సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అసెంబ్లీలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు. పోలింగ్‌లో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకుండా ముందుగా తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసన సభ్యులకు మాక్‌పోలింగ్‌ను నిర్వహించారు. అనంతరం వారందరిని అక్కడి నుంచి బస్సులో అసెంబ్లీకి తరలించారు. ఎన్నికల్లో పాల్గొనేందుకు టీఆర్‌ఎస్, ఎంఐఎం సభ్యులందరూ ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఓటుహక్కుని వినియోగించుకున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తొలిఓటును వేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్
అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీగా ఉన్న ఐదు స్థానాల్లో టీఆర్‌ఎస్ నాలుగు, ఎంఐఎం ఒక స్థానం సొంత చేసుకోనున్నాయి. ఎన్నికల్లో పాల్గొనకుండా పార్టీ సభ్యులకు కాంగ్రెస్, టీడీపీ విప్ జారీచేశాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పాల్గొనట్లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment