గొంతు నులిమే కుట్ర. బీజేపీని అణిచివేసే చర్య. బీజేపీ పేరు వింటేనే సీఎం కేసీఆర్ వెన్నులో వణుకుపుడుతోంది. బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అందులో భాగమే. అసెంబ్లీలోకి అనుమతించే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు.. స్పీకర్‌కు సూచించినా పట్టించుకోలేదు. ట్రాఫిక్ రద్దీ, ప్రజలకు ఇబ్బంది అనే పేరుతో ధర్నా కు పోలీసులు అనుమతి నిరాకరించడం విస్మయం కలిగి స్తోంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేసినప్పుడు లేని ఇబ్బంది.. బీజేపీ దీక్ష చేపడితేనే వచ్చిందా? ఇది ముమ్మాటికీ పక్షపాత చర్యే. ఈ అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు స్పందించాలి. కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంత పాలనను అంతం చేసేదాకా ఉద్యమిస్తూనే ఉంటాం’అని బండి సంజయ్ స్పష్టం చేశారు. -
ఆ కుటుంబాలకు పరిహారం ఎప్పుడిస్తారు?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సోకి మృత్యువాతపడిన వారి కుటుంబాలకు ఎప్పటిలోగా పరిహారం అందిస్తారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కరోనా నియంత్రణకు తగినచర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. రాష్ట్రవ్యాప్తం గా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, పరిస్థితి అదుపులోనే ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై విచారణ ముగించాలని కోరారు. ‘‘కరోనాతో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు పరిహారం పంపిణీ చేశారా.. ఇప్పటివరకు ఎంత మందికిచ్చారు.. ఇంకా ఎన్ని కుటుంబాలకు ఇవ్వాల్సి ఉంది.. తదితర వివరాలతో స్థాయీ నివేదికను ఆరువారాల్లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ రెండోవారానికి వాయిదా వేసింది. కాగా, కరోనా నియంత్రణలో రాష్ట్రప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందని ధర్మాసనం అభినందించింది. కరోనా నియంత్రణకు తగినచర్యలు తీసుకుంటూనే ఎప్పటికప్పుడు తమకు పరిస్థితిని వివరించిన ప్రజా ఆరోగ్యవిభాగం డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు పనితీరును ప్రశంసించింది. 1–22వ తేదీల మధ్య 23,526 కేసులు ‘‘జనవరిలో 3.40 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 1 నుంచి 22 తేదీల మధ్య 12,41,660 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 23,526 పాజిటివ్ కేసులు(1.89 శాతం) వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 5.78 కోట్ల(105 శాతం) మందికి మొదటిడోసు ఇచ్చాం. 15–17 ఏళ్ల మధ్య యువకుల్లో మొదటి డోసు 15.40(84 శాతం) లక్షల మందికి, 8.18(44 శాతం) లక్షల మందికి రెండోడోసు ఇచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 56,265 బెడ్లు అందుబాటులో ఉండగా, 971 మంది రోగులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. 55,294 (98.30 శాతం) బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 6 వేల బెడ్లు చిన్నారుల చికిత్స కోసం ఏర్పాటు చేయగా, ఇందులో 4,125 ఆక్సిజన్, 1,875 ఐసీయూ బెడ్లు ఉన్నాయి’’అని డాక్టర్ శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం ‘‘హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో భౌతిక తరగతులకు హాజరుకాలేని విద్యార్థుల కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితులకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’’అని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. -
Telangana: అప్పు 41 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్పు ఈ ఆర్థిక సంవత్సరం రూ. 40 వేల కోట్ల మార్కును దాటనుంది. గత డిసెంబర్ నాటికే రూ. 39 వేల కోట్ల రుణాలను తీసుకున్న ప్రభుత్వం.. మంగళవారం మరో రూ. 2 వేల కోట్లను సమీకరించేందుకు సిద్ధమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా రూ.2 వేల కోట్ల విలువైన బాండ్లను వేలం వేయనుంది. దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన మొత్తం రూ.20,659 కోట్ల విలువైన బాండ్ల వేలానికి ఆర్బీఐ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ మేరకు మంగళవారం జరిగే వేలంలో 12 సంవత్సరాల కాలపరిమితి గల రూ.2 వేల కోట్ల విలువైన రాష్ట్ర ప్రభుత్వ బాండ్లను వేలం వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఆర్థిక పరపతి మెండుగానే ఉన్న మన రాష్ట్ర బాండ్ల వేలం సులభంగా జరిగిపోతుందని, రూ.2 వేల కోట్ల సమీకరణ పెద్ద కష్టమేం కాదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. గత అక్టోబర్ నాటికి రూ. 28 వేల కోట్ల అప్పు కాగ్ లెక్కల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నాటికి రూ. 28,349 కోట్లను ప్రభుత్వం బహిరంగ రుణాల ద్వారా సేకరించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ అప్పు రూ.39 వేల కోట్లకు చేరింది. ఇప్పుడు రూ.2 వేల కోట్ల బాండ్ల వేలంతో రూ.40 వేల కోట్ల మార్కు దాటనుంది. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని పక్కాగా అమలు చేసే రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణకు రానున్న రెండు నెలల్లో మరో రూ.6 వేల కోట్ల వరకు రుణాన్ని సమీకరించే అవకాశముంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారమే రూ.47,500 కోట్లను రుణాలుగా సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు మిగిలిన మొత్తాన్నీ రుణాల రూపంలో సమీకరించుకుని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.31 వేల కోట్లకు పైగా మాత్రమే రుణంగా తీసుకోవాలని వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ కరోనా మిగిల్చిన కష్టాల వల్ల భారీగా అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఏడాది మొత్తం రూ.45 వేల కోట్లకు పైనే అప్పు చేయాల్సి వచ్చింది. ఒక్క 2021 జనవరి నెలలోనే రూ. 6 వేల కోట్లు రుణాలను సర్కారు సమీకరించడంతో ఆ ఏడాది అప్పటివరకు రూ.37 వేల కోట్లుగా ఉన్న అప్పు రూ.43 వేల కోట్లు దాటింది. తర్వాతి రెండు నెలల్లో మరో రూ.2,500 కోట్లకు పైగా అప్పులు తీసుకోవడంతో ఆ ఏడాది అప్పులు రూ. 45 వేల కోట్లు దాటాయి. -
ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ బాధ్యతలొద్దు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల కమిషనర్లుగా నియమించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అదనపు బాధ్యతలు ఒక ప్రభుత్వ అధికారికి అప్పగించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది. మార్గోవా, మాపుసా, మార్ముగోవా, సంగెం, క్వీపెం మున్సిపల్ ఎన్నికలకు గోవా ఎన్నికల కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. చట్ట ప్రకారం మహిళలకు వార్డులు కేటాయించకపోవడంతో సదరు 5 మున్సిపాల్టీల్లో ఎన్నికలు నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, ఈ సందర్భం గా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను రాజీ చేయలేమని, ఎన్నికల కమిషనర్లు స్వతంత్ర వ్యక్తులుగా ఉండాలని, ప్రభుత్వం లో పదవిలో ఉన్న వ్యక్తిని ఏ రాష్ట్రాలూ ఎన్నికల కమిషనర్‌గా నియమించజాలవని పేర్కొంది. ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తి గోవాలో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం బాధాకరమై న అంశమని ధర్మాసనం అభిప్రాయ పడింది. -
కోవిడ్ ముట్టఢీ రాష్ట్రాల కట్టఢీ
సాక్షి, హైదరాబాద్: దేశంలో కోవిడ్ రోజురోజుకూ విస్తరిస్తుంది. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో 11 మంది చనిపోయారు. దీంతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. పాజిటివ్ రోగుల సంఖ్య పెరగడంతో కోవిడ్ వ్యాపించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. కోవిడ్ అధికంగా ఉన్న రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాలూ కోవిడ్ కట్టడికి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. హోం క్వారంటైన్లో ఉన్న వారి కదలికలు కనిపెట్టేందుకు కర్ణాటక సర్కా రు ఫోన్ ద్వారా ట్రాక్ చేస్తోంది. ఒకటి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను ఒడిశా ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మృతుల బంధువులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పరిహారం అందజేయాలని బిహార్ సర్కారు నిర్ణయించింది. ఇంకా ఏయే రాష్ట్రాలు ఏ చర్యలు తీసుకుంటున్నాయంటే.. ఢిల్లీ: బియ్యం, భోజనం ఉచితం - రైళ్లు, విమానాలు, పబ్లిక్, ప్రైవేట్ బస్సులు బంద్. డీటీసీలోని 50 శాతం బస్సులు అత్యవసర సేవలకు వినియోగం. - నిర్మాణ పనులు బంద్. నిత్యావసర వస్తువులు విక్రయించే కొన్ని మినహా మిగతా అన్ని మార్కెట్లు, దుకాణాలు, పరిశ్రమల బంద్. - సెక్షన్ 144 విధింపు. ఒకచోట పెద్దసంఖ్యలో గుమిగూడటం నిషేధం. అన్ని మత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలపై నిషేధం. - జామియా, జేఎన్‌యూ విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశాలు. ఐఐటీ ఢిల్లీ తరగతుల రద్దు. - 72 లక్షల మంది పేదలకు ఏడున్నర కిలోల చొప్పున బియ్యం ఉచితం. 8.5 లక్షల మందికి రూ.4 వేల నుంచి రూ.5వేల పెన్షన్. - నైట్‌షెల్టర్లలో అందరికీ ఉచిత భోజనం. - లాక్డౌన్ సమయంలో వేతనాల్లో కోత విధించకూడదని ఆదేశాలు. - క్వారంటైన్ వ్యక్తులు నివసిస్తున్న ఇళ్ల మార్కింగ్. యూపీ: పేదలకు ‘రిలీఫ్’ - క్కువమంది గుమికూడకుండా చర్యలు. నిరంతరం పెట్రోలింగ్. - నోయిడా, గ్రేటర్ నోయిడాలో స్విమ్మింగ్ పూల్స్ మూసివేత, బహిరంగ కార్యక్రమాలు, మత, రాజకీయ సమావేశాలు ఏప్రిల్ 15 వరకు నిషేధం. - ప్రజలకు అవసరమైన సరుకులు, సాయం అందించడానికి పోలీసు వాహనాల వినియోగం. - కోవిడ్ పాజిటి వ్ వచ్చిన వారికి ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించి, చికిత్సకయ్యే మొత్తాన్ని భరిస్తుంది. - ఆరోగ్య సేవలకు 108, 102 అంబులెన్సులు.. ఎమర్జెన్సీ వైద్య సేవలకు 250 అడ్వాన్స్ లైఫ్ స పోర్ట్ అంబులెన్సులు.. - ఉపాధి కూలీలు, అం త్యోదయ కార్డుదారులకు, పేదలకు రిలీఫ్ ప్యాకేజీలు.. దినసరి కూలీలకు నిర్ధారిత మొత్తం అందజేత. - ఉద్యోగులు వీలైనంత వరకు ఇళ్ల నుంచే పనిచేయాలని ఆదేశాలు. ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు. - 1 నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు విద్యార్థులు. మహారాష్ట్ర: చికిత్స కేంద్రాల పెంపు - సినిమా హాళ్లు, జిమ్, పార్కులు మూసివేత. మాల్స్, సినిమా హాళ్లు మార్చి 31 వరకు బంద్. - బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, మందులు, నిత్యావసరాల దుకాణాలు ఓపెన్. - రాష్ట్ర, అన్ని జిల్లాల సరిహద్దుల మూసివేత. రైళ్లు, ప్రజా రవాణా, ప్రైవేటు సర్వీసుల రద్దు. అత్యవసర సేవలకు సిటీ బస్సుల వినియోగం. - ప్రభుత్వ కార్యాలయాల్లో 5 శాతం ఉద్యోగులే పనిచేయాలి. - వైరస్ టెస్టింగ్, చికిత్స సెంటర్ల సంఖ్య పెంపు. - ముంబై, పుణే, నాగ్‌పూర్ సహా మహారాష్ట్రలోని అన్ని నగరాల్లో 144 సెక్షన్ అమలు. - 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షల వాయిదా. 10, 12 పరీక్షలు యథాతథం. ఐఐటీ బాంబే విద్యార్థులు క్యాంపస్ ఖాళీ చేయాలని ఆదేశాలు. రాజస్తాన్: పూర్తిగా లాక్డౌన్ - జైపూర్, జోధ్‌పూర్ స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారా లు వాయిదా. అత్యవసర సేవ లు మినహా పూర్తిగా లాక్డౌన్. - పేదలకు మే నెల వరకు ఉచితంగా గోధుమల పంపిణీ. - వీధి వ్యాపారులు, రోజుకూలీల కుటుంబాలకు ఏప్రిల్ 1 నుంచి రెండు నెలల వరకు ఉచితంగా నిత్యావసరాలు. - అత్యవసర సేవలు మినహా ప్రైవేటు ఆఫీసులు, మాల్స్, షాపులు, ఫ్యాక్టరీలు, రవాణా, స్కూళ్లు మూసివేత. ఛత్తీస్‌గఢ్: ‘అత్యవసరాలు’ మాత్రమే - నగరాల్లో లాక్డౌన్. అన్ని కార్యాలయాలు, రవాణా సేవలు, మిగతా కార్యకలాపాలు రద్దు. - అత్యవసర, నిత్యావసర సేవలు అందుబాటులోనే ఉంటాయి. - కరెంట్, తాగునీరు, వంటగ్యాస్ సరఫరా, పారిశుధ్యం, నిత్యావసరాలు, కమర్షియల్ గూడ్స్ రవాణా సేవలు కొనసాగుతాయి. పశ్చిమబెంగాల్: విద్యాసంస్థల మూత - అత్యవసర, నిత్యావసర సేవలన్నీ కొనసాగింపు. - అన్ని రకాల విద్యాసంస్థలన్నీ ఏప్రిల్ 15 వరకు మూసివేత. బోర్డ్ పరీక్షలు యథాతథం. బిహార్: సీఎం ‘నిధి’ పరిహారం - ఇక్కడ ఆదివారం మొదటి కోవిడ్ మృతి కేసు నమోదైంది. అంతర్రాష్ట్ర రవాణా పూర్తిగా నిలిపివేత. బస్సులు ఎప్పటికప్పుడు శుభ్రం. - జిల్లా హెడ్‌క్వార్టర్స్, నగర పంచాయతీలన్నింటిలో లాక్డౌన్ అమలు. కోచింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు, పబ్లిక్ పార్కులు మూసివేత. - మృతుల బంధువులకు సీఎం సహాయనిధి నుంచి పరిహారం. - పాట్నా హైకోర్ట్ అత్యవసర కేసుల కోసమే పనిచేస్తుంది. ఉత్తరాఖండ్: కూలీ ఖాతాల్లో రూ.1,000 - రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న కూలీల ఖాతాల్లో రూ.1,000 జమ. అత్యవసర సేవలు మినహా మిగతా అన్నిటిపై నిషేధం. - ఆహార, ఆరోగ్య అవసరాలపై దృష్టి.. ఇంటింటికీ వెళ్లి సరుకులు, మందులు అందజేత. ఒడిశా: ఆదేశాలు పాటించకుంటే కేసులు - అన్ని విద్యాసంస్థలూ ఏప్రిల్ 15 వరకు బంద్. పూరీ బీచ్, కోణార్క్ సూర్య మందిరం, చిలక సరస్సు, చంద్రభాగా బీచ్ మూసివేత. - 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షల రద్దు. యూనివర్సిటీల సెమిస్టర్స్ వాయిదా. - ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారిపై ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు. మధ్యప్రదేశ్: పేదలకు రేషన్ - భోపాల్, జబల్పూర్లో పేద కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా ఈ నెల సరుకులు ఉచితంగా పంపిణీ. - ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో భక్తులకు ప్రవేశం నిషేధం. తమిళనాడు: సరిహద్దులు బంద్ - అన్ని స్కూళ్లు, కాలేజీలు, అమ్యూజ్మెంట్ పార్కులు, థియేటర్లు, స్విమ్మింగ్‌పూల్స్ మూసివేత. ప్రజా రవాణా రద్దు. - 10, 12 తరగతుల పరీక్షలు కొనసాగుతాయి. - కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ సరిహద్దుల మూత. - రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ. మతపర కార్యక్రమాలు, కాన్ఫరెన్స్‌లు, బహిరంగ సభలపై నిషేధం. కర్ణాటక: నిఘాలో ‘క్వారంటైన్’ - హోం క్వారంటైన్లో ఉన్న వారి కదలికలు ఫోన్ ద్వారా ట్రాకింగ్. - షాపింగ్ మాల్స్, బార్ల మూసివేత మరో పది రోజుల పొడిగింపు. - కోవిడ్ నియంత్రణ చర్యలకు రూ.200 కోట్ల సహాయ నిధులు విడుదల. కేరళ: పరీక్షలకు ఓకే - 1 నుంచి 7వ తరగతి వరకు సీబీఎస్ఈ, ఐసీ ఎస్ఈ బోర్డ్ స్కూళ్లు మూత. - పది, పన్నెండో తరగతి పరీక్షలు కొనసాగుతాయి. జమ్మూకశ్మీర్: విదేశీయులకు ‘నో’ - విదేశీయులకు ప్రవేశంపై నిషేధం. - రాంబాన్, కిష్త్ వాడ్ సహా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు. -
గ్రామ స్వరాజ్యం.. సచివాలయాలతో సాకారం
తన భూమికి సంబంధించిన 1బీ ధ్రువపత్రాన్ని చూపుతున్న ఈ రైతు పేరు కురబ మంజునాథ్. ఇతడిది అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం తూర్పు కోడిపల్లి. గ్రామంలో సర్వే నం.90లో 3 ఎకరాల భూమి ఉంది. భూమి 1బీ ధ్రువపత్రం, అడంగల్ కోసం ఆదివారం గ్రామ సచివాలయానికి వచ్చాడు. రైతు అడిగిన ధ్రువపత్రాలను అక్కడి సిబ్బంది వెంటనే అందించారు. దీంతో మంజునాథ్ ఆనందానికి హద్దుల్లేవు. గతంలో కల్యాణదుర్గం వెళ్లి గంటల తరబడి వేచి చూసినా జరగని పనులు ఇప్పుడు తమ గ్రామంలోనే వెంటనే జరగుతుండటంతో సంతోషంగా ఉందని చెప్పాడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని వెంకట్రాజుపురం ప్రజలు ఏ పనులు కావాలన్నా 32 కిలోమీటర్ల దూరంలోని గ్రామ పంచాయతీకి, లేదంటే 42 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకునేవారు. ఇప్పుడు వెంకట్రాజుపురంలో గ్రామ సచివాలయం ఏర్పాటైంది. సొంత గ్రామంలోనే అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌కార్డు కోసం ఆదివారం గ్రామ సచివాలయంలో దరఖాస్తులు అందజేశారు. సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా విప్లవాత్మకమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గణతంత్ర దినోత్సవం రోజునే రాష్ట్ర ప్రజలకు వారి సొంత గ్రామాల్లోనే 536 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 15,002 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా, ఆదివారం నుంచి 14,487 సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి లేకుండా ప్రభుత్వ సేవలు అందుతుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థ తప్పిందని చెబుతున్నారు. సమయం, డబ్బు ఆదా అవుతోందని పేర్కొంటున్నారు. ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో కోటిన్నర దాకా కుటుంబాలు ఉండగా, అందులో గ్రామీణ ప్రాంతాల్లోనే కోటి కుటుంబాలు నివసిస్తున్నాయి. 70 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందిన దాఖలాలు లేవు. పథకాలను ప్రజల ముంగిటకు చేర్చే అధికార యంత్రాంగం లేకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా సామాజిక సూచికలు.. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాల్లో ఆశించిన ప్రగతి సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితిని మార్చాలంటే పరిపాలనను ప్రతి గడప వద్దకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే గ్రామ, వార్డు స్థాయిలో పనిచేసేందుకు 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. వాటి భర్తీ ప్రక్రియను సైతం స్వల్ప వ్యవధిలోనే విజయవంతంగా పూర్తి చేశారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రతి లబ్ధిదారుడికి అందించాలన్న లక్ష్యంతో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మరో 2.80 లక్షల మంది వలంటీర్లను నియమించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామ సచివాలయంలో దరఖాస్తుదారుడికి సదరం సర్టిఫికెట్ అందజేస్తున్న సిబ్బంది ఫిర్యాదుల పరిష్కారానికి ‘స్పందన’ ఎక్కడి సమస్య అక్కడే పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. 80 శాతానికి పైగా ప్రజా సమస్యలను గ్రామ పంచాయతీ స్థాయిలోనే పరిష్కరించాలని.. ప్రజలు మండల, జిల్లా కేంద్రాల్లో ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని ఆదేశించారు. ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగానే గ్రామ–వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థతో ప్రజలకు ప్రభుత్వ సేవలు ఇక వారి గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. అలాగే ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా గ్రామ–వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఈ ఫిర్యాదులను అధికారులు ఏ మేరకు పరిష్కరించారన్న దానిపై ప్రభుత్వం ప్రతివారం సమీక్ష నిర్వహించనుంది. మహిళా రక్షణకు పెద్దపీట రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పాలన వికేంద్రీకరణ ప్రక్రియలో భాగంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒకరు చొప్పున మహిళా పోలీసులను నియమించింది. ప్రతి 2,000–5,000 మంది జనాభాకు ఒక మహిళా పోలీసు నిత్యం అందుబాటులో ఉంటారు. గ్రామ, వార్డు స్థాయిలో స్థానిక మహిళలు ఎదుర్కొనే సమస్యలకు స్థానికంగానే పరిష్కారం చూపుతారు. లంచాల బెడదకు అడ్డుకట్ట పడినట్టే.. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనంపై ప్రజలు విసుగెత్తిపోయారు. గ్రామ, వార్డు సచివాలయాలతో లంచాల బెడదకు దాదాపు అడ్డుకట్ట పడినట్టే. ఎవరైనా ఊళ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి వద్దకు వెళ్లి పని చేసి పెట్టాలని దరఖాస్తు అందజేస్తే కాదనలేని పరిస్థితి ఉంటుంది. ఇక మండల, జిల్లా కేంద్రాల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. మండల, జిల్లా కేంద్రాల్లోని అధికారులు వాళ్లు చేయాల్సిన పనిని మరింత సమర్థవంతంగా చేసే వీలుంటుంది. – చంద్రమౌళి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రిటైర్డు కమిషనర్ గ్రామాల రూపురేఖలే మారిపోతాయి గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపురేఖలే మారిపోతాయి. గతంలో ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అధికారులే ప్రజల చుట్టూ తిరుగుతున్నారు. ఇళ్ల వద్దకొచ్చి సమాచారం తీసుకుంటున్నారు. కావాల్సిన పనులు చేసి పెడుతున్నారు. అవినీతికి ఆస్కారమే లేదు. అధికార వికేంద్రీకరణ దిశగా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ గొప్ప ముందడుగు. – చిత్తరవు నాగేశ్వరరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ మెంబర్ గ్రామ స్వరాజ్యం వచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల వద్దకే నిజమైన పాలన తెచ్చారు. గ్రామ స్వరాజ్యం అందుబాటులోకి వచ్చింది. సచివాలయాలతో ప్రజల కష్టాలు తీరాయి. ఇక్కడ మా సమస్యలకు పరిష్కారం పొందే అవకాశం కల్పించడం సంతోషకరం. – శ్యామసుందర్‌రెడ్డి, యు.రాజుపాలెం, వైఎస్సార్ జిల్లా సమయం, డబ్బు ఆదా మా ఊళ్లో గ్రామ సచివాలయం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. 1బీ అండగల్, 1బీ సవరణ, వెబ్‌ల్యాండ్‌తోపాటు ప్రతి పనికీ మండల కేంద్రమైన కణేకల్లుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్య లేదు. సమయం వృథా కాదు. బస్సు, ఆటో చార్జీలు, భోజనాల ఖర్చులు తప్పుతాయి. మా గ్రామంలోనే అన్ని పనులు జరిగిపోతున్నాయి. – అనంతమ్మ, బెణికల్లు అనంతపురం జిల్లా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట ప్రభుత్వ పథకాలు పొందాలంటే దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. ప్రతి పనికీ డబ్బులు వసూలు చేసేవారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయాల వల్ల దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట పడుతుంది. వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ప్రతి పనినీ ఉచితంగా చేయించుకోవచ్చు. – దారంశంకర్, గుంటూరు కష్టాలు తప్పుతాయి ఇంతకుముందు ఏ పని కావాలన్నా పంచాయతీ, తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మేం ఉండే ప్రాంతానికి దగ్గర్లోనే సచివాలయం ప్రారంభించడం సంతోషంగా ఉంది. రేషన్ కార్డు కావాలన్న, పింఛన్ కావాలన్న మీ సేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలు తప్పుతాయి. – జొన్నాడ వెంకటరమణ, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా నిజమైన ప్రజా పాలనకు నాంది గ్రామ సచివాలయాలు నిజమైన ప్రజా పాలనకు నాంది పలుకుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం వేలాది ఉద్యోగాలు భర్తీ చేశారు. ఆయన పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. – ఎన్ నాగప్రసాద్, బందరు మండలం, కృష్ణా జిల్లా మంచి విధానమిది ఇంతకుముందు ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దళారులు దోచేసేవారు. సచివాలయాల వల్ల అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఖర్చు లేకుండా ఆన్లైన్ ద్వారా పనులు చేయించుకోవచ్చు. చాలా మంచి విధానమిది. – బర్మా వెంకట లలిత కుమారి, బందరు మండలం, కృష్ణా జిల్లా చారిత్రక నిర్ణయం దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటికి తీసుకురావడం చారిత్రక నిర్ణయమే. ఇక ఏ ఒక్క లబ్ధిదారుడూ కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు శ్రమకోర్చి వెళ్లాల్సిన పని లేదు. సేవలను ప్రజలకు దగ్గరకు చేర్చిన సచివాలయ వ్యవస్థ చరిత్ర సృష్టిస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి మంచి గుర్తింపు వస్తుంది. – డాక్టర్ వడిశెట్టి గాయత్రి, మహిళా సైంటిస్ట్, పిఠాపురం, తూ.గోదావరి కలలో కూడా ఊహించలేదు ఇలాంటి గొప్ప పాలన వస్తుందని కలలో కూడా ఊహించలేదు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా సామాన్యుల బాధలు పట్టించుకునేవారు కాదు. వ్యయప్రయాసలకోర్చి 10 కిలోమీటర్లు దూరంలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధలు తగ్గాయి. – ఈశ్వర్‌రెడ్డి, రైతు, గోపిదిన్నె, చిత్తూరు జిల్లా -
80% ఉద్యోగాలు స్థానికులకే..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న 1,26,728 ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులను స్థానికులకే కేటాయిస్తారు. మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు ఏ జిల్లాలో చదువుకుంటారో సదరు అభ్యర్థిని స్థానిక కేటగిరీగా గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన మొత్తం పోస్టుల్లో 80 శాతం వారితోనే భర్తీ చేస్తారు. ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి.. వేరే జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో 20 శాతం మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొంది. వయో పరిమితి.. జీతం ఇలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితి 18నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు అమలు చేస్తారు. సంబంధిత ఉద్యోగంలో ఇప్పటికే ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న వారికి వయో పరిమితిలో వారి సర్వీసు కాలానికి సడలింపు ఇస్తారు. గరిష్ట వయో పరిమితిలో అత్యధికంగా ఐదేళ్ల సడలింపు ఇస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్ష అనంతరం ఎంపికయ్యే అభ్యర్థికి మొదటి రెండేళ్లు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించి, ఆ తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగి హోదా కల్పిస్తూ బేసిక్ శాలరీ అమలు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు రూ.15,030 నుంచి రూ.46,060 మధ్య బేసిక్ శాలరీ నిర్ణయించగా.. మిగిలిన పోస్టులకు రూ.14,600 నుంచి రూ.44,870 మధ్య బేసిక్ శాలరీగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తు విధానం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మూడు వెబ్ పోర్టల్స్‌ను ఏర్పాటు చేసింది. ఏ వెబ్ పోర్టల్‌ను ఓపెన్ చేసినా.. ఒకే తీరున మొత్తం ఐదు విభాగాలతో కూడిన స్క్రీన్ కనిపిస్తుంది. మొదట నోటిఫికేషన్ అన్న విభాగం ఉంటుంది. దానికి కింద క్లిక్ చేస్తే.. భర్తీ చేసే ఉద్యోగాల వారీగా వివరాలు ఉంటాయి. ఏ ఉద్యోగానికి సంబంధించిన పేరు మీద క్లిక్ చేస్తే.. ఆ ఉద్యోగానికి సంబంధించి జిల్లా వారీగా ఖాళీలు, విద్యార్హత, పరీక్ష విధానం వంటి సమగ్ర వివరాలు ఉంటాయి. వాటి ఆధారంగా అభ్యర్థి తనకు ఆసక్తి ఉన్న ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెప్–1లో పేర్కొన్న రెండో కాలంలో ఉన్న బటన్ క్లిక్ చేసి అభ్యర్థి పేరు, ఆధార్ వివరాలు లేదా ఇతర గుర్తింపు కార్డు వివరాలతోపాటు మొబైల్ నంబర్, ఫొటోను అప్లోడ్ చేస్తే సంబంధిత అభ్యర్థి ఫోన్ నంబర్‌కు అతని దరఖాస్తుకు సంబంధించి కేటాయించిన ఐడీ వివరాలు మెసేజ్ అందుతుంది. ఆ ఐడీ వివరాల ప్రకారమే అతడు ఆన్లైన్లో తన దరఖాస్తును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ –2 విభాగంలోని బటన్‌ను క్లిక్ చేస్తే.. అభ్యర్థి మొబైల్‌కు మెసేజ్ ద్వారా అందిన ఐడీ నంబర్ వివరాలు నమోదుకు బాక్స్‌లు ఉంటాయి. ఐడీ నంబర్ నమోదుతో పాటు తాను ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారనే వివరాలను అక్కడ నమోదు చేస్తే పూర్తి దరఖాస్తు ఫారం నమూనా ఓపెన్ అవుతుంది. తప్పులు లేకుండా దానిని నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం పూర్తి చేసినట్టు క్లిక్ బటన్ నొక్కే ముందువరకు తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులో పేర్కొన్న వివరాలను మార్చడానికి వీలుండదు. నాల్గవ కాలమ్గా అభ్యర్థి దరఖాస్తుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఉంటాయి. అక్కడ బటన్ క్లిక్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చివరన గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలు ఉన్నాయి. అభ్యర్థికి ఏమైనా సమాచారం కావాలంటే అక్కడ తెలుసుకోవచ్చు. పోస్టుల వారీగా పరీక్ష విధానం.. వివరాలు -
యజ్ఞంలా ‘నివాస స్థలాల’ భూసేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి నివాస స్థల పట్టాల పంపిణీకి ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. ఇల్లు గానీ, ఇంటి స్థలం గానీ లేని వారందరికీ వచ్చే తెలుగు సంవత్సరాది(ఉగాది) పర్వదినం సందర్భంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఒకేరోజు 25 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన భూమిని సమకూర్చడానికి అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి 62,500 ఎకరాల భూమి అవసరమని లెక్క తేల్చింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రస్తుతం ఇళ్ల స్థలాల పంపిణీకి పనికొచ్చే భూమి ఎంత ఉంది? ఇంకా ఎక్కడెక్కడ ఎంత భూమి సేకరించాలనే దానిపై అధికారులు ప్రాథమిక కసరత్తు చేపట్టారు. అక్టోబరు 2వ తేదీన గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఏర్పాటైన తర్వాత ఏయే గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లు లేని వారు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎంతమందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలో పక్కాగా తేలుతుంది. దీని ప్రకారం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని మినహాయించి, అవసరమైన ప్రైవేట్ భూమిని సేకరించి, పట్టాల పంపిణీకి వీలుగా ప్లాట్లు వేయాల్సి ఉంటుంది. 62,500 ఎకరాలు అవసరం ఒక ఎకరా భూమి 40 మందికి మాత్రమే పట్టాల పంపిణీకి సరిపోతుంది. ఎకరాకు వంద సెంట్లు కాగా, నిబంధనల ప్రకారం ఇందులో 40 సెంట్లు రహదారులు, మురుగు కాలువలు, పార్కులు తదితరాలకు వదిలిపెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 60 సెంట్లను ఒక్కొక్కరికి 1.5 సెంట్ల చొప్పున 40 మందికి పంచవచ్చు. ఈ లెక్కన 25 లక్షల మందికి నివాస స్థలాలు ఇవ్వడానికి 62,500 ఎకరాలకుపైగా భూమి అవసరం. ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పరిశ్రమలు స్థాపిస్తామంటూ భూములు తీసుకుని, ఆ తర్వాత ముఖం చాటేసిన సంస్థలకు నోటీసులు జారీచేసి, సదరు భూములను వెనక్కి తీసుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. మొత్తమ్మీద ఇప్పటిదాకా ఉన్న లెక్కల ప్రకారం 8,500 ఎకరాల భూమి ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం వద్ద ఉంది. మిగిలిన 54,000 ఎకరాలను వివిధ మార్గాల్లో సమకూర్చాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. భారీస్థాయిలో భూసేకరణ చేయాల్సి ఉన్నందున ప్రభుత్వం ఇందుకోసం ఐఏఎస్ అధికారిని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనరేట్‌లో స్పెషల్ కమిషనర్‌గా నియమించింది. ఆయన ఏయే జిల్లాల్లో ఎంతెంత భూమి కావాలో నివేదిక రూపొందించి, ఆ మేరకు భూసేకరణ కోసం కలెక్టర్లతో నిత్యం సమన్వయం చేసుకుంటారు. పట్టణాల్లో అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీకి భూసేకరణను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సమీక్షించాలి. ఇళ్లు లేని వారి కోసం వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని గృహ నిర్మాణ శాఖకు ముఖ్యమంత్రి భారీ లక్ష్యం నిర్దేశించారు. భూసేకరణ ప్రక్రియ రెవెన్యూ, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమం, ఆర్థిక తదితర శాఖలతో ముడిపడి ఉంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో రూ.5,000 కోట్లు కేటాయించింది. వివిధ శాఖల సమన్వయంతో భూసేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి ఓ కమిటీని నియమించింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ అధ్యక్షతన గల ఈ కమిటీలో గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో భూసేకరణ కోసం ప్రత్యేకంగా నియమితులైన స్పెషల్ కమిషనర్ సభ్యులుగా ఉన్నారు. లక్ష్యం మేరకు భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యేలా చూడడమే ఈ కమిటీ బాధ్యత. ‘‘25 లక్షల మందికి ఇళ్ల పట్టాల జారీకి కసరత్తు చేస్తున్నాం. పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న ముఖ్యమంత్రి లక్ష్యం ఎంతో ఉన్నతమైనది. దీనిని నెరవేర్చే దిశగా అధికార యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది’’ అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ చెప్పారు. -
రాళ్ల గుట్టల్ని కూడా వదలరా?
సాక్షి, హైదరాబాద్: ‘చిమ్మ చీకట్లో తడుముకోవద్దు. కానీ మనం చీకట్లో తడుముకుంటున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. హైదరాబాద్ మహానగర స్వరూపాన్ని 1956 నుంచి అంచనా వేసిన నిపుణులు ఉన్నారు. అలాంటి వాళ్ల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోండి. ప్రకృతిపరంగా ఏర్పడిన శిలాసంపదను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి’అని రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని బాబా ఫకృద్దీన్ ఔలియా దర్గా (ఫకృద్దీన్ గుట్ట)లో ప్రకృతిసిద్ధమైన శిలా సంపద, ఏక శిలా రూపాలను ధ్వంసం చేస్తున్నారనే ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫకృద్దీన్ గుట్టను పేల్చి రాళ్లు కొడుతున్నారని, ఆ గుట్టను వారసత్వ సంపదగా గుర్తించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ‘సొసైటీ టు సేవ్ రాక్’సంస్థ కార్యదర్శి ఫరూక్ ఖాదర్ దాఖలు చేసిన పిల్‌ను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘ఇప్పటికే చెరువుల్ని మాయం చేశామని, ఇక రాళ్లను కూడా వదిలిపెట్టమా’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొండల్ని పేల్చి ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటూపోతే ప్రకృతి వికృతరూపం దాల్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఏకశిల, శిలా సంపదలను కాపాడేందుకు తీసుకునే చర్యల్ని వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫకృద్దీన్ గుట్టపై పేలుళ్లను ఆపేశామని, కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. -
అసెంబ్లీ భవనాలు సరిపోవా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న శాసనసభ భవనాలు సరిపోతున్నాయో లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య 119 మాత్రమే కాబట్టి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 మంది ఉండేవారు) ఇప్పుడున్న భవనం ఎందుకు సరిపోవడం లేదో వివరించాలని సూచించింది. ఇప్పటి అసెంబ్లీ భవనం సరిపోతున్నప్పుడు కొత్త భవన నిర్మాణం అవసరం ఎందుకో కూడా తెలియజేయాలని పేర్కొంది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి రాష్ట్ర చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. కొత్తగా అసెంబ్లీ భవనాలు నిర్మించాలనే నిర్ణయానికి అనుగుణంగా ప్లాన్ రూపకల్పన చేశారో లేదో, డిజైన్ రూపొందించిందీ లేనిదీ కూడా గురువారం జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చేందుకు హెచ్ఎండీఏ అనుమతి తీసుకున్నారో లేదో కూడా చెప్పాలని కోరింది. హుడా చట్టం ప్రకారం ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ భవనాల జాబితా నుంచి తొలగించినా హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో ఆ నిబంధన కొనసాగుతున్నందున కూల్చివేత విషయమై అనుమతి పొందిందీ లేనిదీ వివరించాలని ఆదేశించింది. అమల్లో ఉండేది కొత్త చట్టమే: ఏఏజీ పాత చట్టం ప్రకారం ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ భవనాల జాబితా నుంచి తొలగించినందున ఇప్పుడు కొత్త చట్టమే అమల్లో ఉంటుందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వస్తుందనేది ఆశాజనక విషయమని, ఆ ఆలయం జాబితాలో చేరిన తర్వాతే రక్షణ లభిస్తుందని పేర్కొంది. ఇక్కడ కూడా హుడా చట్టం కింద వారసత్వ భవనం కాదని చెబుతున్న ప్రభుత్వం.. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం దాని రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అవుతుందని వ్యాఖ్యానించింది. అయితే, ఒక చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో మరో చట్టాన్ని రూపొందించినప్పుడు కొత్త చట్టమే అమల్లో ఉంటుందని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని అదనపు ఏజీ రామచంద్రరావు బదులిచ్చారు. 1960, 2017 చట్టాలు, 13వ నిబంధనలోని విషయాలన్నీ ఒకే అంశానికి చెందినవని, దీనిపై మీమాంస లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుత అసెంబ్లీ భవనం సరిపోతోందో లేదో, హెచ్ఎండీఏ చట్టం ప్రకారం కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారో లేదో గురువారం చెప్పాలని ఆదేశించింది. -
పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే..
సాక్షి, అమరావతి: ఇక నుంచి రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం ఉద్యోగాలను ప్రభుత్వం స్థానికులకే ఇవ్వనుంది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు కూడా వచ్చే మూడేళ్లలో 75 శాతం ఉద్యోగాలను కూడా స్థానికులకే ఇచ్చేలా చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనసభలో కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలను, ఫ్యాక్టరీలను నెలకొల్పడం ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. మరింత సులువుగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా సరళతర విధానాలను రూపొందించనుందని బిల్లులో స్పష్టం చేసింది. విద్యుత్, గనులు, మౌలిక రంగాలు, పోర్టులు ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవోనోపాధిని కోల్పోయేవారికి అండగా..: పరిశ్రమల స్థాపనకు ప్రైవేట్ వ్యవసాయ భూముల డిమాండ్ పెరిగిపోతోందని, పరిశ్రమలకు భూములిచ్చినవారు తమ భూమితోపాటు జీవనోపాధిని, ఆదాయాన్ని కోల్పోతున్నారని బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరికి ఆ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్ ఉందని పేర్కొంది. అయితే.. పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న ఉద్యోగాలకే స్థానికులను పరిమితం చేస్తున్నారని తెలిపింది. దీనివల్ల తక్కువ ఆదాయంతో స్థానిక యువతలో అసంతృప్తి పెరిగిపోతోందని వివరించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో కనీసం 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని చట్టం చేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపింది. స్థానికత అంటే.. ఏపీతోపాటు జిల్లా, జోన్‌గా పేర్కొంది. స్థానికంగా తగిన అర్హతలు ఉన్నవారు లేకపోతే పరిశ్రమలు, ఫ్యాక్టరీలు.. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని, తగిన శిక్షణ ఇచ్చి మూడేళ్లలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, పీపీపీ విధానంలోని జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో మూడేళ్లలోగా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనల నుంచి మినహాయింపు కోరాలంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం మూడు వారాల్లోగా తగిన విచారణ చేసి నిర్ణయం తీసుకుంటుంది. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇస్తున్నారా? లేదా? అనే అంశాన్ని నోడల్ ఏజెన్సీ ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇస్తున్నవారిపై ఎటువంటి న్యాయస్థానాలకు వెళ్లరాదనే నిబంధన విధించారు. -
అతివలకు అండగా..
సాక్షి, అమరావతి: మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 82,502 కేసులు నమోదు కాగా.. వాటిలో అత్యాచారాలు, వేధింపులు, దాడులు, అవమానాల వంటి కేసులు 44,780 ఉండటం గమనార్హం. గతేడాది జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. 2014 నుంచి 2018 డిసెంబర్ వరకు మహిళలపై నేరాలను గమనిస్తే ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న మహిళా పోలీస్ టీమ్‌లను సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు కొత్తగా మరిన్ని చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు విజయవాడ, విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో 18 యూనిట్లలో ఏర్పాటైన శక్తి టీమ్స్ (మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల బృందాలు)ను రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. ప్రధానంగా పట్టణాల్లోని విద్యాలయాలు, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కాపుకాసే మహిళా పోలీస్ టీమ్‌లు పోకిరిల పనిపట్టనున్నాయి. మహిళలపై దాడులు, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ఇవి పనిచేస్తాయి. పోలీస్ వలంటీర్లు, మహిళా మిత్రల నియామకం వివిధ సమస్యల బారిన పడుతున్న మహిళలకు అండగా ఉండేలా ప్రత్యేకంగా మహిళా పోలీస్ వలంటీర్లు, మహిళా మిత్రలను ప్రభుత్వం నియమిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 18,512 మంది మహిళా పోలీస్ వలంటీర్ల నియామకం, నిర్వహణ కోసం ఈ ఏడాది బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ప్రస్తుతం విజయవాడలో నేర విచారణ, బాధితుల సంరక్షణ కోసం అంతర్జాతీయ ఫౌండేషన్ సహకారంతో మహిళా పోలీస్ వలంటీర్ల వ్యవస్థ నడుస్తోంది. వారితోపాటు రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలకు చెందిన మహిళా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యోగులు, విద్యార్థినులతో ‘మహిళా మిత్ర’ బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళా చైతన్యానికి, వారికి అండగా నిలిచేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బాలికలు, మహిళల అక్రమ రవాణాకిక చెక్ రాష్ట్రం నలుమూలల నుంచి మహిళల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు యుద్ధప్రాతిపదికన స్పందించి వారికి రక్షణ కల్పించేలా ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వíßహిస్తున్న హెల్ప్‌లైన్ 181, ఏపీ పోలీస్ హెల్ప్‌లైన్ 100, 1090, పోలీస్, అగ్నిమాపక, ఆరోగ్య, ఇతర అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ 112 నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య మానవ అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళలు, బాలికల అక్రమ రవాణాను నివారించేలా ఏలూరు, గుంటూరు, అనంతపురంలలో ఉన్న మూడు ప్రత్యేక యూనిట్లకు జవసత్వాలు కల్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. మరోవైపు సామాజిక మాధ్యమాలు, ఇతర ప్రచార సాధనాల్లో మహిళలు, బాలికలకు సంబంధించిన అసభ్య పోస్టింగ్‌లు, ట్రోలింగ్లు, కించపరిచే వ్యాఖ్యానాల మూలాలను గుర్తించి అడ్డుకోవడంపైనా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం మహిళలు, చిన్నారులపై సైబర్ క్రైమ్ నిరోధానికి నాలుగు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.38.85 లక్షలను బడ్జెట్లో కేటాయించడం విశేషం. -
వార్డు సచివాలయాలు 3,775
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో కొత్తగా ఏర్పాటుకానున్న వార్డు సచివాలయాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి ఏర్పాటు, ఉద్యోగాల భర్తీ, విద్యార్హతలు, బడ్జెట్ కేటాయింపు, విధివిధానాలపై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్డు సచివాలయాల ఏర్పాటుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఈ నూతన వ్యవస్థకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇకపై పట్టణ ప్రజలు తాము నివాసం ఉండే ప్రాంతాలకు కూతవేటు దూరంలోనే ఏర్పాటు కానున్న వార్డు సచివాలయాల్లో ఉద్యోగులను సంప్రదించి, సమస్యలు పరిష్కరించుకునే అవకాశం లభించనుంది. మున్సిపల్ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు పట్టణాలు, నగరాల్లో 3,775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం వార్డుల్లో పని చేస్తున్న ఉద్యోగులతో పాటు 34,350 మందిని కొత్తగా నియమిస్తామని మున్సిపల్ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు చెప్పారు. పోస్టుల భర్తీకి ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపారు. 18 సేవలు 10 విభాగాలుగా విభజన పట్టణాల్లో ప్రతి 4,000 మంది జనాభాకు ఒక వార్డు సచివాలయం ఏర్పాటు కానుంది. ప్రతి 5,000 మందికి ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని తొలుత అధికారులు భావించారు. అయితే, ప్రజలకు మరింతగా అందుబాటులో ఉండడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సత్వరం అందించాలన్న యోచనతో ప్రతి 4,000 మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంత ప్రజలకు ప్రస్తుతం మున్సిపాల్టీలు 18 రకాల సేవలు అందిస్తున్నాయి. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, అర్బన్ ప్లానింగ్, రక్షిత మంచినీటి సరఫరా, అగ్నిమాపక సేవలు, పారిశుధ్యం, మురికివాడల అభివృద్ధి, బలహీన వర్గాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, రహదారులు, పార్కుల నిర్మాణాలు, జనన మరణాల నమోదు, వీధిలైట్లు, పార్కింగ్, బస్‌స్టాఫ్‌ల ఏర్పాటు వంటి సేవలు అందిస్తున్నాయి. ఇకపై ఈ 18 సేవలను 10 విభాగాలుగా ఏర్పాటు చేసి, ఒక్కో విభాగానికి ఒక్కో కార్యదర్శిని నియమించనున్నారు. వీరు తమ పరిధిలోని వాలంటీర్లతో ఆ విభాగానికి చెందిన సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తారు. వార్డు సచివాలయంలో ఆరోగ్యానికి సంబంధించిన సేవలను వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూకు సంబంధించిన సేవలను రెవెన్యూ శాఖ, మహిళల సంక్షేమం, భద్రతకు సంబంధించిన సేవలను పోలీస్ శాఖ పర్యవేక్షించనున్నాయి. మిగిలిన సేవలన్నింటినీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షిస్తాయి. అభ్యర్థుల ఎంపికకు రాత పరీక్ష వార్డు కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వార్డు సచివాలయాల్లో నిర్వహించాల్సిన విధులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. పట్టభద్రులు, ఇంజినీర్లు, పాలిటెక్నిక్‌లో డిప్లొమా పూర్తి చేసిన వారు, డిగ్రీలో సోషల్‌వర్క్, నర్సింగ్‌లో ఫార్మాడి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం నిర్వహించనున్న రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రూ.629.99 కోట్లు కేటాయింపు వార్డు సచివాలయాల నిర్వహణకు, కొత్తగా నియమితులు కానున్న వార్డు కార్యదర్శులకు శిక్షణ ఇచ్చేందుకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలలకు వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.629.99 కోట్లు కేటాయించింది. ఒక్కో వార్డు కార్యదర్శికి శిక్షణా కాలంలో రూ.15 వేల వేతనం ఇవ్వనున్నారు. వార్డు సచివాలయాల కోసం ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఒక గదిని అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వార్డు సచివాలయాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వార్డు కార్యదర్శుల విధులు - వార్డుల్లో నియమితులైన వాలంటీర్ల విధులను పర్యవేక్షించాలి. - ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించాలి. ఆయా విభాగాల సిబ్బందితో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. - లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తరుచూ పరిశీలించాలి. కొందరు లబ్ధిదారులను సంప్రదించి వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించాలి. - ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. - ప్రభుత్వ సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ అయ్యే విధంగా చూడాలి. - విద్య, ఆరోగ్యం, పారిశుధ్య పరిస్ధితులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. వార్డు వాలంటీర్లు వీటిని సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. వార్డు కార్యదర్శుల నియామక షెడ్యూల్ - నోటిఫికేషన్: జూలై 22 - దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ: ఆగస్టు 5 - పరీక్షల నిర్వహణ: ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 - సర్టిఫికెట్ల పరిశీలన: సెప్టెంబరు 16 నుంచి 18 - ఎంపికైన అభ్యర్థుల జాబితా: సెప్టెంబరు 20 - వార్డు కార్యదర్శులుగా ఎంపికైన వారికి శిక్షణ: సెప్టెంబరు 23 నుంచి 28 - నగరాలు, పట్టణాల్లో వార్డు కార్యదర్శుల కేటాయింపు: సెప్టెంబరు 30 - వార్డు కార్యదర్శుల బాధ్యతలు, ప్రాక్టికల్ తదితరాలపై శిక్షణ: అక్టోబరు 7 నుంచి నవంబరు 16 -
పీఎం–కిసాన్‌కు 34.51 లక్షల మంది రైతులు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. ఎన్నికలకు ముందున్న మార్గదర్శకాల్లో మార్పు చేయడంతో అనేకమంది అర్హులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 34.51 లక్షల మంది రైతులను ఈ పథకంలో లబ్ధిదారులుగా వ్యవసాయ శాఖ వర్గాలు గుర్తించాయి. ఆయా లబ్ధిదారుల వివరాలను పీఎం–కిసాన్ పోర్టల్‌లో మంగళవారం నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. తొలి విడతలో వీరికి పంపిణీ చేయాల్సిన సొమ్మును ఈ నెలాఖరులో బ్యాంకు ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం–కిసాన్’పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందిస్తామని, దానిని 3 విడతలుగా (విడతకు రూ.2 వేలు) పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి రాష్ట్రంలో 54.50 లక్షల మంది రైతులున్నారు. పీఎం–కిసాన్ పథకంలో గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 27.42 లక్షల మంది రైతులనే అర్హులుగా గుర్తించి పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. వారిలో మొదటి విడతలో 18.47 లక్షల మంది రైతులకు రూ.369.40 కోట్ల నగదు బదిలీ చేశారు. తొలి విడత పంపిణీ ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న కారణంతో మే 23 తేదీ వరకు మిగిలిన రైతులకు నగదు బదిలీ చేయలేదు. ఆ తర్వాత రెండో విడతలో 18.58 లక్షల మంది రైతులకు రూ.370.16 కోట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో 27.42 లక్షల మంది రైతులను పీఎం–కిసాన్ లబ్ధిదారులుగా గుర్తించినప్పటికీ 18 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయగలిగారు. మిగిలిన లబ్ధిదారులను వివిధ రకాల సాంకేతిక కారణాలు చూపించి విస్మరించారు. పెరిగిన లబ్ధిదారులు.. ఈసారి పీఎం–కిసాన్ పథకంలో కొన్ని నియయ నిబంధనలను సడలించారు. కేవలం ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు కాకుండా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది . దీంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో ఈ లబ్ధిదారుల సంఖ్య 27.42 లక్షలు ఉండగా.. ఇప్పుడు 34.51 లక్షలకు పెరిగింది. కొత్తగా 7.09 లక్షల మందిని ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చారు. ఈ నెలాఖరులోగా మొదటి విడత డబ్బులు రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు. రెండో విడత సొమ్మును అక్టోబర్‌లో, మూడో విడత సొమ్మును తర్వాత మేలో పంపిణీ చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రం నుంచి లబ్ధిదారులుగా ఎంపికైన రైతులకు నగదు బదిలీ చేయటానికి ఒక్క విడతకు రూ.690.20 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉంటుంది. మూడు విడతల్లో కలిపి రూ.2,070.60 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రంలోని రైతాంగానికి అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. -
తొలి ‘స్పందన’కు అర్జీల వెల్లువ
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమానికి అన్ని జిల్లాల్లో అనూహ్య స్పందన లభించింది. సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా వినతులు వెల్లువెత్తాయి. ప్రతిచోటా వచ్చిన ప్రతి అర్జీదారుడినీ పలకరించి.. వారికొచ్చిన సమస్యేమిటో అధికారులు తెలుసుకున్నారు. సమస్యను ఎప్పటిలోగా పరిష్కరించగలమో ఆ తేదీని కూడా పేర్కొంటూ రసీదులు ఇవ్వడంతో అర్జీదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఈ తరహాలో అధికారులు స్పందించే వారు కాదని, తీసుకున్న అర్జీలు ఏం చేసేవారో కూడా తెలిసేది కాదనీ వినతులిచ్చేందుకు వచ్చిన వారు చెప్పారు. తొలిసారి ప్రతి అర్జీకి పరిష్కార గడువు తేదీని కూడా నిర్దేశిస్తూ రసీదు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్లో ముందెన్నడూ లేనివిధంగా 513 అర్జీలు అందగా.. డివిజన్, గ్రామీణ స్థాయిల్లో 1,050కి పైగా దరఖాస్తులు వచ్చాయి. డివిజన్, మండల స్థాయిల్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు వినతులు స్వీకరించారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో స్పందనకు 354 వినతులు వచ్చాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని వినతులు మరో 98 వచ్చాయి. మండలాలు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 720 వరకు అర్జీలు వచ్చాయి. విజయనగరం కలెక్టరేట్, పార్వతీపురం ఐటీడీఏతోపాటు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌తోపాటు ఆర్డీవో, తహసీల్దార్, ఐటీడీఏ, జిల్లా ఎస్పీ, మండల పోలీస్ స్టేషన్లలో స్పందన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 660 అర్జీలు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో 360 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 120 ఫిర్యాదులు అందాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో నిర్వహించిన ‘స్పందన’కు 253 అర్జీలు వచ్చాయి. గుంటూరు జిల్లాలో స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అచ్చంపేట మండలంలో వృద్ధురాలు పట్టాదార్ పాస్ పుస్తకం కోసం వీఆర్వోకు రూ.50 వేలు లంచం ఇచ్చి ఏడాదైనా ఆమె సమస్య పరిష్కారం కాలేదు. స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు మొరపెట్టుకోవడంతో ఆయన వీఆర్వోను పిలిచి మందలించి రెండు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్‌కు 600 ఫిర్యాదులు, తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో 22 ఫిర్యాదులు అందాయి. రూరల్ ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి 80కు పైగా అర్జీలు వచ్చాయి. ఒంగోలు కలెక్టరేట్లో స్పందన కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. వివిధ సమస్యలపై మొత్తం 375 అర్జీలు స్వీకరించినట్టు అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి 1,293 అర్జీలు వచ్చాయి. జిల్లా కేంద్రంలో 653 అర్జీలు అందాయి. కర్నూలు కలెక్టరేట్లో స్పందనకు 1,127 దరఖాస్తులు రాగా.. నమోదుకు వీలులేని దరఖాస్తులు కూడా భారీగా అందాయి. కడప కలెక్టరేట్లో నిర్వహించిన స్పందనకు దాదాపు 500 మందికి పైగా వచ్చి సమస్యలను విన్నవించుకున్నారు. చిత్తూరు కలెక్టరేట్, తిరుపతి, మదనపల్లిలోని సబ్ కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు అన్ని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమానికి మొత్తం 2,528 వినతులు వచ్చాయి. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయానికి 996 అర్జీలు రాగా.. అందులో 950 మంది నివాస స్థలాల కోసం వచ్చిన వారే ఉన్నారు. అప్పటికప్పుడు ట్రై సైకిల్ అందజేత నెల్లూరు నగరానికి చెందిన దివ్యాంగుడు మోహన్ ట్రై సైకిల్ కోసం నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు స్పందన కార్యక్రమానికి హాజరై కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబుకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. అతడికి అప్పటికప్పుడు ట్రై సైకిల్ అందజేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో ఇంత వేగంగా సమస్య పరిష్కారం అవుతుందని తాను ఊహించలేదని మోహన్ వ్యాఖ్యానించాడు. తక్షణ స్పందనపై హర్షం వ్యక్తం చేశాడు. -
జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జెడ్పీపీలు, ఎంపీపీలకు పోస్టులు, సిబ్బంది కేటాయింపునకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల మొదటివారంలో కొత్త జెడ్పీపీలు, మండల పరిషత్‌ల నూతన పాలకమండళ్లు ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి అనుగుణంగా మొత్తం 32 జెడ్పీపీలు, 539 మండలాల్లో సిబ్బంది కేటాయింపు, సర్దుబాటు, ఇతర అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. గతంలోని ఉమ్మడి తొమ్మిది జిల్లా పరిషత్‌లలోని పోస్టులను కొత్తగా ఏర్పడిన 32 జిల్లా పరిషత్‌లలో సర్దుబా టు చేస్తారు. ప్రస్తుతం 9 జిల్లా పరిషత్‌లలో 9 మంది జెడ్పీ సీఈవోలు, 9 మంది డిప్యూటీ సీఈవోలు పనిచేస్తున్నారు. తొమ్మిది మంది డిప్యూటీ సీఈవోలను మరో 9 జిల్లాలకు సీఈవోలుగా, మిగిలిన 14 జిల్లాల్లో ఇదివరకే డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి పొందిన వారిని సీఈవోలుగా నియమించాలని ప్రభుత్వం సూచించింది. తొమ్మిది జెడ్పీలలో 9 మంది అకౌంట్స్ ఆఫీసర్లు (ఏవో) పనిచేస్తున్నందున, మిగిలిన 23 జిల్లాల్లో డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతులు పొందిన వారిని ఏవోలుగా నియమిస్తారు. పాత జెడ్పీపీలకు మంజూరైన పోస్టులన్నీ (రీ అలొకేట్ చేయాల్సిన మినహాయించి) కొత్త జెడ్పీపీలకు కేటాయిస్తారు. పని ఒత్తిడి ప్రాతిపదికన... కొత్త జిల్లాల్లో పని ఒత్తిడి, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి పోస్టులను జెడ్పీపీలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీనికి అనుగుణంగా రీ అలొకేట్ కాని పోస్టుల్లోని ఉద్యోగులంతా కూడా కొత్త జెడ్పీపీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా జెడ్పీ కార్యాలయాల్లో కొనసాగుతారు. వారిని కొత్త జెడ్పీపీలకు ముందస్తు(ప్రొవిజనల్)గా కేటాయించినట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త పరిషత్‌లకు కేటాయించాల్సిన మేరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు. కొత్త జెడ్పీపీలకు కేటాయించిన వారు, ఆర్డర్ టు సర్వ్ కింద నియమితులైన (పైన పేర్కొన్న విధంగా) ఉద్యోగులు సీనియారిటీ, పదోన్నతులు, సర్వీసు అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా/జోనల్/మల్టీ జోనల్ కేడర్లలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు. సిబ్బంది విభజన... మునుపటి జెడ్పీపీ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న జిల్లాల కలెక్టర్లు, వాటి పరిధిలో కొత్తగా ఏర్పడిన జిల్లాల కలెక్టర్లను సంప్రదించి సొంత ప్రాంతం, మండలం, సీనియారిటీ ప్రాతిపదికన సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. జెడ్పీపీల్లోని మండలాల సంఖ్య నిష్పత్తికి అనుగుణంగా సిబ్బంది సర్దుబాటు ఉంటుంది. జిల్లా పరిషత్‌లలో అందుబాటులో ఉన్న వాహనాలు, ఫర్నిచర్, మౌలిక వసతులు తదితరాలను కొత్త జెడ్పీపీలకు పాత జిల్లా కేంద్రాల కలెక్టర్లు పంపిణీ చేస్తారు. కొత్త జెడ్పీపీల కోసం భవనాలను (వీలైనంత మేరకు ప్రభుత్వ భవనాల్లోనే) జిల్లా కలెక్టర్లు గుర్తిస్తారు. పాత జెడ్పీపీల్లోని వాహనాలను కూడా కొత్తగా ఏర్పడిన జెడ్పీపీలకు మండలాల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. మండల పరిషత్‌లలో... కొత్తగా ఏర్పడిన 112 మండలాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 539 మండలాలుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో గత మండల ›ప్రజాపరిషత్(ఎంపీపీ) కార్యాలయాల్లోని పోస్టులను కొత్తగా ఏర్పడిన ఎంపీపీల్లో సర్దుబాటు చేస్తారు. కొత్త మండలాల్లో పనిఒత్తిడి, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి కొత్త పోస్టులను కొత్త ఎంపీపీలకు కేటాయిస్తారు. దీనికి అనుగుణంగా రీ అలొకేట్ కాని పోస్టుల్లోని ఉద్యోగులంతా కూడా కొత్త ఎంపీపీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా ఎంపీపీ కార్యాలయాల్లో కొనసాగుతారు. వారిని కొత్త ఎంపీపీలకు ముందస్తు(ప్రొవిజనల్)గా కేటాయించినట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త మండల పరిషత్‌ల అవసరాల మేరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు. కొత్త పరిషత్‌లకు కేటాయించినవారు, ఆర్డర్ టు సర్వ్ కింద నియమితులైన (పైన పేర్కొన్న విధంగా) ఉద్యోగులు సీనియారిటీ, పదోన్నతులు, సర్వీసు అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా/జోనల్/మల్టీజోనల్ కేడర్లలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు. రద్దయిన మండలాల్లో పనిచేస్తున్న సిబ్బందిని సమీప మండలాలు లేదా కొత్తగా ఏర్పడిన మండలాల్లో సర్దుబాటు చేస్తారు. కొత్తగా ఏర్పడిన ఎంపీపీల్లో సీనియారిటీ అధారంగా ఈవోపీఆర్డీ, సూపరింటెండెంట్లను ఇన్చార్జి ఎంపీడీవోలుగా జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. 32 జెడ్పీపీ చైర్పర్సన్లు, సీఈవోలు, ఇతర సిబ్బంది, 112 ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీడీవోలు, ఇతర సిబ్బంది అవసరాలకు తగ్గట్టుగా ఫర్నిచర్‌ను కేటాయిస్తారు. -
ఎన్నికల తర్వాతే కొత్త మున్సిపల్ చట్టం
-
చట్ట సవరణతో పురపోరు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత మున్సిపల్ చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పురపాలక చట్టం కొలిక్కి రాకపోవడంతో చట్ట సవరణతో వార్డుల సంఖ్యను ఖరారు చేసింది. దీనికి అనుగుణంగా శుక్రవారం అర్డినెన్స్ జారీ చేసింది. జూలై నెలాఖరులోగా ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 138 పట్టణ స్థానిక సంస్థల్లో డివిజన్లు/వార్డుల సంఖ్యను ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వార్డుల విభజనలో శాస్త్రీయత లోపించినందున వార్డులను హేతుబద్ధీకరిస్తూ పురపాలకశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సగటున 1,500 నుంచి 15 వేల జనాభా వరకు ఒక్కో వార్డు ఉండగా దీన్ని పునర్విభజనతో సవరించింది. 2011 లెక్కల ప్రకారం మున్సిపాలిటీల జనాభా, ఓటర్ల నిష్పత్తికి అనుగుణంగా వార్డుల సంఖ్యను ఖరారు చేసింది. వాస్తవానికి కొత్త మున్సిపల్ చట్టం మనుగడలోకి వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ముసాయిదా చట్టాన్ని కూడా రూపొందించింది. అయితే ఈ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త చట్టం కోసం ఎదురుచూడకుండా ప్రస్తుత చట్టం ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. దీనికి అనుగుణంగా వార్డులను ప్రకటిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. గణనీయంగా పెరిగిన వార్డులు... సగటున జనాభా, ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోవడంతో మున్సిపాలిటీల్లో భారీగా వార్డులు పెరిగాయి. గతంలో 74 మున్సిపాలిటీల పరిధిలో 1,900 వార్డులుండగా ప్రస్తుతం 138 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం ఈ సంఖ్య 3,385కి చేరింది. ఆర్డినెన్స్‌కు ముందు ఈ వార్డుల సంఖ్య 2,631గా ఉండేది. చిన్న పురపాలికల్లో 1,000–1,500 ఓటర్లకు ఓ వార్డును సర్కారు ఏర్పాటు చేసింది. ఇక 50 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో 2,500 నుంచి 3 వేల ఓటర్లకు ఒక వార్డు ఉండనుంది. వరంగల్ మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో వార్డుల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు 8 లక్షల జనాభా ఉన్న ఈ కార్పొరేషన్లో డివిజన్‌కు దాదాపు 15 వేల ఓటర్లు ఉంటే ఐదు లక్షలలోపు జనాభా ఉన్న మిగతా కార్పొరేషన్లలో సగటున ఆరు నుంచి ఎనిమిది వేల మంది ఓటర్లకు ఒక డివిజన్‌ను ఖరారు చేసింది. కనిష్టం 10 వార్డులు... గతేడాది ఆగస్టు 2న కొత్తగా 68 మున్సిపాలిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో అతితక్కువ జనాభా ఉన్న మండల కేంద్రాలు కూడా పురపాలికలుగా మారాయి. పట్టణీకరణను పరిగణనలోకి తీసుకున్న సర్కారు భారీగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో చిన్న మున్సిపాలిటీల్లో కనిష్టంగా 10 వార్డులు ఏర్పడ్డాయి. అందులో అలంపూర్, వడ్డేపల్లి, భూత్పూర్, అమరచింత, ఆత్మకూరు, చండూరు మున్సిపాలిటీలున్నాయి. -
ఏపీ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు
-
ఉద్యోగుల బదిలీలు నేటి నుంచే..
సాక్షి, అమరావతి : ఉద్యోగుల సాధారణ బదిలీలు మంగళవారం నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ బదిలీలకు అనుమతినివ్వగా.. ప్రస్తుతమున్న నిషేధాన్ని తొలగించారు. తిరిగి వచ్చే నెల 6న నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ సోమవారం జీవో జారీచేశారు. అయితే, ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమైనందున అన్ని రకాల విద్యాశాఖలను బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎటువంటి ఆరోపణలకు, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా జీవోలో ప్రభుత్వం స్పష్టంచేసింది. ఉద్యోగుల రిక్వెస్ట్, పరిపాలనాపరమైన సౌలభ్యం ప్రాతిపదికగా బదిలీలు చేయాలని అందులో పేర్కొన్నారు. అలాగే, ఐదేళ్ల పాటు ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలన్నారు. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మార్గదర్శకాలు ఇవే.. - ఉద్యోగుల బదిలీల్లో 40 శాతం పైగా అంగవైకల్యం సర్టిఫికెట్ గల వారికి ప్రాధాన్యతనివ్వాలి - ఉద్యోగుల పిల్లలు ఎవరైనా మానసిక వైకల్యంతో ఉంటే అలాంటి ఉద్యోగులను సంబంధిత వైద్య సదుపాయం గల ప్రాంతాలకే బదిలీ చేయాలి - క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి జరిగిన భార్యగాని ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఆ వైద్య సదుపాయాలున్న చోటకు మాత్రమే సంబంధిత ఉద్యోగులను బదిలీ చేయాలి. - కారుణ్య నియామకాల్లోని వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యతనివ్వాలి. - భార్యభర్తల కేసుల్లో భార్య బదిలీకి ప్రాధాన్యత ఇవ్వాలి. అదీ కూడా గతంలో ఈ సదుపాయం పొందినట్లయితే ఎనిమిదేళ్ల తరువాత మాత్రమే అనుమతించాలి. - బదిలీలన్నీ రిక్వెస్ట్ కింద పరిగణనలోకి తీసుకోవాలి. - పదోన్నతులు పొందిన ఉద్యోగులను బదిలీ చేయాలి. అయితే, బదిలీ చేసేచోట సంబంధిత పోస్టు ఉంటేనే చేయాలి. - తొలుత అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫై చేయాలి. వాటిని భర్తీచేశాకే నాన్ ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీలు చేయాలి. - ఐటీడీఏ ప్రాంతాల్లో పనిచేస్తున్న లోకల్ కేడర్, జోనల్ కేడర్ ఉద్యోగులను రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులను సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలకు ప్రాధాన్యతనివ్వాలి. - ఐటీడీఏ ప్రాంతాల్లో పోస్టింగ్‌లకు ఉద్యోగులు 50 ఏళ్లలోపు వయస్సు గలవారై ఉండాలి. అలాగే, గతంలో ఐటీడీఏలో పనిచేయని వారై ఉండాలి. - ఐటీడీఏ పరిధిలోని మారుమూల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. వీటిని బదిలీల ద్వారా భర్తీచేయడానికి సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలి. - అన్ని బదిలీలు సంబంధిత అథారిటీ ఆదేశాలు, నిబంధనల మేరకు జరగాలి. - బదిలీ ప్రక్రియకు సంబంధిత శాఖాధిపతి బాధ్యత వహించాలి. ఎటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి. - రెవెన్యూ, ఇతర ఆర్జిత శాఖలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు కూడా ఆయా శాఖల మార్గదర్శకాల మేరకు వచ్చే నెల 5లోగా బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలి. - వ్యవసాయ శాఖలో బదిలీలను మాత్రం ఆయా శాఖలకు అనుగుణంగా నిర్వహించుకోవచ్చు. - స్కూలు విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య, సంక్షేమ శాఖల విద్యా సంస్థలన్నింటిలో బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమైనందున వీటిల్లో బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. వీరిని బదిలీ చేయరాదు.. - వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులు.. అలాగే, గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల్లో పనిచేస్తున్న వారికీ బదిలీల నుంచి మినహాయింపు ఉంది. - కంటిచూపు లేని ఉద్యోగులు ప్రత్యేకంగా వారు బదిలీకి రిక్వెస్ట్ చేస్తే తప్ప వారిని బదిలీ చేయరాదు. వారు కోరిన చోట స్పష్టమైన ఖాళీ ఉంటేనే బదిలీ చేయాలి. - ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులతో పాటు ఇతర శాఖాపరమైన ఆరోపణలున్న వారిని కూడా. -
21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. ఈ నెల 5వ తేదీన 26 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన సంగతి తెల్సిందే. దీంతో 15 రోజుల వ్యవధిలో రెండు దశల్లో రాష్ట్రంలో 47 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. అప్పట్లో బదిలీ చేసిన వారిలో ఐదుగురు మరోసారి బదిలీ అయ్యారు. టీడీపీ హయాంలో ప్రత్యేకంగా డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల కో ఆర్డినేషన్ ఐజీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్‌ను అనంతపురం పీటీసీకి బదిలీ చేయగా తాజాగా ఆయన్ను పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కోయ ప్రవీణ్, జీవీజీ అశోక్‌కుమార్, సర్వశ్రేష్ట త్రిపాఠి, విక్రాంత్ పాటిల్‌పై ప్రభుత్వం మరోసారి బదిలీ చేసింది. -
5 నెలల సమయం కావాలి..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు కనీసం 151 రోజులు (5 నెలలు) సమయం కావాలని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సమీప గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం, మేజర్ గ్రామాలను కొత్త మున్సిపాలిటీలుగా చేసేందుకు, ఆ తర్వాత వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు ఆ సమయం పడుతుందని తెలిపింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. 53 మున్సిపాలిటీలు, 3 మున్సిపల్ కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు జూలై 2తో ముగిసిందని, ఈ లోగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికలు నిర్వహించాల్సిందిగా గతేడాది డిసెంబర్ 31న, ఈ ఏడాది మార్చి 28న ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతో కోర్టుకెక్కింది. ఎన్నికల ప్రక్రియ చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కూడా మరో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలను బుధవారం విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు పేర్కొన్నారు. అన్నింటికీ ఒకేసారి.. కష్టం! 53 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో ఒక్క గ్రామపంచాయతీ విలీనం కూడా కాలేదని, వీటి ఎన్నికల విషయంలో ఉత్తర్వులు జారీ చేస్తే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అఫిడవిట్లో హైకోర్టుకు నివేదించారు. జవహర్‌నగర్, నిజాంపేట, కొంపల్లి, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏర్పడ్డాయి. బడేపల్లి (జడ్చర్ల) నకిరేకల్ మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు వచ్చే ఏడాది డిసెంబర్ 15 వరకు ఉంది. గుండ్లపోచంపల్లి పాలకవర్గం గడువు జూన్ 1తో ముగిసిందన్నారు. పాలకవర్గాల గడువు ముగిసిపోతున్నందున వాటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టమవుతుందని కౌంటర్లో తెలిపారు. ‘సమీపంలోని చిన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడం, మేజర్ గ్రామాల్ని కొత్త మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జనవరి 19న జిల్లా కలెక్టర్లను ఆదేశించాం. దీంతో రాష్ట్రంలోని 131 గ్రామాలను సమీపంలోని 42 మున్సిపాలిటీలు, 173 గ్రామాలను 68 మున్సిపాలిటీలుగా మార్చాం. వీటికి ఎన్నికలు నిర్వహించాలంటే ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు పూర్తి కావాలి. ఈలోగానే 14 పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేయడాన్ని, 28 గ్రామాల్ని మున్సిపాలిటీల్లో విలీనం చేయొద్దన్న రిట్లను గత మార్చి 8న హైకోర్టు తోసిపుచ్చింది’అని అరవింద్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. -
నెలకు సరిపడా మందులు ఒకేసారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీపీ, షుగర్ రోగులకు ఒకేసారి నెలకు సరిపడా మందులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అసంక్రమిత వ్యాధుల (ఎన్సీడీ) స్క్రీనింగ్ అనంతరం రక్తపోటు, మధుమేహ వ్యాధులకు నెలకు సరిపడా మందులిచ్చే కార్యక్రమం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేకాదు వారి జీవిత కాలమంతా ఈ మందులను ఉచితంగా అందించనున్నారు. కొనసాగుతోన్న వైద్య పరీక్షలు ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన 12 జిల్లాల్లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)పై స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతోంది. అలాగే జూన్ చివరి వారం లేదా జులై మాసంలో మరికొన్ని జిల్లాల్లో ఎన్సీడీ స్క్రీనింగ్స్ చేపట్టబోతున్నారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ అసంక్రమిత జబ్బుల పరీక్షలను పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ గట్టి పట్టుదలతో ఉంది. జాతీయ ఆరోగ్య మిషన్ కూడా దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. గ్రామాల్లో ఆశా, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మందులు చాలక అవస్థలు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 104 వాహనాల ద్వారా పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మందు గోలీలు ఇస్తున్నారు. వారానికో పదిరోజులకో సరిపోయేంత మాత్రమే ఇస్తున్నారు. దీంతో 104 ఇచ్చే మందుల మీదే ఆధారపడ్డ పేద రోగులు మళ్లీ మందులు వచ్చేదాకా తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతేకాక ప్రస్తుతం స్క్రీనింగ్ జరిగే జిల్లాల్లో బీపీ ఎక్కువగా ఉన్నవారికి , షుగర్ లెవల్స్ అసాధారణంగా ఉన్నవారికి ఈ డోసులు సరిపోవడం లేదని, అందుకే వారికి బయటనుంచి ట్యాబ్లెట్స్ కొనుక్కోమని చెబుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మందుల పంపిణీ బాధ్యత ‘ఆశ’లదే బీపీకి రెండు రకాలు, షుగరుకు మూడు రకాల గోలీలు వైద్య ఆరోగ్యశాఖ ఇవ్వబోతోంది. బీపీకి 50 ఎంజీ , 20 ఎంజీ డోసులతో కూడిన ట్యాబ్లెట్లను ఇస్తారు. ప్రతి నెలా మందులు అయిపోయాక వాటిని తిరిగి తెచ్చి ఇచ్చే బాధ్యత స్థానిక ఆశ కార్యకర్తలకు అప్పగించారు. స్థానికంగా ఉండే ఆశ కార్యకర్తల వద్దే ఆ గ్రామంలో ఎంతమంది బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారనే డేటా ఉంటుంది. దాని ఆధారంగా ప్రతి నెలా మందులు ఇవ్వనున్నారు. -
మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో అన్ని వ్యాపారాలను మహిళా సంఘాలే నిర్వహిం చేలా, ఆర్థిక పరిపుష్టిని సాధించేలా కృషి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సూచించారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయిల్లో వివిధ ప్రైవేట్ వ్యాపారులు, ఇతరులు నిర్వహించే పరిశ్రమలన్నీ మహిళా సంఘాలే నిర్వహించేలా ఈ వ్యవస్థ బలోపేతం కావాలనేది రాష్ట్ర ప్రభుత్వ కోరిక అని పేర్కొన్నారు. కల్తీలను నిరోధించేందుకు ఆయా వ్యాపారాలన్నీ కూడా మహిళా సంఘాల ద్వారా చేయించాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకైనా సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) బ్యాంకు లింకేజీ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పీఆర్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, సెర్ప్ సీఈవో పౌసమి బసు, ఎస్ఎల్డీసీ చైర్మన్ ఓంప్రకాశ్ మిశ్రా, ఆర్బీఐ మేనేజర్ శంకర్, నాబార్డ్ సీజీఎం విజయ్‌కుమార్‌లతో కలిసి 2019–20 ఆర్థిక ఏడాదిలో రూ. 6,584 కోట్లకు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ అందించేందుకు సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందరర్భంగా మంత్రి రుణ ప్రణాళిక లక్ష్యాలను వివరించడంతోపాటు ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. రుణ లక్ష్యాలకు మించి తమ ప్రభుత్వం సంఘాలకు కార్యక్రమాలు ఇస్తుందని, అందువల్ల అంతకు మించి రుణాలిచ్చేందుకు బ్యాంకులు సహకరించాలని కోరా రు. ప్రతి గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయబోతోందన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్‌ను నియమిస్తున్నట్టు, సంఘాల్లోని ప్రతి మహిళ ఏయే కార్యకలాపాలు చేపడుతుందో తెలుసుకోవడంతో పాటు ప్రతి ఇంటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయా రు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు పీఆర్‌శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ తెలిపారు. సెర్ప్ ద్వారా చేపడుతున్న కార్యకలాపాలు, తదితర అంశాలను గురించి సీఈవో పౌసమి బసు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మహిళా సంఘాలకు అన్నివిధాలా సహాయ, సహకారాలను అందిస్తామని ఎస్ఎల్బీసీ చైర్మన్ ఓపీ మిశ్రా వెల్లడించారు. సంఘం లోని ఒక్కో మహిళకు ఇచ్చే రుణాల్లో రూ. 25 వేల వరకు ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేయరా దని ఆర్బీఐ నిర్దేశించిందని ఆర్బీఐ మేనేజర్ శంకర్ తెలిపారు. కొన్ని మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల చార్జీలు, ప్రాసెసింగ్ చార్జీలు తగ్గించాలని కోరినపుడు ఆయనపై విధంగా స్పందించారు. 1992లో 500 గ్రూపులతో మొదలైన స్వయం సహాయక సంఘాల ఉద్యమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87 లక్షల గ్రూపులకు విస్తరించిందని నాబార్డ్ సీజీఎం విజయ్‌కుమార్ తెలిపారు. -
నిజాం షుగర్స్ అమ్మకానికి పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: నష్టాలతో మూతపడిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌ను విక్రయించి.. బ్యాంకులు, ఇతర సంస్థలకు బకాయిలు చెల్లించాల్సిందిగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎస్‌సీఎల్‌టీ) ఆదేశించింది. సుమారు 8 దశాబ్దాల చరిత్ర కలిగిన నిజాం షుగర్స్ పునరుద్ధరణ మార్గాలు మూసుకుపోవడంతో ఆస్తుల విక్రయం (లిక్విడేషన్) మినహా మరో మార్గం లేకుండా పోయిందని పేర్కొంది. ఇప్పటికే పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోవడంతో వేతనాల కోసం ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ నెల 3న తీర్పు వెలువరించిన ట్రిబ్యునల్ గురువారం లిక్విడేషన్‌కు ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులు అందిన తర్వాత.. తదుపరి కార్యాచరణపై స్పష్టత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని చక్కెర శాఖ అధికారులు నిర్ణయించారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో 1937లో ఏర్పాటు చేసిన నిజాం చక్కెర కర్మాగారం (ఎన్ఎస్ఎల్) సుమారు రెండు దశాబ్దాలుగా నష్టాల బాటలో నడిచింది. నష్టాల నుంచి పరిశ్రమను గట్టెక్కించే నెపంతో 2002లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం డెల్టా పేపర్ మిల్స్‌కు 51శాతం వాటాను విక్రయించింది. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్)గా పేరు మార్చుకున్న నిజాం చక్కెర కర్మాగారం.. నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో 2015 డిసెంబర్లో పరిశ్రమను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు పరిశ్రమ ఆస్తులను విక్రయించి అప్పులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్డీఎస్ఎల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఎన్డీఎస్ఎల్ను నడిపేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 2015, ఏప్రిల్‌లో కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రైవేటు భాగస్వామ్య సంస్థకు చెందిన 51శాతాన్ని టేకోవర్ చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి, 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కార్యదర్శుల కమిటీని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ 28ను విడుదల చేసింది. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఎన్డీఎస్ఎల్... బ్యాంకర్ల వద్ద భారీగా అప్పులు పెరిగిపోవడంతో దివాలా పరిశ్రమగా గుర్తించాలని 2017లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, హైదరాబాద్ బెంచ్‌ను ఎన్డీఎస్ఎల్ ఆశ్రయించింది. అప్పులు తీర్చేందుకు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిసొల్యూషనల్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ)ని ప్రారంభించాలని కోరింది. ఈ నేపథ్యంలో రుణ దాతలతో (కమిటీ ఆఫ్ క్రెడిటర్స్) సంప్రదింపులు జరిపేందుకు ఆర్.రామకృష్ణ గుప్తా అనే నిపుణుడికి బాధ్యతలు అప్పగించింది. 2017, అక్టోబర్ మొదలుకుని 2018, సెప్టెంబర్ వరకు 11 పర్యాయాలు రుణదాతలతో సంప్రదింపులు జరిపినా.. పునరుద్ధరణ అంశం కొలిక్కి రాలేదు. సహకార రంగంలో పరిశ్రమను పునరుద్ధరించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్రప్టెన్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీసీ) నిబంధనల మేరకు 2018, సెప్టెంబర్ 19లోపు సమస్యను పరిష్కరించాల్సి ఉండగా.. 12 వారాల పాటు గడువు పొడిగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మరోవైపు పరిశ్రమను కొనుగోలు చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కొన్ని సంస్థలు ఆసక్తి చూపాయి. అయితే పరిశ్రమ ఆస్తులు, అప్పులను పరిశీలించిన సంస్థలు చివరి నిమిషంలో వెనుకడుగు వేశాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: భద్రు మాలోత్ నిజాం చక్కెర కర్మాగారం లిక్విడేషన్ అనుమతికి సంబంధించి ఎన్సీఎల్టీ ఉత్తర్వులు అధికారికంగా అందిన తర్వాత.. ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని చక్కెర శాఖ కమిషనర్ భద్రు మాలోత్ ‘సాక్షి’కి వెల్లడించారు. రైతులు, ఉద్యోగులకు నష్టం జరగకుండా పరిశ్రమ పునరుద్ధరణ మార్గాలను అన్వేషిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఎన్సీఎల్టీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు లేదా ఎన్సీఎల్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ప్రభుత్వం ఆశ్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. లిక్విడేషన్‌కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు.. అయితే వరుస ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గడువులోగా పునరుద్ధరణ ప్రణాళిక అందకపోవడంతో పరిశ్రమ అమ్మకానికి (లిక్విడేషన్) అనుమతిస్తూ ఎన్సీఎల్టీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 12 వారాల గడువును ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ వినతిని ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. రామకృష్ణ గుప్తాకు లిక్విడేటర్‌గా బాధ్యతలు అప్పగించింది. లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు.. పునరుద్ధరణకు సంబంధించి కొనుగోలుకు ఆసక్తి ఉన్న సంస్థలతో సంప్రదింపులు జరపడంతో పాటు, ప్రభుత్వ స్పందన కోసం కొంత కాలం వేచి చూసే యోచనలో లిక్విడేటర్ ఉన్నట్లు సమాచారం. వివిధ సంస్థలకు రూ.360 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. ఆస్తులు కూడా అంతే మొత్తంలో ఉన్నట్లు సమాచారం. లిక్విడేషన్‌కు ఎన్సీఎల్టీ అనుమతి ఇవ్వడంతో సంస్థపై ఆధారపడిన సుమారు 250 మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. -
సెప్టెంబర్ 15 నాటికి బతుకమ్మ చీరలు
సాక్షి, హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీలో గతంలో తలెత్తిన అవాంతరాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ ఏడాది చీరల తయారీని సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు నిర్దేశించింది. 6.30 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి జరగాల్సి ఉండటంతో.. ఫిబ్రవరిలోనే చేనేత సహకార సంఘాలకు చీరల తయారీకి చేనేత సహకార సంఘాల సమాఖ్య ఆర్డర్ ఇచ్చింది. గతంతో పోలిస్తే రంగులు, డిజైన్ల ఎంపికలోనూ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ రంగుల్లో 50 రకాలైన చీరలను ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో 2017 నుంచి అర్హులైన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ చేస్తోంది. రెండేళ్లుగా సుమారు 90లక్షల మందికి పైగా ఉచితంగా చీరలు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది 95లక్షల చీరల పంపిణీని లక్ష్యంగా నిర్దేశించింది. చీరల తయారీ బాధ్యతను సిరిసిల్లలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు అప్పగించారు. బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి తొలి ఏడాది.. అనగా 2017లో ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంతో.. సిరిసిల్ల చేనేత సహకార సంఘాలు సకాలంలో చీరల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేక పోయాయి. దీంతో 3.75కోట్ల మీటర్ల వస్త్రాన్ని సిరిసిల్ల మరమగ్గాల మీద సిద్ధం చేయగా, మరో 2.36కోట్ల మీటర్ల వస్త్రాన్ని గుజరాత్‌లోని సూరత్ నుంచి దిగుమతి చేసుకున్నారు. సూరత్ నుంచి దిగుమతి చేసుకున్న వస్త్రం నాణ్యతపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో 2018 బతుకమ్మ చీరల తయారీకి సంబంధించిన ఆర్డర్‌ను పూర్తిగా సిరిసిల్ల నేత కార్మికులే స్థానికంగా మరమగ్గాలపై సిద్ధం చేశారు. సుమారు 6 కోట్ల మీటర్ల వస్త్రాన్ని సకాలంలో సిద్ధం చేసినా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బతుకమ్మ చీరల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. దీంతో ఎన్నికలు ముగిసిన తర్వాత గత ఏడాది డిసెంబర్ మూడో వారంలో ఈ చీరల పంపిణీ ప్రారంభించి..ఈ ఏడాది జనవరి వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగించారు. టెస్కో ద్వారా రూ.450 కోట్ల ఆర్డర్లు తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్ (టెస్కో) ద్వారా రాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు ఈ ఏడాది సుమారు రూ.450 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కాయి. ఈ ఏడాది రూ.280 కోట్లు బతుకమ్మ చీరల రూపంలో సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ఆర్డర్ లభించింది. వీటితో పాటు రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పంపిణీ చేసే వస్త్రాల ఉత్పత్తి ఆర్డర్ కూడా ఈ సంఘాలకే దక్కింది. కేసీఆర్ కిట్ల ద్వారా బాలింతలకు ఇచ్చే చీరలతో పాటు, వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖలకు సంబంధించి దుప్పట్లు, కార్పెట్ల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని చేనేత సహకార సంఘాలకు అప్పగించారు. ఇదిలా ఉంటే బతుకమ్మ చీరల ద్వారా ఉపాధి పొందుతున్న సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం నుంచి బకాయిలు సకాలంలో విడుదల కావడం లేదు. గత ఏడాది బతుకమ్మ చీరలు, రంజాన్ వస్త్రాల తయారీకి సంబంధించి టెస్కో నుంచి రూ.25 కోట్ల మేర ఈ సంఘాలకు విడుదల కావాల్సి ఉంది. 95 లక్షల మందికి పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ చీరల పంపిణీకి రెండేళ్లుగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ మూడో వారంలో లబ్ధిదారులకు చీరలు అందేలా చేనేత శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముదురు రంగులతో కూడిన 50 రకాలైన డిజైన్లను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిపుణులు రూపొందించారు. చీర అంచులు, కొంగు డిజైన్లలో వైవిధ్యం ఉండేలా రూపొందించడంతో పాటు, చీరతో పాటు రవిక బట్టను కూడా అందిస్తారు. ఈ ఏడాది సుమారు 6.30 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి చేయాలని సిరిసిల్ల చేనేత సహకార సంఘాలకు ఆర్డర్ ఇవ్వగా.. 95లక్షల మందికి చీరలు పంపిణీ చేయనున్నారు. వీటి తయారీ ద్వారా సిరిసిల్లలో 22వేలకు పైగా మరమగ్గాలపై ఆధారపడిన 20వేల మంది చేనేత కార్మికులకు సుమారు ఆరు నెలల పాటు ఉపాధి దక్కనుంది. గతంలో సగటున నెలకు రూ.6 వేల నుంచి రూ.8వేల వరకు వేతనం పొందిన కార్మికులు.. ప్రస్తుత ఆర్డర్లతో సుమారు రూ.20వేల వరకు ఆర్జిస్తున్నారు. -
ఐదింటిపై మూడో కన్ను
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల్లోనే కాదు.. రాజధాని నిర్మాణం, పురపాలక, పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖల పరిధిలో చేపట్టిన పనుల్లో కూడా జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు థర్డ్ పార్టీ విచారణ పరిధిని పెంచడంతోపాటు సభ్యుల సంఖ్యను కూడా 5కు పెంచింది. రిటైర్డు ఈఎన్సీలు రోశయ్య, బి.నారాయణరెడ్డి, సుబ్బరాయశర్మ, ఐఐటీ ప్రొఫెసర్ సూర్యప్రకాశ్, నాక్ డైరెక్టర్ పీటర్లను థర్డ్ పార్టీ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి. పేదల ఇళ్లలోనూ కమీషన్ల పర్వం.. టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల తరహాలోనే తాత్కాలిక సచివాలయం, శాశ్వత పరిపాలన భవనాలు, రహదారుల అంచనా వ్యయాలను భారీగా పెంచేసి ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి భారీగా కమీషన్లు వసూలు చేసుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు అంచనా వ్యయాన్ని సగటున కి.మీ.కి రూ.59 కోట్లుగా నిర్ణయించి కాంట్రాక్టర్లకు అప్పగించడమే దీనికి తార్కాణం. తాత్కాలిక సచివాలయం, శాశ్వత భవనాల నిర్మాణ పనుల్లోనూ ఇదే రీతిలో అంచనాలు పెంచేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో వాటర్ గ్రిడ్, ఏఐడీబీ (ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు) రుణంతో చేపట్టిన రహదారుల పనుల్లోనూ అంచనా వ్యయాన్ని పెంచేసి భారీగా దోచుకున్నారు. రహదారులు, భవనాల శాఖ పరిధిలో చేపట్టిన రహదారులు, భవనాల నిర్మాణ పనుల్లోనూ అదే మాదిరిగా దోపిడీ జరిగింది. పురపాలక శాఖలో ప్రధానంగా పీఏంఏవై పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ.20,535 కోట్ల నుంచి రూ.38,265.88 కోట్లకుపైగా పెంచేసి లబ్ధిదారులపై రూ.17,730.88 కోట్ల రుణభారాన్ని మోపి టీడీపీ పెద్దలు కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలను థర్డ్ పార్టీ ద్వారా నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. థర్డ్ పార్టీ విచారణకు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసింది. అవి ఇలా ఉన్నాయి.. - శాఖలవారీగా, ప్రాజెక్టుల వారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను థర్డ్ పార్టీ పరిశీలించాలి. - ఒక ప్రాజెక్టు డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? లేక డీపీఆర్‌ను రూపొందించకుండా అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? అన్నది తేల్చాలి. - అంచనా వ్యయాన్ని ఖరారు చేసేటప్పుడు పనుల పరిమాణాన్ని అవసరం లేకున్నా అమాంతం పెంచేశారా? లేదా అనే అంశాన్ని పరిశీలించాలి. - ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో టెండర్ పిలిస్తే ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్ కమిటీ)ను, లంప్సమ్(ఎల్ఎస్)–ఓపెన్ విధానంలో టెండర్ పిలిస్తే చీఫ్ ఇంజనీర్స్ కమిటీలను సంప్రదించి అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? లేదా? అనే అంశాన్ని పరిశీలించాలి. - టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేటప్పుడు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించేలా నిబంధనలు విధించారా? అనే అంశాన్ని తేల్చాలి. - నిబంధనలను అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లను కట్టడి చేయడం, కుమ్మక్కు చేయడం వల్ల అధిక ధరలకు పనులు కట్టబెట్టారా? లేదా? దీనివల్ల ఖజానాకు ఎంత నష్టం? అన్నది పరిశీలించాలి. - ఇప్పటివరకు చేసిన పనుల నాణ్యతను పరిశీలించాలి. నాణ్యతకు, పరిమాణానికి, బిల్లుల చెల్లింపులకు తేడాలుంటే వాటిని ప్రత్యేకంగా గుర్తించాలి. - శాఖల వారీగా, ప్రాజెక్టుల వారీగా ఈ అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. -
సమష్టిగా అభివృద్ధి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్లు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రామపంచాయతీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అందరు సమష్టిగా పనిచేయాలని సూచించారు. సమష్టి కృషితోనే బంగారు తెలంగాణ సాకారమవుతుందన్నారు. కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్లు పుట్ట మధు (పెద్దపల్లి), కోవా లక్ష్మి (కుమ్రం భీమ్ ఆసిఫా బాద్), లింగాల కమల్‌రాజ్ (ఖమ్మం), పద్మ (నాగర్‌కర్నూలు), లోక్‌నాథ్‌రెడ్డి (వనపర్తి), హేమలత (మెదక్), నరేందర్‌రెడ్డి (నల్లగొండ), సందీప్‌రెడ్డి(యాదాద్రి భువనగిరి), మంజుశ్రీ (సంగారెడ్డి), సుధీర్‌కుమార్(వరంగల్ అర్బన్), జ్యోతి (వరంగల్ రూరల్), సంపత్‌రెడ్డి (జన గామ), కుసుమ జగదీష్ (ములుగు), బిందు (మహబూబాబాద్), శ్రీహర్షిణి (జయశంకర్ భూపాలపల్లి) సోమవారం హైదరాబాద్‌లో కేటీ ఆర్‌ను కలిశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డి, వరంగల్ ఉమ్మడి జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మా నర్సింగరావు, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, సండ్ర వెంక టవీరయ్య, కోనేరు కోనప్ప, గొంగడి సునీత, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్‌నాయక్, గ్యాదరి కిషోర్, సుమన్, గువ్వల బాలరాజు, ధర్మారెడ్డి, సతీష్ కుమార్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపునేని నరేందర్, హరిప్రియ, క్రాంతి కిరణ్ తదితరులు కేటీఆర్‌ను కలిశారు. -
ఆ ఏర్పాట్లకు ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయొద్దు?
సాక్షి, హైదరాబాద్: బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాట్లు చేయరాదని ఎక్కడుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ బిజినెస్ రూల్ కింద ఖర్చులెలా చేయాలని ఉందో తెలియజేయాలని బాలల హక్కుల సంఘాన్ని నిలదీసింది. అన్ని ప్రభుత్వ శాఖలు చేప ప్రసాదం ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయని, ప్రభుత్వ శాఖలు చేసే ఖర్చుల గురించి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించకపోవడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుత్‌రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని శుక్రవారం హైకోర్టు మరోసారి విచారించింది. ప్రజాధనాన్ని ఖర్చు చేసేప్పుడు వాటి గురించి ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని, ఖర్చు చేసే అంశంపై జవాబుదారీతనం ఉండాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి వాదించారు. ప్రభుత్వం ఏ బిజినెస్ రూల్ ప్రకారం ఖర్చు చేయాలో తెలియజేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ప్రశ్నించింది. పెద్ద సంఖ్యలో జనం వస్తున్నప్పుడు వారికి మంచినీరు, అత్యవసర వైద్యం, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తే తప్పేంటని అడిగింది. ఆ విధమైన ఏర్పాట్లు చేయడానికి అభ్యంతరం లేదని, అయితే అందుకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల గురించే తమకున్న అభ్యంతరమని, ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయకుండానే ఖర్చు చేస్తోందని న్యాయవాది బదులిచ్చారు. ఈ విషయంపై గతంలో లోకాయుక్త ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పగానే ధర్మాసనం కల్పించుకుని.. లోకాయుక్త సిఫార్సు మాత్రమే చేస్తుందని, ఆ సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలని ఏమీ లేదని చెప్పింది. ప్రజావసరాల కోసం పోలీస్, మత్స్య, విద్యుత్, రెవెన్యూ వంటి శాఖల సేవల్ని ఉపయోగించుకోకపోతే, రేపు ఏదైనా జరగరానిది జరిగితే కోర్టులకు వచ్చి ప్రభుత్వ వైఫల్యం చెందిందని వ్యాజ్యాలు వేసే అవకాశాలు ఉంటాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఇక íసిటీ పోలీస్ కమిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్లో చేప మందుపై గతంలో దాఖలైన కోర్టు కేసుల తర్వాతే చేప ప్రసాదం పేరుతో బత్తిన సోదరులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దీనిని 1845 నుంచి ఇస్తున్నారని, దాని ఫార్ములా గోప్యంగానే ఉంచుతున్నారని, ఆస్తమా తగ్గుతుందనే నమ్మకంతో భారీ సంఖ్యలో వచ్చే వారి కోసం పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. పిటిషనర్ అచ్యుత్‌రావుపై 2017లో హైదరాబాద్ పాతబస్తీలోని టప్పాచాబుత్రా పోలీస్‌స్టేషన్‌లో బాలల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసు ఉందన్నారు. -
పట్టణ ప్రణాళికలు రెడీ!
సాక్షి, హైదరాబాద్: కొత్త పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రణాళికలను రెడీ చేస్తోంది. ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరగడానికి దోహదపడే మాస్టర్ప్లాన్లకు తుదిరూపునిస్తోంది. నూతనంగా ఏర్పడ్డ 68 పురపాలికల్లో.. 23 మున్సిపాలిటీలకు మాస్టర్ప్లాన్లను తయారు చేస్తోంది. ఇందులో ఇప్పటికే పెద్దపల్లి పురపాలిక ముసాయిదా మాస్టర్ ప్లాన్‌కు సర్కారు ఆమోదముద్ర వేసింది. మరో ఏడు మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదాలను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పురపాలక శాఖ పంపింది. పట్టణీకరణ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించే ఈ మాస్టర్ ప్లాన్‌లో భూ వినియోగంపై స్పష్టతనిస్తోంది. రహదారులకు పెద్దపీట! పట్టణాభివృద్ధికి దిక్సూచిగా చెప్పుకునే మాస్టర్‌ప్లాన్‌లో జోనల్ రెగ్యులైజేషన్‌ను విధిగా పాటించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టకుండా బ్రేక్ పడనుంది. నిర్దేశిత జోన్లో మాత్రమే నివాస భవనాలకు అనుమతులు జారీ చేయనున్నారు. రెసిడెన్షియల్ జోన్లో మాత్రమే ఈ కట్టడాలను అనుమతిస్తారు. అలాగే కమర్షియల్ జోన్లో వాణిజ్య కార్యకలాపాలను, రిక్రియేషన్/కన్జర్వేషన్ జోన్‌ను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. వీటితోపాటు మాస్టర్‌ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్‌తోపాటు ప్రజావసరాలు, మౌలిక వసతులు, రహదారుల విస్తరణపై కూడా స్పష్టత నివ్వనున్నారు. ఈ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగానే ఆయా మున్సిపాలిటీల్లో అనుమతులు జారీ చేయనున్నారు. ప్రభుత్వ పరిశీలనకు ఎనిమిది ఇప్పటికే పెద్దపల్లి మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఓకే చెప్పగా.. మహబూబాబాద్, భూపాలపల్లి, అందోల్–జోగిపేట్, దేవరకొండ, కొల్లాపూర్, నాగర్‌కర్నూలు, అచ్చంపేట పురపాలికల ముసాయిదా మాస్టర్ప్లాన్లు ప్రభుత్వ పరిశీలనకు వెళ్లాయి. ఇవిగాకుండా.. బాదేపల్లి, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, కల్వకుర్తి, కోదాడ, హుజూర్నగర్, ఐజ, నర్సంపేట, పరకాల, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లెందు, బెల్లంపల్లి, మణుగూరు మున్సిపాలిటీల మాస్టర్ప్లాన్లను డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం (డీటీసీపీ) చకచకా రూపొందిస్తోంది. వీటన్నింటికి త్వరితగతిన ఆమోదముద్ర వేయించడం ద్వారా ఆగస్టు నుంచి మనుగడలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇదిలావుండగా, ఇప్పటికే వివిధ నగరాభివృద్ధి సంస్థలు మాస్టర్ప్లాన్లను అమలు చేస్తున్నాయి. తాజాగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో అధికశాతం వీటి పరిధిలోకి వస్తున్నందున అమలులో ఉన్న మాస్టర్ప్లాన్లే వీటికి వర్తించనున్నాయి. -
గురుకులాల్లో తగ్గనున్న సీట్లు..
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రాథమిక వసతుల సమస్య వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో అయిదువందలకు పైగా కొత్త గురుకుల పాఠశాలలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. ఈ క్రమంలో అద్దె భవనాల్లోనే వీటిని స్థాపించగా... ప్రస్తుతం అక్కడ వసతుల సమస్య తలెత్తింది. క్రమంగా తరగతులు పెరుగుతుండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.దీంతో తొలుత తీసుకున్న భవనాల విస్తీర్ణం సరిపోకపోవడంతో తరగతుల నిర్వహణ భారంగా మారుతోంది.ఈక్రమంలో 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి సీట్లను సొసైటీలు కోత పెట్టాయి. ఇందులో గిరిజన గురుకుల సొసైటీలో 900సీట్లు, బీసీ గురుకుల సొసైటీలో 400 సీట్లు తగ్గాయి. రెండుకు బదులుగా ఒక సెక్షన్‌తో... సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతీ తరగతికి 2 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో 40 మంది వం తున విద్యార్థులకు అడ్మిషన్ ఇస్తారు. ఈక్రమంలో 2019–20కి గాను రాష్ట్రవ్యాప్తంగా 613 గురుకుల పాఠశాలల్లో 47,740 మందికి అడ్మిషన్లు ఇస్తూ ఇటీవల టీజీసెట్ ఆదేశాలిచ్చింది. గత నెలలో నిర్వహించిన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా వారికి ఆన్లైన్లోనే సీట్లు కేటాయించింది. ఈనెల 31లోగా నిర్దేశిత పాఠశాలల్లో ప్రవేశాలు పొందాలని స్పష్టం చేసింది.వాస్తవానికి 613 గురుకుల పాఠశాలల్లో రెండు సెక్షన్లలో 80 మంది విద్యార్థుల వంతున 49,040 సీట్లు భర్తీ చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేవలం 47,740 సీట్లకు సెట్ కన్వీనర్ పరిమితం చేయడం గమనార్హం. ఇందులో 338 బాలికల గురుకులాల్లో 26,370 సీట్లు, 275 జనరల్ గురుకులాల్లో 21,370 సీట్లు భర్తీ చేయనుంది. -
పుస్తకాల మోత..వెన్నుకు వాత
సాక్షి, అమరావతి: బడి పిల్లల పుస్తకాల బరువు తగ్గించాలని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా ఏపీ సర్కారు పట్టించుకోలేదు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ జీవోలు జారీచేసి పిల్లల పుస్తకాల బరువును తగ్గించాయి. మన రాష్ట్రం మాత్రం ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. బాలబాలికల శారీరక, మానసిక ఎదుగుదల అనేది వారికి ఉన్న హక్కు. బరువైన పుస్తకాల సంచులను వీపు మీద మోయటం వల్ల విద్యార్థులు వెన్నుపూస, ఎముకల సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎందరో వైద్యులు, బాలల హక్కుల ఉద్యమకారుల కృషితో కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ పిల్లలు మోసుకెళ్లే సంచులు, ఇంటివద్ద చేసే హోమ్ వర్క్‌పై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేస్తే ఆ మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి. ఇప్పుడు ఆలస్యం చేస్తే ఈ విద్యా సంవత్సరంలో కూడా పిల్లలు ఆ మోత బరువు నుంచి విముక్తి కాలేరు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. తరగతులను బట్టి బ్యాగుల భారం నిర్దేశించారు. కనిష్టంగా కేజీన్నర.. గరిష్టంగా 5 కేజీలు మాత్రమే పుస్తకాల బరువు ఉండాలి. తరగతుల వారీగా నిర్దేశించిన బరువు కంటే ఎక్కువ బరువును విద్యార్థులపై మోపితే స్కూల్ టీచర్లు, యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇవ్వాలి బడి పిల్లలపై మోయలేని పుస్తకాల భారాన్ని తగ్గించాలని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలి. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర మార్గదర్శకాలు అమలవుతున్నాయి. బడులు తెరవటానికి మరో 22 రోజుల గడువు ఉంది. అప్పటిలోగా పుస్తకాల బరువు తగ్గించే జీవో జారీ చేయాలి. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్‌కు, ముఖ్య కార్యదర్శికి అర్జీలు ఇచ్చాం. అయినా స్పందన లేదు. – బీవీఎస్ కుమార్, చైర్మన్, కృష్ణా జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ -
ఆర్థిక భారం.. లేదు సాయం
సాక్షి, అమరావతి: సామాన్యుడి రవాణా సాధనమైన ఆర్టీసీ బస్సు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. గత ఐదేళ్లుగా నష్టాలు నానాటికీ పెరుగుతుండడం, సర్కారు నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. కాస్త చేయూతనందించి, కష్టాల కడలి నుంచి గట్టెక్కించండి అని పదేపదే విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం కనీసం స్పందించిన పాపానపోలేదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలంటే ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థను కాపాడుకోవాలంటే టిక్కెట్ చార్జీలు పెంచడం మినహా మరో గత్యంతరం లేదని ఆర్టీసీ యాజమాన్యం తేల్చిచెబుతోంది. సంస్థ ఆస్తులు హాంఫట్ ఆర్టీసీపై అప్పుల భారం ప్రస్తుతం రూ.6,445 కోట్లకు చేరింది. నష్టాలు ప్రతిఏటా పెరుగుతూ ఇప్పుడు రూ.1,029 కోట్లకు చేరాయి. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోకపోగా, సంస్థ ఆస్తులను అస్మదీయులకు అప్పనంగా అప్పగించేసింది. బీవోటీ విధానంలో విలువైన ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టి ఆర్టీసీ మనుగడను దెబ్బతీసింది. ప్రభుత్వ ప్రచారానికి, అధికార పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను యథేచ్ఛగా వాడుకున్నారు. పోలవరం యాత్రలకు ఆర్టీసీ బస్సులను తిప్పారు. ఇందుకు గాను ఆర్టీసీకి ప్రభుత్వం రూ.75 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు జల వనరుల శాఖ విడుదల చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయినా ఇప్పటిదాకా రూపాయి కూడా రాలేదు. ముఖ్యమంత్రి సభలకు, ధర్మపోరాట దీక్షలకు డ్వాక్రా మహిళలను, జనాన్ని తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకున్నారు. వాటికి సక్రమంగా బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవు. ఫలితంగా ఆర్టీసీ రూ.కోట్లల్లో ఆదాయం కోల్పోయింది. ఆర్టీసీ సొమ్ముతో ముఖ్యమంత్రి సోకులు ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఆర్టీసీకి చెందిన రూ.9 కోట్ల నిధులతో అత్యాధునికమైన బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన సుబ్బారావు అనే పొగాకు రైతు తమకు గిట్టుబాటు కల్పించడం లేదు గానీ ముఖ్యమంత్రి కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఏటా రూ.281 కోట్ల వడ్డీ కట్టాల్సిందే.. ఆర్టీసీపై అప్పుల భారం పెరిగిపోవడంతో రుణాల కోసం బ్యాంక్‌లను ఆశ్రయించక తప్పడం లేదు. బస్టాండ్లను తనఖా పెట్టి మరీ రుణాలు పొందారు. ప్రస్తుతం బ్యాంకు రుణాలు రూ.2,026 కోట్లు ఉండగా, వీటికి వడ్డీ కింద ప్రతిఏటా రూ.281 కోట్లు బ్యాంకులకు చెల్లిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘హడ్కో’ నుంచి పొందిన రుణం రూ.793 కోట్లు ఉంది. సంస్థకు చెందిన క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ, ప్రావిడెంట్ ఫండ్‌లో కార్మికులు దాచుకున్న రూ.1,232 కోట్లను ఆర్టీసీ వాడుకుంది. కనీసం ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన యూనిఫాంను మూడేళ్లుగా ఇవ్వడం లేదు. ఎంవీ ట్యాక్స్ ముక్కు పిండి మరీ వసూలు మోటార్ వాహన పన్ను(ఎంవీ ట్యాక్స్) ఆర్టీసీకి పెనుభారంగా పరిణమించింది. ఎంవీ ట్యాక్స్ తగ్గించాలని ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలను ప్రతిఏటా ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆర్టీసీకి పన్ను మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఎంవీ ట్యాక్స్ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ ఆదాయంలో 13 శాతం ఉండేది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని 7 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీని ఆదుకోవాలంటే ఎంవీ ట్యాక్స్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ప్రభుత్వానికి ఏటా రూ.300 కోట్లు ఎంవీ ట్యాక్స్ కింద ఆర్టీసీ ఏటా ప్రభుత్వానికి రూ.300 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో ప్రతి మూడు నెలలకు 7 శాతం వంతున మోటార్ వాహన పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రతి రోజూ ఆర్టీసీకి సగటున రూ.12 కోట్ల ఆదాయం వస్తోంది. అంటే మూడు నెలలకు రూ.1,080 కోట్లు, ఏడాదికి రూ.4,320 కోట్లు. ఈ ఆదాయంలో రూ.302 కోట్ల వరకు ఎంవీ ట్యాక్స్ కింద ప్రభుత్వానికి చెల్లించాలి. 2015–16లో ఎంవీ ట్యాక్స్ రూ.280 కోట్లు ఉండగా, 2018–19 నాటికి అది రూ.316 కోట్లకు చేరింది. డీజిల్ భారం రూ.650 కోట్లు డీజిల్ ధర 2015–16లో లీటర్‌కు రూ.49 ఉండగా, 2018–19 నాటికి రూ.70.41కి చేరింది. డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ఆర్టీసీపై భారం పెరిగిపోతోంది. డీజిల్ భారం ఆర్టీసీపై ఈ ఏడాది రూ.650 కోట్లు ఉంది. ఈ భారాన్ని భరించాలని యాజమాన్యం పలుమార్లు వినతి చేసినా ప్రభుత్వం లెక్కచేయలేదు. డీజిల్‌పై వ్యాట్ 17 వాతం వరకు ప్రభుత్వానికి చెల్లించాలి. దీన్ని తగ్గించాలని కోరుతున్నా సర్కారు ససేమిరా అంటోంది. ధనిక వర్గాలు ప్రయాణించే విమాన ఇంధనంపై ప్రభుత్వం కేవలం 1 శాతమే వ్యాట్ వసూలు చేస్తోంది. మిగిలిన 16 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తుండడం గమనార్హం. -
ఫార్మా సిటీ.. వెరీ పిటీ
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగాన్ని విస్తరించేందుకు హైదరాబాద్ సమీపంలోని 18,304 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే తొలి సమీకృత ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 2015లో ప్రకటించింది. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) పరిధిలో ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ‘హైదరాబాద్ ఫార్మా సిటీ లిమిటెడ్’పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కూడా ఏర్పాటు చేశారు. ప్రతిపాదిత ఫార్మా సిటీలో బాహ్య, అంతర్గత మౌలిక సౌకర్యాలు పూర్తి చేసి.. 2019 నాటికి ఔత్సాహిక ఫార్మా సంస్థలకు భూ కేటాయింపులు, అనుమతులు ఇచ్చేలా టీఎస్ఐఐసీ షెడ్యూలు రూపొందించింది. తొలి విడతలో 9,212 ఎకరాలకు గాను 6,719 ఎకరాలను సేకరించగా, మిగతా భూమిని సేకరించడంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టింది. తొలి విడత భూ సేకరణకు హడ్కో ద్వారా టీఎస్ఐఐసీ రూ.725 కోట్లు రుణం తీసుకోవడంతో పాటు, ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధుల కోసం ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)కు ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఫార్మాసిటీ ప్రాజెక్టుకు నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి) హోదా ఇచ్చేందుకు కేంద్ర పరిశ్రమల శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక, విధాన విభాగం (డిప్) 2017 ఏప్రిల్‌లో సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. నయా పైసా విదల్చని ‘డిప్’ హైదరాబాద్ ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా దక్కడంతో బాహ్య, అంతర్గత మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.6 వేల కోట్లు ఇవ్వాలంటూ కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహక, విధాన విభాగం ‘డిప్’కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు నాటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ వినతిపత్రం కూడా ఇచ్చారు. తొలి విడతలో రూ.1,500 కోట్లు విడుదల చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినా, రెండేళ్లుగా ఫార్మా సిటీకి కేంద్రం నుంచి నయాపైసా విదల్చలేదు. ఫార్మా సిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,395 కోట్లు కాగా, నిమ్జ్ హోదా ద్వారా కనీసం రూ.6 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు సమకూర్చుకుని మౌలిక సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో 2019 మే నాటికి ఔత్సాహికులకు ఫార్మాసిటీలో భూ కేటాయింపులు చేస్తామనే ప్రకటన ఇప్పట్లో ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. వడివడిగా టీఎస్ఐఐసీ అడుగులు... ఫార్మాసిటీ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ఐఐసీ మొదట్లో వడివడిగా అడుగులు వేసింది. ఫార్మాసిటీని ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ సుమారు రూ.400 కోట్లతో రహదారుల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టింది. మరోవైపు పర్యావరణ అనుమతులు సాధించడంతో పాటు, సింగపూర్‌కు చెందిన సుర్బాన జురోంగ్ కన్సల్టెంట్స్ ద్వారా సమీకృత మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించిన ప్రణాళిక తుది దశలో ఉంది. సమీకృత కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు (సీఈటీపీ), జీరో లిక్విడ్ డిశ్చార్జి (జడ్ఎల్డీ) ప్లాంట్లను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ను 2017లో విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించి, 8 కంపెనీలను వడపోతలో ఎంపిక చేశారు. జహీరాబాద్ నిమ్జ్‌పైనా ప్రభావం... దేశ వ్యాప్తంగా మొత్తం 22 భారీ పారిశ్రామిక వాడలకు నిమ్జ్ హోదా దక్కగా, ఇందులో రాష్ట్రంలో రెండు ఉన్నాయి. ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా సూత్రప్రాయంగా దక్కగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్‌కు తుది ఆమోదం లభించింది. అయితే జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.3 వేల కోట్లివ్వాలని టీఎస్ఐఐసీ ప్రతిపాదించినా కేంద్రం నుంచి నిధులు విడుదల కావడం లేదు. దీంతో ఫార్మాసిటీ తరహాలో జహీరాబాద్ నిమ్జ్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. కేంద్రం నుంచి స్పందన కరువు... ఫార్మా సిటీకి నిమ్జ్ హోదా నేపథ్యంలో మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులివ్వాల్సిందిగా టీఎస్ఐఐసీ కేంద్రాన్ని కోరింది. జీరో లిక్విడ్ డిశ్చార్జి గ్రాంటు కోసం కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్ విభాగానికి ప్రతిపాదనలు సమర్పించింది. సీఈటీపీ నిధుల కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. గ్రీన్‌క్లైమేట్ ఎన్విరాన్మెంట్ ఫండ్ ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖకూ లేఖ రాసింది. అయితే ప్రతిపాదనలు పంపించి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం నుంచి నిధుల విడుదల విషయంలో కనీస స్పందన కానరావడం లేదు. కేంద్రం నుంచి గ్రాంటు విషయంలో స్పష్టత లేకపోవడంతో సీఈటీపీ, జడ్ఎల్డీ ప్లాంట్లను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఎంపిక చేసిన 8 కంపెనీల వడపోత ప్రక్రియను టీఎస్ఐఐసీ నిలిపివేసింది. ఫార్మాసిటీ ప్రత్యేకతలు.. పెట్టుబడుల అంచనా: రూ.64 వేల కోట్లు ఫార్మా ఎగుమతులు (ఏటా): రూ.58 వేల కోట్లు ప్రత్యక్ష ఉపాధి: 1.70 లక్షల మందికి పరోక్ష ఉపాధి: 3.90 లక్షల మందికి కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు, మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్, క్వాలిటీ సర్టిఫికేషన్ ల్యాబ్, లాజిస్టిక్ హబ్, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఎన్విరాన్ మేనేజ్మెంట్ సెల్, సమీకృత నివాస గృహాల సముదాయం, ఫార్మా ఉత్పత్తి యూనిట్లు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వీటితో పాటు ఫార్మా సిటీ ప్రాంగణంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. -
నత్తనడకన ‘నిమ్జ్’ భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి ‘నిమ్జ్’ ఏర్పాటుకోసం రాష్ట్రం ప్రభుత్వం చేస్తోన్న భూసేకరణ యత్నాలు ముందుకు సాగడంలేదు. మూడేళ్ల క్రితం ఈ నిమ్జ్ ఏర్పాటుకు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో కచ్చితంగా ఐదువేల హెక్టార్లు (సుమారు 12,500 ఎకరాలు) సేకరించాలని కేంద్రం నిర్దేశించింది. దీనిలో భాగంగా 2016 మార్చి లోగా భారీ పారిశ్రామికవాడ స్థాపనకు అవసరమైన తొలి విడత భూమి ని సేకరిస్తేనే ‘నిమ్జ్’ హోదా దక్కుతుందని షరతు విధించింది. దీంతో నిమ్జ్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతాన్ని ఎంపిక చేసి భూ సేకరణ ప్రారంభించింది. రాష్ట్రంలో వరుస ఎన్నికలు ఓవైపు, మరోవైపు ప్రభుత్వం చెల్లించే ధర తమకు ఆమోదయో గ్యం కాదంటూ రైతులు చెబుతుండటంతో తొలి విడత భూసేకరణ ప్రక్రియ కొలిక్కి రావట్లేదు. 12,635 ఎకరాలకు గానూ తొలి విడతలో న్యాలకల్ పరిధిలోని ముంగి, రుక్మాపూర్‌తో పాటు, ఝరాసంగం మండల పరిధిలో బర్దీపూర్, చీలపల్లి, ఎల్గో యి గ్రామాల పరిధిలో 3,501 ఎకరాలు సేకరించాలని రెవెన్యూ విభాగానికి లక్ష్యం విధించారు. 2016లో భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు రూ.132.85 కోట్లు వెచ్చించి 2,925 ఎకరాలుసేకరించారు. తొలి విడతలో సేకరించాల్సిన మిగతా 566 ఎకరాల భూమిలో గ్రామ కంఠం, చెరువులు, కుంటలతో పాటు కొన్ని భూములపై కోర్టు కేసులతో భూ సేకరణ ముందుకు సాగడం లేదు. ధర చెల్లింపుపై రైతుల అసంతృప్తి రాష్ట్ర భూ సేకరణ చట్టం 2017లోని జీవో 123 నిబంధనలకు అనుగుణంగా తొలి విడతలో 2,925 ఎకరాల పట్టా, అసైన్మెంట్, ప్రభుత్వ భూములను రెవెన్యూ యంత్రాంగం సేకరించింది. ఎకరాకు అసైన్డ్ భూములకు రూ.3.25 లక్షలు, పట్టా భూములకు రూ.5.65లక్షల చొప్పున చెల్లించారు. అసైన్డ్ భూములకు సంబంధించి కొన్ని చోట్ల రైతులు కబ్జా లో ఉన్నా.. సాంకేతిక అంశాలను కారణంగా చూపు తూ పరిహారం చెల్లించేందుకు అధికారులు నిరాకరించారు. నిమ్జ్ ఏర్పాటు ప్రకటనతో స్థానికంగా ఎకరా భూమి ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల పైనే పలుకుతోంది. దీంతో రైతులు, రైతు కూలీలు ఆందో ళన చెందుతున్నారు. తమకు భూసేకరణపై అవగాహన కల్పించకుండా, హడావుడిగా భూములు తీసుకున్నారని తొలి విడతలో భూములు కోల్పోయిన రైతులు ఆరోపిస్తున్నారు. తమకు చెల్లించాల్సిన పరిహారం పెంచాలని డిమాండు చేస్తున్నారు. ధర పెంచాలంటూ రైతుల ఒత్తిడి రెండు, మూడు విడతల్లో సేకరించే భూముల్లో ఎక్కు వ శాతం పట్టా భూములే ఉన్నాయి. రెండో విడతలో 1,269 ఎకరాల సేకరణ ప్రతిపాదనలను నిమ్జ్ వర్గా లు రెవెన్యూ శాఖకు పంపించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో భూములు అప్పగించాల్సిందిగా కోరుతూ సంబంధిత గ్రామాల్లో జహీరాబాద్ ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు సదస్సులు నిర్వహించారు. ఎకరాకు రూ.7 లక్షలు చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెప్తుండగా, రైతులు మాత్రం భూమి ధరను పెంచాలని డిమాండ్ చేస్తుండటంతో భూ సేకరణ సవాలుగా మారింది. నిమ్జ్ ఏర్పాటైతే కేంద్రం నుంచి వచ్చేవి ఇవి... నిమ్జ్‌ను జాతీయ రహదారులతో అనుసంధానం, మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం వంద శాతం గ్రాంటు రూపంలో ఇస్తుంది. ఆ తర్వాత పారిశ్రామిక పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు విడిగా ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తుంది. ఈ లెక్కన జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక సదుపాయాలకు రూ.3వేల కోట్లు గ్రాంటు రూపంలోనూ.. అందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు రూ.4వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు, రాయితీ రూపంలో అందే వీలుంది. -
చిన్న పరిశ్రమకు చేయూత
రాష్ట్రంలో నష్టాల బాటలో ఉన్న పరిశ్రమలను గట్టెక్కించేందుకు అవసరమైన నిధుల సేకరణపై కూడా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ దృష్టి సారించింది. రాష్ట్రంలో 13,581 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలుండగా, రూ.1,018 కోట్ల పెట్టుబడితో స్థాపించిన సూక్ష్మ పరిశ్రమలు 62 వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రూ.76,286 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన చిన్న తరహా పరిశ్రమలు సుమారు 75 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల యజమానుల్లో చాలా మందికి వ్యాపార దక్షత లేకపోవడం, మార్కెటింగ్ ఒడిదుడుకులతో ఆ పరిశ్రమలు కాస్తా నష్టాల బాట పడుతున్నాయి. అయితే ఇందులో సుమారు 3,700 పరిశ్రమలు 6 నెలలుగా కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను తొలి దశలో హెల్త్ క్లినిక్ వడపోస్తున్నది. వీటిలో నిర్వహణ లోపం, మార్కెటింగ్ ఉన్నా వర్కింగ్ క్యాపిటల్ పెట్టే పరిస్థితి లేక నష్టాల్లో కూరుకుపోతున్న పరిశ్రమలను గుర్తిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ నిధుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నష్టాల పాలవ్వకుండా గాడిన పెట్టి దానిపై ఆధారపడిన కార్మికులు నష్టపోకుండా కాపాడేందుకు 2017లో రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్’ను ఏర్పాటు చేసింది. నష్టాల్లో ఉన్న పరిశ్రమల పునరుద్ధరణతో సరిపెట్టకుండా, వాటి వ్యాపార దక్షత పెంచే బాధ్యతను కూడా హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఐహెచ్‌సీఎల్) భుజాలకెత్తుకుంటోంది. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ టీఎస్ఐడీసీ అడుగుజాడల్లో ఏర్పాటైన టీఐహెచ్‌సీఎల్‌ను రూ.100 కోట్ల మూలనిధితో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో రాష్ట్రం తన వంతు వాటాగా రూ.10 కోట్లు, కేంద్రం నుంచి రూ.50 కోట్లు వాటాగా చెల్లించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇప్పటివరకు రూ.7 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. మరో రూ.50 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల నుంచి సేకరించాలని నిర్ణయించారు. హెల్త్ క్లినిక్ కార్యకలాపాలకు సలహాదారు, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓతో కూడిన బోర్డుతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులతో ప్రత్యేక వ్యూహ బృందం కూడా పనిచేస్తోంది. ఏడుగురు సభ్యులున్న ఈ బృందంలో బ్యాంకింగ్, పాలన, పారిశ్రామిక రంగాలకు చెందిన నిపుణులు, అధికారులున్నారు. ఏడాది పాటు పర్యవేక్షణ నష్టాల బాటలో ఉన్న పరిశ్రమలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు, వాటి పనితీరును ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏడాది పాటు పర్యవేక్షిస్తోంది. సదరు పరిశ్రమలకు మార్కెటింగ్, ఉత్పత్తిలో మెళకువలపై కూడా హెల్త్ క్లినిక్ బృందాలు శిక్షణ ఇస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు సాధిస్తున్న హెల్త్ క్లినిక్ పనితీరుపై ఇతర రాష్ట్రాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. రుణా గ్రస్త పరిశ్రమలను తిరిగి గాడిలో పెట్టడంపై తమకు సహకారం అందించాల్సిందిగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వినతులు అందుతున్నట్లు హెల్త్ క్లినిక్ అధికారులు చెప్తున్నారు. లోక్‌సభ ఎన్నికల పర్వం ఇతర రాష్ట్రాల్లోనూ కన్సల్టెన్సీ సేవలు అందించడంపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ ఎన్ని.. ఇకపై ఎన్ని.. - తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 149 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల పునరుద్ధరణపై ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఐహెచ్‌సీఎల్) దృష్టి సారించింది. - ఇప్పటివరకు 41 పరిశ్రమలను పునరుద్ధరించగా, మరో 14 పరిశ్రమల స్థితిగతులపై అధ్యయనం జరుగుతోంది. పునరుద్ధరించిన పరిశ్రమల్లో అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 23, హైదరాబాద్‌లో 5, యాదాద్రి భువనగిరిలో 3, వరంగల్ అర్బన్ జిల్లాలో 2 పరిశ్రమలున్నాయి. - ఇక మేడ్చల్, జగిత్యాల, జనగామ, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో ఒక్కో పరిశ్రమను చొప్పున తిరిగి పట్టాలెక్కించారు. వీటిలో ఎక్కువగా మరమగ్గాలు, లోహ వస్తుత్పత్తికి సంబంధించిన పరిశ్రమలే ఉన్నాయి. -
మా సొమ్ములివ్వండి మహాప్రభో..!
సాక్షి, హైదరాబాద్ : దరఖాస్తులు తిరస్కరించి నాలుగేళ్లయినా.. చెల్లించిన సొమ్ము మాత్రం తిరిగి రాలేదు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో వెలిసిన కట్టడాల క్రమబద్ధీకరణకు 2015లో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు జీఓ 58,59ను జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు జీఓ 58 కింద ఉచితంగా స్థలాలను క్రమబద్ధీకరించిన సర్కారు..జీఓ 59 కింద (చెల్లింపు కేటగిరీ)మాత్రం నిర్దేశిత మొత్తాన్ని చెల్లించిన వారికి స్థల యాజమాన్య హక్కులు కల్పించింది. అయితే, జీఓ 59 కింద అనర్హమైన దరఖాస్తుదారుల డబ్బులను రిఫండ్ చేయకుండా మొండికేసింది. తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు డబ్బును వాపసు చేయమని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి ఏడాది క్రితం ఉత్తర్వులు జారీ చేసినా జిల్లా కలెక్టర్లు మాత్రం పట్టించుకోవడంలేదు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు అర్జీలు స్వీకరించిన సమయంలో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో దరఖాస్తుదారులు నిర్దేశిత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించారు. ఈ నిధులను కొన్నాళ్లు తమ ఖాతాల్లోనే ఉంచుకున్న తహసీల్దార్లు.. ఏ పద్దు కింద వీటిని డిపాజిట్ చేయాలో తెలియక స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు అట్టిపెట్టుకోవడం సరికాదని భావించిన ప్రభుత్వం.. ఆ నిధులను ట్రెజరీల్లో జమ చేయాలని ఆదేశించింది. మూలుగుతున్న రూ.48.56 కోట్లు చెల్లింపు కేటగిరీ కింద స్థలాల క్రమబద్ధీకరణ చేసుకున్న అర్జీలలో 2,761 దరఖాస్తులను ప్రభుత్వం తోసిపుచ్చింది. మార్గదర్శకాలకు అనుగుణంగా లేనివాటిని, రైల్వే, కాందిశీకులు, తదితర కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భూములు, ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన కట్టడాల రెగ్యులరైజ్‌కు చేసుకున్నవాటిని అనర్హమైనవి తేల్చింది. ఈ మేరకు తిరస్కరణ గురైన దరఖాస్తుదారులకు చెల్లించిన మొత్తాన్ని వాపస్ చేయనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్, మెదక్, జోగులాంబ–గద్వాల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రూ.48.56 కోట్లు ఇవ్వాల్సివుంటుందని లెక్క గట్టింది. దీంతో స్థలాల క్రమబద్ధీకరణకు నోచుకోకపోవడంతో నిరాశకు గురైన అర్జీదారులు కనీసం చెల్లించిన మొత్తమైనా వస్తుందని భావించి తహసీళ్ల చుట్టూ చక్కర్లు కొట్టారు. దరఖాస్తుదారులు కట్టిన మొత్తాన్ని ట్రెజరీల్లో జమ చేసినందున.. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే తప్పా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దరఖాస్తుదారుల ఆవేదనను ఆర్థం చేసుకున్న కలెక్టర్లు రిఫండ్ విషయాన్ని తేల్చాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సర్కారు.. డబ్బును వాపస్ చేయమంటూ ఉత్తర్వులు జారీ చేసినా.. ఏ పద్దు కింద ట్రెజరీ నుంచి తిరిగి తీసుకోవాలనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఆఖరికి ఈ వ్యవహారంపై స్పష్టతనిస్తూ గతేడాది మే 18న జీఓ 206 జారీ చేసినా.. కలెక్టర్లు ఇప్పటివరకు దరఖాస్తుదారులకు నయాపైసా వెనక్కి ఇవ్వలేదు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారులు చక్కర్లు కొడుతున్నా.. రెవెన్యూ గణం మాత్రం కనికరించడంలేదు. దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్నట్లుగా ప్రభుత్వం ఆదేశాలిచ్చినా.. కలెక్టర్లు మాత్రం స్పందించకోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
‘గురుకుల’ పోస్టుల విభజనకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలలకు మంజూరు చేసిన పోస్టుల భర్తీకి గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) చర్యలు చేపట్టింది. అయితే, రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టులను విభజించాల్సి ఉంది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి పోస్టులేమిటనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పోస్టుల విభజనపై ఇటీవల గురుకుల నియామకాల బోర్డు ప్రభుత్వాన్ని వివరణ కోరగా మీరే తేల్చుకుని వివరాలివ్వాలని సూచించింది. ఈ క్రమంలో పోస్టుల విభజనపై గురుకుల నియామకాల బోర్డు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. గురుకుల విద్యాసంస్థల సొసైటీల నుంచి ఎనిమిది మంది సీనియర్ అధికారులను ఇందులో నియమించింది. ఉద్యోగాల కేటగిరీ, వర్క్ పర్ఫార్మెన్స్, పేస్కేల్ తదితర అంశాలను ప్రాతిపదికన తీసుకుని పోస్టుల విభజన చేసేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీలతోపాటు సొసైటీ కార్యాలయాలు, రీజినల్ కార్యాలయాల్లోని ఉద్యోగుల సమాచారాన్ని కమిటీ సేకరించి పరిశీలిస్తోంది. పోస్టుల విభజనపై నివేదికను రూపొందించిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు గురుకుల నియామకాల బోర్డు కన్వీనర్ నవీన్ నికోలస్ ‘సాక్షి’తో అన్నారు. విభజన పూర్తయితేనే కొత్త నియామకాలు కొత్త జోనల్ విధానం అందుబాటులోకి రావడంతో పోస్టుల విభజన అనివార్యమైంది. దీంతో పోస్టుల విభజన అంశాన్ని పలు శాఖలు ప్రభుత్వానికి వదిలేశాయి. అయితే, గురుకుల పాఠశాలల్లో కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేస్తున్న తరుణంలో సొసైటీ పరిధిలోని పోస్టులను విభజించేందుకు గురుకుల బోర్డు చర్యలు చేపట్టింది. సొసైటీకి ప్రత్యేక సర్వీసు నిబంధనలు ఉండటంతో ఆ మేరకు పోస్టులు విభజించొచ్చనే భావనతో గురుకులబోర్డు చర్యలు వేగవంతం చేసింది. దీంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పరిశీలన పూర్తిచేయాలని ఆదేశించింది. వారంలోగా కమిటీ నివేదిక వచ్చే అవకాశం ఉంది. అనంతరం ప్రభుత్వానికి సమర్పించి ఆమోదింపజేసుకోవచ్చని అధికారులు యోచిస్తున్నారు. -
గురుకులాల్లో ‘సమగ్ర వార్షిక ప్రణాళిక’
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లో సమగ్ర విద్యావిధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గురుకుల సొసైటీల నిర్ణయాలకు తగినట్లుగా ఆయా పాఠశాలల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సాగుతున్నాయి. కేజీ టు పీజీ విద్యా కార్యక్రమంలో భాగంగా అన్ని గురుకుల పాఠశాలల్లో ఒకే తరహా బోధన, అభ్యసనతోపాటు బోధనేతర కార్యక్రమాలన్నీ ఒకే పద్ధతిలో ఉండాలని నిర్ణయించింది. దీంతో అన్ని గురుకుల సొసైటీలకు సమగ్ర వార్షిక ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిందిగా సూచించింది. సమగ్ర వార్షిక ప్రణాళిక రూపకల్పనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీ కార్యదర్శులకు సూచనలు చేసింది. ప్రస్తుతం సొసైటీల వారీగా రూపొందించిన ప్రణాళిక ఆధారంగా సమగ్ర ప్రణాళికను తయారు చేస్తారు. జూన్ 1 నుంచే అమలు.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పాఠశాల ప్రారంభం నుంచి ముగింపు వరకు చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి అకడమిక్ క్యాలెండర్ తయారు చేస్తారు. ఈ క్యాలెండర్ ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో రోజువారీ కార్యక్రమాలు అమలు చేస్తారు. ఇదే తరహాలో గురుకుల విద్యా సంస్థల సొసైటీ సైతం ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తుంది. సొసైటీలు ఎవరికివారు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుంటున్నప్పటికీ.. కొన్ని కార్యక్రమాల్లో వ్యత్యాసం ఉండటంతో ఒకే తరహా ఫలితాలు రావడం లేదనే భావన ఉంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని గురుకుల పాఠశాలల్లో సమగ్ర వార్షిక ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అన్ని సొసైటీ కార్యదర్శులకు సూచనలు చేసిన ప్రభుత్వం.. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదించాలని స్పష్టం చేసింది. సొసైటీ కార్యదర్శులు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు ప్రభుత్వ ఆమోదం దక్కిన వెంటనే అమల్లోకి వస్తుంది. జూన్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో ఆ రోజు నుంచే సమగ్ర ప్రణాళిక అమలు చేసేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఒకే సమయపాలన, ఒకేసారి పరీక్షలు.. సమగ్ర ప్రణాళికతో అన్ని గురుకుల పాఠశాలల పనివేళలు ఒకే తరహాలో ఉంటాయి. విద్యార్థుల డైట్ మెనూ, పాఠ్యాంశ బోధన, అభ్యసనా కార్యక్రమాలు, సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షలు కూడా ఒకేసారి జరుగుతాయి. బోధన కార్యక్రమాలతో పాటు బోధనేతర కార్యక్రమాలైన క్రీడలు, ఇతర శిక్షణ కార్యక్రమాలు నిర్ణీత తేదీల్లో ఉండటంతో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ సులభతరమవుతుంది. విద్యార్థుల కార్యక్రమాలతోపాటు ఉపాధ్యాయులు కూడా అన్ని సొసైటీలకు కలిపి ఒకేచోట శిక్షణ కార్యక్రమాలు చేపడితే నిధుల వ్యయం కూడా కలసి వస్తుందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
108లో ఆక్సిజన్ లేక రోగి మృతి
పిఠాపురం : 108 వాహనాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా మరో నిండు ప్రాణం బలైపోయింది. వాహనంలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణం ఇందిరా కాలనీకి చెందిన కూరపాటి చిన గంగరాజుకు భార్య చింతాలమ్మ, ఇద్దరు కుమారులున్నారు. ఆయన కొంతకాలం కిందట అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకున్నాక వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున గంగరాజు ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఇది గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఇంతలో శుక్రవారం ఉదయం మళ్లీ అదే పరిస్థితి ఎదురవగా ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. 108లో అయితే ఆక్సిజన్ ఉంటుందని భావించి ఫోన్ చేశారు. అది రాగానే ఆక్సిజన్‌ను వెంటనే పెట్టాలని అభ్యర్థించగా.. రెగ్యులేటర్ పనిచేయడంలేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఆక్సిజన్ లేకుండానే అందులో తరలిస్తుండగా మార్గమధ్యంలో గంగరాజు మృతిచెందాడు. ఆక్సిజన్ ఉండి ఉంటే మృతిచెంది ఉండేవాడు కాదని బంధువులు రోదిస్తూ చెప్పారు. కాగా, గత కొన్ని రోజులుగా ఆక్సిజన్ ఉపయోగించే రెగ్యులేటర్ పనిచేయడంలేదని, మరమ్మతుల కోసం పై అధికారులకు సమాచారం ఇచ్చామని 108 సిబ్బంది వివరించారు. మరమ్మతులు కాకపోవడంవల్లే ఆక్సిజన్ అందించలేక పోయామన్నారు. -
భూ మార్పిడికి రైతుల మొగ్గు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని చూసిన తర్వాత అన్నదాతల ఆలోచనలు మారుతున్నాయి. వ్యవసాయ భూమి ఉండటం ఎంత లాభదాయకమో ఇప్పుడు వారికి తెలిసివస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో వివిధ కారణాల వల్ల వ్యవసాయ భూములను వ్యవసాయేతర వినియోగం (నాన్ అగ్రికల్చరల్ / నాలా) కోసం మార్పిడి చేసుకున్న రైతులు ఇప్పుడు తిరిగి అవే భూములను వ్యవసాయ భూములుగా మార్చాలంటూ రెవెన్యూ ఉన్నతాధికారులను కోరుతున్నారు. నాన్ అగ్రికల్చరల్ భూమిని అగ్రికల్చర్ భూమిగా మార్చుకునేందుకు పలువురు పట్టాదారులు ముందుకు వస్తున్నారు. గతంలో కంపెనీల నిర్మాణం, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమనో ముందుగానే అగ్రికల్చర్ భూములను నాన్ అగ్రికల్చర్ భూములుగా మార్పిడి చేసుకున్నారు. దీనికోసం ఆయా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే ఆ భూములు నాన్ అగ్రికల్చర్ భూములుగా మారిపోయాయి. ప్రస్తుతం ఆ భూముల్లో కంపెనీల నిర్మాణం చేపట్టకపోవడంతో పాటు, మరికొన్ని భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేయకపోవడంతో చాలా ప్రాంతాల్లో అలాగే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం పేర ఎకరాకు సంవత్సరానికి రూ.8 వేల చొప్పున గత ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఆర్థిక సాయం అందజేసింది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి పెంచిన డబ్బులు అందనున్నాయి. ఎకరాకు ఒక సీజన్‌కు రూ.5 వేల చొప్పున సంవత్సరానికి రూ.10 వేలు రైతుకు అందనున్నాయి. దీంతో పాటు గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు సాధారణ మరణం పొందినా రూ.5 లక్షల బీమా సౌకర్యం వర్తిస్తోంది. రైతుల పిల్లలకు అగ్రికల్చర్ బీఎస్సీ సీట్లలో (పాస్ పుస్తకాలు ఉన్నవారికి ) రిజర్వేషన్ అవకాశం కూడా ఉంది. అదే మాదిరిగా, బంగారు రుణాలపై కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి పొందితే తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి. వాటితో పాటు పంట రుణాలు కూడా బ్యాంకుల నుంచి అతితక్కువ వడ్డీకి వస్తున్నాయి. ఇలా.. వ్యవసాయ భూమి ఉన్న రైతులు ఎన్నో ప్రయోజనాలను పట్టాదారు పాస్ పుస్తకాలతో పొందుతున్నారు. దీంతో పలువురు రైతులు తిరిగి తమ ‘నాలా’భూములను రద్దు చేయించుకుని వ్యవసాయ భూములుగా మార్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. నష్టపోతున్న ‘నాలా’యజమానులు కంపెనీల నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తమ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకున్న వారు తాము నష్టపోతున్నామన్న భావనకు వచ్చారు. అగ్రికల్చర్ భూమిని నాన్ అగ్రికల్చర్ భూమిగా ఒక సారి మారిస్తే.. ఇక, ఆ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉండవు. పైగా ప్రభుత్వం వ్యవసాయ భూములకు అందించే ఎలాంటి పథకాలు కూడా ఆ యజమానులకు వర్తించవు. నాన్ అగ్రికల్చర్ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పితే ఆ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందే అవకాశం ఉంది. కానీ అవి ఏర్పాటు చేయని కారణంగా ఇటు సబ్సిడీ రాకపోవడంతో పాటు వ్యవసాయదారులకు ఇచ్చే పథకాలు కూడా వర్తించకపోవడంతో వారు పునరాలోచనలో పడుతున్నారు. దీంతో అగ్రికల్చర్ భూములను నాన్ అగ్రికల్చర్ భూములుగా మార్చుకున్నవారు తిరిగి వ్యవసాయ భూములుగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకుంటున్నారు. సీసీఎల్ఏకు దరఖాస్తులు నల్లగొండ జిల్లా కనగల్ మండలం చర్లగౌరారం శివారులో గట్టు పద్మావతి, యాపాల వెంకట్‌రెడ్డి అనే ఇద్దరు భూ యజమానుల పేర సర్వే నంబర్ 254లో ఆరున్నర ఎకరాల భూమి ఉంది. గతంలో అక్కడ బయోగ్యాస్ ప్లాంట్ కోసం తమ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడిచేసుకున్నారు. కానీ, అక్కడ ఆ ప్లాంటును నెలకొల్పలేదు. ఫలితంగా ఆ భూమి నాన్ అగ్రికల్చరల్ భూమిగానే కొనసాగుతోంది. దీంతో వీరు అగ్రికల్చర్ భూమిగా మార్చుకునేందుకు సీసీఎల్ఏకు దరఖాస్తు చేసుకున్నారు. వీరే కాకుండా.. వివిధ మండలాల నుంచి నాన్ అగ్రికల్చర్ భూమిని అగ్రికల్చర్ భూమిగా మార్చా లంటూ ఏడాది కాలంగా రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారని జిల్లా రెవెన్యూ అధికార వర్గాలు చెబుతున్నాయి. నాన్ అగ్రికల్చర్ భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకోవాలనుకున్నా.. ప్రభుత్వం ఇచ్చే ఉచిత విద్యుత్‌ను కూడా వాడుకునే అవకాశం ఉండదు. ప్రత్యేక చట్టంచేయాల్సిందే అగ్రికల్చర్ భూమిని నాన్ అగ్రికల్చర్ భూమిగా మార్చేందుకు మాత్రమే చట్టం ఉందని, కానీ.. నాన్ అగ్రికల్చర్ భూమిని తిరిగి అగ్రికల్చర్ భూమిగా మార్చేందుకు చట్టం లేదని, దీనికోసం కొత్త చట్టం చేయాల్సిందేనని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు దరఖాస్తులు పెట్టుకుంటున్నారని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని అధికారవర్గాలు చెప్పాయి. తాజాగా కొందరు సీసీఎల్ఏకు దరఖాస్తు చేసుకోగా అక్కడినుంచి నల్లగొండ కలెక్టరేట్‌కు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి కూడా అన్ని వివరాలను సీసీఎల్ఏకు రాసి తిరిగి పంపుతున్నట్లు రెవెన్యూ వర్గాలు చెప్పాయి. -
విద్యుత్ డిమాండ్ 14,500 మెగావాట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా భారీగా పెరగనుంది. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 100 టీఎంసీల నీటిని తరలించి వచ్చే ఖరీఫ్‌లో కనీసం 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు తొలిసారిగా సాగునీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ లక్ష్యం మేరకు పనులు సమయానికి పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు గోదావరి జలాలను ఎత్తిపోయడానికి పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న చిన్నాచితక ఎత్తిపోతల పథకాలకు 1,080 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ సంస్థ (డిస్కం)లు సరఫరా చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అదనంగా 600–2,600 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఈ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు ప్రారంభం కానున్న నేపథ్యం లో వచ్చే జూలై నుంచి రాష్ట్ర విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతూ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వచ్చే సరికి రికార్డు స్థాయిలో 14,500 మెగావాట్లకు ఎగబాకనుందని రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) అంచనా వేసింది. మార్చి 4న ఏర్పడిన 10,501 మెగావాట్ల విద్యుత్ డిమాండే ఇప్పటివరకు రాష్ట్ర అత్యధిక విద్యుత్ డిమాండ్‌కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బకు వచ్చే జూలైలో ఈ రికార్డు కనుమరుగు కానుంది. జూలైలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 12,000 మెగావాట్లకు చేరనుంది. బోరు బావుల కింద పంటల సాగు లేకపోవడంతో ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రోజుకు సగటున 8,200 మెగావాట్లకు తగ్గిపోయింది. జూలై నుంచి బోరు బావుల కింద ఉన్న ఆయకట్టుతోపాటు కాళేశ్వరం కొత్త ఆయకట్టుకు నీటి సరఫరా ప్రారంభం కానున్న నేపథ్యం లో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ అమాంతం పెరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేయండి.. వచ్చే జూలై నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగునీటి సరఫరా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యుత్ సంస్థలకు నీటిపారుదలశాఖ విజ్ఞప్తి చేసింది. భక్త రామదాసు, దేవాదుల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎల్లంపల్లి తదితర ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే విద్యుత్ సంస్థలు గరిష్టంగా 1,080 మెగావాట్ల వరకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపో తల కోసం అదనంగా 600–2,600 మెగా వాట్ల విద్యుత్‌సరఫరా చేయాలని నీటిపారుదలశాఖ కోరింది. ఈ ప్రాజెక్టుకు ఏ నెలలో ఎంత విద్యుత్ అవసరమన్న లెక్కలను అందించింది. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే జూలై నుంచి అదనంగా 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు టెండర్ల ను పిలిచామన్నారు. నిర్మాణంలో ఉన్న 1,080 మెగావాట్ల భద్రాద్రి విద్యుత్ కేంద్రం నుంచి డిసెంబర్ నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభం కానుందన్నారు. డిస్కంలపై తీవ్ర ఆర్థిక భారం! కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం డిస్కంలు ముందస్తుగా భారీ ఎత్తున విద్యుత్‌ను సమీకరించి పెట్టుకుంటున్నాయి. ఇందుకోసం రూ. వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి కాకపోయినా లేక ఈ ప్రాజెక్టు కోసం సమీకరించిన విద్యుత్‌ను పూర్తిగా వాడుకోవడంలో విఫలమైనా డిస్కంలు భారీగా నష్టపోనున్నాయి. డిస్కంలు మరింత సంక్షోభంలో కూరుకుపోనున్నాయి. థర్మల్, సోలార్, జల విద్యుత్ ప్లాంట్లు కలిపి రాష్ట్రం ఇప్పటికే దాదాపుగా 16,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే 9,000 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మినహాయిస్తే జల, సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి ఎప్పడు అవసరముంటే అప్పుడు విద్యుదుత్పత్తి చేసుకొని వాడుకోవడానికి అవకాశం లేదు. రాష్ట్రంలో 3,700 మెగావాట్ల సామర్థ్యంగల సౌర విద్యుత్ కేవలం పగటి వేళల్లోనే ఉత్పత్తి అవుతుంది. 2,441 మెగావాట్ల సామర్థ్యంగల జల విద్యుదుత్పత్తి కేంద్రాలున్నా ఆయా జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలున్నప్పుడే జలవిద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాలను తీర్చడానికి వచ్చే జూలై నుంచి మరో 1,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేయనున్నాయి. -
వైఎస్సార్సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేశాం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ నిజమేనని హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. టెలిగ్రాఫ్ చట్టం 1885లోని సెక్షన్ 5(2)ను అనుసరించే ఆ పని చేశామని తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు, ఈ వివరాలను కౌంటర్ రూపంలో లిఖితపూర్వకంగా తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తనతో పాటు తమ పార్టీకి చెందిన నాయకుల ఫోన్లను అధికార పార్టీ కోసం పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారో జాబితాను సమర్పించేలా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, టెలి కమ్యూనికేషన్స్ కార్యదర్శి, వోడాఫోన్ ఏపీ, తెలంగాణ నోడల్ ఆఫీసర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. అలాగే డీజీపీ ఠాకూర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ డీజీలను టెలిగ్రాఫ్ చట్టం కింద ప్రాసిక్యూట్ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఏఏ సందర్భాల్లో ట్యాపింగ్ చేయవచ్చో సెక్షన్ 5(2) చెబుతోందని, ఇదే విషయంపై సుప్రీంకోర్టు సైతం స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. దీనికి ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, సెక్షన్ 5(2)ను అనుసరించే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. తాము చట్ట ప్రకారమే నడుచుకున్నామని వివరించారు. అయితే ఈ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఎస్పీ ఇంటెలిజెన్స్, విజయవాడ పేరు మీద గత వారం తమకు ఇచ్చిన సీల్డ్ కవర్‌ను వెనక్కి ఇచ్చేస్తున్నామని ధర్మాసనం ఏజీకి చెప్పింది. ఆ సీల్డ్ కవర్‌ను కోర్టు వద్ద ఉంచుకున్నా తమకు అభ్యంతరం లేదని ఏజీ చెప్పగా, ప్రస్తుతం ఆ వివరాలతో తమకు అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. సెక్షన్ 5(2) చెబుతోంది ఇదే.. 1.దేశ సమగ్రత, సార్వభౌమత్వం 2. దేశ భద్రత 3.విదేశాలతో స్నేహ సంబంధాలు 4. పబ్లిక్ ఆర్డర్ 5.నేర ప్రేరేపణను నిరోధించడం. ఈ ఐదు సందర్భాల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చునని టెలిగ్రాఫ్ చట్టం చెబుతోంది. ఈ సందర్భాలు మినహా మిగిలిన ఏ సందర్భాల్లోనూ ఫోన్ ట్యాప్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పీయూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన తీర్పునిచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ ఐదు సందర్భాలను అనుసరించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు చెబుతోంది. కాని వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ నెంబర్‌తో పాటు ఇతర వైఎస్సార్సీపీ నేతల ఫోన్ నెంబర్లను కూడా ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ట్యాప్ చేయాలని వోడాఫోన్ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చింది -
ఇచ్చట ‘మీసేవ’ తిరస్కరించబడును!
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడుకు చెందిన రైతు శివప్రసాద్‌రెడ్డికి వారసత్వంగా వచ్చిన భూమి ఉంది. ఒక సర్వే నంబరు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాకపోవడంతో మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. ముడుపులు ఇవ్వకపోవడంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన శంకర్‌రెడ్డి (బాధితుడి విజ్ఞపి మేరకు పేరు మార్చాం) మ్యుటేషన్ కోసం రెవెన్యూ రికార్డుల్లో తన పేరు నమోదు చేయాలంటూ నిర్దిష్ట రుసుము చెల్లించి అన్ని ఆధారాల జిరాక్స్ కాపీలతో ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి కారణాలు చూపకుండానే ఆయన దరఖాస్తును తిరస్కరించారు. సంబంధిత అధికారిని కలవగా ముడుపుల కింద కొంత సొమ్ము తీసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంత చేసినా ఇప్పటికీ ఆయన పేరుతో మ్యుటేషన్ కాలేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లుగా తిరస్కరించిన ‘మీసేవ’ దరఖాస్తుల సంఖ్య 71 లక్షలకుపైమాటే. ఒక్కో దరఖాస్తుకు ప్రజలు సగటున రూ.300 చొప్పున చెల్లించినట్లు లెక్క వేసినా 71 లక్షల అర్జీలను తిరస్కరించడం ద్వారా సర్కారు వసూలు చేసిన సొమ్ము రూ.213 కోట్లకు పైమాటే! ఇక బాధితులు నష్టపోయింది దీనికంటే ఎక్కువే ఉంటుంది. పౌరులకు పనులు జరగని మీసేవ అర్జీలతో ఎవరికి ఉపయోగం? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మీసేవలో దరఖాస్తు చేసినా మళ్లీ సంబంధిత కార్యాలయాలకు వెళ్లి ముడుపులు చెల్లిస్తే తప్ప పరిష్కారం కావడం లేదు. రెవెన్యూ, పురపాలక శాఖల్లో ఇలాంటి పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. దీంతో ‘ఎందుకొచ్చిన మీసేవ..?’ అంటూ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం పారదర్శకతకు మారుపేరంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ‘మీసేవ’ తిరస్కరణ సేవగా మారింది. భూముల మ్యుటేషన్, కొలతలు, అదనపు సర్వే నంబరు చేర్పు, వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం, భవన నిర్మాణ ప్లాన్ అప్రూవల్ తదితరాల కోసం ‘మీసేవ’ ద్వారా అందే దరఖాస్తులను అధికారులు పెద్ద ఎత్తున తిరస్కరిస్తూ చెత్తబుట్టలో పడేస్తున్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మీసేవ తిరస్కరణ అర్జీలు 71 లక్షలు దాటిపోవడం సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గడువుదాకా పట్టించుకోని సిబ్బంది.. ఏ పని కావాలన్నా లంచాలు చెల్లించాల్సిన పనిలేదని, నిర్దిష్ట రుసుము కట్టి మీసేవ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే చాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్త డొల్ల అనేందుకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్న పౌరులే నిదర్శనం. ఏ శాఖల కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు తీరలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీసేవలో దరఖాస్తు ఇచ్చినా పట్టించుకునే దిక్కులేక గ్రీవెన్స్‌సెల్‌లో అర్జీలు ఇస్తున్నారు. మీసేవ ద్వారా అందే అర్జీలను చాలామంది సిబ్బంది నిర్దిష్ట గడువు వరకు పట్టించుకోకుండా తీరా రెండు మూడు రోజుల ముందు చిన్న చిన్న కారణాలతో తిరస్కరిస్తున్నారు. కొంతమంది సిబ్బంది కనీసం కారణం కూడా చూపకుండానే పక్కన పడేస్తున్నారు. పక్కవారికి పంపితే పరిష్కారమైనట్లా? కొందరు సిబ్బంది తమ వద్దకు వచ్చే అర్జీలను ఇతర ఉద్యోగుల వద్దకు పంపుతూ పరిష్కారమైనట్లు జాబితాలో చేర్చేస్తున్నారు. దీనివల్ల పరిష్కారమైన అర్జీలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ తంతును చూసి ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వినతులను తిరస్కరించడం దారుణమైతే, ఫైలును పక్క ఉద్యోగికి పంపి పరిష్కారమైనట్లు నమోదు చేయడం మరీ ఘోరమని పేర్కొంటున్నారు. ‘ఈ పరిణామాలు ఏమాత్రం సరికాదు. సరైన కారణాలు చూపకుండా కొందరు, అసలు కారణం పేర్కొనకుండానే మరికొందరు వినతులను తిరస్కరిస్తున్నట్లు నా దృష్టికి కూడా వచ్చింది. నిర్దిష్ట సమయంలో దరఖాస్తు పరిష్కరించకుంటే సంబంధిత ఉద్యోగి పేరు రికార్డుల్లో నమోదవుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకు దురుద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని గుర్తించాం. ఇలా జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని స్పెషల్ ఛీప్ సెక్రటరీ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. చేతి చమురు వదులుతోంది ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు రుసుములు, సర్వీసు చార్జీల రూపంలో రూ.వందల్లో చెల్లిస్తున్నారు. అయితే దరఖాస్తుతో పని అయిపోతుం దనుకుంటే పొరపాటే. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తుకు జత చేసిన పత్రాలు స్పష్టంగా లేవంటూ, జిరాక్స్ కాపీలు ఇవ్వాలని ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాధానం వస్తోంది. దీనికి మరికొంత సొమ్ము చెల్లించాలి. ఇలా మీసేవలో దరఖాస్తు చేసుకుంటే ఒక్కో అర్జీకి సుమారు రూ. 400 దాకా చేతి చమురు వదులుతోంది. ఇవీ ‘మీసేవా’ గణాంకాలు... - 2014 జూన్ నుంచి ఇప్పటివరకు రెవెన్యూ వెబ్సైట్ వెబ్‌ల్యాండ్‌లో అదనపు సర్వే నంబరు చేర్పు కోసం 2,41,447 వినతులు రాగా 1,57,365 అర్జీలను తిరస్కరించారు. 82,557 దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. - వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం 69,274 మంది దరఖాస్తు చేసుకోగా 50,913 అర్జీలను ఆమోదించారు. 17,576 వినతులను తిరస్కరించి చెత్తబుట్టలో పడేశారు. - 500 చదరపు అడుగులలోపు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో కట్టడాల క్రమబద్ధీకరణ కోసం 32,056 అర్జీలు రాగా 3,562 వినతులను మాత్రమే ఆమోదించారు. 20361 దరఖాస్తులను తిరస్కరించారు. - ఆక్రమిత ప్రభుత్వ భూమిలో కట్టడాల క్రమబద్ధీకరణ కోసం 73,783 వినతులు రాగా 3401 అర్జీలు మాత్రమే ఆమోదం పొందాయి. 70,382 దరఖాస్తులను తిరస్కరించారు. - ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం 8,60,440 దరఖాస్తులు రాగా 6,20,070 అర్జీలను ఆమోదించారు. 2,25,711 వినతులు తిరస్కరించారు. - కంప్యూటరైజ్డ్ అడంగల్‌లో కరెక్షన్ కోసం 40,74,721 వినతులు రాగా 26,97,255 మాత్రమే ఆమోదం పొందాయి. మిగిలిన 13,37,732 అర్జీలు చెత్తబుట్టపాలయ్యాయి. -
రమణీ లలామ..నవలావణ్య సీమ ..
సాక్షి, కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఆదివారం శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీరామ.. జయరామ... జయజయ రామ.. నామస్మరణతో భద్రగిరి మార్మోగింది. అర్చకస్వాముల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మిథిలా స్టేడియంలో నయనానందకరంగా సాగిన స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగింది. సీతారాములు ఆశీనులైన మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది. అర్చకులు తెల్లవారుజామున 2 గంటలకే దేవాలయం తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, నివేదన, శాత్తుమురై, మూలవరులకు అభిషేకం, మంగళా శాసనం జరిపించారు. తర్వాత గర్భగుడిలోని మూలమూర్తులకు కల్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో ఆశీనులను చేసి మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తోడ్కొని వచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపించారు. సీతారాముల కల్యాణోత్సవ విశిష్టతను, భద్రాద్రి ఆలయ క్షేత్ర ప్రాశస్త్యాన్ని, భక్త రామదాసు సేవలను, ఆయన సీతారాములకు చేయించిన బంగారు ఆభరణాల ప్రాశస్త్యాన్ని వేద పండితులు భక్తులకు వివరించారు. సీతమ్మవారికి ఎక్కడైనా మంగళసూత్రాలు రెండే ఉంటాయని, కానీ భద్రాచలంలో మాత్రం మూడు సూత్రాలు ఉంటాయని, రామదాసు చేయించిన సూత్రం ఇక్కడ అదనంగా ఉంటుందని తెలిపారు. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయగా, ఈసీ అనుమతితో స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చారు. కాగా, సోమవారం మిథిలా స్టేడియం ప్రాంగణంలో స్వామి కల్యాణోత్సవం జరిగిన మండపంలోనే శ్రీరామ మహా పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు జరగనుంది. ప్రభుత్వం తరఫు న గవర్నర్ నరసింహన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. -
బ్యారేజీలే వారధులు
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు, తాగునీరే కాకుండా బ్యారేజీలపై నుంచి వాహనాల రాకపోకలు సాగించడానికి వంతెనల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రూ.80 వేల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసి పనులను చేపట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్టులోని లింకు–1లోని సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంపుహౌస్, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణాలతోపాటు మూడు బ్యారేజీలపై మూడు వంతెనల పనులు ఊపందుకుని తుదిదశకు చేరాయి. మేడిగడ్డ బ్యారేజీ పైన ఇలా.. కాళేశ్వరంలో మొదటిదశ గోదావరిపై మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఎల్ అండ్ టీ సంస్థ నిర్మాణ పనులు దక్కించుకుంది. జయశంకర్ భూపాపలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ నుంచి మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా పోచంపల్లి మధ్య గోదావరిపై అడ్డంగా బ్యారేజీ నిర్మిస్తున్నారు. 1628 మీటర్ల పొడవు, 100 మీటర్ల ఎత్తుతో చేపట్టిన ఈ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 16.1 టీఎంసీలు. బ్యారేజీ నిర్మాణం పూర్తయితే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలకు ప్రాజెక్టు కమ్ వారధిగా కూడా వాహనాల రాకపోకలకు ఉపయోగకరంగా ఉంటుంది. అన్నారం బ్యారేజీపై: ఈ బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,148 కోట్లు కేటాయించింది. వంతెనతోపాటు బ్యారేజీని అఫ్కాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్ధ చేపట్టి గడువులోగా పూర్తిచేసింది. ఈ బ్యారేజీ నీటి నిల్వ సామ ర్థ్యం 11 టీఎంసీలు. మహదేవపూర్ మండలం అన్నారం–మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల గ్రామాల మధ్య గోదావరిపై అడ్డంగా 66 గేట్లతో 1270 మీటర్ల పొడవుతో అన్నారం బ్యారేజీని నిర్మించారు. వంతెన ద్వారా జయశంకర్, మంచిర్యాల జిల్లాల గోదావరి తీర ప్రాంతాల ప్రజలకు వారధిగా ఉపయోగపడుతుంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం–మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం శివ్వారం గోదావరి నదులపై అడ్డంగా సిరిపురం బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. కాళేశ్వరం బ్యారేజీలో భాగంగా నిర్మించే ఈ సుందిళ్ల బ్యారేజీని రూ.1,445 కోట్లతో 1.36 కిలోమీటర్ల పొడవుతో చేపట్టారు. చివరి దశ పనులు జరుగుతున్నాయి. రాకపోకలు ఈ నెల చివరి వరకు ప్రారంభం కానున్నాయి. మం«థని–చెన్నూర్ నియోజకవర్గాలకు బ్యారేజీతోపాటు వంతెన అందుబాటులోకి రానుంది. కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంతో 3 వారధులు అందుబాటులోకి వస్తున్నాయి. గోదావరి, ప్రాణహితపై ప్రజలకు ఐదు వంతెనలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మంచిర్యాల, జయశంకర్, పెద్దపల్లి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. -
జీతం ఎగవేసిన సర్కార్ అల్లాడుతున్న చిరుద్యోగులు
సాక్షి, అమరావతి: వేలాది మంది చిరు ఉద్యోగుల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంస్థలు, గురుకులాలు, సర్వశిక్ష అభియాన్, మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు నాలుగు నెలల నుంచి వేతనాలను చెల్లించకుండా నిలుపుదల చేయించారు. ఎన్నికల ముందు తన రాజకీయ, స్వార్ధ ఆర్థిక ప్రయోజనాల కోసం వందల కోట్ల నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి మళ్లించేశారు. నాలుగు నెలల నుంచి వేతనాలు అందకపో వడంతో ఆ కుటుంబాల జీవనం దుర్భరంగా తయారయ్యింది. మేము ఏమి తినాలి..ఎలా బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లా పాపలతో పస్తులుండలేక వేతనాల కోసం ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. చివరకు ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకూ వేతనాలు ఇవ్వకుండా నిలుపుదల చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నాలుగు నెలలుగా వేతనాల్లేవు.. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యాసంస్థలు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, సర్వశిక్ష అభియాన్, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా నాలుగు నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం వేతనాలు నిలిపేసింది. చివరకు పాఠశాలల పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకానికి కూడా నిధులు ఇవ్వకుండా బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) బిల్లులను కూడా చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అధికారులకు ఇప్పుడు అద్దె వాహనాలే ఉన్నాయి. స్వయం ఉపాధి కింద యువత బ్యాంకుల ద్వారా కార్లను కొనుక్కుని ప్రభుత్వ శాఖల్లో అద్దెకు తిప్పుతున్నారు. వీరికి కూడా నాలుగు నెలల నుంచి నెలనెలా చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా నిలుపుదల చేశారు. పోలీసులకు టీఏ, డీఏలు బంద్ రాష్ట్రంలో వేల సంఖ్యలో పనిచేస్తున్న పోలీసులకు గత ఎనిమిది నెలల నుంచి డీఏ, టీఏలను నిలుపుదల చేశారు. ఇటీవల ఆ ఎనిమిది నెలల టీఏ, డీఏలను విడుదల చేసినట్లే చేసి తిరిగి ఐదు నెలల డీఏ, టీఏ సొమ్ము రూ.70 కోట్లు ఖజానాకు తీసేసుకున్నారు. కేంద్ర నిధులు రూ.5 వేల కోట్లు మళ్లింపు కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం కేంద్రం విడుదల చేసిన రూ.5,000 కోట్ల నిధులను ఆయా పథకాలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించేసింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను కూడా ఇతర అవసరాలకు మళ్లించేసింది. ఉప ప్రణాళిక పనులకు, అవసరాలకు నిధులను విడుదల చేయకుండా ఇతర అవసరాలకు ఆ నిధులను వినియోగిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఫిబ్రవరి జీతం బంద్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే.. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 1.25 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగుల ఫిబ్రవరి వేతనాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. సకాలంలో వేతన బిల్లులను సమర్పించలేదనే సాంకేతిక కారణం చూపుతున్నారు. దీనిపై ఉద్యోగులు సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ (సీఎఫ్ఎంఎస్)ను ప్రశ్నిస్తే.. ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారంటూ అధికారులు చెబుతున్నారని ఒక ఉద్యోగి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ సీఈవోతో సహా అక్కడ పనిచేసే ఉద్యోగులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా, మండల పరిషత్‌ల ఉద్యోగులకు వేతనాలు అందకపోవడం గమనార్హం. మార్చి గడిచినా రెగ్యులర్ ఉద్యోగులకు కూడా ఇంకా ఫిబ్రవరి వేతనాలు చెల్లించలేదంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి తీరు ఎలా ఉందో అర్దం అవుతోందని ఆ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. రూ.30 వేల కోట్ల బిల్లులు పెండింగ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎంపిక చేసిన రాజకీయ పరమైన, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు చెందిన బిల్లులను మాత్రమే చెల్లిస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, వారి నేతలకు చెందిన బిల్లుల చెల్లింపునకు మాత్రమే ఆర్థిక శాఖకు సీఎం అనుమతి ఇస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. సాధారణంగా చెల్లించాల్సిన అన్ని రకాలు కలిపి కొన్ని లక్షల బిల్లులకు చెందిన రూ.30 వేల కోట్ల బిల్లులను చెల్లించవద్దంటూ ముఖ్యమంత్రి నిలుపుదల చేయించినట్లు సమాచారం. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌కు విలువ లేకుండా సీఎం చెప్పినట్లుగా ఆర్థిక శాఖ అధికారులు నడుచుకోవడాన్ని అధికార యంత్రాంగం తప్పుపడుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిరోజూ ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడుతూ తనకు కావాల్సిన వారికి, తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలకు మాత్రమే నిధులు విడుదల చేయించడం గమనార్హం. కోడ్ ఉన్నందున అధికారులతో ఎటువంటి సమీక్షలు నిర్వహించరాదని తెలిసినా.. ముఖ్యమంత్రి శుక్రవారం ఆర్థిక శాఖలోని ముగ్గురు అధికారులను తన ఇంటికి పిలిపించుకుని సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశమయ్యింది సీఎంవో, ఆర్థిక శాఖలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. కాన్పు కోసం మంగళసూత్రం తాకట్టు దేవదాయ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. దీంతో ఒక ఉద్యోగి తన భార్య కాన్పునకు డబ్బులేకపోవడంతో ఆమె మంగళ సూత్రం తాకట్టు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. పిల్లల పాలు, ఫీజులకు డబ్బుల్లేవు రెగ్యులర్ పోలీసులతో సమానంగా పనిచేస్తున్న హోంగార్డుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. వారికి ఇచ్చే వేతనాలే చాలా తక్కువ. అలాంటి వారికి మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఇంటి అద్దె, పాలు, పిల్లల ఫీజులు వంటి నెలనెలా చేయాల్సిన చెల్లింపులకు డబ్బులేక నానా అవస్థలు పడుతున్నారు.పిల్లల పెళ్లిళ్లు ఇతర సొంత అవసరాల కోసం ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతివ్వడం లేదు. కంట్రిట్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) కింద ఉద్యోగుల వాటాను వారి వేతనాల నుంచి మినహాయించుకున్న ప్రభుత్వం.. ఆ సొమ్మును సంబంధిత నిధికి జమ చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించేసింది. 2017–18కు సంబంధించిన రూ.200.23 కోట్లను సీపీఎస్ నిధికి ప్రభుత్వం జమ చేయలేదని ‘కాగ్’ పేర్కొంది. -
ఈసీ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితా ఇవ్వండి
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. విధి నిర్వహణను పక్కన పెట్టేసి అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ చేయడంపై చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం బుధవారం విచారించింది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను ఏకపక్షంగా ప్రకటించిందని, తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలని కోరుతూ జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్ బుధవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించేందుకు సిద్ధం కాగానే, మరో న్యాయవాది ఎస్. వివేక్ చంద్రశేఖర్ జోక్యం చేసుకుంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ బదిలీలు చేసిందని, అందువల్ల ఈ వ్యాజ్యంలో తమ వాదనలు కూడా వినాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి హాజరవుతారని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు. ఇందుకు ఏజీ శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. వారి ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో లేదు ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో ఎక్కడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నామని పేర్కొనలేదని ఏజీ తెలిపారు. ఇంటెలిజెన్స్ డీజీతో పాటు ఇద్దరు జిల్లా ఎస్పీలను బదిలీ చేసిందని కోర్టుకు నివేదించారు. ఎస్పీలు ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని, అందువల్ల వారి బదిలీకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఇంటెలిజెన్స్ డీజీకి ఎన్నికల సంఘం విధులతో ఏమాత్రం సంబంధం ఉండదని, అందువల్ల ఆయన బదిలీ పైనే తమ అభ్యంతరమని తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 28(4) ప్రకారం రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారి, ఈ సెక్షన్ కింద నియమితులైన అధికారులు, ఎన్నికల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన పోలీసు అధికారులంతా ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల కమిషన్ డిప్యుటేషన్లో ఉంటారని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాను ఇవ్వాలని కోరింది. -
ఏపీలో ప్రభుత్వ పనితీరు అధ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్లు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న అంశంగా మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ సంస్థ తేల్చింది. ఓటర్లు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న అంశాల్లో ఏపీ ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందని, ఆయా అంశాల్లో ఓటర్లు ఇచ్చిన స్కోరును బట్టి తేలింది. ఐఐఎం–బెంగళూరు ప్రొఫెసర్ త్రిలోచన్ శాస్త్రి ఈ ఫౌండర్ చైర్మన్‌గా ఉన్న ఏడీఆర్ సంస్థ దేశవ్యాప్తంగా 2018 అక్టోబరు నుంచి 2018 డిసెంబరు మధ్య కాలంలో 534 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 2,73,487 మంది ఓటర్లను సర్వే చేసింది. ఫలితాలను సోమవారం ఇక్కడ విడుదల చేసింది. పాలనాంశాలకు సంబంధించి ఓటర్ల ప్రాధాన్యతలు, ఆయా అంశాల్లో ప్రభుత్వ పనితీరుపై ఓటర్ల రేటింగ్, ఓటింగ్ ప్రవర్తనపై ప్రభావం చూపే కారకాలు అన్న మూడు అంశాలు తేల్చే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహించింది. పాలనకు సంబంధించి మొత్తం 31 ప్రాధాన్యతాంశాలను ఓటర్ల ముందుంచి అందులో మొదటి ఐదు ప్రాధాన్యత అంశాలను గుర్తించాలని ఓటర్లను కోరింది. అలాగే ఆయా అంశాలపై ప్రభుత్వ పనితీరును గుడ్, యావరేజీ, బ్యాడ్ అనే మూడుస్థాయిల స్కేల్‌పై గుర్తించాలని కోరింది. ఐదు మార్కుల్లో ఐదు మార్కులు ఇస్తే గుడ్ అని, మూడు మార్కులు ఇస్తే యావరేజీ అని, 1 మార్కు వస్తే బ్యాడ్ అని పరామితిని నిర్ధేశించింది. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాధాన్యత లభించిన 10 అంశాల్లో మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ప్రాథమిక అవసరాలు అందించే వైద్యం, తాగునీరు, రోడ్లు, ప్రజారవాణా.. ఈ ఐదు టాప్–5లో నిలిచాయి. అయితే ఆయా అంశాల్లో ఆయా ప్రభుత్వాల పనితీరుపై ఓటర్లు సంతృప్తిగా లేకపోవడం గమనార్హం. ప్రతి అంశంలోనూ యావరేజీ కంటే తక్కువ మార్కులు సాధించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు అద్వానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన మూడు అంశాల్లో మెరుగైన ఉపాధి/ఉద్యోగ అవకాశాలు, తాగునీరు, మెరుగైన ఆస్పత్రులు/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఈ మూడు అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అద్వానంగా ఉంది. బిలో యావరేజీ స్కోరు(ఐదింట మూడు మార్కుల కంటే తక్కువ) మాత్రమే దక్కించుకోవడం గమనార్హం. మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అనే అంశాన్ని 46.14 శాతం ఓటర్లు ప్రాధాన్యత కలిగిన అంశంగా ఎంచుకోగా, వారు ప్రభుత్వ పనితీరుకు కేవలం 2.10 మార్కులే ఇచ్చారు. తాగునీటి అంశాన్ని 45.25 శాతం మంది ఓటర్లు ప్రాధాన్యతాంశంగా ఎంచుకోగా.. ఆ అంశంలో ప్రభుత్వ పనితీరుపై కేవలం 2.04 మార్కులు మాత్రమే ఇచ్చారు. మెరుగైన ఆస్పత్రులు/ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంశాన్ని 31.40 శాతం మంది ప్రాధాన్యత అంశంగా ఎంచుకోగా.. ఈ అంశంలో ప్రభుత్వ పనితీరుపై కేవలం 2.72 స్కోరు మాత్రమే దక్కించుకుంది. ఏ ఒక్క అంశంలోనూ ప్రభుత్వం యావరేజీ స్కోరును కూడా అందుకోలేదు. ఏపీ గ్రామీణం ఇలా.. పట్టణ ప్రాంతాలు అలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ఓటర్లు అత్యంత ప్రాధాన్య అంశాలుగా మూడింటిని ఎంచుకున్నారు. 48 శాతం మంది సాగునీటి లభ్యత, 46 శాతం మంది వ్యవసాయ సబ్సిడీలు(విత్తనాలు, ఎరువులకు), 44 శాతం మంది వ్యవసాయానికి విద్యుత్తు అనే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వీరు ఆయా అంశాల్లో ప్రభుత్వానికి ఇచ్చిన మార్కులు యావరేజీ కంటే తక్కువ. మొదటి అంశానికి 2.13 మార్కులు, రెండో అంశానికి 1.99 మార్కులు, మూడో అంశానికి 2.19 మార్కులు ఇచ్చారు. ఇక పట్టణ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన మూడు అంశాల్లో మెరుగైన ఉపాధి/ఉద్యోగ అవకాశాలు, తాగునీరు, నీరు, కాలుష్యం. 58 శాతం మంది ఓటర్లు ప్రాధాన్యతగా ఎంచుకున్న మెరుగైన ఉపాధి అవకాశాలు అనే అంశంలో ప్రభుత్వ పనితీరుకు 2.13 మార్కులు ఇచ్చారు. 55 శాతం మంది ఓటర్లు ప్రాధాన్యత అంశంగా ఎంచుకున్న తాగునీటి అంశంలో ప్రభుత్వ పనితీరుకు వారు ఐదు మార్కులకు గానూ 1.91 మాత్రమే ఇచ్చారు. అలాగే నీరు, కాలుష్యం అనే అంశాన్ని 53 శాతం పట్టణ ఓటర్లు ప్రాధాన్యత అంశంగా ఎంచుకోగా.. వారు ఈ అంశంలో ప్రభుత్వ పనితీరుకు 2.19 మార్కులు ఇచ్చారు. ఏ అంశంలోనూ ప్రభుత్వం యావరేజీ స్కోరు కూడా సాధించలేకపోయింది. ఇక ఈ సర్వేలో ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల వారీగా టాప్–3 ప్రాధాన్యత గల అంశాలను ఏడీఆర్ సంస్థ ప్రచురించింది. -
తిరుమల: ఏపీ ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అమరావతి/తిరుమల: కలియుగ ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నైవేద్యం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్యాన్ని ఉదయం ఏడు గంటలకు మార్చింది. దీంతో అప్పటి నుంచి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగే నైవేద్యం వరకూ స్వామివారిని 13 గంటలపాటు పస్తు ఉంచుతున్నారు. తిరుమల ఆలయంలో ఉదయం వీవీఐపీ బ్రేక్ దర్శనాలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో ముఖ్యంగా సోమవారం బాగా పెరిగిపోతోంది. దీంతో ఎల్–2, ఎల్–3 దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు శ్రీవారి నైవేద్యం వేళలో కీలక మార్పులు చేస్తూ ఆదివారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అలాగే ప్రతి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న నేవైద్యాన్ని ఉదయం ఏడు గంటలకే పూర్తిచేయాలని అర్చకులను ఆదేశిస్తూ ఆ ఉత్తర్వులో తెలిపింది. ఈ నిర్ణయంపై హిందూ మత ప్రచారకులు మండిపడుతున్నారు. ఇది స్వామి వారికి మహా అపచారం చేయడమే అవుతుందని హెచ్చరిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు రాత్రి పవళింపు సేవ వరకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో స్వామివారికి నైవేద్యం సమర్పణ ఉంటుంది. దీనిని త్రికాల నివేదనగా పిలుస్తుంటారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ, అర్చన కార్యక్రమాల అనంతరం ఉదయం ఐదున్నర గంటలకు స్వామి వారికి తొలివిడత నైవేద్యం సమర్పిస్తారు. దీనిని ప్రాతఃకాల ఆరాధనగా పిలుస్తారు. తొలి విడత నైవేద్యం అనంతరం వీవీఐపీ బ్రేక్ దర్శనాలు కొనసాగుతాయి. రెండో విడతగా మధ్యాహ్నం మళ్లీ నైవేద్యం సమర్పిస్తారు. మూడో విడతగా రాత్రి 8 గంటలకు జరుగుతుంది. వీవీఐపీ కోటా కింద భారీ సంఖ్యలో ఎల్–2, ఎల్–3 దర్శనాలను మధ్యాహ్నం ఎంతసేపైనా కొనసాగించడానికే ప్రభుత్వం మధ్యాహ్నం నైవేద్యం వేళలలో మార్పులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారమే ఎందుకంటే.. తిరుమలలో ప్రతి సోమవారం కల్యాణోత్సవ మండపంలో ‘విశేష పూజ’సేవ నిర్వహించాల్సి ఉండటం, అదే రోజు వీవీఐపీ బ్రేక్ దర్శనానికి బాగా డిమాండ్ ఉండటం వంటి కారణాలతో ప్రత్యేకించి సోమవారం స్వామి వారికి మధ్యాహ్న వేళ సమర్పించే నైవేద్య వేళలో మార్పులు తీసుకొచ్చారని చెబుతున్నారు. అలాగే, ఈ ఒక్కరోజు మాత్రం తెల్లవారుజామున తొలి విడత నైవేద్యం అనంతరం ఎల్–1 బ్రేక్ దర్శనాలు కొనసాగించి 7 గంటలకు మధ్యాహ్న నైవేద్యం పూర్తిచేసి ఆ తర్వాత ఎల్–2, ఎల్–3 దర్శనాలను ఎంతసేపైనా కొనసాగిస్తారు. మిగిలిన రోజుల్లో మధ్యాహ్న నైవేద్య కార్యక్రమాలు యథావిధిగానే కొనసాగుతాయి. ప్రభుత్వ తాజా ఆదేశాల కారణంగా ప్రతీ సోమవారం తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువసేపు క్యూలలో వేచి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. అభ్యంతరాలతో ఆగమ సలహా మండలికి సిఫారసు మధ్యాహ్న నైవేద్యం వేళలో మార్పుపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ విషయాన్ని పూర్తిస్థాయి పరిశీలనార్ధం ఆగమ సలహా మండలికి సిఫార్సు చేసినట్లు డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. వీరి సలహా వచ్చే వరకు ప్రతి సోమవారం పాత పద్ధతిలోనే మధ్యాహ్న నైవేద్యం నిర్వహిస్తామన్నారు. మరోవైపు.. శ్రీవారి ఆలయంలో ప్రతీ సోమవారం విశేషపూజ నిర్వహణకు తగినంత సమయం కోసం ఆలయ ప్రధాన అర్చకులు, ముగ్గురు ఆగమ పండితులు ఇతర అర్చకుల సలహా మేరకే మధ్యాహ్న నైవేద్యాన్ని సోమవారం ఉ.7 గంటలకు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. -
కేంద్ర, రాష్ట్రాల సఖ్యత!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సంబంధాలు తరచూ వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో సుమారు మూడేళ్ల తర్వాత అంతర్రాష్ట్ర మండలి సమావేశం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరిగే సమావేశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్రాష్ట్ర మండలి సెక్రటేరియట్ ఇప్పట్నుంచే సన్నాహాలు ప్రారంభించింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర–రాష్ట్రాలకు ఉండే హక్కులకు సంబంధించి ఏకీకృత విధానం రూపొందించడంపై దృష్టి సారించింది. అయితే మండలి సమావేశం ఏకపక్షంగా జరపకూడదనే ఉద్దేశంతో ఎజెండా రూపకల్పనకు వీలుగా అంతర్రాష్ట్ర మండలిలో ప్రస్తావించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా మండలి సెక్రటేరియట్ రాష్ట్రాలను కోరింది. అయితే తాము చర్చకు ప్రతిపాదించే అంశాలకు మద్దతుగా అవసరమైన పత్రాలను కూడా జత చేయాలని సూచించింది. కొత్త ట్రిబ్యునల్ లేదు.. జాతీయ హోదా రాలేదు... కేంద్ర, రాష్ట్రాల నడుమ ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు 1990లో అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటైంది. దీనికి ప్రధాని అధ్యక్షుడిగా ఉంటారు. ప్రస్తుతం మండలిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ తదితరులు సభ్యులుగా మరో 10 మంది కేంద్ర మంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారు. మండలి చివరి సమావేశం 2016 జూలై 16న జరిగింది. ఆ తర్వాత ఎలాంటి సమావేశాలు జరగలేదు. 2016లో జరిగిన భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదీ జలవివాదాలపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ నిర్ణీత వ్యవధిలో ఇచ్చే విధంగా నిర్ధేశించాలని, కేంద్రం మరింత నిర్ణయాత్మక పాత్ర వహించాలని ఈ భేటీలో కోరారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు సమాన హక్కులు ఉండేలా రాష్ట్ర వాదనలను ట్రిబ్యునల్ తొలి నుంచీ వినాలని, లేనిపక్షంలో కొత్త ట్రిబ్యునల్ వేసి కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని విన్నవించారు. దీంతోపాటే సాగునీటి రంగంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక భారీ పథకానికి కేంద్రం నిధులివ్వాలని కోరిన కేసీఆర్... కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక దానిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని విన్నవించారు. అలాగే మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం, మిషన్ భగీరథకు కేంద్రం పూచీకత్తు వంటి అంశాలను మండలి భేటీలో కేంద్రం ముందుంచారు. కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు (ఏటా రూ. 25 వేల కోట్లు) కేటాయించడంతోపాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు తాము ఖర్చు చేస్తున్న రూ. 30–40 వేల కోట్ల వల్ల రాష్ట్రంపై పడిన ఆర్థిక భారాన్ని కొంతలో కొంత తగ్గించుకోవడానికి ద్రవ్య పరిపతి యాజమాన్య నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిమితిని పెంచాలని అదే భేటీలో కోరారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచితే ప్రభుత్వంపై పడే ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు దోహదపడుతుందని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనిలో కొన్ని అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. అయితే నదీ జలాల విషయంలో మాత్రం సానుకూలత చూపలేదు. ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ప్రకటించలేదు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కేంద్రంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అంతర్రాష్ట్ర మండలి సమావేశం కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శి సంజీవ్ గుప్తా ఇటీవల రాష్ట్ర సీఎస్ ఎస్కే జోషీకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కౌన్సిల్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అంశాలకు సంబంధించిన పత్రాలతోపాటు ఇతర రాజ్యాంగ, న్యాయపరమైన సమస్యలకు సంబంధించిన వివరాలు పంపాల్సిందిగా లేఖలో కోరారు. పార్లమెంట్ ద్వారా కేంద్రం రూపొందించిన చట్టాలను రాష్ట్రాల్లో అమలు చేయడంలో ఆయా ప్రభుత్వాల సహాయ సహకారాలపై మండలి సమావేశంలో చర్చిస్తామని లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో మళ్లీ పాత అంశాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నాయి. -
కోడ్ వేళ ‘దేశం’ ఫుడ్ బకెట్స్
సాక్షి, విశాఖపట్నం: గిరిజనుల ఆరోగ్యం..సంక్షేమం కోసం గడచిన ఐదేళ్లలో ఏనాడు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వేళ ఎన్నడూ లేని ప్రేమ ఒలకబోస్తుంది. మాతా, శిశు మరణాల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందంటూ జాతీయ ఆరోగ్య సంస్థలు ఘోషిస్తున్నా ఇంతవరకు పట్టించుకోలేదు. అయితే ఎస్టీ కుటుంబాల ఓట్లపై కన్నేసిన ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఫుడ్ బకెట్ (గిరి ఆహారభద్రత)పేరిట కొత్త పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆరు రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు కేజీల చోడి(రాగి)పిండి, రెండు కేజీల కందిపప్పు, ఒక లీటర్ పామాయిల్, కేజీ చొప్పున ఉప్పు, వేరుశెనగ, బెల్లం పంపిణీ చేయాలని నిర్ణయిస్తూ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పైగా కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత పాత తేదీతో ఈ ఉత్తర్వులు (సర్క్యులర్ నం.ఎంకేటీజీ/ఎం6/ఫుడ్ బాస్కెట్ /2009, డేట్: 27–02–2019) జారీ చేయడం వివాదాస్పదమవుతోంది. రాష్ట్రంలోని సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చిత్తూరు, కేఆర్ పురం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలోని 77 మండలాల్లో రెండులక్షల 668 ఎస్టీ కుటుంబాలకు ఫుడ్‌బాస్కెట్ కిట్లు ఇవ్వాలని నిర్ణయించారు. 24 గంటలు తిరక్కుండానే ఆ సంఖ్యను రెట్టింపు చేస్తూ 4,24,335 ఎస్టీ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ మేరకు సరుకులను ఆయా మండలాలకు కేటాయిస్తూ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఉత్తర్వులు (ఆర్సీ నం.ఎస్‌వోడబ్ల్యూ 03–21021(32)/1/2018–జీ, సెక్షన్–సీవోటీడబ్ల్యూ, డేటెడ్: 28–02–2019) జారీచేసింది. అయితే 25–02–2019నుంచి 28–03–2019 వరకు ఈ సరుకులను పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీచేయడం విస్మయం కలిగిస్తోంది. ఆగమేఘాలపై పంపిణీకి కసరత్తు.. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు పౌర సరఫరాల శాఖ డెప్యూటీ తహసీల్దార్లు, రేషన్ డీలర్లతో సమావేశాలు నిర్వహించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రకాల నిత్యావసరాలను చంద్రన్న సంక్రాంతి కానుక సంచి మాదిరిగా నాన్ వోవెన్ కారీ బ్యాగ్‌లలో పెట్టి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కొంతమంది అధికారులు ఎన్నికల నిబంధనల కారణంగా పంపిణీ ప్రక్రియకు అభ్యంతరం వ్యక్తం చేయగా.. పాలకులు ఆదేశించారని, అమలు చేయాల్సిందేనంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ కోడ్ ఉల్లంఘనే.. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ పాత తేదీలతో ఆదేశాలు జారీ చేస్తూ అధికార ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోంది. ఎస్టీ కుటుంబాల పౌష్టికాహారం, సంక్షేమం ముసుగులో ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాలకులు పాల్పడుతున్నారు. ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించి పంపిణీని తాత్కాలికంగా నిలుపుదల చేయాలి. –కాండ్రేగుల వెంకటరమణ, సమాచార హక్కు ఉద్యమకర్త, విశాఖపట్నం -
కాపులకు రిక్త హస్తమే!
సాక్షి, అమరావతి: కాపులను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు మోసం చేసింది. సబ్సిడీ రుణాలు అంటూ వారాల తరబడి తిప్పుకుని ఇప్పుడు అయోమయంలో పడేసింది. 2018–19 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు ప్రకటించిన లక్ష్యంలో 10 శాతం మందికి (6,630) మాత్రమే రుణాలు ఇచ్చింది. గత ఐదు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు పదేపదే చెప్పడంతో ఆన్లైన్ ద్వారా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఎంపీడీవో కార్యాలయాల వద్ద రెండు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. దరఖాస్తులు చేసుకునేందుకు వారం రోజులు పని మానుకోవాల్సి వచ్చింది. దరఖాస్తుకు కావాల్సిన సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు మరో వారం తిరగాల్సి వచ్చిందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇంత చేస్తే ఎంపిక చేసిన ఎంపీడీవోలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఎన్నిసార్లు వెళ్లి అడిగినా నిధులు మంజూరు కాలేదు కాబట్టి తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. కాపుల జీవనోపాధి మెరుగుకు ఈ రుణాలు కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018–19 సంవత్సరానికి 68,787 మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.687.87 కోట్లు కేటాయించారు. అయితే మండల స్థాయిలో ఇంటర్వ్యూల అనంతరం కలెక్టర్లు రాష్ట్రంలో లక్ష్యానికి మించి 73,401 మందిని ఎంపిక చేశారు. వీరి కోసం రూ. 515.38 కోట్లు రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ మేరకు కాపు కార్పొరేషన్ 73,109 మందికి సబ్సిడీ విడుదల చేసింది. అయితే రుణాలు ఇచ్చింది మాత్రం కేవలం 6,636 మందికి రూ.49.27 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 66,973 మందికి రుణాలు ఇవ్వలేదు. వీరందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే వీరికి ఈ సంవత్సరం రుణాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈరోజు నుంచి ఎన్నికల హడావుడి మొదలైంది. రుణాలు పంపిణీ చేసే పనిలో ఏ అధికారి కూడా ఉండే అవకాశాలు లేవు. ఎన్నికల కోసం శిక్షణ, డ్యూటీ అలాట్మెంట్ వంటి పనుల్లో బిజీగా ఉంటారు. అందువల్ల ఈ సంవత్సరం రుణాలు ఎగ్గొట్టినట్లేనని చెప్పవచ్చు. నిధులు విడుదల కావాల్సి ఉంది సబ్సిడీ రిలీజ్ చేశాం. త్వరలోనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంపికైన వారందరికీ రుణాలు పంపిణీ చేస్తాం. ఈనెల 15 నుంచి రుణాలు అందించే కార్యక్రమాన్ని ఆయా బ్యాంకులు చేపడతాయి. సబ్సిడీ నగదు నేరుగా బ్యాంకుల్లో జమవుతుంది. అందువల్ల బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. – కోట్ల శివశంకర్‌రావు, ఎండీ, కాపు కార్పొరేషన్. -
అప్పుల్లోనూ అయ్య బాబోయ్!
సాక్షి, అమరావతి: అప్పులు తేవడంలో మంత్రి నారా లోకేశ్.. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నారు. మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టాక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడంలో ముందంజలో ఉంది. ఈ శాఖలో అమల్లో ఉన్న కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచే ఏటా రాష్ట్రానికి దాదాపు రూ.10 వేల కోట్లు వస్తున్నాయి. వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రూ.1,000–1,500 కోట్ల దాకా కేటాయింపులు జరుగుతుంటాయి. ఈ నిధులూ సరిపోక 2018 ఏప్రిల్ తర్వాత కేవలం ఒక ఏడాది కాలంలోనే ఆ శాఖ బ్యాంకుల నుంచి ఏకంగా రూ.18,850 కోట్లు అప్పులు తెచ్చింది. ప్రభుత్వం నేరుగా అప్పు తీసుకోకుండా.. అప్పు తేవడం కోసమే అన్నట్టుగా శాఖకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెస్తున్నారు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోంది. ఈ అప్పులన్నీ సాధారణ ఎన్నికలు జరగడానికి ఐదారు నెలల ముందే కావడం గమనార్హం. ఇప్పటికే గ్రామాల్లోని మంచినీటి పథకాలు, రోడ్లు వంటి వాటిని తాకట్టు పెట్టి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల నగదును.. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రకటించిన పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలకు మళ్లించారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. – గ్రామీణ రోడ్ల మరమ్మతుల కోసం రూ.1500 కోట్ల అప్పు అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, కడప జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లోని 16 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 5,515 లింకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని.. వాటికి మరమ్మతుల కోసమంటూ రూ.1,500 కోట్లు అప్పు తీసుకొస్తోంది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) అమలుకు కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్రానికి కేటాయించిన రూ.400 కోట్లను ప్రత్యేకించి ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాలో ఖర్చు పెడతామని.. ఆ ఖాతాల్లో ఉండే నిధులను సెక్యూరిటీగా పేర్కొంటూ ఆ బ్యాంకు నుంచి రోడ్ కార్పొరేషన్ పేరిట రూ.1,500 కోట్లు అప్పుగా తీసుకుంటున్నారు. ఈ అప్పుకు ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుందంటూ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు వెలువడ్డాయి. – చిన్న చిన్న రోడ్ల నిర్మాణం కోసం రూ.3,800 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో 250 మంది జనాభా ఉండే చిన్న గ్రామాలకు కొత్తగా తారు రోడ్ల నిర్మాణానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.3,800 కోట్లు అప్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు కూడా పిలిచారు. ఆ అప్పును కూడా చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన హామీల అమలుకు ఖర్చుచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని చెబుతున్నారు. – మంచినీటి పథకాల పేరుతో రూ.12,380 కోట్ల అప్పు ఎన్నికల ముందు ప్రభుత్వం ఏపీ తాగునీటి సరఫరా కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రూ.12,380 కోట్లు తీసుకొస్తోంది. 13 జిల్లాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా ప్రతి మనిషికీ 55 లీటర్ల చొప్పున నీటి సరఫరా లక్ష్యంగా వాటర్ గ్రిడ్ పథకం చేపడుతున్నట్టు చంద్రబాబు 2014లో ప్రకటించారు. 2015 అక్టోబర్‌లోనే అధికారుల బృందాన్ని వివిధ రాష్ట్రాల పర్యటనకు పంపడంతో పాటు.. పథకం అమలుకు రూ.22 వేల కోట్ల ప్రణాళికను సిద్ధం చేసింది. నాలుగేళ్లు దీనిపై మౌనంగా ఉన్న సర్కార్.. ఎన్నికల ముందు ఆ ప్రతిపాదనలకు దుమ్ము దులిపి బ్యాంకుల నుంచి రూ.12,380 కోట్ల అప్పులు తీసుకొస్తోంది. మొదట తయారు చేసిన రూ.22 వేల కోట్ల ప్రతిపాదనలను.. రూ.29 వేల కోట్లకు పెంచి, ఎన్నికల ముందు ఇప్పుడు అందులో మొదట దశలో రూ.15,769 కోట్ల పనులు అమలుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. అందుకుగాను పంచాయతీరాజ్ పరిధిలో ఉండే ఆంధ్రప్రదేశ్ మంచినీటి సరఫరా కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రూ.12,380 కోట్ల అప్పులు తీసుకొస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలను తాకట్టు పెట్టి ప్రభుత్వం ఇప్పటికే కొంత అప్పు తీసుకుంది. ఆ డబ్బుతో మంచినీటి పథకాల నిర్మాణ పనులు మొదలు పెట్టనే లేదు. కానీ ఆ నిధులను చంద్రబాబు ఎన్నికల పథకాలకు మళ్లించారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు కోసం రూ.1250 కోట్లు అప్పు.. గ్రామాల్లో కరెంటు స్తంభాలకు ఎప్పటి నుంచి ట్యూబ్ లైట్ వీధి దీపాలు వెలుగుతున్నాయి. లోకేశ్ మంత్రి అయ్యాక తనకు అనుకూలంగా ఉండే కొంత మంది కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు ఇప్పుడున్న ట్యూబ్ లైట్లను తొలగించి.. ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు పూనుకున్నారు. ఒక్కో ఎల్ఈడీ బల్బుకు ఏడాదికి రూ.450 చొప్పున పదేళ్ల పాటు గ్రామ పంచాయతీ గానీ, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.1000 కూడా ఖర్చు కాని ఎల్ఈడీ బల్బుకు కాంట్రాక్టరుకు రూ.4,500 చెల్లించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,918 గ్రామ పంచాయతీల్లో 30 లక్షల కరెంట్ స్తంభాలకు ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు గానూ కాంట్రాక్టర్లకు పదేళ్ల కాలంలో మొత్తం రూ.1,250 కోట్లు అప్పు తెచ్చి చెల్లించాల్సి ఉంటుంది. -
‘ప్రైవేటు’లో కొనడం కోసమే..
సాక్షి, అమరావతి: ముడుపుల కోసం టీడీపీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందనేందుకు అతి తక్కువకు లభించే కేంద్ర విద్యుత్‌ను వదిలేసి.. ‘ప్రైవేటు’ సంస్థలనుంచి అధిక రేటుకు కొనుగోలు చేయడానికి సమాయత్తమవ్వడమే నిదర్శనంగా నిలుస్తోంది. తమకు బకాయిపడ్డ రూ.3,768 కోట్లు చెల్లించిన తర్వాతే విద్యుత్ సరఫరాపై మాట్లాడాలని కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఆంధ్రప్రదేశ్‌కు నోటీసులు పంపినా.. ప్రభుత్వం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బకాయిలు చెల్లించేవరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయాన్ని గతంలోనే తెలియజేసినా పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోవడం అనివార్యమైందని తెలిపింది. కాగా, ఇంత సీరియస్‌గా హెచ్చరించినా ఏమాత్రం స్పందించకపోవడం విద్యుత్ వర్గాలనే విస్మయ పరుస్తోంది. ఎన్టీపీసీ విద్యుత్ ఆగిపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిసింది. కేంద్ర విద్యుత్ నిలిపివేస్తే బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీపీపీసీ విద్యుత్ కేంద్రాలైన సింహాద్రి, రామగుండం, కొరిసి, తాల్చేరు, వల్లూరుతో పాటు పలు కేంద్రాల నుంచి రోజుకు 51 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుతోంది. దీని ధర యూనిట్‌కు రూ.4 మాత్రమే ఉంటుంది. ఇంత చౌకగా లభించే విద్యుత్‌ను వదులుకుని మార్కెట్లో యూనిట్ రూ.6 కన్నా తక్కువకు ఇవ్వబోమంటున్న ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి విపరీతమైన భారమవుతుందని అధికారులు చెప్పినా ఏమాత్రం విన్పించుకోవడం లేదు. ప్రభుత్వ పెద్దలకు అనుకూలమైన విద్యుత్ ఉత్పత్తిదారులు అధిక రేటుకు విద్యుత్ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారు. వీళ్లంతా ముఖ్యమంత్రిని కలిసి మంతనాలు జరిపినట్టు తెలిసింది. ఎన్నికల ఖర్చుల కోసం కొంత ముట్టజెబుతామని చెప్పినట్టు సమాచారం. ఈ కారణంగానే తక్కువగా వచ్చే కేంద్ర విద్యుత్‌కు పరోక్షంగా అడ్డుపడుతున్నారని తెలిసింది. రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా రోజుకు 190 మిలియన్ యూనిట్లకు విద్యుత్ డిమాండ్ చేరింది. ఇందులో 51 మిలియన్ యూనిట్ల కేంద్ర విద్యుత్ ఆగిపోతే రోజుకు కనీసం నాలుగు గంటల పాటు రాష్ట్రంలో విద్యుత్ కోత విధించాల్సి వస్తుంది. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు అందలేదని, ఇతర మార్గాల్లో అప్పులు తెచ్చే వరకూ ఎన్టీపీసీకి బకాయిలు చెల్లించలేమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులకు ఎలా చెల్లిస్తారని విద్యుత్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. భయపడుతున్న అధికారులు.. చౌకగా లభించే కేంద్ర విద్యుత్‌ను కాదని, ప్రైవేటు విద్యుత్ కొనుగోలును ప్రభుత్వం ప్రోత్సహించడాన్ని కొంతమంది విద్యుత్ ఉన్నతాధికారులు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల తామెక్కడ ఇబ్బందుల్లో పడతామోననే భయం వాళ్లను వెంటాడుతోంది. ఇంధనశాఖ ముఖ్య అధికారి ఒకరు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లపై లోతుగా అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. కొనుగోలు దిశగా అధికారులు నిర్ణయం తీసుకోలేరని, ప్రభుత్వమే దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన లేఖ రాయడంపై ముఖ్యమంత్రి కార్యాలయం కాస్తా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే విద్యుత్ సమన్వయ కమిటీ చేత తీర్మానం చేయించి పంపాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ఎన్టీపీసీకి బకాయిలు చెల్లించపోవడానికి సరైన కారణాలు చూపించాల్సి ఉంటుందని, ప్రభుత్వం చెప్పినట్టు వింటే చిక్కుల్లో పడతామని అధికారులు భయపడిపోతున్నారు. -
60 వేల మందికి నైపుణ్య శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) పథకాన్ని కేంద్రప్రభుత్వం మరింత విస్తృతం చేసింది. ఇప్పటివరకు అంశాలవారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి నిపుణులను తయారు చేస్తుండగా తాజాగా ఆసక్తితో కూడిన వృత్తి నైపుణ్యం దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అధికసంఖ్యలో యువతకు నైపుణ్యాన్ని పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు రాష్ట్రాలవారీగా లక్ష్యాలను నిర్దేశించింది. ఇందులో భాగంగా మన రాష్ట్రానికి 60 వేలమంది యువతకు ప్రాధాన్యత, ఆవశ్యకత ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని సూచించింది. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ చర్యలు మొదలుపెట్టింది. 2020 నాటికి రాష్ట్రానికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లాలకు లక్ష్య నిర్దేశాలు కేంద్రం రాష్ట్రాలకు లక్ష్యాలను నిర్దేశించగా వాటి సాధనకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీ లక్ష్యాలను నిర్దేశించింది. ఈ క్రమంలో యువత, అక్షరాస్యత, నిరుద్యోగం తదితర అంశాలను పరిగణిస్తూ ఉపాధి కల్పన శాఖ 33 జిల్లాలకు లక్ష్యాలను ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారులకు సమాచారం అందించింది. జిల్లా స్థాయిలో పీఎంకేవీవై అమలు కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, నోడల్ అధికారిగా జిల్లా ఉపాధి కల్పన అధికారి వ్యవహరిస్తారు. పీఎంకేవీవై కింద దాదాపు 275 రకాల వృత్తులకు సంబంధించి శిక్షణలు ఇస్తున్నారు. ఇందులో 200 గంటల నుంచి 1,200 గంటల వరకు కార్మిక నిబంధనల మేరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. నైపుణ్యాభివృద్ధిశిక్షణ కార్యాక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 127 ట్రైనింగ్ పార్ట్నర్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి శిక్షణ, తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిబంధనల మేరకు నిధులు విడుదల చేస్తుంది. ఈ ట్రైనింగ్ పార్ట్నర్లు నిరుద్యోగులను ఎంపిక చేసేందుకు జిల్లాలు, డివిజన్ స్థాయిలో కౌశల్ మేళాలు ఏర్పాటు చేస్తారు. అదేతరహాలో రోజ్‌గార్ మేళాలు నిర్వహించి ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడం, నైపుణ్యాన్ని మెరుగుపర్చడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. అనంతరం శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందిస్తారు. ప్రాధాన్యత రంగాలు, ఉపాధి మెరుగ్గా ఉండే కంపెనీల్లో ఈ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా ఉపాధి కల్పన శాఖ చర్యలు తీసుకుంటుంది. -
రాజధానిలో భూమి తీసుకో..అమ్ముకో
సాక్షి, అమరావతి: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే చిప్ డిజైనింగ్ కంపెనీ సాక్‌ట్రానిక్స్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీల వర్షం కురిపించింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నాలుగు అంతస్థుల భవనంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీకి రాజధాని అమరావతిలో 40 ఎకరాల భూమిని కారుచౌకగా కేటాయించింది. రూ.160 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.20 కోట్లకే కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో ఎకరం భూమి ధరను ప్రభుత్వమే రూ.4 కోట్లుగా గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ, సాక్‌ట్రానిక్స్‌కు ఎకరం కేవలం రూ.50 లక్షలకే కేటాయిస్తూ హాడావిడిగా ఉత్తర్వులను జారీ చేసింది. విలువైన భూమి కేటాయించడమే కాకుండా పూర్తిగా అమ్ముకోవడానికి లేదా లీజుకు ఇచ్చుకోవడానికి హక్కులు సైతం కల్పించడం గమనార్హం. అమరావతిలో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సాక్‌ట్రానిక్స్ దరఖాస్తు చేసుకున్న రెండు నెలల్లోనే శరవేగంతో ఫైల్ ముందుకు కదిలింది. ఆ సంస్థకు అత్యంత తక్కువ ధరకే విలువైన భూమిని కేటాయించడమే కాకుండా భారీగా రాయితీలు కల్పించడం ఉన్నతస్థాయి అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధానిలో వేలం విధానంలోనే ప్రైవేట్ కంపెనీలకు భూ కేటాయింపులు చేయాలని ఏపీసీఆర్డీఏ స్పష్టంగా చెపుతోంది. కానీ, దాన్ని పక్కన పెట్టి సాక్‌ట్రానిక్స్‌కు భూ కేటాయింపులు చేయడం గమనార్హం. రాయితీల్లోనే రూ.250 కోట్ల లబ్ధి 2014–2020 ఎలక్ట్రానిక్స్ పాలసీ ప్రకారం లభించే రాయితీలే కాకుండా ఇంకా అదనపు ప్రయోజనాలను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు రాయితీల విలువ రూ.250 కోట్లు ఉంటుందని అధికారులు చెపుతున్నారు. కేవలం ఒక్క భూమిపైనే రూ.140 కోట్ల ప్రయోజనం నేరుగా లభించింది. ఇవికాకుండా ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం గ్రాంట్‌గా ఎకారానికి గరిష్టంగా రూ.30 లక్షలతోపాటు అన్ని గ్రాంట్లు కలిపి గరిష్టంగా రూ.50 కోట్లకు వరకు ఇచ్చారు. ఈ విషయాన్ని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ల్యాండ్ కన్వర్జేషన్ చార్జీల నుంచి సైతం మినహాయింపు ఇచ్చారు. ఆంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో 54 ఎకరాల్లోనే అతిపెద్ద క్యాంపస్ నిర్మించింది. ఒక చిన్న చిప్ కంపెనీకి రాజధాని అమరావతిలో ఏకంగా 40 ఎకరాలు కేటాయిచండమే కాకుండా, ఇతరులకు అమ్ముకునే హక్కును కూడా కల్పించడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కేసీఆర్‌కు అండగా మున్నూరు కాపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచి బంగారు తెలంగాణ నిర్మాణంలో మున్నూరుకాపులు ముందుంటారని తెలంగాణ మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్ అన్నారు. కులవృత్తులను కాపాడడంతోపాటు వ్యవసాయదారులకు పథకాలను అమలు చేయడంలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మహాసభ రాష్ట్ర కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్, కోశాధికారి ఇసంపెళ్లి వెంకన్న తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. ముదిరాజ్‌లు, గొల్ల కుర్మలు తదితర దళిత బహుజన కుల సోదరులు ఒకవైపు తమ కులవృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు వ్యవసాయం చేస్తుంటారని, వారి కులవృత్తులతో పాటు వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. అయితే మున్నూరుకాపుల ఏకైకవృత్తి వ్యవసాయమేనని, ప్రభుత్వం తమకు ప్రత్యేక వెసులుబాటు కల్పించి ఆదుకోవాలని కోరారు. మున్నూరుకాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతోపాటు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందజేయాలని కోరారు. హైదరాబాద్‌లోని మున్నూరు కాపు మహాసభను దేవాదాయ, ధర్మాదాయ శాఖ నుంచి వేరు చేసి, ఆస్తులను మహాసభకే అప్పగించాలని కోరారు. గౌరవాధ్యక్షుడిగా ప్రకాశ్.. తెలంగాణ మున్నూరుకాపు మహాసభ గౌరవాధ్యక్షుడిగా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్‌ను ఎన్నుకున్నట్టు పురుషోత్తం తెలిపారు. టీఎస్పీఎస్సీ సభ్యుడు సి.విఠల్, ముఖ్యమంత్రి ప్రజాసంబంధాల అధికారి రమేశ్ హజారీలను మహాసభ గౌరవ సలహాదారులుగా నియమించినట్టు వెల్లడించారు. మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా నీల పద్మ, యూత్ విభాగానికి ఆకుల స్వామి పటేల్, ఐటీ విభాగానికి వెలగపల్లి వామన్‌రావు, కోకన్వీనర్‌గా అశోక్, ప్రొఫెషనల్ కన్వీనర్‌గా మామిడి అశోక్‌లను నియమించినట్లు తెలిపారు. -
పల్లెలకు పచ్చని శోభ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీలు పచ్చదనంతో కళకళలాడనున్నాయి. పరిశుభ్రతకు కేంద్రంగా మారనున్నాయి. పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పచ్చదనం, పరిశుభ్రత ప్రధాన అంశాలుగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 90 రోజుల ప్రణాళికను విడుదల చేసింది. కొత్తగా ఎన్నికైన గ్రామసర్పంచ్‌లంతా సమగ్ర కార్యాచరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రతి గ్రామంలో కనీసం ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సీఎం ఆదేశాలు.. గ్రామపంచాయతీల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ఇటీవల సీఎం కేసీఆర్ కొన్ని ఆదేశాలిచ్చారు. వీటిని తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ, జిల్లా కలెక్టర్లు, జెడ్పీపీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మెమో జారీచేసింది. పచ్చదనం, పరిశుభ్రతకు చర్యలు చేపట్టడంలో భాగంగా గ్రామాల్లోని వీధులు, మురుగుకాల్వల సంఖ్యను బట్టి తగిన సిబ్బందిని కేటాయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరి ద్వారా రెగ్యులర్‌గా వీధులు, కాల్వలు శుభ్రం చేయడానికి పంచాయతీ కార్యదర్శి వెంటనే కార్యకలాపాల పట్టిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. గ్రామపంచాయతీ, సర్పంచ్‌లతో పాటు ఈఓపీఆర్డీ, ఎంపీడీవోలు ఈ పనులను పర్యవేక్షించాలని సూచించింది. 100 శాతం పన్నుల వసూలు.. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కల్పనకు 3 నెలల పాటు వివిధ రూపాల్లో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా 100 శాతం పన్నుల వసూలుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ప్రతి గ్రామసర్పంచ్ చర్యలు తీసుకోవాలని సూచించింది. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నెలకు కనీసం ఒకసారి శ్రమదానం నిర్వహించి, ఇందులో గ్రామస్తులు కొన్ని గంటల పాటు పాల్గొనేలా కార్యక్రమాలు చేపట్టాలి. చేపట్టాల్సిన కార్యక్రమాలు.. - ప్రతి గ్రామంలో కనీసం ఒక కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేసి, చెత్తంతా తీసుకొచ్చి కంపోస్ట్‌గా మార్చాలి. - గ్రామాల్లోని ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తను విడివిడిగా పెట్టేందుకు వీలుగా గ్రామపంచాయతీ నిధులతో డబ్డాలు సరఫరా చేయాలి. - ఉపయోగించని, పనికి రాకుండా పోయిన అన్ని బోర్‌వెల్స్‌ను, ఓపెన్ వెల్స్ మూసేయాలి. - ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠధామం (శ్మశానం)ఏర్పాటు కోసం తగిన స్థలం ఎంపికచేయాలి. పంచాయతీ భూములను మొదటి ప్రాధాన్యమివ్వాలి. అందుబాటులో లేకపోతే ఏదైనా శాఖకు సంబంధించిన భూమిని జిల్లా కలెక్టర్ కేటాయిస్తారు. ఇవేమి అందుబాటులో లేనపుడు గరిష్టంగా రూ.5 లక్షల వరకు గ్రామపంచాయతీ నిధులు లేదా ఎమ్మెల్యే నిధి, తదితరాల నుంచి కేటాయించవచ్చు. - ఉపాధి హామీ నిధులతో శ్మశానాల నిర్మా ణ పనులు చేపట్టి ఆరు నెలల్లోగా పూర్తిచేయాలి. పట్టణాల్లో మాదిరిగా కనీస సౌకర్యాలు.. నగరాలు, పట్టణాల్లో మాదిరిగా పంచాయతీల్లోనూ పారిశుధ్యం, వీధి దీపాలు, తదితర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామపంచాయతీలకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు తమ విధులు, బాధ్యతలు, అధికారాలు, చట్టంలో పొందుపరిచిన ఆయా అంశాల గురించి పూర్తిస్థాయి అవగాహన సాధించేందుకు జిల్లా స్థాయిల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణను మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
కోడ్‌లోనూ కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదన్న నిబంధనలను తోసిరాజంటూ సోమవారం సమావేశమైన మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేయడం గమనార్హం. ముఖ్యంగా బీసీ కులాలకు చెందిన మూడు కార్పొరేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు, రూ.10 కోట్ల మూలధనంతో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం రవాణా సాధికార సంస్థ ఏర్పాటు, 13 మంది హైకోర్టు జడ్జీలకు 600 చదరపు గజాల చొప్పున స్థలాలతో పాటు హైకోర్టు సిబ్బందికి స్థలాలు, అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు చెల్లింపులు, జర్నలిస్టులకు గృహనిర్మాణాలు, సీఆర్డీఏ పరిధిలో 4వ తరగతి ఉద్యోగులకు కూడా స్థలాలను కేటాయిస్తూ నిబంధనల సవరణ, వివిధ నగరాల్లో చేపట్టే గృహ నిర్మాణాలకు స్థలాలు కేటాయిస్తూ అనేక విధానపరమైన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవన్నీ గతంలో తీసుకున్న నిర్ణయాలేనని, వీటిని కేవలం మంత్రివర్గంలో రాటిఫికేషన్ మాత్రమే చేశామంటూ మంత్రి కాల్వ వివరణ ఇచ్చారు. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు.. - ఏపీ ముదిరాజ్/ముత్రాసి/తెనుగోళ్లు సహకార ఆర్థిక సంస్థలు, ఏపీ నగరాలు/నాగవంశ సహకార ఆర్థిక సంఘం, ఏపీ కల్లు, నీరా గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థలు ఏర్పాటు. దీంతో పాటు కొత్తగా ఏర్పాటైన 13 బీసీ కార్పొరేషన్లకు మేనే జింగ్ కమిటీలకుమంత్రి మండలి ఆమోదించింది. - రూ.10 కోట్ల మూలధనంతో ఆటో డ్రైవర్లకు, వాహనాల డ్రైవర్లకు డ్రైవింగ్‌లో అధునాతన శిక్షణకు రవాణా సాధికారిక సంస్థ ఏర్పాటు. - రూ.పదివేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్ల చెల్లింపునకు రూ.250 కోట్ల కేటాయింపు. - సింహాచలం భూములకు సంబంధించి అన్ని ఇబ్బందులు పరిష్కరించాలని నిర్ణయం. మంత్రి యనమల నేతృత్వంలో మంత్రుల సంఘం ఈ సమస్యను పరిష్కరించాలి. - రాజధాని అమరావతిలో హైకోర్టు జడ్జీలు, హైకోర్టు పరిధిలో ఉన్న జిల్లా జడ్జీలు, ఇతర జ్యుడీ షియల్ అధికారులు, హైకోర్టు సిబ్బందికి మార్కె ట్ రేటు ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయం.హైకోర్టు జడ్జీలు ఒకొ క్కరికీ 600 చదరపు గజాలు, రిజిస్ట్రార్ జనరల్, రిజిస్ట్రార్ (ఐటీ, జ్యుడిషియల్)కు 500 చదరపు గజాలు, హైకోర్టు గెజిటెడ్ సిబ్బందికి 200 చద రపు గజాలు, హైకోర్టు నాన్–గెజిటెడ్ సిబ్బందికి 175 చదరపు గజాల కేటాయింపు. - రాజధానిలో కొన్ని ప్రత్యేక వర్గాలకు అవకాశం కల్పించేందుకు అమరావతి భూ కేటాయింపు నిబంధనలు–2017కు సవరణ. - నెల్లూరు జిల్లా గృహాల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కేటాయింపు. ఎస్‌ఆర్‌క్యూ కోటాతో సహా కేటాయించిన 18,641 ఇళ్లను సామాజికవర్గాల వారీగా ఇవ్వాలని నిర్ణయం. - కృష్ణాజిల్లా మైలవరం మండలం పొందుగల గ్రామంలో 78.2ఎకరాల్లో టౌన్షిప్ అభివృద్ధికి కేబినెట్ నిర్ణయం. - పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పేదల గృహనిర్మాణానికి 4.3 ఎకరాలు, ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో 4.76 ఎకరాల ప్రభుత్వ భూమి స్థానిక సంస్థలకు బదలాయింపు. - తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరంలో 1.65 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని.. రాజమహేంద్రవరం రూరల్ మండలం మోరంపూడి గ్రామంలో 8.97 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్‌కు బదలాయింపు. ఇక్కడ అఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ కింద గృహ నిర్మాణాన్ని చేపడతారు. ఇదే జిల్లా పెద్దాపురం డివిజన్ వాలు తిమ్మాపురం గ్రామంలో 31.42 ఎకరాల ప్రభుత్వ స్థలం కూడా అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టు నిమిత్తం పెద్దాపురం మున్సిపాల్టీకి బదలాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం. - జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రత్యేక కేటగిరిగా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చినట్టే జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం, సీఆర్డీఏ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇళ్లు సొంతంగా నిర్మించుకునే పరిస్థితిలో జర్నలిస్టులు లేనందువల్ల భూమిని ప్రభుత్వమే తీసుకుని వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఆదేశాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో కలిపి, అవసరాన్ని బట్టి జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ నుంచి కూడా ఇళ్ల నిర్మాణానికి నిధులను వినియోగించుకోవాలని సూచన. రాజధాని భూముల సంతర్పణ సరళతరం రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన భూమిని కారుచౌకగా తనకు నచ్చిన వారికి నచ్చినట్లు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మరింత సరళతరం చేసేలా నిబంధనలను సవరించింది. కేబినెట్ సమావేశంలో రాజధాని భూ కేటాయింపు నిబంధనలు–2017లో చేసిన సవరణలకు ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెంచే పేరుతో, కొన్ని ప్రత్యేక వర్గాలకు సైతం రాజధానిలో అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ సవరణలు చేస్తున్నట్లు పేర్కొన్నా అవన్నీ కార్పొరేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్, వాణిజ్య సంస్థలకు కట్టబెట్టేందుకే ఈ సవరణలు చేసినట్లు స్పష్టమవుతోంది. జడ్జీలు, జ్యుడీషియల్ ఉద్యోగులు, జర్నలిస్టులు మరికొన్ని వర్గాలకు స్థలాలు కేటాయించే ముసుగులో అయిన వారికీ భూములు కట్టబెట్టేందుకు ఈ సవరణలు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఐటీ కంపెనీలు, హెల్త్ సెంటర్లు, మాల్స్ వంటి వాటికి భూములు కట్టబెట్టేందుకు ఈ సవరణలు చేసినట్లు తెలుస్తోంది. తాజా సవరణల ప్రకారం.. కంపెనీలు, సంస్థలు తమకు కేటాయించిన భూములను అభివృద్ధి చేసినా, చేయకపోయినా అమ్ముకునే వీలు కల్పించింది. -
రాజకీయ ప్రత్యర్థులపై.. ట్యాపింగ్ అస్త్రం!
సాక్షి, అమరావతి బ్యూరో : ‘రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. ఎలా జరుగుతోంది.. ఎవరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియాలి’....ఇదీ రాష్ట్ర పోలీసు బాస్‌లకు సీఎం చంద్రబాబు డైరెక్షన్. అందుకు ఆయన జపిస్తున్న మంత్రం.. అమలుచేస్తున్న కుతంత్రం ఫోన్ ట్యాపింగ్. అందుకోసం ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో ఓ ఉన్నతాధికారిని ప్రత్యేకంగా నియమించుకుని పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థను అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారు. అసాంఘిక శక్తుల కట్టడికి ఉద్దేశించిన కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థను తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా వాడుకునేందుకు బరితెగిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు, ఉన్నతాధికారులే టార్గెట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లజ్జగా అడ్డదారులు తొక్కుతోంది. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులు, ఉన్నతాధికారులతోపాటు సొంత నేతల కదలికలు, ఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేయమని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దలు విస్పష్టమైన ఆదేశాలిచ్చారు. నిబంధనల ప్రకారం ఫోన్ ట్యాపింగ్‌కు స్పష్టమైన విధివిధానాలున్నాయి. ఉగ్రవాద సంస్థలు, మావోయిస్టు పార్టీలు, ఇతర అసాంఘిక శక్తుల కట్టడికి మాత్రమే పోలీసులు ఆ పనిచేయాలి. ఎవరి ఫోన్లను ట్యాపింగ్ చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇచ్చి మరీ అమలుచేయాల్సి ఉందని కేంద్ర టెలిగ్రాఫ్ చట్టం చెబుతోంది. కానీ, ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసు అనుభవంతో.. పక్కా వ్యవస్థను ఏర్పాటుచేసుకుని మరీ రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ దారుణానికి పాల్పడుతోంది. తీవ్రవాదులు, అసాంఘిక శక్తుల కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ ఉండేది. విభజన అనంతరం మన రాష్ట్రంలో ఆ వ్యవస్థను ఏర్పాటుచేయలేదు. 2015లో తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలుకు చంద్రబాబు ప్రయత్నించిన ఉదంతాన్ని ఈ కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ ద్వారానే కేసీఆర్ ప్రభుత్వం బట్టబయలు చేసింది. దాంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు అమరావతిలో ఈ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో మావోయిస్టుల కట్టడికి కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థను కొనుగోలుకు అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం అనుమతితో విదేశాల నుంచి భారీ మొత్తం వెచ్చించి ఈ వ్యవస్థను ఏర్పాటుచేసుకుంది. దీని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏటా అప్డేట్ చేయడానికి కూడా పెద్దఎత్తున ఖర్చుచేస్తోంది. మరి ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చిస్తూ నిర్వహిస్తున్న కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థను భద్రతాపరమైన అంశాలకు కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుండటం అందరినీ విస్మయపరుస్తోంది. ట్యాపింగ్‌తో విజిలెన్స్ దాడులు కూడా.. కాగా, ఇటీవల విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో టీడీపీ రాజకీయ ప్రత్యర్థుల వ్యాపార సంస్థలపై విజిలెన్స్ దాడులు నిర్వహించి వేధించడం వెనుక కూడా ఫోన్ ట్యాపింగ్ అంశమే ప్రధాన పాత్ర పోషించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఇలా మరింతగా అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు ప్రభుత్వం బరితెగించనుందని కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి. అస్మదీయ అధికారుల కనుసన్నల్లో.. ఇంటెలిజెన్స్ విభాగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే దుర్వినియోగం చేస్తూ వస్తోంది. మరోవైపు.. ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ అజమాయిషీకి ఈ విభాగంలో అస్మదీయ అధికారులను కూడా ఇటీవలే ప్రత్యేకంగా నియమించింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక ఉన్నతాధికారిగా ఉన్న వ్యక్తి ఫక్తు టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలులో ఈయనే క్రియాశీలంగా వ్యవహరించడం తెలిసిందే. తాజాగా రాజకీయ ప్రత్యర్థులు, ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ కోసం మరో అస్మదీయ అధికారిని ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రభుత్వం నియమించింది. ఈ కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ కొనుగోలు చేయడంలో ఆయనే క్రియాశీలంగా వ్యవహరించారు. తరువాత ఆయన పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. తాజాగా ఆయన్ని మళ్లీ ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ చేశారు. కాల్ ఇంటర్‌సెప్టర్ వ్యవస్థ పనితీరు, ఫోన్ ట్యాపింగ్‌లపై ఆయనకు పూర్తి అవగాహన ఉన్నందునే ఆయన్ని కీలకస్థానంలో నియమించారు. అంతేకాకుండా.. ఫోన్ ట్యాపింగ్, ఇతర సాంకేతిక అంశాలపై అవగాహన ఉన్న నలుగురు అధికారులను కూడా ఆయన పరిధిలోకి తీసుకువచ్చారు. ఆ బృందం ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే.. ఎంతో సమర్థుడిగా గుర్తింపు పొందిన ఓ కలెక్టర్‌ను హఠాత్తుగా అమరావతికి బదిలీ చేశారు. మరో ఐపీఎస్ అధికారిని లా అండ్ ఆర్డర్ నుంచి అప్రధాన పోస్టుకు మార్చారు. -
పథకాలు రూపొందించేటప్పుడే దోపిడీకి ప్లాన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్రంలో అవినీతి సంస్థాగతంగా మారిపోయింది. అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించేలా ఉంది. స్కీమ్‌లు తయారు చేసినప్పుడే ఏ విధంగా దోచుకోవచ్చో ఆలోచిస్తున్నారు. ఇరిగేషన్, ఆర్అండ్బీ పనుల అంచనాలను పెంచేసి, సీఎం దగ్గరి నుంచి నాయకులు, ఉద్యోగుల వరకూ పర్సంటేజీలు పంచుకుంటున్నారు. ఇసుక, మట్టిని కూడా పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు’’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజేయ కల్లాం ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ‘సేవ్ ఆంధ్రప్రదేశ్–సేవ్ డెమోక్రసీ’ సదస్సు నిర్వహించారు. పలువురు ప్రముఖులు, మేధావులు, ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, ఇతర పెద్దలు పాల్గొన్న ఈ సదస్సులో అజేయ కల్లాం ప్రసంగించారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ పరంగా 2014 జూలై నాటికి పోలవరం మనిహా మిగిలిన 23 ప్రాజెక్టులకు రూ.17 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా చేశారని, ప్రస్తుతం రూ.51 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోందని, మూడు రెట్లు అధికంగా ఖర్చు పెట్టినా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. హౌసింగ్‌లో అవినీతికి అంతేలేకుండా పోతోందని విమర్శించారు. పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో చదరపు అడుగుకు అదనంగా రూ.1,000 వరకూ ఖర్చు చేస్తున్నారని చెప్పారు. 10 లక్షల ఇళ్లకు గాను అదనంగా రూ.36,500 కోట్లు ఖర్చు చూపించి, రూ.18,250 కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అజేయ కల్లాం ఇంకా ఏం చెప్పారంటే... దిగజారిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ‘‘ఏపీ విభజనకు ముందు రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా కేవలం 23 శాతం. విభజన వల్ల 2014 జూలై నాటికి అది 30.2 శాతానికి పెరిగింది. 2017–18 నాటికి ఈ వాటా 34.4 శాతంగా నమోదైనట్లు శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. కానీ, పరిశ్రమల రంగం వాటా 22.5 శాతం నుంచి 22.1 శాతానికి దిగజారిపోయింది. సేవా రంగం వాటా కూడా 44.6 శాతం నుంచి 43.5 శాతానికి పడిపోయింది. అభివృద్ధి సూత్రం ఏమిటంటే జీడీపీలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతూ పోవాలి. పరిశ్రమలు, సేవా రంగం వాటా పెరగాలి. వాస్తవ లెక్కలు ఇలా ఉంటే గుజరాత్ రాష్ట్రం మన రాష్ట్రాన్ని చూసి అసూయ పడుతోందని, అందుకే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెబుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు కేవలం 20.28 శాతం ఉండగా, గత ఏడాది 28.2 శాతంగా ఉందని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొనగా, ప్రస్తుతం 29 శాతం వరకు ఉండవచ్చు. అంతకు ముందు 1995–2004 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో అప్పుల శాతాన్ని స్థూల ఉత్పత్తిలో 29.5 శాతానికి పెంచారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 29.5 శాతం ఉన్న అప్పులను 20.28గా తగ్గించింది. 28 శాతం ఉంటే రెడ్అలెర్ట్. కానీ, ప్రస్తుతం అప్పులను 29 శాతానికి తీసుకువెళ్లి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకొస్తున్నారు. ఈ విధంగా నాలుగేళ్లలో బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పు రూ.35 వేల కోట్లుండగా, ప్రస్తుతం మరో రూ.15 వేల కోట్ల అప్పులు చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా, కేంద్రానికి తెలియకుండా తెస్తున్న అప్పులు రూ.50 వేల కోట్లకు చేరనున్నాయి. ముందు చెప్పిన విధంగా 29 శాతానికి ఇది అదనం. దీన్ని కూడా కలుపుకుంటే రాష్ట్రం తీర్చాల్సిన అప్పు స్థూల ఉత్పత్తిలో 34 శాతం దాటుతుంది. దీన్నుంచి బయటపడాలంటే ఏ రాష్ట్రానికైనా కనీసం రెండు దశాబ్దాలు పడుతుంది. చేనేత రంగంలోనూ అదేతీరు చేనేత రంగం పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. ఒక్క వైఎస్సార్ జిల్లాలో 120 చేనేత సొసైటీలున్నాయి. ఆరు వేల మంది సభ్యులు ఉన్నారు. ఆప్కో చైర్మన్‌గా ఓ వ్యక్తి ఉన్నారు. ఆయన తాలూకు వ్యక్తులతో 80 బోగస్ సొసైటీలు పెట్టి, వాటి ద్వారా బట్ట తయారైనట్టు, 2015–16లో రూ.262.75 కోట్ల విలువైన క్లాత్‌ను ఆప్కోకు సరఫరా చేసినట్టుగా చూపారు. 11 కంపెనీల నుంచి మీటరు రూ.30కి కొని, రూ.50కి సొసైటీల ద్వారా అమ్ముకుంటున్నారు. 2015 ఏప్రిల్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు రూ.75.95 కోట్ల విలువైన బట్ట బోగస్‌గా సరఫరా చేశారు. వాస్తవంగా రూ.29.63 కోట్ల విలువైన బట్ట మాత్రమే సరఫరా చేశారు. మిగిలినదంతా బయటి నుంచి కొనుగోలు చేసి తెచ్చిన బట్ట’’ అని అజేయ కల్లాం పేర్కొన్నారు. దోపిడీపై ప్రశ్నిస్తే బురద జల్లుతారా?: విజయ్‌బాబు చంద్రబాబు ప్రభుత్వం గోబెల్స్ ప్రచారానికి దిగుతోందని సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ విజయబాబు అన్నారు. ప్రపంచంలో మాకియవెల్లీ ఇజం అనేది ఒకటుందని, దీనిప్రకారం పదవి కోసం ఏ నీచానికైనా దిగజారుతారని, అవసరమైతే వెన్నుపోటు పొడుస్తారని, సీఎం చంద్రబాబు కూడా ఆ బాటలోనే నడుస్తున్నారని విమర్శించారు. దోపిడీపై ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం బురద జల్లుతోందని మండిపడ్డారు. పోలవరంపై ప్రజలను ఏమారుస్తున్నారు: ఉండవల్లి అరుణ్‌కుమార్ ‘‘పోలవరం సందర్శన అంటూ లక్షకు పైగా జనాన్ని తరలించి భోజనాలు కూడా పెడుతున్నారు. ఒక్కసారైనా నేను నా సొంత ఖర్చులతో వచ్చి చూస్తాను. ప్రభుత్వం తరపున ఒక్క అధికారి వచ్చి నేను అడిగిన సమాధానాలకు చెప్పండి అని అడుగుతున్నా స్పందించడం లేదు’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నచ్చిన వ్యక్తులకు పోస్టింగ్‌లు ఇచ్చి, ప్రజలను ఏమారుస్తున్నారని దుయ్యబట్టారు. 15 శాతం బోగస్ ఓట్లు: వి.లక్ష్మణరెడ్డి అవినీతి చేయడం తప్పు కాదనే భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఒక్కో ఎమ్మెల్యే రూ.100 కోట్ల నుంచి రూ.1,000 కోట్లు వరకూ సంపాదించారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గంలో 25 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదని, నంద్యాల మోడల్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని 3.6 కోట్ల ఓట్లల్లో 15 శాతం (60 లక్షల ఓట్లు) బోగస్ ఓట్లు కొనసాగుతున్నాయని, ఆ బోగస్ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశిస్తాయని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో అవినీతి శివతాండవం మాజీ సీఎస్ అజేయ కల్లాం పోడూరు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా అవినీతి శివతాండవం చేస్తోందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి’సీఎస్) అజేయ కల్లాం ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో ‘మనకోసం మనం’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాలను దోపిడీ కోసమే భారీగా పెంచుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతి అభివృద్ధి పనిలోనూ 30 శాతం నుంచి 40 శాతం కమీషన్లు, లంచాలు రూపంలో దోపిడీ జరుగుతోందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా జరుగుతున్న ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని పిలుపునిచ్చారు. -
విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్నాయి. ఓ వైపు డిస్కంల ఆర్థికలోటు ఏడాదికేడాది పెరిగిపోతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు విద్యుత్ రాయితీలు కేటాయించడం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎదురైన విద్యుత్ సంక్షోభాన్ని డిస్కంలు కేవలం 6 నెలల్లోనే అధిగమించి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నాయి. దీనికితోడు రాష్ట్రప్రభుత్వ నిర్ణయం మేరకు గతేడాది జనవరి 1 నుంచి వ్యవసాయానికి ఉచిత్విద్యుత్ సరఫరా పథకాన్ని 9 గంటల నుంచి 24 గంటలకు పొడిగించాయి. ఈ చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. రాష్ట్ర అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి అదనపు విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయాల్సి రావడంతో డిస్కంలపై ఆర్థికభారం పెరిగిపోయింది. దీంతో విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లించడంలో డిస్కంలు చేతులెత్తేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రూ.1,356 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామని జాతీయ థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థ(ఎన్టీపీసీ) గతనెలలో హెచ్చరికలు జారీ చేసింది. మరో ప్రైవేటు కంపెనీకు సైతం రూ.1,000 కోట్ల వరకు బకాయిలను డిస్కంలు చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీలు పెంచి ఆదుకుంటుందని డిస్కంల యాజమాన్యాలు ఆశించాయి. తాజాగా శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అరకొరగా విద్యుత్ రాయితీ నిధులు కేటాయించడంతో విద్యుత్ సంస్థలు తీవ్ర నిరాశకు గరయ్యాయి. విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కొంప ముంచిన ఈఆర్సీ లెక్కలు ప్రస్తుత చార్జీలను యథాతథంగా కొనసాగిస్తే 2018–19లో రూ.9,970.98 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడనుందని గతేడాది రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో డిస్కంలు అంచనా వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే విద్యుత్ రాయితీ నిధులతో కొంతవరకు ఆర్థికలోటు భర్తీ కానుండగా, మిగిలినలోటును విద్యుత్ చార్జీల పెంపుతో పూడ్చుకోవాలని డిస్కంలు భావించాయి. విద్యుత్‌చార్జీల పెంపునకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. 2018–19 రాష్ట్ర బడ్జెట్లో సైతం డిస్కంలకు ప్రభుత్వం రూ.4,980 కోట్ల విద్యుత్ రాయితీలు మాత్రమే కేటాయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించిన ఈఆర్సీ డిస్కంల ఆర్థికలోటు అంచనాలను రూ.5,980 కోట్లకు కుదించి పాతచార్జీలతోనే వార్షిక టారిఫ్ ఉత్తర్వులను జారీ చేసింది. వచ్చే నెలతో 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుండగా, ఇప్పటికే డిస్కంలు రూ.5 వేల కోట్లకుపైగా ద్రవ్యలోటును ఎదుర్కొంటున్నాయని ట్రాన్స్‌కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత చార్జీలనే వచ్చే ఏడాది కొనసాగిస్తే 2019–20లో డిస్కంలు రూ.10 వేల కోట్లకుపైగా ఆర్థికలోటును ఎదుర్కోక తప్పదని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2019–20లో విద్యుత్‌శాఖకు రూ.4,002 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ సబ్ నిధులు కలుపుకున్నా విద్యుత్ రాయితీలు రూ.5 వేల కోట్లకు మించవని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.5 వేల కోట్లకుపైగా ఆర్థికలోటులో కొంతభాగాన్ని అయినా పూడ్చుకోవడానికి విద్యుత్‌చార్జీల పెంపు తప్పదని చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చే జూన్‌లో విద్యుత్‌చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించే అవకాశాలున్నాయి. -
ఇనాం భూములకు ఎసరు!
సాక్షి, అమరావతి: అత్యంత విలువైన ఇనాం భూములకు రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెట్టింది. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఇనాం భూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్న నేపథ్యంలో విక్రయ హక్కులు కల్పించడం ద్వారా వాటి విలువను భారీగా పెంచేందుకు ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగానే 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇనామ్స్ రద్దు, రైత్వారీ చట్టం–1956కు సవరణ ఆర్డినెన్స్ జారీ చేసింది. తద్వారా ఆలయాలు, ధార్మిక సంస్థల సేవకులకు పూర్వం కేవలం అనుభవించడానికే కేటాయించిన భూములు, స్థలాలకు విక్రయ హక్కులు కల్పించినట్లయింది. పూర్వం రాజులు, సేవా సంస్థలు, సేవ, ఆధ్యాత్మిక భావం గల సంపన్నులు ఆలయాలు, ధార్మిక సంస్థలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ కోసం భూములు లాంటి స్థిరాస్తులు రాసి ఇచ్చారు. ఈ ఆలయాల్లో పూజలు చేసే పూజారులు, మేళం వాయించే వాయిద్యకారులు, స్వామివారికి నైవేద్యం కోసం పాలు సమర్పించే ఆవులు మేపేవారు తదితర సేవకులకు ఈ సేవలు చేస్తున్నంతకాలం జీవనాధారం కోసం ఇనాం కింద భూములు ఇచ్చారు. ఈ సేవలు చేస్తున్నంత కాలం మాత్రమే ఈ భూములను అనుభవిస్తూ ఫల, ఇతర ఉత్పత్తులు పొందే హక్కు వీరికి ఉంటుంది. ఇనాం చట్టం రద్దుతో.. 1956లో ప్రభుత్వం ఇనామ్స్ చట్టాన్ని రద్దుచేసింది. దీంతో అప్పట్లో ఇలాంటి భూములను అనుభవిస్తున్న ఇనామీలతోపాటు ఇతరులు కూడా రైత్వారీ పట్టాలు పొందారు. చాలావరకూ ఇవి పట్టణాలు, నగరాల్లో ఉండటంతో వీటి విలువ భారీగా పెరిగింది. రాష్ట్రంలో ఇలా ఆలయ సేవకుల ఇనాం భూములు 24,614 ఎకరాలకు పైగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు లాంటి పట్టణాలు, నగరాల్లో ఈ భూములు ఇళ్లస్థలాలుగా మారాయి. అనధికారిక క్రయ విక్రయాలు కూడా జరిగాయి.దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని, రైత్వారీ పట్టాలు ప్రభుత్వమే ఇవ్వడమంటే దేవాలయ భూములను ధారాదత్తం చేయడమేనని, ఇది అన్యాయమంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. ఆలయాల్లో సేవ చేసినంత కాలం అనుభవించడానికి మాత్రమే హక్కు ఉన్న ఇనాం భూములను అమ్ముకోవడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధప్రదేశ్ ఇనామ్స్ రద్దు, రైత్వారీ పట్టాలుగా మార్పిడి చట్టం–1956కు సవరణ చేసింది. దీన్ని గవర్నర్ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. ఈ చట్టం 1956 నవంబరు 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లుగా (రెట్రాస్పెక్టివ్ ఎఫెక్టు) 2013 సెప్టెంబరు 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 1956 నుంచి ఈ భూములకు సంబంధించిన క్రయవిక్రయ లావాదేవీలు ఏమీ చెల్లవు. జరిగిన లావాదేవీలన్నీ అనధికారికమే. వీటికి చట్టబద్ధత లేదు. అనగా ఇవి ఇనాం భూముల కిందే ఉంటాయి. ఈ మేరకు ప్రభుత్వం ఈ భూములను బదలాయింపు నిషేధ(పీఓటీ) జాబితాలో 22 ఎ–1 కింద పెట్టింది. హఠాత్తుగా.. పట్టణాలు, నగరాల్లో ఇనాం భూములు ఇళ్ల స్థలాలుగా మారడంతో చాలామంది అధికార పార్టీ నాయకులు వాటిని తక్కువ ధరకే కొనుగోలు చేశారు. నిషేధిత జాబితా నుంచి తొలగించి, క్రయవిక్రయాలకు అనుమతి ఇస్తే వీటి ధర 10 నుంచి 20 రెట్లు వరకూ పెరుగుతుంది. అందుకే ఈ చట్టాన్ని సవరించాలని వారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. చట్ట సవరణ చేస్తే తమ అధీనంలోని ఆస్తుల విలువ పెరగడంతోపాటు లక్షలాది మంది అనుభవంలో ఉన్న స్థలాలనూ అమ్ముకునే వెసులుబాటు వస్తుందని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం 2013 సెప్టెంబరు 26న గెజిట్ జారీ చేసినప్పటి నుంచే ఈ చట్టం వర్తించేలా ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది. దీన్ని కేబినెట్లో పెట్టి ఆమోదముద్ర వేసి, గవర్నర్ అనుమతితో ఆర్డినెన్సు జారీచేశారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి శనివారం జీవో జారీ చేశారు. నిబంధనలతో కూడిన గెజిట్‌ను కూడా శనివారం జారీ చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఈ ఇనాం భూములు 1956కు పూర్వస్థితి ప్రకారం ఆలయాలు/ధార్మిక సంస్థల పేరుతో ఉన్నట్లే. తాజాగా ఆర్డినెన్సు జారీతో 2013 సెప్టెంబరు 26వ తేదీ వరకూ జరిగిన క్రయవిక్రయాలు, లావాదేవీలకు చట్టబద్ధత లభిస్తుంది. అప్పటివరకూ కొనుగోలు చేసిన/ అనుభవిస్తున్న వారు ఇక వీటిని అమ్ముకోవచ్చు. అనగా 24,614 ఎకరాలు ఇక ఇనాం భూముల జాబితాలో ఉండవు. ఇందులో 70 శాతం అధికార టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. -
‘ప్రైవేట్’ కోసం ప్రజలకు టోపీ
రూ. 5,615 కోట్లు భరిస్తే దాదాపు 32,900 కోట్ల రూపాయల విలువైన భారీ కేంద్ర ప్రాజెక్టు మన రాష్ట్రానికొచ్చేది. భారీగా ఉద్యోగాలొచ్చేవి. అయితే ఈ మొత్తం భరించలేమంటూ చంద్రబాబు తేల్చిచెప్పారు. అదేసమయంలో ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన.. దానికి ఏకంగా రూ. 12,578 కోట్ల అదనపు రాయితీలను ప్రకటించేశారు. రూ.5,615 కోట్లు కట్టే స్థోమత లేదని చెప్పుకున్న ఆయన ప్రైవేటు సంస్థకు రెట్టింపు రాయితీలను ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధమైన చర్యలతో రాష్ట్రం నుంచి మరో భారీ కేంద్ర ప్రాజెక్టు జారిపోయింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కాకినాడలో రూ.32,900 కోట్లతో భారీ క్రాకర్, పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చినా ముఖ్యమంత్రి ప్రైవేటు సంస్థకే మొగ్గు చూపారు. కోల్‌కతాకు చెందిన హల్దియా పెట్రోకెమికల్స్ సంస్థతో వేగంగా ఒప్పందం కుదుర్చుకోవడమే కాకుండా గత నెలలో కాకినాడలో ఆగమేఘాల మీద శంఖుస్థాపన కూడా చేసేశారు. అంతేకాదు పారిశ్రామిక పాలసీ ప్రకారం లభించే రాయితీలు కాకుండా అదనంగా రూ. 12,578 కోట్ల రాయితీలను ఇస్తూ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎస్ఐపీబీ) నిర్ణయం తీసుకుంది. హల్దియాకు వివిధ రూపాల్లో ఇస్తున్న భారీ రాయితీలను చూసి అధికారులకే కళ్లుతిరుగుతున్నాయి. ప్రభుత్వం సంస్థను కాదని... రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు హెచ్‌పీసీఎల్–గెయిల్ కలిసి క్రాకర్, పెట్రో కెమికల్ యూనిట్ పెట్టడానికి 2017లో జరిగిన సీఐఐ పెట్టుబడుల సదస్సులో ఒ్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం కాకినాడ సెజ్‌లో 2,000 ఎకరాల్లో 1.55 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఈ ప్రాజెక్టు లాభదాకతపై ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ స్టడీలో రూ. 5,615 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అవసరమవుతుందని, ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని, మిగతా అన్ని యూనిట్లలో ఇదే విధానం అనుసరిస్తున్నారని ఆ కేంద్ర సంస్థలు పేర్కొన్నాయి. లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రూ. 5,615 కోట్లు వీజీఎఫ్ కింద ఇచ్చే పరిస్థితిలేదని, ఈ మొత్తాన్ని కూడా కేంద్రమే భరించాలంటూ ముఖ్యమంత్రి పట్టుపడుతూ వచ్చారు. చివరకు ఎన్నికల సమయంలో తామే సొంతంగా ఏర్పాటు చేస్తామంటూ హల్దియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారీ రాయితీలు.. కేంద్ర సంస్థకు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేటు సంస్థకు రూ. 12,578 కోట్ల ప్రయోజనాలను ఏ విధంగా కల్పిస్తుందంటూ పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా 2015–20 పాలసీ ప్రకారం లభించే ఇతర రాయితీలు కూడా ఆ ప్రైవేటు సంస్థకు లభిస్తాయని పేర్కొంటున్నారు. ఇదే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చి ఉంటే రెట్టింపు సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేసేవని, తద్వారా రాష్ట్ర యువతకు ఉద్యోగాలతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వచ్చేదని పలువురు ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా చేయకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక ప్రైవేటు సంస్థకు.. అది కూడా ఎన్నికల ముందు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. హల్దియా సంస్థ ఈ ప్రాజెక్టుకు ఆమోదం కోసం ఎస్ఐపీబీ డిసెంబర్ 28, డిసెంబర్ 29న వరుసగా రెండుసార్లు సమావేశం కావడం, జనవరి 3న జీవో చేయడం ఆ మరుసటి రోజే కాకినాడలో ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారంటే దీని వెనుక ఉన్న శక్తుల గురించి అర్థం చేసుకోవచ్చంటున్నారు.