గ్రామజ్యోతి నిధులిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి | karthik reddy pill in high court gramajyothi funds | Sakshi
Sakshi News home page

గ్రామజ్యోతి నిధులిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి

Published Sun, Apr 2 2017 1:59 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

karthik reddy pill in high court gramajyothi funds

హైకోర్టులో కార్తీక్‌రెడ్డి పిల్‌
సాక్షి, హైదరాబాద్‌: గ్రామజ్యోతి పథకం కింద గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు, సౌకర్యాల కల్పనలో రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి, హైదర్హాకోట్‌ సర్పంచ్‌ పి.కృష్ణా రెడ్డి ఈ వ్యాజ్యాన్ని వేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

గ్రామజ్యోతి పథకం కింద గ్రామ పంచాయతీలకు నిధులు, సౌకర్యాలను కల్పించా ల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పిటిషనర్లు తెలిపారు. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ.5,375.53 కోట్లు గ్రామ పంచాయతీలకు అందాల్సి ఉన్నా, ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేయలేద న్నారు. కనుక ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పంచాయతీలకు నిధులిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement