సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగే డిసెంబర్ 7న, కౌంటింగ్ నిర్వహించే డిసెంబర్ 11న సెలవులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ ఎస్.కె.జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సాధారణ సెలవులను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే అవసరమైన మేరకు ప్రభుత్వ సంస్థలకు సెలవులు ప్రకటించే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. కార్మికులు పనిచేసే అన్ని సంస్థలు పోలింగ్ రోజున కచ్చితంగా సెలవు ప్రకటించాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment