సాక్షి, హైదరాబాద్: అత్యంత వెనుకబడ్డ గిరిజన తెగ (పీవీటీజీ)ల్లోని కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. పీవీటీజీల్లో 4 తెగలున్నాయి. చెంచు, తోటి, కొండ రెడ్డి, కొలామ్ తెగలు అత్యంత వెనుకబడ్డ గిరిజనులుగా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో ఈ తెగల్లోని కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆ శాఖ చర్యలు మొదలుపెట్టింది. పూర్తిగా అటవీ ప్రాంతంలో నివసించే తెగలకు చెందిన వీరు ప్రస్తుతం తాత్కాలిన నివాసాల్లోనే ఉంటున్నప్పటికీ వీరికి అనువైన చోట పక్కా ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీరి పూర్తిస్థాయి ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం అమలు చేస్తున్న సాంప్రదాయ పరిరక్షణ అభివృద్ధి పథకం నిధులను వినియోగించు కోవాలని గిరిజన సంక్షేమ శాఖ యోచిస్తోంది.
నాలుగు తెగల్లో 50 వేల కుటుంబాలు
రాష్ట్రంలో 3 ఐటీడీఏలున్నాయి. ఉట్నూరు, ఏటూరు–నాగారం, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో పీవీటీ జీ కేటగిరీ కింద దాదాపు 50 వేల కుటుంబాలుంటా యని గిరిజన సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నా యి. ఇందులో దాదాపు 95% మందికి పక్కా ఇళ్లు లేవు. దీంతో అటవీ ప్రాంతాల్లో ఉంటున్న పేద గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పీవీటీజీల్లో ఉన్న పేద కుటుంబా లన్నింటికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికా రులు నిర్ణయించారు. సంఖ్య ఎక్కువగా ఉంటే విడ తల వారీగానైనా పూర్తిస్థాయిలో అర్హులకు న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్(ఆర్‌డీటీ) ఆధ్వర్యంలో అనంత పురంలో గిరిజనులకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారు.
తక్కువ ఖర్చుతో మన్నికైన ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆ దిశగా చర్చలు జరుపుతోంది. దీనిలో భాగంగా తాజాగా డీఎస్‌ఎస్ భవన్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులతో గిరిజన సంక్షేమ శాఖ సమావేశం నిర్వహించింది. పీవీటీజీలకు ఎలాంటి ఇళ్లు నిర్మించి ఇస్తే బాగుంటుందనే దానిపై చర్చలు జరిపారు. ఆర్‌డీటీ రూపొందించిన ఇంటి నమూనాలనూ పరిశీలించా రు. ఒక ఇల్లు నిర్మించాలంటే రూ.3 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు అభిప్రాయపడు తున్నారు. ఈనేపథ్యంలో పూర్తిస్థాయిలో చర్చలు జరిపి డిజైన్ రూపొందించాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది.
పేద గిరిజనులకు పక్కా ఇళ్లు!
Published Mon, Feb 18 2019 1:34 AM | Last Updated on Mon, Feb 18 2019 1:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment