కొత్తగా...సరికొత్తగా... | Manchu Vishnu New Film With Karthik Reddy | Sakshi
Sakshi News home page

కొత్తగా...సరికొత్తగా...

Published Tue, Oct 6 2015 11:41 PM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

కొత్తగా...సరికొత్తగా...

కొత్తగా...సరికొత్తగా...

ఆ కుర్రాడికి ఓ అమ్మాయి విపరీతంగా నచ్చేసింది. కానీ అందరిలా కాకుండా కొత్తగా ప్రేమించాలనుకున్నాడు. లవ్‌లో సరికొత్త యాంగిల్‌ను ట్రై చేశాడు. మరి తర్వాత ఈ కుర్రాడి డిఫరెంట్ లవ్‌స్టోరీ ఎన్ని మలుపులు తిరిగిందనే ది తెలుసుకోవాలంటే మంచు విష్ణు తాజా చిత్రం కోసం ఎదురు చూడాల్సిందే. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ పతాకంపై ‘అడ్డా’ ఫేమ్ కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో డి.కుమార్, పల్లి కేశవరావ్ నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
 
  ఇందులో సోనారిక కథానాయిక. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ ఇది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. విష్ణు బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథ ఇది.  సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, విజయ్ సి. కుమార్ కెమెరా పనితనం ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో మరో ప్రముఖ కథానాయిక నటిస్తున్నారు. టైటిల్‌ను దసరా సందర్భంగా ప్రకటించనున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ: సోమా విజయ్‌ప్రకాశ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement