సాక్షి,రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డిపై 12 మంది జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. శుక్రవారమే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆ మరుసటి రోజు శనివారం(ఫిబ్రవరి 17) ఆమెపై అవిశ్వాసం నోటీసు ఇవ్వడం వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది.
ఈ మేరకు అవిశ్వాసం నోటీసును 12 మంది బీఆర్‌ఎస్ సభ్యులు కలిసి జెడ్పీ సీఈవోకు అందించారు. సునీతామహేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచే జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్‌పర్సన్ పదవి చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ అవిశ్వాసం గనుక నెగ్గితే సునీతామహేందర్‌రెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ పదవి కోల్పోవాల్సి ఉంటుంది. సునీతామహేందర్‌రెడ్డితో పాటు ఆమె భర్త మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌కు రేవంత్ బర్త్ డే విషెస్
Comments
Please login to add a commentAdd a comment