
తీగల కృష్ణారెడ్డితో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్‌రెడ్డి
దిల్‌సుఖ్‌నగర్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యలో మహేశ్వరం నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంతో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి... ఆ పార్టీ నాయకుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురుకాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసిన సబిత, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి... ఆయనతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కలిసిన సబిత, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి త్వరలో చేవెళ్లలో నిర్వహించనున్న బహిరంగ సభలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చేవెళ్ల అభ్యర్థిని గెలిపించే బాధ్యతను సీఎం సబితకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్చేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ను ఖాళీ చేసేందుకు పథకం వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరనున్న ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆమె అన్ని విధాలా భరోసా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment