theegala krishna reddy
-
నాకు రాజకీయ జన్మనిచ్చింది మామే..
మహేశ్వరం: తనకు రాజకీయ జన్మనిచ్చింది తన మామ తీగల కృష్ణారెడ్డి అని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం ఆమె తన భర్త హరినాథ్‌రెడ్డితో కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మామ సహకారంతో రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు జెడ్పీ చైర్‌పర్సన్‌గా అయ్యానని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో పయనిస్తానని తెలిపారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా తాను పని చేస్తానని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. -
రంగంలోకి సబిత
దిల్సుఖ్నగర్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యలో మహేశ్వరం నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంతో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి... ఆ పార్టీ నాయకుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురుకాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసిన సబిత, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి... ఆయనతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కలిసిన సబిత, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి త్వరలో చేవెళ్లలో నిర్వహించనున్న బహిరంగ సభలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఎన్నికల్లో టీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థిని గెలిపించే బాధ్యతను సీఎం సబితకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను టీఆర్ఎస్లో చేర్చేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ను ఖాళీ చేసేందుకు పథకం వేస్తున్నారు. టీఆర్ఎస్లో చేరనున్న ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆమె అన్ని విధాలా భరోసా ఇస్తున్నారు. -
‘మిషన్ కాకతీయ’తో చెరువులకు పూర్వవైభవం
కందుకూరు (రంగారెడ్డి జిల్లా): 'మిషన్ కాకతీయ' పథకం ద్వారా చెరువులకు పూర్వ వైభవం తేవడానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కప్పాటి పాండురంగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న మిషన్ కాకతీయ పనులను ఆయన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడారు. మండల పరిధిలో 38 చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టడానికి ప్రభుత్వం గుర్తించగా అందులో 30 చెరువులకు అనుమతులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం 27 చెరువుల్లో పనులు కొనసాగుతున్నాయన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం శంకుస్థాపనకు సీఎం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ఈ ప్రాంతంలోని చెరువులు నిండుతాయని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్‌ను మెప్పించి నియోజకవర్గానికి అధికంగా నిధులు తీసుకురావడానికి అహర్నిశలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. -
29న టీఆర్ఎస్లో చేరనున్న తలసాని, తీగల?
ఎప్పటినుంచో చేరుతారని భావిస్తున్న టీ-టీడీపీ నేతలు తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి.. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో బలోపేతం కావాలని భావిస్తున్న టీఆర్ఎస్.. ఈ నేతలను చేర్చుకోవాలని నిర్ణయించింది. నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో ఈనెల 29న జరిగే బహిరంగ సభలో తలసాని, తీగల, ధర్మారెడ్డి మరికొందరు ఇతర నాయకులు చేరతారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం శంఖారావం పూరించాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందుకే ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు తలసాని శ్రీనివాస యాదవ్, తీగ కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి సహా మరికొందర ఉనాయకులను పార్టీలో చేర్చుకుని, హైదరాబాద్ నగరంలో పార్టీని బలోపేతం చేసుకోవలని నిర్ణయించారు. వాస్తవానికి తలసాని, తీగల ఇంతకుముందే దసరా సమయంలో టీఆర్ఎస్లో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి గానీ, అప్పట్లో ఆగిపోయారు. ఇప్పుడు వాళ్లు చేరడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
పార్టీ మార్పుపై ఇప్పటికి నో కామెంట్స్
టీడీపీ సీనియర్ నాయకుడు, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి దసరాలోపు పార్టీ మారతారన్న విషయానికి ప్రస్తుతానికి ఒక కామా పడింది. ఇప్పట్లో తాను పార్టీ మారకపోవచ్చునంటూ తీగల స్వయంగా వెల్లడించారు. కార్యకర్తలతో చర్చిస్తున్నానని, వాళ్ల మనోభావాలకు అనుగుణంగా, వాళ్లు ఏం చెబితే అదే చేస్తానని ఆయన అన్నారు. తాను 33 ఏళ్లుగా టీడీపీలో ఉంటూ అనేక పదవులు నిర్వర్తించానని తీగల తెలిపారు. తాను పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడే ఉన్నానని, చంద్రబాబు కంటే కూడా పార్టీలో సీనియర్‌నని ఆయన కార్యకర్తలతో చెప్పారు. (టీఆర్ఎస్లోకి తీగల?) త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. తన నియోజకవర్గంతో పాటు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే తాను కోరుకుంటున్నానని, అభివృద్ధిలో అందరం భాగస్వాములం కావాలని చెబుతానని అన్నారు. కార్యకర్తలు ఏం చెబుతారో చూడాలన్నారు. దసరాలోపు పార్టీ మారతానన్న విషయమై మాత్రం నో కామెంట్స్ అనేశారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటానని, వాళ్లు ఏమంటే దానికే కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.