ZP Chairperson
-
అవసరం తీరాక.. జంప్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీకి వైఎస్సార్సీపీలో ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. సాధారణ గృహిణిగా ఉన్న ఆమెకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించారు. కొంత కాలానికి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌గా ఓడిపోయిన కుటుంబం నుంచి వచ్చిన మహిళకు జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్‌గా అనేక అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే వెన్నుపోటు పొడిచారు. రాజకీయంగా ఉనికితో పాటు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీని మోగసించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పద్మశ్రీ, భర్త ప్రసాద్‌కు పారీ్టలో ప్రాధాన్యం పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ఘంటా ప్రసాద్ బుధవారం నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీలో మొదటి నుంచి ఘంటా ప్రసాద్ కీలకంగా ఉన్నారు. పార్టీ కూడా అదే స్థాయిలో ప్రాధాన్యతనిచ్చి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా చేశారు. 2021లో దెందులూరు నియోజకవర్గం పెదపాడు జెడ్పీటీసీగా ఘంటా ప్రసాద్ భార్యకు అవకాశం కలి్పంచారు. అనంతరం జెడ్పీ చైర్మన్‌గా ఉన్న కవురు శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఎన్నికకావడంతో జెడ్పీ చైర్మన్ పదవీ ఖాళీ అయింది. అనేక మంది పదవి కోసం ప్రయత్నాలు చేసినా.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు పదవి ఇవ్వాలనే కారణంతో పద్మశ్రీకి గతేడాది జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. మొదట జనసేన.. ఇప్పుడు టీడీపీ 2026 ఏప్రిల్ వరకు ఆమెకు పదవీ కాలం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి పాలుకావడంతో పదవి కాపాడుకోవడానికి కూటమి వైపు చూశారు. తొలుత జనసేన అని ప్రకటించి చివరికి టీడీపీలో చేరారు. 2013 ఎన్నికల్లో ఘంటా ప్రసాద్ తండ్రి ఘంటా రంగారావు పెదపాడు మండలం సత్యవోలు నుంచి సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మహిళకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ప్రాధాన్యం ఇచ్చినా వంచనకు పాల్పడి పార్టీకి ద్రోహం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా జెడ్పీటీసీల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తనతో పాటు 15 మంది జెడ్పీటీసీలను తీసుకువెళ్లడానికి అన్ని రకాలుగా ప్రయతి్నంచినా, జెడ్పీటీసీలు ససేమిరా అనడంతో ఒంటరిగా టీడీపీలో చేరారు. ఘంటా రాకను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు ఘంటా ప్రసాద్ ఈ నెల 2న పారీ్టకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు సాయంత్రం జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మళ్లీ మూడురోజులు తరువాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను విశాఖలో కలిసి ఆగమేఘాల మీద ఘంగా ప్రసాద్ టీడీపీ కండువా వేయించుకున్నారు. మళ్లీ బుధవారం అమరావతిలో లోకే‹Ùను కలిసి జెడ్పీ చైర్పర్సన్, ఆమె భర్త టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మినహా ఏలూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనలేదు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జెడ్పీ చైర్పర్సన్ చేరికను బలంగా వ్యతిరేకించారు. -
కాంగ్రెస్‌లో చేరిన వెంటనే.. ఆ జెడ్పీ చైర్‌పర్సన్‌పై బీఆర్ఎస్ అవిశ్వాసం
సాక్షి,రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డిపై 12 మంది జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. శుక్రవారమే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆ మరుసటి రోజు శనివారం(ఫిబ్రవరి 17) ఆమెపై అవిశ్వాసం నోటీసు ఇవ్వడం వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ మేరకు అవిశ్వాసం నోటీసును 12 మంది బీఆర్ఎస్ సభ్యులు కలిసి జెడ్పీ సీఈవోకు అందించారు. సునీతామహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచే జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్పర్సన్ పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అవిశ్వాసం గనుక నెగ్గితే సునీతామహేందర్‌రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ పదవి కోల్పోవాల్సి ఉంటుంది. సునీతామహేందర్‌రెడ్డితో పాటు ఆమె భర్త మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌కు రేవంత్ బర్త్ డే విషెస్ -
మంత్రి, జెడ్పీ చైర్మన్ మధ్య మాటల యుద్ధం
బీబీనగర్: గ్రామ పంచాయతీ భవన ప్రారంభో త్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి జెడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డిల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. సోమ వారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామపంచా యతీ భవన ప్రారంబోత్సవ అనంతరం నిర్వ హించిన సమావేశంలో సందీప్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వారంలోపే రైతు భరోసాతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇవ్వలేదని, రైతుబంధు రాలేదని ఎవరైనా అడిగితే చెప్పుతో కొడ తాం అనడం సరికాదని, రైతుబంధు ఇచ్చింది మేమే అని అనడంతో వెంటనే కాంగ్రెస్ నాయకులు జెడ్పీ చైర్మన్‌తో వాగ్వాదం చేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకొని.. సందీప్‌రెడ్డి చిన్న పిల్లగాడు, అతనికి ఏమీ తెలియదని, తెలియక మాట్లాడుతున్నాడని అనడంతో సందీప్‌రెడ్డి జోక్యం చేసుకొని.. తాను అన్నీ తెలిసే మాట్లాడుతున్నానని అనడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన మంత్రి.. ‘వీన్ని ఎత్తి బయటపడేయండి’అని అనడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజీ మీదకు దూసుకొచ్చారు. సందీన్రెడ్డి డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సందీప్‌రెడ్డిని స్టేజీపై నుంచి వెళ్లిపోవాలని డీసీపీ, ఏసీపీ చెప్పగా తాను ఎందుకు వెళ్లాలి అంటూ జెడ్పీ చైర్మన్ పోలీసులను ప్రశ్నించారు. దీంతో మంత్రి మరింత ఆగ్రహంతో ‘వార్డు మెంబర్‌గా కూడా గెలవలేవు.. ఏదో నీ తండ్రి మాధవరెడ్డి పేరుతో పదవి వచ్చింది తప్ప నీలో ఏమీలేదు. నీ సొంత గ్రామానికి రోడ్డు వేయించలేకపోయావు బచ్చా’అని అన్నారు. పోలీసులు సందీప్‌రెడ్డిని స్టేజీ కిందకు తీసుకుపోతున్న సమయంలో ఒకరిద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు వెనుక నుంచి ఆయనను పిడుగుద్దులు గుద్దారు. సభాస్థలి నుంచి కొద్ది దూరం వెళ్లిన తర్వాత సందీప్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పలేక మంత్రి కోమటిరెడ్డి తనపై దాడి చేయించారని చెప్పారు. -
గుండెపోటుతో బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్ మృతి
సాక్షి, జనగామ: జనగామ జిల్లా జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. హన్మకొండలోని చైతన్యపురిలోని నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు సంపత్‌రెడ్డిని నగరంలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే సంపత్‌రెడ్డి మృతి చెందారు. ఎనిమిది సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో సంపత్‌రెడ్డి కుమారుడు మృతి చెందాడు. ఇటుక బట్టీల వ్యాపారం చేసే సంపత్‌రెడ్డి 2004లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో చిల్పూర్ మండల జెడ్పీటీసీగా గెలుపొందారు. తర్వాత జెడ్పీ చైర్మన్ అయ్యారు. జెడ్పీ చైర్మన్‌గా ఉంటూనే జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంపత్‌రెడ్డి మృతితో ఆయన స్వగ్రామమైన రాజవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. మృతదేహాన్ని స్వగ్రామం రాజవరానికి తీసుకెళ్లి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు నివాళులర్పించనున్న కేసీఆర్.. జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జిల్లా జెడ్పీచైర్మన్ సంపత్‌రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మంగళవారం కేసీఆర్ జనగామకు వెళ్లి సంపత్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. ఒకే ఏడాదిలో రెండో జెడ్పీచెర్మన్.. ఇదే ఏడాది జూన్‌లో ములుగు జిల్లా జెడ్పీచైర్మన్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతి చెందారు. ఈయన కూడా బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో నడిచిన వారిలో ఒకరు. జగదీష్ మృతి చెందినపుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన నుంచి కోలుకోక ముందు తొలి నుంచి పార్టీలో ఉన్న మరో జెడ్పీచైర్మన్, జిల్లా అధ్యక్షుడిని సంపత్‌రెడ్డి రూపంలో కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీ వర్గాలను కలవర పరుస్తోంది. ఇదీచదవండి..ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా.. ఆసక్తికర వ్యాఖ్యలు -
మౌనం వీడేనా!
వికారాబాద్: ఎన్నికల ప్రచారానికి జెడ్పీ చైర్పర్సన్ సునితారెడ్డి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఆమె ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో కనిపించలేదు. బీఆర్ఎస్ అధిష్టానం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి 15 రోజులు దాటింది. బరిలో నిలిచిన వారు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే జెడ్పీ చైర్పర్సన్ సునితారెడ్డి ఇప్పటి వరకే ఏ నియోజకవర్గంలో కూడా అభ్యర్థి తరఫున ప్రచారం చేయలేదు. గతంలో ఎమ్మెల్యేలతో తలెత్తిన వివాదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల్లోని చిన్న చిన్న కార్యకర్తలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేలు సునితారెడ్డిని మాత్రం ప్రచారానికి పిలువలేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. పెరుగుతున్న గ్యాప్ ఏడాది క్రితం నుంచి ఎమ్మెల్యేలు, వారి వర్గీయులు జెడ్పీ చైర్పర్సన్ సునితారెడ్డితో అంటీముట్టనట్లు ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఆరు నెలల క్రితం మర్పల్లిలో ఆమె కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనపై కలత చెందిన ఆమె ఎమ్మెల్యేలు, వారి వర్గీయులను దూరం పెడుతూ వచ్చారు. ప్రధానంగా వికారాబాద్, తాండూరు ఎమ్మెల్యేలతో ఏడాది కాలంగా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల్లో ఒక వర్గం సునితారెడ్డికి అండగా నిలవగా, మరో వర్గం వ్యతిరేకంగా ఉంది. ఈ వర్గమే ఆమె కాన్వాయ్‌పై దాడికి యత్నించింది. ఈ గొడవలు ఎన్నికల నాటికి సద్దుమనుగుతాయని అనుకుంటే మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. అయితే ఆమె వర్గంలోని మెజార్టీ నాయకులు ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అసమ్మతి నేతలను బుజ్జగించి, ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న ఎంపీ రంజిత్‌రెడ్డి.. సునితారెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఆ రెండు చోట్ల ప్రచారం చేసే అవకాశం పరిగి ఎమ్మెల్యేతో జెడ్పీ చైర్‌పర్సన్‌కు పెద్దగా అభిప్రాయ బేధాలు లేకపోవడం, కొడంగల్ ఎమ్మెల్యే స్వయాన ఆమె మరిది కావటంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఆమె అధిష్టానం పెద్దలకు కూడా చెప్పినట్లు సమాచారం. అయితే సన్నిహితుల వద్ద మాత్రం అసలు విషయం చెబుతూ.. ఇతరులు ఎవరైనా అడిగితే మాత్రం తన ఆరోగ్యం సహకరించక పోవడం వల్లే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు చెబుతూ వస్తోంది. -
పల్లె గుండెల్లో విజయ వీచిక
పల్లె జనాలను కుటుంబ సభ్యుల్లా వరసలు పెట్టి ఆప్యాయంగా పిలవడం, అక్కడి ఆడపడుచులతో తోబుట్టువులా కలిసిపోవడం, ఊరి కష్టసుఖాలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు సూచించడం, రాత్రి అదే పల్లెలో నిద్రపోవడం, ఉదయం లేచి మళ్లీ ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీయడం.. క్షేత్రస్థాయిలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ చేసి చూపిస్తున్న కార్యక్రమాలివి. అధినేత ఆదేశాల మేరకు గ్రామగ్రామాన తిరుగుతూ పార్టీ పతాకాన్ని జనం గుండెల్లో ప్రతిష్టిస్తున్నారామె. సంక్షేమ సమాచారం చేరవేస్తూనే.. సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు. పల్లె నిద్ర, రచ్చబండ పేరుతో ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆమెలోని నిఖార్సయిన రాజకీయ నాయకురాలికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బాబాయ్ బాగున్నావా..? అవ్వా ఆరోగ్యం ఎలా ఉంది..? పిల్లలూ బడికెళ్లి చదువుకుంటున్నారా..? అమ్మా.. పింఛన్ అందుతోందా..? జిల్లా ప్రథమ పౌరురాలు సాధారణ పల్లెవాసులతో మాట కలుపుతున్న పద్ధతి ఇది. జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ చేపడుతున్న పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమంలో ఇలాంటి ఆప్యాయమైన పలకరింపులు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఇంతవరకు ఏ మహిళా నేత చేపట్టని ఈ వినూత్న కార్యక్రమం ప్రజల మన్ననలను అందుకుంటోంది. పేరు ఒకలా తీరు మరోలా కాకుండా పల్లె నిద్ర అంటే అచ్చంగా అదే పల్లెలో నిద్రిస్తూ.. రచ్చబండపై ముఖాముఖి మాట్లాడుతూ ఆమె ఆదర్శప్రాయంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల యోగ క్షేమాలను తెలుసుకునేందుకు జిల్లా ప్రథమ పౌరురాలు పిరియా విజయ పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తన హోదాని పక్కన పెట్టి ఒక సాధారణ మహిళగా గ్రామస్తులతో కలిసిపోతున్నారు. సొంత మనిషిగా మెలిగి లోటుపాట్లను తెలుసుకుంటున్నారు. గ్రామస్తులతో ముఖాముఖీ తర్వాత రాత్రి బస చేసి గ్రామాల పరిస్థితులను చూస్తున్నారు. రోజంతా గ్రామంలోనే ఉండి అక్కడి స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సమస్యలు తెలుసుకుని, సంక్షేమాలను వివరించి వారితో మమేకమవుతున్నారు. కార్యక్రమం జరుగుతోందిలా.. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సెపె్టంబర్ 30వ తేదీ నుంచి సోంపేట మండలం ఉప్పలాం సచివాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలను జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అమలు చేయడం ప్రారంభించారు. ►సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు సంబంధిత గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందించినవి తెలియజేస్తూ, వారికి ఇంకేం కావాలో తెలుసుకొనే ప్రయత్నం చేసి, వాటిని అక్కడికక్కడే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చూపిస్తున్నారు. ►రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గ్రామస్తులు, మహిళలతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలియజేస్తున్నారు. స్థానికంగా ఉండే సమస్యలను తెలుసుకొని, వాటిని అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ►తర్వాత ఆ గ్రామస్తులతోనే రాత్రి భోజనం చేసి, అక్కడే పల్లెనిద్ర చేస్తున్నారు. ►మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచి, మహిళలతో టీ తాగుతూ వారితో రచ్చబండపై సమావేశమవుతున్నారు. ►గ్రామంలో అందుబాటులో ఉన్న టిఫిన్ చేసి మళ్లీ ఉదయం 7 గంటలకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, మిగతా ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్, గ్రామస్తులతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముందురోజు మిగిలిపోయిన గడపలను తిరిగేలా మరుసటి రోజు ఉదయం 11గంటల వరకు నిర్వహిస్తున్నారు. 9 గ్రామాల్లో పల్లెనిద్ర, రచ్చబండ.. ► ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సెపె్టంబర్ 30వ తేదీన సోంపేట మండలం ఉప్పలాం గ్రామంలో ప్రారంభించిన పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను ఇప్పటి వరకు 9 చోట్ల నిర్వహించారు. ►నియోజకవర్గంలోని ఉప్పలాం, బట్టిగళ్లూరు, గొల్లవూరు, శాసనాం, మామిడిపల్లి–1, మామిడిపల్లి–2, ఇచ్ఛాపురం మండలం డొంకూరు, అరకభద్ర గ్రామాలు, కవిటి మండలం భైరిపురం గ్రామాల్లో చేపట్టారు. వేలాది గడపలను సందర్శించారు. వందలాది సమస్యలను స్వీకరించారు. ► సోంపేట మండలం ఉప్పలాంలో 110, గొల్లవూరులో 20, టి.శాసనం పంచాయతీలో 10, మామిడిపల్లి పంచాయతీలో 30, కవిటి మండలం బైరీపురంలో 20, ఇచ్ఛాపురం మండలం టి.బరంపురంలో 10, అరకభద్రలో 10, డొంకూరులో 10 వినతులను స్వీకరించారు. ►వచ్చిన అర్జీల్లో చాలా వరకు హౌసింగ్, రేషన్‌కార్డు, డ్రైనేజీ తాగునీటి, రోడ్లు తదితరమైనవి ఉన్నాయి. ఇవన్నీ వెంటనే పరిష్కరించదగ్గ వినతులే కావడంతో అక్కడికక్కడే అధికారులతో మాట్లాడుతున్నారు. పరిష్కారాలను చూపుతూ ప్రజలతో మమేకమవుతున్నారు పిరియా విజయ. -
హస్తం గూటికి జెడ్పీ చైర్పర్సన్ సరిత...
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి పాలమూరులో పునర్ వైభవాన్ని చాటేందుకు పక్కాప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ప్రధానంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంపై ఇదివరకే నజర్ వేసిన ఆ పార్టీ పెద్దలు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టొద్దనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, సీనియర్ నేత, కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు బహిష్కరణ తర్వాత సంప్రదింపులకు శ్రీకారం చుట్టి.. ఆయనను సొంత గూటికి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. అదేవిధంగా బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్‌రెడ్డి సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్ఎస్ అసమ్మతులు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి తదితరులు సైతం చేయి అందుకోనున్నారు. ప్రధానంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో జూపల్లితో మొదలైన చేరికల పరంపర నడిగడ్డగా పేరొందిన జోగుళాంబ గద్వాల జిల్లాకు పాకింది. ♦ అసమ్మతి నేతలతో మాటాముచ్చట.. కాంగ్రెస్‌లోకి బడా నేతల చేరిక నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరింత దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పొసగకపోవడంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితాతిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి సైతం హస్తం గూటికి చేరనున్నారు. రేవంత్‌రెడ్డితో ఆయనకు పాత పరిచయం ఉంది. దీంతో రేవంత్‌రెడ్డి.. చంద్రశేఖర్‌రెడ్డితోపాటు సరితాతిరుపతయ్యతో కలిసి అసమ్మతి నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు సరిత, చంద్రశేఖర్ వేర్వేరుగా రోజుకో మండలం చొప్పున పర్యటిస్తున్నారు. అసమ్మతి నేతలు మూకుమ్మడిగా కాంగ్రెస్‌లో చేరేలా సన్నాహాలు ముమ్మరం చేశారు. మరోవైపు గద్వాల, ధరూర్, మల్దకల్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లోని బీఆర్ఎస్కు చెందిన పలువురు ముఖ్య నేతలతో రేవంత్‌రెడ్డి సైతం స్వయంగా ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. అలంపూర్ నియోజకవర్గంలో సైతం చాపకింద నీరులా కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వినికిడి. సరితాతిరుపతయ్యతో కలిసి ఓ జెడ్పీటీసీ సభ్యుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది. తెరపైకి బీసీ ఫార్ములా.. మారుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో గద్వాలలో బీసీ ఫార్ములా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సైతం ఇదే నినాదంతో ముందుకెళ్లాలనే యోచనలో ఉంది. కాంగ్రెస్‌లో చేరుతున్న జెడ్పీ చైర్పర్సన్ సరితాతిరుపతయ్య కురువ సామాజికవర్గానికి చెందినవారు కాగా.. గద్వాల, అలంపూర్‌లో ఈ వర్గానికి చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో వీరి రాకతో కాంగ్రెస్‌లో జోష్ నెలకొంది. సర్వేల ఆధారంగా టికెట్ కేటాయిస్తామని పార్టీ అధిష్టానం చెబుతున్నప్పటికీ.. సరితాతిరుపతయ్యకే ఖరారైనట్లు గద్వాల నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. మరోవైపు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సైతం బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. కాంగ్రెస్‌లో ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈయన కూడా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరే కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు నాయకులు కాంగ్రెస్‌లో చేరాలని యోచిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను బేరీజు వేసుకుంటున్న వారు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయి తే పోటీ లేకుండా బీసీ వర్గానికి చెందిన ఒకరు ఎన్నికల్లో నిలబడితే గెలిచే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
మీకోసం ఎదురెళ్లడానికి సిద్ధంగా ఉన్నా..
గద్వాల రూరల్: నేనంటే గద్వాలలోని కొందరు నాయకులకు భయం.. అందుకే నేను మీటింగ్‌కు వస్తే కరెంట్ తీశారు.. నేను కుల, మత భేదాలు తెలియకుండా అందరి మధ్య పెరిగిన వ్యక్తిని. కానీ, నడిగడ్డలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇక్కడ కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఎస్సీలను ముట్టుకోరు.. దగ్గరకు రానీయరు.. ఇలాంటి పరిస్థితి ఎక్కడా చూడలేదు. ఇక్కడ రాజ్యాధికారం అంతా కొందరి చేతిలో బంధీ అయింది. ఇక్కడ జరుగుతున్న మీటింగ్‌కు చాలామంది రావాల్సి ఉన్నా.. కొందరు నాయకుల దౌర్జన్యానికి భయపడి రాలేకపోయారు. దీంతో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను కేవలం బానిసలుగా చూస్తున్నారు.. ఈ పరిస్థితి మారాలంటే మనకే రాజ్యాధికారం దక్కాలి.. ఇక్కడున్న వారికి ఎవరికి అవకాశం వచ్చినా నేను అండగా నిలబడతాను.. మీకోసం ఎదురెళ్లడానికి సిద్ధంగా ఉన్నా.. నాకు మీరు అండగా నిలబడాలి అంటూ జెడ్పీ చైర్పర్సన్ కె.సరిత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మల్దకల్లో నిర్వహించిన గద్వాల యువచైతన్య సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమే రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గద్వాలలో ఒక్కసారి బలహీన వర్గానికి చెందిన గట్టుభీముడికి అవకాశం వచ్చిందని, అన్న భీముడు అన్ని వర్గాలకు అండగా నిలబడ్డాడని, ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు సేవ చేస్తూ అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. మన ఓటు మనమే వేసుకుందామని, మనల్ని మనమే గెలిపించుకుందామన్నారు. మార్పు ఒక్కరితోనే మొదలవుతుంది. ఆ ఒక్కరు నేనై మొదలుపెడతానని, నాకు మీరంత అండగా నిలబడాలని కోరారు. గద్వాలలో మనల్ని అణచివేతకు గురిచేస్తున్నారని, అందుకే మిమ్మల్ని పదే పదే అడుగుతున్నా.. ముఖ్యంగా యువత చెబుతున్నా.. మీరు ఇక్కడికి రాకపోవడానికి రకరకాల భయాలే కారణమని తెలుసు.. కానీ, నేను చెప్పేది మీరు కచ్చితంగా వింటారు. ఎందుకంటే ఫేస్బుక్లో ఎంతమంది నన్ను ఫాలో అవుతారో నాకు తెలుసు. చదువుకున్న యువత ముందుకు రావాలి. ఎన్నికల సమయంలో మీకు క్రికెట్ టోర్నమెంట్ అంటూ పక్కదోవ పట్టించి మోసం చేసేందుకు ఇక్కడి కొందరు నాయకులు కుయుక్తులు పన్నుతారు. వారి కుతంత్రాలకు మోసపోకుండా చైతన్యులు కావాలి. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. వెనకబడ్డ జాతులు బాగుపడటానికి ముందుకొచ్చిన నాయకుడికి నేను అండగా ఉంటా.. నాకు మీరు అండగా ఉండాలి. నా దృష్టిలో రెండే కులాలున్నాయి. ఒకటి మంచితనం, రెండు చెడుతనం. జనాలకు మేలు చేసే కులం అగ్రకులమైతది కానీ, తెల్లబట్టలు వేసుకుని జనాలకు కీడు చేసుకుంటూ హింసిస్తూ నేను అగ్రకులస్తుడిని అంటే సరిపోదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో పాల్గొన్న పలువురు వక్తలు ఈసారి అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే టికెట్ ఇవ్వాలని డిమాండు చేశారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో బీసీ బలమేంటో చూపిస్తాం అన్నారు. -
మంత్రి నిరంజన్‌రెడ్డికి షాక్.. ఆత్మాభిమానం చంపుకోలేకేనన్న నేతలు!
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇలాకా వనపర్తి జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో ముసలం మొదలైంది. మంత్రికి సన్నిహితులుగా పేరొందిన ముఖ్య నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్ రెడ్డితోపాటు వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఐ.సత్యారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ సాయిచరణ్‌రెడ్డి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ఈ మేరకు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాలు ప్రదర్శించారు. వీరితోపాటు మరో 11 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, పలువురు ఉపసర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించడమే కాకుండా బీఆర్ఎస్ లో తాము ఎదుర్కొన్న బాధలను వెళ్లగక్కారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక..: ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ మామూలు కార్మికులు సైతం ఆత్మగౌరవం కోరుకుంటారని.. అలాంటిది అధికారంలో ఉండి కూడా ఆత్మగౌరవాన్ని పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేకే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. నిరంజన్‌రెడ్డికి పేరొచ్చిందంటే మేమే కారణం పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డికి నీళ్ల నిరంజన్‌రెడ్డి అనే పేరు వచ్చేందుకు తమ శ్రమే కారణమన్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది ఎవరో వారి మనసులో ఉందని.. త్వరలోనే వారు బాహాటంగా చెప్పే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నియంత పాలన అంతం కోసం ఇక నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. కాగా, నియోజకవర్గంలో ఇప్పటివరకు తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న మంత్రి నిరంజన్ రెడ్డికి అతడి సొంత సెగ్మెంట్ నుంచే వ్యతిరేకత పెల్లుబికడంతో పాటు తాజా పరిణామాలు ఎదురుదెబ్బేనని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. -
అవినీతి నిరూపిస్తే మంథని చౌరస్తాలో ఉరేసుకుంటా
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గాన్ని ఎక్కువ కాలం పాలించిన బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే తనపై కక్షగట్టి నిరాధారమైన ఆరోపణలతో రాష్ట్ర మీడియా తనపై కుట్రలు చేస్తుందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. మధుకర్ హత్య మొదలు.. చికోటి ప్రవీణ్ హవాలా వ్యవహారం వరకు ఎక్కడా తప్పు చేయలేదని, రాష్ట్ర మీడియా మాత్రం తన ప్రమేయం ఉన్నట్లుగా దుష్ప్రచారం చేస్తోందని, తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే మంథని ప్రధాన చౌరస్తాలో ఉరేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంథనిలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు నాగరాజును ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరే పించానని కోర్టులో కేసు వేశారని, అది నిలువలే దని, తర్వాత మధూకర్ ఆత్మహత్యకు తానే కారణమంటూ హైదరాబాద్, ఢిల్లీ నుంచి ప్రతినిధులు వచ్చి రాద్దాంతం చేశారని, ఆ కేసు కోర్టులో ఉందని, దానిపై కథనాలు ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. తాను అక్రమంగా రూ.900 కోట్లు సంపాదించినట్లు మీడియా ప్రచారం చేస్తుందని అందులో వాస్తవం లేదని, చికోటి వ్యవహారంలో మీడియా నిజాలు వెలుగులోకి తీసుకురావాలన్నారు. (క్లిక్: మునుగోడులో బరిలోకి రేవంత్.. కాంగ్రెస్ ప్లాన్ ఫలిస్తుందా..?) -
వికారాబాద్ టీఆర్ఎస్ పార్టీలో రచ్చకెక్కిన వర్గపోరు
-
మహానాడు కాదు.. ఏడుపునాడు
పార్వతీపురం టౌన్: తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తు న్నది మహానాడు కాదు.. ఏడుపు నాడు అని వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహానాడు పేరుతో ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారని ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజులు ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడు ఆద్యంతం సీఎంను, ఆయన కుటుంబా న్ని దూషించడమే లక్ష్యంగా సాగిందన్నారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, బీసీలకు కల్పించిన ప్రయోజనాలను, భవిష్యత్తులో ఏమి చేస్తారో చెప్పకుండా ప్రభుత్వంపై బురదజల్లడ మే పనిగా పెట్టుకోవడం విచారకరమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదివరకు ఎవరూ చేయని విధంగా మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు 70 శాతం పదవులు కేటాయించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. ఆయా వర్గాల్లోని లబ్ధిదారులకు 95 శాతం మేర సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రకు ఆయా వర్గాల నుంచి వస్తున్న విశేష స్పందనను చూసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి భయం పట్టుకుందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మానసిక స్థైర్యం కల్పించేందుకు నానా తంటాలు పడుతున్నారన్నారు. అదే ఆనాడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017లో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే నవరత్నాల కార్యక్రమం కింద ఏమీ చేస్తామో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం చేసి చూపించారన్నారు. తమ నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: సమ్మర్ స్టడీస్.. ఇంట్లోనే చదవండి ఇలా!) -
టీడీపీ దిగజారుడు రాజకీయాలు సరికాదు.. ఆనం అరుణమ్మ ఫైర్
నెల్లూరు(పొగతోట): మహిళలపై జరిగిన ఘటనల విషయంలో ప్రతిపక్ష నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మండిపడ్డారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడారు. మహిళలపై జరిగే ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో జగనన్న ప్రభుత్వం తీసుకున్న చర్యలు గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేపట్ట లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు ఇటువంటి ఘటనలపై శవ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. చదవండి👉🏼 టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం దారుణం జరిగితే మహిళలకు అండగా నిలువాలే తప్ప ఆమెను మానసికంగా చంపే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రవర్తించిన తీరు గర్హనీయమన్నారు. గుంటూరు జిల్లా తుమ్మపాడులో మహిళపై జరిగిన దారుణంపై పోలీసులు 24 గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేశారన్నారు. 9 నెలలోపు నిందితులకు శిక్ష పడేలా చేసిందన్నారు. పోలీసు శాఖను మహిళలుగా అభినందిస్తున్నామన్నారు. మహిళలకు రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహ¯రెడ్డి మహిళల సంరక్షణకు దిశ యాప్‌ను ప్రారంభించి ఆపదలో ఉన్న మహిళలు సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసు శాక వారిని కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. 100, 112 ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం జగనన్నకు మహిళలపై ఉన్న బాధ్యతకు నిదర్శనమన్నారు. పెళ్లకూరు ఆత్మకూరు జెడ్పీటీసీలు ప్రిస్కిల్లా ప్రసన్నలక్ష్మి పలువురు పాల్గొన్నారు. చదవండి👉🏾 పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి.. -
కారుకూతలు కూస్తే ఖబడ్దార్
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై కారుకూతలు కూస్తూ... లేనిపోని రాద్ధాంతాలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తెలుగుదేశం నాయకులకు జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర తీవ్రస్థాయిలో హెచ్చరించారు. బుధవారం నగర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఓ సంఘటనను బూచిగా చూపిస్తూ టీడీపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపైన దాడికి పాల్పడిన వీళ్లా మహిళల రక్షణ గురించి ప్రశ్నించేదన్నారు. ఇదేనా మహిళలపై గౌరవమని ధ్వజమెత్తారు. మచ్చలేని ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం జగన్‌పై బురద చల్లేందుకు గోతికాడి గుంట నక్కలా ఎదురు చూస్తున్నారని విమర్శించారు. మహిళల రక్షణకు దిశ చట్టంగా మార్చేందుకు సహకరించపోవడం దారుణమన్నారు. టీడీపీ హయాంలో విజయవాడలో బాలికపై ఓ కార్పొరేటర్ అఘాయిత్యానికి పాల్పడినప్పుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదన్నారు. ఆనాడు ఓ గిరిజన ఎమ్మెల్యేపైన దేశ ద్రోహం కేసు నమోదు చేశారు? అప్పుడు గుర్తుకు రాలేదా? ఈ అక్కచెల్లెలు అని ప్రశ్నించారు. చట్టసభలో ఎమ్మెల్యే రోజాను ఈడ్చుకెళ్లింది మీరు కాదా అని ప్రశ్నించారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఎమ్మార్వో వనజాక్షి, రితేశ్వరి లాంటి బాధిత మహిళలు ఎందరో ఉన్నారన్నారు. ఎన్నో కళాశాలలో విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు. ఉనికి చాటుకోవడానికి లేనిపోని రాద్ధాంతాలు చేసి అభాసు పాలవుతున్నారన్నారు. ప్రజలకు మేలు చేసే వి«ధంగా ప్రజల్లోకి వెళ్లండి, చిల్లర వేషాలు మానుకోవాలని హితువు పలికారు. పేదలకు పట్టాల పంపిణీ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఆరోపణలతో పబ్బం గడుపుకోవాలని చూడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి:ఉన్మాద పాలన ఘనత చంద్రబాబుది: రాష్ట్రంలో ఉన్మాద పాలన సాగించిన ఘనుడు చంద్రబాబు అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వ్యాఖ్యానించారు. తహసీల్దార్పైన, అధికారులపైనా టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన వేధింపులు, చిత్రహింసలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బిక్కుబిక్కుమంటూ మహిళలు గడిపేవారన్నారు. దిశా యాప్‌తో మహిళలు నేడు ఎంతో ధైర్యంగా ఉన్నారన్నారు. ఇది చూసి ఓర్వలేక చేస్తున్న కుట్రలు అందరికి అర్థమవుతున్నాయన్నారు. మాది ఆడబిడ్డలకు అండగా ఉండే ప్రభుత్వమని పేర్కొన్నారు. మహిళలకు రాజ్యాధికారం ఇచ్చేందుకు 50 శాతం నామినేటెడ్ పదవులతో ఉన్నత స్థానంలో కూర్చొబెట్టామన్నారు. అగ్రవర్గాల మహిళలకు ఈబీసీ కింద రుణాలు, గ్రామ సచివాలయాల్లో 2 లక్షల ఉద్యోగులు ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యల చేయడానికి వంగలపూడి అనితకు అర్హత లేదన్నారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని మహిళా పుట్టుకనే హేళన చేసిన దౌర్భాగ్యుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. బెయిల్ కోర్టులిస్తాయా.. ప్రభుత్వాలు ఇస్తాయో మాజీ ఎమ్మెల్యే అనితకు తెలియకపోవడం దురదృష్టమన్నారు. 14 ఏళ్ల పాలనలో మహిళల కోసం ఏం చేయలేని చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని కోరుతున్నానన్నారు. నారా లోకేష్ పీఏ టీడీపీ ఆఫీస్‌లో ఇబ్బందులున్నాయని చెప్పినప్పడు తెలుగు మహిళల నోరు ఎందుకు లేవలేదన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్లో అప్పటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధాలున్నాయని తెలిసినప్పడు నిరసన ఎందుకు చేయలేదన్నారు. ధ్వజమెత్తిన మహిళా నాయకులు... రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేయడం మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైఎస్సార్సీపీ మహిళా నాయకులు హెచ్చరించారు. దిశ యాప్ పట్ల లేనిపోని రాద్ధాంతం చేయాలని చూస్తే మహిళలు ఉగ్రరూపం దాల్చాల్సి వస్తుందని పలు కార్పొరేషన్ల చైర్మన్లు కొండా రమాదేవి, పిళ్లా సుజాత, చొక్కాకుల లక్ష్మి, మాధవివర్మ, చిన్నతల్లి, వైఎస్సార్ సీపీ మహిళా నాయకులు పేడాడ రమణకుమారి, నల్ల కృపాజ్యోతి హెచ్చరించారు. (చదవండి: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీదే విజయం :పుష్ప శ్రీవాణి) -
పాత జెడ్పీ చైర్మన్లే.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా పాత జిల్లా పరిషత్‌ల విధానమే కొనసాగనుంది. ప్రస్తుత జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవీకాలం ముగిసే వరకు పాత జిల్లాల విధానంలోనే ఆయా పదవుల్లో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగో తేదీ నుంచి ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుత జిల్లా ప్రజా పరిషత్‌ల పదవీ కాలం ముగిసే వరకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వాటి పరిధి, అధికారాలపై కొత్త జిల్లాల ఏర్పాటు ఎలాంటి ప్రభావం చూపదు అని నోటిఫికేషన్లో పేర్కొంది. 2026 సెప్టెంబరు వరకు.. గతేడాది సెప్టెంబర్ 25న రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుత జిల్లా పరిషత్‌ల పదవీ కాలం 2026 సెప్టెంబరు 24 వరకు ఉంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్పటి వరకు పాత జిల్లాల ప్రాతిపదికనే జిల్లా పరిషత్‌ల పాలన కొనసాగనుంది. పాత జిల్లాల ప్రాతిపదికనే జెడ్పీ సీఈవో కార్యాలయాలు కొనసాగుతాయి. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలలో జెడ్పీ కార్యాలయాలు ప్రత్యేకంగా ఉండవు. అడ్వకేట్ జనరల్ సూచనల మేరకు న్యాయ వివాదాలు తలెత్తకుండా జిల్లా పరిషత్తులపై ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలోనూ.. తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. తెలంగాణలో 2016లో దసరా రోజు కొత్త జిల్లాలు ఏర్పాటు కాగా అప్పటికి జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరిగి రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. దీంతో 2014లో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లే 2019లో పూర్తి పదవీకాలం ముగిసే వరకు కొనసాగారు. 2019లో జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు మాత్రమే 33 జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్‌లను విభజించి ఎన్నికలు నిర్వహించారు. ఇది చదవండి: ఏపీలో కొత్త డివిజన్లకు ఆర్డీవోల నియామకం -
ఆర్మూర్ టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు
-
జెడ్పీ పీఠాన్ని దక్కించుకున్న వైఎస్ఆర్సీపీ
-
వైఎస్సార్ జిల్లా జడ్పీ చైర్మన్‌గా ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి
-
చిత్తూరు జిల్లా పరిషత్ నూతన చైర్మన్ గా జి. శ్రీనివాసులు
-
పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీ ఛైర్మెన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికలకు సర్వం సిద్ధం
-
ఏపీ: నేడు జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక శనివారం జరగనుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 640 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే విధానంలో ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అన్ని జిల్లాల్లో నేటి ఉదయం 10 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రిసైడింగ్ అధికారి.. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఒక్కో జిల్లాలో ఇద్దరు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్, జిల్లాకు ఇద్దరు చొప్పున వైస్ చైర్మన్ల ఎన్నికను నిర్వహించనున్నారు. -
25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో పరోక్ష పద్ధతిలో జరిగే మండల పరిషత్ అధ్యక్ష(ఎంపీపీ), జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. 24న ఎంపీపీ, 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపీపీ ఎన్నిక జరిగే రోజే మండల కో ఆప్టెడ్ సభ్యుడు, మండల ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఇక జెడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహించే రోజే ప్రతి జిల్లాలో ఇద్దరు కో ఆప్టెడ్ సభ్యులు, ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది. ప్రమాణ స్వీకారం ముగియగానే కో ఆప్టెడ్ ఎన్నిక మండల పరిషత్‌లలో 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక జరుగుతుంది. ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవుల కోసం సాయంత్రం విడిగా సమావేశం నిర్వహిస్తారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లకు విడిగా ఎన్నిక 25వతేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని జిల్లా పరిషత్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్తగా జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే సమావేశంలో ఇద్దరు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. సాయంత్రం విడిగా సమావేశం నిర్వహించి జెడ్పీ చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక చేపడతారు. వాయిదా పడ్డ చోట్ల మర్నాడు నిర్వహణ ఒకవేళ ఏదైనా కారణాలతో ఉదయం కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగని పక్షంలో ఆయా మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లలో సాయంత్రం జరగాల్సిన ఎంపీపీ, ఉపాధ్యక్ష, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలను కూడా వాయిదా వేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మండల పరిషత్‌లో 24వ తేదీన కో ఆప్టెడ్ సభ్యుడితో పాటు ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవుల ఎన్నిక వాయిదా పడిన పక్షంలో మరుసటి రోజు 25వ తేదీన నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని నోటిఫికేషన్లో ఆదేశించారు. జిల్లా పరిషత్‌లలో 25వ తేదీన జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిన పక్షంలో 26వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు స్థానిక రిటర్నింగ్ అధికారి చర్యలు చేపట్టాలని సూచించారు. -
పరిషత్ తీర్పు: చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా అన్ని స్థానాల్లో అధికార పార్టీ విజయ దుంధుబి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లలో 11 జెడ్పీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కృష్ణా జిల్లా: 46 జెడ్పీటీసీ స్థానాల్లో 40 వైఎస్సార్సీపీ సొంతం. గుంటూరు: 57 జెడ్పీటీసీ స్థానాల్లో 34 వైఎస్సార్సీపీ విజయం ప్రకాశం: 55 స్థానాల్లో 55 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ. నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఉన్న 46 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. విశాఖపట్టణం: 39 స్థానాల్లో 33 వైఎస్సార్సీపీ గెలుపు. టీడీపీ ఒకటి, సీపీఎం ఒకచోట గెలిచింది. విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాల్లో 34 వైఎస్సార్సీపీ విజయం సాధించింది. శ్రీకాకుళం: 38 జెడ్పీటీసీ స్థానాల్లో 28 వైఎస్సార్సీపీ కైవసం అనంతపురం: 62 స్థానాల్లో 60 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ. ఒకటి టీడీపీ, ఇతరులు మరో చోట గెలిచారు. చిత్తూరు: 65 జెడ్పీటీసీ స్థానాల్లో 43 వైఎస్సార్సీపీ విజయం వైఎస్సార్ కడప: 50 స్థానాల్లో 46 గెలిచిన వైఎస్సార్సీపీ కర్నూలు: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్న 53లో 51 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీలకు 20 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. పశ్చిమ గోదావరి: 48 జెడ్పీటీసీ స్థానాల్లో 25 వైఎస్సార్సీపీ కైవసం. -
Green India Challenge: బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటిన అమీర్ ఖాన్
-
ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
-
ఏపీ: ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు నిర్వహించనుండగా అదే రోజు కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక చేపట్టనున్నారు. మరుసటి రోజు 25వ తేదీన జెడ్పీ చైర్మన్, రెండు జెడ్పీ వైస్ చైర్మన్లకి ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు జెడ్పీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుంది. మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు ఇలా.. 20వ తేదీలోపు ఎంపీటీసీ సభ్యులందరికీ ప్రత్యేక సమావేశంపై నోటీసులు. 24న ఉదయం 10 లోపు మండల పరిషత్‌లో కో ఆప్షన్ సభ్యుడి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నిక. మధ్యాహ్నం 1 గంట: కో ఆప్షన్ సభ్యుడి ప్రమాణ స్వీకారం 3 గంటలకు: ప్రత్యేక సమావేశంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎంపిక జెడ్పీ చైర్మన్ ఎన్నిక జెడ్పీటీసీలకు 21వ తేదీలోపు ప్రత్యేక సమావేశంపై నోటీసులు 25వ తేదీన ఉదయం పది గంటలలోపు ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఉదయం పది నుంచి ఒంటి గంట లోపు స్క్రూటినీ, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఎన్నిక మధ్యాహ్నం ఒంటి గంట: కోఆప్షన్ సభ్యుల ప్రమాణస్వీకారం 3 గంటలకు: జెడ్పీ చైర్ పర్సన్, రెండు వైఎస్ చైర్మన్లకు ఎన్నిక ఎంపీపీ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ నామినేట్ చేసిన గెజిటెడ్ అధికారి వ్యవహరించనున్నారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్న కలెక్టర్లు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు అనివార్య కారణాల నిర్వహించలేకపోతే మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలి. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికల సమావేశానికి ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా అనుమతి. ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదు. -
గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్ భర్త ఆడియో వైరల్
గద్వాల్ రూరల్: గద్వాల్ సీఐగా పనిచేసి పలు ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన హనుమంతుతో జెడ్పీ చైర్పర్సన్ భర్త తిరుపతయ్య ఫోన్లో మాట్లాడిన సంభాషణలు శనివారం సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం జిల్లాలో చర్చనీయాంశమైంది. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డికి చెందిన ఓ వ్యక్తి గతంలో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యవహారానికి సంబంధించి కేసు విషయంలో తిరుపతయ్య.. హనుమంతుతో ఫోన్లో మాట్లాడుతూ గట్టు మండల పోలీసు శాఖ అధికారి, స్థానిక ఎమ్మెల్యేపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ సంభాషణ ఎంతవరకు వాస్తవం, ఇది తాజాదా, లేక గతంలో మాట్లాడిన సంభాషణా అన్నదానిపై స్పష్టత లేదు. మొత్తంగా గద్వాల టీఆర్ఎస్లో వర్గవిభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఫోన్ సంభాషణతో మరోమారు స్పష్టమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
గద్వాల్ జడ్పీ చైర్ పర్సన్ భర్త ఆడియో కలకలం
-
ఎంపీపీ వర్సెస్ జెడ్పీ చైర్పర్సన్.. ఆ మాత్రం తెలియదా..
సాక్షి, ఇల్లందకుంట(కరీనంగర్): ప్రొటోకాల్ పాటించకుండా జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షత వహిస్తూ చెక్కులు ఏ విధంగా పంపిణీ చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎంపీపీ పావని నిలదీసింది. దీంతో ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ మధ్య కొంతసేపు మాటల యుద్ధం నడిచింది. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తుండగా ఇరువురు ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో లబ్ధిదారులు ఆందోళన గురయ్యారు. అసలే చెక్కుల కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నామని, ఈ సమయంలో మీ గొడవలు ఏంటని ప్రశ్నించారు. చెక్కులు పంపిణీ చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న చెక్కుల పంపిణీని అడ్డుకోవడానికి ఈటల వర్గీయులు ఇలా మాట్లాడుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ ఆరోపించారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదనలు పెరుగగా, ఆర్డీవో రవీందర్‌రెడ్డి కలుగజేసుకొని సముదాయించారు. అనంతరం సర్పంచులు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చదవండి: ఫోన్‌కాల్ కలకలం: ‘నువ్వేమైనా కేసీఆర్వా.. లేక ఎర్రబెల్లివా?’ -
బడ్జెట్లో జిల్లా పరిషత్‌లకు రూ.320 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ‘జిల్లా పరిషత్ చైర్మన్లు ఏ చిన్న పని చేయాలన్నా నిధుల కొరత ఎదుర్కొంటున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా కొంత వరకు నిధుల కేటాయింపులో అలసత్వం జరిగిన మాట వాస్తవమే. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో ఒక్కో జిల్లా పరిషత్‌కు రూ.10 కోట్ల చొప్పున రూ.320 కోట్లు కేటాయిస్తాం’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్లకు ఎన్నో అధికారాలు ఉన్నా.. చిన్నా చితకా పనులను కూడా మంజూరు చేసే పరిస్థితి లేకపోవడాన్ని సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో పాటు పలువురు చైర్మన్లు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో జిల్లా పరిషత్‌లను బలోపేతం చేసేందుకు అవసరమైన నిధులను కేటాయిస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు. ‘జిల్లా పరిషత్ చైర్మన్లకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంకు ఉంటుంది. వారి కోసం ఇప్పటి వరకు లేని ప్రత్యేక కార్యక్రమాన్ని ఏదైనా ఆలోచిస్తాం. నాలుగు రోజుల్లో ప్రగతి భవన్లో జిల్లా పరి షత్ చైర్మన్లతో కలసి భోజనం చేసి.. ప్రత్యే కంగా సమావేశమవుతా. జెడ్పీ చైర్మన్లకు ప్రత్యేక క్వార్టర్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభిస్తాం’అని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. చదవండి: (నిధులెట్లా.. 2021–22 బడ్జెట్ కూర్పుపై సీఎం కసరత్తు) డీసీఎంఎస్‌లు వారధిగా పనిచేయాలి.. ‘ప్రభుత్వానికి, రైతులకు మధ్య జిల్లా సహకార మార్కెటింగ్ (డీసీఎంఎస్) సొసైటీలు వారధిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. జవహర్లాల్ నెహ్రూ హయాంలో పురుడు పోసుకున్న ఈ వ్యవస్థను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ప్రత్యేక గ్రాంటును కూడా ఇస్తుంది’అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం మెదక్ డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ నేతృత్వంలో ఉమ్మడి 9 జిల్లాల చైర్మన్లు తెలంగాణ భవన్లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. రైతులకు ట్రాక్టర్లు, ఎరువులు తదితరాలు అందజేయడంలో డీసీసీబీలతో కలసి డీసీఎంఎస్‌లు పనిచేయాలన్నారు. డీసీఎంఎస్‌ల ద్వారా రైతులకు సేవ చేయడంలో ఉన్నంత సంతృప్తి ఎందులోనూ లభించదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: (మరో పదేళ్లు నేనే ముఖ్యమంత్రి: సీఎం కేసీఆర్) ఐదు గంటలకు పైగా.. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా ఐదు గంటలకు పైగా గడిపారు. మధ్యాహ్నం 2.15కు తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్ 4.15 వరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లతో సుమారు గంటన్నర పాటు వేర్వేరుగా సమావేశమయ్యారు. జెడ్పీ చైర్మన్లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు నిధులు, ఇతర సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను సీఎం కేసీఆర్‌కు అందజేశారు. కాగా, సమావేశం ప్రారంభానికి ముందు నాగార్జునసాగర్ దివంగత శాసన సభ్యుడు నోముల నర్సింహయ్య చిత్ర పటం వద్ద సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో కలసి నివాళి అర్పించారు. మొత్తం 299 మందిని ఆదివారం జరిగిన రాష్ట్ర సమావేశానికి ఆహ్వానించగా, ఒకరిద్దరు మినహా మంత్రులు, పార్టీ ప్రజా ప్రతినిధులు అందరూ హాజరైనట్లు తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఆ నేతలతో ప్రత్యేక భేటీ? ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించి ఇటీవలి కాలంలో ప్రకటనలు చేసిన మంత్రులు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత సీఎంను ప్రత్యేకంగా కలసినట్లు తెలిసింది. అయితే ఈ భేటీ వివరాలు వెల్లడికాలేదు. -
తల్లిదండ్రులతో ‘దిశ’కు సఖ్యత లేదు..
‘దిశ’ ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ శోభ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తల్లిదండ్రులతో సఖ్యత లేకపోవడం వల్లే దిశ తన చెల్లికి ఫోన్ చేసిందని పేర్కొన్నారు. కామారెడ్డి క్రైం: దిశ ఘటనపై కామారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దిశ తన చెల్లెలికి కాకుండా తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఉంటే వారు వచ్చి తీసుకెళ్లేవారన్నారు. తల్లిదండ్రులతో దిశకు సఖ్యతతో లేనట్లు కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. కామారెడ్డి జిల్లాపరిషత్ స్థాయీ సంఘాల సమావేశం మంగళవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో భాగంగా విలేకరులను ఉద్దేశించి మాట్లాడిన చైర్పర్సన్ దిశ ఘటనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో దిశ తన సోదరికి కాకుండా తండ్రికి ఫోన్ చేయాల్సిందన్నారు. గెజిటెడ్ ఆఫీసర్ అయిన ఆమె తండ్రి వెంటనే అక్కడికి వచ్చి తీసుకువెళ్లేవారన్నారు. దిశ తన పేరెంట్స్ దగ్గర ధైర్యాన్ని కోల్పోయిందన్నారు. తమ పిల్లలకు తల్లిదండ్రులు ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. అప్పటి వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయన్నారు. వీటిని ప్రభుత్వం ఎక్కడ ఆపగలదని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరిని ప్రభుత్వం చూసుకోవడం ఎలా సాధ్యపడుతుందన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. సరిగా అర్థం చేసుకోలేదు.. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో జెడ్పీ చైర్పర్సన్ స్పందించారు. బుధవారం ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేశారు. దిశ సంఘటన ఎంత బాధాకరమైనదో చెప్పడం మాటలకందని విషయమని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక మహిళగా, ఆడబిడ్డల తల్లిగా ప్రతిస్పందించానని వివరించారు. సభలు, సమావేశాలలో దిశ సంఘటనను తీవ్రంగా ఖండించడంతోపాటు సాటి మహిళగా ఆవేదనను వ్యక్తం చేశానని పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డిలో జరిగిన ఒక సమావేశంలో తాను మాట్లాడిన మాటలను కొంతమంది మీడియా మిత్రులు సరిగ్గా అర్థం చేసుకోకుండా వక్రీకరించడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు పిల్లలు తమ తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకునే విధంగా సంబంధాలు ఉండాలన్నది తన ఉద్దేశమని వివరించారు. తన వ్యాఖ్యలు ఎవరి మనసునైనా నొప్పిస్తే క్షమించాలని కోరారు. -
సమాధానం చెప్పేందుకు తత్తరపాటు
సాక్షి,ఆదిలాబాద్: పాఠశాలల్లో తరగతి గదులు సరిపోవడం లేదని, విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్ లేవని, అభివృద్ధి పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, పనులు నాసిరకంగా జరుగుతున్నాయని, గ్రామాల్లో రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, అనేక గ్రామాలకు రహదారి సంబంధాలు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారని, సరైన వైద్యసేవలు అందడం లేదని, వైద్యులు ఆస్పత్రులకు రావడం లేదని, సరిపడా మందులు లేవని, రైతుబంధు, రైతుబీమా, పీఎంకిసాన్ యోజన డబ్బులు రాలేదని, ఇలా అనేక సమస్యలపై సభ్యులు సందించారు. గుక్కవీడకుండా సభ్యులు అడిగిన సమస్యలకు అధికారులు సమాధానం చెప్పేందుకు తత్తరపడ్డారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తమ మండలంలోని సమస్యలపై గళం వినిపించారు. శనివారం జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాపురావు, ఆత్రం సక్కు, జెడ్పీ సీఈఓ కిషన్, వైస్ చైర్మన్ ఆరె రాజన్న, సభ్యులు పాల్గొన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, పురాణం సతీశ్ గైర్హాజరయ్యారు. లోక్‌సభ సమావేశాలు ఢిల్లీలో ఉండడంతో ఎంపీ సోయం బాపురావు రాలేకపోయారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కూతురు వివాహం ఆదివారం హైదరాబాద్‌లో ఉండడంతో ఆమె సమావేశానికి రాలేదు. ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభమైంది. మొత్తం 42 అంశాలకుగానూ విద్యాశాఖ అంశంతో మొదలైన సమావేశంలో వ్యవసాయం, మార్కెటింగ్, ఆర్అండ్బి, విద్య, వై ద్యం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, పరిశ్రమలు, అటవీశాఖ అంశాలపై ఉదయం సెషన్లో చర్చ జరిగింది. మధ్యాహ్న భోజనం అ నంతరం మిగితా అంశాలు చర్చకు వచ్చాయి. అయితే కొన్ని అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినప్పటికీ అనేక అంశాలపై తట్టి వదిలేశారు. సాయంత్రానికి సమావేశం ముగించారు. తలమడుగు మండలం సాయిలింగిలో టాయిలెట్స్ మంజూరు చేయాలని జెడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి కోరారు. రోడ్ల విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంగా నిధుల మంజూరు విషయంలో వైస్ చైర్మన్ ఆరె రాజన్నతో ఆయనకు కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆర్ఓఎఫ్ఆర్ కింద పట్టాలు ఇచ్చినవారికి ఇప్పటివరకు ఏ ఒక్కరికీ రైతుబంధు రాలేదని బజార్హత్నూర్ జెడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామంలో రూ.45లక్షలతో పాఠశాల భవనాలు నిర్మిస్తుండగా 80 శాతం పనులు పూర్తయి మిగితా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భీంపూర్ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్ అన్నారు. కుంటాల జలపాతానికి వెళ్లే రోడ్డులో ఆర్అండ్బి గెస్ట్‌హౌజ్‌కు సంబంధించిన స్థలం అన్యాక్రాంతం అవుతుందని, అధికారులు పట్టించుకోవడం లేదని నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గాదిగూడలో పీహెచ్‌సీని 24 గంటల ఆస్పత్రిగా మార్చాలని జెడ్పీటీసీ మెస్రం గంగుబాయి కోరారు. సమస్యలపై గళంసీజన్‌ను బట్టి అంశాల ప్రస్తావన జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా సీజన్‌ను బట్టి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆరేడు అంశాలను తీసుకొని విస్తృతంగా చర్చించాలి. ఇది నా అభిప్రాయం. గత సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి యాక్షన్‌టేక్ రిపోర్టును సమావేశం కంటే వారం ముందుగానే అందించే ఏర్పాట్లు అధికారులు చేయాలి. ఇలా జెడ్పీ సమావేశం ఓ క్రమపద్ధతిగా జరిగితే జిల్లాలోని సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. – దివ్యదేవరాజన్, కలెక్టర్ -
సమావేశంలో ఎదురుపడని మంత్రులు..
ఆలస్యమైనా... అతిథులంతా వచ్చిన తరువాతే ఏ సభ అయినా మొదలవడం ఆనవాయితీ. అందులోనూ... అధికారిక సభలయితే ఆ హంగామానే వేరు. కానీ కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశం అందుకు భిన్నంగా సాగింది. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఇక్కడి సమావేశం ఆవిష్కరించింది. అధికార పార్టీలోని ఇద్దరు మంత్రుల మధ్య నెలకొన్న అగాధం ప్రస్ఫుటంగా కనిపించింది. ఇద్దరు మంత్రులు కరీంనగర్‌లోనే ఉన్నా... ఒకరు హాజరైన సమయంలో మరొకరు అక్కడ లేకపోవడం గమనార్హం. ఉదయమే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక్కరే వెళ్లారు. ఆయనతోపాటు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి ఉండగా... కరీంనగర్‌లోనే ఉన్న మంత్రి గంగుల కమలాకర్ హాజరు కాలేదు. 11.30 గంటలకు మొదలైన జిల్లా పరిషత్ సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్ రాగా... ‘ఆ సమయంలో’ మంత్రి ఈటల రాలేదు. గంగుల వెళ్లిపోయిన కొద్దిసేపటికి ఈటల హాజరై తనదైన శైలిలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరును వివరించారు. సాక్షి, కరీంనగర్ : జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనమల విజయ అధ్యక్షతన ఆదివారం కరీంనగర్ జెడ్పీ సమావేశం జరిగింది. ఉదయం 11.30 గంటలకు సమావేశం మొదలుకాగా... అప్పటికి జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు , ఎమ్మెల్యే రవిశంకర్, కొందరు కార్పొరేషన్ చైర్మన్లు, 16 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల తీరు, పౌరసరఫరాల శాఖ, సహకార సమాఖ్యలు చేస్తున్న కృషి, జరుగుతున్న అవకతవకలను మంత్రి వివరించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ సమయంలో మరో మంత్రి ఈటల రాజేందర్ సభలో లేకపోవడం గమనార్హం. 9 గంటలకు కరీంనగర్‌లోనే ‘ఈటల’ ఉదయమే కరీంనగర్ వచ్చిన మంత్రి ఈటల రాజేందర్ 9 గంటలకు కొత్తపల్లిలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడి నుంచి జెడ్పీ చైర్పర్సన్ కనమల విజయ నివాసానికి వెళ్లి అల్పాహారం చేశారు. అక్కడి నుంచి తన సొంత నియోజకవర్గానికి వెళ్లిపోయారు. జమ్మికుంటలో పెళ్లిళ్లు, ఇతర ప్రొగ్రామ్స్‌లో పాల్గొని ఒంటిగంట ప్రాంతంలో తిరిగి కరీంనగర్ చేరుకుని జిల్లా పరిషత్ సమావేశానికి హాజరయ్యారు. అయితే అప్పటికే తన శాఖకు సంబంధించిన లోటుపాట్లను చర్చించిన మంత్రి గంగుల కమలాకర్ ఖమ్మంలో వివాహానికి హాజరు కావాలని చెప్పి సమావేశం నుంచి వెళ్లిపోయారు. గంగుల వెళ్లిపోయిన కొద్దిసేపటికి మంత్రి ఈటల జెడ్పీ హాల్లోకి అడుగుపెట్టారు. కాగా మంత్రి గంగుల కమలాకర్ ఉన్నంత సేపు సభలో ఉన్న రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు మంత్రి ఈటల రాజేందర్ వచ్చే ముందు హాల్ నుంచి వెళ్లిపోవడం గమనార్హం. సమావేశానికి రాని కలెక్టర్ జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ కీలకంగా వ్యవహరిస్తారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై మంత్రి గంగుల మాట్లాడుతూ కలెక్టర్ తన రాజ్యాంగబద్ధమైన పదవి పరిధిని దాటి వ్యవహరించారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య అంతరం పెరిగినట్లయింది. యాదృశ్ఛికమో... కావాలని జరిగిందో తెలియదో గానీ ఈ సమావేశానికి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హాజరు కాలేదు. ఆయన తరఫున జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ సమావేశం ముగిసే వరకు ఉన్నారు. ఆయనతోపాటు సీఈవో వెంకట మాధవరావు సమావేశం నిర్వహణలో ఉన్నారు. ఢిల్లీలో ఎంపీ సంజయ్ పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఢిల్లీలో ఉండడంతో జెడ్పీ సమావేశానికి హాజరు కాలేదు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ జెడ్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. -
కనీస సమాచారం లేకపోతే ఎలా..!
నిజామాబాద్‌అర్బన్: జిల్లా ఉపాధి కల్పన అధికారి మోహన్‌లాల్ తీరుపై జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్‌రావు, స్థాయీ సంఘ సభ్యులు మండిపడ్డారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో స్థాయీసంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కల్పన శాఖపై సమీక్ష నిర్వహించారు. శాఖ ద్వారా చేపడుతున్న విధానాలను పేర్కొనాలని చైర్మన్ ఆదేశించారు. సం బంధిత అధికారి వద్ద ఎలాంటి సమాచారం లేకపోవడంతో సమాధానం చెప్పలేకపోయారు. దీంతో చైర్మన్ సమావేశానికి వచ్చేటప్పుడు ఇలా గేనా వస్తారా అని ప్రశ్నించారు. ఎంప్లాయీమెం ట్ కార్యాలయంలో ఎన్ని ఏజెన్సీలు కొనసాగుతున్నాయి. ఐదేళ్ల నుంచి ఎందుకు టెండర్లు వే యడం లేదంటూ ప్రశ్నించారు. తక్షణమే అన్ని వివరాలను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖపై జరిగిన సమీక్షలో ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేయడం, మొక్కల పెంపకాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ నుంచి ఇప్పటి వరకు ఎంత మందికి సబ్సిడీ రుణాలు ఇచ్చారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం వ్యవసాయంపై సమీక్ష సమావేశం జరిగింది. రైతు బంధు పథకం అమలు, ప్రస్తుతం ఖరీఫ్‌కు పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశంలో వైస్‌చైర్మన్ రజిత, సభ్యులు అధికారులు పాల్గొన్నారు. -
జెడ్పీ స్థాయీ సంఘాల ప్రాధాన్యం పెరిగేనా?
సాక్షి, ఆదిలాబాద్: కొత్త జెడ్పీ.. పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసి నెలరోజులు దాటింది. పాలన వ్యవహారాలు ప్రారంభమైతేనే పనితీరు ఎలా ఉంటుందో తెలుస్తుంది. పాలకవర్గం ఇంకా క్రియాశీలకం కాలేదు. సమావేశాల నిర్వహణతోనే ఇటు జెడ్పీలో అధికారులు, సిబ్బంది పరంగా విధుల నిర్వహణ, ఇటు పాలకవర్గం వ్యవహారం స్పష్టం అవుతుంది. ప్రస్తుతం కొత్త జెడ్పీ పాలకవర్గం ‘స్థాయీ’ పెంచేలా వ్యవహరిస్తుందా.. లేదా అనేది భవిష్యత్ నిర్ధారించనుంది. మ్మడి జిల్లా ఉన్నప్పుడు 52 మండలాలతో జెడ్పీ పాలన సందడిగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలపాటు కొత్త జెడ్పీలు ఏర్పాటు చేయడంతో మార్పులు జరిగాయి. అప్పుడు 52 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉండగా, ప్రస్తుతం కొత్త జిల్లాలో 18 మండలాల్లో ఆదిలాబాద్‌అర్బన్ మండలం మినహా 17 మంది ఉన్నారు. దీంతో స్థాయీ సంఘాలు, సర్వసభ్య సమావేశంలో మునపటి సభ్యుల సందడి కనిపించే అవకాశం లేదు. అయితే ప్రస్తుత పాలకవర్గంలో అధికార టీఆర్ఎస్ తొమ్మిది మంది సభ్యులను కలిగి ఉంది. ఇక బీజేపీ ఐదుగురు, కాంగ్రెస్ ముగ్గురు జెడ్పీటీసీలు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన ఉట్నూర్ జెడ్పీటీసీ చారులత జెడ్పీ చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు తెలిపింది. దీంతో ఆమె కాంగ్రెస్ వైపు ఉండే అవకాశాలు లేవు. అయినా జెడ్పీచైర్మన్ ఎన్నిక సమయంలో ఐదుమంది సభ్యులు ఉన్న బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దించడం, దానికి కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే మెజార్టీ సభ్యులు టీఆర్ఎస్ వైపు ఉండడంతో పాలకవర్గం అధికార పార్టీ వంతైంది. ఇదిలా ఉంటే స్థాయీ సంఘం, సర్వసభ్య సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కలిసి అధికార టీఆర్ఎస్ పార్టీని సమస్యలపై ఎండగట్టే అవకాశాలు లేకపోలేదు. అలాంటి సమయంలో రాజకీయాలకే కొత్తైన జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సమర్థవంతంగా వారిని తిప్పికొడతారా.. లేనిపక్షంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది సమావేశాల్లోనే స్పష్టమయ్యే పరిస్థితి ఉంది. సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. అయితే స్థాయీ సంఘాల్లో మాత్రం వారిని కూడా సభ్యులుగా తీసుకోనున్నారు. కాగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వారే ఉండటంతో పాలక పక్షానికి బలంగా ఉంది. అయితే ఎంపీ బీజేపీ సోయం బాపురావు ప్రాతినిధ్యం వహిస్తుండటం, ఆ పార్టీకి ఐదుగురు సభ్యులు ఉండటం, ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు మద్దతు పలికే అవకాశం ఉండడంతో సమావేశాల్లో వాడీవేడి ఉండే అవకాశాలు లేకపోలేదు. స్థాయీ సంఘాలు కీలకం.. జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసిన 60 రోజుల్లోపు స్థాయీ సంఘాలను నియమించాల్సి ఉంటుంది. ఇందులో ఏడు స్థాయీ సంఘాలు ఉన్నాయి. వాటిలో ప్రణాళిక ఆర్థిక పన్నులు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యసేవలు, మహిళ సంక్షేమం, సాంఘిక సంక్షే మం, నిర్మాణ పనుల స్థాయీ కమిటీలు ఉన్నా యి. ఇందులో ప్రణాళిక ఆర్థిక పన్నులు, నిర్మాణ పనుల స్థాయి కమిటీలకు సభ్యుల నుంచి అధిక డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం జెడ్పీలో 17మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు, కోఆప్షన్ సభ్యులను మన జెడ్పీ స్థాయీ సంఘంలో సభ్యులుగా తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలు సంపూర్ణంగా ఉండగా, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని మండలాలు పాక్షికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలతోపాటు ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలను కూడా స్థాయీ సంఘంలో సభ్యులుగా తీసుకోవాల్సి వస్తుందా.. లేదా అనే విషయంలో జెడ్పీ ఉన్నతాధికారులు రాష్ట్ర అధికారుల నుంచి సమాచారం కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి నిబంధన ఉందో ఇక్కడ కూడా అదే అమలవ్వాలని ఉంది. తద్వారా జిల్లాలో పాక్షికంగా ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఆదిలాబాద్ జెడ్పీ స్థాయీ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తారా.. లేదా అన్నది త్వరలో తేలిపోనుంది. అయితే ఈ స్టాండింగ్ కమిటీల నియామకానికి సంబంధించి ఇప్పటి వరకు పైనుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో కదలిక కనబడటంలేదు. సుమారు నెలరోజుల సమయం ఉండడంతో అధికారులు పై విషయాల్లో స్పష్టత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీలుగా ఉపాధ్యాయ వర్గం నుంచి గెలిచిన రఘోత్తం రెడ్డి, పట్టభద్రుల స్థానం నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన పురాణం సతీశ్‌లు ఉన్నారు. అయితే పురాణం సతీశ్‌ను స్థాయీ సంఘంలో సభ్యుడిగా తీసుకునే విషయంలో అధికారులు స్పష్టత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా సతీశ్ మంచిర్యాల జిల్లా ఓటరుగా ఉండడంతో అక్కడి జెడ్పీలోనే స్థాయీ సంఘం సభ్యుడిగా వ్యవహరించే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నియామకాలు జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా అధికార పార్టీ సభ్యులకే స్థాయీ సంఘంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అదే సమయంలో విపక్ష సభ్యులకు కూడా సంఘాల్లో అవకాశం కల్పించినా అప్రాధాన్యత సంఘాల్లో వారికి చోటు కల్పించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో పాలకవర్గాన్ని విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ల వ్యవహార శైలి ఎలా ఉండబోతుందో త్వరలో తేలిపోనుంది. సమావేశాలతోనే పాలనలో పరుగు జెడ్పీ కొలువుదీరి నెలరోజులు దాటినా ఇప్పటికీ పాలన పట్టాలెక్కలేదు. ప్రధానంగా సమావేశాల ప్రారంభంతోనే వేగం పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా పరంగా ఆదిలాబాద్ జెడ్పీలో 69 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేవారు. అయితే నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌లో కొత్త జెడ్పీల ఏర్పాటుతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులనే అక్కడికి విభజించారు. ప్రస్తుతం కొత్త ఆదిలాబాద్ జెడ్పీలో 22 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ప్లానింగ్, అకౌంట్స్, వర్క్స్, జీపీఎఫ్, విద్య సెక్షన్లను ఒక్కొక్క సూపరింటెండెంట్ పర్యవేక్షించేవారు. ప్రస్తుతం ఈ ఐదు సెక్షన్లకు కలిపి ఇద్దరు సూపరింటెండెంట్లను నియమించారు. అయితే ఇప్పటికి కార్యకలాపాల పరంగా వేగం పుంజుకోలేదు. ప్రధానంగా ఒకట్రెండు సమావేశాలు జరిగి విధివిధానాలు స్పష్టమైతేనే జెడ్పీలో అధికార కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంది. సీఈఓలకే నిధుల కేటాయింపు అధికారం.. ఆదిలాబాద్ జెడ్పీలో ఎన్నికల సమయంలో, ప్రమాణస్వీకారం రోజు సీఈఓగా ఉన్న నరేందర్‌ను ఇక్కడి నుంచి మంచిర్యాలకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం కిషన్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే మధ్యలో సీఈఓగా వేణు అనే అధికారి ఇక్కడికి బదిలీపై వచ్చి ఒకేరోజు పనిచేసి వెళ్లిపోయారు. ప్రధానంగా రెవెన్యూ అధికారి అయిన వేణు జెడ్పీ కార్యకలాపాల్లో పీఆర్ సిబ్బంది మధ్య ఇక్కడ ఇమడలేకపోయారన్న విమర్శ లేకపోలేదు. అదే సమయంలో గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జెడ్పీలోనే ఏఓగా పనిచేసిన కిషన్ ఆదిలాబాద్ జెడ్పీ సీఈఓగా రావడం యాదృచ్చికంగా జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఉమ్మడి పాలకవర్గంలో జెడ్పీకి వివిధ పథకాల కింద నిధుల కేటాయింపు జరగకపోవడంపై అప్పట్లో సభ్యులు ప్రతీ సమావేశంలోనూ ఆక్షేపన వ్యక్తం చేసేవారు. ప్రస్తుతం కొత్త జెడ్పీలకు నిధులు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిధుల విడుదల, వినియోగం, అధికారాలను జెడ్పీ సీఈఓకు కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో జెడ్పీ సీఈఓల ఆమోదం తర్వాత నిధుల కేటాయింపు, విడుదల, పంపిణీ అధికారాలు డిప్యూటీ సీఈఓలకు ఉండగా, ప్రస్తుతం మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఈఓల పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. వారి స్థానంలో ప్రతీ జెడ్పీకి అకౌంట్ ఆఫీసర్ పోస్టును కేటాయించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉమ్మడి జెడ్పీకి ఏఓగా వ్యవహరించిన కిషన్ ప్రస్తుతం సీఈఓగా నిధుల విడుదల, వినియోగంలో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. ఆదేశాలు రావడమే తరువాయి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే స్థాయీ సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఈ సంఘాల ఏర్పాటుతోపాటు మన జెడ్పీ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేల విషయంలోనూ ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. – కిషన్, జెడ్పీ సీఈఓ -
నాలుగు జెడ్పీలకు పాలకమండళ్లు
సాక్షి, హైదరాబాద్: బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో కొత్త జెడ్పీపీ చైర్పర్సన్లు , వైస్ చైర్పర్సన్లు కో ఆప్షన్ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని జడ్చర్ల ఎంపీపీలు, ఎంపీటీసీలు బుధవారం తొలిసారిగా సమావేశమై బాధ్యతలు చేపట్టారు. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ఎంపీపీలు, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల ఎంపీపీలు పదవులు చేపట్టారు. వీరంతా బుధవారం నుంచి ఐదేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగుతారు. మహబూబాబాద్ జిల్లా జెడ్పీపీని అక్కడి ఎంపీడీవో కార్యాలయంలో, ములుగు జిల్లా జెడ్పీపీని ములుగు ఎంపీడీవో ఆఫీసులో, ఖమ్మం జిల్లా జెడ్పీపీని పాత జిల్లా పరిషత్‌లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీపీని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేశారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా జెడ్పీ తొలి సమావేశంలో పీఆర్ శాఖ మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. గత నెలలోనే 28 జెడ్పీపీల్లో పాలకమండళ్లు... గత నెల 7న 28 జిల్లా పరిషత్‌ల చైర్పర్సన్లు బాధ్యతలు చేపట్టారు. అప్పుడు పదవుల్లోకి వచ్చిన జెడ్పీ చైర్పర్సన్లు అదే రోజున తొలి సమావేశం నిర్వహించి పదవులు చేపట్టారు. పదవీకాలం ముగియకపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని నాలుగు జెడ్పీపీల్లో కొత్త పాలకమండళ్లు ఏర్పడలేదు. ఇప్పుడు అన్ని జిల్లా పరిషత్‌లలో పాలక వర్గాలు కొలువుదీరినట్టు అయింది. -
'ఆ సంఘటన నన్ను బాగా కలిచి వేసింది'
సాక్షి, మహబూబాబాద్ : ‘రాజకీయాల్లోకి రావడం ద్వారా పేదలకు సేవ చేయొచ్చని చిన్నప్పుడే తెలుసుకున్నా.. అందుకే నిర్ణయించుకున్నాను.. దీనికి తోడు మా చిన్నమ్మ సత్యవతి రాథోడ్ ఇదే రంగంలో ఉండడంతో అవగాహన పెరిగింది.. నలుగురు ఆడపిల్లల్లో చిన్నదాన్ని కావడంతో మా తల్లిదండ్రులు నన్ను కొడుకులా పెంచారు.. అందుకే మగ వాళ్లలా దుస్తులు వేసుకోవడం అలవాటైంది’ అని చెప్పారు మహబూబాబాద్ జెడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి పర్సనల్ టైం’లో వెల్లడించిన మరికొన్ని అంశాలు ఆమె మాటల్లోనే.. మధ్య తరగతి కుటుంబం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాల్యాతండలోని మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం మాది. నాన్న శ్రీకాంత్ నాయక్, అమ్మ కాంతి. మా ఇంట్లో ముగ్గురు అక్కల తర్వాత నేను పుట్టాను. అందరికంటే చిన్నదాన్ని. దీంతో ఇళ్లు, బంధువుల్లో నేనంటే గారాబం. అందరూ నన్ను ఆప్యాయంగా చూసుకుంటారు. అయితే మా పెద్ద అక్క అంటే మాత్రం కొంచెం భయం. మిగతా ఇద్దరు అక్కలతో క్లోజ్‌గా ఉండేదాన్ని. ఫస్ట్ డే చూడాల్సిందే సినిమాల విషయానికొస్తే న్యాచురల్ స్టార్ నానీ అంటే ఇష్టం. నేను చూసిన లాస్ట్ మూవీ మజీలీ. నాని సినిమా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. కాలేజీలో మా గ్యాంగ్‌తో కలిసి సినిమాలు రెగ్యులర్‌గా చూసేదాన్ని. ఆన్లైన్లో వెబ్ సిరీస్ సీరియల్స్, కోరియన్ మూవీస్ రెగ్యులర్‌గా చూస్తా. ఇక సీరియల్స్ అంటే మాత్రం తెగ బోర్. అందుకే వాటికి జోలికి వెళ్లను. చిన్నప్పుడే అనుకున్నా... చిన్నప్పటి నుంచి చిన్నమ్మ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను రాజకీయాల్లో చూస్తూ పెరిగినా. వేసవి సెలవుల్లో ఒకసారి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు చిన్నమ్మను కలుసుకోవడానికి చాలామంది ప్రజలు వచ్చి తమ గోడు చెప్పుకునేవారు. అలాగే చిన్నమ్మతో కలిసి కార్యక్రమాలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం, చిన్నమ్మకు ఇచ్చే గౌరవం బాగుండేది. చేతిలో అధికారం ఉంటే అక్కడిక్కడే ప్రజల సమస్యలు పరిష్కరింవచ్చని తెలుసుకుని రాజకీయాల్లోకి రావాలనుకున్నా. ఈ దశలో 2018లో బీటెక్ పూర్తికాగానే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రావటం.., రిజర్వేషన్ కలిసి రావటంతో ఎన్నికల్లో పోటీచేయాలనుకున్నా. చిన్నమ్మ, అమ్మ,నాన్న కూడా సరే అనటంతో బయ్యారం జెడ్పీటీసీగా పోటీచేసి విజయం సాధించా. ఆ తర్వాత జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం దక్కింది. నన్ను కొడుకులా పెంచారు.. నేను కాలేజీలో ఉన్నప్పుడు పెద్దగా నా డ్రెస్సింగ్ స్టైల్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చాక చాలా మంది నా డ్రెస్సింగ్ గూర్చి మాట్లాడుతున్నారు. అమ్మనాన్నలకు నలుగురం ఆడపిల్లలమే కావటం.. చిన్న దాన్నయిన నన్ను కొడుకులా పెంచారు. దీంతో చిన్నప్పటి నుంచి ఇలా డ్రెస్సింగ్ చేసుకోవటం అలవాటైంది. ఇదే కంఫర్ట్‌గా ఉండటంతో కంటిన్యూ చేస్తున్నా. లక్ష్మీనర్సింహస్వామి అంటే నా ఇష్ట దైవం. అయితే, దైవభక్తి కొంచెం తక్కువే. ఆ సంఘటన కలిచి వేసింది జెడ్పీటీసీగా పోటీచేసి ప్రచారంలో ఉండగా కోడిపుంజల తండాలో ఓ సంఘటన నన్ను కలిచివేసింది. అక్కడి మహిళ ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతుండగా హాస్పిటల్‌కు తీసుకపోవటానికి సరైన రోడ్డు సదుపాయం లేదు. కచ్చా రోడ్డులో మూడు కిలోమీటర్లు దూరం తీసుకెళ్లి అక్కడి నుంచి మహబూబాబాద్‌కు ఆటోలో 8కి.మీ తీసుకెళ్తే హస్పిటల్కీ చేరుకోలేని పరిస్థితి. ఆ సంఘటన నన్ను బాగా కలిచి వేసింది. దీంతో ఖచ్చితంగా గెలిచి, పల్లెల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ధృడంగా నిర్ణయించుకున్నా. అందుకే నా మొదటి ప్రాధన్యత విద్య, వైద్య రంగాలకు ఇస్తాను. -
'దేశంలోని ఆలయాలన్నీ తిరిగా'
సాక్షి, నార్నూర్(ఆసిఫాబాద్) : ‘పేద కుటుంబంలో పుట్టి..ఎన్నో కష్టాలు పడ్డా. కాలినడకన వెళ్లి చదువుకున్న. రెవెన్యూ శాఖలో డిప్యూటీ సర్వేయర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇందులోనూ పదోన్నతులు పొంది అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి దేవస్థానాలకు వెళ్తుంటా. దాదాపు దేశంలోని అన్ని దేవాలయాలు తిరిగా. జీవితంలో కుటుంబంతో కలిసి తిరగని స్థలం అంటూ ఏది లేదు’ అంటున్నారు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్. ‘సాక్షి పర్సనల్ టైం’లో ఆయన మరెన్నో విషయాలు వెల్లడించారు. మా సొంతూరు నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామం. మా నాన్న చిన్యా, అమ్మ హీరాబాయి. మొత్తం ఎనిమిది మంది సంతానం. అందులో ఐదుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెలు. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న కష్టపడి చదివించారు. నేను ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు భీంపూర్‌లో చదువుకున్నా. తర్వాత ఇంటర్ వరకు ఉట్నూర్‌లో చదివిన. అప్పుడు మా గ్రామానికి రోడ్డు సరిగా లేదు. కాలినడకన వెళ్లే వాళ్లం. చాలా కష్టపడి చదువుకున్నా. ఒకానొక సందర్భంలో మా సొంతూరి నుంచి ఉట్నూర్ దాదాపు 20 కి.మీ. కాలినడకన వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. బీఏ పూర్తి చేశాను. 1990 నవంబర్ 1వ తేదీన నాకు డిప్యూటీ సర్వేయర్‌గా (టీజీఎంఎస్) ఉద్యోగం వచ్చింది. 1991లో భీంపూర్ గ్రామానికి చెందిన కవితతో వివాహామైంది. ఆమెకు కూడా 1998లో రెవెన్యూశాఖలో వీఆర్వో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరం ఉద్యోగ రిత్యా చాలా బిజీ అయ్యాం. సర్వేయర్‌గా సొంత మండలంలో విధులు నిర్వహించడం సంతృప్తినిచ్చింది. డిప్యూటీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా కుమురంభీం జిల్లాలో విధులు నిర్వహించాను. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడుపుతా.. నేను నా భార్య కవిత ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగులమే. కుమారులు సరేందర్, నరేందర్. విధి నిర్వహణలో భాగంగా పిల్లలకు చాలా దూరం అయ్యే వాళ్లం. అప్పుడు చాలా బాధనిపించేది. అయినా వారి భవిష్యత్ దృష్ట్యా కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకునే వాళ్లం. సెలవు రోజు సమయం దొరికితే పిల్లలతో ఎక్కువగా గడిపే వాళ్లం. వారిని పార్కు, షాపింగ్‌కు తీసుకెళ్లే వాళ్లం. నాకు ఐదెకరాల వ్యవసాయం ఉంది. ఉద్యోగ సమయం అయిపోగానే వ్యవసాయ పనులు చూసుకొని ఇంటికి వెళ్లేవాన్ని. మిగతా సమయంలో ఇంట్లోనే ఉంటా. అప్పుడప్పుడు కుటుంబ çసభ్యులతో కలిసి దేవస్థానాలకు వెళ్తుంటా. దాదాపు దేశంలోని అన్ని దేవాలయాలు తిరిగాను. మహారాష్ట్రలోని పండరిపూర్, మహోర్, పౌరదేవి, గురుద్వార్, షిర్డీ, తిరుపతి, విజయవాడ దుర్గామాత దేవాలయాలతోపాటు బాసరను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నాను. మూడు నెలల క్రితం పశ్చిమబెంగాల్లోని నికోబార్ దీవులను సందర్శించి బోటింగ్ చేసి కుటుంబ సభ్యులతో సరదగా గడిపాం. దాదాపు నెల రోజులు కన్యాకుమారి నుంచి కాశీ వరకు తిరిగాం. జీవితంలో కుటుంబంతో కలిసి తిరగని స్థలం లేదు. ఇక ఇంట్లో ముగ్గురం మాత్రమే ఉంటాం. చిన్న కొడుకు మాతోనే ఉంటాడు. పెద్దోడు అపోలో హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తాడు. సామాజిక సేవలు జనంతో మనం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి ఉట్నూర్ ప్రాంతంలో ఉచితంగా అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి గిరిజన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని పంపిణీ చేసిన. చైతన్య సంప్రదాయ దార్మిక సంస్థ ఆధ్వర్యంలో 2000 సంవత్సరం నుంచి ఈరోజు వరకు ఏటా 2 వేల నుంచి 3 వేల మందికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి పండరిపూరి యాత్రకు తీసుకెళ్తాం. గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా, లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా, ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహారాజ్ జయంతి కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించాను. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. -
బీజేపీలోకి ప్రకాశం జెడ్పీ చైర్మన్
సాక్షి, ఢిల్లీ : ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మంగళవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు భరత్ కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హరిబాబు ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్ గా ఈదర హరిబాబు గెలిచిన విషయం తెలిసిందే. -
'అందరం కలిసికట్టుగా పనిచేస్తాం'
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జెడ్పీచైర్మన్‌గా దాదన్నగారి విఠల్, వైస్ చైర్మన్‌గా రజిత యాదవ్ శుక్రవారం ప్రమాణం చేశారు. కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావు స్వయంగా వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..సభను హుందాతనంగా నడిపించాలి. అందరూ పోటి పడీ పనిచేయాలని, అర్థవంతమైన చర్చల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటలు పాటు కరెంటు అమలవడం, ఎకరాకు రూ.ఐదు వేలు ఇవ్వడం చూసి ఇతర రాష్ట్రాల నాయకులు ఆశ్చర్యపోతున్నారు. గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నా ప్రజా ప్రతినిధులుగా సభా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని పోచారం పేర్కొన్నారు. 'స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు కట్టబెట్టాలని, దానికి తగ్గట్టే నిధులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నార'ని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎస్సారెస్సీ పునరుజ్జీవం ద్వారా త్వరలోనే జిల్లా రైతులకు సాగు, తాగు నీరు అందుతుందని ఆయన స్పష్టం చేశారు. 'నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రజల సమస్యలు తీర్చేందుకు అందరం కలిసికట్టుగా పని చేస్తామని' నూతన జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ తెలిపారు.కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు విజి గౌడ్, ఆకుల లలిత తదితరులు హాజరయ్యారు. -
సిద్ధిపేటను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి
సాక్షి, సిద్ధిపేట : జెడ్పీటీసీలు స్థానిక సంస్థల ప్రతినిధులతో కలిసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా పని చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా పరిషత్ పాలకవర్గం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. గొప్ప అనుభవం ఉన్నవారు, విద్యావంతులు ఈ సారి జిల్లా పరిషత్‌కు ఎన్నికయ్యారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అయిన సిద్ధిపేటను రాష్ట్రంలో ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలో బాగా పని చేసే అధికారులన్నారని వారి సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. సభలో, సమావేశాల్లో చర్చ అర్థవంతంగా, ప్రశ్న ఆలోచించే విధంగా ఉండాలన్నారు హరీశ్ రావు. హెడ్లైన్ వార్తల కోసం అరిచి గగ్గోలు పెట్టుకోవద్దని తెలిపారు. ప్రజా ప్రతినిధులు వివిధ శాఖలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నేను అనే విధానంతో కాకుండా మేము అనే పద్దతిలో పని చేసుకోవాలన్నారు. పొరపాటు జరిగినప్పుడు భేషజాలకు పోకుండా ఆ తప్పును సవరించుకునే వారే గొప్పవారవుతారని పేర్కొన్నారు. -
వైద్యురాలిగా.. ప్రజా ప్రతినిధిగా..
సాక్షి, మహేశ్వరం: ప్రజా ప్రతినిధిగా, వైద్యురాలిగా సేవలు అందిస్తూ భేష్ అనిపించుకుంటున్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి. వైద్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైనా వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ‘ఆర్ట్’ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేపు (జూలై 1న) ‘డాక్టర్స్ డే’ సందర్భంగా అనితారెడ్డిపై ప్రత్యేక కథనం. కర్ణాటకలో వైద్య విద్య పూర్తిచేసిన తీగల అనితారెడ్డి కొంత కాలం నగరంలో ఓవైసీ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న దక్కన్ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత రెండేళ్లు మహబూబ్‌నగర్‌లో ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2010లో ఆమె మామ, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రోత్సాహంతో దిల్‌సుఖ్‌నగర్‌లో టీకేఆర్ ఐకాన్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు ఉచితంగా సేవలు అందించారు. వైద్య సేవ చేస్తూనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకొని 2016లో ఆర్కేపురం కార్పొరేటర్‌గా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఓటమి చెందినా నిరుత్సాహ పడకుండా మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీ కార్యాక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో మహేశ్వరం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొంది జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనా తన ఆస్పత్రిలో వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. ఆర్ట్(అనితారెడ్డి తీగల) ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేశారు. ఇవే కాకుండా ఉమెన్ ఇంప్రూవ్మెంట్ శిబిరం, స్వచ్ఛ భారత్, మొక్కల నాటడం తదితర స్వచ్ఛ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తాను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఉన్నా వైద్య వృత్తిని వీడనని, ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటానని అనితారెడ్డి చెబుతున్నారు. -
కొడుకు లేని లోటును తీరుస్తున్నాం..
‘మా అమ్మానాన్న ఆండాళమ్మ, స్వామిరెడ్డిలకు మేము నలుగురు కూతుళ్లమే. అమ్మాయిలని వివక్ష చూపకుండా.. విలువ కట్టలేని ప్రేమను పంచి మమ్మల్ని మా అమ్మానాన్న బాగా పెంచారు. అందరినీ చదివించారు. నేను డాక్టర్‌గా ఎదగాలన్నది నాన్న ఆకాంక్ష. ఈ గమ్యాన్ని చేరడంతో ఎంతో సంతోషపడ్డారు. అమ్మ మూడేళ్ల క్రితం మా నుంచి దూరమైంది. అప్పటి నుంచి నాన్న బాగోగులు బిడ్డలమే చూసుకుంటున్నాం. కొడుకులేని లోటు తీరుస్తున్నాం. ఒక ఆడబిడ్డగా దేవుడు మాకిచ్చిన వరమిది’ అని జిల్లా పరిషత్ నూతన చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి చెప్పారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ తన విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: మా అమ్మనాన్నలది హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్. అప్పట్లో మలక్‌పేట టీవీ టవర్ వద్ద ఉండేవాళ్లు. మాకు దగ్గర్లోని తిరుమల హిల్స్‌లో నా భర్త హరినాథ్‌రెడ్డి వాళ్ల ఇల్లు. ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ ఒకరి కంట ఒకరం పడలేదు. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. పెళ్లి నాటికే మా ఇద్దరిదీ ఎంబీబీఎస్ పూర్తయింది. వివాహం తర్వాత నేను ఉన్నత చదువులు అభ్యసించడంలో హరి ప్రోత్సాహం ఎంతో ఉంది. నేను గుల్బర్గాలో ఎండీ, డీజీఓలో చేరగా.. ఆయన తమ విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. పీజీలో ఉండగానే కూతురు త్రిష పుట్టింది. మూడు నెలల వయసులో పాపను అత్తమ్మ దగ్గరే ఉంచాను. ఆలనాపాలనా తనే చూసుకున్నారు. అప్పుడు పరీక్షలు ఉండటంతో గుల్బర్గా వెళ్లక తప్పలేదు. ఇలా పీజీ అయ్యే వరకు వారానికోసారి పాప వద్దకు వచ్చే వెళ్లేదాన్ని. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో ఎటువంటి ఇబ్బందీ రాలేదు. ఆప్యాయతకు, అనురాగానికి ఏమాత్రం కొదవ లేదు. మామ తీగల కృష్ణారెడ్డి, అత్తయ్య అరుంధతి, మరిది అమర్నాథ్రెడ్డి, తోటి కోడలు తులసి, మా వారు, ఇద్దరు పిల్లలం కలిసే నివసిస్తాం. నిత్యం ఎవరి బిజీలో వాళ్లుంటారు. ప్రతి శనివారం సాయంత్రం అందరం కలిసే భోజనం చేస్తాం. మా ఆడపడుచు కుటుంబమూ ఈ విందుకు హాజరవుతుంది. సమయాన్ని బట్టి కలిసే చోటు మారుతుంది. ఇలా ఇంటిల్లిపాదితో వారానికోసారి భేటీ ఉండటం గొప్ప సంతోషానిచ్చే అంశం. చిన్నప్పటి నుంచి టాపర్‌ని బాల్యం నుంచి చదువుల్లో ముందజలో ఉండేదాన్ని. పోటీతత్వం, ఇష్టంతో చదివేదాన్ని. ఏ క్లాస్‌ని తీసుకున్నా ఫస్ట్ లేదా సెకండ్ వచ్చేదాన్ని. టెన్త్ వరకు హైదరాబాద్‌లో చదవగా.. విజయవాడలో ఇంటర్ పూర్తయింది. గుల్బర్గాలోని ఎంఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎండీ, డీజీఓ చేశా. వైద్య విద్యలో పీజీ కాగానే నగరంలో ఓవైసీ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న డక్కన్ మెడికల్ కాలేజీలో ఐదేళ్లపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఇదే ఆస్పత్రిలో వైద్య సేవలందించాను. అనంతరం రెండేళ్లపాటు మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా కొనసాగాను. మామ, మా ఆయన ప్రోత్సాహంతో 2010లో దిల్‌సుఖ్‌నగర్‌లో టీకేఆర్–ఐకాన్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి స్థాపించాను. స్వీట్స్ తినేందుకు కిలోమీటర్లు వెళ్లేవాళం.. వైద్యవిద్య చదివే సమయంలో నచ్చిన ఆహారం తినేందుకు క్లాస్‌లకు డుమ్మా కొట్టేవాళ్లం. మా కాలేజీకి ఐదు కిలోమీటర్ల దూరంలో రసమలై స్వీట్ తినేందుకు వెళ్లేవాళ్లం. అలాగే అక్కడ ఆశీర్వాద్ హోట్‌లో చికెన్ ఫ్రైడ్ రైస్, జనతా ఐస్‌క్రీం పార్లర్లో వివిధ రకాల ఫేవర్లలో ఐస్‌క్రీంలు చాలా ఫేమస్. చాలా ఆకర్షనీయంగా, టేస్టీగా ఉండటంతో తరగతులకు డుమ్మాకొట్టి ఆ రుచులను ఆస్వాదించేవాళ్లం. మా బెస్ట్ ఫ్రెండ్స్ మ్తొతం ఏడుగురు. ఎక్కడికి వెళ్లినా మేమంతా ఒకే జట్టుగా కదిలేవాళ్లం. 16ఏళ్ల నాటి కోరిక.. నెరవేరిన వేళ పెళ్లయిన కొత్తలో మేమిద్దరం మారీషస్కి వెళ్లాం. హెలికాప్టర్ రైడ్ చేయాలన్న కోరికను ఆయన ముందుంచా. అయితే, ఆ రైడ్ చేయడం వీలుపడలేదు. ఈ విషయాన్ని 16 ఏళ్లపాటు తనలో దాచుకున్న ఆయన నా 40వ పుట్టిన రోజు సందర్భంగా నిజం చేశారు. సౌతాఫ్రికాకు తీసుకెళ్లి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్కడ హెలికాప్టర్ రైడ్ చేయించారు. ఈ ఘటన చాలా సర్ప్రైజ్ కలిగించింది. ఆ క్షణాన నాకసలు మాటలు రాలేదు. నా ఇష్టం పట్ల ఆయన చూపిన ప్రేమ నా జీవితకాలపు తీపిజ్ఞాపకం. వైద్య వృత్తి వల్ల నేను.. టీకేఆర్ విద్యాసంస్థల నిర్వహణలో మా భర్త చాలా బిజీ. ఉదయం లేచింది మొదలు రాత్రి 8 గంటల వరకు ఈ వ్యవహారాలే ఉంటాయి. కానీ, ప్రతి ఆదివారం పూర్తిగా మేం కుటుంబానికే కేటాయిస్తాం. ఆ రోజు ఎటువంటి పనులూ పెట్టుకోం. ఆయనది విశాల మనస్తత్వం. అన్నీ అర్థం చేసుకోగల గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. నాన్‌వెజ్ అంటే మహాఇష్టం.. మావారికి నాన్‌వెజ్ అంటే ఇష్టం. మటన్ మహాఇష్టం. మా ఇద్దరు పిల్లలు త్రిష, కృష్ణారెడ్డిలు కూడా వాళ్ల నాన్ననే అనుసరిస్తారు. రోజు వడ్డించినా వద్దనకుండా లాగించేస్తారు. నేనేమో నాన్‌వెజ్‌కు కొంచెం దూరం. నాన్‌వెజ్‌ని నేనే వండాలి..వడ్డించాలి. ఇక ఆరోజు క్రికెట్ ఉంటే పండగే. వారి ముంగిటకే వంటకాలను తీసుకెళ్లాలి. ఆ మ్యాచ్ అయ్యేదాకా టీవీని వదలరు. నేను పెద్దగా టీవీ చూడను. చూసే సమయమూ ఉండదు. పిల్లల చదువులో మాత్రం చాలా సీరియస్‌గా ఉంటాను. ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఎడ్యుకేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాను. నన్ను స్ఫూర్తిగా తీసుకున్న మా కూతురు డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నీట్లో మెరిట్ వచ్చింది. ఎంబీబీఎస్‌లో చేరనుంది. అబ్బాయి.. సెకండ్ క్లాస్. సినిమాలో విషయంలో మా అభిరుచులు వేరు. నేను హిందీ సినిమాలు చూస్తా, ఆయన తెలుగు కామెడీ మూవీలు ఎక్కువగా చూస్తారు. అయినా ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవిస్తూ రెండు భాషల సినిమాలకు వెళ్తుంటాం. బేసిక్‌గా నేను చిరంజీవి ఫ్యాన్‌ని. జగదేకవీరుడు.. అతిలోకసుందరి బాగా నచ్చిన సినిమా. సేవకు కదిలి.. ప్రాణాలు కాపాడి మా ఆస్పత్రికి గ్రామీణ ప్రాంత మహిళలు అధికంగా వస్తుంటారు. వాళ్లంతా పెద్దగా పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారని తెలిసింది. విశ్రాంతి పెద్దగా తీసుకోరని, మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నట్లు నా కౌన్సెలింగ్ ద్వారా తేలింది. ఇటువంటి మహిళలు చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ వంటి వారిని వేధిస్తున్నాయి. తొలుత వారికి చైతన్యం కల్పించడం ద్వారా కొంత అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చని భావించా. ఇందుకోసం ‘ఆర్ట్’ ఫౌండేషన్‌ను స్థాపించి.. గ్రామీణ మహిళల్లో పరిశుభ్రత, ఆరోగ్యంపై విస్తృతంగా అవగాహన కల్పించాం. 60కి పైగా క్యాంపులు ఏర్పాటు చేశాం. అలాగే ప్రభుత్వ పాఠశాలల బాలికల్లోనూ చైతన్యం తెచ్చాం. దీంతోపాటు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌ని మా ఆస్పత్రిలో ఉచితంగా చేయించాం. ఇలా 1,350 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా.. ఇందులో నలుగురికి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడంతో వీరి ప్రాణాలను కాపాడగలిగాం. ఇప్పటికే నిత్యం ఒక గంట ఆ ఆస్పత్రిలో గర్భిణులకు ఉచిత ఓపీ సౌకర్యాన్ని కొనసాగిస్తున్నాం. -
వీడలేమంటూ..వీడ్కోలంటూ..
ఎక్కడో పుట్టి..ఎక్కడో ఎన్నికై.. ఇక్కడే కలిశాం..వీడలేమంటూ వీడ్కో లంటూ.. ఈ ఐదేళ్లు కలిసి నడిచిన సభ్యులు శనివారం చివరి జెడ్పీ సర్వసభ్య సమావేశంతో విడిపోయారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జెడ్పీ విభజ న జరగడం..ఇటీవల కొత్త పాలకవర్గాలు ఎన్నిక కావడంతో అరవై ఏళ్ల అనుబంధానికి ఫుల్స్టాప్ పడింది. చివరిరోజు ఆత్మీయ పలకరింపులు..సన్మానాలు, సత్కారాలు, ఆద్యంతం ఉద్విగ్న భరిత వాతావరణంలో సభ్యులంతా పాత జెడ్పీకి బైబై చెప్పారు. సాక్షి, ఆదిలాబాద్: యాభై రెండు మంది జెడ్పీటీసీలు.. పది మంది శాసన సభ్యులు.. అందులోంచే మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. జిల్లా ఉన్నతాధికారులు.. వీరంతా ఒకేసారి కలిసేది ఉమ్మడి జెడ్పీ సమావేశం. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత నాలుగు జిల్లాల కలెక్టర్లు అదనపు ఆకర్షణగా నిలిచింది. చరిత్ర కలిగిన ఉమ్మడి జెడ్పీ ఠీవి ఇక ముగిసిన ప్రస్థానం. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కొత్త జెడ్పీ పాలకవర్గాలు త్వరలో కొలువుదీరనుండగా, ఉమ్మడి జిల్లాలోని పాలకవర్గం పదవీకాలం వచ్చే నెల పూర్తి కావస్తుంది. అంతకుముందు చివరిసారిగా సభ్యులు సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లా పరిషత్ పాలకవర్గ సర్వసభ్య సమావేశం శనివారం జెడ్పీ చైర్పర్సన్ వి.శోభాసత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఉమ్మడి జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఆసిఫాబాద్ కలెక్టర్, ఇన్చార్జి ఆదిలాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆదిలాబాద్ జేసీ సంధ్యారాణి, మంచిర్యాల జేసీ సురేందర్‌రావు, నిర్మల్ ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు పాల్గొన్నారు. మధుర క్షణాలు.. ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశం ప్రారంభమైంది. వేదికను జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్, జేసీలు, జెడ్పీ సీఈఓ కె.నరేందర్ అలంకరించారు. ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, రాథోడ్ బాపురావు వేదిక ఎదురుగా ఆసీనులయ్యారు. జెడ్పీ వైస్‌చైర్మన్ మూల రాజీరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అదే వరుసలో కూర్చున్నారు. సమావేశం మధ్యలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఐకే రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ పాలకవర్గానికి ఇదే చివరి సభ అని, జూలై 4 వరకు పదవీ కాలం ఉన్నా అధికారికంగా సభ ఇదే చివరిదని పేర్కొన్నారు. ఈ సభలో సభ్యులు హుందాగా సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రధాన అంశాలపైనే చర్చ.. ఉమ్మడి జెడ్పీ చివరి సమావేశంలో ఎజెండా అంశాలు అనేకంగా ఉన్నా ప్రధాన అంశాలపైనే చర్చ సాగింది. సమావేశంలోనే సభ్యులకు వీడ్కోలులో భాగంగా సన్మానం చేయాలని ముందుగానే నిర్ణయించడంతో ప్రధాన అంశాల మట్టుకు చర్చించారు. మిషన్ భగీరథ, హరితహారం, వ్యవసాయంపై మాట్లాడారు. సభలో జెడ్పీటీసీలు అశోక్, జగ్జీవన్, సుజాత, రాథోడ్ విమల, కేశవ్‌గిత్తే వివిధ అంశాలపై ప్రస్తావించారు. ప్రధానంగా వర్షాలు పడిన తర్వాత హరితహారం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని మంత్రి ఐకేరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం సమావేశాన్ని ముగిస్తూ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుండె దిటువు.. సన్మాన కార్యక్రమం ప్రారంభమైన తర్వాత సభ్యుల్లో తాము ఇక ఒకేచోట కలవలేమన్న ఆవేదన కనిపించింది. ఈ ఐదేళ్లు కలిసి నడిచిన ప్రస్తానం వారి కళ్లముందు కదలాడింది. మొదట సభ్యులు సభ ప్రాంగణంలోకి వస్తున్న సమ యంలోనూ అందరిలో ఈ పాలకవర్గానికి ఇదే చివరి సభ కావడంతో వస్తువస్తూనే ఒకరికొకరు పలకరించుకోవడం కనిపించింది. మహిళ సభ్యులు గుమిగూడి మాట్లాడుకోవడం అగు పించింది. పురుష సభ్యులు కరచలనం చేసుకుంటూ కనిపించారు. మొత్తం మీదా సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు వీడ్కోలు ఘట్టం వారి హావభావాలతో కొనసాగింది. మొదట ఉమ్మడి జిల్లా మంత్రి ఐకేరెడ్డిని జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, వైస్‌చైర్మన్ మూల రాజీరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి జ్ఞాపికను అందజేసి శాలువాతో సన్మానించారు. జెడ్పీ చైర్పర్సన్ శోభారాణిని మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జేసీలు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్, డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్, తదితరులను సన్మానించి మెమోంటోలను అందజేశారు. సభ్యులకు సన్మానం.. జెడ్పీటీసీలకు ఆ తర్వాత సన్మానం నిర్వహించారు. మొదట మహిళా జెడ్పీటీసీలను అనంతరం మిగతా జెడ్పీటీసీలకు శాలువా కప్పి పూలమాల వేసి జ్ఞాపికను ఇచ్చి సన్మానించారు. జైనూర్ జెడ్పీటీసీ మస్రత్ ఖానమ్‌ను సన్మానించినప్పుడు ఆమె ప్రసంగించారు. ఐదేళ్లు సభలో ఎంతో నేర్చుకున్నామని, ఏదైన తప్పు చేసి ఉంటే క్షమించాలని కోరారు. మంత్రి, జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేల సహకారం మరవలేనిదన్నారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు సభ్యులందరిలో ఒక రకమైన ఆవేదన కనిపించింది. అనంతరం సభ్యులు గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ ఐదేళ్ల జ్ఞాపకాలను చివరి రోజు మధుర ఘట్టంగా మలుచుకున్నారు. అదే సందర్భంలో మంత్రి ఐకేరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీలుగా పదవి కాలం ముగిసినప్పటికీ భవిష్యత్‌లో ఇతర పదవుల ద్వారా ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు. -
గళమెత్తారు..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రజా సమస్యలపై జెడ్పీటీసీ సభ్యులు గళమెత్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో తీరొక్క సమస్యలపై ప్రశ్నించారు. ప్రధానంగా జిల్లాలోని పలువురు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందలేదని, దీంతో వారు రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారని, దీనిపై రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అలాగే మత్స్య సహకార సంఘాలకు కట్టిన భవనాలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సాధారణ చివరి సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్మన్ బరపటి వాసుదేవరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, మార్కెటింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, వైద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ సాగింది. జిల్లాలో రైతుల వెతలను పట్టించుకునే వారే కరువయ్యారని, రెవెన్యూపరమైన పనులు సామాన్యులకు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొందని, జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ బాగుచేయలేనంతగా దెబ్బతిన్నదని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కో ఆప్షన్ సభ్యుడు జియావుద్దీన్ పేర్కొన్నారు. అనేక మండలాల్లో రైతులకు ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలు చేరనేలేదని, సాంకేతిక అంశాలను తప్పులుగా భూతద్దంలో చూపుతూ రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుబంధు ఆర్థిక సహాయాన్ని అధికారులు అడ్డుకుంటున్నారని, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న లోపాలను, సాంకేతిక తప్పిదాలను సరి చేయాల్సిన క్షేత్రస్థాయి సిబ్బంది అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అలాగే మత్స్య సహకార సంఘాలకు కట్టిన భవనాలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సాధారణ చివరి సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్మన్ బరపటి వాసుదేవరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, మార్కెటింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, వైద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ సాగింది. జిల్లాలో రైతుల వెతలను పట్టించుకునే వారే కరువయ్యారని, రెవెన్యూపరమైన పనులు సామాన్యులకు అందుబాటులో రాని పరిస్థితి నెలకొందని, జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ బాగుచేయలేనంతగా దెబ్బతిన్నదని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కో ఆప్షన్ సభ్యుడు జియావుద్దీన్ పేర్కొన్నారు. అనేక మండలాల్లో రైతులకు ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలు చేరనేలేదని, సాంకేతిక అంశాలను తప్పులుగా భూతద్దంలో చూపుతూ రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుబంధు ఆర్థిక సహాయాన్ని అధికారులు అడ్డుకుంటున్నారని, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉన్న లోపాలను, సాంకేతిక తప్పిదాలను సరి చేయాల్సిన క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బోనకల్, ఏన్కూరు జెడ్పీటీసీ సభ్యులు సైతం ఇదే అంశంపై ప్రభుత్వ విధానాలను నిలదీశారు. ఐదేళ్ల తమ పదవీ కాలంలో ప్రజలకు ఎంతో సేవ చేయాలని భావించామని, నిధుల కొరత కారణంగా అనేక పనులు చేయకుండానే పదవీ కాలాన్ని ముగించాల్సి వస్తోందని పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని కౌలు రైతులకు భూమి కార్డులు ఇవ్వాలని, వారికి రైతుబంధు వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జేసీ అనురాగ్ జయంతి మాట్లాడుతూ రైతుబంధు, ఆర్ఓఆర్, పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో ఎదురవుతున్న ఇబ్బందిని, రైతులకు జరుగుతున్న అసౌకర్యంపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే దీనిని అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా జిల్లా అధికార యంత్రాంగం భావించి అనేక చోట్ల గ్రామసభలు నిర్వహించి.. ఈ తరహా ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతులకు డబ్బులు చెల్లించే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని, అందరికీ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సభ్యులు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని శాఖలవారీగా సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. మత్స్య శాఖ నిధులతో పలుచోట్ల సంఘ భవనాలు నిర్మిస్తే.. ఇప్పుడు డబ్బులు లేవని ఇబ్బంది పెడుతున్నారని, అప్పుడున్న నిధులు వెనక్కిపోవడానికి బాధ్యులు ఎవరో తేల్చాలని, ఏళ్ల తరబడి నిర్మించిన భవనాలకు డబ్బులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవడం మినహా మరో మార్గం లేదని బోనకల్ జెడ్పీటీసీ సభ్యుడు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డిప్యూటీ సీఈఓ అప్పారావు స్పందిస్తూ.. ఈ నిధులకు సంబంధించి ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాయడంతోపాటు నిధుల లభ్యతపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రభుత్వ పర్యవేక్షణ అనేక అంశాల్లో కరువవడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, తాలిపేరులో చేప పిల్లలు వేస్తామని అధికారులు మాకు సమాచారం ఇచ్చారని, నాలుగు లారీల్లో చేప పిల్లలు వస్తున్నాయని వేసేందుకు ఆహ్వానించారని.. తీరా తాము అక్కడికి వెళ్లేసరికి లారీలు, చేప పిల్లలు లేవని, ఇదేమిటని పరిశీలిస్తే.. తాలిపేరు చెరువులో చేప పిల్లలను వదిలేశామని చెబుతున్నారని, ఆ ప్రాంతంలో లారీ టైర్ల అచ్చులు సైతం పడకుండా అన్ని లారీలు ఎలా వచ్చాయో ఇప్పటికీ అర్థం కావడం లేదని దుమ్ముగూడెం జెడ్పీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఏన్కూరు జెడ్పీటీసీ సభ్యురాలు మాట్లాడుతూ ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లో దళారుల దందా రాజ్యమేలుతోందని, రైతుకు తీవ్రస్థాయిలో అన్యాయం జరుగుతోందని, ఇదేమిటని ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు ప్రశ్నిస్తే.. వారిని లోబరుచుకోవడానికి దళారులు ప్రయత్నిస్తున్నారని, దీనిపై అధికారులు దృష్టి సారించకపోతే రైతు అన్యాయమైపోతాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందు జెడ్పీటీసీ చండ్ర అరుణ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అందించే రైతుబంధు డబ్బులను కొన్ని బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, ఇది తీవ్రవైన విషయంగా ప్రభుత్వం పరిగణించాలని, రైతుకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే నగదును పాత అప్పుల కింద బ్యాంకు అధికారులు జమ చేసుకునే పద్ధతికి అధికారులు చెక్ పెట్టకపోతే రైతుబంధు పథకం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పలు ఉదాహరణలను వివరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జెడ్పీ చైర్మన్ బరపటి వాసుదేవరావు మాట్లాడుతూ గత ఐదేళ్లలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలను అర్హులైన పేదలకు అందించడంలో ప్రజాప్రతినిధులంతా పాలుపంచుకున్నారని అన్నారు. సమావేశంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ మౌలాన, జియావుద్దీన్, ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
అభినందన సభలా..
ఉమ్మడి జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం శుక్రవారం అభినందన సభలా సాగింది. ఉదయం పలు ప్రజాసమస్యలపై సభ్యులు చర్చించారు. మధ్యాహ్నం సన్మానాలు, సత్కారాలతో సాగింది. సమావేశంలో అటవీ శాఖ అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుత పాలకవర్గంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. చైర్మన్ దఫేదార్ రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. రెండు జిల్లాల వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధు లు ఈ సమావేశానికి హాజరయ్యారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. సమావేశం ప్రారంభమైన వెంటనే ఎజెండాలోని అంశాలను కాకుండా, ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావాలని చైర్మన్ రాజు సూచించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు సమస్యలను ప్రస్తావించారు. అటవీశాఖ అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గాంధారి జెడ్పీటీసీ తానాజీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గాంధారి – వెల్లుట్ల పాత రోడ్డుపై మరమ్మతులు పనులను అడ్డుకోవడం ఎంతవరకు సమం జసమని అధికారులను ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు లాగేసుకుంటున్నారని, ఈ భూమే ఆధారంగా జీవిస్తున్న గిరిజనులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుబంధు డబ్బులను బ్యాంకర్లు తమ అప్పుల కింద జమ చేసుకుంటున్నారని జుక్కల్ ఎమ్మెల్యే సింధే పేర్కొన్నారు. శనగల డబ్బులెప్పుడిస్తరు? మూడు నెలల క్రితం శనగలు విక్రయించిన రైతులకు ఇప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల వద్ద బీమా ప్రీమియం వసూలు చేస్తున్న బీమా కంపెనీలు పంట నష్టపోతే పరిహారం ఇవ్వడంలో ముఖం చాటేస్తున్నా యని ఆరోపించారు. ఎనిమిది నెలలుగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు రాకపోవడం, పంట నష్టపోయిన రైతులకు పరిహారం వంటి అంశాలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాలపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఎంఆర్ఎం.రావు, సత్యనారాయణ సమాధానమిచ్చారు. పీఆర్ రోడ్లు ఆర్‌అండ్‌బీకి.. కామారెడ్డి జిల్లాలో ఏడు పంచాయతీరాజ్ రోడ్లను ఆర్అండ్బీ రోడ్లుగా బదిలీ చేసేందుకు జెడ్పీ తీర్మానించింది. 2019–20 ఆర్థి క సంవత్సరానికి సంబంధించిన జెడ్పీ బడ్జెట్ అంచనాలు, అలాగే 2018–19 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. 36 మండల పరిషత్‌ల బడ్జెట్లకూ ఆమోదం తెలిపింది. జెడ్పీ సాధారణ నిధుల నుంచి చేపట్టనున్న పనులు, గతంలో మంజూరైన పనుల మార్పులు.. ఇలా 16 అంశాలకు ఆమోదముద్ర వేసింది. చైర్మన్ దఫేదార్ రాజుపై ప్రశంసలు జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజుపై శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశంసల జల్లులు కురిపించారు. చైర్మన్ పదవి రాజుకు కొత్తే అయినప్పటికీ.. ఐదేళ్ల పాటు సమర్థవంతమైన పాలనను అందించారని కితాబునిచ్చారు. జెడ్పీ సమావేశాలన్నీంటిని హుందాగా నడిపించారని, పాలకపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ప్రజా సమస్యలకే ప్రాధాన్యత ఇస్తూ సమావేశంలో అర్థవంతమైన చర్చ జరిగేలా సభలను నడిపించారని పేర్కొన్నారు. ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతం చేసుకున్న సందర్భంగా చైర్మన్ రాజు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను స్పీకర్ అభినందించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కూడా పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. సన్మానాల జోరు.. చివరి సర్వసభ్య సమావేశంలో సన్మానాలు జోరుగా సాగాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని చైర్మన్ రాజు సన్మానించారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం సన్మానాల కార్యక్రమం కొనసాగింది. జెడ్పీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ గడ్డం సుమనారవిరెడ్డిలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఎమ్మెల్యేలు హన్మంత్‌సింధే, నల్లమడుగు సురేందర్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీగౌడ్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను కూడా సత్కరించారు. -
చివరి ‘నాలుగు’ మాటలు!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నాలుగు జిల్లా పరిషత్‌లుగా విడిపోయింది. పాత పాలకవర్గం పదవీ కాలం ముగియకపోవడంతో ఇన్నాళ్లూ ఉమ్మడిగానే సభలు, సమావేశాలు నిర్వహించారు. ఇటీవల పరిషత్ ఎన్నికలు ముగియడం.. పాలక వర్గాల పదవీ కాలం దగ్గరపడడం.. కొత్త పాలకవర్గం కొలువుదీరిన తర్వాత ఏ జిల్లాలో ఆ జెడ్పీ సమావేశాలు జరుపుకోనున్నారు. ప్రస్తుతం చివరిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశం శనివారం నిర్వహించనున్నారు. పునర్విభజన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్‌లకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఇక నుంచి ఆ జిల్లాల్లోనే జెడ్పీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ పాలకవర్గం హయాంలో ఐదేళ్లలో రూ.42.12కోట్లతో ఉమ్మడి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. 2014, ఆగస్టు 6వ తేదీన ప్రారంభమైన జెడ్పీ పాలక వర్గ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీన ముగియనున్నది. 2014లో ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన గడిపల్లి కవిత ఎన్నిక కాగా.. రాష్ట్రస్థాయిలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్లో చేరారు. అయితే పదవీ కాలం మరి కొద్దినెలల్లో ముగుస్తుందనగా.. చైర్పర్సన్ పదవికి ఆమె రాజీనామా చేయడంతో వైస్ చైర్మన్ బరపటి వాసుదేవరావు జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది. 2014లో జరిగిన జెడ్పీ తొలి సాధారణ సమావేశానికి చైర్పర్సన్ హోదాలో గడిపల్లి కవిత అధ్యక్షత వహించగా.. చివరి సాధారణ సమావేశానికి వైస్ చైర్మన్‌గా ఉన్న వాసుదేవరావు చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించే అవకాశం లభించింది. ఒకే పదవీ కాలంలో ఇద్దరు పనిచేసే అరుదైన అవకాశం ఈ హయాంలోనే లభించడం రాజకీయంగా విశేషంగా భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఖమ్మం జిల్లా పరిషత్ పాలకవర్గంలో ప్రస్తుత జెడ్పీటీసీలు ఎవరూ తిరిగి ఎన్నిక కాలేదు. అయితే జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బరపటి వాసుదేవరావు మాత్రం కొత్తగూడెం జిల్లా పరిషత్ పరిధిలోని పాల్వంచ జెడ్పీటీసీ సభ్యుడిగా తిరిగి ఎన్నికయ్యారు. కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌లో సభ్యుడిగా.. ఉమ్మడి జిల్లా పరిషత్‌కు చైర్మన్‌గా వ్యవహరించే అరుదైన అవకాశం సైతం ఆయనకే లభించింది. అనేక ప్రజా సమస్యలపై వివిధ రాజకీయ పక్షాల నుంచి గెలుపొందిన జెడ్పీటీసీ సభ్యులు.. జిల్లా పరిషత్ సాధారణ సమావేశం వేదికగా.. తమ వాణిని వినిపించడంతోపాటు రాష్ట్రస్థాయి సమస్యలపై స్పందించి తీర్మానాలు చేయాలని పట్టుపట్టిన సందర్భాలు సైతం అనేకం. జిల్లాను రెండేళ్ల క్రితం వణికించిన డెంగీ జ్వరాలను అరికట్టాలని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని జెడ్పీ సమావేశం వేదికగా అన్ని రాజకీయ పక్షాలు మూకుమ్మడిగా చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది. తాగు, సాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రజా సమస్యలపై ఈ ఐదేళ్లలో ప్రజాప్రతినిధులతోపాటు వివిధ పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు తమ గళాన్ని వినిపించారు. అయితే తమ మండలాల పరిధిలో అనేక సమస్యలున్నా వాటిని పరిష్కరించుకునే ఆర్థిక వెసులుబాటు, నిధులు మంజూరు చేసుకునే పరిస్థితి జెడ్పీటీసీలకు లేకపోవడంతో కొంత నిరాశ నిస్పృహలు వారిలో అలముకున్నాయనే ప్రచారం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించనున్నారు. వ్యవసాయం, ఉపాధిహామీ, వైద్య, ఆరోగ్య శాఖలపై సమీక్షించనున్నారు. దీనికి సంబంధించిన ప్రగతి నివేదికలను అధికారులు ప్రజాప్రతినిధులకు చదివి వినిపించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇదే చివరి సమావేశం కావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై క్షుణ్ణంగా చర్చించనున్నట్లు భావిస్తున్నారు. వ్యవసాయ శాఖ సమీక్షలో రాయితీపై విత్తనాల సరఫరా, రైతుబంధు, రైతుబీమా, ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి, ఎరువుల సరఫరా, మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణపై.. అలాగే జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖల నిర్వహణపై పూర్తి చర్చ నిర్వహించనున్నారు. ఇక ఉపాధిహామీ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై.. వైద్య, ఆరోగ్య శాఖ ప్రగతి నివేదికను అధికారులు ప్రజాప్రతినిధులకు వినిపించిన అనంతరం.. దీనిపై చర్చ కొనసాగనున్నది. ఐదేళ్లలో ప్రత్యేక తీర్మానాలు 2014 నుంచి నేటి జిల్లా పరిషత్ సమావేశం వరకు పలు అంశాలపై చర్చించి.. తీర్మానాలు చేశారు. 2019, సెప్టెంబర్ 29న నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించిన అనంతరం జిల్లాలోని గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్ కింద మూసివేయకుండా కొనసాగించాలని తీర్మానం చేశారు. జిల్లాలోని వర్షాభావ పరిస్థితుల దృష్టా అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని తీర్మానించారు. 2015, సెప్టెంబర్ 5న జరిగిన జెడ్పీ సమావేశంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. 2017, నవంబర్ 5న నిర్వహించిన సమావేశంలో భక్తరామదాసు కళాక్షేత్రం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆధీనంలోనే ఉండాలని తీర్మానించారు. రూ.42.12కోట్లతో అభివృద్ధి పనులు ఐదేళ్లలో జిల్లా పరిషత్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రూ.42,12,93,608లతో అభివృద్ధి పనులను చేపట్టారు. ఎస్ఎఫ్సీ, టీఎఫ్సీ, సీనరేజి, జెడ్పీటీసీ నిధులు, ఇసుక వేలం, స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రెయిన్లు, పాఠశాల భవనాలు, ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణాలు అధికంగా చేపట్టారు. ఇందులో దాదాపు 85 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు కొనసాగుతున్నాయి. -
చివరి మీటింగ్
ఆదిలాబాద్‌అర్బన్: అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశాలు జరగడం ఇదే చివరి సారి. ఇక నుంచి ఏ జిల్లాలో ఆ జిల్లా పరిషత్ సమావేశాలు జరగనున్నాయి. పునర్విభజనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ నాలుగు జిల్లాలుగా ఏర్పడి ఆయా జిల్లాలోనే పరిషత్ ఎన్నికలు జరిగాయి. నూతనంగా ఎన్నికైన కొత్త సభ్యులు వారి వారి జిల్లాలో జరిగే జెడ్పీ సమావేశాలకు, సభలకు హాజరవుతుంటారు. దీంతో ఉమ్మడి జెడ్పీ సభ్యుల కలయికకు ఇవే చివరి సమావేశాలు అనడంలో సందేహం లేదు. అయితే శుక్రవారం ఉదయం 10:30 గంటలకు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరగనున్నాయి. శనివారం ఉదయం 10:30 గంటలకు – జెడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది. స్థాయీ సంఘ సమావేశాలకు తక్కువ మోతాదులో సభ్యులు హాజరైనా.. తెల్లారే ఉమ్మడి జెడ్పీ చివరి సర్వసభ్య సమావేశం ఉండడంతో నాలుగు జిల్లాల సభ్యులు, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, అధికారులు హాజరయ్యే ఆస్కారం ఉంది. అయితే చివరి సమావేశంలో పదవీకాలం జూలై 4తో ఐదేళ్లు పూర్తి చేసుకోనున్న సభ్యులకు సన్మానాలు, సత్కరాలు ఉంటాయని జెడ్పీ సీఈవో కె.నరేందర్ తెలిపారు. ఎమ్మెల్యేలకు మొదటివి.. సభ్యులకు చివరివి.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరు తెలుసుకునే ఆయా ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులు జెడ్పీ స్థాయీ సంఘ, సర్వసభ్య సమావేశాల్లో చర్చిస్తుంటారు. అయితే ఈ రెండు రోజుల్లో జరిగే సమావేశాల్లో విచిత్ర పరిణామం ఎదురుకానుంది. అదేటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారికి ఈ సమావేశాలు మొదటివి కాగా, జూలైలో పదవీకాలం పూర్తి చేసుకోమనున్న జెడ్పీ సభ్యులకు మాత్రం ఇవే చివరి సమావేశాలు కానున్నాయి. మరీ ముఖ్యంగా జెడ్పీకి కొత్త పాలకవర్గం (చైర్మన్‌తో సహా సభ్యులు) ఎన్నికైన పాత పాలకవర్గం సమావేశాలు నిర్వహించడం కూడా విశేషమే. ఇదిలా ఉండగా, ఈ ఏడాదిలో వరుసగా వచ్చిన ఎన్నికల దృష్ట్యా సభ్యులు రాకపోవడంతో సమావేశాలు రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా స్థాయీ సంఘాలు కొనసాగుతాయా? లేదా అన్న సందేహం లేకపోలేదు. ఇక తెల్లావారే సర్వసభ్య సమావేశం ఉండడంతో సభ్యులతోపాటు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు హాజరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సమావేశాలకు అందరు హాజరైతే గత ఆరు నెలలుగా చర్చించాల్సిన ప్రగతి అంశాలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే సమావేశాలకు సభ్యులు రావడం పెద్ద సమస్యగా మారితే ఇప్పుడు నిర్వహించే సమావేశం చివరిది కావడంతో ఆ సమస్య ఉండదని సభ్యులతోపాటు అధికారులు భావిస్తున్నారు. ప్రాధాన్యత అంశాలపై చర్చ.. జెడ్పీ స్థాయీ సంఘాలు, సర్వసభ్య సమావేశాలు సాఫీగా కొనసాగితే ప్రాధాన్యత అంశాలపై చర్చ జరగనుంది. ప్రధానంగా వ్యవసాయం, పాఠశాలల పునఃప్రారంభం, హరితహారం కార్యక్రమం, వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులకు వైద్య సదుపాయాలు, ఆస్పత్రుల తీరు, సంక్షేమ పథకాలైన పింఛన్ల పెంపు, రేషన్ కార్డులు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, తదితర అంశాలపై చర్చించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తరగతుల నిర్వహణ, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, బడిబయట పిల్లలను బడికి తీసుకురావడం, బాల కార్మిక నిర్మూలన, ఉపాధ్యాయులు, ఎంఈవోల కొరత, విద్యావాలంటీర్ల కొనసాగింపు తదితర అంశాలపై చర్చకు రావచ్చు. ఈ సారి పదో తరగతి ఫలితాల్లో జిల్లా మంచి పేరును సాధించింది. దీంతో వచ్చే ఏడాది మరింత మెరుగుపర్చుకునేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యార్థులకు కనీస అవసరాలపై చర్చించే ఆస్కారం ఉంది. వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెనూ పాటించడం, హాస్టళ్లలో సౌకర్యాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల పనితీరు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల పనితీరు తదితర అంశాలు చర్చకు రావచ్చు. ఇక ఖరీఫ్ (వానాకాలం) ప్రారంభం ఇప్పటికే వారం గడిచిపోయింది. సుమారు 40 నుంచి 50 శాతం మంది పొలాల్లో విత్తనాలు నాటారు. ఇంకా కొంత మంది రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 15 తర్వాత కురిసే వర్షాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. జిల్లా రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచడం, పంటలపై మందు పిచికారీ, ఏఏ రకాల ఎరువులు వాడాలనే దానిపై రైతులకు అవగాహన తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సమయంలో రైతులకు ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయం (రైతుబంధు), బ్యాంకుల ద్వారా అందజేసే పంట రుణాలు, తదితర అంశాలు చర్చకు రావచ్చు. జిల్లాలో ఇప్పటికే సుమారు 40 శాతం మందికి రైతుబంధు రాగా, మిగతా 60 శాతం మందికి రైతుబంధు రావాలంటే మరో పక్షం రోజుల వరకు పడుతుంది. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ తదితర అంశాలు చర్చించవచ్చు. ఈ అంశాలతోపాటు త్వరలో చేపట్టే హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం, నర్సరీల్లో ఉన్న మొక్కలు, ఈ ఏడాది లక్ష్యానికి అనుగుణంగా మొక్కల పెంపకం తదితర అంశాలు చర్చకు రావచ్చు. రానున్న వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పీహెచ్సీ, సీహెచ్‌సీల పనితీరుతోపాటు జిల్లా ఆసుపత్రులు తీరుపై చర్చించనున్నారు. అయితే ఆసుపత్రుల్లో సరిపడా డాక్టర్లు, సౌకర్యాలు, మందులు, ఇతరాత్ర అంశాలు చర్చించనున్నారు. వీటితో పాటు ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అయినా 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్‌కు సంబంధిత మార్గదర్శకాలు, విధివిధానాలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, దళిత బస్తీ పథకం కింద భూ పంపిణీ, భూములు అమ్మిన వారికి డబ్బు చెల్లింపులు, ఈ ఏడాదిలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ చెక్కుల పంపిణీ, తదితర అంశాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. -
ఆర్నెల్లలో పల్లెలన్నీ మారాలి
గ్రామ పంచాయతీలకు కార్యదర్శులను నియమించాం. పంచాయతీరాజ్ చట్టం చాలా కఠినంగా ఉంది. కార్యదర్శి చక్కగా పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తేనే మూడేళ్ల తరువాత ఆయన సేవలను క్రమబద్ధీకరిస్తాం. పంచాయతీ కార్యదర్శులపై పూర్తి నియంత్రణ మీదే. అలాగే డీపీవో, డీఎల్పీవో, ఈవోఆర్డీ, ఎంపీడీవోతో బాగా పనిచేయించాలి. దీనికి సంబంధించిన ఆర్థిక, పరిపాలన, అజమాయిషీ అధికారాలను త్వరలోనే నిర్ణయిస్తాం. ఆరు నెలల్లో పూర్తి మార్పు కనబడాలి. సాక్షి, హైదరాబాద్ : ‘‘స్థానిక సంస్థలు చాలా కాలం పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో పనిచేశాయి. పారిశుద్ధ్య కార్యక్రమం బ్రహ్మాండంగా ఉండేది. దురదృష్టవశాత్తు ఆ స్ఫూర్తి ఇప్పుడు కొరవడింది. 70 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా ఏ గ్రామానికి పోయినా అపరిశుభ్ర వాతావరణం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. గ్రామాల్లో మంచిగా ఏదీ జరగడం లేదు. పల్లెలు పెంటకుప్పల్లాగా తయారయ్యాయి. ఎందుకీ క్షీణత? మంచినీళ్లకు గోస ఎందుకు? తెలంగాణ ఎక్కడో లేదు....గ్రామాల్లోనే ఉంది. గ్రామాలను మనం అద్భుతంగా చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. మీరంతా విద్యాధికులు. పరిస్థితులను అర్థం చేసుకోండి. మీరు గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. భయంకరమైన గ్రామాల పరిస్థితులలో ఆరు నెలల్లో మార్పు రావాలి. అది గుణాత్మకమైన మార్పు కావాలి’’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లతో సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ప్రజాప్రతినిధుల బాధ్యతలను ముఖ్యమంత్రి కూలంకషంగా వివరించారు. మంగళవారం ప్రగతి భవన్లో కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వర్ధిల్లాలనే ప్రధాన లక్ష్యంతో రూపొందించిన కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లో క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. ‘‘నేను స్వయంగా పంచాయితీరాజ్ విషయంలో అవగాహనకు రావడానికి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ఐఆర్డీలో శిక్షణకు వెళ్లా. అక్కడే హాస్టల్లో ఆరు రోజులుండి ఏడు రోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యా. అప్పుడు నాకు పూర్తి అవగాహన వచ్చింది. మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరంతా జూలైలో పదవీబాధ్యతలు స్వీకరించేలోగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ తీసుకోవాలి. ఇందుకోసం అధికారులు ఒక కోర్సు తయారు చేస్తారు’’అని సీఎం తెలిపారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లకు త్వరలోనే హైదరాబాద్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. సమావేశం ప్రారంభం కావడానికి ముందు సీఎం కేసీఆర్... జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను వారి స్థానాల దగ్గరకు వెళ్లి ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందించారు. వారితో కలసి భోజనం చేశారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతా మహేందర్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎ. జీవన్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, షకీల్, మాజీ ఎమ్మెల్యేలు ఎం. సుధీర్‌రెడ్డి, నల్లాల ఓదేలు, ఉమా మాధవరెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లతో భేటీలో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే... బాగా పనిచేస్తేనే క్రమబద్ధీకరణ... గ్రామ పంచాయితీలకు కార్యదర్శులను నియమించాం. పంచాయతీరాజ్ చట్టం చాలా కఠినంగా ఉంది. కార్యదర్శి చక్కగా పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తేనే మూడేళ్ల తరువాత ఆయన సేవలను క్రమబద్ధీకరిస్తాం. పంచాయతీ కార్యదర్శులపై పూర్తి నియంత్రణ మీదే. అలాగే డీపీవో, డీఎల్పీవో, ఈవోఆర్డీ, ఎంపీడీవోలతో బాగా పని చేయించాలి. దీనికి సంబంధించిన ఆర్థిక, పరిపాలన, యాజమాయిషీ అధికారాలను త్వరలోనే నిర్ణయిస్తాం. ఆరు నెలల్లో పూర్తి మార్పు కనబడాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవిపల్లి, ముల్కనూర్, అంకాపూర్ లాంటి ఆదర్శ గ్రామాల మాదిరిగా మారాలి. ఏ జిల్లా పరిషత్ అగ్రభాగాన నిలిస్తే ఆ జిల్లాకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి రూ. 10 కోట్లు మంజూరు చేస్తాం. ఒకటి కంటే ఎక్కువ పరిషత్‌లు ముందు నిలిస్తే వాళ్లకూ మంజూరు చేస్తాం. 32 జిల్లాలు కూడా అగ్రభాగాన నిలిచి మొత్తం అందరూ కలసి రూ. 320 కోట్లు పొందాలని నా కోరిక. జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు కొత్త కార్లు కొనిస్తాం. మీరు చాలా మంచి మార్పు తీసుకు రాగలమని ప్రజల్లో భావన తీసుకు రాగలిగితే అంతకన్నా గొప్ప లేదు. ప్రజల్లో బాగా తిరిగి పంచాయతీరాజ్ సంస్థను బలోపేతం చేయాలి. క్రియాశీలకంగా ఏ గ్రామానికి ఆ గ్రామమే అభివృద్ధి జరగాలంటే మీరు బాధ్యత తీసుకోవాలి. మీరు నాయకత్వం వహించాలి. మీ కింది వారికి స్ఫూర్తి కావాలి. ఎలాగైతే తెలంగాణ సాధించామో అలాగే గ్రామాల అభివృద్ధి జరగాలి. లేనిపోని దర్పం తెచ్చుకోకండి... జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లుగా ఏకపక్ష విజయం సాధించినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. మీరు పనిచేయబోయే ఈ ఐదేళ్ల కాలంలో మంచి పేరు తెచ్చుకోవాలి. మీకు పనిచేసే ధైర్యాన్ని, అభినివేశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. మీరింకా ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షిస్తున్నా. మీకు లభించిన పదవిని ఎంత గొప్పగా నిలబెట్టుకుంటే అంత మంచిది. ఎవరూ పుట్టినప్పుడు అన్నీ నేర్చుకోలేదు. పరిస్థితులను బట్టి నేర్చుకుంటూ పోతారు. మనిషి చివరి శ్వాస విడిచే వరకు జ్ఞాన సముపార్జన చేసుకుంటూ పోవాలి. మన జీవితం చాలా చిన్నది. ఆ కాస్త సమయంలోనే మంచి పేరు తెచ్చుకోవాలి. అజ్ఞాని ఏ రోజైనా జ్ఞాని కాగలుగుతాడు. కానీ మూర్ఖుడు జ్ఞాని కాలేడు. వాడు తనకే అన్నీ తెలుసు అనుకుంటాడు. అలా కాకుండా అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్న వారే ఎంచుకున్న రంగంలో ముందడుగు వేయగలరు. అన్ని విషయాల్లాగానే పంచాయతీరాజ్ విషయాలను కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. పదవి వచ్చిన తరువాత మన సహజత్వాన్ని కోల్పోకూడదు. అలా చేస్తే జనం నవ్వుతారు. లేనిపోని దర్పం తెచ్చుకోకూడదు. పదవి రాగానే మీరు మారిపోకూడదు. మనకు రావాల్సిన, దక్కాల్సిన గౌరవం ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. పెట్టుడు గుణాల కంటే పుట్టుడు గుణం మంచిది అంటారు పెద్దలు. మన వ్యవహార శైలే మనకు లాభం చేకూరుస్తుంది. ప్రజలకు అనేక సమస్యలుంటాయి. వారు ఆ సమస్యల పరిష్కారం కోసం మీ దగ్గరికి వస్తారు. నాయకుల మంచి లక్షణం ఒకరు చెప్పింది వినడం. అదే మీరు చేయండి. ఓపికగా వారి సమస్యలను సావధానంగా వినండి. వాళ్లను కూర్చోబెట్టి మర్యాద చేయండి. అప్పుడే వాళ్లకు రిలీఫ్ వస్తుంది. ఆ తరువాత వారి సమస్యలను ఎలా పరిష్కరించాలో ప్రయత్నం చేయండి. సహజత్వాన్ని కోల్పోకుండా ప్రవర్తిస్తే మంచి పేరు వస్తుంది. మంచిపేరుతోనే ఉన్నతస్థాయి వస్తుంది. మీరంతా మీ సామర్థ్యాన్ని, అదృష్టాన్నిబట్టి ఈ పదవుల్లోకి వచ్చారు. ఇదంతా మీ సత్త్రవర్తన వల్లే. మంచి పనులు చేయడానికి పెట్టుబడులు అవసరం లేదు. సరళంగా మాట్లాడటమే ఏ రోజునైనా మనకు పెట్టని కోట. ప్రజాసమస్యలపట్ల ప్రజాప్రతినిధులు ఎంతటి శ్రద్ధ కనబరుస్తున్నారో ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. దీనివల్ల మనకు ఇంకా ఉన్నతావకాశాలు వస్తాయి. విజయాలు, అపజయాలు సర్వసాధారణం. కానీ రాజకీయాల్లో ఉన్న వారు ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉండటం ప్రాథమిక లక్షణం. జెడ్పీలకు రాజ్యాంగబద్ధ అధికారాలన్నీ కట్టబెట్టుతాం... గతంలో జెడ్పీ చైర్పర్సన్లకు పెద్దగా పనిలేదు. ఇటీవల కేంద్ర ఆర్థిక సంఘాన్ని కలిసినప్పుడు మన వ్యవస్థ గురించి వివరించా. ఇక్కడ జెడ్పీ చైర్పర్సన్లకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ రాంక్ ఇచ్చామని చెప్పా. వాళ్లు ఇక ముందు క్రియాశీలకంగా పని చేస్తారని కూడా చెప్పా. అవసరమైన సాయం చేస్తామని ఆర్థిక సంఘం అధ్యక్షుడు మాట ఇచ్చారు. ఏ విధంగానైనా మీ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆలోచన చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అన్ని అధికారాలు సంక్రమింప చేస్తాం. ఇంత ఏకపక్షంగా 32 జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ రాలేదు. దాంతోపాటే మీకు బరువు, బాధ్యతలు పెరిగాయి. మీ పాత్ర ఉన్నతంగా ఉండాలి. జిల్లా పరిషత్‌లు క్రియాశీలకం కావాలి. మీ విధులు, బాధ్యతలు పటిష్టం కావాలి. పంచాయతీరాజ్ ఉద్యమం అలా మొదలైంది... పంచాయతీరాజ్ ఒక అద్భుతమైన ఉద్యమం. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దీనికి రూపకల్పన చేశారు. రాష్ట్రాలకు పాలనలో స్వతంత్రత ఉండాలని, అది వికేంద్రీకరణ జరగాలని స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టారు. కేంద్రీకృత పాలన క్షేత్రస్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. ఎక్కడికక్కడే అభివృద్ధి జరగాలని ఒక అద్భుతమైన ఉద్యమానికి ప్రాణం పోశారు. దీని మొట్టమొదటి పేరు కమ్యూనిటీ డెవలప్మెంట్. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న తొలినాళ్లలో అమెరికా వెళ్లినప్పుడు ఆ దేశాధ్యక్షుడు ఐసన్ హోవర్ ఆయనకు ఎస్కే డేను పరిచయం చేశారు. ఆయన భారతీయుడని, గ్రామీణ అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని, అవి అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని నెహ్రూకు ఐసన్ హోవర్ చెప్పారు. ఆయన్ను అమెరికా అధ్యక్షుడు పొగడటంపట్ల సంతోషం వ్యక్తం చేసిన నెహ్రూ... భారత్‌కు రమ్మని ఎస్కే డేను ఆహ్వానించారు. ప్రథమ పంచవర్ష ప్రణాళికలో దేశ అవసరాలకు భిన్నంగా సత్వర పారిశ్రామీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం తనకు అభ్యంతరమని, అది తప్పని, మొదలు సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆహార రంగంలో స్వయం సమృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని డే సూచించారు. నెహ్రూ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. నెహ్రూ స్వదేశానికి వచ్చాక మంత్రి మండలిలో, పార్టీలో ఎస్కే డే సలహాపై చర్చించారు. ఫలితంగా రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యతాక్రమం మారింది. ఆధునిక దేవాలయాల పేరిట భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అప్పటి ఆ మార్పు వల్ల ఈ రోజున ఆహార రంగంలో స్వావలంబన వచ్చింది. నెహ్రూ తీసుకువచ్చిన మార్పు వల్ల సంతోషించిన ఎస్కే డే భారత్ రాగా ఆయన్ను తక్షణమే రాజ్యసభ సభ్యుడిని చేసి కేబినెట్ మంత్రిగా నెహ్రూ నియమించారు. ఆయనకు కమ్యూనిటీ డెవలప్మెంట్ శాఖను కేటాయించారు. గ్రామీణ భారతాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. ఆయన వెంటనే కార్యక్రమం మొదలుపెట్టారు. సరాసరి హైదరాబాద్ వచ్చి ఎన్ఐఆర్డీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచే యావత్ భారత దేశానికి పంచాయతీరాజ్ ఉద్యమాన్ని విస్తరింప చేశారు. అప్పట్లో ఆయన దేశంలోనే మొట్టమొదటి సమితి (పటాన్చెరు) అధ్యక్షుడిగా పి. రామచంద్రారెడ్డిని నియమించారు. అలా మొదలైంది పంచాయితీరాజ్ ఉద్యమం. గ్రామీణ తెలంగాణ బాగు కోసం పనిచేయండి... మన ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రవేశపెట్టిన పింఛన్, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ప్రజాదరణ పొంది ఎన్నికల్లో పార్టీ విజయానికి కారణమయ్యాయి. అందుకే వాళ్ల రుణం మనం తీర్చుకోవాలి. దీనికి పాత్రధారులు మీరే. మండలాధ్యక్షులను మీలాగే తయారు చేయండి. నాలాగా మీరు కూడా వారికి అవగాహన కలిగించాలి. మీరు సందేశాత్మకంగా మాట్లాడాలి. ఆ స్థాయి రావడానికే మీకు శిక్షణ ఇప్పిస్తున్నాం. ఏ ఉద్యమ స్ఫూర్తితో ఎస్కే డే పంచాయతీరాజ్‌ను ప్రారంభించారో దాన్ని మనం ముందుకు తీసుకు పోవాలి. 60 శాతం జనాభా ఉన్న గ్రామీణ ప్రజలకు మీరు నాయకత్వం వహించాలి. గ్రామాలను పట్టుకొమ్మల్లాగా చేయడంలో నిమగ్నం కావాలి. అలా చేసి మీ జీవితాలను ధన్యం చేసుకోండి. గొప్ప పేరు సంపాదించుకోండి. అందులో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. గ్రామీణ తెలంగాణను అన్ని రకాలా బాగు చేయడానికి మీ శక్తియుక్తులను ఉపయోగించండి. -
కొత్త జెడ్పీ చైర్మన్లకు సీఎం కేసీఆర్ ఉద్భోద
సాక్షి, హైదరాబాద్ : పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతి సాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధికి పంచాయతీ రాజ్ ఉద్యమం, సహకారం ఉద్యమం ఎంతగానో దోహదపడ్డాయని, ఆ ఉద్యమానికి పూర్వ వైభవం రావాలని చెప్పారు. నిర్ధేశిత లక్ష్యాలను ఛేదించి, గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్ లకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రగతినిధి నుంచి రూ.10 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ప్రజాప్రతినిధుల బాధ్యతలను సీఎం కూలంకశంగా వివరించారు. జిల్లా పరిషత్ చైర్మన్లగా, వైఎస్ చైర్మన్లుగా ఏకపక్ష విజయం సాధించినందుకు అందరిని అభినందించారు. ఈ ఐదేళ్లలో కష్టపడి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. పదవి వచ్చిన తర్వాత సహత్వాన్ని కోల్పోకుండా ప్రవర్తిస్తేను మంచి పేరు వస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవరపల్లి, ముల్కనూర్, అంకాపూర్ లాంటి ఆదర్శ గ్రామాల మాదిరిగా మారాలని సిఎం ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లకు త్వరలోనే హైదరాబాద్ లో శిక్షణా కార్యక్రమం నిర్విస్తామని ప్రకటించారు. గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వర్థిల్లాలనే ప్రధాన లక్ష్యంతో రూపొందించిన కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలులో క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. ‘చాలా కాలం పంచాయితీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో స్థానిక సంస్థలు పనిచేశాయి. పారిశుద్ధ్య కార్యక్రమం బ్రహ్మాండంగా వుండేది. దురదృష్ట వశాత్తు ఆ స్ఫూర్తి ఇప్పుడు కొరవడింది. 70 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత కూడా ఏ గ్రామానికి పోయినా అపరిశుభ్రత వాతావరణం కొట్టవచ్చినట్లు కనబడుతుంది. గ్రామాల్లో మంచిగా ఏదీ జరగడం లేదు. పల్లెలు పెంటకుప్పల లాగా తయారయ్యాయి. ఎందుకీ క్షీణత? మంచినీళ్ల గోస ఎందుకు? తెలంగాణ ఎక్కడో లేదు....గ్రామాల్లోనే వుంది. గ్రామాలు మనం అద్భుతంగా చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. మీరంతా విద్యాధికులు. పరిస్థితులను అర్థం చేసుకోగలరు. మీరు గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. భయంకరమైన గ్రామాల పరిస్థితులలో మార్పు రావాలి. అది గుణాత్మకమైన మార్పు కావాలి. మీ అందరు జులై నెలలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ లోపుగా మీరంతా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ లొ శిక్షణకు పోవాలి. దానికి మా అధికారులు ఒక మంచి కోర్స్ డిజైన్ తయారు చేస్తారు. గ్రామ పంచాయితీలకు కార్యదర్శులను నియమించాం. పంచాయితీ రాజ్ చట్టం చాలా కఠినంగా వుంది. కార్యదర్శి చక్కగా పనిచేస్తేనే, అనుకున్న ఫలితాలను సాధిస్తేనే, మూడేళ్ళ తరువాత ఆయన సేవలను క్రమబద్దీకరిస్తాం. పంచాయితీ కార్యదర్శుల మీద పూర్తి నియంత్రణ మీదే. అలాగే డీపీవో, డీఎల్పీవో, ఈవోఆర్డీ, ఎంపీడీవోలతో బాగా పనిచేయించాలి. దీనికి సంబంధించిన ఆర్ధిక, పరిపాలన, ఆజమాయిషీ అధికారాలను త్వరలోనే నిర్ణయిస్తాం. ఆర్నెల్లలో పూర్తి మార్పు కనబడాలి’ అని సిఎం చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతా మహేందర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎ.జీవన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, షకీల్, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, నల్లాల ఓదేలు, ఉమా మాధవరెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
నాకు రాజకీయ జన్మనిచ్చింది మామే..
మహేశ్వరం: తనకు రాజకీయ జన్మనిచ్చింది తన మామ తీగల కృష్ణారెడ్డి అని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం ఆమె తన భర్త హరినాథ్‌రెడ్డితో కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మామ సహకారంతో రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు జెడ్పీ చైర్‌పర్సన్‌గా అయ్యానని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో పయనిస్తానని తెలిపారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా తాను పని చేస్తానని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. -
సమష్టిగా అభివృద్ధి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్లు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రామపంచాయతీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అందరు సమష్టిగా పనిచేయాలని సూచించారు. సమష్టి కృషితోనే బంగారు తెలంగాణ సాకారమవుతుందన్నారు. కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్లు పుట్ట మధు (పెద్దపల్లి), కోవా లక్ష్మి (కుమ్రం భీమ్ ఆసిఫా బాద్), లింగాల కమల్‌రాజ్ (ఖమ్మం), పద్మ (నాగర్‌కర్నూలు), లోక్‌నాథ్‌రెడ్డి (వనపర్తి), హేమలత (మెదక్), నరేందర్‌రెడ్డి (నల్లగొండ), సందీప్‌రెడ్డి(యాదాద్రి భువనగిరి), మంజుశ్రీ (సంగారెడ్డి), సుధీర్‌కుమార్(వరంగల్ అర్బన్), జ్యోతి (వరంగల్ రూరల్), సంపత్‌రెడ్డి (జన గామ), కుసుమ జగదీష్ (ములుగు), బిందు (మహబూబాబాద్), శ్రీహర్షిణి (జయశంకర్ భూపాలపల్లి) సోమవారం హైదరాబాద్‌లో కేటీ ఆర్‌ను కలిశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డి, వరంగల్ ఉమ్మడి జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మా నర్సింగరావు, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, సండ్ర వెంక టవీరయ్య, కోనేరు కోనప్ప, గొంగడి సునీత, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్‌నాయక్, గ్యాదరి కిషోర్, సుమన్, గువ్వల బాలరాజు, ధర్మారెడ్డి, సతీష్ కుమార్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపునేని నరేందర్, హరిప్రియ, క్రాంతి కిరణ్ తదితరులు కేటీఆర్‌ను కలిశారు. -
అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
మహేశ్వరం: జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డికి సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జెడ్పీ పీఠం పార్టీ కైవసం చేసుకోవడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేసి అనితారెడ్డిని అభినందించారు. కొత్తగా ఎన్నికైన పరిషత్ సభ్యులంతా గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపినట్లు అనితారెడ్డి చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ రంగారెడ్డి జిల్లా చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తీగల హరినాథ్‌రెడ్డి, కందుకూరు జెడ్పీటీసీ సభ్యుడు బొక్క జంగారెడ్డి, నాయకులు కొత్త మనోహర్‌రెడ్డి, కె.రాకేశ్‌రెడ్డి, లక్ష్మీనర్సింహరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి పునరంకితమవుదాం
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సాకారం దిశగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్న అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ వంతుగా కృషి చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. పాలకవర్గాలు కొలువుదీరిన వెంటనే అభివృద్ధికి పునరంకితమవ్వాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ప్రజల వద్దకు చేర్చేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాల న్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్పర్స న్లు పట్నం సునీతారెడ్డి (వికారాబాద్), స్వర్ణ సుధాకర్ (మహబూబ్‌నగర్), నల్లాల భాగ్యలక్ష్మి (మంచిర్యాల), న్యాలకొండ అరుణ (సిరిసిల్ల), తీగల అనితారెడ్డి (రంగారెడ్డి), మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి (మేడ్చల్) ఆదివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారిని అభినందించారు. కార్యక్రమం లో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, పురాణం సతీశ్, ఎమ్మెల్యేలు రమేశ్‌బాబు, నరేందర్‌రెడ్డి, సుమన్, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొత్త చరిత్ర
-
ఉద్యమ, సామాజిక నేపథ్యాలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్.. జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎంపికలో ప్రత్యేక పంథా అనుసరించింది. పదవుల కేటాయింపులో సామాజిక సమతౌల్యం, ఉద్యమ నేపథ్యాలకు పెద్దపీట వేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తం 32 జిల్లాల్లోని 64 జెడ్పీ అధ్యక్ష, ఉపా«ధ్యక్ష పదవులకు శనివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 40 పదవులు బడుగు, బలహీనవర్గాలకు దక్కాయి. బీసీలకు 7, ఎస్సీలకు 6, ఎస్టీలకు మరో 4 జెడ్పీ చైర్పర్సన్ పదవులను టీఆర్ఎస్ కేటాయించింది. మొత్తం 17 జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులను బడుగు బలహీన వర్గాలకు అప్పజెప్పడంతోపాటు మరో 23 జెడ్పీ వైస్ చైర్పర్సన్ పదవులను సైతం బలహీన వర్గాలకు చెందిన నాయకులకు కేటాయించింది. కేటీఆర్ విస్తృత కసరత్తు... ఈ మొత్తం ఎంపికలకు సంబంధించి గత మూడు రోజులుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రత్యేకంగా కసరత్తు చేశారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని దాదాపు అన్ని జిల్లా స్థానాలకు సంబంధించి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు సంబంధించిన ఎంపికపై ఏకాభిప్రాయం వచ్చేలా చర్యలు తీసుకున్నారు. పలు జిల్లాల మంత్రులు కేటీఆర్‌తో సమావేశమై జెడ్పీ చైర్పర్సన్లను ఎంపిక చేశారు. ఈసారి సాధ్యమైనంత ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాలకు, ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలన్న పార్టీ ఆలోచన మేరకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుందని చర్చల సందర్భంగా కేటీఆర్... స్థానిక మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులెవరైనా జెడ్పీటీసీలుగా గెలిచి ఉంటే వారి వివరాలు ఇవ్వాలని మంత్రులకు సూచించారు. ఈ మేరకు పలు జిల్లాల్లో ఉద్యమ నేపథ్యం కలిగి, పార్టీలో కొనసాగుతున్న పలువురు నాయకులకు జెడ్పీ పదవులు దక్కేలా చర్యలు తీసుకున్నారు. ఉద్యమకారుల కోటాలో జెడ్పీ చైర్పర్సన్ పదవులు పొందిన వారిలో ములుగు జిల్లాకు చెందిన కుసుమ జగదీశ్, నల్లగొండ జిల్లాకు చెందిన బండ నరేందర్‌రెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ కుమార్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాథోడ్ జనార్దన్ ఉన్నారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థి నాయకుడు సిద్ధం వేణుకు జెడ్పీ వైస్ చైర్మన్‌గా అవకాశం దక్కింది. కేవలం జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవుల్లోనే కాకుండా కో ఆప్షన్ సభ్యుల ఎంపిక విషయంలోనూ ఇదే సూత్రాన్ని పార్టీ అమలు చేసింది. జిల్లా పరిషత్ పదవులకు జరిగిన ఎంపికపై పార్టీ శ్రేణులతోపాటు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో కేటీఆర్ చేసిన కసరత్తును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. -
జెడ్పీలన్నీ గులాబీవే
సాక్షి, హైదరాబాద్: ఎంపీపీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన అధికార టీఆర్ఎస్ జెడ్పీ ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించింది. శనివారం 32 జిల్లాల్లో జెడ్పీపీ పదవులకు జరిగిన ఎన్నికల్లో 32 జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కో ఆప్షన్ పదవులన్నింటినీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. విపక్షాల నుంచి ఎక్కడా కనీస పోటీ కూడా ఎదురు కాలేదు. సింగిల్ సెట్ నామినేషన్లతోనే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అభ్యర్థులు బరిలో నిలిచి గెలిచారు. 20 జెడ్పీ పీఠాలను మహిళలు గెలుచుకున్నారు. తొలుత ఒక్కో జెడ్పీలో ఇద్దరు కో ఆప్టెడ్ సభ్యుల చొప్పున ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించారు. జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించిన ఈ ఎన్నికల్లో కో ఆప్టెడ్ మెంబర్స్ ఎన్నికకు అధిక శాతం జిల్లాల్లో ఒక్కో నామినేషనే రావడంతో ఆ స్థానాల్లో వారు ఎన్నికైనట్లు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో మినహా జెడ్పీ ఎన్నికల సందర్భంగా విపక్ష పార్టీల సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరు కాలేదు. 32 జిల్లాల్లోని జెడ్పీ పదవులను గెలుచుకునే సంఖ్యాబలం అధికార టీఆర్ఎస్కు ఉండటంతో పోటీ అనేదే లేకుండా పోయింది. అంతేకాకుండా అన్ని జిల్లా పరిషత్‌లలో టీఆర్ఎస్ సభ్యులతో కూడిన కోరంతోనే సమావేశం నిర్వహించడంతో విపక్ష„ పార్టీల సభ్యులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ముగిశాయి. జెడ్పీ పదవులు గెలుచుకునే సంఖ్యాబలం ఉండటంతో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికల్లో వివిధ వర్గాలకు ప్రాధాన్యం కల్పించే చర్యలను టీఆర్ఎస్ అధిష్టానం చేపట్టింది. ప్రత్యేక సమావేశానికి ముందే జెడ్పీ చైర్పర్సన్ పదవులకు పోటీ పడుతున్న వారి పేర్లను ఆయా జిల్లాల పార్టీ ఇన్చార్జీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఏకగ్రీవ తీర్మానాలతో చైర్పర్సన్లను ఎన్నుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నిక ముగియడంతో పరిషత్ పోరు పూర్తయింది. అయితే ఎంపీపీ, జెడ్పీ పదవులకు ఎన్నికైన వారితోపాటు కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులంతా పాత పాలకమండళ్ల పదవీకాలం ముగిశాక జూలై మొదటి వారంలో పదవీ బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. పట్నం సునీతారెడ్డి హ్యాట్రిక్... ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని రెండుసార్లు చేపట్టిన పట్నం సునీతారెడ్డి (మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి) ఈసారి వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అంగోతు బిందు ఈ పదవిని చేపడతున్న పిన్న వయస్కురాలిగా నిలుస్తున్నారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన బిందు 23 ఏళ్ల వయసులోనే జిల్లా స్థాయిలో కీలక పదవిని చేపట్టనున్నారు. బయ్యారం జెడ్పీటీసీ స్థానానికి పోటీ ద్వారా తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సోదరి కుమార్తె. నేతల కుటుంబ సభ్యుల గెలుపు... జెడ్పీ చైర్పర్సన్లుగా మాజీ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి (కుమ్రం భీం ఆసిఫాబాద్), పుట్టా మధుకర్ (పెద్దపల్లి), కోరం కనకయ్య (భద్రాద్రి కొత్తగూడెం), స్వర్ణ సుధాకర్ (మహబూబ్‌నగర్) ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు డా. అనితారెడ్డి, మంచిర్యాల జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు భార్య నల్లాల భాగ్యలక్ష్మి, యాదాద్రి జెడ్పీ చైర్‌పర్సన్‌గా దివంగత నేత, మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవ్‌రెడ్డి తనయుడు ఎ. సందీప్‌రెడ్డి, మేడ్చల్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కుమారుడు శరత్‌చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. నిజామాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా దాదన్నగారి విఠల్‌రావుకు అవకాశం లభించింది. నల్లగొండ జెడ్పీ చైర్‌పర్సన్‌గా అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పని చేసిన బండా నరేందర్‌రెడ్డి, వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన గండ్ర జ్యోతికి (ఎమ్మెల్యే గ్రండ వెంకట రమణారెడ్డి సతీమణి) వరంగల్ రూరల్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వనపర్తి మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న లోక్నాథ్రెడ్డికి ఈసారి వనపర్తి జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం లభించింది. గతంలో వివిధ జెడ్పీల్లో వైస్ చైర్‌పర్సన్‌గా విధులు నిర్వహించిన వారికి చైర్పర్సన్ పదవులు లభించాయి. కరీంనగర్ జెడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న డా. సుధీర్ కుమార్ ఇప్పుడు వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు. కరీంనగర్ జెడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న రాయిరెడ్డి రాజిరెడ్డి తాజా ఎన్నికల్లో హుస్నాబాద్ జెడ్పీటీసీగా గెలుపొంది సిద్దిపేట జెడ్పీ వైస్ చైర్పర్సన్ అయ్యారు. ఎన్నికలు జరగని ఎంపీపీలకు విడిగా నోటిఫికేషన్... మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరగకుండా మిగిలిపోయిన 22 అధ్యక్ష, 26 ఉపాధ్యక్ష పదవులతోపాటు 18 కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు తేదీని నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. మిగతా స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. శుక్ర, శనివారాల్లో కలిపి మొత్తం 513 మంది ఎంపీపీ అధ్యక్షులను ఎన్నుకున్నారు. మొత్తంగా టీఆర్ఎస్కు 429 ఎంపీపీలు, కాంగ్రెస్‌కు 62, బీజేపీకి 6, ఇండిపెండెంట్లకు 12, ఆల్ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌కు 2, సీపీఎం, టీడీపీలకు చెరో ఎంపీపీ అధ్యక్ష పదవులు లభించినట్లు ఎస్ఈసీ ప్రకటించింది. -
తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కారు టాప్ గేరులో దూసుకెళ్లింది. అత్యధిక సీట్లు గెలుచుకొని దాదాపు అన్ని మండల ప్రజాపరిషత్(ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. జిల్లా పరిషత్‌లోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ఈనెల 4న పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. 32 జిల్లాల్లోనూ జెడ్పీ చైర్మన్ పీఠాలు కైవసం చేసుకునే రీతిలో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 538 జెడ్పీటీసీలకు గానూ.. టీఆర్ఎస్ 449 స్థానాలను దక్కించుకుంది. కరీంనగర్, గద్వాల, మహబూబ్‌నగర్, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పరిధిలో టీఆర్ఎస్ అన్ని జెడ్పీటీసీ స్థానాలను క్లీన్‌స్వీప్ చేసింది. ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, మేడ్చల్, ములుగు జిల్లాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్కో జెడ్పీటీసీ స్థానంలో మాత్రమే గెలుపొందగా, మిగిలిన స్థానాలన్నీ టీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. నల్గొండ జెడ్పీ చైర్మన్‌గా బండా నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా స్వర్ణ సుధాకర్ రెడ్డి, వైఎస్ చైర్మన్‌గా యాదయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ గా వేలేటి రోజా శర్మ, వైఎస్ చైర్మన్ గా రాయిరెడ్డి రాజారెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ముంజు శ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కో-ఆప్షన్ మెంబర్లు గా ముస్తఫా, మహ్మద్ అలీ ఏకగ్రీవం. నల్గొండ జడ్పీచైర్మన్ గా బండా నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ గా పాగాల సంపత్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా గిరబోయిన భాగ్యలక్ష్మి ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రకటించారు. కోఆప్షన్ సభ్యులు గా టిఆర్ఎస్ కు చెందిన ఎండీ గౌస్ పాష మరియు మదర్ ఏకగ్రీవం ఎన్నికయ్యారు. జెడ్పీగా ఎన్నికైన పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తి రెడ్డి తదితరులు మెదక్ జెడ్పీ ఛైర్ పర్సన్‌గా హేమలత శేఖర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జోగులంబ గద్వాల జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ గా సరితా, వైస్ ఛైర్పర్సన్ గా సరోజమ్మ ను ఏకగ్రీవం నాగర్ కర్నూల్ జడ్పీ చైర్మన్ గా పద్మావతి, వైస్ చైర్మన్ గా బాలాజీ సింగ్ ఎన్నికయ్యారు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా కోనారావుపేట జెడ్పీటీసీ న్యాలకొండ అరుణ, వైస్ చైర్మన్ గా ఇల్లంతకుంట జడ్పీటీసీ సిద్దం వేణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే రమెష్ బాబు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ నిజామాబాద్ నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్‌గా దాదన్నగారి విఠల్ రావ్, వైస్ చైర్మన్‌గా రజిత యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావ్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కనుమల్ల విజయ ఇల్లందకుంట, వైస్ చైర్మన్ గా పేరాల గోపాల్ రావు సైదాపూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కనుమల్ల విజయ ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ గా కోవ లక్ష్మీ ,వైస్ చైర్మన్ గా కోనేరు కృష్ణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా నల్లాల బాగ్య లక్ష్మీ, వైస్ చైర్మన్ గా సత్యనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికాని భారతి హోళీకెరీ ప్రకటించారు. బాణా సంచా పేల్చుతూ సంబరాలు జరుపుకుంటున్న తెరాస శ్రేణులుఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ గా జనార్దన్ రాథోడ్ ,వైస్ చైర్మన్ గా ఆరె రాజన్న లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా కోవ.లక్ష్మి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ గా కోనేరు కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెరాస శ్రేణుల భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ గా పుట్ట మధుకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా తీగల అనితా హరినాథ్ రెడ్డి , వైస్ ఛైర్మన్ గా ఈటె గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా సునీత మహేందర్ రెడ్డి. వైస్ చైర్మన్ గా విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ జిల్లా చైర్ పర్సన్ గా సునీతా మహేందర్ రెడ్డి మూడు సార్లు ఎన్నికయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు సార్లు వికారాబాద్ జిల్లా పరిషత్ మొట్టమొదటి చైర్ పర్సన్ గా సునీత మహేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. సూర్యపేట జడ్పీ చైర్మన్ గా గుజ్జదీపిక యుగేందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదాద్రి భువనగిరి జడ్పీచైర్మన్ గా ఏలిమినేటి సందీప్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి జడ్పీ చైర్మన్ గా దఫెదార్ శోభ, వైస్ చైర్మన్ గా పరికి ప్రేమ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ములుగు జడ్పీ చైర్ పర్సన్ కుసుమ జగదీశ్, వైస్ చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ గా పుట్ట మధుకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్ అర్బన్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా మరేపల్లి సుధీర్, వైస్ చైర్మన్ గా శ్రీ రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వరంగల్ రురల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా గండ్ర జ్యోతి , వైస్ చైర్మన్ గా ఆకుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ గా కోరం కనకయ్య, వైస్ చైర్మన్ గా కంచర్ల చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
పెట్టు‘బడి’ మాసం
పాపన్నపేట(మెదక్): పాఠశాలలు ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. జిల్లాలో 119 ప్రైవేట్ పాఠశాలలుండగా సుమారు 25 వేల మంది విద్యార్థులున్నారు. బడిగంటలు మోగే సమయం దగ్గర పడుతున్న కొద్దీ తల్లిదండ్రుల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ధనవంతులు.. ఉద్యోగులు.. రైతులు .. చిరుద్యోగులు.. మధ్య తరగతి వారంతా ఆంగ్ల మాధ్యమంపై మోజుతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలల్లో చదివించడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం అప్పులు చేయడానికి సైతం వెనుకాడడం లేదు. కొంతమందైతే కేవలం పిల్లల చదవుల కోసమే పొలాలు కౌలు కిచ్చి..పెద్ద మనుషులను ఇంటి దగ్గరే వదిలి.. పట్నం వెళ్లి కిరాయి రూములు తీసుకొని నివాసం ఉంటున్నారు. జూన్ నెల వచ్చిందంటే గుబులే.. జూన్ నెల వచ్చిందంటే చాలు అటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో..ఇటు రైతన్నల్లో ఆందోళన ప్రారంభమవుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా ఫీజులను 10 నుంచి 15 శాతం పెంచుతూ పోతున్నారు. నడక సరిగా రాని చిన్నారిని నర్సరీలో చేర్చాలంటే ఏటా కనీసం రూ.20 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఫీజు రూ.12 వేలు కాకుండా, బుక్స్, బ్యాగ్‌లు, టై, షూ, సాక్స్, యూనిఫాం, చివరకు పుస్తకాలకు వేసే కవర్లు కూడా వారి దగ్గరే కొనాల్సి ఉంటుంది. ఇక ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు ఫీజు కింద ఏడాదికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. నాలుగు, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలు బయట కొనే అవకాశం ఉన్నప్పటికీ, పాఠశాలల యాజమాన్యాలు సూచించిన రెడీమేడ్ షాప్‌ల్లో వారు చెప్పిన ధరలకే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక 6,8వ తరగతుల నుంచి కొన్ని పాఠశాలలు ఐఐటీ ఫౌండేషన్ పేరిట క్లాసులు నడుపుతున్నాయి. ఇవన్నీ కలిపి తల్లిదండ్రులకు తడిసి మోపెడవుతోంది. -
జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక నేడే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ పాలక మండలిలోని కీలక పదవుల ఎన్నిక నిర్వహణకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్, రెండు కోఆప్షన్ పదవులకు ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఖైరతాబాద్‌లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలుత కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత జెడ్పీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ఉదయం 10 గంటలకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలలోపు అర్హుల జాబితా ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు కొంత సమయం కేటాయిస్తారు. ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్ లోకేష్‌కుమార్, ఇతర అధికారులు ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఒంటిగంటలోపు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. 3.30 గంటలలోపు ఎన్నికలు పూర్తవుతాయి. కాగా, ఎన్నిక పూర్తయినప్పటికీ వీరి ప్రమాణ స్వీకారం వచ్చే నెల మొదటి వారంలో జరిగే వీలుంది. ప్రస్తుత పాలక మండలి పదవీకాలం వచ్చేనెల నాలుగో తేదీ వర కు ఉంది. ఆలోపు ప్రమాణ స్వీకారం జ రిగే తేదీని యంత్రాంగం ప్రకటించనుంది. దీనికి అనుగుణంగా కొత్త పా లక మండలి కొలువుదీరుతుంది. అదే తొలి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తారు. వైస్ చైర్మన్ పదవి ఎస్టీకి లేదా బీసీకి జెడ్పీ చైర్ పర్సన్ పదవికి టీఆర్ఎస్ నుంచి మహేశ్వరం జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ తీగల అనితారెడ్డి పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈమె ఎన్నిక లాంఛనమే. ఇక వైస్ చైర్మన్ పదవిని ఎస్టీ లేదా బీసీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వ్ చేయగా.. ఆ పదవి రెడ్డి సామాజిక వర్గం కోటాలో పడింది. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పదవిని బీసీకి కేటాయించాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. మరో సమీకరణ కూడా టీఆర్ఎస్ పార్టీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో కొనసాగి ప్రస్తుత కొంత రంగారెడ్డి జిల్లాలో ఉన్న 11 మండలాల పరిధి వ్యక్తికి జెడ్పీ చైర్ పర్సన్‌గా అవకాశం కల్పిస్తున్నారు. పాలమూరు నుంచి రంగా రెడ్డి జిల్లాలో కలిసిన ప్రాంతానికి వైస్ చైర్మన్ పదవిని కేటాయించాలన్న డిమా ండ్ కూడా వినిపిస్తోంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడి పది మండలాల్లో ఎస్టీ జెడ్పీటీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీనికి అనుగుణంగా ఎస్టీ సామాజిక వర్గానికి పదవికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ సామాజిక వర్గం.. అభ్యర్థి ఎవరు అన్న దానిపై పార్టీ వర్గాలు వెల్లడించడం లేదు. అధిష్టానం నుంచి వచ్చే సీల్డ్ కవరులో ఎవరి పేరు ఉంటే.. వైస్ చైర్మన్‌గా ఆ వ్యక్తి ఉంటారని పేర్కొంటున్నారు. -
జెడ్పీ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతి!
సాక్షి, వరంగల్ రూరల్: రూరల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి గండ్ర జ్యోతికి దక్కనుంది. జిల్లాలో 16 జెడ్పీటీసీలకు మూడు దశల్లో మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. 16 జెడ్పీటీసీలకు 16 జెడ్పీటీసీలను టీఆర్ఎస్ గెలుపొంది క్లీన్ స్వీప్ చేసింది. గెలుపొందిన జెడ్పీటీసీలను వెంటనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాంపునకు తీసుకవెళ్లారు. శనివారం ఉదయం 9గంటలకు వరంగల్ రూరల్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జెడ్పీచైర్‌పర్సన్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసింది. చైర్‌పర్సన్‌తో పాటు వైఎస్ చైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. జ్యోతికే చాన్స్ శాయంపేట జెడ్పీటీసీ సభ్యురాలుగా గండ్ర జ్యోతి ఎన్నికయ్యారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో గండ్ర జ్యోతి చేరారు. ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి కలిశారు. గండ్ర జ్యోతికి జెడ్పీచైర్‌పర్సన్‌గా అవకాశం కల్పిస్తామని కేటీఆర్ హమీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వెంటనే టీఆర్ఎస్లో చేరి ఆ పార్టీ తరఫున జెడ్పీటీసీ సభ్యురాలుగా నామినేషన్ వేసింది. 10వేల మెజార్టీతో శాయంపేట జెడ్పీటీసీగా గెలుపొందారు. దీంతో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతికి చాన్స్ దక్కనుంది. జ్యోతి టీఆర్ఎస్లో చేరకుముందు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందరు ఏకాభిప్రాయంతో నర్సంపేట నియోజకవర్గానికి జెడ్పీచైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. జ్యోతి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో సీన్ రివర్స్ అయింది. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది. -
నేడు జెడ్పీ చైర్మన్ ఎన్నిక
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. జెడ్పీలోని సమావేశ హాలులో చైర్మన్‌తో పాటు, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. చైర్మన్ పదవి మాక్లూర్ జెడ్పీటీసీ దాదాన్నగారి విఠల్‌రావుకు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఒక వేళ ఊహించని పరిణాలు జరిగితే తప్ప మార్పులేమీ ఉండకపోవచ్చనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా చైర్మన్ పదవి రేసులో జెడ్పీ వైస్ చైర్మన్ , ఇందల్వాయి జెడ్పీటీసీ సుమనా రవిరెడ్డితో పాటు, ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. విఠల్‌రావుకు ఈ పదవి దక్కితే వైస్ చైర్మన్ పదవి బీసీ జెడ్పీటీసీకి కేటాయించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు గాను 23 స్థానాలను గెలుచుకుని టీఆర్ఎస్ జెడ్పీలో స్పష్టమైన మెజారిటీ సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు రెండేసి జెడ్పీటీసీలకు పరిమితమయ్యాయి. ఈ రెండు పార్టీలు దరిదాపుల్లో లేవు. క్యాంపు నుంచి గెస్ట్‌హౌస్‌కు.. అక్కడి నుంచి సమావేశానికి.. పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ., టీఆర్ఎస్ పార్టీ ముందు జాగ్రత్తగా క్యాంపును నిర్వహిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రత్యేక వసతిగృహానికి టీఆర్ఎస్ జెడ్పీటీసీలను మంగళవారం రాత్రే తరలించింది. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఇప్పటికే అ పార్టీ జెడ్పీటీసీలందరికి ఆదేశాలు జారీ చేశారు. కాగా చైర్మన్ ఎన్నిక కోసం జెడ్పీటీసీలందరిని శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి డిచ్పల్లి వద్ద హైవేపై ఉన్న ఓ ప్రైవేటు గెస్ట్‌హౌస్‌కు తరలించనున్నారు. అక్కడ అధిష్టానం నిర్ణయాన్ని జెడ్పీటీసీలకు అధికారికంగా ప్రకటించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఓటింగ్‌కు తీసుకెళ్లేలా గులాబీ పార్టీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మంత్రి వేముల ప్రశాంత్రెడి ఈ ఎన్నిక సమన్వయ బాధ్యతలు తీసుకున్నారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతో పాటు, కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు జిల్లా పరిషత్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమావేశం హాలులో మధ్యాహ్నం ఒంటి గంటకు జెడ్పీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించిన విషయం విధితమే. ఈ మేరకు సమావేశం హాలులో ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. బారికేడ్లను కట్టారు. ఎన్నిక మొత్తం వీడియో చిత్రీకరణ ఉంటుంది. అలాగే వెబ్‌క్యాస్టింగ్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారిగా కలెక్టర్.. ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు వ్యవహరించనున్నారు. కోఆప్షన్ సభ్యుల పదవులకు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ఒకరి పేరును ఒక జెడ్పీటీసీ ప్రతిపాదించాల్సి ఉండగా, మరొకరు బలపరచాలి. పదవులకు చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక ఉంటుంది. గంట ముందు విప్‌జారీ.. జెడ్పీ ప్రత్యేక సమావేశం ప్రారంభానికి ఒక గంట ముందు అన్ని పార్టీలు విప్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. ఆయా పార్టీల సభ్యులు విప్‌కు వ్యతిరేకంగా ఓటింగ్‌లో పాల్గొంటే వారి ఓటు చెల్లినప్పటికీ, వారి పదవిని కోల్పోతారు. ఈ మేరకు ముందు జాగ్రత్తగా అన్ని పార్టీలు విప్‌ను జారీ చేయనున్నాయి. ఈ ఎన్నిక సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశానికి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక ఆహ్వాన సభ్యులుగా సమావేశానికి హాజరు అయ్యేందుకు వీలుంటుంది. -
జెడ్పీ చైర్మన్ ఎన్నిక.. నేడే!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్‌పై తొలిసారి గులాబీ జెండా ఎగరనుంది. 31 జెడ్పీటీసీ స్థానాలకు అత్యధికంగా 24 జెడ్పీటీసీలను సొంతం చేసుకున్న టీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనుంది. శనివారం నాటి ఎన్నిక లాంఛనమే కానుంది. నార్కట్‌పల్లి జెడ్పీటీసీ సభ్యుడు బండా నరేందర్ రెడ్డి పేరు ఖరారైందని పార్టీ వర్గాలు తెలిపాయి. మిర్యాలగూడ జెడ్పీటీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి కూడా చైర్మన్ పదవిని ఆశించారు. కానీ, ఆయనకు మరో పదవి రూపంలో గుర్తింపు ఇస్తామని పార్టీ నాయకత్వం నచ్చజెప్పినట్లు చెబుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు జిల్లా పరిషత్‌లో ప్రధానమైన నాలుగు పదవులను నాలుగు నియోజకవర్గాలకు కేటాయించారని చెబుతున్నారు. వైస్ చైర్మన్ పదవి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కేటాయించినట్లు సమాచారం. అనుముల జెడ్పీటీసీ సభ్యుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇరుగి పెద్దులు పేరు ఖరారైందని తెలుస్తోంది. కోఆప్షన్ సభ్యుల విషయానికొస్తే మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాలకు కో–ఆప్షన్ సభ్యుల పదవులు ఇవ్వాలని నిర్ణయించారని అంటున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం మాడ్గులపల్లి మండలం ఆగమోత్కూరు మాజీ సర్పంచ్ మోసిన్ అలీ, నల్లగొండ నియోజకవర్గం నుంచి క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన జాన్ శాస్త్రి పేర్లపై చర్చ జరిగిందని అంటున్నారు. దేవరకొండ నియోజకవర్గానికి జెడ్పీ స్టాండింగ్ కమిటీల్లో అవకాశం కల్పిస్తామ హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల లాంఛనమే...! జిల్లాలోని 31 జెడ్పీటీసీ సభ్యులకుగాను టీఆర్ఎస్ 24 మందిని, కాంగ్రెస్ ఏడుగురు సభ్యులను గెలచుకున్నాయి. దీంతో అత్యధిక మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్‌గా ఎన్నిక కావడం లాంఛనమే. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల అనంతరం సభ్యులను క్యాంపులకు తరలించారు. జిల్లా ఇన్చార్జ్, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నేతృత్వంలో క్యాంప్ ఏర్పాటైంది. వీరంతా శనివారం జరిగే జెడ్పీ చైర్మన్ ఎన్నికకు ఉదయం 10 గంటల కల్లా జిల్లా పరిషత్‌కు చేరుకుంటారు. ముందుగా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. -
నేడే ‘జెడ్పీ’ పట్టాభిషేకం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గులాబీ జెండాల రెపరెపల మధ్య జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుల పట్టాభిషేకం శనివారం జరగనుంది. ప్రత్యర్థి పార్టీల ఉనికి సైతం కనిపించని రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున జెడ్పీటీసీలుగా గెలిచిన నేతలు జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని నాలుగు జిల్లాలకు చైర్పర్సన్/చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు జెడ్పీటీసీలను ఎన్నుకోనున్నారు. అంతకుముందే ఉదయం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికతో జిల్లా పరిషత్‌లలో పాలక మండళ్ల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. కాగా, ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ జిల్లా పరిషత్‌కు 15 మంది జెడ్పీటీసీలు టీఆర్ఎస్ నుంచే ఎన్నికవడంతో ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. పెద్దపల్లిలో 13 సభ్యులకు గాను ఇద్దరు కాంగ్రెస్ నుంచి ఎన్నికవగా, 11 మంది సభ్యులతో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో సభ్యుడు ఎన్నిక కాగా, మిగతా సీట్లలో టీఆర్ఎస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో జెడ్పీ అధ్యక్షుల ఎన్నిక లాంఛనమే. మూడు జిల్లాల్లో స్పష్టత– జగిత్యాల తప్ప టీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా పుట్ట మధును స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలకు ముందు రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్‌పర్సన్‌గా న్యాలకొండ అరుణ పేరును కేటీఆర్ ఓకే చేశారు. ఇక కరీంనగర్ చైర్‌పర్సన్‌గా ఇల్లందకుంట జెడ్పీటీసీ కనుమండ్ల విజయను మంత్రి ఈటల రాజేందర్ తెరపైకి తెచ్చారు. ఈ మూడు జిల్లాలకు చైర్పర్సన్లకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాగా, జగిత్యాల జిల్లాపైనే తొలి నుంచి పీఠముడే కొనసాగుతోంది. తొలుత బుగ్గారం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్‌కు చైర్మన్ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చినట్టుగా భావిస్తున్న లీకుల్లో కోరుట్ల జెడ్పీటీసీ దాసెట్టి లావణ్య పేరు తెరపైకి వచ్చింది. శుక్రవారం సీను మారింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్‌కుమార్ రంగంలోకి దిగారు. జగిత్యాల రూరల్ జెడ్పీటీసీ దావ వసంతకు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని పావులు కదుపుతున్నారు. దీంతో రాత్రి వరకు జగిత్యాలపై పీఠముడి వీడలేదు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల పంచాయితీని తెంపే పనిలో పడ్డారు. రాత్రి వేళ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలతో మంతనాలు జరిపి, అధిష్టానం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. రెండు జిల్లాలకు వైస్ చైర్మన్లు ఖరారు కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా గన్నేరువరం, శంకరపట్నం జెడ్పీటీసీలు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలలో ఒకరు నియమితులవుతారని పార్టీలో ప్రచారం జరిగింది. చివరికి శుక్రవారం అధిష్టానం సైదాపూర్ జెడ్పీటీసీ పేరాల గోపాల్‌రావు పేరును ఖరారు చేసింది. రాజన్న సిరిసిల్ల వైస్ చైర్మన్‌గా ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్దం వేణు ఖరారైంది. పెద్దపల్లి వైస్ చైర్పర్సన్ విషయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కాల్వశ్రీరాంపూర్ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డికి మద్దతుగా నిలిచారు. సీనియర్ జెడ్పీటీసీ, మహిళా నాయకురాలు పాలకుర్తి నుంచి గెలిచిన కందుల సంధ్యారాణి పోటీ పడుతున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి వైస్ చైర్పర్సన్ పంచాయితీని కూడా పరిష్కరించే పనిలో పడ్డారు. -
సీల్డ్ కవర్లో జెడ్పీ చైర్మన్లు
సాక్షి, హైదరాబాద్: జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు ఏకపక్ష ఫలితాలు రావడంతో అన్ని జెడ్పీ పీఠాలనూ తన ఖాతాలో వేసుకోనుంది. అయితే, ఆ పదవులు ఎవరికి దక్కుతాయో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతో పాటు ఇద్దరేసి చొప్పున కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు శనివారం ఆయా జిల్లా పరిషత్‌ల ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా పదవులకు పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా టీఆర్ఎస్ వ్యూహం రచించింది. జెడ్పీ చైర్మన్ పదవులు ఎవరికి అప్పగించాలనే అంశంపై మూడు రోజుల పాటు తీవ్ర కసరత్తు చేసిన టీఆర్ఎస్. కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. జిల్లాలవారీగా జాబితాను ఖరారు చేశారు. అయితే, చాలాచోట్ల జెడ్పీ చైర్మన్ పదవులకు పార్టీలో అంతర్గత పోటీ ఉండటంతో చివరి నిమిషం వరకు గోప్యత పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలవారీగా జెడ్పీ చైర్మన్ పదవులకు ఎంపిక చేసిన పేర్లను ప్రాదేశిక ఎన్నికల కోసం ఇదివరకే నియమించిన పార్టీ జిల్లా ఇన్చార్జిలకు శుక్రవారం రాత్రి సీల్డ్ కవర్లో అందజేశారు. అన్ని చోట్లా జెడ్పీ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా చూడాలని వారిని కేటీఆర్ ఆదేశించారు. 30 జెడ్పీలపై ఉత్కంఠ... ఈనెల 4న పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. 32 జిల్లాల్లోనూ జెడ్పీ చైర్మన్ పీఠాలు కైవసం చేసుకునే రీతిలో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియకు ముందే ఆసిఫాబాద్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ల పేర్లను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఆసిఫాబాద్‌కు మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, పెద్దపల్లికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును ఎంపిక చేయగా.. ప్రస్తుతం మరో 30 జెడ్పీ చైర్మన్ల పేర్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రాదేశిక ఫలితాలు వెలువడిన వెంటనే.. పార్టీ పక్షాన గెలుపొందిన జెడ్పీటీసీ సభ్యులతో జిల్లాలవారీగా క్యాంపులు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు మొత్తం 28 మందిని 32 జిల్లాలకు ప్రాదేశిక ఎన్నికల ఇన్‌చార్జీలుగా నియమించారు. ఆ క్యాంపుల నిర్వహణను పర్యవేక్షిస్తూ వచ్చిన పార్టీ ఇన్చార్జీలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సంప్రదింపులు జరిపి.. జిల్లాలవారీగా జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఆశిస్తున్నవారి జాబితాను అందజేశారు. అలాగే జిల్లాలవారీగా ఎన్నికైన టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యుల అభిప్రాయాన్ని కూడా కేటీఆర్‌కు నివేదించారు.నేరుగా సమావేశ మందిరానికే..: జిల్లాల వారీగా వివిధ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లను కేటీఆర్ ఖరారు చేశారు. చాలా చోట్ల ఆయా పదవులపై ఏకాభిప్రాయం కుదిరినా, కొన్ని జిల్లాల్లో మాత్రం అంతర్గత పోటీ నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతుదారులకు పదవి దక్కేలా చివరి నిమిషం వరకు లాబీయింగ్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలవారీగా పార్టీ, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు పేర్లను ఖరారు చేసిన కేటీఆర్.. సీల్డ్ కవర్లో వాటిని ఇన్‌చార్జీలకు అందజేశారు. శనివారం సాయంత్రం 3 గంటలకు జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. క్యాంపులో ఉన్న జెడ్పీటీసీ సభ్యులు నేరుగా సమావేశ మందిరానికి వెళ్లేలా ప్రణాళిక సిద్దం చేశారు. అంతర్గత పోటీ నెలకొన్న చోట పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాల్సిన బాధ్యతను పార్టీ ఇన్‌చార్జీలకు అప్పగించారు. 449 జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు... గతనెల 6, 10, 14 తేదీల్లో మూడు విడతల్లో రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో (హైదరాబాద్ జిల్లాను మినహాయించి) 538 జిల్లా, 5,816 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 4న ఫలితాలు విడుదల కాగా.. టీఆర్ఎస్ 449, కాంగ్రెస్ 75, బీజేపీ 8, ఇతరులు ఆరు జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందారు. కరీంనగర్, గద్వాల, మహబూబ్‌నగర్, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పరిధిలో టీఆర్ఎస్ అన్ని జెడ్పీటీసీ స్థానాలను క్లీన్‌స్వీప్ చేసింది. ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, మేడ్చల్, ములుగు జిల్లాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్కో జెడ్పీటీసీ స్థానంలో మాత్రమే గెలుపొందగా, మిగిలిన స్థానాలన్నీ టీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. -
436 మండల పీఠాలపై గులాబీ జెండా
సాక్షి, హైదరాబాద్: మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 436 మండల పీఠాలను గెలుచుకుని సత్తా చాటింది. 6 జిల్లాల్లో ఎంపీపీలన్నిం టినీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ పార్టీ 12 జిల్లాల్లో ఖాతాయే తెరవలేదు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలో 538 ఎంపీపీలు ఉండగా.. 537 చోట్ల ఎన్నికలు జరిగాయి. భద్రాద్రి జిల్లాలోని ఒక మండలంలో ఎన్నిక జరగలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం 537 ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 436 ఎంపీపీలను టీఆర్ఎస్ గెలుచుకోగా.. కాంగ్రెస్ పార్టీ 53 చోట్ల విజయం సాధించింది. ఇక బీజేపీ కేవలం 8 ఎంపీపీలతో సరిపెట్టు కోగా.. ఇతరులు (స్వతంత్రులు) 7 ఎంపీపీల్లో గెలుపొందారు. సీపీఐ, సీపీఎం ఒక్క ఎంపీపీనీ గెలుచుకోలేకపోయాయి. 33 ఎంపీపీల్లో కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొన్నిచోట్ల స్వతంత్రంగా గెలిచిన ఎంపీటీసీలు మద్దతు తెలపడంతో ఆయా ఎంపీపీలు అధికార పార్టీ వశమయ్యా యి. ఈ సందర్భంగా పలువురు ఇండిపెండెంట్లు టీఆర్ఎస్లో చేరినట్టు సమాచారం. ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్‌లోని ఒకట్రెండు మండలాలు, ఇతర జిల్లాలోని మరికొన్ని చోట్ల మండల అధ్యక్ష పదవుల కోసం టీఆర్ఎస్లోని గ్రూపుల మధ్య పోటీ నెలకొనడంతో అక్కడక్కడా ఘర్షణపూర్వక వాతావరణం ఏర్పడింది. కొన్నిచోట్ల ఈ పరిణామాలు స్వల్ప ఉద్రిక్తతలకు దారితీశాయి. తొలుత కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహించి, తర్వాత ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియను కొనసాగించారు. అధిక మండలాల్లో టీఆర్ఎస్కి మెజార్టీ ఉండటంతో ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఎంపీపీ పదవులు చేజిక్కించుకున్న చోట్ల అధికార పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకొన్నాయి. -
‘కుర్చీ’ కమల్‌కే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా లింగాల కమల్రాజుకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అధికారికంగా ఆయన పేరును శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈనెల 8వ తేదీన జెడ్పీ చైర్మన్ పదవికి ఎన్నిక ఉండడంతో పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మెజార్టీ స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్కు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి సునాయాసంగా లభించే అవకాశం ఏర్పడింది. మొత్తం 20 జెడ్పీటీసీలకుగాను.. 17 జెడ్పీటీసీలను ఆ పార్టీ గెలుపొందింది. దీంతో జెడ్పీ చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై టీఆర్ఎస్ అధినేత జిల్లా నేతలతో చర్చించి.. కమల్‌రాజు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక జిల్లాస్థాయిలో చైర్మన్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన వైస్ చైర్మన్ పదవిపై మాత్రం నెలకొన్న పీటముడి ఇంకా వీడలేదు. వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని వైస్ చైర్మన్ పదవికి అభ్యర్థిని ఖరారు చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పలు సామాజిక వర్గాల నుంచి టీఆర్ఎస్ తరఫున జెడ్పీటీసీలుగా ఎన్నికైన వారిలో అనేక మంది ఈ పదవిని ఆశిస్తుండడంతో పేరును ఖరారు చేయడానికి పార్టీ పలు కోణాల్లో కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైస్ చైర్మన్ పదవితోపాటు రెండు కోఆప్షన్ సభ్యుల పదవులకు సైతం అదేరోజు ఎన్నిక జరుగుతుండడంతో ఆ పేర్లను సైతం ఖరారు చేయాల్సి ఉంది. ‘వైస్’పై ఆలోచన.. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ కావడంతో.. వైస్ చైర్మన్ పదవిని మహిళలకు కేటాయించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి గెలిచిన జెడ్పీటీసీల్లో ఒకరిని వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి జెడ్పీటీసీగా గెలుపొంది.. ఉద్యమ నేపథ్యం కలిగి.. బీసీ వర్గానికి చెందిన ధనలక్ష్మి అభ్యర్థిత్వం వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వైస్ చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించడంతోపాటు మహిళను ఎంపిక చేసినట్లు అవుతుందనే దానిపై పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే పెనుబల్లి జెడ్పీటీసీ, బీసీ వర్గానికి చెందిన చక్కిలాల మోహన్‌రావు పేరును సైతం పార్టీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జెడ్పీ చైర్మన్ పదవికి మధిర నియోజకవర్గం నుంచి గెలుపొందిన మధిర జెడ్పీటీసీ లింగాల కమల్‌రాజును ఎంపిక చేయాలని నిర్ణయించిన అధిష్టానం.. వైస్ చైర్మన్ పదవికి ధనలక్ష్మి పేరు పరిశీలనలో ఉండడంతో ఇక రెండు కోఆప్షన్ పదవుల్లో సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైస్ చైర్మన్ పదవి కోసం అనేక మంది జెడ్పీటీసీలు గట్టిగా పట్టుపట్టడమే కాకుండా.. తమ అభీష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం ముఖ్య నేతల ద్వారా అధిష్టానాన్ని ఒప్పించే పనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఖమ్మం జిల్లా పరిషత్‌లో అంతర్భాగంగా ఉండి.. కొత్త జిల్లా పరి షత్గా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందనే అంశం సామాజిక సమీకరణాల ఆధారంగా ఖమ్మం జెడ్పీ వైస్ చైర్మన్ పదవి ఖరారు వ్యవహారంతో ముడిపడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లాలోని 20 మండల ప్రజా పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల కోసం ఈనెల 7వ తేదీన అధికారులు ఆయా మండల కార్యాలయాల్లో ఎన్నికను నిర్వహించనున్నారు. మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నా.. కొన్నిచోట్ల ఎంపీపీ పదవులు ఎవరిని వరించాలన్నా స్వతంత్ర అభ్యర్థులదే కీలక నిర్ణయంగా మారే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ జిల్లా లోని వివిధ మండలాల్లో తమకు గల బలాబలాల ఆధారంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యులను గెలుచుకునేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందించింది. -
పరిషత్ పీఠాలు ఎవరివో తేలేది నేడే
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో తదుపరి ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలతోపాటు జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీ) చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం ఎంపీపీ కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలతోపాటు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. శనివారం జెడ్పీ కోఆప్టెడ్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఫలితాలను అధికారులు అప్పటికప్పుడు ప్రకటిస్తారు. జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించినందున ఎస్ఈసీ ప్రమేయం లేకుండానే ఎంపీపీల ఫలితాలను మండలాల్లో, జెడ్పీల ఫలితాలను జిల్లాల్లో వెంటనే వెలువరిస్తారు. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జెడ్పీ, ఎంపీపీ పదవులకు పరోక్ష పద్ధతుల్లో ఎన్నుకునే విధానం ఉండేది. అయితే, ఫలితాల వెల్లడి తర్వాత బేరసారాల నివారణ చర్యల్లో భాగంగా పరిషత్ పదవుల ఎన్నికకు ఎక్కువ వ్యవధి లేకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు రావడంతో ఈ ఆనవాయితీ మారింది. ఎంపీ టీసీ, జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణం చేయకుం డానే ఎంపీపీ అధ్యక్ష, జెడ్పీ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. ఇలా ప్రమాణం చేయకుం డానే అధ్యక్ష, చైర్పర్సన్లను ఎన్నుకోవడం పంచాయతీరాజ్ చరిత్రలో ఇదే తొలిసారి. ఎన్నికల ప్రక్రియ ఇలా... ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రతి మండలానికీ సదరు మండల ఎంపీడీవోను పర్యవేక్షణ అధికారిగా నియమించారు. ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తారు. సాయంత్రం 5 గంటల్లోగా ఎంపీపీ కోఆప్టెడ్, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తికానున్నాయి. ఎంపీపీ కోఆప్టెడ్, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల కోసం ఉద్దేశించిన ప్రత్యేక సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమవుతుంది. తొలుత కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. ఇందుకోసం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఒకే నామినేషన్ దాఖలైతే ఆ అభ్యర్థి ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఒకటికి మించి నామినేషన్లు వస్తే మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ఎన్నిక నిర్వహిస్తారు. ఇది ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. అనంతరం ఎంపీపీ ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు. ఈ ఎన్నికలన్నీ కోరం ఉంటేనే నిర్వహిస్తారు. సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే వీటిని నిర్వహిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల ప్రకారం పిలిచి చేతులు ఎత్తే పద్ధతిలో సభ్యులతో ఓట్లు వేయిస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చినవారిని ఎన్నికైనట్టుగా ప్రిసైడింగ్ అధికారి ప్రకటిస్తారు. ఒకవేళ బరిలో ఉన్నవారందరికీ సమానమైన ఓట్లు వస్తే లాటరీ పద్దతిలో విజేతను ప్రకటిస్తారు. శనివారం జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు కూడా ఇదే తరహాలో నిర్వహిస్తారు. కోఆప్టెడ్ పూర్తి కాకపోతే అధ్యక్ష ఎన్నికలు ఉండవు... ఒకవేళ ఏదైనా కారణంతో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక పూర్తి కాకపోతే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగవు. ఈ విషయాన్ని ఎస్ఈసీకి తెలియజేస్తే ఈ ఎన్నికల నిర్వహణకు మరో తేదీని ప్రకటిస్తుంది. కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు రాజకీయ పార్టీలు విప్ జారీ చేసే అవకాశం లేదు. అయితే కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక పూర్తయి ఎంపీపీ పదవులకు ఎన్నిక జరగకపోతే ఆ మరుసటి రోజే ఆ పదవులకు ఎన్నికలు నిర్వహించవచ్చు. ఒకవేళ ఆ రోజు కూడా ఎన్నిక పూర్తి కాకపోతే మరో తేదీని ఎస్ఈసీ ప్రకటిస్తుంది. స్ఈసీ నిర్ణయించిన తేదీన నిర్వహించే ఎన్నికలకు కోరం లేకపోయినా ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవచ్చు. కాగా, తాము నియమించిన విప్‌లను మార్చే అవకాశం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కల్పించారు. అయితే ప్రత్యేక సమావేశానికి ఒకరోజు ముందు ఉదయం 11 గంటలలోపు ప్రిసైడింగ్ అధికారులకు ఆ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను మారుస్తున్నట్టు గతంలో ఇచ్చిన వ్యక్తే మరోసారి లేఖ ఇవ్వాలి. దీనిపై ప్రిసైడింగ్ అధికారి సంతృప్తి చెందితే అందుకు అనుమతిస్తారు. జులైలోనే బాధ్యతల స్వీకరణ... పాత పాలక మండళ్ల పదవీకాలం ఇంకా ముగియనందున కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, శుక్రవారం ఎన్నికయ్యే ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, శనివారం ఎన్నికయ్యే జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవీకాలం వచ్చేనెల మొదటివారంలో మొదలు కానుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపీటీసీల పదవీ కాలం జూలై 3 వరకు, జెడ్పీటీసీల పదవీకాలం జులై 4 వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఆయా తేదీల తర్వాతే కొత్త పరిషత్ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టు 5 తర్వాత ఎంపీపీ, ఆగస్టు 6 తర్వాత కొత్త జెడ్పీ చైర్పర్సన్లు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. -
నీకా..నాకా!?
సాక్షి, జనగామ: జిల్లాలోని జెడ్పీటీసీ స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్వీన్‌స్వీప్ చేసింది. 12 స్థానాల్లోను 12 చోట్లా తిరుగులేని మెజార్టీతో విజయం సాధించింది. ప్రతిపక్షమే లేకుండా గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు గెలుపొందిన అభ్యర్థుల్లో జెడ్పీ చైర్మన్ ఎవరనేది ఆసక్తిగా మారుతోంది. జెడ్పీ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించారు. విజయం సాధించిన వారిలో చాన్స్ ఎవరి దక్కుతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. గుడి, పాగాల మధ్య తీవ్ర పోటీ జెడ్పీటీసీలుగా గెలుపొందిన సభ్యుల్లో లింగాల ఘనపురం నుంచి విజయం సాధించిన గుడి వంశీధర్‌రెడ్డి, చిల్పూర్ మండలం నుంచి విజయం సాధించిన పాగాల సంపత్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొన్నది. ఇద్దరు జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. మొదటి నుంచి జెడ్పీ చైర్మన్ స్థానంపై ఆశలు పెట్టుకొని జెడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దిగారు. పోటీ చేసిన ఇద్దరు విజయం సాధించడంతో చైర్మన్ కూర్చీ పోటీ పడుతున్నారు. జనరల్ స్థానం కావడంతో ఇద్దరిలో ఒక్కరికే అవకాశం దక్కే అవకాశం ఉంది. చివరి నిమిషంలో ఏమైన సమీకరణలు మారితే మహిళలకు చైర్మన్ పదవిని కట్టబెట్టే అవకాశాలున్నాయి. మహిళలకు చాన్స్ వస్తే తరిగొప్పుల నుంచి గెలుపొందిన ముద్దసాని పద్మజారెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. వంశీధర్‌కు అధిష్టానం ఆశీస్సులు రఘునాథపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ గుడి వంశీధర్‌రెడ్డికి పార్టీ అధిష్టానం ఆశీస్సులున్నాయి. కేటీఆర్ ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతోపాటు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు గ్రామాలను ఏకగ్రీవం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. మాదారం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. అయితే సొంత మండలం రఘునాథపల్లిలో రిజర్వేషన్ కలిసి రాక పోవడంతో లింగాల ఘనపురం నుంచి జెడ్పీటీసీ బరిలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు. వంశీధర్‌రెడ్డి తరుఫున స్వయంగా మంత్రి దయాకర్‌రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి దయాకర్‌రావు అండదండలతోపాటు పార్టీ పెద్దల సపోర్టు ఉండడంతో జెడ్పీ చైర్మన్ వంశీధర్‌రెడ్డికే దక్కే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రాదేశిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే చైర్మన్ రేసులో యువనేత ఉండడం విశేషం. ఉద్యమకారుడిగా సంపత్‌రెడ్డి చిల్పూర్ మండలం నుంచి గెలుపొందిన పాగాల సంపత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉంది. 2001 నుంచి పార్టీలో పని చేస్తున్నారు. ఉమ్మడి స్టేషన్ ఘన్పూర్ మండల అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం రైతు సమన్వయ సమితి నియోజకవర్గ కో కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేతోపాటు ఎన్నికల ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ నేతలతో సంబంధాలున్నాయి. చిల్పూర్ జనరల్ స్థానం నుంచి గెలుపొందడంతో చైర్మన్ రేసులో సంపత్‌రెడ్డి ఉన్నారు. ఘన్పూర్ కోటాలోనే చైర్మన్.. జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచే జెడ్పీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. జనగామ నుంచి రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ పదవి ఇచ్చారు. ఇక స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచే జెడ్పీ చైర్మన్ పదవిని ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో లింగాల ఘనపురం, చిల్పూర్ మండలాలు ఘన్పూర్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ రెండు మండలాల నుంచి గెలుపొందిన వంశీధర్‌రెడ్డి, పాగాల సంపత్‌రెడ్డిలో ఒక్కరికి చాన్స్ దక్కే అవకాశం ఉంది. నేడో రేపో చైర్మన్ అభ్యర్థిని పార్టీ నేతలు ప్రకటించే అవకాశం ఉంది. -
జెడ్పీ చైర్‌పర్సన్‌గా దఫేదార్ శోభ!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి నిజాంసాగర్ జెడ్పీటీసీ సభ్యురాలు దఫేదార్ శోభ పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత జెడ్పీటీసీ సభ్యులను హైదరాబాద్‌కు తరలించారు. జిల్లాలో 22 జెడ్పీటీసీలకుగాను టీఆర్ఎస్ పార్టీనుంచి 14 మంది సభ్యులు విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీకి చెందిన వారే జెడ్పీ చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులు పొందనున్నారు. జెడ్పీ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కాగా, ప్రస్తుత జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు భార్య శోభ నిజాంసాగర్ నుంచి గెలుపొందడంతో ఆమెను జెడ్పీ చైర్మన్‌గా ఎంపిక చేశారు. వైస్ చైర్మన్‌గా.. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవిని కామారెడ్డి నియోజక వర్గానికి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీ అధిష్టానాన్ని కోరారని సమాచారం. తనకు మొదటి నుంచి ముఖ్య అనుచరుడిగా ఉన్న మాచారెడ్డి జెడ్పీటీసీ సభ్యుడు మిన్కూరి రాంరెడ్డి పేరును సూచించినట్లు తెలిసింది. బీబీపేట జెడ్పీటీసీ సభ్యుడు ప్రేమ్‌కుమార్ కూడా వైస్‌చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. మిన్కూరి రాంరెడ్డికే వైస్ చైర్మన్ పదవి దక్కుతుందని భావిస్తున్నారు. -
అధినేత ఆశీస్సులెవరికో?
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అధినేత కేసీఆర్ సూచించిన వారికే జెడ్పీ చైర్మన్ పదవి దక్కనుండటంతో సీఎం ఆశీస్సులు ఎవరికి ఉంటాయనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమాతో ఉంది. మొత్తం 27 జెడ్పీటీసీ స్థానాలుండగా, ఇప్పటికే మాక్లూర్ జెడ్పీటీసీ స్థానాన్ని టీఆర్ఎస్ ఏకగ్రీవంగా దక్కించుకుంది. మిగిలిన 26 స్థానాలకు ఎన్నికలు జరగగా, మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. అయితే జెడ్పీ చైర్మన్ రేసులో నలుగురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన దాదన్నగారి విఠల్‌రావు, ఇందల్వాయి జెడ్పీటీసీగా బరిలో నిలిచిన జెడ్పీవైస్ చైర్పర్సన్ సుమన రవిరెడ్డి, ధర్పల్లి జెడ్పీటీసీగా పోటీ చేసిన బాజిరెడ్డి జగన్, బోధన్ జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన గిర్దావార్ లక్ష్మి పేర్లు తెరపైకి వచ్చాయి. నేడు వెలువడనున్న ఫలితాలను బట్టి గెలుపొందిన వారిలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చైర్మన్ అభ్యర్థి ఎంపిక జరుగుతుంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు చైర్మన్ ఎన్నికపై సంకేతాలు అందాయి. విజయం సాధించిన జెడ్పీటీసీలతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సమావేశం అయ్యే అవకాశాలున్నాయి. చైర్మన్‌తో పాటు, జెడ్పీ వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు అన్నీ అధిష్టానం సూచనల మేరకు జరగనున్నాయి. క్యాంపు రాజకీయాలకు అవకాశం..? చైర్మన్ పీఠంపై కాంగ్రెస్, బీజేపీలు కూడా ఆశలు పెట్టుకున్నాయి. అవకాశం వస్తే గెలుపొందే ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి పీఠం దక్కించుకునే యోచనలో ఆ పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏకపక్షంగా ఉన్నట్లయితే క్యాంపులకు అవకాశం ఉండదు. కానీ ఆయా పార్టీలకు మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త అటు ఇటుగా ఫలితాలు వచ్చిన పక్షంలో క్యాంపు రాజకీయాలకు తెరలేవనుంది. మొత్తం ఇప్పటికే జెడ్పీటీసీ అభ్యర్థులు సోమవారం నగరంలోని పలు హోటళ్లలో బస చేశారు. మొత్తం 27 జెడ్పీటీసీ స్థానాలుండగా, చైర్మన్ పీఠం దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 14 జెడ్పీటీసీ స్థానాలు గెలవాల్సి ఉంది. అంటే చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థికి 13 మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారుల ముందు జాగ్రత్త.. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఈనెల 8న, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక ఈనెల 7న నిర్వహించనున్నారు. మధ్యలో మూడు, నాలుగు రోజులే సమయం ఉంటుంది. విజయం సాధించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు క్యాంపునకు తరలివెళ్లే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. విజయం సాధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు చైర్మన్, ఎంపీపీ ఎన్నికకు సంబంధించిన నోటీసులు ఇచ్చాకే.., వారు గెలుపొందినట్లు సర్టిఫికేట్ ఇవ్వాలనే యోచనలో అధికారులు ఉన్నారు. లేనిపక్షంలో వారు క్యాంపునకు తరలివెళితే నోటీసులు ఇవ్వడం ఇబ్బందిగా మారనుండటంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. సమన్వయ బాధ్యతలు మంత్రికి.. జెడ్పీ చైర్మన్ ఎంపిక ప్రక్రియ సమన్వయ బా ధ్యతలను జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. రాష్ట్రంలో అన్ని జెడ్పీలను కైవ సం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్న ఆ పార్టీ ఈ మేరకు ఒక్కో జిల్లాకు ఒక్కో ఇన్చార్జిని ని యమించింది. ఇన్చార్జులను ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. అధిష్టానం నిర్ణయించే వారిని చైర్మన్‌గా గెలిపించుకునేందుకు మిగితా జెడ్పీటీసీలను సమన్వయం చేసే బాధ్యతలను ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. -
గుంపుతో ‘క్యాంపు’!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల పదవుల ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందే ప్రధాన పార్టీలన్నింటా క్యాంపు రాజకీయాల బెడద మొదలైంది. ఫలితాలు వెలువడ్డాక.. గెలిచిన సభ్యులను ఎలా కాపాడుకోవాలి? ప్రత్యర్థులను ఎలా చిత్తు చేయాలి? చేతులెత్తే పద్ధతిన జరిగే జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్ష పదవులనెలా కైవశం చేసుకోవాలి.. మెజారిటీ బలాన్ని నిరూపించుకునేందుకు ఎవరికి వల వేయాలి? ఏమేం ఎర వేయాలి? అందరి నోటా ఇదే చర్చ జరుగుతోంది. నేటి సాయంత్రానికల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 71 జెడ్పీటీసీ, 780 ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. అనంతరం మండలాల్లో.. గ్రామాల్లో కొలువుదీరే విజేతలెవరో తేలిపోనుంది. అలాగే ఈనెల 7న ఎంపీపీ, 8న జెడ్పీ చైర్మన్ల ఎంపికకు ముహూర్తమూ ఖరారైంది. దీంతో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జెడ్పీ చైర్మన్ గిరీలతో పాటు ఎంపీపీ పీఠాలు ఎవరు కైవసం చేసుకుంటారో అనే చర్చ ఇప్పట్నుంచే మొదలైంది. క్యాంపునకు తరలించే యోచన ప్రాదేశిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు చేజారకుండా వారిని క్యాంపులకు తరలించే యోచనలో పార్టీలున్నాయి. సాధారణంగా అన్ని చోట్ల ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీ అక్కడి ఎంపీపీ.. జెడ్పీ చైర్మన్, చైర్పర్సన్ పీఠాన్ని కైవశం చేసుకునే అవకాశముంది. కానీ అనిశ్చిత బలబలాలతో హంగ్ లాంటి పరిస్థితి ఉత్పన్నమైతే.. చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితమే. ఒకటీ రెండు ఓట్లు తారుమారైతే.. ఎవరైనా లోపాయకారీగా ప్రత్యర్థి పార్టీలకు మొగ్గు చూపితే.. ఎన్నిక జరిగే సమయానికి ఎవరైనా గైర్హాజరైనా.. ఫలితం తారుమారయ్యే పరిస్థితి నెలకొంటుంది. గెలిచే మేజిక్ ఫిగర్‌కు ఒక ఓటు అటు ఇటయినా.. ఫలితం చేజారిపోవటం ఖాయం. అందుకే ప్రధాన పార్టీలతోపాటు చైర్మన్ గిరీ రేసులో ఉన్న అభ్యర్థులకు రాబోయే ఎన్నిక సవాలుగా మారుతుంది. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలు కావటంతో విప్ జారీ చేసే అవకాశం లేకపోలేదు. అందుకే తమకున్న బలగాన్ని చైర్మన్ ఎన్నిక జరిగే వరకు భద్రంగా కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ఇప్పట్నుంచే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తమ సభ్యులతో పాటు అవసరమైన ఓట్ల మేరకు మిగతా వారితో బేరసారాలాడి ఎన్నిక నాటి వరకు ఎక్కడికైనా తరలించే క్యాంపు రాజకీయాలపై దృషి సారించాయి. ఫలితాలు వెలువడిన వెంటనే బేరసారాలు చేసుకుని రహస్యంగా శిబిరాలకు తరలించేందుకు నాయకులు మొగ్గు చూపుతున్నారు. మండలాల్లో ఈ క్యాంపు రాజకీయాలు మరింత జోరుగా సాగే అవకాశముంది. అన్నిచోట్ల ఎంపీటీసీలుగా గెలిచే సభ్యులకు ఎంతో కొంత ముట్టజెప్పి ఎంపీపీ పదవులను తమ వశం చేసుకునేందుకు అన్ని పార్టీల నాయకులు కాచుక్కూచున్నారు. అందుకే ఫలితాలు వెలువడిన వెంటనే ఎంపీటీసీ సభ్యులను విహారయాత్రల పేరుతో క్యాంపులకు తీసుకెళ్లే ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. పార్టీ ఆఫీసుల్లో సమావేశాల పేరిట గెలిచిన ఎంపీటీసీ సభ్యులందరినీ ఇతర ప్రాంతాలకు తరలించాలని ఒక ప్రధాన పార్టీ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సొంత పార్టీ సభ్యులు క్యాంపుల దారి పట్టకుండా ఉండేందుకు విప్ జారీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. పదవిని అందుకోవాలని ఎంపీపీ రేసులో ఉన్న అభ్యర్థులు తమ శక్తియుక్తులతోపాటు డబ్బులు కుమ్మరించేందుకు సిద్ధపడగా.. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు సైతం ఎక్కువ ఎంపీపీ స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలని ఎత్తుగడలు వేస్తుండటంతో క్యాంపులు ఎన్ని రూట్లు మారుతాయోననే చర్చ జరుగుతోంది. రంగంలో ఇన్‌చార్జ్‌లు ప్రాదేశిక ఎన్నికల ఫలితాల తర్వాత గెలుపొందిన అభ్యర్థులు చేజారకుండా ఉండేందుకు అన్ని పార్టీలు శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఇన్‌చార్జీగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు నియమించారు. అలాగే జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని, నాగర్‌కర్నూల్ జిల్లాకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని నియమించారు. ఇటు కాంగ్రెస్ సైతం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డిని, నాగర్‌కర్నూల్ జిల్లాకు మల్లు రవిని, వనపర్తి జిల్లాకు మాజీ మంత్రి చిన్నారెడ్డిని, జోగుళాంబ గద్వాలకు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను నియమించింది. ఇక బీజేపీ నుంచి గెలుపొందిన అభ్యర్థులు క్యాంపులకు తరలివెళ్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆ పార్టీ నాయకులు డి.కె.అరుణ, మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయి పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. -
7న ఎంపీపీ.. 8న జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జూన్ 7న.. జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీపీ) చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు 8న జరగనున్నాయి. ఎంపీపీ ఎన్నికల రోజే మండల కోఆప్షన్, జెడ్పీపీ ఎన్నికల రోజున జిల్లా పరిషత్ కోఆప్షన్ ఎన్నికలూ పూర్తికానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి బుధవారం నోటిఫికేషన్, షెడ్యూల్ జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించి, అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలో మొత్తం 539 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. న్యాయపరమైన అంశాలతో ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. 5,857 ఎంపీటీసీ స్థానాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ ఎంపీపీ పరిధిలోని 11 ఎంపీటీసీలు, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎంపీపీ పరిధిలోని 15 ఎంపీటీసీలు, ములుగు జిల్లా మంగపేటలోని 14 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగలేదు. మొత్తమ్మీద రాష్ట్రవ్యాప్తంగా 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. వాటిలో 4 జెడ్పీటీసీలు, 158 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 534 జెడ్పీటీసీ, 5,659 ఎంపీ టీసీ స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది. కొత్త గా జరిగిన జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా పాత 9 జిల్లాల స్థానంలో(హైదరాబాద్ మినహాయించి) 32 కొత్త జిల్లాల్లోని జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, 538 ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంది. 6న ఎంపీపీ అధ్యక్షుల ఎన్నిక నోటిఫికేషన్... జూన్ 7న ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణకు 6వ తేదీన మండలాల్లోని రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. జూన్ 7న ఉదయం 10 గంటల వరకు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల పదవి కోసం పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాటిని పరిశీలించి, చెల్లుబాటయ్యే నామినేషన్లను ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అనంతరం చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. ఒకవేళ కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరగకపోతే, ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. కోఆప్షన్ సభ్యులను ఎన్నికైన సభ్యుడు ప్రతిపాదించాలి. ఒకే సభ్యుడు రెండు పేర్లను ప్రతిపాదిస్తే ఆ నామినేషన్ తిరస్కరిస్తారు. ఒక్కరే పోటీలో ఉంటే ఏకగ్రీవమైనట్టు ప్రకటిస్తారు. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇద్దరు సభ్యులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్ష, ఉపాధ్య ఎన్నిక ఉంటుంది. మొదట ఎంపీపీ అధ్యక్షుడి కోసం పరోక్ష ఎన్నిక నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎంపీపీ ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎన్నికైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేసిన తర్వాత ఎన్నికలు ముగిసినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. 7న జెడ్పీపీ చైర్పర్సన్ల ఎన్నిక నోటిఫికేషన్... జూన్ 8న నిర్వహించే జెడ్పీపీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం జూన్ 7న జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎంపీపీ అధ్యక్ష ఎన్నికల తరహాలోనే జూన్ 8న ఉదయం 10 గంటల వరకు జెడ్పీపీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల పదవులకు పోటీపడే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాటిని పరిశీలించిన తర్వాత చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించి, ఆ తర్వాత ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. ముందుగా జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీపీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఎన్నికైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేసి ఎన్నిక ప్రక్రియ ముగిస్తారు. ఏదైనా కారణంతో ఎంపీపీ అధ్యక్ష, జెడ్పీపీపీ చైర్పర్సన్ల ఎన్నికలు వాయిదాపడితే, మరుసటిరోజున వాటిని నిర్వహించాలి. రెండోసారి కూడా వాయిదాపడితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలి. -
జెడ్పీలపై టీఆర్ఎస్ నజర్
హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో పాగా వేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యం పెట్టుకుంది. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్‌లు, 538 మండల పరిషత్ అధ్యక్ష పదవులను కైవసం చేసే ఉద్దేశంతో వ్యూహం రచిస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని టీఆర్ఎస్ ధీమాతో ఉంది. అనంతరం అన్ని జెడ్పీ, ఎంపీపీలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తోంది. ఎంపీపీలను గెలుచుకునే బాధ్యతను ఎమ్మెల్యేలకు, జెడ్పీలు గెలిచే బాధ్యతను ఉమ్మడి జిల్లాల మంత్రులకు అప్పగించింది. ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయంతో పని చేసి అన్ని పదవులను టీఆర్ఎస్ గెలుచుకునేలా వ్యవహరించాలని అధిష్టానం సూచించింది. అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రుల ఆధ్వర్యంలో ఆయా ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం నిర్ణయించిన వారికి జెడ్పీ చైర్పర్సన్ పదవి దక్కేలా, ఈ ఎన్నిక వ్యవహారాన్ని సాఫీగా పూర్తి చేసేందుకు ప్రతీ జిల్లాకు పార్టీ తరఫున ఓ ఇన్చార్జీని నియమిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆరు జిల్లాలకు పార్టీ తరఫున ప్రత్యేకంగాఇన్చార్జీలను నియమించారు. మిగిలిన జిల్లాలకు ఇదే విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలోని ఎంపీటీసీలను సమన్వయపరిచాలని కేటీఆర్ ఆదేశించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరుఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి బాధ్యత అప్పగించారు. అలాగే గెలిచిన జెడ్పీటీసీలను వెంటనే మంత్రులు సమన్వయం చేసి జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక సాఫీగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో 5,817 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 158 ఎంపీటీసీ స్థానాలు, 4 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 4 జెడ్పీటీసీ స్థానాలను, 152 ఎంపీటీసీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. పోలింగ్ జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు జూన్ 4 వెల్లడికానున్నాయి. ఫలితాలు వచ్చిన వెంటనే నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలను సమన్వయం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే మంత్రుల ఆధ్వర్యంలో జెడ్పీటీసీ సభ్యుల సమన్వయ ప్రక్రియ జరగనుంది. వరంగల్, మహబూబాబాద్ నేతలకు కేటీఆర్ అభినందనలు... లోక్‌సభ ఎన్నికల్లో బాగా పని చేశారని ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. వరంగల్ లోక్‌సభలో పసునూరి దయాకర్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారని, మహబూబాబాద్‌లో మాలోతు కవిత మంచి ఆధిక్యంతో గెలిచారని అన్నారు. ఈ స్థానాల ఇన్‌చార్జీగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్యేలతో సమన్వయంతో పని చేయడం వల్లే టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారన్నారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులు పసునూరి దయాకర్, మాలోతు కవిత, రాజ్యసభ సభ్యుడు గుండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యానాయక్, టి.రాజయ్య, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, బి.శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోతు హరిప్రియ, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బి.వెంకటేశ్వర్లు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్, మాజీ ఎంపీ సీతారాంనాయక్ తదితరులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించేలా అంతా సమన్వయంతో పని చేయాలని కేటీఆర్ ఆదేశించారు. అన్ని జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ పదవులు టీఆర్ఎస్ వారే ఎన్నికయ్యేలా వ్యూహం అమలు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికలకు ఇన్చార్జీలను నియమించారు. వరంగల్ అర్భన్–గుండా ప్రకాశ్‌రావు/దాస్యం వినయభాస్కర్, వరంగల్ రూరల్–పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జనగామ–బోడికుంటి వెంకటేశ్వర్లు, మహబూబాబాద్–నాగుర్ల వెంకటేశ్వర్లు, ములుగు–నన్నపునేని నరేందర్, భూపాలపల్లి–బండా ప్రకాశ్‌ను ఇన్‌చార్జీలుగా నియమించినట్లు టీఆర్ఎస్ ప్రకటన జారీ చేసింది. జెడ్పీలపై అధిష్టాన నిర్ణయం... మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ఆయా ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే పూర్తి చేసుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించింది. ఎమ్మెల్యేల అభీష్టం మేరకు ఎంపీపీ పదవులను భర్తీ చేయాలని మంత్రులకు స్పష్టం చేసింది. జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులపై అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. జిల్లాల వారీగా రిజర్వేషన్లను పరిశీలించి రాష్ట్రం యూనిట్‌గా జెడ్పీ చైర్పర్సన్ పదవులకు అభ్యర్థులను నిర్ణయించనున్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక రోజున టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం మంత్రులకు సమాచారం ఇవ్వనుంది. దీనికి అనుగుణంగా జిల్లాల్లో ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని అధిష్టానం ఆదేశాలిచ్చింది. -
జిల్లా పరిషత్ చివరి సమావేశం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. నేడు నిర్వహించ తలపెట్టిన సమావేశం జరిగేలా లేదు. కోరం లేక వాయిదా పడే అవకాశమే కనిపిస్తోంది. ప్రస్తుత పాలక వర్గం పదవీకాలం జూలై మొదటి వారం వరకు ఉంది. అంటే మరో రెండు నెలల లోపు ఈ పాలకవర్గం పదవీకాలం ముగుస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించాలని జెడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు నిర్ణయించారు. కాగా సమావేశానికి సభ్యులు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో అభివృద్ధి పనులకు సంబంధించి తీర్మానాలు చేయరాదు. అలాగే పాలకవర్గం కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు వీలు లేదు. దీంతో సమావేశానికి సభ్యుల çహాజరు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం జెడ్పీటీసీలుగా ఉన్న వారు, ఎంపీపీలుగా కొనసాగుతున్న వారు ఎన్నికల్లో పోటీ చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ఇటీవలే ముగిసింది. ఈ నేపథ్యంలో సభ్యులు కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశాలు లేవు. దీంతో సమావేశం వచ్చే నెలకు వాయిదా పడే అవకాశాలున్నట్లు సభ్యులు అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికల పనుల్లో అధికారులు బిజీ.. మరోవైపు వరుస ఎన్నికల పనుల్లో జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం బిజీగా ఉంది. ‘పరిషత్’ ఎన్నికల పోలింగ్ ఇటీవలే ముగిసింది. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సమయం కూడా దగ్గర పడుతోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో జెడ్పీ సమావేశానికి జిల్లా ఉన్నతాధికారులు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సమావేశం నిర్వహించి, సమస్యలపై చర్చించే క్రమంలో సమాధానాలు ఇవ్వాల్సిన అధికారులు లేకపోతే ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో సర్వసభ్య సమావేశం వచ్చే నెలలో నిర్వహించన్నట్లు తెలుస్తోంది. సాధారణ నిధులపై తీర్మానాలు జిల్లా పరిషత్ నిధులతో వివిధ అభి వృద్ధి పనులు చేపట్టేందుకు తీర్మానాలు చేయాలని పాలకవర్గం భావిస్తోంది. జెడ్పీలో ప్రస్తుతం సాధారణ నిధులు అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులతో తాగునీటి ఎద్దడి నెలకొన్న ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం కల్పన, చిన్న రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని పాలకవర్గం భావిస్తోంది. ఈ పనులు మంజూరు కావాలంటే జెడ్పీ సభ్యులు తీర్మానం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండటంతో వచ్చే నెలలోనే తీర్మానాలు చేయాల్సి వస్తోంది. -
అందరికీ అవకాశం
సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ప్రస్థానం ఈ ప్రాదేశిక ఎన్నికల అనంతరం ముగిసిపోనుంది. 1959లో ఏర్పాటైన జెడ్పీ అరవై సంవత్సరాలు కలిసి నడిచింది. జిల్లాల విభజనతో ఉమ్మడి ఆదిలాబాద్ నాలుగు జిల్లాలుగా ఏర్పడటం, ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు జిల్లాల వారీగా ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇక ఉమ్మడి జెడ్పీ చరిత్రగా మిగిలిపోనుంది. ఉమ్మడి జెడ్పీలో ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ జిల్లాల నుంచి జెడ్పీ చైర్మన్ల ప్రాతినిధ్యం ఉంది. ప్రస్తుతం నాలుగు జిల్లాలుగా ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల నుంచి కూడా పలువురు ప్రాతినిధ్యం వహించారు. నిర్మల్ నుంచే అత్యధికం.. ఉమ్మడి గా 1959 నుంచి 2019 వరకు 19 మంది ప్రాతినిధ్యం వహించారు. మధ్యకాలంలో కాల పరిమితి ముగిసినప్పుడు ప్రత్యేక అధికారుల పాలన కూడా కొనసాగింది. స్పెషల్ ఆఫీసర్లుగా కలెక్టర్లు వ్యవహరించారు. ఈ 19 మందిలో ప్రస్తుతం నిర్మల్ జిల్లా నుంచే 11 మంది ఉండటం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో నిర్మల్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రధానంగా రాజకీయ చైతన్యం ఈ ప్రాంతంలో అధికం. ఆ తర్వాత మంచిర్యాల నుంచి ఐదుగురు, ఆదిలాబాద్ నుంచి ఇద్దరు, కుమురంభీం జిల్లా నుంచి ఒక్కరు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాకో జెడ్పీ చైర్మన్ స్థానం ఏర్పడింది. దీంతో స్థానిక నేతలకు అవకాశం లభించనుంది. కొంతమందికి ఉన్నతి.. ఉమ్మడి జెడ్పీచైర్మన్‌గా వ్యవహరించిన వారిలో కొంతమంది రాజకీయంగా ఉన్నతి సాధించారు. మరికొంత మంది ఆ పదవి తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. ఇంకొంతమంది ఇప్పటికీ ఉన్నత పదవి కోసం పోరాడుతున్నారు. మొదటి చైర్మన్ రంగారావు పల్సికర్ రాజకీయం అక్కడితోనే నిలిచిపోయింది. 1960 నుంచి 1961 వరకు జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించిన పి.నర్సారెడ్డి ముఖ్యమంత్రులు బ్రహ్మానందంరెడ్డి, వెంగల్రావుల హయాంలో రెండుసార్లు మంత్రులుగా పనిచేశారు. రెవెన్యూ మంత్రిగా ఆయన పేరు గడించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్రస్థాయిలో పదవి అలంకరించారు. ఆయనకు సోదరుడైనటువంటి పి.గంగారెడ్డి 1964 నుంచి 1967 వరకు జెడ్పీచైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచి కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. టి.మధుసూదన్‌రెడ్డి 1983 నుంచి 1985 వరకు జెడ్పీచైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన ఆ తర్వాత ఆదిలాబాద్ ఎంపీగా పనిచేశారు. మహ్మద్ సుల్తాన్‌అహ్మద్ 1985 నుంచి 1986 వరకు జెడ్పీచైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. 1987 నుంచి 1991 వరకు జెడ్పీ చైర్మన్‌గా ఉన్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం రెండోసారి కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నారు. 2006 నుంచి 2009 వరకు అధ్యక్షుడిగా ఉన్న రాథోడ్ రమేశ్ ఎమ్మెల్యే, ఎంపీగా కూడా పనిచేశారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. కొంతమంది కనుమరుగు.. జెడ్పీచైర్మన్లుగా పనిచేసిన వారిలో కొంతమంది రాజకీయంగా కనుమరుగయ్యారు. మరికొంత మంది వివిధ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. కడెంకు చెందిన జి.నారాయణరెడ్డి ఏడాదిపాటు 1967 నుంచి 1968 వరకు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయనకు రాజకీయంగా ఎలాంటి పదవులు లభించలేదు. 1991 నుంచి 1992 వరకు చైర్మన్‌గా ఉన్న చుంచు ఊశన్నది కూడా అదే పరిస్థితి. 1995 నుంచి 1996 వరకు చైర్ పర్సన్‌గా వ్యవహరించిన సుమతిరెడ్డి ఆ తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. టి.పురుషోత్తంగౌడ్ది ఇదే పరిస్థితి. చిట్యాల సుహాసిని ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓటమి చెందారు. ప్రస్తుతం బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు. లోలం శ్యామ్‌సుందర్ నిర్మల్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో చేరారు. జుట్టు అశోక్ చైర్మన్ పదవి తర్వాత ఎలాంటి ఉన్నత పదవి చేపట్టలేదు. సిడాం గణపతి ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నా చైర్మన్ పదవి తర్వాత ఎలాంటి ఉన్నతి లభించలేదు. పూర్తి కాలం కొంతమందే.. జెడ్పీచైర్మన్లుగా పూర్తికాలం కొంత మందే పదవిలో ఉన్నారు. జి.నర్సింహారెడ్డి 1970 నుంచి 1976 వరకు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 1987 నుంచి 1991 వరకు, లోలం శ్యామ్‌సుందర్ 2001 నుంచి 2006 వరకు పదవిలో ఉన్నారు. ప్రస్తుతం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న వి.శోభారాణి 2014 నుంచి పదవిలో ఉన్నారు. ఈ జూన్‌తో పదవి కాలం ముగియనుంది. జెడ్పీచైర్మన్ రిజర్వేషన్ మొదట్లో ఉండేది కాదు. ఆ తర్వాత బీసీ, ఎస్సీలకు వచ్చింది. 2014లో బీసీ (మహిళ)కు రిజర్వ్ చేశారు. అప్పట్లో టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో 52 స్థానాలకు గాను 38 ఏకపక్షంగా గెలిచింది. ఆ తర్వాత పలువురు ఇతర పార్టీల జెడ్పీటీసీలు టీఆర్ఎస్లో కలవడంతో సంపూర్ణమైంది. ఇక అప్పట్లో చైర్పర్సన్ స్థానం కోసం టీఆర్ఎస్లో నిర్మల్ జెడ్పీటీసీ వి.శోభారాణి, మంచిర్యాల జెడ్పీటీసీ ఆశాలత, నార్నూర్ జెడ్పీటీసీ రూపావతి పుష్కర్ల మధ్య పోటీ నెలకొనగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిర్మల్ జెడ్పీటీసీ వి.శోభారాణి పేరును జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఖరారు చేశారు. జిల్లాల వారీగా జెడ్పీ చైర్మన్లు.. నిర్మల్ : రంగారావు పల్సికర్, రాంచంద్రారావు అన్నాజీ, లోలం శ్యామ్‌సుందర్, జుట్టు అశోక్ (ముథోల్ నియోజకవర్గం), పి.నర్సారెడ్డి, పి.గంగారెడ్డి, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, ఎన్.సుమతిరెడ్డి, వి.శోభారాణి (నిర్మల్ నియోజకవర్గం), జి.నారాయణరెడ్డి, రాథోడ్ రమేశ్(ఖానాపూర్ నియోజకవర్గం). మంచిర్యాల: జి.నర్సింహారెడ్డి, బి.సీతాపతి, చుంచు ఊశన్న(మంచిర్యాల నియోజకవర్గం), మహ్మద్ సుల్తాన్ అహ్మద్ (చెన్నూర్ నియోజకవర్గం), టి.పురుషోత్తంగౌడ్ (బెల్లంపల్లి నియోజకవర్గం). కుమురంభీం : సిడాం గణపతి (సిర్పూర్ నియోజకవర్గం). ఆదిలాబాద్ : టి.మధుసూదన్‌రెడ్డి, చిట్యాల సుహాసిని రెడ్డి (ఆదిలాబాద్ నియోజకవర్గం) పెరిగిన జెడ్పీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లాలో 52 మండలాలు ఉండగా 52 మంది జెడ్పీటీసీలు ఎన్నికయ్యేవారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడడంతో జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 66కు పెరిగింది. దీంతో ఉమ్మడి జిల్లాతో పోలిస్తే.. 14 జెడ్పీటీసీ స్థానాలు పెరిగాయి. 636 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కొత్త జిల్లాల్లో ఈ సంఖ్య తగ్గి 568కి చేరింది. ప్రధానంగా పలు ఎంపీటీసీ స్థానాలు ఉన్నటువంటి గ్రామాలు సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం చేయడం, తక్కువ ఓటర్లు ఉన్న వాటిని సమీపంలోని మరో ఎంపీటీసీ స్థానంలో కలపడం వంటివి జరగడంతో ఈ సంఖ్య తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు జిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఆదిలాబాద్ 17 158 మంచిర్యాల 16 130 కుమురంభీం 15 124 నిర్మల్ 18 156 మొత్తం 66 568 -
‘అతివ’కే పట్టం..
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాపరిషత్ జిల్లాల పునర్విభజనతో ఆరు జిల్లా పరిషత్‌లుగా విడిపోయింది. వచ్చే జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు నూతన జిల్లాల వారీగా జరుగనున్నాయి. ఈ మేరకు నూతన జిల్లా ప్రజా పరిషత్‌ల వారీగా రిజర్వేషన్లు ప్రభుత్వం బుధవారం ఖరారు చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ అనంతరం జిల్లాలో జెడ్పీ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. రూరల్ జిల్లా అక్టోబర్ 11, 2016న ఆవిర్భవించింది. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోనే జిల్లా పరిషత్ కొనసాగింది. త్వరలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీలు రిజర్వేషన్లలో మహిళలకు కేటాయించిన వారికి ఈ అవకాశం దక్కనుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌గా మహిళే ఉండగా, ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ మహిళలకు రిజర్వేషన్ కావడంతో వారికి ఉన్నత పదవులు లభించనున్నాయి. జిల్లాలో 16 జెడ్పీటీసీలు, 178 ఎంపీటీసీలు ఉన్నాయి. పదవి ఎవరిని వరిస్తుందోనని చర్చలు మొదలయ్యాయి. -
మహిళలకు ‘పెద్ద’పీట
ఆదిలాబాద్‌అర్బన్: భూమి.. ఆకాశం.. అన్నింటా సత్తాచాటుతున్న మహిళలకు రాజకీయాల్లోనూ ప్రాతినిథ్యం దక్కుతోంది. ఒకప్పుడు వంటింటికి పరిమితమైన వీరికి అవకాశాలు అందివస్తున్నాయి. మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాలను ఎక్కువ సంఖ్యలో ‘ఆమె’కు కేటాయిస్తూ పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు జెడ్పీ పీఠాలు ఆమెకు దక్కాయి. ప్రస్తుతమున్న ఆదిలాబాద్ జెడ్పీ తప్పా కొత్తగా ఏర్పాటైన నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లా పరిషత్‌లు ఆమెను వరించాయి. ఇక ఆయా జిల్లాల పరిషత్ చైర్మన్ స్థానానికి రిజర్వేషన్‌పై స్పష్టత రావడంతో ఆయా పార్టీల్లో మహిళా నేతలెవరున్నారనే అంశంపై పార్టీలు దృష్టి సారించనున్నాయి. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీలుగా గెలవడం ఒక ఎత్తైతే.. విజయం సాధించిన జెడ్పీటీసీల మద్దతు కూడ గట్టి చైర్మన్ పదవీ దక్కించుకోవడం మరో ఎత్తు. ఆ మూడు జిల్లాలు ‘ఆమె’కే.. జిల్లా ప్రజా పరిషత్‌కు అధ్యక్షులుగా వ్యవహరించే చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఆయా జిల్లాల వారీగా జిల్లా పరిషత్ రిజర్వేషన్ల లెక్క తేలింది. గత వారం రోజులుగా పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్న కసరత్తుకు తుది రూపు వచ్చింది. ఎట్టకేలకు ఆయా జిల్లాల వారీగా జెడ్పీ చైర్పర్సన్ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే ఆదిలాబాద్ జిల్లా పునర్విభజనలో భాగంగా నాలుగు జిల్లాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. కొత్తగా మరో మూడు జిల్లాలు నిర్మల్, మంచిర్యాల, కుమురంభీంలు ఏర్పాటయ్యాయి. పాత ఆదిలాబాద్ జిల్లాకు జనరల్ రిజర్వేషన్ కేటాయించగా, కొత్తగా ఏర్పడిన మూడు జిల్లాలకు మహిళా రిజర్వేషన్లను కేటాయించారు. జిల్లా పునర్విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి సారిగా జెడ్పీ చైర్పర్సన్లుగా మహిళలే ఎన్నిక కానున్నారు. ఎస్టీలకు రెండు..ఎస్సీ, ఆన్‌రిజర్వుడ్ ఒక్కోటి.. జిల్లా ప్రజా పరిషత్‌లో భాగమైన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల లెక్క తేలకుండానే చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆదిలాబాద్ జెడ్పీని ఎస్టీ జనరల్‌కు కేటాయించగా, నిర్మల్ జెడ్పీని ఆన్ రిజర్వుడ్ మహిళ, మంచిర్యాల జెడ్పీని ఎస్సీ మహిళ, ఆసిఫాబాద్ జెడ్పీని ఎస్టీ మహిళకు కేటాయించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో నాలుగు జెడ్పీలు ఉన్నాయి. రాష్ట్రం యూనిట్‌గా తీసుకొని ఆయా జిల్లాలకు జెడ్పీ పదవుల రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఇందులో మహిళలకు 50 శాతం కోటా ఉంటుంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మూడు కొత్త జిల్లాలకు మహిళలకు రిజర్వేషన్లు దక్కాయి. అయితే ఈ సారి ఎస్సీ, ఎస్టీ, ఆన్‌రిజర్వుడ్ స్థానాలకు తప్ప బీసీ వర్గానికి ఏ ఒక్క స్థానం దక్కలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లో మార్పు జరిగిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. రిజర్వేషన్లు ఇలా.. జిల్లా వర్గం కేటాయింపు ఆదిలాబాద్ ఎస్టీ జనరల్ కుమురంభీం ఎస్టీ మహిళ మంచిర్యాల ఎస్సీ మహిళ నిర్మల్ అన్‌రిజర్వుడ్ మహిళ -
గ్రామాల్లో ‘స్థానిక’ సందడి షురూ
సాక్షి, కథలాపూర్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత ఐదు నెలలుగా గ్రామాల్లో రాజకీయాలు వెడేక్కి.. ప్రశాంతంగా ముగియడంతో నాయకులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో గ్రామాల్లో రాజకీయాలు మరోమారు వెడేక్కాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయని కొందరు నాయకులు తమకు రిజర్వేషన్లు కలిసిరాలేదని మరికొందరు తమ అనుచరవర్గాలతో రాజకీయ భవితవ్యంపై చర్చల్లో మునిగితేలుతున్నారు. మరోవైపు ఏ నాయకుడిని గెలిపిస్తే మంచిపాలన అందిస్తారనే విషయంలో ప్రజలు సైతం కూడళ్ల వద్ద చర్చించుకోవడం విశేషం. బీసీలకే కథలాపూర్ ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు.... ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ జిల్లాస్థాయిలో జరగడంతో కథలాపూర్ మండల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానం బీసీలకే రిజర్వ్ అయ్యాయి. కథలాపూర్ మండలంలో 19 గ్రామాలుండగా.. 13 ఎంపీటీసీ స్థానాలుగా నిర్ణయించారు. ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను మండలస్థాయి యూనిట్‌గా ఖరారు చేయనుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆయా గ్రామాల్లో ఇటివలే జరిగిన సర్పంచ్ ఎన్నికలకు వర్తించే రిజర్వేషన్లు ఎంపీటీసీ స్థానాలకు దగ్గరగా ఉంటాయని ఆయా గ్రామాల్లో ఆశావహులు ఇప్పటికే అనుచరవర్గంతో ప్రచారాలు ప్రారంభించడం గమనార్హం. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురి నాయకులకు ప్రజాతీర్పు కోరుకునేందుకు ఎంపీటీసీ ఎన్నికల రూపంలో మరోచాన్స్ వచ్చినట్లయిందని.. గెలుపుకోసం ఏమి చేయాలనే వ్యుహాలు రచించుకుంటున్నారు. మండలంలో 32,712 మంది ఓటర్లు.. కథలాపూర్ మండలంలో 19 గ్రామాలకు గాను 13 ఎంపీటీసీ స్థానాలుండగా.. 32,712 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళ ఓటర్లు 17,354 మంది, పురుషులు 15,358 మంది ఓటర్లు ఉన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో యువత ఉపాధి నిమిత్తం గల్ఫ్‌బాట పట్టినవారే ఉండటంతో మహిళ ఓటర్లు ఎక్కువగా వినియోగించుకునే అవకావం ఉంది. ఆయా గ్రామాల్లో గెలుపు ఓటములకు మహిళ ఓటర్లు కీలకం కానున్నారని పార్టీల నాయకులు భావిస్తున్నారు. కథలాపూర్‌కు మరోసారి జెడ్పీ చైర్మన్ పోస్టు దక్కేనా..? 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కథలాపూర్ జెడ్పీటీసీగా గెలుపొందిన తుల ఉమ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జిల్లాల పునర్విభజన జరగడంతో ప్రస్తుతం కథలాపూర్ మండలం జగిత్యాల జిల్లా పరిధిలోకి వచ్చింది. జిల్లాలో 18 జెడ్పీటీసీ స్థానాలుండటంతో ఏ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ జెడ్పీ చైర్మన్ సీటు కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీగా బరిలో ఉండే నాయకులు సైతం జిల్లాస్థాయిలో ప్రభావం చూపాలని అప్పుడే ఉన్నతస్థాయిలో పార్టీ నేతలో చర్చలు జరుపుతుండటం విశేషం. మరోసారి కథలాపూర్ జెడ్పీటీసీగా గెలుపొందినవారు జెడ్పీ చైర్మన్ సీటు దక్కించుకుంటారా లేదా అనేది రాజకీయ నాయకుల్లో ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఏప్పుడేమి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని రాజకీయనాయకులతోపాటు ప్రజల్లో రోజురోజుకు ఉత్కంఠ నెలకొంది. -
‘స్థానిక’ రిజర్వేషన్ల ఖరారు నేడే
సాక్షి, నల్లగొండ : స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 5వ తేదీలోగా రిజర్వేషన్లను ఖరారు చేసి నివేదికలు పంపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్‌లతోపాటు మండలాలను నోటిఫైడ్ చేస్తూ గెజిట్‌ను కూడా విడుదల చేసింది. దీంతో జిల్లా పరిషత్ అధికారులు రిజర్వేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు. మంగళవారం సాయంత్రంలోగా రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి అందించాల్సి ఉంది. గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా ఆధారంగా.. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల కోసం తయారు చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని మొదట నిర్ణయించింది. ఆ మేరకు వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందించాలని గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించాలని ప్రస్తుతం నిర్ణయించింది. దీంతో ఆ ఓటర్ల జాబితా ప్రకా రమే రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. నేడు రిజర్వేషన్లు ఖరారు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను కలెక్టర్, ఆర్డీఓల ఆధ్వర్యంలో ఎంపీడీఓలు పూర్తి చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ 5వ తేదీలోగా రిజర్వేషన్ తయారు చేసి నివేదికలు పంపించాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్ ప్రక్రియను ఆయా కలెక్టర్లు, ఆర్డీఓల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం వరకు ప్రక్రియ ముగియనుంది. వెంటనే అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే జిల్లా ఎంపీపీల రిజర్వేషన్ కోటా ఖరారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఆయా జిల్లాలకు కేటాయించిన ఎంపీపీల రిజర్వేషన్లను ప్రకటించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో మొత్తం 71 మండలాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం ఎస్సీలకు 12 ఎంపీపీ స్థానాలు, ఎస్టీలకు 10, బీసీలకు 13, అన్ రిజర్వ్డ్ కింద 36 ఎంపీపీ స్థానాలను రిజర్వ్ చేశారు. ఈ జాబితాను ఇప్పటికే ఆయా కలెక్టర్లకు పంపించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లకు ఫైనల్ అథారిటీ కలెక్టర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు ఇప్పటికే ఆయా జిల్లాకు కేటాయించిన ఎంపీపీ రిజర్వేషన్లను ఏయే మండలాలకు కేటాయించాలనేది మంగళవారం నిర్ణయిస్తారు. అదే విధంగా జెడ్పీటీసీ రిజర్వేషన్‌కు సంబంధించి కూడా రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు. జి ల్లా యూనిట్‌గా తీసుకొని జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ చేయనున్నారు. ఎంపీటీసీల రిజర్వేషన్ బాధ్యత ఆర్డీఓలకు... ఎంపీటీసీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ఆర్డీఓల ఆధ్వర్యంలో చేయనున్నారు. ఆయా డివిజన్లలోని మండల ప్రాదేశిక నియోజకవర్గాల్లో రిజర్వేషన్ ఎంపీడీఓలు చేడతారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ జనాభా ఆధారంగా చేస్తుండగా, బీసీ రిజర్వేషన్ మాత్రం ఓటర్ల జాబితా ఆధారంగా చేపట్టనున్నారు. జెడ్పీ అధ్యక్షుడు, ఎంపీపీలు రాష్ట్ర యూనిట్‌గా.. జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఎంపీపీల రిజర్వేషన్లు రాష్ట్ర యూనిట్‌గా తీసుకొని చేయనున్నారు. ఇప్పటికే ఎంపీపీల కోటా ఏ జిల్లాకు ఎవరెవరికి ఎన్ని స్థానాలనేది ప్రకటించారు. జిల్లా పరిషత్ అ«ధ్యక్షుల రిజర్వేషన్ మాత్రం ప్రకటించలేదు. తేలిన ఉమ్మడి జిల్లా ఎంపీపీల రిజర్వేషన్ కోటా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 మండలాలు ఉన్నాయి. అందులో నల్లగొండ జిల్లాలో 31 మండలాలు ఉండగా అందులో ఎస్సీలకు 5, ఎస్టీలకు 6, బీసీలకు 4, జనరల్ కేటగిరీలో 16 కేటాయించారు. సూర్యాపేట జిల్లాలో 21 మండలాలకు ఎస్సీ 4, ఎస్టీ 3, బీసీ 4, జనరల్ 12 కేటాయించారు. అదే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలకు ఎస్సీ 3, ఎస్టీ 1, బీసీ 5, జనరల్ 8 స్థానాలుగా జిల్లా కోటాను నిర్ణయించారు. -
గ్రామాల్లో దాహం.. దాహం
సాక్షి,గాండ్లపెంట: వేసవి కాలం రాకముందే పలు గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటి దాహం కేకలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యతో స్థానికుల సతమతమవుతున్నారు. చుక్క నీటి కోసం రాత్రిళ్లు జాగరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాండ్లపెంట మండల పరిధిలోని మలమీదపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన దేవలచెరువుపల్లి, కరణంవారిపల్లి, కోటూరు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కోటూరు గ్రామంలో టీడీపీకి చెందిన ఓ జెడ్పీటీసీ ఉన్నా పట్టించుకోవడం లేదు. కోటూరులో గత నాలుగు నెలలుగా మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోలేదని గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మలమీదపల్లి గ్రామ పంచాయతీ బోరులో అదనపు పైపులు అమర్చినా నీరు ఓహెచ్‌ఆర్ ట్యాంకు చేరకపోవడంతో ఎగువ ప్రాంతాల్లోని వారు రాత్రి సమయంలో ఎక్కడ బోర్లు ఉంటే అక్కడికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. పంచాయతీ బోరు నీటిని నేరుగా ఓహెచ్‌ఆర్ ట్యాంకుకు నింపితే అందరికి నీరు అందే వీలుందని మలమీదపల్లి ఎంపీటీసీ వైస్ ఎంపీపీ ఆదెప్పనాయుడు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కుటుంబాలు అధికంగా ఉన్నాయని, పంచాయతీ నీటిని నేరుగా ట్యాంకుకు పంపితే కొద్దో గొప్పో ఎగువ ప్రాంతాలకు నీరు అందే వీలుంది. అదే విధంగా దేవలచెరువుపల్లిలో నాలుగు నెలలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడినా ఎవరూ స్పందించలేదు. కోటూరులో పంచాయతీ పథకంలో నీరు అడుగంటి పోవడంతో వచ్చే కొద్దిపాటి నీటి కోసం రాత్రిళ్లు బిందెలు కోళాయిల వద్ద ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. -
పిల్లలూ.. దుస్తులు ఇలా శుభ్రం చేసుకోవాలి
కర్ణాటక, రాయచూరు రూరల్: ఇంటిలో ఉన్న కన్నపిల్లల దుస్తులు శుభ్రం చేయాలంటే తలనొప్పిగా మారుతున్న నేటి రోజుల్లో జెడ్పీ సీఈఓ కవితా మన్నికేరి స్వయంగా రంగంలోకి దిగి పిల్లలకు దుస్తులు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించిన ఘటన యాదగిరి జిల్లా లింగేరి మొరార్జి దేశాయి వసతి పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. ఆమె పాఠశాలను సందర్శించిన సమయంలో చిన్న పిల్లలు బట్టలు శుభ్రం చేసుకోవడానికి పడుతు న్న కష్టాలను చూడలేక ఆమే స్వతహాగా పిల్లలకు దుస్తులను ఎలా పిండుకోవాలో చూపించారు. అనంతరం విద్యార్థులు హాస్టల్లో ఏవిధంగా చదువుకుంటున్నారనే విషయంపై కూడా ఆరా తీశారు. -
రైతులంటే ఇంత అలుసా..?
రైతులంటే ఇంత అలుసా... ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు విడతల రైతుబంధు పథకం పూర్తయింది... తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకు రంగం సిద్ధం చేసింది... అయినా ఇంతవరకు జిల్లాలో అర్హులైన రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందలేదు... దీంతో రైతుబంధు పథకంతో పాటు రైతుబీమాకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది... వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు నిర్లిప్తత వీడాలి...? అంటూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జేసీ జీవీ.శ్యాంప్రసాద్‌లాల్, జగిత్యాల జాయింట్ కలెక్టర్ రాజేశం, జయశంకర్భూపాలపల్లి జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, జెడ్పీ సీఈవో వెంకటమాధవరావుతో పాటు ఏడు జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మొదటగా ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమరజవాన్ల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. హుస్నాబాద్, చొప్పదండి, ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీలు రాయిరెడ్డి రాజిరెడ్డి, ఇప్పనపల్లి సాంబయ్య, తోట ఆగయ్య ఆమరజవాన్లకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం వివిధ శాఖల పనితీరు, పథకాల అమలుపై చర్చ జరిగింది. సాక్షిప్రతినిధి,కరీంనగర్: జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా రైతు సమస్యలపై సభ్యులు సంబంధిత అధికారులను నిలదీశారు. బెజ్జంకి జెడ్పీటీసీ సభ్యులు తన్నీరు శరత్‌రావు మాట్లాడుతూ..రైతుబంధు,రైతుబీమాకు ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి మాట్లాడుతూ మహాముత్తారం, మహాదేవపూర్, కాటారం మం డలాల్లో 70 శాతానికిపైగా భూరికార్డులు సరిగ్గా లేవని ఆరోపించారు. ముస్తాబాద్ జెడ్పీటీసీ సభ్యులు శరత్‌రావు మాట్లాడుతూ మండలంలో 700మందికిపైగా రైతులకు పాసుపుస్తకాలు అందలేదన్నారు. మానకొండూర్, బోయిన్పల్లి, శంకరపట్నం జెడ్పీటీసీలు ఎడ్ల సుగుణాకర్, లచ్చిరెడ్డి, సంజీవరెడ్డి మాట్లాడుతూ ఆత్మ పథకంపై అవగాహన సమావేశాలు పెట్టడం లేదని మండిపడ్డారు. రామడుగు జెడ్పీటీసీ వీర్ల కవిత మాట్లాడుతూ గుండి గ్రామంలో సిలివేరి సత్తయ్య అనే రైతు మరణించాడని పాస్‌బుక్ లేకపోవడంతో రైతుబంధు పథకానికి నోచుకోలేకపోయాడని ఇలాంటి ఘటనలు కొకొల్లాలుఅని సభదృష్టికి తెచ్చారు. వేములవాడ జెడ్పీటీసీ శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు చెందిన భూమికి సంబంధించి రెండేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పాస్‌పుస్తకాలు ఇవ్వడం లేదని అన్నారు. మల్యాల జెడ్పీటీసీ శోభరాణి మాట్లాడుతూ బల్వంతపూర్ గ్రామంలో రైతు మరణిస్తే అర్హతలు ఉన్న రైతుబంధు చెక్కు ఇవ్వడంలో వ్యవసాయ శాఖ అధికారులు కొర్రీలు పెడుతున్నారని సభదృష్టికి తెచ్చారు. ‘మిషన్‌భగీరథ’పనులపై అసంతృప్తి... మిషన్ భగీరథ పథకం పనులపై సభ్యులు మండిపడ్డారు. ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్దం వేణు, ఎంపీపీ అయిలయ్యలు మాట్లాడుతూ గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఇప్పటి వరకు ఎన్ని ట్యాం కులు నిర్మించారు...ఎక్కడెక్కడ పైపులు వేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పనుల వల్ల రోడ్లన్ని అస్థవ్యస్థంగా తయారవుతున్నాయని, పైపులు వేసిన చోట గుంతలు పూడ్చటం లేదని ఒకే కాంట్రాక్టర్ ఎక్కువ మొత్తంలో ట్యాంకులను కాంట్రాక్ట్ తీసుకోవడం వల్ల పనుల్లో వేగం తగ్గిందని కాంట్రాక్టర్ల తీరుపై పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. విద్యశాఖ తీరుపై ఆసక్తికర చర్చ... విద్యశాఖలో సమస్యలను ప్రతి సమావేశంలో విన్నవిస్తున్నా పరిష్కారానికి మోక్షం లభించడం లేదని సభ్యులు ఆసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీపీ వాసాల రమేష్ మాట్లాడుతూ.. కొత్తపల్లి మండల కేంద్రంలో వ్యాయమా ఉపాధ్యాయుడు విద్యాసాగర్ 18 ఏళ్లుగా ఒకేస్కూల్లో పనిచేస్తున్నాడని, తనకున్న పలుకుబడితో విధులు నిర్వహించకుండా రాజకీయాలకే పరిమితమవుతున్నాడని ఆరోపించారు. మహాముత్తారం జెడ్పీటీసీ రాజిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అటెండర్లు, స్వీపర్ల పోస్టులను భర్తీ చేయాలని , ప్రహరీ గోడలు ,అదనపు గదుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ తోట ఆగయ్య మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలోని గత ఘటన ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. డీఈవో వెంకటేశ్వర్ల మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య అందిస్తున్నామని సమాధానం ఇవ్వబోతుండుగా.. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు రాయిరెడ్డి రాజిరెడ్డి అడ్డుపడి కొడిమ్యాల మండల కేంద్రంలో గత సంవత్సరం ఎస్ఎస్సీ పరీక్షల సందర్భంగా జరిగిన మాస్ కాపీయింగ్ వ్యవహారంలో పది మందిని తిరిగి విధుల్లోకి తీసుకుని ఒక్కరికి పోస్టింగ్ ఎందుకు ఇవ్వడం లేదని డీఈవోను ప్రశ్నించారు. ఆ ఉపాధ్యాయుడి పరిధి మోడల్ స్కూల్ సొసైటీలో ఉందని డీఈవో సమాధానం ఇచ్చారు. మల్యాల ఎంపీపీ శ్రీలత, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్ , మంథని జడ్పీటీసీ సరోజన మాట్లాడుతూ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని, గ్రంథాలయాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తకపఠనంపై ఆసక్తి కలిగించాలని సభ దృష్టికి తెచ్చారు. వైద్య శాఖ పై గరంగరం... జిల్లాలో వైద్యశాఖ తీరు మారడం లేదని, ప్రతి సమావేశంలో చెప్పిన విషయాలను చెప్పడమే తప్ప సమస్యలకు మోక్షం లభించడం లేదని వైద్యశాఖ అధికారుల తీరుపై సభ్యులు ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో పోస్టుమార్టం భవనం పూర్తయిన ప్రారంభానికి ఎందుకు ఆలస్యం జరుగుతుందని కో ఆప్షన్ సభ్యులు జమీలోద్దీన్తో పాటు తదితరులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై మండిపడ్డారు. పోస్టుమార్టం భవనానికి దారి లేదనే నెపంతో వాయిదా వేయడం తగదని, కేవలం ప్రహరీ గోడ కూల్చేందుకు ఎందుకు జంకుతున్నారని ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహకుల ఒత్తిళ్లకు తలొగ్గడం విచారకరమని సభ్యులు మండిపడ్డారు. కాటారం మండల కేంద్రంలో పోస్టుమార్టం గదిని ఏర్పాటు చేయాలని, మంథని ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్టు డాక్టర్‌ను నియమించాలని చల్లా నారాయణరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. ఐసీడీఎస్ అవినీతిపై మల్యాల జెడ్పీటీసీ బైఠాయింపు... జగిత్యాల జిల్లాలో మహిళ శిశు సంక్షేమ శాఖ అవినీతికి అడ్డుఅదుపు లేకుండా పోయిందని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పౌష్టికాహారం, పాలు,గుడ్లు వంటి వాటిలో రెండున్నర కోట్ల కుంభకోణం జరిగిందని రెండేళ్లుగా పత్రికలు కోడైకూస్తున్నా చర్యలు లేవని మల్యాల జెడ్పీటీసీ శోభారాణి అధికారుల తీరుపై మండిపడ్డారు. దీంతో జగిత్యాల జిల్లా అధికారులు ఎవరూ సమావేశంలో లేకపోవడంతో అధికారులు వచ్చి సమాధానం ఇచ్చేంత వరకు నేలపై కూర్చుంటానని చెబుతూ సమావేశం పోడియం ముందు బైఠాయించారు. దీంతో జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ జోక్యం చేసుకోని సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని, అవినీతి ఆరోపణల విషయంపై ప్రభుత్వానికి నివేదిస్తా మని చెప్పడంతో శోభారాణి శాంతించారు. 15రోజుల్లో పాసుపుస్తకాలు అందజేస్తాం 15 రోజుల్లో అర్హత గల రైతులందరికి పాసుపుస్తకాలు అందజేస్తాం. మిగిలిన చోట్ల భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోంది. 2వేల పాసుపుస్తకాలు ఇప్పటికే జిల్లాకు చేరాయి. అర్హత గల రైతులందరికీ పాసుపుస్తకాలతో పాటు రైతుబంధు, రైతుభీమా పథకం అందుతుంది. – శ్యాంప్రసాద్‌లాల్, కరీంనగర్ జాయింట్ కలెక్టర్ మార్చి 31లోగా ఇంటింటికీ నీరు పెద్దపల్లి జిల్లాలోని అన్ని గ్రామాలకు మార్చి 31లోపు మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి నీరు అందిస్తాం. అందుకు పూర్తి ఏర్పాట్లు చేశాం. పైపుల కోసం వేసిన గుంతలు పూడ్చే బాధ్యత కాంట్రాక్టర్లదే. దేశంలో పంజాబ్ రాష్ట్రం 70 శాతం ఇంటింటికి నల్లానీరు అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వందశాతం భగీరథ నీళ్లు ఇంటింటికి అందజేస్తుంది. – శ్రీదేవసేన, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులది అంతే బాధ్యత ఉంటుంది. సమావేశాలకు అధికారులు జవాబుదారీతనంతో పాటు సమగ్ర నివేదికలతో రావాలి. ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా అధికారులు వ్యవహరించడం సరికాదు. – తుల ఉమ, జెడ్పీ చైర్పర్సన్ -
‘జెడ్పీ’ కసరత్తు
జిల్లా ప్రజానీకం, రాజకీయ నాయకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జిల్లా పరిషత్ త్వరలో ఏర్పాటు కానుంది. పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్న విధంగా నూతన జిల్లా పరిషత్ ఏర్పాటు కోసం చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్‌ను విభజించి కొత్తగా మెదక్, సిద్దిపేట జెడ్పీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును అధికారులు ప్రారంభించారు. ఈనెల 25వ తేదీలోగా నూతన జెడ్పీ, జెడ్పీటీసీలు, ఎంపీపీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ జెడ్పీ సీఈఓకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా పరిషత్ అధికారులు ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధం అవుతున్నారు. సాక్షి, మెదక్: జిల్లా పరిషత్ సభ్యుల పదవీకాలం జూలైతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. నూతన జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణకు వీలుగా సాధ్యమైనంత త్వరగా కొత్త జెడ్పీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా మొదట మెదక్ జిల్లాలో కొత్త జెడ్పీటీసీలు, ఎంపీపీల ఏర్పాటు కోసం అధికార యంత్రాంగం ప్రతిపాదనలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 46 జెడ్పీటీసీలు, 46 మంది మండల పరిషత్ అధ్యక్షులున్నారు. కాగా కొత్తగా ఏర్పాటైన మెదక్ జిల్లా నుంచి ప్రస్తుతం 15 మంది జెడ్పీటీసీలు, 15 మంది ఎంపీపీలు జెడ్పీ సమావేశాలకు హాజరవుతున్నారు. కాగా జిల్లాల పునిర్వభజన సమయంలో మండలాల సంఖ్య పెరిగింది. జిల్లాలో ఇది వరకు 15 మండలాలు ఉండగా కొత్తగా హవేళిఘణాపూర్, నిజాంపేట, చిలిపిచెడ్, నార్సింగి, మనోహరాబాద్ మండలాలు ఏర్పడ్డాయి. దీంతో మండలాల సంఖ్య 20కి చేరింది. కొత్త రెవెన్యూ మండలాల ఆధారంగా జిల్లాలో జెడ్పీటీసీల సంఖ్య కూడా 20కి చేరనుంది. అలాగే మండల పరిషత్‌లు కూడా 20 ఏర్పాటు కానున్నాయి. దీంతో పాటు ఎంపీటీసీల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీ) విభజన చేపట్టనున్నారు. 2011 జనాభా ఆధారంగా ఎంపీటీసీల విభజన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కొత్తగా ఐదు మండలాలు ఏర్పడినందున ఎంపీటీసీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల కేటాయింపు కొత్తగా ఏర్పాటయ్యే జెడ్పీలకు ఉద్యోగుల కేటాయింపుపైనా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటు చేసే మెదక్, సిద్దిపేట జెడ్పీలకు ఉద్యోగులను కేటాయించనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ జెడ్పీలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరిస్తోంది. జిల్లా పరిషత్ ఆధీనంలో మండల పరిషత్, గ్రామీణ నీటిసరఫరా, పంచాతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలు పనిచేస్తున్నాయి. కాగా కొత్తగా జిల్లాల ఏర్పాటు సమయంలో మండల పరిషత్, గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను కొత్త జిల్లాలకు ఆపాయింట్ చేశారు. దీంతో మూడు శాఖల ఉద్యోగులు విభజన ప్రస్తుతం ఉండదని, కేవలం కొత్త జెడ్పీకి సీఈఓ, డిప్యూటీ సీఈఓ, సూపరింటెండెంట్లు, మినిస్టీరియల్ స్టాఫ్‌ను మాత్రమే నియమిస్తారని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, మినిస్టీరియల్ స్టాఫ్‌ను మాత్రమే మూడు జిల్లాలకు విభజించే అవకాశం ఉంది. పదవులపై నాయకుల్లో ఆశలు కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పడుతుండడంతో పాటు కొత్తగా ఐదు జెడ్పీటీసీ, ఐదు ఎంపీపీ పదవులు వస్తున్నందున నాయకుల్లో పదవులపై ఆశలు పెరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్ నాయకులు కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకుంటున్నారు. రిజర్వేషన్లు కలిసివస్తే జెడ్పీటీసీలు పోటీచేసేందుకు అనువైన మండలాలను ఎంపిక చేసుకునేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు సిద్ధం అవుతున్నారు. హవేళిఘణాపూర్, చిల్పిచెడ్, నార్సింగి, మనోహరాబాద్, నిజాంపేట మండలాల్లోని కొత్తగా జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులు రానున్నాయి. దీంతో ఆయా పదవులపై నాయకులు ఇప్పటి నుంచే కన్నేసి ఉంచారు. -
జెడ్పీ చైర్పర్సన్ ఎవరో?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత చైర్పర్సన్ గడిపల్లి కవిత ఈనెల 2వ తేదీ తన పదవికి రాజీనామా చేయగా.. ప్రభుత్వం ఆమోదించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న పదవిలో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుంది.. ఎటువంటి విధానాన్ని అవలంబిస్తుంది.. దేనిని ప్రాతిపదికగా తీసుకుంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరో రెండు నెలల్లో జిల్లా పరిషత్ పదవీ కాలం పూర్తవుతున్నందున ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న బరపటి వాసుదేవరావుకే చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తొలుత భావించినా.. పంచాయతీరాజ్ చట్టాలను అనుసరించి.. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై జిల్లా అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు సమాచారం. సాధారణంగా జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీ కాలం ఆరు నెలల్లోపు ఉండి.. చైర్మన్ పదవి ఖాళీ అయిన పక్షంలో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న వారికి చైర్మన్‌గా అవకాశం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే జెడ్పీ చైర్‌పర్సన్‌గా రాజీనామా చేసిన గడిపల్లి కవిత ఆ పదవిలో 2014, ఆగస్టు 7న బాధ్యతలు స్వీకరించడంతో ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి రాజీనామా చేసిన తేదీ వరకు గల రోజులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. ఆరు నెలల ఆరు రోజులు చైర్పర్సన్ పదవీ కాలం ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది. ఆరు నెలలకు మించి చైర్పర్సన్ పదవీ కాలం ఉన్న పక్షంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆ పదవికి సభ్యుల్లో అర్హులైన వారిని ఎన్నుకోవాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నట్లు సంబంధిత అధికారులు.. ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. దీంతో చైర్మన్ పదవీ వ్యవహారం రసకందాయంలో పడినట్లయింది విశ్లేషణలో ఎవరికి వారే.. అయితే జెడ్పీ చైర్మన్ పదవిని ఏ ప్రాతిపదికన.. ఎవరితో భర్తీ చేయాలనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంత వరకు ఈ పదవి భర్తీ వ్యవహారంపై ఆయా పార్టీలు విశ్లేషణలో పడ్డాయి. 15 రోజులపాటు చైర్మన్ పదవి ఖాళీగా ఉంటే ఆ తర్వాత యథావిధిగా వైస్ చైర్మన్ జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం సైతం ఉందని పంచాయతీరాజ్ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే జెడ్పీ చైర్పర్సన్ రాజీనామా చేసి వారం రోజులు కావడం.. మరో వారం రోజుల్లోగా ప్రభుత్వం నుంచి ఏదైనా నిర్ణయం రాని పక్షంలో ప్రస్తుత వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వారికే చైర్మన్‌గా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. అయితే జెడ్పీ చైర్మన్ రాజీనామా, ప్రమాణ స్వీకారం మధ్య వ్యత్యాస కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఆరు నెలలకుపైగా ఉందని ప్రభుత్వం భావిస్తే చైర్మన్ పదవికి మళ్లీ ఎన్నిక నిర్వహించే అవకాశం సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఖాళీ అయిన చైర్పర్సన్ పదవి కోసం అధికార టీఆర్ఎస్కు చెందిన పలువురు జెడ్పీటీసీ సభ్యులు దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్సీ మహిళలకు రిజర్వు అయిన ఈ పదవిని దక్కించుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నలుగురు మహిళలు అధికార టీఆర్ఎస్లో ఉన్నారు. వీరిలో ఒకరికి అవకాశం కల్పిస్తారా? లేదా? ప్రభుత్వం ఉపాధ్యక్షుడిని కొనసాగిస్తుందా? లేకపోతే ప్రభుత్వ అధికారికి బాధ్యతలు అప్పగిస్తుందా? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన గడిపల్లి కవిత అవిభాజ్య ఖమ్మం జిల్లా వెంకటాపురం జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఎన్నిక నిర్వహించినట్లయితే అశ్వాపురం, చర్ల, పినపాక, వాజేడు జెడ్పీటీసీల్లో ఒకరికి చైర్‌పర్సన్‌గా అవకాశం లభించనుంది. ఈ నలుగురు అధికార టీఆర్ఎస్లో కొనసాగుతుండగా.. ఏన్కూరు జెడ్పీటీసీ మాత్రం టీడీపీలో కొనసాగుతున్నారు. అధికార టీఆర్ఎస్లో ఉన్న నలుగురిలో ఒకరికి జెడ్పీ చైర్పర్సన్ పదవి అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రంలోని అన్ని జెడ్పీటీసీలకు 2014 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి. ఖమ్మం జిల్లాలో సైతం అదే సమయంలో ఎన్నికలు జరిగినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5 మండలాలు ఏపీలో కలవడం, అంతకుముందే జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన జెడ్పీటీసీలు ఏ జిల్లా పరిషత్ పరిధిలోకి వస్తారనే అంశంపై స్పష్టత రావడానికి సమయం పట్టడంతో ఆగస్టులో ఖమ్మం జెడ్పీ చైర్పర్సన్ పదవి భర్తీ అయింది. అప్పటి వరకు ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న ఐదు మండలాలు పూర్తిగా విలీనం కావడంతో.. 41 మండలాల జెడ్పీటీసీలు ఖమ్మం జెడ్పీ పరిధిలోకి రానున్నారని ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాలుగు నెలలు ఆలస్యంగా జెడ్పీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. ఈ అంశాలన్నింటినీ ఎన్నికల నోటిఫికేషన్లతో సహా జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి.. జెడ్పీ చైర్పర్సన్ పదవి భర్తీకి అనుసరించే విధానంపై నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరినట్లు సమాచారం. -
జెడ్పీకి గుడ్‌బై..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి గడిపల్లి కవిత రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 2014 ఆగస్టు 7వ తేదీన బాధ్యతలు చేపట్టిన ఆమె సుమారు 54 నెలలపాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. కవిత రాజీనామా జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా టీడీపీలో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె గతంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోటీ చేసి ఓటమి చెందారు. టీడీపీలో ఉన్నంతకాలం తుమ్మల అనుచరురాలిగా ఉన్న కవిత.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం(ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా) జెడ్పీటీసీగా గెలుపొందారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళలకు రిజర్వ్ కావడంతో.. టీడీపీలో అప్పుడు కీలకంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో అనూహ్యంగా కవితను ఆ పదవి వరించింది. తన రాజకీయ గురువుగా భావించే తుమ్మల నాగేశ్వరరావుతోపాటే ఆమె 2014 సెప్టెంబర్‌లో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మధిర ‘అసెంబ్లీ’పై ఆసక్తి చూపి.. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధిర నుంచి పోటీ చేయడానికి ఆమె ఆసక్తి ప్రదర్శించారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థిత్వం లింగాల కమల్రాజుకు ఖరారైంది. శాసనసభ ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేక తనకు రాజకీయ అండదండలు అందించిన వ్యక్తి ఓటమి చెందడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు కవిత శనివారం తనను కలిసిన విలేకరులకు వివరించారు. వెంకటాపురం జెడ్పీటీసీ పదవికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి తాను రాజీనామా చేశానని, అయితే టీఆర్ఎస్ పార్టీలో ఇక మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తానని రాజీనామా చేయడానికి రాజకీయ కారణాలతోపాటు కొన్ని వ్యక్తిగత కారణాలు సైతం ఉన్నాయని ఆమె వివరించారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి సాధారణ కార్యకర్తగా నిరంతరం కృషి చేస్తానన్నారు. చైర్‌పర్సన్‌గా తనను ఆదరించి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడా పదవి ఎవరికి..? జెడ్పీ చైర్పర్సన్ పదవికి కవిత ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవి ఎవరిని వరిస్తుంది..? ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీ వరకు జిల్లా పరిషత్ పాలక వర్గ పదవీ కాలం ఉంది. ఈలోపే జెడ్పీ చైర్పర్సన్ పదవికి కవిత రాజీనామా చేయడంతో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా ఉన్న వారు చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బరపటి వాసుదేవరావు పాల్వంచ జెడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ తరఫున ఎన్నికై తుమ్మల నాగేశ్వరరావుతోపాటు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. తుమ్మల సన్నిహితుడిగా పేరొందిన బరపటి వాసుదేవరావును జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లా పరిషత్ పదవీ కాలం ముగిసే లోపు చైర్మన్ రాజీనామా చేస్తే వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీనేనని.. అదే తరహా సంప్రదాయం కొనసాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టీడీపీ గెలుపొందడంతో గడిపల్లి కవిత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశం లభించింది. 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకుంది. పలు కీలక మండలాల జెడ్పీటీసీ పదవులను కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరమైన చర్చ కొనసాగుతోంది. మిగిలిన పదవీ కాలం రెండు నెలలే.. రెండునెలల్లో జిల్లా పరిషత్ పదవీకాలం ముగుస్తుండటంతో కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. వైస్ చైర్మన్‌కు చైర్మన్‌గా బా§ధ్యతలు అప్పగించే అవకాశం సైతం లేకపోలేదని చర్చ జరుగుతోంది. 2014లో 46 మండలాల జెడ్పీటీసీ పదవులకు ఎన్నికలు జరగ్గా.. రాష్ట్ర విభజన అనంతరం ఐదు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో 41 మండలాల జెడ్పీటీసీలు జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి పలువురు జెడ్పీటీసీలు టీఆర్ఎస్లో చేరడంతో జిల్లా పరిషత్‌లో టీఆర్ఎస్ మెజార్టీ కలిగి ఉంది. వాసుకు చైర్మన్ గిరి దక్కేనా? పాల్వంచరూరల్: జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి గడిపల్లి కవిత రాజీనామా చేయడంతో వైస్ చైర్మన్‌కు ఆ పదవి దక్కుతుందనే చర్చ సాగుతోంది. పాల్వంచ జెడ్పీటీసీ సభ్యుడు బరపటి వాసుదేవరావు ప్రస్తుతం జెడ్పీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. 2014లో పాల్వంచ జెడ్పీటీసీగా టీడీపీ నుంచి విజయం సాధించిన ఆయన తుమ్మల నాగేశ్వరరావుతోపాటే టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. తుమ్మలకు సన్నిహితుడనే పేరు కూడా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది. -
టీఆర్ఎస్కు షాక్.. జెడ్పీ ఛైర్పర్సన్ రాజీనామా
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గడిపల్లి కవిత పదవికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఈమేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్నన్‌కు అందజేశారు. గత కొంతకాలంగా పార్టీలో ఆమెకు సరైన ప్రాధ్యాన్యత ఇవ్వక పోవడంతో రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మధిర స్థానంలో పోటీ చేయాలని ఆమె భావించారు. కానీ మధిర టికెట్‌ను ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ వర్గానికి చెందిన లింగాల కమల్ రాజ్‌కు ఇవ్వడంతో ఆమె తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కవిత 2014లో రాజకీయాల్లోకి వచ్చి జెడ్పీ చైర్‌పర్సర్‌గా ఎన్నికయ్యారు. కాగా ఎన్నికల ముందు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బుడాన్ బేగ్ కూడా పార్టీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. -
జెడ్పీ చైర్పర్సన్ సీసీ ఆత్మహత్యాయత్నం!
శ్రీకాకుళం, అరసవల్లి: ‘పదోన్నతితో పాటు సర్వీసు రెగ్యులర్ చేసే విషయంలో జెడ్పీ సీఈఓ బి.నగేష్, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు డి.అప్పన్నలు మూడేళ్లుగా తనను మానసికంగా వేధిస్తున్నారని, కక్ష సాధిస్తున్నారని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొంటూ జిల్లా పరిషత్ ఉద్యోగి మాసపు సంతోష్‌కుమార్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికిపాల్పడ్డాడు. తన చావుకు వారే కారణమంటూ విలేకరుల ఎదుట జిల్లా పరిషత్ కార్యాలయంలోనే ప్రమాదకర ఫినాయిల్‌ను తాగేయడంతో స్థానికంగా కలకలం రేగింది. జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మికి క్యాంపు క్లర్క్ (సి.సి)గా పనిచేస్తున్న సంతోష్ మంగళవారం ఉదయం విలేకరుల సమక్షంలో తన ఆవేదనను వెల్లగక్కాడు. తనకు సీనియర్ అసిస్టెంట్‌గా కండీషనల్‌గా పదోన్నతి ఇచ్చారని, దీన్ని రెగ్యులర్ చేయాలని సీఈఓను ఎన్నోసార్లు కోరానని చెప్పాడు. కుటుంబ కలహాల కేసు కారణంగా అమలైన తన సస్పెన్షన్ కాలాన్ని రెగ్యులర్ చేసి, ఇంక్రిమెంట్లు మంజూరు చేసే విషయంలోనూ సీఈఓ, యూనియన్ నేతలు వేధించారని వాపోయాడు. ఆఖరికి అనిల్ అనే క్లాస్–4 ఉద్యోగితో తనపై అట్రాసిటీ కేసును కూడా బనాయించేలా కుట్ర పన్నారని ఆధారాలతో వివరించాడు. తనకు జరిగిన అన్యాయంపై సూసైడ్ నోట్‌నే ఫిర్యాదుగా తీసుకుని కలెక్టర్, ఎస్పీలు న్యాయం చేయాలని చెబుతూ ఒక్కసారిగా ఫినాయిల్‌ను తాగేశాడు. దీంతో తోటి ఉద్యోగులంతా ఆందోళనకు గురై వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. నిబంధనల ప్రకారమే.. చైర్పర్సన్ సీసీగా పనిచేస్తున్న సంతోష్ పదోన్నతి విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను. ఇందులో ఎటువంటి కక్ష సాధింపులు లేవు. ఇప్పటికే ఆయనకు సీనియర్ అసిస్టెంట్‌గా తాత్కాలిక పదోన్నతి ఇచ్చాం. రెగ్యులర్ చేయడానికి కోర్డు కేసులుండడంతో కొంత సమయం పడుతుంది. ఆయన చైర్పర్సన్ వద్ద పనిచేస్తున్నాడు..! విధివిధానాలు ఎలా ఉంటాయో అతనికి బాగా తెలుసు. -
ప్రెస్మీట్లో జెడ్పీ చైర్మన్ పీఏ ఆత్మహత్యాయత్నం
సాక్షి, శ్రీకాకుళం : పదోన్నతి కల్పించే విషయంలో జిల్లా పరిషత్ సీఈవో నగేశ్ వేధింస్తున్నారని ఆరోపిస్తూ జడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మీ పీఏగా పనిచేస్తున్న సంతోష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జడ్పీ చైర్మన్ మీడియా సమావేశం ఉందని మీడియాను పిలిపించి.. వారి సమక్షంలోనే పురుగుల మందు తాగారు. సహచర ఉద్యోగులు, మీడియా సిబ్బంది సంతోష్‌ను అడ్డుకొని పురుగుల మందు బాటిల్‌ను లాక్కున్నారు. అనంతరం సంతోష్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తులం సంతోష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.చైర్మన్‌కు అనుకూలంగా పనిచేస్తున్నానని జడ్పీ సీఈవో నగేష్ తనను వేధిస్తున్నారంటూ సంతోష్ ఆరోపించారు. ఆత్మహత్యాయత్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ప్రెస్మీట్లో జెడ్పీ చైర్మన్ పీఏ ఆత్మహత్యాయత్నం
-
బీబీనగర్ : నిరుపయోగంగా మండల సమాఖ్య భవనం
సాక్షి, బీబీనగర్ : మండల కేంద్రంలోని మహిళా సంఘాల సౌలభ్యం కోసం నిర్మించిన మండల సమాఖ్య భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో భవనం కాస్త నిరుపయోగంగా మారింది. పోచంపల్లి చౌరస్తా సమీపంలో మండల సమాఖ్య భవన నిర్మాణానికి 2011లో బీఆర్జీఎఫ్ నిధుల నుంచి రూ.11లక్షలు మంజూరయ్యాయి. దీంతోఅప్పటి జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ భవన నిర్మాణం చివరి దశలో ఉండగా నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయి భవనం అసంపూర్తిగానే మిగిలిపోయింది. స్త్రీ శక్తి భవనం నిర్మించడంతో.. మండల సమాఖ్య భవనం నిర్మాణం జరుగుతున్న సమయంలో స్త్రీ శక్తి భవనం మంజూరైంది. దీంతో ఈ భవనం నిర్లక్ష్యానికి గురికాగా స్త్రీ శక్తి భవనం నిర్మాణ పూర్తి చేశారు. దీంతో మండల మహిళా సమాఖ్య సంఘాలు ఈ భవనాన్ని వినియోగిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న మండల సమాఖ్య భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారి బూత్ బంగ్లాగా దర్శనమిస్తున్న భవనాన్ని మరో ప్రభుత్వ కార్యాకలాపాలకు వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. భవన నిర్మాణాన్నిపూర్తిచేయాలి మండల సమాఖ్య భవన నిర్మాణాన్ని నిలిపివేయడంతో భవనం అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనాన్ని నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించాలని కోరుతున్నాం. – బెండ ప్రవీణ్, బీబీనగర్ -
పంతం నీదా.. నాదా సై
ఒంగోలు టూటౌన్: జిల్లా అభివృద్ధికి గుండెకాయ వంటి జిల్లా పరిషత్ వివాదాల సంక్షోభంపై పాలకులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిషత్ పాలనలో చైర్మన్ ఈదర హరిబాబు, సీఈవో కైలాష్ గిరీశ్వర్ మధ్య కొరవడిన సమన్వయంపై నోరు మెదపకపోవడంపై మండిపడుతున్నారు. సమన్వయంతో ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన వీరు ఎవరికి వారే మోనార్క్లుగా వ్యవహరిస్తున్నారు. నువ్వేంత ఎంటే నువ్వెంత అనే స్థాయికి వీరి వ్యవహరం వెళ్లటం జిల్లా ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. చివరకు జిల్లా పరిషత్ రోడ్డున పడింది. ఏ స్థాయికి వెళ్లిందంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అనధికార సభ్యులు వెళ్లి గొడవ చేసే స్థాయికి దిగజారింది. సోమవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో చొరబడిన కొందరు ప్రైవేట్ వ్యక్తులను గుర్తించి పోలీసులు బయటకుపంపిన విషయం జిల్లాలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన సమావేశం చివరికి వీరి వివాదాలకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వేదికవుతోంది. ప్రతి సమావేశం రచ్చ రచ్చ అవుతోంది. ప్రజా సమస్యలు, ప్రశ్నోత్తరాల సమయం గాలికిపోతోంది. అధికారులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూడాల్సి వస్తోంది. పనుల ఆమోదం కోసం సభ్యులు నెత్తి, నోరు కొట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు. గ్రామాలలో ఇంతవరకు పనులు చేయలేకపోయామని, ప్రజల ముందు తలెత్తుకోలేకపోతున్నామని సభ దృష్టికి తీసుకువస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఇలా గత మూడు సమావేశాలుగా జరుగుతున్నా జిల్లా పెద్దలు, జిల్లా యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. ప్రభుత్వ కూడా చోద్యం చూస్తుండటంతో జిల్లాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జడ్పీలో కరువైన పాలన, చైర్మన్, సీఈవో మధ్య కొరవడిన సమన్వయంపై జిల్లా ప్రజలను కలవర పరుస్తోంది. ఎనిమిది నెలలే గడువు.. జిల్లాలో 56 మండలాలు ఉండగా 1028 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవి ఒంగోలు, కందుకూరు, మార్కాపురం రెవెన్యూ డివిజన్లుగా పరి పాలన జరుగుతోంది. 25.92 లక్షల గ్రామీణా జనాభా ఉండగా, పట్టణ జనాభా 4.67లక్షలకు పైగా ఉన్నారు. మొత్తం 33 లక్షల వరకు జనాభా ఉన్నారు. మొత్తం 12 శాసన సభా నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న 56 మండలాల నుంచి ఎన్నికైన 56 మంది జడ్పీటీసీ సభ్యులతో జిల్లా పరిషత్ పాలకవర్గం ఏర్పడింది. ఈ పాలక వర్గం ఏర్పడి నాలుగున్నరేళ్లయింది. ఇంకా ఎనిమిది నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ పరిస్థితులలో సోమవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సర్వ సభ్య సమావేశ ఉద్దేశమిది.. జిల్లాలోని గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆయా మండలాల్లోని జడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించిన పనులపై సమీక్షించాలి. చేస్తున్న పనుల వివరాలతోపాటు నిధుల కేటాయింపుల గురించి సభ దృష్టికి తీసుకురావాలి. సమావేశంలో పాలకవర్గం ఆమోదించిన పనులకు సీఈవో, చైర్మన్ ఆమోద ముద్ర వేయాలి. కాని గత రెండు, మూడు సమావేశాలుగా ఇలా జరగటంలేదు. పాలకవర్గం ఆమోదించిన పనులకు సీఈవో ఆమోద ముద్ర వేయకపోవడంతో సమస్య జటిలమవుతోంది. చైర్మన్ ప్రతిపాదించిన పనులలో లోపాలు, లొసుగుసుకులు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ తిరిస్కరిస్తుండటంపై విబేధాలు తీవ్ర తరమయ్యాయి. ఈ విబేధాలే గత రెండు, మూడు సర్వసభ్య సమావేశాలలో ముదిరి పాకన పడ్డాయి. సమస్య ఎటు తేలకుండానే సమావేశాలు ముగిస్తుండటం పరిపాటిగా మారింది. పెండింగ్‌లో కోట్ల రూపాయల పనులు.. రెండు వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో ఉపాధి పనుల 90 శాతం, జిల్లా పరిషత్ నిధులు 10శాతంతో పనులు చేయాల్సి ఉంది. ఈ పనులకు సంబంధించి గత యేడాది జూన్‌లో జరిగిన సమావేశంలో రూ.40 కోట్ల అంచనాలతో దాదాపు 668 పనులను ఆమోదించారు. ఈ ఫైల్ చివరకు జిల్లా కలెక్టర్ వద్దకు చేరి నిలిచిపోయింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో రూ.7 కోట్ల విలువైన పనులకు తీర్మానాలు చేశారు. ప్రతి సభ్యుడు రూ.10 లక్షల పనులకు ప్రతిపాదించి ఆమోదించారు. ఈ ఫైల్ జిల్లా పరిషత్‌లో టేబుల్‌కే పరిమితమయింది. కథ దీని దగ్గర నుంచేమొదలయింది.చైర్మన్ అందించిన పత్రాలలో పాత తేదిలు వేశారనే అనుమానంతో సీఈవో ఈ ఫైలును ముందుకు కదలనీయ్యలేదని సమాచారం. ఆయన వాదన కూడా అదే. ఫలితంగా పనులు మంజూరులో జాప్యం జరిగిందని చర్చించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ముందు జిల్లా పరిషత్ చైర్మన్ రూ.6 కోట్ల విలువైన పనులకు సంబంధించిన ఫైలును సీఈవోకి పంపించారు. దీనిపై సీఈవో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి విషయాలు వెల్లడించారు. లోటు బడ్జెట్ కారణంగా చైర్మన్ పంపిన పనులను ఆమోదించలేమని వెల్లడించారు. దీనిపై సర్వసభ్య సమావేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాదోపవాదాలు జరిగాయి. జడ్పీలోనూ, ట్రెజరీలో ఉన్న మొత్తం నిధులు కేవలం రూ.22.80 కోట్లేనని వాటిలో వివిధ రకాల పద్దులకు రూ.21 కోట్ల చెల్లించాల్సి ఉందని లెక్కలు వివరించారు. కేవలం రూ.1.80 కోట్లే ఉంటాయి. ఉన్న నిధులకే పనులు కేటాయించి ఆమోదించుకోవాల్సి ఉంటుందని సీఈవో వివరించారు. సభ్యుల మొర ఆలకించని సీఈవో.. నాలుగున్నర ఏళ్లుగా గ్రామాలలో ఏ ఒక్క పనిచేయలేకపోయాం. మీ పంతాలు, పట్టింపులతో ప్రతిపాదించిన పనులు తీర్మానం కాకుండా నిలిచిపోతున్నాయి. మేము గ్రామాలలో తిరగాలా వద్దా అంటూ సభ్యులు సోమవారం వేదిక వద్దకు వెళ్లి మరీ గొడవ చేశారు. ఇద్దరు (చైర్మన్‌ని కలుపుకోని) సమన్వయంతో పనులకు ఆమోద ముద్ర వేయాలని వేడుకున్నారు. ఇదే విషయాన్ని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఉన్న నిధులు ఎంత, ఎన్ని పనులు వచ్చాయి. ఏయే పనికి ఎంతెంత కేటాయించాలో తేల్చండి అని వివరంగా చెప్పారు.మీ గొడవ వల్ల సభలో ఉండలాన్న సిగ్గుగా ఉందని కూడా అన్నారు. ఎవరు చేయాల్సిన పని వారు చేయండి తెలిపారు. అయినా చివరకు గొడవలతోనే సమస్య ముగిసింది. చైర్మన్, సీఈవో తలోదారి.. జిల్లా పరిషత్‌లో ఎడ మొహం, పెడ మొహంగా వ్యవహరిస్తున్న చైర్మన్, సీఈవో తీరుపై జిల్లా కలెక్టర్ గాని, అధికార పార్టీకి చెందిన మంత్రులుగాని, ప్రభుత్వం గాని పట్టించుకోకపోవడంపై జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటు ప్రజల సమస్యలను పరిష్కరించటంలో చొరవ తీసుకోకపోవడంపై పల్లె ప్రజలు మండిపడుతున్నారు. చైర్మన్, సీఈవో మాట్లాడితే చట్టాలు, పంచాయతీరాజ్ చట్టం, నిబంధనలు, రూల్స్ అంటుండటం, ఎవరికి వారే అడ్డగోలుగా వ్యవహరించడాన్ని సభ్యులుతో పాటు ప్రజానీకం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోని జిల్లా పరిషత్ సంక్షోభానికి తెరపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కమలం గూటికి ఉమ..?
సాక్షి, జగిత్యాల: జిల్లా పరిషత్ చైర్పర్సన్.. మేడిపల్లి మండలం మోత్కురావుపేట ఆడబిడ్డ తుల ఉమ త్వరలోనే కమలం గూటికి చేరునున్నారా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఖరారైతే ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగే ఆలోచనతో ఆమె ఉన్నారా..? ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నారా..? అంటే ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. వేములవాడ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన తుల ఉమ.. ఈనెల 24న ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు ఆధ్వర్యంలో తన పుట్టినిల్లయిన మేడిపల్లిలో జరిగిన ప్రజాఆశీర్వాద సభకు డుమ్మా కొట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మొదట్నుంచే రమేశ్‌బాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉమ.. ఆశీర్వాద సభకు హాజరైతే ఆయన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకున్నట్టే అని అందరూ భావించారు. కానీ ఆమె సభలో పాల్గొనకపోవడం.. మరుసటి రోజే అక్కడే తన క్యాడర్‌తో సుమారు మూడు గంటలపాటు సుదీర్ఘ మంతనాలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యే బరిలో ఉండాల్సిందేనంటూ ఉమపై ఆమె క్యాడర్ తీవ్రఒత్తిడి తీసుకురావడంతో ఆమె బరిలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అనే విషయంపై ఉమ తన క్యాడర్‌కు స్పష్టత ఇవ్వలేదు. మరోపక్క రమేశ్‌బాబు జర్మనీ పౌరసత్వం కేసుకు సంబంధించి ఈనెల 26న కోర్టులో విచారణ ఉంది. ఇందులో ఏ తీర్పు వస్తుందో వేచిచూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలనే ఆశతో ఉమా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తీర్పు రమేశ్‌బాబుకు అనుకూలంగా వస్తే బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే ప్రచారం జరుగుతోంది. ప్రతికూల తీర్పు వస్తే.. వేములవాడ టికెట్ తనకే వరిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఉమ వైపు బీజేపీ చూపు..? ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా బీజేపీ కొన్నిరోజుల క్రితం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో వేములవాడ నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఉమపై పార్టీ ఆరా తీసినట్లు సమాచారం. ఇదే క్రమంలో వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉన్న.. సున్నిత మనస్కురాలిగా పేరొందిన తుల ఉమకు వేములవాడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఉమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో హైదరాబాద్‌లో కలవడం అప్పట్లో చర్చకు దారి తీసింది. తాజాగా బీజేపీ జాతీయ నాయకులు ఉమతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీనే నమ్ముకుని ఉన్న ప్రతాపరామకృష్ణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ ప్రతాప రామకృష్ణను కాదని ఉమకు టికెట్ ఇస్తే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనని బీజేపీ నేతలు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచే.. 2001 టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే తుల ఉమ పార్టీలో కొనసాగుతున్నారు. అప్పట్నుంచీ పార్టీనే నమ్ముకుని ఉన్న ఆమె 2014 ఎన్నికలతోపాటు ఈసారీ తన నియోజకవర్గమైన వేములవాడ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. దీనికి తోడు వేములవాడ తాజామాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, తుల ఉమల మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న పోరు తారస్థాయికి చేరుకుంది. ఈక్రమంలోనే ఆమె ఉమ పార్టీపై కాస్త అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు రమేశ్‌బాబు, తుల ఉమకు చెందిన రెండువర్గాలుగా చీలిపోయారు. కొన్నాళ్ల నుంచి ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కాగా ప్రస్తుతం తుల ఉమకు మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో బాగా పట్టు ఉంది. ఇటు వేములవాడ, చందుర్తి, కోనరావుపేట మండలాల్లోనూ కొంత క్యాడర్ ఉంది. కేసీఆర్‌నే నమ్ముకుని ఉన్న: తుల ఉమ టీఆర్ఎస్ ఏర్పాటు రోజు నుంచే నేను మా పార్టీ అధినేత కేసీఆర్‌పై నమ్మకంతో ఉన్న. వేములవాడ టికెట్ నాకే వస్తుందనే నమ్మకం ఉంది. మంత్రులు ఈటల, కేటీఆర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ కూడా భరోసా ఇచ్చారు. ఇప్పటికైతే టీఆర్ఎస్ను వీడే ఆలోచన లేదు. హైదరాబాద్‌లోని మా బంధువు ఇంటికి వెళ్లగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ యాదృచ్ఛికంగా కలిశారు. -
చర్చనీయాంశంగా.. జెడ్పీ!
సాక్షిప్రతినిధి, నల్గొండ : నల్గొండ జిల్లా పరిషత్ రాజకీయం రసకందాయంలో పడింది. జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ తిరిగి సొంతగూటికి చేరడంతో జిల్లా పరిషత్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. కాంగ్రెస్‌నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన బాలు.. చైర్మన్‌గా ఎన్నికై ఆరు నెలలకే టీఆర్ఎస్లో చేరారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన మరో 19 మంది జెడ్పీటీసీ సభ్యులు కూడా టీఆర్ఎస్లోకి వలసెళ్లారు. జెడ్పీ పాలక వర్గంలో 59 మంది సభ్యులకుగాను స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ 43 వంది, టీఆర్ఎస్ నుంచి 13 మంది, టీడీపీ ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. దీంతో ఎస్టీలకు రిజర్వుడు అయిన నల్లగొండ జెడ్పీ చైర్మన్ పీఠాన్ని ఎక్కే అ దృష్టం చందంపేట జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచిన బాలునాయక్‌ను వరించింది. అప్పటికీ ఆయన దేవరకొండ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. వివిధ కారణాలతో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం, ఆ తరువాత 19 మంది కాంగ్రెస్ సభ్యులు కూడా టీఆర్ఎస్లోకి చేరడంతో జెడ్పీలో వారి బలం 32కు పెరిగింది. కాంగ్రెస్ సంఖ్యా బలం తగ్గి, టీఆర్ఎస్ బలం పెరగడంతో జెడ్పీలో నా లుగేళ్లపాటు వారి ఆధిపత్యమే కొనసాగింది. జిల్లా పరిషత్‌కు కేటాయించే సాధారణ నిధులు, ఆర్థిక సంఘం నిధుల పంపకాల్లో అధికార పార్టీ సభ్యులదే పైచేయిగా ఉండేది. పనుల పంపకాల్లో సభ్యులు అందరికీ కలిపి ఒక వాటా ఇస్తే.. చైర్మన్‌కు ప్రత్యేకమైన వాటా తీసుకునేవారు. ఈ పంపకాల విషయంలో అధికార, ప్రతిపక్ష సభ్యులకు మధ్య ఎప్పుడూ వాగ్వాదం జరిగేది. నిధుల పంపకాల్లో మంత్రి, ఎమ్మెల్యేల సహకారం కూడా చైర్మన్‌కు ఉండడంతో ప్రతిపక్ష సభ్యులకు నోరుమెదిపే అవకాశం లేకుండా పోయింది. చివరకు జెడ్పీ వైస్ చైర్మ¯Œన్ కర్నాటి లింగారెడ్డి సైతం మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జానారెడ్డికి అత్యంత సన్నిహితుడైన లింగారెడ్డి కాంగ్రెస్‌నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లాల్సిన పరిణామాలు ఏర్పడ్డాయి. కొంతకాలానికి లింగారెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చారు. అధికార సభ్యుల బలంతో నాలుగేళ్ల పాటు రాజ్యమేలిన జెడ్పీ పాలక వర్గం ఇప్పుడు చైర్మన్ తిరిగి సొంత గూటికి చేరడంతో జెడ్పీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలకవర్గానికి పది నెలల గడువు జెడ్పీ పాలకవర్గం 2014 జులై 5న కొలువుదీరింది. ఈ ఏడాది జూలై నాటికి నాలుగేళ్లు పూర్తయింది. వచ్చే ఏడాది జులై 4వ తేదీ నాటికి సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. అంటే ఇంకా పది నెలల గడువు మిగిలి ఉంది. దేవరకొండ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన బాలునాయక్ తిరిగి మరోసారి ఎమ్మెల్యే కావాలనే, తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ఒకవేళ ఆయనకు టికెట్ కేటాయిస్తే, ఆ ఎన్నికల్లో ఆయన గెలిస్తే.. చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే, ఒకవేళ ఓడిపోతే మాత్రం తిరిగి ఆయన చైర్మన్‌గా కొనసాగే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, టీఆర్ఎస్ మెజార్టీ సభ్యులు ఉన్న జెడ్పీలో బాలునాయక్‌ను చైర్మన్‌గా కొనసాగనిస్తారా? లేదంటే అవిశ్వాస తీర్మానానికి సభ్యులు సిద్ధపడతారా..? అన్న విషయం ప్రస్తుతం చర్చనీ యాంశంగా మారింది. ఈ వివాదం ఇప్పట్లో తేలేలా లేకున్నా కాంగ్రెస్ సభ్యులు మాత్రం సంతోషంగా ఉన్నారని అంటున్నారు. ఈ పదినెలల కా లంలో జెడ్పీకి వచ్చే నిధుల్లో కాంగ్రెస్ సభ్యులకు మెజార్టీ వాటా దక్కుతుందని ఆశపెట్టుకున్నారు. అవిశ్వాసం అనివార్యమైతే..! ఒకవేళ చైర్మన్‌పైన అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వస్తే మొత్తం సభ్యుల్లో నాలుగో వంతు మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడున్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సభ్యుల సంఖ్యలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. జెడ్పీ రాజకీయ ఎలా ఉండబోతుందో ప్రత్యక్షంగా చూడాలంటే మాత్రం అక్టోబర్ 11వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంటుందంటున్నారు. ఆ రోజున జరగనున్న జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇరు పార్టీల సభ్యులు ఎలా వ్యవహరించబోతున్నారు? చైర్మ¯Œన్ విషయంలో వారి వైఖరి ఎలా ఉండబోతోందోనన్న అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. -
కడప జడ్పీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : కడప జిల్లా పరిషత్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశానికి సంబంధం లేని ఆప్కో ఛైర్మన్ హాజరు కావడం పట్ల వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్త చేశారు. వేదికపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్లకార్డులతో వేదిక వద్ద నిరసనకు దిగారు. కరువుపై సమాధానం చెప్పాలంటూ మంత్రులు సోమిరెడ్డి, ఆది నారాయణ రెడ్డిలను నిలదీశారు. నెలరోజుల క్రితం పంటలను పరిశీలించిన మంత్రి ఏమి చర్యలు తీసుకున్నారని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాగా చర్చను అడ్డుకుంటున్నారని సోమిరెడ్డి ఎదురుదాడికి దిగారు. దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు, ఇరు వర్గాల వారికీ నచ్చజెప్పి ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేశారు. -
పాము కరిస్తే పూజలు చేయొద్దు
కృష్ణాజిల్లా, అవనిగడ్డ: పాముకాటు వేసినపుడు మూఢ నమ్మకాలకు పోయి మంత్రాలు, నాటువైద్యం, పూజలు చేస్తూ కూర్చోకుండా వీలైనంత త్వరగా వైద్యశాలకు వెళ్ళి చికిత్స తీసుకోవాలని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గద్దె అనూరాధ పేర్కొన్నారు. శుక్రవారం స్ధానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న పాముకాటు బాధితులను అనూరాధ, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పరామర్శించారు. పాముకాటుకు గురై చికి త్స తీసుకుంటున్న రోగులను పరామర్శించారు. ఎక్కడికి వెళితే పాము కరచింది, ఎంత సమయంలో వైద్యశాలకు వచ్చారు, చికిత్స ఎలా అందుతుందని ప్రశ్నించారు. పాముకాటుకు గురైన వెంటనే సమీపంలోని వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందడం ద్వారా ప్రాణాపాయం లేకుండా చూసుకోవచ్చన్నారు. మోపిదేవిలో నిర్వహించిన సర్పశాంతి హోమం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఛైర్పర్సన్ బదులిస్తూ పాముకాటుకు గురైనపుడు భయపడుతూ ఉండటం వల్ల విషప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ భయాలను తొలగించేందుకు, మనో ధైర్యం ఇచ్చేందుకు ఈ హోమం దోహద పడుతుందని పేర్కొన్నారు. అవసరమైతే స్నేక్ స్టిక్స్ సరఫరా... వరదలు, పంటకాలువలో కొత్తనీరు రావడం, వర్షాలు ఎక్కువగా కురవడం, ఎలుకలు పెరగడం వల్ల పాముల బెడద ఎక్కువైందని ఛైర్పర్సన్ అనూరాధ చెప్పారు. వీటి బారి నుంచి రైతులు, కూలీలను కాపాడేందుకు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలోని 11 గ్రామాల్లో హెక్టార్‌కి 40 కిలోల గుళికలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి పాముకాట్ల విషయం తీసుకెళ్ళినట్టు చెప్పారు. అవసరమైతే పాములు దగ్గరకు రాకుండా ఉండే శబ్ధతరంగాల స్టిక్స్‌ను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలు, పీహెచ్‌సీల్లో పాము విషం విరుగుడు (యాంటీ స్నేక్ వీనం ఇంజక్షన్లు) అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ బీవీ కనకదుర్గ, జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణదొర, వైద్యశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మత్తి శ్రీనివాసరావు, వైద్యులు టి.నాగలక్ష్మీ, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ (రాజా), ఎంపీటీసీ గాజుల మురళీకృష్ణ పాల్గొన్నారు. -
జెడ్పీలో ఇష్టారాజ్యం
జిల్లా పరిషత్ పరిపాలన గాడి తప్పింది. పాలకపక్షం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జెడ్పీని టీడీపీ కార్యాలయంగా మార్చేశారనే విమర్శలొస్తున్నాయి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం, ప్రతిపక్షం ప్రశ్నిస్తే.. గొంతు నొక్కడం సర్వసాధారణంగా మారిపోయింది. జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఉద్యోగుల బదిలీల్లోనూ నిబంధనలకు తిలోదకాలిచ్చారనే ఆరోపణలున్నాయి. మూడేళ్ల కాల పరిమితి ముగియకుండానే కొందరిని బదిలీ చేయడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీ సమావేశాల్లో సైతం సమస్యలపై చర్చ సాగడం లేదనే వాదన వినిపిస్తోంది. సాక్షి, మచిలీపట్నం: జిల్లా పరిషత్ (జెడ్పీ)లో ఆటవిక పాలన సాగుతోందా? తమకు ఇష్టమొచ్చిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారా? పాలకపక్షం తమ సొంత కార్యాలయంగా మలచుకుందా? అంటే అవుననే సమాధానం చెప్పా ల్సిన పరిస్థితి. ఇందుకు పాలక పక్షం వ్యవహరి స్తున్న తీరు బలం చేకూర్చుతుంది. జిల్లా పరిషత్ ప్రజా సమస్యలపై విస్తృతమైన చర్చ జరిగే వేదిక. మంత్రులు, కలెక్టర్, జెడ్పీ చైర్మన్ సభా వేదికపై ఆసీనులై ప్రజా ప్రయోజనాల నేపథ్యంలో నిర్వహించే చర్చ. ప్రతి మూడు నెలలకోసారి ప్రతిపక్ష, పాలకపక్ష ఎంపీటీసీ సభ్యులు ఒకే చోట చేరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు వెతికే నిర్ణయాలు తీసుకోవడంతో జిల్లా పరిషత్ కీలక భూమిక పోషిస్తుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న శాఖలో పరిస్థితి కట్టుతప్పింది. పాలక పక్షం తమకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెడ్పీ కార్యాలయం అన్న భావన నుంచి బయటకు వచ్చి టీడీపీ కార్యాలయంగా మార్చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలలు జిల్లాలో ఇటీవల 40 మంది ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేశారు. వీటిలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. బదిలీలకు సదరు ఉద్యోగి ఒక కార్యాలయంలో కనీసం మూడేళ్లు పనిచేయా లన్నది నిబంధన. కానీ ఇక్కడ ఇలాంటివేమీ వర్తించవు. ఆరు నెలలు పనిచేసిన వారిని సైతం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చల్లపల్లి, పామర్రు మండలాల్లో ఈ తంతు సాగింది. పరస్పర బదిలీలకు సైతం మూడేళ్లు పనిచేయాలన్నది ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉన్నా.. 8 నెలలు దాటకనే బదిలీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ⇔ జెడ్పీ సీఈవో సెలవులో ఉన్న సమయంలో డిప్యూటీ సీఈవోతో తంతు కానిచ్చేశారు. డిప్యూటీ సీఈవోకు బదిలీల అధికారం లేదు. కేవలం పాలన పరమైన ఫైళ్లపై సంతకాలు మాత్రమే చేయాల్సి ఉంది. ⇔ ఏవైనా అవినీతి, పాలన పరమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగిని విధుల నుంచి సస్పెండ్ చేస్తే.. అనంతరం ఆ ఉద్యోగి విధుల్లో చేరితే అతను ఇంతకు ముందు పనిచేసిన కార్యాలయం లో కాకుండా వేరే చోట పోస్టింగ్ ఇవ్వాలి. కానీ గన్నవరంలో ఓ ఉద్యోగి సస్పెండ్ అయితే తిరిగి అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. ⇔ జెడ్పీ చైర్మన్ ఎల్లప్పుడు కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతోంది. వారంలో కేవలం మంగళవారం మాత్రమే కార్యాలయానికి దర్శనమివ్వ డం, మిగిలిన రోజుల్లో విజయవాడలో ఉండటంతో ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు సైతం సింహభాగం మంగళవారమే నిర్వహించడాన్ని బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. కేవలం జెడ్పీ సమావేశమే కాదు.. ఎలాంటి సమావేశాలైనా మంగళవారమే నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ⇔ గత నెల 19న జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని భావించారు. తిరిగి ఈనెల 10న నిర్వహిస్తామని వాయిదా వేశారు. ఒక సారి జెడ్పీ సమావేశం తేదీ ప్రకటిస్తే విధిగా నిర్వహించాలి. కోరం లేని పక్షంలో వాయిదా వేయాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన ఉన్న నేపథ్యంలో వాయిదా వేసినట్లు విమర్శలు వస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకు ప్రజా సమస్యలపై చర్చ జరిగే సమావేశం వాయిదా వేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ⇔ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అడ్డుగా ఉందని కృష్ణమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం బహిర్గతం కావడంతో తిరిగి కృష్ణమ్మ విగ్రహాన్ని రాత్రికి రాత్రే ప్రతిష్టించారు. ⇔ జెడ్పీ చైర్మన్ గతేడాది 20 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లారు. సాధారణంగా చైర్మన్ జిల్లా దాటి 14 రోజులకు మించి వెళితే ఇన్చార్జి బాధ్యతలు ఇతరులకు అప్పగించి వెళ్లాలి. 20 రోజులు వెళ్లినా ఇతరులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిం చిన దాఖలాలు లేవన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ⇔ జెడ్పీ అజెండా పుస్తకాలు నేరుగా సభ్యులకు పంపాల్సి ఉండగా.. మండల కేంద్రాలకు పంపి సభ్యులే వచ్చి వాటిని తీసుకెళ్లాలని హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అడుగడుగునా అడ్డంకులు.. ప్రతిసారి నిర్వహించే జెడ్పీ సర్వసభ్య సమావే శంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు విద్య, వైద్యం తదితర అంశాలపై చర్చ లేవనెత్తడం.. పాలకపక్ష సభ్యులు అడ్డంకులు సృష్టించడం పరిపాటిగా మారింది. ఈ చర్యలకు నిరసనగా గత సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. కోరం లేకపోయినా పాలపక్ష సభ్యులు అంతా తామై వ్యవహరించి సమావేశం నిర్వహించి మమ అనిపించారు. -
అమిత్ షా కాన్వాయ్‌ని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
-
కొత్తపేటలో బాలుడు అదృశ్యం
శివ్వంపేట(నర్సాపూర్) : బాలుడు అదృశ్యమైన సంఘటన మండల పరిధి కొత్తపేట గ్రామంలో చోటుచేసుకుంది. గంగిరెద్దుల కాలనీలో నివాసం ఉండే మారయ్య కుమారుడు క్రాంతికిరణ్ (9) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడు. గత నెల 24న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకువెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం బాలుడి తండ్రి మారయ్య శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు శివ్వంపేట పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై లక్ష్మీకాంతరెడ్డి కోరారు. రాంపూర్ తండాలో.. చేగుంట(తూప్రాన్) : మండలంలోని రాంపూర్ తండాలో తమ కుమారుడు ప్రవీణ్ తప్పిపోయినట్లు తల్లిదండ్రులు యెమ్లీ, వెంకటిలు తెలిపా రు. వారి కుమారుడు ప్రవీణ్ అలియాస్ అచ్చూ శనివారం ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలిపారు. అదేరోజు రాత్రి నుండి ప్రవీణ్‌కోసం వెతికినా జాడ దొరకలేదని తెలిపారు. మూడు రోజులుగా బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో మంగళవారం చేగుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టి బాలుడి ఆచూకీ కనుగొంటామని తెలిపారని చెప్పారు -
యాంటీ ఆక్సిడెంట్లతో 20 ఏళ్లు వెనక్కు...
పండ్లు, కాయగూరల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లతో ఆరోగ్యానికి మేలన్నది అందరికీ తెలుసుగానీ.. దీని వెనుక ఉన్న రహస్యమేమిటన్నది మాత్రం అంతగా తెలియదు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ లోటు భర్తీ అయింది. అంతేకాకుండా మార్కెట్లో లభ్యమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ మన రక్తనాళాలు విశాలంగా మారేందుకు సాయపడతాయని... తద్వారా వాటి వయసు 20 ఏళ్లు తగ్గినట్లు అవుతుందని కూడా గుర్తించారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఈ మార్పు జరిగితే గుండెజబ్బుల నుంచి రక్షణ లభిస్తుందన్నది తెలిసిందే. కొంతమంది 60 – 69 ఏళ్ల మధ్యవయసున్న కార్యకర్తలకు ఈ యాంటీ ఆక్సిడెంట్లను రోజుకు 20 మిల్లీగ్రాములు, ఇంకొంతమందికి ఉత్తుత్తి మందు అందించినప్పుడు వారి ఎండోథీలియం (రక్తనాళపు లోపలిగోడలు) చాలా చక్కగా పనిచేయడం మొదలుపెట్టాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. వరుసగా ఆరువారాలపాటు ఈ యాంటీ ఆక్సిడెంట్లను వాడిన తరువాత రెండు వారాల విరామమిచ్చి యాంటీ ఆక్సిడెంట్లను ఉత్తుత్తి మందులను మార్చి ఇచ్చామని అప్పుడు కూడా దాదాపు సగంమందిలో రక్తనాళాలు విశాలంగా మారాయని చెప్పారు. ఆహారం జీర్ణమైపోగా మిగిలిపోయే ఫ్రీరాడికల్స్ సమస్య తక్కువ కావడం వల్ల ఈ మార్పు చోటు చేసుకుంటున్నట్లు తాము అంచనా వేస్తున్నామని మరిన్ని పరిశోధనలు చేపట్టడం ద్వారా ఫలితాలను నిర్ధారించుకుంటామని చెప్పారు. పరిశోధన వివరాలు హైపర్‌టెన్షన్ మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. -
పనోడు అని సంబోధిస్తారా?
ఒంగోలు టూటౌన్ : జిల్లా పరిషత్ సీఈఓ టి. కైలాష్ గిరీశ్వర్‌ని పనోడు అని మిగిలిన ఉద్యోగులను చిన్న పనోళ్లని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు సంబోధించడం దురదృష్టకరమని ఎంపీడీఓ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ బి. సాయికుమారి, మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసకుమార్, పంచాయతీ కార్యదర్శిల అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రామోహన్, పీఆర్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ వై. పోలయ్య (పాల్‌రాజ్), ఈఓఆర్డీల అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తదితరులు గురువారం తీవ్రంగా ఖండించారు. 18వ తేదీ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జరిగిన ఈ సంఘటన అందరినీ బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులంతా ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలే కానీ ఒకరికి ఒకరు జవాబుదారీ తనం కాదని చెప్పారు. జరిగిన సంఘటనను పంచాయతీ రాజ్ డిపార్టుమెంట్ తరఫున అన్ని అసోషియేషన్లు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. -
డంపింగ్ యార్డులు నిర్మించాలి
నల్లగొండ : గ్రామాల్లో డంపింగ్ యార్డులు నిర్మించాలని జెడ్పీ స్థాయీ సంఘం కమిటీ సభ్యులు కోరారు. గురువారం నల్లగొండలోని జెడ్పీ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం స్థాయి సంఘం కమిటీల సమావేశం జరిగింది. జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలూనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆయా కమిటీల సభ్యులు, ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ.. గ్రామాల్లో రహదారుల వెంట చెత్తా చెదారం పేరుకుపోతోందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో డంపింగ్ యార్డులు నిర్మించి.. చెత్త నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారంలో భాగంగా పంపిణీ చేస్తున్న మల్బరీ, వేప మొక్కలు నాసిరకంగా ఉంటున్నాయని.. మొక్కలు ఎదగడం లేదని సభ్యులు అన్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడానికి కాంటాలు సరిపోవడం లేదని, అధనంగా కాంటాలు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, చింతపల్లి, మాడ్గులపల్లి ఏరియాల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని, జాతర్లు, పండుగలప్పుడు వ్యాపారులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని సభ్యులు తెలిపారు. దీనిపై ఎక్సైజ్ శాఖ స్పందిచకపోతే.. ప్రజాప్రతినిధులుగా తామే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గురువారం జరిగిన సమావేశాలకు పలువురు అధికారులు హాజరు కాకపోవడంపై జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా గైర్హాజరైన అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గత సమావేశాల్లో సభ్యులు కోరిన వివిధ అభివృద్ధి పనులను అధికారులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చైర్మన్ సూచించారు. సమావేశంలో సభ్యులు, జెడ్పీ సీఈఓ హనుమానాయక్, డీఆర్డీఓ రింగు అంజయ్య, డీఈఓ జగిని చైతన్య, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. -
రాజ్యసభ ఎంపీని కలిసిన అరిగెల
వాంకిడి(ఆసిఫాబాద్) : టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, వాంకిడి జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు బుధవారం ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర, గ్రామీణ ప్రాంతాల సమస్యలను రాజ్యసభలో చర్చించాలని కోరినట్లు అరిగెల నాగేశ్వర్రావు ఫోన్‌ద్వారా విలేకరులకు తెలిపారు. -
వంద కోట్లకు విమాన ప్రయాణికులు!
న్యూఢిల్లీ: దేశీ విమానయాన రంగం గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో.. వచ్చే 15–20 ఏళ్లలో ప్రయాణికుల సంఖ్య అయిదు రెట్లు పెరుగుతుందని, వంద కోట్లకు చేరగలదని పౌర విమానయాన శాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసం కొత్తగా మరిన్ని విమానాశ్రయాల నిర్మాణం, సిబ్బందికి నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడం మొదలైన వాటిపై కసరత్తు చేస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా బుధవారం ఏఐఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. కేవలం విమానాలే కాకుండా హెలికాప్టర్లు, సీ ప్లేన్లు, ప్యాసింజర్ డ్రోన్స్ మొదలైన వాటిలో ప్రయాణించే వారంతా కూడా ఈ వంద కోట్ల ప్రయాణికుల్లో ఉంటారని పేర్కొన్నారు. 2013లో పది కోట్లుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య 2017లో ఇరవై కోట్లకు చేరినట్లు సిన్హా వివరించారు. 130 కోట్ల దేశ జనాభాలో ప్రస్తుతం కేవలం అయిదు శాతం మంది మాత్రమే విమాన ప్రయాణం చేస్తున్నారని ఆయన తెలిపారు. రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం.. భారీ లక్ష్య సాధనకు సంబంధించిన అడ్డంకులను తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని సిన్హా వివరించారు. 100 కోట్ల విమాన ప్రయాణికుల లక్ష్యాన్ని సాధించేందుకు రూ. 4 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం ఏవియేషన్ రంగంలో ప్రత్యక్షంగా రెండు లక్షల మంది, పరోక్షంగా 12 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని.. వచ్చే కొన్నేళ్లలో ఇది 60 లక్షలకు చేరగలదన్నారు. అలాగే ఏవియేషన్ రంగం ఆదాయాలు రూ.2 లక్షల కోట్ల నుంచి 15–20 ఏళ్లలో రూ.8–10 లక్షల కోట్లకు చేరుతుందని తెలిపారు. భారీగా వృద్ధి చెందుతున్న ప్యాసింజర్ డ్రోన్స్ విభాగం.. రాబోయే రోజుల్లో ఏకంగా లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరగలదని పేర్కొన్నారు. ఈ విభాగంలో ఆధిపత్యం దిశగా ప్రమాణాలు, నిబంధనల రూపకల్పన, టెక్నాలజీ మొదలైన వాటిపై కేంద్రం దృష్టి సారిస్తోందని సిన్హా వివరించారు. మేకిన్ ఇండియా విమానాలు.. విమానాలు, డ్రోన్ల తయారీని కూడా మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగం చేయాలని కేంద్రం యోచిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. మరికొన్నేళ్లలో భారత్‌కు 1,300 విమానాలు అవసరమవుతాయని ఆయన వివరించారు. ‘ఈ 1,300 విమానాలను విదేశాల నుంచి తెచ్చుకోవాలనుకోవడం లేదు. వీటిని భారత్‌లోనే తయారు చేస్తాం‘ అని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో రక్షణ శాఖ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని పని చేయనున్నట్లు ఆయన వివరించారు. -
జాతీయస్థాయిలోనూ వైఎస్ జగన్ ప్రకంపనలు!
-
బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన బీసీ సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. జనాభాలో సగభాగం బీసీలున్నారని, వారి ఓట్లతోనే ఏ పార్టీకైనా అధికారం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రలోభాల రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇకపై బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకే ఓట్లు పడతాయన్నారు. ఇప్పటివరకు పార్లమెంటులో బీసీలకు సముచిత న్యాయం జరగలేదని.. వందల కులాలకు ప్రాతినిధ్యం దక్కలేదని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఎమ్మెల్యేలు తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. -
చదువుతోనే మార్పు
విజ్ఞానం సాధించేందుకు చదువు చక్కని మార్గం అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం గొప్ప మార్పునకు సంకేతమని.. ఇది అమలు కావడంతో అనేక మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చారని చెబుతున్నారు. అయితే సభలు, సమావేశాల్లో మాట్లాడే అవకాశం.. వేదికపై కుర్చీలు ఇచ్చే విషయంలో ఇప్పటికీ అన్ని చోట్ల వివక్ష ఉందని.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని కోరుతున్నారు. ఇదంతా ఒక్కరోజులో వచ్చేది కాదని.. మార్పు మొదలైందని.. అది మరింత వేగంగా జరగాలని ఆకాంక్షిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు స్వావలంబన సాధించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ పిలుపునిచ్చారు. ‘విజ్ఞానం పెంచుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. అప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు.. విజ్ఞానం సాధించేందుకు చదువు చక్కని మార్గం.’ అని అంటున్నారు. ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతుల్లో చోటుచేసుకుంటున్న మార్పులపై తన అభిప్రాయాలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. పద్మ ఏమంటున్నారో ఆమె మాటల్లోనే.. విజ్ఞానం పెంచుకోవాలి.. గతంతో పోల్చితే ఆడపిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వచ్చింది. మగ పిల్లలకు పోటీగా ఆడ పిల్లలను చదివిస్తున్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తున్నారు. గతంలో ఇంత చక్కని అవకాశం లేదు. ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకున్నప్పుడు మహిళా సాధికారత అనేది సాధ్యమవుతుంది. ఒత్తిడిని తగ్గించాలి.. మన కార్యాలయాలన్నీ పురుషుల పనితీరుకు తగ్గట్లుగానే ఉంటాయి. వర్కింగ్ ఉమెన్ కష్టానికి తగ్గట్లుగా పని ప్రదేశాల్లో మార్పు రావాలి. ఇంటి దగ్గర వంటతో మొదలు పెట్టి ఆఫీసు పని.. మళ్లీ సాయంత్రం ఇంటి పని.. ఇలా పొద్దంతా కష్టపడతారు. వారికి ఒత్తిడి తగ్గేలా ఆఫీసులో వాతావారణం ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో వెయిటింగ్ రూం అందుబాటులోకి తెచ్చాం. మధ్యాహ్నం లంచ్ చేసేందుకు మహిళా ఉద్యోగులు దీన్ని వినియోగిస్తున్నారు. కొంత ప్రైవసీ ఉంటుంది. ఈ కొంత ఎంతో ఒత్తిడిని తగ్గిస్తుంది. చేతల్లో చూపించాలి.. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అనే స్లోగన్లు అనేక చోట్ల కనిపిస్తాయి. ఇలా మాటల్లో, రాతల్లో ఉండే వాటిని చేతల్లో చూపించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం గొప్ప మార్పునకు సంకేతం. ఈ విధానం అమలు కావడం వల్ల అనేక మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు. సభలు, సమావేశాల్లో మాట్లాడే అవకాశం, వేదికపై కుర్చీలు ఇచ్చే విషయంలో ఇప్పటికీ అన్ని చోట్ల వివక్ష ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఇదంతా ఒక్కరోజులో వచ్చేది కాదు. మార్పు మొదలైంది. అది మరింత వేగంగా జరగాలి. ఇప్పటికే స్థానిక సంస్థలో పెద్ద ఎత్తున మహిళలు రాజకీయ ప్రవేశం చేశారు. రానున్న రోజుల్లో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే రోజు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. -
అమ్మ వద్దన్నా.. ధైర్యం చేశా...
ఉన్నత విద్యను అభ్యసించింది.. ఉపాధ్యాయురాలిగా వృత్తి ధర్మం నెరవేర్చింది.. విద్యావంతులుగా తీర్చిదిద్దింది.. ఈ క్రమంలోనే రాజకీయంగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఎన్నో అవమానాలు, అవాంతరాలను అధిగమించి.. జిల్లాస్థాయిలో కీలక పదవికి చేరుకున్న ఆమె.. కష్టం, అవమానాలు, ఏవగింపు మాటలకు బెదరకుండా మరింత కసి.. పట్టుదలతో రాజకీయాలను చాలెంజ్‌గా తీసుకున్నానని చెబుతున్న జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవితతో ‘సాక్షి ప్రతినిధి’ ముఖాముఖి. – సాక్షిప్రతినిధి, ఖమ్మం సాక్షిప్రతినిధి, ఖమ్మం: చైర్పర్సన్ గడిపల్లి కవితతో ‘సాక్షి’ ప్రతినిధి ముఖాముఖి. మహిళగా మీ రాజకీయ ప్రవేశం సాహసమేనా? పెద్దగా రాజకీయ నేపథ్యం లేని కుటుంబం మాది. పైగా సంప్రదాయాలు, కట్టుబాట్లకు నెలవైన కుటుంబ నేపథ్యం తో నేను రాజకీయాల్లోకి రావడమే సాహసంగా మారింది. చదువుకున్న మహిళగా.. రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఒకటి చేయాలని.. సమాజం కోసం పాటుపడాలని అంతర్లీనంగా ఎక్కడో ఒక ఆకాంక్ష నాలో విద్యార్థి దశనుంచే దాగి ఉండేది. బహుశా ఆ ఆకాంక్షే కట్టుబాట్లను, చివరికి అమ్మమాటను సైతం తోసి పుచ్చి రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. రాజకీయ ఉన్నతికి మీకు తోడుగా నిలిచింది ఎవరు..? రాజకీయాల్లో నిరాదరణకు గురైనప్పుడు కనుచూపు మేరలో ఎదిగే అవకాశాలు కనపడనప్పుడు.. ఒక మెట్టు ఎక్కేందుకు మహిళగా నా శక్తినంతా కూడగట్టుకుని ప్రయత్నం చేస్తున్నప్పుడు సహకరించడం మానేసి కిందకు లాగే ప్రయత్నం చేసినప్పుడు అందరూ అన్నట్లుగానే రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశామా..? అన్న భావన కలిగేది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం, ఆయన ఇచ్చిన భరోసా రాజకీయంగా ఎదగడానికి టానిక్‌లా పనిచేసింది. నా రాజకీయ ఎదుగుదలలో అడుగడుగునా కనిపించేది మంత్రి తుమ్మలే. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి కోసం సాక్షాత్తు చంద్రబాబుతో ఖరాఖండిగా చెప్పడం వంటి అనేక రాజకీయ పరిణామాలు నన్ను రాజకీయ నేతగా నిలబెట్టాయి. భర్త కృష్ణప్రసాద్ ఇచ్చిన తోడ్పాటుతోపాటు ఏ అవకాశం వచ్చినా మహిళగా నన్ను ప్రోత్సహించిన మంత్రి తుమ్మలతోనే ఈ రాజకీయ ఉన్నతి సాధ్యమైంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఉంటూ కుటుంబానికి మీరు ఇచ్చే సమయం..? జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి కచ్చితంగా బాధ్యతాయుతమైన పదవే. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు కుటుంబం కూడా అత్యంత ముఖ్యం. మహిళగా కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే రాజకీయాల్లో రాణించే ప్రయత్నం చేస్తా. ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇస్తూ ఉంటా. అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే నేనే స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లా. అక్కడ అనేకమంది డాక్టర్ కోసం వేచి ఉంటే నేను ప్రజాప్రతినిధిని అన్న భావన లేకుండా అమ్మను వరుస క్రమంలో చూసే దాక వేచి ఉన్నా. రాజకీయాలు సరిపడవని అన్నదెవరు..? దాని నేపథ్యం ఏమిటి..? మా కుటుంబానికి పెద్దగా రాజకీయ నేపథ్యం లేదు. నాన్న కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో తిరిగే వారు. నాకు వివాహం అయిన తర్వాత నా భర్త కృష్ణప్రసాద్ కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. సింగరేణి ఉద్యోగుల సమస్యల కోసం పోరాడిన చరిత్ర మా మామగారికి ఉంది. ఆ ధైర్యం, ఆ వారసత్వం పునరుద్ధరించాలనే రాజకీయాల్లోకి రావాలని నా భర్త కృష్ణప్రసాద్ తోడ్పాటును అందించారు. ఇక అమ్మ నా రాజకీయ ప్రవేశాన్ని ససేమిరా వద్దన్నది. అమ్మమాటను తోసిపుచ్చొద్దని అనుకున్నా.. అత్తింటి వారి తోడ్పాటుతో ఎంతటి అవాంతరాన్నైనా ఎదుర్కోవచ్చునన్న ధైర్యం నాలో కలిగింది. భర్తతో పాటు అత్తింటి వారు, మా బావగారు డాక్టర్ కనకరాజు అందించిన ప్రోత్సాహం అమ్మకు వివరించా. రాజకీయ ప్రవేశానికి ముందు మీరేం చేసేవారు..? నా రాజకీయ రంగ ప్రవేశం 2000లో అనుకోకుండా జరిగింది. కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వు కావడంతో అనూహ్యంగా నా పేరు టీడీపీ తరుపున తెరపైకి వచ్చింది. అప్పటి వరకు నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా. ఆ ప్రాంతంలో సుపరిచితురాలిగా ఉండటం. మా కుటుంబానికి మంచి నేపథ్యం ఉండటం వంటి సానుకూల కారణాలు నన్ను చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ ఎంపిక చేసేందుకు కారణాలుగా నిలిచాయి. మంత్రి తుమ్మల నన్ను ప్రోత్సహించి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీచేయించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయా. అప్పటినుంచి రాజకీయ కష్టాలను అధిగమించే పనిలోనే నిమగ్నమయ్యా. 2014లో కాని నాకు మళ్లీ మంత్రి తుమ్మల ఆశీస్సులతోనే జెడ్పీ చైర్పర్సన్ అయ్యే అవకాశం రాలేదు. దాదాపు 13 సంవత్సరాలు రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కోక తప్పలేదు. ఆదరించే వారి కన్నా.. అవమానించే వారే రాజకీయాల్లో ఎక్కువగా ఉంటారని ఒక్కోసారి ఆవేదన కలిగేది. రాజకీయంగా మీ భవిష్యత్ కార్యాచరణ..? రాజకీయాల్లో అనుకున్నవి జరగడం.. ఆశించిన పదవులు రావడం అనేది ఎవరికీ జరిగే పనికాదు. నిబద్ధతతో రాజకీయాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తే అవకాశాలు అవే వస్తాయని నమ్మే వారిలో నేను ముందు వరుసలో ఉంటా. ఇందుకు నా రాజకీయ జీవితమే ఉదాహరణ. అవకాశాల కోసం వెంపర్లాడకుండా.. చెప్పిన పని చేసుకు పోవడమే అర్హత ఏమోనని అనుకున్నా. భవిష్యత్తులో సైతం ఇదే రీతిలో వ్యవహరిస్తా. రాజకీయ పయనం ఇంతటితో ఆపాలని లేదు. టీడీపీ, టీఆర్ఎస్ల్లో ఎందులో మీరు సౌకర్యంగా ఉన్నారు..? రాజకీయాల్లో ఏ పార్టీలో ఉండే సౌకర్యం ఆ పార్టీలో ఉంటుంది. టీడీపీలో నా కోసం పోరాడిన నాయకులు ఉండటం నాకు ఒక వరం లాంటిది. అదే నాయకులు పార్టీ మారదాం. పరిస్థితులు మారాయని నచ్చజెపితే కాదనలేకపోయా. నా రాజకీయ భవిష్యత్ ఎవరిపై ఆధారపడి ఉందో వారే పార్టీ మారే అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆనందంగా అంగీకరించా. కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో లక్ష్మణరేఖ దాటడం తప్పదు. అలాగే నేను కూడా ఇంట్లో వారి మాట కాదని మంత్రి తుమ్మల సూచన మేరకు పార్టీ మారాను. -
జెడ్పీ ఛైర్మన్ తుల ఉమకు ప్రమోషన్..!
-
నేనొకడిని ఉన్నానని గుర్తుందా..?
అనంతపురం సిటీ: ‘‘అధికారులపై వచ్చిన ఆరోపణలకు సంజాయిషీ ఇవ్వమంటే ఇవ్వరు... జెడ్పీ చైర్మన్‌గా నా దృష్టికి తీసుకురాకుండానే ఓ అధికారి జెడ్పీ ఆవరణలోని కార్యాలయాన్ని తనకు నచ్చిన చోటుకు మార్చుకుంటాడు... ఇక అభివృద్ధి పనుల్లో పర్సెంటేజీల వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయని ఫిర్యాదులొస్తే పట్టించుకోరు... అసలు మీరు ఏమనుకుంటున్నారు...జెడ్పీ చైర్మన్‌గా నేనొకడిని ఉన్నానని మీకు గుర్తుందా..?’’ అంటూ చైర్మన్ బోయ నాగరాజు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జెడ్పీలోని సమావేశ భవనంలో జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. పద్ధతులు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పలు అంశాలపై చర్చ స్థాయీ సంఘం సమావేశాలకు చైర్మన్ బోయ నాగరాజుతో పాటు మూడు అంశాలపై అధ్యక్ష స్థానంలో లక్ష్మీనారాయణరెడ్డి కొనసాగారు. వ్యవసాయం, సాంఘిక సంక్షేమ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, జల వనరుల శాఖలకు సంబంధించిన ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇన్పుట్ సబ్సిడీతో పాటు తాగునీటి సమస్య పరిష్కారం, వేసవిలో సురక్షిత నీటిని అందించే విషయంలో పలు తీర్మానాలు చేశారు. తాజాగా రూ.9 కోట్లు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎస్ఈ హరేరామ్‌నాయక్ తెలిపారు. త్వరలో ఈ పనులకు సంబంధించిన టెండర్లకు పిలుస్తామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఇంకా రూ.12 కోట్లు నిధులు అడిగామన్నారు. రహదారుల నిర్మాణం అనుకున్నంత వేగంగా సాగడం లేదన్న విషయం వాస్తవమేనని ఎస్ఈ సుబ్బరావు అన్నారు. గతేడాది మిగులు నిధులను ఈ ఏడాదికి వినియోగించుకునే విషయాన్ని కలెక్టర్‌ని అడిగామన్నారు. అనుమతి రాగానే సర్దుబాట్లు చేస్తామన్నారు. స్థాయీ సంఘం సమావేశాల్లో సీఈఓ శోభాస్వరూపారాణి, డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణ, పలువురు జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. పర్సెంటేజీల పట్టికలను ఏర్పాటు చేయండి సార్.. ‘‘పంచాయతీరాజ్ శాఖలో ప్రతిపనికీ అధికారులు పర్సెంటేజీలు అడుగుతున్నారు..ఇకపై మీ కార్యాలయాల్లో ఏయే అధికారికి, ఏఏ పనికి ఎంత వాటా ఇవ్వాలో పట్టికలో రాసి ఉంచండి సార్...అప్పుడు మాకూ ఇబ్బంది ఉండదు’’ అంటూ అధికార పార్టీకి చెందిన కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రవూఫ్ అధికారుల తీరును తూర్పారబట్టారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పనులు చేస్తే కనీసం రూ.10 వేలు కూడా మిగలడం లేదన్నారు. ఇందులో కూడా ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి కూడా వాటాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామని వాపోయారు. రహదారులు, అంగన్ వాడీ భవనాలు, గిడ్డంగుల నిర్మాణాల్లో జరుగుతున్న, జరిగిన అవినీతి గురించి కనీస విచారణ జరిపేందుకు కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు జంకడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దీంతో అధికారుల మాట నోట రాలేదు. పైపెచ్చు సర్దుకుంటామని చెప్పి తప్పుకున్నారు. -
గ్రామాల్లో అభివృద్ధి వేగవంతం
అనంతగిరి: తమ ప్రభుత్వ పాలనలో గ్రామగ్రామాన అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని జెడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ పట్టణం, మండలంలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే సంజీవరావుతో కలిసి మంగళవారం ఆమె ప్రారంభించారు. రూ.90 లక్షలకు పైగా నిధులతో పలు పనులు, శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అభివృద్ధి దశల వారీగా జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. బిల్లులు తప్పకుండా వస్తాయన్నారు. గ్రామాల్లో స్వచ్ఛ్ భారత్ కోసం పాటుపడాలన్నారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వబోతోందని, వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తోందని అన్నారు. గిరిగేట్‌పల్లిలో మహిళా సంఘ భవన నిర్మాణానికి రూ.8 లక్షలు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు క ల్పించడానికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. మద్గుల్ చిట్టంపల్లిలో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందిగా ఉన్న పాఠశాల నూతన భవన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పదో తరగతిలో గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంటే ఎక్కువ టీచర్లున్న పాఠ«శాలల నుంచి డిప్యూటేషన్ చేస్తామన్నారు. ఇందుకు త్వరలో ఎంఈఓలతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనవసరంగా విమర్శించొద్దు: ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ మాజీమంత్రి ప్రసాద్‌కుమార్ మా సీఎం, మంత్రులను అనవసరంగా విమర్శించడం మానుకోవాలన్నారు. ఆయనది కర్నాటక ప్రాంతమని, తాండూర్‌లో వచ్చి స్థిరపడ్డారని అన్నారు. ఈ ప్రాంతప్రజలు మంచోళ్లు కనుక గెలిపించారన్నారు. ఇకముందు చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. మాజీమంత్రికి అభివృద్ధి కంటే ధనార్జనే ధ్యేయంగా పనిచేశారని ఆరోపించారు. వికారాబాద్ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానన్నారు. తాను ఈ ప్రాంతంలో 30 ఏళ్ల నుంచి ప్రజలకు సేవలు చేస్తున్నాన్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ముత్తాహార్ షరీఫ్, ఎంపీపీ భాగ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి, ఎంపీడీఓ సత్తయ్య, పీఆర్ డీఈ రాజమోహన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌పటేల్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి, డీటీ కృష్ణయ్య, ఏఓ ప్రసన్నలక్ష్మి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నర్సింలు, ప్రభావతిరెడ్డి, మాణెమ్మ, శమంతాపాండు, అరుణ, లక్ష్మయ్య, ఎంపీటీసీ సాయన్న, నాయకులు, నర్సింహరెడ్డి, గోపాల్, వేణుగోపాల్‌రెడ్డి, సురేష్, చందర్‌నాయక్, ప్రభాకర్‌రెడ్డి, రాజమల్లయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవ విగ్రహాలు!
ఒకప్పుడు వెలుగు వెలిగిన జిల్లా పరిషత్ నేడు కళావిహీనంగా మారింది. నిధులు, విధులు లేక కొట్టుమిట్టాడుతోంది. జిల్లా పరిషత్‌తో పాటు మండల పరిషత్‌లలో కరెంటు బిల్లులు చెల్లించేందుకు కూడా అష్టకష్టాలు పడే పరిస్థితి దాపురించింది. సమావేశాల నిర్వహణ అంటేనే అధికారులు ఆందోళన చెందుతున్నారు. బిల్లుల చెల్లింపులు, నిధుల కేటాయింపులకు డబ్బులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక, మండల కార్యాలయాల్లోనైతే కనీసం జిరాక్స్ బిల్లులు చెల్లించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్‌అర్బన్: గతంలో జిల్లా, మండల పరిషత్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు భారీగా వచ్చేవి. అయితే, మూడేళ్ల వ్యవధిలో కేంద్రానికి సంబంధించి కీలకమైన బీఆర్జీఎఫ్ సహా రెండు పథకాలు నిలిచిపోయాయి. బీఆర్జీఎఫ్ నిధులు జీపీలకే చెల్లిస్తున్నారు. ఇక, మూలధన నిధి సమకూరడం లేదు. 2016–17కు గాను సీనరేజ్ గ్రాంట్ రాలేదు. మొత్తంగా నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో జెడ్పీకి కేటాయించింది రూ.9.64 కోట్లు మాత్రమే. ఈ నిధులతో జిల్లా, మండల పరిషత్‌ల నిర్వహణ కష్టంగా మారింది. అభివృద్ధి పనులకు నిధుల్లేక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి నెలకొంది. ప్రతి సమావేశంలో నిధుల కోసం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆందోళన చేస్తున్నారు. పేరుకే మండల పరిషత్‌లు.. ఉమ్మడి జిల్లాలో 36 మండల పరిషత్‌లు ఉన్నాయి. వీటి పరిస్థితి నామమాత్రంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక్కో మండలానికి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆర్థిక సంఘం నిధులు, రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు బీఆర్జీఎఫ్ నిధులు విడుదల చేసేది. ప్రస్తుతం అన్ని రకాల నిధులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఒక్కో మండలానికి రూ.10 లక్షలు కుడా రాని పరిస్థితి ఏర్పడింది. నిధులు లేక గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి నిలిచి పోయింది. ‘మన ఊరు–మన ప్రణాళిక’, ‘గ్రామజ్యోతి’ పథకాలు పడకేశాయి. మురికినీటి కాలువలు, సీసీ రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలకు ప్రహరీలు, మరుగుదొడ్ల నిర్మాణాలు మూడేళ్లుగా నిలిచి పోయాయి. ఏం చేయలేక పోతున్నాం.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది. కానీ నిధులు లేక మేము ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి మండల, జిల్లా పరిషత్‌లను బలోపేతం చేయాలి. – శ్రీనివాస్, నవీపేట జెడ్పీటీసీ నిలిచిన అభివృద్ధి.. నిధులు లేక అభివృద్ధి నిలిచి పో యింది. గ్రామాలకు వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంది. ప్రజలకు సమాధానం చెప్పు కోలేక పోతున్నాం. ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి. – పుప్పాల శోభ, నిజామాబాద్ జెడ్పీటీసీ -
ఈ సారైనా.. చర్చిస్తారా?
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : మూడు నెలలకోసారి జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ఏనాడూ ప్రజా సమస్యలపై చర్చ జరిగలేదు. ఈసారి జరిగే సమావేశం ఏదైనా ప్రతిఫలం ఇస్తుందా.. లేక ఎప్పటిలాగే రచ్చ చేసి ఎవరిదారిన వారు పోతారా.. అనేది వేచి చూడాల్సిందే. జెడ్పీ పాలక మండలి ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు 13 సమావేశాలు జరిగాయి. ఏ సమావేశంలో కూడా రాజకీయ రచ్చ తప్పి స్తే ప్రజా అవసరాలు, సమస్యలపై చర్చ ఏ మాత్రం జరగకపోవడం గమనార్హం. 6 జిల్లాలో 182 అంశాలు మొత్తం ఆరు జిల్లాలకు చెందిన 182 అంశాలపై అధికారులు ఎజెండా తయారు చేశా రు. ఇందులో 38 శాఖలకు చెందిన ఎజెం డా కాపీలు జిల్లా పరిషత్‌కు పంపలేదు. గత సమావేశంలో చర్చించిన అంశాలు పరి ష్కారం కావనే అభిప్రాయం సభ్యుల్లో ఉం డగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరు కావడం లే దు. దీంతో జెడ్పీటీసీ సభ్యులు స మావేశాని కి హాజరయ్యేందుకు ఆసక్తి చూపడంలేదు. ఈ క్రమం లో సమావేశాలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. చర్చకు రాని ఎజెండాలు... పాలక మండలి ఏర్పడిన నాటి నుంచి ఎజెండాలోని అంశాలు ఎన్నడూ చర్చకు రాలేదు. ఒక వేళ జరిగినా రెండు, మూడు ఎజెండాలపై మాత్రమే ఎవరైనా మాట్లాడతారు. ఎప్పటికీ తాగునీటి సమస్య (ఆర్డ బ్ల్యూఎస్), వ్యవసాయం, ఉపాధి హామీ (డీఆర్డీఓ) తప్పితే మరో శాఖ మీద చర్చే జరగలేదు. ఈ సారి 182 అంశాల ఎజెండాను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో 38 శాఖల ప్రగతి నివేదికలను జెడ్పీ అధికారుల కు ఆయా శా ఖ అధికారులు ఇంకా సమర్పించనేలేదు. ఉ మ్మడి జిల్లా ఉన్నప్పుడు 68 ఎజెండాలు ఉం టేవి. అప్పుడే మూడుకు మించి అంశాలపై చర్చ జరుగలేదు. కొత్త జిల్లాల ఏర్పడిన నేపథ్యంలో 182 అంశాల ఎజెండా జిల్లా పరిషత్ ముందు ఉంది. ఇందులో ఎన్ని అం శాలు చర్చకు వస్తాయో చూడాల్సి ఉంది. మొదటి ఎజెండాగా ఆర్‌డబ్లు్యఎస్ శాఖను పెట్టగా.. వ్యవసాయం, ఇరిగేషన్, డీఆర్డీ, ఎస్సీ సంక్షేమ శాఖలు ఆ తర్వాత ఉన్నాయి. కొత్త పంచాయతీలపై ప్రశ్నిస్తారా? ప్రభుత్వం ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కొత్త గ్రామపంచాయతీలను ఏ ర్పాటు చేసే ప్రక్రియలో అధికారులు ఉన్నారు. 500 జనాభా ఉన్న గ్రామపంచాయతీల ప్రతిపాదనలను అధికారులు సి ద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. తమ గ్రా మాన్ని పంచాయతీగా మార్చాలని, లేక వద్ద ట సభ్యులు పట్టు బట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అధికార పార్టీతో సహా అందరు సభ్యులు నిధుల విషయంలో అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఇదే కారణంతో శనివారం జరగనున్న సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. అనవసర చర్చలు జిల్లా పరిషత్ పాలక మండలి ఏర్పడిన తరువాత ఇప్పటిదాక 13 జెడ్పీ సర్వసభ్య సమావేశాలు కొనసాగాయి. గత ఏడాది అక్టోబర్ 6వ తేదీన జరిగిన జెడ్పీ సమావేశం మొత్తం రచ్చరచ్చగా జరిగింది. జెడ్పీటీసీ సభ్యులకు తెలియకుండా నిధులు పక్కదారి పట్టిస్తున్నారని సభ్యుల ఆందోళన చేపట్టారు. అది కాస్తా ఎమ్మెల్యేల ప్రొటోకాల్ రగడకు దారి తీసింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మధ్య కూడా వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఎలాంటి చర్చ జరుగకుండానే సభను ముగించారు. ఇలాగే ప్రతి సభలో ఆందోళనలు చేయడం పరిపాటిగా మారింది. ప్రతి పక్ష పార్టీ, అధికార పక్ష పార్టీలకు మధ్య వాదోపవాదాలు సర్వసాధారణమయ్యాయి. ఉన్నది మూడే సమావేశాలు జెడ్పీ సమావేశాలు ఇక మూడే ఉన్నాయి.. ఇన్నిరోజులు జరిగిన సమావేశాల్లో ఏ సమస్యా పరిష్కారం కాలేదు. నిధులు లేక జెడ్పీకి వెళ్లలేక పోతున్నాం. ప్రతి మూన్నెళ్లకోసారి సభ నిర్వహించాలని కోరినా నిర్వహించలేని పరిస్థితి నెలకుంది. సభ నిర్వహణ కూడా గందరగోళంగా మారుతోంది. – శ్రీహరి, జెడ్పీటీసీ సభ్యుడు, మక్తల్ నిధులు కేటాయించాలి జిల్లా పరిషత్‌కు పూర్వ వైభవం రావాలంటే అధిక నిధులను కేటాయించాలి. తాము ఎన్నికైన మండలంలో అభివృద్ధి పనులు చేపడతామం. నిధులు లేక ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోతున్నాం. – రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు, ఖిల్లాఘనపూర్ జెడ్పీని బలోపేతం చేస్తాం... జిల్లా పరిషత్‌ను బలోపేతం చేస్తాం. త్వరలో ప్రభుత్వం జెడ్పీకి అధిక నిధులను కేటాయించనుంది. జెడ్పీటీసీల గౌరవం పెంచే విధంగా కృషి చేస్తాం. జిల్లా పరిషత్ సమావేశాన్ని పారదర్శకంగా నిర్వహిస్తాం. పక్షపాత వైఖరి లేకుండా అందరికి సమాన అవకాశం కల్పిస్తాం. – బండారి భాస్కర్, జిల్లా పరిషత్ చైర్మన్ -
గిరిజన గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
ఎల్లారెడ్డిపేట : గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జెడ్పీటీసీ తోట ఆగయ్య అన్నారు. వీర్నపల్లి మండలం గర్జనపెల్లి శివారులోని భిక్షపతి, పూనానాయక్, లచ్చయ్య తండాల్లో రూ.81 లక్షలతో నిర్మించనున్న బీటీరోడ్డు పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా గిరిజనులు అడవుల్లో దుర్భర జీవితాలు గడిపారన్నారు. వారి జీవితాల్లో మార్పు తేవడానికే ప్రభుత్వం తండాల మధ్య లింకురోడ్లు ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్, ఎల్సాని మోహన్‌కుమార్, ప్రభాకర్, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ కమల, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీరాంనాయక్, విఠల్, భాస్కర్, రాజిరెడ్డి, రవి, శేఖర్, తిరుపతి, బుగ్గయ్య పాల్గొన్నారు. -
ప్రమాద బాధితులకు జెడ్పీ చైర్పర్సన్ పరామర్శ
కరీంనగర్ : కొమురంభీమ్ జిల్లా తిర్యాణి మండలం గుండాలలో గురువారం జరిగిన ప్రమాదంలో గాయపడి న బాధితులను కరీంనగర్‌లోని మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే కోవా లక్ష్మితో కలిసి బాధితులను పరామర్శించారు. కూలీపనులకోసం ట్రాక్టర్‌పై వెళ్తుండగా.. అదుపు తప్పి బోల్తాపడడంతో ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనలో 12మంది గాయపడగా అందరినీ కరీంనగర్ ప్రభు త్వ ప్రధానాస్పత్రికి తరలించారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం బాధితులను మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో లక్ష్మి బాయి, లీల, పూలాబాయి, పార్వతి, వెన్నెల, భారతీబాయి, రంగుబాయి, కమలాబాయి, ప్రేమలత ఉన్నారు. -
షరతులు వర్తిస్తాయి!
తమిళసినిమా: ఇకపై నిబంధనలు వర్తిస్తాయి(కండిషన్స్ అప్లై) అంటోంది నటి నయనతార. నటిగా ఒకప్పటి స్థాయి వేరు ఇప్పటి నయన్ స్థానం వేరు. ఆదిలో నటిగా స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఇమేజ్ను కాపాడుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. మొదట్లో దర్శకుల సూచనలతో నటించేవారు. అందాలారబోత విషయంలో హద్దుల పరిధి విధించుకోలేదు. టూపీస్ దుస్తుల నటనకు పరాకాష్ట బిల్లా చిత్రం. అయితే అదంతా గతం. ఇప్పటి నయన్ స్థాయి వేరు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మొదలెట్టారో.. అప్పటి నుంచి అభిమానులు ఈ బ్యూటీకి ‘లేడీసూపర్‌స్టార్’ పట్టం కట్టేశారు. అరమ్ చిత్రంతో నయనతార లెవెల్ వేరు అన్నంతగా మారిపోయింది. గతంలో ప్రేమ ఓటమి, తాజాగా ప్రియుడితో సహజీవనం వంటివి నయన్ నట జీవితానికి ఎలాంటి ఆటంకం కాలేదన్నది నిజం. కరెక్ట్‌గా చెప్పాలంటే మొదట్లో దర్శకులు శాసించినట్లు నయన్ నటించేవారు. ఇప్పుడు ఆమె ఆదేశాలను దర్శక నిర్మాతలు పాటించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిని గ్రహించిన నయన్ ఇకపై నిబంధనలు వర్తిస్తాయి అని అంటోందట. ముఖ్యంగా ఇంతకు ముందు మాదిరి హీరోలతో సన్నిహితంగా నటించేది లేదు. ఇక ఒక పరిమితికి మించి కురుచ దుస్తులు ధరించను అని దర్శక నిర్మాతలకు కథ వినిపించినప్పుడే స్పష్టంగా చెప్తోందట. ప్రచార కార్యక్రమాలకు దూరం ఉండే పరిస్థితి ఇకపై కూడా కొనసాగుతుందని చెబుతుందట. ఇటీవల నయన్ నటించిన తెలుగు చిత్రం ‘జైసింహా’లో కూడా దుస్తులు, హీరోతో సన్నిహితంగా నటించే విషయాల్లో పరిమితులు పాటించిందట. ఇలా ఈ అమ్మడు తన చిత్ర ప్రయాణాన్ని ఇంకా ఎంతకాలం సాగించుకుంటుందో. ప్రస్తుతం చేతిలో ఐదు చిత్రాలతో బిజీగా ఉంది. తను ఊ అంటే మరిన్ని అవకాశాలు రెడీగా ఉన్నాయట. ఇమైకానోడిగళ్, కొలైయుధీర్ కాలం, కొలమావు కోకిల, తెలుగులో సైరా నరసింహారెడ్డి, ఆరడుగుల బుల్లెట్టు చిత్రాల్లో నయన్ ప్రస్తుతం నటిస్తోంది. ఇక అరమ్ చిత్రానికి సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. -
ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా..
సాక్షి, ఏలూరు: మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. మంత్రి పదవిలో ఉండి సంస్కారహీనంగా మాట్లాడటం ఆయనకు సరికాదన్నారు. మంత్రి తమను శత్రువులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో మంత్రితో పోటీ పడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మాణిక్యాలరావు సిద్ధంగా ఉన్నారా అని బాపిరాజు ప్రశ్నించారు. -
నా జోలికొస్తే ఖబడ్దార్, మీకు ఆ ధైర్యం ఉందా?
సాక్షి, తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ మధ్య పంచాయితీ తెగడం లేదు. మంత్రి మాణిక్యాలరావును లక్ష్యంగా చేసుకుని మిత్రపక్షానికి చెందిన తెలుగుదేశం నాయకులు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం లేదు. దీంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకే వేదికపై ఇరువర్గాలు ఆరోపణలు గుప్పించుకుని రోడ్డున పడుతున్నారు. ఒకే జన్మభూమి సభకు ఒకరి తర్వాత ఒకరు వెళ్లి విమర్శలు చేసుకోవడం చూసి జనం అసహ్యించుకుంటున్నారు. మంత్రిపై వ్యంగ్య వాగ్బాణాలు : ఈనెల 2 నుంచి జన్మభూమి – మా ఊరు కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో మంత్రి మాణిక్యాలరావు చురుకుగా పాల్గొంటున్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కూడా ఇదే నియోజకవర్గాన్ని లక్ష్యం చేసుకుని మంత్రికి సమాచారం ఇవ్వకుండా రోజూ జన్మభూమి సభల్లో పాల్గొంటున్నారు. మంగళవారం వెంకట్రామన్నగూడెం సభలో మంత్రి పాల్గొనాల్సి ఉండగా ఆయన రావడం ఆలస్యంకావడంతో అప్పటికే ఈ సభకు హాజరైన బాపిరాజు మంత్రిని ఉద్దేశించి వ్యంగ్య వాగ్బాణాలు విసిరారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సహకరించడం లేదంటూ వ్యాఖ్యానించారు. తర్వాత సభకు హాజరైన మంత్రిమాణిక్యాలరావుకు జెడ్పీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తుకొచ్చింది. దీంతో మంత్రి కూడా తన హద్దులు దాటేసి జెడ్పీ చైర్మన్‌పై విరుచుకుపడ్డారు. ‘నా కంటే ముందు ఈ వేదికపైకి వచ్చి వెళ్లిన ఒకటో కృష్ణుడు నేను తప్ప ఇంకొకడు అభివృద్ధి చేయలేడని అన్నారంట. నేను కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే, పంచాయతీరాజ్ విభాగం ద్వారా జిల్లా పరిషత్ ఖర్చుపెట్టే పరిస్థితి. నేను అక్కడ నిధులు ఆపితే ఇక్కడ విలవిల్లాడతారు. స్పష్టంగా చెబుతున్నా, ఒక రాష్ట్ర మంత్రిగా , క్యాబినెట్లో భాగస్వామిగా ఉన్న వ్యక్తిని గురించి ఇదే వేదికపై చులకనగా మాట్లాడటం అనేది తీవ్రమైన విషయం. చాలా కాలంగా చూసీచూడనట్టు పోయా. ఖబడ్దార్’ అని హెచ్చరించారు. అభివృద్ధి కోసం, నిధులు తేవడం కోసం తాను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల చుట్టూ తిరుగుతుంటే, జెడ్పీ చైర్మన్ మాత్రం బోడిగుండులా ఇక్కడే గుండ్రంగా తిరుగుతూ రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి విమర్శలు గుప్పించారు. దీనిపై టీడీపీ నేతలూ ఘాటుగానే స్పందించారు. టీడీపీ భిక్షతోనే నెగ్గారనే విషయాన్ని మర్చిపోవద్దని, జెడ్పీ చైర్మన్ తప్పుగా మాట్లాడారని నిరూపించకపోతే ఊళ్లో తిరగనివ్వబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టను.. దీనిపైనా మంత్రి స్పందిస్తూ మళ్లీ నిన్న (బుధవావరం) జెడ్పీ చైర్మన్‌పై విరుచుకుపడ్డారు. తాడేపల్లిగూడెంలో జెడ్పీ తరఫున చేసిన పనులు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో తనను అంటరానివాడిగా చూస్తున్నారని మూడున్నరేళ్లలో రామన్నగూడెంలో ఏ ప్రారంభోత్సవానికైనా పిలిచారా? అని మంత్రి ప్రశ్నించారు. ‘ ఏ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం లేదు? ఎందుకీ శత్రుత్వ ధోరణి? నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టను. నన్ను నిలదీయాలని చూస్తే...ప్రభుత్వాన్నే నిలదీస్తా. నేను మంత్రిని...నన్నే పట్టించుకోరా? అని ప్రశ్నలు సంధించారు. మాణిక్యాలరావుకు అంత ధైర్యముందా? ప్రతిగా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు కూడా మరోసారి మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ...‘ మంత్రి అందరినీ చులకనగా చూస్తారు. అసలు మర్యాద ఇవ్వరు. అందుకే మా మధ్య గొడవలు. జెడ్పీ చైర్మన్ బాపిరాజు ఇప్పుడు రాజీనామా చేస్తే మేం మళ్లీ గెలిపించుకోగలం. మీకు ఆ ధైర్యం ఉందా?. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా, ఆంధ్రప్రదేశ్ ను కట్ చేస్తా అని చేసిన అభ్యంతర వ్యాఖ్యల విషయంలో మంత్రి మాణిక్యాలరావు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని’ అని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బాపిరాజు స్పందిస్తూ తన ఎదుగుదలను చూసి మంత్రి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. మరోవైపు ఇద్దరూ తగదా పడుతూ ఒకరి అవినీతిని మరొకరు బయట పెడుతున్న వైనం తాడేపల్లిగూడెంలో చర్చనీయాంశంగా మారింది. -
మనుషులు కారు..!
-
గ్రామజ్యోతి ఎజెండాగా టీఆర్ఎస్ఎల్పీ భేటీ
* నేడు తెలంగాణ భవన్లో సీఎం అధ్యక్షతన సమావేశం * జెడ్పీ చైర్పర్సన్లకు ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: గ్రామాల అభివృద్ధి, మౌలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘గ్రామజ్యోతి’ కార్యక్రమమే ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ శాసనసభాపక్షం (టీఆర్ఎస్ఎల్పీ) భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ఈ భేటీకి హాజరు కావాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి. గ్రామజ్యోతి పూర్తిగా గ్రామీణ సమస్యలు, వసతుల కల్పనకు సంబంధించినది కావడంతో జెడ్పీ చైర్పర్సన్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. రానున్న నాలుగేళ్ల కాలానికి ప్రణాళికలు రూపొందించే దిశలో గ్రామజ్యోతిని నిర్వహించనున్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీ శ్రేణులనూ ఈ కార్యక్రమంతో మమేకం చేయడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చన్న భావనలో అధికార టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. ఈ కారణంగానే ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కల్పించనున్నారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకునేలా టీఆర్ఎస్ఎల్పీ నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశాలన్నింటినీ చర్చించడం, గ్రామజ్యోతిని విజయవంతం చేయడం కోసం సలహాలు, సూచనలు స్వీకరించే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఈనెల 17న సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామజ్యోతిని ప్రారంభించనుండటం, ఆ తర్వాత జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు టీఆర్ఎస్ఎల్పీ భేటీలో కర్తవ్య బోధ చేస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దీనిపై విపక్షాలు అనవసర విమర్శలు చేయకుండా నోళ్లు మూయించే వ్యూహంపైనా సీఎం తమ సభ్యులకు ఈ సమావేశంలో సూచనలు చేసే అవకాశం ఉందంటున్నారు. సెప్టెంబర్ తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినందున సమావేశాల గురించి కూడా ఈ భేటీలో చర్చించే వీలుందంటున్నారు. -
జెడ్పీ చైర్పర్సన్లకు మరో నజరానా
జెడ్పీ చైర్పర్సన్లకు కొత్త వాహనాలు సొంత భవనాల్లేని జెడ్పీలకు కొత్తగా నిర్మాణం ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయండి జెడ్పీ చైర్పర్సన్ల సమావేశంలో కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ల్లకు రూ.లక్ష చొప్పున గౌరవ వేతనాన్ని శుక్రవారం ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు.. తాజాగా వారికి మరో నజరానాను కూడా ప్రకటించారు. జెడ్పీ చైర్పర్సన్లందరికీ కొత్త వాహనాలను కూడా సమకూరుస్తామని శనివారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం హామీ ఇచ్చారు. అలాగే సొంత భవనాల్లేని జిల్లా పరిషత్‌లకు కూడా ఆయా జిల్లాల్లో నూతన భవనాలను నిర్మించేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ జెడ్పీ చైర్పర్సన్లందరూ స్థానికంగా జిల్లా కలెక్టర్లతో సమన్వయంగా జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. గతంలో జిల్లా పరిషత్‌లకు ఉండే 29 అధికారాలను తిరిగి కల్పించాలని పలువురు జెడ్పీ చైర్పర్సన్ల్లు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈవిషయమై విస్తృతంగా చర్చించిన సీఎం జెడ్పీ చైర్పర్సన్ల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలపై జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని జెడ్పీ చైర్పర్సన్లను సీఎం కేసీఆర్ కోరారు. ఈ సమావేశానికి అదిలాబాద్ జెడ్పీ చైర్మన్ మినహా మిగిలిన అన్ని జిల్లాల జెడ్పీ చైర్పర్సన్లు హాజరయ్యారు. అంతకుముందు తమకు గౌరవ వేతనాలను పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్‌కు జెడ్పీ చైర్మన్లందరూ కృతజ్ఞతలు తెలిపారు. గౌరవవేతనాలను పెంచినందున ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో పలువురు ఎంపీటీసీలు, పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు మంత్రి కేటీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఉన్న 12వేల మంది వార్డు సభ్యులకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలంటూ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ఫోరం డిమాండ్ చేసింది. తమ హక్కుల సాధన కోసం ఈనెల 16న జరిగే గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల సమావేశంలో కార్యాచరణను ప్రకటిస్తామని ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఏం జరుగుతుందో ?
పనుల కేటాయింపు నిలిపేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌కు మంత్రి ఆదేశం ఈసారికి ఇలాగే కానీయాలన్న చైర్పర్సన్ స్వాతిరాణి కలెక్టర్ వద్ద ఫైల్ మంత్రి, జెడ్పీ చైర్పర్సన్ వివాదంపై పార్టీ వర్గాల్లో విసృ్తత చర్చ సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఉపాధి పనుల కేటాయింపు రగడ ఎక్కడికి దారితీస్తుందో తెలియడం లేదు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి మధ్య జరుగుతున్న అంతర్గత పోరులో ఎవరిది పైచేయి అవుతుందన్న దానిపై పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కలెక్టర్ వద్దకు చేరింది. ఆయన తీసుకునే నిర్ణయంకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. వారం రోజులుగా ఆ ఇద్దరు నేతలు హైదరాబాద్‌లో ఉండడంతో వ్యవహారం గుంభనంగా ఉండిపోయింది. కానీ వారిలో జెడ్పీచైర్‌పర్సన్ ఇప్పటికే జిల్లాకొచ్చారు. మంత్రి కూడా జిల్లాకు రానున్నారు. దీంతో కలెక్టర్‌పై ఒత్తిడి రాక తప్పదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెట్ పనుల కింద జిల్లాకు రూ. 35కోట్లు కేటాయించారు. వీటి ద్వారా తమ నేతల మెప్పు పొందాలని అటు జెడ్పీ చైర్పర్సన్ స్వాతి రాణి, మంత్రి మృణాళిని ఆరాటపడుతున్నారు. ఇరువురు వేర్వేరుగా కేటాయింపులు చేసి, మండలాల వారీగా ప్రతిపాదనలు పంపించాలని తమ నేతలకు సూచించిన విషయం తెలిసిందే. ఇందులో జెడ్పీ చైర్పర్సన్ కాసింత ముందంజలో నిలిచారు. అలా వచ్చిన ప్రతిపాదనలపై జెడ్పీ ద్వారా తీర్మానం చేసి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా కలెక్టర్‌కు పంపించారు. ఇంతలోనే కొందరు నేతలకు సందేహం వచ్చి మంత్రిని వాకబు చేయడంతో జెడ్పీ చైర్పర్సన్, మంత్రి ఇద్దరూ కాంపోనెట్ పనుల కోసమే ప్రతిపాదనలు స్వీకరించారని తేలింది. దీంతో మంత్రి రంగంలోకి దిగి పనుల ప్రతిపాదనలను నిలిపేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఆదేశించినట్టు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ప్రతిపాదనలు తీసుకున్నాక ఎలా నిలిపేస్తామని, జెడ్పీ తీర్మానంతోనే వెళ్లాలని చైర్పర్సన్ కరాఖండీగా చెప్పినట్టు తెలియవచ్చింది. ఈ సందర్భంలో ఓవర్ టేక్ చేస్తున్నావని, మంచిది కాదని చైర్పర్సన్ స్వా తిరాణిని మంత్రి వారించినట్టు కూడా బయట వినిపిస్తోంది. ఈ సారికైతే ప్రతిపాదిత కేటాయింపులు ఆపేది లేదని, భవిష్యత్‌లో ఉపాధి నిధులు మంజూరైతే మీ ప్రకారంగా చేసుకోవాలని మంత్రికి తెగేసి చెప్పినట్టు సమాచారం. ఇంతలోనే హైదరాబాద్‌లో శిక్షణా తరగతులకోసం ఆ ఇద్దరు నేతలు వెళ్లడంతో ఆ వ్యవహారం అలా ఉండిపోయింది. శిక్షణా తరగతులు ముగియడంతో ఇప్పటికే చైర్పర్సన్ స్వాతిరాణి జిల్లాకొచ్చారు. మంత్రి కూడా ఈరోజు, రేపో జిల్లాకొచ్చే అవకాశం ఉంది. ఉపాధి పనుల ప్రతిపాదిత ఫైలు కలెక్టర్ వద్ద ఉంది. మంత్రి తన పంతం నెగ్గించుకోవాలంటే కలెక్టర్ వద్దే ఆ ఫైలు ఆపేయాలి. అంటే తప్పనిసరిగా కొర్రి వేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించే అవకాశం ఉంది. అదే జరిగితే చైర్పర్సన్ ప్రతిఘటనను కలెక్టర్ ఎదుర్కోవల్సి ఉంటుంది. ఒకవేళ మంత్రి వెనక్కి తగ్గితే చైర్పర్సన్ మాట చెల్లుబాటు అయినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ వర్గాల్లో విసృ్తత చర్చ నడుస్తోంది. -
ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ కు తప్పిన ప్రమాదం
హైదరాబాద్: ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జెడ్పీ చైర్ పర్సన్ శోభరాణి గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవాను డీసీఎం వ్యాను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న జెడ్పీ చైర్మన్ శోభారాణితో పాటు ఆమె భర్త సత్యనారాయణ గౌడ్ కు స్వల్పగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇక..స్టాండింగ్ కమిటీల వంతు!
నల్లగొండ :జిల్లాపరిషత్ పాలకవర్గం కొలువుదీరడంతో ఇప్పుడు అందరి దృష్టి స్టాండింగ్ కమిటీలపై పడింది. జెడ్పీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన 60 రోజుల్లోగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సమావేశంలో ముందుగా స్టాండింగ్ కమిటీలకు ఎన్నిక ఉంటుంది. సభ్యుల మధ్య పోటీ ఏర్పడితే రహస్య ఓటింగ్ నిర్వహిస్తారు. లేనిపక్షంలో ఏకగ్రీవంగానే ఎన్నుకుంటారు. జిల్లాపరిషత్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ స్టాండింగ్ కమిటీలకు ఎన్నిక జరగలేదు. సభ్యులందరినీ ఏకగ్రీవంగానే కమిటీల్లో నియమించారు. ఏడు కమిటీలు జిల్లా పరిషత్‌లో మొత్తంగా ఏడు స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి. జెడ్పీ చైర్మన్ నాలుగు కమిటీలకు, వైస్‌చైర్మన్ ఒక కమిటీకి చైర్మన్‌గా ఉంటారు. మహిళా సంక్షేమ స్థాయి కమిటీలో కేవలం సభ్యులు ఉంటారు. అయితే ఈ కమిటీలో సగం మంది మహిళలు తప్పనిసరిగా ఉండాలి. సాంఘిక సంక్షేమ స్థాయి కమిటీ లోనూ సభ్యులే ఉంటారు. ఇక్కడా సగం మంది మహిళలకు అవకాశం కల్పించాలి. ఈ సగం మందిలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సభ్యులకు అవకాశం ఇవ్వాలి. ప్రణాళిక-ఆర్థిక స్థాయి, పనుల స్థాయి కమిటీల్లో సభ్యులుగా ఉండేందుకు జెడ్పీటీసీల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో కమిటీలో 11మంది సభ్యులు ఉండగా, జెడ్పీ పరిధిలో మొత్తంగా 79 సభ్యులు (జెడ్పీటీసీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు) ఉంటారు. కమిటీల ఎన్నిక ఇలా... ఇప్పటిదాకా స్టాండింగ్ కమిటీలకు ఎన్నికలు జరగలేదు. ఏకగ్రీవంగానే కమిటీలకు సభ్యులను ఎన్నుకున్నారు. జెడ్పీ చైర్మన్ ఇచ్చిన జాబితా ప్రకారం సర్వసభ్య సమావేశం రోజున ఏ కమిటీల్లో ఎవరిని నియమించారనే విషయాన్ని ప్రకటిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సూచనల మేరకే జెడ్పీటీసీ సభ్యులను కమిటీల్లో నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా వచ్చిన ప్రతిపాదనలనే జెడ్పీ చైర్మన్ ఆమోదిస్తూ వచ్చారు. ఏదేని విపత్కర పరిస్థితుల్లో ఎన్నిక నిర్వహించాల్సి వస్తే మాత్రం రహస్య ఓటింగ్ ద్వారానే కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. ఉదాహరణకు ఓ కమిటీకి 15 పోటీ పడుతుంటే, 11 మందిని మాత్రమే ఎన్నుకునేందుకు రహస్య ఓటింగ్ నిర్వహిస్తారు. మిగిలిన జెడ్పీటీసీ సభ్యులందరు కూడా ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రం ఓటు హక్కు ఉండదు. జెడ్పీ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకు చివరి వరకూ పోటీలో ఉన్న నేతలు ముఖ్యమైన కమిటీల్లో చోటు దక్కించుకునేందుకు అప్పుడే తమ గాడ్ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
జెడ్పీ సారథి నామన
సాక్షి, కాకినాడ : ముహూర్తం ముంచుకొచ్చినా.. జెడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వంపై తేల్చుకోలేకపోవడంతో టీడీపీ జెడ్పీ టీసీలు శనివారం మధ్యాహ్నం వరకూ పార్టీ కార్యాల యానికే పరిమితమయ్యారు. దాంతో ఉదయం పదిగంటలకే జరగాల్సిన ఎక్స్ అఫిషియా సభ్యుల ఎన్నిక, సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ జాప్యమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి టీడీపీ జెడ్పీటీసీలు జెడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. ఎక్స్ అఫిషియా సభ్యులుగా కొవ్వాడకు చెందిన మట్టా సూర్య సత్యప్రకాశరావు, ద్రాక్షారామకు చెందిన మీర్జా ఖాసిం ఖాజీ హుస్సేన్‌లను టీడీపీ ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రకటించారు. జెడ్పీ ఎన్నికల ఆర్వో, సీఈఓ మజ్జి సూర్యభగవాన్ జెడ్పీటీసీ, కో ఆప్షన్ సభ్యులతో అక్షర క్రమంలో ప్రమాణం చేయించారు. తొలుత టీడీపీకి చెందిన అమలాపురం జెడ్పీటీసీ సభ్యురాలు అధికారి జయ వెంకటలక్ష్మి ప్రమాణం చేశారు.పార్టీ కండువాలతో హాజరైన వైఎస్సార్ సీపీ సభ్యులుచిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరిల ఆధ్వర్యంలో పార్టీకి చెందిన 14 మంది జెడ్పీటీసీ సభ్యులు పార్టీ కండువాలు ధరించి సమావేశానికి హాజరయ్యారు. వారిలో తొలుత దేవీపట్నం జెడ్పీటీసీ సభ్యురాలు మట్ట రాణి, తర్వాత జ్యోతుల నవీన్‌కుమార్, మిగిలిన సభ్యులు ప్రమాణం చేశారు. వారిని ఆ పార్టీ యువజన, వాణిజ్య విభాగం కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, కర్రి పాపారాయుడు అభినందించారు. రాంబాబును ప్రతిపాదించిన పేరాబత్తుల ప్రమాణ స్వీకారాల అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక చేపట్టారు. పి.గన్నవరం జెడ్పీటీసీ సభ్యుడు నామన రాంబాబు పేరును చైర్మన్ పదవిని ఆశించి భంగపడిన ఐ.పోలవరం జెడ్పీటీసీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్ ప్రతిపాదించగా, కడియం జెడ్పీటీసీ సభ్యురాలు పాలపర్తి రోజా బలపర్చారు. వైస్ చైర్మన్‌గా రంగంపేట జెడ్పీటీసీ సభ్యుడు పెండ్యాల నళినీకాంత్ పేరును గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు మడికి సన్యాసిరావు ప్రతిపాదించగా, తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి బలపర్చారు. నామన, పెండ్యాల ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన కలెక్టర్ నీతూ ప్రసాద్ వారితో ప్రమాణం చేయించారు. ‘నామన ’కు అభినందనల వెల్లువ జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన నామన రాంబాబును ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, టీడీపీ ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, తోట త్రిమూర్తులు, పులపర్తి నారాయణమూర్తి, దాట్ల బుచ్చిరాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు, ఎస్వీఎస్ఎన్ వర్మ, పెందుర్తి వెంకటేష్, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పార్టీ రాష్ర్ట ప్రధానకార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం అభినందించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెలేలు నెహ్రూ, జగ్గిరెడ్డి, రాజేశ్వరి, ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు జ్యోతుల నవీన్‌కుమార్ తదితరులు నామనను అభినందించారు. ప్రజలకు మంచి చేస్తే సహకరిస్తామని, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ఎండగడతామని నెహ్రూ పేర్కొన్నారు. జెడ్పీ కార్యాలయ సిబ్బంది, ఎంపీడీఓలు, వివిధశాఖల అధికారులు నామనను అభినందించారు. -
లాంఛనమే..
జెడ్పీ చైర్‌పర్సన్‌గా లాలం భవాని వైస్ చైర్మన్‌గా కొట్యాడ అప్పారావు నేడు ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు విశాఖ రూరల్ : రెండేళ్ల తరువాత జిల్లా పరిషత్ పీఠంపై పాలకవర్గం కొలువుతీరనుంది. సుదీర్ఘకాలంగా సాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనకు తెరపడనుంది. శనివారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 39 జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ 15 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ 24 జెడ్పీటీసీలను గెలుచుకొని జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. రాంబిల్లి మండలం నుంచి గెలిచిన లాలం భవాని చైర్పర్సన్ అభ్యర్థినిగా ఎన్నికలకు ముందే టీడీపీ ప్రకటించింది. వైస్‌చైర్మన్ అభ్యర్థిగా అనంతగిరి మండలం జెడ్పీటీసీ కొట్యాడ అప్పారావు పేరును ఖరారు చేశారు. దీంతో వీరి ఎన్నిక లాంచనం కానుంది. ఏర్పాట్లు పూర్తి : చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్‌సమావేశ మందిరంలో ఈ ఎన్నిక జరగనుంది. దీనికి హాజరుకావాలంటూ జిల్లా కలెక్టర్, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి సాల్మన్ ఆరోఖ్యరాజ్ గెలిచిన అభ్యర్థులతో పాటు సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలకు నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం 10 గంటల లోపు కో-ఆప్షన్ సభ్యులుగా బరిలో ఉండే వారు నామినేషన్లు సమర్పించాలి. వీరు తప్పనిసరిగా మైనా ర్టీ ధ్రువపత్రం సమర్పించాలి. ఉదయం 10 నుంచి 12 వరకు నామినేషన్లు పరిశీలన, మధ్యాహ్నం ఒంటి గంటలోపు నామినేషన్ల ఉప సంహరణకు అవకాశముంటుంది. ఒంటిగంటకు కో-ఆప్షన్ సభ్యుల ప్రమా ణ స్వీకరం జరుగుతుంది. అనంతరం 3 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో 39 జెడ్పీటీసీ సభ్యులతో సమావేశం జరుగుతుంది. ఒక వరుస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, మరో వరుస జెడ్పీటీసీ సభ్యులకు ఏర్పాటు చేశారు. చేతులు ఎత్తే విధానంలో ఈ ఎన్నిక మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ైవె స్చైర్పర్సన్ ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నికలకు పార్టీలు విప్‌ను జారీ చేయనున్నాయి. -
టిక్.. టిక్..
ఎంపీపీల ఎన్నిక నేడు * జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపు * కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల శిబిరాలు * టీడీపీ ప్రలోభాలపర్వంపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు * విప్ జారీ చేసిన వైఎస్సార్ సీపీ సాక్షి, ఒంగోలు : జిల్లాలో పరిషత్ పోరు ఊపందుకుంది. మండల అధ్యక్షుల (ఎంపీపీలు) ఎన్నిక శుక్రవారం జరగనుంది. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ నెలకొంది. గెలిచిన ఎంపీటీసీ సభ్యుల బలబలాలపై ఆయా పార్టీల నాయకులు ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ.. మండల స్థాయిలోనూ హవా కొనసాగించేందుకు అడ్డదారులు తొక్కుతోంది. మెజార్టీ లేనిచోట్ల ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని ప్రలోభపెట్టి తమ వైపునకు తిప్పుకునేందుకు నానాతంటాలు పడుతోంది. తెలుగు తమ్ముళ్ల చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను మంటగలిపి అత్యధిక ఎంపీపీ స్థానాలు కై వసం చేసుకోవాలన్న టీడీపీ ఎత్తులకు వైఎస్సార్ సీపీ పైఎత్తులు వేస్తోంది. విప్ జారీ చేసిన సంగతి ఆ పార్టీ తమ సభ్యులకు తెలియజేసింది. ఎంపీపీలను ఎన్నుకునే ముందు తొలుత ఎంపీటీసీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అత్యధిక స్థానాలు వైఎస్సార్ సీపీవే ఈ ఏడాది ఏప్రిల్ 6, 11 తేదీల్లో జిల్లాలోని 56 మండలాల్లో 790 మండల ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 409 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ బలం 345 స్థానాలకే పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థులు 15 చోట్ల గెలవగా చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గం ఆటో గుర్తుపై పోటీ చేసి 14 చోట్ల విజయం సాధించింది. బీఎస్పీ ఒక ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకుంది. మండలాల వారీగా చూస్తే వైఎస్సార్ సీపీ 29 ఎంపీపీ పీఠాలు, టీడీపీ 19 స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 8 మండలాల్లో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లేనందున ఇక్కడ స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు ఆ రెండు పార్టీలూ దృష్టిపెట్టాయి. అందిరి చూపూ జెడ్పీ పీఠం వైపే జిల్లా పరిషత్ పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన జెడ్పీటీసీ సభ్యుల బలం వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉంది. జిల్లాలో 56 జెడ్పీటీసీలకుగాను ఆ పార్టీ 31 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ తరఫున 25 మంది సభ్యులు మాత్రమే విజయం సాధించారు. టీడీపీ ఎలాగైనా జెడ్పీ పగ్గాలు చేపట్టాలనే వ్యూహంతో రకరకాల కుయుక్తులకు పాల్పడుతోంది. కసరత్తులో భాగంగా తొలుత అత్యధిక ఎంపీపీ స్థానాల కైవసం చేసుకునేందుకు ఇతర పార్టీల ఎంపీటీసీ సభ్యులను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. నేతల సమావేశాల్లో కొనుగోళ్ల వ్యవహారంపై బహిరంగంగానే కార్యకర్తలకు పిలుపునివ్వడం.. కొన్నిచోట్ల ఎంపీటీసీల బంధువులతో బేరాలకు దిగి బరితెగించిందనే ఆరోపణలు టీడీపీ మూటగట్టుకుంటోంది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు మాత్రం తాము పార్టీ నిబంధనలకు కట్టుబడే ఉన్నామని, ప్రత్యర్థులు పనిగట్టుకుని దుష్ర్పచారం చేస్తున్నారని పలు సందర్భాల్లో బహిరంగంగానే వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. విప్‌ను ధిక్కరిస్తే అనర్హత వేటుకు గురికాక తప్పదన్న రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యలపై జిల్లాలో సర్వత్రా చర్చ జరుగుతోంది.