Karthik Reddy
-
కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్: కార్తిక్ రెడ్డికి పసిడి, రజతం, కాంస్యం
కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్-2024 పోటీలు ముగిశాయి. సౌతాఫ్రికాలోని డర్బన్ వేదికగా నవంబరు 28- డిసెంబరు 1 వరకు జరిగిన ఈ మెగా ఈవెంట్ విజయవంతంగా పూర్తైంది. ఇందులో భారత చాంపియన్ అరబండి కార్తిక్ రెడ్డి నాలుగు పతకాలు గెలవడం విశేషం.ఎలైట్, క్లబ్ కేటరిగీలలో వేర్వేరు విభాగాల్లో పోటీ పడిన కార్తిక్ రెడ్డి.. పసిడి, రజత(రెండు), కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత హెడ్‌కోచ్ కీర్తన్ కొండ్రు కార్తిక్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. అత్యుత్తమ నైపుణ్యాలతో పాటు అంకితభావం కలిగి ఉన్నందుకే కార్తిక్ రెడ్డికి ఈ విజయాలు సాధ్యమయ్యాయని కొనియాడారు.తన ప్రతిభతో దేశాన్ని గర్వపడేలా చేసిన కార్తిక్ రెడ్డి.. భారత కరాటేకు గొప్ప పేరు తీసుకువచ్చాడని కీర్తన్ కొండ్రు అభినందించారు. కాగా సౌతాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్ పదకొండవ ఎడిషన్ విజయవంతం కావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్-2024లో పతకాలు గెలిచిన మనోళ్లు వీరేకార్తిక్- స్వర్ణం, రజతం, రజతం, కాంస్యంమేసమ్- స్వర్ణం, కాంస్యంభువనేశ్వరి- స్వర్ణం, కాంస్యం, కాంస్యంనవీన్- స్వర్ణం, కాంస్యంరోహన్- స్వర్ణం, కాంస్యంఆరాధ్య- స్వర్ణంఆర్య- స్వర్ణం, రజతం, కాంస్యంసమిహాన్- స్వర్ణం, కాంస్యంసంకేత్- స్వర్ణం, కాంస్యంఆమేయ్- స్వర్ణంహాసిని- రజతంబిలహరి- రజతంరామానుజ- రజతంసాయిహర్ష్- రజతంఅమిత్- కాంస్యంభార్గవ్- కాంస్యంలిఖిత- కాంస్యం, కాంస్యంఅమిత్ ఆదిత్య- కాంస్యం.ఘె.చంద్రశేఖరరెడ్డి పుత్రోత్సాహంఆంధ్రప్రదేశ్ కు చెందిన అరబండి కార్తీక్ రెడ్డి కామన్ వెల్త్ కరాటే చాంపియన్ షిప్ 2024 పోటీలలో అంతర్జాతీయ వేదికలపై తెలుగు వారి ఖ్యాతిని నిలబెట్టాడు. భారత్ కు ప్రాతినిధ్యం వహించి నాలుగు పతకాలతో మెరిసి నిర్వాహకులు, క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు.ఈ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మొత్తం 15 మంది క్రీడాకారులు ఈ కరాటే ఈవెంట్ లో పాల్గొనగా, వారిలో కార్తీక్ రెడ్డి కి మాత్రమే నాలుగు పతకాలు లభించటం విశేషం. ఈ నేపథ్యంలో... తన కుమారుడు అంతర్జాతీయ వేదికలపై రాణించడం పట్ల తండ్రి, సెంట్రల్ జిఎస్టీ కమిషనర్ ఎ.చంద్రశేఖరరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేసారు. -
సీఎం జగన్‌ను కలిసిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ కార్తీక్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏపీకి చెందిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ అరబండి కార్తీక్ రెడ్డి గురువారం కలిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సీఎం అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం అన్నారు. కరాటేను శాప్ క్రీడగా గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. చదవండి: ఏపీలో సీఎం జగన్ పాలన అద్భుతం: మంత్రి కేటీఆర్ ఇటీవల జరిగిన కామన్వెల్త్ కరాటే చాంపియన్ షిప్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, అండర్ 16 బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో స్వర్ణపతక విజేతగా కార్తీక్ నిలిచాడు. అంతకుముందు ఏప్రిల్‌లో లాస్వేగాస్లో జరిగిన యూఎస్ఏ ఓపెన్ ఛాంపియన్ షిప్‌లోనూ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో వరసగా రెండు స్వర్ణాలు నెగ్గిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అక్టోబర్‌లో టర్కీలో వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఆధ్వర్యంలో అఫిషియల్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో పాల్గొని పతకం సాధిస్తానని కార్తీక్ తెలిపారు. తాను సాధించిన పతకాలను సీఎం జగన్‌కు చూపి, తనకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని సీఎంని కార్తీక్ కోరగా, సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం, మున్ముందు కార్తీక్ అవసరమైన పూర్తి ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, కార్తీక్ తల్లిదండ్రులు శిరీషా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌కేడీఏఏపీ ప్రెసిడెంట్ డాక్టర్ మిల్టన్ లూథర్ శాస్త్రి, ప్రవీణ్ రెడ్డి, కృష్ణారెడ్డి ఉన్నారు. -
కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర కుర్రాడికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ కుర్రాడు ఎ.కార్తీక్ రెడ్డి స్వర్ణ పతకంతో మెరిశాడు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లో కార్తీక్ రెడ్డి క్యాడెట్ బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో విజేతగా నిలిచాడు. జారాలాంపౌస్ (సైప్రస్) రజతం, హారిసన్ లుకాస్ (స్కాట్లాండ్), జేకబ్ కట్లర్ (ఇంగ్లండ్) కాంస్య పతకాలు గెలిచారు. -
కార్తీక్ రెడ్డికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: యూఎస్ఏ ఓపెన్ అంతర్జాతీయ కరాటే టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ కుర్రాడు ఎ.కార్తీక్ రెడ్డి స్వర్ణ పతకం సాధించాడు. అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో తిరుపతికి చెందిన కార్తీక్ అండర్–13 బాలుర కుమిటే టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని నెగ్గాడు. 40 దేశాల నుంచి 300కు పైగా క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. చదవండి: IPL 2022 DC Vs PBKS: ఢిల్లీ అలవోకగా... -
ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు
కార్తీక్ రెడ్డి, నేనే శేఖర్, స్వాతి, శ్వేత, ఆయేషా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అమ్మాయంటే అలుసా?’. నేనే శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవులూరి భాస్కర్ రెడ్డి సమర్పణలో వై. బ్రహ్మ శేఖర్, వై. లిఖితా చౌదరి నిర్మించారు. ఈ నెల 16న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నేనే శేఖర్ మాట్లాడుతూ – ‘‘ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు. వారికి గౌరవం ఇవ్వాలి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. చాలా సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమా తెరకెక్కించాను’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: వినీష్ గౌడ్, కో ప్రొడ్యూసర్: ఎన్. మాధవరెడ్డి. -
అమ్మాయంటే అలుసా దిశకు అంకితం
‘‘స్టార్ హీరోలు, దర్శకుల దగ్గర ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశాను. తొలిసారి నిర్మాతగా మారి సినిమా తీశాను. అనుకోని ఇబ్బందుల వల్ల సినిమా ఆగిపోతే నా భార్యకు తెలియకుండా ఇల్లు అమ్మేసి సినిమా పూర్తి చేశాను’’ అన్నారు నేనే శేఖర్. ఆయన హీరోగా, దర్శక–నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘అమ్మాయంటే అలుసా?’. కార్తీక్ రెడ్డి, స్వాతి, శ్వేత, ఆర్తి ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల చేశారు.‘‘ప్రస్తుత సమాజానికి ఎటువంటి కథ అయితే బావుంటుందో తెలిసినవాడు శేఖర్’’ అన్నారు నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్. ‘‘ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత రామసత్యనారాయణ. ‘‘ఈ సినిమాను దిశకు అంకితం చేస్తున్నా’’ అన్నారు నేనే శేఖర్. -
సినిమాల పైరసీ నేపథ్యంలో..
నవీన్ చంద్ర ,గాయత్రీ సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘హీరో హీరోయిన్ ’.స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మించిన ఈ చిత్రానికి ‘అడ్డా’ ఫేమ్ జి.కార్తీక్ రెడ్డి దర్శకుడు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. భార్గవ్ మన్నె మాట్లాడుతూ– ‘‘సినిమాల పైరసీ నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ కథ ఇది. తను అనుకున్న పాయింట్‌ను చక్కగా తెరకెక్కించాడు కార్తీక్. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం టీజర్ ఇటీవల విడుదల కాగా మంచి స్పందన వచ్చింది.నవీన్ చంద్ర యాక్టింగ్ నెక్ట్స్ లెవ ల్లో ఉంటుంది. పైరేటెడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
మండలి టికెట్ మహేందర్‌రెడ్డికే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరన్న అంశంపై దాదాపు స్పష్టత వచ్చింది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికే టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ఆయన పేరును ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి స్థానానికి ఉప ఎన్నిక జరిపేందుకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఈ స్థానంలో ఎమ్మెల్సీగా కొనసాగిన మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి.. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి నరేందర్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, అధికార పార్టీ తరఫున బరిలో ఎవరు ఉంటారన్నది ఇప్పటి వరకు చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి మహేందర్‌రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ మధ్యలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరే సమయంలో పార్టీ అధిష్టానం నుంచి సబితమ్మకు మంత్రి పదవితోపాటు కార్తీక్‌కు ఎమ్మెల్సీ పదవిపై హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కార్తీక్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే కార్తీక్ మాత్రం ఎమ్మెల్సీ బరిలో లేరని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ ఎవరి పేరు ఖరారు చేసినా తమ మద్దతు ఉంటుందని చెబుతున్నాయి. సీఎం భరోసా మేరకు.. అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మహేందర్‌రెడ్డి.. చేవెళ్ల లోక్‌సభ టికెట్ ఆశించారు. దాదాపు ఈ టికెట్ ఆయనకే ఖరారైందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే, అనూహ్యంగా మహేందర్‌రెడ్డి మిత్రుడు పారిశ్రామికవేత్త డాక్టర్ రంజిత్‌రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఇలా చివరి నిమిషంలో టికెట్ చేజారిన మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని సీఎం కేసీఆర్ అప్పుడు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు మహేందర్ రెడ్డి వైపు సీఎం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. నేడు కాంగ్రెస్ అభ్యర్థిపై స్పష్టత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై కాంగ్రెస్ పెద్దలు శనివారం ప్రత్యేకంగా గాంధీభవన్‌లో భేటీ కానున్నారు. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గాల అభ్యర్థులను తేల్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలిసింది. జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలు రేసులో ఉన్నట్లు సమాచారం. వీరిద్దిరిలో ఒకరికి అవకాశం ఇస్తారా? లేదంటే మరొకరిని తెరమీదకు తీసుకొస్తారా? అనేది ఈ భేటీలో తేలనుంది. -
కాంగ్రెస్ పార్టీ ఖాళీ..?
మొయినాబాద్: అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్‡్షతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి సబితారెడ్డి, ఆమె తనయుడు టీఆర్ఎస్లో చేరుతుండడంతో వారితో పాటు కాంగ్రెస్ నాయకులు, పలువురు సర్పంచ్‌లు కారెక్కెందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 19న శంషాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో కార్తీక్‌రెడ్డితోపాటు జిల్లాలోని పలు మండలాల కాంగ్రెస్ నాయకులు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు గులాబీ కండువ కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సబితారెడ్డి, కార్తీక్రెడ్డిలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి వారి అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వరుసగా ప్రతి రోజు సమావేశాలు నిర్వహించి చర్చించుకుంటున్నారు. అందులో భాగంగా శనివారం రాత్రి మొయినాబాద్ మం డల నాయకులు, పలువురు ప్రజాప్రతినిదులు సబితారెడ్డి, కార్తీక్‌రెడ్డితో సమావేశమైనట్లు సమాచారం. మండలంలోని కాంగ్రెస్ నాయకులంతా వారితోపాటే గులాబీ పార్టీలో చేరే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. మొయినాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అత్యధికులు సబితారెడ్డి అనుచరులే కావడంతో వారిబాటలోనే నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు చాలా మంది నాయకులు అంగీకరించినట్లు తెలుస్తుంది. మండల పార్టీ అధ్యక్షుడితోపాటు ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు, ఏఎంసీ మాజీ చైర్మన్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు సైతం సబితారెడ్డి కుటుంబం వెనక నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. వారంతా 19న శంషాబాద్‌లో జరిగే బహిరంగ సభలో గులాబీ కండువాలు కప్పుకోనున్నారు. మిగిలేదెవరు? ప్రస్తుత రాజకీయ పరిణామాలతో మొయినాబాద్ మండల కాంగ్రెస్‌లో మిగిలేదెవరో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికంగా సర్పంచ్ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మొయినాబాద్ మండలంలో సబితారెడ్డి అనుచరవర్గమే అధికంగా ఉంటుంది. ఇప్పుడు వారంతా టీఆర్ఎస్లో చేరితే మిగిలేది ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎంపీ కొండా విశ్వేశరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నా వారి వెంట ఎంత మంది నిలుస్తారనేది వేచిచూడాలి. -
టీఆర్ఎస్లో చేరికకు ముహూర్తం ఖరారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా వేసుకోనున్నారు. శంషాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ మైదానంలో సాయంత్రం 6 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కార్తీక్‌రెడ్డి నిశ్చయించారు. ఇదే వేదికపై ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గులాబీ గూటికి చేరనున్నారు. వీరితోపాటు తమ వర్గంగా భావిస్తున్న పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పార్టీ మారనున్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల మంది టీఆర్ఎస్ శ్రేణులను ఈ సభకు సమీకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొంత ఆలస్యంగా సబిత.. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాలని తొలుత భావించారు. ఈ మేరకు చేవెళ్ల లేదా శంషాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేపటి నుంచి ప్రారంభించనుండటంతో.. సమయం వీలుకాదని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తనకు బదులు కుమారుడు కేటీఆర్‌ను జిల్లాకు పంపిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ సమక్షంలో కార్తీక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నారు. అయితే సబిత మాత్రం ఒకటి రెండు రోజులు ఆగనున్నట్లు తెలిసింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు. -
రంగంలోకి సబిత
దిల్సుఖ్నగర్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యలో మహేశ్వరం నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంతో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి... ఆ పార్టీ నాయకుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురుకాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసిన సబిత, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి... ఆయనతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కలిసిన సబిత, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి త్వరలో చేవెళ్లలో నిర్వహించనున్న బహిరంగ సభలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఎన్నికల్లో టీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థిని గెలిపించే బాధ్యతను సీఎం సబితకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను టీఆర్ఎస్లో చేర్చేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ను ఖాళీ చేసేందుకు పథకం వేస్తున్నారు. టీఆర్ఎస్లో చేరనున్న ప్రజాప్రతినిధులు, నాయకులకు ఆమె అన్ని విధాలా భరోసా ఇస్తున్నారు. -
కారెక్కనున్న సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ కురాలు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. తనకు మంత్రి పదవితోపాటు కుమారుడు కార్తీక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు టీఆర్ఎస్ నుంచి భరోసా లభించడంతో ఆమె కాంగ్రెస్‌ను వీడనున్నారు. సబిత బుధవారం తన రాజకీయ కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉంది. బుధ లేదా గురువారాల్లో కాంగ్రెస్‌కి రాజీనామా చేసే అవకాశముంది. కేసీఆర్ సమక్షంలో సబిత, కార్తీక్ గులాబీ కండువా వేసుకోనున్నారు. ఫలించని బుజ్జగింపులు... కాంగ్రెస్‌లోనే కొనసాగాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా బుజ్జగించే ప్రయత్నం చేసినా తన ఆలోచనను సబిత మార్చుకోలేదు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి తదితరులు ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి నచ్చజెప్పేందుకు యత్నించినా వెనక్కి తగ్గకపోవడం తో మంగళవారం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని సబిత ఇంటికెళ్లిన రేవంత్.. కాంగ్రెస్‌ను వీడాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని సబిత ను కోరారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారని సాయంత్రం వరకు ప్రచారం జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు బుధవారం ఢిల్లీ వెళ్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే సాయంత్రానికి మళ్లీ సీన్ మారింది. రేవంత్ తనను కలిసిన సమయంలోనే తాను పార్టీని వీడనున్నట్లు ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. ఉత్తమ్ వ్యవహార శైలితోపాటు జిల్లాలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో సబిత, కార్తీక్ తీవ్ర కలత చెందినట్లు తెలిసింది. దీంతోపాటు టీఆర్ఎస్ నుంచి ఆమెకు మంత్రి పదవి, కుమారుడికి రాజకీయ భవిష్యత్తుపై కేసీఆర్, కేటీఆర్, కవితల నుంచి భరోసా లభించడంతో చివరకు పార్టీ మారాలనే నిర్ణయించుకున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని తన అనుచరులు, పార్టీ సీనియర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన సబిత, కార్తీక్రెడ్డిలు ఇదే విషయాన్ని వారికి చెప్పారు. -
గులాబీ గూటికి సబితా ఇంద్రారెడ్డి!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ బహిరంగ సభ జరిగిన మరుసటి రోజే.. అదే జిల్లాకు చెందిన నాయకురాలు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.. గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సబిత, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భం గా కార్తీక్ రాజకీయ భవిష్యత్తుతో పాటు సబితకు మంత్రివర్గంలో స్థానంపై కేటీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్టు సమాచారం. దీంతో సోమవారం అనుచరులతో సమావేశం కానున్న సబిత త్వరలోనే నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని ఆమె సన్నిహితుల ద్వారా తెలిసింది. పలు ప్రతిపాదనలపై చర్చ ఒవైసీ నివాసంలో కేటీఆర్‌తో జరిగిన భేటీలో సబితా ఇంద్రారెడ్డి కుటుంబం రాజకీయ భవిష్యత్తుపై టీఆర్ఎస్ నుంచి సంపూర్ణ హామీ లభించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో తొలి మహిళా హోంమంత్రిగా రికార్డు సృష్టించిన సబిత.. తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా రికార్డు సృష్టించే విధంగా సానుకూల చర్చలు వీరి మధ్య జరిగినట్టు సమాచారం. సబితకు మంత్రిపదవి ఇవ్వడం పట్ల కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నారని కేటీఆర్ సంకేతాలిచ్చారని సమాచారం. అయితే ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి ఎమ్మెల్సీనా, ఎంపీనా అన్న విషయంలో మాజీ మంత్రి, సబిత సన్నిహిత బంధువు పట్నం మహేందర్‌రెడ్డితో కూర్చుని మాట్లాడుకోవాలని ఆయన సూచించినట్టు సమాచారం. అవసరమైతే సబిత చేవెళ్ల ఎంపీగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేయొచ్చనే వార్తలు కూడా వినిపించాయి. అదే అనివార్యమైతే మహేశ్వరం ఎమ్మెల్యేగా కార్తీక్ ఉంటారని, ఈ మేరకు కూడా భేటీలో చర్చలు జరిగాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటి నుంచో అసంతృప్తి టీపీసీసీ నాయకత్వం పట్ల సబిత చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తనతో సంప్రదించకుండానే.. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై గుర్రుగా ఉన్నారు. తన కుమారుడి కోసం అడిగిన రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానాన్ని పొత్తు పేరుతో టీడీపీకి ఇచ్చి చేజేతులా అక్కడ ఓటమి పాలయ్యామనే భావనలో ఆమె ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పార్టీ నాయకత్వం వైఖరిలో మార్పు లేకపోవడంతో సబితలో అసంతృప్తి మరింత పెరిగింది. దీనికి తోడు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగం లేదని, రాజకీయంగా తనకు భవిష్యత్తులో ఇబ్బందులుంటాయని.. ఆమె కొంత కాలంగా సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. అసద్‌తో భేటీ అనంతరం కవిత నివాసానికి వెళ్లిన సబిత దాదాపు గంటపాటు భేటీ అయినట్టు సమాచారం. ఫలించని బుజ్జగింపు యత్నాలు తాజా పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ ప్రముఖుల సబితను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిలు సబిత నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. పార్టీలోనే కొనసాగాలని, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా.. ఈ బుజ్జగింపులు ఫలించలేదని తెలిసింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలూ.. ఆదివారం ఒక్క రోజే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో.. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వీరి బాటలోనే వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒక గిరిజన ఎమ్మెల్యేతో పాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరొకరు ఉన్నారని, వారు బుధవారం లోపు నిర్ణయాన్ని ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలతో వీరి సంప్రదింపులు పూర్తయ్యాయని, నేడో, రేపో లేఖలు కూడా వస్తాయంటున్నారు. వీరి తర్వాత మరో ఎమ్మెల్యే కూడా పార్టీని వీడి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ముగ్గురు మహిళా ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియానాయక్‌లు వెళ్లిపోనున్న నేపథ్యంలో.. పార్టీలో సీతక్క ఒక్కరే ఏకైక మహిళా ఎమ్మెల్యేగా మిగలనున్నారు. -
అమ్మ కోసం కార్తీక్‌రెడ్డి సీటు త్యాగం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నాడు కుమారుడు ఎంపీగా పోటీ చేసేందుకు పెద్ద మనస్సు చేసుకొని పోటీకి దూరమైన అమ్మ.. నేడు తల్లి బరిలోకి దిగేందుకు వీలుగా తన సీటును త్యాగం చేసిన కుమారుడు. ఇలా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె తనయుడు కార్తీక్రెడ్డిలు జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లగా.. కార్తీక్‌కు చేవెళ్ల ఎంపీగా పోటీకి లైన్‌క్లియర్ చేసేందుకు సబిత తన మహేశ్వరం సీటును త్యాగం చేశారు. ఇప్పుడు మహేశ్వరం సెగ్మెంట్‌ను సబితకు కేటాయించగా.. కూటమి పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో కార్తీక్‌కు సీటు త్యాగం తప్పలేదు. పాత కథ పునరావృతం 2014 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే మహేశ్వరం శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తల్లి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే, కుటుంబానికి ఒకే టికెట్ అనే నిబంధనను కాంగ్రెస్ పార్టీ తెర మీదకు తేవడంతో తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసం మహేశ్వరం సిట్టింగ్ స్థానాన్ని త్యజించారు. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం కార్తీక్‌కు లభించింది. ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన కార్తీక్‌కు పరాభవం ఎదురైంది. దీంతో కొద్ధిరోజుల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సబిత.. ఈ సారి పాత స్థానమైన మహేశ్వరం నుంచి, కార్తీక్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ రెండు స్థానాల టికెట్లు తమకు ఖాయమని భావించారు. అయితే, అనూహ్యంగా ఈ సారి కూడా ‘ఫ్యామిలీకి ఒకే టికెట్’ షరతును వర్తింపజేయాలని హైకమాండ్ నిర్ణయించడంతో కార్తీక్ నీరుగారారు. అయితే, ఈ నిబంధన కార్యరూపం దాల్చదని చివరి నిమిషం వరకు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ నెరిపారు. సొంత పార్టీని ఒప్పించడానికి సతమతమవుతున్న ఆయనకు మిత్రపక్షం రూపంలో చుక్కెదురైంది. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ ఈ స్థానాన్ని ఎగురేసుకుపోవడంతో ఆయనకు నిరాశే మిగిలింది. దీంతో కుంగిపోయిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని చెప్పడమేగాకుండా.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, మహేశ్వరంలో అమ్మ పోటీ చేస్తుండడంతో తన రాజీనామా ప్రభావం ఆమెపై పడకూడదని భావించారు. రాజీనామా నిర్ణయంపై వెనుకడుగువేశారు. దీంతో నాడు కార్తీక్ కోసం తల్లి సీటును త్యాగం చేయగా.. ఈ సారి తల్లి కోసం తనయుడు సీటును త్యజించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
పొత్తు... ముగ్గురు చిత్తు..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మహాకూటమి పొత్తు కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. మూడు స్థానాలను మిత్రపక్షమైన టీడీపీకి కేటాయించడంతో నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సెగ్మెంట్ల టికెట్లను ఆశించిన ముగ్గురు ఆశావహులు పార్టీ హైకమాండ్‌పై ధిక్కార స్వరం వినిపించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి ఏకంగా రాజీనామాస్త్రాన్ని సంధించగా.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్ టికెట్లు అమ్ముకున్నారని డీసీసీ అధ్యక్షుడు ఆడియో టేపులను విడుదల చేసి కలకలం సృష్టించారు. టికెట్ల కేటాయింపులో యాదవులకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఈనెల 17న ఇండిపెండెంట్లుగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ భిక్షపతియాదవ్, ఇబ్రహీంపట్నం రేసులో నిలిచిన క్యామ మల్లేశ్ ప్రకటించారు. దీంతో జిల్లాలో కూటమి కుంపటి రాజేసినట్లయింది. మరోవైపు మాజీ మంత్రి శంకర్రావు కూడా షాద్‌నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. పార్టీకి కార్తీక్ షాక్! మాజీ మంత్రి సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి పార్టీకి షాక్ ఇచ్చారు. రాజేంద్రనగర్ సీటును టీడీపీకి సర్దుబాటు చేయడంతో అసంతృప్తికి లోనైన ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శంషాబాద్‌లో గురువారం కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించిన కార్తీక్.. సీటు కేటాయింపుపై పునరాలోచన చేస్తే సరేసరి.. లేకపోతే తమ రాజీనామాలు ఆమోదించినట్లుగానే భావిస్తామని హెచ్చరించారు. ఏ మాత్రం ఓటు బ్యాంకు లేని టీడీపీకి కాంగ్రెస్ కార్యకర్తలెవ్వరూ ఓటేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. సీట్ల పంపకాలలో పీసీసీ పెద్దలు ఇష్టానుసారంగా వ్యవహరించారని విమర్శించారు. కార్తీక్ రాజీనామా ప్రకటనతో ఆగ్రహంతో ఊగిపోయిన కార్యకర్తలు శంషాబాద్‌లో పార్టీ కార్యాలయంలో హంగామా సృష్టించారు. ఫ్లెక్సీ, జెండా దిమ్మెలను ధ్వంసం చేశారు. ఈ అసమ్మతి సెగలు రాజేంద్రనగర్ రాజకీయాన్ని హాట్‌హాట్‌గా మార్చాయి. ఇదిలావుండగా, కార్తీక్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసినందున.. బరిలో ఉంటారా? లేదా వేచిచూడాల్సిందే! మూటల మాటలు బయటపెట్టిన క్యామ డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ అధిష్టానంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టికెట్ల కేటాయింపుల్లో బీసీలకు ముఖ్యంగా గొల్ల, కురుమలకు కేవలం ఒక సీటును కేటాయించడాన్ని తప్పుబట్టారు. అంతేగాకుండా టికెట్లను బహిరంగంగా అమ్ముకున్నారని సంచలన ప్రకటన చేశారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్ కుమారుడు టికెట్లను వేలం పెట్టారని, ఆశావహుల నుంచి రూ.3 కోట్ల మేర వసూలు చేశారని ఆరోపిస్తూ, భక్తచరణ్‌దాస్ కుమారుడు సాగర్ జరిపిన సంభాషణలుగా చెప్పుకుంటున్న ఆడియో టేపులను విడుదల చేశారు. ఈ ముడుపుల వ్యవహారం పార్టీలో కలకలం సృష్టించింది. ఇబ్రహీంపట్నం సీటును టీడీపీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. బీసీలను మోసం చేసిన పార్టీకి బుద్ధి చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులు, కురుమలను ఏకం చేస్తానని హెచ్చరించారు. రేపు నామినేషన్ వేస్తా : భిక్షపతియాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును ‘దేశం’కు కేటాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న ఆయన.. అధిష్టానం వ్యవహారశైలిపై విరుచుకుపడుతున్నారు. డబ్బుల సంచులకు టికెట్లు పంపిణీ చేశారని పీసీసీపై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నుంచి బరిలో దిగుతున్న అభ్యర్థి మూటలకు ఆశపడి.. తనకు టికెట్ నిరాకరించారని దుయ్యబట్టారు. ఈనెల 17న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ టికెట్ కోసం ప్రయత్నించిన తోటకూర జంగయ్యయాదవ్ కూడా బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇదిలావుండగా, మాజీ మంత్రి శంకర్రావు గురువారం షాద్‌నగర్‌లో తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి పార్టీకి సవాల్ విసిరారు. -
ఆయనకి టిక్కెట్ ఇవ్వకపోతే మేము ఒప్పుకోం.
-
ఆయనకి టిక్కెట్ ఇవ్వకపోతే మేము ఒప్పుకోం..
సాక్షి, రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి భంగపడిన సంగతి తెలిసిందే. ఎన్నికల పొత్తులో భాగంగా ఆ టికెట్ టీడీపీకి కేటాయించారు. మీ నేపథ్యంలో కార్తీక్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. శంషాబాద్‌లోని ఆయన నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తు పేరు చెప్పి టీడీపీ దరిద్రం కాంగ్రెస్ కు అంటించారని ఉత్తమ్ కుమారెడ్డిపై నిప్పులు చెరిగారు. 40 మంది కార్యకర్తలు కూడా లేని టీడీపీకి రాజేంద్రనగర్ సీటు కేటాయిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతోందనీ, కాలాన్ని వృధా చేయకుండా కార్తీక్ రెడ్డికి టికెట్ కోసం వేలాదిగా గాంధీభవన్ ముట్టడించాలని మన పోరాటం ఢిల్లీకి తాకి పునరాలోచించాలని కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజేంద్ర నగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షడు శ్రీనివస్ గౌడ్ అధ్యక్ష పదవికి రాజీనామచేశారు. కార్తీక్ రెడ్డికి టికెట్ ఇస్తే లక్ష ఓట్లతో రాజేంద్ర నగర్ గెలుస్తారు. లేదంటే ప్రచాకటరకమిటీ సభ్యత్వంతో సహా అన్ని పదవులకు కార్తీక్ రెడ్డి ,రాజేంద్రనగర్ కార్యకర్తలు రాజీనామా చేస్తామని, కూర్చొని మాట్లాడితే కాదు, రోడ్లపైకి వెళ్లి ఎక్కడిక్కడ స్తంభింపచేయాలని ఇంతమంది కార్యకర్తలను రోడ్డు మీద పడేసినందుకు ఉత్తమ్ కుమారెడ్డికి ధన్యవాదాలని ఎద్దెవ చేశారు. కార్తీక్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకున్నా ఆయనవెంటే ఉంటామని ప్రకటించారు,ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సైతం సిద్దపడాలని అవసరమైతే సబితమ్మ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా ఇద్దరు బరిలో నిలవాలని ఇద్దరినీ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. -
థ్రిల్‌కి గురి చేసే స్కెచ్
నర్సింగ్ మక్కల, ఇంద్ర, సమీర్ దత్త, కార్తీక్ రెడ్డి, చక్రి మాగంటి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సూపర్ స్కెచ్’. రవిచావలి దర్శకత్వంలో యు అండ్ ఐ బ్యానర్ సమర్పణలో బలరామ్ మక్కల, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో రవి చావలి మాట్లాడుతూ – ‘‘సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ప్రతి నిమిషం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులకు థ్రిల్ కలుగుతుంది. ఈ చిత్రంలో తెలంగాణ యాసలో మాట్లాడే నర్సింగ్ మక్కల క్యారెక్టర్ సూపర్బ్‌గా ఉంటుంది. సురేంద్రగారు అద్భుతమైన విజువల్స్ ఇస్తే, కార్తీక్ మ్యూజిక్, నేపథ్య సంగీతంతో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు’’ అన్నారు. ‘‘కథ వినగానే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే కుదిరితే బావుంటుందని అనుకున్నాం. స్క్రీన్‌ప్లే చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఫైనల్ అవుట్‌పుట్ చూశాం. జూన్‌లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఇంద్ర, నర్సింగ్ మక్కల తదితరులు పాల్గొన్నారు. -
కార్తీక్ వ్యూహం.. లైన్ క్లియర్..!
మాజీ హోంమంత్రులు జానారెడ్డి, మాధవరెడ్డి తనయులు రఘువీర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి కూడా కార్తీక్‌కు ప్రాణస్నేహితులు. ఈ త్రయంతో రేవంత్‌కు సాన్నిహిత్యం ఉంది. వీరి ప్రోద్బలం కూడా రేవంత్ కాంగ్రెస్ గూటి వైపు చూసేందుకు దారితీసిందని చెప్పుకోవచ్చు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి పార్టీ మారాలనే ఆలోచన వెనుక మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రాజకీయ పరిణామాలకు ఆయనే వ్యూహకర్తగా తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి కథ..స్క్రీన్‌ప్లే ఇక్కడి నుంచే మొదలైనట్టు తెలుస్తోంది. కార్తీక్‌కు రేవంత్‌తో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా సన్నిహిత సంబంధాలుండడంతో కార్తీక్ నివాసం నుంచే రాజకీయ మంత్రాంగం నడిపినట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌తో భేటీ వంటి కీలక అంశాలకు కూడా జిల్లాలోనే బీజం పడిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీన్ రివర్స్ అయ్యింది. తాజాగా రాజకీయాల్లో డేరింగ్.. డైనమిక్... ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రేవంత్ కాంగ్రెస్‌లో చేరితే ఇటు వికారాబాద్ జిల్లాతోపాటు పొరుగునే ఉన్న పాలమూరు జిల్లాలోనూ పూర్వవైభవం సాధించవచ్చని అంచనా వేస్తోంది. ఓటుకు నోటు కేసులో ఆయన జైలుకు వెళ్లడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా రేవంత్ ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడానికి కార్తీక్‌రెడ్డి ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ హోంమంత్రులు జానారెడ్డి, మాధవరెడ్డి తనయులు రఘువీర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి కూడా కార్తీక్‌కు ప్రాణస్నేహితులు. ఈ త్రయంతో రేవంత్‌కు సాన్నిహిత్యం ఉంది. వీరి ప్రోద్బలం కూడా రేవంత్ కాంగ్రెస్ గూటి వైపు చూసేందుకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న ఉమా మాధవరెడ్డి (సందీప్‌రెడ్డి తల్లి) కూడా త్వరలోనే టీడీపీకి గుడ్‌బై చెప్పే అవకాశం లేకపోలేదు. తాండూరుపై ప్రభావం! రేవంత్ సైకిల్ దిగడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారే అవకాశముంది. రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ పక్కనే తాండూరు నియోజకవర్గం ఉంటుంది. ఈ ప్రాంతంలోనూ రేవంత్‌కు కొంత మేర పట్టుంది. పరిగి నియోజకవర్గంలోనూ ఆయన అనుచరగణం ఉంది. ఇవే కాకుండా ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, మహేశ్వరం, కూకట్పల్లి, తదితర నియోజకవర్గాల్లోనూ రేవంత్‌కు సొంత కేడర్ ఉంది. తాజా పరిణామాలు ఈ నియోజకవర్గాలపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం రేవంత్ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. -
గ్రామజ్యోతి నిధులిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి
హైకోర్టులో కార్తీక్‌రెడ్డి పిల్ సాక్షి, హైదరాబాద్: గ్రామజ్యోతి పథకం కింద గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు, సౌకర్యాల కల్పనలో రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి, హైదర్హాకోట్ సర్పంచ్ పి.కృష్ణా రెడ్డి ఈ వ్యాజ్యాన్ని వేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. గ్రామజ్యోతి పథకం కింద గ్రామ పంచాయతీలకు నిధులు, సౌకర్యాలను కల్పించా ల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పిటిషనర్లు తెలిపారు. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ.5,375.53 కోట్లు గ్రామ పంచాయతీలకు అందాల్సి ఉన్నా, ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేయలేద న్నారు. కనుక ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పంచాయతీలకు నిధులిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. -
ఫేస్బుక్లో పరిచయం... ప్రేమ పేరుతో వంచన
బెంగళూరు : ఫేస్బుక్ పరిచయం ఓ యువతికి ప్రాణ సంకటంగా మారింది. ఆ యువతికి ప్రేమ పేరుతో వల వేసిన యువకుడు..తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి అవసరాలు తీర్చుకున్నాడు. మోసాన్ని గుర్తించిన యువతి నిలదీయగా, చంపేస్తామని బెదిరిస్తున్నాడు. ఈ ఘటన బుధవారం బెంగళూరులో వెలుగు చూసింది. పోలీసులతో పాటు బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన 26 ఏళ్ల యువతికి స్థానిక జేపీ నగర్లో నివసిస్తున్న కార్తీక్‌రెడ్డితో మే మొదటి వారంలో ఫేస్బుక్లో పరిచయమైంది. వారం పాటు ఛాటింగ్ చేసిన తర్వాత కార్తీక్‌రెడ్డి తన ప్రేమను వ్యక్తం చేశాడు. పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. ఇందుకు ఆమె ఒప్పుకోవడమే కాకుండా తల్లిదండ్రులకు కూడా తెలియజేసింది. వారి సమ్మతితో అప్పుడప్పుడు డేటింగ్‌కు వెళ్లేది. ఈ క్రమంలో శారీరకంగా ఒకటయ్యారు. తర్వాత కార్తీక్‌రెడ్డి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అనుమానించిన యువతి ఫేస్బుక్లో అతనికి స్నేహితులుగా ఉన్నవారిని విచారించింది. గతంలో కూడా కార్తీక్ ఇలానే పలువురిని మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలు అతడిని నిలదీసింది. దీంతో ‘నా గురించి నా స్నేహితులతో విచారిస్తావా? నాకు చాలామంది రాజకీయ నాయకులు, కార్పొరేట్ వ్యక్తులతో సంబంధం ఉంది. నేను ఒక కంపెనీ సీఈఓను. నువ్వు ఏమీ చేయలేవు. నిన్ను వదిలిపెట్టను’ అని కార్తీక్ రెడ్డి బెదిరించాడు. అంతేకాకుండా ఫోన్ చేసి యాసిడ్ పోస్తానని బెదిరింపులకు దిగాడు. కార్తీక్‌రెడ్డి స్నేహితుడిగా చెప్పుకునే జయదీప్ కూడా బాధితురాలికి ఫోన్ చేసి ‘నీ పై వాహనం పోనిచ్చి చంపేస్తా. రోడ్డు ప్రమాదమని అందరినీ నమ్మిస్తా’ అంటూ కొద్దిరోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు వైట్‌ఫీల్డ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్‌రెడ్డి, జయదీప్ కోసం గాలిస్తున్నారు. -
తప్పుడు రిపోర్టు ఇచ్చిన ఆస్పత్రిపై ఫిర్యాదు
తన కూతురుకు వచ్చిన జ్వరం డెంగ్యూగా నిర్ధారించి తీవ్ర ఆందోళనకు గురి చేశారంటూ ఓ వ్యక్తి వైద్యశాల నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శ్రీరామా పిల్లల ఆస్పత్రి ఉంది. ఈ ఆస్పత్రిలో గత నెల 15వ తేదీన కార్తీక్‌రెడ్డి అనే వ్యక్తి తన కూతురుకు వైద్యం చేయించారు. అయితే, ఆమెకు డెంగ్యూ జ్వరం వచ్చిందని చెప్పటంతో హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించారు. అక్కడి వైద్యులు మాత్రం సాధారణ జ్వరంగా తేల్చారు. దీంతో కార్తీక్‌రెడ్డి.. తప్పుడు నివేదికతో తనను తీవ్ర ఆందోళనకు గురి చేసిన ఆస్పత్రి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఇటీవల డీఎంహెచ్‌వో ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు. కాగా.. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలను ఆస్పత్రిపై తీసుకోలేదంటూ సదరు బాధితుడు బుధవారం సాయంత్రం ఒన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని సీఐ ఒన్‌టౌన్ సీఐ బిక్షం తెలిపారు. -
కొత్తగా...సరికొత్తగా...
ఆ కుర్రాడికి ఓ అమ్మాయి విపరీతంగా నచ్చేసింది. కానీ అందరిలా కాకుండా కొత్తగా ప్రేమించాలనుకున్నాడు. లవ్‌లో సరికొత్త యాంగిల్‌ను ట్రై చేశాడు. మరి తర్వాత ఈ కుర్రాడి డిఫరెంట్ లవ్‌స్టోరీ ఎన్ని మలుపులు తిరిగిందనే ది తెలుసుకోవాలంటే మంచు విష్ణు తాజా చిత్రం కోసం ఎదురు చూడాల్సిందే. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ పతాకంపై ‘అడ్డా’ ఫేమ్ కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో డి.కుమార్, పల్లి కేశవరావ్ నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందులో సోనారిక కథానాయిక. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ ఇది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. విష్ణు బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథ ఇది. సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, విజయ్ సి. కుమార్ కెమెరా పనితనం ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో మరో ప్రముఖ కథానాయిక నటిస్తున్నారు. టైటిల్‌ను దసరా సందర్భంగా ప్రకటించనున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ: సోమా విజయ్‌ప్రకాశ్. -
ఈ తరానికి జంధ్యాల ప్రేమకథ
ప్రముఖ దర్శకులు జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘నాలుగు స్థంభాలాట’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని యాపిల్ సినిమా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ’. ఇషాంత్ వర్మ సమర్పణలో మనెగుంట కార్తీక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ జరుగుతోంది. కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలక్ష్మీ, గాయత్రీ గుప్తా, శేఖర్, దిలీప్ ముఖ్య తారలు. చిత్రవిశేషాలను దర్శకుడు చెబుతూ -‘‘ప్రస్తుత తరానికి తగ్గ కథతో రూపొందిస్తున్న చిత్రం ఇది. జంధ్యాలగారు సినిమాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో ఈ చిత్రం అంత బాగుంటుంది. ఇటీవల మలేసియాలో 40 రోజుల పాటు నిరాటంకంగా చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం జరుపుతున్న షెడ్యూల్‌తో సినిమా ముగుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: కోశిరెడ్డి రవికుమార్, పసుపులేటి సురేష్‌బాబు. -
స్వీయానుభవాలతో...
దర్శకుడు వేల్ ప్రభాకరన్ తన స్వీయ అనుభవాల ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కూడా ఆయనే పోషిస్తుండం విశేషం. కార్తీక్‌రెడ్డి, శేఖర్ నిర్మాతలు. ఇళయరాజా సంగీత దర్శకుడు. ఆసక్తిగొలిపే విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇళయరాజా స్వరాలు యువతరాన్ని ఉర్రూతలూగిస్తాయని, ఇళయరాజా సమక్షంలో హైదరాబాద్‌లోనే ఘనంగా పాటల్ని విడుదల చేస్తామనీ, జనవరిలో సినిమాను విడుదల చేస్తామనీ నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి భాస్కరరెడ్డి. -
'తల్లీ తనయుడు డుమ్మా కొట్టారు'
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు గైర్హాజరు అయ్యారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డితో పాటు ఆమె వర్గంగా పేరొందిన పలువురు నాయకులు సదస్సుకు డుమ్మా కొట్టారు. పార్టీకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానంటూ ఇటీవలి జరిగిన పలు సమావేశాల్లో సబితా ఉద్ఘాటించగా... తాజా సదస్సుకు దూరంగా ఉండటంపై అక్కడి నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు ఇబ్రహీంపట్నంలో తలపెట్టిన సదస్సుకు పార్టీలో కీలకంగా వ్యవహరించే మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం హాజరు కాలేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ నేతలంతా సదస్సుకు గైర్హాజరు అయినట్లు సమాచారం. -
సోనియా సభ.. అభ్యర్థులకు క్షోభ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘సుబ్బి పెళ్లి.. ఎంకి చావుకొచ్చిందన్న’ చందంగా సోనియా సభ ఇద్దరు నేతల రాజకీయ భవితవ్యాన్ని గందరగోళంలో పడేసింది. అధినేత్రి రాకతో ఓట్లు రాల్చుకోవచ్చనే ఆశించిన సదరు అభ్యర్థులు.. గెలుపు వాకిట బోల్తా పడడమేకాకుండా చివరకు అన ర్హత వేటును తప్పించుకునేందుకు మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి దాపురించింది. ఏప్రిల్ 27న చేవెళ్లలో జరిగిన భారీ బహిరంగసభలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాల్గొన్నారు. అధినేత్రి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం భారీగా జనసమీకరణ చేపట్టింది. సభను విజయవంతం చేసేందుకు దాదాపు రూ.కోటి వరకు ఖర్చు చేసింది. సుమారు 700పైగా ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొని జనాలను సభకు తరలించింది. కేవలం దీని కోసమే రూ.85 లక్షలను ఆర్టీసీకి చెల్లించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే రూ.28 లక్షలు, ఎంపీ రూ.70 లక్షలకు మించి ఖర్చు చేయడానికి లేదు. అయితే, జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొనే సభల వ్యయం విషయంలో కొన్ని సడలింపులున్నాయి. ఈ భరోసాతోనే బస్సుల అద్దెలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చెల్లించింది. అసలేం జరిగిందంటే.. స్టార్ క్యాంపెయినర్లు పాల్గొనే సభల నిర్వహణా వ్యయాన్ని అభ్యర్థుల లెక్కలో చూపకుండా మినహాయింపు ఉంది. అదే సమయంలో సదరు నేత తన ప్రసంగంలో అభ్యర్థుల పేర్లను ఉచ్చరించినా, ఓటర్లకు పరిచయం చేసినా, వేదిక ప్రాంగణంలో అభ్యర్థుల పోస్టర్లు ప్రదర్శించినా ఎన్నికల వ్యయంలో కొంత నిష్పత్తిని సదరు అభ్యర్థి ఖాతాలో జమచేయాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చేవెళ్లలో జరిగిన సోనియాగాంధీ సభ వీడియో పుటేజీని నిశితంగా పరిశీలించిన వ్యయ పరిశీలకులు.. ప్రచార సభ ఖర్చును రూ. కోటిగా తేల్చారు. ఈ మొత్తాన్ని అభ్యర్థుల పద్దులో చేర్చాల్సివుంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థుల అభ్యంతరంతో ఈ వ్యవహారంపై స్పష్టత కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. వ్యయ పరిశీలకుడి అభిప్రాయంతో ఏకీభవించిన ఈసీ.. సభ వ్యయాన్ని చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ అభ్యర్థులందరి ఖాతాలో జమచేయాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల సమర్పించిన లెక్కలను మదింపు చేసిన పరిశీలకులు.. ఆ రోజు సభలో పాల్గొన్న సభ్యుల ఖాతాలో రూ.14.30 లక్షల చొప్పున జమ చేశారు. శేరిలింగంపల్లి అభ్యర్థి భిక్షపతియాదవ్ సభకు రాకపోవడంతో ఈ వాతను తప్పించుకున్నారు. ఎంపీ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి సహా మిగతా ఆరుగురు అసెంబ్లీ అభ్యర్థుల పద్దులో ఈ లెక్కను చూపారు. ప్రసాద్, మల్‌రెడ్డికి చిక్కులు? చేవెళ్ల సభ పరిణామాలను ముందుగా ఊహించని కాంగ్రెస్ అభ్యర్థులిద్దరిని తాజా పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎన్నికల వ్యయాలను సమర్పించలేదనే కారణంతో కొన్నేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని 9 మంది అభ్యర్థులు ఇప్పటికే కోల్పోయారు. వీరిలో వికారాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగిన మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అధినేత్రి సోనియా ఎన్నికల ఖర్చును తమ ఖాతాలో జమ చేయడంతో మరో ఇద్దరికి కష్టం కాలం వచ్చింది. మాజీ ఎమ్మెల్యే లు ప్రసాద్‌కుమార్, మల్రెడ్డి రంగారెడ్డిల ఎన్నికల వ్యయ పరి మితి మించిపోయింది. నిర్దేశిత రూ.28 లక్షల్లో కేవలం రూ.14-18 లక్షల వరకు చూపిన వ్యయానికి ఎన్నికల పరిశీలకులు ఓకే చేసినప్పటికీ, సోనియా సభ ఖర్చును వీరి ఖాతాలోకూడా కొంత మొత్తా న్ని జమచేయడం వీరికి క్షోభను మిగిల్చింది. చేవెళ్ల సభ వ్యయం విషయంలో అనుసరించాల్సిన పద్ధతిపై జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జరిగిన కమిటీ చర్చించింది. అనంతరం ఈ సభ వ్యయాన్ని సమంగా లోక్‌సభ పరిధిలోని అభ్యర్థులకు పంచాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అప్పటికే ఎంతో కొంత ఖర్చు పెట్టిన వీరికి, ఈ వ్యయం జమ కావడం పరిమితి దాటినట్లు విశ్వసనీయంగా తెలి సింది. ఇదే పరిస్థితి ఉత్పన్నమైతే ప్రజాప్రతినిథ్య చట్టం 1951 సెక్షన్ 77 ప్రకారం మూడు నుంచి ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉండదని అధికారవర్గాలు అంటున్నాయి. ఈసీ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ ఈ తరహా కేసులో అనర్హత వేటు పడలేదని, అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉందని స్పష్టంచేశాయి. వ్యయ వివరాలను నేడోరేపో ఈసీఐ వెబ్సైట్లో పొందుపరిచే అవకాశం ఉందని ఓ ఎన్నికల అధికారి వెల్లడించారు. అయితే ఈ విషయంపై అధికారికంగా స్పందించేందుకు అధికారులు నిరాకరించారు. -
తొలిసారి ఎదురుగాలి
చేవెళ్ల, న్యూస్‌లైన్: మూడు దశాబ్దాలపాటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పట్లోళ్ల కుంటుంబానికి తొలిసారి ప్రజల నుంచి ఎదురుగాలి వీచింది. 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో, 1999 నుంచి 2014వరకు కాంగ్రెస్ పార్టీలో అన్నీ తామై నడిపిన ఆ కుంటుబానికి నేడు ప్రాతినిథ్యం కరువైంది. 30 ఏళ్లుగా ఆదరిస్తూ వచ్చిన ప్రజల నుంచి మొదటిసారి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఒక కుటుంబం నుంచి ఒకేసీటు అనే నినాదాన్ని ఏఐసీసీ అమలుచేయడంతో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా జిల్లాలో ఆధిపత్యం చలాయించిన మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి తన కుమారుడు కార్తీక్‌రెడ్డి కోసం పోటీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్‌ను కార్తీక్‌రెడ్డికి కేటాయించింది. అయితే కార్తిక్రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 26,685 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. 1985లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఇంద్రారెడ్డి అఖండ మెజార్టీతో విజయం సాధించారు. 1989, 1994 ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి పోటీచేసి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999లో ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరినా ప్రజలు ఆదరించారు. 2000 సంవత్సరంలో ఇంద్రారెడ్డి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన సతీమణి సబితారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2004లో సైతం ఆమె విజయం సాధించారు. ఇలా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, సబితారెడ్డి రెండు సార్లు గెలిచారు. 2009 వరకు పట్లోళ్ల కుటుంబ ఆధిపత్యం కొనసాగింది. ఆ ఏడాది నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ల అసెంబ్లీ స్థానం ఎస్సీకి రిజర్వ కావటంతో సబితారెడ్డి మహేశ్వరం జనరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. నిరాశలో కార్యకర్తలు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు పోటీచేయాలన్న ఉద్దేశంతో నాలుగైదేళ్లుగా క్షేత్ర స్థాయిలో కార్తిక్‌రెడ్డి పనిచేశారు. నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్‌ను కాపాడుకున్నారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ నవనిర్మాణ పాదయాత్ర పేరుతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ వద్దగల ఆరెమైసమ్మ దేవాలయం నుంచి చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల మీదుగా తాండూరు వరకు 101 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. దీనికి విశేష స్పందన రావడంతో ఎంపీ టికెట్ ఇస్తే సునాయాసంగా గెలుస్తారని భావించారు. రాహుల్ దూతలు కూడా ఇదే విషయాన్ని అధిష్టానానికి వివరించారు. ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో పోటీ నెలకొన్నప్పటికి కార్తిక్‌రెడ్డి అధిష్టానం నుంచి టికెట్ సాధించగలిగారు. చేవెళ్ల నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుందని కార్యకర్తలు ఊహించారు. అనూహ్యంగా కార్తిక్‌రెడ్డి కంటే తెరాస అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని చే వెళ్లతో పాటు నవాబుపేట, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ మండ లాల్లో ఏ ఒక్క చోటా కార్తిక్‌రెడ్డికి ఆధిక్యం రాలేదు. అన్ని మండలాల్లోనూ వెనుకబడి పోవటం ఆ పార్టీ కార్యకర్తలను నిరాశకు గురిచేసింది. ఇలా ఎందుకు జరిగిందంటూ అంతర్మథనంలో పడిపోయారు. చేవెళ్ల అసెంబ్లీ పరిధిలో లోక్‌సభకు మొత్తం 1,61,971 ఓట్లు పోలవగా అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అత్యధికంగా 79,781 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 53,096 ఓట్లు పడ్డాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా సబితాఇంద్రారెడ్డి అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. -
మాజీ 'హోం' వారసుల ఓటమి....
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో కీలక నేతల వారసులుగా రాజకీయ అరంగేట్రం చేసిన యువనేతలకు నిరాశే మిగిలింది. తమ కుటుంబ పెద్దలు ప్రజలకు చేసిన మేలు.. యువతలో ఉన్న ఇమేజీపై ఆశలతో ఎన్నికల బరి లోకి దిగినప్పటికీ చేదు అనుభవమే ఎదురైంది. చేవెళ్ల పార్లమెంటు బరిలో దిగిన ఇరువురు వారసులకు ఇదే పరిస్థితి కనిపించింది. రాష్ట్ర హోంమంత్రులుగా పనిచేసి ఇంద్రారెడ్డి, సబితారెడ్డిల కుమారుడు కార్తీక్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా, టీడీపీ ప్రభుత్వంలో హోం మంత్రితో పాటు పలు కీలకపదవులు చేపట్టిన తూళ్ల దేవేందర్‌గౌడ్ పెద్ద కుమారుడు తూళ్ల వీరేందర్‌గౌడ్ టీడీపీ తరపున బరిలోకి దిగారు. పార్టీ క్యాడర్‌తో రంగంలోకి దిగిన ఇరువురు కుటుంబ పెద్దల పేరుతో విస్తృతంగా ప్రచారం చేశారు. దాదాపు తమకు గెలుపు ఖాయమని భావించిన ఇరువురికి అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేతిలో ఘోరపరాజయం ఎదురైంది. మరోవైపు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బండారు లక్ష్మారెడ్డి సైతం ఓటమి పాలయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి సోదరుడైన లక్ష్మారెడ్డి.. ఈసారి అన్న రాజిరెడ్డి పోటీనుంచి తప్పుకోడంతో కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని పోటీ చేశారు. చివరకు బీజేపీ అభ్యర్థి ప్రభాకర్ చేతిలో ఓటమిపాలయ్యారు. -
చేవెళ్లలో.. హోరాహోరీ
చేవెళ్ల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి కె.శ్రీకాంత్‌రావు: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి విజయం సాధించాలన్నా.. నగర శివార్లలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నియోజకవర్గంలో దాదాపు 20 లక్షల ఓటర్లున్నారు. బరిలో కొత్త ముఖాలు కాంగ్రెస్ నుంచి మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి, తెలుగుదేశం నుంచి మాజీ హోం మంత్రి దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్, టీఆర్ఎస్ నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి మనువడు కొండా విశ్వేశ్వరరెడ్డితోపాటు వైఎస్సార్సీపీ పక్షాన కొండా రాఘవరెడ్డి రంగంలో ఉన్నారు. వారంతా మొదటిసారి పోటీ చేస్తున్న వారే. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థులపైనే వీరు ఆధారపడి ఉన్నారు. ప్రధానంగా తాండూరు, రాజేంద్రనగర్‌లలో మైనారిటీ ఓట్లు కీలకం కానున్నాయి. అసెంబ్లీ అభ్యర్థులదే భారం ఈ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ఏడుగురిలో సబితా ఇంద్రారెడ్డి పోటీ నుంచి తప్పుకోవడం తో మిగిలిన వారిలో రాజేంద్రనగర్ ఎమ్మె ల్యే మినహా ఐదుగురు తీవ్ర పోటీ ఎదుర్కొం టున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు హరీశ్వర్‌రెడ్డి(పరిగి), మహేందర్‌రెడ్డి(తాండూరు), కె .ఎస్.రత్నం(చేవేళ్ల), వికారాబాద్‌లో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, శేరిలిం గంపల్లిలో ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభావంతో పార్లమెంట్‌కు క్రాస్ ఓటింగ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులు ఎంీపీ అభ్యర్థిని విస్మరించి తమ వరకు మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారు. సెగ్మెంట్ల వారీగా బలాబలాలు పరిగి సెగ్మెంట్లో కాంగ్రెస్ నుంచి రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ నుంచి రాంరెడ్డి, టీఆర్ఎస్ నుంచి హరీశ్వర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఇప్పటికే వరుస విజయాలు సాధించిన హరీశ్వర్‌రెడ్డిపై ఈసారి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కమతం రాంరెడ్డి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. దీనితో కాంగ్రెస్ ఓట్లు చీలే అవకాశం ఉంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి రుక్మారెడ్డి సైతం ప్రచారంలో దీటుగా వెళ్తున్నారు. - తాండూరులో మహేందర్‌రెడ్డి(టీడీపీ), నారాయణరావు(కాంగ్రెస్), నరేష్(టీడీపీ), ప్రభుకుమార్(వైఎస్సార్సీపీ) బరిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రభుకుమార్ మిగిలిన అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. - వికారాబాద్‌లో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి సం జీవరావు, వైఎస్సార్సీపీ నుంచి క్రాంతికుమార్, బీజేపీ నుంచి పుష్పలీల పోటీ చేస్తున్నారు. - చేవేళ్లలో టీఆర్ఎస్ అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ నుంచి కాలే యాదయ్య రంగంలో ఉండగా, టీడీపీ నుంచి వెంకటేష్ రంగంలో ఉన్నారు. పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఉంది. - రాజేంద్రనగర్‌లో ప్రకాశ్‌గౌడ్(టీడీపీ), మజ్లిస్, జ్ఞానేశ్వర్(కాంగ్రెస్), ముజ్తాబా అహ్మద్(వైఎస్సార్సీపీ) అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోటీ మాత్రం మజ్లిస్, టీడీపీ మధ్యనే నెలకొంది. - శేరిలింగంపల్లిలో వైఎస్సార్సీపీ నుంచి ముక్కా రూపానందరెడ్డి(వైస్సార్సీపీ), భిక్షపతియాదవ్(కాంగ్రెస్),అరికెపూడి గాంధీ(తెలుగుదేశం) బరిలో ఉన్నారు. - మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టీడీపీ నుంచి తీగెల కష్ణారెడ్డి, సీపీఐ నుంచి అజీజ్‌పాషా మధ్య పోటీ నెలకొంది. -
కాంగ్రెస్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం
మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి షాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర పునర్నినిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిన్నసోలీపేట్, మద్దూర్, హైతాబాద్ గ్రామాల్లో సోమవారం రాత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తన కుమారుడు కార్తీక్‌రెడ్డికి, కాలె యాదయ్యకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. అసెంబ్లీ అభ్యర్థి కాలె యాదయ్య, డీసీసీ అద్యక్షుడు పడాల వెంకటస్వామి, సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సదాలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకులు జనార్దన్‌రెడ్డి, గోపాల్, లక్ష్మారెడ్డి, అస్మత్‌పాషా, సుధాకర్‌రెడ్డి, రాజు, కుమార్, చంద్రశేఖర్ తదితరులున్నారు. -
ప్రతిష్టాత్మకం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంటు పోరు ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులంతా కొత్తవారవడం, వీరు ప్రముఖుల వారసులు కావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పోటీ పడుతుండగా.. టీడీపీ నుంచి మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్ బరిలో నిలిచారు. దీంతో ఇద్దరు మాజీ హోంమంత్రులకు తనయుల గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు కోసం ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ తమ కుమారులను గెలిపించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచార రంగంలోకి బంధుగణం.. పల్లె, పట్టణ వాతావరణం కలయిక చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి జోరుగా సాగుతోంది. కార్తీక్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్‌ల బంధువర్గం సైతం ప్రచారంలో పాల్గొంటోంది. వీరేందర్‌కు అండగా దేవేందర్‌గౌడ్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరేందర్ తన మిత్రవర్గంతోనూ కలిసి ప్రచార కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల నిర్వహణ అంతా వీరేందర్ సోదరుడు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు పట్టణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. చేవెళ్ల సొంత ప్రాంతం కావడంతో ఇక్కడినుంచే అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కార్తీక్‌రెడ్డికి అండగా సబితారెడ్డి ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఇప్పటికే ఆ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేయగా.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్తీక్ సోదరులు ప్రచార కార్యక్రమాల నిర్వహణను చూసుకుంటున్నారు. మరోవైపు కార్తీక్ చిన్నమ్మ, సోదరి కూడా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. -
మల్కాజిగిరి సర్వేదే..చేవెళ్ల నుంచి కార్తీక్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం శనివార ం రాత్రి అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ కేవలం లోక్‌సభ అభ్యర్థుల పేర్లనే వెల్లడించింది. జిల్లాలోని మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణకు, చేవెళ్ల నుంచి కార్తీక్‌రెడ్డికి టికెట్లు దక్కాయి. శాసనసభ అభ్యర్థులను కూడా నిర్ణయించినప్పటికీ, చివరి నిమిషంలో జాబితాను వాయిదా వేశారు. ఊహించినట్లుగానే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డికి స్థాన మార్పిడి జరిగింది.మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి మారాలనే ఆయన నిర్ణయానికి అధిష్టానం తలూపింది. దీంతో ఆయన స్థానంలో కార్తీక్‌రెడ్డికి టికెట్ లభించింది. కాగా, మరో కేంద్ర మంత్రి, మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణకు సిట్టింగ్ స్థానమే దక్కింది. ఫలించిన కార్తీక్‌రెడ్డి ప్రయత్నం... చేవెళ్ల నుంచి పార్లమెంటుకు పోటీచేయాలన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. సీనియర్ నేత జైపాల్ రెడ్డి రాకతో 2009లో చివరి నిమిషంలో పార్టీ టికెట్టు కోల్పోయిన కార్తీక్.. ఈసారి పట్టువదలకుండా పోరాడి బీ ఫారం దక్కించుకున్నారు. ఈసారి ఎలాగైనా ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్న కార్తీక్.. మూడు నెలల క్రితమే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. సీటు మారుతున్నట్లు జైపాల్ వెల్లడించకముందే చేవెళ్ల పార్లమెంటుపై తన ఇష్టాన్ని ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’ పేర బహిరంగ పరిచారు. ఈసారి కూడా పార్లమెంటు స్థానానికి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. జైపాల్ తప్పుకున్నప్పటికీ, తన స్థానంలో మరో సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డిని బరిలోకి దించాలని గట్టి ప్రయత్నమే చేశారు. కుటుంబంలో ఒకరికే సీటు అని కాంగ్రెస్ నిబంధన పెట్టడంతో ఒకదశలో సబితా ఇంద్రారెడ్డికే చేవెళ్ల ఎంపీ టికెట్ ఖరారవుతుందని అంతా భావించారు. ఇదే విషయాన్ని అధిష్టానం కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆదినుంచి స్థానంపై ఎంతో మక్కువ ప్రదర్శించిన తన కుమారుడికే సీటు కేటాయించేలా పార్టీ పెద్దలను ఒప్పించారు. సాధించిన ‘సర్వే’ సిట్టింగ్ స్థానాన్ని మంత్రి సర్వే సత్యనారాయణ తిరిగి నిలబెట్టుకున్నారు. జనరల్ స్థానమైనా మల్కాజ్గిరి లోక్ సభ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించినా సర్వే అభ్యర్థిత్వానికే అధిష్టానం మొగ్గు చూపడం గమనార్హం. అగ్రనేతలు, సెలబ్రిటీల పేర్లు ఆశావహుల జాబితాలో కనిపించినా.. చివరకు సర్వే పలుకుబడి ముందు నిలబడలేదు. కాగా, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చే భువనగిరి లోక్‌సభ స్థానం కూడా సిట్టింగ్ సభ్యుడు కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డికే ఖ రాయింది. తొలుత ఇక్కడి నుంచి టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రేసులో నిలవడం.. కోమటిరెడ్డి బ్రదర్స్ దీన్ని వ్యతిరేకించడంతో అధిష్టానం ఈ సీటు విషయంలో పునరాలోచన చేసింది. ఇదిలావుండగా, రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ నాగర్‌కర్నూలు నుంచి లోక్‌సభ బరిలో నిలుస్తారని ప్రచారం జరిగింది. లోక్‌సభకు పోటీచేసేందుకు ఆయన ఆసక్తి చూపడంతో ఈ స్థానానికి మరొకరిని ఖరారు చేశారు. పెండింగ్‌లో మహేశ్వరం..! కాగా, మహేశ్వరం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోయింది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి సబిత ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈసారి ఆమె రాజేంద్రనగర్ నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. మరోవైపు సీపీఐతో పొత్తులో భాగంగా ఈ సీటును ఆపార్టీకి కేటాయించే అంశాన్ని హైకమాండ్ పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సీటును పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. మరోవైపు సబిత ఖాళీ చేసిన మహేశ్వరం సీటును సీపీఐకి కేటాయించరాదని స్థానిక కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. సంస్థాగత నిర్మాణంలేని ఆ పార్టీ ప్రభావం... చేవె ళ్ల ఎంపీ స్థానంపై పడుతుందని వారు వాదిస్తున్నారు. -
‘చేవెళ్ల’ ఎవరికో?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌లో సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎంపీ సూదిని జైపాల్‌రెడ్డి పాలమూరు సీటుకుమారడం దాదాపు ఖాయం కావడం.. ఆయన స్థానంలో రంగంలో దిగే గెలుపు గుర్రం ఎవరనేది తేలకపోవడం హస్తం పార్టీ ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ అన్న కాంగ్రెస్ హైకమాండ్ నిబంధన.. ఈ సీటుపై ఆశ పెట్టుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుటుంబసభ్యుల ముందరికాళ్లకు బంధం వేస్తున్నాయి. తన రాజకీయ వారసుడిగా తనయుడు కార్తీక్‌రెడ్డిని చేవెళ్ల బరిలోకి దించాలని చేవెళ్ల చెల్లెమ్మ భావించారు. కార్తీక్ పార్లమెంట్‌కు... తాను అసెంబ్లీకి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో రాజేంద్రనగర్ శాసనసభా స్థానం నుంచి పోటీకి సబిత సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏకకాలంలో పార్లమెంట్, అసెంబ్లీ టికెట్ల బీ ఫారాల కోసం నిరీక్షిస్తున్న వీరికి అధిష్టానం పెద్దల ప్రకటన షాక్‌నిస్తోంది. కుటుంబసభ్యుల్లో ఒకరికి మాత్రమే టికెట్ పక్కా అన్న ప్రకటన వీరికి ప్రతికూలంగా మారింది. జై... పాలమూరుతో.. జైపాల్‌రెడ్డి నిష్ర్కమణతో చేవెళ్ల టికెట్ కు లైన్ క్లియరైనట్లేనని సబితమ్మ భావించారు. ఆయన స్థానంలో కార్తీక్‌ను బరిలోకి దింపేందుకు ప్రధాన అవరోధం తొలిగిందన్నఅంచనాకొచ్చారు. అయితే, ఒక్కరికే ఛాన్స్ నిబంధనతో తమలో ఒకరు తప్పుకోవాల్సి వస్తుందనే వాదన వారిని డీలా పడేస్తోంది. పార్లమెంటు రేసులో సబిత అభ్యర్థిత్వానికే అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సైతం సబితతో చర్చించారు. తనకు జాతీయ రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదని, ఎంపీ సీటుకు తన కుమారుడి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఆమె కోరారు. అదే సమయంలో రాజేంద్రనగర్ అసెంబ్లీ టికెట్ తనకు ఖరారు చేయాలని అభ్యర్థించారు. సబిత విన్నపంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని డిగ్గీరాజా ఈ అంశంపై మరోసారి చర్చిద్దామని దాటవేసినట్లు తెలిసింది. ఇదిలావుండగా, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సారి పార్లమెంటుకు పోటీ చేయాలని కార్తీక్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ వ్యూహంలో భాగంగానే గత ఆరు నెలలుగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా, తెలంగాణ నవ నిర్మాణ యాత్ర పేరిట 101కి.మీ. మేర పాదయాత్ర నిర్వహించారు. జైపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీకి దిగనిపక్షంలో తనకే సీటొస్తుందన్న ధీమాతో ఉన్నారు. అటో..ఇటో తేల్చుకోలేక... ఇద్దరిలో ఒకరికే టికెట్ అని అధిష్టానం స్పష్టం చేయడంతో సబిత, కార్తీక్‌లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కుమారుడు ఆశిస్తున్న చేవెళ్ల నుంచి తనను బరిలోకి దించాలనే కాంగ్రెస్ పెద్దల సూచన ఆమెను ఇరకాటంలోకి నెట్టింది. ఎంపీ సీటు పుత్రుడికి దక్కించుకునేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాగా, కార్తీక్ మాత్రం అమ్మ విషయంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని... అదే సమయంలో రాజేంద్రనగర్ టికెట్ కూడా తమ వారికే కేటాయించాలని అంటున్నారు. అంతేకాకుండా లోక్‌సభ బరిలో ఎవ రు ఉండాలనేది మా కుటుంబ ంలో అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఏది ఏమైనా చేవెళ్ల ఎంపీ టికెట్ కేటాయింపు కాంగ్రెస్ పార్టీకి చిక్కుముడిగా మారిందనడంలో సందేహం లేదు. -
‘గ్రేటర్’ ఇరకాటం
బడ్జెట్.. బడ్జెట్.. స్టాండింగ్ కమిటీలో చర్చకు కాంగ్రెస్ ‘నో’ జీహెచ్ఎంసీలో విపత్కర పరిస్థితి సర్కారుకు కమిషనర్ లేఖ సర్వసభ్య భేటీకి సూచన నెలాఖరులోగా సమావేశం సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ చరిత్రలోనే అరుదైన సన్నివేశం.. ఇదివరకెన్నడూ లేని విధంగా స్టాండింగ్ కమిటీ సమావేశంలో కనీస చర్చ జరగకుండా.. అక్కడ ఆమోదం పొందకుండానే కొత్త బడ్జెట్ (2014-15) సర్వసభ్య సమావేశం ముందుకు రానుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి వర్తమానం అందింది. మేయర్ పీఠంపై ఎంఐఎం- కాంగ్రెస్ మధ్య కుదిరిన ఒప్పందం అమలుకు నోచకపోవడమే ఈ పరిణామాలకు కారణం. ఒప్పందం మేరకు.. పాలకమండలికి చివరి ఏడాదైన ఈ సంవత్సరంలో కాంగ్రెస్ అభ్యర్థి మేయర్‌గా ఎన్నిక కావాలి. కానీ, మేయర్‌గా కొనసాగుతున్న మాజిద్‌హుస్సేన్ (ఎంఐఎం) రాజీనామా చేయకపోవడం, ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడంతో కినుక వహించిన కాంగ్రెస్ పార్టీ స్టాండింగ్ కమిటీ సభ్యులు.. స్టాండింగ్ కమిటీ సమావేశంలో బడ్జెట్‌పై చర్చకు ‘నో’ అంటున్నారు. రెండేళ్ల క్రితం మాజిద్ మేయర్ కావడానికి ముందు ఎంఐఎం స్టాండింగ్ కమిటీ సభ్యు లు.. కాంగ్రెస్ మేయర్ కార్తీకరెడ్డి హయాంలోని బడ్జెట్‌కు తాము అంగీకరించేది లేదని, తమ పార్టీ మేయర్ వచ్చాకే ఆమోదిస్తామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ సైతం అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. తమ పార్టీ మేయర్ వచ్చే వరకు ఎంఐఎం మేయర్ ఆధ్వర్యంలో రూపొందించిన బడ్జెట్‌ను తాము ఆమోదించేది లేదని భీష్మించడంతో విపత్కర పరిస్థితి నెలకొంది. కమిషనర్ లేఖతో.. బడ్జెట్ అంచనాలు, చర్చ, స్టాండింగ్ కమిటీ, సర్వసభ్య సమావేశాల్లో ఆమోదం పొందడం వంటివి నిర్ణీత వ్యవధిలో పూర్తయి మార్చి మొదటి వారంలోగా ప్రభుత్వానికి నివేదిక వెళ్లాలి. ఇప్పటి వరకు బడ్జెట్ అంచనాలు తప్ప ఆ తదుపరి కార్యక్రమాలు జరగలేదు. బడ్జెట్‌కు ప్రభుత్వ ఆమోదం లేనిదే వచ్చే ఏప్రిల్ నుంచి నిధులు వెచ్చించేందుకు వీల్లేదు. చివరకు ఉద్యోగులకు జీతభత్యాలూ అందని పరిస్థితి. దీంతో తాజా పరిణామాలను వివరిస్తూ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రభుత్వానికి రెండుసార్లు లేఖ రాశారు. ఏం చేయాలో సూచించాలని కోరారు. అందుకు స్పందించిన ప్రభుత్వం.. స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందకున్నా, సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందాలని సూచించింది. ఈ మేరకు కమిషనర్‌కు లేఖ పంపినట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. అంటే, బడ్జెట్ ఆమోదానికి ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తే సరిపోతుంది. నెలాఖరులోగా సమావేశం నిర్వహించాలన్నది జీహెచ్ఎంసీ వర్గాల యోచన. సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందేనా? ప్రభుత్వ సూచన మేరకు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినా.. అక్కడైనా ఆమోదం పొందగ లదా? అన్నది ప్రశ్నార్థకమే!. ఎందుకంటే కోరం లేనిదే సర్వసభ్య సమావేశం సాధ్యం కాదు. కాంగ్రె స్ సభ్యులు కోరం లేకుండా చూడగలిగితే సమావేశమే జరగదు. కోరం అంటూ ఉండి సమావేశం జరిగితే చాలు.. ఎవరు వ్యతిరేకించినా ఆమోదం పొందినట్లు చూపే అవకాశముంది. గతంలో పలు అంశాల్లో అలా జరిగిన దాఖలాలున్నాయి. -
పాలి‘ట్రిక్స్’... ఫ్యామిలీ ‘ప్యాక్స్’!
చెల్లెమ్మ ‘కార్తీక’ నోము... మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన తనయుడు కార్తీక్‌రెడ్డిని ఈసారి ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం టికెట్ తృటిలో తప్పిపోవడంతో ఈసారి ఎలాగైనా పోటీ చేయాలనే కృతనిశ్చయంతో కార్తీక్‌రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’ పేరుతో చేవెళ్ల సెగ్మెంట్లో పాదయాత్ర నిర్వహించారు. సిట్టింగ్ ఎంపీ జైపాల్‌రెడ్డి ఈసారి పోటీచేయకపోతే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఏఐసీసీ దూతను కోరారు. ఇక సబితమ్మ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం లేదా రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదీ ‘మర్రి’ మార్క్... జిల్లా రాజకీయాలపై పట్టు సాధించాలని మర్రి కుటుంబం భావిస్తోంది. ఎన్డీఆర్ ఎఫ్ వైస్ చైర్మన్‌గా సోనియాగాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిఉన్న మర్రి శశిధర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసుడిని తెరమీదకు తేవాలని నిర్ణయించారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పెద్ద కుమారుడు ఆదిత్యను పోరులోకి దింపాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన కుటుంబం... సీనియర్ల మద్దతు కూడగట్టే యత్నం చేస్తోంది. సీఎం పదవి రేసులో ఉన్న మర్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్‌నగర్ నుంచి మళ్లీ పోటీచేయాలని యోచిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తే మాత్రం శశిధర్‌రెడ్డే చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి తలపడే అవకాశముంది. మరోవైపు టీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వీరికి సమీప బంధువు కావడం విశేషం. ‘పట్నం’ చెట్టపట్టాల్! తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి ఈసారి తన భార్య సునీతను కూడా ఎన్నికల్లో నిలపాలని యోచిస్తున్నారు. పార్లమెంట్‌కు తాను.. శాసనసభకు తన సతీమణిని బరిలో దింపాలని భావిస్తున్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ సీట్లపై కన్నేసిన మహేందర్...బీజేపీ పొత్తుతో పార్లమెంటులోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానం నుంచి సునీతను పోటీ చేయించేందుకు పావులు కదుపుతున్నారు. సోదరుడు, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి పరిగి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం తరఫున ఎన్నికల సమరానికి సై అంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇదివరకే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తరుణంలో నరేందర్ పోటీ ఖరారైనట్టే! ‘వీరు’డొచ్చాడు! రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ తన రాజకీయ వారసుడిగా చిన్న కుమారుడు వీరేందర్‌ను ప్రకటించారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన మేడ్చల్‌లోని అంతర్భాగమైన ఉప్పల్ నియోజకవర్గం నుంచి వీరేందర్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. టీడీపీ బలంగా ఉండటం, పాత పరిచయాలు కలిసివస్తాయని అంచనా వేసిన గౌడ్సాబ్... తన ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని ఉప్పల్కే కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఉప్పల్‌లో విస్తృతంగా పర్యటిస్తున్న వీరేందర్ ఈసారి ప్రత్యక్షంగా కదనరంగంలోకి దూకేందుకు పావులు కదుపుతున్నారు. మామ ఇక్కడ.. అల్లుడక్కడ! చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ ఎస్.జైపాల్‌రెడ్డి అల్లుడు రేవంత్‌రెడ్డి టీడీపీ తరఫున మల్కాజిగిరి లోక్‌సభ సీటును ఆశిస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్.. తెలంగాణవాదం నేపథ్యంలో అక్కడ గెలుపు కష్టమేననే అంచనాకొచ్చారు. ఈ క్రమంలోనే మల్కాజిగిరిపై కన్నేశారు. మామ జైపాల్‌రెడ్డితో తీవ్ర అభిప్రాయ భేదాలున్న రేవంత్... పార్లమెంటులో ప్రవేశించడం ద్వారా ఆయనకు సవాల్ విసరాలని భావిస్తున్నారు. అయితే, రేవంత్ అభ్యర్థిత్వంపై స్థానికంగా పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరికొందరు ఆశావహులు వీరే... మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మరోసారి టికెట్‌ను ఆశిస్తున్నారు. వయోభారం దృష్ట్యా తనను కాదనుకుంటే కుమారుడు శ్రీనివాసరెడ్డికి సీటు దక్కేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన రమేశ్‌కు ఈయన బాబాయి. వీరిలో ఎవరో ఒకరే బరిలో ఉండాలని భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి వచ్చే ఎలక్షన్లలో యాకుత్‌పురా నుంచి పోటీచేసేందుకు తహతహలాడుతున్నారు. ఉప్పల్ శాసనసభ్యుడు బండారి రాజిరెడ్డి వయోభారం దృష్ట్యా రాజకీయాల నుంచి విరమించుకుంటే.. పొటీ చేసేందుకు వెనుకాడకూడదని సోదరుడు లక్ష్మారెడ్డి నిర్ణయించుకున్నారు. -
రేసులో నిలిచేదెవరో?
అధికారపార్టీలో అలజడి మొదలైంది. అభ్యర్థుల ఖరారుపై అధిష్టానం దూత ఆదివారం జిల్లాకు రానుండడంతో రాజకీయవాతావరణం వేడెక్కనుంది. గెలుపు గుర్రాల అన్వేషణ సాగిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలకుడి ముందు బలప్రదర్శనకు ఆశావహులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యర్థులకు పార్టీ టికెట్లు దక్కకుండా వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్న నేతలు.. సీటు ఎగురేసుకుపోయేందుకు ఎత్తులు వేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటరీ స్థానంతోపాటు దాని పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయ సేకరణకు పార్టీ పరిశీలకుడు, కర్ణాటక రాణిబెన్నూర్ ఎమ్మెల్యే కేబీ. కోలివాడ్ ఆదివారంనుంచి డీసీసీ కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల నుంచి ఈ సారి పోటీకి దిగేందుకు మాజీ మంత్రి సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ వైస్‌చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు ఆదిత్య ఉత్సాహం చూపుతున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ కూడా ఈ సీటు రేసులో ఉన్నారు. జైపాల్ రెడ్డి పోటీనుంచి తప్పుకుంటే మాత్రమే తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వీరందరూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నా.. అంతర్గతంగా మాత్రం సీటుపై గురి పెట్టారు. మరోవైపు అసెంబ్లీలో ప్రవేశించేందుకు కుతూహలం చూపుతున్న నాయకులు కూడా వేగును ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ స్థానానికి ప్రధానంగా ముగ్గురు రేసులో ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన రమేశ్ సహా మాజీ ఎమ్మె ల్యే నారాయణరావు కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. మహారాజ్ కుటుంబం నుంచి వీరిరువురిలో ఎవరో ఒకరు బరిలో ఉండే అవకాశముంది. మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్‌గౌడ్, సబిత సోదరుడు నర్సింహరెడ్డి కూడా తాండూరు నుంచి పోటీకి యత్నిస్తున్నారు. ఈ శాసనసభ స్థానం నుంచి ఎన్నికల గోదాలో దిగేందుకు అధికారపార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. 2009లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన కాలె యాదయ్య సహా ఎస్సీ సెల్ కన్వీనర్ వెంకటస్వామి ఈసారి టికెట్ రేసులో ఉన్నారు. వీరేగాకుండా మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా ఇక్కడి నుంచి పోటీచేస్తారని రాజకీ యవర్గాల్లో చర్చ సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ప్రసాద్‌కుమార్ మళ్లీ బరిలో దిగనున్నారు. ఇక్కడి నుంచి మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ కూడా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఈయన కూడా ఏఐసీసీ దూతకు తన అంతరంగాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి. మాజీ మంత్రి సబిత అండదండలతో టికెట్‌ను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ సీటుపై ప్రధానంగా ఇద్దరు నేతలు కన్నేశారు. మాజీ మంత్రి కమ తం రాంరెడ్డి మరోసారి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతుండగా.. 2009లో రెబల్‌గా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన పీసీసీ ప్రధాన కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశాలు తక్కువేనని ప్రచారం జరుగుతోంది. ఈసారి పొరుగున ఉన్న రాజేంద్రనగర్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఈ నియోజకవర్గంతో ఉన్న పాత పరిచయాలు తనకు కలిసివస్తాయని ఆమె అంచనా వేస్తున్నారు. సబిత మాత్రం మహేశ్వరం నుంచే మళ్లీ పోటీ చేస్తానని చెబుతున్నారు. సబిత ఇక్కడి నుంచి తప్పుకుంటే చల్లా నర్సింహరెడ్డి, గుర్రం నర్సింహరెడ్డిలు టికెట్ రేసులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో పరాజయం పాలైన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈసారి కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. మొదట్లో సబిత అనుచరుడిగా మెలిగి.. ప్రస్తుతం కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పంచన చేరిన జ్ఞానేశ్వర్ ఆయన ఆశీస్సులతో బీ ఫారంను దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి మద్దతు కూడా కూడగడుతున్నారు. మరోవైపు ఈ సీటుపై మాజీ మంత్రి సబిత కూడా కన్నేశారు. ఒకవేళ తన తనయుడు కార్తీక్‌రెడ్డికి ఎంపీ టికెట్ దక్కని పక్షంలో ఇక్కడి నుంచి బరిలో నిలిపే దిశగా ఆలోచన సాగిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ మరోసారి పోటీకి ఉవ్విళ్లురుతున్నారు. ఒకవేళ ఆయన కాదనుకుంటే తన కుమారుడు రవికుమార్‌ను తెరమీదకు తెచ్చే అవకాశముంది. రాష్ట్ర ఓబీసీ సెల్ కన్వీనర్ రాగం నాగేందర్, హఫీజ్‌పేట కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ టికెట్ రే సులో ఉన్నారు. ఎమ్మెల్యేకు దీటుగా పరిశీలకుడి ఎదుట బలప్రదర్శన చేసేందుకు ఈ ఇరువురు నేతలు సన్నద్ధమవుతున్నారు. -
యాత్రల కాలం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సార్వత్రిక పోరు దగ్గర పడుతుండడంతో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు... త మ భవిష్యత్తును పదిలం చేసుకునే దిశగా పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంటరీ సీటును ఆశిస్తున్న అధికార పార్టీ యువనేత కార్తీక్‌రెడ్డి ఐదు రోజులపాటు పాదయాత్ర నిర్వహించడం ద్వారా జిల్లా రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజేంద్రనగర్ అసెంబ్లీ సీటు రేసులో ఉన్న టీఆర్ఎస్ జిల్లా సారథి నాగేందర్‌గౌడ్ శుక్రవారం పాల్మాకుల నుంచి పాదయాత్రను మొదలు పెట్టారు. ఈ యాత్ర నాలుగు రోజులపాటు నియోజకవర్గంలో కొనసాగుతుంది. యాత్ర ఉద్దేశం సంపూర్ణ తెలంగాణ సాధన కోసమేనని చెబుతున్నప్పటికీ, అంతర్లీనంగా మాత్రం తమ పట్టును నిలుపుకునేందుకేనని తెలుస్తోంది. మరోవైపు ఇదే పార్టీకి చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా త్వరలోనే పాదయాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల రెండో వారంలో యాత్ర మొదలు పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నారు. సుమారు పది లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు రంగారెడ్డి జిల్లా రైతాంగానికి జీవధారగా మారుతుందని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జూరాల నుంచి జిల్లా సరిహద్దు వరకు యాత్ర నిర్వహణకు సన్నిహితులతో తర్జనభర్జనలు పడుతున్నారు. ఇదిలావుండగా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా మహేశ్వరం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి కూడా మహేశ్వరం సెగ్మెంట్లో పాదయాత్ర నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు గడువు ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ నేతలు యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆశావహులు యాత్రలను వేదికగా మలుచుకుంటున్నారు. -
తెలంగాణ స్వప్నం నెరవేరింది
తాండూరు, న్యూస్‌లైన్: సోనియాగాంధీ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు చేపట్టిన తెలంగాణ నవ నిర్మాణ యాత్ర ముగింపు సభ ఆదివారం రాత్రి తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగింది. ఈసభకు హాజరైన ఎంపీ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నవ నిర్మాణ యాత్రతో కార్తీక్‌రెడ్డి తండ్రి ఇంద్రారెడ్డికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. సీమాంధ్రులు తెలంగాణాను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినా ఆగదని ఆయన స్పష్టం చేశారు. అయితే పార్లమెంట్లో బిల్లు పాసయ్యే వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తెలంగాణ కోసం ఉద్యమించడం ఆపలేదన్నారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో సబితారెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణానికి పాటుపడతామన్నారు. తెలంగాణ కోసం పోరాడిన పార్టీలను తాము గౌరవిస్తామని, అయితే తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టేనని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీని, శ్రేణులను ఉత్తేజపరుస్తూ యాత్ర చేపట్టిన కార్తీక్‌రెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందన్నారు. మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో జిల్లాకు చెందిన విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియాగాంధీ పాదాలకు మొక్కినా తప్పులేదన్నారు. మాజీ హోంమంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెర దించుతూ సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారన్నారు. జిల్లాలో తన కొడుకు కార్తీక్‌రెడ్డి ఐదు రోజుల పాదయాత్రకు అండగా నిలబడిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఉద్విగ్నతకు లోనైన కార్తీక్‌రెడ్డి ఐదు రోజులపాటు జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన కార్తీక్‌రెడ్డి వేదికపై ఉద్విగ్నానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన అమ్మమ్మగారి ఊరైన తాండూరులో తన పాదయాత్రకు ఘన స్వాగతం లభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఐదు రోజుల పాదయాత్రకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలన్నారు. తెలంగాణ ప్రజల కలను నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినందున సోనియాకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు పాదయాత్ర చేశానన్నారు. కొత్త రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఆర్థిక వనరుల విషయంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇంద్రారెడ్డి కొడుకుగా, పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పని చేస్తానన్నారు. కాగా జై తెలంగాణ నినాదాలతో సభ మారుమోగింది. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రావణ్‌కుమార్, చేవెళ్ల, పరిగి, వికారాబాద్,తాండూరు కాంగ్రెస్ నాయకులు కాలె యాదయ్య, రాంమోహన్‌రెడ్డి, యాదయ్య,రమేష్, విశ్వనాథ్‌గౌడ్, సిటీ కేబుల్ ఎండీ నర్సింహ్మారెడ్డి(బాబు), దారాసింగ్, రాకేష్, అపూ, మల్లిఖార్జున్, ప్రభాకర్‌గౌడ్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు. అంతకుముందు కార్తీక్‌రెడ్డిని కార్తకర్తలు గజమాలతో సన్మానించారు. -
తెలంగాణ నవనిర్మాణ బాధ్యత కాంగ్రెస్‌దే..
పరిగి, పూడూరు, న్యూస్‌లైన్: తెలంగాణ నవనిర్మాణ బాధ్యత కాంగ్రెస్‌దేనని మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడు, కాంగ్రెస్ యువనాయకుడు కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ నవనిర్మాణ యాత్ర మూడో రోజు పరిగి నియోజకవర్గంలో కొనసాగింది. చిట్టెంపల్లి గేట్ వద్ద నియోజకవర్గంలోకి చేరుకున్న పాదయాత్ర కండ్లపల్లి గేట్ మీదుగా మన్నెగూడ చౌరస్తాకు చేరుకుంది. చిట్టెంపల్లిగేట్‌లో ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిట్టెంపల్లిగేట్, కండ్లపల్లిగేట్, మన్నెగూడలో పీసీసీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలి కారు. మన్నెగూడ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, నాన్న ఇంద్రారెడ్డి కల ఎట్టకేలకు సోనియాగాంధీ సాకారం చేసిందని పేర్కొన్నారు. నాడు తెలంగాణ వస్తుందని నాన్న చెప్పా రు.. నేడు ఆకలను కాంగ్రెస్ సాకారం చేసిందన్నారు. మ ళ్లీ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఆర్థిక, సామాజిక, విద్యా, వైద్యరంగాల్లో తెలంగాణ అన్ని రాష్ట్రా ల కంటే మందుకు దూసుకుపోతుందన్నారు. ఎంతో మంది బలిదానాల వల్ల తెలంగాణ ఏర్పాటైందన్నారు.సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పటానికే ఈ యాత్ర చేపట్టానని ఆయన తెలిపారు. విద్యార్థులపై కేసులు పెట్టించిన ఘనత హరీశ్వర్‌రెడ్డిదే: టీఆర్ఆర్ టీడీపీలో ఉండగా ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి జెతైలంగాణ అన్న విద్యార్థులు, యువకులు, జేఏసీ నాయకులపై కేసు లు పెట్టించారని పీసీసీ కార్యదర్శి టీ. రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు.బంధుమిత్రులతో కలిసి దళితులు, గిరిజ నుల భూములు గుంజుకున్న ఘనత హరీశ్వర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పునర్నిర్మాణం పై ఉన్న చిత్తశుద్ధే కాంగ్రెస్‌ను గెలిపిస్తుందన్నారు. కార్యక్రమంలో టీటీడీ మాజీ సభ్యుడు కాలేయాదయ్య, డీసీసీబీ వైస్ చైర్మన్ బీ.బీంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీ. నారాయణ్‌రెడ్డి, పూడూరు మండల అధ్యక్షుడు సుబానయ్య, దోమ అధ్యక్షుడు రాములు, కుల్కచర్ల అధ్యక్షుడు వెంకటయ్య, గండేడ్ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, నాయకులు నర్సింహారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మేఘమాల, మహిళా విభాగం అధ్యక్షురాలు సురేఖారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సోనియాకు రుణపడి ఉంటాం
చేవెళ్ల, న్యూస్‌లైన్: తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఇక్కడి ప్రజలంతా రుణపడి ఉన్నారని, వారి పట్ల మనం కృతజ్ఞతగా ఉండాల ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. గురువారం రెండో రోజు ‘తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్ర’ చేవెళ్ల మండల కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సారయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను సోనియా గాంధీ నెరవేర్చారని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. ఉద్యమం నడుస్తున్న కాలంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నా.. తెలంగాణ ఏర్పడలేదని, ఇప్పుడు సోనియాగాంధీ వల్ల సాధ్యమవుతోందని అన్నారు. కార్తీక్‌రెడ్డి పాదయాత్రకు తెలంగాణ ఫోరం మద్దతు ప్రకటిస్తున్నదన్నారు. పది జిల్లాల్లోనూ యువకులు ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అందరూ ఆశీర్వదించాలి.. తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రారంభించిన ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును ప్రత్యేక రాష్ట్రంలో పూర్తి చేసుకుందామని మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు. హోంమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం ఎవరు ఉద్యమం చేసినా పూర్తిగా సహకరించానని తెలిపారు. కార్తీక్‌రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని, పాదయాత్ర విజయవంతానికి కృషిచేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని అన్నారు. పునర్నిర్మాణం కాంగ్రెస్ బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాలనే ఉద్దేశంతోనే పాదయా త్ర చేపట్టానని కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. బలిదానాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సమస్యా తీరుతుందన్నారు. పశ్చిమ రంగారెడ్డి జిల్లాను హార్టికల్చర్ జోన్‌గా ఏర్పాటుచేయడానికి తనవంతు కృషిచేస్తానని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, గచ్చిబౌలిలో 300 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. కృష్ణా జలాల తరలింపునకు ప్రయత్నిస్తా: చంద్రశేఖర్ జిల్లా ప్రజల సాగునీరు, తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రకటనతో పది జిల్లాలకు స్వాతంత్య్రం వచ్చినట్లయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ పి.వెంకటస్వామి, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు కాలె యాదయ్య, డీసీసీబీ డెరైక్టర్, మండల పార్టీ అధ్యక్షుడు ఎస్.బల్వంత్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎం.బాల్‌రాజ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో చేవెళ్ల సర్పంచ్ ఎం.నాగమ్మబాల్‌రాజ్, డీసీసీబీ వైస్‌చైర్మన్ పి.కృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎం.వెంకటేశంగుప్త, వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, ఇంద్రన్న యువసేన అధ్యక్షుడు జి.రవికాంత్‌రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం.యాదగిరి, ఎండీ.అలీ, శివానందం, ఎం.రమణారెడ్డి, వనం మహేందర్‌రెడ్డి, నర్సింహులు, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సోనియా పుణ్యమే
నార్సింగి, చేవెళ్ల, మొయినాబాద్, న్యూస్‌లైన్: ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు. బుధవారం ‘తెలంగాణ నవ నిర్మా ణ పాదయాత్ర’ పేరుతో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర రాజేంద్రనగర్ మండలం అరె మైసమ్మ దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జానారెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గ్రామగ్రామాన తెలియజేయడంతోపాటు స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు కార్తీక్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పాటు కావాలని కలలుకన్న రంగారెడ్డి, చెన్నారెడ్డి, ఇంద్రారెడ్డిలతోపాటు ప్రాణత్యాగాలు చేసిన శ్రీకాంతాచారి, యాదిరెడ్డి తదితరులకు జోహార్లు పలికారు. తెలంగాణ రాష్ర్టంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందన్నారు. అభివృద్ధిలో యువత భాగస్వామ్యం ముఖ్యమన్నారు. ఆరె మైసమ్మ అమ్మ వద్ద నుంచి ప్రారంభించిన అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయని, కార్తీక్ రెడ్డి 100 కి.మీటర్ల పాదయాత్ర సైతం విజయవంతం అవుతుందన్నారు. సోనియాకు రుణపడి ఉంటారు ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. జిల్లాకు చెందిన యాదిరెడ్డి ఢిల్లీ నడిబొడ్డున ఆత్మబలిదానం చేసి మన ఆకాంక్షను సోనియాగాంధీకి తెలిపారన్నారు. పాదయాత్ర చేపట్టిన కార్తీక్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. అమరుల కుటుంబాలను ఆదుకోవాలి ఆత్మబలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ర్టం ఏర్పడబోతోందని, వారి కుటుంబాలను రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదుకోవాలని కార్తీక్‌రెడ్డి అన్నారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ 1969 నుంచి ఇప్పటివరకు ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన అమరుల కుటుంబాలకు గచ్చిబౌలిలోని ఏపీఐఐసీకి చెందిన 40 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. సీమాంధ్రులు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా పట్టించుకోకుండా తెలంగాణ బిల్లును అసెంబ్లీకి పంపారని, పార్లమెంటులో కూడా పాస్ చేయించేందుకు కృషి చేస్తున్న సోనియాగాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని తెలిపేందుకే పాదయాత్రను చేస్తున్నానని కార్తీక్‌రెడ్డి తెలిపారు. తొలగిన మనస్పర్థలు కార్తీక్‌రెడ్డి పాదయాత్ర జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించింది. ఇన్నాళ్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షడిని నేనంటే నేనేనని కెఎం.ప్రతాప్‌రెడ్డి, కె.మల్లేశ్‌లు పాత్రికేయుల సమావేశాలు పెట్టి ప్రకటించుకునే వారు. ఈ సభా వేదికపై ఒకరికొకరు అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడని పిలుచుకోవడంతో జిల్లా కాంగ్రెస్ నాయకులు సంబరపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ తులసీరాం, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, మాజీ అధ్యక్షుడు కేఎం.ప్రతాప్, సీనియర్ నాయకులు పి.రాజు, నవాబ్ముంతాజ్, సదాలక్ష్మి, ఏ.మాధవరెడ్డి, జె.సత్యనారాయణ, ఇ.నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు యం.జైపాల్‌రెడ్డి, కె.అశోక్‌యాదవ్, శిశుపాల్సింగ్, అశోక్, ఆంజనేయులు, వై.నరేష్, చాంద్‌పాషా, కృష్ణారెడ్డి, నవీన్, సాగర్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గైర్హాజరైన నియోజకవర్గ కన్వీనర్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జరిగిన పాదయాత్ర ప్రారంభం, బహిరంగసభకు పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బి. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గైర్హాజరయ్యారు. ఆయన ఇంటిముందే కార్యక్రమం జరుగుతున్నా హాజరుకాలేదు. ఆయనతో పాటు ఆయన అనుచరవర్గం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రణధీర్‌రెడ్డి, శంషాబాద్‌కు చెందిన సీనియర్ నాయకుడు వేణు, వారి అనుచరులు పాల్గొనలేదు. ఇంద్రారెడ్డి సమాధి వద్ద నివాళులు పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కార్తీక్‌రెడ్డి మండల పరిధి కౌకుంట్ల శివారులోని తన తండ్రి, మాజీ హోం మంత్రి పి.ఇంద్రారెడ్డి సమాధికి నివాళులర్పించారు. అంతకుముందు నగరంలోని శ్రీనగర్‌కాలనీలో గల స్వగృహంలో తల్లి, మాజీ హోంమంత్రి సబితారెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి కౌకుంట్లకు వచ్చారు. చిలుకూరులో పూజలు చిలుకూరు బాలాజీని సైతం కార్తీక్‌రెడ్డి దర్శించుకున్నారు. సోదరులు కౌశిక్‌రెడ్డి, కళ్యాణ్రెడ్డిలతో కలిసి ఉదయం 10 గంటలకు ఆయన ఆలయానికి వచ్చారు. ఆలయ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ వారికి స్వాగతం పలికారు. నేరుగా గర్భగుడిలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పట్టువస్తాలను పూజారులు కార్తీక్‌రెడ్డికి ఆశీర్వాదంగా అందజేశారు. -
కాంగ్రెస్‌లో ‘నవ’ కదలిక!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి చేపట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్ర’.. నిస్తేజంగా ఉన్న కాంగ్రె స్ శ్రేణుల్లో కదలిక తెచ్చింది. తెలంగాణ ఉద్యమం..అనంతర పరిణామాల కారణంగా కొన్నాళ్లుగా ఎలాంటి కార్యక్రమాలు లేక.. స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొనడం కన్పించింది. అయితే తెలంగాణ ప్రకటనను సానుకూలంగా మలుచుకోవడంలో విఫలమైన అధినాయకత్వం.. కార్తీక్ చేపట్టిన యాత్రకు వెన్నంటి నిలువలేకపోయింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మినహా ఇతర ఎమ్మెల్యేలెవరూ కార్యక్రమానికి రాలేదు. జిల్లాలో సబితకు వైరివర్గంగా వ్యవహరిస్తున్న మంత్రి ప్రసాద్‌కుమార్, కేఎల్లార్ డుమ్మాకొట్టగా, ఇతర ఎమ్మెల్యేలు పలు సాకులతో మొదటి రోజు యాత్రకు దూరంగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్లలో తలపెట్టిన యాత్రలో పాలుపంచుకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతోనే ముఖ్యనేతలు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. కార్తీక్ యాత్రను వ్యతిరేకిస్తున్న జైపాల్.. ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని సంకేతాలిచ్చారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో పాల్గొనే అంశంపై ఒకింత సందిగ్ధత నెలకొంది. అయితే, కార్తీక్‌రెడ్డి పార్టీపరంగానే యాత్ర నిర్వహిస్తున్నందున పార్టీ శ్రేణులు సహకరించాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. దీంతో దిగువ శ్రేణి నాయకులు ఉత్సాహంగా ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’కు కదిలారు. కాగా, జైపాల్‌రెడ్డి మాత్రం తనకు రాజకీయంగా తలనొప్పులు సృష్టించేలా పాదయాత్ర చేపట్టారని, దీంట్లో భాగస్వాములు కావద్దని హెచ్చరించడంతో పలువురు ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారని తెలుస్తోంది. తొలిరోజు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తాండూరు, చేవెళ్ల అభ్యర్థులు రమేశ్, యాదయ్య హాజరుకాగా, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే తనయుడు రవికుమార్ యాదవ్ సంఘీభావం పలికారు. రాజేంద్రనగర్ ఇన్చార్జి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కూడా ముఖం చాటేశారు. ఇదిలావుండగా, పాదయాత్రపై ఎలాంటి విభేదాల్లేవని, గైర్హాజరైన నేతలు ఐదు రోజులపాటు సాగే యాత్రలో ఏదో ఒక రోజు పాలుపంచుకుంటామని తమకు చెప్పారని సబిత వర్గీయులు చెబుతున్నారు. కాగా తెలంగాణ నవ నిర్మాణ యాత్రకు భారీగా జనసమీకరణ చేశారు. రాజకీయ భవిష్యత్తుకు తొలి అడుగుగా భావిస్తున్న యాత్రను జయప్రదం చేసేందుకు సబిత శిబిరం సర్వశక్తులొడ్డింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా జనాన్ని పాదయాత్ర ప్రారంభోత్సవ సభకు తరలించారు. -
‘తెలంగాణ’ సోనియా ఘనతే..
తాండూరు, న్యూస్‌లైన్: అరవై ఏళ్లుగా తెలంగాణ ప్రజలు పడుతున్న అవమానాలు, కష్టాల నుంచి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విముక్తి కలిగించారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పి.కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం తాండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ, కాంగ్రెస్ అధిష్టానమే అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వచ్చేనెల నుంచి జిల్లాలో పాదయాత్ర నిర్వహించనున్నట్టు వెల్లడించారు. జిల్లాలోని ఆరె మైసమ్మ దేవాలయం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఐదు నియోజకవర్గాల మీదుగా సాగుతుందని, తాండూరులో ముగుస్తుందన్నారు. ఐదు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని, కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ నాయకులు హాజరవుతారన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అని ప్రచారం చేయడంతోపాటు తెలంగాణ పునర్ నిర్మాణానికి కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. వారం రోజుల్లో పాదయాత్ర షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగానా, ఎంపీగానా ఏ స్థానానికి పోటీ చేస్తారని విలేకరులు ప్రశ్నిం చగా..నాన్న ఇంద్రారెడ్డి ఎంపీ కావాలనుకున్నా నెరవేరలేదని, అందుకే ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు. తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రమేష్, డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు అపూ పాల్గొన్నారు.