29న టీఆర్ఎస్లో చేరనున్న తలసాని, తీగల? | talasani and theegala likely to join trs on 29th | Sakshi
Sakshi News home page

29న టీఆర్ఎస్లో చేరనున్న తలసాని, తీగల?

Published Fri, Oct 24 2014 4:27 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

29న టీఆర్ఎస్లో చేరనున్న తలసాని, తీగల? - Sakshi

29న టీఆర్ఎస్లో చేరనున్న తలసాని, తీగల?

ఎప్పటినుంచో చేరుతారని భావిస్తున్న టీ-టీడీపీ నేతలు తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి.. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో బలోపేతం కావాలని భావిస్తున్న టీఆర్ఎస్.. ఈ నేతలను చేర్చుకోవాలని నిర్ణయించింది. నిజాం కాలేజి గ్రౌండ్స్లో ఈనెల 29న జరిగే బహిరంగ సభలో తలసాని, తీగల, ధర్మారెడ్డి మరికొందరు ఇతర నాయకులు చేరతారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం శంఖారావం పూరించాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

అందుకే ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు తలసాని శ్రీనివాస యాదవ్, తీగ కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి సహా మరికొందర ఉనాయకులను పార్టీలో చేర్చుకుని, హైదరాబాద్ నగరంలో పార్టీని బలోపేతం చేసుకోవలని నిర్ణయించారు. వాస్తవానికి తలసాని, తీగల ఇంతకుముందే దసరా సమయంలో టీఆర్ఎస్లో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి గానీ, అప్పట్లో ఆగిపోయారు. ఇప్పుడు వాళ్లు చేరడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement