కామన్‌వెల్త్ కరాటే చాంపియన్‌షిప్-2024 పోటీలు ముగిశాయి. సౌతాఫ్రికాలోని డర్బన్ వేదికగా నవంబరు 28- డిసెంబరు 1 వరకు జరిగిన ఈ మెగా ఈవెంట్ విజయవంతంగా పూర్తైంది. ఇందులో భారత చాంపియన్ అరబండి కార్తిక్ రెడ్డి నాలుగు పతకాలు గెలవడం విశేషం.
ఎలైట్, క్లబ్ కేటరిగీలలో వేర్వేరు విభాగాల్లో పోటీ పడిన కార్తిక్ రెడ్డి.. పసిడి, రజత(రెండు), కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత హెడ్‌కోచ్ కీర్తన్ కొండ్రు కార్తిక్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. అత్యుత్తమ నైపుణ్యాలతో పాటు అంకితభావం కలిగి ఉన్నందుకే కార్తిక్ రెడ్డికి ఈ విజయాలు సాధ్యమయ్యాయని కొనియాడారు.
తన ప్రతిభతో దేశాన్ని గర్వపడేలా చేసిన కార్తిక్ రెడ్డి.. భారత కరాటేకు గొప్ప పేరు తీసుకువచ్చాడని కీర్తన్ కొండ్రు అభినందించారు. కాగా సౌతాఫ్రికాలో జరిగిన కామన్‌వెల్త్ కరాటే చాంపియన్‌షిప్ పదకొండవ ఎడిషన్ విజయవంతం కావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
కామన్‌వెల్త్ కరాటే చాంపియన్‌షిప్-2024లో పతకాలు గెలిచిన మనోళ్లు వీరే
కార్తిక్- స్వర్ణం, రజతం, రజతం, కాంస్యం
మేసమ్- స్వర్ణం, కాంస్యం
భువనేశ్వరి- స్వర్ణం, కాంస్యం, కాంస్యం
నవీన్- స్వర్ణం, కాంస్యం
రోహన్- స్వర్ణం, కాంస్యం
ఆరాధ్య- స్వర్ణం
ఆర్య- స్వర్ణం, రజతం, కాంస్యం
సమిహాన్- స్వర్ణం, కాంస్యం
సంకేత్- స్వర్ణం, కాంస్యం
ఆమేయ్- స్వర్ణం
హాసిని- రజతం
బిలహరి- రజతం
రామానుజ- రజతం
సాయిహర్ష్- రజతం
అమిత్- కాంస్యం
భార్గవ్- కాంస్యం
లిఖిత- కాంస్యం, కాంస్యం
అమిత్ ఆదిత్య- కాంస్యం.ఘె.
చంద్రశేఖరరెడ్డి పుత్రోత్సాహం
ఆంధ్రప్రదేశ్ కు చెందిన అరబండి కార్తీక్ రెడ్డి కామన్ వెల్త్ కరాటే చాంపియన్ షిప్ 2024 పోటీలలో అంతర్జాతీయ వేదికలపై తెలుగు వారి ఖ్యాతిని నిలబెట్టాడు. భారత్ కు ప్రాతినిధ్యం వహించి నాలుగు పతకాలతో మెరిసి నిర్వాహకులు, క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఈ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మొత్తం 15 మంది క్రీడాకారులు ఈ కరాటే ఈవెంట్ లో పాల్గొనగా, వారిలో కార్తీక్ రెడ్డి కి మాత్రమే నాలుగు పతకాలు లభించటం విశేషం. ఈ నేపథ్యంలో... తన కుమారుడు అంతర్జాతీయ వేదికలపై రాణించడం పట్ల తండ్రి, సెంట్రల్ జిఎస్టీ కమిషనర్ ఎ.చంద్రశేఖరరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేసారు.
Comments
Please login to add a commentAdd a comment