తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు... | 12 TDP MLAs merge with TRS:bjp mla lakshman slams over telangana speaker decision | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు...

Published Fri, Mar 11 2016 3:43 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు... - Sakshi

తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు...

హైదరాబాద్ : తెలంగాణలో స్పీకర్ నిర్ణయంతో ప్రజలు విస్తుపోతున్నారని బీజేపీ ఎమ్మెల్యే డా.లక్ష్మణ్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులతో రాష్ట్రానికి తలవంపులు వచ్చాయని, అధికార పార్టీకి బలం ఉన్నా వేరే పార్టీ ఎమ్మెల్యేలెందుకు? అని ప్రశ్నించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలేంటనీ ఎమ్మెల్యే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

 

అప్పుల దిశగా తెలంగాణ రాష్ట్రం వెళ్తోందని ఆయన మండిపడ్డారు. కాగా తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు 12మంది టీఆర్ఎస్లో చేరారు. సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యారు. మూడింట రెండొంతులకు పైగా ‘చీలిపోయామని’, తమను టీఆర్‌ఎస్‌లో కలిపేయాలన్న ఆ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement