
శుభాకాంక్షలు చెబుతున్న తీగల అనితారెడ్డి
మహేశ్వరం: తనకు రాజకీయ జన్మనిచ్చింది తన మామ తీగల కృష్ణారెడ్డి అని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం ఆమె తన భర్త హరినాథ్‌రెడ్డితో కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మామ సహకారంతో రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు జెడ్పీ చైర్‌పర్సన్‌గా అయ్యానని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో పయనిస్తానని తెలిపారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా తాను పని చేస్తానని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment