సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్‌పర్సన్లు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రామపంచాయతీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అందరు సమష్టిగా పనిచేయాలని సూచించారు. సమష్టి కృషితోనే బంగారు తెలంగాణ సాకారమవుతుందన్నారు. కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్‌పర్సన్లు పుట్ట మధు (పెద్దపల్లి), కోవా లక్ష్మి (కుమ్రం భీమ్ ఆసిఫా బాద్), లింగాల కమల్‌రాజ్ (ఖమ్మం), పద్మ (నాగర్‌కర్నూలు), లోక్‌నాథ్‌రెడ్డి (వనపర్తి), హేమలత (మెదక్), నరేందర్‌రెడ్డి (నల్లగొండ), సందీప్‌రెడ్డి(యాదాద్రి భువనగిరి), మంజుశ్రీ (సంగారెడ్డి), సుధీర్‌కుమార్(వరంగల్ అర్బన్), జ్యోతి (వరంగల్ రూరల్), సంపత్‌రెడ్డి (జన గామ), కుసుమ జగదీష్ (ములుగు), బిందు (మహబూబాబాద్), శ్రీహర్షిణి (జయశంకర్ భూపాలపల్లి) సోమవారం హైదరాబాద్‌లో కేటీ ఆర్‌ను కలిశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డి, వరంగల్ ఉమ్మడి జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మా నర్సింగరావు, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, సండ్ర వెంక టవీరయ్య, కోనేరు కోనప్ప, గొంగడి సునీత, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్‌నాయక్, గ్యాదరి కిషోర్, సుమన్, గువ్వల బాలరాజు, ధర్మారెడ్డి, సతీష్ కుమార్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపునేని నరేందర్, హరిప్రియ, క్రాంతి కిరణ్ తదితరులు కేటీఆర్‌ను కలిశారు.
సమష్టిగా అభివృద్ధి: కేటీఆర్
Published Tue, Jun 11 2019 1:59 AM | Last Updated on Tue, Jun 11 2019 1:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment